చిన్నకోడూరు: అతనో మామూలు బక్క రైతు.. నేల తల్లిని నమ్మి కుటుంబాన్ని పోషించుకుందామనుకున్న ఆ అభాగ్యుడి ఆశలు అడియాశలయ్యాయి. ప్రకృతి పగబట్టి పిడుగు రూపంలో మృత్యువు అంచుల వరకు తీసుకవెళ్లింది. దీంతో ఆయన ఏడాది కాలంగా జీవచ్ఛవంలా బతుకీడుస్తున్నాడు. ఇంటి పెద్దను కాపాడుకునేందుకు ఆ కుటుంబం పడుతున్న వ్యధ వర్ణనాతీతం. వైద్య చికిత్స కోసం కార్పొరేట్ ఆస్పత్రుల చుట్టూ తిరిగి ఉన్నదంతా ఊడ్చుకుపోవడంతో కుటుంబ సభ్యులు ప్రభుత్వ సహాయం కోసం, ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తున్నారు. శరీరంలోని ఒక భాగం స్పర్శ కోల్పోవడంతో సంవత్సర కాలంగా మంచానికే పరిమితమైన బాధితుని వివరాలు ఇలా ఉన్నాయి.. చిన్నకోడూరు మండలం చంద్లాపూర్ గ్రామానికి చెందిన ఈరగారి కిష్టారెడ్డి (39) ఊరి శివారులోని ఐదెకరాల భూమిని సాగు చేసుకుంటున్నాడు.
గత ఏ డాది జూన్ 5న వర్షంతో పాటు పిడుగు పడడం తో పొలంలో పనులు చేసుకుంటున్న మరో ఇద్దరు రైతులు అక్కడిక్కడే మృతి చెందారు. ఆ ప్రాంతానికి కొద్ది దూరం లో వ్యవసాయ పనులు చేసుకుంటు న్న కిష్టారెడ్డి పిడుగుపాటుతో అస్వస్థతకు గురయ్యాడు. కుటుంబ సభ్యులు వెంటనే వైద్య సేవల నిమిత్తం ఆస్పత్రికి తరలించినా నాటి నుంచి నేటి వరకు ఆయన కుడి చేయి, కుడి కాలు, కుడి కన్ను పని చేయకుండా పోయాయి. దీంతో కిష్టారెడ్డిని మామూలు మనిషిగా మార్చేందుకు కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని పలు కార్పొరేట్ ఆస్పత్రుల చుట్టూ తిరిగారు. వైద్య ఖర్చుల కో సం నగలను అమ్ముకున్నారు. వైద్య ఖర్చులు తలకుమించి భారంగా మారడం, కుటుంబ పోషణ ప్రశ్నార్థకంగా నిలవడంతో కుటుంబ సభ్యుల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది.
నరకం అనుభవిస్తున్నాం...
పిడుగు పాటుతో జీవచ్ఛంగా మారిన భర్త కిష్టారెడ్డిని చూస్తూ నరకం అనుభవిస్తున్నానని, ఏడాది కాలంగా మంచానికే పరిమితమైన ఆయన బాధ వర్ణనాతీతమని భార్య కవిత, కుమార్తె నిఖిత ఆవేదనవ్యక్తం చేశారు.
ప్రకృతి శాపం..జీవితం దుర్భరం!
Published Mon, Jul 21 2014 11:53 PM | Last Updated on Tue, Oct 9 2018 7:52 PM
Advertisement