నాగర్‌కర్నూలు : మహబూబ్ నగర్ జిల్లా నాగర్ కర్నూలు మండలం పెద్దాపూర్ శివారులో పిడుగుపడి ఇద్దరు మహిళలు మృతి చెందగా, మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. శుక్రవారం మధ్యాహ్నం 3.40 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. పొలంలో వ్యవసాయ పనుల్లో ఉండగా సమీపంలోనే పిడుగు పడడంతో బక్కమ్మ (55), ఈశ్వరమ్మ (40) అక్కడికక్కడే మృతి చెందారు. బాలయ్యకు తీవ్ర గాయాలు కావడంతో అతడ్ని సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలిస్తున్నారు.