one injured
-
హనుమాన్ ఆలయాన్ని ఢీకొట్టిన బైక్
పర్లాకిమిడి: గుసాని సమితి కత్తలకవిటి గ్రామం వద్ద ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ సంఘటనలో ఇద్దరు మృతి చెందారు. వివరాలు ఇలా ఉన్నాయి. జంగాలపాడు గ్రామం నుంచి మోటార్ సైకిల్‌పై బయలుదేరిన ముగ్గురు యువకులు వేగంగా వెళ్తూ కత్తలకవిటి గ్రామం మలుపు వద్ద ఉన్న హనుమాన్ మందిరాన్ని ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో డ్రైవింగ్ చేస్తున్న చిన్మయపాత్రో(20) సంఘటనా స్థలంలో మృతిచెందాడు. మరో ఇద్దరు తీవ్రగాయాలపాలవడంతో పర్లాకిమిడి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తీవ్ర గాయాలైన వారిలో ఆర్.చందు, మిన్నా నాయక్‌ను మెరుగైన వైద్యం కోసం పర్లాకిమిడి ప్రభుత్వ ఆస్పత్రి నుంచి బరంపురం ఎంకేసీజీ మెడికల్ కళాశాల ఆస్పత్రికి తరలించారు. బరంపురం మెడికల్ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మరో వ్యక్తి మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా అతి వేగమే చిన్మయ పాత్రో ప్రాణం తీసిందని సంఘటనా స్థలంలోని గ్రామస్తులు తెలిపారు. గురండి పోలీసులు కేసును నమోదు చేసుకుని విచారిస్తున్నారు. -
ఐదు గంటలు నరకప్రాయం
చింతూరు (రంపచోడవరం) : ఎదురెదురుగా వస్తున్న రెండు లారీలు ఢీకొన్న ఘటనలో ఓ లారీడ్రైవర్ క్యాబిన్లో ఇరుక్కుని ఐదు గంటలపాటు నరకం అనుభవించాడు. మండలంలోని కాటుకపల్లి వద్ద ఆదివారం ఛత్తీస్‌గఢ్ నుండి విజయవాడ వెళ్తున్న లారీ విజయవాడ నుంచి ఛత్తీస్‌గఢ్ వెళుతున్న లారీ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఓ లారీ డ్రైవర్‌కు స్వల్పగాయాలయ్యాయి. దీంతో అతడికి ఏడుగురాళ్లపల్లి ఆసుపత్రిలో చికిత్స నిర్వహించిన అనంతరం భద్రాచలం తరలించారు. కాగా మరో లారీలోని డ్రైవర్ తెలంగాణ రాష్ట్రం నల్గొండకు చెందిన లతీఫ్ క్యాబిన్లో ఇరుక్కుని పోయాడు. స్టీరింగ్ వీల్ వద్ద కాలు ఇరుక్కుని ఎంతకూ రాకపోవడంతో వైద్యులు అతడికి లారీలోనే సిలైన్లు పెట్టి చికిత్స అందించారు. మధ్యాహ్నం మూడు గంటలకు ప్రమాదం జరుగగా పోలీసులు తీవ్రంగా శ్రమించి ఐదు గంటల అనంతరం గ్యాస్‌కట్టర్ సాయంతో రాత్రి ఎనిమిది గంటలకు అతనిని బయటకు తీశారు. అనంతరం 108 ద్వారా అతడిని భద్రాచలం ఆసుపత్రికి తరలించారు. -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం
పాయకరావుపేట: మండలంలో జాతీయరహదారిపై తాండవబ్రిడ్జి సమీపంలో శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డుప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందగా, మరోవ్యక్తి తీవ్రగాయాల పాలయ్యాడు. ఎస్ఐ బాబూరావు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఎస్.రాయవరం మండలం గెడ్డపాలెం గ్రామానికి చెందిన కర్రి గణేష్(45), కర్రి నానాజీలు బైక్‌పై తుని బయలుదేరారు. వీరు కోటనందూరు వద్ద ఉన్న జీడి పిక్కల పరిశ్రమలో పనిచేస్తున్నారు. తాండవ బ్రిడ్జిసమీపంలోకి రాగానే బైక్ అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొని అవతలవైపు( తుని నుంచి విశాఖ వెళ్లే) రోడ్డుపై పడ్డారు. ఇంతలో తుని నుంచి విశాఖ వైపు వెళ్తున్న గుర్తుతెలియని వాహనం వీరిని ఢీకొంది.ఈ ప్రమాదంలో గణేష్ అక్కడికక్కడే మరణించాడు. తీవ్రంగా గాయపడిన నానాజీని తుని ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదుచేసి దర్యాప్తుచేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు. -
బాకూరు ఘాట్‌లో జీపు బోల్తా
హుకుంపేట(అరకులోయ): మండలంలోని బాకూరు ఘాట్‌లోని డోగులజోరు సమీపంలోని మలుపు వద్ద ఓ జీపు అదుపుతప్పి లోయలోకి బోల్తా పడిన ప్రమాదంలో నాలుగేళ్ల బాలుడు మృతిచెందాడు.మరో మహిళకు తీవ్రగాయాలయ్యాయి. మరికొందరు స్వల్ప గాయాలతో ప్రమాదం నుంచి బయట పడ్డారు. సూకూరు పంచాయతీలోని బిరిసింగి గ్రామం నుంచి సుమారు 15 మంది ప్రయాణికులతో శుక్రవారం సాయంత్రం వెళ్తున్న సర్వీసు జీపునకు ఘాట్‌లోని డోగులజోరు సమీపంలో బ్రేక్ ఫెయిలైంది. దీంతో అదుపు తప్పి,లోయలోకి దూసుకుపోయి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బాకూరు గ్రామానికి చెందిన గెమ్మెలి సంజయ్‌భార్గవ్(4),బాకూరు వెంకటలక్ష్మిలకు తీవ్ర గాయాలయ్యాయి. మరికొంత మంది ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. పరిస్థితి విషమంగా ఉన్న సంజయ్‌భార్గవ్‌ను పాడేరు ప్రాంతీయ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే బాలుడు మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. బాలుడి మృతదేహాన్ని శవపరీక్షల గదిలో భద్రపరిచారు.తీవ్ర గాయాలపాలైన వెంకటలక్ష్మికి వైద్యసేవలు అందించారు. కుమారుడు తమ కళ్లముందే మృతిచెందడంతో తల్లిదండ్రులు కుమారి,సత్తిబాబు కన్నీరుమున్నీరుగా విలపించారు.బరిసింగి గ్రామంలోని ఓ వివాహ కార్యక్రమానికి వెళ్లి, తిరిగి ఇంటికి వెళుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. బిరిసింగి,బాకూరు గ్రామాల్లో విషాదఛాయలు అలముకున్నాయి. హుకుంపేట పోలీసుస్టేషన్‌కు ఫిర్యాదు అందడంతో ఎస్ఐ నాగకార్తీక్ కేసు నమోదు చేసి, సంఘటన స్థలాన్ని పరిశీలించారు. -
ఇంటికి చేరుకునేలోపే...
పరిగి : పండగపూట విషాదం చోటు చేసుకుంది. అందరూ ఉపవాస దీక్షల్లో మునిగిపోతే..ఆ ఇంట్లో మాత్రం విషాద ఛాయలు అలముకున్నాయి. ఎదురురెదుగా వస్తున్న డీసీఎం, బైక్ ఢీకొన్న ప్రమాదంలో బైక్‌పై వెళుతున్న ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా మరో బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన పరిగి మండల పరిధిలోని ఖుదావంద్‌గేట్ సమీపంలో పరిగి–షాద్‌నగర్ రోడ్డుపై మంగళవారం సాయంత్రం చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా చౌదరిగూడ మండలం గాలిగూడెం అనుబంధ గ్రామం ఇస్రాన్‌గడ్డతండాకు చెందిన విక్రమ్(19), అదే తండాకు చెందిన హన్ము(13) స్నేహితులు. విక్రమ్ అన్న బతుకుదెరువు కోసం బొంబాయి వెళుతుండటంతో సాగనంపేందుకు వికారాబాద్ రైల్వేస్టేషన్‌కు వెళ్లారు. వారిని రైలెక్కించి తిరిగి ఇంటికి బయలుదేరారు. మరో 10 నిమిషాల్లో ఇంటికి చేరుతారనగా మండల పరిధిలోని ఖుదావంద్‌పూర్ గేట్ సమీపంలో ఎదురుగా వస్తున్న డీసీఎం వీరి బైకును ఢీకొట్టింది. దీంతో బైక్‌పై ఉన్న విక్రం (19) అక్కడికక్కడే మృతి చెందాడు. హన్ము(13)కు తీవ్ర గాయాలవడంతో పరిగి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించటంతో నగరంలోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. విక్రమ్ షాద్‌నగర్‌లోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ రెండో సంవత్సరం చదువుతుండగా.. హన్ము గాలిగూడెం పాఠశాలలో 7వ తరగతి చదువుతున్నాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. విక్రమ్ మృతదేహాన్ని పరిగి మార్చురీలో ఉంచారు. -
పండక్కి వెళ్తూ..
కొడవలూరు: ఉపాధి కోసం జిల్లాకు వలస వచ్చి పండక్కి ఇంటికి వెళ్తూ ఓ వ్యక్తి దుర్మరణ పాలయ్యాడు. మరొకరు తీవ్రంగా గాయపడి మృత్యువుతో పోరాడుతున్నారు. ఈ విషాద ఘటన మండలంలోని రాచర్లపాడు వద్ద జాతీయ రహదారిపై శుక్రవారం సాయంత్రం జరిగింది. పోలీసుల సమాచారం మేరకు.. గుంటూరు జిల్లా ఊపూరు మండలం కాకర్లపూడికి చెందిన దాసరి కోటేశ్వరరావు (32), రవీంద్ర బేల్దారీ పనుల నిమిత్తం తడకు వలస వెళ్లారు. సంక్రాంతి పండగ నేపథ్యంలో స్వగ్రామానికి వెళ్లేందుకు బైక్‌లో బయల్దేరారు. కొడవలూరు మండలం రాచర్లపాడు చెరువు వద్దకు వచ్చే సరికి ముందు వెళుతున్న లారీని క్రాస్ చేయబోయి బైక్ అదుపు తప్పి రోడ్డుపై పడిపోయింది. ఇంతలోనే వెనుకనే వేగంగా వస్తున్న కారు వీరి పైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కోటేశ్వరరావు అక్కడికక్కడే మృతి చెందగా, రవీంద్ర తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుడిని 108లో చికిత్స నిమిత్తం నెల్లూరుకు తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కోటేశ్వరరావు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్‌కానిస్టేబుల్ రక్షణకుమార్ తెలిపారు. చెరకు ట్రాక్టర్ ఢీకొని వ్యక్తి మృతి సంగం: రోడ్డు పక్కన నడిచి వెళ్తున్న ఓ వ్యక్తిని చెరకు ట్రాక్టర్ ఢీకొని మృతి చెందిన ఘటన సంగం సబ్‌స్టేషన్ వద్ద శుక్రవారం రాత్రి జరిగింది. స్థానికుల కథనం మేరకు.. సంగం రాళ్లచెలికకు చెందిన కలికిరి వెంకటరత్నం (40) చేనేత కార్మికుడు. పనిలో కుటుంబపోషణ జరగకపోవడంతో ప్రైవేట్‌గా ఎలక్ట్రిషియన్ పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో గురువారం రాత్రి ఇంట్లో నుంచి రోడ్డు మీదకు వచ్చి సబ్‌స్టేషన్ నుంచి బస్టాండ్ వైపు నడిచి వెళ్తుండగా వెనుకనే వచ్చిన చెరకు ట్రాక్టర్ అతన్ని ఢీకొంది. దీంతో అతను ట్రాక్టర్ చక్రాల కింద పడి తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదం జరిగిన వెంటనే ట్రాక్టర్ డ్రైవర్ వెంటనే పరారయ్యాడు. స్థానికులు, కుటుంబ సభ్యులు అతన్ని 108 వాహనంలో ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారు. కుటుంబానికి జీవనా«ధారమైన వెంకటరత్నం మృతితో భార్య పద్మ, కుమారుడు, కుటుంబ సభ్యుల రోదనలు మిన్నం టాయి. సంగం రాళ్లచెలికలో విషాదఛాయలు అలముకున్నాయి. పోలీసులు ప్రమాదానికి కారణమైన ట్రాక్టర్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేస్తున్నట్లు ఎస్సై వేణు తెలిపారు. ఘటనా స్థలంలో కోటేశ్వరరావు మృతదేహం -
రాయచోటి శివారులో ఘోర రోడ్డుప్రమాదం
-
రథోత్సవంలో అపశ్రుతి
పందికుంట(వజ్రకరూరు) : మండల పరిధిలోని పందికుంట గ్రామంలో బుధవారం సాయంత్రం శ్రీరామ నవమి వేడుకల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. సీతారాముల విగ్రహాలను ఊరేగిస్తుండగా ఒక్కసారిగా రథం కిందపడిపోయింది. భక్తులకు ఎలాంటి హానీ జరగకపోయినా అందులో ఉన్న అర్చకుడికి స్వల్ప గాయాలయ్యాయి. -
పట్టణాల నుంచి పల్లెలకు తాకిన గన్‌కల్చర్
-
గుంటూరులో భోగి మంటల్లో అపశ్రుతి
గుంటూరు : భోగి మంటల్లో అపశ్రుతి చోటుచేసుకుని ఓ వ్యక్తి గాయపడ్డాడు. వివరాల్లోకి వెళితే...భోగి సందర్భంగా శుక్రవారం ఉదయం గుంటూరులోని ఎన్టీఆర్ స్టేడియంలో భోగి మంటల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి కూడా హాజరయ్యారు. ఈ నేపథ్యంలో భోగి మంటల్లో కిరోసిన్ పోస్తుండగా అకస్మాత్తుగా మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో మంటలు ఓ వ్యక్తి శరీరానికి అంటుకున్నాయి. అతడిని కాపాడేందుకు ఎమ్మెల్యే మోదుగుల ప్రయత్నించారు. ఆయన పాదాలకు కూడా మంటలు అంటుకున్నాయి. గాయపడిన వ్యక్తిని స్టేడియం నిర్వాహకులు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
మోటార్‌సైక్లిస్ట్ దుర్మరణం
రాచూరు (ఉంగుటూరు): ఉంగుటూరు మండలం రాచూరు వద్ద ఆదివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరొకరు తీవ్రగాయాలపాలయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద నిండ్రకొలనుకు చెందిన చిన్నం కిషోర్ (26), అతని స్నేహితుడు దాసరి రవి కలిసి మోటార్ సైకిల్‌పై తాడేపల్లిగూడెం వెళ్తుండగా నారాయణపురం నుంచి గణపవరం వైపు వెళుతున్న చేప పిల్లల లోడు లారీ ఎదురుగా వచ్చి వీరిని ఢీకొట్టింది. దీంతో మోటార్ సైకిల్ నడుపుతున్న చిన్నం కిషోర్ తలకు బలమై గాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. వెనుక ఉన్న రవికి తీవ్రగాయాలు కావడంతో ఏలూరు ఆశ్రం ఆసుపత్రికి తరలించారు. చేబ్రోలు ఏఎస్ఐ రమణకేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
రోడ్డు ప్రమాదంలో ఒకరికి గాయాలు
ఎస్ఐ వాహనమే ఢీకొట్టిందని బంధువుల ఆరోపణ గుత్తి రూరల్: మండలంలోని బసినేపల్లి శివార్లలో గుర్తు తెలియని వాహనం ఢీకొని అదే గ్రామానికి చెందిన షేక్ బాషా అనే స్లైక్లిస్టు తీవ్రంగా గాయపడినట్లు పోలీసులు తెలిపారు. గ్రామ శివార్లలోని సిమెంట్ స్తంభాల తయారీ పరిశ్రమలో కూలీ పనికి వెళ్లే బాషా మధ్యాహ్నం భోజనానికి సైకిల్‌పై ఇంటికి బయలు దేరాడు. అదే సమయంలో గుత్తి వైపునకు వెళ్తున్న గుర్తుతెలియని వాహనం బాషా సైకిల్‌ను వెనుక నుంచి వచ్చి వేగంగా ఢీకొనడంతో సైకిల్ నుజ్జునుజ్జైంది. బాసా ఎగిలి అల్లంత దూరంలో పడ్డాడు. రక్తస్రావమై తీవ్రంగా గాయపడ్డ బాషాను అటుగా వెళ్తున్న కర్నూలు జిల్లా ఎస్ఐ శంకర్ తన జీపులోనే చికిత్స నిమిత్తం గుత్తి ప్రభుత్వాస్పత్రికి తరలించాడు. కాగా ఎస్ఐ శంకర్ వాహనం ఢీకొట్టడంతోనే ఈ ప్రమాదం జరిగిందని బాధితుడి తండ్రి తెలిపారు. పంచాయితీ అనంతరం బాషా చికిత్సకయ్యే ఖర్చు మొత్తాన్ని ఎస్ఐ భరించేలా మాట్లాడుకొన్నట్లు తెలిసింది. ఆ తరువాత అతన్ని మెరుగైన చికిత్స కోసం కర్నూలుకు తరలించారు. ఆ తరువాత బాధితులు మాటమార్చి గుర్తు తెలియని వాహనం ఢీకొట్టినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్ఐ శంకర్ గుత్తిలో నివాసముంటూ ప్రభుత్వ వాహనాన్ని తన సొంతానికి వాడుకుంటూ రోజూ జొన్నగిరి నుంచి గుత్తికి వచ్చి వెళ్తుంటాడని తెలిసింది. ఈ విషయంపై ఎస్ఐ శంకర్‌ను ఫో¯ŒSలో ‘సాక్షి’ వివరణ కోరగా... బాషాను తన ముందు వెళ్తున్న లారీ ఢీ కొట్టి వెళ్తే వెనుకనే వచ్చిన తాను మానవత్వంతో అతడిని ఆస్పత్రికి చేర్చానన్నారు. తన వాహనమే ఢీకొట్టినట్లు బాషా కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులు భావించారని వివరించారు. బాధితుడు కూడా కోలుకున్నాక లారీ ఢీకొట్టినట్టు చెప్పాడని ఎస్ఐ తెలిపారు. గుత్తి ఎస్ఐ చాంద్‌బాషా వివరణ అడగ్గా.. బాషాను వెనుక నుంచి లారీ ఢీ కొట్టడంతో ఎగిరి ముందు వస్తున్న ఎస్ఐ జీపుపై పడ్డాడని చెప్పారు. ఎస్ఐ జీపు ఢీ కొట్టలేదన్నారు. -
వ్యక్తిపై హోంగార్డు కత్తితో దాడి
వేటపాలెం: వెంకటేశ్వర్లు అనే వ్యక్తిపై వీర వసంతరావు అనే హోంగార్డు కత్తితో దాడి చేశాడు. ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం దేశాయ్పేటలోని సాల్వేషన్ ఆర్మీ చర్చి ముందు వేటపాలెం-చీరాల రోడ్డులో నేటి ఉదయం ఈ ఘటన జరిగింది. వెంకటేశ్వర్లు, వసంతరావుల స్వగ్రామం యాదవపాలెం. వెంకటేశ్వర్లు తన భార్యతో కలిసి బైక్‌పై స్వగ్రామం నుంచి చీరాలకు పూలు అమ్మడానికి వెళ్తున్నాడు. దారి మధ్యలో వెంకటేశ్వర్లును కలిసిన వసంతరావు చిట్టీ డబ్బుల విషయం అడిగాడు. వీరిద్దరి మధ్య చిట్టీ డబ్బుల విషయంలో భిన్న అభిప్రాయాలు రావడంతో హోంగార్డు వసంతరావు కత్తితో దాడి చేసినట్లు సమాచారం. తీవ్రంగా గాయపడిన వెంకటేశ్వర్లను చికిత్స నిమిత్తం చీరాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
బైక్‌ను ఢీకొన్న స్కార్పియో
యువకుడి పరిస్థితి విషమం సంగం : మోటార్‌బైక్‌ను స్కార్పియో ఢీకొనడంతో ఓ యువకుడు తీవ్రంగా గాయపడిన సంఘటన మండలంలోని దువ్వూరు వద్ద శుక్రవారం జరిగింది. మండలంలోని గాంధీజనసంఘంకు చెందిన ఇంటా కిరణాకుమార్రెడ్డి తన మోటార్‌బైక్‌లో నెల్లూరుకు వెళ్లి ఇంటికి వస్తుండగా దువ్వూరు వద్ద లారీని తప్పించబోయే క్రమంలో వేగంగా వచ్చిన స్కార్పియో ఢీకొంది. దీంతో కిరణ్‌కుమార్‌రెడ్డి బైక్ పైనుంచి ఎగిరి రోడ్డుపై పడ్డాడు. తలకు తీవ్ర గాయాలై అపస్మారక స్థితికి చేరుకున్నాడు. స్థానికుల సమాచారంతో 108 సిబ్బంది కిరణ్‌కుమార్‌రెడ్డికి ప్రథమ చికిత్స చేసి నెల్లూరుకు తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా వారు తెలిపారు. సమాచారం అందుకున్న సంగం ఎస్ఐ వేణు సంఘటన స్థలానికి వచ్చి ప్రమాదానికి కారణమైన స్కార్పియోను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కేరళ కోర్టు ఆవరణలో పేలుడు కలకలం
-
కేరళ కోర్టు ఆవరణలో పేలుడు కలకలం
తిరువనంతపురం: కేరళ మలప్పురం కోర్టు ఆవరణలో మంగళవారం పేలుడు ఘటన స్థానికంగా కలకలం రేపింది. కోర్టు ఆవరణలో పార్క్ చేసి ఉన్న కారులో పెద్ద శబ్దంతో పేలుడు సంభవించింది. ఈ సంఘటనలో మూడు వాహనాలు ధ్వంసం కాగా, ఒకరు గాయపడ్డారు. పెద్ద శబ్దంతో పేలుడు సంభవించిందని స్థానికులు, పోలీసులు తెలిపారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు డాగ్, బాంబ్ స్క్వాడ్ సిబ్బందితో సోదాలు చేపట్టారు. దుండగులు ప్రెషర్ కుక్కర్ బాంబును అమర్చి పేల్చినట్టు పోలీసులు గుర్తించారు. కారు యజమాని హోమియో డీఎంవోదిగా గుర్తించారు. అలాగే ఘటనా స్థలంలో కరుడుకట్టిన ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్ ఫోటోను స్వాధీనం చేసుకున్నారు. పేలుడు వెనుక ఉగ్రవాదుల హస్తం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ర్యాష్ డ్రైవింగ్ తో ‘మైనర్’ బీభత్సం
హైదరాబాద్: చిన్నారి ‘రమ్య’ విషాదాంతం మరవక ముందే అటువంటి ఘటనే మరొకటి చోటుచేసుకుంది. అంబర్‌పేట డీడీ కాలనీలో ఓ ఇంటర్ విద్యార్థి శనివారం అతి వేగంగా కారు నడుపుతూ బీభత్సం సృష్టించాడు. అంబర్‌పేటకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి రమేష్ పటేల్ కుమారుడు డీడీ కాలనీలోని శ్రీ చైతన్య కళాశాలలో ఇంటర్ ఫస్టియర్ చదువుకుంటున్నాడు. ఈ రోజు ఉదయం ఓ బాలికతోపాటు ముగ్గురు స్నేహితులతో కలసి కారులో కళాశాలకు బయలుదేరాడు. అతడు వేగంగా కారు నడుపుతూ ఓ వ్యక్తిని ఢీ కొట్టబోయాడు. అతడిని తప్పించేందుకు కారును రోడ్డు పక్కన పార్కు చేసి ఉన్న కార్లను ఢీ కొట్టాడు. సంఘటన స్థలికి చేరుకున్న పోలీసులు కారులో పరిశీలించగా మద్యం బాటిళ్లు కనిపించాయి. అందులో ఉన్న బాలికను ఇంటికి పంపించి అభిషేక్‌తో పాటు అతని స్నేహితులను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. ఈ ఘటనపై అంబర్ పేట సీఐ ఆనంద్ కుమార్ మాట్లాడుతూ... ఈరోజు ఉదయం 7.30 గంటల ప్రాంతంలో మైనర్ ర్యాష్ డ్రైవింగ్‌తో ప్రమాదం చేసినట్లు సమాచారం అందిందన్నారు. డీడీ కాలనీలోని సోమసుందర్ నగర్ లో ఆగి ఉన్న కార్లతో పాటు ఓ వ్యక్తిని ఢీకొట్టినట్లుగా గుర్తించామని, గాయపడిన వ్యక్తి యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు చెప్పారు. ర్యాష్ డ్రైవింగ్, విత్ అవుట్ లైసెన్స్ సెక్షన్ల కింద మైనర్‌తో పాటు కారు యజమానిపై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. -
శోక శుక్రవారం
శుక్రవారం నాలుగు కుటుంబాలకు శోకం మిగిల్చింది. వేర్వేరు దుర్ఘటనల్లో నలుగురు మరణించారు. విద్యుదాఘాతానికి ఇద్దరు బలికాగా, కారు ఢీకొని ఇద్దరు ప్రాణాలు విడిచారు. దీంతో ఆ కుటుంబాలు తల్లడిల్లుతున్నాయి. వరికోత యంత్రం తరలిస్తూ.. ఉంగుటూరు : లారీలో వరి కోత యంత్రాన్ని పొలానికి తరలిస్తుండగా, విద్యుదాఘాతానికి గురై ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. ఉంగుటూరు మం డలం వెల్లమిల్లి వద్ద శుక్రవారం ఉదయం ఈ దుర్ఘటన జరిగింది. ఈ ఘటనలో మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. చేబ్రోలు పోలీసుల కథనం ప్రకారం.. వెల్లమిల్లి పంట పొలాల్లో వరి కోత నిమిత్తం పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా నుంచి గురువారం రెండు యంత్రాలు వచ్చాయి. స్థానికంగా ఉన్న మధ్యవర్తి కడవకొల్లు పెద్ద ముత్యాలు ద్వారా రైతు యాదగాని సత్యనారాయణ పొలంలో శుక్రవారం వరి కోత పని చేయాలని నిర్ణయించారు. దీంతో ఉదయం వరి కోత యంత్రాన్ని లారీలో తీసుకెళ్తుండగా విద్యుత్ తీగలు అడ్డువచ్చాయి. దీంతో లారీపై ఉన్న వారు కర్రలతో తీగలను ఎత్తేందుకు యత్నించి విఫలమయ్యారు. తీగలు యంత్రానికి తగలడంతో లారీలోకీ విద్యుత్ ప్రసరించింది. దీంతో లారీ నడుపుతున్న కడిమి భాస్కర్ ( 32), క్యాబిన్లో ఉన్న మరో వ్యక్తి దామవరపు నరసింహారావు అలియాస్ జగపతి (22) అక్కడిక్కడే మృతిచెందారు. వీరిని రక్షించబోయి తాటిపర్తి పవన్ తీవ్రంగా గాయపడ్డాడు. వీరిలో భాస్కర్‌ది పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా మోతుకూరు మండలం రెడ్డిపాలెం కాగా, జగపతి, పవన్‌లది మోతుకూరు మండలం కొత్త ఒంగులూరు. దీంతో పవన్‌ని, మృతదేహాలను స్థానికులు తాడేపల్లిగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలాన్ని చేబ్రోలు ఎస్సై చావా సురేష్, విద్యుత్ ఏఈలు రాళ్లపల్లి భీమేశ్వరరావు(నారాయణపురం), రెడ్డి సుబ్రహ్మణ్యం(గొల్లగూడెం) ఉంగుటూరు ఏవో డాక్టర్ ఎస్.ప్రసాద్, గ్రామ సర్పంచి నరమామిడి నాగేశ్వరరావు, బాదంపూడి సొసైటీ అధ్యక్షులు మల్లారెడ్డి శేషగిరి పరిశీలించారు. పొట్టకూటి కోసం వచ్చి.. పొట్టకూటికోసం పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా నుంచి వచ్చిన వారిద్దరూ విద్యుదాఘాతానికి బలైపోయారు. నెల్లూరు జిల్లా నుంచి రెండు యంత్రాలు రాగా, వాటితోపాటు మొత్తం 20 మంది సిబ్బంది వచ్చారు. వీరిలో ఇద్దరు మరణించగా, ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో తోటి సిబ్బందిని విషాదఛాయలు ఆవరించాయి. పొట్టకూటి కోసం వచ్చామని, ఏటా వస్తున్నామని, ఇలా జరుగుతుందని ఊహించలేదని వారు ఆవేదన వ్యక్తంచేశారు. ఇంద్రకీలాద్రికి వెళ్తూ.. అనంతలోకాలకు.. భీమడోలు : విజయవాడ ఇంద్రకీలాద్రికి వెళ్తున్న ఇద్దరు భవానీ భక్తులు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. ఈ దుర్ఘటన శుక్రవారం గుండుగొలను–పాతూరు మధ్య షుగర్ ఫ్యాక్టరీ వద్ద జాతీయ రహదారిపై జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. గణపవరం మండలం జల్లికొమ్మెరకు చెందిన అడ్డగర్ల గిరి(20), మద్దాల సూరిబాబు(21), మద్దాల ఏడుకొండలు, మద్దాల సాయి వ్యవసాయ కూలీలు. వీరంతా బంధువులు. నలుగురూ కలిసి విజయవాడ కనకదుర్గమ్మ ఆలయానికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. శుక్రవారం తెల్లవారుజామున కాలినడకన బయలుదేరారు. వారు గుండుగొలను దాటి పాతూరు పంచాయతీ పరిధిలోకి వచ్చే సరికి తాడేపల్లిగూడెం నుంచి విజయవాడ వైపు వెళ్తున్న కారు అతివేగంగా వచ్చి ముందుగా రోడ్డు పక్కనే జంటగా నడుస్తున్న అడ్డగర్ల గిరి, మద్దాల సూరిబాబుపై నుంచి దూసుకువెళ్లింది. దీంతో అక్కడికక్కడే గిరి దుర్మరణం పాలయ్యాడు. కొద్దిసేపు కొనప్రాణాలతో కొట్టుకున్న సూరిబాబు సహచరుల కళ్లెదుటే తుదిశ్వాస విడిచాడు. దీంతో ఏడుకొండలు, సాయి తీవ్రంగా రోదించారు. మృతులిద్దరికీ వివాహాలు కాలేదు. దీంతో ఇద్దరి కుటుంబాలు తల్లడిల్లుతున్నాయి. సమాచారం అందుకున్న భీమడోలు ఎస్సై బి.వెంకటేశ్వరరావు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ప్రమాదానికి కారణమైన కారును అందులో ఉన్నవారు అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. కారు అద్దాలు దెబ్బతిన్నాయి. మృతదేహాలను పంచనామా నిమిత్తం పోలీసులు ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. -
కారు హల్చల్: ఒకరికి గాయాలు
నార్తురాజుపాలెం(కొడవలూరు): నార్తురాజుపాలెంలో కారు హల్చల్ చేసిన సంఘటనలో ఓ వ్యక్తి గాయపడ్డారు. ఈ సంఘటన సోమవారం రాత్రి చోటుచేసుకుంది. నెల్లూరు ఎన్టీఆర్ నగర్‌కు చెందిన వారు కొత్తకారు కొనుగోలు చేసి ఆ కారులో రామతీర్థానికి పూజకు వెళ్లారు. అక్కడ పూజ పూర్తి చేసుకొని తిరిగి అతివేగంగా వస్తూ బసవాయపాలెం వద్ద నెల్లూరు నుంచి విధులు ముగించుకొని స్వగ్రామమైన అల్లూరుకు మోటార్ సైకిల్‌పై వెళుతున్న కుండా గౌతమ్‌ను ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో గౌతమ్‌కు గాయాలయ్యాయి. ఆ వెంటనే అప్రమత్తమైన గౌతమ్lకారును వెనుకనే వెంబడించగా, మరింత వేగంతో నార్తురాజుపాలెం వైపు వచ్చిన ఆ కారు స్థానిక బస్టాండు కూడలిలో అతివేగంగా అటుఇటు తిప్పుతూ స్థానికులను భయభ్రాంతులను చేసి నెల్లూరు వైపు దూసుకెళ్లింది. కారును అతివేగంగా మలుపులు తిప్పడంతో కూడలిలో ఉన్న ఇద్దరు వ్యక్తులకు త్రుటిలో ప్రమాదం తప్పింది. నార్తురాజుపాలెంలో హల్చల్ చేసి పరారైన కారు నెల్లూరు ఎన్టీఆర్ నగర్ వద్ద వదిలేసి ఉండగా, స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. హల్చల్ చేసిన కారును స్వాధీనం చేసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ నారాయణరెడ్డి తెలిపారు. -
చెట్టును ఢీకొన్న కారు..ఒకరి మృతి
కరీంనగర్: కరీంనగర్ జిల్లా సిరిసిల్ల మండలం జిల్లెల క్రాసింగ్ వద్ద ఓ కారు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తిమ్మాపూర్ మండలానికి చెందిన మహ్మద్ రిజ్వాన్ (32) అక్కడికక్కడే మృతిచెందగా..మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి... క్షతగాత్రుడ్ని సమీపంలోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని... మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మోటారు సైకిళ్లు ఢీకొని వ్యక్తి దుర్మరణం
కొవ్వూరు : మండలంలోని ఔరంగబాద్ సమీపంలో ఆదివారం వేకువజామున రెండు మోటారు సైకిళ్లు ఢీకొన్న ప్రమాదంలో సాగిరాజు శ్రీనివాసకుమారరాజు (43) అనే వ్యక్తి దుర్మరణం పాలయ్యారు. దేవరపల్లికి చెందిన కుమారరాజు మోటారు సైకిల్‌పై వెళుతుండగా ఔరంగబాద్ సమీపంలో 5.30–6.00 గంటల సమయంలో ఎదురుగా వస్తున్న మరో బైక్ ఢీకొట్టింది. దీంతో కుమారరాజుకు తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే మృతిచెందారు. మృతుడు విజ్జేశ్వరంలో శెనగన వీర్రాజుకు చెందిన డీసీఎం వ్యాన్‌పై డ్రైవర్ పనిచేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. వీర్రాజు ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై ఎస్ఎస్ఎస్ పవన్‌కుమార్ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కొవ్వూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
ఎర్రగడ్డలో రోడ్డు ప్రమాదం: ఒకరి మృతి
హైదరాబాద్ : ఎర్రగడ్డ సమీపంలోని రహదారిపై బుధవారం రోడ్డుప్రమాదం చోటు చేసుకుంది. ముందు వెళ్తున్న స్కూటర్‌ను వెనుక నుంచి వేగంగా వచ్చి... లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో స్కూటర్ నడుపుతున్న వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు. వెనక కూర్చున వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని... క్షతగాత్రుడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. మృతుని వివరాలు తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
రెండు బైక్‌లు ఢీ.. వ్యక్తి మృతి
రాచర్ల: ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్రవాహనాలు ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందగా, మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన ప్రకాశం జిల్లా రాచర్ల మండలం పలుగుంటపల్లి వద్ద గురువారం చోటుచేసుకుంది. ఎదురెదురుగా వస్తున్న రెండు బైక్‌లు ఢీకొనడంతో బైక్ పై ఉన్న యామ వెంకటేశ్వర్లు(46) అక్కడికక్కడే మృతిచెందగా, మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు. -
లారీని ఢీకొన్న టయోటా: ఇద్దరు మృతి
మహబూబ్‌నగర్ : మహబూబ్‌నగర్ జిల్లా కొత్తకోట మండలం పాలెం వద్ద ఆదివారం లారీని టయోటా కారు ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి... క్షతగాత్రుడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని... రెండు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
రోడ్డుప్రమాదంలో ఇద్దరు బీటెక్ విద్యార్థులు మృతి
గుడ్లవల్లేరు (కృష్ణా జిల్లా) : వేగంగా వెళ్తున్న లారీ ఎదురుగా వస్తున్న బైక్‌ను ఢీకొట్టిన ఘటనలో బైక్ పై ఉన్న ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం పెంజెండ్ర గ్రామ శివారులో శనివారం చోటుచేసుకుంది. కళాశాల నుంచి ఇంటికి వెళ్తున్న విద్యార్థులను ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టడంతో.. ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందిచారు. విద్యార్థుల వివరాలు తెలియాల్సి ఉంది.