కర్నూలు(ఆధోని): కర్నూలు జిల్లా ఆధోని మండలం ఆరేకల్ వద్ద ఎదురెదురుగా వస్తున్న ఇన్నోవా, బోలెరో వాహనాలు ఢీకొన్నాయి. మంగళవారం రాత్రి జరిగిన ఈ ప్రమాదంలో బోలెరోలో ప్రయాణిస్తున్న శ్యామల(32) అనే మహిళ మృతిచెందగా.. మరో మహిళకు తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం వెంటనే ఆధోని ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.