తోపుడుబండిపై భార్య మృతదేహం.. కన్నీళ్లు పెట్టిస్తున్న ఘటన | Woman Died Of Heart Attack After Flood Water Entered Her House In Singh Nagar Vijayawada | Sakshi
Sakshi News home page

తోపుడుబండిపై భార్య మృతదేహం.. కన్నీళ్లు పెట్టిస్తున్న ఘటన

Published Tue, Sep 3 2024 4:57 PM | Last Updated on Tue, Sep 3 2024 5:30 PM

Woman Died Of Heart Attack After Flood Water Entered Her House In Singh Nagar Vijayawada

సాక్షి, విజయవాడ: సింగ్‌నగర్‌లో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. ఇంట్లోకి వరద నీరు రావడంతో పద్మావతి (48) అనే మహిళ గుండె ఆగి మృతి చెందింది. నిన్న ఉదయం జరిగిన ఈ ఘటన జరిగింది. హార్ట్ ఎటాక్ అని చెప్పినా కూడా పడవలు, అంబులెన్స్‌లు రాలేదు. దీంతో బయటకు రాలేక, మెడిసిన్ అందక.. తీవ్ర బాధను పద్మావతి అనుభవించింది. చివరికి భర్త, కుమారుల కళ్లెదుటే కన్నుమూసింది.

నిన్నటి నుంచీ ఇంట్లోనే డెడ్‌బాడీతో కుటుంబ సభ్యులు ఉన్నారు. చివరికి వరద నీటిలోనే తోపుడిబండిపై మృతదేహంతో భర్త శ్రీనివాసరావు బయలుదేరారు. 4 కిలోమీటర్లు  భార్య మృతదేహాన్ని తోపుడుబండిపై తోసుకుంటూ వరదలో నీటిలోనే ప్రయాణం సాగించారు. సింగ్‌నగర్ ఫ్లై ఓవర్ వరకు వచ్చి అధికారులను ప్రాధేయపడినా ఊరట దక్కలేదు.

నాలుగు కిలోమీటర్లు వచ్చారుగా ఇంకో కి.మీ. వెళ్తే మెయిన్ రోడ్ వస్తుందంటూ ఉచిత సలహాను అధికారులు ఇచ్చారు. దీంతో చేసేదిలేక తోపుడు బండిపై మృతదేహంతో కుటుంబసభ్యులు వెళ్లిపోయారు. పద్మావతి మృతి ఘటన చూపరులను కంట తడి పెట్టించింది.


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement