woman died
-
బెంజ్ కారుతో 20 ఏళ్ల యువకుడి బీభత్సం.. మహిళ మృతి
బెంగళూరు: పీకలదాకా తాగిన మత్తులో కారు నడిపిన ఓ యువకుడు.. మహిళ ప్రాణాలను బలి తీసుకున్నాడు. మెర్సిడెస్ బెంజ్ కారుతో ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ రోడ్డు దాటుతున్న మహిళను ఢీకొట్టి ఆమె మృతికి కారణమయ్యాడు. ఈ ఘటన కర్ణాటక రాజధాని బెంగళూరులో జరిగింది. నగరంలోని కెంగేరి మెట్రో స్టేషన్ సమీపంలో శనివారం రాత్రి 30 ఏళ్ల సంధ్య రోడ్డు దాటడానికి ప్రయత్నిస్తోంది. అదే సమయంలో మద్యం మత్తులో ఉన్న 20 ఏళ్ల విద్యార్థి ధనుష్ తన తండ్రి మెర్సిడెస్ బెంజ్ కారుతో వవేగంగా వస్తూ ఆమెను ఢీకొట్టాడు. దీంతో సంధ్య అక్కడికక్కడే మృతి చెందింది.ప్రమాదం తర్వాత నిందితుడు అక్కడి నుండి పారిపోవడానికి ప్రయత్నించగా.. స్థానికులు అతన్ని పట్టుకొని చితకబాదారు. సమాచారం అందుకున్న కెంగేరి పోలీసులు నిందితుడు ధనుష్‌తోపాటు అతని స్నేహితుడుని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.కాగా నిందితుడిని ప్రైవేట్ బస్ ట్రావెల్ కంపెనీ యజమాని అయిన వీర శివ కుమారుడు ధనుష్‌గా గుర్తించారు. అతని తండ్రి ఇటీవలే లగ్జరీ కారు మెర్సిడెస్ బెంజ్‌ను కొనుగోలు చేశాడు. ఈ క్రమంలో ధనుష్ ఈ కారును తీసుకొని యశ్వంత్‌పూర్ సమీపంలోని ఒక మాల్‌కు స్నేహితుడితో కలిసి వెళ్లాడు. ఇద్దరు అక్కడ మద్యం తాగి మైసూరు రోడ్డుకు లాంగ్ డ్రైవ్‌కు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. కారు నడుపుతున్న ధనుష్ అతివేగంతో కెంగేరి స్టేషన్ కు చేరుకోగానే స్పీడ్ బ్రేకర్ ను గమనించలేక వాహనంపై నియంత్రణ కోల్పోయాడు. రోడ్డు దాటుతున్న మహిళను ఢీ కొట్టాడు. -
తోపుడుబండిపై భార్య మృతదేహం.. కన్నీళ్లు పెట్టిస్తున్న ఘటన
సాక్షి, విజయవాడ: సింగ్‌నగర్‌లో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. ఇంట్లోకి వరద నీరు రావడంతో పద్మావతి (48) అనే మహిళ గుండె ఆగి మృతి చెందింది. నిన్న ఉదయం జరిగిన ఈ ఘటన జరిగింది. హార్ట్ ఎటాక్ అని చెప్పినా కూడా పడవలు, అంబులెన్స్‌లు రాలేదు. దీంతో బయటకు రాలేక, మెడిసిన్ అందక.. తీవ్ర బాధను పద్మావతి అనుభవించింది. చివరికి భర్త, కుమారుల కళ్లెదుటే కన్నుమూసింది.నిన్నటి నుంచీ ఇంట్లోనే డెడ్‌బాడీతో కుటుంబ సభ్యులు ఉన్నారు. చివరికి వరద నీటిలోనే తోపుడిబండిపై మృతదేహంతో భర్త శ్రీనివాసరావు బయలుదేరారు. 4 కిలోమీటర్లు భార్య మృతదేహాన్ని తోపుడుబండిపై తోసుకుంటూ వరదలో నీటిలోనే ప్రయాణం సాగించారు. సింగ్‌నగర్ ఫ్లై ఓవర్ వరకు వచ్చి అధికారులను ప్రాధేయపడినా ఊరట దక్కలేదు.నాలుగు కిలోమీటర్లు వచ్చారుగా ఇంకో కి.మీ. వెళ్తే మెయిన్ రోడ్ వస్తుందంటూ ఉచిత సలహాను అధికారులు ఇచ్చారు. దీంతో చేసేదిలేక తోపుడు బండిపై మృతదేహంతో కుటుంబసభ్యులు వెళ్లిపోయారు. పద్మావతి మృతి ఘటన చూపరులను కంట తడి పెట్టించింది. -
ప్రియుడు దూరం కావడంతో వివాహిత ఆత్మహత్య
అక్కిరెడ్డిపాలెం: జీవితంపై విరక్తితో వివాహిత ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. గాజువాక పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మల్కాపురం దరి కాకరలోవ జై ఆంధ్రకాలనీకి చెందిన దండు భాను కుమార్తె స్వాతి (23)కి ఏడేళ్ల క్రితం వేపగుంట వద్ద గల చీమలాపల్లికి చెందిన కొప్పల దేవేంద్రకుమార్‌తో ప్రేమ వివాహం జరిగింది. వీరికి ఒక పాప ఉంది. కొన్నాళ్ల తర్వాత మనస్పర్థల కారణంగా వారు దూరంగా ఉంటున్నారు. స్వాతి నాలుగేళ్లగా తల్లి వద్దనే ఉంటూ గాజువాకలోని ఓ షాపింగ్‌మాల్‌లో పనిచేస్తోంది. ఈ క్రమంలో మల్కాపురానికి చెందిన రోహిత్ కుమార్‌తో సన్నిహితంగా ఉండేది. కొద్ది రోజులుగా గాజువాకలోని ఓ లేడీస్ హాస్టల్లో ఉంటోంది. స్వాతి కుమార్తె మల్కాపురంలో ఆమె తల్లి వద్ద ఉంటుంది. రెండు నెలల క్రితం స్వాతి భర్త దేవేంద్రకుమార్ అత్త వద్దకు వచ్చి తన కుమార్తెను తీసుకెళ్లి రెండు రోజుల్లో తీసుకొస్తానని చెప్పి తిరిగి తీసుకురాలేదు. దీంతో స్వాతి తన కూతురుతో పాటు రోహిత్ కూడా దూరం కావడంతో జీవితంపై విరక్తి చెంది హాస్టల్లో ఆదివారం అర్ధరాత్రి ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. గమనించిన హాస్టల్ వార్డెన్ గాజువాక పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. మృతురాలి తల్లి దండు భాను ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టనున్నట్లు ఏఎస్ఐ రవికుమార్ తెలిపారు. -
అక్క కోసం కదులుతున్న బస్సు దిగుతూ..
వెంగళరావునగర్: అక్క కోసం కదులుతున్న బస్సు దిగిన చెల్లెలు ప్రమాదవశాత్తూ అదే బస్సు చక్రాల కింద నలికి మృత్యువాత పడిన ఘటన మధురానగర్ పీఎస్ పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది. మసీరా మెహ్రీన్(16) యూసుఫ్‌గూడలోని మాస్టర్స్ జూనియర్ కళాశాలలో ఇంటర్ ఫస్టియర్ చదువుతుండగా, ఆమె సోదరి జవేరియా మెహెక్ సెకండియర్ చదువుతోంది. మధ్యాహ్నం కళాశాల అయిపోగానే ఇంటికి వెళ్ళడానికి అక్కాచెల్లెళ్ళు యూసుఫ్‌గూడ చెక్‌పోస్ట్ వద్ద ఉన్నారు. సికింద్రాబాద్ నుంచి బోరబండ వెళ్తున్న బస్సు రాగానే రద్దీ ఎక్కువగా ఉండటంతో ముందుగా మెహ్రీన్ బస్సు ఎక్కింది. మెహెక్ మాత్రం ఫుట్ బోర్డు వరకు ప్రయాణికులు ఎక్కువగా ఉండటంతో బస్సు ఎక్కలేక రోడ్డు మీదనే నిలబడిపోయింది. ఇంతలో బస్సు బయలుదేరడంతో అక్క కోసం మెహ్రీన్ కదులుతున్న బస్సులో నుంచి కిందకు దిగేందుకు ప్రయతి్నంచింది. దాంతో ఆమె ప్రమాదవశాత్తు బస్సు చక్రాల కింద పడి నలిగి మృతి చెందింది. అక్క మెహెక్‌తో పాటు ఈ ప్రమాదాన్ని ప్రత్యక్షంగా చూసిన స్థానికులు సైతం విలవిలలాడిపోయారు. ఇటీవల పదో తరగతి పూర్తి చేసుకున్న మెహ్రీన్ వారం కిందటే కాలేజీలో చేరింది. మధురానగర్ ఇన్స్పెక్టర్ మధుసూధన్‌రెడ్డి కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఘోర రోడ్డు ప్రమాదం.. సాప్ట్వేర్ ఇంజినీర్ మృతి
పెనుకొండ రూరల్: డివైడర్‌ను ఢీకొన్న ఘటనలో కారులో ప్రయాణిస్తున్న వివాహిత మృతి చెందింది. పోలీసులు తెలిపిన మేరకు... వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగుకు చెందిన మురళి, ఉమాదేవి (34) దంపతులు బెంగళూరులోని ఓ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్లుగా పనిచేస్తున్నారు. బెంగళూరులోనే స్థిరపడిన వీరు... తమ ఇద్దరు పిల్లలతో కలసి మూడు రోజుల క్రితం హైదరాబాద్‌లోని బంధువుల ఇంట జరిగిన శుభకార్యానికి హాజరయ్యారు. ఆదివారం రాత్రి కారులో బెంగళూరుకు బయలుదేరారు, సోమవారం ఉదయం పెనుకొండ సమీపంలోని 44వ జాతీయ రహదారిపై గుట్టూరు వై.జంక్షన్ వద్దకు చేరుకోగానే డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో కారు వేగంగా వెళ్లి డివైడర్‌ను ఢీకొని రెండు ముక్కలైంది. ఘటనలో ఉమాదేవి అక్కడికక్కడే మృతి చెందింది. మిగిలిన ముగ్గురు స్వల్ప గాయాలుతో బయటపడ్డారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు పెనుకొండ ఎస్ఐ రంగడు తెలిపారు. -
భర్త చెంపపై కొట్టడంతో భార్య మృతి
కొవ్వూరు: డ్వాకా రుణ వాయిదా చెల్లింపు విషయంపై తగదా పడి భార్యను భర్త చెంపపై కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందిన ఘటన మంగళవారం కొవ్వూరు మండలం మద్దూరు గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన సండ్ర వీరబాబు, భార్య లావణ్య సాయి దీపిక(30)తో డ్వాక్రాలో తీసుకున్న రుణం చెల్లింపు విషయంపై వారం నుంచి తగదా పడుతున్నాడు. మంగళవారం ఉదయం వాయిదా డబ్బులు ఇవ్వాలని భార్య మరోసారి అడగడంతో కోపోద్రిక్తుడైన వీరబాబు ఆమెను చెంపపై బలంగా కొట్టాడు. దీంతో ఆమె అక్కడికక్కడే పడి మృతి చెందినట్లు స్ధానికులు చెబుతున్నారు. ఈ విషయం వీరబాబు అత్తమామలకు ఫోన్ చేసి జరిగిన ఘటనకు గురించి తెలిపాడు. వీరబాబుకి, లావణ్యకి 13 ఏళ్ల క్రితం వివాహం అయ్యింది. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. మృతురాలి కుటుంబ సభ్యులు వీరబాబే లావణ్యను హత్య చేశాడని ఆరోపించారు. పెళ్లి అయినప్పటి నుంచి వీరబాబు తన కుమార్తెను సక్రమంగా చూసుకోలేదని, ఎన్నో బాధలు పెట్టారని తల్లి బడేటి వెంకటలక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు. తన కుమార్తెను చిత్ర హింసలకు గురి చేయడమే కాకుండా అన్యాయంగా చంపేశారని ఆరోపించారు. వెంకటలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు రూరల్ ఎస్సై కె.సుధాకర్ తెలిపారు. డీఎస్పీ కె.సీహెచ్ రామరావు ఘటనా స్ధలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. -
ఓటు వేసి.. మృత్యుఒడిలోకి..
హన్మకొండ: అసెంబ్లీ ఎన్నికలు ఆ కుటుంబంలో విషాదాన్ని నింపాయి. స్వగ్రామంలో ఓటు వేసి తిరిగి వెళ్తుండగా మృత్యువు కారు రూపంలో వచ్చి వారు ప్రయాణిస్తున్న ద్విచక్రవాహనాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో భార్య మృతి చెందగా భర్తకు తీవ్ర గాయాలయ్యాయి. అలాగే ఇద్దరు కుమారుల కాళ్లు విరిగి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతురాలి బంధువుల కథనం ప్రకారం. వరంగల్ జిల్లా ఖానాపురం మండలం రాగంపేటకు చెందిన వాంకుడోత్ రవీందర్ తన కుటుంబంతో కలిసి హనుమకొండ రెడ్డికాలనీలో నివాసముంటున్నారు. గురువారం అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా స్వగ్రామంలో ఓటు హక్కు వినియోగించుకుని బైక్ పై భార్య మానస(27), ఇద్దరు కుమారులు జ్ఞాన చైతన్య, హర్షవర్ధన్‌ను తీసుకుని హనుమకొండకు తిరుగు ప్రయాణమయ్యాడు. మార్గమధ్యలో వరంగల్–నర్సంపేట రహదారిపై గీసుకొండ మండలం కొమ్మాల శివారులోకి రాగానే నర్సంపేట వైపునకు ఎదురుగా వస్తున్న కారు డ్రైవర్ అతి వేగంగా వచ్చి వారి ద్విచక్ర వాహనాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో రవీందర్, మానసకు బలమైన గాయాలు కాగా వారి కుమారుల కాళ్లు విరిగాయి. వారందరినీ 108 అంబులెన్స్‌లో ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యసేవల కోసం మానసను హనుకొండలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ ఆమె శుక్రవారం ఉదయం మృతి చెందింది. అజాగ్రత్తగా కారు నడిపిన డ్రైవర్‌పై చట్టరీత్యా చర్య తీసుకోవాలని, మృతురాలి బంధువు వాంకుడోత్ ప్రవీణ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు గీసుకొండ సీఐ రామకృష్ణ తెలిపారు. -
విద్యుత్ శాఖ అటెండర్ యాదమ్మ దారుణ హత్య
రంగారెడ్డి: పెట్రోల్ పోసి తగులబెట్టి ఓ మహిళను దారుణంగా హత్య చేసిన ఘటన రంగారెడ్డి జిల్లా హైదరాబాద్ గ్రీన్ ఫార్మాసిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. సీఐ రామాంజనేయులు తెలిపిన వివరాలు.. మంచాల మండలం జాపాల గ్రామానికి చెందిన మంథని కృష్ణ విద్యుత్ శాఖలో హెల్పర్‌గా పని చేస్తూ నాలుగేళ్ల క్రితం గ్రామంలోనే ప్రమాదవశాత్తు మృతి చెందాడు. గ్రామస్తుల ఆందోళనతో ప్రభుత్వం కృష్ణ భార్య యాదమ్మ(38)కు తుర్కయంజాల్‌లో ఉన్న విద్యుత్ శాఖ డీఈఈ కార్యాలయంలో అటెండర్‌గా ఉద్యోగం కల్పించింది. ఆమె నిత్యం జాపాల నుంచి తుర్కయంజాల్‌కు వెళ్లి వస్తుండేది. రోజు మాదిరిగానే మంగళవారం ఉదయం ఇంటి నుంచి బయలుదేరింది. రాత్రి 10 గంటలైనా ఇంటికి రాకపోవడం, ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి ఉండడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురై మంచాల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో బుధవారం ఉదయం ముచ్చర్ల శివారులోని చాకలోనికుంట సమీపంలో కాలిపోయిన ఓ మహిళ మృతదేహం ఉన్నట్లు సమాచారం అందింది. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు యాదమ్మ కుటుంబ సభ్యులను పిలిపించగా మృతదేహం ఆమెదేనని గుర్తించారు. పోలీసులు క్లూస్‌టీం, డాగ్‌స్క్వాడ్‌తో వివరాలు సేకరించారు. సంఘటనా స్థలాన్ని ఇబ్రహీంపట్నం ఏసీపీ శ్రీనివాస్‌రావు పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కాగా, జాపాల గ్రామం నుంచి మంగళవారం ఉద యం తుర్కయంజాల్‌లోని విద్యుత్ శాఖ డీఈఈ కార్యాలయంలో విధులకు వెళ్లిన యాదమ్మ సా యంత్రం కార్యాలయం ముందున్న సాగర్‌రోడ్డు వద్దకు వచ్చి ఓ కారులో వెళ్లినట్లు సీసీ పుటేజీలో రికార్డయింది. ఆమె ఎవరి కారులో వెళ్లింది.. కారు లో ఉన్నదెవరు.. స్వగ్రామంలో ఏమైనా తగాదాలున్నాయా.. ఎక్కడో చంపి మృతదేహన్ని ఇక్కడి కి తీసుకొచ్చి పడేశారా.. అత్యాచారం చేసి, ఆనవాళ్లు దొరక్కకుండా తగులబెట్టడానికి యత్నించారా అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. యాద మ్మ వెళ్లిన కారు నంబర్‌ను సీసీ పుటేజీలో గుర్తించిన పోలీసులు ఆ దిశలో వివరాలు సేకరిస్తున్నారు. జాపాలలో విషాదఛాయలు మంచాల: యాదమ్మ మృతితో ఆమె స్వగ్రామం జాపాలలో విషాదఛాయలు అలముకున్నాయి. మృతురాలికి కూతుళ్లు అర్చన, విమల, కుమారుడు వీరేందర్ యాదవ్ ఉన్నాడు. తల్లిదండ్రుల మృతితో వారి కుటుంబం రోడ్డున పడింది. తల్లి మృతదేహాన్ని చూసి పిల్లలు కన్నీరుమున్నీరయ్యారు. -
తెగిన లిఫ్ట్ వైర్, 8వ ఫ్లోర్ నుంచి ఒక్కసారిగా పడిపోవడంతో..
నోయిడా: ప్రమాదం ఎప్పుడు ఎటువైపు నుంచి ముంచుకొస్తుందో చెప్పలేము. ఊహించని ప్రమాదాలతో రెప్పపాటులో ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. తాజాగా అలాంటి ఘటన చోటుచేసుకుంది. ఓ బిల్డింగ్‌లోని లిఫ్ట్ ఒక్కసారిగి కిందకు జారడంతో గుండెపోటుకు గురై ఓ మహిళా ప్రాణాలు కోల్పోయింది. ఉత్తర ప్రదేశ్‌లోని నోయిడాలో గురువారం ఈ ఘోరం వెలుగుచూసింది. నోయిడాలోని సెక్టార్ 137లో పరాస్ టియెర్రా సొసైటీలోని ఓ అపార్ట్మెంట్లోని లిఫ్ట్‌లోకి 73 ఏళ్ల వృద్ధురాలు వెళ్లింది. ఈ క్రమంలో లిఫ్ట్ వైర్ ఒక్కసారిగా తెగిపోవడంతో 8 ఫ్లోర్లు కిందకు జారిపడింది. అయితే లిఫ్ట్ గ్రౌండ్‌ను ఢీకొట్టకుండా మధ్య అంతస్తుల్లో చిక్కుకుపోయింది. ఊహించని పరిణామంతో లిఫ్ట్‌లో ఒంటరిగా ఉన్న మహిళ స్పృహతప్పి పడిపోయింది. కాసేపటికి గమనించిన సిబ్బంది మహిళను ఫెలిక్స్ ఆసుపత్రిలో చేర్చగా.. చికిత్స పొందుతూ గంటకే మృతిచెందింది. అయితే మహిళ తల వెనక, మోచేతి వద్ద గాయాలున్నట్లు వైద్యులు తెలిపారు. లిఫ్ట్ పడిపోవడం వల్ల ఆమెకు ఈ గాయాలైనట్లు పేర్కొన్నారు. మహిళను ఆసుపత్రికి తీసుకొచ్చినప్పుడు పల్స్ లేదని ఆకస్మిక ఘటనతో ఆమెకు గుండెపోటు వచ్చినట్లు తెలుస్తోందని వైద్యులు వెల్లడించారు. మరోవైపు అపార్ట్‌మెంట్‌కు చెందిన వందలాది మంది సొసైటీ కాంప్లెక్స్ బయటకు వచ్చి జరిగిన ఘోరానికి వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. వృద్ధురాలి మృతికి యజమాన్యం నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు. చదవండి: ఎట్టకేలకు సీఎం ‘కుర్చీ’లో కూర్చున్న అజిత్ పవార్ -
షాపింగ్ కోసమని హైదరాబాద్‌కు.. రోడ్డు ప్రమాదంలో శభానా మృతి
కరీంనగర్‌క్రైం: కరీంనగర్ నుంచి పెద్దపల్లి వెళ్లే బైపాస్‌రోడ్డులో సోమవారం వేకువజామున రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ మహిళ మృతిచెందగా.. మరో ఎనిమిది మంది గాయపడ్డారు. కరీంనగర్ వన్‌టౌన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కరీంనగర్ అజ్మత్‌పురకు చెందిన శభానా అంజుమ్(48) తన బంధువు సయ్యద్ అఫ్జలుల్ రెహ్మాన్ ఎంగేజ్మెంట్ ఉండగా ఆదివారం ఉదయం ఎర్టిగా కారులో అఫ్జలుల్ రెహ్మాన్, శభానా అంజుమ్, మెహ్మతిపాతి మా, అమాల్ ఫాతిమా, రుక్సానాభేగం, మీర్జా సమీర్‌భేగ్ కలసి హైదరాబాద్‌కు షాపింగ్ కోసమని వెళ్లారు. షాపింగ్ ముగించుకొని తిరిగి కరీ ంనగర్ వస్తుండగా సోమవారం వేకువ జామున 4.30గంటల ప్రాంతంతో కరీంనగర్ ఆటోనగర్ సమీపంలో కారు డివైడర్‌ను ఢీకొని బోల్తాపడింది. కారులో ఉన్న అఫ్జలుల్ రెహ్మాన్, మెహ్మతిపాతిమా, అమాల్ ఫాతిమా, రుక్సానాబేగం, మిర్జాసమీర్‌బేగ్‌లకు స్వల్పగాయాలయ్యాయి. శభానా అంజుమ్‌కు తీవ్ర గాయాలు కావడంతో ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందు తూ కాసేపటికే మృతిచెందింది. మృతురాలి భర్త సయ్యద్ అబ్దుల్ రెహమాన్ ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
చెరుకు మిషన్‌లోకి చున్నీ: యువతి మృతి
శ్రీకాకుళం: శ్రీకూర్మంలోని శ్రీకూర్మనాథాలయం వద్దనున్న చెరుకు మిషన్ వద్ద పని చేస్తున్న గాయత్రి (18) అనే యువతి చున్నీ మిషన్‌లోకి వెళ్లిపోవడంతో ఊపిరాడక మృతి చెందింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కండ్ర వీధికి చెందిన గాయత్రి ఆదివారం సాయంత్రం చెరుకు మిషన్ వద్ద పనిచేస్తూ ఉండగా ప్రమాదవశాత్తు చున్నీ మిషన్‌లోకి వెళ్లిపోయి ఊపిరాడక అపస్మారక స్థితికి వెళ్లిపోయింది. స్థానికులు హుటాహుటిన రిమ్స్‌కు తరలించినా అప్పటికే ఆమె మృతి చెందింది. ఎస్ఐ ఎన్.కామేశ్వరరావు కేసు నమోదు చేశారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్ సీపీ యువనేత ధర్మాన రామ్మనోహర్ నాయుడు రిమ్స్ వైద్యులతో మాట్లాడారు. -
హైదరాబాద్ యువతి హత్య కేసు.. అపార్ట్మెంట్లో ఆ రోజు ఏం జరిగింది?
కర్ణాటక: హైదరాబాద్‌కు చెందిన యువతి ఆకాంక్ష (23) హత్య కేసులో బెంగళూరు జీవన్ బీమానగర పోలీసులు ఆమె ప్రియుని కోసం అన్వేషణ చేపట్టారు. ఢిల్లీకి చెందిన అర్పిత్ (25) హత్య చేసినట్లు నిర్ధారణకు వచ్చారు. వివరాలు.. బీకాం పూర్తి చేసిన ఆకాంక్ష బెంగళూరులో మార్కెటింగ్ సంస్థలో పని చేసేది. ఢిల్లీకి చెందిన ఆర్పిత్ కూడా ఆకాంక్ష పని చేస్తున్న సంస్థలోనే ఉద్యోగంలో చేరాడు. ఇద్దరి మధ్య స్నేహం పెరిగి, ప్రేమకు దారి తీసింది. మొదట కొద్ది రోజులు ఒకే ఇంటిలో సహజీవనం చేశారు. కొన్నిరోజుల క్రితం హైదరాబాద్‌కు అర్పిత్ బదిలీ కాగా, ఆ రూంను ఖాళీ చేసిన ఆకాంక్ష స్నేహితురాలితో కలిసి అపార్ట్మెంట్ ఫ్లాట్‌లో బాడుగకు ఉంటోంది. ఆత్మహత్య అనేలా నాటకం ఈ నేపథ్యంలో ఇద్దరూ ఒకేచోట ఉద్యోగం చేయాలని, పెళ్లి విషయంలో విభేదాలు వచ్చాయి. హైదరాబాదు నుంచి వచ్చిన అర్పిత్ సోమవారం ఆకాంక్షతో కలిసి నగరంలో షికార్లు చేశాడు. మధ్యాహ్నం అపార్ట్‌మెంట్‌కు వెళ్లిన సమయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీనితో ఆమెను గొంతు నులిమి హత్య చేశాడు. తరువాత గొంతుకు చున్నీ బిగించి ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లుగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. కానీ ఫ్యాన్‌కు వేలాడదీయలేక నేల మీద పడుకోబెట్టి ఫ్లాట్‌కి తాళం వేసుకొని పరారయ్యాడు. ఆకాంక్షతో పాటు అదే ఫ్లాట్‌లో ఉన్న స్నేహితురాలు కొన్ని గంటల తరువాత వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తల్లిదండ్రుల రాక హైదరాబాద్ నుంచి తల్లిదండ్రులు, బంధువులు చేరుకుని విగతజీవిగా ఉన్న ఆకాంక్షను చూసి భోరున విలపించారు. తమ కూతురిని అర్పిత్ హత్య చేసినట్లు మృతురాలి తల్లిదండ్రులు జీవన్ బీమానగర పోలీసులకు ఫిర్యాదు చేశారు. పరారీలో ఉన్న అతని కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. -
ఆర్థిక సమస్యలతో గృహిణి ఆత్మహత్య
మనోహరాబాద్(తూప్రాన్): ఆర్థిక సమస్యలతో ఓ గృహణి ఆత్మహత్య చేసుకుంది. ఎస్ఐ సందీప్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం...మండలపరిధిలోని కాళ్ళకల్‌కు చెందిన చెనిగారపు స్వాతి(30) ఆర్థిక సమస్యలతో గురువారం ఇంట్లోనే విషం తాగింది. గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స కోసం మేడ్చల్‌లో ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందింది. మృతురాలి సోదరుడు రాజు ఫిర్యాదు మేరకు శుక్రవారం కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తూప్రాన్ ఆస్పత్రికి తరలించారు. మృతురాలికి ఒక కూతురు, కుమారుడున్నారు. -
కూలర్లో నీళ్లు పోస్తుండగా..
హైదరాబాద్: ఇంట్లో కూలర్లో నీళ్లు పోస్తుండగా ఓ మహిళ విద్యుదాఘాతానికి గురై మృతి చెందింది. ఈ సంఘటన ఆదివారం రాత్రి గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గోల్కొండ రిసాలబజార్‌లో హర్షియాబేగం(29) తన భర్త మహ్మద్‌తో కలిసి ఉంటున్నది. ఆదివారం రాత్రి కూలర్‌ను ఆఫ్ చేయకుండా నీళ్లు పోసింది. అదే సమయంలో ఆమె కూలర్ తగిలి విద్యుదాఘాతానికి గురైంది. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. భార్యను కాపాడబోయిన మహ్మద్‌కు కూడా విద్యుత్ షాక్ తగిలి గాయపడ్డారు. కాగా కూలర్ ఐరన్‌ది కావడంతో అందులోకి విద్యుత్ ప్రవహించిందని పోలీసులు అనుమానిస్తున్నారు. -
నాలుగు రోజులుగా ఉరికి వేలాడుతూ..
నరసన్నపేట: నాలుగు రోజులుగా ఆ ఇంటి తలుపులు మూసే ఉన్నాయి. న్యూస్ పేపర్లు ఎక్కడ వేసినవి అక్కడే ఉన్నాయి. ఎవరు పిలిచినా లోపల నుంచి సమాధానం రావడం లేదు. స్థానికుల ఫిర్యాదు మేరకు ఇంటికి వెళ్లి పరిశీలించిన పోలీసులకు ఫ్యాన్ హుక్కు ఓ మహిళ మృతదేహం వేలాడుతూ కనిపించింది. నాలుగు రోజులుగా ఆ మృతదేహం అలాగే ఉన్నట్లు వారు గుర్తించారు. నరసన్నపేట శ్రీరామనగర్‌లో జరిగిన ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. మృతురాలు బమ్మిడి శాంతకుమారి(39) అని, ఆమెది శ్రీకాకుళంలోని ప్రశాంతి నగర్ అని పోలీసులు నిర్ధారించారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. స్థానిక శ్రీరామనగర్‌లో బమ్మిడి జయకుమార్, భార్య శాంతకుమారి నివాసం ఉంటున్నారు. నా లుగు రోజులుగా ఆ ఇంటికి ఎవరూ రాకపోవడం, ఇంటి నుంచి దుర్వాసన వస్తుండడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వారి ఫిర్యా దు మేరకు ఎస్ఐ వై.సింహాచలం శుక్రవారం ఉద యం ఇంటిని పరిశీలించారు. తలుపులకు లోపల నుంచి గడియ పెట్టి ఉండడంతో తీయడం సాధ్యం కాలేదు. దీంతో ఆ కుటుంబం వివరాలు సేకరించారు. స్థానిక వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయంలో ఆఫీస్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న బమ్మిడి జయకుమార్ తన భార్య శాంత కుమారితో అక్కడ నివశిస్తున్నట్లు తెలుసుకున్నారు. జయకుమార్ ఆచూకీ తెలుసుకొని ఆయనను ఇంటికి రప్పించారు. అలాగే శాంతకుమారి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చి వా రు వచ్చిన తర్వాత గడియ విరగ్గొట్టి లోపలకు వెళ్లి చూస్తే వంట గదిలో ఫ్యాన్ హుక్కు ఉరి వేసుకుని శాంతకుమారి కనిపించింది. సంఘటన జరిగి నాలు గు రోజులు కావడంతో మృతదేహం నుంచి దుర్వాసన అధికంగా వచ్చింది. ఆమె మృతదేహాన్ని చూసి న కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. అప్పటికే సిద్ధంగా ఉన్న క్లూస్ టీమ్ సభ్యులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి వేలిముద్రలు సేకరించారు. శాంత కుమారి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. ఈ నెల 23వ తేదీ వేకువజామున ఆమె ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని భావిస్తున్నారు. అంతకుముందు రోజు భార్యతో గొడవపడిన జయకుమార్ తన స్వగ్రామం నందిగాం మండలం శ్రీపురం వెళ్లిపోయి అక్కడే ఉన్నారు. దీంతో ఇంటిలో ఎవరూ లేని సమయం చూసి ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నారు. సంఘటన స్థలాన్ని టెక్కలి డీఎస్పీ బాలచంద్రారెడ్డి, తహసీల్దార్ ఎ.సింహాచలంలు పరిశీలించారు. మృతురాలి తండ్రి చిగులపల్లి లక్ష్మణరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నరసన్నపేట సీఐ డి.రాము కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ‘వేధింపులు తాళలేకే..’ ‘నా కుమార్తె శాంతకుమారి అల్లుడు, ఆయన కుటుంబ సభ్యుల వేధింపులు తాళలేక ఈ అఘాయిత్యానికి పాల్పడింది’ అని తల్లిదండ్రులు చిగులపల్లి లక్ష్మణరావు, కనకరత్నం సోదరి ధనలక్ష్మిలు ఆరోపించారు. వివాహమైనప్పటి నుంచి అదనపు కట్నం కోసం వేధిస్తున్నారని తెలిపారు. అవి భరించలేకే తమ కుమార్తె చనిపోయిందని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. 2018లో వివాహమైందని, సంతానం లేదని అన్నారు. భర్త జయకుమార్ మాట్లాడుతూ ఆమె తనను వేధించేదని, పలుమార్లు కొట్టిందని, ఆ బాధలకు భయపడి 22న సొంతూరు వెళ్లిపోయానని, ఆ తర్వాత ఈ అఘాయిత్యానికి పాల్పడిందని అన్నారు. -
విహారానికి వచ్చి.. మృత్యు ఒడిలోకి
అల్లూరి సీతారామరాజు: ప్రకృతి ఒడిలో సరదాగా సేదా తీరుదామని వచ్చిన ఓ పర్యాటకురాలిని చెట్టుకొమ్మ రూపంలో మృత్యువు కబళించింది. ఆమె బంధువుల కథనం మేరకు వివరాలిలావున్నాయి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడుకు చెందిన ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు విహార యాత్రకు మారేడుమిల్లి బయలుదేరారు. మార్గంలో రాజమహేంద్రవరంలో మరొక మహిళతో కలిసి ఎనిమిది మంది బుధవారం మారేడుమిల్లి వచ్చారు. ఇక్కడ నుంచి జతలరంగిణి జలపాతం వద్దకు వెళ్లారు. సందర్శన అనంతరం అక్కడి నుంచి అమృతధార జలపాతానికి వెళ్లారు. వీరిలో రాజమహేంద్రవరానికి చెందిన ఎ.సంధ్య (38) జలపాతం పైభాగంలో బండరాళ్లపై కూర్చొని ఉంది. ఆమైపె ఒక్కసారిగా భారీ చెట్టు కొమ్మ విరిగి ఆమైపె పడింది. దీంతో ఆమె కిందకు జారి బండరాళ్లపై పడిపోయింది. తలకు, కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. బంధువులు వెంటనే స్థానిక పీహెచ్‌సీకి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో రంపచోడవరం ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందింది. ఈ మేరకు స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
డెంగీతో వివాహిత మృతి
భద్రాద్రి: డెంగీతో ఓ వివాహిత మృతిచెందిన ఘటన మంగళవారం మండలంలో చోటుచేసుకుంది. మండల కేంద్రంలోని ఎస్సీకాలనీకి చెందిన మలిపెద్ది సంధ్య (22)కు ఇటీవల తీవ్ర జ్వరం రావడంతో భర్త రామకృష్ణ ఆమెను భద్రాచలంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చాడు. అనంతరం పరీక్షించిన వైద్యులు ఆమెకు డెంగీ లక్షణాలున్నాయని నిర్ధారించి చికిత్స అందిస్తూ వచ్చారు. ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించి మంగళవారం సాయంత్రం మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతురాలికి 18 నెలల కుమారుడు ఉన్నాడు. -
అందరూ ‘పోయారు’.. నేనెందుకు బతకాలి?
ధర్మపురి(బుగ్గారం): ‘పుట్టుకతోనే కొడుకును కోల్పోయిన.. రోడ్డు ప్రమాదంలో కూతురు చనిపోయింది.. వారి మరణాన్ని తట్టుకోలేని నా భర్త మనస్తాపంలో మంచం పట్టిండు.. ఆ తర్వాత ఆయనా పోయిండు.. నాకు తోడుగా ఉండే నా తల్లి కూడా చనిపోయింది.. ఇక నేనెవరి కోసం బతకాలి’ అని తీవ్రంగా మదనపడిన మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన బుగ్గారం మండల కేంద్రంలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. బుగ్గారం మండల కేంద్రానికి చెందిన పన్నాటి సుమలత(38)కు జిల్లాలోని మల్యాల మండల కేంద్రానికి చెందిన గంగాధర్‌తో 2014లో వివాహమైంది. ఈ దంపతులకు కొడుకు పుట్టగానే చనిపోయాడు. ఆ తర్వాత కొంతకాలానికి కూతురు జన్మించింది. కొన్నేళ్లక్రితం ఆ బాలిక రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. ఇద్దరు పిల్ల లు మృతి చెందారనే మనస్తాపానికి గురైన గంగాధర్.. అనంతరం అనారోగ్యం బారిన పడ్డాడు. ఆ తర్వాత కొద్దిరోజులకే అతడూ మరణించాడు. దిక్కుమొక్కులేని సుమలత.. పుట్టింటికి చేరుకుంది. కొన్నిరోజులుగా తల్లిదండ్రుల వద్ద ఉంటోంది. అయితే, ఆమె తల్లి అనారోగ్యంతో ఇటీవల మృతి చెందింది. నా అనుకున్న వారంతా ఒక్కొక్కరుగా చనిపోతుండడంతో తట్టుకోలేని సుమలత .. తీవ్ర మనస్థాపనకు గురైంది. ఈ క్రమంలో ఇంట్లో ఎవరూలేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు జగిత్యాల ఏరియా ఆస్పత్రికి తరలించారు. తండ్రి లక్ష్మీరాజం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై అశోక్ తెలిపారు. -
పెళ్లయి నెలరోజులు.. నవవధువు దుర్మరణం
మైసూరు: వేగంగా వచ్చిన లారీ బైకును ఢీకొన్న ప్రమాదంలో నవ వివాహిత మహిళ మృతి చెందిన సంఘటన అరకలగూడు వద్ద చోటు చేసుకుంది. కుశాల నగర దగ్గర సిగె హోసూరుకు చెందిన గణేష్ కుమార్తె ఎస్.జీ.శోభ (25) మృతురాలు. శోభకు 36 రోజుల కిందట అరకలగూడు తాలూకాలోని ఇబ్బడి గ్రామానికి చెందిన నవీన్‌తో పెళ్ళి జరిగింది. ఇద్దరూ కలిసి సోమవారం అరకలగూడు నుంచి హొళె నరసిపురకు బైకులో వెళ్తున్నారు. ఇంతలో వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది. వారిద్దరూ కింద పడగా మీద నుంచి లారీ దూసుకెళ్లింది. తీవ్రగాయాలతో శోభ ఘటనాస్థలిలోనే కన్నుమూసింది. భర్తకు రెండు కాళ్ళు విరిగాయి, స్థానికులు అతన్ని ఆస్పత్రికి తరలించారు. హోళె నరిసిపుర గ్రామీణ పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేశారు. -
సంతానం కోసం పూజలు.. భర్తతో బైక్‌పై శివయ్య ఆలయానికి వెళ్తుండగా..
మంచిర్యాల: అదుపుతప్పిన బైక్ ప్రమాదవశాత్తు కుమురంభీం ప్రాజెక్టు ప్రధాన ఎడమ కాలువలో దూసుకెళ్లిన ఘటనలో భార్య మృతిచెందగా, భర్త ప్రాణాలతో బయటపడ్డాడు. మండలంలోని ఇందాని(మోకాసిగూడ) సమీపంలో ఈ ఘటన సోమవారం చోటు చేసుకుంది. ఎస్సై డి.సాగర్ కథనం ప్రకారం.. మండలంలోని లెండిగూడ గ్రామానికి చెందిన వడై ఇంద్రాజీ–సాక్రుబాయి(28) దంపతులు గత 9 ఏళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. మూడేళ్ల క్రితం బాబు పుట్టిన వెంటనే చనిపోయాడు. అప్పటి నుంచి మళ్లీ సంతానం కలగకపోవడంతో పిల్లల కోసం గత మూడు నెలల నుంచి బెండార శివారులో గల శంకరుని ఆలయంలో ప్రతీ శని, సోమవారాలు పూజలు నిర్వహించేవారు. ఎప్పటిలాగే సోమవారం ఉదయం 5.30 గంటలకు ఇంద్రాజీ, సాక్రుబాయి దంపతులు బెండార శంకరుని గుడికి వెళ్లేందుకు బైక్‌పై బయల్దేరారు. కుమురంభీం ప్రాజెక్టు ఎడమ ప్రధాన కాలువ మీదుగా ఉన్న బీటీ గుండా వెళ్తుండగా మోకాసిగూడ–సరాండి గ్రామాల మధ్యలో ఉన్న మూలమలుపు వద్ద బైక్ అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లింది. బైక్‌తోపాటు ఇద్దరు నీటిలో మునిగారు. ఇంద్రాజీకి ఈత రావడంతో వెంటనే తేరుకుని భార్యను ఒడ్డుకు తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేశాడు. కాలువకు సిమెంటు లైనింగ్ ఉండటంతో నీళ్లలో నుంచి బయటికి రాలేకపోయాడు. కొంత సమయానికి అటుగా వెళ్తున్న ఓ వ్యక్తి సహాయంతో భార్యను బయటికి తీసుకొచ్చాడు. కానీ అప్పటికే సాక్రుబాయి మృతి చెందింది. కాలువలో నీళ్లతో పాటు నాచు, పూడిక అధికంగా ఉండటంతో బాధితులు బయటపడటంలో ఆలస్యమై ఉంటుందని అక్కడున్న వారు అభిప్రాయాలు వ్యక్తం చేశారు. నీటిలో మునిగిన బైక్‌ను పోలీసులు స్థానికుల సహాయంతో బయటికి తీశారు. మృతురాలి తండ్రి ఆదె మోతీరాం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
వివాహిత ఆత్మహత్య.. అల్లుడి వివాహేతర సంబంధం వల్లే కూతురు చనిపోయిందంటూ..
లక్కవరపుకోట: మండలంలోని మార్లాపల్లి గ్రామానికి చెందిన వివాహిత రమ(26) ఆదివారం ఉదయం ఉరిపోసుకుని ఆత్మహత్యకు పాల్పుడింది. ఈ సంఘటనపై ఎస్సై ముకుందరావు, మృతురాలి కుటుంబసభ్యులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గంట్యాడ మండలం రాకోడు గ్రామానికి చెందిన రమకు ఎల్.కోట మండలం మార్లాపల్లి గ్రామానికి చెందిన లెక్కల చిన్నంనాయుడుతో ఆరేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరి దాంపత్య జీవితంలో 5 సంవత్సరాల పాప, 3 సంవత్సరాల వయస్సు గల బాబు ఉన్నారు. కాగా రమ భర్త చిన్నంనాయుడు విశాఖపట్నం ఉద్యోగ నిమిత్తం వెళ్లగా శనివారం రాత్రి ఇంటిలో ఆమె ఒక్కతే పడుకుంది. ఆదివారం తెల్లవారాక చూసేసరికి ఉరికి వేలాడి కనిపించింది. వెంటనే స్థానికులు ఎల్.కోట పోలీసులకు సమాచారం అందజేయగా ఘటనా స్థలానికి ఎస్సై ముకుందరావు సిబ్బందితో కలిసి వచ్చి పరిశీలించారు. వేధింపులే కారణం తన కూతురు చావుకు అల్లుడు, అత్త, మామల వేధింపులు, శారీరకంగా హింసించడం, అల్లుడు చిన్నంనాయుడికి వివాహేతర సంబంధంఉండడం కారణాలు. దీంతో మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పుడినట్లు మృతురాలి తల్లి రామకృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
చదువుకున్న భార్య ఎక్కడ తనను నిర్లక్ష్యం చేస్తుందోనని నిర్దాక్షణ్యంగా...
అనకాపల్లి: చదువుకున్న భార్య ఉద్యోగం చేస్తూ ఎక్కడ తనను నిర్లక్ష్యం చేస్తుందోనన్న అనుమానం. తనకు ఫోన్ వాడడం రాదు, ఆమె ఫోన్ వాడుతోంది...ఎప్పుడు ఎవరితో మాట్లాడుతుందో ఎక్కడ తన చేయి దాటిపోతోందోన్న ఆత్మనూన్యతా భావం...వెరసి అనుమానం పెనుభూతమై కట్టుకున్న భార్యను నిర్దాక్షణ్యంగా చంపేశాడు. నక్కపల్లి మండలం చీడిక గిరిజన గ్రామంలో శుక్రవారం రాత్రి జరిగిన ఈ ఘటనకు సంబంధించి స్థానికులు, మృతురాలి బంధువులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. చీడికకు చెందిన చీడిక నాగేంద్రకు వరుసకు మరదలు అయ్యే తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరానికి చెందిన రాజ్యలక్ష్మి(32)తో పదేళ్ల క్రితం వివాహమైంది. ఆ సమయంలో కట్న కానుకలు బాగానే ఇచ్చారు. వీరికి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. రాజ్యలక్ష్మి డిగ్రీ చదువుకుంది. నాగేంద్ర చదువుకోలేదు. ఏ పనిపాటా లేకుండా తిరుగుతున్నాడు. ఈ పరిస్థితుల్లో ఇంట్లో పూట గడవడం కష్టమై పాయకరావుపేటలో ఒక ప్రైవేటు వస్త్ర దుకాణంలో సేల్స్‌గర్ల్‌గా చేరింది. అవసరార్థం సెల్‌ఫోన్ కూడా కొనుక్కుంది. అయితే భార్య ఉద్యోగం చేయడం, ఫోన్ ఉపయోగించడం తరచూ ఫోన్‌కాల్స్ మాట్లాడడంతో నాగేంద్రలో అనుమానపు బీజాలు ఏర్పడ్డాయి. దీంతో ఇద్దరి మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయి. వేధింపులు భరించలేక భార్య కొద్దిరోజులపాటు పుట్టింటికి వెళ్లిపోయింది. పెద్దలు సర్ది చెప్పి ఇద్దరినీ కలిపారు. కొద్దిరోజులు బాగానే ఉన్నా, తర్వాత ఒత్తిడి చేసి ఆమెను ఉద్యోగం మాన్పించాడు. అయితే ఆమె తన కుటుంబ సభ్యులతో ఫోన్ మాట్లాడడాన్ని నాగేంద్ర అనుమానించేవాడు. శుక్రవారం రాత్రి రాజ్యలక్ష్మి ఫోన్ మాట్లాడుతుండంతో ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. ఎప్పటి నుంచో భార్యపై అనుమానం పెంచుకున్న నాగేంద్ర కత్తిపీట చెక్కను తీసుకుని ఆమె తలపై బలంగా కొట్టాడు. దీంతో బలమైన గాయమై రక్తపు మడుగులో పడిపోయిన తల్లిని చూసి ఇద్దరు పిల్లలు భయంతో కేకలు వేశారు. విషయం చుట్టుపక్కల వారికి తెలిసి వారు వచ్చే చూసేటప్పటికే ఆమె రక్తపు మడుగులో ప్రాణాలొదిలింది. నాగేంద్ర పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. స్థానికులు మృతురాలి తల్లిదండ్రులకు సమాచారం అందించడంతో వారు వచ్చి పోలీసుల కు ఫిర్యాదు చేశారు. సీఐ నారాయణరావు, ఎస్ఐ శిరీష సంఘటన స్థలానికి వెళ్లి క్లూస్ టీం సాయంతో వివరాలు సేకరించారు. ఇద్దరి మధ్య కొద్దినెలలుగా జరుగుతున్న ఘర్షణను ఇద్దరు పిల్లలు, స్థానికులు పోలీసులకు తెలిపారు. భార్యపై అనుమానంతోనే నాగేంద్ర ఈ హత్యకు పాల్పడ్డాడని ప్రాథమిక విచారణలో వెల్లడైనట్టు సీఐ తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నామన్నారు. కేసు నమోదు చేసి, మృతదేహాన్ని నక్కపల్లి ఏరియా ఆస్పత్రికి పోస్టుమార్టం కోసం తరలించామన్నారు. అమ్మ లేక అనాథల్లా మారిన పిల్లలు కళ్ల ముందే కన్న తల్లిని తండ్రి నిదాక్షిణ్యంగా హత్య చేయడంతో ఇద్దరు చిన్నారులు భయభ్రాంతులకు గురయ్యారు. భయంతో ఏం జరిగిందో, ఏం చెప్పాలో అని దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. తల్లి మృతదేహం ముందు కన్నీరు మున్నీరుగా రోధిస్తున్నారు. అమ్మనాన్నల మధ్య సఖ్యత లేకపోయినప్పటికీ అమ్మ వారిని కంటికి రెప్పలా కాపాడుకునేది. తండ్రి జులాయిగా తిరుతున్నా ఏ లోటు లేకుండా తల్లి చూసుకునేదని, ఇప్పుడు ఆమెను తండ్రి పొట్టన పెట్టుకోవడంతో పిల్లలు అనాథలయ్యారని చుట్టు పక్కల వారు బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు. -
మహిళ దారుణ హత్య
వరంగల్: బండరాయితో తలపై మోది మహిళను అతి దారుణంగా హత్య చేసిన ఉదంతం వరంగల్ జిల్లా సంగెం మండలంలోని వంజరపల్లిలో ఆదివారం ఉదయం కలకలం రేపింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పల్లారుగూడ రెవెన్యూ శివారు వంజరపల్లికి చెందిన కౌడగాని శంకర్రావు రోజు మాదిరిగా ఉదయం గేదెలను తోలుకుని వ్యవసాయబావి వద్దకు వెళ్తున్నాడు.రోడ్డు పక్కన వెళ్తుండగా దూడ ఒక్కసారిగా బెదిరింది. అటుగా చూడడంతో తప్పెట్ల ఎల్లయ్య వ్యవసాయ భూమి వద్ద మహిళ రక్తపు మడుగులో మృతదేహం కన్పించింది. వెంటనే సర్పంచ్ భర్త పెంతల అనీల్‌కు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. ఆయన వచ్చి చూసి వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో ఎస్సై భరత్ చేరుకుని ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి ఈస్ట్ జోన్ డీసీపీ కరుణాకర్, మామునూర్ ఏసీపీ కృపాకర్, పర్వతగిరి సీఐ శ్రీనివాస్, పోలీస్ సిబ్బంది చేరుకున్నారు. డాగ్ స్క్వాడ్, క్లూస్‌టీం రంగంలోకి దిగి ఆధారాలు సేకరించారు. మృతదేహం వద్ద లభ్యమైన పర్సులో రూ 5,280 నగుదు, ఐదు రూపాయల కాయిన్, రోడ్డుపై పగిలిన గాజులు, ఒక కాలి చెప్పు, కాలిపట్టాతో పాటుగా మృతురాలి వేలిముద్రలు, రోడ్డుపై పడిన రక్తంను సేకరించారు. మృతదేహం ఎడమపక్కన కనుబొమ్మ, ముక్కు, కణతపై కింది పెదవిపై బండరాయితో మోదినట్లు బలమైన గాయాలున్నాయి. శనివారం రాత్రి 9 గంటల తర్వాత ఎవరో మెడకు స్కార్‌్ఫతో ఉరివేసి ముఖం గుర్తుపట్టకుండా ఉండేందుకు బండరాయితో మోది చంపి రోడ్డు పక్కన పడవేసినట్లు తెలుస్తుందని పోలీసులు తెలిపారు. మృతురాలు నల్లబెల్లి శివారు జగ్గునాయక్ తండాకు చెందిన జర్పుల శౌరి(45)గా బంధువులు గుర్తుపట్టినట్లు తెలిపారు. శౌరి భర్త స్వామి 12 ఏళ్ల క్రితం మరణించాడు. ఇద్దరు కుమారులు సురేష్, వెంకటేష్ ఉన్నారు. పెద్ద కుమారుడు సురేష్‌కు భార్య అనూష, ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. వంజరపల్లి సర్పంచ్ భర్త అనీల్ ఫిర్యాదు మేరకు పర్వతగిరి సీఐ శ్రీనివాస్ కేసునమోదు చేసుకుని హత్యకు కుటుంబకలహాలా లేదా మరే ఇతర కారణాలున్నాయనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై భరత్ తెలిపారు. -
వరుసకు ఇద్దరూ అక్కాచెల్లెళ్లు.. పెళ్లి సంబంధాలు చూస్తుండటంతో...
సాక్షి, తిరుపతి: తమకు ఇష్టంలేని పెళ్లి చేస్తారేమోనని వరుసకు అక్కాచెల్లైళ్లెన ఇద్దరు యువతులు ఆదివారం కూల్‌డ్రింక్‌లో విషపుగుళికలు కలుపుకుని ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టారు. వీరిలో ఒకరు నాయుడుపేట ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందగా.. మరొకరి పరిస్థితి విషమంగా ఉండడంతో నెల్లూరు వైద్యశాలకు తరలించారు. ఈ ఘటన మండలంలోని తిమ్మాజికండ్రిగ గ్రామంలోని స్వర్ణముఖి నది కాజ్ వద్ద చోటు చేసుకుంది. నాయుడుపేట సీఐ నరసింహరావు తెలిపిన వివరాల మేరకు.. ఓజిలి మండల, కొత్తపేట గ్రామానికి చెందిన ముమ్మడి సుబ్బయ్య, కస్తూరమ్మకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తె సుప్రియకు వివాహంకాగా రెండో కుమార్తె రజిత నాయుడుపేట పట్టణంలో డిగ్రీ చివరి సంవత్సరం చదువుతూ... కొత్తపేటలో వలంటీర్‌గా పనిచేస్తోంది. ఇదిలావుండగా.. కొత్తపేట మాజీ సర్పంచ్ బట్టా సురేష్, వీరమ్మ దంపతులకు కుమారుడు పూర్ణచంద్ర, కుమార్తె నీరజ ఉన్నారు. నీరజ బీటెక్ చదివి ఇంట్లోనే ఉంటోంది. రజిత, నీరజ ఇద్దరూ చిన్నమ్మ, పెద్దమ్మ పిల్లలు. వరుసకు అక్కాచెల్లెళ్లు. ఈక్రమంలో కుటుంబ సభ్యులు పెళ్లి చేయాలని వీరికి సంబంధాలు చూస్తున్నారు. తమకు ఇష్టం లేని పెళ్లి చేస్తారేమోనని అక్కాచెల్లెళ్లు క్షణికావేశానికి లోనయ్యారు. ఆదివారం స్కూటీ డ్రైవింగ్ నేర్చుకుంటామని చెప్పి నాయుడుపేట వైపు వచ్చారు. వారి వెంట విషపు గుళికలు ఉన్న డబ్బాతోపాటు కూల్‌డ్రింక్ తెచ్చుకున్నారు. తిమ్మాజికండ్రిగ గ్రామ సమీపంలో స్వర్ణముఖి నది కాజ్ వే వద్ద ఇద్దరు కూల్‌డ్రింక్‌లో విషపు గుళికలు కలుపుకుని సేవించి కుటుంబ సభ్యులకు ఫోన్‌చేసి సమాచారం అందించారు. వారు వెంటనే 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. అప్పటికే స్వర్ణముఖి కాజ్ వే సమీపంలో అపస్మారకస్థితిలో పడి ఉన్న ఇద్దరు యువతులను నాయుడుపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్సలు అందించారు. చికిత్స పొందుతూ రజిత(21) మృతువాత పడింది. నీరజ పరిస్థితి విషమంగా ఉండడంతో నెల్లూరుకు తరలించారు. రజిత మృతి పట్ల ఓజిలి ఎస్ఐ ఆదిలక్ష్మి విచారం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి వివరాలు సేకరించారు. -
Hyderabad: రోడ్డు ప్రమాదంలో ఒకరు.. కరెంట్ షాక్‌తో మరొకరు!
సాక్షి, హైదరాబాద్: ఇంటి మరమ్మతులు చేస్తుండగా ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ తగిలి మహిళ మృతి చెందిన ఘటన నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులవివరాల ప్రకారం.. నేరేడ్మెట్ చంద్రబాబునగర్‌లో నివాసముండే ఏ.మణ్యం ఇంట్లో మరమ్మతులు చేస్తుండగా ప్రమాదవశాత్తు కోడలు వరలక్ష్మీ(21) కరెంట్ షాక్‌కు గురైంది. తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం నేరేడ్మెట్లోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. రోడ్డు ప్రమాదంలో విద్యార్థి దుర్మరణం రోడ్డు ప్రమాదంలో విద్యార్థి దుర్మరణం చెందిన ఘటన మల్కాజిగిరి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. ఓల్డ్ మీర్జాలగూడకు చెందిన సాయితేజ యాదవ్(23) ఓయూలో ఎంబీఏ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఈ నెల 1వ తేదీ రాత్రి స్నేహితుడి బైక్(కేటీఎం డ్యూక్) తీసుకొని బంధువుల ఇంట్లో జరుగుతున్న ఫంక్షన్‌కు వెళ్లాడు. తెల్లవారుజామున ఇంటికి తిరిగి వస్తుండగా సాయిరాం థియేటర్ దాటిన తర్వాత బైక్‌కు కుక్క అడ్డురావడంతో అదుపుతప్పి ఫుట్‌పాత్‌ను ఢీకొట్టాడు. తీవ్రగాయాలు కావడంతో స్థానిక ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. సాయితేజ తల్లి ప్రమీల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
బట్టలు ఆరబెడుతూ కరెంట్ షాక్ కు గురై మహిళ మృతి
తిరువళ్లూరు: తిరువళ్లూరు జిల్లా వరదాపురంలో శనివారం విద్యుత్ షాక్‌తో మహిళ మృతి చెందింది. పూండి యూనియన్ వరదాపురం గ్రామానికి చెందిన నాగరాజ్ భార్య కీర్తన(30) ఉతికిన బట్టలను మిద్దె పైన కేబుల్ వైర్‌పై ఆరవేయడానికి ప్రయత్నించింది. ఆ సమయంలో ఆమెకు విద్యుత్ షాక్ కొట్టడంతో స్పృహ తప్పి పడిపోయింది. గమనించిన కుమార్తె తండ్రికి సమాచారం ఇచ్చింది. నాగరాజ్ సంఘటన స్థలానికి వచ్చి 108 సిబ్బందికి సమాచారం అందించారు. వారు పరిశీలించి ఆమె అప్పటికే మృతి చెందినట్టు నిర్ధారించారు. తాలూకా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
Medak: చికెన్ ముక్క గొంతులో ఇరుక్కుని మహిళ మృతి
సాక్షి, మెదక్ : చికెన్ ముక్క గొంతులో ఇరుక్కుని ఓ మహిళ మృతి చెందింది. ఈ విషాద ఘటన మెదక్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాలు.. ఒడిశాకు చెందిన సంతోషి(30) అనే మహిళ కూలి పనుల కోసం వలస వచ్చింది. ముసాయిపేట్ మండలం కొప్పులపల్లి గ్రామ శివారులో ని ఇటుక బట్టీలలో పని చేసుకుంటూ జీవిస్తుంది. మంగళవారం తూప్రాన్ సంతకు వెళ్లిన మహిళ.. మద్యం సేవించి ఇంటికి వచ్చింది. అనంతరం ఇంట్లో చికెన్ వండుకుని తింటున్న సమయంలో చికెన్ ముక్క గొంతులో ఇరుక్కుపోయింది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే తూప్రాన్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మహిళ చనిపోయినట్లు వైద్యులు వెల్లడించారు. వెల్దుర్తి ఎస్ఐ మధుసూదన్ గౌడ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. చదవండి: ‘సాక్షి’ చేతిలో సాత్విక్ సూసైడ్ నోట్.. నివ్వెరపోయే విషయాలు -
అందంగా కన్పించాలని ముక్కుకు ప్లాస్టిక్ సర్జరీ.. ఆ తర్వాత గంటల్లోనే..
శాన్ ఫ్రాన్సిస్కో: అందంగా కన్పించాలని ముక్కుకు సర్జరీ చేయించుకున్న ఓ యువతి 24 గంటలు కూడా తిరగకుండానే ప్రాణాలు కోల్పోయింది. ముక్కు ఆకృతి మార్చుకునేందుకు ఆరున్నర గంటల పాటు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న ఈమె.. ఇంటికెళ్లిన కాసేపటికే సృహ కోల్పోయి కుప్పకూలింది. కుటుంబసభ్యులు వెంటనే ఆసత్రికి తరలించగా.. ఆమె పరిస్థితి చూసిన వైద్యులు షాక్ అయ్యారు. యువతి ఊపిరితిత్తులు మొత్తం రక్తంతో నిండిపోయాయి. శ్వాసకూడా తీసుకోలేని పరిస్థితి. ఆమెను కాపాడేందుకు డాక్టర్లు తీవ్రంగా శ్రమించినా ఫలితం లేకపోయింది. ఆరుసార్లు కార్డియోరెస్పిరేటరీ అరెస్టులతో(శ్వాసవ్యవస్థ దెబ్బతినడం) ఆమె కన్నుమూసింది. ముక్కుకు సర్జరీ చేయించుకుని చనిపోయిన ఈ యువతి పేరు కారెన్ జులియెత్ కార్డెనాస్ యురిబె. అమెరికా శాన్ ఫ్రాన్సిస్కోలో నివసిస్తోంది. వయసు 21 ఏళ్లు. సైకాలజీ కోర్సు చివరి సెమిస్టర్ చదువుతోంది. తాను మరింత అందంగా కన్పించేందుకు ముక్కు ఆకృతి మార్చుకోవాలనుకుంది. జనవరి 29న ప్లాస్టిక్ సర్జరీ చేయించుకునేందుకు క్లినిక్‌కు వెళ్లింది. ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు వైద్యులు ఆమెకు ఆపరేషన్ చేశారు. ఇంటికెళ్లిన కాసేపటికే.. సర్జరీ అనంతరం ఇంటికెళ్లిన జులియెత్ కాసేపటికే సృహతప్పి పడిపోయింది. దీంతో తీవ్ర ఆందోళన చెందిన కుటుంబసభ్యులు ఆమెను తిరిగి స్పృహలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు. కాసేపయ్యాక తేరుకున్న యువతి మళ్లీ కుప్పకూలింది. దీంతో సర్జరీ చేసిన వైద్యుడుకి ఫోన్ చేశారు కుటుంబసభ్యులు. ఆమెను మళ్లీ తన ఆస్పత్రికి తీసుకురావాలని అతను సూచించాడు. అయితే యువతి పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో తల్లిదండ్రులు ఆమెను ఇంటికి సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యులు యువతి పరిస్థితి చూసి షాక్ అయ్యారు. ఆమెను సృహలోకి తీసుకొచ్చేందుకు ఎన్నిసార్లు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఆమె లేచినా మళ్లీ వెంటనే స్పృహ కోల్పోతోంది. దీంతో ఆమెను స్కానింగ్ చేసిన వైద్యులు అవాక్కయ్యారు. ఆమె ఊపిరితిత్తుల నిండా రక్తం నిండిపోయింది. శ్వాస తీసుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతోంది. దీంతో ఆమెకు పైపుల ద్వారా శ్వాస అందించేందుకు వైద్యులు ప్రయత్నించారు. కానీ ప్రయత్నాలు ఫలించలేదు. ఆరు సార్లు కార్డియెక్ రెస్పిరేటరీ అరెస్టులతో యువతి ప్రాణాలు కోల్పోయింది. దీంతో సర్జరీ చేసిన వైద్యుడి పొరపాటు చేయడం వల్లే ఆమె ప్రాణాలు కోల్పోయిందని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. అతనిపై కేసు పెడతామని చెప్పారు. అక్కడ సర్జరీలు కామన్.. కాగా.. అమెరికాలో ముక్కుకు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవడం 2020 నుంచి బాగా పాపులర్ అయ్యింది. అందంగా కన్పించేందుకు ఏ మాత్రం ఆలోచించకుండా సర్జరీలు చేయించుకుంటున్నారు. మొత్తం 3,52,555 మంది ఈ ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. చదవండి: 18 ఏళ్ల యువతికి లాటరీలో రూ.290 కోట్లు.. ఆ డబ్బుతో ఏం చేసిందంటే..? -
ఆపరేషన్ చేసి కడుపులో బ్యాండేజ్ వదిలేసిన వైద్యులు.. మహిళ మృతి
లక్నో: వైద్యుల నిర్లక్ష్యానికి ఓ మహిళ బలైంది. ఆపరేషన్ చేసి బ్యాండేజ్‌ను కడుపులోనే వదిలివేయడంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది. దీంతో కుటుంబసభ్యులతో పాటు స్థానికులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే మహిళ ప్రాణాలు కోల్పోయిందని పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. ఉత్తర్‌ప్రదేశ్ అమ్రోహ జిల్లాలో ఈ ఘటన జరిగింది. మృతురాలి భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నట్లు పేర్కొన్నారు. అమ్రోహ జిల్లాలో ఇటివలే ఇలాంటి ఘటన జరిగింది. మహిళకు ఆపరేషన్ చేసిన వైద్యులు కడుపులో టవల్‌ను వదిలేశారు. ఆమెకు తీవ్రమైన నొప్పి రావడంతో పరీక్షలు చేయగా ఈ విషయం వెలుగుచూసింది. ఈ ఆపరేషన్ చేసిన వైద్యుడు అనుమతి లేకుండా ఆస్పత్రి నిర్వహిస్తున్నట్లు విచారణలో తేలింది. Amroha, UP | Locals protest after a woman died allegedly due to bandage left inside her stomach during operation On basis of a man's complaint alleging that his wife died after treatment at a hospital due to negligence of a doctor, case registered.Probe on:VK Rana, CO City(21.1) pic.twitter.com/BjKhG8zxyf — ANI UP/Uttarakhand (@ANINewsUP) January 22, 2023 చదవండి: షారుఖ్ ఖాన్ ఫోన్ చేసి బాధపడ్డారు: అసోం సీఎం -
ముక్కు నొప్పితో ఆసుపత్రికి.. వైద్యం వికటించి వివాహిత మృతి
సాక్షి, ఖమ్మం: ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత నెలకొంది. పెద్దాస్పత్రిలో ఓ మహిళ ముక్కుకు ఆపరేషన్ నిర్వహిస్తుండగా అపస్మారక స్థితిలోకి వెళ్లి మృత్యువాత పడింది. ఈ ఘటనకు వైద్యుడి నిర్లక్ష్యమే కారణమంటూ ఆమె బంధువులు ఆరోపిస్తూ ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. మంగళవారం సాయంత్రం ఈ ఘటన జరగగా, వైద్యుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని నినదించిన బంధువులు, అంతటితో ఆగకుండా మృతురాలిని ఉంచిన ఐసీయూ అద్దాలు, పూలకుండీలను ధ్వంసం చేశారు. ఈ ఘటనకు సంబంధించి మృతురాలి బంధువుల కథనం ప్రకారం... ఖమ్మం అర్బన్ మండలం పుట్టకోటకు చెందిన వెంకటలక్ష్మి, ముత్తయ్య భార్యాభర్తలు. వెంకటలక్ష్మి25)కి ముక్కులో గడ్డ ఏర్పడటంతో జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి రాగా పరీక్షించిన వైద్యులు ఆపరేషన్ చేయాలని సూచించారు. దీంతో ఈనెల 6వ తేదీన ఆస్పత్రిలో చేర్పించగా మంగళవారం ఆపరేషన్ చేయాలని నిర్ణయించారు. ఈక్రమంలో ఆమె ముక్కుకు ఆపరేషన్ చేస్తుండగా ఒక్కసారిగా అపస్మారక స్థితిలోకి వెళ్లి మృత్యువాత పడింది. అయితే, అంత వరకు బాగానే ఉన్న వెంకటలక్ష్మి మృతి చెందినట్లు తెలుసుకున్న మృతురాలి కుటుంబ సభ్యులు పెద్దసంఖ్యలో చేరుకుని ఆస్పత్రి సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. వీరి స్వగ్రామమైన పుట్టకోటతో పాటు మృతురాలి స్వగ్రామమైన తిరుమలాయపాలెం నుండి పెద్దసంఖ్యలో బంధువులు చేరుకోగా, న్యూడెమెక్రసీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు సంఘీభావం తెలిపారు. ఆస్పత్రి ఎదుట బైఠాయించి ఆందోళన మృతురాలి బంధువులు, వివిధ పార్టీల నాయకులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. వైద్యుడు సరిగా పట్టించుకోలేదని, మత్తుమందు ఎక్కువగా ఇవ్వడం వల్లే వెంకటలక్ష్మి మృతి చెందిందని ఆరోపించారు. ఆందోళన ఉధృతం కావటంతో వన్‌టౌన్, టూటౌన్, త్రీటౌన్, ఖానాపురం హవేలి పోలీస్ స్టేషన్ల సిబ్బంది భారీగా మొహరించారు. అంతే కాకుండా ఖమ్మం ఏసీపీ ఆంజనేయులు చేరుకుని మృతురాలి బంధువులకు నచ్చచెప్పేందుకు యత్నించినా ససేమిరా అన్నారు. చివరకు ఆస్పత్రి సూపరింటెండెంట్ బి.వెంకటేశ్వర్లు, ఆర్ఎంఓ బి.శ్రీనివాసరావు, ఏసీపీ ఆంజనేయులు, బీఆర్ఎస్ నాయకులు బీరెడ్డి నాగచంద్రారెడ్డి తదితరులు వెంకటలక్ష్మి బంధువులతో చర్చించి కుటుంబంలో ఒకరికి ఔట్ సోర్సింగ్ ఉద్యోగం ఇవ్వడమే కాక ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పడంతో రాత్రి ఆందోళన విరమించారు. -
Hyderabad: ఐటీ కారిడార్‌లో దారుణం.. మీద నీళ్లు చల్లినందుకు
సాక్షి, హైదరాబాద్: మీద నీళ్లు చల్లినందుకు సారీ చెప్పాలని కోరిన ఇద్దరు యువకులను బెంజ్‌కారుతో ఢీకొట్టాడు మరో యువకుడు. తమ వారిపై అలా ఎలా ప్రవర్తిస్తావని అడిగేందుకు బైకుపై వెళ్లిన దంపతులను కూడా బెంజ్ కారుతో ఢీ కొట్టాడు. సారీ చెప్పేందుకు ఇష్టపడని యువకుని ఇగో ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. ఈ ఘటనలో ఎగిరి కిందపడ్డ ఓ యువతి తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ సంఘటన రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎర్రగడ్డకు చెందిన దంపతులు సయ్యద్ సయీఫుద్దీన్ జావీద్, మరియా మీర్(25) ఒక బైక్‌పై, జావీద్ సోదరులు సయ్యద్ మినాజుద్దీన్, రషద్ మిష్బా ఉద్దీన్‌లు ఒక బైక్‌పై ఈ నెల 17 రాత్రి కేబుల్ బ్రిడ్జి చూసేందుకు మాదాపూర్ వచ్చారు. కేబుల్ చూసిన తరువాత 18న అర్థరాత్రి 1 గంట సమయంలో ఫుడ్ కోసం గచ్చిబౌలి వైపు వచ్చారు. తిరిగి వెళుతుండగా పక్కనుంచి వెళ్లిన బెంజ్ కారు నుంచి నీళ్లు మీదపడ్డాయి. దీంతో బైక్‌పై ఉన్న మినాజుద్దీన్, రషీద్‌లు కారును వెంబడించి నీళ్లు పోసి..సారీ చెప్పకుండా వెళుతున్నావని అడిగారు. దీంతో కారు డ్రైవింగ్ సీట్లో కూర్చున్న వ్యక్తి వీరిని దుర్భాషలాడుతూ బెంజ్ కారు ఢీ కొట్టడంతో ఇద్దరు కిందపడి పోయారు. దీనిని గమనించిన సయీఫుద్దీన్ బైక్‌పై కారును వెంబడించగా...వీరి బైకును కూ డా గచ్చిబౌలోని అట్రియం మాల్ వద్ద ఢీ కొట్టాడు. దీంతో బైక్‌పై ఉన్న మరియా మీర్ ఎగిరి కింద పడటంతో తలకు గాయాలయ్యాయి. గచ్చిబౌలి కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మృతి చెందింది. మృతురాలికి 8 నెలల కూతురు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. బెంజ్ కారు నడిపిన యువకుడు రెండు సార్లు కారుతో ఢీ కొట్టాడని చెప్పడంతో పోలీసులు విచారణ చేపట్టారు. సీసీ పుటేజీలను పరిశీలించగా ఒకసారి బైక్‌ను ఢీ కొట్టడంతో ఇద్దరు యువకులు కింద పడ్డారని, మరో బైక్‌ను ఢీ కొట్టడంతో మరియా మీర్, సయీఫుద్దీన్లు ఎగిరి పడ్డట్లు గుర్తించారు. కారులో ప్రయాణించిన వ్యక్తి జూబ్లీహిల్స్‌కు చెందిన ఓ వ్యాపారవేత్త కొడుకు రాజసింహారెడ్డిగా గుర్తించి పోలీసులు అరెస్ట్ చేశారు. కారును సీజ్‌చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
వేగంగా వస్తున్న రైలు.. అక్కను కాపాడి.. చెల్లెలు దుర్మరణం
ఖమ్మం క్రైం: శరవేగంగా వస్తున్న రైలును గమనించని అక్కను కాపాడే క్రమంలో చెల్లెలు మరో రైలు ఢీకొని దుర్మరణం పాలైంది. ఖమ్మం జిల్లా కేంద్రంలో జరిగిన ఈ సంఘటనపై జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ అందించిన వివరాలివి. ఖమ్మం శ్రీనివాస్‌నగర్‌కు చెందిన పోతునూక యశోద (37) తన అక్క వరలక్ష్మి, మరో మహిళతో కలిసి కమాన్‌బజార్‌లో మంగళవారం షాపింగ్‌కు వెళ్లారు. తిరిగి వచ్చేటప్పుడు వరలక్ష్మి ఓవర్ బ్రిడ్జి కింద వెంకటగిరి రైలు గేటుదాటుతోంది. అదే సమయంలో ఎగువ లైన్లో రైలు అతివేగంగా వస్తున్న విషయాన్ని గమనించిన ఆమె చెల్లెలు యశోద.. అక్క వరలక్ష్మిని వెనక్కి లాగింది. కానీ మరోవైపు డౌన్‌లైన్‌లో వస్తున్న రైలును గమనించకపోవటంతో యశోదను ఢీకొనగా.. తలకు తీవ్రగాయమై అక్కడికక్కడే మృతి చెందింది. తన ను కాపాడబోయి చెల్లెలు కళ్ల ముందే మృతి చెందటంతో అక్క వరలక్ష్మి గుండెలు పగిలేలా రోదించడం కలిచివేసింది. యశోదకు భర్త రమేశ్, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆమె మృతదేహాన్ని అన్నం ఫౌండేషన్ చైర్మన్ శ్రీనివాసరావు మార్చురీకి తరలించగా కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ భాస్కర్‌రావు తెలిపారు. చదవండి: కిచెన్ రూమ్ తాళం చెవి ఇవ్వలేదని.. భార్యపై కత్తెరతో దాడి -
మరో విషాదం: రైలు కింద తోసేసి యువతి హత్య.. కూతురు మరణ వార్త తెలియడంతో
సాక్షి, చెన్నై: తమిళనాడులో సంచలనం సృష్టించిన ప్రేమోన్మాది ఘాతుకానికి బలైన యువతి ఘటనలో మరో విషాదం చోటుచేసుకుంది. రైలు కింద పడి కూతురు మృతిచెందిందన్న వార్త తెలియడంతో ఆమె తండ్రి గుండెపోటుతో ఆసుపత్రిలో చేరారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం ప్రాణాలు విడిచారు. చెన్నైలోని ఓ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న మృతురాలి తల్లి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. కాగా ప్రేమను నిరాకరించిందన్న కారణంతో యువతిని రైలు కిందకు తోసేసి ఓ వ్యక్తి హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ షాకింగ్ ఘటన తమిళనాడులోని చెన్నైలో గురువారం చోటుచేసుకుంది. ఆదంబాక్కంకు చెందిన మాణిక్యం కూతురు సత్య(20) టీనగర్‌లోని ప్రైవేట్ కళాశాలలో బీకాం రెండో సంవత్సరం చదువుతోంది. అదే ప్రాంతానికి చెందిన సతీష్ అనే యువకుడు ప్రేమ పేరుతో కొంతకాలంగా ఆమెను వేధిస్తున్నాడు. గురువారం ఉదయం కళాశాలకు వెళ్లేందుకు యువతి సెయింట్ థామస్‌మౌంట్ రైల్వే స్టేషన్‌కు చేరుకుంది. అక్కడకు వచ్చిన యువకుడు ఆమెతో వాగ్వాదానికి దిగాడు. సంబంధిత వార్త: ప్రేమోన్మాది ఘాతుకం.. కానిస్టేబుల్ కూతురు దారుణ హత్య తనను ప్రేమించమని, పెళ్లి చేసుకోమని చాలా సేపు గొడవ పడ్డాడు. అందుకు యువతి ఒప్పుకోలేదు. అదే సమయంలో ప్లాట్‌ఫామ్ వైపు రైలు దూసుకొస్తుండగా యువకుడు ఉన్మాదిలా మారాడు. యువతిని ఒక్కసారిగా రైలు కిందకు తోసేసి అక్కడి నుంచి పరారయ్యాడు. దీంతో రైలు చక్రాల కింద పడి నలిగిన సత్య అక్కడిక్కడే మృత్యువాతపడింది. కూతురు మరణ వార్త విన్న సత్య తండ్రి మాణిక్యం గుండెపోటుతో శుక్రవారం తెల్లవారుజామున కన్నుమూశారు. ఆమె తల్లి ఆసుపత్రి పాలైంది. యువతి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాజీవ్ గాంధీ హాస్పిటక్‌కు తరలించారు. దీనిపై కేసు నమోదు చేసిన రైల్వే పోలీసులు రెండు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి నిందితుడు సతీష్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఇదిలా ఉండగా సత్యకు గత నెలలోనే మరో వ్యక్తితో నిశ్చితార్థం జరిగింది. కాగా కొంత కాలంగా రైల్వే స్టేషన్లో ప్రేమ పేరిట యువతులపై వేధింపుల ఘటనలు పెరిగిపోవడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. చదవండి: లవర్‌తో భర్త షికార్లు.. షాపింగ్ మాల్లో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య.. తర్వాత.. -
క్రిమినల్ కోసం వెళ్లిన పోలీసులపై మర్డర్ కేసు!
దెహ్రాదూన్: నేరాలకు పాల్పడుతున్న వారిని పట్టుకుని కేసులు నమోదు చేస్తారు పోలీసులు. అయితే, నేరస్థులను పట్టుకునేందుకు వెళ్లిన పోలీసులపైనే మర్డర్ కేసు నమోదైన అరుదైన సంఘటన ఉత్తరాఖండ్‌లో జరిగింది. మైనింగ్ మాఫియాను పట్టుకునే క్రమంలో జరిగిన ఎదురు కాల్పుల్లో స్థానిక బీజేపీ నేత భార్య మృతి చెందింది. దీంతో ఆగ్రహించిన గ్రామస్థులు పోలీసులపై దాడి చేశారు. వారిపై హత్య కేసు సైతం నమోదు చేశారు. ఇంతకి ఏం జరిగిందంటే? ఉత్తర్‌ప్రదేశ్‌లోని మొరదాబాద్‌కు చెందిన ఐదుగురు పోలీసులు మైనింగ్ మాఫియాను పట్టుకునేందుకు ఉత్తరాఖండ్‌లోని జాస్పూర్కు వెళ్లారు. రూ.50,000 రివార్డ్ ఉన్న వాంటెడ్ క్రిమినల్ జాఫర్.. జాస్పూర్‌లోని భుల్లార్ అనే వ్యక్తి ఇంటిలో ఉన్నట్లు తెలిసి.. అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో పోలీసులు, మైనింగ్ ముఠా మధ్య ఎన్కౌంటర్ మొదలైంది. ఈ ఎదురుకాల్పుల్లో స్థానిక బీజేపీ నేత గుర్తాజ్ భుల్లార్ భార్య గుర్ప్రీత్ కౌర్ ప్రాణాలు కోల్పోయింది. ఇద్దరు పోలీసులకు సైతం తూటాలు తగిలాయి. బీజేపీ నేత భార్య మృతితో గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులపై దాడి చేశారు. ఈ దాడిలో ముగ్గురు పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. ఉత్తరాఖండ్ వెళ్లిన ఐదుగురు ఉత్తర్‌ప్రదేశ్ పోలీసులపై హత్య కేసు సైతం నమోదైంది. ‘రూ.50వేల రివార్డ్ ప్రకటించిన వాంటెడ్ క్రిమినల్ కోసం వెతుకుతున్నాం. భరత్‌పుర్ గ్రామం నుంచి తప్పించుకుని పోయాడు. మా పోలీసు బృందం అక్కడికి వెళ్లిన క్రమంలో వారిపై దాడి చేసి ఆయుధాలు లాక్కున్నారు. ప్రస్తుతం ఐదుగురు పోలీసులు చికిత్స పొందుతున్నారు. నిందితులు పరారీలో ఉన్నారు. వారి కోసం వేట కొనసాగుతుంది.’ అని మొరదాబాద్ సీనియ్ పోలీసు అధికారి షలాబ్ మథూర్ తెలిపారు. ఇదీ చదవండి: హిజాబ్ తీర్పు: సుప్రీం కోర్టులో ఊహించని పరిణామం -
హిజాబ్ నిరసనలకు కారణమైన ‘యువతి’ మరణంలో ట్విస్ట్!
టెహరాన్: మాహ్సా అమీని(22) అనే యువతి మృతితో ఇరాన్లో హిజాబ్ వ్యతిరేక ఆందోళనలు కొనసాగుతున్నాయి. హిజాబ్ సరిగా ధరించలేదన్న ఆరోపణలతో నైతిక విభాగం పోలీసులు అరెస్టు చేయగా.. వారి కస్టడీలో తీవ్రంగా గాయపడి మరణించినట్లు ఆరోపణలు వచ్చాయి. అయితే, అమీని మృతిపై విచారణ చేపట్టిన అధికారి నివేదిక మాత్రం దీనికి భిన్నంగా ఉంది. ఆమె అనారోగ్య కారణాలతోనే మరణించినట్లు నివేదికలో పేర్కొన్నారు. తల, శరీర భాగాలకు దెబ్బలు తగలడం వల్ల ఆమె చనిపోలేదని.. సెరిబ్రల్ హైపాక్సియా కారణంగా అవయవాల వైఫల్యంతో మరణించినట్లు అందులో తేలిందని ఇరాన్ అధికారిక వార్తా సంస్థ ఐఆర్ఎన్ఏ శుక్రవారం పేర్కొంది. కుటుంబంతో కలిసి టెహ్రాన్ ట్రిప్‌కు వెళ్లిన యువతిని హిజాబ్ ధరించలేదని పోలీసులు అరెస్ట్ చేసి కస్టడీకి తరలించారు. అయితే.. ఆ తర్వాత స్ప్రహ కోల్పోయిందంటూ ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. ఈ క్రమంలో అమినీకి గాయాలయ్యాయని, ఆమె మృతికి పోలీసులే కారణమని కుటుంబ సభ్యులు ఆరోపించారు. అయితే, తల, కాళ్లు, చేతులకు దెబ్బలు తగలడం వల్ల అమినీ మరణించలేదని నివేదిక పేర్కొనటం గమనార్హం. కానీ, ఆమెకు ఏమైనా గాయాలయ్యాయా? అనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. అంతర్లీన వ్యాధుల కారణంగా కస్టడీలో ఉన్న సమయంలో ఆమె కుప్పకూలిందని తెలిపింది. శరీరంలో ఆక్సిజన్ సరఫరా వ్యవస్థ దెబ్బతినడంతో ఆమె హైపాక్సియాకు గురైందని, ఫలితంగా మెదడు దెబ్బతిన్నట్లు తెలిపింది. ఇదీ చదవండి: హిజాబ్ ధరించలేదని పోలీసుల టార్చర్?.. కోమాలోంచే కన్నుమూసిన యువతి -
ఊహించని ప్రమాదం: వరద నీటిలో స్కూటీ స్కిడ్.. కరెంట్ స్తంభం పట్టుకోవడంతో
బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరు మహానగరాన్ని వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. గత కొన్నిరోజులుగా కురుస్తున్న కుంభవృష్టి వానలతో ఐటీ కారిడార్ సహా అనేక ప్రాంతాలు నీట మునిగాయి. వరద నీటితో రహదారులు జలమయమయ్యాయి. రోడ్లపైకి భారీగా నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ట్రాఫిక్ జామ్‌తో వాహనాల రాకపోకలు స్తంభించాయి. భారీ వర్షాల కారణంగా నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్నిచొట్ల ఊహించని ప్రమాదాలు సైతం జరుగుతున్నాయి. More video from Marathahalli, Bengaluru.#Bangalore #Bengaluru #BengaluruRains #SiliconValleyofIndia #bengalururains #bengalurufloods #Karnataka pic.twitter.com/q5owjkUnhG — Anil Kumar Verma (@AnilKumarVerma_) September 6, 2022 తాజాగా రోడ్డుపై వెళుతోన్న ఓ యువతి ప్రమాదవశాత్తూ కరెంట్ షాక్ తగిలి అక్కడిక్కడే మృతువ్యవాత పడింది. ఈ విషాద ఘటన బెంగళూరు నగరంలోని వైట్‌ఫీల్డ్ సమీపంలో సోమవారం రాత్రి 9.30 నిమిషాలకు చోటుచేసుకుంది. 23 ఏళ్ల అఖిల అనే యువతి పాఠశాలలో ఆడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్లో పనిచేస్తుంది. విధులు నిర్వహించుకొని రాత్రి స్కూల్ నుంచి తన స్కూటీపై ఇంటికి బయల్దేరింది. ఈ క్రమంలో వరద నీటితో నిండిన రోడ్డుపై వెళ్తుండగా ఒక్కసారిగా స్కూటీ స్కిడ్ అయ్యింది. చదవండి: ఎంత పనైపాయే.. స్కెచ్ ఒకరికి.. మర్డర్ మరొకరిని.. దీంతో యువతి కిందపడకుండా ఉండేందుకు పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్ని పట్టుకునేందుకు ప్రయత్నించింది. అయితే అదే స్తంభానికి కరెంట్ పాస్ అవుతుండటంతో షాక్ తగిలి కిందపడిపోయింది. దీనిని గమనించిన స్థానికులు యువతిని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. కాగా బెంగళూరులో విద్యుత్ అధికారులు, మున్సిపల్ అధికారులు తమ విధులను సక్రమంగా నిర్వహించడం లేదని.. తన కూతురు చావుకు అధికారుల నిర్లక్ష్యమే కారణమని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. Situation at Marathahalli, Bengaluru.#Bangalore #Bengaluru #BengaluruRains #SiliconValleyofIndia #bengalururains #bengalurufloods #Karnataka pic.twitter.com/6rftd868Ro — Anil Kumar Verma (@AnilKumarVerma_) September 6, 2022 -
కు.ని. విషాద ఘటన.. అయ్యో దేవుడా! ఈ పిల్లల బతుకులెట్లా?
మౌలిక సదుపాయాల లేమి, ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం వెరసి అనేక మంది తల్లీపిల్లలకు తీరని కడుపుకోతను మిగుల్చుతోంది. పైసా ఖర్చు లేకుండా ప్రభుత్వ ఆస్పత్రిలో మెరుగైన వైద్యసేవలు పొందవచ్చని భావించి ఎంతో ఆశతో ఆస్పత్రులకు చేరుకుంటున్న గర్భిణులు, బాలింతలను మృత్యుపాశాలు వెంటాడుతున్నాయి. ఇబ్రహీంపట్నం సీహెచ్‌సీలో కు.ని చికిత్సలు వికటించి రెండు రోజుల్లో నలుగురు తల్లులు మృత్యువాతపడటం యావత్ రాష్ట్రాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. రోగుల నిష్పత్తికి సరిపడా మౌలిక సదుపాయాలు, వైద్య సిబ్బందిని ఏర్పాటు చేయాల్సిన వైద్య ఆరోగ్యశాఖ అధికారులు పట్టానట్టుగా వ్యవహరించడమే ఇందుకు కారణమని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సాక్షి, ఇబ్రహీంపట్నం: కుటుంబ నియంత్రణ ఆపరేషన్ వికటించడంతో మృత్యువుతో పోరాడి ప్రాణాలొదిలిన అవుతపురం లావణ్య (22) అంత్యక్రియలు సీతారాంపేటలో ప్రశాంతంగా ముగిశాయి. లావణ్యకు ఇద్దరు కుమార్తెలు అక్షర (6), భావన (4) కుమారుడు యశ్వంత్ (ఏడు నెలలు) ఉన్నారు. చివరి చూపుల సందర్భంగా అత్తమామలు,, బంధువుల రోదనలతో అక్కడ విషాదఛాయలు అలుముకున్నాయి. ఏమి జరిగిందో తెలియని పసిమొగ్గలను చూసి వారు కన్నీటి పర్యంతమయ్యారు. బరువెక్కిన హృదయంతో ఓదార్చారు. అసలు ఏం జరిగిందో తెలియక పసిమొగ్గలు దీనంగా చూస్తుండటాన్ని అందరినీ కదిలించింది. తమ తల్లి తిరిగిరాని లోకాలకు వెళ్లి పోయిందని, ఇక తాము చూడ లేమని తెలియని ఆ చిన్నారులను చూసి చలించి పోయారు. భర్త లింగస్వామి ఓ రైతు వద్ద జీతం చేస్తూ అతని వ్యవసాయ పనులు చేస్తుంటాడు. సొంత ఇల్లు కూడలేని దీనస్థితి ఆ కుటుంబానిది. ప్రభుత్వం ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు. తలకొరివి పెట్టిన మామ కట్టుకున్న భర్త, కన్న కుమారుడు ఉన్నప్పటికీ అర్ధంతరంగా తనువు చాలించడంతో లావణ్య మామ యాదయ్య అంత్యక్రియల ప్రక్రియ నిర్వహించారు. ఏడు నెలల బాబు చేతిని ముట్టించి దహన సంస్కారాల కార్యక్రమంలో మామ యాదయ్య ముందు నడిచాడు. ఏ జన్మలో రుణపడి ఉన్నానో నంటూ కో డలి మృతదేహం చుట్టూ తిరిగి దహన సంస్కా రాలు చేయడం అక్కడున్న వారిని కదిలించింది. సుష్మ కూతురు శాన్వి, కుమారుడు శ్రేయన్ను ఓదార్చుతున్న జెడ్పీటీసీ సభ్యురాలు నిత్యారెడ్డి లింగంపల్లిలో సుష్మ అంత్యక్రియలు మంచాల: కుటుంబ నియంత్రణ ఆపరేషన్ వికటించి మృతి చెందిన మైలారం సుష్మ స్వగ్రామం లింగంపల్లిలో మంగళవారం విషాదఛాయలు అలుముకున్నాయి. ఆమె అంత్యక్రియలకు వివిధ గ్రామాల నుంచి ప్రజా ప్రతినిధులు, ప్రజలు భారీగా తరలివచ్చారు. బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చారు. సుష్మ కూతురు శాన్వి, కుమారుడు శ్రేయన్ అమ్మ కావాలని ఏడవడం అక్కడున్న వారిని కంటతడి పెట్టిస్తోంది. మంచాల జెడ్పీటీసీ మర్రి నిత్యారెడ్డి.. సుష్మ మృతదేహానికి నివాళులర్పించారు. అనంతరం సుష్మ భర్త ఈశ్వర్, వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. కొంత ఆర్ధిక సాయం చేశారు. ఇది పూర్తిగా ప్రభుత్వం వైఫల్యమే కారణమని జెడ్పీటీసీ ఆరోపించారు. ప్రభుత్వమే పూర్తి బాధ్యత తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆమె వెంట సర్పంచ్ వినోద మూర్తి, ఎంపీటీసీ జయనందం తదితరులు పాల్గొన్నారు. మౌనిక పిల్లలు పిల్లల ఆమయాక చూపులు అదే విధంగా మాడ్గుల మండలం కొలుకుల పల్లి పంజాయతీ పరిధిలోని రాజీవ్ తండాకు చెందిన మౌనికకు నాలుగేళ్ల కిందట శ్రీనివాస్ నాయక్‌తో పెళ్లి జరిగింది. వీరికి మాను శ్రీ(3), గౌతమ్(15 నెలలు) ఇద్దరు పిల్లలు. శ్రీనివాస్ నాయక్ వ్యవసాయం, కూలీ పనులు చేస్తుంటాడు. మౌనిక భర్తతో కలిసి పనులకు వెళ్తూ కుటుంబానికి ఆసరాగా ఉండేది. అయితే మౌనిక తల్లి తిరిగిరాదని లోకాలకు వెళ్లిందని తెలియక పిల్లలు అమాయక చూపులు చూస్తున్నారు. భర్త శ్రీనివాస్ నాయక్ సైతం కన్నీటి పర్యంతమవుతున్నాడు. మమత, ఇద్దరు పిల్లలు భర్తకు చేదోడువాదోడు ఇక ఇదే మండలం నర్సాయపల్లికి చెందిన మమత, మల్లేష్ గౌడ్లకు అయిదేళ్ల కిందట వివాహమైంది. వీరికి ఇద్దరు కుమార్. వర్షిత్(4), విహాన్(2). పేద కుటుంబానికి చెందిన మల్లేష్ గౌడ్ వ్యవసాయం చేసుకుంటూ డీసీఎం వ్యాన్ నడుపుకుంటున్నాడు. వ్యవసాయంలో భర్తకు చేదుడో వాదోడుగా ఉండే మమత ఇలా తిరిగి రాని లోకాలకు వెళ్లడంతో పిల్లలు, భర్త భోరున విలపిస్తున్నారు. -
ఓ వైపు భర్త చావు బతుకుల మధ్య.. మరోవైపు రోడ్డు ప్రమాదంలో భార్య మృతి
ఆరిలోవ (విశాఖ తూర్పు): చావు బతుకుల మధ్య ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న భర్తకు సపర్యలు చేసి ఇంటికి వెళ్తున్న మహిళను బస్సు ఢీకొట్టడంతో దుర్మరణం చెందారు. హనుమంతవాక కూడలిలో జరిగిన దుర్ఘటనకు సంబంధించి ఆరిలోవ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఎంవీపీ కాలనీకి చెందిన బోర పుష్పలత (59) భర్త అనారోగ్యంతో బాధపడుతూ ఆరిలోవ ప్రాంతం హెల్త్ సిటీలోని ఓ ఆస్పత్రిలో కోమాలో చికిత్స పొందుతున్నారు. ఆస్పత్రిలో భర్తకు సోమవారం సేవలు చేసిన పుష్పలత మంగళవారం ఉదయం ఎంవీపీ కాలనీలోని ఇంటికి బయలుదేరారు. పుష్పలతను ఆమె అన్నయ్య బైక్‌పై హనుమంతవాక దరి ఎల్వీపీ కంటి ఆస్పత్రి వద్దకు తీసుకొచ్చి దించారు. అనంతరం ఆయన మళ్లీ ఆస్పత్రికి వెళ్లిపోగా... అక్కడి నుంచి పుష్పలత హనుమంతవాక వరకు ఫుట్‌పాత్‌పై నడుచుకొంటూ వచ్చారు. కూడలి దాటడానికి రోడ్డు మీదకు దిగుతుండగా నగరం నుంచి విజయనగరం వెళ్తున్న మహారాజా విజయరామ గజపతి రాజ్ కళశాలకు చెందిన బస్సు ఢీకొట్టింది. దీంతో పుష్పలత కిందపడి బస్సు వెనుక చక్రాలకు, ఫుట్‌పాత్‌కు మధ్యలో ఇరుక్కుపోయి ప్రమాద స్థలంలోనే ప్రాణాలు విడిచారు. బస్సు చక్రాలకు, ఫుట్‌పాత్‌కు మధ్యలో ఇరుక్కుపోయిన ఆమెను బయటకు తీయడానికి స్థానికులు, అక్కడే విధులు నిర్వహిస్తున్న ఆరిలోవ ట్రాపిక్ పోలీసులు ఎంతో శ్రమించాల్సి వచ్చింది. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మృతురాలు చిన్న కుమారుడు అనిల్‌రెడ్డి ఫిర్యాదుతో ఆరిలోవ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆమెకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. చిన్న కుమారుడు, కుమార్తెకు ఇంకా వివాహం జరగాల్సి ఉంది. మరో వైపు ఆమె భర్త ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇటువంటి సమయంలో బస్సు చక్రాల కింద పుష్పలత నలిగిపోయి చనిపోవడంతో బంధువులు కన్నీటపర్యంతమవుతున్నారు. -
రెండేళ్ల క్రితమే మృతి.. ఇప్పటికీ ప్రతినెలా ఇంటి రెంట్ చెల్లిస్తున్న మహిళ!
లండన్: రెండేళ్ల క్రితమే మృతి చెందిన ఓ మహిళ నుంచి ఇప్పటికీ ఇంటి రెంటు తీసుకుంటున్నారు ఆ ఇంటి యజమాని. ఈ సంఘటన బ్రిటన్ రాజధాని లండన్‌లో వెలుగు చూసింది. ఇంతకీ ఏం జరిగింది. మృతి చెందిన మహిళ నుంచి ఇంటి రెంటు ఎలా తీసుకోగలుగుతున్నారు? అనే అంశాన్ని తెలుసుకున్న పోలీసులు అవాక్కయ్యారు. లండన్, పెఖమ్ నగరంలోని ఓ అపార్ట్ మెంట్లో 61 ఏళ్ల శీలా సెలియోవన్ అనే మహిళ అస్తికలను గుర్తించారు పోలీసులు. మూడో అంతస్తులో ఉంటున్న ఆమె ఇంటి తలుపులు బద్ధలు కొట్టి లోపలికి వెళ్లిన పోలీసులకు ఆమె ఎముకలు మాత్రమే కనిపించాయి. డెంటల్ రికార్డ్స్ ప్రకారం బాధితురాలిని గుర్తించారు పోలీసులు. ఆమె మరణానికి ఎలాంటి అనుమానాస్పద కారణాలు కనిపించలేదన్నారు. 2019, ఆగస్టులో ఆమె మృతి చెంది ఉండవచ్చని భావిస్తున్నారు. రెండేళ్లుగా కనిపించకపోయినా.. అవివాహిత అయిన 61 శీలా కుటుంబం దక్షిణాఫ్రికాలో ఉంటోంది. ఆమె మృతి చెందినట్లు 2022, ఫిబ్రవరిలో గుర్తించినట్లు డైలీ మెయిల్ నివేదించింది. 2019, అక్టోబర్‌లో ఆమె ఫ్లాట్ నుంచి కుల్లిపోయిన వాసన విపరీతంగా వచ్చినట్లు ఇరుగు పొరుగువారు తెలిపారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. రెండు సార్లు ఆమె ఫ్లాట్ వద్దకు వచ్చినా తెరిచేందుకు సరైన కారణం లేదని తిరిగి వెళ్లిపోయారు పోలీసులు. ఆమెను చివరి సారిగా 2019, ఏప్రిల్‌లో చూసినట్లు స్థానికులు తెలిపారు. అదే ఏడాది ఆగస్టులో చివరిసారిగా ఇంటి రెంటు చెల్లించారు శీలా. ఆ తర్వాత చెల్లించకపోవటం వల్ల ఆమె యూనివర్సల్ క్రెడిట్ పేమెంట్స్ నుంచి ఆటోమెటిక్‌గా రెంట్ పే చేసేందుకు హౌసింగ్ గ్రూప్ అంగీకరించింది. ఆ తర్వాత 2020, మార్చి నుంచి ప్రతి నెలా యజమానికి ఆటోమేటిక్‌గా రెంటు అందుతోంది. అయితే.. ఆమెను పలకరించేందుకు ఏ ఒక్కరు ప్రయత్నించకపోవటం గమనార్హం. 2020, జూన్‌లో గ్యాస్ తనిఖీల్లో భాగంగా అధికారులు ఫ్లాట్‌కు వెళ్లగా.. ఎవరూ స్పందించలేదు. దీంతో శీలా ఉండే ఇంటికి గ్యాస్ కనెక్షన్ తొలగించారు. ఆమె ఫ్రిడ్జ్‌లో ఉన్న ఆహారపదార్థాలపై తేదీల ఆధారంగా ఆమె 2019, ఆగస్టులో చనిపోయి ఉంటారని అధికారులు అంచనా వేశారు. ఆమె 2019, ఆగస్టు 14న టెలిఫోన్ ద్వారా వైద్యుడితో మాట్లాడారు. తనకు ఇబ్బందిగా ఉందని, ఒక్కోసారి శ్వాస తీసుకోలేకపోతున్నట్లు తెలిపింది. ఆ తర్వాతి రోజు వైద్యుడిని కలవాల్సి ఉంది. కానీ ఆమె హాజరవ్వలేదు. ఇదీ చూడండి: స్విమ్మింగ్‌పూల్ సింక్‌హోల్‌లో పడి వ్యక్తి మృతి.. వీడియో వైరల్! -
ఉద్యోగంలో చేరిన పది రోజులకే యువతి మృతి.. ఏం జరిగిందంటే?
మలికిపురం(కోనసీమ జిల్లా): ఆ యువతి పట్టుదలతో చదివింది. ఎంఎల్‌హెచ్‌పీ పూర్తి చేసింది. ఆరోగ్య శాఖలో ఉద్యోగం సంపాదించి కుటుంబానికి అండగా నిలవాలనుకుంది. అనుకున్నది సాధించింది. అంతలోనే విధి వక్రీకరించింది. స్వల్ప అనారోగ్యం తీవ్ర రూపం దాల్చి ఆ యువతిని తిరిగిరాని లోకాలకు తీసుకెళ్లింది. మలికిపురం మండలం గొల్లపాలెంలో ఈ విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ఏఎన్ఎం నల్లి విజయకుమారి (21) ఆకస్మిక మృతి చెందింది. ఇటీవలే ఆమెకు ఏఎన్ఎంగా ఉద్యోగం రావడంతో పి.గన్నవరం మండలం ఏనుగుపల్లి పీహెచ్సీలో విధులలో చేరారు. చదవండి: టీవీ రిపోర్టర్‌నంటూ.. మహిళపై లైంగికదాడి.. ఆ దృశ్యాలను రికార్డింగ్ చేసి.. విధులలో చేరి పది రోజులు కూడా కాలేదు. ఇటీవల ఆమెకు స్వల్ప అనారోగ్యం రావడంతో రాజమహేంద్రవరం తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆమె మృతి పట్ల గ్రామస్తులు దిగ్భ్రాంతికి గురయ్యారు. పలువురు బుధవారం విజయకుమారి చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఆమె తండ్రి ఎంపీటీసీ మాజీ సభ్యుడు నల్లిదాసును పరామర్శించారు. ఎంపీపీ కేతా శ్రీను, ఎంపీటీసీ సభ్యురాలు మట్ట అనంత లక్ష్మి, సర్పంచ్‌లు మందపాటి నాగేశ్వరావు యెనుముల నాగు, రాపాక ఆనందకుమార్ పరామర్శించిన వారిలో ఉన్నారు. -
మల్కాజిగిరిలో కలకలం.. తల్లి మృతదేహంతో ఇంట్లో మూడురోజులుగా..
సాక్షి, హైదరాబాద్: మల్కాజిగిరిలో దారుణం చోటుచేసుకుంది. విష్ణుపురి కాలనీలోని మైత్రి నివాస్ అపార్ట్మెంట్లోని ఫ్లాట్‌లో కుళ్లిపోయిన స్థితిలో పడి ఉన్న ఒక మహిళ మృతదేహాన్ని గుర్తించారు. ఫ్లాట్ నుండి దుర్వాసన రావడంతో అపార్ట్మెంట్ వాసులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చదవండి: రోజూ నలుగురు మగాళ్లు మిస్!.. ఎన్నెన్నో కారణాలు తల్లి మృతదేహంతో పాటు ముడు రోజులుగా కుమారుడు గడపడం కలకలం రేపింది. కుమారుడు సాయికృష్ణతో కలిసి తల్లి విజయ నివసిస్తుంది. సాయి కృష్ణ మానసిక పరిస్థితి సరిగ్గా ఉండదని తరచూ తల్లి, కొడుకులు గొడవ పడేవారని స్థానికులు చెబుతున్నారు. కొడుకు మానసిక పరిస్థితి వల్ల కొడుకే తల్లిని హత్య చేసి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పలు కోణల్లో పోలీసులు విచారణ చేస్తున్నారు. -
జిమ్ చేస్తూనే కుప్పకూలిన మహిళ.. సీసీటీవీలో దృశ్యాలు.. క్షణాల వ్యవధిలో
బెంగళూరు: జిమ్‌లో వ్యాయామం చేస్తుండగా మహిళ కింద పడి మృతి చెందిన ఘటన బెంగళూరులో జరిగింది. శనివారం ఉదయం మల్లేశ్వపాళ్యంలోని ఒక జిమ్‌లో వినయకుమారి (44) అనే మహిళ వ్యాయామం చేస్తూ కింద పడిపోయింది. దీంతో వెంటనే పక్కనున్నవారు ఆమెను రక్షించాలని చూసిన క్షణాల వ్యవధిలోనే ప్రాణాలు కోల్పోయింది. దీంతో అక్కడున్నవారు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఈ దృశ్యాలన్నీ అక్కడి సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి. వినయకుమారి ఐడీసీ సంస్థలో ఉద్యోగం చేస్తోంది. జిమ్ సిబ్బంది ఆమెను ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. -
కరీంనగర్లో కారు బీభత్సం.. నలుగురు మహిళలు మృతి
సాక్షి, కరీంనగర్: కరీంనగర్ పట్టణంనలో కారు ఆదివారం ఉదయం బీభత్సం సృష్టించింది. వేగంగా దూసుకొచ్చిన కారు కమాన్ ప్రాంతంలోని రోడ్డు పక్కన ఉన్న గుడిసెల మీదకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో నలుగురు మహిళలు మృతిచెందారు. మరో అయిదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. అతి వేగమే రోడ్డు ప్రమాదానికి కారణమని స్థానికులు చెబుతున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కరీంనగర్లో ఆక్సిడెంట్ చేసిన కారుపై 9 ఓవర్ స్పీడ్ చలాన్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రమాద సమయంలో కారులో నలుగురు వ్యక్తులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఘటన చోటుచేసుకున్న తరువాత అందులో ప్రయాణిస్తున్న వ్యక్తులు పరారయ్యారు. తర్వాత వారి అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. చదవండి: ఒకే గ్రామానికి చెందిన యవతితో ప్రేమ.. ఎన్నిసార్లు తిరిగినా ఒప్పుకోవడం లేదని.. నిర్లక్ష్యమే ఘోర ప్రమాదానికి కారణం కరీంనగర్ కమాన్ సెంటర్ వద్ద జరిగిన యాక్సిడెంట్ మైనర్ల నిర్వహకమేనని పోలీస్ కమిషనర్ సత్యనారాయణ ప్రెస్మీట్లో వెల్లడించారు. కారు యాక్సిడెంట్ చేసింది 16 సంవత్సరాల మైనర్ అబ్బాయని, కారు యాక్సిడెంట్ చేసే సమయంలో ముగ్గురు మైనర్లు ఉన్నారన్నారు. కారు ప్రమాదానికి కారణం యాక్సిడెంట్ చేసిన మైనర్ తండ్రి కచ్చకాయల రాజేంద్రప్రసాద్ నిర్లక్ష్యం కూడా ఉందన్నారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. -
మాదాపూర్ ఆక్సిడెంట్ కేసులో మలుపు
సాక్షి, మాదాపూర్: మాదాపూర్ రోడ్డు ప్రమాదం కేసులో కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. కారు నడిపిన యువకుడు సృజన్ కుమార్ ప్రమాద సమయంలో మద్యం సేవించి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. సృజన్ కారుపై 11 ఈ చలాన్లు ఉన్నట్లు, ఈ 11 చలాన్లు కూడా ఓవర్ స్పీడ్, డేంజరస్ డ్రైవింగ్వేనని తేలింది. కాగా ఆగి ఉన్న రాయల్ ఎన్ఫీల్డ్ బైక్‌ను మహేంద్ర ఎక్స్‌యూవీ కారు ఢీ కొనడంతో వెనుక కూర్చున్న ఓ యువతి మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ సంఘటన మాదాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం జరిగింది. మాదాపూర్ ఇన్స్పెక్టర్ రవీంద్రప్రసాద్ తెలిపిన మేరకు.. ఆదివారం ఉదయం 7 గంటల ప్రాంతంలో నేరేడ్మెట్కు చెందిన టి.అజయ్(23) తన స్నేహితురాలు జెన్నీఫర్ డిక్రూజ్‌తో కలసి తన రాయల్ ఎన్ఫీల్డ్ బైక్‌పై కొత్తగూడ వైపు నుంచి సైబర్ టవర్స్ వైపు వస్తున్నాడు. మార్గమధ్యలో సీఐఐ జంక్షన్ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఆగారు. చదవండి: హైదరాబాద్‌లో బస్‌పాస్‌కు రూ.1200.. ఇలా చేస్తే బెటరేమో! అదే సమయంలో మహేంద్ర ఎక్స్‌యూవీ కారును డ్రైవర్ అతి వేగంగా నడుపుతూ వచ్చి ఆగి ఉన్న బైక్‌ను ఢీ కొట్టాడు. దీంతో వెనుక కూర్చున్న జెన్నీఫర్ డిక్రూజ్‌కి బలమైన గాయాలయ్యాయి. ఆమెను వెంటనే మెడికవర్ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అయితే అప్పటికే చనిపోయినట్టు డాక్టర్లు తెలిపారు. అజయ్‌కు ఎడమ చేయి, ఎడమ కాలు, వెన్నుముకకు బలమైన గాయాలయ్యాయి. కార్ డ్రావర్ పరారయ్యాడు. యువతి తండ్రి జాన్‌సిరిల్ డిక్రూజ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని ధర్యాప్తు చేస్తున్నారు. కాగా అజయ్, జెన్నీఫర్‌కు ఇటీవలే నిశ్చితార్థం జరిగినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఇరు కుటుంబాల సమక్షంలో పెళ్లి చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇంతలోనే ఆ కుంటుంబాల్లో ఈ రోడ్డు ప్రమాదం అంతులేని విషాదాన్ని నింపింది. ఓ కుటుంబానికి కడుపుకోత మిగల్చడంతోపాటు మరో కుటుంబానికి కొడుకు ఎప్పటికి తేరుకుంటాడో తెలియని పరిస్థితిలోకి నెట్టేసింది. చదవండి: ఈ-చలాన్: హైదరాబాదీలకు చుక్కలు చూపిస్తున్న ట్రాఫిక్ పోలీసులు -
‘వైద్యురాలి నిర్లక్ష్యంతో బాలింత మృతి’
సాక్షి, మన్సూరాబాద్, హైదరాబాద్: ప్రసవం కోసం వచ్చిన మహిళ డాక్టర్ నిర్లక్ష్యం వల్లే మృతి చెందిందంటూ మన్సూరాబాద్ చంద్రపురికాలనీలోని అరుణ ఆసుపత్రిలో బంధువులు ఆందోళన చేశారు. బంధువులు తెలిపిన మేరకు.. చింతలకుంట చెక్‌పోస్ట్ సమీపంలో ఇంజనీర్స్‌కాలనీలో సువర్ణ –లక్ష్మణ్ దంపతులు నివాసముంటున్నారు. వీరి కుమార్తె ప్రతిభ(27)ను శుక్రవారం మధ్యాహ్నం ప్రసవం కోసం తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకొచ్చారు. సాధారణ కాన్పు చేద్దామని చెప్పిన వైద్యులు అర్ధరాత్రి 2 గంటల సమయంలో కాన్పు కావటం లేదని చెప్పి ఆపరేషన్ చేశారు. ప్రసవం అనంతరం శిశువు ఆక్సిజన్ తీసుకోవటం లేదని, బాలింతకు రక్తస్రావం జరుగుతుంతోందని, పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. రక్తప్రసరణ నివారణకు ఆపరేషన్ చేయడంతో మరో రెండు ఆపరేషన్లు చేశారన్నారు. అయితే శనివారం ఉదయం 9గంటల ప్రాంతంలో పరిస్థితి విషమంగా ఉందని, అవెర్‌గ్లోబల్ ఆసుపత్రికి తీసుకెళ్లాలని సలహా ఇచ్చారని పేర్కొన్నారు. అక్కడ చికిత్స పొందుతూ సాయంత్రం 3 గంటల ప్రాంతంలో మృతి చెందింది. దీంతో ఆదివారం బంధువులు, కాలనీవాసులు ఎల్బీనగర్లోని అరుణ ఆసుపత్రికి చేరుకుని ఆందోళన చేశారు. ‘డాక్టర్ నిరక్ష్యం వల్లే మృతి చెందింది... మాకు న్యాయం చేయాలంటూ’ నిరసనకు దిగారు. దీంతో ఎల్బీనగర్ పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు. అయితే.. అరుణ ఆసుపత్రి వైద్యురాలిని వివరణ కోసం ప్రయత్నిస్తే అందుబాటులో లేరు. సిబ్బంది కూడా లేరు. చదవండి: మహాగణపతి సిద్ధం.. ఖైరతాబాద్ చరిత్రలోనే తొలిసారి బైక్‌పై వెళ్లి.. ఆకస్మిక తనిఖీలు చేపట్టిన హైదరాబాద్ కలెక్టర్ ఆసుపత్రి ఎదుట ఆందోళన చేస్తున్న మృతురాలి బంధువులు -
సాఫ్ట్వేర్ ఉద్యోగిని మృతి.. అత్తింటివారే చంపారని ఆరోపణలు
సాక్షి, విజయవాడ: సాఫ్ట్వేర్ ఉద్యోగి ఉష అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఆమె రెండేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. తమ కుమార్తె ఉషను అత్తింటివారే చంపేశారని ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని ఉష తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. ఉష సోదరుడి ఫిర్యాదుపై కేసు నమోదు చేశామని ఎస్ఐ తెలిపారు. పోస్ట్‌మార్టం నివేదిక ఆధారంగా కేసు విచారణ చేస్తామని చెప్పారు. ఈ కేసుపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు పేర్కొన్నారు. చదవండి: అరకు మత్తులో.. యువత చిత్తు..! -
మొన్ననే నవ్వుతూ.. అంతలోనే ఏడిపిస్తూ..!
సాక్షి, హిమాయత్‌నగర్: మరణపు అంచుల వరకు వెళ్లిన అభాగ్యురాలికి అన్నీ తామై కింగ్‌కోఠి వైద్య బృందం బతికించారు. నాలుగు రోజులు గడిచేలోపు నవ్వుతూ కనిపించిన ఆ యువతి విగతజీవిగా మారింది. అభాగ్యురాలు ఉన్నట్టుండి సోమవారం కన్ను మూయడంతో ఇటు వైద్యబృందం, అటు తోటి రోగులు తీవ్ర మనోవేదనకు గురయ్యారు. కొద్దిరోజుల క్రితం గాయాలతో రోడ్లపై సంచరిస్తున్న యువతి(25)ని ఎల్బీనగర్ పోలీసులు ఉస్మానియా ఆస్పత్రికి పంపారు. ఉస్మానియా వారు ఈ నెల 12న కింగ్‌కోఠికి పంపారు. ఒళ్లంతా వికారంగా ఉండటంతో.. ఆమెకు వైద్యం చేసేందుకు సిబ్బంది కూడా వెనకడుగు వేశారు. దీంతో అడిషినల్ సూపరింటెండెంట్ జలజ వెరోనికా ప్రత్యేంగా శ్రద్థ తీసుకుని సిబ్బందితో చికిత్స అందించి, యువతిని శుభ్రంగా చేశారు. కోవిడ్ ర్యాపిడ్ టెస్ట్ చేయగా నెగిటివ్ వచ్చింది. మళ్లీ పరీక్షలో పాజిటివ్ వచ్చి అనంత లోకాలకు.. ‘అభాగ్యురాలికి అన్నీ తానై’ అనే శీర్షికతో ఈనెల 24న ‘సాక్షి’ కథనాన్ని ప్రచురించగా.. పాఠకులు, నెటిజన్లు కింగ్‌కోఠి వైద్యులు, సిబ్బందిని సోషల్ మీడియాలో ప్రశంసించారు. రెండ్రోజుల క్రితం యువతికి ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయగా.. కోవిడ్ పాజిటివ్ వచ్చింది. వెంటనే చికిత్సను కూడా ప్రారంభించారు. సోమవారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో యువతి మృతిచెందింది. దీంతో ఇటు సిబ్బంది, అటు తోటి రోగులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. యువతి మృతదేహాన్ని తీసుకెళ్లమని ఎల్బీనగర్ పోలీసులకు నారాయణగూడ పోలీసులు సమాచారం ఇచ్చారు. సుమారు 3 గంటలైనా వారు రాకపోవడంతో వార్డులో నుంచి మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. చదవండి: అభాగ్యురాలికి అన్నీ తానై.. డాక్టర్ ఔదార్యం -
వైద్యుల నిర్లక్ష్యం.. ఆపరేషన్ వికటించి మహిళ మృతి
సాక్షి, వనస్థలిపురం: వెన్నుపూసకు నిర్వహించిన ఆపరేషన్ వికటించి ఓ మహిళ మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యంతోనే ఆమె మృతి చెందిందని బంధువులు ఆందోళనకు దిగారు. ఈ సంఘటన శుక్రవారం వనస్థలిపురం చింతలకుంటలోని మెడిసిస్ ఆసుపత్రిలో చోటు చేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం... నల్లగొండ అప్పలమ్మగూడంకు చెందిన సిరసవాడ నాగేష్, నాగమణి (27) భార్యాభర్తలు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. నాగమణి కొంతకాలంగా నడుం, వెన్నునొప్పితో బాధపడుతోంది. ఆపరేషన్ నిమిత్తం బుధవారం చింతలకుంటలోని మెడిసిస్ ఆసుపత్రిలో చేర్పించారు. గురువారం సాయంత్రం ఆమెకు ఆపరేషన్ చేశారు. అనంతరం నాగమణి ఆరోగ్యం క్షీణించడంతో మధ్యరాత్రి ఆమె మృతి చెందింది. అయితే వైద్యుల నిర్లక్ష్యంతోనే నాగమణి మృతి చెందిందని ఆపరేషన్ సమయంలో ఆసుపత్రిలో రక్తం నిల్వలు కూడా లేవని బంధువులు ఆరోపించారు. ఆపరేషన్ తర్వాత నాగమణికి కాళ్లు పని చేయక పోవచ్చు అని చెప్పిన వైద్యులు చివరకు ఆమె ప్రాణాలు తీశారని ఆమె భర్త నాగేష్ రోధిస్తూ తెలిపాడు. వైద్యులు హడావిడిగా ఆపరేషన్ చేసి ఆమె మృతికి కారణమయ్యారని బంధువులు పేర్కొన్నారు. ఆసుపత్రి వద్ద గొడవలు జరుగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. బీసీ నాయకులు బాధితుల తరపున ఆసుపత్రి యాజమాన్యంతో మాట్లాడి వారికి నష్టపరిహారం అందేలా చేయడంతో గొడవ సద్దుమణిగింది. మా నిర్లక్ష్యం లేదు: ఆసుపత్రి నిర్వాహకులు నాగమణికి ఆపరేషన్ నిర్వహించిన తర్వాత సడెన్‌గా బీపీ డౌన్ అయ్యిందని, వెంటిలేటర్‌పై ఉంచి ఆమెకు మెరుగైన చికిత్సను అందించామని వైద్యులు వేణుగోపాల్ తదితరులు తెలిపారు. ఒకేసారి హార్ట్ మీద ప్రెషర్ పడటంతో ఆమె మృతి చెందిందన్నారు. చాలా తక్కువ కేసుల్లో ఇలా జరుగుతుందని వారు తెలిపారు. ఆమె ప్రాణాలు కాపాడడానికి తమ వంతు అన్ని ప్రయత్నాలు చేశామని తెలిపారు. ఇందులో తమ నిర్లక్ష్యం ఏమి లేదని వారు పేర్కొన్నారు. -
భూతవైద్యుడి చికిత్స.. యువతి మృతి
సాక్షి, దేవరకొండ : అనారోగ్యానికి గురైన యువతి కొండమల్లేపల్లిలోని ఓ భూత వైద్యుడి వద్ద చికిత్స పొందుతూ బుధవారం హఠాన్మరణం చెందింది. వివరాలిలా ఉన్నాయి. కొండమల్లేపల్లి తహసీల్దార్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న పిట్టల నరసింహకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వారిలో పెద్ద కుమార్తె హిమవర్షిణి అనారోగ్యానికి గురికావడంతో గతకొన్ని రోజులుగా మండల పరిధిలోని కొల్‌ముంతలపహాడ్ స్టేజీ సమీపంలోని భూతవైద్యుడి వద్ద చికిత్స పొందుతోంది. ఈక్రమంలో బుధవారం హిమవర్షిణి అకస్మాత్తుగా మృతి చెందింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దేవరకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కొండమల్లేపల్లి ఎస్ఐ భాస్కర్‌రెడ్డి తెలిపారు. -
విషాదం: లిఫ్ట్ అడిగి బైక్‌పై వెళ్తుండగా..
సాక్షి, కౌడిపల్లి(మెదక్): లిఫ్ట్ అడిగి బైక్‌పై వెళ్తుండగా అదుపుతప్పి కింద పడటంతో మహిళ మృతి చెందిన ఘటన కౌడిపల్లి మండలం రాయిలాపూలో శుక్రవారం చోటు చేసుకుంది. స్థానిక ఎస్ఐ రాజశేఖర్, మృతురాలి కుటుంబ సభ్యుల కథనం మేరకు.. రాయిలాపూర్ గ్రామానికి చెందిన కన్నారం భూషణం అతడి భార్య పుష్పమ్మ (42), అత్త తుడుం దుర్గమ్మతో కలిసి గ్రామ సమీపంలో తాళ్లగడ్డ తండా వెళ్లే రోడ్డు పక్కన ఉన్న వ్యవసాయ పొలం వద్ద కూరగాయలు తెంపేందుకు వెళ్లారు. పని అయిపోయాక ఇంటికి వచ్చే క్రమంలో అటుగా పాలివాడైన గ్రామానికి చెందిన రాయెల్లి ప్రభాకర్ బైక్‌పై వస్తుండటంతో భూషణం అతన్ని లిఫ్ట్ అడిగి తన భార్య పుష్పమ్మను బైక్‌పై ఎక్కించి కూరగాయల గంపను ఇచ్చాడు. ఇంటివద్ద దింపమని చెప్పాడు. కొద్దిదూరం రాగానే బైక్ అదుపుతప్పి కింద పడిపోయారు. బైక్ పైనుంచి పడిన వెంటనే పుష్పమ్మకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలు భర్త భూషణం ఫిర్యాదు మేరకు బైక్‌ను అజాగ్రత్తగా నడిపిన రాయెల్లి ప్రభాకర్‌పై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. చదవండి: భర్త చేష్టలతో విసుగుచెంది... రాసలీలల కేసు: ఢిల్లీ నుంచి వీడియో అప్లోడ్ ∙ -
సహజీవనం: అప్పు చెల్లించమన్నందుకు ప్రియురాలి హత్య
సాక్షి, వికారాబాద్: జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. అప్పుగా తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వాలని కోరిన ప్రియురాలిని హత్య చేసిన సంఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. మాలాల మండలం పగిడ్యాల గ్రామానికి చెందిన బేగారి లక్ష్మీ అనే మహిళ భర్త కొంతకాలం కిందట మరణించాడు. భర్త మృతితో ఒంటరిగా ఉంటున్న లక్ష్మి పద్దేముల్ మండలం బండమీదిపల్లి గ్రామానికి చెందిన నర్సింలుతో సహాజీనవం చేస్తోంది. ఈ క్రమంలో లక్ష్మీ, నర్సింలుకు 50 వేల రూపాయలు అప్పుగా ఇచ్చింది. ఆ డబ్బు తిరిగి ఇవ్వాలని లక్ష్మీ నర్సింలును పలుమార్లు కోరింది. దీంతో డబ్బు తిరిగి ఇవ్వాల్సి వస్తుందేమోనని అతడు లక్ష్మిని హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. వారం రోజుల క్రితం డబ్బు ఇస్తానని లక్ష్మీని నమ్మించి తన వెంట తీసుకెళ్లాడు. నమ్మి నర్సింలు వెంట వెళ్లిన లక్ష్మిని రాస్నం అడవిలో దారుణంగా హత్య చేశాడు. లక్ష్మి కనిపించకపోడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు నర్సింలును విచారించగా జరిగిన విషయం చెప్పాడు. దీంతో సీఐ జలంధర్ రెడ్డి, ఎస్ఐ అశోక్ బాబు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. చదవండి: సుంకి చెక్ పోస్టు: సంచుల కొద్దీ నకిలీ నోట్ల పట్టివేత భర్త అడ్డుతొలగిస్తే సంతోషంగా ఉండొచ్చని.. -
మగబిడ్డకు జన్మ.. అంతలోనే విషాదం
కర్ణాటక , హొసూరు : హొసూరు ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవానికి వచ్చిన ఓ మహిళ ప్రాణాలు కోల్పోయిన ఘటన ఆదివారం చోటు చేసుకుంది. హోసూరు సమీపంలోని తొడుదేపల్లి గ్రామానికి చెందిన దేవరాజ్ భార్య పవిత్ర (21) నిండు గర్భిణి. ఈనెల 3వ తేదీన ఆమె ప్రసవం కోసం హొసూరు ప్రభుత్వం ఆస్పత్రిలో చేరింది. ఆదివారం సాయంత్రం మగబిడ్డకు జన్మనిచ్చింది. తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నారని డాక్టర్లు తెలిపారు. అయితే రాత్రి 7 గంటల సమయంలో పవిత్ర మృతి చెందింది. విషయం తెలుసుకొన్న బంధువులు ఆందోళనకు దిగారు. ఆస్పత్రి ప్రధాన వైద్యాధికారి భూపతి, డీఎస్పీ మురళీ ఘటనా స్థలానికి చేరుకొని ఆందోళనకారులతో మాట్లాడారు. ప్రసవం అనంతరం పవిత్రకు నొప్పులు ఎక్కువ కావడంతో మృతి చెందిందని వారికి వివరించారు. ఇదిలా ఉంటే ఇటీవల హొసూరు ప్రభుత్వ ఆస్పత్రిలో డాక్టర్ల నిర్లక్ష్యంపై తీవ్రంగా విమర్శలు వస్తున్నాయి. -
మ్యాన్ హోల్లో పడి.. సముద్రంలో శవమై..
ముంబై: దేశ వాణిజ్య రాజధాని ముంబైలో దారుణ ఘటన చోటు చేసుకుంది. మురికి కాలువలో పడిన ఓ మహిళ కొన్ని గంటల తర్వాత సముద్రంలో శవమై తెలిన ఘటన బీఎంసీ అధికారులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మహరాష్ట్రలోని ఘాట్కోపర్ వద్ద ఈ నెల 3న జరిగిన ఈ ఘటనపై బీఎంసీ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతి చెందిన సదరు మహిళల షీతల్ దామాగా అధికారులు గుర్తించారు. అధికారుల సమాచారం ప్రకారం.. 32 ఏళ్ల షీతల్ అక్టోబర్ 3న తన కుమారుడితో కలిసి బయటకు వెళ్లింది. ఆ రోజు ముంబైలో అధికారులు భారీ వర్ష సూచన ఇవ్వడంతో తన కుమారుడిని ఇంటికి పంపించింది. అనంతరం ఎన్ని గంటలు గడిచిన షీతల్ ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆమె కోసం గాలించారు. (చదవండి: ప్లాన్ బెడిసికొట్టింది.. ఈసారి భార్య కూడా) ఓ మ్యాన్ హోల్ వద్ద తన హ్యాండ్ బ్యాగ్ దొరకడంతో ఆమె మురికి కాలువలో పడి ఉంటుందని అభిప్రాయపడి బీఎంసీ అధికారులకు సమాచారం ఇచ్చారు. కుటుంబ సభ్యుల సమాచారం మేరకు సమీపంలోని మహీమ్, టాండెయో, బాంద్రా-కుర్లా ప్రాంతాల్లో అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. 33 గంటల తర్వాత ఆమె మృతదేహాన్ని అధికారులు హాజీ అలీ సమీపంలోని సముద్రంలో కనుగొన్నారు. ఘట్కోపర్ మ్యాన్ హోల్ వద్ద మునిగిన ఆమె సముద్రంలో కనిపించడంపై అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆమె పడిన మ్యాన్ హోల్ ద్వారా మానవ దేహం 22 కిలోమీటర్లు ప్రయాణించేందుకు అవకాశం లేదని బీఎంసీ అధికారులు పర్కొన్నారు. ఈ ప్రాంతంలోని మురికి కాలువల 3 చోక్ పాయింట్లకు అనుసంధానం అయి ఉందని, అక్కడ ఆమె శరీరం ఇరుక్కోని ఉండాలన్నారు. కానీ అలా జరగ లేదు. అంతేగాక ఘట్కోపర్ నుంచి ఆమె మృతదేహాం తెలుతూ ఉండటం కూడా నమ్మశక్యం కానీ విషయం అన్నారు. మృతురాలు పడిన మురికి కాలువ మహీం వైపు ఉందని, వర్లీ నల్లా కాదని అని బీఎంసీ అధికారులు వెల్లడించారు. అంతేగాక ఆ మురికి నీటి మార్గం మానవ శరీరం పట్టేంత పెద్దది కూడా కాదని అధికారులు స్పష్టం చేశారు. షీతల్ మృతి కారణాలను కనుగొనేందుకు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. (చదవండి: కుక్కల్లా మొరిగిన వారు ఇప్పుడేం చెబుతారు!) -
పసికందుకు తల్లి ప్రేమను దూరం చేసిన కరోనా
ఔరంగాబాద్ : కరోనా వైరస్..బంధాలను, బంధుత్వాలను దూరం చేస్తుంది. 30 ఏళ్ల మహిళ పండంటి బిడ్డకు జన్మనిచ్చిన కొన్ని రోజుల్లోనే కరోనాతో మృత్యువాత పడింది. ఈ ఘటన మహారాష్ర్టలోని ఔరంగాబాద్‌లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం..మే 28న మూత్రపిండాల సమస్యతో గర్భిణీ నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చేరింది. అదే రోజున ఆడబిడ్డకు జన్మనిచ్చింది. మరుసటి రోజున నిర్వహించిన పరీక్షలో మహిళకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. అప్పటికే తీవ్ర ఆరోగ్య సమస్యలకు తోడు కరోనా కూడా సోకడంతో పరిస్థితి విషమించి మరణించినట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. అయితే చిన్నారికి మాత్రం వైరస్ సోకలేదని స్పష్టం చేశారు. ఇప్పటివరకు ఔరంగాబాద్‌లో కరోనా కేసుల సంఖ్య 1,834కు పెరగగా, గత 24 గంట్లోనే 65 కొత్త కేసులు నమోదయ్యాయి. (టిక్‌టాక్ స్టార్ పై కేసు నమోదు ) -
ఉసురు తీసిన నిరీక్షణ..
ఆత్మకూరు: కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చిన మొక్కజొన్నలను కాంటా వేయకపోవడం.. రోజుల తరబడి పడిగాపులు కాయాల్సి రావడం.. ఓ మహిళా రైతు ప్రాణాలు తీసింది. కొనుగోలు కేంద్రం వద్ద పది రోజులుగా వేచి ఉన్న ఆ మహిళా రైతు గుండెపోటుతో మృతి చెందడం వరంగల్ రూరల్ జిల్లా ఆత్మకూరు మండలంలోని నీరుకుళ్ల గ్రామంలో కలకలం సృష్టించింది. వివరాలిలా ఉన్నాయి. మండలంలోని పెంచికలపేట పీఏసీఎస్ ఆధ్వర్యంలో నీరుకుళ్లలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కేంద్రానికి పది రోజుల క్రితం పెంచికలపేటకు చెందిన నరిగె బొందమ్మ (65) మొక్కజొన్నలను తీసుకొచ్చింది. అయితే, కేంద్రంలో అప్పటికే నిల్వ ఉన్న సరుకును తరలించకపోవడంతో బొందమ్మతో పాటు మరికొందరు రైతుల మొక్కజొన్నలను కాంటా వేయలేదు. రెండు రోజుల నుంచే లారీల ద్వారా నిల్వల తరలింపు ప్రారంభమైంది. కాగా, పది రోజుల నుంచి ప్రతిరోజూ ఉదయం కేంద్రానికి రావడం, సాయంత్రం వరకు వేచి ఉండి ఇంటికి వెళ్తున్న బొందమ్మ.. సోమవారం ఉదయం కూడా తన మొక్కజొన్నలను కాంటా వేయాలని సిబ్బందిని ప్రాధేయపడుతున్న క్రమంలో అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో కుప్పకూలింది. వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం స్థానిక వైద్యుడి వద్దకు తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. దీంతో రైతులు బొందమ్మ మృతదేహాన్ని కొనుగోలు కేంద్రం వద్దకు తీసుకొచ్చి ఆందోళనకు దిగారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు, కుటుంబసభ్యులతో మాట్లాడి బొందమ్మ మృతదేహాన్ని వారి ఇంటికి తరలించారు. తహసీల్దార్ ముంతాజ్, సీఐ రంజిత్‌కుమార్, పీఏసీఎస్ చైర్మన్ కంది శ్రీనివాస్‌రెడ్డి, సీఈఓ లక్ష్మయ్య బొందమ్మ కుటుంబీకులను పరామర్శించడంతో పాటు సొసైటీ తరఫున కుటుంబానికి రూ.10 వేలు అందచేశారు. బొందమ్మ భర్త ఓదెలు 25 ఏళ్ల క్రితం, ఆమె కుమారుడు కుమారస్వామి నాలుగేళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందారు. ప్రస్తుతం ఆమె తన కోడలితో కలసి వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. -
హర్యానాలో విషాదం; బర్త్‌డే పార్టీకి వెళ్లి..
చండీగఢ్ : హర్యానాలో విషాదం చోటుచేసుకుంది. పుట్టినరోజు వేడుకలు జరుపుకుని వస్తున్న ఓ కుటుంబం రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో మహిళ(26) మృతి చెందగా కుటుంబ సభ్యులు తీవ్రంగా గాయపడ్డారు. వివరాలు.. చంఢీగడ్‌లో నివసిస్తున్న రాఘవ్ గుప్తాకు పదినెలల క్రితమే శ్రీస్టితో వివాహం జరిగింది. తాజాగా భార్య పుట్టినరోజు రావడంతో బర్త్‌డే వేడుకలు నిర్వహించడానికి విహారయాత్రకు బయల్దేరారు. మొత్తం ఆరుగురు కలిసి షిమ్లాకు వెళ్లగా అక్కడ ఓ హోటలో బర్త్‌డే పార్టీ జరుపుకున్నారు. మంగళవారం రాత్రి తిరుగు ప్రయాణం అవ్వగా.. ప్రమాదవశాత్తు రహదారిపై సైన్ బోర్డు స్తంభానికి కారు ఢీ కొట్టింది. దీంతో కారు ఇంజన్ పూర్తిగా ధ్వంసమై బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆరుగురికి తీవ్ర గాయాలవ్వగా.. వారిని హుటాహుటినా స్థానిక ఆసుపత్రికి తరలించారు. కాగా అప్పటికే శ్రిష్టి మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. మిగతా కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. కాగా అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. విచారణ చేపట్టారు. మరోవైపు రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ముగ్గురు వ్యక్తులను వేగంగా వస్తున్న ట్రక్కు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో జగత్పాల్(36), సునీల్(35)అక్కడిక్కడే మరణించగా అధేష్ కుమార్ పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. -
దారుణం: ఏనుగు దాడిలో మహిళ మృతి
చెన్నై : ట్రెక్కింగ్‌కు వెళ్లిన ఓ మహిళ ఏనుగు దాడిలో మృతిచెందారు. ఈ దారుణ ఘటన తమిళనాడులోని కోయంబత్తూర్‌లో ఆదివారం చోటుచేసుకుంది. వివరాలు.. గణపతి మా నగర్‌కు చెందిన పి. భువనేశ్వరి తన భర్త ప్రశాంత్ వీకెండ్స్‌లో ట్రెక్కింగ్‌కు వెళ్తుంటారు. ఈ క్రమంలోనే ఆదివారం ఆరుగురు స్నేహితులతో కలిసి భువనేశ్వరి దంపతులు రెండు కార్లలో పాలమలై రిజర్వ్ ఫారెస్ట్‌లో ట్రెక్కింగ్‌కు వెళ్లారు. ఆదివారం ఉదయం 6 గంటల సమయంలో పాలమలైకు చేరుకుని.. కార్లను రోడ్డు పక్కన నిలిపి.. నాలుగు కి,మీ దూరంలో ఉన్న పాలమలై అరంగనాథర్ దేవాలయం వరకు నడుస్తూ వెళ్లారు. వీరికి దారిలో ఏనుగు ఎదురుపడింది. దీంతో భయభ్రంతాలకు గురై అందరూ దూరంగా పరుగులు తీశారు. ఈ క్రమంలో పొదల్లో దాక్కొవాలని భువనేశ్వరి ప్రయత్నించగా.. అది గమనించిన ఏనుగు ఆమెను తొండంతో విసిరి పారేసింది.దీంతో ఆమె అక్కడక్కడే మరణించారు.మిగతా వారు ఏనుగు దాడి నుంచి సురక్షింతంగా బయటపడి అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని వారిని రక్షించి.. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం కోయంబత్తూర్ మెడికల్ కళాశాలకు పంపారు. కాగా భువనేశ్వరికి 11 ఏళ్ల కుమారుడు, 8 ఏళ్ల కుమార్తె ఉన్నారు. ఈ ఘటనపై రేంజ్ అధికారి సురేష్ మాట్లాడుతూ.. ఆడవిలో ప్రవేశించడానికి సదరు బృందం ఎలాంటి అనుమతి తీసుకోలేదని తెలిపారు. అనుమతులు లేకుండా అడవుల్లో ట్రెక్కింగ్ చేసినందుకు వారిపై కేసు నమోదు చేస్తామని అన్నారు. పాలమలై రిజర్వ్ ప్రాంతమని ఇక్కడ జంతువుల దాడి జరుగుతుందని ఇప్పటికే చుట్టు పక్కలా ప్రాంతాల్లో హెచ్చరికలు జారీ చేశామని అధికారి తెలిపారు -
ఊరంతా షార్ట్ సర్క్యూట్
రాయపోలు(దుబ్బాక): ప్రశాంతంగా ఉన్న ఆ పల్లెలో ప్రజలకు విద్యుత్ ప్రమాదం కంటిమీద కునుకులేకుండా చేసింది. ట్రాన్స్ఫార్మర్ వద్ద ఎర్తింగ్ లోపంతో ప్రమాదం సంభవించింది. దీని వల్ల విద్యుత్ షాక్‌తో ఓ మహిళ మృతిచెందగా, ఒక పూరిగుడిసె దగ్ధమైంది. సిద్దిపేట జిల్లా రాయపోలు మండలం ఎల్కల్ గ్రామంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో గ్రామానికి చెందిన తాటికొండ కళవ్వ (53) సెల్‌ఫోన్ చార్జింగ్ పెడుతుండగా విద్యుత్ షాక్‌కు గురైంది. ఈ విషయాన్ని గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను హుటాహుటిన గజ్వేల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆమె ఆస్పత్రిలో మృతి చెందింది. ఇదిలా ఉండగా కళవ్వను తీసుకుని ఆసుపత్రికి వెళ్లిన ఆమె భర్త తాటికొండ నర్సింహులు తన కొడుకు నవీన్‌తో కలసి తిరిగి అర్ధరాత్రి సమయంలో ఇంటికి వచ్చాడు. అప్పటికే అతని కోడలు మహేశ్వరి గుడిసెలో నిద్రిస్తోంది. ఆ సమయంలో గుడిసెలో నుంచి పొగలు రావడం గమనించిన వారు వెంటనే మహేశ్వరిని బయటకు తీసుకొచ్చారు. అంతలోనే గుడిసెకు మంటలు అంటుకోవడంతో అప్రమత్తమైన స్థానికులు వెంటనే మంటలు చల్లార్చారు. అప్పటికే గుడిసె పైకప్పు కాలిపోయింది. ఈ ప్రమాదంలో ఇంట్లోని టీవీ, ఇతర వస్తువులు కాలిపోయాయి. వీటితో పాటు నగదు కూడా కాలిపోయినట్లు బాధితులు తెలిపారు. గుడిసెలోని విద్యుత్ స్విచ్‌బోర్డు నుంచి స్పార్క్స్ వచ్చి నిప్పంటుకున్నట్టు చెబుతున్నారు. -
పోయిన ప్రాణాన్ని దాచారు!
పాతపోస్టాఫీసు(విశాఖ దక్షిణ): చికిత్స కోసం ఆస్పత్రిలో చేరిన మహిళ చనిపోయినా.. తమకు సకాలంలో తెలియజేయలేదని కుటుంబ సభ్యులు ఆస్పత్రిలోనే ఆందోళనకు దిగారు. ఈ ఘటన రాంనగర్ కేర్ ఆస్పత్రిలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. మృతురాలి కుమార్తె లీలాకుమారి, సోదరుడు ఎన్.మోహనరావు తెలిపిన వివరాల ప్రకారం.. తాటిశెట్టి కుసుమ (65) ఆనందపురం మండలం వెల్లంకి గ్రామంలో నివసిస్తున్నారు. ఇటీవల షుగర్, బీపీ హఠాత్తుగా పెరగడంతో కుసుమను కుటుంబ సభ్యులు రాంనగర్ కేర్ ఆస్పత్రిలో ఈనెల 15న సాయంత్రం 6.30 గంటలకు జాయిన్ చేశారు. అప్పటి నుంచి ఐసీయూలో ఉంచి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. రోగి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నా సకాలంలో వైద్యం అందుతున్న కారణంగా కోలుకునే అవకాశాలు ఉన్నాయని వైద్యులు తెలిపారు. మంగళవారం సాయంత్రం వరకూ అందరితో మాట్లాడింది. బుధవారం ఉదయం సమీప బంధువు కుసుమను చూసేందుకు ఉదయం 10 గంటలకు ఆస్పత్రికి రాగా రోగి నిద్రపోతోందని, ఆమెను కదిలించవద్దంటూ సెక్యూరిటీ సిబ్బంది ఐసీయూలోకి అనుమతించలేదు. అదేవిధంగా రోగి సోదరుడు మోహనరావు హైదరాబాద్ నుంచి వచ్చి ఐసీయూలోకి వెళ్లేందుకు చేసిన ప్రయత్నాన్ని సెక్యూరిటీ అడ్డుకున్నారు. సాయంత్రం 6 గంటలకు బలవంతంగా లోనికి వెళ్లి చూసేసరికి అప్పటికీ కుసుమ అపస్మారక స్థితిలో ఉంది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళనకు దిగారు. కుసుమ ఉదయమే చనిపోయి ఉంటుందని, ఈ విషయాన్ని రాత్రి 9.30 గంటల వరకూ దాచిపెట్టారని బంధువులు వాపోయారు. డబ్బులు కట్టించుకోవడంలో ఉన్న శ్రద్ధ రోగుల మీద చూపడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వివరాలు తెలుసుకునేందుకు వెళ్లిన మీడియా ప్రతినిధులను సెక్యూరిటీ అడ్డుకున్నారు. మృతురాలి బంధువులు ఇచ్చిన సమాచారం మేరకు మూడో పట్టణ పోలీసులు వచ్చి పరిస్థితిని చక్కదిద్దారు. -
అత్తారింటికి వెళ్తావనుకుంటే..
ప్రొద్దుటూరు క్రైం : ‘మంచి సంబంధమని మురిసిపోతిమి కదమ్మా.. అత్తారింటికి వెళ్తావనుకుంటే.. మమ్మల్ని వదలి శాశ్వతంగా దూరమవుతున్నావా తల్లీ.. నిన్ను వదిలిపెట్టి ఎలా ఉండాలమ్మా.. చిన్నీ.. లేయమ్మా’ అంటూ కుమార్తెను తల్చుకుంటూ ఆ తల్లి రోదిస్తున్న తీరు అందరినీ కలచి వేసింది. కర్నూలు జిల్లాలో శుక్రవారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ప్రొద్దుటూరులోని ద్వారకానగర్‌కు చెందిన గోథ్నవితోపాటు మిట్టమిడి వీధిలోని మార్తల సుధాకర్‌రెడ్డి, బి కోడూరు మండలానికి చెందిన కాసా నారాయణరెడ్డి మృతి చెందిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌లోని యువకుడితో గోథ్నవికి నిశ్చితార్థం జరిపించి తిరిగి.. ప్రొద్దుటూరుకు వస్తున్న సమయంలో వారి కారు.. ట్రాక్టరును ఢీకొనడంతో ఈ దుర్ఘటన జరిగింది. ఇదే ప్రమాదంలో గోథ్నవి తల్లి ఇందిరా, తండ్రి మల్లికార్జునరెడ్డి, లత, పెద్దమ్మ సక్కుబాయ్, డ్రైవర్ మహబూబ్‌బాషాకు గాయాలయ్యాయి. కర్నూలు నుంచి ఆమె మృతదేహాన్ని అంబులెన్స్‌లో ప్రొద్దుటూరుకు తీసుకొని వచ్చారు. తీవ్ర గాయాలైనా మృతురాలి తల్లి, తండ్రి, పెద్దమ్మ సక్కుబాయ్ కూడా వచ్చారు. తండ్రి మల్లికార్జునరెడ్డికి కాలు విరగడంతో ఆయన నడవలేని స్థితిలో ఉన్నాడు. దీంతో ఆయనను ఇంటి ప్రాంగణంలో పడుకోపెట్టారు. తీవ్రంగా గాయపడిన లత కర్నూలు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. బంధువులు, వీధిలోని ప్రజలు, సన్నిహితులు, గోథ్నవి పని చేసిన సరస్వతి విద్యామందిరం స్కూల్ ఉపాధ్యాయులు, యాజమాన్యం ద్వారకానగర్‌కు వచ్చి కడసారి మృతదేహాన్ని చూసి నివాళులర్పించారు. సహచరురాలు దూరం కావడంతో ఉపాధ్యాయులు కంట తడి పెట్టారు. ప్రమాదం నుంచి సురక్షితంగా.. గోథ్నవి నిశ్చితార్థం కోసం హైదరాబాద్‌కు వెళ్లిన వారిలో శివారెడ్డి ఉన్నారు. ఆయన గోథ్నవికి స్వయాన చిన్నాన్న. రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు కారులో ఉన్న వారిలో ముగ్గురు మృతి చెందగా, మిగతా వాళ్లు తీవ్రంగా గాయ పడ్డారు. అయితే వెనుక సీట్లో కూర్చున్న శివారెడ్డి ఎలాంటి గాయాలు కాకుండా సురక్షితంగా బయట పడ్డారు. రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే ఆయనే స్థానికుల సాయంతో సహాయక చర్యలు చేపట్టాడు. అంబులెన్స్‌కు సమాచారం అందించి అందిరినీ ఆస్పత్రికి తరలించారు. చీకటి కావడంతో ఎవరు, ఎక్కడ ఉన్నారో తెలియలేదని, తర్వాత దారిన వెళ్లే ప్రజలు వచ్చి సెల్ఫోన్ల లైట్ వేయడంతో.. అందరినీ గుర్తు పట్టి సకాలంలో ఆస్పత్రికి చేర్చగలిగామని శివారెడ్డి తెలిపారు. ఎవరి కోసం బతకాలమ్మా.. రోడ్డు ప్రమాదంలో ఇందిరా కూడా తీవ్రంగా గాయపడింది. కుమార్తె మృతి చెందిందనే విషయం తెలిసినప్పటి నుంచి ఆమె రోదించసాగిందని బంధువులు అంటున్నారు. కర్నూలు నుంచి ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఆమె ఏడుస్తూనే ఉండిపోయింది. ‘నా కొడుకు చనిపోతే పిల్ల కోసమైనా బతకమంటిరే.. ఇప్పుడు నా పిల్ల దూరమైతే ఇక ఎవరి కోసం బతకాలి దేవుడా..’ అంటూ కుమార్తె మృతదే హం వద్ద కూర్చొని విలపిస్తోంది. మూడేళ్ల క్రితం కుమారుడు శివ ఆత్మహత్య చేసుకున్నా డు. కొన్ని నెలల పాటు కుమారుడ్ని తలచుకుంటూ రోదించేది. ఇప్పుడు ఆమెను ఓదార్చడానికి బంధువులు ప్రయత్నించినా సాధ్యం కాలేదు. చివరి సారిగా తనివి తీరా కుమార్తెను చూసుకున్న తల్లి ఇందిరా.. ముద్దాడి ఆమెకు తుది వీడ్కోలు పలికింది. ఆదివారం సాయంత్రం ఆర్టీపీపీ రోడ్డులోని శ్మశాన వాటికలో గోథ్నవి అంత్యక్రియలు నిర్వహించారు. -
చిరకాల కోరిక తీరకుండానే..
సాక్షి, ప్రొద్దుటూరు(కడప) : ప్రొద్దుటూరులోని బాలాజీనగర్–1కు చెందిన పెండ్లిమర్రి భాగ్యమ్మ (51) అమరనాథ్ యాత్రలో గుండె పోటుతో మృతి చెందింది. జూన్ 26న ఆమె భర్త శంకరయ్యతో కలిసి అమరనాథ్ యాత్రకు బయలుదేరి వెళ్లింది. 12 మంది బంధువులు, కర్నూల్ నుంచి సుమారు 100 మంది భక్తులతో కడప నుంచి నిజాముద్ధీన్ ఎక్స్‌ప్రెస్ రైలులో వెళ్లారు. 27న ఢిల్లీకి చేరుకున్నారు. ఢిల్లీలోని వైష్ణవి ఆలయం, ద్వారక, స్వర్ణదేవాలయం, వాఘా సరిహద్దు, జమ్ము కాశ్మీర్‌లోని పలు ప్రదేశాలను సందర్శించారు. అమరనాథ్ కొండపైకి వెళ్లేందుకు ఈ నెల 3న మధ్యాహ్నం 3 గంటల సమయంలో కశ్మీర్లో ఉన్న బర్తాల్ బేస్ క్యాంపునకు చేరుకొని రాత్రి ఉండటానికి బాడుగ రూములు తీసుకున్నారు. ఆ రోజు రాత్రి అక్కడే బస చేసి గురువారం ఉదయం అమరనాథుని దర్శనానికి వెళ్లాలనుకున్నారు. ఇందుకోసం డోలీలకు డబ్బు కూడా చెల్లించారు. అయితే కొద్ది సేపటి తర్వాత సుమారు 3.30 గంటల సమయంలో భాగ్యమ్మకు గుండె పోటు రావడంతో కుప్ప కూలిపోయింది. భర్తతో పాటు యాత్రికులు ఆమె వద్దకు చేరుకునే లోపు తుదిశ్వాస విడిచింది. భార్య అకాల మరణాన్ని చూసి భర్త శంకరయ్య తల్లడిల్లిపోయారు. తమకు బుధవారం సాయంత్రం 4.40 గంటలకు సమాచారం అందిందని కుటుంబ సభ్యులు తెలిపారు. కశ్మీర్లో ఫోన్లు పని చేయకపోవడంతో వీరికి ఆలస్యంగా తెలిసింది. ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు మృతదేహం బర్తాల్ బేస్ క్యాంపు సమీపంలోని సోనామార్గ్ ఆస్పత్రిలో గురువారం ఆమె మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని శ్రీనగర్‌కు తరలించారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు తీసుకొని వచ్చారు. శుక్రవారం ఉదయం వారి స్వస్థలమైన ప్రొద్దుటూరుకు భాగ్యమ్మ మృతదేహాన్ని తీసుకొని వస్తారని కుటుంబ సభ్యులు తెలిపారు. అదే రోజు ఆమె అంత్యక్రియలను నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. పూర్తి ఆరోగ్యంతో ఉండేది భాగ్యమ్మ పూర్తి ఆరోగ్యంతో ఉండేదని, ఏ రోజు ఆస్పత్రికి వెళ్లలేదని కుమార్తె నాగవేణి తెలిపింది. తల్లి మరణ వార్త విని ఆమె బోరున విలపించసాగింది. శంకరయ్య, భాగ్యమ్మ దంపతులకు మంజుల, నాగవేణి అనే కుమార్తెలు, శరత్ అనే కుమారుడు ఉన్నారు. కుమారుడు హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్నారు. శంకరయ్య జమ్మలమడుగు ఆర్టీసి డిపోలో డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. గత ఏడాది అతను జమ్మలమడుగు డిపోకు బదిలీ అయ్యారు. వచ్చే ఏడాది డిసెంబర్లో పదవీ విరమణ పొందనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా బుధవారం ఉదయం 7.30 సమయంలో తల్లి భాగ్యమ్మ తమతో ఫోన్లో మాట్లాడిందని కుమార్తె నాగవేణి చెబుతూ విలపించసాగింది. కశ్మీర్లో ఉన్నామని, రేపు (గురువారం) ఉదయం అమరనాథ్ కొండపైకి వెళ్తామని తల్లి చెప్పినట్లు తెలిపింది. ఆమె ఫోన్ పని చేయకపోవడంతో ట్రావెల్స్ ప్రతినిధి ఫోన్‌తో మాట్లాడిందన్నారు. ఏదైనా అవసరం ఉంటే ఈ నంబర్‌కే ఫోన్ చేయాలని తల్లి చెప్పిందని, ఇంతలోనే ఘోరం జరిగిపోయిందని రోదించింది. తల్లి మరణ వార్త విని కడపలో ఉంటున్న ఇద్దరు కుమార్తెలు, అల్లుళ్లు శ్రీధర్, అర్జున్ ప్రొద్దుటూరుకు వచ్చారు. తల్లి మృతదేహాన్ని ప్రొద్దుటూరుకు తీసుకొని వచ్చేందుకు కుమారుడు శరత్ హైదరాబాద్‌లోనే ఉండిపోయారు. ఈ సంఘటనపై రెవెన్యూ అధికారులు వివరాలు సేకరించి కలెక్టర్‌కు పంపినట్లు తెలిసింది. -
చార్ధామ్ యాత్రకు వెళ్లి ..
సాక్షి, కోడుమూరు(కర్నూలు) : చార్ధామ్ యాత్రకు వెళ్లిన కోడుమూరు పట్టణానికి చెందిన ఓ మహిళా భక్తురాలు గుండెపోటుతో మృతిచెందిన ఘటన ఈనెల 27న ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని యమునోత్రిలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. కోడుమూరుకు చెందిన ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగి రామచంద్రుడు భార్య ధర్మాంబ (65) నాలుగు రోజుల క్రితం చార్ధామ్ యాత్రకు బంధువులతో కలిసి వెళ్లింది. యాత్రలో భాగంగా ఈనెల 27న ఉత్తరాఖండ్‌లోని యమునోత్రి ఆలయంలో దర్శనం నిమిత్తం క్యూలో నిలబడిన ధర్మాంబ ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలింది. గమనించిన బంధువులు అక్కడే ఉన్న వైద్యుడిని సంప్రదించగా అప్పటికే ఆమె మృతిచెందినట్లు నిర్ధారించారు. ధర్మాంబ మృతదేహాన్ని కోడుమూరుకు తీసుకొచ్చేందుకు వైఎస్సార్సీపీ కర్నూలు ఎంపీ డాక్టర్ సంజీవ్‌కుమార్ జిల్లా అధికారులు, ఢిల్లీలోని ఏపీ భవన్ అధికారులతో మాట్లాడారు. శనివారం విమానంలో హైదరాబాద్‌కు, అక్కడి నుంచి రోడ్డుమార్గంలో కోడుమూరుకు తీసుకొచ్చేలా చర్యలు తీసుకున్నారు. మృతురాలికి భర్తతో పాటు, కుమారుడు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. -
మొన్న శ్రీలత,నేడు లావణ్య
-
బస్సు ఢీకొని మహిళ మృతి
పశ్చిమగోదావరి, పాలకొల్లు అర్బన్: బ్యాంక్ పని ముగించుకుని స్కూటర్‌పై ఇంటిముఖం పట్టిన భార్యాభర్తలను ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో భార్య అక్కడికక్కడే మృతిచెందగా భర్తకు తీవ్రగాయాలైన ఘటన పూలపల్లిలో గురువారం చోటుచేసుకుంది. పట్టణ పోలీస్ స్టేషన్ రైటర్ నాగేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం, పాలకొల్లు మండలం వెలివెల గ్రామానికి చెందిన కొప్పినీడి పద్మ ఆంజనేయులు, అతడి భార్య సరోజిని (43) బ్యాంక్ పనిమీద స్కూటర్‌పై పాలకొల్లు వచ్చారు. పని ముగించుకుని తిరిగి ఇంటికి వెళుతుండగా పూలపల్లి వద్ద భీమవరం నుంచి పాలకొల్లు వెళుతున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. దీంతో సరోజిని అక్కడికక్కడే మృతి చెందగా ఆంజనేయులు వెన్నెముక జారిపోవడంతో ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతురాలికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వీరిలో పెద్ద కుమార్తె సాయిరత్నం గ్రామంలో డ్వాక్రా యానిమేటర్‌గా పనిచేస్తున్నారు. రెండో కుమార్తె వెంకట దుర్గ డిగ్రీ పాసై ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నారు. స్టేషన్ రైటర్ నాగేశ్వరరావు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పాలకొల్లు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. -
కుటుంబ పోషణకు వెళ్లి కువైట్‌లో మృత్యువాత
చిత్తూరు, రామసముద్రం : మంచం పట్టిన భర్తకు వైద్యం, కుటుంబ పోషణ నిమిత్తం కడుపు చేత పట్టుకుని కువైట్‌కు వెళ్లిన మహిళ రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ విషాద సంఘటన వివరాలు.. రామసముద్రం మండలం అరికెల గ్రామానికి చెందిన గోవిందమ్మ(42) తన కుమార్తెకు వివాహం చేశారు. కుమారుడు వెల్డింగ్ పనులకు వెళ్తున్నాడు. ఈ నేపథ్యంలో గోవిందమ్మ భర్త శ్రీనివాసుల ఆచారి అనారోగ్యానికి గురై మంచాన పడ్డాడు. ఈ పరిస్థితులలో కుటుంబ పోషణ నిమిత్తం గోవిందమ్మ 2014లో కువైట్‌కు వెళ్లింది. అక్కడ ఒక ఇంట పనులకు కుదిరింది. తిరిగి 2016లో డిసెంబర్లో స్వగ్రామానికి వచ్చింది. కొన్ని నెలల విరామం తరువాత 2017లో మళ్లీ కువైట్‌కు వెళ్లింది. ఈనెల 5న పనులు ముగించుకుని వెళ్తుండగా వాహనం ఢీకొని రోడ్డు ప్రమాదంలో అక్కడిక్కడే మృతి చెందింది. ఈ విషయాన్ని గోవిందమ్మ స్నేహితులు కుటుంబ సభ్యులకు తెలియజేయడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతురాలి కుమారుడు పృథ్వి తన తల్లి మృతదేహం స్వగ్రామానికి చేరేందుకు సహకరించాలని ఈనెల 11న చిత్తూరుకు వెళ్లి జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్నను కోరారు. స్పందించిన ఆయన ఇండియన్ ఎంబసీ అధికారులకు సమాచారం అందించి, కువైట్ అధికారులతో మాట్లాడారు. రెండు రోజుల్లో మృతదేహాన్ని తరలించనున్నట్లు వారు చెప్పినట్లు తెలియవచ్చింది. మృతదేహం కోసం కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఎదురుచూస్తున్నారు. -
108 నిర్లక్ష్యంతో మహిళ మృతి
మదనపల్లె టౌన్: 108కు ఫోన్ చేసినా స్పందించకపోవడంతో ఓ పేద మహిళ నిండు ప్రాణాన్ని కోల్పోయింది. మదనపల్లెలోని బెంగళూరు రోడ్డులో నివాసం ఉంటున్న బి.రేణుక(35) కుటుంబ కలహాల కారణంగా భర్త ప్రసాద్ నుంచి విడిపోయింది. కొత్తిమీర విక్రయించుకుంటూ ఇద్దరు పిల్లలను పోషించుకుంటోంది. శుక్రవారం రాత్రి ఉన్నట్టుండి ఆమెకు ఛాతీలో నొప్పి వచ్చింది. చుట్టుపక్కల వారు వెంటనే ఆస్పత్రికి తరలించేందుకు ప్రయత్నించారు. 108కు ఫోన్ చేశారు. అయితే అటువైపు నుంచి ఎలాంటి స్పందన రాలేదు. రేణుక వద్ద ఆటోలో వెళ్లేందుకు డబ్బు లేకపోవడంతో స్థానికులు కొత్తిమీర అమ్ముకునేందుకు వినియోగించే తోపుడు బండిపైనే జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే వైద్యులు అప్పటికే ఆమె మృతి చెందినట్టు ధ్రువీకరించారు. దీంతో ఇద్దరు పిల్లలు అనాథలుగా మారారు. -
ఆస్పత్రికి వెళితే..ఆయువు తీశారు..!
అది ఏ దిక్కూలేని దవాఖానా. అక్కడ వైద్యులు ఉండరు. సకాలంలో వైద్యం అందదు. కళ్లుతిరిగి పడిపోయిందని ఆస్పత్రికి తీసుకెళితే వృద్ధురాలి ఆయువు తీశారు. ప్రాణాలు పోతున్నా వైద్యం చేసేవారు కరవు అనేందుకు రాజంపేట ఏరియా ఆస్పత్రిలో శనివారం జరిగిన ఈ ఘటన నిదర్శనంగా నిలుస్తోంది. అధికారులు, వైద్యుల తీరుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజంపేట: ఆకేపాడు గ్రామపరిధిలోని రామిరెడ్డిగారిపల్లెకు చెందిన ఆవుల సుభద్రమ్మ (68) అనే వృద్ధురాలు సకాలంలో వైద్యం అందక ప్రాణాలు విడిచింది. ఈ సంఘటన శనివారం చోటుచేసుకుంది. బాధితుల వివరాల మేరకు... సుభద్రమ్మ కళ్లు తిరిగి కిందకిపడిపోయింది. ఆమెను రాజంపేట ఏరియా ఆసుపత్రి(వైద్యవిధానపరిష్)కు తీసుకెళ్లారు. అయితే ఆ సమయంలో డ్యూటీలో ఉన్న నర్స్ స్థానిక వైద్యునికి సమాచారం తెలియజేశారు. ఆయన వచ్చే సరికే వృద్ధురాలి పరిస్థితి విషమించింది. మృత్యుఓడిలోకి చేరుకుంది. వృద్ధురాలిని పరిశీలించి అక్కడి నుంచి వైద్యుడు వెళ్లిపోయారు. సకాలంలో వృద్ధురాలు ఆసుపత్రికి వచ్చినప్పటికి వైద్యం అందించలేకపోవడంతో బంధువులు ఆగ్రహించారు. అన్ని సౌకర్యాలు ఉంటాయనే (ట్రామాకేర్‌సెంటర్) ఉద్దేశంతో వృద్ధురాలిని తీసుకు వచ్చామని.. ఆస్పత్రి దుస్థితి తమకు తెలిసి ఉంటే తీసుకొచ్చేవాళ్లం కాదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎదైనా కార్పొరేట్ హాస్పిటల్‌కు తీసుకెళ్లినా కాపాడుకునేవాళ్లమని మృతురాలి సంబంధీకులు వాపోయారు. కాల్డ్యూటీలు.. రాజంపేట ఏరియా హాస్పిటల్లో కాల్‌డ్యాటీలు అమలుచేస్తున్నారు. వైద్యులు, వైద్యసిబ్బంది కొరత సమస్య వెంటాడుతోంది. ఈ క్రమంలో కాల్‌డ్యాటీలు తెరపైకి వచ్చాయి. వైద్యుడు 10 నుంచి 15 నిమిషాల్లో వచ్చి చికిత్స చేసేలా నిర్ణయం తీసుకున్నారని ఆసుపత్రి వర్గాలు మరోవైపు చెబుతున్నాయి. అయితే కొందరు వైద్యులు జీవో ప్రకారం స్థానికంగా లేకపోవడం వల్లనే ఇటువంటి పరిస్థితులు ఉత్పన్నమైవుతాయనే ఆరోపణలు వెలువడుతున్నాయి. కాల్డ్యూటీలో రోగులు తమకు సహకరించాలని ముందస్తుగా సెంటర్లో ఫ్లెక్సీని కూడా ఏర్పాటు చేశారు. ఆ లెక్కన చూస్తే శనివారం వృద్ధురాలని 12.15గంటలకు తీసుకొస్తే 12.40గంటలకు కానీ వైద్యం చేసేందుకు ఎవరూ రాలేదు. దీంతో వృద్ధురాలి కానరాని లోకాలకు చేరుకుంది. వైఎస్సార్సీపీ నేతల ఆందోళన వృద్ధురాలి మృతికి సకాలంలో వైద్య సేవలందించకపోవడమే కారణమని, ఇక్కడ వైద్యులు అందుబాటులో లేరని వైఎస్సార్సీపీ నేతలు మూకుమ్మడిగా ధ్వజమెత్తారు. వైఎస్సార్సీపీ జిల్లా రైతు ప్రధానకార్యదర్శి గీతాల నరసింహారెడ్డి, నీనేస్తం అధ్యక్షుడు పెంచలయ్యనాయుడు, దళితనాయకులు దండుగోపి, ఆర్సీ పెంచలయ్య, సొంబత్తిన శ్రీనివాసులు, మాజీ సర్పంచి బుర్రునాగేశ్వరరావు, మాధవరం వల్లి, ఆకేపాడు గ్రామానికి చెందిన నాయకులు ట్రామా కేర్ సెంటర్ ఎదుట ఆందోళనకు దిగారు. వైద్యవిధానపరిషత్ నిర్వహణ విఫలమయ్యిందని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. వైద్యులు నిర్లక్ష్యంపై నిప్పులు చెరిగారు. మాజీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్రెడ్డి కృషితో ట్రామాకేర్సెంటర్ను తీసుకొచ్చారని, ఇప్పుడు టీడీపీ పాలనలో దిక్కులేని దవాఖానాగా మారిపోయిందని విమర్శించారు. ప్రాణాలు కాపాడలేని పెద్దాసుపత్రి ప్రాణాలు పోసేవిధంగా ఉండాలే కానీ, ప్రాణాలను కాపాడలేని విధంగా రాజంపేట పెద్దాసుపత్రి నిర్వహణ తీరు కనిపిస్తోంది. గతంలో చిన్నారి భవ్యశ్రీ మృతి సంఘటనలో చట్టపరమైన చర్యలు తీసుకుని ఉండి ఉంటే ఈ రోజు వృద్ధురాలి ప్రాణంపోయి ఉండేది కాదు. తాను ఎంతో కృషిచేసి ట్రామాకేర్‌సెంటర్ మంజూరు, ఓపీబ్లాక్ ఆధునీకరణ లాంటివిచేపడితే పేదలకు మెరుగైన వైద్యం అందుతుందని భావించాను. టీడీపీ పాలకుల వల్లే ఆస్పత్రికి ఈ దుస్థితి వచ్చింది. –ఆకేపాటి అమర్నాథ్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, రాజంపేట డీసీహెచ్కు ఫోన్‌చేశాను.. అవ్వ అస్వస్థతకు గురికావడంతో రాజంపేట ఏరియా హాస్పిటల్‌కు తీసుకువచ్చాను. అయితే అందుబాటులో వైద్యులు లేరు. వైద్యుని కోసం ఎదురుచూడాల్సి వచ్చింది. మృతిచెందినట్లుగా తెలిసి, ఇక్కడున్న పరిస్థితులను డీసీహెచ్కు ఫోన్ ద్వారా వివరించాను. పొంతనలేని సమాధానాలు చెప్పి, ఫోన్ కట్‌చేశారు. –ఆవుల విష్ణుకాంత్‌రెడ్డి, మృతురాలి మనవడు, ఆకేపాడు -
బస్సు ఢీకొని మహిళ దుర్మరణం
లక్ష్మీపురం(గుంటూరు): ప్రభుత్వ సమగ్రాసుపత్రిలో బంధువులను పరామర్శించి పెదకాకాని శివాలయానికి ద్విచక్రవాహనంపై వెళుతున్న దంపతులను ప్రైవేటు బస్సు ఢీ కొనడంతో బస్సు టైర్ కింద మహిళ పడి అక్కడికక్కడే మృతి చెందింది. ఆమె భర్తకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన గుంటూరు నగరంలో కాకాని రోడ్డులో ఉన్న బెస్ట్‌ప్రైస్ వద్ద శుక్రవారం చోటు చేసుకుంది. ఈస్ట్ ట్రాఫిక్ సీఐ పూర్ణచంద్రరావు తెలిపిన వివరాల ప్రకారం గుంటూరు రూరల్ మండలం ఓబులునాయుడుపాలెంకు చెందిన ఏమినేని సాంబశివరావు మిర్చి యార్డులో ముఠా కూలీగా జీవనం సాగిస్తుంటారు. భార్య శివపార్వతి. వీరికి ఇద్దరు కుమారులు గణేష్, సాయికుమార్ చెన్నైలో సాఫ్ట్వేర్ కంపెనీలలో పనిచేస్తున్నారు. శివపార్వతి తల్లి సింహాద్రి నాగేశ్వరమ్మ కొన్ని రోజులుగా అనారోగ్యంతో గుంటూరు ప్రభుత్వ సమగ్రాసుపత్రిలో చికిత్స పొందుతూ ఐసీయూలో ఉన్నారు. సాంబశివరావు, శివపార్వతి గురువారం సాయంత్రం ఓబులునాయుడుపాలెం నుంచి గుంటూరు వచ్చి ఆసుపత్రిలో తల్లి నాగేశ్వరమ్మను పరామర్శించి తిరిగి రాత్రి ఓబులునాయుడుపాలెం వెళ్లారు. శుక్రవారం ఉదయం కార్తీక పౌర్ణమి సందర్భంగా పెదకాకాని దేవాలయంలో దీపారాధన చేసేందుకు ద్విచక్రవాహనంపై దంపతులిద్దరూ బయల్దేరారు. గుంటూరు బెస్ట్ ప్రైస్ వద్దకు చేరుకునే సరికి యామినీ ట్రావెల్స్‌కు చెందిన బస్సు ఆటోను తప్పించే యత్నంలో ద్విచక్రవాహనాన్ని ఢీకొంది. దీంతో ద్విచక్రవాహనం నడుపుతున్న సాంబశివరావు, శివపార్వతి కిందపడ్డారు. శివపార్వతి (50) తలభాగం బస్సు వెనుక టైర్ కింద పడటంతో నుజ్జునుజ్జు అయి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. భర్త సాంబశివరావుకు తీవ్రగాయాలయ్యాయి. సాంబశివరావును ఆసుపత్రికి తరలించడం కోసం స్థానికులు 108కు ఫోన్ చేయగా, ఇదిగో వస్తుంది.. అదిగో వస్తుంది.. అంటూ 108 సిబ్బంది కాలయాపన చేయడంతో ఆటోలో సాంబశివరావును జీజీహెచ్‌కు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో అక్కడ నుంచి ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. సమాచారం తెలుసుకున్న ఈస్ట్ ట్రాఫిక్ సీఐ పూర్ణచంద్రరావు సిబ్బందితో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను నియంత్రించారు. బస్సు డ్రైవర్ పరారీలో ఉన్నాడు. మృతురాలు శివపార్వతి పెద్ద కుమారుడికి ఇటీవల నిశ్చితార్థం అయింది. 2019 ఫిబ్రవరి 9వ తేదీన వివాహం జరగాల్సి ఉంది. పోలీసులు శివపార్వతి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం జీజీహెచ్‌కు తరలించారు. ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
చంపుతున్న స్వైన్‌ఫ్లూ
తూర్పుగోదావరి, కాకినాడ సిటీ: జిల్లాలో స్వైన్‌ఫ్లూ స్వైరవిహారం చేస్తోంది. రెండో రోజుల్లో ఇద్దరు ఈ వ్యాధి లక్షణాలతో కాకినాడ జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ మృతి చెందారు. అమలాపురంలోని ఈదరపల్లికి చెందిన తిరుమనాథం వీరవెంకట సత్యనారాయణమ్మ (36) స్వైన్‌ఫ్లూ వ్యాధికి చికిత్స పొందుతూ కాకినాడ జీజీహెచ్‌లో బుధవారం మృతి చెందింది. అలాగే బిక్కవోలు మండలం బలభద్రపురానికి చెందిన బొండా మేరీ (34) అనే ఆమె అక్టోబర్ 30న కాకినాడ జీజీహెచ్‌లో స్వైన్‌ఫ్లూ వ్యాధి లక్షణాలతో చేరగా, ఆమెకు స్వైన్‌ఫ్లూ లక్షణాలు కన్పించడంతో బుధవారం రాత్రి టెస్ట్‌లకు బ్లడ్ శాంపిళ్లు తీసి విశాఖపట్నం పంపారు. ఈలోపే ఆమె గురువారం ఉదయం చనిపోయింది. డాక్టర్లు స్వైన్‌ఫ్లూ అనే అనుమానమే తప్ప, రిపోర్టు రాలేదని చెబుతున్నారు. ఇప్పటికే ఈ వ్యాధి లక్షణాలతో రాజమహేంద్రవరంలో ఇద్దరు, కాకినాడ రూరల్ మండలంలోని ఒకరు, అల్లవరం మండలం కొమరిగిరిపట్నానికి చెందిన ఒక మహిళ స్వైన్‌ఫ్లూ బారిన పడి కాస్త కుదుటపడి ఇళ్లకు చేరుకున్నారు. జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో స్వైన్‌ఫ్లూ లక్షణాలు స్పష్టంగా కన్పిస్తున్నా అధికార యంత్రాంగం చీమకుట్టినట్టు కూడా లేకుండా వ్యవహరిస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మొన్నటి వరకు రాజమహేంద్రవరం, కాకినాడ రూరల్ నియోజకవర్గాలకు పరిమితమైన ఈ స్వైన్‌ఫ్లూ కేసులు నేడు అమలాపురం, బిక్కవోలు, కాకినాడ సిటీ నియోజకవర్గాల పరిధిలో కనిపిస్తుండడంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. జిల్లా కేంద్రం కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో కనీసం స్వైన్‌ఫ్లూకి సంబంధించి పరీక్ష ల్యాబ్ లేకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇక్కడ అన్ని సౌకర్యాలతో స్వైన్‌ప్లూ వ్యాధిగ్రస్తులకు ప్రత్యేక వార్డు ఏర్పాటు చేశామని చెబుతున్న వైద్యాధికారులు కేసుల వస్తే వారికి కనీసం వెంటిలేటర్లు కూడా అందించలేని పరిస్థితుల్లో ఉన్నారు. దానికి తోడు ఒక వార్డునే కేటాయించారు. ఈ సీజన్లో ఇప్పటికి ఏడు కేసులు నమోదయ్యాయి. పేరు వింటేనే హడల్ కొన్ని రోజులుగా చల్లటి వాతావరణం నెలకొనడంతో హెచ్–1ఎన్–1 వైరస్ చాపకింద నీరులా విస్తరిస్తోంది. చలితోపాటు గాలులు వీస్తుండడంతో జలుబు, చలి జ్వరం, లక్షణాలతో ఉన్నవారు పెరుగుతున్నారు. వారిలో హెచ్–1ఎన్–1 వైరస్ కారక క్రిములు వృద్ధి చెందుతున్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇన్ప్లూయంజా ఏ అనే వైరస్ వల్ల వ్యాధి ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతుంది. కేవలం గాలి వాహకంగా వ్యాప్తి చెందే స్వైన్‌ఫ్లూ జ్వరంలా మొదలై ఊపిరితిత్తుల అంతర భాగంలోకి పాకడం వల్ల అది ప్రాణాంతక వ్యాధిలా మారుతోంది. సకాలంలో మెరుగైన చికిత్స తీసుకోకుంటే ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. ఈ లక్షణాలుంటే మందులు వాడిన 48 గంటల్లో తగ్గకపోయినా ప్రధానంగా శ్వాస తీసుకోవడం ఇబ్బందికరంగా మారినా వెంటనే దగ్గర్లో ఉన్న వైద్యులను సంప్రదించాలి. ముఖ్యంగా మధుమేహం, చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణులు, ఆస్తమా రోగులు, ఇతరుల కంటే ఈ వైరస్ సోకడానికి దాదాపు 80శాతం అవకాశం ఎక్కువని వైద్యులు చెబుతున్నారు. బలభద్రపురానికి చెందిన మహిళ మృతి బిక్కవోలు (అనపర్తి): స్వైన్‌ఫ్లూతో కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చేరిన బలభద్రపురం ఎస్సీ పేటకు చెందిన బి.మేరి చికిత్స పొందుతూ గురువారం మృతి చెందింది. వారం రోజుల పాటు అనపర్తి సీహెచ్‌సీ, కాకినాడ ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స తీసుకున్న ఆమె బుధవారం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చేరిన విషయం విదితమే. ఆమె రక్తం, కళ్లె పరీక్షల నిమిత్తం విశాఖపట్నం పంపించగా గురువారం రిపోర్టులు రావలసి ఉంది. అయితే ఇంతలోనే ఆమె మృతి చెందింది. కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి నుంచి అందిన సమాచారం మేరకు బిక్కవోలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యురాలు చంద్రకుమారి గురువారం ఎస్సీపేటలో వైద్య శిబిరాన్ని నిర్వహించారు. 74 మందిని పరీక్షించగా నలుగురికి జ్వరం సోకినట్టు గుర్తించి వైద్య సహాయం అందజేస్తున్నట్టు తెలిపారు. అయితే పారిశుద్ధ్య లోపంతో పాటు వైద్య ఆరోగ్యశాఖాధికారుల ఉదాసీనత కారణంగానే మేరికి ప్రాణాంతక వ్యాధి సోకి మరణించిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. వ్యాధులు ఉధృతంగా ఉండే ఈ రోజుల్లోనైనా పంచాయతీరాజ్, ఆరోగ్యశాఖాధికారులు సమన్వయంతో పని చేసి ప్రాణాంతక రోగాల నుంచి రక్షించాలని వారు కోరుతున్నారు. వైద్య శిబిరం నిర్వహిస్తున్న డాక్టర్ చంద్రకుమారి ప్రత్యేక వార్డు ఏర్పాటు జనరల్ ఆసుపత్రిలో స్వైన్‌ఫ్లూ అనుమానితులు, పాజిటివ్ వచ్చిన వారికి ప్రత్యేకంగా వార్డు ఏర్పాటు చేశాం. వ్యాధిగ్రస్తులకు అవసరమైన మందులు కూడా అందుబాటులో ఉంచాం. జనసంచారం, సమూహం వద్ద మాస్కులు ధరించాలి. ఎప్పటికప్పుడు చేతులు శుభ్రం చేసుకోవాలి. వ్యాధిగ్రస్తులు తుమ్మినా, దగ్గినా చేతిని అడ్డుపెట్టుకోవాలి. మంచి పౌష్టికాహారం తీసుకోవాలి. – డాక్టర్ టీఎస్ఆర్ మూర్తి, జిల్లా వైద్యాధికారి -
బస్సు ఢీకొని యువతి దుర్మరణం
ఆనందపురం(భీమిలి): మండలంలోని వేములవలస జాతీయ రహదారిపై బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువతి తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందగా మరో యువతి గాయపడి చికిత్స పొందుతోంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నగరంలోని విజయా మెడికల్ సెంటర్లో పని చేస్తున్న చలపతి మాలతి, మల్లేశ్వరిలు ఒక వాహనంపై వారితో పాటు పలువురు వాహనాలపై తగరపువలసలో ఉన్న తమ స్నేహితురాలు పాపకు జరుగుతున్న నామకరణ కార్యక్రమంలో పాల్గొనడానికని విశాఖ నుంచి బయలుదేరి వెళ్తున్నారు. వారి ద్విచక్ర వాహనాలు మండలంలోని వేములవలస జాతీయ రహదారిపైకి చేరుకునే సరికి వెనుక వైపు నుంచి వస్తున్న విశాఖ నుంచి రాజాం వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనం వెనుక వైపు కూర్చున్న చలపతి మాలతి(26) రోడ్డుపై తూలి పడడంతో ఆర్టీసీ బస్సు వెనుక టైరు తలపై నుంచి వెళ్లి పోయింది. ఈ సంఘటనలో మాలతి తల నుజ్జునుజ్జు కావడంతో అక్కడికక్కడే మృతి చెందగా ద్విచక్ర వాహనాన్ని నడుపుతున్న మల్లేశ్వరి రోడ్డుపై పడిపోయి గాయాలు పాలయింది. మృతి చెందిన మాలతి విజయా మెడికల్ సెంటర్లో రిసెప్సనిస్ట్‌గా పని చేస్తుండగా ఆమెకు ఇటీవలే ఓ పాప జన్మించిందని పొలీసులు తెలిపారు. సంఘటనా స్థలానికి ఎస్ఐలు శ్రీనివాస్, గణేష్, ట్రాఫిక్ ఎస్ఐ సోమరాజు చేరుకున్నారు. ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా చర్యలు చేపట్టి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భీమిలి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆర్టీసీ బస్సు డ్రైవర్, కండక్టర్లను అదుపులోకి తీసుకున్న ఆనందపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఫోన్ కోసం బైక్‌పై నుంచి..
ప్రకాశం, పొదిలి: సెల్ ఫోన్ జారి కిందపడుతుండగా దానిని అందుకునే ప్రయత్నంలో మోటారు సైకిల్ పై నుంచి జారిపడిన వివాహిత మృతి చెందింది. ఈ సంఘటన మండలంలోని సలకనూతల వద్ద శుక్రవారం జరిగింది. పట్టణానికి చెందిన ఊటుకూరి వెంకట ప్రసాద్ భార్య విజయలక్ష్మి(45) పట్ణణంలో మీ సేవ సెంటర్ నిర్వహిస్తుంటారు. ప్రసాద్ వైద్య ఆరోగ్య శాఖలో కాంట్రాక్ట్ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో బాధితురాలు సోదరునితో కలిసి మోటారు సైకిల్‌పై దొనకొండ అడ్డరోడ్డు వైపు వెళుతున్నారు. ఆ సమయంలో సెల్ ఫోన్ మాట్లాడుతుండగా అది కిందకు జారింది. దీంతో అది కింద పడకుండా పట్టుకునే ప్రయత్నంలో విజయలక్ష్మి మోటారు సైకిల్ నుంచి జారి పడింది. తలకు గాయాలై అక్కడికక్కడే మృతి చెందింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పోలీసులు వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. భర్త, పిల్లలు, బంధువులు విజయలక్ష్మి మృతదేహం భోరున విలపించారు. -
ర్యాష్ డ్రైవింగ్.. మహిళ మృతి
సాక్షి, ఆదిలాబాద్ : ఆటో డ్రైవర్ నిర్లక్ష్యానికి ఓ నిండు ప్రాణం బలైంది. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లాలో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాలివి.. బస్టాండ్ సమీపంలో ఓ వ్యక్తి రోడ్డు క్రాస్ అవుతున్నాడు. అదే సమయంలో అటువైపుగా ఓ ఆటో వేగంతో దూసుకొచ్చింది. రోడ్డు క్రాస్ అవుతున్న వ్యక్తిని తప్పించబోయి ఆటో డివైడర్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఓ మహిళ సంఘటన స్థలంలోనే మృతి చెందగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం క్షతగాత్రులను దగ్గరలో ఉన్న ఆస్పత్రికి తరలించారు. ఆటో డ్రైవర్ పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు సమాచారం. రోడ్డు క్రాస్ అవుతున్న వ్యక్తిని ఆటో ఢీకొట్టడంతో అతడికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. ర్యాస్ డ్రైవింగ్ ప్రమాదానికి కారణమని స్థానికులు చెబుతున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. అంతేకాక ప్రమాద సమయంలో అక్కడున్న కొందర్ని అడిగి సమాచారం సేకరించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఆటో డ్రైవర్ నిర్లక్ష్యానికి ఓ నిండు ప్రాణం బలి
-
ఇంజక్షన్ వికటించి మహిళ మృతి
తాడితోట (రాజమహేంద్రవరం): ఇంజక్షన్ వికటించి ఓ మహిళ మృతి చెందింది. కోరుకొండ మండలం కణుపురు గ్రామానికి చెందిన దొడ్డి అమ్మాజీ(55) తలలో నరాల బలహీనత గురించి వైద్యం చేయించుకునేందుకు సోమవారం రాజమహేంద్రవరం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చింది. అక్కడ డ్యూటీ డాక్టర్ నాయక్ ఆమెను పరీక్షించి ఇంజక్షన్ చేయమంటూ డ్యూటీ నర్సుకు అప్పగించారు. అయితే ఇంజక్షన్ చేసిన కొద్ది క్షణాలకే ఆ మహిళ మృతి చెందింది. దీంతో మృతురాలి బంధువులు ఆసుపత్రి వద్ద ఆందోళన నిర్వహించారు. వైఎస్సార్ సీపీ కేంద్ర పాలక మండలి సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొని మృతురాలి కుటుంబానికి న్యాయం చేయాలని, మృతికి కారణమైన నర్సుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇంజక్షన్ ఒకేసారి చేయకుండా సెలైన్ బాటిల్ ద్వారా ఎక్కించాలని సూచించినా నర్సు పట్టించుకోకుండా ఇంజక్షన్ చేసిందని, అందువల్లే ఆమె మృతి చెందినట్టు బంధువులు ఆరోపించారు. సంఘటనపై డాక్టర్లతో ఆమె చర్చించారు. డాక్టర్లు, నర్సుల నిర్లక్ష్యంపై నిలదీశారు. మరోవైపు మృతురాలి బంధువులు ఆసుపత్రి ముందు బైఠాయించి ఆందోళన చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నాయకుడు శివ, బీసీ యువజన సంఘం నాయకులు దాస్యం ప్రసాద్, మృతురాలి బంధువులు పాల్గొన్నారు. -
ఆస్పత్రిలో గుర్తు తెలియని మహిళ
కడ్తాల్(కల్వకుర్తి) రంగారెడ్డి : గుర్తు తెలియని మహిళ కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందింది. సంఘటనకు సంబంధించి ఎస్ఐ సుందరయ్య తెలిపిన వివరాలు.. ఈ నెల 4వ తేదీన గుర్తు తెలియని మహిళ(50), మండల కేంద్రంలోని ప్రధాన రహదారి సమీపంలో అనారోగ్యంతో బాధపడుతూ పడి ఉంది. స్థానికుల సమాచారం మేరకు గుర్తు తెలియని మహిళను చికిత్స నిమిత్తం కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మృతి చెందింది. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. -
పెళ్లిలో గొడవ.. తొలి రోజే వధువు ఆత్మహత్య
సాక్షి, నల్గొండ/పెద్దఅడిశర్లపల్లి : ఎన్నో ఆశలతో అత్తారింట్లో అడుగు పెట్టాల్సిన నవ వధువు తనువు చాలించింది. పెళ్లి వేడుకలో జరిగిన గొడవతో మనస్తాపానికి గురై పెళ్లి రోజు రాత్రి నెయిల్ పాలిష్ తాగి ఆత్మహత్యకు యత్నించగా చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతిచెందింది. ఈ ఘటన పీఏపల్లి మండలంలోని గుడిపల్లిలో చోటు చేసుకుంది. బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. పీఏపల్లి మండలం గుడిపల్లికి చెందిన బూరుగు వెంకటయ్య, యశోద దంపతుల కుమార్తె కల్పన(23)కు చింతపల్లి మండలం గొడుగుండ్లకు చెందిన రాజుతో ఈ నెల 19న గొడుగుండ్లలో వివాహం జరిగింది. అయితే పెళ్లి రోజున కట్నకానుకల విషయం.. ఇరు కుటుంబీకుల మధ్య గొడవకు దారి తీసింది. ఈ గొడవతో కల్పన మనస్తాపం చెందింది. ఈ క్రమంలోనే పెళ్లి జరిగిన రాత్రి గుడిపల్లిలోని ఇంట్లో నెయిల్ పాలిష్ తాగింది. గమనించిన కుటుంబీకులు చికిత్స నిమిత్తం నల్లగొండలోని ఆస్పత్రికి తరలించగా శనివారం రాత్రి మృతి చెందింది. నవ వధువు మృతితో సందడిగా ఉండాల్సిన ఇంట్లో విషాదం నిండింది. బంధువుల రోదనలతో గ్రామంలోనూ విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ విషయమై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. -
మొబైల్ పేలి.. మహిళ మృతి
సాక్షి, కడప : నేడు అక్కడక్కడ మొబైల్ పేలి మృత్యువాత పడుతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. అలాంటి సంఘటన వైఎస్సార్ జిల్లా చక్రాయపేట మండలం కల్లూరి పల్లె తండాలో ఆదివారం చోటుచేసుకుంది. వివరాలివి.. బుక్కే శాంతమ్మ తన మొబైల్‌కు ఛార్జింగ్ పెట్టింది. కాసేపు తర్వాత ఛార్జింగ్ పెట్టిన మొబైల్ ఒక్కసారిగా పేలిపోయింది. దీంతో తీవ్రంగా గాయపడిన శాంతమ్మ అక్కడిక్కడే మృతి చెందింది. ఈ సంఘటనతో ఆ గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. ఆమె అక్క కుమారుడు ఈశ్వర్ నాయక్ హైదరాబాద్‌లో నివశిస్తున్నాడు. బంధువులకు సమాచారం అందించే క్రమంలో నాయక్‌కు ఫోన్ చేసి విషయం చెప్పారు. ఆమె మరణవార్త విని ఈశ్వర్ నాయక్ కూడా మృతి చెందాడు. -
చీమ చింతకాయల కోసం వెళ్లి..
చెన్నారావుపేట: చీమ చింతకాయల కోసం వెళ్లి ప్రమాదవశాత్తు బావిలో పడి మహిళ మృతి చెందిన సంఘటన వరంగల్ రూరల్ జిల్లాలోని చెన్నారావుపేట మండలం అమీనాబాద్ గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. ఏఎస్సై షేక్ షíఫీ, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మరాటి కోమల(45) తన వ్యవసాయ బావి వద్ద గొర్రెల మంద కావలికి వెళ్లింది. భర్త సాంబయ్య ఇంటి వద్ద ఉన్నాడు. మంద వద్ద ఉన్న కోమల బావికి సమీపంలో ఉన్న చీమ చింతకాయల చెట్టు వద్దకు కాయలు తెంపుకోవడానకి వెళ్లింది. బావి అంచున ఉన్న కర్రపై నిల్చోని చీమ చింతకాయలు కోస్తుండగా కర్ర విరిగి ప్రమాదవశాత్తు బావిలో పడి మృతి చెందింది. భర్త సాంబయ్య గొర్రెల మంద వద్దకు వెళ్లాడు. అక్కడ భార్య కోమల కనిపించకపోవడంతో చుట్టు పక్కల ప్రాంతాల్లో చూశాడు. ఎక్కడ కనిపించక పోవడంతో బావిలో చూడగా కోమల అందులో పడి శవమై తేలింది. గ్రామస్తుల సాయంతో మృత దేహాన్ని బయటికి తీశారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సాంబయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై తెలిపారు. -
గూడు చెదిరింది..గుండె ఆగింది
అల్గునూర్(మానకొండూర్): వారిది పేద కుటుంబం. ఇంటిపెద్ద గతంలోనే కాలం చేశాడు. తల్లి, ముగ్గురు పిల్లలు వారికున్న చిన్నపాటి ఇంటిలో జీవనం సాగిస్తున్నారు. జాతీయరహదారికి పక్కన ఉండడంతో రోడ్డు వెడల్పు కార్యక్రమంలో గూడు కోల్పోయారు. కట్టుబట్టలతో రోడ్డున పడ్డారు. ఉన్న ఒక్కగానొక్క ఆధారం పోవడంతో ఆ తల్లి కొద్దిరోజులుగా బెంగపెట్టుకుంది. పరిహారం వస్తుందో లేదోనని దిగాలుతో మంగళవారం ఉదయం గుండెపోటుతో మృతిచెందింది. ఈసంఘటన తిమ్మాపూర్ మండలం అల్గునూర్‌లో జరిగింది. ముగ్గురు పిల్లలను అనాథలయ్యారు.. కుటుంబ సభ్యుల వివరాల మేరకు.. అల్గునూర్‌కు చెందిన అఫిదాబీ(43) భర్త గతంలోనే అనారోగ్యంతో మృతిచెందాడు. ఈమెకు ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు. మానసిక వికలాంగులరాలైన కూతురు ఇంటి వద్దనే ఉంటోంది. ఇద్దరు కొడుకులు కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. గతంలో కోర్టు కేసు కారణంగా అల్గునూర్‌లో ఆగిపోయిన రాజీవ్‌రహదారి విస్తరణ పనులు ఇటీవల మొదలయ్యాయి. అల్గునూర్ చౌరస్తాలో ఉన్న ఇళ్లకు సంబంధించిన పరిహారాన్ని ప్రభుత్వం హైకోర్టులో డిపాజిట్ చేసింది. కాంట్రాక్టర్ రోడ్డు పనులు ప్రారంభించారు. దీంతో రోడ్డుకిరువైపులా ఉన్న ఇళ్లను యజమానులే కూల్చేసుకుంటున్నారు. సొంత డబ్బులతో ఇల్లు కూల్చివేత అఫిదాబీ కూడా సొంత డబ్బులతో ఇటీవలే ఇల్లు కూల్చివేసుకుంది. అయితే గ్రామానికి చెందిన శ్రీనివాస్‌చారి సర్వేనంబర్ 501, 511లోని భూములు తమవే అని, వాటికి సబంధించిన పరిహారం తమకే ఇప్పించాలని గతంలోనే కోర్టులో కేసు వేశాడు. దీంతో ఇదే సర్వేనంబర్‌లో ఉన్న పలు ఇళ్ల యజమానులకు పరిహారం చెల్లింపు నిలిచిపోయింది. అఫిదాబీకి రావాల్సిన రూ.5 లక్షలు అందలేదు. ఇల్లు తప్ప వేరే ఆస్తిపాస్తులు లేని అఫిదాబీ కుటుంబం కట్టుబట్టలతో రోడ్డున పడ్డారు. కొద్దిరోజులుగా దిగాలుతో.. కోర్టు కేసు ఎప్పుడు తేలుతుంది.. పరిహారం ఎప్పుడు అందుతుందోనని కొన్నిరోజులుగా దిగాలు చెందుతోంది. ఈ క్రమంలో మంగళవారం ఉదయం గుండెపోటుతో కుప్పకూలింది. తహసీల్దార్ జగత్సింగ్ బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడారు. పరిహారం ఇప్పటికే కోర్టులో డిపాజిట్ అయిందని, బాధితులు ఆందోళన చెందొద్దని సూచించారు. -
వరంగల్ అర్భన్: పిడుగుపడి మహిళ మృతి