లారీ ఎక్కించి...తల్లిని చంపిన కొడుకు  | angry son murderd mother | Sakshi
Sakshi News home page

లారీ ఎక్కించి...తల్లిని చంపిన కొడుకు 

Published Tue, Dec 19 2017 8:04 AM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM

సాక్షి, బెంగళూరు: ఆస్తి వివాదంలో విచక్షణ కోల్పోయిన ఒక కొడుకు కన్నతల్లినే హత్య చేశాడు. ఈ సంఘటన బెంగళూరు పరిధిలో దేవనహళ్లిలో సోమవారం రాత్రి జరిగింది. జయశ్రీ (42) అనే మహిళ గత 20 ఏళ్లుగా భర్తనుంచి దూరంగా ఉంటోంది. తనకు దేవుడు పూనుతాడని, అందువల్ల సంసారం చేయలేనని ఒంటరిగా యలహంకలో నివసిస్తోంది. సోమవారం సాయంత్రం కలలో దేవుడు కనిపించాడని దేవనహళ్లిలో భర్తకు చెందిన స్థలంలో పూజలు చేయసాగింది. ఇది తెలిసి ఆమె కొడుకు అరుణ్‌ (22) వచ్చి ఆమెతో ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని గొడవకు దిగాడు. ఆమె వినిపించుకోకపోవడంతో తాను నడిపే లారీతో ఆమె మీద నుంచి పోనిచ్చాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మరణించగా, పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement