బెంజ్‌ కారుతో 20 ఏళ్ల యువకుడి బీభత్సం.. మహిళ మృతి | Bengaluru woman dies after being hit by Mercedes driven by drunk 20-year-old | Sakshi
Sakshi News home page

తప్ప తాగి బెంజ్‌ కారుతో 20 ఏళ్ల యువకుడి బీభత్సం.. మహిళ మృతి

Published Tue, Nov 5 2024 5:35 PM | Last Updated on Tue, Nov 5 2024 5:50 PM

Bengaluru woman dies after being hit by Mercedes driven by drunk 20-year-old

బెంగళూరు: పీకలదాకా తాగిన మత్తులో కారు నడిపిన ఓ యువకుడు.. మహిళ ప్రాణాలను బలి తీసుకున్నాడు. మెర్సిడెస్‌ బెంజ్‌ కారుతో ర్యాష్‌ డ్రైవింగ్‌ చేస్తూ రోడ్డు దాటుతున్న మహిళను ఢీకొట్టి ఆమె మృతికి కారణమయ్యాడు. ఈ ఘటన కర్ణాటక రాజధాని బెంగళూరులో జరిగింది. నగరంలోని కెంగేరి మెట్రో స్టేషన్ సమీపంలో శనివారం రాత్రి 30 ఏళ్ల సంధ్య రోడ్డు దాటడానికి ప్రయత్నిస్తోంది. అదే సమయంలో  మద్యం మత్తులో ఉన్న 20 ఏళ్ల విద్యార్థి ధనుష్‌ తన తండ్రి మెర్సిడెస్ బెంజ్ కారుతో వవేగంగా వస్తూ ఆమెను ఢీకొట్టాడు. దీంతో సంధ్య అక్కడికక్కడే మృతి చెందింది.

ప్రమాదం తర్వాత నిందితుడు అక్కడి నుండి పారిపోవడానికి ప్రయత్నించగా.. స్థానికులు అతన్ని పట్టుకొని చితకబాదారు. సమాచారం అందుకున్న కెంగేరి పోలీసులు నిందితుడు ధనుష్‌తోపాటు అతని స్నేహితుడుని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.

కాగా నిందితుడిని ప్రైవేట్ బస్ ట్రావెల్ కంపెనీ యజమాని అయిన వీర శివ కుమారుడు ధనుష్‌గా గుర్తించారు. అతని తండ్రి ఇటీవలే లగ్జరీ కారు మెర్సిడెస్‌ బెంజ్‌ను కొనుగోలు చేశాడు. ఈ క్రమంలో ధనుష్ ఈ కారును  తీసుకొని యశ్వంత్‌పూర్ సమీపంలోని ఒక మాల్‌కు స్నేహితుడితో కలిసి వెళ్లాడు. ఇద్దరు అక్కడ మద్యం తాగి మైసూరు రోడ్డుకు లాంగ్ డ్రైవ్‌కు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. కారు నడుపుతున్న ధనుష్ అతివేగంతో కెంగేరి స్టేషన్ కు చేరుకోగానే స్పీడ్ బ్రేకర్ ను గమనించలేక వాహనంపై నియంత్రణ కోల్పోయాడు. రోడ్డు దాటుతున్న మహిళను ఢీ కొట్టాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement