
బెంగళూరు: బైక్‌పై వెళ్తున్న విద్యార్థిని కిందపడగా వెనుక నుంచి వచ్చిన క్యాంటర్ ఆమె పైనుండి దూసుకెళ్లగా మరణించిన సంఘటన బెంగళూరు–మంగళూరు జాతీయ రహదారి మార్గంలో చోటుచేసుకుంది. మాగడి తాలూకా బ్యాడరహళ్లి గ్రామానికి చెందిన సిద్ధరాజు, జగదాంబ దంపతుల కుమార్తె ధనుశ్రీ (20) మృతురాలు. వివరాలు..
ఈమె మంగళూరు ఆళ్వాస్ కాలేజీలో ఇంజినీరింగ్ చదువుతోంది. గ్రామంలో జాతర ఉండడంతో వచ్చింది. తిరిగి మంగళూరు వెళ్లేందుకు తమ్ముడు రేణుకేశ్‌తో కలిసి బైక్‌పై కుణిగల్ రైల్వేస్టేషన్‌కు బయలుదేరింది. తాళెకెరె హ్యాండ్ పోస్టు వద్ద జాన్సన్ ఫ్యాక్టరీ ముందు ప్రమాదవశాత్తు బైక్ పైనుండి కిందపడింది. వెనుకనే వేగంగా వచ్చిన క్యాంటర్ ఆమెపై దూసుకుపోయింది. ప్రమాదంలో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. కుణిగల్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.