కాణిపాకం : ఆర్టీసీ అద్దె బస్సు ఢీకొని ఒక మహిళ చనిపోయింది. చిత్తూరు జిల్లా కాణిపాకం మండలం ఆగరంపల్లిలో శనివారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. గంగాధరనెల్లూరు మండలం వేలుకూరుకు చెందిన సారలమ్మ(48) రోడ్డు పక్కన నిలుచుని ఉండగా ప్రమాదవశాత్తు చిత్తూరు-2 డిపోనకు చెందిన బస్సు ఆమెను ఢీకొట్టింది. దీంతో ఆమె తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే చనిపోయింది. ఈ మేరకు ఎస్ఐ నరేశ్‌బాబు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.