
రాయచూరు రూరల్: నగరంలోని మహాబళేశ్వర సర్కిల్ వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందింది. మృతురాలిని కల్మలకు చెందిన తాయమ్మ(35)గా గుర్తించారు. ఈమె స ర్కిల్ సమీపంలోని దేవాల యం ముందు భాగంలో ద్వి చక్ర వాహనంపై బట్టలు విక్రయించేందుకు Ðవెళుతుండగా ఎదురుగా వచ్చిన లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెం దింది. తాయమ్మ మహాబళేశ్వర సర్కిల్ నుంచి సర్దార్ వల్లబ్‌భాయి పటేల్ సర్కిల్ వైపు ద్విచక్ర వాహనంపై వెళుతుండగా, సర్దార్ వల్లబ్‌భాయి పటేల్ సర్కిల్ వైపు నుంచి మహాబళేశ్వర సర్కిల్ వైపు వస్తున్న లారీ ఢీకొనడంతో ఈ దుర్ఘటన జరిగినట్లు ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ వీరనగౌడ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment