raichur
-
సింధనూరు ప్రమాదంపై వైఎస్ జగన్ దిగ్ఫ్రాంతి
గుంటూరు, సాక్షి: కర్ణాటక రాయ్‌చూర్ జిల్లా సింధనూర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏపీ విద్యార్థులు మరణించడంపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్ఫ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలుపుతూ, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ప్రభుత్వాన్ని కోరుతూ ఓ ప్రకటన విడుదల చేశారాయన. కర్నూలు జిల్లా మంత్రాలయం నుంచి కర్ణాటకలోని హంపీ ఆరాధన కార్యక్రమాలకు వెళ్తుండగా...వాహనం బోల్తా పడిన ఘటనలో ముగ్గురు వేదపాఠశాల విద్యార్ధులు, డ్రైవర్ చనిపోయిన ఘటన అత్యంత బాధాకరం. ఈ ఘటన తీవ్ర దిగ్భాంత్రికి గురి చేసింది. .చనిపోయిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడ్ని ప్రార్థిస్తున్నాను. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలబడాలని కోరుతున్నాను అని తన ప్రకటనలో పేర్కొన్నారాయన. In a tragic incident near Sindhanur taluk in #Raichur district, four people lost their lives when a vehicle carrying devotees overturned.The victims include three students from the Mantralayam Sanskrit School—Ayavandan (18), Sujendra (22), and Abhilash (20)—along with the… pic.twitter.com/ze2dALIfk1— South First (@TheSouthfirst) January 22, 2025మంగళవారం రాత్రి మంత్రాలయం నుంచి వేదపాఠశాల విద్యార్థులు కర్ణాటకలోని హంపి క్షేత్రానికి బయల్దేరారు. అక్కడ నరహరి తీర్థుల ఆరాధనకు 14 మంది విద్యార్థులతో వాహనం బయల్దేరింది. ఈ క్రమంలో సింధనూరు సమీపంలో వాహనం బోల్తాపడింది. డ్రైవర్ శివ, ముగ్గురు విద్యార్థులు అభిలాష, హైవదన, సుజేంద్ర అక్కడికక్కడే మృతిచెందారు. మరికొందరు విద్యార్థులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను సింధనూరు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్‌తో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రులు వేర్వేరు ప్రకటనల్లో దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. -
ఒకే కాన్పులో ముగ్గురు బిడ్డల జననం
రాయచూరు రూరల్: ఒకే కాన్పులో ముగ్గురు బిడ్డలను ప్రసవించిన ఘటన బెళగావి జిల్లాలో చోటు చేసుకుంది. రాయభాగ తాలూకా కంకణవాడి గ్రామ నివాసి పూజా మొదటి కాన్పులో ఇద్దరు మగ పిల్లలు, ఒక ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. గురువారం రాత్రి మూడలిగిలోని ప్రైవేట్ ఆస్పత్రిలో ఆమె కాన్పు కోసం చేరారు. ముగ్గురు పిల్లలు ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు మహంతేష్ కదాడి, మయూరి, విజయ్, బసవరాజ్ తెలిపారు. -
బీజేపీ నేతకు నో టికెట్.. మద్దతుదారుల ఆత్మహత్య యత్నం!
బెంగళూరు: లోక్‌సభ ఎన్నికల్లో బీవీ నాయక్ అనే నేతకు బీజేపీ టికెట్ నిరారించింది. దీంతో ఆయన అభిమానులు, కార్యకర్తలు తీవ్రంగా మనస్తాపం చెందారు. ఆయన అభిమానులు, మద్దతుదారులు బుధవారం రోడెక్కి నిరసన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో శివకుమార్, శివమూర్తి అనే ఇద్దరు బీవీ నాయక్ మద్దతుదారులు నిరసన తెలుపుతూ.. పొట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు యత్నించారు. దీంతో మరో మద్దతుదారుడు వెంటనే వారి వద్ద నుంచి పేట్రోల్ క్యాన్‌ను లాక్కున్నాడు. అక్కడితో ఆగకుండా బీవీ నాయక్ అభిమానులు టైర్లతో మెయిన్‌రోడ్డును దిగ్బంధం చేశారు. 2019లో బీవీ నాయక్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన సమీప బీజేపీ అభ్యర్థి రాజా అమరేశ్వర నాయక్ చేతిలో పరాజయం పాలయ్యారు. సుమారు 1,17,716 ఓట్లు తేడాతో ఓడిపోయారు. అనంతరం బీవీ నాయక్ బీజేపీలో చేరారు. మొదటి నుంచి బీవీ నాయక్ తనకు బీజేపీ అధిష్టానం రాయ్‌చూర్ ఎంపీ టికెట్ కేటాయిస్తుందని ఆశించారు. అయితే, మరోసారి రాయ్‌చూర్ పార్లమెంట్ స్థానాన్ని సిట్టింగ్ ఎంపీ రాజా అమరేశ్వర నాయక్‌కు కేటాయించింది బీజేపీ. దీంతో తమ నేతకు బీజేపీ టికెట్ కేటాయించలేదని బీవీ నాయక్ అభిమానులు, మద్దతుదారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. -
కర్ణాటక - తెలంగాణ సరిహద్దులో ఉన్న కృష్ణానది వంతెన
-
రేపటి నుంచి సిద్దిపేటలో రైలుకూత
సాక్షి, హైదరాబాద్: సిద్దిపేట–సికింద్రాబాద్ మార్గంలో రెండు ప్యాసింజర్ రైళ్లు మంగళవారం నుంచి రాకపోకలు సాగించనున్నాయి. వాణిజ్యపరంగా అభివృద్ధి చెందుతున్న సిద్దిపేటతో పాటు గజ్వేల్, ప్రముఖ పుణ్యక్షేత్రాలైన నాచగిరి (నాచారం), కొమురవెల్లి తదితర ప్రాంతాల మీదుగా సికింద్రాబాద్ స్టేషన్‌కు రోజుకు రెండు ప్యాసింజర్ రైళ్లు తిరుగుతాయి. తొలుత కాచిగూడ–సిద్దిపేట మధ్య రైళ్లు తిప్పాలని భావించినా, ఆయా ప్రాంతాల నుంచి ఎక్కువ మంది సికింద్రాబాద్‌కు వస్తున్నందున, సికింద్రాబాద్ స్టేషన్ నుంచే రైళ్లు నడపాలని దక్షిణమధ్య రైల్వే నిర్ణయించింది. సికింద్రాబాద్–సిద్దిపేట (నిడివి 116 కిలోమీటర్లు) డెమూ రైలుచార్జీ :రూ.60 హాల్ట్‌స్టేషన్లు: మల్కాజిగిరి, కెవలరీ బ్యారక్స్, బొల్లారం, గుండ్లపోచంపల్లి, మేడ్చల్, మనోహరాబాద్, నాచారం, బేగంపేట, గజ్వేల్, కొడకండ్ల, లకుడారం, దుద్దెడ, సిద్దిపేట ట్రిప్పులు ఇలా... సిద్దిపేటలో రైలు(నంబరు:07483) ఉదయం 6.45కు బయలుదేరి సికింద్రాబాద్‌కు 10.15కు చేరుకుంటుంది. తిరిగి సికింద్రాబాద్‌లో రైలు (నంబరు:07484) ఉదయం 10.35కు బయలుదేరి సిద్దిపేటకు మధ్యాహ్నం 1.45 గంటలకు చేరుకుంటుంది. తిరిగి సిద్దిపేటలో మధ్యాహ్నం 2.05 గంటలకు బయలుదేరి సిక్రింద్రాబాద్‌కు సాయంత్రం 5.10 గంటలకు చేరుకుంటుంది. సికింద్రాబాద్‌లో సాయంత్రం.5.45 గంటలకు బయలుదేరి సిద్దిపేటకు రాత్రి 8.40 గంటలకు చేరుకుంటుంది. అయితే ఉదయం సిద్దిపేట బదులు సికింద్రాబాద్ నుంచే రైలు బయలుదేరేలా చూడాలని స్థానిక నేతలు రైల్వేకు లేఖ రాశారు. దీనికి రైల్వే సమ్మతిస్తే ఈ వేళలు అటూ ఇటుగా మారుతాయి. సికింద్రాబాద్ జూబ్లీ బస్టాండ్ నుంచి సిద్దిపేటకు ఎక్స్‌ప్రెస్ బస్సుచార్జీ రూ.140. ప్రయాణ సమయం రెండున్నర గంటలు. రైలులో ప్రయాణ సమయం కాస్త ఎక్కువగా ఉన్నా, చార్జీ మాత్రం బస్సుతో పోలిస్తే సగానికంటే తక్కువగా ఉంది. రైలులో సికింద్రాబాద్–సిద్దిపేట మధ్య రానుపోను రూ.120 అవుతుండగా, పాస్ తీసుకుంటే రూ.90 ఉండొచ్చు. కృష్ణా టు రాయచూర్ రైలు రాకపోకలు షురూ మహబూబ్‌నగర్–మునీరాబాద్ (కర్ణాటక) మధ్య 234 కి.మీ. నిడివితో నిర్మించే రైల్వే ప్రాజెక్టులో భాగంగా తెలంగాణ సరిహద్దు ప్రాంతమైన కృష్ణా వరకు పనులు పూర్తి కావటంతో కొత్త రైలు సర్విసు ప్రారంభమైంది. కాచిగూడ–బెంగుళూరు మార్గంలో ఉన్న దేవరకద్ర నుంచి కొత్తలైన్ మొదలు, అటు సికింద్రాబాద్–వాడీ మార్గంలో ఉన్న కర్నాటక సరిహద్దు స్టేషన్ అయిన కృష్ణాకు ఇది అనుసంధానమైంది. దీంతో కాచిగూడ నుంచి కృష్ణా స్టేషన్ మీదుగా కర్ణాటకలోని రాయచూరు వరకు ప్యాసింజర్ డెమూ రైలు సర్విసును ఆదివారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ మహబూబ్‌నగర్‌లో జరిగిన బహిరంగసభలో జెండా ఊపి ప్రారంభించారు. దీంతో కృష్ణా నుంచి కొత్త రైలు బయలుదేరి కాచిగూడకు చేరుకుంది. సోమవారం నుంచి కాచిగూడ–రాయచూరు మధ్య ప్రారంభమవుతుంది. రైలుచార్జీ: 85.. రోజుకు ఒకటే ట్రిప్పు కాచిగూడ–రాయచూరు (నిడివి 221 కిలోమీటర్లు) ప్రస్తుతం స్పెషల్ సర్వీసుగా ఉన్నందున ఎక్స్‌ప్రెస్ చార్జీలున్నాయి. రెగ్యులర్ సర్విసుగా మారిన తర్వాత ఆర్డినరీ చార్జీలు అమలులోకి వస్తాయి. అప్పుడు చార్జీ రూ.50 ఉంటుంది.హాల్ట్‌స్టేషన్లు: కాచిగూడ, మలక్‌పేట, డబీర్‌పురా, యాకుత్‌పురా, ఉప్పుగూడ, ఫలక్‌నుమా, శివరాంపల్లి, బుద్వేల్, ఉందానగర్, తిమ్మాపూర్, కొత్తూరు, షాద్‌నగర్, బూర్గుల, బాలానగర్, రాజాపురా, గొల్లపల్లి, జడ్చర్ల, దివిటిపల్లి, యెనుగొండ, మహబూబ్‌నగర్, మన్యంకొండ, దేవరకద్ర, మరికల్, జక్లేర్, మక్తల్, మాగనూరు, కృష్ణా, చిక్సుగుర్, రాయచూరు రైలు (నంబరు:07477) వేళలు ఇలా కాచిగూడలో ఉదయం 9.40కి బయలు దేరి 11.50గంటలకు మహబూబ్‌నగర్, 12.14కు దేవరకద్ర, మధ్యాహ్నం 2 గంటలకు కృష్ణా, 3 గం.కు రాయచూరు చేరుకుంటుంది. తిరిగి రాయచూరులో మధ్యాహ్నం.3.30 గంటలకు రైలు(నంబరు:07478)బయలుదేరి 3.49కి కృష్ణా, 5.29కి దేవరకద్ర, 6.05కు మహబూబ్‌నగర్ రాత్రి 9.10గంటలకు కాచిగూడకు చేరుకుంటుంది. -
Video: కారు బీభత్సం.. గాల్లో ఎగిరిపడ్డ విద్యార్థులు
బెంగళూరు: ప్రమాదాలు ఎప్పుడు ఏ రూపంలో వస్తాయో ఎవరూ ఊహించలేరు. రోడ్డు ప్రమాదాలైతే మరీ దారుణం, మనం ఎంత జాగ్రత్తగా వెళ్లినప్పటికీ అవతల వాహనదారుడి నిర్లక్ష్యం వల్ల కూడా మనం ప్రమాదాల బారిన పడాల్సి వస్తుంది. తాజాగా ఓ కారు నడుపతున్న వ్యక్తి ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ బైక్‌ని ఢీ కొట్టింది. అనంతరం అటుగా నడుచుకుంటూ వెళ్తున్న విద్యార్థినులపైకి దూసుకెళ్లింది. ఈ దారుణ ఘటన కర్ణాటకలోని రాయచూర్ జిల్లాలో చోటు చే''కుంది. అతివేగంగా వెళ్తున్న కారు బైక్‌ను, ఇద్దరు విద్యార్థినులను ఢీకొట్టిన ఘోర రోడ్డు ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటన జూలై 18న రాయచూర్‌లోని శ్రీరామ దేవాలయం సమీపంలో జరిగినట్లు సమాచారం. నిమిషానికి పైగా నిడివి ఉన్న సీసీటీవీ ఫుటేజీలో కాలేజీ అమ్మాయిలు వాహనాలు వెళుతుండగా రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తున్నారు. కారు దూసుకువచ్చి బైక్‌ను ఢీ కొట్టి అనంతరం పక్కనే నడుచుకుంటూ వెళ్తున్న ఇద్దరు కాలేజీ అమ్మాయిలను ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్ పై వెళ్తున్న వ్యక్తి సహా విద్యార్థులు గాల్లోకి ఎగిరి రోడ్డుపై పడ్డారు. ఇంత ప్రమాదం జరిగినా కారు నడుపుతున్న వ్యక్తి కనీసం వారికి ఏమైందని కూడా చూడకుండా వేగంగా కారు నడుపుకుంటా వెళ్లిపోయాడు.ఇందుకు సంబంధించిన సీసీటీవీలో రికార్డ్ కాగా.. ప్రస్తుతం ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఘటనపై రాయచూరు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ప్రస్తుతం, బైకర్ రాయచూర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్)లో చికిత్స పొందుతున్నాడు. విద్యార్థులకు స్వల్ప గాయాలైనట్లు సమాచారం. ರಾಯಚೂರಿನ ರೈಲ್ವೆ ಸ್ಟೇಷನ್ ರಸ್ತೆಯಲ್ಲಿ ಕಾರು ಹಾಯ್ದ ರಭಸಕ್ಕೆ ಇಬ್ಬರು ವಿದ್ಯಾರ್ಥಿನಿಯರು ಹಾರಿ ಬಿದ್ದ ದೃಶ್ಯ#raichur pic.twitter.com/9BrsoFevc3 — Prajavani (@prajavani) July 26, 2023 చదవండి పాక్ వెళ్లి ప్రియున్ని పెళ్లాడిన అంజు.. ఆమె తండ్రి ఏమన్నాడంటే..? -
100% కాంగ్రెస్ గెలుస్తుంది.. ఇదే ప్రజల తీర్పు
-
రాయచూర్ బీజేపీ గెలుపుపై శివరాజ్ పాటిల్ రియాక్షన్
-
పని ఒత్తిడి తట్టుకోలేక ఏడ్చేసిన మహిళా ఉద్యోగి
-
నిర్భయంగా వచ్చి ఓటేయాలని ఓటర్లకు పిలుపు
-
Karnataka Elections: తెలుగువారి ప్రభావమున్న జిల్లాలో ఎవరిది పైచేయి
నారాయణపూర్, హోస్పేట ప్రాజెక్టుల నుంచి వచ్చే నీటితో.. గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి వచ్చి స్థిరపడిన తెలుగు ప్రజలు చేసే వ్యవసాయంతో కళకళలాడుతూ కనిపించే కర్ణాటకలోని రాయచూర్ జిల్లాలో గ్రామీణ ప్రాంతాలు రాజకీయంగా చైతన్యవంతంగా కనిపిస్తున్నాయి. ఇక్కడ పట్టణ ప్రాంతాల్లో పెద్దగా అభివృద్ధి కనిపించకపోవడం, పాలకుల నిర్లక్ష్యమే ఇందుకు కారణమనే అభిప్రాయం ఉన్నా.. గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం వ్యవసాయాభివృద్ధి కనిపిస్తుంది. రాయచూర్ (పట్టణ), రాయచూర్ (గ్రామీణ), సింధనూర్, మస్కి, మాన్వి, దేవదుర్గం, లింగుసూగుర్ నియోజకవర్గాలున్న రాయచూర్ జిల్లాలో.. ఈసారి ఎన్నికల్లో అనేక రాజకీయ, సామాజిక అంశాలు ప్రభావం చూపనున్నాయి. లింగాయత్, వాల్మీకి (నాయక్)లతోపాటు తెలుగు ప్రజలు ఇక్కడ ఎక్కువ. రెండు నియోజకవర్గాల్లో అయితే తెలుగు ప్రజలే నిర్ణాయక శక్తిగా ఉన్నారు. ఎన్నికల నేపథ్యంలో నియోజకవర్గాల వారీగా ‘సాక్షి’ క్షేత్రస్థాయి పరిశీలన ఇది. రాయచూర్ పట్టణ (అర్బన్) రాయచూర్ పట్టణ నియోజకవర్గంలో బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు నడుస్తోంది. బీజేపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే, లింగాయత్ వర్గానికి చెందిన శివరాజ్‌పాటిల్, కాంగ్రెస్ నుంచి మాజీ కౌన్సిలర్ మహ్మద్‌షా ఆలం, జేడీఎస్ నుంచి మాజీ మున్సిపల్ చైర్మన్, ఈడిగ సామాజిక వర్గానికి చెందిన వినయ్‌కుమార్ బరిలో ఉన్నారు. బీజేపీ అభ్యర్థి పాటిల్ ఇప్పటికే రెండుసార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే పార్టీ పరంగా బీజేపీకి సానుకూలత కనిపిస్తోంది. షా ఆలంకు టికెట్ ఇచ్చిన కాంగ్రెస్ మైనార్టీ ఓట్లపై ఆశలు పెట్టుకుంది. రాయచూరు గ్రామీణ (రూరల్) ఎస్టీ రిజర్వుడు నియోజకవర్గమైన రాయచూరు రూరల్‌లో కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే దద్దల్ బసన్నగౌడ, బీజేపీ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే తిప్పరాజు, జేడీఎస్ అభ్యర్థి, మాజీ జెడ్పీ సభ్యుడు చిన్న నర్సింహనాయక్ పోటీ చేస్తున్నారు. ఇక్కడి ఎమ్మెల్యేకు సాత్వికుడనే పేరుంది. పెద్దగా వ్యతిరేకత కనిపించడం లేదు. అయితే ఈ నియోజకవర్గానికి కృష్ణా, తుంగభద్ర జలాలు తీసుకురావడంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యం చూపాయన్న భావన ఉంది. కాంగ్రెస్ అభ్యర్థి బసన్నగౌడ పట్ల సానుకూలత కనిపిస్తోంది. సింధనూర్ జేడీఎస్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన వెంకట్రావ్ నాడగౌడ, కాంగ్రెస్ నుంచి అంపన్నగౌడ బాదర్లి బరిలో ఉండగా, బీజేపీ నుంచి కరియప్ప పోటీ చేస్తున్నారు. ఇక్కడ బీజేపీ ప్రభావం తక్కువే అయినా కరియప్ప కాంగ్రెస్ నుంచి వెళ్లి బీజేపీ టికెట్ తెచ్చుకోవడంతో.. త్రిముఖ పోటీ నెలకొంది. ఇక్కడ తెలుగువారు ఎక్కువ. వారు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నట్టు చెప్తున్నారు. లింగుసూగుర్ ఇది ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం. కాంగ్రెస్ నుంచి డీఎస్ ఉలిగేరి, బీజేపీ నుంచి మానప్ప వజ్జల్, జేడీఎస్ నుంచి సిద్ధూ బండి పోటీ చేస్తున్నారు. పైకి మాత్రం ఉలిగేరి, వజ్జల్ మధ్య పోటీ భీకరంగా కనిపిస్తోంది. అయితే, సిద్ధూ బండిపై సానుభూతి కనిపిస్తోంది. ఆయన గతంలో రెండు సార్లు పోటీ చేసి ఓడిపోవడంతో ఈసారి ఆయనకు ఓట్లు పడతాయనే అంచనాలున్నాయి. జేడీఎస్ ప్రభుత్వం నారాయణపూర్ ప్రాజెక్టు నుంచి ఈ నియోజకవర్గానికి సాగునీరు తీసుకువచ్చారనే అభిప్రాయం కలసిరానుంది. మస్కి ఇక్కడ పారీ్టలు మారినా ప్రత్యర్థులు పాతవారే. కాంగ్రెస్ నుంచి పోటీలో ఉన్న బసన్నగౌడ గతంలో బీజేపీలో పనిచేశారు. బీజేపీ నుంచి పోటీలో ఉన్న ప్రతాపగౌడ పాటిల్ అంతకుముందు కాంగ్రెస్‌లో పనిచేశారు. గత ఎన్నికల్లో, తర్వాత ఉప ఎన్నికల్లో వారు తలపడ్డారు. ఇప్పుడూ వీరి మధ్యనే పోటీ ఉంది. ఇక్కడ వాల్మీకి, లింగాయత్‌లు చెరోసగం బీజేపీ, కాంగ్రెస్‌ల వైపు ఉండగా.. ఇతర కులాలు, తెలుగు క్యాంపులు కాంగ్రెస్ వైపు కనిపిస్తున్నాయి. జేడీఎస్ నామమాత్రపు పోటీకి మాత్రమే పరిమితమనే అంచనాలున్నాయి. మాన్వి ఎస్టీ రిజర్వుడు నియోజకవర్గం మాన్విలో హోరాహోరీ పోరు నడుస్తోంది. జేడీఎస్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే రాజా వెంకటప్పనాయక్ బరిలో ఉన్నారు. కాంగ్రెస్ నుంచి అంపయ్యనాయక్, బీజేపీ నుంచి బీవీ నాయక్ పోటీ చేస్తున్నారు. లింగాయత్, వాల్మీకి వర్గాలు ప్రధాన ఓటర్లు అయినా తెలుగువారి ప్రభావం ఎక్కువే. మాన్వి జనరల్ నియోజకవర్గంగా ఉన్నప్పుడు బోసురాజు ఎమ్మెల్యేగా పనిచేశారు. తర్వాత వెంకటప్పనాయక్ ఎమ్మెల్యేగా గెలిచారు. ఈ ఇద్దరూ తెలుగు ఓటర్ల మద్దతుతోనే గెలిచారని అంచనా. ఈసారి కూడా వారు కాంగ్రెస్‌వైపు మొగ్గుచూపుతున్నారు. లింగాయత్‌లు బీజేపీ వైపు కనిపిస్తున్నారు. దేవదుర్గం ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్, బీజేపీ ఏమీ చేయలేదని, జేడీఎస్ అధికారంలో ఉన్నప్పుడే నారాయణపూర్ నుంచి సాగునీరు తీసుకువచ్చిందన్న సానుకూలత కనిపిస్తోంది. ఇక్కడ జేడీఎస్ నుంచి కరెమ్మ నాయక్, కాంగ్రెస్ నుంచి శ్రీదేవీ నాయక్, బీజేపీ నుంచి శివన్నగౌడ పోటీలో ఉన్నారు. జేడీఎస్ రెండు సార్లు టికెట్ ఇవ్వకపోయినా ఇండిపెండెంట్‌గా పోటీ చేసి రెండో స్థానంలో నిలిచిన కరెమ్మ నాయక్ పట్ల ప్రజల్లో సానుభూతి ఉంది. కాంగ్రెస్ అభ్యరి్థకి ఉన్న కుటుంబ రాజకీయ బలం కొంతమేర ప్రభావం చూపనుంది. -
ఎన్నికల వేళ రాయచూర్ రైతులు కీలక డిమాండ్లు
-
విద్యార్థిని అనుమానాస్పద మృతి.. లైంగిక దాడికి పాల్పడి హత్య?
సాక్షి, బెంగళూరు: పీయూసీ విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన లింగసూగురులో చోటు చేసుకుంది. అయితే తన కుమార్తెపై ప్రిన్సిపాల్ లైంగిక దాడికి పాల్పడి హత్య చేశాడని మృతురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. లింగసూగూరు తాలూకా గోనవాట్ల తండాకు చెందిన యువతి లింగసూగూరులోని ప్రైవేటు పీయూసీ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతోంది. అక్కడే హాస్టల్లో ఉంటోంది. ఏం జరిగిందో ఏమో కాని తన గదిలో శుక్రవారం ఉరి వేసుకున్న స్థితిలో విగతజీవిగా కనిపించింది. పోలీసులు వచ్చి పరిశీలించి మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. కాగా తన కుమార్తెను ప్రిన్సిపాల్ లైంగికంగా వేధించేవాడని, ఈక్రమంలోనే శుక్రవారం లైంగిక దాడికి పాల్పడి ఓణితోనే ఉరివేసి హత్య చేశాడని మృతురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ మంజునాథ తెలిపారు. చదవండి: ‘హాయ్ అమ్మా, నాన్న.. ఈ స్ట్రెస్ తీసుకోలేకపోతున్నాను.. క్షమించండి!’ -
ఇడియట్స్ అని తిడుతూ..సహనం కోల్పోయిన ఎమ్మెల్యే
కొందరూ ఎమ్మెల్యే కింద స్ధాయి ఉద్యోగులపై తమ ఆవేశాన్ని వెళ్లగక్కడం మామూలే. మరికొందరూ ఏకంగా చేయి జేసుకున్న సందర్భాలు ఉన్నాయి. అచ్చం అలానే ఇక్కడొక ఎమ్మెల్యే రోడ్డునిర్మాణ పనులను ఎందుకు ఆలస్యం చేస్తున్నారంటూ కాంట్రక్టర్ని తిడుతూ..భౌతిక దాడికి దిగారు. ఏకంగా ఆ కాంట్రాక్టర్ కళ్ల అద్దలను కూడా పగలు కొట్టేసి..తోసేస్తానంటూ బెదిరింపులకు దిగారు. ఈఘటన కర్ణాటకలోని రాయచూర్ జిల్లా కవితా పట్టణంలో చోటు చేసుకుంది. కర్ణాటకలోని రాయ్‌చూర్‌లో నిర్మాణ పనుల ప్రాజెక్టును తనిఖీ చేసేందుకు వచ్చిన జేడీఎస్ ఎమ్మెల్యే రాజా వెంకటప్ప సహనం కోల్పోయారు. ఈ పనుల్లోజాప్యం ఎందుకు జరుగుతోందంటూ నిర్మాణ పనుల బాధ్యులపై మండిపడ్డారు. అక్కడు ఉన్న కాంట్రాక్టర్‌ని చూస్తూ..ఇడియట్స్ మీరు గుల్బర్గా నంచి ఇక్కడికి ఎందుకు వలస వచ్చారని ప్రశ్నించారు. మన జిల్లా నుంచి ఉద్యోగానికి ఎవరూ లేరా? అంటూ తిట్టిపోశారు. మనవాళ్ల అయినతే ఈపాటికి పని పూర్తి అయిపోయేదంటూ విరుచుకుపడ్డారు. అంతేగాదుఎమ్మెల్యే ఆ కాంట్రాక్టర్ ముఖానికి ఉన్న కళ్లద్దాలను లాక్కొని పగలు కొట్టడమే గాక ఇక్కడ నుంచి తోసేస్తానని బెదరించారు. ఆ తర్వాత జేఈ శ్యామలప్ప అనే మరో వ్యక్తిని కూడా దుర్భాషలాడారు. వాస్తవానికి రోడ్డు నిర్మాన పనులు ప్రారంభించి ఏడాది దాటిని పూర్తవ్వకపోవడంపై కవితా పట్టణం స్థానికులు ఎమ్మెల్యేను ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జేడీఎస్ ఎమ్మెల్యే వెంకటప్ప రోడ్డు నిర్మాణ కాంట్రాక్టర్లపై మండిపడ్డారు. మీరంతా నాప్రతిష్టను దిగజార్చాలనే ప్రయత్నం చేస్తున్నారంటూ వారిపై ఆరోపణలు చేశారు. చెప్పుడు మాటలు వింటూ కావాలనే జాప్యం చేస్తూ..నాసిరకంగా పనులు చేస్తున్నారంటూ శారీరక దాడికి దిగారు. అందుకు సంబంధించిన దృశ్యాలు కొందరూ కెమరాలో బంధించడంతో ఈ ఘటన వెలుగు చూసింది. (చదవండి: మీకు జీవితఖైదు సరైనదే: షాక్ ఇచ్చిన హైకోర్టు) -
Bharat Jodo Yatra: నిరుద్యోగులకు మొండిచెయ్యి
రాయచూరు రూరల్: కాంగ్రెస్ భారత్ జోడో యాత్ర కర్నాటకలో ముగిసింది. రాష్ట్రంలో రాహుల్ గాంధీ 500 కిలోమీటర్లకుపైగా పాదయాత్ర చేశారు. శనివారం రాయచూర్ పట్టణంలో బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ‘‘కర్నాటకతో మా కుటుంబానికి సుదీర్ఘ అనుబంధముంది. నాన్నమ్మ ఇందిరా, అమ్మ సోనియా ఇక్కడి నుంచి గెలిచారు’’ అని గుర్తు చేసుకున్నారు. తమ కుటుంబానికి కర్ణాటక ప్రజలు అందించిన విజయాన్ని ఎప్పటికీ మర్చిపోలేనని అన్నారు. యువతకు ఉద్యోగాలిస్తామన్న హామీని ప్రధాని నరేంద్ర మోదీ తుంగలో తొక్కారని ధ్వజమెత్తారు. నిరుద్యోగులకు మొండిచెయ్యి చూపారని ఆరోపించారు. కర్ణాటకలో బీజేపీ నేతలు అన్ని పనుల్లో ‘40 శాతం కమీషన్’ వసూలు చేస్తున్నారని విమర్శించారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్లు దేశంలో హింస, ద్వేషాలను ప్రేరేపిస్తున్నాయని మండిపడ్డారు. 2023లో కర్ణాటక అసెంబ్లీ, 2024లో లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కచ్చితంగా విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. భవిష్యత్తులో రూ.500కు వంటగ్యాస్ సిలిండర్ అందజేస్తామన్నారు. ఎలాంటి షరతులు లేకుండా రూ.3 లక్షల వరకు వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తామన్నారు. భారత్ జోడో యాత్ర ఆదివారం ఉదయం తెలంగాణలోకి ప్రవేశించనుంది. -
స్నేహితుడితో వివాహేతర సంబంధం.. ఆపై భర్తతో కలిసి..
సాక్షి, రాయచూరు రూరల్: భర్త, కుటుంబ సభ్యులతో కలిసి ప్రియుడిని హత్య చేసిన ప్రేయసి ఘటన యాదగిరి జిల్లాలో ఆదివారం జరగగా ఆలస్యంగా వెలుగు చూసింది. గురుమట్కల్ తాలూకా కడేచూరు–బాడియాళ పారిశ్రామికవాడలో సిద్దార్థ(30) అనే వ్యక్తి దారుణహత్యకు గురయ్యాడు. ఘటన పూర్వాపరాలు...యాదగిరి తాలూకా యలసత్తికి చెందిన సిద్దార్థ బెంగళూరులో సొంతంగా రెండు కార్లను అద్దెకు తిప్పేవాడు. కడేచూరుకు చెందిన శ్రీదేవి(35) అనే మహిళకు శహపుర తాలూకాకు చెందిన బీ.నాగప్పతో పదేళ్ల క్రితం వివాహమైంది. బ్రతుకుదెరువు కోసం బెంగళూరు వెళ్లిన ఈ దంపతులు అక్కడ సిద్దార్థ నివాసం ఉంటున్న ఇంటి పక్కనే బాడుగకు ఇల్లు తీసుకుని నివాసమున్నారు. వివాహేతర సంబంధానికి దారి తీసిన స్నేహం ఈక్రమంలో సిద్దార్ధ, శ్రీదేవిల మధ్య ఏర్పడిన పరిచయం కాస్తా స్నేహంగా, చివరకు ప్రేమగా మారి వివాహేతర సంబంధానికి దారి తీసింది. శ్రీదేవితో కలిసి తమ సొంతూరికి మకాం మార్చిన సిద్దార్థ అనంతరం తన వద్ద ఉన్న కార్లను జల్సాల కోసం అమ్మేశాడు. అతని వద్ద ఉన్న సొమ్మునంతా కాజేసిన శ్రీదేవి తిరిగి భర్తను ఆశ్రయించింది. నాగప్పతో కలిసి ఉండేందుకు మళ్లీ బెంగళూరుకు చేరింది. మళ్లీ జీవనోపాధి కోసం సిద్దార్ధ కూడా బెంగళూరు చేరాడు. అయితే నాలుగేళ్ల క్రితం శ్రీదేవి, నాగప్ప కడేచూరుకు తిరిగొచ్చారు. శ్రీదేవిని చూడాలనుకుంటే సిద్దార్థ నేరుగా బెంగళూరు నుంచి వచ్చి కలిసి మాట్లాడేవాడు. ఓసారి శ్రీదేవి ఇకపై తన వద్దకు రావద్దని సిద్దార్థకు చెప్పడంతో జీవితంపై విరక్తితో ఆత్మహత్యాయత్నం చేశాడు. చదవండి: (బడిలోనే బార్.. ఆ టీచరమ్మ రూటే వేరు) వారించినా వస్తున్నాడనే... చివరికి సిద్దార్థ తల్లిదండ్రులు జరిగిందేదో జరిగింది, దాన్ని గురించి ఆలోచించకుండా యలసత్తిలో వ్యవసాయం చేసుకొమ్మన్నారు. అయినా ఇటీవల శ్రీదేవిని చూడాలనే ఆశతో యలసత్తి నుంచి సిద్దార్థ కడేచూరుకు వచ్చాడు. ఎంత వారించినా తరచూ వస్తున్నాడని కోపం పెంచుకున్న శ్రీదేవి, ఆమె భర్త నాగప్ప, నాగప్ప తల్లి మహదేవమ్మ, సోదరుడు తిరుపతి కలసి సిద్దార్ధను బాడియాళ పారిశ్రామికవాడలో కొట్టి హత్య చేశారని యాదగిరి జిల్లా ఎస్పీ వేదమూర్తి తెలిపారు. ఈ విషయంపై సమాచారం అందుకుని నలుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు ఆయన తెలిపారు. ఈ ఘటనపై సైదాపుర పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ కాళప్ప బడిగేర్ కేసు నమోదు చేసుకోగా దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ బసవరాజ్ తెలిపారు. -
పరువు హత్య: ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని.. యువతి సోదరులు..
రాయచూరు రూరల్: తమ సోదరిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడన్న కోపంతో యువతి సోదరులు పరువు హత్యకు పాల్పడిన ఘటన కలబుర్గి జిల్లాలో చోటు చేసుకుంది. అఫ్జల్‌పుర తాలూకా దేవల గాణగాపురలోని ఓ లాడ్జిలో విధులు నిర్వహిస్తున్న చంద్రకాంత్(24)కు అదే ఊరులో డిగ్రీ చదువుతున్న జేవర్గి తాలూకా హుల్లూరుకు చెందిన అమ్మాయితో పరిచయమైంది. ఆరు నెలలుగా వారిద్దరి మధ్య ప్రేమాయణం సాగింది. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుని ఇటీవల ఇళ్లు వదిలి వెళ్లారు. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన అమ్మాయి పెద్దలు వారి ఆచూకీని కనుగొని ఈ నెల 3న బెంగళూరు నుంచి పిలుచుకొచ్చారు. ఆ తర్వాత తన సోదరి అంటే ఇష్టం లేదని చెప్పాలని ఆమె సోదరులు ఈరప్ప, హులిగప్ప, రాకేష్‌లు చంద్రకాంత్‌పై శతవిధాలుగా ఒత్తిడి తెచ్చారు. చదవండి: (పెళ్లి చేసుకుందామని అడిగితే.. కడుపు మీద తన్నడంతో..) అందుకు చంద్రకాంత్ ససేమిరా అనడంతో అతనిని అంతమొందించాలని ప్రణాళిక రచించారు. ఈక్రమంలో మంగళవారం రాత్రి అతనిని లాడ్జిలోనే నిర్బంధించి క్రిమిసంహారక మందును తాపించి గొంతు నులిమి చంపి సమీపంలోని ఇంగళిగి వద్ద పొలంలో మృతదేహాన్ని పడేశారు. సమాచారం అందుకుని యువకుడి మృతదేహాన్ని స్వాధీనపరచుకున్న దేవల గాణగాపుర పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. చదవండి: (ఏఈ హత్య కేసు: భార్యే కుంటలో వేసి తొక్కి.. ఏమీ ఎరగనట్లు) -
అన్నా చెల్లి ప్రతిభ.. ఎస్ఐ ఉద్యోగానికి ఎంపిక
సాక్షి, రాయచూరు(కర్ణాటక): పోటీ ప్రపంచంలో అన్నా చెల్లి పోలీస్ శాఖలో ఉద్యోగాలు సాధించి పలువురికి స్ఫూర్తిగా నిలిచారు. లింగసుగూరు తాలూకా అశిహళతండాకు చెందిన కార్తీక్ రాథోడ్, రూపా రాథోడ్ ఉత్తమ ర్యాంకులు సాధించి ఎస్ఐ పోస్టులకు ఎంపికయ్యారు. తండ్రి గురుగుంట కళాశాలలో ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్నారు. వీరి ఎంపికపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: (ఆరేళ్లుగా పరిచయం.. కారులో తీసుకెళ్లి అత్యాచారం) -
విస్తుపోయిన వృద్ధురాలు.. ఖాతాలోకి రూ.10 కోట్లు
రాయచూరు: పింఛన్‌తో జీవితం సాగించే వృద్ధురాలి ఖాతాలోకి ఏకంగా రూ.10 కోట్ల నగదు జమ అయిన ఘటన కర్ణాటకలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రాయచూరు తాలూకా గుంజళ్లిలో నివాసం ఉంటున్న తాయమ్మ(65)కు నెలకు రూ.3వేలు పింఛన్ వస్తుంది. గత ఏడాది డిసెంబర్ 20న ఈ అవ్వ ఖాతాలోకి రూ.10 కోట్ల 38 లక్షల 62 వేల నగదు జమైంది. చదవండి: కారులో 6 ఎయిర్‌బ్యాగ్స్ ఉండాల్సిందే : గడ్కరీ అదే నెల 31న తాయమ్మ గుంజళ్లిలోని బ్యాంక్‌కు వెళ్లి పింఛన్ డ్రా చేసుకుని ఇంటికి వచ్చింది. ఆమె వెంట వెళ్లిన వ్యక్తి తాయమ్మ ఖాతాలో రూ.కోట్లలో నగదు ఉండటాన్ని గుర్తించాడు. రూ.8 లక్షలు డ్రా చేయాలని చెప్పి జనవరి 1న బ్యాంకుకు తీసుకొని వెళ్లాడు. బ్యాంకు అధికారులు అనుమానం వచ్చి ఖాతాను పరిశీలించగా కోట్లలో నగదు ఉండటంతో విస్తుపోయారు. దీనిపై విచారణ చేస్తామని, అప్పటివరకు డబ్బు డ్రా చేయవద్దని చెప్పి వారిని వెనక్కి పంపారు. బ్యాంకు అధికారులనుంచి ఎలాంటి సమాచారం అందకపోవడంతో వృద్ధురాలి భర్త రామన్న గురువారం రాయచూరు జిల్లా ఎస్పీ నిఖిల్‌కు ఫిర్యాదు చేశారు. -
సీమంతానికి ఏర్పాట్లు చేస్తుండగానే గర్భిణి ఆత్మహత్య
సాక్షి, రాయచూరు రూరల్: వరకట్న వేధింపులకు మరో అబల బలైంది. గదగ్ జిల్లాలో గర్భిణి అత్మహత్య ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు... గదగ్ జిల్లా గజేంద్ర గడకడ్డికి చెందిన లోకేష్ రాథోడ్ (27)కు ఏడాది క్రితం బాగల్‌కోట జిల్లా ఇలకల్ తాలూకా చిక్క కోడలగి తండాకు చెందిన నిర్మల (23)తో వివాహం జరిగింది. పెళ్లి సమయంలో అనుకున్నంత వరకట్నం తేలేదని నిర్మలను రోజూ చిత్రహింసలు పెడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇది భరించలేక శుక్రవారం రాత్రి నిర్మల ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. నాలుగు నెలల గర్భిణి కావడంతో ఆమె సీమంతానికి ఏర్పాట్లు చేస్తుండగానే ఈ దుర్ఘటన జరగడంతో బంధువుల రోదనలు మిన్నంటాయి. గజేంద్ర గడ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
కర్ణాటక: మహిళా ఎస్ఐ దాష్టీకం
సాక్షి, రాయచూరు(కర్ణాటక): మహిళలకు రక్షణ కల్పించాల్సిన ఎస్ఐ దాష్టీకానికి పాల్పడ్డారు. విత్తనాల కోసం వచ్చిన మహిళపై చేయిచేసుకుకొని దురుసుగా వ్యవహరించారు. ఈఘటన గురువారం యాదగిరి జిల్లా గురుమఠకల్‌లో చోటు చేసుకుంది. గురుమఠకల్‌లో గురువారం విత్తన పంపిణీ చేపట్టారు. దీంతో గ్రామాలనుంచి పెద్ద సంఖ్యలో రైతులు తరలివచ్చి క్యూలో నిలబడ్డారు. చదవండి: తెలంగాణలో 20 మంది డీఎస్పీలకు స్థానచలనం ఈ సందర్భంగా తోపులాట జరిగింది. దీంతో బందోబస్తు కోసం వచ్చిన ఎస్ఐ గంగమ్మ ఒక మహిళను కిందకు తోసి ఆమెపై చేయి చేసుకుంది. ఎస్ఐ తీరును నిరసిస్తూ మహిళలు ఆందోళనకు దిగడంతో పోలీసులు లాఠీచార్జ్ చేశారు. కాగా ఘటనపై విచారణ చేపడుతామని జిల్లా ఎస్పీ వేదమూర్తి ప్రకటించారు. చదవండి: మన కుటుంబ పరిస్థితి ఎందుకు ఇలా ఉందంటూ.. -
హైదరాబాదీ అల్లుడి చేతిలో తల్లీ కూతుళ్ల హతం
సాక్షి, రాయచూరు : కర్ణాటకలోని రాయచూరులో దారుణం చోటు చేసుకుంది. అల్లుడి చేతిలో తల్లీ కూతుళ్లు హత్యకు గురయ్యారు. మంగళవారం అర్ధరాత్రి తాలూకాలోని యరమరాస్‌లో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. వివరాలు.. యరమరాస్ ఇంజినీరింగ్ కళాశాల వద్ద నివాసం ఉంటున్న పారిశుధ్య కార్మికురాలు సంతోష్ (45)కి వైష్ణవి(25), ఆరతి(16) కూతుళ్లు. ఆరు నెలల క్రితం హైదరాబాద్‌కు చెందిన సాయి అనే యువకుడితో పెద్దకూతురు వైష్ణవికి వివాహం జరిపించారు. సాయి హైదరాబాద్‌లో వడ్డీ వ్యాపారి. పెళ్లయినప్పటి నుంచి భార్యను చిత్రహింసలకు గురి చేసేవాడు. దీంతో ఇటీవల వైష్ణవి పుట్టింటికి వచ్చింది. మంగళవారం రాత్రి సాయి అత్తవారింటికి వచ్చాడు. తనతో హైదరాబాద్‌కు రావాలని భార్యను ఒత్తిడి చేయడంతో ఆమె ససేమిరా అంది. చదవండి: అంతర్రాష్ట్ర క్రికెట్ బెట్టింగ్ రాకెట్ బ్లాస్ట్: రూ.2.21 కోట్ల విలువైన సొత్తు స్వాధీనం ఈ క్రమంలో ఉన్మాదిగా మారిన సాయి భార్యను, అడ్డు వచ్చిన అత్త సంతోషిని, మరదలు ఆరతిని కత్తితో పొడిచి పరారయ్యాడు. తీవ్ర గాయాలతో బాధితులు కొద్దిసేపటికే ప్రాణాలు విడిచారు. అర్ధరాత్రి సమయం కావడంతో అందరూ నిద్రలో ఉన్నందున ఘటన గురించి ఎవరికీ తెలియలేదు. బుధవారం ఉదయం సంతోషి బంధువులు పనిమీద ఇంటికి రాగా రక్తపు మడుగులో ముగ్గురి మృతదేహాలు కనిపించాయి. అక్కడికి చేరుకుని పోలీసులు విచారణ చేపట్టారు. ఎస్పీ శ్రీహరి బాబు ఘటన స్థలాన్ని పరిశీలించారు. రాయచూరు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి హంతకుడి కోసం గాలింపు చేపట్టారు. అతడి కోసం హైదరాబాద్‌కు పోలీసు బృందాలు వచ్చాయి. చదవండి: మనసిచ్చిన మేనబావ.. మనువాడుతానని మరదలుకు చెప్పి -
భర్త వేధింపులు: హాస్టల్లో తెలంగాణ విద్యార్థిని ఆత్మహత్య
రాయచూరు రూరల్: భర్త వేధింపులను భరించలేక దంత వైద్య విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన నగరంలో చోటు చేసుకుంది. నవోదయ దంత వైద్య కళాశాలలో చివరి ఏడాది చదువుతున్న శృతి (26) సోమవారం రాత్రి హాస్టల్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ప్రాణాలు తీసుకుందని మహిళా పీఎస్ సీఐ గుండూరావ్ తెలిపారు. తెలంగాణలోని వరంగల్ జిల్లా ఖాజీపేటకు చెందిన శృతికి గతేడాది డిసెంబర్లో పెళ్లయింది. భర్త బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజినీర్. లాక్డౌన్ కావడంతో సొంతూరులో ఇంటి నుంచి పనిలో ఉన్నాడు. తరచూ ఫోన్లో మాట్లాడుతూ అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడని శృతి బాధపడేది. దీంతో జీవితం మీద విరక్తి చెంది అఘాయిత్యానికి పాల్పడినట్లు సమాచారం. -
బర్త్‌డే పార్టీలో దెయ్యం.. వీడియో వైరల్
బెంగళూరు: బర్త్‌డే పార్టీ అంటే సాధారణంగా ఫ్రెండ్స్, కుటుంబ సభ్యులు, బంధువులు హాజరవుతారు. కానీ రాయ్‌చూర్‌లో జరిగిన ఓ బర్త్‌డే పార్టీకి అనుకోని అతిథి వచ్చింది. ఇలా వచ్చి అలా మెరుపుతీగలా మాయమైన ఈ అతిథి ప్రస్తుతం తెగ వైరలవుతోంది. ఎవరా గెస్ట్ అనుకుంటున్నారా.. దెయ్యం. వినగానే కాస్త భయం వేసినా ఇది మాత్రం వాస్తవం. పైగా వీడియో కూడా ఉంది. ఆ వివరాలు.. రాయ్‌చూర్‌లో ఓ వ్యక్తి పుట్టిన రోజు వేడుకను వెరైటీగా పెట్రోల్ బంక్‌లో ఏర్పాటు చేశారు. ఫ్రెండ్స్ అంతా వచ్చి.. కేక్ కట్ చేసి బర్త్‌డే బాయ్‌కి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మిగతా స్నేహితులు దీన్ని వీడియో తీసే పనిలో ఉన్నారు. యువకులంతా ఇలా ఎంజాయ్ చేస్తుండగా.. ఉన్నట్టుండి వీరి వెనక నుంచి ఓ ఆకారం పరిగెత్తడం వీడియోలో క్లియర్‌గా కనిపిస్తుంది. యూట్యూబ్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరలవుతోంది. దీన్ని చూసిన నెటిజనులు ‘‘ఇదంతా ట్రిక్, ఆత్మ కాదు పాడు కాదు.. పొగ అలా కనిపించింది’’ అని కామెంట్ చేస్తున్నారు. (చదవండి: ప్రాంక్ కాదు, అక్కడ నిజంగానే దెయ్యం!) -
అల్లుని కుటుంబంపై కత్తులతో దాడి
సాక్షి, రాయచూరు: ప్రేమపెళ్లి తరువాతి పరిణామాలతో రక్తం ఏరులైంది. ఏకంగా నలుగురు ప్రాణాలు కోల్పోయారు. సంతోషంలో మునిగితేలాల్సిన కొత్త జంట విషాదంతో దిగ్భ్రాంతికి గురైంది. రాయచూరు జిల్లా సింధనూరులో శనివారం ఈ మారణహోమం చోటుచేసుకుంది. ప్రేమపెళ్లి చేసుకున్న 6 నెలల తరువాత అమ్మాయి తండ్రి.. అబ్బాయి కుటుంబంపై దాడి చేసి హత్యాకాండకు పాల్పడ్డాడు. (బిడ్డా.. నేనూ నీ వద్దకే) ఎలా జరిగిందంటే వివరాలు.. సుక్కాలపేటలో ఉండే మౌనేష్ (25), మంజుల(22) ప్రేమించుకున్నారు. ఇద్దరిదీ ఒకే కులం. మౌనేష్ కుటుంబసభ్యులే పెళ్లిచేయగా అదే ఇంట్లో కాపురం పెట్టారు. అప్పటినుంచి కూతురిపై తండ్రి అంబణ్ణ (55) పట్టరాని కోపంతో ఉన్నాడు. ఈ తరుణంలో శనివారం మంజుల తండ్రి ఇంటికి వెళ్లి తనకు ఆస్తిలో రావాల్సిన వాటాను ఇవ్వాలని డిమాండ్ చేసింది. తండ్రి ఇటీవల రెండో పెళ్లి చేసుకోవడంతో తనకు ఆస్తి దక్కదేమోనని మంజుల భయపడింది. అతడు ఆగ్రహం పట్టలేక మీ అంతచూస్తానని బెదిరించడంతో ఆమె ఇంటికి వచ్చేసి భర్తతో సహా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి తండ్రిపై ఫిర్యాదు చేసే పనిలో ఉంది. (ఫెయిర్‌లో ఏముంది?) కత్తులు కొడవళ్లతో దాడి అన్నట్లుగానే అంబణ్ణ దొడ్డ ఫక్కీరప్ప(55), సన్న ఫక్కీరప్ప (60), సోమశేఖర్ అనే బంధువులతో కలిసి అల్లుని ఇంటికి వచ్చాడు. రావడంతోనే అల్లుని కుటుంబసభ్యులపై కత్తులు, కొడవళ్లతో విరుచుకుపడ్డారు. ఇష్టానుసారంగా పొడిచి, గొంతులు కోసి పరారయ్యారు. ఈ పాశవిక దాడిలో మౌనేష్ అన్న నాగరాజు(38), అక్క శ్రీదేవి (30), పెద్దన్న హనుమేష్ (40), తల్లి సుమిత్ర (55) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఇక తండ్రి వీరప్ప(65), రేవతి (20), తాయమ్మ (25) గాయాల పాలయ్యారు. రక్తపుమడుగులో శవాలు ఇంటి వద్ద రక్తపు మడుగుల్లో మృతదేహాలతో ఆ ప్రాంతం బీభత్సంగా తయారైంది. ఎటుచూసినా శవాలే కనిపించాయి. మంజుళ తండ్రి అంబణ్ణ ఇంటికి వెళ్లి ఆస్తిలో వాటా కావాలని కోరింది, దీంతో తండ్రి మౌనేష్ కుటుంబ సభ్యులను హత్య చేశాడని ఎస్పీ వేదమూర్తి తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం పట్టణ ఆస్పిత్రికి తరలించారు. నిందితులను పోలీసులు అరెస్టు చేసి కేసు దర్యాప్తు చేపట్టారు. -
14 ఏళ్లుగా తేనీరే ఆహారం
సాక్షి, రాయచూరు : ఆరోగ్యం సహకరించకున్నా రకరకాల వంటకాలు తినాలని నాలుక ఉవ్విళ్లూరుతుంటుంది. కానీ ఓ మహిళ కేవలం టీతో ఆకలిని చల్లార్చుకుంటోంది. 14 ఏళ్ల కిందట కుమారుడు మరణించగా, ఆనాటి నుంచి టీ తప్ప మరేమీ తీసుకోవడం లేదు. కర్ణాటకలో విజయపుర జిల్లా తాళికోటె తాలూకా సాసనూరుకు చెందిన శాంతమ్మ బిరాదార్ (75)కు ముగ్గురు ఆడపిల్లలు, కొడుకు ఉన్నారు. కొడుకు, భర్త చనిపోయిన తర్వాత జీవితంపై విరక్తి పెంచుకుంది. టీ తాగుతూ కాలం వెళ్లదీస్తోంది. చిన్న మఠంలో ఉంటున్న ఆమె అన్నం ముట్టదు. కుటుంబీకులు వైద్యుల వద్ద చూపించగా, ఆమె ఆరోగ్యం బాగుందని తేల్చారు. భోజనం చేయాలని వైద్యులు సూచించినా ఆమె మాత్రం రోజుకు 4 సార్లు టీ తాగుతూ ఆకలిని జయిస్తోంది. -
పేదరాలి ఇంటికి పెద్దసార్
రాయచూరు రూరల్: ఓ ఐపీఎస్ అధికారి అనుకుంటే ఫైవ్‌స్టార్ హోటల్ నుంచి టిఫిన్ వస్తుంది. పెద్ద పెద్ద చెఫ్‌లు వండిపెడతారు. కానీ ఆ ఎస్పీ ఓ చిన్న పూరిగుడిసెలో ముసలమ్మ చేసిన టిఫిన్‌ను పూరెగుడిసెలో ఆరగించి అందరినీ అబ్బురపరిచారు. జనంతో మమేకం కావడం ఎలాగో చూపించారు. ఆదివారం కర్ణాటకలో రాయచూరు జిల్లా మాన్వి తాలూకా కుర్డి గ్రామంలో ఎస్పీ వేదమూర్తి ఆధ్వర్యంలో యువత, ఉద్యోగులు స్వచ్ఛతా కార్యక్రమాన్ని చేపట్టారు. పాడుబడ్డ బావిని శుభ్రం చేసి, దాని చుట్టూ మొక్కలు నాటారు. ఎస్పీ వేదమూర్తి గ్రామంలో సంచరిస్తున్న సమయంలో పాలమ్మ (70) అనే వృద్ధురాలు ఆయనకు నమస్కారం చేసింది. బాగున్నావా అమ్మా అని ఎస్పీ ఆమెను పలకరించారు. ఉదయం ఏమైనా తిన్నారా?, తింటావా అని ఆమె ఎస్పీని ప్రశ్నించింది. ఎస్పీ సరేనంటూ ఆమె పూరిపాకలోకి వెళ్లారు. పాలమ్మ ఇచ్చిన జొన్నరొట్టే, శనగపిండి కూరని తిన్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతోంది. -
వారి మధ్య ప్రేమ?.. సీఐడీకి కీలక సమాచారం
రాయచూరు రూరల్/ కంప్లి: సివిల్ ఇంజనీరింగ్ విద్యార్థి మధు పత్తార్ అనుమానాస్పదంగా మృతి కేసు విచారణలో సీఐడీ అధికారులకు పలు విషయాలు బయట పడుతున్నాయి. అదనపు డీజీపీ సలీం నేతృత్వంలోని అధికారుల బృందం దర్యాప్తు సాగిస్తోంది. నిందితుడు సుదర్శన్ యాదవ్‌ను క్షుణ్ణంగా విచారించి సమాచారం రాబడుతున్నాయి. సీఐడీ ఎస్పీ శరణప్ప, డీఎస్పీ రవి శంకర్, సీఐ దిలీప్ కుమార్‌లు ఏడీజీపీతో పాటు విచారణలో పాల్గొంటున్నారు. ఏప్రిల్ 13న ఇంటి నుంచి బయల్దేరిన మధు పత్తార్ (23) 16వ తేదీన నగరంలోని మాణిక్‌ప్రభు ఆలయం వెనుక గుట్టల్లో ఉరివేసుకున్న స్థితిలో శవమై తేలిన సంగతి తెలిసిందే. నవోదయ ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతున్న మధు హత్య కేసులో నిందితుడిగా భావిస్తున్న సుదర్శన్ యాదవ్‌ల మధ్య ఎనిమిదేళ్ల నుంచి ప్రేమ వ్యవహారం కొనసాగుతున్నట్లు సమాచారం. దానికి సంబంధించి కొన్ని ఫోటోలు కూడా బయటకు వచ్చాయి. నగరంలోని ఒక ప్రైవేట్ పాఠశాలలో 8, 9, 10వ తరగతి, కళాశాలలో 11, 12వ తరగతుల వరకు క్లాస్మేట్లుగా ఉన్నారు. యాదవ్ బీకాంలో చేరగా మధు ఇంజనీరింగ్‌కు వేర్వేరు కాలేజీల్లో చేరారు. అతని ప్రవర్తన నచ్చక ఆమె దూరంగా ఉంది. అయినా ప్రేమిస్తున్నానంటూ వెంటపడేవాడు. ఇద్దరి మధ్య గొడవలు చోటు చేసుకోవడంతో మధును యాదవ్ హత్య చేశాడో, లేక మధునే ఆత్మహత్య చేసుకుందా? అనే అంశాలపై పూర్తి స్థాయిలో అధికారులు విచారణ చేస్తున్నారు.గత రెండు వారాలుగా సీఐడీ అధికారుల బృందం నగరంలోనే తిష్ట వేసి విచారణ సాగిస్తోంది. సీబీఐతో దర్యాప్తు చేయించాలి మధుపత్తార్ అనుమానాస్పద మృతి కేసును సీబీఐతో దర్యాప్తు చేయించాలని మంగళవారం ఏబీవీపీ తాలూకా శాఖ ర్యాలీని నిర్వహించి తహశీల్దార్‌కు వినతిప్రతాన్ని అందజేశారు. స్థానిక శారద పాఠశాల నుంచి ప్రారంభమైన ర్యాలీ ప్రముఖ మార్గాల మీదుగా తహాశీల్దార్ కార్యాలయానికి చేరారు. మధుపత్తార్ హత్యకు కారకులైన దోషులను బంధించి ఉరిశిక్ష వేయాలని నినాదాలు చేశారు. ఈ సందర్బంగా ఏబీవీపి తాలూకా శాఖా అధ్యక్షులు ఎం.శివబసవనగౌడ కార్తీక్, గీతా పాల్గొన్నారు. -
మధు హత్య కేసును సీబీఐకి అప్పగించాలి
సాక్షి, బెంగళూరు : రాయచూరులో ఇంజనీరింగ్ విద్యార్థిని మధు పత్తార్ అనుమానాస్పద హత్య కేసు సమగ్ర విచారణ కోసం సీబీఐకి అప్పగించాలని గాయత్రి విశ్వకర్మ మహిళా సంఘం అధ్యక్షురాలు, న్యాయవాది జానకీ తారానాథ్ డిమాండ్ చేశారు. ఆమె సోమవారం అఖిల భారత్ విద్యార్థి పరిషత్(ఏబీవీపీ) తాలూకా సమితి, గాయత్రి విశ్వకర్మ తాలూకా మహిళా సంఘం నేతృత్వంలో చేపట్టిన ఆందోళనలో పాల్గొని మాట్లాడారు. మహిళా కమిషన్ నివేదిక ప్రకారం ప్రతి సంవత్సరం 3600 మహిళలపై అత్యాచార కేసులు నమోదవడం శోచనీయన్నారు. ఇటీవల కాలంలో హాస్టళ్లల్లో ఉంటూ విద్యను అభ్యసిస్తున్న విద్యార్థినులు నిత్యం వేధింపులను అనుభవిస్తున్నారన్నారు. అందువల్ల విద్యార్థినులకు తగిన భద్రత కోసం ఇలాంటి కేసులను తక్షణమే విచారణ జరిపి నేరస్తులకు కఠిణ శిక్ష విధిస్తే విద్యార్థినులు, తల్లిదండ్రుల్లో ఆత్మస్థైర్యం వస్తుందన్నారు. అనంతరం ఏబీవీపీ కార్యదర్శి యువరాజ్ మాట్లాడుతూ రాయచూరు ఇంజనీరింగ్ కాలేజ్ వెనుక భాగంలోని అరణ్య ప్రాంతంలో ఈనెల 16న విద్యార్థిని మధు పత్తార్ అనుమానాస్పదంగా చనిపోయి శవం కుళ్లిపోయిన స్థితిలో లభించడం ఖండించదగ్గ విషయమన్నారు. విద్యార్థిని తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తమ కుమార్తె అదృశ్యమైందని ఇచ్చిన ఫిర్యాదును తీసుకోక పోవడం, సంఘటన వెలుగు చూసి 12 రోజులు అయినా ఇంక సంపూర్ణ విచారణ జరగక పోవడం, అత్యాచారం చేసి చంపారని పైకి కనబడినా ఇప్పటి వరకు ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి రిపోర్టు రాకపోవడం, నేరస్తులపై చార్జిషీట్ వేసి కోర్టుకు హాజరు పరచకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోందని ఆరోపించారు. ఈ కేసును తీవ్రంగా పరిగణించి నేరస్తులకు కఠిన శిక్ష పడేందకు సీబీఐకి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇదే రీతిలో రాబోయే రోజుల్లో రాయచూరు, కొప్పళ, బళ్లారి జిల్లాల్లో బంద్‌కు పిలుపునిచ్చి తీవ్ర నిరసన ర్యాలీ నిర్వహిస్తామని హెచ్చరించారు. అంతకు ముందు రాష్ట్ర ముఖ్యమంత్రికి తాలూకా తహసీల్దార్ ద్వారా మనవిపత్రాన్ని సమర్పించారు. విశ్వకర్మ సమాజం ముఖ్యనాయకులు, ఏబీవీపీ సంచాలకులు సంతోష్, వీరేశ్ కల్మండ్, విద్యార్థినులు చైత్రా, అశ్వని, సుచిత్రా, రాజేశ్వరి, సహనా తదితరులు పాల్గొన్నారు. -
మధు స్కూటీ తాళాలు, ఫోన్ అతనికి ఎలా వచ్చాయి
ఈ నెల 13వ తేదీన రాయచూ రు నగరం లో అదృశ్యమై 16వ తేదీన అక్క డి మాణిక్‌ప్రభు ఆల యం వెనుక గుట్టల్లో శవమై తేలిన సివిల్ ఇంజనీరింగ్ విద్యార్థిని మధు పత్తార్ అనుమానాస్పద మృతి కేసులో సీఐడీ విచారణలో పురోగతి నమోదైంది. నిందితున్ని 4 రోజుల కస్టడీకి తీసుకుని రహస్య ప్రదేశానికి తరలించారు. మరోవైపు మధు హంతకులను శిక్షించాలని రాయచూరుతో పాటు పలు చోట్ల ప్రజాసంఘాల ధర్నాలు ముమ్మరమయ్యాయి. రాయచూరు రూరల్: విద్యార్థిని మధు పత్తార్ (23) కేసులో ప్రధాన నిందితునిగా అనుమానిస్తున్న సుదర్శన్ యాదవ్ (29)ను సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. బుధవారం రాయచూరు జిల్లా ప్రధాన కోర్టులో హాజరుపరచిన సీఐడీ ఎస్పీ శరణప్ప నిందితుణ్ని విచారించడానికి 10 రోజులు కస్టడీకి ఇవ్వాలని కోర్టుకు విన్నవించారు. కోర్టు 4 రోజులకు మాత్రమే అనుమతించింది. సాయంత్రం నిందితున్ని జిల్లా జైలు నుంచి సీఐడీ అధికారులు విచారణకు తీసుకొని వెళ్లారు. ఇల్లు, కాలేజీలో సీఐడీ పరిశీలనలు మధు మృతిపై విచారణకు రాయచూరు వచ్చిన సీఐడీ అధికారుల బృందం బుధవారం మధు నివాసాన్ని పరిశీలించారు. సీఐడీ ఎస్పీ శరణప్ప, డీఎస్పీ రవిశంకర్, సీఐ దిలీప్ కుమార్ తదితర నలుగురు అధికారులు మధు తల్లిదండ్రులను కలిసి వారి వద్ద నుంచి సమాచారం సేకరించారు. తమ కుమార్తెను ఎవరో హత్య చేశారని,ఆమె ఆత్మహత్య చేసుకొనే వ్యక్తి కాదని వారు అధికారులకు తెలిపారు. మధు పుస్తకాలను తనిఖీ చేశారు. అలాగే మధు చదివిన నవోదయ ఇంజనీరింగ్ కళాశాలలో అధ్యాపకులను, ప్రిన్సిపాల్‌ను సీఐడీ అధికారులు కలిసి వివరాలను సేకరించారు. మధు హత్య కేసు దర్యాప్తులో ఆమె రాసిన డెత్‌నోట్ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీస్ కానిస్టేబుల్ సస్పెండ్? సుదర్శన్ యాదవ్ బావ (అక్కభర్త) ఆంజనేయులుసదర్‌బజార్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్. ఇతడు కంప్యూటర్ ఆపరేటర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. మధు తల్లిదండ్రులు రేణుక, నాగరాజులు మూడురోజుల క్రితం బళ్లారి ఐజీపీ నం జుండ స్వామిని కలిసి మధు మృతి కేసు లో ఆంజనేయులు ప్రమేయం ఉందని ఫిర్యాదు చేశారు. మధు స్కూటీ తాళాలు, మొబైల్ ఫోన్ ఆంజనేయులు చేతిలో ఉ న్నాయని, అవి అతనికి ఎలా వచ్చాయో విచారించాలని కోరారు. దీంతో ఉన్నతాధికారులు ఆంజనేయులను సస్పెండ్ చేసినట్లు తెలిసింది. ఈ విషయంపై ఎస్పీ కిశోర్‌బాబు, సీఐ రాజాసాబ్‌లను సంప్రదించగా స్పందన రాలేదు. తల్లిదండ్రుల ఫిర్యాదును పట్టించుకోలేదనేఆరోపణపై మహిళా పీఎస్ ఎస్ఐ బేబి మరియమ్మను కూడా సస్పెండ్ చేశారు.బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని గురువారం నుంచి ఆందోళనల్ని ఉధృతం చేయనున్నట్లు పలు విద్యార్థి, ప్రజాసంఘాలు తెలిపాయి. -
హంతకులను వదిలిపెట్టొద్దు
రాయచూరుతో పాటు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోన్న సివిల్ ఇంజనీరింగ్ విద్యార్థిని మధు పత్తార్ అనుమానాస్పద మృ తి కేసు విచారణను ప్రభుత్వం సీఐడీకి అప్పగించింది. ఈ మేరకు బ ళ్లారి ఐజీపీ రాయ చూరుకు వచ్చి సమీక్షించారు. తమ కంటివెలుగును కబళించిన హం తకులను పట్టుకుని శిక్షించా లని కన్నవారు డిమాండ్ చేశారు. రాయచూరు రూ రల్: తమ కూతురు విషయంలో న్యాయం చేయాలని సివిల్ ఇంజనీరింగ్ విద్యార్థిని మధు పత్తార్ తల్లిదండ్రులు రేణుక, నాగరాజ కోరారు. ఆదివారం రాయచూరుకు వచ్చిన బళ్లారి ఐజిపి నంజుండస్వామికి వారు వినతి పత్రం సమర్పించి మాట్లాడారు. తన కూతురుని చిత్రహింసలకు గురిచేసి హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించిన హంతకులకు కఠిన శిక్ష విధించాలన్నారు. కూతురిని బలిగొన్నవారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టరాదని కోరారు. కాగా, నేతాజీ నగర్ పోలీస్ స్టేషన్లో నిందితుడు సుదర్శన్‌ను ఆరుబయట కూర్చో బెట్టి సకల సౌకర్యాలు కల్పిస్తున్నారని, అతనికి రక్షణ కల్పించడంలో పోలీసుల ఆసక్తి ఏమిటో అర్థం కావడం లేదని వాపోయారు. ప్రత్యేక దర్యాప్తు బృందం: ఐజీపీ ఇంజనీరింగ్ విద్యార్థిని మధు పత్తార్ అనుమానాస్పద రీతిలో మృతిచెందింది, కేసు విచారణకు ప్రత్యేక బృం దాన్ని ఏర్పా టు చేశాం అని బళ్లారి ఐజీపీ నంజుండప్పస్వామి తెలిపారు. ఆయన జిల్లా ఎస్పీ కార్యాలయంలో మీడియా తో మాట్లాడారు. మధును హత్య చేసిన హంతకుల ను పట్టుకుంటామని తెలిపారు. విచారణ విషయంలో పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ జరిపి దోషులకు శిక్షలు విదించేలా చూస్తామన్నారు. ఈ కేసులో ఊహగానాలకు అవకాశం కల్పించరాదని అన్నారు. పోస్టుమార్టం, ఇతర నివేదికలు రావాల్సి ఉందన్నారు. కేసు విచారణ సిఐడికి అప్పగింత రాయచూరు నగరంలో ఇంజనీరింగ్ విద్యార్థిని మధు పత్తార్ (23) అనుమానస్పద మృతి కేసును రాష్ట్ర ప్రభుత్వం సీఐడీకి అప్పగించింది. నవోదయ ఇంజనీరింగ్ కాలేజీలో సివిల్ ఇంజనీరింగ్ రెండో ఏడాది చదువుతున్న మధు ఈ నెల 13న అదృశ్యం కావడం, 16న గుట్టల్లో ఉరివేసుకున్న స్థితిలో ఆమె మృతదేహం కనిపించడం తెలిసిందే. ప్రేమించలేదని అక్కసుతో ఒక యువకుడు ఆమెను అంతమొందించాడని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లా పోలీసుల అసమర్థతపై ప్రజాసంఘాలు మండిపడుతున్నాయి. సర్కారు ఈ నేపథ్యంలో కేసును సీఐడీకి అప్పగించింది. నిష్పక్షపాతంగా విచారణ జరిపి హంతకులకు శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలని హోంశాఖ ఆదేశించింది. -
రాయచూరులో మరో నిర్భయ ఘటన?
సాక్షి, రాయచూరు: ఉన్నత చదువులు చదివి ఉజ్వల భవితను అందుకుంటుందని ఆశించిన ముద్దుల కూతురు అనాథ శవమవుతుందని ఆ తల్లిదండ్రులు ఊహించలేకపోయారు. ప్రేమపేరుతో వెంటాడి వేధించిన ఓ యువకుడే ఆమెను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించాడని తల్లిదండ్రులు, ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నాయి. మధుకు సంఘీభావంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రదర్శనలు జరుగుతున్నాయి. నగరంలోని ఇంజనీరింగ్ కళాశాలలో సివిల్ ఇంజనీరింగ్ రెండో ఏడాది విద్యార్థిని మధు పత్తార్ (23) అనుమానాస్పద మృతి కేసు తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. మరో నిర్భయ ఘోరాన్ని తలపించే ఈ విషాదంపై సినీ, ఇతర ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా ఆవేదన వ్యక్తం చేస్తుండడం, తల్లిదండ్రులు తమ బిడ్డది ముమ్మాటికి హత్యేనని చెబుతుండడంతో చర్చనీయాంశమైంది. ఏం జరిగింది వివరాలు.. మధు పత్తార్ రాయచూరు నగరంలో ఐడీఎస్ఎంపీ లేఔట్లో తల్లిదండ్రులతో కలిసి ఉంటోంది. ఆమె తండ్రి నాగరాజు పత్తార్ స్వర్ణకారుడు, తల్లి రేణుక గృహిణి. నగరంలోని నవోదయ ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీలో సివిల్ ఇంజనీరింగ్ చదువుతోంది. నిత్యం కాలేజీకి వచ్చి వెళ్లేది. ఈ నెల 13న ఇంటర్నల్ పరీక్షలకు వెళ్లిన అమ్మాయి సాయంత్రమైనా ఇంటికి రాలేదు. మొబైల్‌కు ఫోన్ చేస్తే స్పందన రాలేదు. దీంతో ఆందోళనకు గురైన తల్లిదండ్రులు అదేరోజు సాయంత్రం మహిళా పోలీసు స్టేషన్‌కు వెళ్లి బిడ్డ కనిపించడం లేదని ఫిర్యాదు చేశారు. ఎక్కడికీ పోదు, వస్తుందిలే అని పోలీసులు నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు తప్ప కేసు నమోదు చేసుకుని గాలించలేదు. మూడురోజులు గడిచిపోయాయి. 16వ తేదీన నగరంలోని మాణిక్ ప్రభు దేవాలయం వెనుకభాగంలో నిర్మానుష్యంగా వున్న గుట్టలపై యువతి శవం కనిపించింది. పోలీసులు ఆరా తీయగా అది మధు పత్తార్దేనని తల్లిదండ్రులు, స్నేహితులు గుర్తించారు. పలు అనుమానాలు ‘నేను ఇంజనీరింగ్ కోర్సులో పలు సబ్జెక్టులు ఫెయిల్ అయ్యాను. నా మరణానికి నేనే బాధ్యురాలిని’ అని ఉత్తరం మృతదేహం దగ్గర దొరికిందని పోలీసులు తెలిపారు. మరోవైపు ఎండిపోయిన చెట్టుకు ఉరి వేసుకోవడానికి ఆస్కారం లేదు. ఆమె కూర్చున్న స్థితిలో ఉరివేసుకుని ఉంది. ఇది ఎలా సాధ్యమని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. సూసైడ్ నోట్ కన్నడలో రాసి ఉంది. తమ కూతురికి కన్నడ రాయడం అంతగా రాదని, హంతకుడే ఆ లేఖను రాసి ఆమెతో సంతకం చేయించి ఉంటాడని తల్లిదండ్రులు చెబుతున్నారు. ఆత్మహత్య కాదు హత్యే.. న్యాయం చేయాలి: మధు తల్లి మొర అనుమానాస్పద రీతిలో మరణించిన తమ కూతురు, విద్యార్థిని మధు పత్తార్ విషయంలో ప్రభుత్వం న్యాయం చేయాలని తల్లి రేణుక కోరారు. శనివారం ఇక్కడ పాత్రికేయల భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. తన కూతురుని చిత్రహింసలకు గురిచేసి, హత్య చేసి, ఆత్మహత్యగా చిత్రీకరించిన హంతకులకు కఠిన శిక్ష విధించాలని ఆమె డిమాండ్ చేశారు.ఈ నెల 25వ తేదీన నగరంలో విద్యార్థులు, ప్రజలు, సంఘ సంస్థల సహకారంతో భారీ ఆందోళన నిర్వహిస్తామని ఆమె తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి ఘోరాలు జరగకుండా పోలీసులు చర్యలు చేపట్టాలని కోరారు. మధు తండ్రి నాగరాజు, విశ్వకర్మ సంఘాల నాయకులు పాల్గొన్నారు. అతనిపైనే సందేహాలు సుదర్శన్ యాదవ్ అనే యువకుడు ఐదు నెలల నుంచి ప్రేమపేరుతో మధు పత్తార్‌ను వెంబడిస్తున్నారని, మానసికంగా వేధిస్తున్నాడని ఆమె తల్లిదండ్రులు ఆరోపించారు. ప్రేమించాలని ఒత్తిడి చేసేవాడని ఒత్తిడి చేసేవాడు. మధు అంగీకరించకపోవడంతో తనకు దక్కని ఆమె ఇంకొకరికి దక్కరాదని కక్ష పెంచుకున్నాడు. అర్జంటుగా మాట్లాడాలనే నెపంతో గుట్టలపైకి పిలుచుకెళ్లి చంపి చెట్టుకు వేలాడ దీసి ఆత్మహత్యగా చిత్రీకరించాడని తల్లిదండ్రలు, సంఘ సంస్థల నాయకులు ఆరోపించారు. పోస్టుమార్టం నివేదిక రావాలి 13వ తేదీనే మధు విగతజీవిగా మారింది. 16న మృతదేహం బయటపడింది. ఎండలకు మృతదేహం కమిలిపోయి గుర్తుపట్టలేనంతగా మాడిపోయింది. నేతాజి నగర్ పోలీసులు కేసు నమెదు చేసుకున్నారు. ఇది హత్యేనని, హంతకులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. కాగా, నిందితుడు సుదర్శన్ యాదవ్ ఇప్పటికే పోలీసులకు లొంగిపోయాడని, అతన్ని విచారిస్తున్నారని తెలిసింది. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తరువాతే హత్య, ఆత్మహత్యనా? అనేది చెప్పగలమని, కేసు విచారణలో ఉందని పోలీసు అధికారులు తెలిపారు. -
‘నా గుండె ముక్కలైంది..మానవత్వం ఎక్కడుంది?’
‘మానవత్వం ఎక్కడుంది. రాయ్‌చూర్‌కు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థిపై పాశవికంగా అత్యాచారం జరిపి హత్య చేసిన ఘటన.. నా గుండెను బద్దలు చేసింది. ఇంకా ఎంతమంది ఇలాంటివి ఎదుర్కోవాలి? ఆమెకు న్యాయం జరగాలని, ఇదే చివరి ఘటన కావాలని ఆశిస్తున్నా’ అంటూ హీరోయిన్ రష్మిక మందాన్న సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. రాయ్‌చూర్ అడవిలో హత్యకు గురైన యువతికి న్యాయం జరగాలంటూ #JusticeForMadhu హ్యాష్‌ట్యాగ్‌తో ఆమె చేసిన ట్వీట్ కొన్ని గంటల్లోనే వైరల్‌గా మారింది. రాయ్‌చూర్ అడవిలో గత మంగళవారం ఓ యువతి మృతదేహం చెట్టుకు వేలాడుతూ లభ్యమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మృతురాలిని మధు పథారాగా గుర్తించారు. సివిల్ ఇంజినీరింగ్ చదువుతున్న ఆమెపై అత్యాచారానికి పాల్పడి .. ఆపై సజీవ దహనం చేసి.. చెట్టుకు వేలాడదీసినట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నెల 13న జరిగిన ఈ ఘటనపై సోషల్ మీడియా వేదికగా ఆగ్రహావేశాలు పెల్లుబుకుతున్నాయి. ఇందులో భాగంగా పలువురు సెలబ్రిటీలు మధుకు న్యాయం చేయాలంటూ హ్యాష్‌ట్యాగ్‌తో పెద్ద ఎత్తున పోస్టులు పెడుతున్నారు. ఇలాంటి వాటిని హైలెట్ చేయండి! హీరో మంచు మనోజ్ కూడా ఈ ఘటనపై స్పందించాడు. ‘ ఒకరి కూతురు, సోదరి. తన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నా. ఇలాంటి వార్తలకు ప్రాచుర్యం కల్పించేందుకు మీడియా తన శక్తిని ఉపయోగించాలి. ఈ విషయం గురించి ప్రజలందరికీ తెలిసేలా చేయండి. మహిళలపై జరుగుతున్న ఈ భయంకరమైన ఘటనలను తక్కువగా చూపకండి. మధుకు న్యాయం జరగాలి’ అంటూ మీడియా ప్రతినిధులకు విఙ్ఞప్తి చేశాడు. Where is the humanity? According to sources Madhu a Raichur ,engineering student was raped, murdered.. this truly breaks my heart..how many more like this beforeit stops? #JusticeForMadhu ..Hope justice is given.. and this comes to an end..😔 — Rashmika Mandanna (@iamRashmika) April 19, 2019 -
‘రేప్’ చేసి.. దారుణహత్య!
రాయ్‌చూర్ : కర్ణాటకలోని రాయ్‌చూర్‌లో దారుణమైన ఘటన వెలుగుచూసింది. రాయ్‌చూర్ అడవిలో గత మంగళవారం యువతి మృతదేహం చెట్టుకు వేలాడుతూ లభ్యమైంది. మృతురాలిని మధు పథారాగా గుర్తించారు. సివిల్ ఇంజినీరింగ్ చదువుతున్న మధుపై ‘అత్యాచారం’ జరిపి.. ఆపై సజీవ దహనం చేసి.. చెట్టుకు వేలాడదీసినట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఘటన ఈ నెల 13న జరగగా.. ఈ నెల 16న చెట్టుకు వేలాడుతున్న బాధితురాలి మృతదేహాన్ని గుర్తించారు. హత్యకేసుగా భావిస్తున్న ఈ ఘటనలో ఒక వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. దుండగులు బాధితురాలిని చిత్రహింసలకు గురిచేసి.. ఆమెతో సూసైడ్ నోట్ రాయించారని, అనంతరం ఆమెను చంపేసి.. చెట్టుకు వేలాడదీశారని మీడియా కథనాలను బట్టి తెలుస్తోంది. ఆమె రాసినట్టు చెప్తున్న సూసైడ్ నోట్లో చదువులో వెనుకబడటంతో ఆత్మహత్య చేసుకున్నట్టుగా ఉంది. అయితే, ఆమె అన్ని సబ్జెక్టులను పాస్ అయిందని, చదువులో వెనుకబడిందనే మాట అవాస్తవమని ఈ సూసైడ్ నోట్‌ను ఆమె స్నేహితులు, బంధువులు కొట్టిపారేస్తున్నారు. మధు ఆత్మహత్య చేసుకోలేదని, ఆమె సజీవదహనం చేసి.. చెట్టుకు వేలాడదీశారని ఆమె తండ్రి నాగరాజ్ నేతాజీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. మధుకు న్యాయం చేయాలంటూ హ్యాష్‌ట్యాగ్‌తో పెద్ద ఎత్తున పోస్టులు పెడుతున్నారు. ఘటనకు సంబంధించిన ఫొటోలుగా కొన్ని భయంకరమైన ఫొటోలు నెటిజన్లు షేర్ చేస్తున్నారు. ప్రముఖ నటి రష్మిక మంధానతోపాటు పలువురు ప్రముఖులు కూడా ఈ ఘటనపై తీవ్ర ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ట్విటర్లో పోస్టులు పెట్టారు. అయితే, పోలీసులు ఇప్పటివరకు క్రైమ్‌సీన్ ఫొటోలు విడుదల చేయలేదు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. -
మదిలో నిలిచే మగువల చిత్రాలు
రాయచూరు రూరల్: కుంచెతో కళా నైపుణ్యం ఉట్టి పడేలా, జీవకళ ఉట్టిపడేలా పెయింటింగ్స్ వేయడంలో శశికాంత్ దోత్రేది అందె వేసిన చేయి. ఆయన గీసిన చిత్రాలను చూస్తే ఇది చిత్రమా, ఫోటోనా అనే భ్రమ కలగకమానదు. ఆ స్థాయిలో కుంచె సామర్థ్యాన్ని దోత్రే సొంతం. ఫొటోగ్రఫీని మించి కుంచె ద్వారా చిత్రాలు వేసిన దోత్రేకు ఏ బొమ్మనైనా అదే సర్వస్వమనే తపనతో లీనమై గీస్తారు. శశికాంత్ దోత్రే తండ్రి ఒక చిరుద్యోగి. శశికాంత్ పుట్టి, పెరిగింది, టెన్త్ క్లాస్ వరకు చదువుకుంది రాయచూరు పట్టణంలోనే. తరువాత బదిలీపై మహారాష్ట్రలోని షోలాపూర్‌కు వెళ్లిపోయారు. ఆయన ఎక్కడ ఉన్నా చిత్ర కళను జీవితాశయంగా ఎంచుకున్నారు. మధ్యలోనే చదువుకు స్వస్తి చెప్పి ముంబాయి జె.జె.స్కూల్ ఆఫ్ ఆర్ట్స్‌లో చేరారు. పేదరికంలో మగ్గుతున్న కుటుంబం, ఫీజులు చెల్లించలేని నిస్సహాయ స్థితిలో మధ్యలో కళాభ్యాసాన్ని ఆపిన దోత్రే ఇంటిలోనే తన కుంచెకు పదును పెట్టారు. వివిధ రకాలైన కాగితాలలో రంగు రంగుల పెన్సిళ్లతో చిత్రాలు వేయడం ప్రారంభించాడు. చిత్రకళకు జీవకళ ఉట్టి పడేలా చేశాడు. జాగర్ పేరుతో దేశ వ్యాప్తంగా 40 నగరాలలో కళా ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. అందులో భాగంగా ఇటీవల రాయచూరులోని ఉపాధ్యాయుడు వెంకటేష్ నవలి నివాసంలో తన ప్రతిభను వివరించారు. బల్లపై కూర్చొని పూసలు అల్లుతున్న యువతులు, పూలు కుడుతున్న మహిళ, తిరగలితో ధాన్యం విసరడం, పాతకాలంలో గోళీలు ఆడుతున్న పిల్లలు, వంట చేస్తుంటే తల్లి వెనుక కొడుకు ఉండటం, దుప్పట్లు కుట్టడం, తులసి మొక్కకు నీరు పోస్తున్న మహిళ దృశ్యం సంభ్రమానికి గురిచేస్తాయి. దైనందిన జీవితమే చిత్రం తల్లి కోసం ఎదురు చూస్తున్న అమ్మాయి, కూతురిని ముస్తాబు చేస్తున్న తల్లి, వంట కోసం కాయగూరలు తరుముతున్న దృశ్యం, అల్లికలు వేస్తున్న యువతి, ధాన్యం చెరుగుతున్న స్త్రీ.. ఇలా ఎన్నో పెయింటింగ్స్ కళ ఉట్టి పడుతూ మరులు గొలుపుతాయి. గోరింట పెట్టుకుంటున్న యువతులు, ఇంటివద్ద కట్టపై కూర్చుని మాట్లాడే మహిళలు.. ఇలా పేద, మధ్య తరగతి మానవ జీవితపు పార్శా్వలు చూపరులను ముగ్ధుల్ని చేస్తాయనడంలో సందేహం లేదు. -
కాలేజీ నుంచి సస్పెండ్.. విద్యార్థి ఆత్మహత్య
సాక్షి, రంగారెడ్డి : కళాశాల నుంచి సస్పెండ్ చేశారని ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన బుధవారం కర్ణాటకలోని రాయచూరులో చోటుచేసుకుంది. వివరాలివి.. ధీరజ్ అనే విద్యార్థి రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం బొంగళూర్‌లోని శ్రీచైతన్య కళాశాలలో ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. ధీరజ్ స్వస్థలం కర్నాటకలోని రాయచూరు. ఈ నెల 26వ తేదీన ధీరజ్ కళాశాలలో ఫోన్లో మాట్లాడుతున్నాడు. ఇది గమనించిన యాజమాన్యం అతని మందలించి, కళాశాల నుంచి సస్సెండ్ చేసింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ధీరజ్ ఇంటికి వెళ్లిపోయాడు. జూన్ 27వ తేదీన ఇంటిలో ఉరివేసుకుని తనువు చాలించాడు. ఇది గమనించిన తల్లిదండ్రులు బోరున విలపించారు. విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘాల నాయకులు కళాశాల ఎదుట ఆందోళనకు దిగారు. అతని చావుకు కాలేజీ యాజమాన్యం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. తమ మిత్రుడి మరణవార్త విన్న తోటి విద్యార్థులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
రాయచూరు రూరల్: నగరంలోని మహాబళేశ్వర సర్కిల్ వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందింది. మృతురాలిని కల్మలకు చెందిన తాయమ్మ(35)గా గుర్తించారు. ఈమె స ర్కిల్ సమీపంలోని దేవాల యం ముందు భాగంలో ద్వి చక్ర వాహనంపై బట్టలు విక్రయించేందుకు Ðవెళుతుండగా ఎదురుగా వచ్చిన లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెం దింది. తాయమ్మ మహాబళేశ్వర సర్కిల్ నుంచి సర్దార్ వల్లబ్భాయి పటేల్ సర్కిల్ వైపు ద్విచక్ర వాహనంపై వెళుతుండగా, సర్దార్ వల్లబ్భాయి పటేల్ సర్కిల్ వైపు నుంచి మహాబళేశ్వర సర్కిల్ వైపు వస్తున్న లారీ ఢీకొనడంతో ఈ దుర్ఘటన జరిగినట్లు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ వీరనగౌడ తెలిపారు. -
ఉపాధి హామీలో అవినీతికి చెక్
-జెడ్పీ సీఈఓ కుర్మారావు రాయచూరు రూరల్ : 2015-16వ సంవత్సరానికి రాయచూరు జిల్లాకు రూ.150 కోట్ల క్రియా పథకానికి ఆమోదం లభించిందని, దీనికి సంబంధించి రూ.100 కోట్లు ఖర్చు అయ్యాయని జిల్లా పంచాయతీ సీఈఓ కుర్మారావు తెలిపారు. గురువారం ఆయన జిల్లా పంచాయతీ సభాంగణంలో జరిగిన ప్రగతి పరిశీలన సమావేశంలో పాల్గొని మాట్లాడారు. జిల్లాలోని 164 గ్రామ పంచాయతీల్లో అధికంగా చేపట్టిన ఉపాధి హామీ పథకంలో జరుగుతున్న అవినీతిని అరికట్టేందుకు గ్రామ పంచాయతీ అభివృద్ధి అధికారుల నుంచి పాస్ బుక్, చెక్ బుక్‌లను అందించాలని ఆదేశాలను జారీ చేశామన్నారు. పంచాయతీల్లో చేపట్టిన అనేక పనులు పూర్తి కాకుండానే బిల్లులు పెట్టి నిధు లను పొందుతున్నారని, దీనిని నివారించేందుకు ఫిబ్రవరి, మార్చి నెలల్లో చేపట్టిన ఉపాధి హామీ పథకం పనుల వివరాలను పూర్తిగా విశ్లేషించిన తరువాతే నిధులను విడుదల చేస్తామని తెలిపారు. ఈ పథకంలో ఎటువంటి షరతులు విధించినా ప్రతీ గ్రామ పంచాయతీల లో పంచాయతీ కార్యద ర్శులు, అభివృద్ధి అధికారులు, అధ్యక్షులు కుమ్మక్కై నిధులను స్వాహా చేస్తున్నారన్నారు. దీనికి సంబంధించి తమకు అనేక ఫిర్యాదులు అందాయని వెల్లడించారు. పథకం పనులను పూర్తిగా విశ్లేషించేందుకు ప్రతీ 5 గ్రామ పంచాయతీలకు ఒకరు చొప్పున నోడల్ అధికారులను నియమించడం జరిగిందని, పథకం వివరాలను వారందించిన తరువాతే బిల్లులను విడుదల చేయడం జరుగుతుందన్నారు. ఈ పనుల్లో ఏ విధమైన అవినీతి చోటు చేసుకున్నట్లు వెల్లడైనా సంబంధిత అధికారులపై క్రిమిన ల్ కేసులు పెట్టి వారిపై చట్టరీత్య చర్యలు చేపడతామని హెచ్చరించారు. -
గుక్కెడు నీటి కోసం ఎన్ని తిప్పలో..
- అడుగంటిన భూగర్భ జలాలు - రాయచూరు జిల్లాలో - తీవ్ర తాగునీటి ఎద్దడి రాయచూరు రూరల్: ప్రస్తుత వేసవి కాలంలో మండుతున్న ఎండలకు భూగర్భ జలాలు అడుగంటుతుండటంతో తాగునీటి కోసం ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. పట్టణంలోని కొళాయిల్లో నీళ్లు రాకపోవడంతో బోర్లలోని ఉప్పు నీటితోనే సరిపెట్టుకోవాల్సి వస్తోంది. రాయచూరు పట్టణం లో దాదాపు 4 లక్షలకు పైగా జనాభా వుంది. పట్టణంలో నేతాజీ నగర్, ఎన్జీఓ కాలనీ, వాసవీనగర్, పంచముఖీ కాలనీ, మడ్డిపేట, విద్యానగర్, గంజ్ఏరియా, షియాతలాబ్, సిటీ టాకీస్ ఏరియా, స్టేషన్ ఏరియా, రామలింగేశ్వర కాలనీ, నీలకంఠేశ్వర నగర్, ఐడీఎంఎస్ లేఅవుట్, నిజలింగప్ప కాలనీ, హరిజనవాడ, బెస్తవారి పేటల్లో నీటి కోసం గంటల తరబడి బోర్ల దగ్గర, కొళాయిల వద్ద పడిగాపులు కాయాల్సి వస్తుంది. రాత్రి పూట కొన్ని ప్రాంతాల్లో నీటిని విడుదల చేస్తుండటంతో జాగరణ చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. పట్టణంలో ఏ కొళాయి వద్ద, బోరింగుల వద్ద చూసినా జనాలు బారులు తీరి కనిపిస్తున్నారు. కొన్ని పథకాల కింద నిర్మించిన ట్యాంకులు నీటి నిల్వ సామర్థ్యం తక్కువగా ఉన్నందున అవి ప్రజల అవసరాలను ఏమాత్రం తీర్చలేకపోతున్నాయి. వేసవి కాలంలో పట్టణంలోని ప్రజల నీటి అవసరాలను గుర్తించి చేపట్టిన కొత్త పథకం పనులు మందకొడిగా జరుగుతున్నా మరో వైపు వున్న మంచినీటి పథకాల ద్వారా నీటిని అందించడంలో అధికారులు విఫలం అవుతున్నారు. జిల్లాలోని దేవదుర్గ తాలుకా క్యాదిగేర, రంగనాయకి తండా, మల్లాపూర, సింధనూరు తాలుకా శ్రీనివాస్ క్యాంపు, మాన్వి తాలుకా ఇరకల్, కవితాళ, వక్రాణి, చీకలపర్వి క్యాంపుల్లో తాగునీటిని ట్యాంకుల ద్వారా సరఫరా చేపడుతున్నారు. రాయచూరు తాలుకాలో 16, మాన్విలో 33, దేవదుర్గలో 27, సింధనూరులో 52, లింగసూగూరు తాలూకాలో ఐదు గ్రామాల్లో తాగునీటి ఎద్దడి నెలకొం దని అధికారులు చెపుతున్నారు. మరోవైపు గుల్బర్గ ప్రాంతీయ కమిషనర్ బిస్వాస్ రాయచూరు మినహా ఏ ప్రాంతాల్లో తాగునీటి ఎద్దడి లేదని చెప్పడానికి పైగ్రామాలే సాక్ష్యంగా చెప్పవచ్చు. రాయచూరు జిల్లాలో తాగునీటి ఎద్దడి నివారణకు సంబంధించి రూ.1.30 కోట్లు మంజూరైనా ప్రతిపాదనలు కాగితాలకే పరిమితమయ్యాయి. వేసవి కాలంలో తాగునీటి ఎద్దడి నివారణకు జిల్లా అధికార యంత్రాంగం నిధులు కేటాయిం చినా ఫలితం లేకుండా పోతోంది. ఈనేపథ్యంలో పట్టణంలోని ప్రజల అవసరాలను గుర్తించి ఇప్పటికైనా నీటి సరఫరాను మెరుగుపరచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -
పరువు కన్నా ప్రాణం మిన్న!
(సాక్షి వెబ్ ప్రత్యేకం) దేశం ఎంతగా పురోగామించినా కొన్ని అనాగరిక పోకడలు ఉనికిని చాటుకుంటూనే ఉన్నాయి. పరువు పేరుతో జరుగుతున్న అమానవీయ ఘటనలు నవనాగరిక సమాజం విచక్షణను ప్రశ్నిస్తున్నాయి. కుల, మత, వర్గ, ప్రాంత వైషమ్యాలతో మనుషుల ప్రాణాలు తీస్తున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. పరువు కోసం సొంతవారిని సైతం కడతేర్చేందుకు వెనుదీయని వారు ఉన్నారని తాజా ఘటనలు రుజువు చేస్తున్నాయి. కులాంతర వివాహం చేసుకున్నాడనే కారణంతో ఓ యువకున్ని కొట్టి చంపిన ఘటన కర్ణాటకలోని రాయచూరుకు సమీపంలో యరమరాస్ లో చోటుచేసుకుంది. ఆనంద్ సాగర్(30) వేరే సామాజిక వర్గానికి చెందిన బసవరాజేశ్వరిని 13 నెలల క్రితం రహస్యంగా పెళ్లి చేసుకున్నాడు. అప్పటినుంచి రెండు కుటుంబాల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో మే 17న ఒంటరిగా కనిపించిన ఆనంద్ సాగర్ పై రాజేశ్వరి తండ్రి విరూపాక్షగౌడ్ సహా 8 మంది రాళ్లతో దాడి చేసి కొట్టి చంపేశారు. పరువు పేరుతో 30 ఏళ్ల వ్యక్తిని, మైనర్ బాలికను సజీవ దహనం చేసిన దారుణ ఘటన బీహార్ లోని గయా జిల్లా ఆమెథ గ్రామంలో ఈనెల 14న జరిగింది. వివాహితుడైన కాసియాదిహ్ గ్రామానికి చెందిన జైరామ్ మాంఝీ, పార్వతీయ కుమారి(14) అనే బాలికతో కలిసి పారిపోయాడు. రెండు రోజుల తర్వాత దొరికిన వీరిని అయినవారే సజీవ దహనం చేశారు. తెలుగు నేలపైనా పరువు హత్యల పరంపర కొనసాగుతోంది. తమ కూతురు వేరే కులస్తున్ని ప్రేమించిందన్న కారణంతో తల్లిదండ్రులే ఆమెను హతమార్చిన కిరాతక ఘటన చిత్తూరు జిల్లాలోని పెద్దపంజాని మండలం వీరప్పలిలో ఈ ఏడాది ఆరంభంలో జరిగింది. పరువు పోతుందన్న భయంతో కన్నకూతురిని కర్కశంగా చంపారు. ఇలాంటి దారుణ ఘటనలెన్నో గతంలో జరిగాయి. దేశంలో ఏదో మూల రోజూ పరువు హత్యలు జరుగుతున్నాయి. పరువు పేరుతో మనుషుల ప్రాణాలు తీయడం అమానుషం. తమ ఇష్టానికి అభీష్టంగా వ్యవహరించారనో, తమకు తలవంపులు తెచ్చారనో నిండు ప్రాణాలు నిలువునా తీయడం దారుణం. పరువు పోయినా తిరిగి సంపాదించుకోవచ్చు. కానీ పోయిన ప్రాణాన్ని తిరిగి తీసుకురాలేం. ఈ విషయం గుర్తుంచుకుంటే పరువు హత్యలు ఉండవు. -
మండే ఎండలా.. మజాకా!
మండే ఎండల్లో కొందరు చల్ల చల్లని పానీయాలు అమ్ముకుంటూ బతుకు బండిని లాగిస్తున్నారు. మరి కొందరు ఎండలే అదనుగా భావించి ధరలు పెంచి దండుకుంటున్నారు. ప్రజలేమో ఎండలకు తట్టుకోలేక గొంతు తడుపుకోవడానికి పరుగులు తీస్తున్నారు. ఇలా ఒక్కొక్కరికి ఒకో రీతిలో మండే ఎండలా.... మజాకా అనిపిస్తున్నాయి. - రాయచూరు రాయచూరు: ఉత్తర కర్ణాటకలో రెండే సీజన్లు వేసవి, అతి వేసవి అన్న సంగతి తెలియని వారెవరూ ఉండరేమో. మే రాక ముందే ఎండలు మండిపోతున్నాయి. జిల్లా వ్యాప్తంగా రెండు నెలలుగా (మొన్న కురిసిన అకాల వర్షం మినహా) సగటున 39 నుంచి 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. జిల్లా కేంద్రమైన రాయచూరు నగరానికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వారికి మండుటెండలు స్వాగతం ప లుకుతున్నాయి. దీంతో వారు సహజంగానే చల్లటి పానీ యాలు, చలువ చేసే పదార్థాల కోసం తపిస్తున్నారు. ఉన్నవా రు ఎలాగూ బాటిళ్ల నీళ్లను కొని దాహం తీర్చుకుంటున్నారు. పేదవారు ఆర్టీసీ ఏర్పాటు చేసిన తాగునీరు అలాగే అక్కడి అన్నపూర్ణ క్యాంటీన్ నీళ్లను తాగి ఉపశమనం పొందుతున్నా రు. ఇక చల్లటి పానీయాల సంగతి సరే సరి చెరుకు రసంతో పాటు రకరకాల జూస్లు ఇతరత్రా డ్రింక్స్ ప్యాపారాలు జో రుగా కొనసాగుతున్నాయి. ఇక యాపలదిన్ని తదితర గ్రా మాల నుంచి తెలుగు వారైన మహిళలు బస్టాండ్ రెండు ప్ర ధాన గేట్ల బయట తాటిముంజలను రూ.10 కి 4-5 చొప్పున అమ్ముతున్నారు. రెండు నెలల నుంచి ఈ మహిళలు ప్రజలకు చలువ చేసే తాటిముంజలను విక్రయిస్తున్నారు. ఇక పుచ్చకాయ ఒక ముక్క 10 రూపాయలు కాగా అలాగే ఖర్బుజా ఇతర చలువ నిచ్చే ఆహార పదార్థాలు, కాయగూరల వైపు ప్రజలు పరుగులు తీస్తున్నారు. ముఖ్యంగా దోసకాయ, క్యారెట్, మొలకెత్తిన పెసర్లు తదితరాలకు డిమాండ్ ఎక్కువగానే ఉంది. ఇవి రోజు రోజుకూ ధరలు మారుతున్నాయి. ఈ విషయమై స్థానిక స్టేషన్ రోడ్డు వెస్ట్‌పోలీస్ స్టేషన్ పక్కన ఉన్న కూరగాయల ప్రముఖ వ్యాపారి, మాజీ దళపతి వీరణ్ణ మాట్లాడుతూ, 100 గ్రాములు ఉన్న మొలకెత్తిన పెసర్లు రూ.12, అలాగే దోసకాయ, క్యారెట్, నిమ్మకాయ, ముల్లంగి, బీరకాయ తదితరాలన్ని కేజీ రూ.40-50 పైమాటే. ఇక నిమ్మకాయల ధరను అడగాల్సిన పని లేదన్నారు. రెండు రోజుల క్రితం బసవ జయంతి, వైశాఖమాస పెళ్లిళ్ల సీజన్‌తో పలు కాయగూరల ధరలు ఒక్క సారిగా రెండింతలు మూడింతలు పెరిగాయి. ఎవర్గ్రీన్ ఎళెనీరు(కొబ్బరి బొండం) ధర రూ.30 దగ్గర స్థిర పడిపోయింది. -
రాయచూరులోనే ఐఐటీ
ముఖ్యమంత్రిని కోరిన ఆ ప్రాంత ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రికి వినతి పత్రాన్ని అందజేస్తున్న మల్లికార్జున ఖర్గే తదితరులు బెంగళూరు : ఈ ఆర్థిక ఏడాది బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం కర్ణాటకకు కేటాయించిన ఐఐటీని వెనుకబడిన ప్రాంతంగా పేరుగాంచిన హైదరాబాద్-కర్ణాటక ప్రాంతంలోని రాయచూరులోనే ఏర్పాటు చేయాలని లోక్‌సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు మల్లికార్జునఖర్గే నేతృత్వంలోని ఆ ప్రాంత ప్రజాప్రతినిధుల బృందం ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు విన్నవించింది. ఈమేరకు ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం కృష్ణలో సీఎం సిద్ధరామయ్యను కలిసిన ప్రజా ప్రతినిధులు ఆయనకు వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం మల్లికార్జున ఖర్గే విలేకరులతో మాట్లాడుతూ...అత్యంత వెనకబడిన ప్రాంతమైన రాయచూరులో ఐఐటీ స్థాపనకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. నంజుండప్ప నివేదిక ప్రకారం ఐఐటీ ఏర్పాటుకు రాయచూరు అనువైన ప్రాంతమని అన్నారు. మైసూరు, హాసన, మంగళూరు తదితర ప్రాంతాల నుంచి ఐఐటీ ఏర్పాటుకు డిమాండ్ వస్తుండడంపై మల్లికార్జున ఖర్గే స్పందిస్తూ...ఇతర ప్రాంతాల్లో ఐఐటీని ఏర్పాటు చేయకండి అని తాము కోరడం లేదని, అదే సందర్భంలో రాయచూరులో ఐఐటీ ఏర్పాటు ఆవశ్యకతను మాత్రమే ముఖ్యమంత్రికి విన్నవించామని తెలిపారు. ముఖ్యమంత్రిని కలిసిన ప్రజాప్రతినిధుల బృందంలో రాష్ట్ర వైద్యవిద్యా శాఖ మంత్రి శరణ్ ప్రకాష్ పాటిల్, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఖమరుల్ ఇస్లామ్ తదితరులు ఉన్నారు. -
ఘనంగా ఈద్ మిలాద్ వేడుకలు
రాయచూరు/బళ్లారి అర్బన్: ఈద్ మిలాద్ వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. జిల్లా కేంద్రమైన రాయచూరులో మధ్యాహ్నం 2 గంటలకు పట్టణంలోని షరాఫ్ బజార్, పరకోట, ఖాదర్ గుండ, ఎల్బీఎస్ నగర్, షియా తలాబ్, అరబ్ మొహల్లా నుంచి వేలాది మంది ముస్లింలు ఈద్ మిలాద్ నబీ ర్యాలీలతో తీనకందిల్ వద్దకు చేర్చారు. 3 గంటలకు తీన్‌కందిల్ నుంచి ప్రారంభమైన ర్యాలీ ఏక్ మినార్, జైలు, నగర సభ, టిప్పూ సుల్తాన్ రోడ్డు, జిల్లాధికారి కార్యాలయం, ఈద్గా మైదానం వరకు నిర్వహించారు. శాసన సభ్యుడు శివరాజ్ పాటిల్, విధాన పరిషత్ సభ్యుడు భోసురాజు, మాజీ ఎమ్మెల్యే యాసిన్, కాడా అధ్యక్షుడు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు వసంత్‌కుమార్, డాక్టర్ తాజుద్దీన్, ఇతర నేతలు పాల్గొని అభినందనలు తెలిపారు ఈద్ మిలాద్ ఉన్ నబి వేడుకలను పురస్కరించుకొని బళ్లారిలో భారతీయ రెడ్‌క్రాస్ సంస్థ, ఉసేన్‌నగర్ మసీద్ సంస్థ, స్పందన చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో 19వ వార్డులోని ఉసేన్‌నగర్ మసీదు ప్రాంగణంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. వి మ్స్ డెరైక్టర్ డాక్టర్ వీ.శ్రీనివాస్ శిబి రాన్ని ప్రారంభించి మాట్లాడారు. రక్తం తయారు చేయలేమని, మనమే రక్తదా నం చేసి ప్రాణదాతలుగా నిలవాలన్నా రు. 50 మంది రక్తదానం చేసినట్లు తెలి పారు. అనంతరం భారతీయ రెడ్‌క్రాస్ సంస్థ సభ్యులు టీ.అల్లాబకాష్ ఈద్ మిలాద్ శోభయాత్రను ప్రారంభించగా నగర వీధుల గుండా ఊరేగింపు సాగింది. స్పందన చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు బీ.దేవణ్ణ, ఐఆర్సీఎస్ జిల్లా కార్యదర్శి, హోంగార్డ్స్ కమాండెంట్స్ షకీబ్, హాజీ అబ్దుల్ సత్తార్‌సాబ్, విమ్స్ సిబ్బంది పాల్గొన్నారు. కంప్లి : ఈద్ మిలాదున్నబి వేడుకలు కంప్లిలో ఘనంగా నిర్వహించారు. స్థానిక జోగి కాలువ వద్ద గల బడేసా ఖాద్రి దర్గా నుంచి మక్కా మసీదు చిత్రపటంతో నగరంలోని ప్రధాన వీధుల గుండా ఊరేగింపుగగా దర్గాకు చేరుకున్నారు. మతగురువు సయ్యద్ అబుల్ హసన్ ఖాద్రి, సయ్యద్ ఖాజా మొహిద్దీన్ ఖాద్రి పాల్గొన్నారు. సింధనూరు టౌన్: పట్టణంలో ఆదివారం మిలాదున్న బి వేడుకలు ఘనంగా జరిగాయి. మక్కా, మదినాల స్తంభం నమూనాలను కుష్టగి రోడ్డు, టిప్పుసుల్తాన్ సర్కిల్, కిత్తూరు రాణి చెన్నమ్మ సర్కిల్ మీదుగా ఊరేగించారు. ఖలందరియా కమిటీ, రోషన్ కమిటీ, టిప్పు సుల్తాన్ కమిటీల సభ్యులు పాల్గొన్నారు. సింధనూరు తా లూకాలోని హుడా గ్రామంలో ఆదివారం ఆద్ మిలాద్ పండుగను జరుపుకున్నారు. అనంతరం ముస్లింలు ఊరేగింపు నిర్వహించి ప్రార్థన నిర్వహిం చారు. బళగానూరు గ్రామంలో కూడా షా జామియా మసీద్ సన్నిధిలో ఎస్.శెక్షావలి నేతృత్వంలో శనివారం రాత్రి జాగరణ చేపట్టి ప్రార్థనలు నిర్వహించారు. హొస్పేట : నగరంలో ఆదివారం ఈద్ మిలాద్ పండుగను ముస్లింలు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. స్థానిక ఐఎస్ఆర్ రహదారి ఈద్గా మైదానంలో ప్రత్యేక ప్రార్థనలు చేసిన అనంతరం ప్రముఖ వీధుల్లో ఘనంగా ఊరేగింపు నిర్వహించారు. -
పైసా ఇవ్వలేదు
* అతివృష్టి, అనావృష్టితో నష్టపోయిన రాష్ట్రం * కేంద్ర ప్రభుత్వ వైఖరిపై మంత్రి కృష్ణ బైరేగౌడ ఆవేదన సాక్షి, బెంగళూరు/ రాయచూరు రూరల్ : అతివృష్టి, అనావృష్టి వల్ల నష్టపోయిన ప్రజలను ఆదుకోవడానికి వీలుగా ఇప్పటి వరకూ కేంద్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కృష్ణ బైరేగౌడ స్పష్టం చేశారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం పక్షపాత ధోరణితో వ్యవహరిస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు. రాయచూరులో స్థానిక మీడియాతో శనివారం ఆయన మాట్లాడారు. ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో ఉత్తర కర్ణాటక ప్రాంతంలో కురిసిన అధిక వర్షాల వల్ల రైతులతో పాటు సాధారణ ప్రజలు కూడా ఆర్థికంగా చాలా నష్టపోయారన్నారు. ఇందు కోసం రూ.266 కోట్లు విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వానికి నెల ముందే నివేదిక పంపినా ఇప్పటి వరకు ఒక్క పైసా కూడా విడుదల చేయకపోవడం శోచనీయమన్నారు. రాష్ట్రంలో 34 తాలూకాల్లో కరువు ఛాయలు ఉన్నాయన్నారు. ఈ ప్రాంత రైతులను ఆదుకోవడానికి కూడా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి సాయం అందించడం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం ముందుకు రాకపోయినా ప్రకృతి విపత్తుల వల్ల నష్టపోయిన ప్రాంతాల్లో అభివృద్ధి, సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రూ.537 కోట్లు విడుదల చేసిందన్నారు. మరిన్ని నిధుల విడుదలకు తమ ప్రభుత్వం వెనుకాడబోదన్నారు. రాష్ట్రంలో వ్యవసాయ వర్శిటీ, కళాశాలల స్థాపనకు ఎక్కువ డిమాండ్ ఉన్న మాట వాస్తవమేనన్నారు. అందుకు సరిపడా మానవ వనరులు లేకపోవడం వల్ల డిమాండుకు తగిన సంఖ్యలో విద్యా సంస్థలను స్థాపించలేక పోతున్నామని చెప్పారు. మంత్రి వర్గ విస్తరణ, పునర్ వ్యవస్థీకరణ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో పాటు హై కమాండ్ నిర్ణయంపై ఆధారపడి ఉంటుందన్నారు. మంత్రి మండలి పునర్వ్యవస్థీకరణ వల్ల అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో గందరగోళ పరిస్థితులు ఏర్పడతాయనేది తన వ్యక్తిగత అభిప్రాయమని చెప్పారు. -
ఏం చేస్తే తను మారుతుంది?
వేదిక స్నేహమనేది ఎప్పుడూ నిన్ను ఒక వ్యక్తిగా నిలబెట్టాలి తప్ప, తప్పు దోవలో నడిపించకూడదు. అలా నడిపిస్తే అది నిజమైన స్నేహమే కాదని నా స్థిరమైన అభిప్రాయం. ఆ అభిప్రాయమే నన్ను, రమ్యను దూరం చేసిందనుకుంటా. నేను, రమ్య ఎంత మంచి స్నేహితులమంటే... ఎక్కడికైనా ఇద్దరం కలిసే వెళ్లేవాళ్లం. ఒకే స్కూలు, ఒకే ట్యూషను, ఒకే కాలేజీ... మా స్నేహాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోయేవారు. కొందరు అసూయ కూడా పడేవారు. అలాంటి మా మధ్య దూరం పెరుగుతుందని నేనెప్పుడూ అనుకోలేదు. చదువులు పూర్తయ్యాక ఇద్దరం ఒకేసంస్థలో ఉద్యోగాలు సంపాదించాం. కొన్నాళ్లపాటు బాగానే గడిచింది. కానీ రోజులు గడిచేకొద్దీ రమ్యలో ఏదో మార్పు. తనకి కొత్త ఫ్రెండ్స్ వచ్చారు. దానివల్ల నాకు ఇబ్బంది లేదు. కానీ తన స్నేహాలు సరిగ్గా లేకపోవడమే నన్ను బాధించింది. ఎటువంటి కమిట్మెంట్స్, సిన్సియారిటీ లేని మనుషులతో తిరుగుతూ తను కూడా వాళ్లలా తయారవడం మొదలుపెట్టింది రమ్య. అది నాకు నచ్చలేదు. చాలాసార్లు వారించాను. పనిని నిర్లక్ష్యం చేయవద్దని చెప్పాను. కానీ తను వినలేదు. పైగా నా పోరు పడలేక నన్ను దూరం పెట్టడం మొదలుపెట్టింది. దీనికితోడు తనను నిస్వార్థంగా, నిష్కల్మషంగా అభిమానించిన నాకు అబద్ధాలు చెప్పడం మొదలు పెట్టింది రమ్య. తనని ఏమీ అనలేకపోయేదాన్ని. అలాగని తనను సపోర్ట్ చేయలేను. ఎందుకంటే, తను వెళ్తోన్న దారి తప్పని నాకు తెలుసు కాబట్టి. తన ప్రవర్తన కారణంగా తను కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. అప్పుడు నేను తనని వెనకేసుకుని రాలేకపోయాను. నువ్వలా చేసివుండకపోతే ఈ పరిస్థితి వచ్చి వుండేది కాదు కదా అన్నాను. ఆ మాటని తను తప్పుగా అర్థం చేసుకుంది. నేను తనని దూరం పెడుతున్నానని అనుకుంది. తనే నాకు దూరంగా వెళ్లిపోయింది. నిజానికి ఆ దూరం తను కోరుకుంది. కానీ అది నన్ను మాత్రం చాలా బాధించింది. ఆ విషయం ఎలా చెబితే రమ్యకి అర్థమవుతుంది! ఏం చేస్తే తను మారుతుంది! కనీసం మీరైనా చెప్పరూ! - వందన, రాయచూర్ -
జలదిగ్బంధంలో గ్రామాలు
రాయచూరు రూరల్ : కర్ణాటక, వుహారాష్ట్రలలో నదీ పరివాహక ప్రాంతంలో కురుస్తున్న వర్షాల కారణంగా రాయచూరు జిల్లాలోని కొన్ని గ్రావూలు జలదిగ్బంధంలో చిక్కుకొని ద్వీపకల్పంగా వూరుతున్నారు. ఆలవుట్టి జలాశయుం, నారాయుణపుర జలాశయాలకు వరద నీరు భారీగా వచ్చి చేరుతుండటంతో ఏ సవుయుంలో ఏ ఆపద సంభవిస్తుందోనని నదీ తీర ప్రాంతవాసులు భయాందోళన చెందుతున్నారు. కృష్ణా నది తీరం పక్కన రాయుచూరు తాలూకాలోని వుంగిగడ్డ, కుర్వకుల, కుర్వకుర్థ, బూడిదపాడు, ఆత్కూరు గ్రావూలు, దేవదుర్గ తాలూకా కొప్పరతోపాటు వురో నాలుగు గ్రావూలు, లింగసూగూరు తాలూకాలోని కడదరగడ్డ, యురగొడి, హంచినాళు గ్రావూలు ఇప్పటికే జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోవడంతో గ్రామీణుల పరిస్థితి దయనీయంగా మారింది. మరో వైపు ఎన్‌ఆర్‌బీసీ నుంచి నీటిని నదికి వదులుతుండటంతో నడిగడ్డ ప్రాంతాల ప్రజలు ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకొని జీవిస్తున్నారు. ఇదిలా ఉండగా అత్యవసర పనుల కోసం బోట్ల ద్వారా అవలి వడ్డుకు చేరుకుంటున్నారు. నడిగడ్డ ప్రాంతంలో విద్యార్థులు పాఠశాలకు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో కొన్ని గ్రామాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. వరద అధికమైతే 15-20 రోజుల పాటు గ్రామాలనుంచి బయటకు రాలేని పరిస్థితులు నెలకొంటాయని, జిల్లా, తాలుకా పాలనా యుంత్రాంగం స్పందించి తమకు రక్షణ కల్పించాలని ఆయా ప్రాంతాలవాసులు డిమాండ్ చేస్తున్నారు. -
గ్రామాల్లో తాగునీటికి హాహాకారాలు
రాయచూరు రూరల్, న్యూస్‌లైన్ : ఏ గ్రామానికి వెళ్లినా నీటి ట్యాంకులు, బోరు బావుల వద్ద ప్రజల క్యూలు కన్పిస్తున్నాయి. బిందెడు నీటి కోసం గంటల తరబడి ఎదురు చూడాల్సిన పరిస్థితి దాపురించింది. ఇవి రాయచూరు జిల్లాలో తాగునీటి కోసం ప్రజల పాట్లు. బోర్లలో అడుగంటిన నీరు, నిరుపయోగంగా తాగునీటి పథకాలు, దీనికి విద్యుత్ కోత తోడు కావడంతో గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్య తీవ్ర రూపం దాలుస్తోంది. రోజు రోజుకూ తాగునీటి కోసం కష్టాలు అధికం అవుతున్నాయి.ఎండల తీవ్రత ఎక్కువ కావడం వల్ల బావులు కూడా ఎండిపోతున్నాయి. కొన్ని గ్రామాల్లో మహిళలు తాగునీటి కోసం 3-4 కి .మీ దూరం నడవాల్సి వస్తోంది. మెట్ట ప్రాంతాలైన దేవదుర్గ, లింగస్కూరు తాలుకాల్లో భూగర్భ జలాలు అడుగంటి పోవడంతో బావుల్లో కూడా గుక్కెడు నీరు లభించడం లేదు. రాయచూరు తాలుకాలోని యరగెర, గుంజళ్లి, మలియబాద్, జేగరకల్‌లో దాహం తీర్చుకునేందుకు బావి నుంచి ప్రజలు నీరు తోడుకుంటున్నారు. గిల్లెసుగూరు, వెంకటేశ్వర క్యాంప్, జాగటగల్ తదితర క్యాంపుల్లోని బోర్లలో నీరు ఇంకిపోవడంతో ప్రజలు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు. సాగుకు లేకపోతే పోయాయి.. కనీసం తాగేందుకైనా గుక్కెడు నీరివ్వాలి కదా అని వారు ఆవేదన వ్యక్తం చేశారు. నీటి పథకాలు ఉన్న చోట్ల ఎప్పుడు విద్యుత్ వస్తుందో, ఎప్పుడు నీరు వస్తాయో తెలియక పనులు మానుకుని ఎదురు చూడాల్సి వస్తోందని ప్రజలు న్యూస్‌లైన్‌తో వాపోయారు. లక్షలాది రూపాయల వ్యయంతో నిర్మించిన పథకాలు నిరుపయోగంగా ఉండిపోయాయి. క్యాంపుల్లో రైతులు సొంతంగా నిర్మించుకున్న చెరువులు కూడా పూర్తిగా ఎండిపోయాయి. ఏటా వేసవిలో ఈ సమస్య తీర్చడానికి నిధుల కోసం సంబంధిత అధికారులు ప్రతిపాదనలు పంపుతున్నారే గాని నిధులు మాత్రం అందడం లేదు. అరకొరగా విడుదల అవుతున్నా అవి దుర్వినియోగం అవుతున్నాయి. జిల్లాకు రెండు వైపులా కృష్ణా, తుంగభద్ర నదులు ఉన్నా.. ప్రజా ప్రతినిధుల నిర్లక్ష్యం వల్ల ఏటా నీటి సమస్య తలెత్తడం ప్రజల దురదృష్టంగా చెప్పవచ్చు. తాగునీటి కోసం గ్రామీణ ప్రాంత ప్రజలు పడుతున్న ఇబ్బందులను పరిష్కరించడానికి ప్రజా ప్రతినిధులు, అధికారులు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. -
రాయచూరు లోకసభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్యే పోటీ
రాయచూరు రూరల్ , న్యూస్‌లైన్: రాయచూరులో నేడు(గురువారం) జరిగే లోక్‌సభ ఎన్నికలకు ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ, బీజేపీ మధ్యే గట్టి పోటీ నెలకొంది. కాంగ్రెస్ పార్టీ నుంచి బీవీ నాయక్, బీజేపీ నుంచి శివనగౌడనాయక్, జేడీఎస్ నుంచి డీబీ నాయక్, బీఎస్పీ నుంచి తిమ్మప్పనాయక్, చిన్నయ్యనాయక్, సోమశేఖర్ , నాగరాజ, భగవంతప్ప రంగంలో ఉన్నారు. ప్రధానంగా కాంగ్రెస్, బీజేపీ మధ్యే ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి. బీజేపీ అభ్యర్థి ధన అధికార బలంతో గెలుపు తథ్యంగా భావిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నాయక్ పాత వాడైనా గత ఇరవై ఏళ్లుగా కాంగ్రెస్ ఎంపీగా ఉన్న వెంకటేష్‌నాయక్ ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టలేకపోయారనే విమర్శలున్నాయి. జేడీఎస్ అభ్యర్థి తన ఉనికిని చాటుకునేందుకు గట్టి ప్రయత్నాలు సాగిస్తున్నారు. రాయచూరు లోకసభ నియోజకవర్గంలో ఎనిమిది అసెంబ్లీ స్థానాలున్నాయి. రాయచూరు జిల్లాలో తుంగభద్ర ఎడమ కాలువ, కృష్ణానదిపై నారాయణపూర్ కుడికాలువ, రాష్ట్రానికి 45 శాతం విద్యుత్ ఉత్పత్తి చేసే విద్యుత్ స్థావరాలు, బంగారు నిక్షేపాలు గల హట్టి ప్రాంతాలు ఉన్నా రాయచూరు లోకసభ నియోజకవర్గం అన్ని రంగాల్లోనూ వెనకబడి ఉంది. ప్రస్తుతం 16వ లోకసభకు జరగనున్న ఎన్నికల్లో ప్రాంతీయ అసమానతల నివారణకు ఉద్దేశించిన నంజుండప్ప నివేదికలో తేటతెల్లమైంది. అత్యంత వెనకబడిన జిల్లాగా కీర్తి ఉంది. 60 ఏళ్ల పాలనలో అనుకున్నంత అభివృద్ధి సాధించలేకపోయింది. ఈసారి జరిగే ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులు వెనుకబడిన జాబితా నుంచి తొలగిస్తారో? లేదో? వేచి చూడాలి. 15 సార్లు జరిగిన ఎన్నికల్లో 12 సార్లు కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. 1967లో స్వతంత్ర అభ్యర్థి రాజా వెంకటప్పనాయక్ 1996లో రాజా రంగప్ప నాయక్ గెలిచారు. -
ఫీజులు చెల్లించలేదని పిల్లలను ఇళ్లకు పంపారు
రాయచూరు రూరల్, న్యూస్‌లైన్ :ఫీజు చెల్లించలేదని పిల్లలకు ఇంటికి పంపినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నగరంలోని భగవాన్ మహావీర్ పాఠశాల యాజమాన్యం తీరును నిరసిస్తూ సఫాయి కర్మచార ఉద్యోగుల సంఘం నాయకులు ఆందోళన నిర్వహించారు. ఈమేరకు ఆ సంఘం నాయకులు మంగళవారం జిల్లాధికారి కలెక్టరేట్ వద్ద వివిధ పాఠశాలల విద్యార్థులతో కలిసి ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆందోళనకారులు మాట్లాడుతూ ఫీజులు చెల్లించలేదని చెబుతూ భగవాన్ మహావీర్ పాఠశాల నిర్వాహకులు సఫాయి కర్మచార ఉద్యోగుల పిల్లలను ఇంటికి పంపుతున్నారన్నారు. ఫీజు చెల్లింపునకు వారం రోజులు గడువు ఇవ్వాలని కోరినా పాఠశాల యాజమాన్యం మొండిగా వ్యవహరిస్తోందన్నారు. దాదాపు ఉదయం ప్రారంభించిన ధర్నాను రాత్రి 7.30గంటల వరకు కొనసాగించారు. డీఈఓ మల్లికార్జున అక్కడకు చేరుకొని వారితో చర్చించారు. విద్యార్థులకు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు. సంఘం సంచాలకులు భాస్కర్‌బాబు, గీత పాల్గొన్నారు. -
ఆర్థిక సంక్షోభంలో వ్యవసాయ వర్సిటీ
రాయచూరు రూరల్, న్యూస్‌లైన్ : రాయచూరు వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. బోధన, బోధనేతర సిబ్బందికి వేతనాలు ఇవ్వలేని పరిస్థితి వర్సిటీ అధికారులు ఉన్నారు. ప్రణాళికేతర నిధులకు ఆర్థిక శాఖ అనుమతి ఇవ్వ క పోవడంతో ఈ పరిస్థితి దాపురించినట్లు తెలుస్తోంది. దాదాపుగా ఆరు నెలలుగా వేతనాలు ఇవ్వక పోవడంతో బోధకులు, బోధనేతర సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వేతనాలు ఇవ్వకపోవడంతో కుటుంబాలను పోషించడమే కష్టసాధ్యంగా మారిందని పేరు చెప్పేందుకు ఇష్టపడని సిబ్బంది న్యూస్‌లైన్ వద్ద వాపోయారు. మరో వైపు నిధుల లేమితో వర్సిటీ అభివృద్ధి కుంటు పడింది. కొత్త కార్యక్రమాలు చేపట్టేందుకు అధికారులు వెనుకంజ వేస్తున్నారు. ఈ విషయపై వీసీ బీవీ.పాటిల్‌ను న్యూస్‌లైన్ వివరణ కోరగడా గత ఏడాది ప్రభుత్వం రూ.26 కోట్లు కేటాయించాల్సి ఉండగా రూ.16 కోట్లు మాత్రమే విడుదల చేసిం దన్నారు. ఈ విషయాన్ని సీఎం సిద్ధరామయ్య, వ్యవసాయశాఖ మంత్రి భౌరెగౌడ దృష్టికి తీసుకెళ్లి నిధులు విడుదల చేయాలని కోరుతామన్నారు. ప్రణాళికేతర వ్యయానికి రూ.38 కోట్లను కేటాయించాలని కోరనున్నట్లు తెలిపారు. గుల్బర్గా వ్యవసాయ కళాశాలలో విజ్ఞాన కేంద్రం ఏర్పాటుకు చర్యలు చేపట్టనున్నట్లు వివరించారు. భారతీయ వ్యవసాయ పరిశోధన సంస్థ రూ.2.50 కోట్లను విడుదల చేసిందన్నారు. -
ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృత్యువాత
రాయచూరు రూరల్ , న్యూస్‌లైన్ : బెంగళూరు-నాందేడ్ ఎక్స్‌ప్రెస్‌లో శనివారం తెల్లవారుజామున జరిగిన దుర్ఘటన రాయచూరు డివిజన్లో విషాదం నింపింది. మృతులు, గాయపడిన వారిలో రాయచూరు డివిజన్లోని రాయచూరు, గుల్బర్గా, యాదగిరి, బీదర్ జిల్లాలకు చెందిన వారు ఉన్నారు. రాయచూరు టిప్పుసుల్తాన్ వీధిలో నివాసముంటున్న ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మరణించారు. డయాగ్నస్టిక్ కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న డాక్టర్ యతేష్రాహి భార్య ఆశ్రా(31), ఆమె తమ్ముడు ఇబ్రహీం రాహి(31), ఆమె కుమారుడు నిషారాహిలు(3) మృతి చెందారు. ఇబ్రహీం రాహి రాయచూరులో రెండు నెలల క్రితం పెళ్లి చేసుకున్నాడు. ఇబ్రహీం బెంగళూరులో టాటా కంపెనీలో విధులు నిర్వహించేవాడు. డాక్టర్ ఆస్రా పరీక్షలు రాసేందుకు వెళ్లి ముగ్గురు తిరిగి వస్తుండగా వృుత్యువాత పడ్డారు. మృతుల్లో రాయచూరు డివిజన్‌కు చెందిన కృష్ణమూర్తి(70), పద్మిని(61), లలిత(61), రాహుల్(25), యాదగిరికి చెందిన సంజీవ్ కోలార్ (41) ఉన్నారు. అదే బోగిలో ప్రయాణించిన రాయచూరు జిల్లా సహకార సంఘం అధ్యక్షులు సుభాష్ పాటిల్ శ్యావంతగెర ఆచూకీ తెలియడం లేదు. సేడం తాలూకా అడకి జెడ్పీ మాజీ సభ్యులు భీమయ్య కూడా ఈ ప్రమాదంలో మరణించారు. విధి ఆడిన వింత నాటకం... గుల్బర్గ జిల్లా సేడం తాలూకా అడకి మాజీ జడ్పీ సభ్యుడు భీమయ్య మానప్ప శాబాదకర్ కుమార్తెతో కలసి సేడం తాలూకా పంచాయతీ మాజీ అధ్యక్షుడి కుమార్తె పెళ్లికి హాజరై తిరిగి వస్తూ ఈ రెలైక్కారు. భీమయ్యకు మాత్రం ఏసీ బీ-1 బోగీలో సీటు లభించింది. కుమార్తె వేరే బోగీలో కూర్చుంది. రాత్రి 12.30 గంటలప్పుడు భీమయ్య తన కుమార్తెకు ఫోన్ చేసి, పొద్దున ఇద్దరూ రైలు దిగి కలసి వెళదామని చెప్పారు. వేకువ జామున షార్ట్ సర్క్యూట్ వల్ల బోగీ దగ్ధం కావడంతో ఆయన పూర్తిగా దహనమయ్యారు. కుమార్తె ఆయన మృత దేహాన్ని గుర్తించింది. అయినప్పటికీ డీఎన్ఏ పరీక్షలు పూర్తయిన తర్వాతనే వృుతదేహాన్ని అప్పగించనున్నారు. భీమయ్య రాయచూరు జిల్లా లింగసుగూరు ఎమ్మెల్యే మానప్ప వజ్జల్ సమీప బంధువు. -
కోత..వాత..
= రాజధాని బెంగళూరులో గంటపాటు విద్యుత్ కోత = గ్రామీణ ప్రాంతాల్లో ఎనిమిది గంటలు = రాయచూరు థర్మల్ విద్యుత్ కేంద్రంలో సాంకేతిక సమస్యలు = నిలిచిపోయిన విద్యుదుత్పాదన = రాబోయే వేసవిని తలుచుకుని బెంబేలు సాక్షి ప్రతినిధి, బెంగళూరు : వేసవికి చాలా నెలలున్నప్పటికీ రాష్ర్టంలో అప్పుడే అనధికారిక విద్యుత్ కోతలు మొదలయ్యాయి. ఈ ఏడాది పుష్కలంగా వర్షాలు పడినందున సెప్టెంబరు అంతానికే ప్రధాన రిజర్వాయర్లన్నీ నిండిపోయాయి. కనుక వచ్చే మే వ రకు విద్యుత్ కొరత ఉండబోదని ఆశించిన వారికి నిరాశే ఎదురవుతోంది. బెంగళూరు నగరంలో గంట, గ్రామీణ ప్రాంతాల్లో ఎనిమిది గంటల మేరకు కోత విధిస్తున్నారు. రాయచూరు థర్మల్ విద్యుత్కేంద్రంలో రెండు యూనిట్లలో సాంకేతిక సమస్యలు, నిర్వహణ లోపం వల్ల విద్యుదుత్పాదన నిలిచిపోయింది. రబీ సీజన్లో విద్యుత్ డిమాండ్ పెరగడం, సాంకేతిక సమస్యల వల్ల ఉత్పాదన తగ్గిపోవడంతో రాష్ట్రం ఇప్పటికే 22 శాతం విద్యుత్ కొరతను ఎదుర్కొంటోంది. ఇప్పుడే ఇలా ఉంటే, వేసవిని తలచుకుని విద్యుత్ శాఖ అధికారులు హైరానా పడిపోతున్నారు. విద్యుదుత్పాదనపై శ్రద్ధ ఏదీ? రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా తాత్కాలిక పరిష్కారాలపై శ్రద్ధ చూపడమే తప్ప శాశ్వత నివారణా చర్యలు చేపట్టడం లేదు. బీజేపీ తన హయాంలో విద్యుత్ రంగానికి రూ.14,751 కోట్ల ఖర్చు చేసినా, కొత్తగా ఒక యూనిట్ విద్యుత్ కూడా ఉత్పత్తి కాలేదు. యడ్యూరప్ప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఛత్తీస్‌ఘడ్‌లో విద్యుదుత్పత్తి కేంద్రానికి శంకుస్థాపన చేసినా, తదుపరి ఆ దిశగా అడుగు పడలేదు. రాష్ట్రంలో వివిధ వనరుల ద్వారా విద్యుదుత్పాదనకు అవకాశాలున్నా ప్రభుత్వం ఛత్తీస్ఘడ్పై దృష్టి సారించడం పట్ల అప్పట్లో విమర్శలు వెల్లువెత్తాయి. రాష్ట్రంలోని 34 జలాశయాలు కర్ణాటక విద్యుత్ కార్పొరేషన్ ఆధీనంలో ఉన్నాయి. వాటిల్లో 24 జలాశయాల్లో ఆరు వేల మెగావాట్ల విద్యుదుత్పాదన జరుగుతోంది. ప్రభుత్వం కొంత శ్రద్ధ చూపితే మరో పది జలాశయాల్లో కూడా విద్యుత్ ఉత్పత్తికి అవకాశాలున్నాయి. రాష్ట్రంలో ఏటా విద్యుత్ డిమాండ్ పెరుగుతోంది. సగటున 9 శాతం చొప్పున డిమాండ్ పెరుగుతోందని అధికారులు చెబుతున్నారు. ఇందులో ఆరు శాతాన్ని విద్యుత్ కొనుగోలు ద్వారా సరఫరా చేయగా, మిగిలిన మూడు శాతం కొరతగానే మిగిలిపోతోంది. ఎనిమిదేళ్లలో 20 శాతం డిమాండ్ పెరగగా, అందుకు అనుగుణంగా ఉత్పాదన జరగడం లేదు. -
గజగజ...
= గణనీయంగా పడిపోయిన ఉష్ణోగ్రతలు = గతంలో కనిష్ట ఉష్ణోగ్రత 8.4 డిగ్రీల సెల్సియస్ = ప్రస్తుతం ‘బెల్గాం’లో 5.9 డిగ్రీలుగా నమోదు 1970 నాటి రికార్డు బద్దలు సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ట్రంలో చలి విశ్వ రూపం దాల్చుతోంది. గత రికార్డులను బద్ధలు కొడుతూ కనిష్ట ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయి. బెల్గాం జిల్లాలో ఈ నెల 11న కనిష్ట ఉష్ణోగ్రత 5.9 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. 1970లో నమోదైన 8.4 డిగ్రీలే ఇప్పటి వరకు కనిష్ట ఉష్ణోగ్రతగా రికార్డుగా ఉంది. బీదర్‌లో ఈ నెల 13న ఆరు డిగ్రీల సెల్సియస్‌గా (1936లో 10) నమోదైంది. తుమకూరులో ఈ నెల 11న 8.7 (1981లో 10.4), చిత్రదుర్గలో 8.2 (1945లో 8.3), బళ్లారిలో 9.7 (1926లో 10.6), రాయచూరులో 9.7 (1945లో 10), గదగలో 8.7 (1925లో 10), శివమొగ్గలో 7.2 (1966లో 7.4), చిక్కమగళూరులో 9 (1975లో 11), దక్షిణ కన్నడలో 16.2 (1950లో 16.7), ఉత్తర కన్నడలో 9.5 (1966లో 15.6)గా నమోదయ్యాయి. బెంగళూరులో ఈ నెల 10న 10.4 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. అయితే 1883లో అతి తక్కువగా 8.9 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. -
ఐదేళ్లలో రైల్వే పెండింగ్ ప్రాజెక్ట్‌లు పూర్తి
కేంద్ర మంత్రి మల్లికార్జున ఖర్గే రాయచూరు, న్యూస్‌లైన్ : పెండింగ్‌లో ఉన్న రైల్వే ప్రాజెక్టులను వచ్చే ఐదేళ్లలో పూర్తి చేస్తామని రైల్వే శాఖ మంత్రి మల్లికార్జున ఖర్గే తెలిపారు. శనివారం ఆయన రాయచూరు సమీపంలోని మటమారి రైల్వేస్టేషన్లో మటమారి-మంత్రాలయం రైల్వే స్టేషన్ల మధ్య రైల్వే డబ్లింగ్ (జంట మార్గం) పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. దేశ వ్యాప్తంగా 587 రైల్వే ప్రాజెక్ట్‌ల పూర్తికి రూ.4.50 లక్షల కోట్లు ఆవసరమవుతాయన్నారు. అనంతరం ఆయన రూ.65 కోట్ల వ్యయంతో తుంగభద్ర నదిపై రైల్వే వంతెన పునరుదరణ పనులకు కూడా శంకుస్థాపన చేశారు. రాయచూరులో ముఖ్యమైన ఈ రైల్వే బ్రిడ్జిని త్వరగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఇప్పటికే జిల్లాలో రైల్వే పనుల జాప్యానికి బాధ్యులైన కాంట్రాక్టర్లను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టాలని ఆదేశించారు. మటమారి-మంత్రాలయం మధ్య 10 కిలోమీటర్ల డబ్లింగ్ పనులు 18 నెలల్లో పూర్తి అవుతాయన్నారు. సభలో మాట్లాడిన రాయచూరు రూరల్ ఎమ్మెల్యే తిప్పరాజు హవల్దార్... మంత్రి మల్లికార్జున ఖర్గేను హైదరాబాద్-కర్ణాటక అంబేద్కర్గా అభివర్ణించారు. కార్యక్రమంలో జిల్లాకు చెందిన ఎమ్మెల్యే లు, ఎంపీ పక్కీరప్ప, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
ప్రేమించలేదని.. విషం తాగించి చంపారు!
తన ప్రేమను నిరాకరించినందుకు ఓ యువతికి తన స్నేహితుడి సాయంతో విషం తాగించి మరీ చంపాడో దుర్మార్గుడు. ఈ దారుణ సంఘటన కర్ణాకటలోని రాయచూరు ప్రాంతం మీరాపుర గ్రామంలో జరిగింది. మహాదేవి అనే యువతి తండ్రికి మానసిక స్థితి సరిగా ఉండేది కాదు. దాంతో ఆమె చిన్నప్పటి నుంచి బంధువుల ఇంట్లో ఉండేది. పొలం పనులకు వెళ్తున్న ఆమెను పొరుగున నివసించే నాగరాజు, మారెప్ప అనే యువకులు ఆమె వెంటపడి ప్రేమించాలంటూ వేధించేవారు. కానీ అందుకు ఆమె నిరాకరించింది. ఈ విషయాన్ని ఆమె తన కుటుంబ సభ్యులకు కూడా చెప్పింది. దాంతో వాళ్లు ఆ యువకులను మందలించారు. ఆ యువతిపై కక్ష పెంచుకున్న మారెప్ప.. నాగరాజుతో కలిసి ఆమెను హతమార్చాలని నిర్ణయించుకున్నాడు. ఆదివారం రాత్రి మూత్రవిసర్జన కోసం బయటకు రాగా బలవంతంగా విషం తాగించారు. ఆమెను చికిత్సకు తరలించేలోపే మరణించింది. -
రాయచూరు, గుల్బర్గా జిల్లాల్లో వర్ష బీభత్సం
దేవదుర్గ/రాయచూరు సిటీ/లింగస్గూరు/సేడం, న్యూస్‌లైన్ : వరుణుడు బీభత్సం సృష్టించాడు. తుపాను ప్రభావంతో రాయచూరు, గుల్బర్గా జిల్లాల్లోని రాయచూరు, లింగస్గూరు, దేవదుర్గ తాలూకాలతోపాటు గుల్బర్గా జిల్లా సేడం తాలూకాలో మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు కుండపోత వర్షం కురిసింది. దీంతో వంకలు వాగులు పొంగిపొర్లాయి. పలు ప్రాంతాల్లో ఇళ్లు కూలి భారీగా ఆస్తి నష్టం జరిగింది. పొలాలు నీటమునిగి రైతులు తీవ్రంగా నష్టపోయారు. రాయచూరు తాలూకా యంకరాళ వద్ద వాగు ఉప్పొంగి ఆరు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. యంకరాళ్లు నుంచి అర్షలిగి వెళ్లె రహదారి కోసుకొని పోవడంతో విద్యుత్ స్తంభాలు నెలకొరిగాయి. దాదాపు వందకు పైబడిన ఇళ్లు కూలి పోయాయి. వర్షబాధిత ప్రాంతాలను రాయచూరు గ్రామీణ ఎమ్మెల్యే తిప్పరాజు, తాలూకా పంచాయితీ సభ్యుడు శ్రీధర్‌రెడ్డి, ముక్తియార్లు సందర్శించారు. బాధితులకు పరిహారంతో పాటు ఇళ్లు నిర్మించాలని ప్రభుత్వానికి విన్నవించారు. అదేవిధంగా సేడంలోని నృపతుంగ కాలేజీ రోడ్డు సమీపంలో కాలువలోకి భారీగా వర్షపు నీరు చేరడంతో ఊడగి గ్రామానికి చెందిన ఖయ్యూమ్ పాటిల్, మరెప్ప గల్లంతయ్యారు. ఎస్ఐ పరశురామ్ వనంజకర్ ఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. మరో వైపు పట్టణంలోని కోడ్లా క్రాస్, బసవనగర్ తాండా, చోటిగిరణి తాండా, రెహమత్నగర్, ఇందిరానగర్ కాలనీలు జలమయమయ్యాయి. ఇళ్లలోకి మురికి నీరు ప్రవేశించి ఆహార ధాన్యాలు, గృహోపకరణ వస్తువులు పాడై పేదల పస్తులుండాల్సిన పరిస్థితి నెలకొంది. దీనికి తోడు కరెంట్ కూడా లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు.