సాక్షి, రంగారెడ్డి : కళాశాల నుంచి సస్పెండ్ చేశారని ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన బుధవారం కర్ణాటకలోని రాయచూరులో చోటుచేసుకుంది. వివరాలివి.. ధీరజ్ అనే విద్యార్థి రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం బొంగళూర్‌లోని శ్రీచైతన్య కళాశాలలో ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. ధీరజ్ స్వస్థలం కర్నాటకలోని రాయచూరు.
ఈ నెల 26వ తేదీన ధీరజ్ కళాశాలలో ఫోన్‌లో మాట్లాడుతున్నాడు. ఇది గమనించిన యాజమాన్యం అతని మందలించి, కళాశాల నుంచి సస్సెండ్ చేసింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ధీరజ్ ఇంటికి వెళ్లిపోయాడు. జూన్ 27వ తేదీన ఇంటిలో ఉరివేసుకుని తనువు చాలించాడు. ఇది గమనించిన తల్లిదండ్రులు బోరున విలపించారు. విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘాల నాయకులు కళాశాల ఎదుట ఆందోళనకు దిగారు. అతని చావుకు కాలేజీ యాజమాన్యం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. తమ మిత్రుడి మరణవార్త విన్న తోటి విద్యార్థులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment