Inter student
-
పిఠాపురం నియోజకవర్గంలో ఇంటర్ విద్యార్థిని అదృశ్యం
-
పిఠాపురం: ఇంటర్ విద్యార్థిని అదృశ్యం..
సాక్షి, కాకినాడ జిల్లా: పిఠాపురం నియోజకవర్గంలో ఇంటర్ విద్యార్ధిని అదృశ్యమైంది. 15 రోజుల క్రితం కళాశాలకు వెళ్లిన కొడవలి గ్రామానికి చెందిన వరలక్ష్మీ(16) మిస్సింగ్ కావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రత్తిపాడులో విద్యార్థిని ఇంటర్ ఫస్ట్‌యర్ చదువుతోంది.తొలుత గొల్లప్రోలు పీఎస్‌లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన యువతి తల్లిదండ్రులతో పోలీసులు హేళనగా మాట్లాడారు. దీంతో గత నెల 22న ప్రత్తిపాడు పీఎస్ లో వరలక్ష్మీ అదృశ్యంపై ఫిర్యాదు చేశారు. వరలక్ష్మీ ఆచూకీ తెలియక పోవడంతో తల్లిదండ్రులు ఆందోళనలో ఉన్నారు. తమ కుమార్తె జాడ కోసం సాయం చేయాలని వరలక్ష్మీ తల్లిదండ్రులు పవన్‌కు లేఖ రాశారు. -
ఇంగ్లిష్ మీడియంలో పాఠాలు అర్థం కావడంలేదని..
చిలుకూరు: ఇంగ్లిష్ మీడియంలో పాఠాలు అర్థం కావడం లేదని, దీంతో మార్కులు తక్కువ వస్తున్నాయని ఇంటర్ విద్యార్థి మనస్తాపంతో ఉరివేసుకొని ఆత్యహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా చిలుకూరు మండల పరిధిలోని కవిత జూనియర్ కళాశాలలో ఆదివారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. పోలీసులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలం సజ్జాపురానికి చెందిన బీమన శేఖర్ కుమారుడు బీమన వినయ్ (17) చిలుకూరు మండల పరిధిలోని కవిత జూనియర్ కళాశాలలో ఎంపీసీ గ్రూప్‌లో చేరాడు. 10వ తరగతి వరకు తెలుగు మీడియంలో చదివిన వినయ్.. ఇంటర్లో ఇంగ్లిష్ మీడియంలో సబ్జెక్టులు అర్థంకాక మార్కులు తక్కువగా వస్తున్నాయని కొంతకాలంగా బాధపడుతున్నాడు. ఈ క్రమంలో దసరా సెలవులకు ఇంటికి వెళ్లిన వినయ్ తిరిగి కళాశాలకు వెళ్లడానికి ఇష్టపడలేదు. దీంతో తల్లిదండ్రులు సర్ది చెప్పి ఆదివారం అతడిని మేనమామ, బంధువులు తీసుకొని వచ్చి కళాశాలలో విడిచి పెట్టి వెళ్లారు. ఆ సమయంలో స్టడీ అవర్స్ నడుస్తుండటంతో విద్యార్థులు, అధ్యాపకులు తరగతి గదుల్లో ఉన్నారు. హాస్టల్ గదిలో లగేజీ పెట్టి వస్తానని వెళ్లిన వినయ్ అక్కడున్న ఫ్యాన్‌కు టవల్‌తో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అరగంట తరువాత గమనించిన తోటి విద్యార్థులు, అధ్యాపకులు వెంటనే అతడిని చికిత్స నిమిత్తం కోదాడలోని ప్రైవేట్ వైద్యశాలకు తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. వినయ్ తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రాంబాబు తెలిపారు. దసరా సెలవులు ముగించుకుని తిరిగి వెళ్లిన రోజే ఇలా జరగడంతో కుటుంబ సభ్యులు దిగ్భ్రాంతికి లోనయ్యారు. -
స్నేహితులే అలా చేసేసరికి.. నంద్యాల ఇంటర్ విద్యార్థి కేసులో విస్తుపోయే విషయాలు!
నంద్యాల, సాక్షి: ఆత్మకూరు ఇంటర్ విద్యార్థి అదృశ్యం కేసు.. విషాదాంతంగా మారిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసు దర్యాప్తు పూర్తి చేసిన పోలీసులు విస్తుపోయే వివరాల్ని మీడియాకు వెల్లడించారు. స్నేహితులే అతన్ని ఎత్తుకెళ్లడం, ఆపై అమానవీయంగా ప్రవర్తించడంతో అతను బలవర్మరణానికి పాల్పడినట్లు తెలిపారు. ఆత్మకూరు మండలం కొత్తపేటకు చెందిన ఇంటర్ విద్యార్థి వహీద్ బాషా ఈ నెల 13న కళాశాలకు వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. దీంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు కళాశాలకు వెళ్లి అడిగారు. వహీద్ కళాశాల ప్రాంగణంలో తిరిగి వెళ్లినట్లు తెలుసుకున్నారు. అయితే వహీద్ స్నేహితులే అతన్ని కిడ్నాప్ చేసినట్లు అనుమానించారు. ఆ నలుగురు యువకులపై అనుమానం ఉన్నట్లు పోలీసులకు తెలిపారు. ఈలోపు మూడు రోజులు గడిచాయి. అయినా వహీద్ జాడ తెలియకపోవడంతో అతని కుటుంబంలో ఆందోళన పెరిగిపోయింది. ఈలోపు.. ఆత్మకూరు శివారులోని ఓ బావిలో వహీద్ శవమై కనిపించాడు. దీంతో.. ఇది హత్యా? ఆత్మహత్యా? అనే కోణాల్లో దర్యాప్తు కొనసాగింది. చివరకు.. స్నేహితుల వల్లే వహీద్ చనిపోయాడని పోలీసులు నిర్ధారించారు. అర్బన్ సీఐ లక్ష్మినారాయణ వెల్లడించిన వివరాల ప్రకారం.. వహిద్‌కు స్నేహితులతో ఏవో గొడవలు ఉన్నాయి. ఈ క్రమంలో అతన్ని కిడ్నాప్ చేసిన తీవ్రంగా కొట్టిన యువకులు.. అతన్ని దుస్తులు విప్పించి బలవంతంగా ఫొటోలు తీశారు. దాడి గురించి బయట ఎవరికైనా చెబితే ఆ ఫొటోల్ని నెట్లో పెడతామని బెదిరించారు. దీనిని అవమానభారంగా భావించిన వాహిద్ చివరకు ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనకు కారకులైన నలుగురు యువకుల్ని అరెస్ట్ చేశాం అని తెలిపారయన. -
అనకాపల్లిలో మైనర్‌పై అత్యాచారం
అనకాపల్లి: మైనర్ బాలిక(14)పై అత్యాచారం చేసి, గర్భవతిని చేసిన ఇంటర్ విద్యార్థిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు రూరల్ ఎస్ఐ తేజేశ్వరరావు బుధవారం తెలిపారు. ఎస్ఐ తెలిపిన వివరాలు. వి.మాడుగుల మండలం కింతలివల్లాపురం గ్రామానికి చెందిన కుటుంబం పనుల నిమిత్తం అనకాపల్లి మండలం ఊడేరు గ్రామానికి వలస వచ్చారు. అదే గ్రామానికి చెందిన 17 ఏళ్ల ఇంటర్ విద్యార్థి బాలికపై అత్యాచారం చేశాడు. ప్రస్తుతం 5వ నెల గర్భవతి. బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తేజేశ్వరరావు తెలిపారు. -
క్లాస్ రూంలో దారుణం.. లెక్చరర్ ప్రాణం తీసిన ఇంటర్ విద్యార్ధి
విద్యా బుద్దులు నేర్పించే గురువులపై విద్యార్ధులు క్రూరంగా ప్రవర్తిస్తున్నారు.ఎందుకు సరిగ్గా చదవడం లేదు? అని ప్రశ్నించిన పాపానికి ఓ గురువు ప్రాణం తీశాడో ఇంటర్ విద్యార్ధి. క్లాసు రూంలోనే విచాక్షణా రహితంగా కత్తితో కసితీరా పొడిచి చంపాడు.అస్సోం రాష్ట్రం గౌహతిలో జరిగిన ఈ దుర్ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అస్సాంలోని శివసాగర్ జిల్లాలో రాజేష్ బారువా బెజవాడ (55) కెమిస్ట్రీ లెక్చరర్‌గా విధులు నిర్వహిస్తూనే..సొంతంగా ఓ స్కూల్‌ను రన్ చేస్తున్నారు.అయితే శుక్రవారం ఎప్పటిలాగే ఇంటర్ ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీ సబ్జెట్ చెప్పేందుకు క్లాస్‌కు వచ్చాడు. అనంతరం క్లాస్ రూంలో సరిగ్గా చదవడం లేదని, మీ తల్లిదండ్రుల్ని పిలుచుకుని రావాలని ఓ విద్యార్ధిని మందలించారు.ఆ మరసటి రోజు సదరు విద్యార్ధి సివిల్ డ్రెస్‌తో క్లాస్‌కు వచ్చాడు. పాఠం చెప్పేందుకు క్లాసుకు వచ్చిన రాజేష్ బారువా..సదరు విద్యార్ధిని మీ పేరెంట్స్‌ను పిలుచుకుని రమ్మనమన్నాను కదా.. పిలుచుకుని వచ్చావా? అని ప్రశ్నించారు. విద్యార్ధిని సమాధానం చెప్పకపోవడంతో ఇక్కడి నుంచి వెళ్లిపో అంటూ గట్టిగా అరిచారు.దీంతో అప్పటికే పక్కా ప్లాన్‌తో క్లాసుకు వచ్చిన విద్యార్ధి తన జేబులో ఉన్న పదునైన కత్తితో లెక్చరర్ రాజేష్‌పై దూసుకెళ్లాడు. తలమీద తీవ్రంగా పొడిచాడు. అక్కడి నుంచి పరారయ్యాడు. విద్యార్ధి దాడితో తీవ్ర గాయాలపాలైన రాజేష్ కుప్పకూలిపోయాడు. అప్రమత్తమైన సిబ్బంది, విద్యార్ధులు ఆయన్ను ఆస్పత్రికి తరలించారు. కానీ మార్గం మధ్యలోనే ఆయన మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. -
భుజం..భుజం..రాసుకుందని..
హైదరాబాద్: చిన్న గొడవ కారణంగా చోటు చేసుకున్న ఘర్షణ ఒకరి హత్యకు దారితీసిన సంఘటన బేగంపేట పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగి ంది. బాలంరాయి అంబేడ్కర్‌నగర్‌లో మంగళవారం రాత్రి జరిగిన సంఘటన వివరాలు ఇలా ఉన్నా యి. అంబేద్కర్‌నగర్‌లో నివాసం ఉంటున్న రాజు, యాదమ్మ దంపతుల కుమారుడు బి.తరుణ్ (18) ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. మంగళవారం రాత్రి అత ను స్థానిక శివాలయం సమీపంలోని చౌరస్తాలో ఉన్న ఓ పాన్ షాప్ వద్దకు వెళ్లాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న ఓ యువకుడి భుజం తరుణ్‌కు తగిలింది. దీంతో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి ఘర్షణకు దారి తీసింది. దీంతో సదరు యువకుడు మరో ముగ్గురిని తీసుకువచ్చాడు. నలుగురూ కలిసి తరుణ్‌తో గొడవకు దిగారు. పరిస్థితి అదుపుతప్పి ఘర్షణకు దారితీసింది. ఈ క్రమంలో తమ గదికి వెళ్లిన వారు కత్తి తీసుకువచ్చి తరుణ్‌ను పొడిచి అక్కడి నుంచి పరారయ్యారు. తీవ్రంగా గాయపడిన అతడిని స్థానికులు గాంధీ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. మృతుడి తల్లి యాదమ్మ పోలీసులకు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పోలీసుల అదుపులో నిందితులు.. బేగంపేట పోలీసులు నలుగురు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వరంగల్ జిల్లాకు చెందిన శివశంకర్, తరుణ్, జహీరాబాద్‌కు చెందిన పండు, సాయికిరణ్ తరుణ్‌ను హత్య చేసినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. వీరు ఉద్యోగం కోసం నగరానికి వచ్చి ఈ నెల 1న అంబేడ్కర్‌నగర్‌లో గదిని అద్దెకు తీసుకున్నట్లు విచారణలో వెల్లడైంది. నిందితుల్లో ఒకరైన సాయికిరణ్, బీ తరుణ్ మధ్య మొదట గొడవ జరగ్గా, సాయికిరణ్ మిగతా ముగ్గురిని తీసుకురావడంతో గొడవ పెద్దదై హత్యకు దారితీసినట్లుగా పోలీసులు పేర్కొన్నారు. -
ఇంటర్ విద్యార్థిని అనుమానాస్పద మృతి
హసన్‌పర్తి: హనుమకొండ జిల్లా హసన్‌పర్తి పరిధి భీమారంలోని ఓ ప్రైవేట్ కాలేజీకి చెందిన హాస్టల్లో శుక్రవారం తెల్లవారుజామున ఇంటర్ విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. అయితే తమ కూతురును హత్య చేసి, ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని ఆరోపిస్తూ తల్లిదండ్రులు, బంధువులు కాలేజీ ఎదుట ఆందోళనకు దిగారు. పోలీసుల కథనం ప్రకారం.. హనుమకొండ జిల్లా శాయంపేట మండలం గట్ల కనపర్తికి చెందిన వలుగుల ప్రభాకర్, కవిత దంపతుల పెద్దకూతురు సాహిత్య (17) భీమారంలోని ప్రైవేట్ జూనియర్ కళాశాలలో ఇంటర్ ఫస్టియర్ చదువుతోంది. ఆమె అదే కళాశాల హాస్టల్లోనే ఉంటోంది. ఇటీవల ఇంటర్ పరీక్షలు ప్రారంభం కావడంతో గత సబ్జెక్టుల్లో సాహిత్య అనుకున్నంత మేరకు పరీక్షలు రాయలేదు. దీంతో సాహిత్య మానసిక వేదనకు గురై ఆత్మహత్య చేసుకున్నట్లు ఆమె వద్ద లభ్యమైన సూసైడ్ నోట్ ద్వారా తెలుస్తోంది. భవనంపై నుంచి దూకి..? సాహిత్య, కళాశాల హాస్టల్ భవనం పైనుంచి శుక్రవారం తెల్లవారు జామున దూకి ఉండవచ్చని పోలీ సులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఉదయం సాహిత్య కింద పడి ఉండటం గమనించిన కళాశాల యాజమాన్యం హుటాహుటిన ఆమెను నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించింది. అక్కడినుంచి ఎంజీఎంకు తీసుకెళ్లారు. అయితే అప్పటికే ఆమె మృతిచెందినట్లుగా వైద్యులు ధ్రువీకరించారు. సూసైడ్ నోట్ లభ్యం.. ఇదిలా ఉండగా సాహిత్య రాసిన సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ‘జువాలజీ పరీక్ష రోజు చనిపోతున్నా’అని అందులో పేర్కొంది. అయితే పోలీసులు స్వా«దీనం చేసుకున్న ఆ సూసైడ్ నోట్ తన కూతురిది కాదని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపించారు. తమ కూతురును హత్య చేసి.. ఆత్మహత్య చేసుకున్నట్లు సూసైడ్ నోట్ రాసి పెట్టారని తెలిపారు. భవనంపై నుంచి దూకితే చేతిపై బ్లేడ్‌తో కోసిన గాయాలు ఎలా అయ్యాయని ప్రశ్నించారు. తమ కూతురు మృతదేహాన్ని గోప్యంగా ఎందుకు ఎంజీఎంకు తరలించారన్నారు. కళాశాల ఎదుట ఆందోళన తమకు న్యాయం చేయాలని కోరుతూ మృతురాలి తల్లిదండ్రులు, బంధువులు కళాశాల ఎదుట ఆందోళనకు దిగారు. సుమారు నాలుగు గంటల పాటు ఈ ఆందోళన కొనసాగింది. వారి ఆందోళనకు వి ద్యార్థి సంఘాలు మద్దతు ప్రకటించాయి. కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. హనుమకొండ ఏసీపీ దేవేందర్‌రెడ్డి, స్థానిక పోలీస్ ఇన్స్పెక్టర్ సంజీవ, ఎస్సైలు రాజ్‌కుమార్, సురేశ్‌లు ఆందోళనకారులను శాంతింపజేశారు. సాహిత్య మరణంపై అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు ఇన్స్పెక్టర్ సంజీవ తెలిపారు. కళాశాలలో ఉన్న సీసీ ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. అలాగే సూసైడ్ నోట్‌ను ఫోరెనిక్స్ పరీక్షలకు పంపించనున్నట్లు చెప్పారు. నేత్ర దానం సాహిత్య నేత్రాలు దానం చేశారు. తల్లిదండ్రుల కోరిక మేరకు ప్రాంతీయ నేత్ర వైద్యశాల, వరంగల్ సిబ్బంది నేత్రాలు సేకరించారు. -
ఆదిలాబాద్ జిల్లాలో విషాదం..విద్యార్థి ఆత్మహత్య
-
సూర్యాపేట జిల్లా ఇమాంపేట గురుకులంలో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య
-
ఇంటర్ విద్యార్థి దారుణ హత్య
కోలారు: మైనర్ బాలున్ని మరో మైనర్ బాలుర గుంపు చిత్ర హింసలకు గురి చేసి హత్య చేసింది. ఈ ఘటన శుక్రవారం రాత్రి 10 గంటల సమయంలో కోలారు నగరంలోని పీసీ కాలనీలో చోటు చేసుకుంది. సోషల్ మీడియా దుష్ప్రభావం, బాలలు, యువతలో పెరుగుతోన్న నేర ప్రవృత్తికి ఈ హత్య అద్దం పడుతోంది. కోలారు శాంతి నగర్‌కు చెందిన కార్మికుడు అరుణ్, సుశీల కుమారుడు కార్తీక్ సింగ్ (17) హత్యకు గురైన బాలుడు. వివరాలు.. కార్తీక్‌సింగ్ నగరంలోని కాలేజీలో ఫస్ట్ ఇయర్ ఇంటర్ చదువుతున్నాడు. పీసీ కాలనీకి చెందిన మరో మైనర్ బాలునికి కార్తీక్సింగ్తో గొడవలు ఉన్నాయి. నిందితుడు, అతని స్నేహితులు కార్తీక్ సింగ్‌కు పుట్టిన రోజు పార్టీ ఉందని చెప్పి తెలిపి ప్రభుత్వ బాలుర పాఠశాల మైదానంలోకి పిలిపించారు. అక్కడ అతన్ని తీవ్రంగా కొట్టి చిత్రహింసలు పెట్టారు. కత్తితో గొంతు కోసి పరారయ్యారు. రక్తపుమడుగులో మృతదేహం పడి ఉన్న వీడియోలు వైరల్ అయ్యాయి. నిందితుని నేరాల బాట వేమగల్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న పోలీస్ మురుగన్ కుమారుడు దిలీప్ అలియాస్ షైన్ సూత్రధారి అని ప్రచారం సాగుతోంది. దిలీప్ గత ఫిబ్రవరి నెలలో కూడా ఒకసారి కత్తితో ఒకరిపై దాడి చేశాడు, దీనిపై కోలారు నగర పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదు కాగా, పోలీసు కొడుకే అని సర్దిచెప్పి పంపారు. ఇతడు గంజాయికి బానిసై స్నేహితులతో కలిసి దౌర్జన్యాలు చేసేవాడు. సుమారు 8 నెలల కిందట కూడా కార్తీక్ సింగ్‌ని తీవ్రంగా కొట్టి వీడియోలు తీసి వైరల్ చేశారు. పోలీసుల గాలింపు పోలీసులు చేరుకుని మృతదేహాన్ని పోస్టు మార్టం కోసం ఎస్ఎన్ఆర్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. హంతకులు పరారీలో ఉండి వీరిని అరెస్టు చేయడానికి పోలీసులు 3 తనిఖా బృందాలను ఏర్పాటు చేశారు. ముగ్గురు అనుమానితులను అరెస్టు చేశారు. కఠినంగా శిక్షించాలి: కార్తీక్ తల్లి నా కుమారున్ని ఆ దుండగులే పిలుచుకుని వెళ్లారు. నేను కొంతసేపటికి కార్తీక్ మొబైల్‌కు ఫోన్ చేసినప్పుడు స్విచాఫ్ వచ్చింది. కార్తీక్‌ను ఎవరో కొట్టి చంపారని తరువాత మాకు తెలిసినవారు చెప్పారు. హంతకులకు కఠిన శిక్షలు విధించాలి. -
మిస్టరీగా ఇంటర్ విద్యార్ధిని భవ్యశ్రీ అనుమానాస్పద మృతి
సాక్షి, చిత్తూరు జిల్లా: ఇంటర్ విద్యార్థిని భవ్యశ్రీ అనుమానాస్పద మృతి కేసు మిస్టరీగా మారింది. న్యాయం కోసం పెనమూరు పీఎస్ ఎదుట బాధితురాలి కుటుంబ సభ్యులు, బంధువులు ఆదివారం ఆందోళన చేపట్టారు. కాగా వేణుగోపాలపురానికి చెందిన భవ్యశ్రీ ఈ నెల 17న అదృశ్యమైంది. 18వ తేదీన విద్యార్ధిని తండ్రి మునికృష్ణయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు. 20న ఎగువ చెరువు వద్ద బావిలో భవ్యశ్రీ శవమై కనిపించింది. పోస్టుమార్టం నిమిత్తం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఫోరెన్సిక్ నివేదిక ఆధారంగా పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఇప్పటికే ఈ కేసులో నలుగురు యువకులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. కాగా పోస్టుమార్టంలో ఆమె శరీరంపై ఎలాంటి గాయాలు లేవని ప్రాథమికంగా తెలిసిందని ఎస్ఐ అనిల్‌కుమార్ తెలిపారు. అఘాయిత్యం జరిగిందా, విషప్రయోగం జరిగిందా అని పరీక్షించేందుకు సాంపిల్స్ తీసుకున్నట్లు పేర్కొన్నారు. నీటిలో మునిగి ఊపిరాడక చనిపోయిందా? ఎక్కడి నుంచి అయినా తెచ్చి ఆమె మృతదేహాన్ని బావిలో పడేశారా అన్న విషయం తేల్చేందుకు స్టెరమ్‌బోన్ సాంపిల్స్‌ను కెమికల్ అనాలసిస్ కోసం తిరుపతి ఆర్ఎఫ్ఎస్ఎల్కు పంపుతున్నట్లు పేర్కొన్నారు. ఆ నివేదికలు వచ్చిన అనంతరం అనుమా నితులను సమగ్రంగా, నిష్పాక్షికంగా విచారిస్తామన్నారు. విచారణను తప్పుదారి పట్టించేలా అసత్య ప్రచారాలను, నిరాధార వార్తలను ప్రచారంచేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. చదవండి: రూ.2 లక్షలు లంచం డిమాండ్.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, ఆర్ఐ -
ఉరేసుకుందా.. గుండెపోటా?
వికారాబాద్: ఇంటర్ విద్యార్థిని మృతి అనుమానాస్పదంగా మారింది. ఉరేసుకుని మృతిచెందినట్లు గ్రామస్తులు చెబుతుండగా.. తమ బిడ్డ గుండె పోటుతో మృతిచెందిందని బాలిక తల్లిదండ్రులు పోలీసులకు చెప్పడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్థానికుల సమాచారం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.. మండలంలోని నాగారం గ్రామానికి చెందిన అపూర్వ (18) రంగారెడ్డి జిల్లా షాబాద్‌లోని ఓ గురుకుల కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. వారం రోజుల క్రితం కంటి నొప్పితో హాస్టల్ నుంచి ఇంటికి వచ్చింది. తండ్రి బైండ్ల వెంకటయ్యకు ఫోన్ చేసిన ప్రిన్సిపల్ బాలికను పంపించాలని సూచించారు. దీంతో తల్లిదండ్రులు అపూర్వకు విషయం చెప్పి హాస్టల్‌కు వెళ్లమని సూచించారు. ఆమె మాత్రం రాఖీ పౌర్ణిమ తర్వాత వెళతానని చెప్పడంతో చిన్నపాటి వాగ్వాదం జరిగింది. మిన్నకుండిపోయిన తల్లిదండ్రులు ఎవరి పనులపై వారు వెళ్లిపోయారు. తమ్ముడు సైతం ఇంట్లో లేకపోవడంతో ఒంటరిగా ఉన్న అపూర్వ చీరతో ఫ్యా న్కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి వెళ్లగా.. తమ కూతురు గుండెపో టు తో మృతి చెందిందని తల్లిదండ్రులు చెప్పారు. ఈ విషయమై ఫిర్యాదు చేసేందుకు నిరాకరించారు. -
ఇంటర్ విద్యార్థి విషాదాంతం.. చదవడం ఇష్టం లేక గోదావరిలో దూకాడు
దండేపల్లి: కాలేజీలో దింపేందుకు తీసుకెళ్లిన తండ్రి వద్దనుంచి కరీంనగర్ బస్టాండ్‌లో తప్పించుకున్న ఓ ఇంటర్ విద్యారి్థ...మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం గూడెం వద్ద గోదావరినదిలో శవమై తేలాడు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. దండేపల్లికి చెందిన నానవేని మల్లేశ్ కుమారుడు నానవేని ప్రశాంత్, అలియాస్ గట్టు(19) కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు కాలేజీలో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. ఇటీవల కాలేజీ నుంచి ఇంటికి వచ్చాడు. మంగళవారం అతన్ని కాలేజీలో దింపేందుకు తండ్రి మల్లేశ్ కరీంనగర్ బయల్దేరాడు. కరీంనగర్ బస్టాండులో దిగగానే ప్రశాంత్ తప్పించుకున్నాడు. కొద్దిసేపు బస్టాండులో అతనికోసం వెతికినా ఆచూకీ దొరకలేదు. కాలేజీకి వెళ్లి ఆరా తీయగా, కాలేజీకి రాలేదని చెప్పారు. దీంతో ఇంటికే వచ్చాడేమో అని తండ్రి దండేపల్లికి రాగా..ఇంటికి కూడా రాలేదని కుటుంబసభ్యులు చెప్పడంతో ప్రశాంత్‌ను వెదికేందుకు బయటికి వెళ్లాడు. ఇంతలో సాయంత్రం గూడెం గోదావరినదిలో శవం ఉందని తెలియడంతో అక్కడికి వెళ్లి చూడగా, అది ప్రశాంత్‌ది కావడంతో తల్లిదండ్రులు బోరున విలపించారు. ప్రశాంత్‌ను గతేడాది దండేపల్లి జూనియర్ కాలేజీలో చేరి్పంచగా ఫెయిల్ అయ్యాడు. అతన్ని ఆ కాలేజీ నుంచి తీసి, ఈయేడాది కరీంగర్‌లోని ఓ ప్రైవేటు కాలేజీలో చేరి్పంచారు. చదవడం ఇష్టం లేకనే గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకుని ఉంటాడని కుటుంబీకులు, బంధువులు భావిస్తున్నారు. -
నాన్న పట్టించుకోవడం లేదని..
వికారాబాద్: పదేళ్ల క్రితం తల్లి చనిపోవడం.. తండ్రి తాగుడుకు బానిస కావడం.. పెళ్లయిన సోదరుడు విడిగా ఉండడం.. కుటుంబ గొడవల కారణంగా అన్నతో మాటలు లేకపోవడంతో.. తనకెవరూ లేరని మనోవేదనకు గురైన ఓ ఇంటర్ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన వికారాబాద్ జిల్లా చౌడాపూర్ మండలంలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మల్కాపూర్‌కు చెందిన మనోహర్(16) ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఆదివారం మధ్యాహ్నం తన మొబైల్ వాట్సాప్‌లో ‘ఐ మిస్ యూ ఫ్రెండ్స్’ అని స్టేటస్ పెట్టాడు. ఇది చూసిన చిన్నాన్న కూమారుడు భాను ప్రసాద్.. మనోహర్‌కు ఫోన్ చేశాడు. స్పందించక పోవడంతో పొలం వద్దకు వెళ్లాడు. అప్పటికే మనోహర్ చెట్టుకు వేళాడుతూ విగతజీవిగా కనిపించాడు. ఈ విషయాన్ని భానుప్రసాద్ మృతుడి సోదరుడు మల్లేశ్‌కు తెలియజేశాడు. మనోహర్ తన తండ్రి, స్నేహితులతోనే ఎక్కువగా సన్నిహితంగా ఉండేవాడని.. కొంతకాలంగా నాన్న మద్యానికి బానిస కావడం.. తనను సరిగ్గా చూసుకోకపోవడంతో మనోవేదనకు గురై ఆత్మహత్య చేసుకున్నాడని మల్లేశ్ పొలీసులకు తెలిపాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పురుషోత్తం తెలిపారు. -
హన్మకొండలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య
సాక్షి, వరంగల్: హన్మకొండలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య కలకలం సృష్టిస్తుంది. నగరంలోని సువిద్యా జూనియర్ కళాశాలకు చెందిన ఫస్టియర్ విద్యార్థిని నాగజ్యోతి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్యకు గల కారణాలు స్పష్టంగా తెలియకపోయినప్పటికీ నిన్న జరిగిన ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్ సరిగా రాయకపోవడంతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నారు. జనగామ జిల్లా కొడకండ్ల మండలం ఏడునూతల గ్రామానికి చెందిన నాగజ్యోతి కళాశాలకు చెందిన హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్నారు. నిన్న పరీక్ష రాసి హాస్టల్‌కు వెళ్లిన విద్యార్థిని రాత్రి ఉరి వేసుకుంది. వెంటనే తోటి విద్యార్థులతో పాటు కళాశాల యాజమాన్యం ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. పేరెంట్స్ వస్తే గాని విద్యార్థిని ఆత్మహత్యకు గల కారణాలు తెలిసే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థిని ఆత్మహత్యతో కళాశాల వద్ద పోలీసులు భారీగా మోహరించి ఆందోళనలకు తావు లేకుండా చర్యలు చేపట్టారు. ఇంటర్ పరీక్షలు ప్రారంభమైన రోజునే విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడం సర్వత్రా ఆందోళనకు గురిచేస్తుంది. చదవండి: అందం ఆమె పాలిట శాపమైంది -
ఖమ్మం: సడన్ హార్ట్ ఎటాక్.. కుప్పకూలిన ఇంటర్ విద్యార్థి
సాక్షి, ఖమ్మం: చిన్న వయసులోనే గుండెపోటు సంఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా ఖమ్మం జిల్లాలో గుండెపోటుతో ఇంటర్ విద్యార్థి మరణించాడు. బోనకల్ మండలం బ్రాహ్మణపల్లికి చెందిన మరీదు రాకేష్ మధిరలోని ప్రైవేట్ కాలేజీలో చదువుతున్నాడు. ఇంటి ఆవరణలో స్నేహితులతో మాట్లాడుతుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఆసుపత్రికి తరలించే లోపు రాకేష్ మృతి చెందాడు. కాగా, అతి చిన్నవయసులో గుండెపోట్లు కనిపించడానికి కొన్ని అండర్లైయింగ్ ఫ్యాక్టర్స్ దోహదపడుతున్నట్లు వెల్లడైంది. కుటుంబ చరిత్రలోనే చిన్నవయసులో గుండెపోటు సంఘటనలు ఉండటం. గుండె నిర్మాణంలోనే పుట్టుకతో తేడాలు ఉండటం. గుండెలో లయబద్ధంగా కొట్టుకోడానికి నిత్యం ఒకే రీతిలో విడుదలయ్యే ఎలక్ట్రిసిటీ కావాలి. అది సయనో ఏట్రియల్ నోడ్ అనే గుండెలోని ఓ కేంద్రం నుంచి వెలువడుతుంది. ఈ కరెంటు వెలువడటంలోని తేడాలు (అబ్నార్మాలిటీస్) కూడా ఇలా యువత అకస్మాత్తు మరణాలకు ఒక కారణమని అధ్యయనాల్లో తేలింది. చదవండి: చిన్నవయసులోనే గుండెపోటు సంఘటనలు ఎందుకు? -
ఇన్విజిలేటర్ మందలించాడని.. ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య
మేడిపల్లి: పరీక్షాహాల్‌లో ఇన్విజిలేటర్ మందలించడంతో తీవ్ర మనస్తాపానికి గురైన శ్రీ చైతన్య కాలేజీ ఇంటర్ విద్యార్థిని రమాదేవి (17) కళాశాల హాస్టల్ గదిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మేడిపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. వివరాలిలా.. కర్నూల్ జిల్లా, బల్మూరు మండలం చెంచుగూడ గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీ నిమ్మల రాములు కుమార్తె రమాదేవి మేడ్చల్ జిల్లా ఫీర్జాదిగూడలోని శ్రీ చైతన్య కాలేజీలో బైపీసీ మొదటి సంవత్సరం చదువుతోంది. ప్రీ ఫైనల్ పరీక్షల్లో భాగంగా సోమవారం బోటనీ పరీక్ష రాస్తున్న సమయంలో ఇన్విజిలేటర్ రమాదేవిని మందలించారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురై పరీక్ష పూర్తికాగానే కళాశాల హాస్టల్ మూడవ అంతస్తులోని తన గదిలోకి వెళ్లి ఉరి వేసుకుంది. విషయాన్ని గమనించిన తోటి విద్యార్థులు ఆమెను కిందకు దింపి వెంటనే ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందిననట్లు డాక్టర్లు నిర్థారించారు. విద్యార్థి సంఘాల ఆందోళన విషయం తెలియగానే ఏఐఎస్ఎఫ్, ఎంఆర్పీఎస్, ఎస్ఎఫ్ఐ, ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో కళాశాల ఎదుట విద్యార్థి సంఘాలు ఆందోళన నిర్వహించాయి. కళాశాలలో ఒత్తిడి, వేధింపుల వల్లనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకుందని ఆరోపించారు. ఆందోళనకారులను మేడిపల్లి పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. రమాదేవి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు మేడిపల్లి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఫీజు కోసమే వేధించారు..! బల్మూర్: గత వారం తన కూతురిని ఫీజు కోసం పదేపదే అడిగారని, వేరుశనగ పంట డబ్బులు చేతికొచ్చిన తర్వాత చెల్లిస్తామని చెప్పామని నిమ్మల రాములు చెప్పారు. అయినా వినకుండా పదేపదే ఫీజు చెల్లించాలని తోటి విద్యార్థుల ముందు అవమానించడంతో భరించలేక ఆత్మహత్య చేసుకుందని ఆయన ఆరోపిస్తున్నారు. తన కుమార్తె మృతదేహన్ని కళాశాల యాజమాన్యం గాంధీ ఆస్పత్రికి తరలించి అక్కడ అడ్రస్ లేకుండాపోయిందని మండిపడ్డారు. విద్యార్థిని మృతితో చెంచుగూడెంలో విషాదం ఏర్పడింది. రాములు గ్రామంలో తనకున్న ఎకరా భూమిని సాగు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. -
మేడ్చల్: పీర్జాదిగూడలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య
-
ఇంటర్ విద్యార్థిని మృతి.. కాలేజీలో టాబ్లెట్ వేసుకుని..అంతలోనే
వత్సవాయి(జగ్గయ్యపేట) ఎన్టీఆర్ జిల్లా: అనుమానాస్పదస్థితిలో ఇంటర్ విద్యార్థిని మరణించిన సంఘటన బుధవారం వత్సవాయి మండలం భీమవరం గ్రామంలో జరిగింది. విద్యారి్థని కుటుంబసభ్యులు తెలిపిన వివరాల మేరకు గ్రామానికి చెందిన జి.రాముడు తాపీ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఆయనకు ఒక కుమార్తె జి.భార్గవి(19), కుమారుడు ఉన్నారు. భార్గవి నందిగామలోని ఒక ప్రయివేటు కళాశాలలో ఇంటర్ చదువుతోంది. రోజూ మాదిరిగానే కళాశాలకు వెళ్లిన భార్గవి తనకు ఒంట్లో నలతగా ఉందని కళాశాలలో టాబ్లెట్ వేసుకుంది. మధ్యలోనే ఇంటికి బయలుదేరిన భార్గవి బస్సులో ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో దాహం వేయడంతో పక్కనే ఉన్న ప్రయాణికుల దగ్గర ఉన్న మంచినీరు అడిగి తాగింది. ఇంటికి వచ్చాక కడుపులో మంటగా ఉందని కుటుంబసభ్యులకు తెలపడంతో వారు మరో టాబ్లెట్ తెచ్చి వేశారు. అయినప్పటికీ తగ్గకపోవడంతో భార్గవిని జగ్గయ్యపేట ప్రభుత్వాస్పత్రికి తరలించేలోపే మార్గంమధ్యంలో ప్రాణాలు కోల్పోయింది. తండ్రి రాములు ఫిర్యాదు మేరకు ఎస్ఐ అభిమన్యు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: అనుమానాస్పద స్థితిలో భార్య.. నిద్రమాత్రలు మింగి భర్త.. -
నిర్మల్ జిల్లాలో ఇంటర్ విద్యార్ధి ఆత్మహత్య
-
ఖమ్మం జిల్లాలో వెంటాడుతున్న సూదిమందు భయం
-
ఇంటర్ బోర్డ్ లీల: అప్పుడు ఫెయిల్... ఇప్పుడు పాస్
సాక్షి, హైదరాబాద్: ఇంటర్ బోర్డ్ లీల మరొకటి వెలుగులోకొచ్చింది. ఫెయిల్ అయిన విద్యార్థి రీ వ్యాల్యుయేషన్ జరిపిస్తే, ఏకంగా 31 మార్కులు తేడా వచ్చాయి. ఒకటి, అరా ఓకే కానీ, ఇన్ని మార్కుల తేడా ఎలా వచ్చిందని ఇంటర్ బోర్డ్ అధికారులు సైతం ముక్కున వేలేసుకుంటున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లకు చెందిన ముస్కాన్ బేగం ఈ ఏడాది మే నెలలో జరిగిన ఇంటర్ ద్వితీయ వార్షిక పరీక్షలకు హాజరైంది. అన్ని సబ్జెక్టులు కలిపి ఆమెకు 741 మార్కులొచ్చాయి. జువాలజీలో 10 మార్కులే రావడంతో ఫెయిల్ అయినట్టు ఫలితం వచ్చింది. దీంతో కంగారుపడ్డ బాలిక రీ వ్యాల్యుయేషన్‌కు వెళ్లింది. పూర్తి చేసిన అనంతరం 41 మార్కులు వచ్చినట్టు తేల్చారు. అంటే 31 మార్కులు తక్కువ వేసి, ఆమెను ఫెయిల్ చేశారు. ఇంటర్ బోర్డ్ నిర్వాకం కారణంగా తాను ఇన్ని రోజులు తీవ్ర మనోవేదనకు గురయ్యాయని ముస్కాన్ తెలిపింది. రీ వ్యాల్యుయేషన్‌కు రూ.600, సప్లిమెంటరీ పరీక్షకు రూ.500 చెల్లించానని, నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన తనకు ఇది కూడా భారమేనని తెలిపింది. ఇందుకు బాధ్యులైన వారిపై చర్య తీసుకోవాలని కోరింది. ఘటనతో కంగుతిన్న బోర్డ్ అధికారులు పేపర్ మూల్యాంకనం చేసిన అధ్యాపకుడిపై చర్యలకు సిద్ధమయ్యారు. నిబంధనల ప్రకారం అతనికి రూ. 5 నుంచి 10 వేలు జరిమానా, మూడేళ్లపాటు మూల్యాంకన బాధ్యతల నుంచి తప్పించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. కాగా, విద్యార్థుల భవిష్యత్‌తో ముడిపడి ఉన్న పరీక్షల విభాగంలో కొంతమంది జోక్యం వల్ల ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని తెలంగాణ ఇంటర్ విద్య పరిరక్షణ సమితి కన్వీనర్ మాచర్ల రామకృష్ణ గౌడ్ అన్నారు. -
ఇంటర్ సప్లిమెంటరీ: పరీక్ష కేంద్రంలోకి అనుమతించలేదని..
కేసముద్రం: ఆలస్యంగా పరీక్ష కేంద్రా నికి చేరుకున్న విద్యార్థినిని హాల్లోకి అనుమతించకపోవడంతో మనస్తాపా నికి గురైన ఆమె ఇంటి వద్ద పురుగుల మందుతాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం భూక్యా రాంతండా గ్రామపంచాయతీ శివారు కాలనీలో మంగళవారం చోటుచేసుకుంది. తండాకు చెందిన జాటోతు లచ్చిరాం, శారద దంపతుల చిన్న కుమార్తె సమీరా కేసముద్రం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ సెకండియర్(హెచ్ఈసీ) చదువుతోంది. అదే కళాశాలలో ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఫస్టియర్ పరీక్ష రాసేందుకు కేంద్రం వద్దకు 10 నిమిషాలు ఆలస్యంగా చేరుకుంది. పరీక్ష కేంద్రంలోకి అనుమతించబోమని కేంద్రం నిర్వాహకులు చెప్పారు. దీంతో మనస్తాపానికి గురైన ఆమె ఇంటికి చేరుకుని.. పురుగుల మందు తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను మహబూబాబాద్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం సమీరా చికిత్స పొందుతోంది. -
జవాబు పత్రాలు దిద్దిన అధ్యాపకుడి నిర్లక్ష్యం.. అప్పుడు 0.. ఇప్పుడు 44
ముదిగొండ: ఇంటర్మీడియట్ జవాబు పత్రాలు దిద్దిన అధ్యాపకుడి నిర్లక్ష్యంతో పరీక్షల్లో ఫెయిల్ అయినట్లు మెమో వచ్చిన విద్యార్థికి ఇప్పుడు ఊరట లభించింది. ఖమ్మం జిల్లా ముదిగొండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో హెచ్ఈసీ గ్రూప్‌తో చదివిన భద్రి గోపి ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు రాశాడు. ఇటీవల ప్రకటించిన ఫలితాల్లో అన్ని సబ్జెక్టుల్లో ఉత్తీర్ణుడైన అతడికి ఎకనామిక్స్‌లో మాత్రం సు న్నా మార్కులు వచ్చాయి. దీంతో ఎకనామిక్స్ జవాబు పత్రం రీ వాల్యుయేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ఈ సందర్భంగా ఎకనామిక్స్‌లో 44 మార్కులు వచ్చినట్లు కొత్త మెమోను బుధవారం వెబ్సైట్లో పొందు పరచడంతో గోపి ఊపిరి పీల్చుకున్నాడు. చదవండి👇 తస్మాత్ జాగ్రత్త.. కాల్ చేసి ]401]తో కలిపి డయల్ చేయాలని చెబుతున్నారా.. తెలంగాణలో జికా వైరస్ కలకలం.. హెచ్చరించిన వైద్యులు