
సాక్షి, హైదరాబాద్ : తల్లిదండ్రులు మందలించారని ఇంటిని వెళ్లిపోయిన ఇంటర్ విద్యార్థిని లారా అదృశ్యం కేసు సుఖాంతమైంది. ఆమె క్షేమంగా ఇంటికి తిరిగిరావడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. హయత్‌నగర్ తట్టిఅన్నారానికి చెందిన లారా.. తల్లిదండ్రులు మందలించారంటూ అలిగి మూడు రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయింది. తల్లిదండ్రులు, బంధువులు ఎక్కడ గాలించినా ఆమె ఆచూకీ లభించలేదు. చివరికి హయత్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు ఆమె కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సీసీ కెమెరా పుటేజ్ ఆధారంగా బాలిక జాడ కనుగొనేందుకు ప్రయత్నించారు. అయినప్పటికీ ఫలితం రాలేదు. చివరకు లారానే ఇంటికి తిరిగి రావడంతో కేసు సుఖాంతమైంది.
Comments
Please login to add a commentAdd a comment