hayath nagar
-
పెద్ద అంబర్‌పేట్‌లో విషాదం.. బస్సు కిందపడి చిన్నారి మృతి
సాక్షి, రంగారెడ్డి జిల్లా: పెద్ద అంబర్‌పేట్‌లో విషాదం జరిగింది. హయత్‌నగర్ శ్రీచైతన్య టెక్నో స్కూల్లో ఎల్కేజీ చదువుతున్న నాలుగేళ్ల విద్యార్థిని స్కూల్ బస్సు కింద పడి ప్రాణాలు కోల్పోయింది. బాలిక రోడ్డు దాటుతున్న విషయాన్ని గమనించకుండా వ్యాన్‌ను డ్రైవర్ రివర్స్ చేయడంతో వెనక టైర్ల కింద పడి చిన్నారి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.మరో ఘటనలో ఓ ప్రైవేటు పాఠశాల బస్సు.. బైక్‌ను ఢీకొట్టిన ఘటనలో ఇంజనీరింగ్ విద్యార్థి అక్కడికక్కడే మృతిచెందగా మరొకరికి గాయాలయ్యాయి. శంకర్పల్లి మండల పరిధిలోని ఎన్సీడీ రాయల్ పెవిలియన్ వద్ద బుధవారం సాయంత్రం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లా విజయవాడ అర్బన్ మండల కేంద్రానికి చెందిన శ్రీహర్ష(19)కు దొంతన్‌పల్లిలోని ఇక్ఫాయ్ డీమ్డ్ విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్ సీటు వచ్చింది. దీంతో అతని తల్లి మోకిలతండాలో ఓ గదిని అద్దెకు తీసుకుని ఇక్కడే ఉంటూ కొడుకును చదివిస్తోంది. శ్రీహర్ష నిత్యం బైక్‌పై కాలేజీకి వెళ్లివస్తుంటాడు.ఇదిలా ఉండగా బుధవారం కళాశాల ముగిసిన తర్వాత ఉప్పల్‌కు చెందిన క్లాస్మేట్ హర్షనందన్(19)ను తీసుకుని ఫ్రెషప్ అయ్యేందుకు మోకిలతండాకు వచ్చారు. సుమారు గంటపాటు రూంలో గడిపిన అనంతరం హర్షనందన్ను కాలేజీ వద్ద వదిలిపెట్టేందుకు బైక్‌పై తిరుగు ప్రయాణమయ్యారు. ఎన్సీడీ రాయల్ పెవిలియన్ సమీపంలో కొండకల్ వైపు అతివేగం, అజాగ్రత్తగా వెళ్తున్న ఏపీ మోడల్ పాఠశాల బస్సు వీరిని బలంగా ఢీ కొట్టింది. బైక్ నడుపుపుతున్న శ్రీహర్షకు బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందగా.. హర్షనందన్ పాక్షిక గాయాలతో బయటపడ్డాడు. అతన్ని శంకర్‌పల్లిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న మోకిల పోలీసులు శ్రీహర్ష మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. -
హయత్ నగర్ హత్యకేసులో సంచలన విషయాలు..!
-
హయత్ నగర్ లో చెడ్డీ గ్యాంగ్ కలకలం
-
గండం తప్పింది!
-
హయత్ నగర్ కార్పోరేటర్‌పై దాడి
-
లారా అదృశ్యం కేసు సుఖాంతం
సాక్షి, హైదరాబాద్ : తల్లిదండ్రులు మందలించారని ఇంటిని వెళ్లిపోయిన ఇంటర్ విద్యార్థిని లారా అదృశ్యం కేసు సుఖాంతమైంది. ఆమె క్షేమంగా ఇంటికి తిరిగిరావడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. హయత్‌నగర్ తట్టిఅన్నారానికి చెందిన లారా.. తల్లిదండ్రులు మందలించారంటూ అలిగి మూడు రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయింది. తల్లిదండ్రులు, బంధువులు ఎక్కడ గాలించినా ఆమె ఆచూకీ లభించలేదు. చివరికి హయత్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు ఆమె కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సీసీ కెమెరా పుటేజ్ ఆధారంగా బాలిక జాడ కనుగొనేందుకు ప్రయత్నించారు. అయినప్పటికీ ఫలితం రాలేదు. చివరకు లారానే ఇంటికి తిరిగి రావడంతో కేసు సుఖాంతమైంది. -
ఫ్యాన్‌కు ఉరేసుకుని యువతుల ఆత్మహత్య
-
గుండు గీయించుకుని నిరసన
-
యువతి ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలు
సాక్షి, హైదరాబాద్ : హయత్‌నగర్‌లో కిడ్నాప్ అయిన బీఫార్మసీ విద్యార్థిని కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. అపహరణకు గురై 24 గంటలు గడుస్తున్నా ఇంకా ఆమె ఆచూకీ తెలియకపోవడంతో పోలీసులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నిందుతుల కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. కేసు దర్యాప్తును స్వయంగా పరివేక్షిస్తున్న ఎల్బీ నగర్ డీసీపీ సంప్రీత్ సింగ్.. యువతి తండ్రి నుంచి పూర్తి వివరాలు సేకరిస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే యువతి ఆచూకీ తెలుసుకొని కుటుంబానికి అప్పగిస్తామని పేర్కొన్నారు. -
ఒకేరోజు నాలుగు చోట్ల చైన్‌స్నాచింగ్‌లు
-
బావ ఇంటికే కన్నం..
సాక్షి, హైదరబాద్: జల్సాలకు అలవాటు పడిన ఓ యువకుడు బావ ఇంటికే కన్నం వేసిన సంఘటన బుధవారం హయత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో వెలుగులోకి వచ్చింది. వనస్థలిపురం ఏసీపీ గాంధీ నారాయణ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి... హయత్‌నగర్ మండలం, బ్రాహ్మణపల్లికి చెందిన పరం ముత్యం, భువనేశ్వరి దంపతులు, భువనేశ్వరికి ఆరోగ్యం సరిగా లేకపోవడంతో గత నెల 1న కర్మన్‌ఘాట్‌లోని పుట్టింటికి వెళ్లి 10 రోజులకు తిరిగి వచ్చింది. ఈ మద్యకాలంలో ఆమె సోదరుడు గొబ్బురు రాజు తరచూ బావ ఇంటికి వచ్చి వెళ్లేవాడు. ఈ నెల 30న నగలను తీసుకునేందుకు తాళం చెవి కోసం వెదికినా దొరకకపోవంతో బీరువా తాళాలు పగులగొట్టి చూడగా ఉందులో ఉన్న 17.5 తులాల ఆభరణాలు కనిపించలేదు. దీంతో ముత్యం గత సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు ముత్యం బామ్మర్ది రాజుపై అనుమానంతో అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించాడు. నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు అతడి నుంచి చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. -
హయత్‌నగర్‌లో దారుణం
హైదరాబాద్: హయత్‌నగర్‌లో నిన్న రాత్రి(బుధవారం) దారుణం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి తన ప్రియురాలు, ఆమె స్నేహితురాలిపై యాసిడ్ దాడి చేశాడు. యాసిడ్ గాఢత తక్కువగా ఉండటం వల్ల ప్రమాదం తప్పింది. వివరాలు..హయత్‌నగర్ ప్రాంతానికి చెందిన శంకర్, ఝాన్సీలు రెండు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. ఝాన్సీ నగరంలోని ఓ పెట్రోలు బంకులో పనిచేస్తోంది. కొద్ది రోజుల క్రితం ఝాన్సీకి అదే పెట్రోలు పంపులో పనిచేస్తున్న రమ్య పరిచయమైంది. అప్పటి నుంచి ఝాన్సీ తనను పట్టించుకోవడం లేదని, తన గురించి రమ్య చెడుగా చెప్పిందని భావించి ఇద్దరిపై కోపం పెంచుకున్నాడు. పథకం ప్రకారం నిన్న రాత్రి నడుచుకుంటూ వెళ్తున్న ఇద్దరిపై బాత్రూంలో వాడే యాసిడ్‌తో దాడి చేశాడు. ప్రస్తుతం ఇద్దరూ చికిత్స పొందుతున్నారు. ప్రాణాపాయం లేదు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కారు బోల్తా: ఇద్దరికి గాయాలు
హైదరాబాద్ సిటీ: హయత్‌నగర్ మండలం ఈనమగూడ వద్ద 66వ నెంబర్ జాతీయరహదారిపై మారుతీ కారు పల్టీ కొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం హయత్‌నగర్‌లోని టైటన్ ఆసుపత్రికి తరలించారు. హైదరాబాద్ నుంచి నల్గొండ జిల్లా చిట్యాలకు వెళ్తుండగా గురువారం మధ్యాహ్నం ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
బైక్‌పై భర్త మృతదేహాంతో భార్య అరెస్ట్
హయత్‌నగర్ (రంగారెడ్డి జిల్లా) : హయత్‌నగర్ మండలం పెద్ద అంబర్‌పేట వద్ద బైక్‌పై మృతదేహాన్ని తరలిస్తున్న ఓ వ్యక్తిని, మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. మృతదేహాన్ని బైక్‌పై ఎల్బీనగర్ -మైత్రీనగర్ నుంచి హయత్‌నగర్- అంబర్‌పేట్‌కు తరలిస్తున్న సమయంలో వారిని చూసిన స్థానికులకు అనుమానం రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఈ సంఘటనకు సంబంధించి బైక్‌పై తరలిస్తున్న ప్రవళిక, ఉపేందర్ అనే ఇద్దరిని అరెస్ట్ చేశారు. మృతుడు ప్రవళిక భర్త పుల్లయ్యగా తేల్చారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. పుల్లయ్య కోదాడలోని వ్యవసాయ మార్కెట్లో సూపర్వైజర్గా పనిచేస్తున్నాడు. రోజూ కోదాడ నుంచి ఎల్బీనగర్ వెళ్లి వస్తుంటాడు. ఉపేందర్‌తో ప్రవళిక వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో పలుమార్లు హెచ్చరించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే ఇద్దరూ కలిసి పుల్లయ్యను హత్యచేసి ఉంటారేమోనని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆదివారం మధ్యాహ్నం చోటుచేసుకున్న ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. -
మరణించగానే మాయం.. ఆమె ఎవరు?
హయత్‌నగర్: రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ ఓ వృద్ధుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. అయితే, అప్పటి వరకూ ఆసుపత్రిలో ఉండి చికిత్స చేయించిన మహిళ అతడి శవాన్ని తీసుకెళ్లకుండా అనాథగా విడిచిపోయింది. హయత్‌నగర్ ఎస్ఐ శ్రీనివాస్ కథనం ప్రకారం... భాగ్యలతకాలనీ వద్ద ఈనెల 9న జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వృద్ధుడు తీవ్రంగా గాయపడగా.. ధనలక్ష్మి అనే మహిళ ఉస్మానియా ఆసుపత్రిలో చేర్పించింది. అతడి పేరు పి.రామారావు (66), తండ్రి వెంకటయ్య, నివాసం.. హయత్‌నగర్ పరిధిలోని భాగ్యలతకాలనీ అని రిజిస్టర్లో రాయించింది. గత తొమ్మిది రోజులుగా ఆసుపత్రిలో ఉండి అతడికి చికిత్స చేయింది. అయితే, ఆరోగ్యం విషమించడంతో వృద్ధుడు సోమవారం మృతి చెందాడు. ఈ విషయం తెలిసిన వెంటనే అప్పటి వరకూ అతడి వద్దే ఉన్న మహిళ కనిపించకుండాపోయింది. 24 గంటలు గడిచినా ఇప్పటి వరకూ వృద్ధుడి కోసం ఎవరూ రాలేదని, ఫొటోలో ఉన్న ఈ మృతదేహాన్ని ఎవరైనా గుర్తిస్తే పోలీసులను సంప్రదించాలని ఎస్ఐ కోరారు. -
హయత్ నగర్ అభ్యర్థిపై కత్తులతో దాడి
హైదరాబాద్: హయత్ నగర్ కాంగ్రెస్ అభ్యర్థిపై శనివారం అర్థరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. కారుపై రాళ్ల వర్షం కురిపించిన దుండగులు అనంతరం కత్తులతో దాడికి తెగబడ్డారు. దీంతో ఆయన స్వల్పంగా గాయపడ్డారు. హయత్ నగర్ కాంగ్రెస్ అభ్యర్థి ముత్యాల చంద్రశేఖర్‌రావు శనివారం రాత్రి ఎన్నికల ప్రచారం ముగించుకొని కారులో తిరిగి వస్తుండగా అనూహ్యంగా గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు. కారుపై రాళ్లతో దాడి చేయగా ఆయన తప్పించుకునే ప్రయత్నంలో కత్తితో వెనుక నుంచి దాడి చేశారు. స్వల్పగాయాలు కావడంతో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. -
హయత్ నగర్ లో రోడ్డు ప్రమాదం
హైదరాబాద్: హయత్ నగర్ పరిధిలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అబ్దుల్లాపూర్ వద్ద శ్రీ కృష్ణ ట్రావెల్స్ బస్సు ఓ లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్‌కు తీవ్ర గాయాలు అవగా, మరో ముగ్గురు ప్రయాణీకులు స్వల్ప గాయాలపాలయ్యారు. బాధితులను సమీప ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఆలయంలో చోరీ
హయత్‌నగర్ (రంగారెడ్డి జిల్లా) : రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ మండలం బాచారం గ్రామంలోని లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో చోరీ జరిగింది. ఆదివారం తెల్లవారుజామున గుర్తుతెలియని దుండగులు ఆలయంలో చొరబడి హుండీ ఎత్తుకెళ్లారు. అంతేకాకుండా ఆలయంలో ఉన్న రూ. 2లక్షల విలువైన స్వామివారి బంగారు, వెండి, ఇత్తడి ఆభరణాలను ఎత్తుకెళ్లారు. ఈ విషయం తెలిసిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించి, కేసు నమోదు చేసి దొంగల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. -
పెద్ద మొత్తంలో గంజాయి పట్టివేత
హయత్‌నగర్ (హైదరాబాద్) : ప్రత్యేకంగా తయారు చేసిన వాహనంలో తరలిస్తున్న రూ.5 లక్షల విలువైన గంజాయిని ఎక్సైజ్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు శనివారం రాత్రి పట్టుకున్నారు. హయత్‌నగర్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ నాగిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... విశాఖపట్నంకు చెందిన లక్ష్మణ్‌కుమార్ బొలేరో వాహనం (ఏపీ05 పీఏ 6985)లో సుమారు 256 కిలోల గంజాయిని నారాయణ్‌ఖేడ్‌కు చెందిన జాదవ్ కాశీరామ్‌కు విక్రయించేందుకు తరలిస్తున్నట్టు ఎక్సైజ్ పోలీసులకు సమాచారం అందింది. దీంతో శనివారం రాత్రి పెద్దఅంబర్‌పేట ఔటర్ రింగురోడ్డు వద్ద తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా బొలేరో వాహనాన్ని తనిఖీ చేయగా రూ.5 లక్షల విలువైన (125 ప్యాకెట్లు) గంజాయి రవాణా వెలుగు చూసింది. లక్ష్మణ్‌కుమార్‌తో పాటు కాశీరామ్, విజయనగరంకు చెందిన డ్రైవర్ కె.రమేష్‌లను అరెస్ట్ చేశారు. -
లక్ష కోళ్లకు బర్డ్‌ఫ్లూ
హయత్‌నగర్ : రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ మండలంలోని తొర్రూర్ గ్రామంలో ఉన్న ఓ కోళ్ల పారంలోని లక్ష కోళ్లకు బర్డ్‌ప్లూ సోకినట్లు సమాచారం. బర్డ్‌ప్లూ సోకిన కోళ్లలో ఇప్పటికే 20 వేల కోళ్లు మృతి చెందాయి. కాగా, తొర్రూర్ గ్రామానికి చెందిన శ్రీనివాసరెడ్డికి చెందిన కోళ్ల ఫారంలో ఈ సంఘటన జరిగింది. అయితే, ఫారంలో మిగిలిన కోళ్లను చంపివేయాలని అధికారులకు జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. అయితే, చనిపోయిన కోళ్లను కుప్పలుగా వేయడంతో వర్షం రావడంతో కొట్టుకుపోతున్నాయి. దీంతో కలెక్టర్ తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. బర్డ్ ఫ్లూ వ్యాధి విజృంభించే పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలో రెవెన్యూ అధికారులు వెంటనే హైఅలర్ట్ ప్రకటించారు . -
బర్డ్‌ఫ్లూ.. భయం..భయం
-
బర్డ్‌ఫ్లూ.. భయం..భయం
హైదరాబాద్: హైదరాబాద్‌లోని శివార్లలో ఏవియన్ ఇన్‌ఫ్లూయెంజా వైరస్(బర్డ్ ఫ్లూ)భయట పడింది. హయత్ నగర్ లోని ఓ కోళ్లఫాంలో కోళ్లకి బర్డ్ ఫ్లూ సోకినట్టు పూణే ల్యాబ్ నిర్ధారించింది. కోళ్ల ఫారంలోని 80 వేల కోళ్లకి బర్డ్ ఫ్లూ సోకినట్టు అధికారులు నిర్ధారించారు. దీంతో వ్యాధి సోకిన కోళ్లని ఈ రోజు అధికారులు చంపేయనున్నారు. బర్డ్ ఫ్లూ వ్యాధి విజృంభించే పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలో రెవెన్యూ అధికారులు వెంటనే హైఅలర్ట్ ప్రకటించారు . -
9 ఇసుక లారీలు సీజ్
హైదరాబాద్ : ఎటువంటి చర్యలు తీసుకుంటున్న ఇసుక అక్రమ రవాణాకు బ్రేక్ పడటం లేదు. ఇసుక అక్రమంగా రవాణా చేస్తున్న వారిపై అధికారులు కొరడా ఘళిపించారు. తాజాగా గురువారం వేర్వేరు ప్రాంతాల నుంచి ఇసుకను తరలిస్తున్న లారీలను ఆర్టీఏ అధికారులు సీజ్ చేశారు. నగరంలోని హయత్ నగర్ లో అధికారులు తనిఖీ నిర్వహించారు. ఈ దాడుల్లో ఎలాంటి అనుమతులు లేకుండా, అధిక లోడ్ తో వెళ్తున్న 9 లారీలను పట్టుకున్నారు. వాటిని సీజ్ చేసి స్టేషన్ కు తరలించారు. ఆయా లారీల యజమానులపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.