రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ మండలం బాచారం గ్రామంలోని లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో చోరీ జరిగింది.
హయత్‌నగర్ (రంగారెడ్డి జిల్లా) : రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ మండలం బాచారం గ్రామంలోని లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో చోరీ జరిగింది. ఆదివారం తెల్లవారుజామున గుర్తుతెలియని దుండగులు ఆలయంలో చొరబడి హుండీ ఎత్తుకెళ్లారు.
అంతేకాకుండా ఆలయంలో ఉన్న రూ. 2లక్షల విలువైన స్వామివారి బంగారు, వెండి, ఇత్తడి ఆభరణాలను ఎత్తుకెళ్లారు. ఈ విషయం తెలిసిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించి, కేసు నమోదు చేసి దొంగల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.