
నందిగామ: ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గంలో వరుస దొంగతనాలు పోలీసులకు సవాల్ గా మారాయి. వరుస దోపిడీలతో కలకలం రేపుతున్న దొంగలు.. భారీగా నగదు, బంగారం చోరీ చేస్తూ ప్రజల్ని హడలెత్తిస్తున్నారు. ఇంట్లో ఎవరూ లేని ఇళ్లనే ప్రధానంగా టార్గెట్ చేసి దొంగతనాలకు పాల్పడుతున్నారు దొంగలు. నందిగామ మండలం లింగాలపాడు గ్రామంలో కనిశెట్టి గాంధీ ఇంట్లో రూ. 3 లక్షల విలువగల బంగారాన్ని, రూ. 45 వేల రూపాయల్ని దోచుకెళ్లారు దొంగలు. చందర్లపాడు మండలం లక్ష్మీపురం గ్రామంలో రెండు ఇళ్లల్లో లక్షా 50 వేల నగదు చోరీ చేశారు దొంగలు.
చందర్లపాడు మండలంప కాండ్రపాడులో ఇళ్లలో సైతం దొంగలు చోరీకి పాల్పడ్డారు. చిన్న వెంకటరెడ్డి ఇంటిలో రూ. 12 లక్షల విలువగల బంగారం, రూ. 15 వేల నగదు చోరీ చేశారు. మహేశ్వర్ రెడ్డి ఇంటిలో రూ. 1 లక్ష 50 వేలు విలువగల బంగారం చోరీ చేశారు. నందిగామ ప్రాంతంలో ఒక్కరోజే రూ. 20 లక్షల రూపాయల విలువగల బంగారం, నగదు చోరీ చేశారు. నందిగామ పరిసర ప్రాంతాల్లో వరుస చోరీలు జరుగుతుండటంతో ప్రజలు భయాందోళనలకు గురౌతున్నారు.

Comments
Please login to add a commentAdd a comment