huge robbery
-
తిరుపతిలో భారీ చోరీ
-
తిరుపతి జిల్లా రాజుల కండ్రికలో భారీ చోరీ
-
బంజారాహిల్స్‌లో భారీ చోరీ
బంజారాహిల్స్: హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో ఓ వ్యాపారి ఇంట్లో భారీ చోరీ జరిగింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో పనిమనిషి ఉన్నదంతా ఊడ్చుకుని పరారయ్యాడు. వివరాలు.. బంజారాహిల్స్ రోడ్ నం 12లోని అంకుర్ ఆస్పత్రి సమీపం లో వ్యాపారి కపిల్‌గుప్తా నివసిస్తున్నారు. ఆదివారం సాయంత్రం 6.30 గంటలకు ఓ శుభకార్యానికి కుటుంబసభ్యులతో కలసి వెళ్లారు. తిరిగి సోమ వారం తెల్లవారుజామున 2.45 గంటలకు ఇంటికి వచ్చారు. ఇంటిలోకి వెళ్లిచూడగా బెడ్రూంలో బీరువా తాళాలు పగులగొట్టి ఉండటమే కాకుండా ఆభరణాల బాక్సులన్నీ చిందరవందరగా పడి ఉన్నాయి. వెంటనే బంజారాహిల్స్ పోలీసులకు ఆయన సమాచారం ఇచ్చారు. తమ ఇంట్లో నెలన్నర క్రితం బిహార్‌కు చెందిన రామ్(29) అనే వ్యక్తిని పనిమనిషిగా నియమించుకున్నామని పోలీసులకు తెలిపారు. పెళ్లికి వెళ్తూ ఇంటి బాధ్యతలను పనిమనిషికి అప్పగించినట్లు పేర్కొన్నారు. ఇదే అదనుగా భావించిన రామ్ బీరువాలోని రూ.5.70 లక్షల నగదు, రూ.కోటి విలువ చేసే బంగారు వజ్రాభరణాలను చోరీ చేసి ఇంటికి తాళంవేసి తాళం చెవులను గేటు వద్ద పెట్టి ఉడాయించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆదివారం సాయంత్రం 7.30 గంటల ప్రాంతంలో కపిల్‌గుప్తా మేనల్లుడు ఇంటికి వచ్చి డ్రెస్ మార్చుకుని వెళ్లాడు. ఆ తర్వాతే చోరీ జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు. నిందితుడికి సంబంధించిన ఎలాంటి ఆధారాలు సదరు యజమాని తీసుకోలేదు. నిందితుడి ఫొటోలు కూడా యజమాని వద్దలేకపోవడంతో దర్యాప్తునకు ఆటంకాలు ఏర్పడుతున్నాయి. -
లలితా జ్యువెలరీలో భారీ చోరీ
సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడులోని తిరుచిరాపల్లిలోని లలితా జ్యువెలరీ షోరూంలో భారీ చోరీ జరిగింది. రూ. 50 కోట్ల విలువైన నగలను దుండగులు చోరీచేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, తిరుచిరాపల్లి సత్రం బస్‌స్టేషన్ దగ్గర లలితా జ్యువెలరీ షోరూం ఉంది. అందులో గ్రౌండ్ ఫ్లోర్లో ప్రదర్శన కోసం ఉంచిన నగలు బుధవారం ఉదయానికి మాయమయ్యాయి. దీన్ని గుర్తించిన సిబ్బంది పోలీసులకు సమాచారమిచ్చారు. షోరూం వెనుక గోడకు కన్నం వేసి ఉంది. దుండగులు తమ వేలిముద్రలు ఫోరెన్సిక్ నిపుణులకు దొరక్కుండా ఉండేందుకు కారప్పొడి చల్లి వెళ్లారు. ముఖాలకు జోకర్ బొమ్మల మాస్క్‌లు వేసుకుని షోరూంలో సంచరించడం సీసీ కెమెరాల్లో రికార్డు అయింది. సుమారు రూ. 50 కోట్ల విలువైన వంద కిలోల బంగారం, వజ్రాలు, వెండి నగలను దొంగలు ఎత్తుకెళ్లినట్లు తెలిసింది. రూ.13 కోట్ల విలువైన నగలు చోరీకి గురయ్యాయని తిరుచ్చిలో లలితా జ్యువెలరీ యజమాని కిరణ్ చెప్పడం గమనార్హం. -
విజయనగరం: జిల్లాలో భారీ చోరీ
సాక్షి, విజయనగరం: జిల్లాలో చోరీ సంఘటన ఆలస్యంగా వెలుగ చూసింది. కొత్తవలస మండలం ఉత్తరాపల్లి శివారు గాంధీ నగరం వద్ద నివాసం ఉంటున్న రిటైర్డ్ కస్టమ్స్అధికారి మూనూరు సీతారాం ఇంట్లో గుర్తుతెలియని వ్యక్తులు దొంగతనానికి పాల్పడ్డారు. సుమారు ఇరవై మూడు తులాల బంగారం ఆభరణాలు, 25 తులాల వెండి వస్తువులు, లక్షా యాభైవేలు రూపాయలు నగదును ఎత్తుకెళ్లారు. ఈ మేరకు కుటుంబసభ్యుల ఫిర్యాదుతో కొత్తవలస పోలీసులు కేసు నమోదు చేశారు. క్లూస్ టీమ్ ఆధారాలు సేకరించే పనిలో ఉంది. -
మహిళలను కట్టేసి.. దాడి చేసి చోరీ
-
ఏపీ రాజధానిలో పట్టపగలే భారీ చోరీ
సాక్షి, గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాజధానిలో పట్టపగలే భారీ దోపిడి చోటు చేసుకుంది. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెనుమాకలో ఈ ఘటన జరిగింది. స్థానికంగా ఉండే బ్రహ్మరెడ్డి ఇంటికి బైక్‌పై వచ్చిన ముగ్గురు దుండగులు.. ఇంట్లో ఉన్న ఇద్దరు మహిళలను కట్టేసి, వారిపై దాడి చేసి చోరీ పాల్పడ్డారు. సుమారు కోటి ఇరవై లక్షల రూపాయల నగదు, 20 కాసుల బంగారు నగలను దుండుగులు ఎత్తుకు పోయినట్టు సమాచారం. ఈ సంఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ భారీ చోరీపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
'కుర్లా'లో భారీ దోపిడీ: 19 కిలోల బంగారం చోరీ
సాక్షి, అనంతపురం: అనంతపురం జిల్లాలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. కుర్లా ఎక్స్‌ప్రెస్‌లో దుండగులు ఆదివారం అర్ధరాత్రి భారీ దోపిడీ చేశారు. రైలులో ప్రయాణిస్తున్న ఓ వ్యాపారి నుంచి 19 కిలోల బంగారం అపహరించుకుపోయారు. దోపిడీ విషయం గుర్తించిన బాధితుడు బెంగళూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అనంతపురం జిల్లా ధర్మవరం పోలీసులకు కేసును బదిలీ చేశారు. ధర్మవరం పోలీసులు విచారణ చేపడుతున్నారు. నిందితుల కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చేస్తున్నాయి. దోపిడీ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
గోదావరి ఎక్స్‌ప్రెస్‌లో భారీ చోరీ
-
నిజామాబాద్‌లో భారీ చోరీ
నిజామాబాద్ : నిజామాబాద్ నగరంలోని హైమద్‌పురా కాలనీలో తాళం వేసి ఉన్న ఓ ఇంట్లో గురువారం రాత్రి దుండగులు చోరీకి పాల్పడ్డారు. 100 తులాల బంగారం, రూ. 50 వేల నగదు దోచుకెళ్లారు. ఇంటి యజమాని అబ్దుల్ హక్ జమీన్ ఖతార్‌లో ఉంటాడు. నగరంలో అతని భార్యా, పిల్లలు ఉంటారు. గురువారం ఇంట్లో వారంతా బంధువుల ఇంటికి వెళ్లి వచ్చేసరికి ఈ చోరీ జరిగింది. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు ప్రత్యేక బృందాల సాయంతో నిందితుల కోసం గాలింపు చేపట్టారు. -
హీరో షోరూంలో భారీ చోరీ
ఆళ్లగడ్డ: కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో భారీ చోరీ జరిగింది. హీరో షోరూంలో రాత్రివేళ దొంగలు చొరబడి షోరూంలోని లాకర్లో ఉన్న రూ.6.5 లక్షల నగదును ఎత్తుకెళ్లారు. పైకప్పు రేకులను తొలగించి దొంగలు లోపలికి వెళ్లినట్టు గుర్తించారు. ఉదయం 11 గంటలకు షోరూంను తెరిచేందుకు వచ్చిన యాజమాన్యం చోరీని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
నిడదవోలులో భారీ చోరీ
నిడదవోలు: పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలులో బుధవారం రాత్రి దొంగలు హల్చల్ చేశారు. స్థానిక కెనరా బ్యాంకు వీధిలో నివాసముంటున్న ఉద్దగిరి సత్యవతి ఇంట్లో దొంగలు పడి ఉన్నకాడికి ఊడ్చుకెళ్లారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. ఏడు తులాల బంగారు ఆభరణాలతో పాటు 6 కిలోల వెండి వస్తువులు అపహరించుకెళ్లినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. -
టీడీపీ నేత ఇంట్లో భారీ చోరీ
మండపేట: తూర్పుగోదావరి జిల్లా మండపేట మండలకేంద్రంలో మంగళవారం భారీ చోరీ జరిగింది. స్థానికంగా నివాసముంటున్న వల్లూరి సాయికుమార్ అనే టీడీపీ నేత ఇంట్లోకి దొంగలు ప్రవేశించి రూ.50 లక్షల విలువైన బంగారు ఆభరణాలు రూ.50 వేల నగదును దోచుకెళ్లారు. విషయం తెలిసి రామచంద్రాపురం డీఎస్పీ మురళీకృష్ణ సంఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్లను సంఘటనాస్థలానికి రప్పించి ఆధారాలు సేకరిస్తున్నారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసి గాలింపు చేపట్టారు. -
కూకట్‌పల్లిలో భారీ దొంగతనం
హైదరాబాద్: కూకట్పల్లి ఈనాడు కాలనీలోని ఓ ఇంట్లో భారీ చోరీ జరిగింది. ముక్తా నివాస్‌లోని ఫ్లాట్ నంబర్-403 యజమాని కుటుంబసభ్యులతో కలిసి బంధువుల ఇంటికి వెళ్లాడు. ఇంట్లో ఎవరూ లేకపోవటంతో ఇదే అదనుగా భావించిన దుండగులు బుధవారం అర్థరాత్రి ఇంటి తాళాలు పగులగొట్టి లోపలికి ప్రవేశించారు. బీరువాలో ఉన్న దాదాపు 45 తులాల బంగారు ఆభరణాలు, కిలోన్నర వెండి సామగ్రితో పాటు, ఒక లక్ష నగదును ఎత్తుకెళ్లారు. గురువారం ఉదయం గమనించిన పొరుగు ప్లాట్ వారు బాధితులకు సమాచారం అందించారు. వారు ఘటన స్థలికి చేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
నెల్లూరు జిల్లాలో భారీ చోరీ
చిల్లకూరు: శ్రీ పొట్టి శ్రీ రాములు నెల్లూరు జిల్లాలో భారీ చోరీ జరిగింది. జిల్లాలోని చిల్లకూరు మండలం నెలబల్లిరెట్టపల్లిలోని ఓ ఇంట్లో గురువారం రాత్రి దొంగలు పడి కొట్టిన్నర విలువైన బంగారు, వెండి ఆభరణాలను ఎత్తుకెళ్లారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
ఆల్వాల్‌లో భారీ చోరీ
అల్వాల్: నగరంలోని అల్వాల్ పోలీసు స్టేషన్ పరిధిలో భారీ చోరీ జరిగింది. స్థానిక భూపతిరావునగర్(ఓల్డ్ అల్వాల్)లో ఓ ఇంట్లో సోమవారం రాత్రి ఈ సంఘటన చోటుచేసుకుంది. ఇంట్లోకి చొరబడిన దొంగలు 33 తులాల బంగారు ఆభరణాలు, 2 కిలోల వెండి, రూ. 50 వేల నగదు చోరీ దోచుకెళ్లారు. బాధితుల ఫిర్యాదుతో అల్వాల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మియాపూర్‌లో భారీ చోరీ
హైదరాబాద్: తాళం వేసి ఉన్న ఇంట్లో దొంగలుపడి ఉన్నకాడికి ఊడ్చుకెళ్లారు. ఈ సంఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆర్టీసీ కాలనీ రైల్వేట్రాక్ సమీపంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాలనీకి చెందిన సాయికిరణ్ నెదర్‌ల్యాండ్‌లో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో ఆర్టీసీ కాలనీలోని అతని ఇంట్లో సోమవారం రాత్రి దొంగలు పడి ఇంట్లో ఉన్న 6 తులాల బంగారు ఆభరణాలు, 8 కిలోల వెండి వస్తువులతో పాటు రూ. 30 వేల నగదును ఎత్తుకెళ్లారు. ఇది గుర్తించిన సాయికిరణ్ బంధువులు ఈరోజు మియాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. -
సీతమ్మధారలో రూ. 9 లక్షల చోరీ
విశాఖ: విశాఖపట్నం సీతమ్మధారలో గురువారం మధ్యాహ్నం భారీ చోరీ జరిగింది. నగరంలోని సీతమ్మధారలోని ఎంవీపీ కాలనీ ఏఎస్‌రాజా కళాశాల సమీపంలో ఓ వ్యక్తి నుంచి రూ. 9 లక్షలను ఆగంతకులు లాక్కెళ్లారు. ఈ సంఘటన గురువారం మధ్యాహ్నం జరిగింది. ద్వారకనగర్‌కు చెందిన ఒక వ్యక్తి బ్యాంకులో రూ. 9 లక్షలు డ్రాచేసి తెమ్మని కారు డ్రైవర్ శ్రీనివాస్‌కు చెక్కు ఇచ్చి పంపాడు. డ్రైవర్ కారులో వెళ్లి డబ్బు తీసుకుని వచ్చాడు. ఇంటివద్ద కారును ఆపి డోర్ తీస్తుండగా వెనుక వచ్చిన ఇద్దరు దుండగులు ఒక్కసారిగా కారులోని నగదు సంచిని లాక్కొని ద్విచక్రవాహనంపై ఉడాయించారు. రెప్పపాటులో జరిగిన ఈ సంఘటనతో నివ్వెరపోయిన డ్రైవర్పో లీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు దుండగుల కోసం గాలిస్తున్నారు. -
కంట్లో కారం కొట్టి.. భారీ దోపిడీ!
పులివెందుల: వైఎస్సార్ జిల్లాలో సోమవారం ఉదయం భారీ దోపిడీ జరిగింది. పులివెందులలోని ఏటీఎంలో డబ్బులు పెడుతున్న వెళ్తున్న ఉద్యోగులపై దోపిడి దొంగలు దాడి చేశారు. వారి నుంచి భారీగా డబ్బును దోచుకుపోయారు. ఏటీఎంలో నగదు పెట్టేందుకు వెళుతున్న సిబ్బంది ఇద్దరిపై గుర్తుతెలియని వ్యక్తులు కళ్లలో కారం చల్లి రూ. 53లక్షల నగదు దోచుకెళ్లారు. టాటా కన్సల్టెన్సీకి చెందిన విక్రమ్, శీను అనే యువకులు రెండు ఏటీఎంలలో పెట్టేందుకు నగదు బైక్‌పై తీసుకెళుతుండగా గుర్తుతెలియని వ్యక్తులు దాడిచేశారు. కళ్లలో కారం పొడిని చల్లి, రాళ్లతో దాడిచేసి వారి వద్ద ఉన్న రూ.53 లక్షల నగదును దోచుకెళ్లారు. ఈ సంఘటన పులివెందులలోని ఎస్బీఐ పక్కన ఉన్న రోడ్డులో జరిగింది. ఎస్బీఐ ఏటీఎంలో నగదు పెట్టేందుకు వారు వెళుతుండగా ద్విచక్రవాహనంపై వచ్చిన ఇద్దరు వ్యక్తులు వారి కళ్లలో కారంపొడిని చల్లారు. వారు కింద పడిపోవడంతో రాళ్లతో కొట్టి బ్యాగులో ఉన్న నగదును దోచుకెళ్లారు. గమనించిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విక్రమ్, శీనును చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఎలాంటి సెక్యూరిటీ లేకుండా ద్విచక్రవాహనంపై అంత భారీ మొత్తం తీసుకెళ్లడంపై పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సమీపంలోని సీసీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. -
గోల్కొండ PS పరిధిలో భారీ చోరి
-
పట్టపగలే 7 కిలోల బంగారం చోరీ
తగరపువలస(విశాఖపట్టణం): విశాఖ జిల్లాలో పట్టపగలే దొంగలు రెచ్చిపోయారు. విశాఖపట్నంలోని తగరపువలస ప్రాంతంలోని ఓ నగల దుకాణంలో గురువారం ఉదయం భారీ దొంగతనం జరిగింది. మెయిన్ రోడ్డులో ఉన్న సాయిపద్మ జ్యువెలరీ దుకాణం పై అంతస్తులో యజమాని ఉప్పల శ్రీకాంత్ నివాసం ఉంటుంది. దుకాణంలో సొత్తును ప్రతిరోజూ ఆయన ఇంట్లోనే భద్రపరుస్తుంటారు. రోజు మాదిరిగానే సుమారు ఏడు కిలోల బంగారు, వెండి ఆభరణాలను దుకాణంలోకి తీసుకువచ్చిన శ్రీకాంత్ వాటిని అక్కడే ఉంచి... ఎదురుగా రోడ్డు అవతల ఉన్న సాయిబాబా ఆలయంలోకి వెళ్లారు. అక్కడ బాబాను దర్శించుకుని తిరిగి వచ్చి చూసేసరికి నగలు ఉన్న బ్యాగులు కనిపించలేదు. దీంతో ఆయన వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వివరాలు తెలుసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. -
చైతన్యపురిలో ఓ ఇంట్లో భారీ చోరీ
హైదరాబాద్: ఓ బ్యాంక్ ఉద్యోగి ఇంట్లో బుధవారం భారీ చోరీ జరిగింది. నగరంలోని చైతన్యపురి అల్కాపురిలో బ్యాంక్ ఉద్యోగిని రాజేశ్వరి ఇంట్లో దొంగలు చోరీకి పాల్పడ్డారు. ఈ చోరీలో 33 తులాల బంగారం, 10 లక్షల నగదును దొంగలు అపహరించినట్టు సమాచారం. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
తిరుపతిలో భారీ చోరీ
తిరుపతి : చిత్తూరు జిల్లా తిరుపతి లో భారీ చోరి జరిగింది. ఓ వ్యాపారి ఇంట్లో దొంగలు చొరబడి సుమారు రూ. 15 లక్షల విలువైన వస్తువులను దోచుకెళ్లారు. ఈ సంఘటన శుక్రవారం తిరుపతి నగరంలోని సత్యనారాయణపురం, శివజ్యోతినగర్‌లో జరిగింది. వివరాలు.. శివజ్యోతినగర్‌కు చెందిన రవిశంకర్ ఇంట్లో శుక్రవారం తెల్లవారుజామున దొంగలు పడి రూ. 5లక్షల నగదు, 20 తులాల బంగారు ఆభరణాలు, రెండు విలువైన సెల్ఫోన్లు, క్రెడిట్ కార్డులను ఎత్తుకెళ్లారు. ఉదయాన్ని దొంగలు పడిన విషయాన్ని ఇంటి యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు డాగ్ స్వ్కాడ్ సహాయంతో నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. -
చైతన్యపురిలో భారీ చోరి
హైదరాబాద్:ఇంట్లోవాళ్లంతా నిద్రిస్తున్న సమయంలో దొంగలు తెగబడ్డారు. చడి చప్పుడు కాకుండా ఇంట్లో ఉన్న 85 తులాల బంగారాన్ని దోచుకెళ్లారు. ఈ సంఘటన నగరంలోని చైతన్యపురి పరిధిలో శుక్రవారం తెల్లవారుజామున జరిగింది. మలక్‌పేట్ మార్కెట్లో వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న ప్రభాకర్ అనే వ్యాపారి ఇంట్లో ఈ చోరి జరిగింది. గురువారం అర్థరాత్రి ఇంట్లో చొరబడిన దొంగలు 85 తులాల బంగారాన్ని ఎత్తుకెళ్లారు. చోరి జరిగిన విషయం శుక్రవారం ఉదయం గుర్తించిన ప్రభాకర్ పోలీసులకు సమాచారం అందించాడు. సంఘటనా స్థలానికి చేరుకొన్న పోలీసులు వివరాలు సేకరించి కేసు నమోదు చేశారు. -
జీడిమెట్లలో చోరి
జీడిమెట్ల : ఇంట్లో ఎవరు లేని సమయం చూసి పట్టపగలే దొంగలు తెగబడ్డారు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా జీడిమెట్ల పోలీసు స్టేషన్ పరిధిలో గురువారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. జీడిమెట్ల పరిధిలోని కుత్బుల్లాపూర్ దత్తసాయి రెసిడెన్సిలోని 104 ప్లాట్‌లో పట్టపగలు చోరీ జరిగింది. ప్లాట్‌లో నిమాసముంటున్న పరమేశ్వర్ అనే వ్యక్తి ఇంట్లో ఎవరులేని సమయంలో దొంగలుపడి 19 తులాల బంగారాన్ని ఎత్తుకెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానకి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. -
నిజామాబాద్‌లో భారీ చోరీ
నిజామాబాద్ త్రీ టౌన్: నిజామాబాద్ పట్టణంలోని త్రీటౌన్‌లో మంగళవారం భారీ చోరీ జరిగింది. వివరాలు..మహారాష్ట్రకు చెందిన బాబారావు త్రీటౌన్‌లో కొన్ని సంవత్సరాల క్రితమే వలస వచ్చి జీవనం సాగిస్తున్నాడు. అతనికి నలుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కాగా, గత ఏడాది సెప్టెంబర్‌లో మహారాష్ట్రలోని ధర్మాబాద్‌లో ఉన్న తన నాలుగున్నర ఎకరాల పొలాన్ని రూ. 28 లక్షలకు విక్రయించాడు. ఈ క్రమంలోనే సెప్టెంబర్‌లో లక్ష రూపాయలను అడ్వాన్స్‌గా తీసుకున్నాడు. కాగా, ఫిబ్రవరిలో మిగిలిన రూ.26 లక్షలను తీసుకొని వచ్చి ఇంటిలో భద్రపరిచాడు. అయితే మంగళవారం చూసుకుంటే డబ్బులు కనిపించలేదు. దీంతో పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్లూస్ సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే ప్రస్తుతం వారున్న ఇంటిలో 13 మంది కుటుంబసభ్యులు ఉంటారు. దీంతో దొంగలు వచ్చే అవకాశమే లేదని పోలీసులు భావిస్తున్నారు. కాగా, 15 రోజుల క్రితం వచ్చిన పెద్దల్లుడు ఈ రోజే తిరిగి తన ఊరికి వెళ్లాడు. అతను వెళ్లిన తర్వాత చూసుకుంటే డబ్బు కనిపించడంలేదు. అంతేకాకుండా ధర్మాబాద్‌లోని భూమిని పెద్దళ్లుడే అమ్మించాడు. దీంతో అతనిపై అనుమానాలు వ్యక్తమవుతుండటంతో..ఆ కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. -
జువారిలో భారీ చోరీ
ఎర్రగుంట్ల మండల పరిధిలోని జువారి కర్మాగారంలోని కాలనీలో గురువారం రాత్రి ఏకంగా ఏడు ఇళ్లల్లో భారీ చోరీలు జరిగాయి. తాళాలు వేసిన ఇళ్లనే టార్గెట్‌గా చేసిన దొంగలు భారీ మొత్తంలో బంగారు, వెండిని అపహరించారు. కడప సీసీఎస్ డీఎస్పీ నాగేశ్వరరెడ్డి, ఎస్సీ, ఎస్టీ సెల్ డీఎస్పీ సుధాకర్‌లు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఎర్రగుంట్ల: మండల పరిధిలోని జువారి కర్మాగారంలోని కాలనీలో గురువారం రాత్రి ఏకంగా ఏడు ఇళ్లల్లో భారీ చోరీలు జరిగాయి. తాళాలు వేసిన ఇళ్లనే టార్గెట్‌గా చేసిన దొంగలు బంగారు, వెండి భారీ మొత్తలంలో అపరించారు. కాలనీలో డీబ్లాక్‌లోని 9/2, 10/2, 5/3, 8/3 గదులలో, ఈ బ్లాక్‌లోని 8/1, 10/2, 13/3 క్వార్టర్సులలోని గదులలో ఈ చోరీలు జరిగాయి. ఇటీవల ప్రొద్దుటూరులో జరిగిన చోరీల మాదిరిగానే జువారిలో జరిగిందని పోలీసులు అధికారుల అభిప్రాయ పడుతున్నారు. లబోదిబోమంటున్న బాధితులు.. డీబ్లాక్‌లోని 8/3 గదిలో నివాసమంటున్న గంగాకృష్ణ గురువారం రాత్రి ప్రొద్దుటూరుకు పోయాడు.శుక్రవారం ఇంటికి వచ్చి చూడగా తాళం పగులగొట్టబడి ఉంది. ఇంట్లోకి పోయి చూడగా సుమారు 40 తులాల బంగారు పోయిందని వాపోయాడు. తమ ఇంట్లో సుమారు 45 తులాల బంగారు పోయిందం టూ ఉమామహేశ్వరరెడ్డి లబోదిబోమంటున్నాడు. అలాగే తమ ఇంట్లో రూ.1.50లక్షలు విలువ గల బంగారు పోయిందని ఫణికుమార్ తెలిపాడు. సెక్యూరిటీల నివాసం వద్ద ఆగిన డాగ్ స్వ్కాడ్.. చోరీల సంఘటన స్థలం తెలుసుకోవడానికి కడప నుంచి ప్రత్యేక డాన్ అనే డాగ్ స్క్వాడ్‌ను పిలిపించారు. ఈ డాగ్‌ను మొదట లింగారెడ్డి ఇంట్లో జరిగిన స్థలంలోని కొన్ని వస్తువుల వాసన చూసింది. తర్వాత నేరుగా కాలనీలో కొన్ని ప్రాంతాలు తిరిగి కాలనీ చివర ఉన్న సెక్యురిటీల నివాసం వద్దకు పోయి గదిలో ఓ సెక్యురిటీ పడుకోని ఉన్న పరుపును చూసింది. అనంతరం ఉమామహేశ్వర రెడ్డి ఇంట్లో వస్తువులు వాసన చూసి నేరుగా డీబ్లాక్‌లోని క్వార్టర్స్‌లోనూ చూసింది. రెండోసారి కూడా డాగ్ స్క్వాడ్ సెక్యురిటీ నివాసం వద్దకు పోయి ఆగింది. కాగా భారీ సెక్యురిటీ కలిగిన కాలనీలోని క్వార్టర్స్‌లో చోరీలు జరగడం ఇదే తొలిసారి. పరిశీలించిన డీఎస్పీలు: కడప సీసీఎస్ డీఎస్పీ నాగేశ్వరరెడ్డి, ఎస్సీ, ఎస్టీ సెల్ డీఎస్పీ సుధాకర్‌లు, సీఐ పీటీ కేశవరెడ్డి, ఎస్ఐ సంజీవరెడ్డిలు చోరీలు జరిగిన ఇళ్లను పరిశీలించారు. చోరీ జరిగిన తీరును సీఐను అడిగి తెలుసుకున్నారు. ఇంటి తలుపులును ఏవిధంగా పగులగొట్టారో పరిశీలించారు. ప్రొద్దుటూరులో జరిగిన విధంగానే ఇక్కడ కూడా జరిగింది డీఎస్పీ నాగేశ్వరరెడ్డి అన్నారు. ఇది అనుభవం గల దొంగల పని అని అన్నారు. అన్ని కోణాలలో పరిశీలిస్తామని చెప్పారు. చోరీల జరిగిన సమీపంలోని బయట గడ్డి పొదలలో ఒక డైరీ కన్పించింది. దీనిని కూడా పరిశీలించారు. తర్వాత కడప నుంచి వచ్చిన క్లూస్‌టీం సిబ్బంది సంఘటనా స్థలానికి వచ్చి 7 ఇళ్లల్లో వేలిముద్రలను సేకరించారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ సంజీవరెడ్డి అన్నారు. 80 తులాలు బంగారు, రెండు కిలోల వెండి అపహరణ ఎర్రగుంట్ల: జువారి కాలనీలో ఏడు ఇండ్లల్లో జరిగిన చోరీలో సుమారు 80 తులాల బంగారుతో పాటు 2 కిలోల వెండి అభరణాలు పోయినట్లు ఎస్ఐ సంజీవరెడ్డి తెలిపారు. ఎలాంటి నగదు పోలేదని అన్నారు. బాధితుల ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసును నమోదు చేసి ధర్యాప్తు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. -
నిద్ర లేచేసరికి ఇల్లు గుల్ల
సూళ్లూరుపేట, న్యూస్‌లైన్: ఇంటి యజ మానులు నిద్రలో ఉండగా లోనికి ప్రవేశించిన దొంగలు భారీ చోరీకి పాల్పడ్డారు. విశాలమైన ఇంట్లోని ఓ గదిలో నిద్రపోతున్న బాధితులు దొంగల అలికిడిని గమనించలేకపోయారు. ఇదే అదనుగా దుండగులు 121 సవర్ల బం గారు నగలు, ఐదు కిలోల వెండి వస్తువులు, రూ.5.50 లక్షల నగదు ఎత్తుకెళ్లారు. ఈ భారీ చోరీ సూళ్లూరుపేటలో మంగళవారం అర్ధరాత్రి జరిగింది. పోలీసుల కథనం మేరకు.. షార్బస్టాండ్ సమీపంలో సినీ నిర్మాత ఎన్వీ ప్రసాద్ సోదరుడు ఎన్ వీ మురళి నివాసం ఉంటున్నారు. విశాలమైన ఇంట్లోని ఓ గదిలో మురళీ దంపతులు నిద్రపోయారు. అర్ధరాత్రి తర్వాత ప్రధాన ద్వారం తలుపులు పగలగొట్టి దొంగలు లోనికి ప్రవేశించారు. గది తలుపులు పగలగొట్టి సొమ్మంతా ఎత్తుకెళ్లారు. బుధవారం ఉదయం నిద్రలేచిన మురళి దొంగలు పడినట్లు గమనించి సొత్తు ఉన్న గదిని పరిశీలించాడు. బంగారు, వెండి ఆభరణాలతో పాటు నగదును దొంగలు ఎత్తుకెళ్లినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. 'సీఐ ఎం.రత్తయ్య, ఎస్సై బి.అంకమరావు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. జాగిలం ఇంటి చుట్టూ తిరిగి వెనక వీధిలో కొంతదూరం వెళ్లి ఆగిపోయింది. పోలీసులు దొంగల కోసం ఆరా తీస్తున్నారు. చోరీకి గురైన బంగారు, వెండి ఆభరణాల విలువ రూ.10.72 లక్షలని పోలీ సులు నిర్ధారించగా, ప్రస్తుత రేట్లతో పోలిస్తే సుమారు రూ.34 లక్షలు ఉం టుందని తెలిసింది. భారీ చోరీతో సూళ్లూరుపేట వాసులు హడలిపోతున్నారు.