మియాపూర్‌లో భారీ చోరీ
Published Wed, Nov 23 2016 12:00 PM | Last Updated on Mon, Sep 4 2017 8:55 PM
హైదరాబాద్: తాళం వేసి ఉన్న ఇంట్లో దొంగలుపడి ఉన్నకాడికి ఊడ్చుకెళ్లారు. ఈ సంఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆర్టీసీ కాలనీ రైల్వేట్రాక్ సమీపంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాలనీకి చెందిన సాయికిరణ్ నెదర్‌ల్యాండ్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో ఆర్టీసీ కాలనీలోని అతని ఇంట్లో సోమవారం రాత్రి దొంగలు పడి ఇంట్లో ఉన్న 6 తులాల బంగారు ఆభరణాలు, 8 కిలోల వెండి వస్తువులతో పాటు రూ. 30 వేల నగదును ఎత్తుకెళ్లారు. ఇది గుర్తించిన సాయికిరణ్ బంధువులు ఈరోజు మియాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
Advertisement
Advertisement