miyapur
-
భర్త వేధింపులు తట్టుకోలేక..
మియాపూర్: మనస్పర్థలు, కుటుంబ కలహాలతో విసిగిపోయిన ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. మియాపూర్ సీఐ క్రాంతికుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని ఏలూరు జిల్లా చత్రి మండలం చిత్తాపూర్ గ్రామానికి చెందిన మొక్కపాటి వెంకట నాగలక్ష్మి(28) వివాహం భీమవరానికి చెందిన సామినేని సతీష్ తో 2018లో జరిగింది. వీరికి 2019లో కుమార్తె జన్మించింది. కొద్ది రోజుల తర్వాత వారు విడిపోయారు. 2023 నవంబర్‌లో కోర్టు ద్వారా విడాకులు తీసుకున్నారు. అప్పటి నుంచి కుమార్తె వెంకటనాగలక్ష్మి దగ్గరే ఉంటుంది. నాగలక్ష్మి కూతురుతో కలిసి మియాపూర్‌లో ఉంటూ గచ్చిబౌలిలోని ఓ కంపెనీలో సాప్ట్వేర్ ఉద్యోగం చేస్తోంది.ఈ క్రమంలో ఈ ఏడాది ఆగస్టు 22న నాగలక్ష్మి ఏలూరు జిల్లా తోచిలుక గ్రామానికి చెందిన మువ్వా మణికంఠ మనోజ్‌ను రెండవ వివాహం చేసుకుంది. మనోజ్ సివిల్ కాంట్రాక్టర్‌గా పనిచేస్తున్నాడు. కొంతకాలం ఇద్దరూ బాగానే ఉన్నారు. ఆ తర్వాత ఇద్దరి మధ్య ఆస్తి విషయంలో గొడవలు జరిగాయి. నాగలక్ష్మి పేరుపై ఉన్న వ్యవసాయ భూమిని మనోజ్ తన పేరుపై నమోదు చేయాలని, బ్యాంక్ అకౌంట్‌కు తన ఫోన్ నంబర్‌ను యాడ్ చేయించాలని ఫేస్బుక్, ఇన్‌స్ట్రాగామ్ పాస్వర్డ్లు చెప్పాలని తరచూ వేధిస్తుండేవాడు. ఇటీవల కాలంలో రెండుసార్లు ఆమెను విపరీతంగా కొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. మనస్తాపం చెందిన నాగలక్ష్మి గత నెల 28వ తేదీన ఆన్లైన్లో గడ్డిమందు ఆర్డర్ చేయగా ఈ నెల 4వ తేదీ డెలివరీ అయ్యింది. కాగా బుధవారం మనోజ్, నాగలక్ష్మిల మధ్య మళ్లీ గొడవ జరిగింది. దీంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో నాగలక్ష్మి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు నాగలక్ష్మి భర్త మనోజ్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు సమాచారం. -
మియాపూర్ శ్రీచైతన్య కాలేజీ విద్యార్థి ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్: మియాపూర్ శ్రీచైతన్య కాలేజీలో ఓ విద్యార్థి విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శ్రీచైతన్య బాయ్స్ జూనియర్ కాలేజీలో ఎంపీసీ మొదటి సంవత్సరం చదువున్న విద్యార్థి కౌశిక్ రాఘవ(17) నిన్న రాత్రి హాస్టల్ గదిలో ఊరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. విద్యార్థి మృతిపై తల్లిదండ్రులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థి ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. మృతదేహాన్ని పోస్ట్ మార్టం గాంధీ హాస్పిటల్‌కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
హైదరాబాద్ లో చిరుత కలకలం
-
HYD: మియాపూర్‌లో చిరుత.. భయాందోళనలో స్థానికులు
సాక్షి,హైదరాబాద్: అడవుల్లో ఉండే చిరుత భాగ్యనగరంలోకి ఎంటరైంది. శుక్రవారం(అక్టోబర్ 18)మియాపూర్ లో చిరుత సంచరించడం సంచలనం రేపింది. చిరుత సంచారంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. ఏకంగా మియాపూర్ మెట్రో స్టేషన్ వెనుక భాగంలో చిరతు సంచరించింది. స్థానికుల సమాచారంతో చిరుత సంచరించిన విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో చిరుత కోసం పోలీసులు గాలిస్తున్నారు. చిరుత సంచరిస్తున్న వీడియోను స్థానికులు ఫోన్లో బందించారు. -
‘హైడ్రా’ సిఫార్సులు.. మియాపూర్‌లో అక్రమ కట్టడాలపై రెవెన్యూ కొరడా
సాక్షి, హైదరాబాద్: మియాపూర్ అక్రమ కట్టడాలపై రెవెన్యూ అధికారులు కొరడా ఝళిపించారు. మియాపూర్ చెరువులో అక్రమ కట్టడాలు చేసిన బిల్డర్‌పై కేసు నమోదు చేశారు. మ్యాప్స్ ఇన్ఫ్రా యజమాని సుధాకర్ రెడ్డి పైన కేసు నమోదైంది. మ్యాప్స్ కంపెనీ సుధాకర్‌రెడ్డితో పాటు పలువురుపై కేసులు నమోదు చేసిన అధికారులు.. హైడ్రా సిఫార్సు మేరకు కేసులు నమోదు చేశారు.ఎర్రగుంట చెరువును ఆక్రమించి చేసి బహుళ అంతస్తుల భవనాలను మ్యాప్స్ నిర్మించింది. ఈర్ల చెరువులో బహుళ అంతస్తుల భవనాలు నిర్మించిన ముగ్గురిపై బిల్డర్స్పై కేసులు నమోదు చేశారు. స్వర్ణలత, అక్కిరాజు శ్రీనివాసులపై కేసులు నమోదయ్యాయి.గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని చెరువుల్లో అక్రమ కట్టడాలకు అనుతులు ఇచ్చిన అధికారులపై హైడ్రా చర్యలు చేపట్టింది. హైడ్రా సిఫారసు మేరకు ఆరుగురు అధికారులపై సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. బాచుపల్లి ఎమ్మార్వో పూల్ సింగ్, మేడ్చల్ మల్కాజిగిరి ల్యాండ్ రికార్డ్స్ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాసులు, హెచ్ఎండీఏ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ సుధీర్‌కుమార్, హెచ్ఎండీఏ సిటీ ప్లానర్ రాజ్‌కుమార్, చందానగర్ జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ సుదామ్ష్, నిజాంపేట మున్సిపల్ కమిషనర్ రామకృష్ణఫై పోలీసులు కేసు నమోదు చేశారు. -
పునాటి నరసింహారావుకు ఇండియన్ పోలీస్ మెడల్
సాక్షి, హైదరాబాద్: ఉద్యోగంలో నిబద్ధత కలిగి ఉండటం.. ఏ విభాగంలో పని చేసినా.. అక్కడ అత్యుత్తమ సేవలందించడం.. డిపార్ట్ మెంట్లో ఉన్నతాధికారుల చేత మన్ననలు అందుకోవడం ఆ పోలీసు అధికారికి మొదటి నుంచి ఉన్న ట్రాక్ రికార్డ్. అందుకే ఇప్పుడు ఇండియన్ పోలీస్ మెడల్ ను అందుకుని మరోసారి తన వర్క్‌లో సిన్సియారిటీని చూపించారు. ఆయన ఎవరో కాదు.. హైదరాబాదులోని మియాపూర్ ఏసీపీ నరసింహరావు. మియాపూర్ ఏసీపీగా పనిచేస్తున్న ఆయన ఇండియన్ పోలీస్ మెడల్‌కు ఎంపికయ్యారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఆయన మెడల్‌ను అందుకున్నారు. 1995లో ఎస్సైగా విధుల్లో చేరిన ఆయన 2009లో సి.ఐగా పదోన్నతి పొందారు. వరంగల్ జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఆయన విధులు నిర్వహించారు. పోలీస్ శాఖలో ఆయన చేసిన సేవలకు గాను గతంలోనూ ఉత్తమ సేవా పతకం అందుకోగా ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం ఇండియన్ పోలీస్ మెడల్(ఐ.పి.యమ్ )కు ఎంపిక చేసింది. 2021లో ఏసీపీగా పదోన్నతి పొందిన ఆయన.. ఇంటిలిజెన్స్ విభాగంలో కొంతకాలం పనిచేశారు. ప్రస్తుతం నరసింహారావు మియాపూర్ ఏసిపిగా విధుల్లో కొనసాగుతున్నారు. ఇండియన్ పోలీస్ మెడలను అందుకున్న ఆయనకు మియాపూర్ సబ్ డివిజన్ కు చెందిన పోలీసు సిబ్బంది ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు మరింత మరింత మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తానని అన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ ద్వారా ప్రజలకు ఉత్తమ సేవలు అందించడం, డిపార్ట్ మెంటుపై ప్రజలకు నమ్మకం కలిగించడం... అవగాహన, కౌన్సెలింగ్ ద్వారా నేరాలు చేయకుండా ప్రజలను అప్రమత్తం చేయడం లాంటివి చేస్తూ... తన ఉద్యోగధర్మ నిర్వర్తిస్తున్నట్టు ఏసీపీ నరసింహరావు మెడల్ అందుకున్న సందర్భంగా చెప్పారు. తోటి ఉద్యోగులు, కుటుంబ సభ్యుల సహకారంతోనే తాను డిపార్టుమెంటులో అత్యుత్తమ సేవా పతకాలు పొంది. ప్రజలకు మరింత చేరువ అవుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఉన్నతాధికారుల సహకారం మరువలేనిదని ఆయన అన్నారు. భవిష్యత్తులోనూ తన శక్తి మేరకు మంచి సేవలందించడమే తన కర్తవ్యమని ఆయన చెప్పారు. -
Hyderabad: మాదాపూర్‌లో రేవ్ పార్టీ కలకలం
సాక్షి, హైదరాబాద్: మాదాపూర్‌లో రేవ్ పార్టీ కలకలం రేపింది. సైబర్ టవర్స్ దగ్గర అపార్ట్‌మెంట్‌ను అద్దెకు తీసుకొని నిర్వహిస్తున్న రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. 14 మంది యువకులు, ఆరుగురు యువతులను ఎక్సైజ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బర్త్‌డే పార్టీ సందర్భంగా రేవ్ నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.నిర్వాకుడు నాగరాజ్ యాదవ్‌తో పాటు 15 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో ఐదుగురికి పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి పంపివేశారు. విదేశీ మద్యంతో పాటు డ్రగ్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
హైదరాబాద్‌లో దారుణం..కారులో యువతిపై గ్యాంగ్ రేప్
సాక్షి,హైదరాబాద్ : హైదరాబాద్‌లో దారుణం జరిగింది. రియల్ ఎస్టేట్ కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగినిపై సామూహిక హత్యాచారం జరిగింది.ఈ దారుణానికి ఒడిగట్టిన నిందితుల్ని అరెస్ట్ చేసిన జైలుకు తరలించినట్లు పోలీసులు అధికారిక ప్రకటన చేశారు. జేఎస్ఆర్ గ్రూప్ సన్‌సిటీ అనే రియల్ ఎస్టేట్ కంపెనీలో బాధితురాలు ట్రైనీగా చేరింది. అయితే అదే కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులు సంగారెడ్డి, జనార్దన్‌రెడ్డి బాధితురాలితో కలిసి సైట్ విజిట్ నిమిత్తం యాదాద్రికి కారులో వెళ్లారు. అక్కడ సైట్ విజిట్ చేసి తిరిగి వస్తుండగా నిందితులు ఆమెకు ముందుగా మత్తు మందు కలిపిన ఆహార పదార్ధాలు తినేలా ప్లాన్ చేశారు. ఆమె తినకపోవడంతో మత్తుమందు కలిపిన కూల్‌డ్రింగ్ ఇచ్చారు. ఆ కూల్‌డ్రింక్ తాగిన ఆమెపై కారులోనే దారుణానికి ఒడిగట్టారు. అనంతరం ఆమెకు స్ప్రహ రావడంతో హస్టల్ దగ్గర వదిలేసి పరారయ్యారు. అయితే తనపై జరిగిన దాడిపై బాధితురాలు ఉప్పల్ పీఎస్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అనంతరం ఆ కేసును మియాపూర్ పోలిస్ స్టేషన్‌కు బదిలీ చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులు సంగారెడ్డి, జనార్ధన్‌రెడ్డిలను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వైద్య పరీక్షల నిమిత్తం బాధితురాల్ని ఆస్పత్రికి తరలించారు. నిందితులు విచారణలో చేసిన దారుణాన్ని అంగీకరించారు అని పోలీసులు వెల్లడించారు. -
మియాపూర్ లో తగ్గిన ఉద్రిక్తత, అమలులో 144 సెక్షన్
-
మియాపూర్ పరిస్థితులపై సైబరాబాద్ సీపీ సమీక్ష
-
HYD Alert: మియాపూర్, చందానగర్ పరిధిలో 144 సెక్షన్ విధింపు
సాక్షి, హైదరాబాద్: మియాపూర్, చందానగర్ పరిధిలో నేటి నుంచి 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి. ఎక్కడైనా ఎక్కువ మంది వ్యక్తులు గుమ్మిగూడితే చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.కాగా, సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి ఆదివారం ఉదయం మియాపూర్‌లో పరిస్థితిని సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మదీనాగూడ సర్వే నెంబర్ 100, 101లో శాంతి భద్రతలను పోలీసుల ఆధీనంలోకి తీసుకున్నాం. మియాపూర్, చందానగర్ పరిధిలో ఈరోజు నుంచి జూన్ 29వ తేదీ వరకు 144 సెక్షన్ అమలులో ఉంటుంది. ఎక్కడైనా ఎక్కువ మంది వ్యక్తులు గుమ్మిగుడి ఉన్న చట్టపరమైన చర్యలు ఉంటాయి. ప్రభుత్వ స్థలాలలో ఇల్లు ఇస్తామని మభ్యపెట్టి ప్రచారం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే కొంతమందిపైన కేసులు నమోదు చేశాం. మరికొంత మందిని గుర్తించి కేసులు పెడతాము అని చెప్పారు. ఇదిలా ఉండగా.. మియాపూర్‌లో ప్రభుత్వ భూములపై తప్పుడు ప్రచారం చేసిన వారిపై పోలీసుల కేసులు నమోదు చేశారు. సంగీత, సీత అనే మహిళలు చాలా మంది మహిళలను రెచ్చగొట్టారని తెలిపారు. ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుందామని రెచ్చగొట్టినట్టు గుర్తించారు. ఈ సందర్భంగా స్థానిక ఫంక్షన్ హాల్స్‌లో మీటింగ్ ఏర్పాటు చేసి పేదలను రెచ్చగొట్టారని అన్నారు. పేదలను రెచ్చగొట్టిన పది మందిపై కేసులు నమోదు చేసినట్టు స్పష్టం చేశారు. ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నట్టు చెప్పారు. The people of Miyapur came to take over the lands campaigned on social media in Hyderabad saying come and take over the lands.#Hyderabad #Miyapur pic.twitter.com/z29xhzJWvX— ఉత్తరతెలంగాణ నౌ (@UttaraTGNow) June 23, 2024 -
మియాపూర్ ఘటనపై స్పందించిన కేటీఆర్.. ఏమన్నారంటే?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలపై ఆందోళన వ్యక్తం చేశారు.కాగా, శనివారం మియాపూర్‌లోని హెచ్ఎండీఏ స్థలంలో పేదలు గుడిసెలు వేసుకోవడం.. పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టడంపై కేటీఆర్ స్పందించారు. ఈ క్రమంలో కేటీఆర్ ట్విట్టర్ వేదికగా.. రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవని స్పష్టం చేశారు. అలాగే, గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఇలాంటి పరిస్థితులు ఎప్పుడైనా చూశారా అంటూ కామెంట్స్ చేశారు. No Law No OrderHave you ever seen such nonsense in last 10 years? https://t.co/nd4LP6P72n— KTR (@KTRBRS) June 23, 2024 ఇదిలా ఉండగా.. మియాపూర్‌లోని దీప్తిశ్రీనగర్‌లో శనివారం సాయంత్రం ఉద్రిక్తత చోటు చేసుకున్న విషయం తెలిసిందే. హెచ్ఎండీఏ భూమిలో వేలాది మంది గుడిసెలు వేసుకున్నారు. విషయం తెలుసుకున్న అధికారులు పోలీసుల సహాయం వాటిని తొలగించేందుకు ప్రయత్నించారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.కాగా, శేరిలింగంపల్లి మండలం మియాపూర్ పరిధిలోని సర్వే నంబర్లు 100, 101లో సుమారు 504 ఎకరాల్లో హెచ్ఎండీఏ భూమి ఉన్నది. ఇందులో గుడిసెలు వేసుకొని మూడు నాలుగు రోజులుగా అక్కడే ఉంటున్నారు. అయితే, ప్రభుత్వం ఇక్కడ ఇండ్ల స్థలాలు ఇస్తుందని స్థానికంగా ప్రచారం జరిగింది. దీంతో ఇక్కడి పలు ప్రాంతాల నుంచి భారీగా జనం తరలివచారు. దాదాపు 2వేల మంది వరకు గుడిసెలు వేసుకున్నారు. వాటిని తొలగించేందుకు అధికారులు యత్నించారు.అయితే, గుడిసెలు వేసి కబ్జాలకు పాల్పడుతున్నవారిని ఎట్టిపరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని హెచ్ఎండీఏ అధికారులు హెచ్చరించారు. వారు మాత్రం ఎట్టిపరిస్థితుల్లో కదిలేది లేదంటున్నారు. దీంతో మియాపూర్ లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. గతంలో ఇది ప్రభుత్వ భూమని తెలియక 16మంది వ్యక్తులు కొన్నారని పోలీసులు తెలిపారు. భూమి ప్రభుత్వానిదని కోర్టు నిర్ధారించి.. హెచ్ఎండీఏకు అప్పగించిందన్నారు. కొందరు కొన్నవారు సుప్రీం కోర్టును ఆశ్రయించారని.. మరికొందరు సామాన్య ప్రజలను రెచ్చగొట్టి ప్రభుత్వ భూమి కబ్జాకు ప్రయత్నిస్తున్నారని అధికారులు తెలిపారు. -
మియాపూర్: వీడిన బాలిక హత్య కేసు మిస్టరీ
సాక్షి,హైదరాబాద్: మియాపూర్‌లో సంచలనం రేపిన బాలిక హత్య కేసును పోలీసులు చేదించారు. బాలిక మర్డర్ కేసులో ఆమె తండ్రే హంతకుడని పోలీసులు తేల్చారు. సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు ఈ కేసును విచారించారు. బాలిక మిస్సింగ్ మిస్టరీ వారం రోజుల తర్వాత వీడింది. తండ్రిపై అనుమానంతో తమదైన తీరులో పోలీసులు దర్యాప్తు చేశారు. బాలిక తండ్రి బానోతు నరేష్ పోర్న్ వీడియోలు చూస్తూ చెడు అలవాట్లకు బానిసయ్యాడు.తన కోరిక తీర్చాలంటూ బాలికపై తండ్రి ఒత్తిడి తెచ్చాడు. అమ్మకు చెప్తానని బాలిక గట్టిగా అరవడంతో కోపంతో కన్న కూతురిని హతమార్చాడు. నడిగడ్డ తండా సమీపంలోని పొదల్లోకి తీసుకువెళ్లి జుట్టు పట్టుకుని నేలకేసి కొట్టి హత్య చేశాడు. బాలిక చనిపోయిందా లేదా అని చూసేందుకు హత్య జరిగిన ప్రదేశానికి నిందితుడు తిరిగి వెళ్లినట్లు గుర్తించారు. -
మియాపూర్‌లో సందడి చేసిన డింపుల్ హయాతి (ఫొటోలు)
-
మియాపూర్ సీఐ సస్పెండ్.. కారణం ఇదే..!
-
మియాపూర్ సీఐ సస్పెండ్.. కారణం ఇదే..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పోలీసు శాఖలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. మియాపూర్ సీఐ ప్రేమ్‌కుమార్‌ను సీపీ సస్పెండ్ చేశారు. సదరు సీఐ ఓ మహిళతో అమర్యాదకంగా ప్రవర్తించిన కారణంగా ఆయనను సస్పెండ్ చేసినట్టు తెలుస్తోంది. వివరాల ప్రకారం.. మియాపూర్ సీఐ ప్రేమ్‌కుమార్‌ను సైబరాబాద్ సీపీ సస్పెండ్ చేశారు. కాగా, తనతో అమర్యాదగా ప్రవర్తించారని ఓ మహిళ సైబరాబాద్ సీపీకి ఫిర్యాదు చేశారు. దీంతో, సదరు మహిళ ఫిర్యాదుపై సీపీ అవినాష్ మహింతి విచారణ చేపట్టారు. విచారణలో భాగంగా ఆమెతో ప్రేమ్‌కుమార్ అమర్యాదగా ప్రవర్తించాడని తేలడంతో సీఐని సస్పెండ్ చేశారు. -
భక్తులారా జాగ్రత్త..గణేష్ లడ్డు మాయం..
-
అత్తింటి కుటుంబంపై అల్లుడు విష ప్రయోగం..
హైదరాబాద్: మియాపూర్‌లో దారుణం జరిగింది. సొంత అల్లుడే అత్తింటి కుటుంబంపై విషప్రయోగం చేశాడు. ఈ ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందారు. మిగిలిన కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అత్తింటివారిని అంతం చేయాలనే ఉద్దేశంతోనే బాధిత కుటుంబానికి చెందిన అల్లుడు వారిపై విష ప్రయోగం చేశాడని పోలీసులు తెలిపారు. అత్తింటివారిని అంతం చేయాలని పథకం పన్నిన అల్లుడు అజిత్.. వారు తినే ఆహారంలో విషం కలిపాడు. విషయం తెలియక ఆ విష ఆహారాన్ని తిన్న బాధితుల ఆరోగ్యం క్షీణించసాగింది. హుటాహుటిన వారిని ఆస్పత్రికి తరలించగా విషయం వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేసిన నిజానిజాలను పసిగట్టారు. నిందితుడు ముప్పవరపు అజిత్ కుమార్ పరారీలో ఉన్నాడు. ఈ కేసులో ఇప్పటికి ఆరుగుర్ని అరెస్టు చేశారు పోలీసులు. శిరీష తల్లి మహేశ్వరి మృతి చెందింది. ఇతర కుటుంబ సభ్యులకు హస్పిటల్లో వైద్యులు చికిత్స చేస్తున్నారు. ఇదీ చదవండి: Bholakpur Scrap Godown Blast: బోలక్‌పూర్‌లో పేలుడు.. -
Hyderabad: 300 మందిని నిండా ముంచిన రియల్‌ఎస్టేట్స్ సంస్థ
మియాపూర్ (హైదరాబాద్): పేద, మధ్యతరగతి ప్రజలు కష్టపడి కూడబెట్టుకున్న డబ్బును ప్లాట్ల కొనుగోలు కోసం చెల్లిస్తే.. మైత్రి ప్రాజెక్ట్స్ రియల్‌ఎస్టేట్స్ సంస్థ వారిని నిండా ముంచింది. సుమారు 300 మంది నుంచి రూ.50 కోట్ల వరకు వసూలు చేసి.. వారికి ప్లాట్లు ఇవ్వకుండా, డబ్బులూ తిరిగివ్వకుండా బోర్డు తిప్పేసింది. దీనితో హైదరాబాద్‌లోని మియాపూర్ ఆల్విన్ క్రాస్‌రోడ్డు వద్ద ఉన్న మైత్రి ప్రాజెక్ట్స్ రియల్ ఎస్టేట్ సంస్థ కార్యాలయం ముందు బాధితులు ఆదివారం ధర్నాకు దిగారు. కార్యాలయానికి తాళం వేసి ఉండటంతో అక్కడి నుంచి మియాపూర్ పోలీస్‌స్టేషన్ వరకు ప్లకార్డులు పట్టుకొని నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ఒక్కొక్కరి నుంచి రూ.30 లక్షలదాకా.. బాధితులు వెల్లడించిన వివరాల మేరకు.. గుంటూరుకు చెందిన జానీ బాషాషేక్ రామంతాపూర్‌లోని ఓ అపార్ట్మెంట్లో నివాసం ఉంటూ.. మియాపూర్‌లో మైత్రి ప్రాజెక్టు రియల్ ఎస్టేట్స్ పేరిట కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. హైదరాబాద్ శివార్లలోని గాగిలాపూర్లోని రాయల్ లీఫ్, రామేశ్వర్బండలోని రాయల్ ప్యారడైజ్, మామిడిపల్లిలో రాయల్ వింట్, హంబ్టాన్ ఫామ్స్ పేరుతో వెంచర్లు వేసి.. ఓపెన్ ప్లాట్లను విక్రయిస్తున్నట్టు ప్రచారం చేశాడు. తప్పుడు డాక్యుమెంట్లు, అగ్రిమెంట్లు చూపించి తక్కువ ధరకే ప్లాట్లను ఇస్తామంటూ ప్రజలను నమ్మించాడు. పలు ప్రాంతాలకు చెందిన 300 మంది నుంచి ఒక్కొక్కరి వద్ద రూ.10 లక్షల నుండి రూ.30 లక్షల మేర కట్టించుకున్నాడు. కానీ రిజిస్ట్రేషన్స్ చేయకుండా బాధితులను మూడేళ్లుగా తిప్పించుకుంటూ వచ్చారు. చివరికి మకాం మార్చి సంస్థకు తాళం వేసి పారిపోయాడు. నెల రోజుల కిందే ఫిర్యాదు చేసినా.. తమకు న్యాయం చేయాలని కోరుతూ మియాపూర్, పటాన్చెరువు, సంగారెడ్డి పోలీస్ స్టేషన్లలో నెల రోజుల క్రితం ఫిర్యాదు చేశామని బాధితులు తెలిపారు. పోలీసుల నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో మైత్రి కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి, మియాపూర్ పోలీస్‌స్టేషన్ వరకు ర్యాలీ చేశామని వివరించారు. మైత్రిలో డబ్బులు కట్టినవారంతా పేద, మధ్య తరగతికి చెందినవారమేనని.. తమ కలలు కల్లలు అవుతున్నాయని వాపోయారు. ఈ విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకొని తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. -
హైదరాబాద్ మియాపూర్ లో భారీ మోసం
-
హైదరాబాద్: బోర్డు తిప్పేసిన మైత్రి ప్రాజెక్ట్ సంస్థ
సాక్షి, హైదరాబాద్: వెంచర్లు వేసి తక్కువ ధరకే ప్లాట్లు ఇస్తామంటూ ప్రజలను మోసం చేసిన ఘటన మియాపూర్‌లో చోటుచేసుకుంది. మైత్రి ప్రాజెక్ట్స్ రియల్ ఎస్టేట్ కంపెనీ రాయల్ లీఫ్, రాయల్ పేరడైజ్, రాయల్ మింట్ పేరుతో మూడు వెంచర్లు వేసి 300 మంది దగ్గర సుమారు 50 కోట్ల రూపాయలు వసూలు చేసి బోర్డు తిప్పేశాడు. మైత్రి ప్రాజెక్ట్ ఎండి జానీ భాషా షేక్ గత మూడు సంవత్సరాల నుండి రిజిస్ట్రేషన్ చేస్తామంటూ మబ్బి పెడుతూ కాలం గడుపుతున్నాడని బాధ్యతలు తెలిపారు. ఒక్కసారిగా అందరూ అడిగేసరికి రాత్రికి రాత్రి ఫ్యామిలీతో పారిపోయాడని, ఇందుకోసం మూడు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినా ఇప్పుడు దాకా ఎలాంటి స్పందన లేదని వాపోతున్నారు. ఇందులో అందరూ మధ్య తరగతి, పేద తరగతి వారే ఉన్నామని దయచేసి న్యాయం చేయాలని పోలీసులను కోరారు. ఇందుకు నిరసనగా ఈరోజు మియాపూర్ ఆల్విన్ కాలనీలోని మైత్రి ప్రాజెక్ట్స్ ఆఫీస్ నుంచి పోలీస్ స్టేషన్ వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. పోలీసుల స్పందించి వెంటనే జానీ భాషా షేక్ ను అరెస్టు చేయాలని కోరారు. చదవండి: ఆ దేవుడు నిన్ను తీసుకెళ్లాడా బావా.. నాకు తోడుగా ఉంటావనుకుంటే.. -
31 కిలోమీటర్ల రోడ్డుకు రూ.1,297 కోట్లా..!
సాక్షి, హైదరాబాద్: ఆరు వరుసలకు విస్తరిస్తున్న రోడ్డది.. నిడివి 31 కి.మీ. మాత్రమే. కానీ దాని నిర్మాణానికి మాత్రం ఏకంగా రూ. 1,297 కోట్లు ఖర్చు కానుంది! అంటే ఒక కిలోమీటర్‌కు దాదాపు రూ. 42 కోట్ల వ్యయం అన్నమాట. దీన్ని మరోలా చెప్పాలంటే ఎనిమిది వరుసలు, 158 కి.మీ. నిడివితో రూపుదిద్దుకున్న ఔటర్ రింగురోడ్డు నిర్మాణంలో ప్రతి కిలోమీటర్‌కు అయిన ఖర్చు స్థాయికి దాదాపు సమానమన్నమాట! ఈ కాస్త దూరానికే అంత ఖర్చు ఎందుకు అనుకుంటున్నారా? ఇందులో నిర్మించేది ప్రధాన రోడ్డొక్కటే కాదు.. సరీ్వసు రోడ్లు, క్రాష్ బ్యారియర్లు, ఎలివేటెడ్ కారిడార్లు, జంక్షన్ల వద్ద వంతెనలు, అండర్‌పాస్‌లు, కల్వర్టులు.. ఒకటేమిటి ఎక్స్‌ప్రెస్ వే అంటే ఇలా ఉండాలనే రీతిలో ఇది రూపుదిద్దుకోబోతోంది. ఓ రకంగా చెప్పాలంటే మోడల్ ఎక్స్‌ప్రెస్ వేగా నిలవబోతోంది. హైదరాబాద్–పుణే జాతీయ రహదారిపై మియాపూర్–సంగారెడ్డి మధ్య ఉన్న ఈ మార్గం ఎక్స్‌ప్రెస్ వే తరహాలో ముస్తాబుకానుంది. అందుకే ఖర్చు సైతం భారీగా ఉంది. ట్రాఫిక్ చిక్కులకు తెరదించేలా... తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రల్లో విస్తరించి ఉన్న 65వ నంబర్ జాతీయ రహదారిపై కొన్నేళ్లుగా ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోయింది. దీంతో దాన్ని విస్తరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా హైదరాబాద్ శివార్లలో ఆ మార్గాన్ని యుద్ధప్రాతిపదికన 6 వరుసలకు విస్తరించనుంది. ఇందులో హయత్‌నగర్ దాటాక విజయవాడ రోడ్డులో జాతీయ రహదారుల అభివృద్ధి ప్రాథికార సంస్థ (ఎన్హెచ్ఏఐ) రోడ్డు విస్తరణను చేపట్టనుండగా ముంబై రహదారిలో మియాపూర్ సమీపంలోని మదీనాగూడ నుంచి సంగారెడ్డి వరకు రాష్ట్ర పీడబ్ల్యూడీ విభాగం అభివృద్ధి చేయనుంది. తాజాగా మదీనాగూడ–సంగారెడ్డి మధ్య 6 వరుసల విస్తరణ పనులకు సంబంధించిన డీపీఆర్‌కు కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ అ«దీనంలోని స్టాండింగ్ ఫైనాన్స్ కమిటీ ఆమోదించింది. దీంతో ఇక టెండర్లు పిలిచేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అవి ఖరారయ్యాక రెండున్నరేళ్లలో ప్రాజెక్టును పూర్తి చేయనున్నారు. రోజుకు సగటున లక్ష వాహనాలు.. నగరం నుంచి సంగారెడ్డి రోడ్డు అత్యంత బిజీగా మారిపోయింది. డీపీఆర్ తయారీలో భాగంగా గత ఆగస్టులో ఇస్నాపూర్, పటాన్చెరు మధ్య వెళ్తున్న వాహనాల సంఖ్యపై జాతీయ రహదారుల విభాగం సర్వే నిర్వహించగా ఒక రోజులో సగటున లక్ష వాహనాలు ప్రయాణిస్తున్నట్లు తేలింది. పటాన్చెరు వద్ద రోజుకు 30,683 కార్లు, 12,353 త్రిచక్ర వాహనాలు, 34,437 ద్విచక్ర వాహనాలు, 5,551 బస్సులు, 9 వేల ట్రక్కులు... ఇలా అన్నీ కలిపి రోజుకు లక్ష వరకు తిరుగుతున్నాయి. ఇక మదీనాగూడ ప్రాంతంలో ఆ సంఖ్య అంతకు రెట్టింపుగా ఉంటోంది. ఈ రోడ్డును విస్తరిస్తే ట్రాఫిక్ సమస్య పరిష్కారమవుతుందని అధికారులు పేర్కొంటున్నారు. ఇప్పుడేం చేస్తారు..? మదీనాగూడ నుంచి సంగారెడ్డి వరకు 31 కి.మీ.మేర రోడ్డును 6 వరుసలకు విస్తరించనున్నారు. మూడు వరుసల సరీ్వసు రోడ్డు, ఫుట్‌పాత్, వరద నీటి డ్రెయిన్‌తో 11.66 కి.మీ., మిగతా నిడివిలో రెండు వరుసల సరీ్వసు రోడ్డు ఉండేలా నిర్మించనున్నారు. రుద్రారం వద్ద 1,020 మీటర్ల మేర, గంగారం వద్ద 840 మీటర్ల మేర రెండు ఎలివేటెడ్ కారిడార్లతోపాటు కొత్తగా 11 చిన్న వంతెనలు నిర్మించనున్నారు. ఏడు మేజర్, 19 మైనర్ జంక్షన్లను విస్తరించనున్నారు. ఏడు ప్రాంతాల్లో అండర్‌పాస్‌లు, ఆరు చోట్ల కల్వర్టులను కట్టనున్నారు. ఐదు ప్రాంతాల్లో లిఫ్టు వసతి ఉండే ఫుట్ ఓవర్ బ్రిడ్జీలు, రోడ్డుకు రెండు వైపులా క్రాష్ బ్యారియర్లను ఏర్పాటు చేయనున్నారు. వెరసి ప్రధాన క్యారేజ్ వే మీదకు చుట్టుపక్కల నుంచి ఇతర వాహనాలు, మనుషులు, జంతువులు వచ్చే వీలుండదు. ప్రధాన క్యారేజ్ వే మీదుగా వెళ్లే వాహనాలకు, దీన్ని దాటుతూ అటూఇటూ పోయే వాహనాలకు పరస్పరం ఆటంకం లేని విధంగా డిజైన్ చేశారు. ఇందుకు వీలుగా అదనంగా కావాల్సిన భూమి కోసం రూ. 166 కోట్లు వెచి్చస్తున్నారు. అన్నీ కలిపి నిర్మాణానికి రూ. 1,297 కోట్లు ఖర్చు కానున్నట్టు డీపీఆర్‌లో పేర్కొనగా దానికి తాజాగా కేంద్రం ఆమోదముద్ర వేసింది. బీహెచ్ఈఎల్ వంతెన కాకుండా.. ఈ రోడ్డు విస్తరణలో భాగంగా బీహెచ్ఈఎల్ కూడలి వద్ద 131 కోట్లతో భారీ వంతెన నిర్మిస్తున్నారు. 60 మీటర్ల వెడల్పుతో అది ఉండనుంది. దాన్ని ఈ రోడ్డు విస్తరణ ప్రాజెక్టులో కాకుండా విడిగా చూపారు. దానికి సంబంధించి ఎన్హెచ్ఏఐ రూపొందించిన నమూనా ప్రకారం పనులు సాధ్యం కాదంటూ రాష్ట్ర ప్రభుత్వ అ«దీనంలోని ఎన్‌హెచ్ విభాగం ఇటీవల ప్రతిపాదించింది. దీనిపై ఇరు విభాగాల మధ్య విభేదాలు తలెత్తడంతో పనుల్లో జాప్యం జరుగుతోంది. ఇందుకు కారణం మీరంటే మీరంటూ ఇరు విభాగాలు లేఖలు రాసుకోవడం వివాదాస్పదంగా మారింది. చదవండి: డేటా దేశం దాటిందా? -
Miyapur: బ్రష్ చేస్తుండగా మూర్ఛ.. సంపులో పడి యువతి మృతి
సాక్షి, మియాపూర్: ఓ యువతికి మూర్ఛరావడంతో సంపులో పడి మృతిచెందిన సంఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్ఐ గిరీష్ తెలిపిన మేరకు.. సూర్యాపేట జిల్లా గాం«దీనగర్‌లోని బాచనాయక్‌తండాకు చెందిన లునావత్ నిర్మల(26) మియాపూర్‌లోని మయూరినగర్ స్వదర్ గృహ అనాథాశ్రమంలో ఉంటుంది. నిర్మల మూర్చవ్యాధితో బాధపడుతుండేది. సోమవారం ఉదయం బ్రష్ చేసుకుంటూ ఉండగా మూర్ఛ రావడంతో అనాథాశ్రమ ప్రాంగణంలో ఉన్న సంపులో పడిపోయింది. ఎవరూ చూడకపోవడంతో అందులో మునిగి మృతిచెందింది. కొద్దిసేపటి తర్వాత నిర్మల అశ్రమంలో కనిపించకపోవడంతో నిర్వాహకులు వెతకగా సంపులో కనిపించింది. బయటకు తీయగా అప్పటికే మృతిచెంది ఉంది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి మృతదేహాన్ని గాందీ ఆసుపత్రికి తరలించారు. మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
మియాపూర్ బస్టాండ్‌లో వ్యక్తి దారుణ హత్య
సాక్షి, హైదరాబాద్: మియాపూర్ బస్టాండ్‌లో దారుణం చోటుచేసుకుంది. అందరూ చూస్తుండగానే ఓ వ్యక్తిపై గుర్తు తెలియని దుండగులు దాడి చేసి హత్యకు పాల్పడ్డారు. దుండగుల దాడిలో బాధితుడు అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. బుధవారం రాత్రి ఈ హత్య జరిగినట్లు పోలీసులు తెలిపారు. తాగిన తర్వాత ఇద్దరి వ్యక్తుల మధ్య జరిగిన గొడవ హత్యకు కారణమై ఉండవచ్చాని పోలీసులు భావిస్తున్నారు. బండరాయితో నెత్తి పైన గట్టిగా కొట్టడంతో మరణించినట్లు తెలుస్తోంది. మృతుడిని బీహార్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. కేసు నమోదు చేసుకుని అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. -
‘హాయ్ అమ్మా, నాన్న.. ఈ స్ట్రెస్ తీసుకోలేకపోతున్నాను.. క్షమించండి!’
సాక్షి, హైదరాబాద్: ఒత్తిడి తట్టుకోలేక టెన్త్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన మియపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్ఐ రాఘవేందర్ తెలిపిన వివరాల ప్రకారం... ఈస్ట్ గోదావరి జిల్లాకు చెందిన రాయుడు శ్రీ వెంకటేశ్వర్లు కుటుంబం కేవీఆర్ టవర్స్‌లో నివాసముంటోంది. కుమార్తె సంజన(14) పటాన్చెరు బీరంగూడలోని అకడమిక్ పబ్లీక్ స్కూల్లో పదవ తరగతి చదువుతోంది. తండ్రి ప్రైవేటు ఉద్యోగం చేస్తుండగా తల్లి ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది. శుక్రవారం సంజన పాఠశాలకు వెళ్లి సాయంత్రం 5 గంటలకు ఇంటికి వచ్చింది. అనంతరం తన బెడ్రూమ్లోకి వెళ్లి గడియ పెట్టుకుంది. చాలా సేపటి వరకు సంజన బయటికి రాకపోవడంతో తల్లి శిరీష, సోదరుడు మోహిత్‌లు తలుపులు తట్టగా ఎలాంటి ఉలుకు, పలుకు లేదు. తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లి చూడగా సీలింగ్ ప్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. స్థానిక ఆసుపత్రికి తీసుకువెళ్లగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. ఓ పేపర్‌పై హాయ్ అమ్మా... నాన్న.. మోహిత్ నేను అసలు ఈ స్ట్రెస్ తీసుకోలేకపోతున్నాను దయచేసి నన్ను క్షమించండి... ఐ లవ్ యూ అని రాసి పెట్టి ఆత్మహత్యకు పాల్పడిందని గుర్తించారు. చదువులో ఒత్తిడి భరించలేకే ఆత్మహత్య చేసుకుందని పోలీసులు ప్రాథమిక అంచనలో తేలింది.