సాక్షి, హైదరాబాద్: మియాపూర్, చందానగర్ పరిధిలో నేటి నుంచి 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి. ఎక్కడైనా ఎక్కువ మంది వ్యక్తులు గుమ్మిగూడితే చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
కాగా, సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి ఆదివారం ఉదయం మియాపూర్‌లో పరిస్థితిని సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మదీనాగూడ సర్వే నెంబర్ 100, 101లో శాంతి భద్రతలను పోలీసుల ఆధీనంలోకి తీసుకున్నాం. మియాపూర్, చందానగర్ పరిధిలో ఈరోజు నుంచి జూన్ 29వ తేదీ వరకు 144 సెక్షన్ అమలులో ఉంటుంది. ఎక్కడైనా ఎక్కువ మంది వ్యక్తులు గుమ్మిగుడి ఉన్న చట్టపరమైన చర్యలు ఉంటాయి. ప్రభుత్వ స్థలాలలో ఇల్లు ఇస్తామని మభ్యపెట్టి ప్రచారం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే కొంతమందిపైన కేసులు నమోదు చేశాం. మరికొంత మందిని గుర్తించి కేసులు పెడతాము అని చెప్పారు.
ఇదిలా ఉండగా.. మియాపూర్‌లో ప్రభుత్వ భూములపై తప్పుడు ప్రచారం చేసిన వారిపై పోలీసుల కేసులు నమోదు చేశారు. సంగీత, సీత అనే మహిళలు చాలా మంది మహిళలను రెచ్చగొట్టారని తెలిపారు. ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుందామని రెచ్చగొట్టినట్టు గుర్తించారు. ఈ సందర్భంగా స్థానిక ఫంక్షన్ హాల్స్‌లో మీటింగ్ ఏర్పాటు చేసి పేదలను రెచ్చగొట్టారని అన్నారు. పేదలను రెచ్చగొట్టిన పది మందిపై కేసులు నమోదు చేసినట్టు స్పష్టం చేశారు. ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నట్టు చెప్పారు.
The people of Miyapur came to take over the lands campaigned on social media in Hyderabad saying come and take over the lands.#Hyderabad #Miyapur pic.twitter.com/z29xhzJWvX
— ఉత్తరతెలంగాణ నౌ (@UttaraTGNow) June 23, 2024
Comments
Please login to add a commentAdd a comment