Chandanagar
-
HYD: బైకును ఢీకొన్న ఆర్టీసీ బస్సు.. ఇద్దరు మృతి
సాక్షి, హైదరాబాద్: నగరంలోని చందానగర్‌లో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్సు, బైకును ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు.వివరాల ప్రకారం.. బుధవారం ఉదయం చందానగర్ టీజీఎస్ఆర్టీసీ ఓ బైకును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులు మృతిచెందారు. కాగా, మృతులను చందానగర్‌కు చెందిన మనోజ్, రాజులుగా గుర్తించారు. ఇక, ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. పోస్టుమార్టం నిమ్మితం మృతదేహాలను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.అయితే, మదీనాగుడ జీఎస్ఎం మాల్ నుంచి చందానగర్‌కు రాయల్ ఎన్ఫీల్డ్ బైక్‌పై మనోజ్, రాజులు వెళుతున్నారు. చందానగర్ జీఎస్ఎం మాల్ సమీపంలో యుటర్న్ దగ్గర రాంగ్ రూట్లో వెళుతూ.. ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టారు. బైక్ నడుపుతున్న మనోజ్‌తో పాటు వెనకాల కూర్చున్న రాజు కూడా అక్కడిక్కడే చనిపోయాడు. ఇక, వీరి మృతితో కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. -
HYD Alert: మియాపూర్, చందానగర్ పరిధిలో 144 సెక్షన్ విధింపు
సాక్షి, హైదరాబాద్: మియాపూర్, చందానగర్ పరిధిలో నేటి నుంచి 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి. ఎక్కడైనా ఎక్కువ మంది వ్యక్తులు గుమ్మిగూడితే చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.కాగా, సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి ఆదివారం ఉదయం మియాపూర్‌లో పరిస్థితిని సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మదీనాగూడ సర్వే నెంబర్ 100, 101లో శాంతి భద్రతలను పోలీసుల ఆధీనంలోకి తీసుకున్నాం. మియాపూర్, చందానగర్ పరిధిలో ఈరోజు నుంచి జూన్ 29వ తేదీ వరకు 144 సెక్షన్ అమలులో ఉంటుంది. ఎక్కడైనా ఎక్కువ మంది వ్యక్తులు గుమ్మిగుడి ఉన్న చట్టపరమైన చర్యలు ఉంటాయి. ప్రభుత్వ స్థలాలలో ఇల్లు ఇస్తామని మభ్యపెట్టి ప్రచారం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే కొంతమందిపైన కేసులు నమోదు చేశాం. మరికొంత మందిని గుర్తించి కేసులు పెడతాము అని చెప్పారు. ఇదిలా ఉండగా.. మియాపూర్‌లో ప్రభుత్వ భూములపై తప్పుడు ప్రచారం చేసిన వారిపై పోలీసుల కేసులు నమోదు చేశారు. సంగీత, సీత అనే మహిళలు చాలా మంది మహిళలను రెచ్చగొట్టారని తెలిపారు. ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుందామని రెచ్చగొట్టినట్టు గుర్తించారు. ఈ సందర్భంగా స్థానిక ఫంక్షన్ హాల్స్‌లో మీటింగ్ ఏర్పాటు చేసి పేదలను రెచ్చగొట్టారని అన్నారు. పేదలను రెచ్చగొట్టిన పది మందిపై కేసులు నమోదు చేసినట్టు స్పష్టం చేశారు. ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నట్టు చెప్పారు. The people of Miyapur came to take over the lands campaigned on social media in Hyderabad saying come and take over the lands.#Hyderabad #Miyapur pic.twitter.com/z29xhzJWvX— ఉత్తరతెలంగాణ నౌ (@UttaraTGNow) June 23, 2024 -
చందానగర్ లో ఆటమ్న్ సెలూన్ ప్రారంభం (ఫొటోలు)
-
హైదరాబాద్‌లో పోలీసులు తనిఖీలు.. భారీగా బంగారం పట్టివేత
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఎన్నికల సందర్భంగా చేపట్టిన తనిఖీల్లో భారీగా నగదు, మద్యం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తనిఖీల్లో ఇప్పటివరకు రూ.56 కోట్ల నగదు, రూ.2.60 కోట్ల మద్యం సీజ్ చేశారు. 72 కేజీల బంగారం, 429 కేజీల వెండి, 42 క్యారెట్ల వజ్రాలు సీజ్ చేశారు. 5,529 లైసెన్స్డ్ తుపాకులు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 17,128 మందిని పోలీసులు బైండోవర్ చేశారు. తాజాగా, చందానగర్‌లో భారీగా బంగారం, వెండి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిన్న రాత్రి వాహనాలను తనిఖీ చేస్తుండగా భారీగా బంగారం పట్టుబడింది. దాదాపు 29 కేజీల బంగారం, 26 కేజీల వెండి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గంగారంలో నిన్న రాత్రి వాహనాలను తనిఖీ చేస్తుండగా కారులో ఆభరణాలు లభించగా, చందానగర్ పరిధిలోని మలబార్, కళ్యాణ్, లలిత, రిలయన్స్ రిటైల్, విరాజ్ జ్యువెలర్స్ షాపులకు సంబంధించినదిగా పోలీసులు గుర్తించారు. చదవండి: ప్రవళిక ఆత్మహత్య కేసులో మరో ట్విస్ట్ -
హైదరాబాద్‌లో దారుణం.. భార్యకు ఆనందం దూరం చేయాలని..
సాక్షి, హైదరాబాద్: చందానగర్‌లో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. ఐదేళ్ల కూతురిని తండ్రి కిరాతకంగా చంపాడు. స్కూల్లో ఉన్న పాపను మాయమాటలు చెప్పి తీసుకెళ్లిన తండ్రి చంద్రశేఖర్.. పెన్సిల్ బ్లేడ్‌తో కూతురు మోక్షజ(5) గొంతుకోశాడు. పాప మృతిని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. ఓఆర్ఆర్లో కారుకు ప్రమాదం కావడంతో హత్యా ఉదంతం బయటపడింది. చంద్రశేఖర్, హిమ అనే దంపతులు 12 ఏళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరి 8 ఏండ్ల కూతురు మోక్షజ. అయితే భార్యా భర్తలిద్దరూ సాఫ్ట్వేర్ ఉద్యోగులు. కాగా గతేడాది చంద్రశేఖర్ ఉద్యోగం కోల్పోయాడు. ఈ క్రమంలో చంద్రశేఖర్, హిమ మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయి. దీంతో కొద్ది రోజుల క్రితం తన పాపను తీసుకుని హిమ తన పుట్టింటి వెళ్లిపోయింది. చదవండి: అత్తింటి కుటుంబంపై అల్లుడు విష ప్రయోగం.. తనకు భార్య దూరంగా ఉంటుందన్న ఆగ్రహంతో.. ఆ తండ్రి తన కన్న కూతుర్ని గొంతు కోసి చంపాడు. అనంతరం డెడ్‌బాడీని తన కారులో అబ్దుల్లాపూర్‌మెట్ ఓఆర్ఆర్ వైపు తీసుకెళ్లి.. చెట్లలో విసిరేయాలనుకున్నాడు. కానీ అంతలోనే కారు ప్రమాదానికి గురైంది. దీంతో పోలీసులు అప్రమత్తమై ఆ కారు వద్దకు వెళ్లగా.. వెనుక సీట్లో బాలిక మృతదేహం లభ్యమైంది. చంద్రశేఖర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
పూర్తిగా కాలిపోయిన మూడు స్క్రీన్స్
-
చందానగర్ లో జేపీ సినిమాస్ లో భారీ అగ్నిప్రమాదం
-
చందానగర్ నగల దుకాణంలో భారీ చోరీ..
హైదరాబాద్: చందానగర్‌లోని నగల దుకాణంలో భారీ చోరీ జరిగింది. గాంధీ విగ్రహం వద్ద ఉన్న పుఖ్రజ్ లాల్ చంద్ జ్యువలరీ షాప్ లో ఈ ఘటన జరిగింది. నిన్న అర్ధ రాత్రి సమయంలో నగల దుకాణం గోడకు కన్నం వేసి దుండగులు చోరీకి పాల్పడ్డారు. నగల దుకాణానికి ఆనుకోని ఓ వస్త్ర దుకాణం ఉంది. దీన్నే తమ ఆయుధంగా చేసుకున్న దుండగులు వస్త్ర దుకాణం గోడ నుంచి నగలు దుకాణానికి కన్నం వేశారు. అనంతరం దుకాణంలో చొరబడి విలువైన నగలను దోచుకెళ్లారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. ఘటనా స్థలికి చేరుకుని.. సీసీటీవీ ఆధారంగా నేరస్తులను పట్టుకునే పనిలో పడ్డారు. ఇదీ చదవండి: నిండా 40 లేవు, గుండెపోటుతో ఐటీడీఏ ఛైర్మన్ మృతి -
విశాఖ శారదా పీఠాధిపతిని కలిసిన సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. విశాఖ శారదా పీఠాధిపతులను కలిశారు. చందానగర్‌లోని వేంకటేశ్వరస్వామి ఆలయానికి వెళ్లిన కేసీఆర్.. విశాఖ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర సరస్మతి, ఉత్తర పీఠాధిపతి స్వాత్మానందేంద్ర సరస్వతిని బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. పీఠాధిపతుల నుంచి ఆశీస్సులు తీసుకున్నారు. ముఖ్యమంత్రి వెంట శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ఉన్నారు. కాగా శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని గోపన్‌పల్లిలో 9 ఎకరాల స్థలంలో నిర్మించిన విప్రహిత బ్రాహ్మణ సంక్షేమ సదనం ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు విశాఖ శారదా పీఠాధిపతులు హాజరైన సంగతి తెలిసిందే. చదవండి: బిల్లుల పెండింగ్.. గవర్నర్ విజ్ణతకే వదిలేస్తున్నాం: హరీష్ రావు -
చందానగర్: షాపులో ఉన్న భార్యను పరిగెత్తించి.. అతి కిరాతకంగా..
సాక్షి, హైదరాబాద్: కట్టుకున్న భార్యను రాయితో అతి కిరాతకంగా కొట్టి హత్య చేసిన ఘటన చందనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. నల్లగండ్లలో నివాసముంటున్న తాండూరుకు చెందిన అంబికా.. బొటిక్ షాపులో పని చేస్తోంది. శుక్రవారం ఉదయం షాప్‌లో పనిచేస్తున్న సమయంలో ఆమె వద్దకు వచ్చిన భర్త నరేందర్.. తలపై బండరాయితో దాడి చేశాడు. ప్రాణాలు కాపాడుకోవడానికి గాయాలతో రోడ్డుపై పరిగెత్తిన అంబికను వెంబడించి మరి అతి కిరాతకంగా కత్తితో హత్య చేశాడు. గొడవలు కారణంగా భార్యాభర్తలు ఏడాది నుంచి దూరంగా ఉంటున్నారు.. భార్యపై అనుమానంతోనే హత్య చేసినట్లుగా ప్రాథమికంగా నిర్ధారణ అయ్యిందని పోలీసులు తెలిపారు. చదవండి: హైదరాబాద్‌లో దారుణం.. మాజీ ప్రియురాలి ఇంట్లోకి దూరి.. -
చందానగర్ పాపిరెడ్డి కాలనీలో విషాదం
-
ఇద్దరు పిల్లలు సహా దంపతుల ఆత్మహత్య.. ఏం కష్టమొచ్చిందో పాపం!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదారాబాద్‌లో విషాద ఘటన చోటు చేసుకుంది. చందానగర్ పాపిరెడ్డి కాలనీలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. రాజీవ్ గృహకల్ప బ్లాక్ నెంబర్ 18లో నివాసముంటున్న కుటుంబం... ఆదివారం అర్ధరాత్రి బలవన్మరణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఇద్దరు పిల్లలు సహా భార్యాభర్తలు విగతజీవులుగా పడి ఉండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీశారు. కుటుంబ కలహాలా? లేదా అప్పుల వ్యవహారం ఉందా? అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఇదీ చదవండి: తండ్రి కొడుకుల జంట హత్య కేసు: చీకటి జీవితాల్లో వెలుగు దివ్వెలు -
చందానగర్‌లో సందడి చేసిన హీరోయిన్ సురభి
-
చందానగర్ లోని ఓ లాడ్జిలో యువతి అనుమానాస్పద మృతి
-
డైరీలో.. మమ్మీ నేను బతకడానికి వెళ్తున్నా, నా కోసం..
సాక్షి,చందానగర్( హైదరాబాద్): చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ విద్యార్థిని అదృశ్యమైంది. పోలీసులు తెలిపిన మేరకు.. వికారాబాద్ జిల్లా, బషీరాబాద్‌కు చెందిన ఆకార దేవికారాణీ రాజేష్ దంపతులు పాపిరెడ్డి కాలనీలో నివాసముంటున్నారు. వారి కుమార్తె ఆకార ఉజ్జయిని (18) డిగ్రీ చదువుతోంది. తండ్రి మందలించడంతో ఎవరికి చెప్పకుండా వెళ్లిపోయింది. ఒక డైరీలో మమ్మీ నేను బతకడానికి వెళ్తున్నాను, నన్ను వెతకకూడదని రాసిపెట్టి వెళ్లిపోయింది. కుటుంబసభ్యులు చందానగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మరో ఘటనలో... గచ్చిబౌలిలో బిల్డర్ అదృశ్యం గచ్చిబౌలి(హైదరాబాద్): మీటింగ్ ఉందని చెప్పి ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఓ బిల్డర్ అదృశ్యమయ్యాడు. ఈ సంఘటన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఏఎస్ఐ సాయులు తెలిపిన మేరకు.. గచ్చి బౌలిలోని ఏపీహెచ్‌బీ కాలనీ ఎంఐజీలో నివాసముండే సుప్ర బిల్డర్ ఎ.అశోక్(49) ఈనెల 5వ తేదీ సాయంత్రం శంషాబాద్‌లో మీటింగ్ ఉందని చెప్పి ఇంటి నుంచి వెళ్లాడు. తెల్లవారినా ఇంటికి రాకపోవడం, రెండు ఫోన్లు స్విచ్చాఫ్ చేసి ఉండటంతో కుటుంబ సభ్యులు తెలిసిన చోట వాకబు చేశారు. ఆచూకీ లబ్యం కాకపోవడంతో బుధవారం గచ్చిబౌలి పీఎస్‌లో కుమారుడు యోగేష్ కుమార్ ఫిర్యాదు చేశారు. అదృశ్యమైన రోజు ముగ్గురు వ్యక్తులు ఇంటికి వచ్చి తన తండ్రితో మాట్లాడి Ðð వెళ్లారని ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: Doctor Missing Case: వీడని మిస్టరీ.. డాక్టర్ జయశీల్‌రెడ్డి ఏమయ్యారు? -
KTR: క్యాప్ బాగుంది.. ఫొటో దిగుదామా అమ్మా!
సాక్షి, హైదరాబాద్: చందానగర్ సర్కిల్ పారిశుద్ధ్య కార్మికురాలు సైదమ్మను మంత్రి కేటీఆర్ ఆప్యాయంగా పలకరించారు. ఆమె తలపై ధరించిన టోపీ బాగుందంటూ, క్యాప్ సరిచేసి యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. వసంత్ సిటీ వద్ద నిర్మించిన లింక్ రోడ్‌ను ప్రారంభించి వెళ్తున్న సమయంలో, అక్కడే విధులు నిర్వహిస్తున్న ఆమెతో కాసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా... జీతం వస్తోందా అని మంత్రి కేటీఆర్ అడుగగా.. ‘‘మీరు వచ్చాక రెండు సార్లు పెరిగింది’’ అని సైదమ్మ తెలిపారు. ఇందుకు స్పందించిన కేటీఆర్.. ‘‘రెండుసార్లు కాదమ్మా.. మూడు సార్లు పెంచాము’’ అని బదులిచ్చారు. అనంతరం.. ‘‘ఫోటో దిగుదామా’’ అని అడిగి సైదమ్మతో మంత్రి ఫోటో దిగారు. కాగా ఐటీ కారిడార్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఇబ్బందులను దూరం చేసేందుకు చేపట్టిన చర్యల్లో భాగంగా కొత్తగా మరో నాలుగు రోడ్డు మార్గాలను ఐటీ శాఖా మంత్రి కేటీఆర్ సోమవారం ప్రారంభించారు. బీటీ లింకురోడ్డు నుంచి నోవాటెల్ హోటల్ నుంచి కొండాపూర్ ఆర్టీఏ కార్యాలయం వరకు, బీటీ లింకురోడ్డు– మియాపూర్ మెట్రో డిపో నుంచి కొండాపూర్ మసీద్‌బండ జంక్షన్ వరకు, బీటీ లింకురోడ్డు – వసంత్సిటీ నుంచి న్యాక్ వరకు, బీటీ లింకురోడ్డు– జేవీ హిల్స్ పార్కు నుంచి మసీదుబండ వరకు వయా ప్రభుపాద లేఅవుట్ హైటెన్షన్ లైన్ గుండా పయనించేందుకు వీలుగా కొత్త మార్గాలు అందుబాటులోకి వచ్చాయి. చదవండి: మంత్రి కేటీఆర్ నేడు ప్రారంభించిన రోడ్లు ఇవే.. పూర్తి వివరాలు -
చందనగర్‌లో నాలుగు నెలల బాలుడి కిడ్నాప్ కేసు సుఖాంతం
-
సూత్రధారి రాజు.. అమలు యుగంధర్‌రెడ్డి
గచ్బిబౌలి(హైదరాబాద్): చింత యోగా హేమంత్ కుమార్ హత్య కేసులో మరో నలుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్లు తెలిపారు. సోమవారం ఇక్కడ నిర్వహించిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు. అరెస్టు అయినవారిలో సూత్రధారి సోమయాల రాజు, సాయన్నతోపాటు హత్యలో పాల్గొన్న ఎరుకల కృష్ణ, మహ్మద్ పాషా ఉన్నారు. యుగంధర్ రెడ్డిని బావ లక్ష్మారెడ్డి, అక్క అర్చన కలిసి హేమంత్ అడ్డు తొలగించాలని అభ్యర్థించారు. దీంతో వట్టినాగులపల్లికి చెందిన సోమయాల రాజు(52), ఎరుకల కృష్ణ(33), మహ్మద్ పాషా అలియాస్ లడ్డూ(32), ఐడీఏ బొల్లారం నివాసి, రౌడీషీటర్ బ్యాగరి సాయన్న(48)లతో కలిసి హత్యకు పక్కా స్కెచ్ వేశాడు. రూ.10 లక్షల సుపారీకి రూ.50 వేలు అడ్వాన్స్‌గా తీసుకున్నాడు. హేమంత్‌కు సంబంధించిన ఐదున్నర తులాల బంగారు బ్రాస్లెట్, చైన్‌ను ఎరుకల కృష్ణ నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. యుగంధర్ రెడ్డి, అవంతి తండ్రి లక్ష్మారెడ్డిల ఆరు రోజుల కస్టడీ సోమవారం ముగిసింది. అల్లుడు హేమంత్‌ను అడ్డు తొలగించేందుకు రూ.30 లక్షలైనా ఖర్చు చేసేందుకు లక్ష్మారెడ్డి సిద్ధపడ్డట్టు విచారణలో వెల్లడైంది. లక్ష్మారెడ్డి ఇంటి చుట్టూ సీసీ కెమెరాలను అమర్చి అవంతి బయటకు వెళ్లకుండా కట్టడి చేశాడు. అవంతి సోదరుడు అశీష్‌రెడ్డి పాత్రపై ఎలాంటి ఆధారాలు లభించలేదని, ఆధారాలు లభిస్తే అశీష్‌రెడ్డిపై కేసు నమోదు చేస్తామని డీసీపీ వివరించారు. ఏ7 విజయేందర్ రెడ్డి, ఏ8 అర్థం రంజిత్ రెడ్డి, ఏ9 అర్థం రాకేష్ రెడ్డి, ఏ11 ఎల్లు సంతోష్‌రెడ్డి, 12 కైలా సందీప్ రెడ్డి, ఏ15 షేక్ సాహెబ్ పటేల్‌తోపాటు గూడూరు సందీప్‌రెడ్డిలను కస్టడీలోకి తీసుకునేందుకు పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. (చదవండి: హేమంత్ హత్య కేసు: తొలిరోజు విచారణ) అమ్మకు బాగాలేదని... నిందితులు విజయేందర్‌రెడ్డి, స్పందన, రాకేష్‌రెడ్డి గచ్చిబౌలిలోని టీఎన్జీవోస్ కాలనీలో హేమంత్, అవంతిలను రెండుసార్లు కలిశారు. ‘నీవు ఇంటి నుంచి వెళ్లినప్పటి నుంచి అమ్మకు ఆరోగ్యం బాగాలేద’ని నమ్మించారు. పలుమార్లు ఫోన్లో మాట్లాడుతూ ప్రేమ ఉన్నట్లు నటించారు. మరోవైపు హేమంత్ హత్యకు లక్ష్మారెడ్డి, యుగంధర్‌రెడ్డి ప్లాన్ చేశారు. హత్యకు ముందు మరో గ్యాంగ్‌తో లక్ష్మారెడ్డి మాట్లాడినట్లు తెలుస్తోంది. ఒప్పందం కుదుర్చుకున్న తరువాత ఆ ముఠా నుంచి స్పందన రాకపోవడంతో యుగంధర్‌రెడ్డి ద్వారా ప్లాన్ చేసినట్లు సమాచారం. మరో గ్యాంగ్‌తో మాట్లాడిన విషయంపైనా విచారణ చేపట్టనున్నారు. ఎస్‌హెచ్‌వోతోపాటు మరో ఇద్దరికి కరోనా హేమంత్ హత్య కేసులో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌గా ఉన్న ఎస్‌హెచ్‌వో ఆర్.శ్రీనివాస్‌కు కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో డీఐ క్యాస్ట్రో ఐవోగా ఉంటాడని డీసీపీ తెలిపారు. హత్యకేసులో నిందితులైన ఎరుకల కృష్ణ, మహ్మద్ పాషాలకు టెస్ట్‌లు చేయగా పాజిటివ్ అని తేలినట్లు సామాచారం. (చదవండి: మొదటి భార్యకు విడాకులు.. రెండో భార్య కుమార్తెపై కన్ను) -
అవంతికి హామీ ఇచ్చిన సీపీ సజ్జనార్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హేమంత్ కుటుంబ సభ్యులకు పూర్తి భద్రత కల్పిస్తామని సైబరాబాద్ సీపీ సజ్జనార్ హామీనిచ్చారు. హేమంత్ ఇంటివద్ద 24 గంటల భద్రత ఏర్పాటు చేయాలని చందానగర్ పోలీసులకు ఆయన ఆదేశాలు జారీ చేశారు. ఒక మహిళా కానిస్టేబుల్, ఒక కానిస్టేబుల్‌ను ఏర్పాటు చేయాలని చెప్పారు. తమకు ప్రాణహాని ఉందని, భద్రత కల్పించాలన్నహేమంత్ భార్య అవంతి విజ్ఞప్తి మేరకు సజ్జనార్ స్పందించారు. దీంతోపాటు హేమంత్ కేసు విచారణకు ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి లేఖ రాసినట్టు ఆయన తెలిపారు. (చదవండి: ‘చచ్చింది కుక్కనే కదా...మనిషి కాదుగా’) ఇదిలాఉండగా.. హేమంత్ పరువు హత్య కేసులో ప్రధాన నిందితులు యుగేంధర్ రెడ్డి, లక్ష్మారెడ్డిని పోలీసులు ఆరు రోజుల పాటు విచారించనున్నారు. కేసు విచారణలో భాగంగా అవంతిక తండ్రి లక్ష్మారెడ్డి, యుగేందర్ రెడ్డిలను గచ్చిబౌలి పోలీసులు బుధవారం కస్టడీలోకి తీసుకున్నారు. ఇద్దరు నిందితులను గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. గోపన్ పల్లి వద్ద హేమంత్ కిడ్నాప్ స్థలం నుంచి సంగారెడ్డిలో హత్యా స్థలం వరకు నిందితులను తీసుకెళ్లి పోలీసులు సీన్ రీ కన్స్ట్రక్షన్ చేయనున్నారు. ప్రధాన కుట్రదారు లక్ష్మారెడ్డి, అమలు చేసింది యుగంధర్ రెడ్డి అని పోలీసులు నిర్ధారించారు. సుపారీ కిల్లింగ్‌లో ఇంకా ఎవరి హస్తం ఉందనే కోణంలో విచారిస్తున్నారు. కాగా, ఈ కేసులో ఇప్పటివరకు 21 మందిని పోలీసులు అరెస్టు చేయగా.. మరో నలుగురు పరారీలో ఉన్నారు. (చదవండి: హేమంత్ హత్య : అసలు తప్పెవరిది?) -
హేమంత్ హత్య: చందానగర్‌లో ఉద్రిక్తత
సాక్షి, హైదరాబాద్: ప్రేమ పెళ్లి కారణంగా దారుణ హత్యకు గురైన హేమంత్‌కు న్యాయం జరగాలని అతని స్నేహితులు, సన్నిహితులు స్పష్టం చేశారు. హేమంత్ నివాసం వద్ద సోమవారం సాయంత్రం వారంతా నిరసన చేపట్టారు. పరువు హత్యలకు వ్యతిరేకంగా 'జస్టిస్ ఫర్ హేమంత్' కార్యక్రమం చేపడుతున్నట్టు తెలిపారు. తమకు న్యాయం కావాలంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా.. ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిరసన కార్యక్రమంలో హేమంత్ భార్య అవంతి, సోదరుడు సుమంత్, సీపీఐ నారాయణ పాల్గొన్నారు. ఈక్రమంలో హేమంత్ ఇంటినుంచి అవంతి తండ్రి లక్ష్మారెడ్డి నివాసం వైపు నిరసనకారులు దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. అప్రమత్తమైన పోలీసులు వారిని అడ్డుకోవడంతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. కాగా, చందానగర్‌కు చెందిన అవంతిరెడ్డి, హేమంత్ ఇటీవల ప్రేమ పెళ్లి చేసుకోగా.. అవంతి తల్లిదండ్రులు హేమంత్‌ను కిరాతకంగా హత్య చేయించారు. అవంతి మేనమామ యుగేందర్‌రెడ్డి ఈ హత్యకేసులో ప్రధాన నిందితుడు. ఇప్పటికే 14 మందిని జ్యూడిషియల్ రిమాండ్‌కు తరలించగా.. మరో ఏడుగురిని ప్రత్యేక బృందాలు విచారిస్తున్నాయి. రెండేళ్ల క్రితం మిర్యాలగూడలో ప్రణయ్ హత్యోదంతం మరువకపముందే.. హేమంత్ హత్య సంచలనంగా మారింది. (చదవండి: హత్యకేసులో 21కి పెరిగిన నిందితుల సంఖ్య) వైఫల్యం కనిపిస్తోంది ‘జస్టిస్ ఫర్ హేమంత్’ నిరసన కార్యక్రమంలో పాల్గొన్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ మీడియాతో మాట్లాడారు. ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి నిందితులకు ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేశారు. తమ కుటుంబ సభ్యుల నుంచి ప్రాణహాని ఉందని జూన్ 16 తర్వాత అవంతి పోలీసులకు ఫిర్యాదు చేసిందని ఆయన గుర్తు చేశారు. హేమంత్ హత్యకు గురవడంలో పోలీసు శాఖ వైఫల్యం కనిపిస్తోందని అన్నారు. సభ్య సమాజం సిగ్గుపడే ఘటన జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. (చదవండి: హేమంత్‌ది పరువు హత్య: గచ్చిబౌలి పోలీసులు) -
హేమంత్ రిమాండ్‌లో సంచలన విషయాలు
సాక్షి, హైదరాబాద్ : హేమంత్ హత్య కేసులో రిమాండ్‌లో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. అవంతి, హేమంత్‌ను విడదీయడంతోపాటు హేమంత్‌ను చంపేందుకు ప్లాన్ చేసిన మొత్తం వివరాలను నిందితులు పోలీసుల ఎదుట వెల్లడించారు. ఈ నేపథ్యంలో నెల రోజుల ముందే హేమంత్‌ను చంపేందుకు పథకం పన్నినట్లు నిందితులు లక్ష్మారెడ్డి, యుగేంధర్ వెల్లడించారు. గచ్చిబౌలిలోని టీఎన్జీవో కాలనీలో నివాసముంటున్న హేమంత్‌ను ఎలా చంపాలి, ఎలా కిడ్నాప్ చేయాలనే విషయంపై నెల రోజుల ముందే స్కెచ్ వేసినట్లు యుగేంధర్ తెలిపారు. ఇందుకు కిరాయి హంతకులు కృష్ణ, రాజు, పాషాలతో పలుమార్లు సంప్రదించినట్లు పేర్కొన్నారు. అలాగే అవంతికి మాయమాటలు చెప్పి తమ వైపు తిప్పుకోవాలని ప్లాన్ చేసినట్లు లక్ష్మారెడ్డి తెలిపారు. నెల క్రితం హేమంత్‌ను చంపేందుకు లింగంపల్లిలోని లక్ష్మారెడ్డి ఇంట్లో సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. (ఒక్కసారి కళ్ళు తెరువు హేమంత్ : అవంతి) కులాంతర వివాహం చేసుకున్న కారణానికి హేమంత్ అనే వ్యక్తిని గురువారం అత్యంత దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. జూన్ 10న ఇంట్లో నుంచి వెళ్లిపోయిన అవంతిరెడ్డి జూన్ 11న హేమంత్‌ను ప్రేమ వివాహం చేసుకున్నారు. అవంతి, హేమంత్ వివాహం కారణంగా అవమానంతో రగిలిపోయిన లక్ష్మారెడ్డి, భార్య అర్చన తన కూతురు వివాహంపై యుగేంర్‌రెడ్డితో గోడు వెళ్లదీసుకున్నారు. నాలుగు నెలల పాటు ఇంట్లోనే ఉన్న లక్ష్మారెడ్డి, అర్చన దంపతులు తన చెల్లి బాధ చూడలేక అవంతిని హేమంత్ నుంచి విడదీయాలని యుగంధర్‌రెడ్డి నిర్ణయించుకున్నాడు. నెల రోజుల క్రితం లక్ష్మారెడ్డి ఇంట్లో కుటుంంబ సభ్యుల సమావేశం ఎలాగైనా అవంతి, హేమంత్‌ను విడదీయాలని నిర్ణయం తీసుకున్నారు. (హైదరాబాద్‌లో పరువు హత్య కలకలం) యుగేందర్‌రెడ్డి అన్న విజయేందర్‌రెడ్డి గచ్చిబౌలిలోని టీఎన్జీవో కాలనీలో అవంతి ఇంటి కోసం రెక్కీ నిర్వహించి ఈ నెల 24న మధ్యాహ్నం 2:30 ఇంట్లోకి బలవంతంగా చొరబడ్డారు. ఈ క్రమంలో 12 మంది బంధువులు హేమంత్, అవంతిపై దాడిచేస్తూ వారిని కారులోకి ఎక్కించారు. లింగంపల్లిలో మాట్లాడుదామని గోపన్‌పల్లివైపు బుంధువులు తీసుకెళ్లగా గోపన్‌పల్లిలో అవంతి, హేమంత్ తప్పించుకున్నారు. అవంతి పారిపోగా హేమంత్ దొరకపట్టి సాయంత్ర 7:30కు కారులోనే హేమంత్‌ను నిందితులు హత్య చేశారు. సీన్లో లేకుండా లక్ష్మారెడ్డి, అర్చన జాగ్రత్తపడగా అనంతరం బైక్‌పై గోపన్‌పల్లికి చేరుకున్నారు. ఈ హత్య కేసులో మొత్తంలో 13 మంది బంధువులు ఇన్వాల్వ్ అయ్యారు. కాగా అర్చన బాధ చూడలేకే హత్య చేశానని యుగంధర్‌రెడ్డి తెలిపారు. హేమంత్ హత్య కేసులో 18మంది నిందితులు ఉండగా వీరిలోనలుగురు కృష్ణ, బాషా,జగన్, సయ్యద్ పరారీలో ఉన్నారు. మిగతా 14 మందిని గచ్చిబౌలి పోలీసులు అరెస్ట్ చేశారు. అవంతిని వదిలేయమని హేమంత్‌కు ఎంతచెప్పిన వినకపోతేనే హత్య చేశామని ఏ1 నిందితుడు యుగేంధర్ రెడ్డి తెలిపారు.కారులో సైతం చాలా సేపు నచ్చచెప్పినట్లు పేర్కొన్నారు. కాగా యుగేంధర్ రెడ్డితో ఏడు లక్షలకు హత్య చేసేందుకు ఒప్పందం చేసుకున్నామని ఏ5 నిందితుడు బిచ్చుయాదవ్ తెలిపారు. అతనితో 10 సంవత్సరాలుగా కలిసి వాటర్ సప్లై బిజినెస్ చేశామని, ఆ పరిచయంతోనే హత్యకు ఒప్పుకొన్నామని వెల్లడించారు. -
మమ్మల్ని నమ్మించి మోసం చేశారు: అవంతి
సాక్షి, హైదరాబాద్ : తన భర్తను దారుణంగా హతమార్చిన వారిని కఠినంగా శిక్షించాలని హేమంత్ కుమార్ భార్య అవంతి డిమాండ్ చేశారు. తన మేనమామతో కలిసి మరో ఇద్దరు హేమంత్‌ను హత్య చేశారని ఆమె తెలిపారు. అవంతి శుక్రవారమిక్కడ మాట్లాడుతూ.. ‘మేము 8 ఏళ్లుగా మేమిద్దం ప్రేమించుకున్నాం. అయితే పెళ్లికి మా తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. అందుకే ఇంట్లో నుంచి వెళ్లిపోయి ఈ ఏడాది జూన్‌లో వివాహం చేసుకున్నాం. ఆ తర్వాత పోలీసుల సమక్షంలోనే తల్లిదండ్రులతో రాజీ కుదిరింది. నాతో వాళ్లకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. అలాగే నా పేరు మీద ఉన్న ఆస్తులన్నీ మా నాన్నకు రాసిచ్చేశాను. (హైదరాబాద్‌లో పరువు హత్య కలకలం) నిన్న మధ్యాహ్నం మా మేనమామతో పాటు మరికొంతమంది ఇంట్లోకి చొరబడి మా ఇద్దర్ని కిడ్నాప్ చేశారు. కారులో తీసుకువెళుతుండగా ఇద్దరం అందులో నుంచి కిందకు దూకేశాం. అయితే హేమంత్‌ను కొట్టుకుంటూ బలవంతంగా మళ్లీ కారులో తీసుకుని వెళ్లిపోయారు. నేను కిడ్నాపర్ల నుంచి తప్పించుకుని వెంటనే 100కి కాల్ చేసినా.. 40 నిమిషాల వరకు పోలీసులు స్పందించలేదు. హేమంత్ చనిపోయినట్లు ఇవాళ ఉదయం పోలీసులు మాకు చెప్పారు. నల్గొండ జిల్లాలో ప్రణయ్‌ను హత్య చేసిన మారుతీరావు చివరకు ఏమయ్యారో అందరం చూశాం. హేమంత్‌ను చంపినవాళ్లను ఎన్కౌంటర్ చేయాలి. నన్ను ప్రేమించినవాళ్లు అయితే హేమంత్‌ను ఎలా చంపుతారు. పోలీసులు సకాలంలో స్పందిస్తే ఇలాంటి ఘటన జరిగేది కాదు. మమ్మల్ని కిడ్నాప్ చేశాక సాయం చేయాలని అర్థించినా ఎవరూ ముందుకు రాలేదు. మా తల్లిదండ్రులతో మమ్మల్ని కలుపుతారని అనుకున్నా.. నమ్మించి మోసం చేశారు. నా వల్లే ఇదంతా జరిగింది. నేనే లేకుంటే హేమంత్ ఇవాళ బతికి ఉండేవాడు’ అని ఆవేదన వ్యక్తం చేశారు. (function(w,d,s,u,n,i,f,g,e,c){w.WDMObject=n;w[n]=w[n]||function(){(w[n].q=w[n].q||[]).push(arguments);};w[n].l=1*new Date();w[n].i=i;w[n].f=f;w[n].g=g;e=d.createElement(s);e.async=1;e.src=u;c=d.getElementsByTagName(s)[0];c.parentNode.insertBefore(e,c);})(window,document,"script","//api.dmcdn.net/pxl/cpe/client.min.js","cpe","5f686da28ba2a6d8cbff0ede",{scroll_to_pause: true}); ఇలా ప్రాణాలు తీస్తారనుకోలేదు.. కేవలం కులం అనే కారణంగానే తన బిడ్డను పొట్టనపెట్టుకున్నారని మృతుడు హేమంత్ తల్లి లక్ష్మీ భోరున విలపించారు. తన కొడుకుకు ఒక్క చెడు అలవాటు కూడా లేదని, ఎప్పుడూ గట్టిగా మాట్లాడటం కూడా తెలియదన్నారు. ‘తల్లిదండ్రులను ఒప్పించి పెళ్లి చేసుకోవాలని అవంతికి చెప్పాను. అయితే వాళ్లు ఒప్పుకోకపోవడంతో పెళ్లి చేసుకున్నారు. పెళ్లి అయిన తర్వాత కూడా అర్థరాత్రులు ఫోన్ చేసి బెదరించారు. నా కొడుకును చూస్తే ఎలా చంపాలనిపించింది’ అని ఆవేదన వ్యక్తం చేశారు. ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్న నా కొడుకుని ఓ దెబ్బ కొడతారేమో అనుకున్నా కానీ, ఇలా ప్రాణాలు తీస్తారని ఎప్పుడూ ఊహించలేదని హేమంత్ తండ్రి చింతా మురళి కన్నీటిపర్యంతమయ్యారు. హేమంత్ హత్య కేసులో 13 మంది అరెస్ట్ హత్య కేసులో 13మందిని అరెస్ట్ చేసినట్లు గచ్చిబౌలి పోలీసులు తెలిపారు. నిన్న సాయంత్రం నాలుగు గంటలకు అవంతి,హేమంత్‌ను తీసుకెళ్లారన్నారు. హేమంత్ తండ్రి 100కు కాల్ చేశారని, పెట్రోలింగ్ వాహనం వెళ్లేసరికి అక్కడ అవంతి లేదన్నారు. తమకు సాయంత్రం 6.30 గంటలకు అవంతి ఫిర్యాదు చేసిందని పోలీసులు చెప్పారు. ఆ సమయానికే హేమంత్‌ను చంపేశారని, ఈ హత్య కేసులో యువతి తండ్రి లక్ష్మారెడ్డి, బంధువులదే ప్రధాన పాత్ర పోషించారని పేర్కొన్నారు. పోలీసుల అలసత్వం ఏమీ లేదని మాదాపూర్ డీసీపీ స్పష్టం చేశారు. హేమంత్ హత్యకు కొద్ది క్షణాల ముందు తీసిన ఫోటో -
హైదరాబాద్‌లో వివాహిత బలవన్మరణం
సాక్షి, హైదరాబాద్ : నగరంలోని చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం నెలకొంది. గోపన్ పల్లిలో ఓ వివాహిత ఒంటికి నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. భర్త సంతోష్, అత్తామామల వేధింపుల వల్లే స్రవంతి ఆత్మహత్య చేసుకుందని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. సాఫ్ట్వేర్ ఉద్యోగి కంకణాల సంతోష్‌కు 2017 అక్టోబర్‌లో స్రవంతితో వివాహం జరిగింది. వీరు ప్రస్తుతం గోపన్ పల్లి ముప్పా అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్నారు. వీరికి రెండేళ్ల బాబు కూడా ఉన్నారు. పెళ్లైయినా ఏడాదిలోపే తనను భర్త, అత్తమామలు వేధిస్తున్నారని స్రవంతి పోలీసులకు ఫిర్యాదు చేశారు. 2018 ఆగస్టులో ఈ కేసు నమోదైంది.(వికాస్ దూబే మరో సహచరుడు అరెస్టు!) అప్పటి నుంచి కూడా భార్యభర్తల మధ్య విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే సోమవారం రాత్రి సైతం భర్త, అత్తమామలతో స్రవంతికి గొడవ జరిగినట్టు సమచారం. ఆ తర్వాత స్రవంతి ఒంటికి నిప్పంటించుకుని బలవనర్మణం చెందినట్టుగా సమాచారం. ఈ ఘటనపై సమాచారం అందుకున్న చందానగర్ పోలీసులు అక్కడికి చేరకుని మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్‌కు తరలించారు. స్రవంతి మృతిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు.(లగ్నపత్రిక రాయించేందుకు వెళ్తూ..) -
విజేత సూపర్ మార్కెట్ సీజ్
సాక్షి, హైదరాబాద్: కరోనా వ్యాప్తి నేపథ్యంలో సామాజిక దూరం పాటించేలా జాగ్రత్త చర్యలు తీసుకోని సూపర్ మార్కెట్లను జీహెచ్ఎంసీ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలో చందానగర్‌కు చెందిన విజేత సూపర్ మార్కెట్‌ను శనివారం అధికారులు సీజ్ చేశారు. సూపర్ మార్కెట్లో భౌతిక దూరం పాటించకుండా ఒకేసారి ఎక్కుమందిని లోపలికి పంపడం, ఒకే దగ్గర అధిక సంఖ్యలో కస్టమర్స్ ఉండటంతో సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు. వాల్‌మార్ట్ ‘బెస్ట్ ప్రైస్’ సూపర్ మార్కెట్లో అధికారులు తనిఖీలు చేశారు. సీజ్ చేసినట్టు వచ్చిన వార్తలను వాల్‌మార్ట్ ఇండియా తోసిపుచ్చింది. అధికారులు తనిఖీలు మాత్రమే చేశారని వెల్లడించింది. లాక్డౌన్ నిబంధనలను కచ్చితంగా పాటిస్తున్నామని స్పష్టం చేసింది. అయితే అధికారుల తీరుపై సూపర్ మార్కెట్ యాజమాన్యాలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేగాక లాక్డౌన్ సమయంలో ప్రజలకు అనువుగా నిత్యవసర సరుకులను అందిస్తున్న తమపై ఇలాంటి చర్యలు తీసుకోవడం సరికాదని, దీనిపై ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కాగా, కరోనా కట్టడికి దేశవ్యాప్తంగా అమలు చేస్తున్న లాక్డౌన్ గడువును తెలంగాణ ప్రభుత్వం మే 7 వరకు పొడిగించిన సంగతి తెలిసిందే. కిరాణా వర్తకుడికి కరోనా పాజిటివ్ -
క్షణాల్లోనే.. అందమైన బంధంలో అంతులేని శోకం
వివాహ బంధంతో ఒక్కటవ్వాలని కలలు కన్న బావామరదళ్లను మృత్యు రూపంలో వచ్చిన రైలు కబళించింది. వచ్చే వేసవిలో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్న ఈ జంట మంగళవారం గుంటూరులోని బంధువుల ఇంటికి బయలుదేరగా..మధ్యలోనే మృత్యువాత పడింది. చందానగర్ పరిధిలోని శాంతినగర్‌కు చెందిన మనోహర్, సోనీలు క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనేందుకు గుంటూరు వెళ్లేందుకు బయలుదేరారు. చందానగర్ ఎంఎంటీఎస్ రైల్వేస్టేషన్లో పట్టాలు దాటుతుండగా లింగంపల్లి నుంచి హైదరాబాద్ వెళ్తున్న రైలు ఢీకొంది. దీంతో మనోహర్, సోనీ అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. ఈ విషాదాన్ని మనోహర్ తల్లి సూర్యకళ సమీపం నుంచి చూసి తీవ్ర షాక్‌కు గురైంది. ఈ స్టేషన్లో మూల మలుపు ఉండటంతో దగ్గరికి వచ్చే వరకు రైలు కనిపించదు. ఈ క్రమంలోనే ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నారు. చందానగర్: వారిద్దరూ బావా మరదళ్లు, వారికి పెళ్లి చేయాలని పెద్దలు నిర్ణయించారు. కొద్ది రోజుల్లోనే ఒకటికానున్న ఈ జంటను విధి వెంటాడింది. మృత్యువు రూపంలో దూసుకొచ్చిన రైలు ఢీ కొనడంతో ఇద్దరూ అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. ఈ హృదయ విదారక ఘటన మంగళవారం చందానగర్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..చందానగర్ పాపిరెడ్డి కాలనీకి చెందిన పెంటయ్య, సూర్యకళ దంపతుల కుమారుడు మనోహర్(24) హైటెక్‌సిటీలో జీహెచ్ఎంసీ చెత్త ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. శాంతినగర్‌కు చెందిన భిక్షపతి, లక్ష్మమ్మ కుమార్తె సోని(18) ఇంట్లోనే ఉంటుంది. మనోహర్‌కు మేనమామ కూతురైన సోనితో వివాహం జరిపించాలని పెద్దలు నిర్ణయించుకున్నారు. మనోహర్, సోని క్రిస్మస్ వేడుకల నిమిత్తం గుంటూరుకు వెళ్లేందుకు మంగళవారం చందానగర్ రైల్వేస్టేషన్‌కు వచ్చారు. వారిని ఎంఎంటీఎస్ రైలు ఎక్కించేందుకు తల్లి సూర్యకళ కూడా వారి వెంట వచ్చింది. మంగళవారం మధ్యాహ్నం ప్లాట్ ఫాం పక్క నుంచి పట్టాలు దాటుతుండగా లింగంపల్లి నుంచి హైదరాబాద్ వెళుతున్న ఎంఎంటీఎస్ రైలు ఢీ కొట్టింది. ఈ ఘటనలో మనోహర్ పట్టాలపై పడంతో తల, మొండెం వేరయ్యాయి. సోని ఎగిరి పట్టాల పక్కన పడటంతో తీవ్ర గాయాలై అక్కడిక్కడే మృతి చెందింది. తల్లి సూర్యకళ కొద్దిగా వెనకగా ఉండటంతో ప్రమాదం నుంచి బయటపడింది. కళ్ల ముందే కొడుకు, కోడలు చనిపోవడంతో సూర్యకళ కన్నీరు మున్నీరైంది. ఘటనా స్థలాన్ని హైదరాబాద్ రైల్వే ఎస్ఐ జీఆర్పీ దాస్యా నాయక్ పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఉదయం వెళ్లాల్సి ఉండేది... గుంటూరులో ఉంటున్న సూర్యకళ అక్క కుమారుడు సంతోష్ ఆహ్వానం మేరకు మనోహర్, సోని గుంటూరుకు బయలుదేరారు. ఇందుకుగాను మూడు రోజుల క్రితమే రైలు టికెట్ రిజర్వేషన్ చేసుకున్నారు. మంగళవారం ఉదయం లింగంపల్లి స్టేషన్‌కు వెళ్లగా వారు ఎక్కాల్సిన జన్మభూమి ఎక్స్‌ప్రెస్ మిస్ అయ్యింది. దీంతో మధ్యాహ్నం ఎంఎంటీఎస్ రైలు ఎక్కేందుకు స్టేషన్‌కు వచ్చారు. ముందుగా బ్యాగులు తీసుకుని ఫ్లాట్‌ఫాం మీద పెట్టి తిరిగి వచ్చిన మనోహర్ మరదలు, తల్లిని తీసుకొని పట్టాలు దాటుతుండగా వేగంగా దూసుకొచ్చిన ఎంఎంటీఎస్ రైలు ఢీ కొనడంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. సూర్యకళ పెద్ద కొడుకు రాజుకు మతిస్థిమితం లేదు. ఇంటికి పెద్ద దిక్కుగా ఉన్న మనోహర్ మృతి చెందడంతో సూర్యకళ బోరున విలపిస్తోంది. కాగా సోని తల్లి లక్ష్మమ్మ హఫీజ్‌పేట్ డివిజన్లో పారిశుద్ధ్య కార్మికురాలిగా పని చేస్తోంది. మనోహర్, సోని మృతి వార్త తెలియడంతో పాపిరెడ్డి నగర్ కాలనీ, శాంతినగర్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి. మూలమలుపు కారణంగానే.. చందానగర్ ఎంఎంటీఎస్ రైల్వే స్టేషన్‌కు వచ్చే వారు పాపిరెడ్డినగర్ కాలనీ, సురభి కాలనీ, రాజీవ్ గృహకల్ప మీదుగా కాలినడకన వచ్చి పట్టాలు దాటుతుంటారు. అయితే అక్కడ మూల మలుపు ఉండటంతో దగ్గరికి వచ్చే వరకు రైలు కనిపించదు. ఈ క్రమంలోనే ప్రమాదం జరిగి ఉంటుందని రైల్వే పోలీసులు భావిస్తున్నారు. -
చందానగర్‌లో వివాహిత బలవన్మరణం
సాక్షి, హైదరాబాద్: నగరంలోని చందానగర్‌లో దారుణం చోటుచేసుకుంది. చందానగర్‌లోని అపర్ణ లేక్ బ్రిజ్ అపార్ట్మెంట్ 11వ అంతస్తు నుంచి దూకి వివాహిత ఆత్మహత్య చేసుకుంది. మృతురాలిని ప్రియాంక శ్రీవాస్తవగా గుర్తించారు. ఆమెకు రెండేళ్ల క్రితం అనుభవ్ అనే వ్యక్తితో వివాహం కాగా, చందానగర్‌లో నివాసం ఉంటున్నారు. వీరికి 10 నెలల బాబు ఉన్నాడు. అయితే, కొడుకును సరిగ్గా చూసుకోలేకపోతున్నాననే బాధతో ప్రియాంక డిప్రెషన్లోకి వెళ్లినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో బుధవారం ఇంట్లో ఎవరూలేని సమయంలో 11వ అంతస్తు నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడింది. దీంతో ఆమె సంఘటనాస్థలంలో మృతి చెందింది. పై నుంచి దూకడంతో ప్రియాంక దేహం ఛిద్రమైంది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఆహార్యం.. లావణ్యం
-
ఇన్నోవాను ఆటోతో ఓవర్‌టెక్ చేశాడని..
సాక్షి, హైదరాబాద్ : కారుని ఓవర్ టేక్ చేశాడనే కోపంతో ఆటో డ్రైవర్ని నిర్బంధించి చితక బాదిన ఘటన చందానగర్‌లో చోటుచేసుకుంది. గౌలిదొడ్డి గ్రామానికి చెందిన రమేష్ తన మిత్రుడుతో కలిసి నల్లగండ్ల పెట్రోల్ బంకు వైపు వెళ్తున్నారు. అదే వైపు ఇన్నోవా కారులో కొంతమంది యువకులు వెళ్తున్నారు. కారుని ఆటోతో ఓవర్ టేక్ చేశాడనే కోపంతో చేజ్ చేసి ఆటోను అడ్డగించారు. అంతటితో ఆగకుండా రమేష్‌ను కారులో కిడ్నాప్ చేసి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకొని వెళ్లి మరికొంతమంది యువకులతో కలిసి తీవ్రంగా కొట్టారు. దీంతో రమేష్ అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో చనిపోయాడని వదిలి పెట్టి పోయారు. మూడు రోజులు క్రితం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ప్రస్తుతం ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో రమేష్‌కు చికిత్స అందిస్తున్నారు. -
మద్యం మతులో ఘర్షణ ఒకరు మృతి
-
పార్కింగ్ చేసి వచ్చే లోపు స్కూటీ మాయం
-
స్కూటీ ఎలా కొట్టేశారో చూడండి..
సాక్షి, హైదరాబాద్ : చందానగర్ పోలీసు స్టేషన్ పరిధిలో వాహనాల దొంగలు రెచ్చిపోతున్నారు. పార్కింగ్ చేసి పక్కకు వెళ్లి వచ్చే లోపు బండిని అదృశ్యం చేస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే చందానగర్‌లోని ఫాస్ట్స్టెప్ షాపు ముందు జరిగింది. వివరాలు.. శుక్రవారం సాయంత్రం షాపింగ్ కోసం వచ్చిన మహిళ తన ద్విచక్ర వాహనాన్ని చందానగర్ లోని ఫాస్ట్స్టెప్ షాపు ముందు నిలిపి లోపలి వెళ్లారు. తిరిగి వచ్చేసరికి స్కూటీ కనపడలేదు. దీంతో ఆందోళనకు గురైన ఆమె.. తన స్కూటీ కనిపించట్లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సమీపంలోని సీసీ కెమెరా పుటేజీలను పరిశీలించి గుర్తు తెలియని వ్యక్తి వాహనాన్ని తీసుకుని వెళ్తున్నట్లు గుర్తించారు. అనంతరం పుటేజీ ఆధారంగా నిందితుని కోసం గాలిస్తున్నారు. -
నగరంలో రామ్ చరణ్ తేజ్ సందడి
-
మహిళా సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్ : భర్త వేధింపులు భరించలేక ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. వనస్థలిపురానికి చెందిన జి. రేఖ(30) లంగర్‌హౌస్‌కు చెందిన ఉజ్వల్ ప్రేమించుకుని పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్నారు. అనంతరం చందానగర్‌లోని అపర్ణ గార్డినియా ప్లాట్‌నెంబర్ ఎ 801లో నివసిస్తున్నారు. దంపలిద్దరూ గచ్చిబౌలిలోని ఐబీఎం సంస్థలో పనిచేస్తున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు, కొడుకు ఉన్నారు. వేసవి సెలవులు కావడంతో పిల్లలు వనస్థలిపురంలో అమ్మమ్మ, తాతయ్య ఇంట్లో ఉంటున్నారు. కొన్ని రోజుల నుంచి దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. అంతేకాక భర్త ఎప్పుడూ అనుమానిస్తుండటం, ఆర్థిక ఇబ్బందులు ఆమెను ఒత్తిడికి గురిచేశాయి. ఫోన్లో మాట్లాడే విషయంలో భర్త ప్రవర్తన కారణంగా వారిద్దరి మధ్య అభిప్రాయభేదాలు అధికమయ్యాయి. కాగా.. శనివారం రాత్రి భార్యాభర్తలిద్దరు గచ్చిబౌలిలోని ఓ పబ్‌కు వెళ్లారు. ఇంటికి వచ్చాక గొడవపడి వేర్వేరు గదుల్లో నిద్రపోయారు. ఆదివారం ఉదయం ఉజ్వల్ లేచి చూసే సరికి రేఖ ఫ్యానుకు చీరతో వేలాడుతూ కనిపించింది. స్థానికుల సహాయంతో పోలీసులకు సమాచారం అందించగా విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించి, కేసు దర్యాప్తు చేస్తున్నారు. భర్తపై కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. అయితే రేఖ మృతిపై ఆమె కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. -
చందానగర్ హుడా కాలనీలో విషాదం
-
24 గంటల్లో ఐదు హత్యలు
-
భవనంపై నుంచి పడి యువకుడు మృతి
సాక్షి, చందానగర్: హైదరాబాద్ చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తారా నగర్లో భవనంపై నుంచి పడి ఓ యువకుడు మృతిచెందాడు. భవనం రెండవ అంతస్తుపై నుండి ఉమర్ పాషా (27) అనే వ్యక్తి కిందపడిపోయాడు. తీవ్రంగా గాయపడిన అతడిని ఆసుపత్రికి తరలిస్తుండగా మృతిచెందాడు. ఏడాది క్రితమే వివాహం అయింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధి ఆస్పత్రికి తరలించారు. ప్రదవశాత్తు జరిగిందా లేక హత్యా అన్నకోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
‘అపర్ణ వేరే వ్యక్తితో చనువుగా ఉంటుందనే హత్య చేశా’
సాక్షి, హైదరాబాద్ : నగరంలోని చందానగర్‌లో ట్రిపుల్ మర్డర్ కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుడు మధు సోమవారం చందానగర్ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. మూడు హత్యలను తానే చేసినట్లు అతడు అంగీకరించాడు. పోలీసుల విచారణలో అతడు పలు విషయాలు వెల్లడించాడు. ‘ అపర్ణతో పదేళ్లుగా సహజీవనం చేస్తున్నాను. అయితే ఆమె వేరే వ్యక్తితో చనువుగా ఉంటుంది. దాన్ని సహించలేకే హత్య చేశారు. ముందుగా కార్తికేయ, అపర్ణ తల్లి విజయమ్మను గొంతు నులిమి చంపాను. ఆ తర్వాత అపర్ణను గోడకేసి కొట్టి చంపాను.’ అని తెలిపాడు. కాగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి చెందిన అపర్ణ .. కూకట్‌పల్లికి చెందిన మధుతో కలిసి చందానగర్‌లో నివాసం ఉంటోంది. వీరికి నాలుగేళ్ల కుమార్తె ఉంది. ప్రముఖ ఎలక్ర్టానిక్ కంపెనీలో అపర్ణ సేల్స్ ఉమెన్‌గా పనిచేస్తుండగా.. ఆమెతో పాటు తల్లి విజయలక్ష్మి కూడా ఉంటోంది. రెండు రోజులుగా ఇంటి నుంచి బయటకు రాకపోవడం.. ఇంటి నుంచి వాసన రావాడాన్ని సోమవారం ఉదయం గమనించిన వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు ఇంటి తాళాలు పగులగొట్టడంతో అసలు విషయం బయటకు వచ్చింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బలమైన గాయాలతో.. రక్తపు మడుగులో అపర్ణ కిచెన్‌లో.. ఆమె తల్లి, కుమార్తె ఒక గదిలో హత్యకు గురయ్యారు. అయితే మధు ఇది వరకే జరిగిన పెళ్లిని దాచిపెట్టి తనను రెండో పెళ్లి చేసుకున్నాడని ఇటీవల అపర్ణకు, భర్త మధుకు మధ్య గొడవలు జరిగాయని తెలుస్తోంది. దీంతో ఇరువురు చందానగర్ పోలీస్ స్టేషన్ లో పరస్పరం ఫిర్యాదు చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో మధు.. అపర్ణను, కుమార్తెను సరిగా చూసుకోవడంలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అలాగే మధు మొదటి భార్య కుటుంబం, అపర్ణను బెదిరించినట్టు కూడా చెబుతున్నారు. తన భర్తను మోసం చేసి రెండో పెళ్లి చేసుకుందని అపర్ణపై, మొదటి భార్య కుటుంబ సభ్యులు ద్వేషం పెంచుకున్నట్టు తెలుస్తోంది. -
చందానగర్‌లో కుటుంబం హత్య కలకలం
-
దొంగ..దొంగ అని అరిచినందుకే.. చంపాను
చందానగర్ : పక్కింట్లో మధ్యాహ్నం వేళల్లో వృద్ధురాలు ఒక్కతే ఉంటుందని, తాను ఊరికి వెళ్లే ముందు ఆ ఇంట్లో కొంత సొమ్ము దొంగతనం చేయవచ్చుననుకునే అక్కడికి వెళ్లానని, అయితే వృద్ధురాలు ఉమాదేవి కేకలు వేసినందునే కత్తితో దాడి చేసినట్లు చందానగర్‌లో జరిగిన హత్య కేసులో నిందితురాలు వసుంధర లక్ష్మి పేర్కొన్నట్లు సమాచారం. శుక్రవారం రాత్రి గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె వద్దకు వెళ్లిన ఓ ఎస్సై తనను డాక్టర్‌గా పరిచయం చేసుకుని వివరాలు రాబట్టారు. ఉమాదేవి క్షేమంగా ఉన్నట్లు చెప్పడంతో ఆమె అసలు విషయం వెల్లడించింది. తాను ఉమాదేవి ఒంటిపై నగలు తీసుకునేందుకు ప్రయత్నించగా ఆమె కేకలు వేయడంతో పక్కనే ఉన్న కత్తితో గొంతుపై దాడి చేసి పారిపోయేందుకు ప్రయత్నించానంది. అయితే పోలీసులు, స్థానికులు ఇంటిని చుట్టుముట్టడంతో గత్యంతరం లేక కత్తితో తన కడుపులో పొడుచుకుంది. రక్తస్రావం కావడంతో పోలీసులు ఆమెను గాంధీ ఆస్పత్రికి తరలించగా, శనివారం ఉదయం వైద్యులు ఆపరేషన్ నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. -
దొంగలు ఈడ్చుకుంటూ వెళ్లినా వదల్లేదు
చందానగర్: గొలుసు స్నాచింగ్‌కు యత్నిం చిన దొంగలను ఓ మహిళ ధైర్యంగా ఎదుర్కొంది. ఈ క్రమంలో ఆమె తీవ్రగాయాలకు గురైంది. వివరాలు... సురక్షహిల్స్‌కు చెందిన రాధాబాయి శుక్రవారం ఉదయం 7 గంటలకు వాకింగ్‌కు వెళ్లింది. బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు ఆమె మెడలో ఉన్న 4 తులాల బంగారు గొలుసును తెంచుకెళ్లేందుకు యత్నించారు. అప్రమత్తమైన రాధాబాయి వారిని ప్రతిఘటించింది. దీంతో తోకముడిచిన దొంగలు పారిపోతుండగా రాధాబాయి వారి బైక్‌ను గట్టిగా పట్టుకుంది. ఈ క్రమంలో దొంగలు ఆమెను చాలా దూరం రోడ్డుపై ఈడ్చుకెళ్లడంతో తల, చేతులకు బలమైన గాయాలయ్యాయి. స్థానిక కార్పొరేటర్ బొబ్బ నవతారెడ్డి రాధాబాయి ఇంటికి వెళ్లి ఆమెను పరామర్శించారు. ఎంతో ధైర్యంగా స్నాచర్లను ఎదుర్కొని గొలుసును కాపాడుకున్న ఆమెను అభినందించారు. -
సెంట్రో షోరూంలో భారీ అగ్నిప్రమాదం
చందానగర్: ప్రధాన రహదారి పక్కన ఉన్న సెంట్రో చెప్పుల షోరూమ్‌లో శనివారం అగ్నిప్రమాదం జరిగి సుమారు రూ. 6 కోట్ల ఆస్తినష్టం జరిగింది. వివరాలు... ఉదయం 10.30కి చందానగర్‌లోని సెంట్రో షోరూమ్‌ను తెరిచేందుకు సిబ్బంది రాగా.. లోపలి నుంచి పొగ వస్తోంది. వెంటనే వారు అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇచ్చారు. కొద్దిసేపటికే మంటలు చెలరేగి షోరూమ్ మొత్తం వ్యాపించాయి. అగ్నిమాపక సిబ్బంది మూడు ఫైర్ ఇంజిన్లు, ఒక క్రేన్ ఫైర్ ఇంజిన్‌తో మంటలను అదుపులోకి తెచ్చేందుకు యత్నించారు. అయితే, షోరూమ్ ముందు 33 కేవీ విద్యుత్ వైర్లు ఉండటంతో సరఫరా నిలిపేందుకు సమయం పట్టడంతో క్రేన్‌ను షోరూమ్ ముందుకు చేర్చేందుకు ఆలస్యమైంది. తర్వాత క్రేన్ సహాయంతో మూడో ఫ్లోర్‌లోని అద్దాలు పగులగొట్టి నీటిని చిమ్మారు. ఎట్టకేలకు సాయంత్రం 4 గంటలకు మంటలను పూర్తిగా ఆర్పేశారు. దట్టమైన పొగతో ఉక్కిరిబిక్కిరి... ఏప్రిల్ 17న షోరూమ్‌ను ప్రారంభించిన తాము పెద్ద మొత్తంలో వస్త్రాలు, చెప్పులు, ఖరీదైన బ్రాండ్ షూలు తెచ్చి నిల్వ చేశామని షోరూమ్ యజమానులు తెలిపారు. ఈ ప్రమాదంలో రూ. 6 కోట్ల విలువైన సరుకు కాలిపోయిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మంటల్లో లెదర్, ఫ్లాస్టిక్, కాటన్ ఉత్పత్తులు కాలి దట్టమైన పొగ రావడంతో స్థానికులు ఊపిరాడక ఇబ్బందిపడ్డారు. ఘటనా స్థలానికి నాలుగు ఫైర్ ఇంజిన్లు రావడంతో ఆ మార్గంలో చందానగర్ వరకూ ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడటంతో సీఐ తిరుపతిరావు, ట్రాఫిక్ సీఐ వాసు దగ్గరుండి ట్రాఫిక్‌ను నియంత్రించారు. వెస్ట్ జోన్ కమిషనర్ గంగాధర్‌రెడ్డి, ఉప కమిషనర్ మమత, కార్పొరేటర్లు బొబ్బ నవతారెడ్డి, జగదీశ్వర్‌గౌడ్ పరిశీలించారు.∙ఎన్నో ఏళ్లు కష్టపడి నిర్మించుకున్న భవనం అగ్నిప్రమాదంలో కాలిపోయిందని భవన యాజమానులు రాధాకృష్ణ, శ్రీకాంత్, ప్రసాద్ కన్నీరుపెట్టుకున్నారు. -
చందానగర్ సెంట్రోలో అగ్నిప్రమాదం.
-
చందానగర్‌లో మిల్క్ బ్యూటీ
మిల్క్ బ్యూటీ తమన్నా సిటీలో మెరిసింది. చందానగర్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ 156వ షోరూమ్‌ను ఆమె శుక్రవారం ప్రారంభించారు. – చందానగర్ -
చందానగర్ లో చైన్ స్నాచింగ్
చందానగర్ (హైదరాబాద్) : ఇంటి ముందు కూర్చున్న ఓ వృద్ధురాలి మెడలో నుంచి మూడు తులాల బంగారు గొలుసు అపహరించిన సంఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. డీఎస్ఐ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. గంగారానికి చెందిన శాంతమ్మ(70) ఉదయం ఇంటి ముందు మెట్లపై కూర్చుంది. అదే సమయంలో 30 ఏళ్ల వ్యక్తి వచ్చి శాంతమ్మను ఇంటి నెంబర్-50 అడ్రస్ ఎక్కడ అని అడిగాడు. ఆమె సమాధానం చెప్పేలోపు మెడలోని బంగారు గొలుసును తెంచుకొని పారిపోయాడు. కొద్దిదూరంలో బైక్‌తో సిద్ధంగా ఉన్న మరో వ్యక్తితో కలిసి పారిపోయాడు. శాంతమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అదే ప్రాంతంలో మరో ఘటనలో.. గంగారానికి చెందిన లీలావతి(65) ఉదయం వేళలో ఇంటి ముందు కూర్చోగా అడ్రస్ వెతుక్కుంటూ వచ్చిన ఓ యువకుడు ఆమె మెడలోని బంగారు గొలుసును తస్కరించేందుకు ప్రయత్నించాడు. ఆమె గట్టిగా గొలుసును పట్టుకోవడంతో గొలుసు తెగి కింద పడిపోయింది. వెంటనే లీలావతి గట్టిగా కేకలువేయడంతో దుండగలు గొలుసును వదిలేసి అక్కడి నుంచి పరారయ్యాడు. -
మరో మహిళా టెకీ ఆత్మహత్య
హైదరాబాద్: మానసిక వ్యధతో మూడురోజుల కిందట ఆత్మహత్య చేసుకున్న సాఫ్ట్ వేర్ ఇంజనీర్ రాణీ మనీషా ఉదంతం మర్చిపోకముందే హైదరాబాద్ నగరంలో మరో మహిళా టెకీ ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది. నగరంలోని నలగండ్ల (చందానగర్)లో నివసిస్తోన్న మల్లీశ్వరి గచ్చిబౌలీలోని ఓ ఐటీ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తోంది. కొన్నాళ్ల కిందట సునంద కుమార్ మోహిత్ అనే వ్యక్తితో పెళ్లయింది. వారికి ఒక బాబు కూడా ఉన్నాడు. కొద్దికాలంగా భర్త సునంద కుమార్ మల్లీశ్వరిని వేధించడం మొదలుపెట్టాడు. చాలాసార్లు కుటుంబ పెద్దలకు ఫిర్యాదుచేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. దీంతో తీవ్ర మనస్థాపానికి చెందిన ఆమె.. శనివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్లాట్ గదిలోని ఫ్యాన్ కు ఉరివేసుకుంది. సమాచారం అందుకున్న మల్లీశ్వరి బంధువులు ఫ్లాట్ల కు వెళ్లి పరిశీలించగా మృతురాలి మెడ, ముఖంపై గాయాలు కనిపించాయి. దీంతో భర్తే ఆమెను హత్యచేసి ఉంటాడని అనుమానం వ్యక్తంచేస్తున్నారు. -
పెళ్లి విందులో మటన్ వడ్డించలేదని..
హైదరాబాద్: పెళ్లి విందులో మటన్ వడ్డింపు వ్యవహారం వధూవరుల బంధువుల మధ్య ఘర్షణకు దారితీసింది. చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటు చేసుకున్న ఈ సంఘటన గురించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శేరిలింగంపల్లి సురభీ కాలనీకి చెందిన మణికంఠ వివాహం బాచుపల్లి మల్లంపేటకు చెందిన రజనితో ఈ నెల 18న మల్లంపేటలో ఘనంగా జరిగింది. గురువారం సురభీ కాలనీలోని పెళ్లికొడుకు నివాసం వద్ద విందు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో స్థానిక సురభీ కాలనీకి చెందిన ఒక యువకుడు తనకు మటన్ సరిగ్గా వడ్డించలేదని ప్లేటు విసిరేశాడు. అతను విసిరిన ప్లేటు వెళ్లి పెళ్లి కూతరు తరఫు బంధువలపైన పడింది. ఆగ్రహానికి గురైన మల్లంపేట వాసులు అతన్ని తీసుకెళ్లి చితకబాదారు. దీన్ని గ్రహించిన స్థానికులు మల్లంపేట వాసులపై దాడికి దిగడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ నెలకొంది. తమవారిని కొడుతున్నారని సురభీ కాలనీ వాసులు, తమ ఊరి వాళ్లను కొడుతున్నారని మల్లంపేట వాసులు ఆగ్రహాలకు గురై తీవ్ర స్థాయిలో కొట్టుకున్నారు. ఇరువర్గాలకు చెందిన పెద్దలు సర్దిచెప్పి పంపించివేయడంతో అర్ధరాత్రి దాటాక మల్లంపేటకు వెళ్లిపోయారు. కానీ.. తిరిగి శుక్రవారం మధ్యాహ్నం మల్లంపేట గ్రామం నుంచి సుమారు 30 మంది వివిధ వాహనాలలో వచ్చి సురభీ కాలనీ వాసులపై ఆకస్మాత్తుగా దాడికి దిగారు. కాలనీ పక్కనే రైల్వే ట్రాక్ ఉండటంతో కంకర్ రాళ్లతో దాడి చేయడంతో సురభీ కాలనీకి చెందిన సాయి, చిన్న, చంటి, నాగరాజ్, వెంకటేష్‌లకు తీవ్ర గాయాలయ్యాయి. తలకు తీవ్రగాయమవడంతో చరణ్ అనే వ్యక్తి ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. ఆలస్యంగా విషయంగా తెలుసుకున్న చందానగర్ ఎస్సై రామారావు సంఘటన స్థలానికి చేరుకున్నారు. అప్పటికే అక్కడ ఘర్షణ తీవ్రంగా ఉండడంతో అదనపు సిబ్బందిని తీసుకొచ్చి ఇరువర్గాలకు చెందిన వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ మేరకు ఇరువర్గాలు ఒకరిపై కొకరు ఫిర్యాదులు చేసుకోవడంతో, పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
జనపథం- చందానగర్
-
ముగిసిన మెట్రో పొలిస్ అంతర్జాతీయ సదస్సు
-
రాంగోపాల్ వర్మపై కేసు నమోదు
చందానగర్: సినీ దర్శకుడు రాంగోపాల్‌వర్మపై చందానగర్ పోలీస్ స్టేషన్లో ఆదివారం కేసు నమోదైంది. రాంగోపాల్ వర్మ ట్విట్టర్లో హిందువుల మనోభావలను దెబ్బతీసేవిధంగా వినాయకునిపై చేసిన వాఖ్యలపై సామాజిక కార్యకర్త కసిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఫిర్యాదు చేశారు. తనను తాను ర క్షించుకోలేని వినాయకుడు భక్తులను ఎలా రక్షిస్తాడని వర్మ ట్విట్ చేశాడని, ఇది దేశవ్యాప్తంగా ఉన్న వినాయకుని భక్తులు, హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయన్నారు. ఈ ఫిర్యాదు మేరకు చందానగర్ పోలీసులు వర్మపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. -
పాపిరెడ్డికాలనీలో కార్డన్ ఆపరేషన్
చందానగర్: శేరిలింగంపల్లి పాపిరెడ్డి కాలనీలో ఆదివారం తెల్లవారుజామున సైబరాబాద్ పోలీసులు కార్డన్ ఆపరేషన్ నిర్వహించారు. మాదాపూర్ డీసీపీ రాణా, క్రైమ్ ఇన్చార్జి డీసీపీ జానకీ షర్మిల ఆధ్వర్యంలో పాపిరెడ్డి కాలనీ, సందయ్యనగర్, వాంబే గృహాలు, సురభి కాలనీ, రాజీవ్ గృహకల్పలో మొత్తం 2,624 ఇళ్లను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఇద్దరు డీసీపీలు, ఇద్దరు ఏసీపీలు, 30 మంది సీఐలు, 50 మంది ఎస్సైలు, 250 మంది కానిస్టేబుళ్లు 20 బృందాలుగా ఏర్పడి ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నారు. ఉదయం 5.30కి మొదలైన తనిఖీల్లో ప్రతి ఇంటినీ క్షుణ్ణంగా పరిశీలించి అందులో నివసిస్తున్న వారి వివరాలు అడిగి తెలుసుకున్నారు. తనిఖీలు జరుగుతున్నంత సేపు బయటి వారిని లోనికి, లోని వారిని బయటకు వెళ్లనివ్వలేదు. 30 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. వారిలో ఏడుగురికి నేర చరిత్ర ఉంది. ఆయా బస్తీల్లో వాహనాలను తనిఖీ చేయగా 33 ద్విచక్ర వాహనాలు, 10 ఆటోలు, 2 కార్లకు సంబంధించిన సరైన పత్రాలు లేకపోవడంతో వాటిని స్వాధీనం చేసుకున్నారు. తనిఖీల్లో సురేష్ అనే కరడుకట్టిన నేరస్తుడు చిక్కాడు. ఇతనిపై హత్య, అత్యాచారం, నాలుగైదు దొమ్మీ కేసులున్నాయని డీసీపీ రాణా తెలిపారు. -
కన్నా.. వెళ్లిపోయావా
చందానగర్ : హిమాచల్‌ప్రదేశ్ బియాస్ నది ప్రమాదంలో గల్లంతై మృతి చెందిన వెంకట్దుర్గ తరుణ్ మృతదేహాన్ని గురువారం చందానగర్‌లోని టెల్‌కట్స్ అపార్టుమెంట్‌కు తీసుకొచ్చారు. కన్నకొడుకు విగతజీవిగా రావడం చూసి తల్లిదండ్రులు సుబ్బారావు, విజయలక్ష్మీలు ఒక్కసారిగా బోరున విలపించారు. స్టడీటూర్కెళ్లి..ఇలా వస్తావనుకోలేదని కన్నీరుమున్నీరయ్యారు. తొమ్మిదేళ్లుగా వారు నివాసముంటున్న టెల్‌కట్స్ అపార్ట్‌మెంట్‌కు పరిసర ప్రాంతాల ప్రజలు, బంధువులు, స్నేహితులు పెద్దసంఖ్యలో తరలివచ్చి మృతదేహానికి నివాళులర్పించారు. అనంతరం అంత్యక్రియలు నిర్వహించేందుకు వారి స్వగ్రామమైన గుంటూరు జిల్లా మునగాల మండలం పెద్దపర్తిపాలెంకు తరలించారు. -
సమస్యలపై ప్రజాగ్రహం
చందానగర్/సెంట్రల్ యూనివర్శిటీ, న్యూస్‌లైన్: శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని చందానగర్‌లో నిర్వహించిన ‘సాక్షి జనసభ’లో ప్రజలు తమ సమస్యలను ప్రజాప్రతినిధులకు విన్నవించారు. బుధవారం చందానగర్ డివిజన్లోని అంబేద్కర్ కల్యాణ మండపంలో సాక్షి జనసభను ఫ్రెండ్స్ వె ల్ఫేర్ అసొసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ అధ్యక్షతన నిర్వహించారు. అసంపూర్తి డ్రైనేజీ పనులు, రోడ్లు, మంచినీటి సమస్యలను సమావేశం దృష్టికి తే వడంతోపాటు అధికారులు అందుబాటులో ఉండడం లేదని ఆగ్రహం వ్యక్తం చే శారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని కార్పొరేటర్ అశోక్‌గౌడ్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ ఈఈ రాజ్‌కుమార్, వాటర్ వర్క్స్ మేనేజర్ సరిత, వార్డు కమిటీ సభ్యులు మహేష్‌యాదవ్, పలు కాలనీలకు చెందిన ప్రజలు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. సమస్యల పరిష్కారానికి చర్యలు చందానగర్ డివిజన్లో అపరిష్కృత సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం. జనసభలో ప్రజలు మా దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను దశలవారీగా పరిష్కరిష్కరించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తాం. సమస్యల పరిష్కారం కోసం చేపడుతన్న పనుల్లో ఎక్కడా ఆలస్యం చోటు చేసుకోవడం లేదు. త్వరిత గతిన పనులు చేపట్టేందుకు సిద్ధమవుతున్నాం. అదనంగా సర్కిల్-12కు మరో ఏఈని నియమించడానికి ఉన్నతాధికారులు అంగీకరించారు. భూగర్భ డ్రైనేజీ పనులతో రోడ్లు ధ్వంసమయ్యాయి. వాటి మరమతులు చేపట్టే విషయాన్ని సీవరేజ్ బోర్డు అధికారుల దృష్టికి తీసుకువెళ్తాం. - రాజ్‌కుమార్, సర్కిల్-11 ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ వినియోగదారులదే బాధ్యత మంచినీటి పైప్‌లైన్ ఏర్పాటు కోసం తవ్విన పైప్‌లైన్ గుంతలను వినియోగదారులే పూడ్చివేయాలి. ఉన్నతాధికారుల ఆదేశానుసారం అన్ని కాలనీల్లో మంజీరా పైప్‌లైన్ పనులను వేగవంతం చేయనున్నాం. చందానగర్ డివిజన్లోని పలు కాలనీల్లో మంచినీటి సమస్య లేకుండా చర్యలు చేపడుతున్నాం. జన సభ ద్వారా మా దృష్టికి వచ్చిన సమస్యలను జాప్యం లేకుండా పరిష్కరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నాం. జనసభలో వెల్లువెత్తిన సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తాం. - సరిత, మెట్రో వాటర్ వర్క్స్ మేనేజర్ రూ. 2కోట్లతో చందానగర్ అభివృద్ధికి ప్రతిపాదనలు : కార్పొరేటర్ అశోక్‌గౌడ్ చందానగర్ డివిజన్ అభివృద్ధికి రూ. 2కోట్లతో ప్రతిపాదన చేసినట్లు కార్పొరేటర్ అశోక్‌గౌడ్ పేర్కొన్నారు. సమస్యల పరిష్కారానికి సాక్షి దినపత్రిక చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. జనసభ ద్వారా కొత్త సమస్యలు తమ దృష్టికి వచ్చినట్లు పేర్కొన్నారు. రూ.20లక్షలతో ఎంఏనగర్‌లో రోడ్డు నిర్మాణం పూర్తి చేయనున్నట్లు పేర్కొన్నారు. పలు ప్రాంతాల్లో అసంపూర్తిగా మిగిలిన సీసీ రోడ్లు, భూగర్భ డ్రైనేజీ పనులను పరిష్కరించేందుకు అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. పాత ముంబయి రోడ్డు నుంచి అమీన్పూర్ వరకు జరుగుతున్న రోడ్డు నిర్మాణ పనులను వేగవంతం చేసి పూర్తిచేస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటి వరకు ఇంటి నంబర్లు రాని వారికి వెంటనే నెంబర్లు ఇచ్చేలా కృషి చేస్తామని స్పష్టం చేశారు. పలు కాలనీల్లో వీధిలైట్ల ఏర్పాటు, పనిచేయని చోట మరమతులు చేపడతామన్నారు. మియాపూర్‌లోని బస్‌స్టేషన్ సమీపంలో త్వరలో సులభ్‌కాంప్లెక్స్ నిర్మాణానికి చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. అర్హులైన వారికి వృద్ధాప్య పింఛన్లు, రేషన్ కార్డులు అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పటికే జీహెచ్ఎంసీ కమిషనర్ దృష్టికి సమస్యలు తీసుకువెళ్లినట్లు తెలిపారు. వేసవిలో మంచినీటి సమస్య తలెత్తకుండా బోర్ల సంఖ్య పెంచడంతో పాటు అన్ని కాలనీలకు మంజీరా నీరు అందేలా కృషి చేస్తాం. చందానగర్‌లో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి సంబంధిత అధికారులతో ఎప్పటికప్పుడు చర్చిస్తున్నట్లు పేర్కొన్నారు. ఫుట్‌పాత్‌లు ఆక్రమణకు గురవుతున్నట్లు తమ దృష్టికి వచ్చినట్లు తెలిపారు. అధికారులు సమస్యల పట్ల అలసత్వం వహిస్తే ఊరుకునేది లేదన్నారు. ఈ ప్రాంతవాసిగా ఇక్కడి సమస్యలు పరిష్కరించడం తన కర్తవ్యమన్నారు. జనసభల ద్వారా ప్రభుత్వం దృష్టికి సమస్యలను తీసుకువెళ్తున్న ‘సాక్షి’ కృషి మరువలేనిదన్నారు.