
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. విశాఖ శారదా పీఠాధిపతులను కలిశారు. చందానగర్‌లోని వేంకటేశ్వరస్వామి ఆలయానికి వెళ్లిన కేసీఆర్.. విశాఖ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర సరస్మతి, ఉత్తర పీఠాధిపతి స్వాత్మానందేంద్ర సరస్వతిని బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. పీఠాధిపతుల నుంచి ఆశీస్సులు తీసుకున్నారు. ముఖ్యమంత్రి వెంట శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ఉన్నారు.
కాగా శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని గోపన్‌పల్లిలో 9 ఎకరాల స్థలంలో నిర్మించిన విప్రహిత బ్రాహ్మణ సంక్షేమ సదనం ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు విశాఖ శారదా పీఠాధిపతులు హాజరైన సంగతి తెలిసిందే.
చదవండి: బిల్లుల పెండింగ్.. గవర్నర్ విజ్ణతకే వదిలేస్తున్నాం: హరీష్ రావు