హేమంత్ రిమాండ్‌లో సంచలన విషయాలు | Sensational Information About In Hemanth Assassition Case | Sakshi
Sakshi News home page

హేమంత్ రిమాండ్‌లో సంచలన విషయాలు

Published Sat, Sep 26 2020 2:27 PM | Last Updated on Sat, Sep 26 2020 2:44 PM

Sensational Information About In Hemanth Assassition Case - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : హేమంత్‌ హత్య కేసులో రిమాండ్‌లో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. అవంతి, హేమంత్‌ను విడదీయడంతోపాటు హేమంత్‌ను చంపేందుకు ప్లాన్‌ చేసిన మొత్తం వివరాలను నిందితులు పోలీసుల ఎదుట వెల్లడించారు. ఈ నేపథ్యంలో నెల రోజుల ముందే హేమంత్‌ను చంపేందుకు పథకం పన్నినట్లు నిందితులు లక్ష్మారెడ్డి, యుగేంధర్‌ వెల్లడించారు. గచ్చిబౌలిలోని టీఎన్జీవో కాలనీలో నివాసముంటున్న హేమంత్‌ను ఎలా చంపాలి, ఎలా కిడ్నాప్‌ చేయాలనే విషయంపై నెల రోజుల ముందే స్కెచ్‌ వేసినట్లు యుగేంధర్‌ తెలిపారు. ఇందుకు కిరాయి హంతకులు కృష్ణ, రాజు, పాషాలతో పలుమార్లు సంప్రదించినట్లు పేర్కొన్నారు. అలాగే అవంతికి మాయమాటలు చెప్పి తమ వైపు తిప్పుకోవాలని ప్లాన్‌ చేసినట్లు లక్ష్మారెడ్డి తెలిపారు. నెల క్రితం హేమంత్‌ను చంపేందుకు లింగంపల్లిలోని లక్ష్మారెడ్డి ఇంట్లో సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. (ఒక్కసారి కళ్ళు తెరువు హేమంత్ : అవంతి)

కులాంతర వివాహం చేసుకున్న కారణానికి హేమంత్‌ అనే వ్యక్తిని గురువారం అత్యంత దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. జూన్‌ 10న ఇంట్లో నుంచి వెళ్లిపోయిన అవంతిరెడ్డి జూన్‌ 11న హేమంత్‌ను ప్రేమ వివాహం చేసుకున్నారు. అవంతి, హేమంత్‌ వివాహం కారణంగా అవమానంతో రగిలిపోయిన లక్ష్మారెడ్డి, భార్య అర్చన తన కూతురు వివాహంపై యుగేంర్‌రెడ్డితో గోడు వెళ్లదీసుకున్నారు. నాలుగు నెలల పాటు ఇంట్లోనే ఉన్న లక్ష్మారెడ్డి, అర్చన దంపతులు తన చెల్లి బాధ చూడలేక అవంతిని హేమంత్‌ నుంచి విడదీయాలని యుగంధర్‌రెడ్డి నిర్ణయించుకున్నాడు. నెల రోజుల క్రితం లక్ష్మారెడ్డి ఇంట్లో కుటుంంబ సభ్యుల సమావేశం ఎలాగైనా అవంతి, హేమంత్‌ను విడదీయాలని నిర్ణయం తీసుకున్నారు. (హైదరాబాద్‌లో పరువు హత్య కలకలం)

యుగేందర్‌రెడ్డి అన్న విజయేందర్‌రెడ్డి గచ్చిబౌలిలోని టీఎన్జీవో కాలనీలో అవంతి ఇంటి కోసం రెక్కీ నిర్వహించి ఈ నెల 24న మధ్యాహ్నం 2:30 ఇంట్లోకి బలవంతంగా చొరబడ్డారు. ఈ క్రమంలో 12 మంది బంధువులు హేమంత్‌, అవంతిపై దాడిచేస్తూ వారిని కారులోకి ఎక్కించారు. లింగంపల్లిలో మాట్లాడుదామని గోపన్‌పల్లివైపు బుంధువులు తీసుకెళ్లగా గోపన్‌పల్లిలో అవంతి, హేమంత్‌ తప్పించుకున్నారు. అవంతి పారిపోగా హేమంత్‌ దొరకపట్టి సాయంత్ర 7:30కు కారులోనే హేమంత్‌ను నిందితులు హత్య చేశారు. సీన్‌లో లేకుండా లక్ష్మారెడ్డి, అర్చన జాగ్రత్తపడగా అనంతరం బైక్‌పై గోపన్‌పల్లికి చేరుకున్నారు. ఈ హత్య కేసులో మొత్తంలో 13 మంది బంధువులు ఇన్వాల్వ్ అయ్యారు. కాగా అర్చన బాధ చూడలేకే హత్య చేశానని యుగంధర్‌రెడ్డి తెలిపారు.

హేమంత్ హత్య కేసులో 18మంది నిందితులు ఉండగా వీరిలోనలుగురు కృష్ణ, బాషా,జగన్, సయ్యద్ పరారీలో ఉన్నారు. మిగతా 14 మందిని గచ్చిబౌలి పోలీసులు అరెస్ట్ చేశారు. అవంతిని వదిలేయమని హేమంత్‌కు ఎంతచెప్పిన వినకపోతేనే హత్య చేశామని  ఏ1 నిందితుడు యుగేంధర్ రెడ్డి తెలిపారు.కారులో సైతం చాలా సేపు నచ్చచెప్పినట్లు పేర్కొన్నారు. కాగా యుగేంధర్ రెడ్డితో ఏడు లక్షలకు హత్య చేసేందుకు ఒప్పందం చేసుకున్నామని ఏ5 నిందితుడు బిచ్చుయాదవ్ తెలిపారు. అతనితో 10 సంవత్సరాలుగా కలిసి వాటర్ సప్లై బిజినెస్ చేశామని, ఆ పరిచయంతోనే హత్యకు ఒప్పుకొన్నామని వెల్లడించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement