Hemanth
-
మహారాష్ట్ర రాజకీయాల్లో ట్విస్ట్.. శివసేన ఎంపీ రాజీనామా
ముంబై: మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. మరాఠాలకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ సీఎం ఏక్నాథ్ షిండే వర్గం శివసేన ఎంపీ హేమంత్ పాటిల్ తన పదవికి రాజీనామా చేశారు. దీంతో, మహారాష్ట్రలో అధికారంలో ఉన్న శివసేన కూటమి ప్రభుత్వానికి ఊహించని షాక్ తగిలినట్టు అయ్యింది. వివరాల ప్రకారం.. మరాఠాలకు రిజర్వేషన్ కల్పించాలనే డిమాండ్‌కు మద్దతుగా ఎంపీ హేమంత్ పాటిల్ ఆదివారం రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు సమర్పించనున్నట్టు పాటిల్ తెలిపారు. విద్యాసంస్థలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో మరాఠాలకు రిజర్వేషన్ కల్పించాలన్న డిమాండ్‌తో పోఫలి షుగర్ ఫ్యాక్టరీ ఏరియాలో నిరసన తెలుపుతున్న వారిని కలుసుకొని హేమంత్ సంఘీభావం తెలిపారు. ఈ సందర్బంగా వారి ఉద్యమానికి హేమంత్ పాటిల్ మద్దతు ప్రకటించారు. అనంతరం.. అక్కడికక్కడే తన రాజీనామా లేఖను స్పీకర్ ఓంబిర్లాకు పంపించారు. కాగా, లేఖలో మరాఠా రిజర్వేషన్ అంశం ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉంది. దీనిపై మరాఠా సమాజంలో భావోద్వేగాలు నెలకొన్నాయని పాటిల్ ప్రస్తావించారు. Shiv Sena MP Hemant Patil resigns from the post of MP in support of the ongoing movement in the state demanding Maratha reservation. He sent his resignation written in Marathito Lok Sabha Speaker Om Birla pic.twitter.com/mxI9lDHWTK — MUMBAI NEWS (@Mumbaikhabar9) October 29, 2023 ఇదిలా ఉండగా.. మహారాష్ట్రలోని హింగోలి లోక్‌సభ నియోజకవర్గానికి హేమంత్ పాటిల్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే, ఓబీసీ కేటగిరి కింద విద్యాసంస్థలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పించాలని మరాఠా కమ్యూనిటీ కొద్దికాలంగా నిరసనలు, ప్రదర్శనలు చేస్తోంది. కోటా యాక్టివిస్ట్ మనోజ్ జారంగే ఈ ఆందోళనకు నాయకత్వం వహిస్తూ, రెండో విడత నిరవధిక నిరాహార దీక్షను అక్టోబర్ 25న ప్రారంభించడంతో మరాఠా ఉద్యమ ఆందోళన ఊపందుకోనుంది. మరోవైపు.. మరాఠా రిజర్వేషన్లపై షిండే ప్రభుత్వం స్పందిస్తూ.. లీగల్ స్క్రూటినీకి లోబడి రిజర్వేషన్ కల్పించేందుకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేసింది. ఇది కూడా చదవండి: 'సభలకు అజిత్ పవార్ హాజరు కాట్లేదు.. ఎందుకంటే..?' -
ఒక్కసారిగా.. బుల్లెట్ బండి బాలుడి పై పడడంతో.. తీవ్ర విషాదం!
సంగారెడ్డి: బుల్లెట్ బండి వద్ద ఆడుకుంటున్న క్రమంలో అది మీద పడి బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన అమీన్పూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల తెలిపిన వివరాలు. నేపాల్‌కు చెందిన లక్ష్మణ్ రావల్ బతుకుదెరువు కోసం మూడేళ్ల క్రితం అమీన్పూర్ పరిధిలోని బీరంగూడకు వచ్చాడు. సాయి భగవాన్ ఎన్క్లేవ్ వద్ద నివాసం ఉంటూ పనులు చేసుకుంటున్నాడు. ఇతనికి కుమారులు హేమంత్ రావల్(03), భాస్కర్ ఉన్నారు. హేమంత్ 8వ తేదీన ఇంటి పక్కన ఉండే పురుషోత్తం బుల్లెట్ బండి వద్ద ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తు అది మీద పడింది. తీవ్ర గాయాలైన బాలుడిని చికిత్స నిమిత్తం చందానగర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి కిమ్స్‌కు తరలించారు. చికిత్స పొందుతూ శనివారం ఉదయం మృతి చెందాడు. బాలుడి తండ్రి లక్ష్మణ్ రావల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
లక్షణాలు కనపడకుండానే గుండెజబ్బు రావచ్చా? కారణాలేంటి?
కార్డియోమయోపతీ అనేది గుండె కండరాలకు సంబంధించిన వ్యాధి. మొదట్లో చాలామందిలో దీనికి సంబంధించి ఎలాంటి లక్షణాలు కనిపించకపో వచ్చు. అందుకే చాలామందిలో ఇది ఆలస్యంగా బయటపడటం, కొందరిలో ప్రమాదకరమైన పరిస్థితికి తీసుకోవడం కనిపిస్తాయి. కొన్ని సందర్భాల్లో కొన్ని కుటుంబాల్లో ఇది వంశపారపర్యంగా కనిపించవచ్చు. గుర్తించడం, చికిత్స అందించడంలో ఆలస్యం జరిగితే ప్రమాదకరంగా కూడా మారవచ్చు. లక్షణాలు: ఈ వ్యాధి చాలా నెమ్మదిగా ముదురుతూ పో వడం వల్ల మొదట్లో లక్షణాలు కనిపించవు. అటు తర్వాత కూడా క్రమక్రమంగా లక్షణాలు బయటపడుతుంటాయి. కానీ ఇంకొందరిలో మాత్రం సమస్య నిర్ధారణకు ముందునుంచే లక్షణాలు వ్యక్తమవుతుంటాయి. ♦ శ్వాస తీసుకోవడం కష్టం ఉండటం, తరచూ శ్వాస అందక విపరీతమైన ఆయాసం వస్తుండటం ♦ విపరీతమైన అలసట, ♦ పొట్ట – చీలమండ వాపు, కొంతమందిలో కాళ్లవాపు ♦ అరుదుగా ఒక్కోసారి స్పృహ తప్పవచ్చు. రకాలు : కార్డియోమయోపతిలో ప్రధానంగా మూడు రకాలు ఉంటాయి. అవి డయలేటెడ్ కార్డియోమయోపతి, హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతి, రెస్ట్రిక్టెడ్ కార్డియోమయోపతి. వంశపారంపర్యంగా వచ్చే హైపర్ట్రోఫిక్ రకంలో గుండెకండరాలు, గుండెగోడలు మందంగా తయారవుతాయి. పైగా హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతిలో గుండె కండరాలు, గోడలు మందంగా మారడమన్నది రోగులందరిలోనూ ఒకేలా ఉండదు. ఈ తరహా కేసులు మొత్తం కార్డియోమయోపతిలో నాలుగు శాతం వరకు ఉంటాయి. వంశపారంపర్యంగానే వచ్చే మరో రకమైన రెస్ట్రిక్టివ్ రకంలో గుండెగదుల్లో రక్తం భర్తీ అయ్యేందుకు అవసరమైన ఒత్తిడికి సంబంధించిన లోటు ఏర్పడుతుంది. ఈ తరహా కార్డియోమయోపతి కేసులు 1 శాతం ఉంటాయి. కారణాలు: ♦ మద్యం అలవాటు ♦ వైరల్ ఇన్ఫెక్షన్లు ♦ నియంత్రణలో లేని అధిక రక్తపో టు (హైబీపీ), ♦గుండె కవాటాలకు సంబంధించిన సమస్యలు దీనికి కారణమవుతాయి. అయితే అనువంశీకంగా (వంశపారంపర్యంగా) కొన్ని కుటుంబాల్లో కనిపించే కార్డియోమయోపతికి మాత్రం జన్యువుల్లో మార్పు (మ్యుటేషన్)లే కారణం. అలాంటప్పుడు తల్లిదండ్రుల్లో ఒకరికి డయలేటెడ్ కార్డియోమయోపతి ఉన్నట్లయితే పిల్లల్లో సగం మందికి ఈ వ్యాధి వచ్చే అవకాశాలు ఉంటాయి. చికిత్స ఎలాగంటే... ♦కార్డియోమయోపతి కారణంగా గుండె కొట్టుకోవడంలో తీవ్రమైన హెచ్చుతగ్గులు, ఛాతీలో నొప్పి, రక్తం గడ్డకట్టడం వంటి మరికొన్ని సమస్యలు తలెత్తే అవకాశం ఉండవచ్చు. అందుకే నిర్దిష్టంగా కాకుండా... పరిస్థితి తీవ్రత ఆధారంగా చికిత్స అందిస్తారు. గుండె ఏ మేరకు నష్టపోయింది, ఎలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయన్న అంశాల ఆధారంగా డాక్టర్లు చికిత్సను నిర్ణయిస్తారు. ♦ అధిక రక్తపో టు, గుండెస్పందనల్లో విపరీతమైన హెచ్చుతగ్గులను మందులతో అదుపు చేస్తారు. ♦ గుండెకొట్టుకోవడంలో అసాధారణ మార్పులను అదుపుచేయడానికి అవసరమైతే పేస్‌మేకర్ అమర్చుతారు. దాన్ని అమర్చడం ద్వారా గుండెస్పందనలు సజావుగా, లయబద్ధంగా జరిగేలా చూస్తారు. గుండెకొట్టుకోవడంలో ఇంకా ఏవైనా లోటుపాట్లు ప్రాణానికి ప్రమాదం తెచ్చేలా ఉంటే... వాటిని సరిచేసి ప్రాణాల్ని కాపాడటం కోసం ఐసీడీ పరికరాన్ని అమర్చుతారు. ♦ హైపో ట్రోఫిక్, రెస్ట్రిక్టివ్ రకాల కార్డియోమయోపతిలో... అది ఏ రకమైనప్పటికీ చికిత్సలో ప్రధానంగా వ్యాధిలక్షణాలను అదుపు చేయడం, పేషెంట్ పరిస్థితి విషమించకుండా చూడటమే ప్రధానం. - డాక్టర్ హేమంత్ కౌకుంట్ల ,సీనియర్ కార్డియో థొరాసిక్ సర్జన్ -
వీజే చిత్ర ఆత్మహత్య కేసులో భర్త హేమంత్ అరెస్ట్
-
సూత్రధారి రాజు.. అమలు యుగంధర్‌రెడ్డి
గచ్బిబౌలి(హైదరాబాద్): చింత యోగా హేమంత్ కుమార్ హత్య కేసులో మరో నలుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్లు తెలిపారు. సోమవారం ఇక్కడ నిర్వహించిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు. అరెస్టు అయినవారిలో సూత్రధారి సోమయాల రాజు, సాయన్నతోపాటు హత్యలో పాల్గొన్న ఎరుకల కృష్ణ, మహ్మద్ పాషా ఉన్నారు. యుగంధర్ రెడ్డిని బావ లక్ష్మారెడ్డి, అక్క అర్చన కలిసి హేమంత్ అడ్డు తొలగించాలని అభ్యర్థించారు. దీంతో వట్టినాగులపల్లికి చెందిన సోమయాల రాజు(52), ఎరుకల కృష్ణ(33), మహ్మద్ పాషా అలియాస్ లడ్డూ(32), ఐడీఏ బొల్లారం నివాసి, రౌడీషీటర్ బ్యాగరి సాయన్న(48)లతో కలిసి హత్యకు పక్కా స్కెచ్ వేశాడు. రూ.10 లక్షల సుపారీకి రూ.50 వేలు అడ్వాన్స్‌గా తీసుకున్నాడు. హేమంత్‌కు సంబంధించిన ఐదున్నర తులాల బంగారు బ్రాస్లెట్, చైన్‌ను ఎరుకల కృష్ణ నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. యుగంధర్ రెడ్డి, అవంతి తండ్రి లక్ష్మారెడ్డిల ఆరు రోజుల కస్టడీ సోమవారం ముగిసింది. అల్లుడు హేమంత్‌ను అడ్డు తొలగించేందుకు రూ.30 లక్షలైనా ఖర్చు చేసేందుకు లక్ష్మారెడ్డి సిద్ధపడ్డట్టు విచారణలో వెల్లడైంది. లక్ష్మారెడ్డి ఇంటి చుట్టూ సీసీ కెమెరాలను అమర్చి అవంతి బయటకు వెళ్లకుండా కట్టడి చేశాడు. అవంతి సోదరుడు అశీష్‌రెడ్డి పాత్రపై ఎలాంటి ఆధారాలు లభించలేదని, ఆధారాలు లభిస్తే అశీష్‌రెడ్డిపై కేసు నమోదు చేస్తామని డీసీపీ వివరించారు. ఏ7 విజయేందర్ రెడ్డి, ఏ8 అర్థం రంజిత్ రెడ్డి, ఏ9 అర్థం రాకేష్ రెడ్డి, ఏ11 ఎల్లు సంతోష్‌రెడ్డి, 12 కైలా సందీప్ రెడ్డి, ఏ15 షేక్ సాహెబ్ పటేల్‌తోపాటు గూడూరు సందీప్‌రెడ్డిలను కస్టడీలోకి తీసుకునేందుకు పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. (చదవండి: హేమంత్ హత్య కేసు: తొలిరోజు విచారణ) అమ్మకు బాగాలేదని... నిందితులు విజయేందర్‌రెడ్డి, స్పందన, రాకేష్‌రెడ్డి గచ్చిబౌలిలోని టీఎన్జీవోస్ కాలనీలో హేమంత్, అవంతిలను రెండుసార్లు కలిశారు. ‘నీవు ఇంటి నుంచి వెళ్లినప్పటి నుంచి అమ్మకు ఆరోగ్యం బాగాలేద’ని నమ్మించారు. పలుమార్లు ఫోన్లో మాట్లాడుతూ ప్రేమ ఉన్నట్లు నటించారు. మరోవైపు హేమంత్ హత్యకు లక్ష్మారెడ్డి, యుగంధర్‌రెడ్డి ప్లాన్ చేశారు. హత్యకు ముందు మరో గ్యాంగ్‌తో లక్ష్మారెడ్డి మాట్లాడినట్లు తెలుస్తోంది. ఒప్పందం కుదుర్చుకున్న తరువాత ఆ ముఠా నుంచి స్పందన రాకపోవడంతో యుగంధర్‌రెడ్డి ద్వారా ప్లాన్ చేసినట్లు సమాచారం. మరో గ్యాంగ్‌తో మాట్లాడిన విషయంపైనా విచారణ చేపట్టనున్నారు. ఎస్‌హెచ్‌వోతోపాటు మరో ఇద్దరికి కరోనా హేమంత్ హత్య కేసులో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌గా ఉన్న ఎస్‌హెచ్‌వో ఆర్.శ్రీనివాస్‌కు కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో డీఐ క్యాస్ట్రో ఐవోగా ఉంటాడని డీసీపీ తెలిపారు. హత్యకేసులో నిందితులైన ఎరుకల కృష్ణ, మహ్మద్ పాషాలకు టెస్ట్‌లు చేయగా పాజిటివ్ అని తేలినట్లు సామాచారం. (చదవండి: మొదటి భార్యకు విడాకులు.. రెండో భార్య కుమార్తెపై కన్ను) -
హేమంత్ హత్య: కీలక విషయాలు వెల్లడి
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన హేమంత్ హత్య కేసులో నిందితుల కస్టడీ విచారణ ముగిసింది. ఈ హత్య కేసులో ప్రధాన నిందితులు యుగేంధర్ రెడ్డి, లక్ష్మారెడ్డిని పోలీసులు ఆరు రోజుల పాటు కస్టడీకి తీసుకొని విచారించారు. గచ్చిబౌలి పోలీసులు కేసు విచారణలో భాగంగా అవంతి తండ్రి లక్ష్మారెడ్డి, యుగేంధర్ రెడ్డిలను విడివిడిగా విచారణ చేశారు. పోలీసులు విచారణలో నిందితులు కీలక విషయాలు వెల్లడించారు. హేమంత్, అవంతి ప్రేమ విషయం తెలిసే కట్టడి చేశామని అయినా తమని కాదని పెళ్లి చేసుకోవడంతో హేమంత్పై పగతో రగిలిపోయినట్లు అవంతి తండ్రి లక్ష్మారెడ్డి విచారణలో వెల్లడించాడు. ఇక ఈ కేసులో హేమంత్ హత్యకు దారి తీసిన పరిణామాలు, పది లక్షల సుపారీ వ్యవహారంపై విచారణ చేశారు. కస్టడీ ముగియడంతో లక్ష్మారెడ్డి, యుగంధర్ రెడ్డిని ఇద్దరిని రిమాండ్‌కు తరలించారు. చదవండి: అందుకే హేమంత్‌ని చంపేశాం: లక్ష్మారెడ్డి పోలీసుల విచారణలో అవంతి పెళ్లి తరువాత కాలనీలో తల ఎత్తుకొని తిరగలేకపోయామని అవంతి తండ్రి లక్ష్మారెడ్డి తెలిపారు. గత 15 ఏళ్లుగా బామ్మర్ది యుగేంధర్‌తో తనకు సంబంధాలు కానీ, మాటలు కానీ లేవని హేమంత్, అవంతి విషయంపై తిరిగి మాట్లాడాల్సి వచ్చిందని ఆయన పేర్కొన్నాడు. ప్రాణం కంటే పరువే ముఖ్యమని భావించే కుటుంబం తమదని, తాము ఉంటున్న కాలనీలో తమ కుటుంబానిదే ఆధిపత్యం ఉంటుందన్నారు. దీంతో అవంతి ప్రేమ విషయంతో కాలనీలో ఒకరికి ఒకరు చర్చించుకుంటుంటే తలదించుకోవాల్సి వచ్చిందని లక్ష్మారెడ్డి విచారణలో తెలిపారు. కస్టడీలో నిందితులు ఇద్దరినీ నేరం జరిగిన ప్రదేశానికి తీసుకెళ్లిన పోలీసులు సీన్ రీ కన్స్ట్రక్షన్ చేశారు. అవంతికి హామీ ఇచ్చిన సీపీ సజ్జనార్ కేవలం తను డబ్బులు మాత్రమే సమకూర్చానని, మిగిలినదంతా తన బావమరిది యుగంధర్ రెడ్డినే చూసుకున్నాడని లక్ష్మారెడ్డి చెప్పినట్లు సమాచారం. అలాగే మొదటి నుంచి ఆరోపణలు ఎదుర్కొంటున్న అవంతి రెడ్డి సొంత తమ్ముడు ఆశిష్ రెడ్డి పాత్ర పైకూడా విచారణ చేశారు. ఈ కేసులో ఆశిష్ రెడ్డి పాత్ర లేదని పోలీసులు తేల్చారు. త్వరలోనే ఇతర నిందితులను సైతం కస్టడికి తీసుకోని పోలీసులు విచారించనున్నారు. కస్టడీలో ఉన్న నిందితులు ఇచ్చిన సమాచారంతో పరారీలో ఉన్న మరో నలుగురు నిందితులను పోలుసులు అరెస్ట్ చేశారు. నన్ను చంపినా బావుండేది..! నలుగురు నిందితులు అరెస్ట్ హేమంత్ హత్యకు మొదట ఒప్పందం చేసుకున్న సుఫారీ గ్యాంగ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. రూ.10 లక్షలకు ఒప్పందం చేసుకుని రూ.లక్ష అడ్వాన్స్ తీసుకున్నట్లు తేలింది. డబ్బులు అందగానే ఫోన్ ఆఫ్ చేయడంతో, అవంతి మేనమామ యుగేంధర్ బిచ్చు గ్యాంగ్‌తో కలిసి హత్యకు కుట్ర పన్నారు. ఇప్పటివరకు 14 మందిని అరెస్ట్ చేయగా వీరితో కలిసి 18ని అదుపులోకి తీసుకున్నారు. నిందితులపై గతంలోనూ క్రిమినల్ కేసులు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. అవంతి, హేమంత్ పెళ్లి తర్వాత వారిని అవంతి తల్లిదండ్రులు గచ్చిబౌలిలో చాలాసార్లు కలిసినట్లు తెలిపారు. ప్రేమపెళ్లి లక్ష్మారెడ్డికి నచ్చలేకపోవడంతో పెళ్లి చేసుకున్నప్పటి నుంచి హేమంత్‌ను చంపాలని కుట్ర చేశారన్నారు. ఆ తర్వాత అవంతకి మరో పెళ్లి చేయాలనుకున్నట్లు లక్ష్మారెడ్డి విచారణలో తెలిపాడు. కస్టడీ విచారణ అంశాలను మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్లు మీడియాకు వెల్లడించారు. అసభ్య ప్రవర్తన, ట్యూషన్ టీచర్ అరెస్ట్ కూకట్‌పల్లిలోని ట్యూషన్ టీచర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. సబ్జెక్ట్‌లో సందేహాలను నివృత్తి చేస్తానంటూ విద్యార్థిని ఇంటికి వెళ్లి ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో విద్యార్థిని తల్లిదండ్రులు షీ టీమ్స్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో ట్యూషన్ టీచర్‌ను అరెస్ట్ చేసిన షీ టీమ్ నిందితుడిని రిమాండ్‌కు తరలించారు. -
అవంతికి హామీ ఇచ్చిన సీపీ సజ్జనార్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హేమంత్ కుటుంబ సభ్యులకు పూర్తి భద్రత కల్పిస్తామని సైబరాబాద్ సీపీ సజ్జనార్ హామీనిచ్చారు. హేమంత్ ఇంటివద్ద 24 గంటల భద్రత ఏర్పాటు చేయాలని చందానగర్ పోలీసులకు ఆయన ఆదేశాలు జారీ చేశారు. ఒక మహిళా కానిస్టేబుల్, ఒక కానిస్టేబుల్‌ను ఏర్పాటు చేయాలని చెప్పారు. తమకు ప్రాణహాని ఉందని, భద్రత కల్పించాలన్నహేమంత్ భార్య అవంతి విజ్ఞప్తి మేరకు సజ్జనార్ స్పందించారు. దీంతోపాటు హేమంత్ కేసు విచారణకు ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి లేఖ రాసినట్టు ఆయన తెలిపారు. (చదవండి: ‘చచ్చింది కుక్కనే కదా...మనిషి కాదుగా’) ఇదిలాఉండగా.. హేమంత్ పరువు హత్య కేసులో ప్రధాన నిందితులు యుగేంధర్ రెడ్డి, లక్ష్మారెడ్డిని పోలీసులు ఆరు రోజుల పాటు విచారించనున్నారు. కేసు విచారణలో భాగంగా అవంతిక తండ్రి లక్ష్మారెడ్డి, యుగేందర్ రెడ్డిలను గచ్చిబౌలి పోలీసులు బుధవారం కస్టడీలోకి తీసుకున్నారు. ఇద్దరు నిందితులను గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. గోపన్ పల్లి వద్ద హేమంత్ కిడ్నాప్ స్థలం నుంచి సంగారెడ్డిలో హత్యా స్థలం వరకు నిందితులను తీసుకెళ్లి పోలీసులు సీన్ రీ కన్స్ట్రక్షన్ చేయనున్నారు. ప్రధాన కుట్రదారు లక్ష్మారెడ్డి, అమలు చేసింది యుగంధర్ రెడ్డి అని పోలీసులు నిర్ధారించారు. సుపారీ కిల్లింగ్‌లో ఇంకా ఎవరి హస్తం ఉందనే కోణంలో విచారిస్తున్నారు. కాగా, ఈ కేసులో ఇప్పటివరకు 21 మందిని పోలీసులు అరెస్టు చేయగా.. మరో నలుగురు పరారీలో ఉన్నారు. (చదవండి: హేమంత్ హత్య : అసలు తప్పెవరిది?) -
హేమంత్ హత్య: సీపీ సజ్జనార్‌ని కలిసిన అవంతి
సాక్షి, హైదరాబాద్: నగరంలో హేమంత్ కుమార్ హత్య తీవ్ర సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ హత్యను గచ్చిబౌలి పోలీసులు పరువు హత్యగా నిర్ధారించారు. తన భర్త హేమంత్ కుమార్ హత్యకు.. తన తండ్రి, మేనమామ కారణమని అవంతి ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో హేమంత్ కుటుంబ సభ్యులకు ప్రాణహాని ఉందని అవంతి బుధవారం సైబరాబాద్ సీపీ సజ్జనార్‌ను కలిశారు. తమకు, తమ కుటుంబ సభ్యులకు ప్రాణహాని ఉందని, భద్రత కల్పించాలని వినతి పత్రం అందించారు. హేమంత్ హత్యతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరినీ అరెస్ట్ చేయాలని అవంతి ఈ సందర్భంగా సీపీని కోరారు. పోలీసు కస్టడీకి నిందితులు: ఈ హత్య కేసులో పోలీస్ కస్టడీకి తీసుకున్న ప్రధాన నిందితులు యుగంధర్‌రెడ్డి, లక్ష్మారెడ్డిలను ఆరు రోజుల పాటు పోలీసులు విచారణ చేయనున్నారు. హత్య కేసులో ప్రధాన కుట్రదారు లక్ష్మారెడ్డి, అమలు చేసింది యుగంధర్‌రెడ్డి అని పోలీసుల పేర్కొన్నారు. సూపారీ కిల్లింగ్‌లో ఇంకా ఎవరి హస్తం ఉందనే కోణంలో పోలీసులు లోతుగా విచారణ చేస్తున్నారు. అదే విధంగా గోపన్‌పల్లి హేమంత్ కిడ్నాప్ స్థలం నుంచి సంగారెడ్డి హత్య స్థలం వరకు నిందితులను తీసుకెళ్లి సీన్ రీ కన్స్ట్రక్షన్ చేయనున్నట్లు పోలీసులు తెలిపారు. ఇప్పటికే ఈ కేసులో పోలీసులు 21మందిని అరెస్ట్ చేయగా, మరో నలుగురు పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. చదవండి:(హత్యకేసులో 21కి పెరిగిన నిందితుల సంఖ్య) -
హేమంత్ హత్య కేసులో దర్యాప్తు ముమ్మరం
-
మాకు ప్రాణహాని ఉంది: అవంతి
సాక్షి, హైదరాబాద్: పరువు హత్యకు గురైన హేమంత్ భార్య అవంతి డీసీపీ వెంకటేశ్వర్లును కలిశారు. ఈ నేపథ్యంలో గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న అవంతి, పోలీసుల వద్దనున్న తన భర్త వస్తువులను తీసుకోనున్నారు. ఆమె వెంట హేమంత్ తల్లిదండ్రులు, సోదరుడు కూడా ఉన్నారు. కాగా గతంలో తన పట్ల వ్యవహరించిన తీరు, హేమంత్‌ను దారుణంగా హత్య చేయించిన క్రమంలో తన తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల నుంచి ప్రాణహాని ఉందంటూ అవంతి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సైబరాబాద్ సీపీ సజ్జనార్‌ను కలిసి తమకు భద్రత కల్పించాల్సిందిగా ఆయనకు విజ్ఞప్తి చేయనున్నారు.(చదవండి: హేమంత్‌ది పరువు హత్య: గచ్చిబౌలి పోలీసులు) కాగా అవంతిని ప్రేమించి పెళ్లిచేసుకున్న హేమంత్ ఈ నెల 25న అత్యంత దారుణ పరిస్థితుల్లో హత్యకు గురైన విషయం విదితమే. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం సృష్టించింది. ఈ కేసులో మొత్తం 22 మంది నిందితులను గుర్తించిన పోలీసులు.. దీనిని ‘పరువు హత్య’ గా తేల్చారు. పక్కా పథకం ప్రకారమే, తమ పరువు తీశాడనే పగతోనే అవంతి తల్లిదండ్రులు అతడిని హత్య చేయించినట్లు పేర్కొన్నారు. కులాంతర వివాహం చేసుకున్నందుకే లోకల్ గ్యాంగ్‌తో కలిసి అతడి హతమార్చినట్లు అవంతి తండ్రి లక్ష్మారెడ్డి, మామ యుగంధర్ తమ ముందు అంగీకరించినట్లు వెల్లడించారు. -
నన్ను చంపినా బావుండేది..!
(వెబ్ స్పెషల్): ప్రేమించకపోతే ఒకడు చంపేస్తాడు.. ప్రేమిస్తే మరొకడు చంపేస్తాడు.. కూతురు భారమని అసలు పుట్టకుండానే సమాజం చంపేస్తుంది. చచ్చీ చెడి పుట్టినా కన్నకూతుళ్లపైనే లైంగికంగా దాడి చేస్తాడో తండ్రి. ప్రేమను వెతుక్కున్న కన్నబిడ్డ జీవితాన్ని ఆ ప్రేమ ముసుగులోనే కాలరాస్తాడు మరో తండ్రి.. ఇంకేదీ మనుగడ. ఇంకెక్కడిదీ భారతీయ సంస్కృతి. ఎంతకాలం ఈ ఘోరాలు. సమసమాజం రావాలంటే ఇంకెన్ని కంఠాలు తెగిపడాలి. కౌశల్య.. అమృత.. అవంతి.. రేపు మరోచోట...మరో యువతి... ఇలా ప్రేమను ప్రేమించినందుకు ఈ కిరాతక కుల దురంహకారానికి ఇంకెంతమంది సమిధలు కావాలి. ప్రేమసౌధం తాజ్‌మహల్ కొలువైన దేశంలో ప్రేమకు సమాధులు కడుతుంటే చూస్తూ మిన్నకుండి పోవాల్సిందేనా? హేమంత్ కులదురహంకార హత్యతో జనమంతా ఉలిక్కి పడితే మరోవైపు "డాటర్స్ డే'' సందర్భంగా సోషల్ మీడియా అంతా మారు మోగిపోయింది. గుమ్మాడి..గుమ్మాడి.. అంటూ ఎందరో తండ్రులు తమ కూతుళ్లపై అంతులేని ప్రేమను కురిపించారు. కానీ ఇదంతా చూసిన తరువాత కూడా ఎంతో మంది కూతుళ్ల మనసుల్లో మరిన్ని దిగులు మేఘాలు కమ్మేశాయి. ఎందుకంటే నేరం చేసిన మారుతి రావులాంటి వాళ్లని హీరోలుగా చేసిన ఈ సమాజం, చట్టాలు కలగలిసి మరో తండ్రిని అదే కిరాతకానికి ఉసిగొల్పే ధైర్యాన్నిచ్చింది. అంతేనా ఈ అమానుష కిరాయి హత్యలు ఇప్పటికే ప్రేమలో ఉన్నయువతీయువకుల వెన్నులో వణుకు పుటిస్తున్నాయి. నేను పెళ్లి చేసుకోక పోయినా.. వాడు బతికేవాడు.. నన్ను చంపేసినా బావుండేది అన్న అవంతి మాటలు వారి గుండెల్లో గునపాలవుతున్నాయి. చిన్నపుడు అమ్మను నాన్న ఎందుకు కొడుతున్నాడో అర్థంకాదు. ఎందుకు అవమానిస్తున్నాడో తెలియదు. ఇదంతా నా ఖర్మ అంటూ గుడ్లనీరు కుక్కుకున్న అమ్మ బేల ముఖమే చాలామంది అమ్మాయిలకు గుర్తు. ఈ ఘర్షణ నుంచి అవగాహన పెంచుకున్నారు. చదువులు, ఆర్థికస్వావలంబనపై దృష్టిపెట్టి కాలక్రమంలో అవకాశాలను అందిపుచ్చుకుంటూ ఆకాశంలో సగం అంటూ ధైర్యంగా ముందు కొచ్చారు. అనేక అడ్డంకులు, అవరోధాలు, చివరికి లైంగిక దోపిడీని కూడా ఎదుర్కొంటూ ఆకాశమే హద్దుగా పయనిస్తున్నా యువతులకు పెళ్లి ఒక పెద్ద శాపంగా పరిణమిస్తోంది. కులం, మతం, పరువు పేరుతో హేయమైన దుర్మార్గపు దాడులు, హత్యలు పెను సవాళ్లు విసురు తున్నాయి. ప్రేమిస్తే, పెళ్లి చేసుకుంటే చావేనా? తమ పరిస్థితి ఇదేనా, తమకేదీ దిక్కు అనే ఆలోచనలతో ఈ తరం యువతీ యువకులకు కంటిమీద కునుకు లేదంటే అతిశయోక్తి కాదు. కుల, మత మౌఢ్యమనే రక్కసిని అడ్డుకునేదెలా. ఈ మహమ్మారికి మందే లేదా? అనే ప్రశ్నలు వారి మెదళ్ళను తొలిచేస్తున్నాయి. ప్రేమే నేరమా? తమిళనాడులో శంకర్ హత్య ఉదంతం, తెలంగాణాలో ప్రణయ్, మంథని మధుకర్, ఇజ్రాయిల్ దారుణ హత్యలు తీవ్ర సంచలనం రేపాయి. ప్రేమించి పెళ్లి చేసుకున్న నవ దంపతులు సందీప్, మాధవిపై అమ్మాయి తండ్రి వేటకొడవలితో దాడికి చేశాడు. అయితే అదృష్టవశాత్తూ ఇద్దరూ ప్రాణాపాయం నుంచి బయట పడ్డారు. అలాగే కులాంతర వివాహం చేసుకున్న కుమార్తెను గర్భిణీ అని కూడా చూడకుండా హత మార్చారు. మరో ఘటనలో బాలింతగా ఉన్న తమ కూతుర్ని ఏ మాత్రం కనికరం లేకుడా వెంటాడి వెంటాడి చంపి బావిలో పడవేశారు. మరో ఘటనలో కూతురికి మాయ మాటలు చెప్పి నమ్మించి తీసుకొచ్చి ఉరి వేసి హతమార్చారు. ఇలా చెప్పుకుంటూ పోతే లిస్టు చాలా పెద్దది . అసలు వెలుగులోనివి రానివి, గుట్టుచప్పుడు కాకుండా సాగిపోతున్నవి బోలెడు. తమ మాట వినకుండా కులాంతర వివాహం చేసుకుందున్న అక్కసుతో అవంతి భర్త హేమంత్‌ను అత్యంత పాశవికంగా హత్య చేసిన వైనం ఆందోళన రేపింది. ఇదేదో అవేశంతోనో, క్షణికావేశంతోనో చేసింది కాదు. కరోనాతో ప్రపంచమంతా వణికిపోతోంటే అవంతి అమ్మానాన్నలు మాత్రం పగతో రగిలిపోయారు. పన్నాగంతో కుట్రపన్ని, కిరాయి హత్యకు తెగబడ్డారు. ఎప్పటికైనా అమ్మానాన్న మనసు మారుతుందని..తమకూ మంచి రోజులు వస్తాయని, మౌనంగా ఎదురుచూస్తున్న అవంతి ఆశల్ని కాలరాసి ఆమె జీవితంలో అంతులేని అగాధాన్ని మిగిల్చేశారు. మరోవైపు ఏదో ఘనకార్యం చేసినట్లుగా అదే ఊర్లో ఉంటూ, వెడ్డింగ్ షూట్లు, ఫంక్షన్ చేసుకొని మారుతీరావుని రెచ్చ గొట్టిందని, అమృత మీద నోరుపారేసుకున్న దురహంకారులు సోషల్ మీడియోలోమరోసారి తమ నోటికి పని చెబుతున్నారు. తండ్రి ప్రేమ, కట్టుబాట్లు అంటూ సూక్తులు వల్లె వేస్తూ మూర్ఖత్వంతో అగ్నికి ఆజ్యం పోస్తున్నారు. కుటుంబాల్లో తల్లిదండ్రులు, పిల్లల మధ్య ఉండాల్సిన సంబంధాలపై ఇష్టా ఇష్టాలకు తావు లేకుండా ఈ నాటికి మూస ధోరణే కొనసాగుతోంది. అందులోనూ ఆడపిల్లల పరిస్థితి మరీ ఘోరం. మగాడు వాడికేంటి అనే అమానుష ఆధిపత్య ధోరణి. ఆడపిల్లలు ఎలా ఉండాలో...ఏం తినాలో... ఏం బట్టలు కట్టుకోవాలో.. చివరికి ఎవర్ని పెళ్లి చేసుకోవాలో కులాలు, వ్యవస్థలు, కుటుంబాలు, అంతిమంగా తల్లిదండ్రులే శాసిస్తారు. ఆడపిల్లల హక్కులు, వారి వివాహానికి సంబంధించి ఎన్ని చట్టాలు వచ్చినా ఈ ధోరణి మారదు. అదేమంటే కనిపెంచిన తల్లిదండ్రులుగా బిడ్డలపై హక్కు అంటారు. తమ మాట వినకుండా, ప్రేమించిన వ్యక్తితో వెళ్లిపోవడంతోనే కూతురిమీదున్న విపరీతమైన ప్రేమ, కక్షగా మారిందంటూ కిరాయి హత్యలకు వత్తాసు పలుకుతున్న మేధావులు చాలామందే ఉన్నారు. ఈ విషయంలో సంతానం, మాట వినడాలు, పెత్తనాలపై మనస్తత్వ శాస్త్రవేత్తలు చైల్డ్ సైకాలజిస్టులు చెప్పే శాస్త్రీయ అధ్యయనాల్ని పరిగణనలోకి తీసుకోవాలి. తెల్ల కాగితం లాంటి పసిపిల్లలను తీర్చిదిద్దాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే అనేది గుర్తించాలి. మాట వినకుండా.. కొరకరాని కొయ్యల్లాగానో, దుర్మార్గులుగానో, అరాచకంగానో ఎందుకు తయారవుతారనే విషయాన్ని చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. ఎక్కడ లోపం జరుగుతోందో సమీక్షించుకోవాలి. నిజానికి చాలా సమస్యలు అహాల్ని, ఆగ్రహాల్ని పక్కన పెట్టి కాసేపు కూర్చుని మాట్లాడుకుంటే పరిష్కారమయ్యేవే. అలా కాకుండా కులాలు, మతాలు, పరువు, ప్రతిష్టం, వంశం గౌరవం అంటూ పరుగులు పెట్టడంతోనే సమస్యలు మరింత జఠిలమవుతున్నాయి. షరతులతో కూడిన తల్లిదండ్రుల ప్రేమకు తలొగ్గడానికి ఈనాటి తరం సిద్ధంగా లేదు. వయోజనులైన తరువాత వారికిష్టమైన వారికి పెళ్లి చేసుకునే హక్కు, తమకు నచ్చిన జీవితాన్ని గడిపే హక్కు లాంటి ప్రాథమిక హక్కును రాజ్యాంగమే కల్పించింది. ఈ నేపథ్యంలో పిల్లల ప్రేమల్ని అంగీకరించడం పెద్దల బాధ్యత. ఏదైనా పొరపాటు జరిగితే సరిదిద్దాల్సిన బాద్యత కూడా వారిదే. మేమున్నామనే విశ్వాసాన్ని అందించాలి. అపుడే ప్రజాస్వామిక బంధాలు, అనుబంధాలు వెల్లివిరుస్తాయి. తల్లిదండ్రులే దోషులా? ఆడపిల్ల భయంతో భార్య పొట్టనే చీల్చేసిన ప్రబుద్ధులు ఉన్న మన సమాజంలోనే, కూతురు అంటే ప్రాణం పెట్టే తండ్రులూ ఉన్నారు. కానీ బిడ్డల బంగారు భవిష్యత్తుకోసం అహర్నిశలు పాటుపడే తల్లిదండ్రులు వివాహాలదగ్గరికి వచ్చేసరికి పాషాణుల్లా మారిపోతున్నారు. ప్రధానంగా ఇరుగుపొరుగు వారు, రక్తసంబంధీకుల ఒత్తిడి, సూటిపోటీ మాటలను భరించలేమనే భయం వారిని వెంటాడుతుంది. సమాజంలో వేళ్లూనుకు పోయిన కుల వైరుధ్యాలు, సామాజిక కట్టుబాట్లు హత్యలకు పురిగొల్పుతున్నాయి. మన సమాజంలో ప్రేమ వివాహాలు, కులాంతర వివాహాలు ఇపుడే కొత్తగా పుట్టుకొచ్చినవేమీ కాదు. పురాణాల్లో, ఇతిహాసాల్లో గాంధర్వ వివాహాలే ఇందుకు నిదర్శనం. ప్రేమ పెళ్లిళ్లు, కులాంతర వివాహాలు చేసుకుని హాయిగా జీవిస్తున్న కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. అయితే ప్రేమ పెళ్ళిళ్లు చేసుకున్నంత మాత్రాన ఆడవాళ్లు జీవితాలు పూర్తిగా మారిపోతాయని, పూర్తి ఆర్ధిక స్వావలంబన, స్వాతంత్ర్యం వచ్చేస్తుందని అనుకోవడం ఉత్త భ్రమ. అక్కడా పురుషాధిపత్య భావజాలం, ఆధిపత్యం కచ్చితంగా ఉంటాయి. ఇదొక సుదీర్ఘ పోరాటం. ఈ పోరాటానికి ప్రేమ బలాన్నిస్తుంది.. శక్తినిస్తుంది...ఆత్మవిశ్వాసాన్నిస్తుంది. ఈ ఘర్షణే పరిష్కారానికి పునాది వేస్తుంది. విద్య, చైతన్యం, అవగాహన ద్వారా సామాజిక అడ్డుగోడలను కూల్చే ప్రయత్నాలు ముమ్మరం కావాలి.. సహజీవనం ఆమోదయోగ్యమని సర్వోన్నత న్యాయస్థానమే తీర్పు చెప్పిన తరువాత కూడా పెళ్లిళ్ల విషయంలో ఆంక్షలు, దాడులు అనాగరికమనే అవగాహన పెరగాలి. వ్యక్తులుగా, పౌర సమూహాలుగా అందరమూ నడుం బిగించాలి. తద్వారా కులరహిత, మత రహిత మానవ సంబంధాలకు పునాది పడాలి. -
హేమంత్ హత్య: 6 నెలలు అవంతి హౌజ్ అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన హేమంత్ హత్య కేసు విచారణలో కీలక విషయాలు వెలుగుచూస్తున్నాయి. హేమంత్ కుట్రకు రెండు నెలల క్రితమే పథకం రచించినట్టు నిందితుల విచారణలో వెల్లడైంది. కులాంతర వివాహం చేసుకున్నందుకే సుపారీ గ్యాంగ్‌తో కలిసి అవంతి మేనమామ యుగందర్‌రెడ్డి, తండ్రి లక్ష్మారెడ్డి హత్య చేయించారని విచారణలో నిందితులు అంగీకరించారు. హేమంత్, అవంతి కలుసుకోకుండా.. లక్ష్మారెడ్డి క్రూరంగా వ్యవహరించినట్టు తెలిసింది. పెళ్లికి ముందు తనను నెలలు నిర్బంధంలో ఉంచారని అవంతి పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొంది. (చదవండి: హేమంత్ హత్య: చందానగర్‌లో ఉద్రిక్తత) అప్పట్లో మిస్సింగ్ కేసు విచారణలో వెలుగు చూసిన సమాచారం ప్రకారం.. హేమంత్‌ని కలుసుకోకుండా లక్ష్మారెడ్డి ఇంటిచుట్టూ సీసీ కెమెరాలు పెట్టించాడు. జూన్ 10న ఇంట్లో కరెంట్ పోయిన సమయంలో హేమంత్‌కి కాల్ చేసిన అవంతి, అతనితో కలిసి బైక్ పైన పారిపోయింది. అయితే ఆ సమయంలో పవర్ లేకపోవడం, సీసీ కెమెరాల్లో రికార్డ్ కాకపోవడంతో.. అవంతి తల్లిదండ్రులు పోలీసులకు అప్పట్లో ఫిర్యాదు చేయగా మిస్సింగ్ నమోదైంది. ఆ తరువాత రెండు కుటుంబాలకు కౌన్సెలింగ్ చేసి పోలీసులు పంపించేశారు. తర్వాత హేమంత్, అవంతి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. ఇక అదే పగతో రగిలిపోతున్న అవంతి తల్లి, హేమంత్ హత్య చేయడానికి తీవ్ర స్థాయిలో ఒత్తిడి చేసినట్లు విచారణలో తేలింది. కాగా, ఈ కేసులో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. కేసులో మొత్తం 25 మంది ప్రమేయం ఉన్నట్లు పోలీసులు తేల్చారు. ఇప్పటికే 14 మందిని అరెస్ట్ చేసి జ్యూడిషియల్ రిమాండ్‌కు తరలించగా, మరో ఏడుగురిని ప్రత్యేక బృందాలు విచారిస్తున్నాయి. మరో నలుగురి కోసం పోలీసులు గాలిస్తున్నారు. త్వరలోనే వారిని పట్టుకుంటామని చెప్పారు. ఈ క్రమంలో కేసులో లోతైన దర్యాప్తు కోసం నిందితులను ఐదు రోజుల కస్టడీ కోరుతూ ఎల్బీనగర్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నిందితులను ఆధారాలతో సహా విచారణ చేయాలని భావిస్తున్నారు. ఇక జహీరాబాద్‌లో ఓఆర్ఆర్ మీద సీసీ దృశ్యాలను పోలీసులు సేకరించారు. నిందితులను కస్డడిలోకి తీసుకొని సీన్ రీ కన్‌స్ట్రక్చన్ చేయాలనీ భావిస్తున్నారు. హంతకుల ఇళ్ల వద్ద రక్షణ ఇక హేమంత్ కుటుంబ సభ్యులకు ప్రాణహాని ఉందని, గుర్తు తెలియని వ్యక్తులు రెక్కీ నిర్వహిస్తున్నారంటూ అవంతి తరుపు న్యాయవాది కల్యాణ్ దిలీప్ సుంకర మీడియాకు తెలిపారు. హంతకుల ఇంటి వద్ద పోలీస్ రక్షణ ఏర్పాటు చేశారని, బాధితుల ఇంటి దగ్గర పోలీసులు లేకపోవడం వెనుక అంతర్యం ఏమిటని ప్రశ్నించారు. పోలీసులు వ్యవహరిస్తున్న తీరు సరిగా లేదంటూ మండిపడ్డారు. ఇదిలాఉండగా.. నిందితులను కఠినంగా శిక్షించాలని అవంతి, హేంమంత్ సోదరుడు సుమంత్, అతని స్నేహితులు ఆందోళనకు దిగారు. హేమంత్ ఇంటినుంచి లక్ష్మారెడ్డి ఇంటివైపు దూసుకుపోయే ప్రయత్నం చేశారు. పోలీసులు అడ్డుకోడంతో రోడ్డుపై బైటాయించి ఆందోళనకు దిగారు. నిందితులకు వ్యతిరేకంగా నినాదాలు చేయటంతో చందానగర్‌లో కొంత ఉద్రిక్తత నెలకొంది. (చదవండి: హత్యకేసులో 21కి పెరిగిన నిందితుల సంఖ్య) -
హేమంత్ హత్య: చందానగర్‌లో ఉద్రిక్తత
సాక్షి, హైదరాబాద్: ప్రేమ పెళ్లి కారణంగా దారుణ హత్యకు గురైన హేమంత్‌కు న్యాయం జరగాలని అతని స్నేహితులు, సన్నిహితులు స్పష్టం చేశారు. హేమంత్ నివాసం వద్ద సోమవారం సాయంత్రం వారంతా నిరసన చేపట్టారు. పరువు హత్యలకు వ్యతిరేకంగా 'జస్టిస్ ఫర్ హేమంత్' కార్యక్రమం చేపడుతున్నట్టు తెలిపారు. తమకు న్యాయం కావాలంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా.. ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిరసన కార్యక్రమంలో హేమంత్ భార్య అవంతి, సోదరుడు సుమంత్, సీపీఐ నారాయణ పాల్గొన్నారు. ఈక్రమంలో హేమంత్ ఇంటినుంచి అవంతి తండ్రి లక్ష్మారెడ్డి నివాసం వైపు నిరసనకారులు దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. అప్రమత్తమైన పోలీసులు వారిని అడ్డుకోవడంతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. కాగా, చందానగర్‌కు చెందిన అవంతిరెడ్డి, హేమంత్ ఇటీవల ప్రేమ పెళ్లి చేసుకోగా.. అవంతి తల్లిదండ్రులు హేమంత్‌ను కిరాతకంగా హత్య చేయించారు. అవంతి మేనమామ యుగేందర్‌రెడ్డి ఈ హత్యకేసులో ప్రధాన నిందితుడు. ఇప్పటికే 14 మందిని జ్యూడిషియల్ రిమాండ్‌కు తరలించగా.. మరో ఏడుగురిని ప్రత్యేక బృందాలు విచారిస్తున్నాయి. రెండేళ్ల క్రితం మిర్యాలగూడలో ప్రణయ్ హత్యోదంతం మరువకపముందే.. హేమంత్ హత్య సంచలనంగా మారింది. (చదవండి: హత్యకేసులో 21కి పెరిగిన నిందితుల సంఖ్య) వైఫల్యం కనిపిస్తోంది ‘జస్టిస్ ఫర్ హేమంత్’ నిరసన కార్యక్రమంలో పాల్గొన్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ మీడియాతో మాట్లాడారు. ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి నిందితులకు ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేశారు. తమ కుటుంబ సభ్యుల నుంచి ప్రాణహాని ఉందని జూన్ 16 తర్వాత అవంతి పోలీసులకు ఫిర్యాదు చేసిందని ఆయన గుర్తు చేశారు. హేమంత్ హత్యకు గురవడంలో పోలీసు శాఖ వైఫల్యం కనిపిస్తోందని అన్నారు. సభ్య సమాజం సిగ్గుపడే ఘటన జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. (చదవండి: హేమంత్‌ది పరువు హత్య: గచ్చిబౌలి పోలీసులు) -
పోలీసుల అదుపులో అవంతి సోదరుడు
సాక్షి, హైదరాబాద్ : హేమంత్ కుమార్ హత్య కేసులో మరో ఏడుగురు కీలక నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఈ కేసులో మొత్తం నిందితుల సంఖ్య 21కి చేరింది. వీరిలో అవంతి సోదరుడు అశీష్ రెడ్డి, సందీప్‌రెడ్డి సహా ఎ5 కృష్ణ, ఎ6 బాషా ఎ17, జగన్ ఎ18 సయ్యద్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎ1 యుగంధర్ రెడ్డి కృష్ణతో హత్యకు సంబంధించి ఒప్పందం చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. హత్య తర్వాత జగన్, సయ్యద్ నిందితులకు సహకరించినట్లు పేర్కొన్నారు. తన భర్త హత్యలో సందీప్ రెడ్డి గూడూరు, ఆశిష్ రెడ్డి ప్రమేయం కూడా ఉందని అవంతి ఆరోపించిన సంగతి తెలిసిందే. గతంలో సందీప్‌రెడ్డి హేమంత్ తండ్రిపై బెదిరింపులకు పాల్పడ్డాడని ఆమె తెలిపారు. ఇక మరికాసేపట్లో హేమంత్ సోదరుడు, అవంతి సైబరాబాద్ సీపీ కార్యాలయానికి వెళ్లనున్నారు. తమకు ప్రాణహానీ ఉందని అవంతి ఫిర్యాదుచేయనుంది. రాష్ట్రంలో ఈ నెల 25న చోటు చేసుకున్న హేమంత్ హత్య రాష్ట్రంలో తీవ్ర కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. (హేమంత్ హత్య కేసులో మరో ట్విస్ట్!) -
హేమంత్‌ది పరువు హత్యే : పోలీసులు
సాక్షి, హైదరాబాద్: హేమంత్ కుమార్ హత్య కేసును పోలీసులు లోతుగా దర్యాప్తు చేసి పరువు హత్యగా తేల్చారు. హేమంత్‌ను పక్కా ప్రణాళికతో పరువు కోసమే హత్య చేశారుని గచ్చిబౌలి పోలీసులు సోమవారం వెల్లడించారు. తమ కూతురు కులాంతర వివాహం చేసుకున్నందుకే లోకల్ గ్యాంగ్‌తో కలిసి హత్య చేయించినట్లు తండ్రి లక్ష్మారెడ్డి, మామ యుగంధర్ పోలీసులు ముందు నిజం ఒప్పుకున్నారు. అవంతి-హేమంత్ ప్రేమ వివాహం గురించి తెలిసిన లక్ష్మారెడ్డి ఇంటి చుట్టూ సీసీ కెమెరాలు పెట్టించాడని పోలీసులు తెలిపారు. ఆరు నెలల పాటు అవంతిని బయటకు వెళ్లకుండా తండ్రి తీవ్రంగా కట్టడిచేశాడని వెల్లడించారు. దీంతో జూన్ 10న ఇంట్లో కరెంట్ పోయిన సమయంలో అవంతి ఇంట్లో నుంచి పారిపోయి హేమంత్‌ను కలిసిందని పేర్కొన్నారు. ఇప్పటివరకు హేమంత్ హత్య కేసులో మొత్తం 22 మంది నిందితులు గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. చదవండి: (హేమంత్ హత్య కేసు: కీలకంగా మారిన ట్రావెల్స్ హిస్టరీ..) నిందితులను ఐదు రోజుల పాటు కస్టడి కోరుతూ ఎల్బీనగర్ కోర్టులో పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. సంఘటన స్థలానికి సంబంధించి జహీరాబాద్‌లో ఓఆర్ఆర్ మీద సీసీ కెమెరా దృశ్యాలను సేకరించినట్లు పోలీసులు తెలిపారు. నిందితులను కస్డడిలోకి తీసుకొని సీన్ రీ-కన్‌స్ట్రక్చన్ చేయనున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు అవంతి, హేమంత్ కుటుంబసభ్యులు సీపీ సజ్జనార్‌ను కలవనున్నారు. రాష్ట్రంలో ఈ నెల 25న చోటు చేసుకున్న హేమంత్ హత్య రాష్ట్రంలో తీవ్ర కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. (హేమంత్ హత్య : అసలు తప్పెవరిది?) -
హేమంత్ హత్యపై గ్రౌండ్ రిపోర్ట్
-
హేమంత్ హత్య కేసులో మరో ట్విస్ట్!
-
అసలు తప్పెవరిది?
-
హేమంత్ హత్య : అసలు తప్పెవరిది?
పోలీసుల్లో బాధ్యతారాహిత్యం పెరుగుతోందా..? ప్రేమ వివాహం చేసుకొని..భార్యవైపు బంధువుల చేతుల్లో హతమైన హేమంత్ ఉదంతాన్ని పరిశీలిస్తే ఈప్రశ్నలే ఉదయిస్తున్నాయి. హేమంత్‌ను కిడ్నాప్ చేసిన కారును..వారి గొడవలను గమనించిన కొందరు స్థానికులు అడ్డుకోకపోగా సెల్ఫోన్లలో ఫొటోలు, వీడియోలు తీయడంలో మునిగిపోయారు. కనీసం పోలీసులకూ సమాచారం ఇవ్వలేదు. ఇక సరైన సమాచారం అందినా..పోలీసులు వేగవంతంగా స్పందించ లేదని, సమన్వయం చేసుకోవడంలో విఫలమయ్యారనే విమర్శలు విన్పిస్తున్నాయి. అందువల్లే ఓ యువకుడి నిండుప్రాణాలు గాల్లో కలిశాయని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. సాక్షి, సిటీబ్యూరో : గచ్చిబౌలిలో కిడ్నాప్ అయి..సంగారెడ్డి జిల్లా మల్కాపూర్ శివారు కిష్టాయిగూడెం వద్ద విగత జీవిగా మారిన హేమంత్ కుమార్ హత్యోందంతం ఇటు పౌరుల బాధ్యతారాహిత్యాన్ని ఎత్తిచూపుతూ...అటు పోలీసింగ్ విధానం మారాలనే పాఠాన్నీ చెబుతోంది. గోపన్‌పల్లి తండా చౌరస్తా వద్ద కార్లు ఆగడం..వాటిలో పెనుగులాట జరిగిన తతాంగాన్ని సెల్ఫోన్లో ఫొటోలు, వీడియోలు చిత్రీకరించేందుకు ఆసక్తి చూపిన జనాలు..కాస్త మానవత్వం ప్రదర్శించి..అడ్డుకుని..పోలీసులకు సమాచారం ఇచ్చి ఉంటే ఈ దారుణ ఘటన జరిగి ఉండేది కాదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. శుక్రవారం మధ్యాహ్నం 3.42 గంటల ప్రాంతంలో మూడు కార్లు ఆగిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలకు చిక్కిన వాటిని పరిశీలిస్తే అవంతి రెడ్డి కుటుంబ సభ్యుల వద్ద ఎటువంటి దాడి చేసే ఆయుధాలు లేవు. అయితే అక్కడ జరిగిన గలాటాను జనాలు చూశారే తప్ప ఎవరూ ఆపేందుకు ప్రయత్నించకపోవడంతో వారు మరింత రెచ్చిపోయారు. ఇలా దాదాపు 20 నిమిషాలకు పైగానే గడబిడ జరగడం..హేమంత్పై చేయిచేసుకోవడం జరిగింది. ఎలాగోలాగూ వారి నుంచి తప్పించుకొని హేమంత్ కుమార్ తెల్లాపూర్ రోడ్డువైపు పరుగులు తీశాడు. దీంతో అప్పటికే కిరాయి హంతకులు బిచ్చు యాదవ్, ఎరుకల కృష్ణలు కూర్చొని ఉన్న స్విఫ్ట్ కారు (టీఎస్08 ఈటీ 3031)ను డ్రైవ్ చేసిన అవంతి రెడ్డి మేనమామ యుగంధర్ రెడ్డి చేజ్ చేసి మరీ పట్టుకున్నారు. ఆ తర్వాత కారులో ఎక్కించుకొని తెల్లాపూర్ మీదుగా ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) ఎక్కి పటాన్చెరు వద్ద ఆగి అటు నుంచి జహీరాబాద్ వెళ్లారు. (చదవండి : హేమంత్ రిమాండ్‌లో సంచలన విషయాలు) ఇంతవరకు బాగానే ఉన్నా 3.50 గంటల ప్రాంతంలో అవంతి మామ (హేమంత్ తండ్రి) డయల్ 100కు కాల్చేస్తే 4.30 గంటలకు పెట్రోలింగ్ వాహనంలో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. వీరొచ్చే 10 నుంచి 15 నిమిషాల ముందే హేమంత్‌ను కిడ్నాప్ చేసి వాహనంలో తీసుకెళ్లారని అక్కడి స్థానికులు చెబుతున్నారు. అయితే గోపన్‌పల్లి తండా చౌరస్తా వద్ద 11 మందిని అదుపులోకి తీసుకొని, అవంతిని, ఆమె అత్తమామలను ఠాణాకు తీసుకెళ్లారు. ఇక్కడా హేమంత్‌ను కారులో బలవంతంగా తీసుకెళ్లారని తెలిసిన పోలీసులు అటువైపుగా దృష్టి సారించకపోవడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. సమన్వయం చేసి ఉంటే బాగుండేది... అయితే అక్కడ పట్టుకున్న 11 మందిని విచారించారే తప్ప కిడ్నాప్ అయిన హేమంత్పై దృష్టి సారించకపోవడం విమర్శలకు తావిస్తోంది. బలవంతంగా లాక్కొని పారిపోయారని హేమంత్ భార్య అవంతిరెడ్డి చెప్పినా మరుక్షణమే పోలీసులు ఆ కారు నంబర్‌ను చుట్టుపక్కల ప్రాంత పోలీసులకు చేరవేసి ఉంటే దొరికి ఉండేది కావొచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. సుమారు 4.15 గంటల ప్రాంతంలో కిడ్నాప్ అయిన హేమంత్‌కుమార్‌ను దాదాపు మూడు గంటలకుపైగా కారులో తిప్పడంతో ఎక్కడోఒక్క దగ్గర పోలీసులు తనిఖీలు చేస్తే ఇంతటి దారుణం జరిగి ఉండేది కాదన్న వాదన వినిపిస్తోంది. కేవలం యుగంధర్‌రెడ్డి, హేమంత్‌కుమార్ సెల్‌ఫోన్ సిగ్నల్ ట్రేసింగ్‌పైనే ప్రధానంగా దృష్టి సారించడం...ప్రత్యామ్నాయలుగా ఉన్న సీసీటీవీ కెమెరా ఫుటేజీలను సాధ్యమైనంత తొందరగా పరిశీలించకపోవడంలో పోలీసుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనబడుతోంది. హేమంత్ కుమార్‌ను తీసుకెళ్లిన కారు వెళ్లిన మార్గంలో గస్తీ వాహనాలు ఉండి కూడా పట్టుకోకపోవడం పోలీసుల సమన్వయ లోపాన్ని వేలెత్తి చూపుతోంది. ‘హేమంత్ కుమార్‌ను తీసుకెళ్లిన కారు తెల్లాపూర్ వైపు వెళ్లిందని మాత్రమే తెలుసు. అటు నుంచి ఓఆర్ఆర్ మీదుగా పటాన్చెరు నుంచి జహీరాబాద్ వెళ్లిన విషయం తెలియదు. నిందితుడు యుగంధర్‌రెడ్డి నోరు విప్పితేనే కారు ఏయే మార్గంలో వెళ్లిందో తెలిసింద’ని పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ పోలీసు అధికారి వ్యాఖ్యానించారు. (చదవండి : ‘అన్నయ్య మొహం మొత్తం దెబ్బలే’) నోరు విప్పని లక్ష్మారెడ్డి హేమంత్ కుమార్‌ను చంపేందుకు సుపారీ ఇచ్చిన విషయాన్ని అవంతి రెడ్డి తండ్రి లక్ష్మారెడ్డి పోలీసులకు చెప్పలేదు. అతన్ని 4.30 గంటలకు పట్టుకుని..కొన్ని గంటలపాటు విచారించినా అసలు ఏ విషయం తెలపలేదు. గుండె సంబంధిత వ్యాధులు ఉన్నాయని నమ్మించే ప్రయత్నం చేశాడు. ఒకవేళ అతడు నోరు విప్పి ఉంటే ఇంకాస్త సీరియస్‌గా తీసుకొని హేమంత్ ఆచూకీ కోసం వెతికేవాళ్లమని గచ్చిబౌలి ఠాణాలోని ఓ అధికారి పేర్కొన్నారు. మామూలుగా గొడవలతో తీసుకెళ్లి ఉంటారని అనుకున్నామనే చెప్పుకొచ్చారు. ‘హేమంత్..ఒక్కసారి కళ్లు తెరు’ శేరిలింగంపల్లి : కిడ్నాప్‌నకు గురై కిరాతకంగా హత్యకు గురైన హేమంత్ అంత్యక్రియలు శేరిలింంపల్లి తారానగర్‌లోని శ్మశాన వాటికలో అశ్రునయనాల మధ్య శనివారం నిర్వహించారు. అంతకుముందు హేమంత్ మృతదేహాన్ని భద్రపరిచిన కాంటినెంటల్ ఆస్పత్రి నుంచి తారానగర్‌లోని హేమంత్ నివాసానికి తీసుకొచ్చారు. మృతదేహాన్ని చూడగానే హేమంత్ భార్య అవంతిరెడ్డి, ఆయన తల్లిదండ్రులు లక్ష్మీరాణి, మురళీకృష్ణలు బోరున విలపించారు. ‘ఒక్కసారి కళ్ళు తెరువు...హేమంత్..’అంటూ అవంతిరెడ్డి భర్త మృతదేహంపై పడి రోదిచడం...అరేయ్... తమ్ముడూ అంటూ ఒక్కసారి పిలువురా. పిలువు.... వాడొచ్చాడురా...చూడురా....వాడి మొహం చూడరా..అంటూ హేమంత్ తల్లి లక్ష్మీరాణి కన్నీరు మున్నీరుగా విలపించడం అందరినీ కలచివేసింది. అంతకుముందు లండన్ నుంచి హేమంత్ తమ్ముడు సుమంత్ రావడంతో అతన్ని చూడగానే తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. అనంతరం తారానగర్‌లోని శ్మశాన వాటికలో దహన సంస్కారాలు తండ్రి మురళీకృష్ణ నిర్వహించారు. హేమంత్ స్నేహితులు ‘అమర్ హై హేమంత్’అంటూ నినాదాలు చేశారు. (చదవండి : వాళ్లను ఎన్కౌంటర్ చేయండి: అవంతి) రెండు రోజుల క్రితమే ఫోన్లో మాట్లాడా: సుమంత్ హేమంత్ హత్యకు కారణమైన వారికి నూరు శాతం శిక్ష పడాలని అతని తమ్ముడు సుమంత్ డిమాండ్ చేశారు. తారానగర్‌లో విలేకరులతో మాట్లాడుతూ కులాంతర వివాహం చేసుకుంటే చంపుతారా...? అని ప్రశ్నించారు. పోలీసులు ఇప్పటి వరకు కేసు విషయంలో బాగా చేశారని, డబ్బు ఆశ చూపినా పట్టించుకోకపోవడంతో వారు మాకు న్యాయం చేస్తారనే నమ్మకం పెరిగిందని, సీఐ ఎవరో...నాకు తెలియదు...కానీ భవిష్యత్‌లో కూడా ఈ కేసు విషయంలో న్యాయం చేస్తారనుకుంటున్నామన్నారు. డబ్బుతో ఏదైనా చేయవచ్చు అనే ధీమాలో హంతకులు ఉన్నారన్నారు. రెండు రోజుల క్రితం ఫోన్లో మాట్లాడాను. చిన్నతనం నుంచి అన్నీ నాకు వాడే...వాడిని నాకు దూరం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. నా భవిష్యత్తును నాశనం చేసిన వారికి శిక్ష పడాలి : అవంతిరెడ్డి హేమంత్‌తో వివాహమైన నాలుగు నెలలకే ఈ విధంగా చేయడం ఏంటి? అని హేమంత్ సతీమణి అవంతిరెడ్డి ప్రశ్నించారు. 15 మంది కలిసి నా భర్తను హత్య చేస్తారా..? నాపై ప్రేమ ఉంటే నేనుప్రేమించిన వ్యక్తిని చంపుతారా? అని ప్రశ్నించారు. నా భవిష్యత్‌ను నాశనం చేసి ఈ హత్యలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికీ శిక్షపడాలన్నారు. యుగంధర్‌రెడ్డిని ఎన్కౌంటర్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. -
పరువు హత్య
-
హేమంత్ హత్య కేసు: కీలకంగా మారిన ట్రావెల్స్ హిస్టరీ..
సాక్షి, హైదరాబాద్ : నిందితుల చేతిలో దారుణ హత్యకు గురైన హేమంత్ కేసులో పూటకో విషయం బయటపడుతోంది. తాజాగా ఈ కేసులో నిందితుల ట్రావెల్స్ హిస్టరీ కీలకంగా మారుతోంది. చందానగర్‌లోని అవంతి ఇంటి దగ్గర నుంచి హత్య అనంతరం హైదరాబాద్‌కు వచ్చే వరకు చోటుచేసుకున్న ట్రావెల్స్ హిస్టరీ ఒక్కొక్కటిగా వెలుగు చూస్తోంది. అయితే నిందితుల ట్రావెల్ హిస్టరీపైన పూర్తి సమాచారాన్ని సేకరిస్తున్నామని పోలీసులు తెలిపారు. వారి వివరాల మేరకు.. చందా నగర్‌లోని లక్ష్మారెడ్డి ఇంటి నుంచి మూడు కార్లలో నిందితులు బయల్దేరితే అవంతి తండ్రి లక్ష్మారెడ్డి హోండా షైన్ వెహికల్‌పై బయలుదేరారు. తర్వాత రెండు గంటల నలభై నిమిషాలకు చందానగర్ నుంచి బయలుదేరిన నిందితులు.. 40 నిమిషాలు ట్రావెల్ చేసి గచ్చిబౌలిలోని అవంతి ఇంటికి చేరుకున్నారు. చదవండి: (వాళ్లను ఎన్కౌంటర్ చేయండి: అవంతి) ఇంట్లో ఉన్న అవంతి, హేమంత్‌ను బలవంతంగా కారులో ఎక్కించుకొని 15 నిమిషాల్లో గోపనపల్లి చౌరస్తాకు చేరుకున్నారు. గోపన్‌పల్లి చౌరస్తాలో అవంతిని కిందకు దింపి వేసిన నిందితులు.. హేమంత్‌తో మాట్లాడి పంపిస్తాను అంటూ యుగేంధర్ అలాగే కారులో తీసుకెళ్లారు. యుగేంధర్‌తోపాటు అప్పటికే కారులో ఉన్న కిరాయి హంతకులు.యాదవ్, రాజు, పాషా ఉన్నారు. వీరంతా కలిసి ఒకే కారులో జహీరాబాద్ వైపు పయనించారు. ఈ సమయంలో కిరాయి హంతకులు హేమంత్‌ను పలుమార్లు బెదిరించారు. అవంతిని వదిలిపెట్టి వెళ్లిపోవాలంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. అయితే అవంతిని వదిలి పెట్టేందుకు హేమంత్ ఒప్పుకోలేదు. ఈ క్రమంలో జహీరాబాద్ వద్ద మద్యంతో పాటు తాల్లు తీసుకున్న యుగేంధర్ 7:30కు సంగారెడ్డి సమీపానికి చేరుకున్నారు. చదవండి: (హేమంత్ రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు) కారులోనే హేమంత్ కాళ్లు చేతులు కట్టేసి ఊపిరాడకుండా చేశారు. 7:30 ప్రాంతంలో నీకు ప్రేమ, పెళ్లి ఎందుకని బెదిరించిన యుగేంధర్ హేమంత్‌ను ఉరివేసి చంపేశాడు. అనంతరం తొమ్మిదిన్నర గంటల ప్రాంతంలో ముత్తంగి సమీపంలోని దేవాలయం వద్ద మద్యం సేవించారు. 1:30 కు సంగారెడ్డిలోని మిత్రుల వద్ద భోజనం చేశారు. అఖరుకి 2:30కు యుగేంధర్ పోలీసులకు చిక్కారు. ఇదిలా ఉండగా కూతురు ప్రేమ పెళ్లి చేసుకోవడంనచ్చని అవంతి తల్లిదండ్రులు లక్ష్మారెడ్డి, అర్చన హేమంత్‌ని హత్య చేయించారు. సంగారెడ్డి ప్రాంతంలో గురువారం రాత్రి హేమంత్ హత్య చోటుచేసుకుంది. ఈకేసులో ప్రధాన నిందితుడు అవంతి మేనమామ గూడూరు యుగేందర్‌రెడ్డి కాగా మొత్తం 18 మంది నిందితుల ప్రమేయం ఉంది. ఇప్పటివరకు 14 మందిని పోలీసులు రిమాండ్‌కు తరలించారు. (మరో ‘పరువు’ హత్య) -
‘అన్నయ్య మొహం మొత్తం దెబ్బలే’
సాక్షి, హైదరాబాద్: ప్రేమ పెళ్లి చేసుకున్నాడనే కారణంతో దారుణ హత్యకు గురైన హేమంత్ తమ్ముడు సుమంత్ సాక్షి టీవీతో శనివారం మాట్లాడారు. తన అన్న హత్య కేసులో ప్రమేయమున్నా ఒక్కరినీ వదలొద్దని అతను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మళ్లీ ఇలాంటి హత్యలు జరగొద్దని కోరుకున్నారు. హత్యోదంతంపై సుమంత్ మాట్లాడుతూ.. మా అన్న హేమంత్‌ను కొట్టుకుంటూ సంగారెడ్డి తీసుకెళ్లి చంపారట. చివరి సారిగా ఆకలిగా ఉందని చెప్పినా వాళ్లు కనికరించలేదంట. (చదవండి: మరో ‘పరువు’ హత్య) నీకెందుకురా అన్నం అంటూ కొట్టారంట. హత్య వెనకాల అవంతి తండ్రి లక్ష్మా రెడ్డి, తల్లి అర్చన ప్రధాన పాత్ర పోషించినట్టు తెలసుస్తోంది. నా అన్న చంపిన వారిని వదలొద్దు. ఇలాంటి హత్యలు మళ్లీ జరగొద్దు. యూకేలో హోటల్ బిజినెస్ ప్లాన్ చేశాను. కుటుంబం మొత్తం అక్కడే సెటిల్ అవుదాం అనుకున్నాం. ఈ లోపే అన్నయ్యకు ఇంత దారుణం జరగడం కష్టంగా ఉంది. అన్నయ్య సినిమాల్లో ప్రయత్నించాడు. అమ్మ ఇద్దరినీ అందంగా ఉండాలని కోరుకునేది. కానీ చివరిసారిగా అన్నయ్య మొహం మొత్తం దెబ్బలే’అని సుమంత్ కన్నీరుమన్నీరయ్యాడు. (చదవండి: వాళ్లను ఎన్కౌంటర్ చేయండి: అవంతి) -
వాళ్లను ఎన్కౌంటర్ చేయండి: అవంతి
సాక్షి, హైదరాబాద్: హేమంత్‌ను కిరాతకంగా హతమార్చిన వారందరినీ ఎన్కౌంటర్ చేయాలని అతని భార్య అవంతిరెడ్డి డిమాండ్ చేశారు. తమను నమ్మించి మోసం చేశారని వాపోయారు. శనివారం ఆమె సాక్షితో మాట్లాడుతూ.. నాపై ప్రేమ ఉంటే నేను ప్రేమించిన వ్యక్తిని చంపుతారా? మా అమ్మానాన్నల కంటే అత్తామామ ఎక్కువగా ప్రేమిస్తారు. మా ఇంటికి 10 మంది వచ్చి బలవంతంగా తీసుకెళ్లారు. అమ్మానాన్న వద్దకు తీసుకెళ్తామని కిడ్నాప్ చేశారు. (చదవండి: హేమంత్ రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు) హత్యలో మేనమామలు ఇన్వాల్వ్ అవుతారని అనుకోలేదు. మేనమామలు విజేందర్‌రెడ్డి, యుగేంధర్‌రెడ్డి, కలిసి చేశారు. నా భర్తను హత్య చేసిన వారందరినీ ఎన్కౌంటర్ చేయాలి’అని అవంతి ప్రభుత్వానికి మొరపెట్టుకున్నారు. కాగా, కూతురు ప్రేమ పెళ్లి నచ్చని అవంతి తల్లిదండ్రులు లక్ష్మారెడ్డి, అర్చన హేమంత్‌ని హత్య చేయించారు. ఈకేసులో ప్రధాన నిందితుడు అవంతి మేనమామ గూడూరు యుగేందర్‌రెడ్డి. ఇప్పటివరకు 14 మందిని పోలీసులు రిమాండ్‌కు తరలించారు. సంగారెడ్డి ప్రాంతంలో గురువారం రాత్రి హేమంత్ హత్య చోటుచేసుకుంది. (చదవండి: మరో ‘పరువు’ హత్య) -
హేమంత్ రిమాండ్‌లో సంచలన విషయాలు
సాక్షి, హైదరాబాద్ : హేమంత్ హత్య కేసులో రిమాండ్‌లో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. అవంతి, హేమంత్‌ను విడదీయడంతోపాటు హేమంత్‌ను చంపేందుకు ప్లాన్ చేసిన మొత్తం వివరాలను నిందితులు పోలీసుల ఎదుట వెల్లడించారు. ఈ నేపథ్యంలో నెల రోజుల ముందే హేమంత్‌ను చంపేందుకు పథకం పన్నినట్లు నిందితులు లక్ష్మారెడ్డి, యుగేంధర్ వెల్లడించారు. గచ్చిబౌలిలోని టీఎన్జీవో కాలనీలో నివాసముంటున్న హేమంత్‌ను ఎలా చంపాలి, ఎలా కిడ్నాప్ చేయాలనే విషయంపై నెల రోజుల ముందే స్కెచ్ వేసినట్లు యుగేంధర్ తెలిపారు. ఇందుకు కిరాయి హంతకులు కృష్ణ, రాజు, పాషాలతో పలుమార్లు సంప్రదించినట్లు పేర్కొన్నారు. అలాగే అవంతికి మాయమాటలు చెప్పి తమ వైపు తిప్పుకోవాలని ప్లాన్ చేసినట్లు లక్ష్మారెడ్డి తెలిపారు. నెల క్రితం హేమంత్‌ను చంపేందుకు లింగంపల్లిలోని లక్ష్మారెడ్డి ఇంట్లో సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. (ఒక్కసారి కళ్ళు తెరువు హేమంత్ : అవంతి) కులాంతర వివాహం చేసుకున్న కారణానికి హేమంత్ అనే వ్యక్తిని గురువారం అత్యంత దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. జూన్ 10న ఇంట్లో నుంచి వెళ్లిపోయిన అవంతిరెడ్డి జూన్ 11న హేమంత్‌ను ప్రేమ వివాహం చేసుకున్నారు. అవంతి, హేమంత్ వివాహం కారణంగా అవమానంతో రగిలిపోయిన లక్ష్మారెడ్డి, భార్య అర్చన తన కూతురు వివాహంపై యుగేంర్‌రెడ్డితో గోడు వెళ్లదీసుకున్నారు. నాలుగు నెలల పాటు ఇంట్లోనే ఉన్న లక్ష్మారెడ్డి, అర్చన దంపతులు తన చెల్లి బాధ చూడలేక అవంతిని హేమంత్ నుంచి విడదీయాలని యుగంధర్‌రెడ్డి నిర్ణయించుకున్నాడు. నెల రోజుల క్రితం లక్ష్మారెడ్డి ఇంట్లో కుటుంంబ సభ్యుల సమావేశం ఎలాగైనా అవంతి, హేమంత్‌ను విడదీయాలని నిర్ణయం తీసుకున్నారు. (హైదరాబాద్‌లో పరువు హత్య కలకలం) యుగేందర్‌రెడ్డి అన్న విజయేందర్‌రెడ్డి గచ్చిబౌలిలోని టీఎన్జీవో కాలనీలో అవంతి ఇంటి కోసం రెక్కీ నిర్వహించి ఈ నెల 24న మధ్యాహ్నం 2:30 ఇంట్లోకి బలవంతంగా చొరబడ్డారు. ఈ క్రమంలో 12 మంది బంధువులు హేమంత్, అవంతిపై దాడిచేస్తూ వారిని కారులోకి ఎక్కించారు. లింగంపల్లిలో మాట్లాడుదామని గోపన్‌పల్లివైపు బుంధువులు తీసుకెళ్లగా గోపన్‌పల్లిలో అవంతి, హేమంత్ తప్పించుకున్నారు. అవంతి పారిపోగా హేమంత్ దొరకపట్టి సాయంత్ర 7:30కు కారులోనే హేమంత్‌ను నిందితులు హత్య చేశారు. సీన్లో లేకుండా లక్ష్మారెడ్డి, అర్చన జాగ్రత్తపడగా అనంతరం బైక్‌పై గోపన్‌పల్లికి చేరుకున్నారు. ఈ హత్య కేసులో మొత్తంలో 13 మంది బంధువులు ఇన్వాల్వ్ అయ్యారు. కాగా అర్చన బాధ చూడలేకే హత్య చేశానని యుగంధర్‌రెడ్డి తెలిపారు. హేమంత్ హత్య కేసులో 18మంది నిందితులు ఉండగా వీరిలోనలుగురు కృష్ణ, బాషా,జగన్, సయ్యద్ పరారీలో ఉన్నారు. మిగతా 14 మందిని గచ్చిబౌలి పోలీసులు అరెస్ట్ చేశారు. అవంతిని వదిలేయమని హేమంత్‌కు ఎంతచెప్పిన వినకపోతేనే హత్య చేశామని ఏ1 నిందితుడు యుగేంధర్ రెడ్డి తెలిపారు.కారులో సైతం చాలా సేపు నచ్చచెప్పినట్లు పేర్కొన్నారు. కాగా యుగేంధర్ రెడ్డితో ఏడు లక్షలకు హత్య చేసేందుకు ఒప్పందం చేసుకున్నామని ఏ5 నిందితుడు బిచ్చుయాదవ్ తెలిపారు. అతనితో 10 సంవత్సరాలుగా కలిసి వాటర్ సప్లై బిజినెస్ చేశామని, ఆ పరిచయంతోనే హత్యకు ఒప్పుకొన్నామని వెల్లడించారు. -
ఒక్కసారి కళ్ళు తెరువు హేమంత్ : అవంతి
సాక్షి, హైదరాబాద్ : కులాంతర వివాహం చేసుకున్న పాపానికి హత్యకు గురైన హేమంత్ సోదరుడు సుమంత్ యూకే నుంచి హైదరాబాద్ చేరుకున్నాడు. అన్న మృతి తట్టుకోలేక విలవిల్లాడిపోయాడు. వదిన అవంతిని పట్టుకుని బోరున విలపించాడు. తన అన్నను చంపిన వారిని ఎవరిని వదలనని, వారందరినీ కఠినంగా శిక్షించాలని సుమంత్ డిమాండ్ చేశాడు. హత్య జరిగే రెండు రోజుల ముందు అన్నయ్య తనకు ఫోన్ చేశాడని, బిజినెస్ సంబంధించిన పలు అంశాలపై చర్చించామని తెలిపాడు. కులాంతర వివాహం చేసుకున్నందుకే తన అన్నను అతి కిరాతంగా హత్య చేశాడని, చెప్పులతో కొట్టుకుంటూ మరీ తీసుకెళ్లారని ఆవేదన వ్యక్తం చేశాడు. మరోవైపు హేమంత్ అంత్యక్రియలు ముగిశాయి. నగరంలోని చందానగర్ శ్మశాన వాటికలో శనివారం మధ్యాహ్నం అంత్యక్రియలు నిర్వహించారు. (మరో ‘పరువు’ హత్య) అంత్యక్రియల సమయంలో హేమంత్ భార్య అవంతి, తల్లిదండ్రులు గుండెలవిసేలా రోధించారు. తన కొడుకు కన్నా ముందు నన్ను పాడె మీద పడుకోబెట్టండి అంటూ హేమంత్ తల్లి పాడే మీద పడుకోబోయింది. ఒక్కసారి కళ్ళు తెరువు హేమంత్ అంటూ భార్య అవంతి రోధించిన తీరు స్థానికులను కంటతడి పెట్టించింది. మరోవైపు ఈ హత్యలో ప్రధాన సూత్రధారి యుగేందర్ రెడ్డితోపాటు 14 మందిని పోలీసులు అరెస్టు చేశారు. కాగా కూతురు ప్రేమ వివాహాన్ని జీర్ణించుకోలేని అమృత తండ్రి కిరాయి హంతకుడితో ఆమె భర్త ప్రణయ్‌ను హత్య చేయించిన ఘటన మరువకముందే.. మరో పరువు హత్య జరగడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.