
సాక్షి, హైదరాబాద్: సంచలనం సృష్టిస్తోన్న సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ సతీష్ బాబు హత్య కేసుకు సంబంధించి ఓ యువతిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. సతీష్, హేమంత్‌కు సన్నిహితంగా ఉంటున్న ఓ యువతికి ఈ కేసులో ప్రమేయం ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. అయితే స్నేహితుల ఇద్దరి మధ్య ఆర్థికపరమైన విభేదాలు ఉన్నట్లు ఆమె పోలీసులకు స్టేట్‌మెంట్ ఇచ్చినట్లు సమాచారం. అంతేకాకుండా సతీష్ బాబు హత్య జరిగిన సమయంలో ఆమె కూడా హేమంత్‌తో ఉన్నట్లు తెలుస్తోంది. స్నేహితులు ఇద్దరు నెలకొల్పిన సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఈ యువతి ఉద్యోగం చేస్తోంది. అయితే ఆమెతో వీరిద్దరూ ఒకరికి తెలియకుండా మరొకరు సన్నిహితంగా ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది.
చదవండి: సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ సతీష్ హత్య కేసులో కొత్తకోణం!
ఇక పక్కా పథకం ప్రకారమే హేమంత్...సతీష్‌ను హతమార్చినట్లు పోలీసులు ఓ నిర్థారణకు వచ్చారు. ఈ నెల 27 రాత్రి...సంస్థ కార్యాలయంలోనే హేమంత్...సతీష్‌ను దారుణంగా హత్య చేశాడని పోలీసులు అనుమానిస్తున్నారు. తన భర్త కన్పించడం లేదని సతీష్ భార్య...ఆ మరుసటి రోజు రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేసిన సమయంలో ఆమెతో పాటు నిందితుడు హేమంత్, మరి కొంతమంది స్నేహితులు కూడా స్టేషన్‌కు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే 29వ తేదీన పోలీసులు ఎప్పుడైతే సతీష్ మృత దేహాన్ని గుర్తించారో అప్పటినుంచి హేమంత్ ఫోన్ స్విచ్ఛాప్ చేసి..పరారయ్యాడు. అంతకుముందు రోజంతా...సతీష్ భార్య, స్నేహితులతోనే అతను కలిసి వున్నట్లు, తనకేమీ తెలియనట్లు నటించాడని పోలీసులు భావిస్తున్నారు. పరారీలో ఉన్న హేమంత్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment