Satish Babu
-
‘జాతర’ విజయం ప్రేక్షకులకి అంకింతం: సతీష్ బాబు
సతీష్ బాబు రాటకొండ నటిస్తూ, దర్శకత్వం వహించిన చిత్రం ‘జాతర’. ఓ కొత్త పాయింట్‌ని టచ్ చేస్తూ తెరకెక్కించిన ఈ చిత్రం నవంబర్ 8న విడుదలై మంచి టాక్ని సంపాదించుకుంది. సక్సెస్ ఫుల్ రెండు వారాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జాతర సినిమా టీం సక్సెస్ మీట్ జరుపుకుంది.ఈ సందర్భంగా డైరెక్టర్ , హీరో సతీష్ బాబు రాటకొండ మాట్లాడుతూ.. ఈ సినిమాని ఇంతగా ఆదరించిన ప్రేక్షకులకు నా శిరస్సు వంచి పాదాభివందనాలు చేసుకుంటున్నాను. ఈ సినిమాకి పని చేసిన ప్రతి నటీనటులు, టెక్నిషియన్స్ సినిమా విజయానికి కారణం. నవంబర్ 8 న మా సినిమాతో పాటు ఇంకో పది సినిమాలు పైన రిలీజ్ అయినప్పటికీ ప్రేక్షకులు మాకు అందించిన విజయం మాకు చాల ఆనందాన్ని ఇచ్చింది’ అన్నారు.‘ఇంత చిన్న సినిమాకి అంత గుర్తింపు రావడం అంత ఈజీ కాదు. ఒక వారం పాటు ఎక్కడ ఆగకుండా మా జాతర సినిమా సక్సెస్ ఫుల్ గా ఆడి రెండో వారంలోకి కూడా అడుగుపెట్టింది. ఇది మేము చాల గర్వంగా ఫీల్ అవుతున్నాం’ అన్నారు నిర్మాత ద్వారంపూడి శివ శంకర్ రెడ్డి. విష్ణు గారు మాట్లాడుతూ.. ఈ మూవీ స్టోరీ విన్నప్పుడు నేను పల్లెటూరు, గ్రామా దేవత కాన్సెప్ట్ అన్నప్పుడే నేను ఈ సినిమాకి కనెక్ట్ అయ్యాను. ఎందుకంటే మన రూట్స్ ని మనం మర్చిపోము కదా, ఆ విషయం లో నాకు ఈ సబ్జెక్టు బాగా కనెక్ట్ అయింది. అయితే డైరెక్టర్ సతీష్ గారే హీరోగా ఎలా చేస్తారో అనుకున్నాను, కానీ ఈ సినిమాకి అతని నటన ప్లస్ అయింది. మిగతా టెక్నిషియన్స్ ,ఆర్టిస్టులు కూడా చాల బాగా పర్ఫార్మ్ చేసారు. ఈ సినిమా చేసినందుకు నేను చాల గర్వపడుతున్నాను’ అన్నాను. -
వాస్తవ ఘటనల జాతర
‘‘చిత్తూరు జిల్లా మదనపల్లె పరిసర గ్రామంలో గంగమ్మ అమ్మవారి గుడి ఉంది. చుట్టుపక్కల 18 ఊళ్ల ప్రజలు ఈ గుడికి వచ్చి అమ్మవారిని కొలుస్తారు. ఆ అమ్మవారి గురించి తీసిన చిత్రమే ‘జాతర’. వాస్తవ ఘటనలకు ఫిక్షన్ యాడ్ చేసి ఈ చిత్రాన్ని రూపొందించాను. అమ్మవారి పట్ల రాక్షసుడిగా వ్యవహరిస్తున్న వ్యక్తిని హీరో ఎలా సంహరించాడు? అనేది మా చిత్రంలో చూపిస్తున్నాం’’ అని సతీష్ బాబు రాటకొండ చెప్పారు.ఆయన హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘జాతర’. గల్లా మంజునాథ్ సమర్పణలో రాధాకృషా ్ణరెడ్డి, శివశంకర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 8న రిలీజ్ కానుంది. సతీష్ బాబు రాటకొండ మాట్లాడుతూ–‘‘ఈ సినిమా ఓ పెద్ద హీరోతో చేయాల్సింది. కుదరక నేనే హీరోగా చేశా. ఇందులో ప్రేమ కథ ఉంటుంది. మా నిర్మాతలు ఎంతో సపోర్ట్ చే శారు’’ అన్నారు. -
రా అండ్ రస్టిక్‌గా 'జాతర' ఫస్ట్ లుక్
సతీష్ బాబు లీడ్ రోల్ చేస్తూ దర్శకత్వం వహించిన సినిమా 'జాతర'. రాధా కృష్ణారెడ్డి, శివశంకర్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దీయా రాజ్ హీరోయిన్. తాజాగా ఫస్ట్‌లుక్ పోస్టర్ని రిలీజ్ చేసి ప్రమోషన్ మొదలుపెట్టారు. ఈ పోస్టర్ చూస్తుంటే సతీష్ బాబు రా అండ్ రస్టిక్ లుక్‌లో కనిపించారు. కత్తి పట్టుకుని ఉన్నారు.(ఇదీ చదవండి: చైతూ- శోభిత తొలిసారి అక్కడే కలుసుకున్నారా?)ఇక అమ్మవారి ఫోటో, జాతరలో పూనకాలు వచ్చినట్టుగా గెటప్, లుక్ అన్నీ కూడా అద్భుతంగా ఉన్నాయి. 'దేవుడు ఆడే జగన్నాటకంలో ఆ దేవునితో మనిషి ఆడించే పితలాటకం' అని పోస్టర్ మీదున్న డైలాగ్ ఆసక్తిని రేకెత్తిస్తోంది. చిత్తూరు జిల్లాలోని పాలేటి గంగమ్మ దేవత జాతర బ్యాక్ డ్రాప్‌తో సినిమా తీశారు. (ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన మిస్టరీ థ్రిల్లర్.. ట్విస్టులు, క్లైమాక్స్ మాత్రం) -
జనవరిలో టైప్‌రైటింగ్, షార్ట్‌హ్యాండ్ పరీక్షలు
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఏడాది జనవరిలో టైప్ రైటింగ్, షార్ట్‌హ్యాండ్ పరీక్షలను ప్రభుత్వం నిర్వహించనుందని తెలంగాణ రికగ్నైజ్డ్ టైప్‌రైటింగ్, షార్ట్ హ్యాండ్ అండ్ కంప్యూటర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బాలిగ సతీష్‌బాబు తెలిపారు. పరీక్షలను నిర్వహించాలని కోరుతూ గురువారం విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్, కార్యదర్శి సి.శ్రీనాథ్‌ను ఆయన కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వచ్చే ఏడాది జనవరి 22, 23 తేదీల్లో టైప్ రైటింగ్, 29, 30 తేదీల్లో షార్ట్‌హ్యాండ్ పరీక్షలను నిర్వహిస్తామని కమిషనర్ తెలిపారని సతీష్‌బాబు చెప్పారు. పరీక్ష ఫీజు వచ్చే నెల 29 వరకు పొడిగించారని, ప్రీమియం తత్కాల్ కింద రూ. 5వేలు ఫీజు చెల్లించి పరీక్షకు ముందు రోజు వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారని వివరించారు. -
అప్పటి నుంచి సతీష్‌పై ద్వేషం పెంచుకున్న హేమంత్
సాక్షి, హైదరాబాద్ : సంచలనం సృష్టించిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ సతీష్ బాబు హత్య కేసును పోలీసులు చేధించారు. ప్రియురాలు ప్రియాంక కోసమే సతీష్‌ను హేమంత్ హత్య చేశాడని పోలీసులు స్పష్టం చేశారు. ఈ మేరకు హత్య కేసుకు సంబంధించిన వివరాలను మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వరరావు మీడియాకు వివరించారు. ప్రియురాలును దూరం చేస్తున్నాడనే భావనతోనే హేమంత్ సతీష్‌ను హత్య చేసినట్లు విచారణలో తేలిందన్నారు. (చదవండి : సాఫ్ట్వేర్ ఇంజనీర్ దారుణ హత్య) ‘గత నెల 28న సాఫ్టవేర్ ఇంజనీర్ సతీష్ దారుణ హత్యకు గురయ్యాడు. ఈ హత్య కేసులో నిందితుడు హేమంత్‌ను అరెస్ట్ చేశాం. విచారణలో సతీష్ స్నేహితుడు హేమంత్ పై అనుమానం వచ్చింది. దీంతో అతని ఇంటికి వెళ్లి చూశాం. హేమంత్ ఇంటికి తాళం వేసి పరారయ్యాడు. తాళం విరగొట్టి చూస్తే సతీష్ బాడీ ఇంట్లో ఉంది. దీంతో హేమంత్‌ను అదుపులోకి తీసుకొని విచారించగా నిజాన్ని ఒప్పకున్నాడు. అప్పటి నుంచి సతీష్‌పై ద్వేషం పెంచుకున్నాడు సతీష్, హేమంత్ ఇద్దరు చిన్ననాటి స్నేహితులు. సతీష్ 10 ఏళ్ల క్రితం హైదరాబాద్ వచ్చి , సాఫ్ట్ వేర్ సోల్యూషన్ లో కోచింగ్ ఇస్తున్నాడు. మరో వైపు హేమంత్ చిన్న చిన్న కంపెనీల్లో ఉద్యోగం చేస్తూ మధ్యలోనే మానేసేవాడు. ఓ సందర్భంలో సతీష్‌ను హేమంత్ కలుసుకొని ఉద్యోగం ఇప్పించమని కోరారు. దీంతో తన కంపెనీలో ఉద్యోగం ఇచ్చాడు. కొద్దిరోజుల తర్వాత హేమంత్, సతీష్ భాగస్వాములుగా ఓ ఐటీ కంపెనీని నిర్వహించారు. ఈ సందర్భంగా 2016లో తన దగ్గర కోచింగ్ తీసుకొని తన కంపెనీలోనే ఉద్యోగం చేస్తున్న ప్రియాంకను సతీష్ హేమంత్‌కు పరిచయం చేశాడు. అంతకు ముందే సతీష్‌కు ప్రియాంకకు మధ్య సాన్నిహిత్యం ఉండేది. ప్రియాంక కేపీహెచ్బీలో హాస్టల్లో ఉండేది. కాగా కొద్ది రోజుల తర్వాత ప్రియాంకతో హేమంత్‌కు సాన్నిహిత్యం పెరిగింది. ఈ విషయం హేమంత్ భార్యకు తెలిసి ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో హేమంత్, ప్రియాంక ఒక గది రెంట్‌కి తీసుకొని ఉంటున్నారు. గత మూడు నెలలుగా హేమంత్, ప్రియాంక ఒకే గదిలో ఉన్నారు. ఈ విషయం సతీష్‌కు తెలియడంతో హేమంత్‌ను హెచ్చరించాడు. ఆ అమ్మాయికి భవిష్యత్ ఉందని, ఆమెతో కలిసి ఉండొద్దని హేమంత్‌కు వార్నింగ్ ఇచ్చాడు. అలాగే కంపెనీకి నష్టాలు రావడంతో జీతం కూడా తగ్గించాడు. అప్పటి నుంచి సతీష్‌పై హేమంత్ ద్వేషం పెంచుకున్నాడు. ప్రియాంక దూరం అవుతుందని, భావించి కక్ష పెంచుకొని సతీష్‌ను హత్య చేయాలని పథకం పన్నాడు. పక్కా ప్లాన్‌తో హత్య చేశాడు గత నెల 28న సతీష్‌ను హేమంత్ తన ఇంటికి ఆహ్వానించారు. పార్టీ చేసుకుందని చెప్పి నమ్మించి ఇంటికి రప్పించుకున్నాడు. అనంతరం ఇద్దరు మద్యం సేవించారు. రాత్రి 10 గంటల ప్రాంతంలో సతీష్‌ను దారుణంగా హత్య చేశాడు. సుత్తెతో సతీష్ తలపై బలంగా కొట్టి చంపాడు. అనంతరం బాడీని కారులో తరలించాలని చూశాడు. ప్యాకింగ్ కోసం బయటకు వెళ్లి నల్లటి కవర్లు కొన్నాడు. తిరిగి రూమ్‌లోకి వచ్చిన హేమంత్.. మృతదేహం కాలు నరకడానికి ప్రయత్నించాడు. సాధ్యం కాకపోవడంతో భయపడి శవాన్ని అక్కడే వదిలి వెళ్లాడు. ఆ రోజు రాత్రంతా రోడ్లపైనే గడిపాడు. తన భర్త కన్పించడం లేదని సతీష్ భార్య...ఆ మరుసటి రోజు రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేసిన సమయంలో ఆమెతో పాటు నిందితుడు హేమంత్, మరి కొంతమంది స్నేహితులు కూడా స్టేషన్‌కు వచ్చాడు. అన్ని ఆధారాలు సేకరించిన తర్వాతే నిందితుడు హేమంత్ అని తేల్చాం’ అని డీసీపీ మీడియాకు వివరించారు. -
వాళ్లకు వివాహేతర సంబంధం లేదు: హేమంత్
సాక్షి, హైదరాబాద్ : సాఫ్ట్వేర్ ఇంజనీర్ సతీశ్ బాబు హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఈ కేసులో నిందితుడు హేమంత్‌ను ఇప్పటికే అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో విచారణలో భాగంగా హేమంత్ పలు కీలక విషయాలు వెల్లడించినట్లు సమాచారం. సతీశ్‌ను తానే హతమార్చినట్లు అంగీకరించిన హేమంత్..ఈ హత్యతో ప్రియాంకకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నాడు. అదే విధంగా అందరూ భావిస్తున్నట్లుగా సతీశ్- ప్రియాంకల మధ్య వివాహేతర సంబంధం లేదని హేమంత్ తెలిపాడు. కాగా కూకట్‌పల్లిలోని కేపీహెచ్బీలో సతీశ్ దారుణ పరిస్థితుల్లో శవమై తేలిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తన వ్యాపార భాగస్వామి హేమంత్ అతడిని హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. చదవండి : సతీశ్ హత్యకేసులో కొత్త కోణాలు ఈ నేపథ్యంలో దర్యాప్తు చేపట్టగా సతీశ్, హేమంత్‌లకు పరిచయమున్న ప్రియాంక అనే అమ్మాయి కారణంగానే హత్య జరిగిందని భావించారు. ఏడాది కాలంగా భార్యకు దూరంగా ఉంటున్న హేమంత్‌ను... ప్రియాంకతో సాన్నిహిత్యం తగ్గించుకోవాలని సతీశ్ హెచ్చరించినందుకే అతడి హత్య జరిగిందని అనుమానించారు. అదే విధంగా ఆర్థిక లావాదేవీల విషయంలోనూ పోలీసులు విచారణ జరిపారు. ఈ క్రమంలో సతీశ్ కాల్‌డేటా పరిశీలించిన అనంతరం హేమంత్‌ను అదపులోకి తీసుకుని.. సీసీటీవీ ఫుటేజీ సహా పలు కీలక ఆధారాలు సేకరించారు. ప్రస్తుతం హేమంత్ నేరం అంగీకరించడంతో.. అతడికి ఎవరు సహకారం అందించారన్న కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు. -
పోలీసుల అదుపులో నిందితుడు హేమంత్
-
పోలీసుల అదుపులో హేమంత్
సాక్షి, హైదరాబాద్ : సంచలనం సృష్టిస్తోన్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ సతీష్ బాబు హత్య కేసు నిందితుడు హేమంత్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ నగర శివార్లలో హేమంత్‌ను అదుపులోకి తీసుకున్నట్లు సైబరాబాద్ పోలీసులు వెల్లడించారు. సతీష్‌ను తాను ఒక్కడినే హత్య చేశానని, ఇందులో తన ప్రియురాలికి ఎలాంటి సంబంధం లేదని హేమంత్ పోలీసులకు చెప్పినట్లు సమాచారం. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం .. గత నెల 27న సతీష్‌ను హేమంత్ దారుణంగా హత్య చేశాడు. స్నేహితురాలు ప్రియాంకను హాస్టల్ వద్ద డ్రాప్ చేసిన సతీష్.. రాత్రి 8 గంటలకు హేమంత్ రూమ్‌కి వెళ్లాడు. ఇద్దరు కలిసి మద్యం సేవించారు. మాటల మధ్యలో ఆఫీస్‌లో పనిచేస్తున్న అమ్మాయితో హేమంత్‌కు ఉన్న అక్రమ సంబంధ విషయం చర్చకు వచ్చింది. అక్రమ సంబంధం మానుకోవాలని హేమంత్‌ను సతీష్ హెచ్చరించాడు. (చదవండి : సతీష్ హత్యకేసు : బయటపడుతున్న కొత్త కోణాలు) దీంతో భయపడిన హేమంత్.. ఈ విషయాన్ని సతీష్ అందరికి చెబుతాడని, ఎప్పటికైనా తనకు అడ్డుతగులుతాడని భావించి హత్యకు కుట్ర పన్నాడు. రాత్రి 10 గంటల ప్రాంతంలో కత్తితో సతీష్ మెడ కోసి చంపాడు. అనంతరం మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరకాలని భావించాడు. ప్యాకింగ్ కోసం బయటకు వెళ్లి నల్లటి కవర్లు కొన్నాడు. అనంతరం రూమ్‌లోకి వచ్చిన హేమంత్.. మృతదేహం కాలు నరకడానికి ప్రయత్నించాడు. సాధ్యం కాకపోవడంతో భయపడి శవాన్ని అక్కడే వదిలి వెళ్లాడు. ఆ రోజు రాత్రంతా రోడ్లపైనే గడిపాడు. మరుసటి రోజు స్నేహితులతో గడిపాడు. అనంతరం హత్య విషయాన్ని తన సన్నిహితులకు చెప్పాడు. వారు పోలీసులకు లొంగిపోవాలని సలహా ఇచ్చారు. కానీ హేమంత్ మాత్రం లొంగిపోకుండా బంధువుల ఇంట్లో తలదాచుకున్నాడు. సతీష్ భార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు హేమంత్ కోసం ముమ్మరంగా గాలించారు. సోమవారం పోలీసులకు పట్టుబడిన హేమంత్.. నిజాన్ని ఒప్పకున్నాడు. హత్యతో తన ప్రియురాలికి ఎలాంటి సంబంధం లేదని, ఒక్కడినే హత్య చేశానని హేమంత్ పోలీసులు ఎదుట ఒప్పకున్నాడు. -
సతీష్ హత్యకేసు : బయటపడుతున్న కొత్త కోణాలు
సాక్షి, హైదరాబాద్ : సంచలనం సృష్టిస్తోన్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ సతీష్ బాబు హత్య కేసులో రోజు రోజుకి కొత్త కోణాలు బయటపడుతున్నాయి. స్నేహితురాలు ప్రియాంకతో సతీష్ చనువుగా ఉండడం చూసి తుట్టుకోలేకనే హేమంత్ ఈ హత్య చేసినట్లు పోలీసులు నిర్థారణకు వచ్చారు. హేమంత్ స్నేహితురాలు ప్రియాంకతో సతీష్‌కు సంబంధాలు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా సతీష్ కుటుంబ సభ్యులు మాత్రం ఇందుకు ఆర్థిక కారణాలు ఉన్నాయని ఆరోపిస్తున్నారు. అయితే హత్య చేసిన రోజు హేమంత్ ఇంటికి సతీష్ వెళ్లాడని, అక్కడ ఇద్దరూ మద్యం సేవించారని పోలీసులు గుర్తించారు. హత్యకు ముందు రోజు ప్రియాంకను సతీష్ హాస్టల్ వద్ద డ్రాప్ చేసిన సీసీ పుటేజ్‌ను పోలీసులు సేకరించారు. ప్రియాంకను హాస్టల్లో డ్రాప్ చేసిన తర్వాత సతీష్ ఎక్కడికి వెళ్లాడనేది మిస్టరీగా మారింది. (చదవండి : ఆమె’ కోసమేనా హత్య?) ఇక పక్కా పథకం ప్రకారమే హేమంత్...సతీష్‌ను హతమార్చినట్లు పోలీసులు ఓ నిర్థారణకు వచ్చారు. గత నెల 27 రాత్రి...సంస్థ కార్యాలయంలోనే హేమంత్...సతీష్‌ను దారుణంగా హత్య చేశాడని పోలీసులు అనుమానిస్తున్నారు. తన భర్త కన్పించడం లేదని సతీష్ భార్య...ఆ మరుసటి రోజు రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేసిన సమయంలో ఆమెతో పాటు నిందితుడు హేమంత్, మరి కొంతమంది స్నేహితులు కూడా స్టేషన్‌కు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే 29వ తేదీన పోలీసులు ఎప్పుడైతే సతీష్ మృత దేహాన్ని గుర్తించారో అప్పటినుంచి హేమంత్ ఫోన్ స్విచ్ఛాప్ చేసి..పరారయ్యాడు. అంతకుముందు రోజంతా...సతీష్ భార్య, స్నేహితులతోనే అతను కలిసి వున్నట్లు, తనకేమీ తెలియనట్లు నటించాడని పోలీసులు భావిస్తున్నారు. అయితే సతీష్‌ను హత్య చేయడానికి హేమంత్‌కు ఎవరు సహాయం చేశారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
‘ఆమె’ కోసమేనా హత్య?
సాక్షి, కూకట్పల్లి: ఐటీ సంస్థ నిర్వాహకుడు మైలా సతీష్ బాబు హత్య కేసులో ప్రధాన నిందితుడిని కేపీహెచ్‌బీ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. చిన్ననాటి స్నేహితుడు, వ్యాపార భాగస్వామి సతీష్ బాబును నమ్మించి దారుణంగా హత్య చేసిన హేమంత్‌ను పోలీసులు గుల్బర్గా వద్ద అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. సతీ‹Ùబాబు హత్యకు ఆర్ధిక లావాదేవీలతో పాటు ఓ యువతి విషయంలో ఏర్పడిన వివాదాలే కారణం కావచ్చని భావిస్తున్నారు. ఇప్పటికే పోలీసులు కేపీహెచ్‌బీ 7వ ఫేజ్‌లోని ఐటీ స్లేట్ కన్సల్టెంట్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులను విచారించారు. సంస్థ ఆరి్ధక పరిస్థితులతో పాటు ఇద్దరు భాగస్వాముల నడుమ వివాదాలకు కారణాలను ఉద్యోగులను అడిగి తెలుసుకున్నారు. చదవండి: సాఫ్ట్వేర్ ఇంజనీర్ సతీష్ హత్య కేసులో కొత్తకోణం! విదేశాల్లో ఎంఎస్ పూర్తి చేసిన సతీ‹Ùబాబు ఐటీ విద్యార్థులకు శిక్షణ ఇవ్వడంలో ప్రత్యేకతను సొంతం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో నగరంలోని పలు కోచింగ్ సెంటర్లలో విద్యార్ధులకు తరగతులను బోధించడంతో పాటు కన్సల్టెన్సీ నిర్వహించడం ద్వారా ఐటీ సేవలు అందిస్తున్నారు. స్నేహితుడైన హేమంత్‌ను భాగస్వామిగా చేసుకున్న అతను విద్యార్ధులకు శిక్షణ అందించే బాధ్యతలు అప్పగించాడు. క్లాస్ వర్కులో సతీ‹Ùబాబు, ట్రైనింగ్ వర్క్‌లో హేమంత్ ఉమ్మడి సేవలు అందిస్తున్నారు. అయితే అకస్మాత్తుగా సతీ‹Ùబాబు హత్యకు గురికావడం, స్నేహితుడైన హేమంత్ గదిలోనే శవం లభించడం, హేమంత్ పరారీలో ఉండటంతో అతనే నిందితుడిగా నిర్దారించిన పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపి నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. తనకు దూరమవుతుందని.. సతీష్ బాబు, హేమంత్ నిర్వహిస్తున్న ఐటీ కన్సల్టెన్సీ సంస్థలో పనిచేస్తున్న ఓ ఉద్యోగికి సతీష్ తరగతులు బోధించగా హేమంత్ ట్రైనింగ్ ఇచ్చాడు. దీంతో ఆమె ఇద్దరితోనూ స్నేహంగా, చనువుగా ఉండేది. ఈ నేపథ్యంలో సదరు యువతితో హేమంత్ వివాహేతర సంబంధం కొనసాగించాడు. ఆమె కోసం ఏకంగా తన కుటుంబాన్ని సైతం దూరం పెట్టి ఆఫీసు సమీపంలోనే ఓ ఇంటిని అద్దెకు తీసుకొని నివాసం ఉంటున్నాడు. తరచూ ఆ యువతి హేమంత్ ఇంటికి వచ్చి వెళ్లేదని, వారు కలిసిమెలిసి ఉండటం చూసినట్లు స్థానిక కాలనీవాసులు సైతం పోలీసులకు తెలిపినట్లు తెలిసింది. ఈ కోణంలో విచారణ చేపట్టిన పోలీసులు సదరు యువతిని సైతం అదుపులోకి తీసుకొని విచారించినట్లు తెలిసింది. అయితే గత కొద్ది రోజులుగా ఆమె సతీష్ బాబుతో చనువుగా ఉండటాన్ని గుర్తించిన హేమంత్ స్నేహితుడిపై కోపం పెంచుకున్నాడు. తనకు సొంతమని భావిస్తున్న యువతి సతీష్ బాబు కారణంగా దూరమవుతుందని భావించి అడ్డు తొలగించుకునేందుకు హతమార్చి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. -
సతీష్ హత్యకేసు: పోలీసుల అదుపులో యువతి!
సాక్షి, హైదరాబాద్: సంచలనం సృష్టిస్తోన్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ సతీష్ బాబు హత్య కేసుకు సంబంధించి ఓ యువతిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. సతీష్, హేమంత్‌కు సన్నిహితంగా ఉంటున్న ఓ యువతికి ఈ కేసులో ప్రమేయం ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. అయితే స్నేహితుల ఇద్దరి మధ్య ఆర్థికపరమైన విభేదాలు ఉన్నట్లు ఆమె పోలీసులకు స్టేట్మెంట్ ఇచ్చినట్లు సమాచారం. అంతేకాకుండా సతీష్ బాబు హత్య జరిగిన సమయంలో ఆమె కూడా హేమంత్‌తో ఉన్నట్లు తెలుస్తోంది. స్నేహితులు ఇద్దరు నెలకొల్పిన సాఫ్ట్వేర్ కంపెనీలో ఈ యువతి ఉద్యోగం చేస్తోంది. అయితే ఆమెతో వీరిద్దరూ ఒకరికి తెలియకుండా మరొకరు సన్నిహితంగా ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. చదవండి: సాఫ్ట్వేర్ ఇంజనీర్ సతీష్ హత్య కేసులో కొత్తకోణం! ఇక పక్కా పథకం ప్రకారమే హేమంత్...సతీష్‌ను హతమార్చినట్లు పోలీసులు ఓ నిర్థారణకు వచ్చారు. ఈ నెల 27 రాత్రి...సంస్థ కార్యాలయంలోనే హేమంత్...సతీష్‌ను దారుణంగా హత్య చేశాడని పోలీసులు అనుమానిస్తున్నారు. తన భర్త కన్పించడం లేదని సతీష్ భార్య...ఆ మరుసటి రోజు రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేసిన సమయంలో ఆమెతో పాటు నిందితుడు హేమంత్, మరి కొంతమంది స్నేహితులు కూడా స్టేషన్‌కు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే 29వ తేదీన పోలీసులు ఎప్పుడైతే సతీష్ మృత దేహాన్ని గుర్తించారో అప్పటినుంచి హేమంత్ ఫోన్ స్విచ్ఛాప్ చేసి..పరారయ్యాడు. అంతకుముందు రోజంతా...సతీష్ భార్య, స్నేహితులతోనే అతను కలిసి వున్నట్లు, తనకేమీ తెలియనట్లు నటించాడని పోలీసులు భావిస్తున్నారు. పరారీలో ఉన్న హేమంత్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. -
గొంతు కోసి.. ప్యాకింగ్ చేసి..
-
సాఫ్ట్వేర్ ఇంజనీర్ సతీష్ హత్య కేసులో కొత్తకోణం!
సాక్షి, హైదరాబాద్ : సాఫ్ట్వేర్ ఇంజనీర్ సతీష్ బాబు హత్యకేసులో కొత్తకోణం వెలుగుచూసింది. ఈ హత్యకు అక్రమ సంబంధమే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. సతీష్ స్నేహితుడు హేమంత్ పథకం ప్రకారమే ఈ హత్య చేసినట్లు నిర్థారణకు వచ్చారు. హేమంత్ స్నేహితురాలు ప్రియాంకతో సతీష్‌కు సంబంధాలు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా స్నేహితుల మధ్య ఆర్థిక పరమైన గొడవలు తలెత్తినట్లు ప్రియాంక పోలీసులకు స్టేట్మెంట్ ఇచ్చింది. వివరాల్లోకి వెళితే...వాళ్లిద్దరూ బాల్య స్నేహితులు... చిన్నప్పటి నుంచి కలిసి చదువుకున్నారు. ఉన్నత విద్య పూర్తి చేసి ఏడాది క్రితమే వ్యాపారం ప్రారంభించారు. ఏమైందో ఏమో గానీ వ్యాపార భాగస్వామిగా ఉన్న స్నేహితుడిని అతి దారుణంగా హత్య చేయడమేగాక ముక్కలు చేసి ప్లాస్టిక్ కవర్‌తో పార్శిల్ చేసేందుకు యత్నించాడు. ఆ తర్వాత ఏం జరిగిందో.. ఆ శవాన్ని ఇంట్లోనే వదిలేసి, ఫోన్ స్విచ్చాఫ్ చేసి పరారయ్యాడు. చదవండి: కేపీహెచ్బీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ దారుణ హత్య ప్రకాశం జిల్లా, మార్టూరుకు చెందిన మైలా సతీష్‌బాబు (35), భీమవరానికి చెందిన హేమంత్ కోరుకొండ సైనిక్ స్కూల్లో కలిసి చదువుకున్నారు. విదేశాల్లో ఎంఎస్ పూర్తి చేసి వచ్చిన సతీష్‌బాబు.. ఏడాది క్రితం హేమంత్‌తో కలసి కేపీహెచ్‌బీ కాలనీలోని 7వ ఫేజ్‌లో ఐటీ స్లేట్ కన్సల్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో సాప్ట్వేర్ డెవలప్మెంట్ సంస్థను ఏర్పాటు చేశాడు. సతీష్‌బాబు తన భార్య ప్రశాంతితో కలసి మూసాపేట ఆంజనేయనగర్‌లో ఉంటున్నాడు. హేమంత్ కుటుంబం ఆల్వాల్‌లో నివాసం ఉంటుండగా, అతను కేపీహెచ్‌బీలోని 7వ ఫేజ్‌లో ఇళ్లు అద్దెకు తీసుకొని ఒంటరిగా ఉంటున్నాడు. ఎస్ఆర్ నగర్‌లోని ఓ ప్రైవేట్ సంస్థలో ఐటీ విద్యార్థులకు తరగతులు చెప్పే సతీష్ బాబు.. ఐటీ సంస్థ కార్యకలాపాలు చూసుకునేవాడు. బుధవారం రాత్రి క్లాస్ ముగిసిన అనంతరం కార్యాలయానికి వచ్చాడు. 10.30 గంటల ప్రాంతంలో తన భార్యకు ఫోన్ చేసి ఇంటికి వస్తున్నట్లు చెప్పాడు. అర్ధరాత్రి దాటినా అతను ఇంటికి రాకపోవడంతో ప్రశాంతి అతడికి ఫోన్ చేయగా స్విచ్చాఫ్ వచ్చింది. గురువారం అతని ఆచూకీ తెలియకపోవడంతో కేపీహెచ్‌బీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మిస్సింగ్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. హేమంత్ సెల్‌ఫోన్ స్విచ్చాఫ్ చేయడంతో అనుమానం.. సతీష్ బాబుతో పాటు హేమంత్ ఫోన్ కూడా స్విచ్చాఫ్ రావటంతో అనుమానం వచ్చిన ప్రశాంతి పోలీసుల దృష్టికి తీసుకెళ్లింది. పోలీసులు హేమంత్ కోసం ఆరా తీయగా ఆచూకీ లభించలేదు. సెల్‌ఫోన్ టవర్ లొకేషన్ ద్వారా ఆధారంగా అతను కేపీహెచ్‌బీ 7వ ఫేజులో ఉన్నట్లు గుర్తించారు. హేమంత్ ఇంటికి వెళ్లిన పోలీసులకు దుర్వాసన రావడంతో తాళం పగులగొట్టి చూడగా సతీష్ దారుణంగా హత్యకు గురై కనిపించాడు. గొంతు కోసి ఉండటంతో పాటు కడుపు, కాళ్లపై కత్తిగాట్లున్నాయి. కుడికాలు మోకాలు వరకూ కట్‌చేసి ఉంది. ఇంట్లో పెద్ద ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్‌లు, పొడవాటి టీవీ అట్టపెట్టెలు కనిపించాయి. మృతదేహంపై ప్లాస్టిక్ కవర్ కప్పి ఉంది. దీంతో హేమంతే ఈ హత్య చేసి పరారైనట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. మిస్సింగ్ కేసును హత్య కేసుగా మార్చిన పోలీసులు నిందితుడి కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చేపట్టారు. హత్యకు ఆర్థిక లావాదేవీలే కారణమా? లేక ఇతర కారణాలున్నాయా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా, నాలుగు నెలల క్రితమే ఆఫీస్ సమీపంలో ఇండిపెండెంట్ హౌస్‌ను అద్దెకు తీసుకోవడం మొదలు సతీష్ బాబును ఇంటికి రప్పించి హత్య చేసే వరకూ పథకం ప్రకారమే సాగి ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. హత్య సమయంలో హేమంత్‌తో పాటు మరో మహిళ కూడా ఉన్నట్లు స్థానికులు పోలీసుల విచారణలో వెల్లడించారు. మరోవైపు నిందితుడి కోసం పోలీసులు బృందాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి. -
కోనేరు సతీష్బాబును విచారించిన సీబీఐ
రామవరప్పాడు /సాక్షి, అమరావతిబ్యూరో/నందిగామ : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన బీ ఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా హత్య కేసు విచారణను సీబీఐ వేగవంతం చేసింది. హత్యకేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కృష్ణాజిల్లా గూడవల్లి గ్రామ మాజీ సర్పంచ్, మాజీ మంత్రి కోనేరు రంగారావు మనవడు కోనేరు సతీష్బాబును ఆయన ఇంట్లో ఐదుగురు సభ్యులతో కూడిన సీబీఐ అధికారుల బృందం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9.30 గంటల వరకు విచారించింది. పలు అంశాల్లో ప్రశ్నలు సంధించి సమాధానాలు రాబట్టింది. రెండు అంతస్తుల్లోని బెడ్రూమ్లు, హాల్, బీరువా, సీక్రెట్ లాక్‌లను ఓపెన్ చేసి సోదాలు నిర్వహించింది. 9 గంటల పాటు సాగిన విచారణ, సోదాల్లో పలు వస్తువులను, కంప్యూటర్ హర్డ్ డిస్క్, ఫోన్ లిస్టుల బుక్, సీడీ, డైరీలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సతీష్, ఇంట్లో పనివారి వద్ద సెల్ఫోన్లు స్వాధీనం చేసుకుని ల్యాండ్లైన్ల ఫోన్ కనెక్షన్ కట్ చేశారు. కాగా తాను నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడానికి ఎటువంటి పరీక్షలకైనా సిద్ధమేనని సతీష్‌బాబు అన్నారు. బలవంతంగా ఒప్పించారు: సత్యంబాబు తనను బెదిరించి నేరం ఒప్పించారని ఈ కేసులో అభియోగాలు ఎదుర్కొని జైలుకు వెళ్లి నిర్దోషిగా విడుదలయిన సత్యంబాబు పేర్కొన్నారు. ఐదుగురు సభ్యులతో కూడిన సీబీఐ బృందం కంచికచర్ల మండలం అనాసాగరంలోని ఆయన ఇంట్లో సత్యంబాబును, కుటుంబ సభ్యులను విచారించి వాంగ్మూలాన్ని రికార్డు చేసింది. తాను నిర్దోషినని, అసలు ఆయేషా ఎవరో తనకు తెలియదని, హత్య ఎలా జరిగిందో తెలియదని, కేవలం విచారణ పేరుతో రాత్రి సమయంలో వచ్చి తనను తీసుకెళ్లారని చెప్పాడు. నేరం అంగీకరించాల్సిందిగా బలవంతం చేశారని, తాను అంగీకరించకపోవడంతో తన తల్లిని, చెల్లిని చంపేస్తామంటూ బెదిరించి మరీ ఒప్పించారని తెలిపాడు. ఈ క్రమంలో తనను శారీరకంగా, మానసికంగా పోలీసులు వేధించారని, నేరం అంగీకరించకపోతే ఎన్కౌంటర్ చేస్తామని బెదరించడంతో మరో గత్యంతరం లేక నేరాన్ని అంగీకరించానని సత్యంబాబు సీబీఐ అధికారుల వద్ద వాపోయాడు. సత్యంబాబు వాంగ్మూలాన్ని నమోదు చేసిన తరువాత ఆయేషా హత్యకు గురయిన ఇబ్రహీంపట్నంలోని లక్ష్మీదుర్గ హాస్టల్‌ను పరిశీలించారు. ఇప్పటికే ఆయేషామీరా కేసులో కీలకమైన సాక్ష్యాలు ధ్వంసం అయిన ఘటనలో ముగ్గురు విజయవాడ మహిళా కోర్టు సిబ్బందిపై సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సంగతి తెలిసిందే. -
విఐపి రిపోర్టర్ -హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ బాబు
-
‘కళింగ’ ఆశయం...
శ్రీహరి హీరోగా పోలీస్, దేవా, సాంబయ్య తదితర చిత్రాలు డెరైక్ట్ చేసిన కేయస్ నాగేశ్వరరావు తాజా ప్రయత్నం ‘కళింగ’. సతీశ్‌బాబు హీరోగా రూపొందనున్న ఈ చిత్రాన్ని మండవ శాంతిశ్రీ నిర్మించనున్నారు. భారీ నిర్మాణ వ్యయంతో, పూర్తి వాణిజ్య హంగులతో ఈ సినిమా చేయనున్నామని, విజయదశమి రోజున పాటల రికార్డింగ్ చేస్తామని నిర్మాత తెలిపారు. దర్శకుడు మాట్లాడుతూ -‘‘శ్రీహరి మార్కు సినిమా ఇది. శివనాగు అద్భుతమైన స్క్రిప్టు అందించారు. త్వరలోనే చిత్రీకరణ మొదలుపెడతాం. కళింగ అనే యువకుడు తన ఆశయాన్ని ఎలా నెరవేర్చుకున్నాడన్నది ఈ సినిమా ప్రధాన కథాంశం’’ అని చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: శ్రీ వెంకట్, కెమెరా: కిషన్ సాగర్, సమర్పణ: డి. రామ్మూర్తి తేజ, సహనిర్మాత: టి. లక్ష్మణరావు.