
‘‘చిత్తూరు జిల్లా మదనపల్లె పరిసర గ్రామంలో గంగమ్మ అమ్మవారి గుడి ఉంది. చుట్టుపక్కల 18 ఊళ్ల ప్రజలు ఈ గుడికి వచ్చి అమ్మవారిని కొలుస్తారు. ఆ అమ్మవారి గురించి తీసిన చిత్రమే ‘జాతర’. వాస్తవ ఘటనలకు ఫిక్షన్ యాడ్ చేసి ఈ చిత్రాన్ని రూపొందించాను. అమ్మవారి పట్ల రాక్షసుడిగా వ్యవహరిస్తున్న వ్యక్తిని హీరో ఎలా సంహరించాడు? అనేది మా చిత్రంలో చూపిస్తున్నాం’’ అని సతీష్ బాబు రాటకొండ చెప్పారు.
ఆయన హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘జాతర’. గల్లా మంజునాథ్ సమర్పణలో రాధాకృషా ్ణరెడ్డి, శివశంకర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 8న రిలీజ్ కానుంది. సతీష్ బాబు రాటకొండ మాట్లాడుతూ–‘‘ఈ సినిమా ఓ పెద్ద హీరోతో చేయాల్సింది. కుదరక నేనే హీరోగా చేశా. ఇందులో ప్రేమ కథ ఉంటుంది. మా నిర్మాతలు ఎంతో సపోర్ట్ చే శారు’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment