jatara
-
వాస్తవ ఘటనల జాతర
‘‘చిత్తూరు జిల్లా మదనపల్లె పరిసర గ్రామంలో గంగమ్మ అమ్మవారి గుడి ఉంది. చుట్టుపక్కల 18 ఊళ్ల ప్రజలు ఈ గుడికి వచ్చి అమ్మవారిని కొలుస్తారు. ఆ అమ్మవారి గురించి తీసిన చిత్రమే ‘జాతర’. వాస్తవ ఘటనలకు ఫిక్షన్ యాడ్ చేసి ఈ చిత్రాన్ని రూపొందించాను. అమ్మవారి పట్ల రాక్షసుడిగా వ్యవహరిస్తున్న వ్యక్తిని హీరో ఎలా సంహరించాడు? అనేది మా చిత్రంలో చూపిస్తున్నాం’’ అని సతీష్ బాబు రాటకొండ చెప్పారు.ఆయన హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘జాతర’. గల్లా మంజునాథ్ సమర్పణలో రాధాకృషా ్ణరెడ్డి, శివశంకర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 8న రిలీజ్ కానుంది. సతీష్ బాబు రాటకొండ మాట్లాడుతూ–‘‘ఈ సినిమా ఓ పెద్ద హీరోతో చేయాల్సింది. కుదరక నేనే హీరోగా చేశా. ఇందులో ప్రేమ కథ ఉంటుంది. మా నిర్మాతలు ఎంతో సపోర్ట్ చే శారు’’ అన్నారు. -
ఘనంగా తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతర (ఫొటోలు)
-
ఘనంగా ప్రారంభమైన గంగమ్మ జాతర
-
తిరుపతి గంగమ్మ జాతర తొలి రోజు బైరాగి వేషంతో భక్తుల సందడి (ఫొటోలు)
-
మాస్ జాతర
జాతరలో మాస్ ఫైట్ చేస్తున్నారు పుష్పరాజ్. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘పుష్ప’. ఈ చిత్రం తొలి భాగం ‘పుష్ప: ది రైజ్’ సూపర్ హిట్‌గా నిలిచింది. ప్రస్తుతం ‘పుష్ప’ మలిభాగం ‘పుష్ప: ది రూల్’ సినిమా షూట్‌తో బిజీగా ఉన్నారు అల్లు అర్జున్, సుకుమార్. ఈ చిత్రంలో పుష్పరాజ్ ΄ాత్రలో నటిస్తున్నారు అల్లు అర్జున్. ప్రజెంట్ ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్‌లోని ఓ స్టూడియోలో జరుగుతోంది. జాతర నేపథ్యంలో వచ్చే ఓ ΄ాట, ఆ జాతరకు ముడిపడి ఉన్న ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరిస్తున్నారని ఫిల్మ్‌నగర్ సమాచారం. ఈ జాతర బ్యాక్‌డ్రాప్ సీన్స్ అన్నీ ఇంట్రవెల్ సమయంలో రానున్నాయని భోగట్టా. రష్మికా మందన్నా హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో అనసూయ, సునీల్ కీలక ΄ాత్రలు ΄ోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 15న విడుదల కానుంది. -
AP: నలభై ఏళ్ల తర్వాత.. ఆ ఊరిలో జాతర
ఎన్టీఆర్: ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 46 సంవత్సరాల తరువాత జరగనుంది కృత్తివెన్ను మండలం సీతనపల్లి గ్రామదేవత వనువులమ్మ తల్లి మహోత్సవం. 1977వ సంవత్సరంలో చివరిసారిగా గ్రామంలో జాతర నిర్వహించినట్లు స్థానిక పెద్దలు చెబుతున్నారు. అప్పట్లో వచ్చిన చిన్నపాటి విభేదాల కారణంగా 46 ఏళ్లపాటు అమ్మవారి జాతర నిలిచిపోయింది. నాలుగు దశాబ్దాల పైబడి జాతర జరగకపోవడంతో నేటి తరం వారికి అసలు జాతర విశేషాలే తెలియకుండా పోయాయి. దీంతో గ్రామస్తులంతా ఐక్యంగా ముందుకు వచ్చి భావి తరాలకు గ్రామ సంస్కృతి, సంప్రదాయాలను తెలియజేయాలని జాతర మహోత్సవానికి శ్రీకారం చుట్టారు. గ్రామదేవత జాతరంటేనే తెలియని చిన్నారులు, యువత, తెలిసీతెలియని వయస్సులో జరిగిన జాతరను తిలకించిన నడివయస్కులు ఇప్పుడు జరగనున్న జాతర ఉత్సవాన్ని కనులారా తిలకించి తరించాలని ఉత్సాహంతో ఎదురుచూస్తున్నారు. ఈ నెల 27వ తేదీ నుంచి జాతర ప్రారంభం ఈ నెల 27వ తేదీ నుంచి అక్టోబరు 1వ తేదీ వరకు ఐదు రోజుల పాటు జాతర నిర్వహించనున్నట్లు జాతర కమిటీ సభ్యుడు అర్జంపూడి ఏసుబాబు తెలిపారు. 27న అమ్మవారిని గంగా స్నానం చేయించడంతో జాతరకు శ్రీకారం చుడతారు. 28, 29 తేదీలలో గ్రామంలో శ్రీ వనువులమ్మ తల్లికి విశేషమైన పాన్పులు వేస్తారు. 30వ తేదీ ఉదయం చలి నైవేద్యాలు, సాయంత్రం పూలకప్పిరి జరుగుతాయి. 1వ తేదీ ఆదివారం మొక్కుబడులు, నైవేద్యాలతో జాతర ముగుస్తుంది. 2వ తేదీన గ్రామంలో భారీ అన్నసమారాధన నిర్వహించనున్నట్లు తెలిపారు. శ్రీ వనువులమ్మతో పాటు గంగానమ్మ, మహాలక్ష్మమ్మ, మహంకాళమ్మ, పోతురాజులను సైతం కొలవనున్నారు. తోట వంశస్తులు పుట్టింటివారిగా, పోకలవారు అత్తింటి వారిగా అమ్మవారికి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారని కమిటీ సభ్యులు తెలిపారు. చాలా మంచి నిర్ణయం నాకు ఆరేళ్ల వయస్సులో జాతర జరిగింది. ఇప్పుడు జరగబోయే జాతర కోసం అందరం ఎదురు చూస్తున్నాం. ఇటువంటి పండుగలు, జాతరలను క్రమం తప్పకుండా చేయడం వల్ల గ్రామంలో ఐక్యత పెరగడంతో పాటు, బంధుత్వాలు బలపడతాయి. – తోట లవ కిషోర్, సీతనపల్లి మన సంస్కృతి తెలపాలి మా పిల్లలు చిన్నతనంలో జాతర చూశారు. మళ్లీ ఇన్నాళ్లకు జాతర చేయడం ఎంతో సంతోషంగా ఉంది. వనువులమ్మతో పాటు మిగిలిన దేవతలకు జాతర చేస్తారు. రేపటి తరాలకు నాటి సంస్కృతి, సంప్రదాయాలను తెలియజేయడం పెద్దవాళ్లగా మా బాధ్యత. – అర్జంపూడి సావిత్రమ్మ, సీతనపల్లి -
వైభవంగా గర్నిమిట్ట ఎల్లమ్మ జాతర
కేవీపల్లె: మండలంలోని గర్నిమిట్ట గ్రామదేవత ఎల్లమ్మ జాతర వైభవంగా నిర్వహించారు. మండలంలోని అన్ని గ్రామాల నుంచి మహిళలు బోనాలు తెచ్చి అమ్మవారికి స మర్పించారు. మండలం నుంచే గాక వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన చాందినీ బండ్లు, బళ్లారి డ్రమ్మ్, చెక్క భజన లు, కోలాటాలు, పిల్లనగ్రోవి ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. సోమవారం చాందినీబండ్లతో ప్రదక్షిణలు చేశారు. ముగిసిన సత్యమ్మ జాతర కలికిరి: పట్టణంలోని రామ్‌నగర్ కాలనీలో ఉన్న సత్యమ్మ ఆలయంలో జరుగుతున్న జాతర సోమవారంతో ముగిసింది. ఆదివారం రాత్రి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు అమ్మవారికి దీలు, బోనా లు సమర్పించారు. అన్నదానం చేశారు. ఘనంగా ఊంజల్ సేవ వాల్మీకిపురం: గ్రామదేవత నల్లవీర గంగాభవానీ అమ్మవారికి సోమవారం ఊంజల్ సేవ వైభవంగా నిర్వహించారు. కమిటీ సభ్యులు రాంకుమార్ రెడ్డి, రమణారెడ్డి, బలరాం, మహేష్, రవి, జనాస్వామి పాల్గొన్నారు. -
Sammakka Saralamma: వచ్చే ఏడాది మహాజాతరకు రూ. 75 కోట్లు
సాక్షి, వరంగల్: వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనున్న మేడారం సమ్మక్క–సారలమ్మ మహాజాతర కోసం రూ.75కోట్లు విడుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు మహాజాతరలో రోడ్లు, విద్యుత్, తాగునీటి సరఫరా, స్నానాల గదుల ఏర్పాటు తదితర మౌలిక సదుపాయాల కల్పన కోసం ఈ నిధులు ఖర్చు చేయనున్నారు. రెండేళ్లకోసారి నిర్వహించే జాతర సందర్భంగా ఇటీవల రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ఆధ్వర్యంలో కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జాతర నిర్వహణ, మౌలిక సదుపాయాల కల్పన కోసం రూ.110కోట్లు అవసరం ఉంటాయని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. వీటిని పరిశీలించిన ప్రభుత్వం రూ.75కోట్లు విడుదల చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. రెండేళ్ల క్రితం నిర్వహించిన జాతరకు సైతం ప్రభుత్వం రూ.75కోట్లు కేటాయించింది. -
ఎంతటి వారైనా.. బురద పూసుకోవాల్సిందే..!
రాంబిల్లి (యలమంచిలి): బురదమాంబ జాతర. ఎంతటివారైనా ఆ జాతర రోజున బురద పూయించుకోవాల్సిందే. వయసుతో సంబంధం ఉండదు. మగవారు మాత్రమే పాల్గొంటారు. ఆడవారికి మినహాయింపు ఉంటుంది. ఇటువంటి వింత జాతర రాంబిల్లి మండలం దిమిలి గ్రామంలో సోమవారం అర్ధరాత్రి దాటిన తరువాత ప్రారంభం అవుతుంది. మంగళవారం ఉదయం 10 గంటల వరకు కొనసాగుతుంది. వయసుతో సంబంధం లేకుండా.. జాతర రోజు గ్రామంలో ఉంటే ఎంతటివారైనా బురద పూయించుకోవాల్సిందే. వయసుతో సంబంధం లేకుండా మగవారికి డ్రైనేజీల్లో బురదను పూస్తారు. ఆ బురదను ఒకరిపై ఒకరు జల్లుకుంటూ కేరింతలు కొడతారు. ఎంతో ఉత్సాహంగా సాగే వింత పండగ. దల్లమాంబ జాతరలో భాగంగా అనుపు మహోత్సవం సందర్భంగా దిమిలిలో రెండేళ్లకోసారి ఈ జాతర నిర్వహిస్తారు. వేపకొమ్మలను ముంచి.. వేపకొమ్మలను మురుగుకాలువల్లో ముంచి బురదను ఒకరిపై ఒకరు పూసుకొని కేరింతలు కొడుతూ చిన్నారులు, యువకులు నృత్యాలు చేస్తారు. జాతర అనంతరం వేప కొమ్మలను అమ్మవారి ఆలయం వద్ద ఉంచి పూజలు చేస్తారు. కోరిన కోర్కెలు తీర్చే తల్లిగా, భక్తుల కొంగుబంగారంలా బురదమాంబ అమ్మవారిని గ్రామస్తులు కొలుస్తారు. బురద పూసుకున్నప్పటికీ ఎటువంటి చర్మవ్యాధులు సోకకపోవడం అమ్మవారి మహిమగా భక్తులు భావిస్తారు. ఈ జాతర నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేశారు. గ్రామ పురవీధుల్లో దల్లమాంబ అమ్మవారి ఘటాన్ని ఊరేగించి మంగళవారం రాత్రి ప్రత్యేక పూజలు పూర్తి చేయడంతో దల్లమాంబ ఉత్సవాలు ముగుస్తాయి. -
అమ్మ జాతర ఆరంభం
సాక్షి, విజయనగరం టౌన్: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం పైడితల్లి జాతరకు శనివారం అంకురార్పణ చేశారు. వేదపండితుల మంత్రోచ్ఛరణాల మధ్య వేకువజాము నుంచి అమ్మవారికి పంచామృతాలతో అభిషేకాలు, అర్చనలు జరిపారు. ముందుగా అమ్మవారి మండల దీక్షలను శాస్త్రోక్తంగా చేపట్టారు. అనంతరం ఉదయం 9.30 గంటలకు అమ్మవారి చదురుగుడి వద్ద పందిరిరాట వేశారు. 10.30 గంటలకు రైల్వేస్టేషన్ వద్ద ఉన్న వనంగుడి వద్ద పందిరిరాట వేసి జాతర మహోత్సవాలను ప్రారంభించారు. పైడితల్లి అమ్మవారి సిరిమాను పూజారి బంటుపల్లి వెంకటరావు ప్రత్యేకపూజలు చేసి, ఉత్సవానికి నాం దిపలికారు. సుమారు 200 మంది దీక్షాపరులు మాలధారణ చేశారు. రామవరంలో సాక్షాత్కరించిన సిరిమాను.. గంట్యాడ మండలం రామవరం గ్రామంలోని భవిరి వారి కల్లాల్లో పైడితల్లి అమ్మవారి సిరిమాను సాక్షాత్కరించింది. ఈ మేరకు పైడితల్లి అమ్మవారి దేవస్థానం అధికారులు, సిరిమా ను పూజారితో కలిసి ఆ ప్రదేశానికి వెళ్లారు. సిరిమాను, ఇరుసుమానుకు ప్రత్యేక పూజలు జరిపారు. ఈ సందర్భంగా సిరిమాను పూజారి వెంకటరావు మాట్లాడుతూ రామవరం గ్రామంలో భవిరి అప్పారావు, ముత్యాలు, శ్రీనివాసరావు కలాల్లో తల్లి సాక్షాత్కరించిందన్నారు. తమ గ్రామంలో సిరిమానును తల్లికోరుకుందని తెలుసుకున్న గ్రామస్తులు ఆ ప్రాంతానికి చేరుకునిచేరుకుని సిరిమాను, ఇరుసుమాను (చింతచెట్టు)లకు పూజలు చేశారు. పసుపు, కుంకుమలను సమర్పించారు. భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. తొలిరోజే ఎస్పీ రాజకుమారి స్వీయపర్యవేక్షణ.. గతంలో ఎన్నడూలేని విధంగా ఎస్పీ బి.రాజకుమారి శనివారం రాత్రి సిరిమాను తిరిగే హు కుం పేట నుంచి కోట జంక్షన్ వరకు తమ సిబ్బందితో కలిసి దాదాపు మూడు కిలోమీటర్ల మేర నడుచుకుంటూ స్వీయ పర్యవేక్షణ చేశారు. సిరిమాను తిరిగే ప్రదేశాల్లో ఎక్కడెక్కడ లోటుపాట్లు ఉంటాయో, వాటిని ఎలా అధిగమించాలో సంబంధిత అధికారులతోనడుస్తూనే సమీక్షించారు. ఈ సందర్భం గా ఆమె కోట జంక్షన్ వద్ద మాట్లాడుతూ అమ్మపండగను అందరూ ఎంతో ప్రశాం తమైన వాతావరణంలో నిర్వహించుకో వాలని, అందుకు జిల్లా పోలీస్‌శాఖ తొలి రోజు నుంచే కసరత్తు ప్రారంభించిందన్నారు. కొత్తగా జిల్లాకు వచ్చిన అధికా రులందరికీ అవగాహన కోసం ప్రతీ స్పాట్‌ను క్షుణ్ణంగా పరిశీలించామని, పూజారి వెంకటరావుని, ఆలయ అధికారులను అడిగి వివరాలు సేకరించామన్నారు. ఆమె వెంట అదనపు ఎస్పీ ఎన్.శ్రీదేవీరావు, ఓఎస్డీ రామ్మోహనరావు, డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలు, స్పెషల్ బ్రాంచ్ పోలీసులు పాల్గొన్నారు. అమ్మ సాక్షాత్కారం మా అదృష్టం.. పైడితల్లి మా కల్లాల్లో సాక్షాత్కరించడం మా గ్రామ అదృష్టంగా భావిస్తున్నాం. ఏటా క్రమం తప్పకుండా అమ్మను కుటుంబ సమేతంగా దర్శించుకుంటాం. పసుపు, కుంకుమలు సమర్పిస్తాం. గ్రామస్తులందరూ ఎంతో ఆనందంగా ఉన్నారు. పెద్దఎత్తున మా గ్రామంలో పండగ చేసుకుంటాం. – బవిరి అప్పారావు, తోట యజమాని 18 ఏళ్ల తర్వాత మరలా మాకు అదృష్టం.. పైడితల్లి అమ్మవారు 18 ఏళ్ల తర్వాత మరలా మా గ్రామంలో ఉన్న సిరిమానును కోరుకోవడం మా అదృష్టం. అప్పట్లో సరికోలు వారి కలాల్లో అమ్మ కోరుకుంది. మరలా ఇప్పుడు మా ఇంటికి పక్కనే బవిరి వారి కల్లాల్లో వెలిసిన మానును అమ్మ కోరుకుంది. మాకు ఇక రోజూ పండగే. ఈ ఏడాది అంగరంగ వైభవంగా తల్లి పండగను నిర్వహించుకుంటాం. – రొంగలి, సత్యవతి, ఈశ్వరమ్మ, గ్రామస్తులు -
అంబర మంటిన శంబరం
-
అయ్యో.. దేవా !
వాజేడు(భద్రాచలం) : తెలంగాణ–ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల సరిహద్దులోని లొట్టిపిట్టగండి వద్ద గుట్ట ల్లో కొలువైన భీరమయ్య(భీష్మశంకరుడు)ను కొలిచేందుకు భక్తులు ఏడాదికోసారి పోటెత్తుతున్నా అధికారులు మాత్రం అటువైపు కన్నెత్తి చూడడం లేదు. ఫలితంగా సౌకర్యాల లేమితో భక్తులు అవస్థలు పడుతున్నారు. వాజేడు మండల కేంద్రం నుంచి 21 కిలోమీటర్లు నడిచి వెళ్లి అక్కడి నుంచి 3 కిలోమీటర్లు గుట్ట(గాటీ)పైకి ఎక్కాల్సి ఉంటుంది. తెలంగాణ నుంచి ఛత్తీస్‌గఢ్‌కు(రెండు రాష్ట్రాల సరిహద్దులో) వెళ్లే రహదారిలో గుట్టపై భీరమయ్య కొలువై ఉన్నాడు. ఈ గుట్టపై అటు ప్రభుత్వం, ఇటు దేవాదాయ శాఖ ఎలాంటి సౌకర్యాలను కల్పించక పోవడంతో భక్తుల ఇబ్బందులు వర్ణణాతీతంగా మారాయి. కృష్ణాపురం పంచాయతీ పరిధిలోని టేకులగూడెం, కృష్ణాపురం, పెద్దగంగారం, కడేకల్ గ్రామాలకు చెందిన గిరి జనులు భీరమయ్యను పూజిస్తున్నారు. ప్రతీ ఏడాది ఏప్రిల్‌లో శ్రీరామనవమి తర్వాత వచ్చే పౌర్ణమి రోజు నుంచి జాత ర నిర్వహిస్తున్నారు. జాతర సమయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా గిరిజనులు ఏర్పాట్లు చేస్తున్నారు. అయినప్పటికీ అటు ప్రభుత్వం కాని ఇటు భద్రాచలం, ఏటూరునాగారం ఐటీడీఏ అధికారులు పట్టించుకోవడం లేదు. సౌకర్యాల లేమి.. భీష్మశంకరుడిని ఆరాధించే గిరిజనులే జాతర సమయంలో భక్తుల అవసరాల కోసం ఆయిల్ ఇంజన్ ద్వారా తాగునీటిని ఏర్పాటు చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఒక చేతి పంపును వేయించాలని ఎన్నిసార్లు గిరిజనులు, భక్తులు మొరపెట్టుకున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. గత సంవత్సరం పేరూరు ఎస్సైగా పనిచేసిన కాగితోజు శివప్రసాద్ చేతి పంపును రహదారి పక్కన వేయించారు. అదొక్కటే ప్రస్తుతం భక్తుల దాహార్తిని తీరుస్తోంది. మధ్యలో నిలిచిన గుడి నిర్మాణం.. సమీపంలోని నాలుగు గ్రామాల ప్రజలు భీరమయ్యకు గుడినిర్మాణం తలపెట్టా రు. నిధుల లేమి, ఇతర కారణాలతో గుడి నిర్మాణం అర్ధంతరంగా నిలిచిపోయింది. గిరిజనులు అధికారులకు, ఐటీడీఏకు ఎన్నిసార్లు మొర పెట్టుకున్నా పట్టించుకోలేదు. దీంతో గుడిమధ్యలోనే ఆగిపోయింది. అటు ఐటీడీఏ, ఇటు ప్ర భుత్వం నిధులను కేటాయించకపోవడంతో దానిని నిలిపివేశారు. దానికి సమీపంలో స్వామి వారిని ప్రతిష్టించిన ప్రాంతంలో చిన్నమందిరాన్ని పోలీసుల సహకారంతో నిర్మించి పూజలు చేస్తున్నారు. నిధులు మంజూరు చేయాలి.. భీరమయ్య గుడికి 2008లో భద్రాచలం ఐటీడీఏ నుంచి రూ 25 లక్షల నిధులను కేటాయించినట్లు అప్పట్లో ప్రచారం జరి గింది. అప్పట్లో గుడినిర్మాణంతోపాటు గుట్ట ప్రాంతంలో సౌకర్యాలు ఏర్పడుతాయని ఈ ప్రాంత ప్రజానీకం సంతో షించారు. కాని కాలక్రమేనా వాటి ఊసేలేకుండా పోయింది. దీంతో గుడికి నిధులు మంజూరు భ్రమగానే మిగిలింది. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ ఆలయాన్ని అభివృద్ధి చేయాలని భక్తులు కోరుతున్నారు. నిత్యం పూజలు.. రెండు రాష్ట్రాలకు సరిహద్దులో ఉండటంతోపాటు రద్దీగా ఉండే ప్రాంతం కావడంతో భక్తుల తాకిడి స్వామికి ఎక్కువగానే ఉంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిషా నుంచి భక్తులు ఎక్కువగా వస్తుంటారు. ఇక్కడ నిత్యం పూజలు జరుగుతూనే ఉంటాయి. ఈ ప్రాంతం నుంచి వెళ్లే ప్రతీ ఒక్కరూ స్వామిని దర్శించుకోకుండా వెళ్లరు. 31 నుంచి 2 వరకు జాతర.. ఈ నెల 31వ తేదీ నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు మూడు రోజులపాటు భీరమయ్య జాతరను నిర్వహించనున్నారు. అందుకు సంబంధించి టేకులగూడెం గ్రామస్తులు మైక్ ద్వారా ప్రచారం సాగిస్తున్నారు. ఈ జాతరకు గతంలో భద్రాచలం ఆర్టీసీ డిపో నుంచి ప్రత్యేక బస్సులను నడిపేవారు. మరి ఈ సంవత్సరం ఆ ఏర్పాట్లు చేస్తారా లేదా అనేది అనుమానంగా ఉంది. -
ఆ రెండు లక్షలు ఏమయ్యాయి..?
ఇల్లందకుంట(హుజూరాబాద్): ఇల్లందకుంట శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో 2017–18కుగాను జరిగిన జాతర వేలం పాటకు సంబంధించి రూ.రెండులక్షలు తేడాలొచ్చాయి. ఆ సమయంలో టెండర్ పాడిన అనుగం శివకుమార్ రూ.14, 85,232కు టెండర్ దక్కించుకున్నాడు. వాయిదాల పద్ధతిలో రూ.12లక్షలు చెల్లించాడు. మిగిలిన మొత్తంలో రూ.రెండు లక్షలను గత సంవత్సరం మే 7, 18న అప్పటి ఈవో సులోచనకు ఇచ్చానని, ఆ సమయంలో ల్లకాగితంపై రాసి ఇచ్చారని శివకుమార్ అంటున్నాడు. బయటపడిందిలా.. ఎప్పటిలాగే ఈ సంవత్సరం కూడా ఆలయంలో టెండర్లు పిలిచారు. ఇందులో శివకుమార్ కూడా పాల్గొన్నాడు. పాత డబ్బులు చెల్లించలేదని, అవి చెల్లించాకే టెండర్లో పాల్గొనాలని అధికారులు తేల్చిచెప్పారు. దీంతో శివకుమార్ అవాక్కయ్యాడు. తాను ఎప్పుడో డబ్బులు ముట్టజెప్పానంటూ అప్పటి ఈవో సులోచన రాసి ఇచ్చిన కాగితాన్ని చూపించాడు. అయినా వారు ససేమిరా అనడంతో ఈ విషయమై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు. ఈ విషయమై సులోచనను వివరణ కోరగా.. తాను డబ్బులు తీసుకుని రశీదు ఇచ్చానని పేర్కొన్నారు. -
ఎర్రబెల్లి జాతర షురూ..
నిడమనూరు : ఎర్రబెల్లి లింగమంతుల జాతర శనివారం రాత్రి వైభవంగా ప్రారంభమైంది. గ్రామస్తుల మందగంప సమర్పణతో జాతరకు శ్రీకారం చుట్టారు. శనివారం నుంచి మంగళవారం వరకు నాలుగు రోజుల పాటు జాతర సాగుతుంది. ఆదివారం రాత్రి వివిధ గ్రామాలకు చెందిన భక్తులు తల్లిగంపను తెస్తారు. ఎర్రబెల్లి గ్రామానికి చెందిన అన్ని కులాలకు చెందిన ప్రజలు మందగంపను దేవతకు సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ మన్నెం లింగయ్యయాదవ్ ప్రత్యేక పూజలు చేశారు. తల్లిగంప సమర్పణ.. లింగమంతులస్వామి జాతరలో భాగంగా రెండో రోజు ఆదివారం రాత్రి తల్లి గంపను సమర్పించారు. మందగంపను ఎర్రబెల్లి గ్రామస్తులు మాత్రమే తెస్తారు. కానీ తల్లిగంపను ఇతర గ్రామాలకు చెందిన చెంచు కులానికి చెందిన భక్తులు తెచ్చి మాణిక్యాలదేవికి సమర్పిస్తారు. జాతర వద్ద భక్తుల సందడి.. జాతర సందర్భంగా యాదవులు గజ్జెల లాగులు, చేతిలో కత్తులు(అవసరాలు)తో విన్యాసాలు చేశారు. పలువురు అవసరాల తయారీ, పాత వాటిని కొత్తగా చేయడం, వంటి పనిలో నిమగ్నమయ్యారు. జాతర సందర్భంగా గుట్ట వద్ద ఏర్పాటు చేసిన దుకాణాల వద్ద భక్తుల రద్దీ కనిపిస్తుంది. పోలీస్ బందోబస్తు.. జాతర సందర్భంగా.. ఏఎస్ఐ లతీఫ్‌బాబా ఆధ్వర్యంలో జాతర పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీసులతో పాటు మహిళా కానిస్టేబుల్, హోంగార్డులు సైతం విధులు నిర్వహిస్తున్నారు. సోమవారం సీఐ, నలుగురు ఎస్ఐలతో పాటు మొత్తం 80మంది బందోబస్తు నిర్వహించనున్నారు. -
విశాఖ నూక తాత జాతరలో వింత ఆచారం
-
శివరాత్రికి ముస్తాబవుతున్న వేములవాడ
-
భక్తుల కల్పవల్లి.. ఎల్లమ్మ తల్లి
మావురాల మాతల్లిగా.. పేదింటి ఎల్లమ్మగా.. పసుపు బండారు తల్లిగా.. పేదల ఇలవేల్పుగా.. పోలెపల్లి ఎల్లమ్మ దేవత.. భక్తుల కొంగుబంగారంగా వెలుగొందుతున్నారు. కొన్ని శతాబ్దాలుగా భక్తులు ఆరాధిస్తున్నారు. పోలెపల్లి తల్లి దర్శనానికి ఏటేటా భక్తుల సంఖ్య పెరుగుతూనే ఉంది. బొంరాస్‌పేట మండలం శివారులోని మహబూబ్‌నగర్ జిల్లా కోస్గి మండలం పోలెపల్లి గ్రామంలో ఎల్లమ్మమాత కొలువై ఉన్నారు. ఈనెల 8 నుంచి 10 వరకు మూడు రోజుల పాటు పెద్ద ఎత్తున బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రత్యేక కథనం. బొంరాస్‌పేట(కొడంగల్): దేవస్థానం ఏర్పాటుకు ముందునుంచి ఓ పూర్వగాథ ప్రచారంలో ఉంది. 5 శతాబ్దాల క్రితం.. ఈ దేవస్థానం స్థలంలో రైతు గడెంపనులు చేస్తున్నారు. భూమి చదును చేసేందుకు తన గుంటకపై ఓ రాతిని ఉంచి, పనులు పూర్తిగానే సాయంత్రం ఆ రాతిని గట్టున ఉంచి వెళ్లేవారట. మరునాడు వచ్చేసరికి గట్టున ఉంచిన రాయి పొలం నడిబొడ్డున ఉండటం చూసి ఆశ్చర్యపోగా, ఇలా పలుమార్లు జరుగగా రైతు పరికించి చూశాడు. ఒకనాడు రైతుకు.. ‘మహిమగల మావురాల తల్లిని నేను. ఇక్కడే స్థిర నివాసముండి భక్తుల కోర్కెలు తీరుస్తూ పూజలందుకుంటాను. ఆలయం నిర్మించు భక్తుడా’.. అంటూ రైతుకు కలలో వచ్చి ఎల్లమ్మ దేవత చెప్పిందట. నాడు చిన్నపాటి గుడిని ఏర్పాటు చేయగా ప్రస్తుతం ఇంతింతై దేవస్థానంగా లక్షలాది భక్తుల పూజలందుకోవడం విశేషం. బోనపు నైవేద్యాలు జాతరలో ప్రత్యేకంగా బోనాలు, బ్యాండుమేళాలు, డప్పులతో, పూనకాలతో అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేస్తారు. నుదుటికి పసుపు, కుంకుమ తిలకాలు, తెల్లని, పసుపురంగు వస్త్రాలు ధరించి తమ ప్రత్యేక భక్తిని చాటుకుంటారు. బారులుతీరుతూ, గుంపులు గుంపులుగా బోనాల శ్రేణులు దేవస్థానంలో సందడి చేస్తాయి. ఈజాతరలో బోనాల పూజలు ప్రత్యేకం. షోలాపూర్ భక్తుల ప్రత్యేకం.. జాతర భ్రహ్మోత్సవాలకు ప్రతియేటా తెలంగాణ ప్రాంతంలోని భక్తులతోపాటు మçహారాష్ట్ర, కర్ణాటక, బీవండి, షోలాపూర్ తదితర ప్రాంత్రాల నుంచి భక్తులు వేల సంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. సకుటుంబంగా వచ్చి పూజల్లో, సిడే కార్యక్రమాల్లో షోలాపూర్ భక్తుల సేవలు, పూజలు ప్రత్యేకంగా నిలుస్తాయి. వారంలో మూడు రోజులు.. ఆలయంలో జాతర సమయంలోనే కాకుండా ప్రతి ఆదివారం, మంగళవారం, శుక్రవారం వివిధ ప్రాంతాల నుంచి భారీగా వచ్చి ప్రత్యే పూజలు, మొక్కులు తీర్చుకుంటున్నారు. ఈ మూడు రోజులు ఆలయం భక్తులతో కిటకిటలాడుతుంది. సిడే ఘట్టమే ప్రధానం.. బ్రహ్మోత్సవాల్లో రెండో రోజు శుక్రవారం సాయంత్రం జరిగే ‘సిడే’ ఘట్టం ప్రత్యేకను చాటుతోంది. ఈ ఘట్టమే మావురాల తల్లికి మకుటంగా నిలుస్తోంది. దీన్ని తిలకించి తరించడానికి లక్షలాది భక్తులు తరలివస్తారు. అమ్మవారి విగ్రహాన్ని ప్రత్యేకంగా తయారు చేసిన సిడేపై తొట్లాలలో ఉంచి దాదాపు 50 అడుగుల ఎత్తులో ఉంచి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. గవ్వల బండారు చల్లుతూ భక్తులు తమమొక్కులు తీర్చుకుంటారు. జాతర కార్యక్రమాలు ఈ నెల 8 నుంచి మూడు రోజుల పాటు జాతర బ్రహ్మోత్సవాల కార్యక్రమాలు జరగనున్నాయి. గురువారం రాత్రి పల్లకీసేవ (వేంచేపు కార్యక్రమం) కొనసాగుతుంది. ఈ కార్యక్రమంతో ఊరిలో నుంచి ఆలయానికి అమ్మవారు చేరుకుంటారు. శుక్రవారం జాతర ప్రధానఘట్టమైన సిడే(రథోత్సవం) కార్యక్రమం సాయంత్రం ఉంటుంది. శనివారం ఉదయం తేరులాగే కార్యక్రమం, ఆదివారం భక్తుల ప్రత్యేక పూజలతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయని దేవాలయ మేనేజరు రాజేందర్‌రెడ్డి తెలిపారు. అమ్మవారి మహిమ.. పాపాలను రూపుమాపే ‘పసుపు బండారు’ ఎల్లమ్మ దేవత జాతరకు శాస్త్రీయ నేపథ్యం ఉందని చెప్పవచ్చు. పూర్వం వైద్యశాస్త్రం ఇంతగా అభివద్ధి చెందని కాలంలో ఆయుర్వేద వైద్యమే అందుబాటులే ఉండేది. తట్టు, మసూచి వంటి చర్మవ్యాధులకు వేపాకులు, పసుపు చికిత్సకు ఉపయోగించడం పరిపాటిగా ఉండేది. గ్రామదేవతల్లో ఒకరైన ఎల్లమ్మ ఇలాంటి వ్యాధులకు చికిత్స చేసేదనే నానుడికి ఎల్లమ్మ జాతరలో వేప ఆకులతో పూనకాలు, పసుపు బండారుతో పూజలు చేయడం అందుకు నిదర్శనం. అమ్మవారి పసుపు బండారు, వేపాకుల ధరింపుతో రోగాలు, పాపాలు తొలగిపోతాయని అమ్మవారి భక్తుల విశ్వాసం. అప్పటినుంచి పోలెపల్లి ఎల్లమ్మ దేవతను ఇలవేల్పుగా కొలుస్తున్నారు. మరో జోగులాంబ దేవస్థానం ఆలయ అభివృద్ధి కోసం గతేడాది దేవాదాయ శాఖ నుంచి రూ. 25లక్షలు మంజూరుకాగా భక్తులు, దాతల సహకారంతో ఆలయ నిర్మాణం, మండపాలు నిర్మించాం. అమ్మవారి ఆశీర్వాదంతో నా సొంత ఖర్చులతో భక్తులకు విశాలమైన ప్రాంగణంతోపాటు ఆలయ శిఖరం కొత్త హంగులతో అలంపూర్ జోగిలాంబను తలపించే విధంగా నిర్మించాం. జాతరలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశాం. పెద్ద ఎత్తున పోలీసు బలగాలు మోహరించనున్నాయి. – ముచ్చటి వెంకటేశ్, ఆలయకమిటీ చైర్మన్, -
భిక్షమేస్తేనే వదిలేస్తా
సాక్షి, జయశంకర్ భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగడ మండలం తిరుమలగిరి బుగులోని వెంకటేశ్వర స్వామి జాతర.. అక్కడ భిక్షాటన చేసే వ్యక్తి జాతరకు వచ్చిన వారిని ధర్మం చేయమని కాలు పట్టుకుని వదలకుండా చెమటలు పట్టించాడు. జాతరకు వచ్చిన ఓ యువకుడి కాలు పట్టుకుని వదలకుండా డబ్బులు ఇవ్వమని పట్టుబట్టాడు. సదరు యువకుడు డబ్బులు ఇచ్చేవరకు వదలలేదు. ప్రశాంతంగా దైవ దర్శనం కోసం వస్తే.. ఈ భిక్షగాళ్ల గోల భరించలేకపోతున్నామని భక్తులు వాపోతున్నారు. జాతరకు వచ్చిన భక్తులతో భిక్షగాడు చేసిన ఈ తతంగం అంతా ’సాక్షి’ క్లిక్ మనిపించింది. ఫొటోగ్రాఫర్: గుర్రం సంపత్ గౌడ్ -
వైభవంగా మరిడమ్మ జాతర
ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్ సూరిబాబురాజు ఆకట్టుకున్న బ్యాండ్ మేళాలు, కోలాటాలు పెద్దాపురం : కోరిన కోర్కెలు తీర్చే ఇలవేల్పుగా ఉభయ రాష్ట్రాల్లో ప్రసిద్ధి చెందిన పెద్దాపురం మరిడమ్మ జాతర శుక్రవారం రాత్రి వైభవంగా ప్రారంభమైంది. ఆషాఢమాసంలో 37 రోజుల పాటు నిర్వహించే మహోత్సవాల్లో భాగంగా గరగల నృత్యం, అమ్మవారి రథం, బ్యాండ్ మేళాలు, కోలాటం మధ్య సాగింది. రాత్రి 8.30 గంటలకు మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబు రాజు, ఆలయ ట్రస్టీ చింతపల్లి బ్రహ్మాజీలు జాతరను ప్రారంభించారు. మున్సిపల్ చైర్మన్ సూరిబాబు రాజుకు ఆలయ అసిస్టెంట్ కమిషనర్ ఆర్.పుష్పనాథం వేదమంత్రాల నడుమ ఘన స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకుని కొబ్బరికాయ కొట్టి చైర్మన్ జాతరను ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానన్నారు. యాత్రికులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని పుష్పనాథంను ఆదేశించారు. మరిడమ్మ ఆలయానికి ఎదురుగా ఉన్న మనోజ్ చెరువును వచ్చే ఏడాది జాతర సమయానికి బ్లోట్‌క్లబ్ మాదిరి తీర్చిదిద్దేందుకు చర్యలు చేపడుతున్నట్లు సూరిబాబు రాజు వెల్లడించారు. అనంతరం అమ్మవారి గరగల నత్యం, కోలాటం, పులి ఆట, సంబరాల్లోని పలు సాంస్కృతిక కార్యక్రమాలను మంత్రి తిలకించారు. తొలుత ఆయన పాత పెద్దాపురం (కోటముందు) పురాతన చరిత్ర కలిగిన మరిడమ్మ అమ్మవారి ఆలయంలో గరగ ఎత్తి పాత పెద్దాపురం సంబంరాన్ని ప్రారంభించారు. మున్సిపల్ వైస్ చైర్మన్ కురుపూరి రాజు, తూతిక రాజు, బొడ్డు బంగారుబాబు, ఆకుల కృష్ణ బాపూజీ, వాసంశెట్టి గంగ, వంగలపూడి సతీష్, శివకృష్ణ, అ«ధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. -
రమణీయం..రంగనాథుడి రథోత్సవం
జూపాడుబంగ్లా: బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం స్వామివారి తర్తూరు శ్రీలక్ష్మీరంగనాథ స్వామి రథోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయంలో స్వామి వారిని బంగారు తొడుగుతో అలంకరించి పట్టువస్త్రాలతో ముస్తాబు చేశారు. అనంతరం స్వామివారి ఉత్సవ విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రత్యేకంగా అలంకరించిన పల్లకీలో కొలువుంచారు. గ్రామంలోని ఆలయాల వద్దకు తీసుకెళ్లి పూజలు జరిపారు. అనంతరం బంతి, మల్లె, సంపెంగ తదితర పూలతో దేదీప్యమానంగా అలంకరించిన రథంపై స్వామివారిని అధిష్టింపజేశారు. ఆయకట్టుదారులైన కుమ్మరులు బోనం తీసుకొచ్చారు. రథం ముందు పూర్ణాహుతి బలిని ఇచ్చారు. ఆలయ పూజారి నాగిరెడ్డి కుమారుడు ఈశ్వరరెడ్డి స్వామివారి రథానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే ఐజయ్య, టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ మాండ్ర శివానందరెడ్డి, సర్పంచ్ లక్ష్మిదేవమ్మ, ఆలయ ఈఓ సుబ్రమణ్యం నాయుడు, కమిటీ చైర్మన్ రాయపు చిన్నరంగారెడ్డి... రథంలోని స్వామివారికి, రథానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి రథాన్ని జయ జయ ధ్వానాల మధ్య గోవింద నామాన్ని స్మరిస్తూ ముందుకు కదిలించారు. భక్తులు.. స్వామివారి రథోత్సవాన్ని తిలకించి తన్మయత్వంతో ఊగిపోయారు. రథాన్ని రథశాల నుంచి 100 మీటర్ల దూరం లాగి తిరిగి వెనక్కి తెచ్చి రథశాల వద్దకు చేర్చారు. మండే ఎండలను లెక్కచేయకుండా రథోత్సవాన్ని కనులారా తిలకించేందుకు జిల్లా నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. ఉత్సవంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా డీఎస్పీ వినోద్‌కుమార్, నందికొట్కూరు సీఐ శ్రీనాథ్‌రెడ్డి అధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు. -
ఒంగోలు గిత్తలు అ‘ధర’హో
- రూ.1.41 లక్షలకు విక్రయం ఎమ్మిగనూరు రూరల్: శ్రీ నీలకంఠేశ్వరస్వామి జాతరలో రెండు ఒంగోలు గిత్తలు రూ. 1.41 లక్షల ధర పలికాయి. సోమవారం కోసిగి మండలం దొడ్డి బెళగల్ గ్రామానికి చెందిన రైతు పెద్ద తిమ్మప్ప తన ఒంగోలు గిత్తలను విక్రయించేందుకు ఎమ్మిగనూరుకు తీసుకువచ్చాడు. వీటిని తెలంగాణ రాష్ట్ర ఐజ మండలం మేడకుంద గ్రామానికి చెందిన ఈరన్న అనే రైతు.. రూ. 1.41 లక్షలకు కొనుగోలు చేశాడు. ఇంత ధర పలకటం చాలా సంతోషంగా ఉందని రైతు తిమ్మప్ప తెలిపారు. -
వైభవంగా గంగమ్మతల్లి బోనాలు
కరీంనగర్ కల్చరల్ : డప్పుచప్పుళ్లు, పూనకాలు, వేపమండలు, తలపై బోనాలతో కరీంనగర్లో ఆదివారం గంగమ్మ బోనాలు వైభవంగా సాగాయి. నగరంలోని వివిధ కాలనీలకు చెందిన గంగపుత్ర సంఘాల ఆధ్వర్యంలో జరిగిన ఈ బోనాల జాతరలో గంగపుత్ర కులస్తులు, మహిళలు నెత్తిన బోనాలతో అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు. మానేరు జలాశయం వద్ద గల గంగమ్మ తల్లి ఆలయం వద్ద జరిగిన పూజల్లో రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్, జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమ, ఎంపీ వినోద్‌కుమార్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మాజీ మేయర్ శంకర్, కార్పొరేటర్లు పాల్గొన్నారు. -
నాట్యమనోహరంగా..
పీఎంపాలెం : సాయంసంధ్యవేళ...చిన్నారుల చేసిన నత్యాలు కమ్మని కాఫీ తాగేటట్టు అనిపించాయి. వారంతపు వినోద కార్యక్రమంలో భాగంగా ఆదివారం సాయంత్రం శిల్పారామం (జాతర)లో ఊహానిఖిత, రజని,తేజస్విని,జ్యోత్స్నల ప్రదర్శన కనువిందు చేసింది. కూచిపూడి, జానపద నత్యాలు అబ్బురపరిచాయి. ఆహూతులంతా ప్రదర్శనలు తిలకించి ముగ్ధులయ్యారు. -
బోనం శోభాయమానం
-
స్టేజి ప్రోగ్రాంలు ఇవ్వడం చాలా కష్టం
సినీ నటుడు సుమన్ కళాకారులకు సత్కారం శ్రీరంగపట్నం : సినిమాల్లో యాక్షన్ చేయడం సులువేనని, స్టేజీ ప్రోగ్రాంలు ఇవ్వడం మాత్రం చాలా కష్టమని ప్రముఖ సినీ నటుడు సుమన్ అన్నారు. కోరుకొండ మండలం శ్రీరంగపట్నం గ్రామంలోని శ్రీ మోదకొండమ్మ అమ్మవారి ఆలయం వద్ద ఆలయ కమిటీ సమక్షంలో కళాకారుల ప్రదర్శన, అభినందన సభ శనివారం జరిగింది. ఈ సందర్భంగా సుమన్ మాట్లాడుతూ, వివిధ వేషాలతో పలువురిని అలరిస్తున్న కళాకారులను సత్కరించడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. శ్రీరంగపట్నం గ్రామం కళాకారులకు పుట్టినిల్లుగా పేరొందిందన్నారు. తాను ఇప్పటి వరకూ 400 సినిమాల్లో నటించానని, ఇందుకు అభిమానులు, పెద్దల ఆశీర్వాదాలే కారణమని అన్నారు. అన్నమయ్య, శ్రీరామదాసు వంటి మంచి చిత్రాల్లో నటించానని చెప్పారు. రానున్న రోజుల్లో మరిన్ని సినిమాలు చేయాలని ఆశిస్తున్నానని సుమన్ అన్నారు. వైఎస్సార్ సీపీ కేంద్ర పాలక మండలి సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి మాట్లాడుతూ, కళాకారులకు ప్రభుత్వపరంగా అన్ని రాయితీలూ వచ్చేలా కృషి చేస్తానన్నారు. తాను ఆహ్వానించిన వెంటనే వచ్చిన సుమన్‌ను అభినందించారు. అంతకుముందు సుమన్‌కు గ్రామంలో వందలాది మంది స్వాగతం పలికారు. ఆలయ కమిటీ నాయకులు, కళాకారుల నాయకులు సూరిశెట్టి భద్రం, సూరిశెట్టి అప్పలస్వామి, మద్దాల రమణ, పెంటకోటి సూర్యనారాయణ, బొడ్డేటి కొండబ్బాయి, వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ వుల్లి బుజ్జిబాబు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.