ఒంగోలు గిత్తలు అ‘ధర’హో
ఒంగోలు గిత్తలు అ‘ధర’హో
Published Tue, Jan 17 2017 12:09 AM | Last Updated on Tue, Sep 5 2017 1:21 AM
- రూ.1.41 లక్షలకు విక్రయం
ఎమ్మిగనూరు రూరల్: శ్రీ నీలకంఠేశ్వరస్వామి జాతరలో రెండు ఒంగోలు గిత్తలు రూ. 1.41 లక్షల ధర పలికాయి. సోమవారం కోసిగి మండలం దొడ్డి బెళగల్ గ్రామానికి చెందిన రైతు పెద్ద తిమ్మప్ప తన ఒంగోలు గిత్తలను విక్రయించేందుకు ఎమ్మిగనూరుకు తీసుకువచ్చాడు. వీటిని తెలంగాణ రాష్ట్ర ఐజ మండలం మేడకుంద గ్రామానికి చెందిన ఈరన్న అనే రైతు.. రూ. 1.41 లక్షలకు కొనుగోలు చేశాడు. ఇంత ధర పలకటం చాలా సంతోషంగా ఉందని రైతు తిమ్మప్ప తెలిపారు.
Advertisement
Advertisement