ongole gitta
-
ఒంగోలు గిత్తలకు పూర్వ వైభవం.. గుండెలదిరే రంకెలు, చూపులో కసి..
ఒంగోలు గిత్త.. బలీయమైన దేహం. గుండెలదిరే రంకెలు. చూపులో కసి.. ఉట్టిపడే రాజసం. ఎంతటి బరువునైనా సులభంగా లాగేసే జబ్బబలం.. దీని సొంతం. ఒక్కసారి రంకే వేసి కదనరంగంలోకి దిగితే ఇక అంతే. పౌరుషానికి మారుపేరైన ఈ గిత్తలు ప్రకాశం జిల్లా సొంతం. గత పాలకుల నిర్లక్ష్యంతో వీటి ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వీటికి పూర్వవైభవం తీసుకువచ్చేందుకు చర్యలు చేపట్టింది. చదలవాడ పశుక్షేత్రం ద్వారా వీటిని సంరక్షించే చర్యలు చేపట్టింది. ఏటా వీటి సంపద పెరుగతూ వస్తోంది. నూతన సాంకేతిక విధానంతో యాంబ్రియో పద్ధతి ద్వారా దేశంలో మంచి పేరున్న గిర్ ఆవు పిండాలను ఒంగోలు జాతి ఆవుల్లో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టారు. ఇక గిర్ గిత్తలు రంకెలు వేయనున్నాయి. సాక్షి, ఒంగోలు: ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందిన ఒంగోలు గిత్తల జాతి గత పాలకుల నిర్లక్ష్యంతో అంతరించే దశకు చేరుకుంది. 2004 సంవత్సరం తర్వాత అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఈ జాతి గిత్తల వృద్ధికి ప్రత్యేక శ్రద్ధ కనబరిచి నిధులు విడుదల చేశారు. మళ్లీ ఇప్పుడు ఆయన తనయుడు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఒంగోలు జాతి రక్షణకు దృష్టిసారించారు. క్షేత్రంలో 326 పశువులు... చదలవాడ పశుక్షేత్రంలో ఇప్పటి వరకు 326 పశువులున్నాయి. వీటిలో పాలిచ్చే ఆవులు 72, చూడివి 54, ఒట్టిపోయిన ఆవులు 24, మిగిలినవి ఏడాది నుంచి మూడేళ్లలోపు లేగ దూడలు ఉన్నాయి. క్షేత్రంలో ఏడాదికి 120 కోడె దూడలు ఉత్పత్తి చేశారు. వాటిలో 50 ఆవు దూడలు, 70 కోడెదూడలు. గతేడాది రాష్ట్రీయ గోకుల్ మిషన్ కింద జిల్లాలోని పశ్ఛిమ ప్రాంత రైతులకు 43 కోడెదూడలు ఉచితంగా అందజేశారు. మరో 12 ఒంగోలు జాతి కోడె దూడలు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి. మరో 29 కోడె దూడలను గుంటూరు జిల్లా నకిరేకల్ కోడెదూడల ఉత్పత్తి క్షేత్రానికి పంపించారు. గడిచిన మూడేళ్లుగా.. గత టీడీపీ ప్రభుత్వం ఒంగోలు జాతి పశువులను కాపాడాలన్న విషయాన్ని పూర్తిగా గాలికొదిసింది. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం గడిచిన మూడేళ్లలో భారీగా నిధలు కేటాయించింది. క్రమేణా వీటి సంతతి పెరుగుదలకు ప్రత్యేక చర్యలు తీసుకుంది. మేలైన ఆవుల అండాల ఉత్పత్తి కోసం ప్రత్యేకంగా గుజరాత్ నుంచి యంత్రాన్ని తెప్పించారు. సేకరించిన అండాల నిల్వ కోసం ప్రత్యేక ల్యాబ్‌ను కూడా అభివృద్ధి చేశారు. నిధులు పుష్కలం... రాష్ట్ర ప్రభుత్వం సుమారు నాలుగు కోట్ల రూపాయల నిధులు విడుదల చేయడంతో చదలవాడ పశుక్షేత్రంలో అభివృద్ధి పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. పశువుల సం«ఖ్య అధికమవుతుండటంతో రూ.2 కోట్లతో నాలుగు నూతన షెడ్లు ఏర్పాటు చేశారు. పాలనా అవసరాల కోసం రూ.70 లక్షలతో పరిపాలన భవనం, వీటితో పాటు మరో రూ.40 లక్షలతో అంతర్గత రోడ్లు ఏర్పాటు చేశారు. రూ.10 లక్షలతో సోలార్ లైట్లు ఏర్పాటు చేయడంతో క్షేత్రంలో వెలుగులు విరజిమ్ముతున్నాయి. అంతేగాకుండా గోచార్ పథకంలో భాగంగా క్షేత్రంలో భూమి అభివృద్ధి కోసం ప్రభుత్వం రూ.52 లక్షలు ఖర్చు చేయనుంది. ప్రయోగాత్మకంగా యాంబ్రియో.. యాంబ్రియో(పిండం) పద్ధతి అంటే మేలు జాతి ఎద్దు, ఆవు పిండాలను కలగలిపి నేరుగా వేరే ఆవు గర్భంలో ప్రవేశ పెట్టడమే. మనుషుల్లో సరోగసీ ఎలాగో పశువుల్లో యాంబ్రియో అలానే. దీనికోసం కొత్త సాంకేతికతను చదలవాడ పశుక్షేత్రంలో విజయవంతంగా అమలు చేశారు. దేశంలో మంచి పేరున్న గుజరాత్‌కు చెందిన గిర్ జాతి ఆవు నుంచి సేకరించిన పిండాలను ఒంగోలు జాతి ఆవులో ప్రవేశపెట్టారు. ఇలా ఈ ఏడాది జనవరి నెలలో ఆరు పశువుపై ప్రయోగం చేశారు. వాటిలో ఒకటి విజయవంతంగా చూడి కట్టింది. దీంతో ప్రస్తుతం ఒక ఆవు ఈ నెలాఖరుకు ఈన వచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. మేలైన ఒంగోలు జాతి పశువుల ఉత్పత్తే లక్ష్యం ప్రభుత్వం పుష్కలంగా నిధులు కేటాయించడంతో ఒంగోలు జాతి పశువులను ఉత్పత్తి చేస్తున్నాం. గతంలో ఉన్న కష్టాలు ప్రస్తుతం తొలగిపోయాయి. పశుక్షేత్రంలో ఇప్పటికే మౌలిక వసతులు కల్పించారు. యాంబ్రియో పద్ధతి ద్వారా మేలు జాతి పశువుల ఉత్పత్తి కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నాం. – బి.రవి, డిప్యూటీ డైరెక్టర్, చదలవాడ పశుక్షేత్రం ఉచితంగా ఒంగోలు జాతి కోడె దూడ ఇచ్చారు ఒంగోలు ఆవు జాతి, ఒంగోలు గిత్తలను పెంపొందించటానికి రాష్ట్ర ప్రభుత్వం ఒంగోలు జాతి కోడె దూడను నాలుగు నెలల క్రితం ఉచితంగా ఇచ్చింది. అప్పటికే ఏడాది పాటు దాని పోషణ చేసిన తర్వాత రైతుగా, పశుపోషకునిగా ఉన్న నాకు దానిని అందజేశారు. ఒంగోలు పశుగణాభివృద్ధి సంస్థ అధికారులు రాష్ట్రీయ గోకుల్ మిషన్ పథకం ద్వారా అందజేశారు. దాణా, మందులు కూడా ఇచ్చారు. ఆవులను దాటడానికి విత్తనపు గిత్తగా దీనిని తయారు చేస్తున్నాం. నాకు నాలుగు ఆవులు ఉన్నాయి. గ్రామంలోని అందరి పశుపోషకుల ఆవులను దాటించడానికి దానిని వినియోగిస్తాం. తద్వారా ఒంగోలు జాతి ఉత్పత్తిని పెంపొందిస్తాం. – గుండారెడ్డి మల్లికార్జునరెడ్డి, రైతు, చినదోర్నాల -
ఒంగోలు గిత్తలు అ‘ధర’హో
- రూ.1.41 లక్షలకు విక్రయం ఎమ్మిగనూరు రూరల్: శ్రీ నీలకంఠేశ్వరస్వామి జాతరలో రెండు ఒంగోలు గిత్తలు రూ. 1.41 లక్షల ధర పలికాయి. సోమవారం కోసిగి మండలం దొడ్డి బెళగల్ గ్రామానికి చెందిన రైతు పెద్ద తిమ్మప్ప తన ఒంగోలు గిత్తలను విక్రయించేందుకు ఎమ్మిగనూరుకు తీసుకువచ్చాడు. వీటిని తెలంగాణ రాష్ట్ర ఐజ మండలం మేడకుంద గ్రామానికి చెందిన ఈరన్న అనే రైతు.. రూ. 1.41 లక్షలకు కొనుగోలు చేశాడు. ఇంత ధర పలకటం చాలా సంతోషంగా ఉందని రైతు తిమ్మప్ప తెలిపారు. -
ఒంగోలు గిత్త @ రూ. 19 లక్షలు
కడప అగ్రికల్చర్: అరుదైన ఒంగోలు గిత్తకోసం ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం పందిళ్లపల్లెకు చెందిన అంజిరెడ్డి అనే రైతు భారీ మొత్తం వెచ్చించాడు. అక్షరాలా రూ.19 లక్షలు చెల్లించి వైఎస్సార్ జిల్లా కొత్తపేటకు చెందిన రైతు గురుజాల రామకృష్ణారెడ్డి నుంచి ఈ గిత్తను కొనుగోలు చేసి తీసుకెళ్లారు. అంజిరెడ్డి మాట్లాడుతూ ఈ జాతి అంతరించి పోకుండా చేయాలనేదే తన తాపత్రయమని తెలిపారు. -
ఆడపిల్లలంటే తగని సిగ్గు!
తొలి చిత్రంతోనే ప్రేక్షకులను ఆకట్టుకొని, క్రేజు సంపాదించుకున్న యువ హీరో రామ్. అయితే, ఆయన ఇటీవల నటించిన ‘ఒంగోలు గిత్త’, ‘ఎందుకంటే ప్రేమంట’, ‘మసాలా’ చిత్రాలు ఆశించినంతగా ఆడలేదు. దాంతో, మళ్ళీ మంచి విజయం సాధించాలనే పట్టుదలతో తాజాగా సెట్స్‌పై ఉన్న ‘పండగ చేస్కో’ చిత్రంపై ఆయన ఏకాగ్ర దృష్టి పెట్టారు. సినిమాల సంగతి కాసేపు పక్కనపెడితే, ఇప్పటి వరకు తన కెరీర్‌లోని మొత్తం 11 చిత్రాల్లో ఏకంగా 16 మంది హీరోయిన్లతో నటించి, పలు చిత్రాల్లో ఒకరికి ఇద్దరు హీరోయిన్లతో తెరపై నర్తించిన ఘనత ఈ యువ హీరోకు దక్కింది. అయితే, గమ్మత్తేమిటంటే ఈ యువ హీరోకు చిన్నప్పుడు మాత్రం ఆడవాళ్ళంటే తగని సిగ్గట! ఇటీవల ఆయన ఆ సంగతులు ముచ్చటిస్తూ, ఒక ఆసక్తికరమైన సంగతి బయటపెట్టారు. తను చిన్నతనంలో ఆడవాళ్ళతో అసలు మాట్లాడేవాడు కాదట! అయితే, కొందరిని చూసి మనసు పారేసుకొని, మోహంలో పడిన అనుభవాలు మాత్రం ఉన్నాయట! ‘‘నా మీద మనసు పడ్డ ఒక అమ్మాయి గతంలో ఒకసారి నాతో మాట్లాడేందుకు ప్రయత్నించింది. అంతే! నేను అక్కడ నుంచి పరారయ్యాను. అలాగే, కొన్నిసార్లు కొంతమంది అమ్మాయిలు నాకు ప్రేమ ప్రతిపాదన చేశారు. కానీ, అలాంటప్పుడు ఎలా స్పందించాలో నాకు తెలిసేది కాదు’’ అని రామ్ అప్పటి సంగతులు చెప్పుకొచ్చారు. స్కూల్లో చదువుకొనే రోజుల్లో క్రీడా, సాంస్కృతిక కార్యక్రమాల్లో రామ్ చురుగ్గా పాల్గొనేవారట! ‘‘స్కూల్లో నేనొక్కణ్ణే మంచి జావెలిన్ త్రోయర్ని. చిన్నప్పటి నుంచీ నాకు సినిమా హీరోను కావాలని కోరిక. అందుకే, జాజ్, డ్యాన్స్, గుర్రపుస్వారీ, కుంగ్‌ఫూ లాంటి వాటిలో క్రాష్ కోర్సులు చేస్తూ వచ్చా. హీరోనయ్యాక అవన్నీ నాకు ఉపయోగపడతాయనుకున్నా. అచ్చంగా, అలాగే పదహారేళ్ళ వయసులో ‘దేవదాసు’తో తెరపైకి వచ్చా’’ అని రామ్ ఆనందంగా ఆ సంగతులు చెప్పారు. ఎంతైనా, జీవితంలో ఎంత ఎత్తు ఎదిగినా చిన్నప్పటి సంగతులు తీపి జ్ఞాపకాలే కదా!