
ఒంగోలు గిత్త @ రూ. 19 లక్షలు
కడప అగ్రికల్చర్: అరుదైన ఒంగోలు గిత్తకోసం ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం పందిళ్లపల్లెకు చెందిన అంజిరెడ్డి అనే రైతు భారీ మొత్తం వెచ్చించాడు. అక్షరాలా రూ.19 లక్షలు చెల్లించి వైఎస్సార్ జిల్లా కొత్తపేటకు చెందిన రైతు గురుజాల రామకృష్ణారెడ్డి నుంచి ఈ గిత్తను కొనుగోలు చేసి తీసుకెళ్లారు. అంజిరెడ్డి మాట్లాడుతూ ఈ జాతి అంతరించి పోకుండా చేయాలనేదే తన తాపత్రయమని తెలిపారు.