yemmiganur
-
5 ఏళ్ల బాలుడి కిడ్నాప్
-
చంద్రబాబుకు ఎన్నికల కమిషన్ నోటీసులు
సాక్షి, అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబుకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. మార్చి 31న ఎమ్మిగనూరు సభలో చంద్రబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని ఈసీ ఆదేశించింది. చంద్రబాబు ఎన్నికల కోడ్ నియమావళిని ఉల్లంఘించారని అందిన ఫిర్యాదుతో ఈసీ నోటీసులు ఇచ్చింది. 48 గంటల్లోగా అఫిడవిట్ రూపంలో వివరణ ఇవ్వాలని ఈసీ పేర్కొంది. చదవండి: ఈ సైకోయిజాన్ని ఏమనాలి పసుపుపతి.. -
ఎమ్మిగనూరు సభ క్రియేట్ చేసిన ఇంపాక్ట్...భయపడుతున్న బాబు
-
ఎమ్మిగనూరు సభను ఉద్దేశించి సీఎం జగన్ ట్వీట్
-
మీరంతా రావడం పూర్వజన్మ సుకృతం..
-
Memantha Siddham Pics: దద్దరిల్లిన ఎమ్మిగనూరు.. యుద్ధానికి మేమంతా సిద్ధం (ఫొటోలు)
-
కూటమి పేరుతో కుట్రలు.. మోసగాళ్లను నమ్మొద్దు: సీఎం జగన్
సాక్షి, కర్నూలు జిల్లా: ఈ సభ ఎమ్మిగనూరు చరిత్రలో సువర్ణ అక్షరాలతో నిలిచిపోతుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. బిందువు బిందువు చేరి సింధువు అయినట్లు ఇక్కడ జన సంద్రం కనిపిస్తోందన్నారు. ‘మేమంతా సిద్ధం’ పేరుతో బస్సు యాత్ర చేపట్టిన సీఎం జగన్.. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు బహిరంగ సభలో ప్రసంగిస్తూ.. మీ బిడ్డను ఆశీర్వదించడం కోసం మీరంతా రావడం పూర్వజన్మసుకృతం.. అవ్వాతాతలందరికి శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. పేదలంతా ఒక వైపు,పెత్తందారులు మరో వైపు ‘‘మే 13న కురుక్షేత్ర యుద్ధం జరుగబోతుంది. పేదలకు, పెత్తందారులకు మధ్య యుద్ధం జరగబోతుంది. ఈ పొత్తులను, జిత్తులను, ఈ మోసాలను, కుట్రలను వీటన్నింటిని ఎదుర్కొంటూ పేదల భవిష్యత్‌కు అండగా నిలిచేందుకు నేను సిద్ధం. సిద్ధమంటూ లేచే ప్రతి చేయి, ప్రతి గుండె ఐదేళ్లుగా మంచి జరిగిందని, మా ప్రభుత్వ బడులు బాగుపడ్డాయని ప్రతి గుండె చెబుతోంది. జెండాలు జతకట్టిన వారిని ఓడించేందుకు మీరంతా సిద్ధమా?. పెత్తందార్లను ఓడించేందుకు నేను సిద్ధం.. మీరంతా సిద్ధమా?. 58 నెలల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం. మనం చేసిన మంచి కొనసాగాలని ప్రతి గుండె కోరుకుంటోంది. పేదలంతా ఒక వైపు,పెత్తందారులు మరో వైపు. పేదల వ్యతిరేకులను ఓడించండి.. మీ బిడ్డను గెలిపించండి’’ అంటూ సీఎం జగన్ పిలుపునిచ్చారు. విద్యారంగాన్ని విస్మరించిన టీడీపీకి ఓటు వేస్తారా? ‘‘విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం. కార్పొరేషన్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ బడులను తీర్చిదిద్దాం. ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియాన్ని తీసుకొచ్చాం. అమ్మ ఒడి, విద్యాదీవెన ద్వారా పిల్లలను ప్రోత్సహిస్తున్నాం. పిల్లల చదువు గురించి గతంలో ఏ పాలకులు పట్టించుకోలేదు. పేదరికం నుంచి బయటపడాలంటే పిల్లలు చదువుకోవాలి. విద్యారంగాన్ని విస్మరించిన టీడీపీకి ఓటు వేస్తారా?. ధనికులకు అందే చదువునే పేదలకు కూడా అందిస్తున్నాం. మహిళల కోసం గత ప్రభుత్వం ఒక్క పథకం కూడా తీసుకురాలేదు. కూటమి పేరుతో కుట్రలు చేస్తున్నారు. ఎన్ని కుట్రలు చేసినా మళ్లీ మనమే గెలవబోతున్నాం’’ అని సీఎం జగన్ పేర్కొన్నారు. మంచి చేసిన మీ ప్రభుత్వానికి రాఖీ కట్టండి ‘‘మంచి చేసిన మీ ప్రభుత్వానికి రాఖీ కట్టండి. పేదల సొంతింటి కలను నెరవేర్చాం. మహిళల రక్షణ కోసం దిశ యాప్ తీసుకొచ్చాం. ప్రతి నెలా ఒకటో తేదీన రూ.3వేల పెన్షన్ ఇస్తున్నాం. రూ.3వేల పెన్షన్ ఇస్తున్న రాష్ట్రం.. దేశంలో ఏపీ ఒక్కటే. రూ.2 లక్షల 70 వేల కోట్లు పేదల ఖాతాల్లో వేశాం. ఇంత మంచిచేసిన మీ ప్రభుత్వానికి రాఖీ కట్టండని కోరుతున్నా. చంద్రబాబు హయాంలో ఒక్క రూపాయి అయినా వేశారా?. ప్రతిపక్షాలు మోసాలను నమ్ముకున్నాయి. చేసిన మంచిని మాత్రమే మేం నమ్ముకున్నాం’’ అని సీఎం జగన్ చెప్పారు. చంద్రబాబు పేరు చేప్తే వెన్నుపోట్లు.. మోసాలు.. ‘‘ఇంగ్లీష్ మీడియం వద్దని అడ్డుకున్నవారికి బుద్ధి చెప్పండి. పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తుంటే అడ్డుకున్నవారికి బుద్ధి చెప్పండి. ఎస్సీలను అవమానించినవారికి రాజకీయ భవిష్యత్ లేకుండా చేయండి. బీసీల తోకలు కత్తిరిస్తామన్నవారికి తోకలు కత్తిరించండి. మైనార్టీల మనోభావాలను దెబ్బతీస్తున్నవారికి బుద్ది చెప్పండి. ఇప్పుడు కూడా దత్తపుత్రుడిని, ఢిల్లీ నుంచి మోదీని తెచ్చుకున్నాడు. చంద్రబాబు పేరు చేప్తే వెన్నుపోట్లు.. మోసాలే గుర్తుకొస్తాయి. మళ్లీ మోసం చేసేందుకు బాబు రంగురంగుల మేనిఫెస్టోతో వస్తున్నారు’’ అంటూ సీఎం దుయ్యబట్టారు. ఇలాంటి మోసగాళ్ల నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాలి ‘‘2014లో చంద్రబాబు ఇచ్చిన హామీల్లో ఒక్కటీ నెరవేర్చలేదు. ఆడబిడ్డ పుడితే రూ.25వేలు డిపాజిట్ చేస్తానన్నాడు.. చేశాడా?. ఇంటికో ఉద్యోగం అన్నాడు.. ఇచ్చాడా?. ఉద్యోగం ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి అన్నాడు.. ఇచ్చాడా?. అర్హులకు మూడు సెంట్లు స్థలం ఇస్తానన్నాడు ఇచ్చాడా?. ప్రతి నగరంలో హైటెక్ సిటీ నిర్మిస్తానన్నాడు.. నిర్మించాడా?. ఇంత మోసం చేసిన బాబు మళ్లీ సూపర్ సిక్స్ అంటూ వస్తున్నాడు. ఇలాంటి మోసగాళ్ల నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాలి’’ అని సీఎం జగన్ పేర్కొన్నారు. వీరాంజనేయులు చదివింది.. చంద్రబాబు కంటే పెద్ద చదువు ‘‘మేం టిప్పర్ డ్రైవర్‌కు టికెట్ ఇచ్చామని చంద్రబాబు హేళన చేశాడు. మాది పేదవాళ్ల పార్టీ.. అందుకే టిప్పర్ డ్రైవర్‌కు టికెట్ ఇచ్చాం. వీరాంజనేయులు చదివింది.. చంద్రబాబు కంటే పెద్ద చదువు. వీరాంజనేయులు ఎంఏ ఎకనామిక్స్ చదివాడు. బీఈడీ కూడా చేశాడు. బాబు హయాంలో ఉద్యోగం దొరక్క టిప్పర్ డ్రైవర్ అయ్యాడు. పేదవాడైన వీరాంజనేయులు ఎదగాలనే టికెట్ ఇచ్చాం’’ అని సీఎం చెప్పారు. -
Watch Live: మేమంతా సిద్ధం ఎమ్మిగనూరు సభ
-
దారిపొడవునా జై జగన్ నినాదాలు
-
చేనేత భాంధవ్యుల ఆత్మీయ సమ్మేళనం
-
కర్నూలులో తన్నుకున్న టీడీపీ నేతలు
కర్నూలు: కర్నూలులో టీడీపీ నేతలు తన్నుకున్నారు. ‘బీసీ జయహో’ సభలో బీభత్సం సృష్టించారు. ఈ సభలో మాజీ ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి హల్చల్ చేశారు. ఎమ్మిగనూరు టికెట్ కోసం మాచాని సోమనాథ్ వర్గీయులు వాగ్వాదానికి దిగారు. ‘బీసీ జయహో’ సభలో బీసీని అవమానించారని మాచాని సోమనాథ్ అనుచరులు అసహనం వ్యక్తం చేశారు. -
నేడు ఎమ్మిగనూరు, మండపేటలో సామాజిక సాధికార యాత్ర
సాక్షి, తాడేపల్లి: ఏపీ వైఎస్సార్సీపీ చేపట్టిన సామాజిక సాధికార యాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల వారిని ఆత్మీయంగా పలకరించేందుకు వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధులు చేపట్టిన యాత్ర నేడు ఎమ్మిగనూరు, మండపేటలో సాగనుంది. కర్నూలు జిల్లా: ఎమ్మినూరులో ఎమ్మెల్యే చెన్నకేశవ రెడ్డి ఆధ్వర్యంలో బస్సు యాత్ర సాగనుంది. మండల పరిషత్ కార్యాలయంలో 3.30 గంటలకు ముఖ్య నేతలతో ముఖాముఖి అనంతరం.. 4.30కుఎద్దుల మార్కెట్ నుండి సోమప్ప సర్కిల్ మీదుగా వైఎస్సార్ సర్కిల్‌కు వరకు బైక్ ర్యాలీ నిర్వహించనున్నారు. సాయంత్రం 5 గంటలకు బస్టాండ్ ఎదుట బహిరంగ సభ జరగనుంది. మంత్రులు అంజాద్ భాష, ఆదిమూలపు సురేష్, గుమ్మనూరు జయరాం, మా జీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ , ఎంపీ. సంజీవ్ కుమార్, తదితరులు హాజరుకానున్నారు. కోనసీమ జిల్లా మండపేటలో ఎమ్మెల్సీ తీట త్రిమూర్తులు ఆధ్వర్యంలో సామాజిక సాధికార బస్సు యాత్ర కొనసాగనుంది. మధ్యాహ్నం 2 గంటలకు తాపేశ్వరంలో వైఎస్సార్సీపీ నేతల మీడియా సమావేశం అనంతరం మండపేటలోని పూలే విగ్రహం నుంచి కలువ పువ్వు సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించనున్నారు. సాయంత్రం 4.30 గంటలకు కలువు పువ్వు సెంటర్లో బహిరంగ సభ నిర్వహించనున్నారు. మంత్రి జోగి రమేష్, ఎంపీలు పిల్లి సుభాస్ చంద్రబోస్, మార్గాని భరత్, ఎమ్మెల్సీ కుడిపూడి సూర్యనారాయణ, తదితరులు హాజరుకానున్నారు. ఇదీ చదవండి: ఏపీ ఎన్నికలకు కసరత్తు.. నేడు, రేపు ఈసీ సమీక్ష -
కౌరవులతో పోరాడుతున్నాం
సాక్షి ప్రతినిధి కర్నూలు: ‘నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అంటూ ప్రతీ అడుగులోనూ వారికి నేనున్నానంటూ భరోసా ఇస్తూ ప్రేమ, బాధ్యత చూపిస్తున్న ప్రభుత్వం మనది. రాబోయేది కురుక్షేత్ర యుద్ధం. పేదవాడు ఓవైపు, పెత్తందారీ మరోవైపు ఉన్నాడు. యుద్ధం జరగబోయేది కులాల మధ్య కాదు.. జరగబోయే యుద్ధం క్లాస్ వార్! కౌరవులంతా ఓవైపు ఉన్నారు. తోడేళ్లంతా ఏకం అవుతాయి. ఆ గజదొంగల ముఠాల్లా మీ బిడ్డకు అర డజను టీవీ ఛానెళ్లు లేవు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, దత్తపుత్రుడి తోడూ ఉండదు. నేను నమ్ముకుంది దేవుడి దయ.. చల్లని దీవెనలను మాత్రమే. మీ అందరికీ ఒకటే చెబుతున్నా.. వారు చెప్పే మోసాలు, అబద్ధాలను నమ్మకండి. ఓటు వేసే ముందు ఒక్కటే ఆలోచించండి. మీ బిడ్డ వల్ల మీ ఇంటికి మంచి జరిగిందా? లేదా? అని ఆలోచించండి. మంచి జరిగిందంటే మీరే మీ బిడ్డకు సైనికుల్లా అండగా ఉండండి’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ‘జగనన్న చేదోడు’ నాలుగో విడత సాయాన్ని ముఖ్యమంత్రి జగన్ బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేశారు. 3.25 లక్షల మంది టైలర్లు, రజకులు, నాయీ బ్రాహ్మణులకు రూ.10 వేల చొప్పున మొత్తం రూ.325.02 కోట్లను నేరుగా వారి ఖాతాల్లో జమ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో సీఎం జగన్ ప్రజలనుద్దేశించి మాట్లాడారు. జీవన యానంలో తోడుగా నిలబడ్డాం.. వెనుకబడిన కులాలు, వర్గాలను వెన్నెముక కులాలుగా మారుస్తామని నా పాదయాత్ర సందర్భంగా మాటిచ్చా. ఈ 52 నెలల పాలనలో నవరత్నాలులోని ప్రతి కార్యక్రమం ద్వారా నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీలను, నా నిరుపేద వర్గాలను చేయి పట్టుకుని నడిపించగలిగానని మీ బిడ్డగా సగర్వంగా తలెత్తుకుని చెబుతున్నా. వారి జీవన ప్రయాణంలో తోడుగా నిలబడ్డాం. సొంత దుకాణాలున్న రజక, నాయీ బ్రాహ్మణ, టైలర్లకు జగనన్న చేదోడు ద్వారా ఏటా రూ.10 వేల చొప్పున ఆర్థిక సాయం చేస్తున్నాం. క్రమం తప్పకుండా వరుసగా నాలుగో ఏడాదీ పథకాన్ని అమలు చేస్తున్నాం. దీనిద్వారా 1.80 లక్షల మంది టైలర్లు, 1.04 లక్షల మంది రజకులు, దాదాపు 40 వేల మందికిపైగా నాయీ బ్రాహ్మణులకు ఈరోజు మేలు జరుగుతోందని సంతోషంగా చెబుతున్నా. చేదోడు ద్వారా ఇవాళ జమ చేస్తున్న నగదుతో కలిపితే ఇప్పటివరకు దాదాపు రూ.1,252 కోట్లు కేవలం ఈ ఒక్క పథకం కోసమే ఖర్చు చేశాం. ఒక్కో పేద కుటుంబానికి రూ.40 వేల చొప్పున మేలు చేయగలిగాం. ఈ 52 నెలల్లో ప్రతీ అడుగు మంచి కోసమే వేశాం. మొత్తంగా రూ.2.38 లక్షల కోట్లను మీ బిడ్డ బటన్ నొక్కి నేరుగా అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి జమ చేశాడు. ఎక్కడా లంచాలు లేవు. వివక్ష చూపలేదు. గతంలో ఎవరైనా ఆలోచించారా? చిన్న షాపులు పెట్టుకుని జీవనోపాధి పొందుతున్న వారంతా బతకలేని పరిస్థితుల్లో ఉంటే ఈ వ్యవస్థలు కుప్పకూలిపోవా? అని అడుగుతున్నా. ఇలాంటి వారి గురించి గతంలో ఎవరైనా ఆలోచించారా? ప్రతీ అడుగులోనూ పేదలకు తోడుగా నిలిచాం. చేదోడు, వాహనమిత్రతో పాటు స్వయం ఉపాధిని ప్రోత్సహించే కార్యక్రమాలతో పేదలకు అండగా ఉన్నాం. ఏటా క్రమం తప్పకుండా సాయం చేస్తున్నాం. ప్రతీ పేద ఇంట్లో నా అక్కచెల్లెమ్మలకు తోడుగా, వారి పిల్లలకు మేనమామలా తోడుగా ఉన్నా. అప్పుడూ ఇదే బడ్జెట్.. ఈ పథకాలన్నీ ఇంతకుముందు ఎప్పుడైనా విన్నామా? అమలు జరిగాయా? అని అంతా ఆలోచించాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు తోడుగా నిలిచి వారి అభ్యున్నతికి అడుగులు పడింది మీ బిడ్డ నాలున్నరేళ్ల పాలనలోనే. ఈ ప్రభుత్వం వస్తుంది.. ఇలా పథకాలను ఇవ్వగలుగుతుంది... ఎక్కడా లంచాలు, వివక్ష ఉండదు... ఏ పార్టీకి ఓటేశారని అడగరు.. అర్హత ఉంటే చాలు ఖాతాల్లో డబ్బులు పడతాయని ఎవరైనా అనుకున్నారా? గతంలో ఎప్పుడూ జరగని విధంగా మంచి చేస్తున్నాం. అప్పుడూ ఇప్పుడూ అదే బడ్జెట్.. అదే రాష్ట్రం! మారింది కేవలం ముఖ్యమంత్రి మాత్రమే. అప్పుల పెరుగుదల కూడా అప్పటి కంటే తక్కువే. మరి అప్పుడు ఇవన్నీ ఎందుకు జరగలేదు? ఇప్పుడు మీ బిడ్డ ప్రభుత్వంలోనే ఎందుకు జరుగుతున్నాయి? అని అంతా ఆలోచించాలి. గతానికీ, ఇప్పటికీ తేడా ఒక్కటే. మీ బిడ్డ మంచి మనసుతో బటన్ నొక్కుతున్నాడు. నేరుగా అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి డబ్బులు వెళుతున్నాయి. అప్పట్లో గజదొంగల ముఠా ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ–5, వీరికి తోడుగా దత్తప్రుత్రుడు... వీరంతా కలసి దోచుకోవడం, పంచుకోవడం, తినుకోవడమే! అప్పటికీ, ఇప్పటికీ తేడా ఇదీ. అప్పట్లో గజదొంగల ముఠా దోచేసే కార్యక్రమం జరిగింది. ఇప్పుడు మీ బిడ్డ బటన్ నొక్కితే నేరుగా ఖాతాల్లోకి వెళుతున్నాయి. మనందరి పాలనలో.. ఏ పేద కుటుంబమైనా, సంప్రదాయ వృత్తుల కుటుంబాలైనా, రైతులు, కూలీలు.. పేదరికంలో ఉన్న వారెవరైనా కోరుకునేది వారికి ఎప్పుడైనా వైద్యం అవసరమైతే మంచి మనసుతో అండగా నిలిచి ఎన్ని లక్షలైనా ఖర్చు చేసే ప్రభుత్వం కావాలనే! ఆత్మగౌరవాన్ని నిలబెడుతూ, లంచాలు లేకుండా వారి కుటుంబానికి ఇంటి ముందుకొచ్చి చేతికిచ్చిపోయే ప్రభుత్వం రావాలని, కావాలని కోరుకుంటారు. ఇంటి స్థలం, ఇల్లు అవసరాన్ని గుర్తించి వాటిని అందించి, నిర్మించి ఇచ్చే ప్రభుత్వం రావాలని, కావాలని కోరుకుంటారు. నిరుపేద కుటుంబాన్ని శాశ్వతంగా పేదరికం నుంచి బయట పడేసేందుకు తమ పిల్లలను మంచిగా చదివించే మేనమామ స్థానంలో ఉండే ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటారు. అవ్వాతాతలను ఆదుకునే పాలకుడు కావాలని కోరుకుంటారు. అక్కచెల్లెమ్మల సాధికారతకు అండగా నిలబడే మంచి అన్నయ్య, తమ్ముడు సీఎంగా కూర్చోవాలని ప్రతీ పేద కుటుంబం కోరుకుంటుంది. ఇలాంటి మార్పులన్నీ రాష్ట్రంలో ప్రతి జిల్లాలో, ప్రతి గ్రామంలో, ప్రతి కుటుంబంలో కళ్లెదుట కనిపించే విధంగా పాలన అందుబాటులోకి వస్తే అలాంటి పాలనను ‘మా పాలన.. మనందరి పాలన.. మా బిడ్డ పాలన.. మా జగనన్న పాలన ’అని అంటారు. కుప్పంలోనూ ఇళ్లు ఇచ్చింది మీ బిడ్డ ప్రభుత్వమే చంద్రబాబు సాగించిన పాలనను చూస్తే కుప్పం ప్రజలు కూడా ఆయన్ను తమవాడు అని చెప్పుకునే పరిస్థితి లేదు. మూడు విడతలుగా 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నా అక్కడ పేదవాళ్లకు ఇంటి స్థలం ఇచ్చిన దాఖలాలు లేవు. మీ బిడ్డ ప్రభుత్వం అక్కడ 20 వేల ఇంటి పట్టాలను పేదలకు ఇచ్చింది. ఆ అక్కచెల్లెమ్మలకు ఇంటి పట్టాలివ్వడమే కాకుండా 8 వేల ఇళ్లను కూడా నిర్మిస్తోంది మన ప్రభుత్వమే. మాఫీ పేరుతో ముంచేశాడు.. 2014 ఎన్నికల సమయంలో చంద్రబాబు, దత్తపుత్రుడి సంతకాలతో లెటర్లు తీసుకొచ్చారు. టీవీ ఆన్ చేస్తే చంద్రబాబు ముఖం కనిపించేది. వ్యవసాయ రుణాలు మాఫీ కావాలంటే, బ్యాంకుల్లో తాకట్టు పెట్టిన బంగారం బయటకు రావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలని ఊదరగొట్టారు. తీరా చంద్రబాబు సీఎం అయ్యాక రూ.87,612 కోట్ల వ్యవసాయ రుణాల మాఫీ, బంగారం సంగతి దేవుడెరుగు అప్పటి వరకూ వస్తున్న సున్నా వడ్డీని కూడా ఎత్తేశాడు. ఐదేళ్లలో రూ.15 వేల కోట్లు కూడా ఇవ్వని పరిస్థితి. సున్నా వడ్డీ పథకం రద్దయింది. బ్యాంకుల్లోని బంగారాన్ని వేలం వేసే పరిస్థితులు రావడంతో రెతన్న అష్టకష్టాలు పడ్డాడు. అందుకే ఆలోచించాలని అంతా అడుగుతున్నా. 2019 మేనిఫెస్టోలో రైతుకు ఏం చెప్పామో అంతకంటే మిన్నగా చేస్తోంది మీ బిడ్డ ప్రభుత్వం. మేనిఫెస్టోను ప్రకటించి ఎన్నికల తర్వాత చంద్రబాబు చెత్త బుట్టలో వేసిన పరిస్థితిని గుర్తు తెచ్చుకోవాలని కోరుతున్నా. అక్కా.. మీరే చూడండి అంటూ ఎన్నికల వేళ మీ బిడ్డ ఓ మాట చెప్పాడు. అందులో 99 శాతం హామీలను పూర్తి చేసి మేనిఫెస్టోని ప్రతి గడప వద్దకూ తీసుకెళ్లి ‘అక్కా.. జగనన్న మీకు ఈ మాట చెప్పాడు! ఆ మాటను నెరవేర్చాడు చూడండి..’ అంటూ మీ బిడ్డ ప్రభుత్వం పాలన చేస్తోంది. చంద్రబాబు హయాంలో జన్మభూమి కమిటీల నుంచి రాజధాని భూముల వరకూ, స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ నుంచి ఫైబర్ గ్రిడ్ దాకా.. చివరకు మద్యంలోనూ దోచేయడం, పంచుకోవడం, తినుకోవడమే. ఇది మినహా నాడు ఏదీ కనిపించలేదు. ఆ మోసాలు.. గుర్తున్నాయా? పొదుపు సంఘాలను మోసం చేస్తూ చంద్రబాబు చెప్పిన మాటలు జ్ఞాపకం ఉన్నాయా? నాడు టీవీల్లో ప్రకటనలు వచ్చేవి! ఓ అక్క, ఓ చెల్లెమ్మను చూపించేవారు. అందులో మంగళసూత్రం లాక్కుని వెళ్లే ఓ చేతిని మరో చెయ్యి పట్టుకుంటుంది. పొదుపు సంఘాల రుణాలు మాఫీ కావాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని అనేవారు. ఆయన సీఎం అయ్యారు కానీ అప్పటివరకూ ఏ, బీ, గ్రేడ్‌లో ఉన్న సంఘాలన్నీ సీ, డీ గ్రేడ్‌కు దిగజారాయి. పొదుపు సంఘాలకు అప్పటివరకూ ఉన్న సున్నా వడ్డీ పథకాన్ని పూర్తిగా ఎత్తివేశారు. అక్కచెల్లెమ్మలకు ఎన్నో ఇబ్బందులు కల్పించారు. ఆ దుస్థితి నుంచి కాపాడేందుకు మీకు మంచి అన్నయ్య, తమ్ముడు.. మీ బిడ్డ రూపంలో సీఎం స్థానంలోకి వచ్చాడు. వారందరికీ తోడుగా ఉన్నాడు. వైఎస్సార్ ఆసరాÆ, సున్నా వడ్డీ, చేయూతను తోడుగా ఇచ్చాడు. అమ్మ ఒడి ద్వారా ఆదుకున్నాడు. దీంతో ఆ సంఘాలు తిరిగి ఏ, బీ గ్రేడ్‌గా చలామణీ అవుతున్నాయి. ఇప్పుడు అక్కచెల్లెమ్మలు వస్తుంటే బ్యాంకర్లు సెల్యూట్ కొట్టి రుణాలు ఇస్తున్నారు. నాడు 18 శాతం ఉన్న ఎన్పీఏలు, అవుట్ స్టాండింగ్ రుణాలు నేడు 0.3 శాతానికి తగ్గాయి. రాష్ట్రమే కాదు దేశం మొత్తం మన పొదుపు సంఘాల వైపు చూస్తోంది. ఏకంగా 2.07 లక్షల కొత్త ఉద్యోగాలు.. చంద్రబాబు హయాంలో పేదవాడు ఎలా బతుకున్నారో కనీసం ఆలోచించలేదు. ఇల్లు, ఇంటి స్థలం ఉందా? అని ఆలోచించి కనీసం ఒక్క సెంటు ఇచ్చిన పాపాన పోలేదు. మీ బిడ్డ సీఎం అయ్యాక 10, 20 లక్షలు కాదు.. ఏకంగా 31 లక్షల ఇంటి పట్టాలిచ్చాడు. ఒక్కో ఇంట్లో సగటున ముగ్గురు ఉన్నారనుకున్నా ఏకంగా కోటి మందికి మేలు చేసే కార్యక్రమం చేశాం. అందులో 22 లక్షల ఇళ్లు నిర్మాణంలో ఉన్నాయి. వేగంగా పేదల గృహాలను నిర్మిస్తున్నాం. ఈ తేడాను గమనించాలి. చంద్రబాబు హయాంలో ఎంతమంది పేదలకు ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చాయని అడుగుతున్నా. జాబు రావాలంటే బాబు రావాలి.. అంటూ ప్రకటనలిచ్చారు. జాబు ఇవ్వకపోతే ఇంటింటికీ నెలకు రూ.రెండు వేలు నిరుద్యోగభృతి ఇస్తానని ఊదరగొట్టారు. బాబు సీఎం అయినా భృతి ఇవ్వకుండా పిల్లలను కూడా మోసం చేశాడు. ఆపై మీ బిడ్డ ముఖ్యమంత్రి అయ్యాడు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత రాష్ట్రంలో 4 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఉంటే మీ బిడ్డ హయాంలో ఏకంగా 2.07 లక్షల కొత్త ఉద్యోగాలు ఇచ్చాడు. అందులో నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకే 80 శాతం ఉద్యోగాలిచ్చాం. మనుషులు చనిపోయినా పట్టని బాబు పాలన గతంలో పింఛన్, రేషన్‌కార్డు లాంటి ఏ పౌర సేవ కావాలన్నా జన్మభూమి కమిటీలకు లంచాలు ఇస్తూ చెప్పులు అరిగేలా తిరిగిన రోజులే గుర్తుకొస్తాయి. చంద్రబాబు హయాంలో రైతులకు ఎరువులు, పురుగు మందులు కావాలంటే మండల కేంద్రానికి వెళ్లి క్యూలో నిల్చునేవారు. మనుషులు చనిపోయినా పట్టించుకోని పాలన ఆయనదైతే ఇప్పుడు మీ బిడ్డ పాలనలో అవన్నీ మన గ్రామంలో, మన గడప వద్దకే వలంటీర్లు చిరునవ్వుతో తెచ్చి సంక్షేమ ఫలాలను అందిస్తూ తోడుగా ఉంటున్నారు. అప్పట్లో ఆరోగ్యశ్రీని ఎలా వదిలించుకోవాలనే పాలన సాగింది. రాష్ట్రంలో 108,104 వాహనాలకు కనీసం డీజిల్ ఖర్చులు కూడా ఇవ్వని పరిస్థితి. చంద్రబాబు పాలన పోయింది. మీ బిడ్డ పాలన వచ్చింది. ఈ రోజు రాష్ట్రంలో ఏకంగా 17 కొత్త మెడికల్ కాలేజీలను నిర్మిస్తున్నాం. ఆదోనిలో కూడా మెడికల్ కాలేజీని నిర్మిస్తున్నాం. ఏకంగా 1,600 కొత్త 108, 104 వాహనాలను కొనుగోలు చేసి పేదవాడికి తోడుగా ఉన్నాం. గతంలో ఆరోగ్యశ్రీ పరిధిలో కేవలం వెయ్యి ప్రొసీజర్లు మాత్రమే ఉంటే ఈ రోజు 3,300 ప్రొసీజర్లకు విస్తరించాం. రోగులు ఆపరేషన్ అనంతరం ఇంట్లో విశ్రాంతి తీసుకునే సమయంలో డాక్టర్ల సిఫారసు మేరకు నెలకు రూ.5 వేల చొప్పున వైఎస్సార్ ఆరోగ్య ఆసరా ద్వారా సాయం అందిస్తున్నాం. ఇవాళ ప్రతీ గ్రామంలో వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌లు ఉన్నాయి. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ తెచ్చాం. వీటికి తోడు జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా ఇంటింటికి వచ్చి జల్లెడ పట్టి వైద్య పరీక్షలు చేసి మందుల నుంచి చికిత్స వరకూ అందిస్తూ చేయి పట్టుకుని నడిపిస్తున్నాం. పేద పిల్లలకు నాణ్యమైన చదువులు నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీల పిల్లలు వెళ్లే ప్రభుత్వ స్కూళ్లను తెలుగు మీడియానికే పరిమితం చేసి నారాయణ, చైతన్యలను పెంచి పోషించిన పరిస్థితి చంద్రబాబు హయాంలో ఉంటే ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలను నాడు–నేడు ద్వారా రూపురేఖలు మార్చి 6 నుంచి పైతరగతులను డిజిటలైజ్ చేశాం. ప్రతి పేద పిల్లాడి చేయి పట్టుకుని నడిపిస్తున్నాం. 8వ తరగతి పిల్లలకు ట్యాబ్‌లు ఇస్తున్నాం. బాగా చదువుకోవాలని ప్రోత్సహిస్తూ గోరుముద్ద ద్వారా రోజుకో మెనూ అమలు చేస్తున్నాం. పిల్లలు చిక్కటి చిరునవ్వుతో ఉండాలని విద్యాకానుక కిట్లను ఇస్తున్నాం. బైజూస్ కంటెట్ తీసుకొచ్చాం. సీబీఎస్ఈ సిలబస్, బైలింగ్యువల్ పాఠ్య పుస్తకాలు, టోఫెల్ శిక్షణను సర్కారు స్కూళ్లలో అందుబాటులోకి తెచ్చాం. గతంలో పేదవాడి గురించి ఏమాత్రం ఆలోచించిన పరిస్థితి లేదు. అహంకార ధోరణి, పెత్తందారీతనంతో అవమానించారు. ఎస్సీలుగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా? బీసీల తోకలు కత్తిరిస్తా..! ఖబడ్దార్ అని చంద్రబాబు హెచ్చరించలేదా? చివరకు అక్కచెల్లెమ్మలను సైతం అవహేళన చేసేలా కోడలు మగ పిల్లాడిని కంటానంటే అత్త వద్దంటుందా? అని వ్యాఖ్యానించారు. చంద్రబాబు రాజధాని నగరం అని పేరు పెట్టుకున్న చోట పేదవాడికి ఇళ్ల స్థలాలిస్తుంటే కులాల మధ్య సమతుల్యత దెబ్బతింటుందంటూ నిస్సిగ్గుగా కోర్టుల్లో కేసులు వేసి ఆయన నైజాన్ని చాటుకున్నారు. జనవరిలో వైఎస్సార్ ఆసరా.. చేయూత ► నా అక్కచెల్లెమ్మల ముఖంలో సంతోషం చూడాలని నాలుగేళ్లలో వైఎస్సార్ ఆసరా ద్వారా 78,94,194 మందికి రూ.19,178 కోట్లు అందించాం. వచ్చే జనవరిలో మరో రూ.6,500 కోట్లు ఆసరా ద్వారా ఇవ్వనున్నాం. ► పొదుపు సంఘాలు తమ కాళ్లపై నిలబడాలని సున్నా వడ్డీ కింద రూ.4,960 కోట్లు ఇచ్చాం. ► వైఎస్సార్ చేయూత ద్వారా 45–60 ఏళ్లు ఉన్న 26,39,703 మంది నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అక్కచెల్లెమ్మలకు అమూల్, ఐటీసీ, రిలయన్స్, హిందుస్థాన్ లీవర్ లాంటి సంస్థలతో వ్యాపార అవకాశాలను కల్పిస్తూ నేరుగా రూ.14,189 కోట్లు అందించాం. చేయూతకు జనవరిలో మరో రూ.5 వేల కోట్లు ఇవ్వనున్నాం. ► వైఎస్సార్ కాపు నేస్తం ద్వారా 3,57,844 మందికి రూ.2,028 కోట్లు అందించాం. ఈబీసీ నేస్తం ద్వారా అగ్రవర్ణాల్లోని 4.40 లక్షల మంది పేదలకు రూ.1,257 కోట్లు సాయం అందచేశాం. ► మత్స్యకార భరోసా ద్వారా 2,43,394 మందికి రూ.538 కోట్లు ఇవ్వగలిగాం. ► వైఎస్సార్ నేతన్న నేస్తం ద్వారా 82 వేల చేనేత కుటుంబాలకు రూ.982 కోట్లు అందించాం. ► వాహన మిత్ర ద్వారా 275,931 మంది డ్రైవరన్నలకు రూ.1,302 కోట్లు ఇచ్చాం. ► జగనన్న తోడు ద్వారా ఫుట్‌పాత్‌లు, తోపుడుబండ్లపై ఆధారపడే చిరువ్యాపారులకు పెట్టుబడి ఖర్చుల కోసం వడ్డీ వ్యాపారుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ఒక్కొక్కరికి రూ.10 వేలు చొప్పున వడ్డీ లేని రుణాలతో 15,87,492 మందికి రూ.2,956 కోట్లు అందచేశాం. హంద్రీపై వంతెనకు రూ.47 కోట్లు కర్నూలు జిల్లా పర్యటన సందర్భంగా పత్తికొండ–గోనెగండ్లను కలిపేలా హంద్రీ–నదిపై వంతెన నిర్మాణం కోసం రూ.47 కోట్లను మంజూరు చేస్తున్నట్లు సీఎం జగన్ ప్రకటించారు. జగనన్న చేదోడు నిధుల విడుదల సందర్భంగా ఎమ్మిగనూరులో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, గుమ్మనూరు జయరాం, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, ఎంపీ సంజీవ్‌కుమార్, ఎమ్మెల్యేలు చెన్నకేశవరెడ్డి, సాయిప్రసాద్‌రెడ్డి, బాలనాగిరెడ్డి, శ్రీదేవి, హఫీజ్‌ఖాన్, ఎమ్మెల్సీలు మధుసూదన్, రామసుబ్బారెడ్డి, రామచంద్రారెడ్డి, పోతుల సునీత, జెడ్పీ చైర్మన్ పాపిరెడ్డి, మేయర్ బీవై రామయ్య, కలెక్టర్ సృజన తదితరులు పాల్గొన్నారు. -
ఎమ్మిగనూరుకు సీఎం జగన్ వరాల జల్లు..!
-
బటన్ నొక్కి జగనన్న చేదోడు సాయం విడుదల చేసిన సీఎం జగన్ !
-
ప్రతి అడుగులో వెనుకబడిన వర్గాల చేయి పట్టుకొని నడిపిస్తున్నాం
-
బాబు హయాంలో అన్నింటా దోపిడీనే: సీఎం జగన్
సాక్షి, కర్నూల్: ఎన్నికల మేనిఫెస్టోలో 99 శాతం హామీలు నెరవేర్చిన ఘనత తమ ప్రభుత్వానిదేనని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు.అదే గతంలోని చంద్రబాబు ప్రభుత్వం మేనిఫెస్టోను, ఎన్నికల హామీలను చెత్తబుట్టలో పడేసిందని గుర్తు చేశారు. జగన్న చేదోడు కార్యక్రమం కోసం గురువారం ఎమ్మిగనూర్ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ఏమన్నారంటే.. చిక్కటి చిరునవ్వులు, చెరగని ఆత్మీయతలు మధ్య ఇంతటి ప్రేమానురాగాలు చూపిస్తున్న ప్రతి అక్కకూ, చెల్లెమ్మకూ, ప్రతి అవ్వకూ, తాతకూ, ప్రతి సోదరుడికీ, స్నేహితుడికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. నిరుపేదల జీవన ప్రయాణంలో తోడుగా.. దేవుడి దయతో ఈరోజు మరో మంచి కార్యక్రమం ఇక్కడ జరుగుతుంది. వెనుకబడిన కులాలను, వర్గాలను వెన్నుముక కులాలుగా మారుస్తామని పాదయాత్రలో మాట ఇచ్చాం. ఈరోజు మీ బిడ్డగా, మీ అన్నగా సగర్వంగా తలెత్తుకుని చెబుతున్నాను. ఈ 52 నెలల పరిపాలనలో నవరత్నాల్లోని ప్రతి కార్యక్రమం ద్వారా నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, నిరుపేద వర్గాలను చేయి పట్టుకుని నడిపించగలిగాం. వారి జీవన ప్రయాణంలో తోడుగా ఉండగలిగాం. ఈ రోజు తోడుగా నిలబడే కార్యక్రమంలో భాగంగా సొంత షాపు ఉన్న రజక, నాయీ బ్రహ్మణ, టైలర్ అన్నదమ్ములకు, అక్కచెల్లెమ్మలకు ప్రతి ఏటా రూ.10వేలు ఆర్ధిక సాయం చేస్తూ జగనన్న చేదోడు ద్వారా బటన్ నొక్కి వారి ఖాతాల్లోకి జమ చేస్తున్నాం. 3.25 లక్షల మందికి రూ.325 కోట్ల చేదోడు.. ఇవాళ క్రమం తప్పకుండా వరుసగా నాలుగో ఏడాది జగనన్న చేదోడు కార్యక్రమాన్ని అమలు చేస్తూ... 3.25 లక్షల మందికి రూ.325 కోట్లు బటన్ నొక్కి వారి ఖాతాల్లో జమ చేస్తున్నాం. ఈ రోజు సగర్వంగా తెలియజేస్తున్నాను. ఈ 3.25 లక్షల మంది జగనన్న చేదోడు పథకం లబ్ధిదారుల్లో 1.80 లక్షల మంది టైలర్ అన్నదమ్ములకు, అక్కచెల్లెమ్మలకు, 1,04,500 లక్షల మంది రజక సోదరులు, అక్కచెల్లెమ్మలకు, దాదాపు 40వేల నాయీ బ్రాహ్మణ అక్కచెల్లెమ్మలకు, అన్నదమ్ములకు ఈ కార్యక్రమం ద్వారా మంచి జరుగుతుంది. కేవలం జగనన్న చేదోడు అనే పథకం ద్వారా ఇవాళ జమ చేస్తున్న నగదుతో కలిపితే ఇప్పటివరకు ఈ పథకం ద్వారా రూ.1251 కోట్లు అందించాం. ఈ నాలుగు సంవత్సరాల కాలంలో ఒక్క చేదోడు పథకం ద్వారా లక్షలాది మందికి రూ.40 వేల వరకు వారి కుటుంబాలకు ఇవ్వగలిగాం. గతానికీ ఇప్పటికీ పోల్చి చూడండి. 52 నెలల కాలంలో ప్రతి అడుగు ఈ విధంగానే వేస్తూ.. రూ. 2.38 లక్షల కోట్లు నేరుగా బటన్ నొక్కి నా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లో జమ చేశాం. ఎక్కడా ఎవ్వరూ లంచాలు అడగడం లేదు. వివక్ష చూపించడం లేదు. మీ బిడ్డ హయాంలో మన ప్రభుత్వంలో ఈ రకంగా మంచి చేయగలిగాం. చేతివృత్తులను నమ్ముకుని చిన్న చిన్న షాపులు పెట్టుకుని, చిన్న చిన్న వ్యాపారాలు చేస్తూ జీవనోపాధి పొందుతున్న ఇటువంటి వారు బతకలేని పరిస్థితిలోకి వస్తే ఈ వ్యవస్థ కుప్పకూలిపోదా? ఇటువంటి వారి గురించి ఇంతకముందు ఎవరైనా ఆలోచన చేశారా? గత ప్రభుత్వాలు ఎప్పుడూ ఆలోచన చేయని విధంగా ఈ 52 నెలల పాలనలో ప్రతి అడుగులోనూ తోడుగా ఉంటున్నాం. చేదోడు, వాహన మిత్ర, ఇలా స్వయం ఉపాధిని ప్రోత్సహించే అనేక పథకాల ద్వారా తోడుగా ఉంటున్నాం. ప్రతి ఏటా క్రమం తప్పకుండా ఎవరూ ఇబ్బంది పడకుండా వారందరికీ సహాయం అందించే కార్యక్రమం నాలుగేళ్ల మీ బిడ్డ పరిపాలనలోనే జరుగుతోంది. ప్రతి అడుగులోనూ నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ, నా పేద వర్గాలు అంటూ ప్రతి అడుగులోనూ చేయి పట్టుకొని నడిపించే కార్యక్రమం జరుగుతోంది. ప్రతి పేద ఇంట్లో నా అక్కచెల్లెమ్మలకు తోడుగా ఉంటున్నాం. వారి పిల్లలకు సొంత మేనమామగా ఉంటూ అడుగులు వేయిస్తున్నాం. అక్కచెల్లెమ్మలకు తోడుగా– నవరత్నాలు.. అక్కచెల్లెమ్మలు బాగుంటేనే కుటుంబాలు బాగుంటాయని, వారికి తోడుగా నిలబడుతూ ఈ నాలుగేళ్లలో కేవలం అక్కచెల్లెమ్మల కోసం వైయస్సార్ ఆసరా ద్వారా పొదుపు సంఘాల్లో ఉన్న వారిని చేయి పట్టుకొని నడిపిస్తూ తోడుగా ఉన్నాం. 78,94,169 మంది అక్కచెల్లెమ్మలకు స్వయం ఉపాధిని ప్రోత్సహిస్తూ వారికి అందించిన సాయం ఇప్పటికి రూ.19,178 కోట్లు. మరలా ఈ జనవరిలో మరో రూ.6,500 కోట్లు నా అక్కచెల్లెమ్మలకు వైయస్సార్ ఆసరా కింద ఇవ్వనున్నాం. ఆక్కచెల్లెమ్మలు బాగుండాలని... వారికి సున్నా వడ్డీ కింద రూ.4,969 కోట్లు ఇచ్చాం. వైఎస్సార్ చేయూత పథకం ఈ పథకం కింద 45–60 సంవత్సరాల మధ్య ఉన్న నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీకి చెందిన 26,39,703 మంది అక్కచెల్లెమ్మలని ప్రోత్సహిస్తూ అమూల్, ఐటీసీ, రిలయన్స్, హిందుస్తాన్ యూనిలీవర్ లాంటి సంస్థలను తీసుకురావడమే కాకుండా బ్యాంకులతో వారిని అనుసంధానం చేసి తోడుగా ఉన్నాం. ఒక్క వైయస్సార్ చేయూత పథకం ద్వారా బటన్ నొక్కి మీ బిడ్డ పంపించిన సొమ్ము రూ.14,129 కోట్లు. ఈ జనవరిలో వైయస్సార్ చేయూత కింద మరో రూ.5 వేల కోట్లు ఇవ్వనున్నాం. కాపు నేస్తం ఈ పథకం కింద 3,57,844 మందికి తోడుగా నిలబడ్డాం. వారికి రూ.2,028 కోట్లు ఇచ్చాం. వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం ద్వారా పేద 4.40 లక్షల మందిఅక్కచెల్లెమ్మలకు రూ.1257 కోట్లు ఇవ్వగలిగాం. వైఎస్ఆర్ మత్స్యకార భరోసా ఈ పథకం ద్వారా 2,43,394 మందికి స్వయం ఉపాధిని ప్రోత్సహిస్తూ 538 కోట్లు ఇవ్వగలిగాం. వైయస్సార్ నేతన్న నేస్తం ద్వారా 82 వేల చేనేత కుటుంబాలకు ఇప్పటికే ఇచ్చిన సాయం రూ.982 కోట్లు. వాహన మిత్ర ద్వారా 2,75,931 మంది డ్రైవర్ అన్నదమ్ములకు రూ.1,302 కోట్లు బటన్ నొక్కి వారి ఖాతాల్లో జమ చేశాం. జగనన్న తోడు ద్వారా స్వయం ఉపాధిని ప్రోత్సహిస్తూ చిరువ్యాపారాలు చేసుకుంటున్న.. 15,87,492 మంది చిరు వ్యాపారులకు రూ.2956 కోట్లు ఇవ్వగలిగాం. వడ్డీ వ్యాపారులు చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా రూ.10వేలు ఒక్కొక్కరికి ఇస్తున్నాం. ఇప్పుడు చెప్పిన పథకాలన్నీ ఇంతకు ముందు జరిగాయా? ఇవ్వగలిగారా? అని ఆలోచన చేయాలి. ఇలా నిజంగానే ఒక ప్రభుత్వం వస్తుంది, ఎక్కడా లంచాలు లేవు, అర్హత ఉంటే చాలు నా ఖాతాలోకి డబ్బు వస్తుందని నాలుగు సంవత్సరాల క్రితం ఎవరైనా అనుకున్నారా? ఇవన్నీ 52 నెలల మన పరిపాలనలో.. గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఈరోజు ఇవన్నీ జరుగుతున్నాయి. అప్పుడైనా, ఇప్పుడైనా అదే బడ్జెట్, అదే రాష్ట్రం, మారిందల్లా కేవలం ఒక ముఖ్యమంత్రి మాత్రమే. ఆలోచన చేయమని అడుగుతున్నాను. అదే రాష్ట్రం, అదే బడ్జెట్, అప్పులు పెరుగుదల కూడా అప్పటి కంటే ఇప్పుడు తక్కువే. మరి అప్పుడు ఎందుకు జరగలేదు? మీ బిడ్డ పరిపాలనలో ఎందుకు జరుగుతోంది ఆలోచన చేయమని అడుగుతున్నాను. గతానికి ఇప్పటికీ తేడా ఏమిటో తెలుసా? ఒకే ఒక్క తేడా. మీ బిడ్డ మనసు. బటన్ నొక్కుతున్నాడు. నేరుగా నా అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి డబ్బులు వెళ్లిపోతున్నాయి. దోచుకునే గజదొంగల ముఠా... అప్పట్లో జరిగేదేమిటి? ఒక గజదొంగల ముఠా. ఒక ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, ఒక టీవీ5, ఒక చంద్రబాబు నాయుడు, వీరికి తోడు ఒక దత్తపుత్రుడు. వీళ్లందరూ కూడా దోచుకోవడం, దోచుకున్నది పంచుకోవడం, పంచుకన్నది తినుకోవడం. అప్పటికి ఇప్పటికి తేడా ఇదీ. అప్పట్లో గజదొంగల ముఠా రాష్ట్రాన్ని దోచేసిన పరిస్థితి. ఇప్పుడు మీ బిడ్డ పరిపాలనలో బటన్ నొక్కుతున్నాడు, నేరుగా నా అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి పోతోంది. ఎక్కడా ఎవరూ లంచాలు అడగటం లేదు. ఎవరూ వివక్ష కూడా చూపించడం లేదు. ఈ తేడాను గమనించండి. పేద కుటుంబాలు కోరుకునేది... ఏ పేద కుటుంబం అయినా కూడా ఏం కోరుకుంటుంది? రైతు కావొచ్చు, కూలీ కుటుంబం కావొచ్చు, ఎవరైనా ఏమి కోరుకుంటారు. సంప్రదాయ వృత్తులు చేసుకుంటున్న వారైనా, పేదరికంలో ఉన్న వారు ఏం కోరుకుంటారు? పేదరికంలో ఉన్న వాళ్లందరూ కోరుకొనేది తమ కుటుంబానికి ఎప్పుడైనా వైద్యం అవసరమైతే అది ఎన్ని లక్షలైనా ప్రభుత్వం మంచి మనసుతో వాళ్లకు తోడుగా ఉండే ప్రభుత్వం రావాలి, కావాలని కోరుకుంటుంది. ప్రతి పేద కుటుంబం.. తమ కుటుంబానికి తమ ఇంటి ముందుకే వచ్చి తమ ఆత్మగౌరవాన్ని నిలబెడుతూ లంచాలు లేకుండా, వివక్ష చూపకుండా పౌర సేవలన్నీ వాళ్ల చేతికి ఇచ్చిపోయే ప్రభుత్వం కావాలని కోరుకుంటుంది. ఏ పేద కుటుంబమైనా... తమ కుటుంబానికి ఇంటి స్థలమో, ఇల్లు అవసరం అయినప్పుడు దాన్ని ప్రభుత్వం గుర్తించి ఇంటి స్థలం ఇవ్వడంతో పాటు, ఇల్లు కట్టించి ఇవ్వాలన్న తపన, తాపత్రయం ఉన్న ప్రభుత్వం రావాలి, కావాలని కోరుకుంటుంది. ఏ పేద కుటుంబమైనా... వారి కష్టాలను అర్థం చేసుకొని ఒక నిరుపేద కుటుంబాన్ని శాశ్వతంగా పేదరికం నుంచి బయట పడేసేందుకు.. ఆ కుటుంబంలోని పిల్లలను చదివించే మంచి మేనమామ ముఖ్యమంత్రి స్థానంలో ఉండాలని కోరుకుంటుంది. ఏ పేద కుటుంబమైనా... అవ్వాతాతలను సంతృప్త స్థాయిలో ఆదుకోవాలని, అటువంటి మనసున్న పాలకులు రావాలని కోరుకుంటుంది. అక్కచెల్లెమ్మల సాధికారతకు, అండగా, తోడుగా నిలబడే ఒక మంచి అన్నయ్య, మంచి తమ్ముడు ఆ ముఖ్యమంత్రి స్థానంలో కూర్చొని ఉండాలని ప్రతి పేద కుటుంబం కోరుకుంటుంది. ఆలోచన చేయమని అడుగుతున్నాను. ఇలాంటి మార్పులన్నీ రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో, గ్రామంలో కుటుంబంలో ఈ మార్పులు మన కళ్ల ఎదుటే ప్రస్ఫుటంగా కనిపించేట్టుగా పాలన కనిపిస్తే అలాంటి పాలనను ఏమంటారు? అలాంటి పాలనను.. అదీ మా పాలన, మనందరి పాలన అంటారు. మా బిడ్డ పాలన అంటారు. మా అన్న, మా తమ్ముడు జగనన్న పరిపాలన అంటారు. చంద్రబాబు గత పాలన చూస్తే... మరి అదే గతంలో చంద్రబాబు పాలన చూస్తే కుప్పంలో ప్రజలకు కూడా చంద్రబాబు మా వాడు అని చెప్పుకొనే పరిస్థితి కూడా లేని పాలన అక్కడ కనిపిస్తుంది. ఆ కుప్పంలో కూడా పేద వాడికి ఇంటి స్థలం కావాలంటే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి చేయలేకపోయాడు. ఆ కుప్పంలో 20 వేల ఇంటి స్థలాలు ఇచ్చినది కూడా మీ బిడ్డ ప్రభుత్వమే. 8 వేల ఇళ్లు కట్టిస్తున్నది మీ బిడ్డ ప్రభుత్వమే. ఎన్నికలప్పుడు ఇదే పెద్దమనిషి చంద్రబాబు అన్న మాటలు మీ అందరికీ గుర్తున్నాయా ? అప్పట్లో ఎన్నికలప్పుడు మీ అందరి ఇళ్లకు లెటర్లు తీసుకొచ్చారు. చంద్రబాబు, దత్తపుత్రుడి సంతకంతో తీసుకొచ్చారు. ఆ రోజుల్లో ఎన్నికలప్పుడు ఇంటికి వెళ్లి టీవీ ఆన్ చేస్తే చాలు చంద్రబాబునాయుడు ముఖమే కనిపించేంది. రూ. రూ.87,612 కోట్లు వ్యవసాయ రుణాలు మాఫీ కావాలంటే, బ్యాంకుల్లో పెట్టిన రుణాలు మాఫీ కావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలనే మాటలు వినిపించేవి. బాబు ముఖ్యమంత్రి అయ్యాడు. రూ. 87,617 కోట్లు వ్యవసాయ రుణాల మాఫీ, ఇంటికి బంగారం రావడం దేవుడెరుగు.. అప్పటి దాకా రైతులకు వస్తున్న సున్నా వడ్డీ పథకం కూడా ఈ పెద్దమనిషి ఎత్తేశాడు. మొదటి సంతకంతోనే మాఫీ చేస్తానని చెప్పిన పెద్దమనిషి కేవలం రూ. 15 వేల కోట్లు కూడా ఇవ్వని పరిస్థితి వచ్చింది. సున్నా వడ్డీ పథకం కూడా రైతులకు రద్దై.. బ్యాంకుల్లో పెట్టిన బంగారం వేలం వేసే పరిస్థితిలో రైతన్న పడిన కష్టాలు ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకోండి. మీ బిడ్డ పాలనలో... మీ బిడ్డ పాలన 2019 మేనిఫెస్టోలో ఏ మాట చెప్పామో, అంతకన్నా మిన్నగా ప్రతి రైతన్న ముఖంలో సంతోషం కనిపించే విధంగా తోడుగా ఉంటూ నడిపిస్తున్న మీ ప్రభుత్వం. ఎన్నికలు అయిపోయిన వెంటనే మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేసింది బాబు ప్రభుత్వం. కనీసం 10 శాతం కూడా అమలు చేయని ఆ చంద్రబాబు పాలన గుర్తుకు తెచ్చుకోమని అడుగుతున్నాను. ఎన్నికలప్పుడు మీ బిడ్డ మాట ఇచ్చాడు. మేనిఫెస్టో తెచ్చాడు. చెప్పిన హామీల్లో 99 శాతం నెరవేర్చి, మేనిఫెస్టోను ప్రతి గడపకూ తీసుకెళ్లి, అక్కా జగన్ ఈ మాట చెప్పాడు. చెప్పిన ప్రతి మాటా చేశాడు అని ప్రతి గడప వద్దకూ వెళ్లి వాళ్ల ఆశీస్సులు తీసుకున్న పాలన మీ బిడ్డ పాలన. తేడా గమనించండి. బాబు జన్మభూమి కమిటీల నుంచి మద్యం అక్రమాలు వరకు... గతంలో చంద్రబాబు నాయుడు పరిపాలనలో జన్మభూమి కమిటీలతో మొదలు పెడితే రాజధానిలో భూముల నుంచి, స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ వరకు, అక్కడ నుంచి ఫైబర్ గ్రిడ్ దాకా, చివరికి మద్యం కొనుగోళ్లలో కూడా ఎక్కడ పడితే అక్కడ దోచేయడం, దోచుకున్నది పంచుకోవడం, పంచుకున్నది తినుకోవడం తప్ప వేరేది ఏమీ కనిపించలేదు. కానీ మీ బిడ్డ పాలనలో రూపాయి, పది రూపాయలు కాదు, వంద, లక్ష, కోటి రూపాయలు కాదు.. ఏకంగా రూ.2.38 లక్షల కోట్లు నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కి అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి జమ అవుతుంది. వివక్ష చూపించే పరిస్థితి లేదు, లంచాలు అడిగేవాడూ లేడు. పొదుపు సంఘాలను, నా అక్కచెల్లెమ్మలను మోసం చేస్తూ అప్పట్లో చంద్రబాబు అన్న మాటలు గుర్తున్నాయా? అప్పట్లో టీవీల్లో అడ్వర్టైజ్మెంట్లలో ఒక అక్కను, ఒక చెల్లెమ్మనూ చూపించి.. ఆ మంగళసూత్రాన్ని ఒకరు లాక్కొని పోయేవారు. వెంటనే ఒక చేయి వచ్చి పట్టుకుని ఆపేవారు. బాబు వస్తాడు, మంగళ సూత్రం నిలబడుతుందని అడ్వర్టైజ్ మెంట్ వచ్చేది. పొదుపు సంఘాల రుణాలు మాఫీ కావాలంటే...బాబు ముఖ్యమంత్రి అవ్వాలని అడ్వర్టైజ్మెంట్ వచ్చేది. బాబు ముఖ్యమంత్రి అయ్యాడు. పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలు అందరూ...బాబు మాట విని రుణాలు కట్టడం మానేశారు. దీంతో ఏ గ్రేడ్, బీ గ్రేడ్ లో ఉన్న సంఘాలన్నీ సీ గ్రేడ్, డీ గ్రేడ్ కి పడిపోయాయి. పొదుపు సంఘాలన్నీ కూడా 18 శాతం ఎన్ పీఏలు, ఔట్ స్టాండింగ్ గా నిలిచిపోయి, విలవిలలాడిపోయాయి. బాబు ముఖ్యమంత్రి అయ్యాడు ఆ పొదుపు సంఘాలకు అప్పటివరకూ ఉన్న సున్నావడ్డీ పథకం కూడా పూర్తిగా ఎత్తేశాడు. బాబు ఆ అక్కచెల్లెమ్మలను ఇబ్బంది పాలు జేస్తే.. ఆ ఇబ్బందుల్లోంచి అక్కచెల్లెమ్మలకు తోడుగా ఒక మంచి అన్నయ్య, మంచి తమ్ముడుగా మీ బిడ్డ రూపంలో ముఖ్యమంత్రి స్థానంలోకి వచ్చాడు. పొదుపు సంఘాల మహిళలకు తోడుగా నిలబడ్డాడు. చంద్రబాబు వల్ల నష్టపోయిన పొదపు సంఘాలకు వైయస్సార్ ఆసరా, సున్నా వడ్డీ, చేయూత, అమ్మ ఒడి ద్వారా ఆదుకోగలిగాడు. వాళ్లంతా ఇవాళ ఈరోజు అక్కచెల్లెమ్మలంతా ఏ గ్రేడ్, బీ గ్రేడ్ గా చలామణీ అవుతున్నాయి. అక్కచెల్లెమ్మలు వస్తున్నారంటే... బ్యాంకు మేనేజర్లు అక్కచెల్లెమ్మలకు సెల్యూట్ కొట్టి లోన్లు ఇచ్చే కార్యక్రమాలు మీ బిడ్డ హయాంలో జరుగుతోంది. అప్పట్లో 18శాతంగా ఉన్న ఎన్పీఏలు, అవుట్ స్టాండింగ్ రుమాలు ఇవాళ కేవలం పాయింట్ .03 శాతం మాత్రమే ఎన్ పీఏలు, ఔట్ స్టాండింగ్ లుగా తలెత్తుకునే పరిస్థితుల్లో పొదుపు సంఘాలు రాష్ట్రం కాదు, దేశం మొత్తం ఈ రోజు మన అక్కచెల్లెమ్మల వైపు చూస్తోంది. ఆంధ్రరాష్ట్రంలో పొదుపుసంఘాల అక్కచెల్లెమ్మలకు ఇంతి మంచి ఎలా చేయగలిగిందీ, ఇంత మార్పు ఎలా వచ్చిందని దేశమంతా మనవైపు చూస్తోంది. అప్పట్లో చంద్రబాబు హయాంలో అక్కచెల్లెమ్మలు, పేద వాడి గురించి ఆలోచన చేసిన వారు ఎవరూ లేరు. కనీసం పేద వాడికి, అక్కచెల్లెమ్మలకు ఇంటి స్థలం కూడా ఒక్క సెంటైనా ఇచ్చిన పాపాన పోలేదు. 31 లక్షల మందికి ఇళ్లపట్టాలిస్తూ.... ఆ తర్వాత మీ బిడ్డ ముఖ్యమంత్రి అయ్యాడు. మళ్లీ ఆ అక్కచెల్లెమ్మలకు మంచి చేస్తూ ఏకంగా 31 లక్షల ఇంటి పట్టాలు నేరుగా నా అక్కచెల్లెమ్మలకు ఇచ్చాం. 10 వేలు కాదు, 20 వేలు కాదు, లక్ష కాదు.. ఏకంగా 31 లక్షల ఇంటి పట్టాలు ఇచ్చాం. అంటే దాదాపుగా కనీసం ఇంట్లో ముగ్గురు ఉన్నారనుకుంటే కోటి మంది ప్రజలకు ఇంటి పట్టాలు పొందిన పరిస్థితి ఉంది. అంతే కాకుండా అందులో 22 లక్షల ఇళ్లు నిర్మాణంలో వేగంగా కడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. జాబు రావాలంటే.. ఆలోచన చేయండి. ఇదే పెద్దమనిషి అప్పట్లో మాట్లాడిన మాటలు గుర్తున్నాయా ? జాబు రావాలాంటే బాబు రావాలి అని మాట్లాడాడు. ఒక వేళ జాబు ఇవ్వకపోతే ఇంటింటికీ రూ.2 వేలు నిరుద్యోగ భృతి ఇస్తామని ఊదరగొట్టారు. బాబు సీఎం అయ్యి చివరకు పిల్లలను సైతం మోసం చేశాడు. మన ప్రభుత్వంలో 2.07 లక్షల కొత్త ఉద్యోగాలు... ఆ తర్వాత మీ బిడ్డ ముఖ్యమంత్రి అయ్యాడు. స్వాతంత్య్రం వచ్చాక మొత్తం 4 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలంటే నాలుగేళ్ల పాలనలో ఏకంగా 2.07 లక్షల ఉద్యోగాలు మీ బిడ్డ యాడ్ చేశాడు. అంతే కాకుండా వాటిలో నా ఎస్టీలు, నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనార్టీ వర్గాల వారికి వచ్చిన ఉద్యోగాలు 80 శాతం ఉన్నాయి. గడప వద్దకే ప్రభుత్వ సేవలు... గతంలో ఏ పౌర సేవ కావాలన్నా... ఒక పెన్షన్, రేషన్, ఏ పని కావాలన్నా జన్మభూమి కమిటీల చుట్టూ లంచాలు ఇచ్చుకుంటూ చెప్పులరిగేలా తిరుగుతూ, అవస్థలు పడుతున్న రోజులు గుర్తుకొస్తున్నాయా? అప్పట్లో చంద్రబాబు హయాంలో రైతులకు ఎరువులు, పురుగుమందులు కావాలంటే తెల్లవారకముందే మండల కేంద్రాలకు వెళ్లి అక్కడ క్యూలో నిలబడి, ఎండనక, వాననక, చలి అనక మనుషులు చనిపోతున్నా పట్టించుకోని పాలన. మీ బిడ్డ పాలనలో ఈరోజు అవన్నీ కూడా మన గ్రామం వద్దకే, మన గడప వద్దకే, మన ఇంటి వద్దకే చిక్కటి చిరునవ్వులతో వాలంటీర్లు వచ్చి చేయి పట్టుకొని నడిపిస్తున్నారు. చంద్రబాబు - ఆరోగ్యశ్రీ నిర్లక్ష్యం... అప్పట్లో చంద్రబాబునాయుడు హయాంలో ఆరోగ్యశ్రీని ఎలా వదిలించుకోవాలన్న ఆలోచనలతో పరిపాలన సాగింది. రాష్ట్రంలో 108, 104 వాహనాలకు కనీసం డీజిల్ ఖర్చులు ఇవ్వడానికి వెనకాడే పరిస్థితి. తేడా ఈరోజు గమనించండి. మీ బిడ్డ పాలన వచ్చిన వెంటనే రాష్ట్రంలో ఏకంగా 18 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు కడుతున్న పరిస్థితి. ఇక్కడే ఆదోనిలోనే ఒక మెడికల్ కాలేజీ మొట్టమొదటి సారి కడుతున్న పరిస్థితి. ఏకంగా 1,600 కొత్త వాహనాలు 104, 108 వాహనాలను కొనుగోలు చేసి ప్రతి పేదవాడికీ తోడుగా ఉండేట్లుగా ఏర్పాటు చేశాం. అప్పట్లో కేవలం 1000 రోగాలకు పరిమితమైన ఆరోగ్యశ్రీని ఇవాళ 3,300 రోగాలకు విస్తరించిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆరోగ్యశ్రీ మాత్రమే కాదు ఆ పేషెంట్ ఏదైనా ఆపరేషన్ చేసుకుని ఇబ్బందులు పడే పరిస్థితులు వచ్చినప్పుడు ఇంటికి వెళ్లి పనిచేసుకోలేని పరిస్థితుల్లో ఉంటాడని... ఎన్ని నెలలైనా నెలకు రూ.5 వేల చొప్పున రెస్ట్ కోసం ఆరోగ్య ఆసరా తీసుకొచ్చాం. ఇది కూడా మీ బిడ్డ పరిపాలనలోనే జరుగుతోంది. గ్రామాల్లోనూ సమూల మార్పులు... ఇవాళ గ్రామ, గ్రామాన విలేజ్ క్లినిక్‌లు కనిపిస్తున్నాయి. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ కనిపిస్తోంది. ఈ సేవలన్నింటికీ తోడు జగనన్న ఆరోగ్య సురక్ష పేరుతో ప్రతి ఇంటికీ వచ్చి జల్లెడ పడుతూ మందులు, టెస్టులు, చికిత్సలు ఉచితంగా చేయడం కోసం మిమ్నల్ని చేయిపట్టుకుని నడిపించే పరిపాలన కూడా మీ బిడ్డ ప్రభుత్వంలోనే జరుగుతోంది. మన నిరుపేదలందరూ అంటే నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు వెళ్లేది ప్రభుత్వ స్కూళ్లకే. అటువంటి స్కూళ్లను తెలుగు మీడియంకే పరిమితం చేసి నారాయణ, చైతన్య స్కూళ్లను పెంచి పోషించి పేదవాడిని అమ్మేసిన పరిస్థితి చంద్రబాబు హయాంలో జరిగింది. చదువుల విప్లవం.... ఈరోజు నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ,పేద వర్గాల పిల్లలు బాగా చదవాలని నాడు–నేడు ద్వారా వాళ్ల గురించి ఆలోచన చేసి గవర్నమెంట్ బడులన్నీ రూపురేఖలన్నీ మారుతున్నాయి. 6వ తరగతి నుంచి పైతరగతులన్నీ ఇంటరాక్టివ్ ఫ్లాట్ ఫ్యానెల్స్‌తో డిజిటలైజేషన్ చేస్తున్నాం. 8వ తరగతికి వచ్చే సరికి ప్రతి పేదవిద్యార్దిని చేయిపట్టుకుని నడిపిస్తూ.. పిల్లలందరికీ ట్యాబ్ లు ఇస్తున్న పరిపాలన జరుగుతోంది. పిల్లలు స్కూలుకు సంతోషంగా వెళ్లాలి. బాగా చదువుకోవాలని రోజుకో మెనూతో గోరుముద్ద అమలవుతోంది. స్కూళ్లు తెరిచే సమయానికే పిల్లల కోసం ఆలోచన చేసి.. వారి కోసం విద్యా కానుక కిట్టు ఇస్తున్నాం. మొట్టమొదటిసారిగా బైజూస్ కంటెంట్ తీసుకొచ్చాం. ఇంగ్లీష్ మీడియం, సీబీఎస్ ఈ తీసుకొచ్చాం. ఐబీ సిలబస్ దిశగా అడుగులు వేస్తున్నాం. బైలింగువల్ పాఠ్యపుస్తకాలు కూడా ఈరోజు మన ప్రభుత్వ బడులలో అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ మీ బిడ్డ ప్రభుత్వంలోనే వచ్చాయి. గతానికీ, ఇప్పటికీ తేడా గమనించండి. గతంలో పేదవాడి గురించి ఆలోచన చేసే పరిస్థితి లేదు. పైగా పేద వాడిని అహంకారధోరణి, పెత్తందారీ మనస్తత్వంతో అవమానించిన రోజులు ఉన్నాయి. గతంలో ఎస్సీ కులాల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా? అని చంద్రబాబు నాయుడు అన్న మాటలు గుర్తున్నాయా ? బీసీల తోకలు కత్తిరిస్తా కబడ్దార్ అని చంద్రబాబు అన్న మాటలు గుర్తున్నాయా? అప్పట్లో అక్కచెల్లెమ్మలనూ సైతం అవహేళన చేస్తూ... కోడలు మగపిల్లాడిని కంటానంటే అత్త వద్దంటుందా? అని ఆడ పిల్లలను అవహేళన చేసినది గుర్తుందా? ఈరోజు పేద వాడు చంద్రబాబు నాయుడుగారి రాజధాని నగరం అని పేరు పెట్టుకున్నాడో, అక్కడ ఇళ్ల స్థలాలను ఇస్తే అడ్డు తగులుతూ కోర్టులకు వెెళ్లారు. డెమోగ్రాఫికల్ ఇంబ్యాలెన్స్ వస్తుందని నిస్సిగ్గుగా పేద వాడికి ఇళ్ల స్థలాలు ఇవ్వొద్దని కోర్టులకు వెళ్లిన కేసులు వేసిన పరిస్థితి. ఇటువంటి పెద్ద మనిషి ఒకవైపు, మరోవైపు మీ బిడ్డ ఉన్నాడు. మీ బిడ్డ నోరు తెరిస్తే, ప్రతి మీటింగులో, ప్రతి చోటా అనే మాట నా ఎస్సీ, నాఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ, నా పేద వాడు అంటూ తోడుగా ప్రభుత్వం ఉందని ప్రతి అడుగులోనూ భరోసా ఇస్తూ, ప్రేమ, బాధ్యత చూపుతున్న ప్రభుత్వం మనది. రాబోయేది కురుక్షేత్ర యుద్ధం... వీళ్లద్దరి మధ్య యుద్ధం జరుగుతుంది. రాబోయేది, జరగబోయేది కురుక్షేత్రయుద్ధం. రాబోయే యుద్ధం కులాల మధ్య కాదు, క్లాస్ వార్. పేద వాడు ఒకవైపు, పెత్తందారు మరొకవైపున ఉండి యుద్ధం జరగబోతోంది. ఆలోచన చేయాలని, గమనించమని కోరుతున్నాను.మీ బిడ్డకు అరడజను టీవీ చానళ్ల సపోర్ట్ లేదు. ఒక ఈనాడు, ఆంధ్రజ్యోతి, దత్తపుత్రుడి అండ తోడు ఉండదు. రేపు జరగబోయే కురక్షేత్ర సంగ్రామంలో కౌరవులు అందరూ ఏకమవుతారు. తోడేళ్లందరూ ఏకమవుతారు. కానీ మీ బిడ్డకు ఉన్నది పైన దేవుడి దయ, మీ చల్లని దీవెనలు తప్ప ఏదీ లేదు. మీ బిడ్డ పైన దేవుడిని, మిమ్నిల్ని తప్ప మరెవ్వరినీ నమ్ముకోలేదు. రేపు జరగబోయే కురుక్షేత్రంలో టు వేయడానికి వెళ్లేటప్పుడు ఒక్కటేఆలోచన చేయండి. వీళ్లు చెప్పే మోసాలను నమ్మకండి. అబద్దాలను నమ్మకండి. ఒక్కటే కొలమానంగా తీసుకొండి. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగిందా లేదా అన్నది మాత్రమే కొలమానంగా తీసుకోండి. మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు మీరే సైనికులుగా నిలవండి. దేవుడి చల్లని దీవెనలు, ఇంకా ఎక్కువ మంచి చేసే పరిస్థితులు దేవుడు ఇవ్వాలని, దాని వల్ల ప్రతి పేద వాడికీ మంచి చేసే అవకాశం, పరిస్థితులు మరింతగా మీ బిడ్డకు రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. చివరిగా... కాసేపటి క్రితం ఎమ్మెల్యే చెన్నవకేశవరెడ్డి మాట్లాడుతూ గాజులదిన్నె ప్రాజెక్టుకు, గొనగొండ, ఆలూరు, పత్తికొండకు కనెక్టివిటీ, హంద్రీనీవా నదిపైన రూ.47 కోట్లు ఖర్చయ్యే హైలెవెల్ బ్రిడ్జి అడిగారు. దాన్ని మంజూరు చేస్తున్నాను. మరింత మంచి చేసే పరిస్థితులు రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అని సీఎం ప్రసంగం ముగించారు. -
పట్టు వదలని విక్రమార్కుడు మన సీఎం జగన్
-
కర్నూలు జిల్లాలో ఘోర ప్రమాదం.. బావిలోకి దూసుకెళ్లిన కారు..
సాక్షి, కర్నూలు: కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్టేక్ చేయబోయిన కారు.. అదుపుతప్పి బావిలోకి పడిపోయింది. ఎమ్మిగనూరు మండలం ఎర్రకోట దగ్గర ఈ ప్రమాదం జరిగింది. కర్నూలు నుంచి ఎమ్మిగనూరు వెళుతున్న కారు వ్యవసాయ బావిలో పడటంతో అందులో ప్రయాణిస్తున్న నలుగురు మృత్యువాతపడ్డారు. బావిలో నీరు ఎక్కువ ఉండటంతో కారు మొత్తం మునిగిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు కారును బావిలోంచి తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
కర్నూలు: అంగరంగ వైభవంగా నీలకంఠేశ్వర స్వామి మహా రథోత్సవం
-
Kurnool: ఇండియన్ క్రికెట్ టీంకు ఎమ్మిగనూరు విద్యార్థి ఎంపిక
ఎమ్మిగనూరుటౌన్/కర్నూలు: అండర్ 19 ఇండియన్ క్రికెట్ జట్టుకు ఎమ్మిగనూరుకు చెందిన విద్యార్థి కె.మహబుబ్‌బాషా ఎంపికయ్యాడు. స్థానిక ప్రైవేట్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతున్న ఈ విద్యార్థి క్రికెట్లో తన ప్రతిభ చూపి జాతీయ జట్టులో స్థానం దక్కించుకున్నాడు. నాగపూర్‌లో గత నెల 27 నుంచి ఈనెల 12వ తేదీ వరకు అండర్ 19 ఇండియన్ క్రికెట్ జట్టుకు ఎంపిక పోటీలు నిర్వహించారు. అందులో మహబుబ్‌బాషా ప్రతిభ కనబరిచాడు. దుబాయ్‌లో డిసెంబర్ 7 నుంచి 15వ తేదీ వరకు జరగనున్న క్రికెట్ పోటీల్లో అండర్ 19 ఇండియా జట్టు తరఫున ఈ విద్యార్థి ఆడనున్నాడు. ఇండియన్ టీంలో స్థానం దక్కించుకున్న మహబుబ్‌బాషాను సోమవారం కళాశాల డీన్ లింగేశ్వర్రెడ్డి, ప్రిన్సిపాల్ అయ్యప్ప, ఏజీఎం రమణారెడ్డి, తల్లిదండ్రులు మహమ్మద్ రఫీక్, శైనాజ్, స్థానికులు అభినందించారు. చదవండి: Ind Vs Nz 1st T20- Deepak Chahar: రోహిత్ భయ్యాతో మాట్లాడాను.. ‘హోం గ్రౌండ్’లో ఓపెనర్‌గా దిగుతా -
కాన్పుల్లో ఎమ్మిగనూరు టాప్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రసవాలు సగటున ఎక్కువగా జరుగుతున్న సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మొదటి స్థానంలో ఉన్నట్లు వైద్య విధాన పరిషత్ గణాంకాల్లో తేలింది. 2019 ఏప్రిల్ నుంచి 2020 మార్చి వరకు సామాజిక ఆరోగ్య కేంద్రాలు, ఏరియా ఆస్పత్రులు, జిల్లా ఆస్పత్రుల్లో కాన్పుల గణాంకాలు సేకరించారు. ఇక ఏరియా ఆస్పత్రుల్లో కాన్పుల్లో విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం, జిల్లా ఆస్పత్రుల్లో విజయనగరం అగ్రస్థానంలో నిలిచాయి. జిల్లా ఆస్పత్రుల్లో ఎక్కువగా సిజేరియన్లు... 34 సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో నెలకు సగటున 50కి మించి ప్రసవాలు జరుగుతున్నాయి. సగటున వందకు మించి ప్రసవాలు జరుగుతున్నవి 8 ఆస్పత్రులున్నాయి. ఏరియా ఆస్పత్రుల్లో సగటున నెలకు వంద ప్రసవాలు జరిగే ఆస్పత్రులు 19 ఉన్నాయి. వైద్య విధాన పరిషత్ ఆస్పత్రుల్లో మొత్తం 1,67,128 ప్రసవాలు జరగ్గా 58,960 సిజేరియన్లు ఉన్నాయి. 35.27 శాతం సిజేరియన్ ప్రసవాలు జరిగాయి. జిల్లా ఆస్పత్రుల్లో ఎక్కువగా 47 శాతం సిజేరియన్ ప్రసవాలు నమోదయ్యాయి. సాధారణ కాన్పులకు ప్రాధాన్యం ఇస్తూ ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. సగటుకు మించి ప్రసవాలు జరుగుతున్న ఆస్పత్రులను హైలోడ్ డెలివరీ ఆస్పత్రులుగా గుర్తించి వసతులు మరింత మెరుగు పరచనున్నారు. ప్రసూతి వార్డులను యుద్ధప్రాతిపదికన ఉన్నతీకరిస్తున్నారు. గైనకాలజీ, పీడియాట్రిక్స్, అనస్థీషియా వైద్యుల బృందం ఉండేలా చర్యలు చేపట్టారు. అత్యాధునిక ప్రసూతి వార్డులు ‘నాడు – నేడు’ పనుల ద్వారా ప్రధానంగా సీహెచ్‌సీల్లో అత్యాధునిక ప్రసూతి వార్డులు ఏర్పాటు చేస్తున్నాం. ప్రతి ఆస్పత్రిలో ముగ్గురు వైద్యుల బృందం ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం. మౌలిక వసతులు భారీగా పెరగనున్నాయి. –డాక్టర్ యు.రామకృష్ణారావు, కమిషనర్, వైద్యవిధానపరిషత్ -
అబ్బుర పరచిన యువకుల విన్యాసాలు
సాక్షి, ఎమ్మిగనూరు రూరల్: దసరా పండుగ సందర్భంగా కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండల పరిధిలోని గుడేకల్ గ్రామంలో బుధవారం.. యువకులు ప్రదర్శించిన విన్యాసాలు అబ్బుర పరిచాయి. వీపుకు కడ్డీగుచ్చుకొని గ్యాస్ సిలిండర్లు ఎత్తడం, బండలను లాగటం, చిన్న తాడుకట్టుకొని బండరాయిని లాగటం, గొంతుకు కడ్డీలు గుచ్చుకొని ట్రాక్టర్లు లాగటం, ఫల్టీలు కొడుతు ట్యూబ్లైట్లను పగలగొట్టడం, ఇనుప మేకులపై నడుస్తూ బండలు లాగటం, కుస్తీలు.. వంటి విన్యాసాలు వీక్షకులకు ఒళ్లు జలదరింపజేశాయి. ప్రతి సంవత్సరం దసరా పండుగ రోజు పెద్దలు, యువకులు విన్యాసాలు చేయడం ఆనవాయితీ. యువకుల సాహస విన్యాసాలు వీక్షకుల ఒళ్లను జలదరింపజేశాయి. -
ఎమ్మిగనూరు బహిరంగ సభలో వైఎస్ జగన్
-
రోజుకో సినిమా చూపిస్తారు..బీ కేర్‌ఫుల్
సాక్షి, ఎమ్మిగనూరు : ‘‘ఈ అయిదేళ్ల చంద్రబాబు పాలన గురించి అందరూ ఆలోచించండి. అధికారంలోకి వచ్చేముందు చంద్రబాబు రైతులకు, అక్కచెల్లెమ్మలకు ఏం హామీ ఇచ్చారో అందరికీ తెలుసు. ఈ పెద్ద మనిషి అన్నిరకాలుగా అందరినీ మోసం చేశారు. రైతుల రుణాలు మాఫీ చేస్తామని గత ఎన్నికల్లో చెప్పారు. విడతల వారీగా ఇస్తామని చెప్పి రైతులను మోసపూరిత వాగ్దానాలు చేశారు. మళ్లీ ఎన్నికలు దగ్గర్లో పెట్టుకుని బ్యాంకుల్లో వేస్తామని చెబుతున్నారు. ఇంతగా మోసం చేస్తున్న చంద్రబాబు అసలు మనిషేనా?. ఇదే చంద్రబాబు పాలన ఎల్లో మీడియాకు మాత్రం బంగారంలా కనిపిస్తుంది.’’ అని ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సూటిగా ప్రశ్నించారు. శనివారం ఆయన ఎన్నికల ప్రచారంలో భాగంగా కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో బహిరంగ సభలో ప్రసంగించారు. అధికారం కోసం ఎంతకైనా తెగించే చంద్రబాబు, ఆయనకు వత్తాసు పలికే ఎల్లో మీడియా...ప్రజలకు రోజుకో సినిమా చూపిస్తాయని, ఈ విషయంలో అందరూ అప్రమత్తంగా ఉండాలని వైఎస్ జగన్ సూచించారు. ఓ వైపు చంద్రబాబు, మరోవైపు ఎల్లో మీడియా కుట్రలు అందరూ చూస్తున్నారని, ఈ కుట్రలు ముందు ముందు ఇంకా పెరిగిపోతాయన్నారు. లేనిది ఉన్నట్లు, ఉన్నది లేనట్లు చూపిస్తారని, గ్రామాలు మూటలు మూటలు డబ్బులు పంపిస్తారన్నారు. ప్రతి ఒక్కరికీ రూ.3వేలు ఇచ్చేందుకు చంద్రబాబు సిద్ధం అయిపోతున్నారని, ఆ డబ్బుకు ఆశపడ వద్దని వైఎస్ జగన్ కోరారు. కొద్దిరోజులు ఓపిక పడితే మళ్లీ రాజన్న రాజ్యం వస్తుందని, అందరికీ న్యాయం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి... ఎమ్మిగనూరు అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి, కర్నూలు నియోజకవర్గ పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ సంజీవ్ కుమార్‌ను ఆశీర్వదించాలని వైఎస్ జగన్ ఈ సందర్భంగా ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. చదవండి....(దోచుకుని దేశంలో ధనిక సీఎం అయ్యారు: వైఎస్ జగన్) బాబును నమ్మి రైతులు మోసపోయారు వైఎస్ జగన్ ఇంకా ఏం మాట్లాడారంటే... ఆంధ్రప్రదేశ్‌లో రైతుల రుణాలు మాఫీ చేయలేదు. చంద్రబాబును నమ్మి రైతులు మోసపోయారు. రైతులకు కనీస గిట్టుబాటు ధరకూడా రాలేదు. ఈనాడు సర్వం కోల్పోయి అన్నదాతలు రైతులకు చివరకు రైతు బీమా కూడా ఇవ్వలేదు. హెరిటేజ్ కోసం రైతులను దోచి దళారులను బాగు చేస్తున్నారు. వ్యవసాయ రంగంలో దేశంలోనే మనం చివరి స్థానంలో ఉన్నాం. రైతుల రుణాలు 85వేల కోట్ల నుంచి లక్షా 50వేల కోట్లకు పెరిగాయి. ఏపీలో రైతుల అప్పులు ఏస్థాయిలో ఉన్నాయో నాబార్డు నివేదికలు చెబుతాయి. ఇక పొదుపు సంఘాల రుణాలు మాఫీ చేయలేదు. డ్వాక్రా సంఘాలకు సున్నా వడ్డీ రుణాల పథకాన్ని తీసేశారు. అసెంబ్లీలో మేము అడిగిన ప్రశ్నకు ..డ్వాక్రా సంఘాల రుణాలు మాఫీ చేయబోమని అసెంబ్లీ సాక్షిగానే చెప్పారు. చంద్రబాబు ఇచ్చే హామీలు, ప్రలోభాలకు మోసపోకండి. కొద్ది రోజులు ఓపికపడితే వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. ఎన్ని లక్షలు ఖర్చు అయినా మీ పిల్లలను ఉన్నత చదువులు చదివిస్తా. పిల్లలను బడులకు పంపిస్తే ఏడాదికి రూ.15వేలు. రైతులకు ప్రతి ఏడాది మే నెలలో పెట్టుబడి సాయం రూ.12,500. 45 ఏళ్లు దాటిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు రూ.75వేలు. డ్వాక్రా మహిళలకు చెబుతున్నా.. ఎన్నికల నాటికి ఎంత రుణమున్నా నాలుగు దఫాల్లో నేరుగా ఇస్తాం. అవ్వా, తాతలకు రూ.3వేల వరకూ పింఛన్ ఇస్తాం. పసుపు-కుంకుమ డ్రామాకు మోసపోవద్దు. జగన్ రూ.2వేలు ఇస్తానని చెప్పకుంటే చంద్రబాబు ఇచ్చేవారా? ’ అని సూటిగా ప్రశ్నించారు. -
బుట్టా రేణుకకు చేదు అనుభవం!
సాక్షి, కర్నూలు : గత ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గుర్తుపై నెగ్గి, ఆపై ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ టీడీపీలో చేరిన ఎంపీ బుట్టా రేణుకకు చేదు అనుభవం ఎదురైంది. ఓ వైపు పార్టీ మారడంతో ప్రజా మద్దతు కోల్పోయిన బుట్టా రేణుకకు టీడీపీ నేతల నుంచీ అలాంటి పరిస్థితులే తలెత్తుతున్నాయి. టీడీపీలో చేరిన ఆమెకు పార్టీ నేతలు సహకారం అందడం లేదన్నట్లు కనిపిస్తోంది. ఎంపీ నిధుల కింద మంజూరైన మినీ వాటర్ ప్లాంట్ ప్రారంభోత్సవానికి బుట్టా రేణుక ఎమ్మిగనూరుకు వెళ్లారు. అయితే ఈ కార్యక్రమానికి ఒక్క టీడీపీ నేత కూడా హాజరు కాకపోవడంతో షాకవ్వడం ఆమె వంతు అయింది. దీంతో కేవలం బుట్టా రేణుక ఒక్కరే కార్యక్రమంలో పాల్గొని.. త్వరత్వరగా తన పని ముగించుకుని అక్కడి నుంచి వెళ్లిపోవడం గమనార్హం. -
ఎమ్మిగనూరులో ఎమైంది?
-
కదిలిన వైద్య సిబ్బంది
– గ్రామాల్లో వైద్య శిబిరాలు ఎమ్మిగనూరు రూరల్ : మండలంలో ప్రబలిన విష జ్వరాలపై మంగళవారం ‘సాక్షి’ లో ప్రచురితమైన కథనానికి అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించారు. ఎమ్మిగనూరు మండలంలోని వెంకటగిరి, ఎర్రకోట, కందనాతి, మసీదపురం గ్రామాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి రోగులకు వైద్య సేవలు అందించారు. శిబిరాల్లో మాత్రలతోపాటు సూదులు కూడా వేశారు. వెంకటగిరి గ్రామాన్ని ఎంపీపీ వాల్మీకి శంకరయ్య సందర్శించి వైద్య శిబిరానికి వెళ్లి రోగులకు అందిస్తున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో పర్యటించి పారిశుద్ధ్యంపై చర్యలు చేపట్టాలని పంచాయతీ అధికారులకు సూచించారు. మసీదు పురంలో హాలహర్వి పీహెచ్సీ డాక్టర్ అఖిలేష్ రోగులకు పరీక్షలు నిర్వహించారు. ఎర్రకోటలో దైవందిన్నె పీహెచ్సీ డాక్టర్ దుర్గాబాయి పరీక్షలు నిర్వహించి, సూదులు, మందులు వేశారు. ఈ గ్రామాల్లో మందును స్ర్పే చేయించి, బ్లీచింగ్ పౌడర్‌ను చల్లించారు. -
అయ్యో.. ఆర్టీసీ!
పెరగని ఆక్యుపెన్సీరేషియో రూ.2.20కోట్ల నష్టాల్లో ఎమ్మిగనూరు డిపో ఎమ్మిగనూరు: సంస్థ అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం.. ప్రయివేటు వాహనాల తాకిడి.. పని చేయని పరిరక్షణ కమిటీ.. వెరసి ఎమ్మిగనూరు ఆర్టీసీ డిపో నష్టాల బాటలో నడుస్తోంది. డిపోలో ఆక్యుపెన్సీరేషియో పెరగకపోగా మరింత దిగజారుతుండడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఎమ్మిగనూరు డిపో ఒకప్పుడు లాభాలబాటలో ఉండేది. ప్రయివేటు వాహనాలు.. స్టీరింగ్, మాక్సి ఆటోలు ఇబ్బడిముబ్బడిగా రోడ్డెక్కుతుండడంతో ఆర్టీసీ ఆదాయానికి గండిపడుతోంది. సమయ పాలన కొరవడడం కూడా నష్టాలకు కొంత కారణంగా తెలుస్తోంది. సమయానికి బస్సులు రాని పరిస్థితి ఉండటంతో ప్రయాణీకులు అందుబాటులో ఉన్న ఏదో ఒక వాహనాన్ని ఆశ్రయిస్తున్నారు. అలాగే చెయ్యెత్తిన చోట బస్సు ఆపాలని ఉన్నతాధికారులు ఆదేశించినా సంపూర్ణంగా అమలు కావడంలేదన్న ఆరోపణలున్నాయి. డిపోకు సంబంధించి 84 బస్సులుండగా 48 సర్వీసులు పల్లెవెలుగులే. మిగతా వాటిలో 10 సూపర్ లక్జరీ, 24 ఎక్స్‌ప్రెస్, 2 ఆల్ట్రాడీలక్స్ బస్సులున్నాయి. వీటిలో సూపర్‌లగ్జరీ, డిలక్స్, ఎక్స్‌ప్రెస్ బస్సుల ఆక్యుపెన్సీ రేషియో 80 శాతం పైగా ఉండగా, పల్లెవెలుగు బస్సులకు 55శాతానికి మించడం లేదు. అధిక సర్వీసులుండే పల్లెవెలుగు బస్సులతో పాటు సూపర్‌లగ్జరీ, డిలక్స్, ఎక్స్‌ప్రెస్ బస్సుల నుంచి కనీసం 80 శాతం ఆక్యూపెన్సీ రేషియో వస్తేనే రాబడికి, వ్యయానికి సరిపోతుంది. ప్రస్తుతం 75శాతం వరకు ఆక్యుపెన్సీ పెరిగినా నష్టాలు నివారించే పరిస్థితి కనిపించడం లేదు. ఇందులో కూడా 2 నుంచి 3శాతం వరకు స్కూల్ పిల్లల బస్ పాసుల రీయింబర్స్మెంట్ డబ్బు కలుస్తోంది . అక్రమ రవాణాను అరికట్టకుండా ఆక్యుపెన్సీరేషియో పెంచాలనడం సమంజసం కాదని, వీటిని అరికడితే సీట్ల భర్తీ శాతం పెంచడం పెద్ద కష్టమేమికాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మూడేళ్లుగా దిగువ చూపులు.. మూడేళ్లుగా ఎమ్మిగనూరు డిపో ఆక్యుపెన్సీ రేషియో హెచ్చుతగ్గులుగా ఉంటూ అసలైన రేషియోకు చేరుకోవడంలేదు. 2015–16లో 71శాతం, 2016–17లో 68శాతంగా ఉండగా 2017–18కి సంబంధించి ఇప్పటి వరకు 74శాతం మాత్రమే ఉంది. ఈ రేషియో 80శాతం వస్తేనే సంస్థ మనుగడ సాధ్యమంటున్నారు ఆర్టీసీ అధికారులు. వరుసగా నష్టాలు.. ఎమ్మిగనూరు డిపో సుమారు రూ.3.90కోట్ల నష్టాల్లో ఉంది. ఏడాది కాలంగా రూ.1.68కోట్ల నష్టాన్ని పూడ్చినా రూ.2.20కోట్ల నష్టం మిగిలే ఉంది. అభయ పథకం, సేవాకేంద్రాలు, ట్రాఫిక్ గైడ్స్ నియామకం, గిఫ్ట్ స్కీం, వనిత, క్యాట్ కార్డులు తదితర పథకాలు పెట్టినా ఆశించిన స్థాయిలో ఫలితం కనిపించడం లేదన్న అభిప్రాయం ఉంది. పనిచేయని ఆర్టీసీ పరిరక్షణ కమిటీ.. ప్రయివేటు వాహనాలను నియంత్రిస్తూ ఆర్టీసీ ఆదాయాన్ని పెంచేందుకు గాను ఏర్పాటు చేసిన ఆర్టీసీ పరిరక్షణ కమిటీ ఏమాత్రం పనిచేయడం లేదు. కమిటీలో భాగస్వాములుగా ఉన్న డిపో మేనేజర్, స్థానిక ఎస్ఐ, ఆర్టీఓ.. నెలలో కనీసం రెండుసార్లు ఆయా రూట్లలో పర్యటించి అక్రమ వాహనాలపై చర్యలు తీసుకోవాలి. ఆటోల్లో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోకుండా చూడాలి. ఆటో డ్రైవర్లకు లైసెన్సులున్నాయో లేదో పరిశీలించి వారిపై చర్యలు తీసుకోవాలి. అయితే డిపో పరిధిలో చాలా కాలంగా పరిరక్షణ కమిటీ పనిచేయడంలేదు. అమలుకు నోచుకోని మోటార్‌వాహనాల చట్టం ఆంధ్రప్రదేశ్ మోటారు వాహనాల చట్టం 1989, సెక్షన్ 185(సి) ప్రకారం ప్రయాణికులను ఎక్కించుకునే ప్రయివేటు వాహనాలు, ఆటోలు ఆర్టీసీ బస్‌స్టేషన్‌కు కనీసం కిలోమీటరు బయట ఉండాలి. ఈ నిబంధనను అతిక్రమించిన వారిపై చర్యలు తీసుకునే హక్కు పరిరక్షణ కమిటీకి ఉంది. కానీ ఎమ్మిగనూరు ఆర్టీసీ బస్‌స్టేషన్ వద్ద అమలు కావడం లేదు. కమిటీ తరఫున కాంట్రాక్ట్ ఉద్యోగులను ఉంచడంతో వారి మాట ప్రయివేటు బస్సులు, ఆటో వాలాలు వినడంలేదు. నిత్యం బస్టాండ్ ప్రధాన ద్వారం వద్దే ఉండి ప్రయాణికులను ఎక్కించుకుంటున్నారు. -
ఒంగోలు గిత్తలు అ‘ధర’హో
- రూ.1.41 లక్షలకు విక్రయం ఎమ్మిగనూరు రూరల్: శ్రీ నీలకంఠేశ్వరస్వామి జాతరలో రెండు ఒంగోలు గిత్తలు రూ. 1.41 లక్షల ధర పలికాయి. సోమవారం కోసిగి మండలం దొడ్డి బెళగల్ గ్రామానికి చెందిన రైతు పెద్ద తిమ్మప్ప తన ఒంగోలు గిత్తలను విక్రయించేందుకు ఎమ్మిగనూరుకు తీసుకువచ్చాడు. వీటిని తెలంగాణ రాష్ట్ర ఐజ మండలం మేడకుంద గ్రామానికి చెందిన ఈరన్న అనే రైతు.. రూ. 1.41 లక్షలకు కొనుగోలు చేశాడు. ఇంత ధర పలకటం చాలా సంతోషంగా ఉందని రైతు తిమ్మప్ప తెలిపారు. -
హర హర మహాదేవ
- అంగరంగ వైభవంగా నీలకంఠేశ్వరుని మహా రథోత్సవం - జనసంద్రమైన ఎమ్మిగనూరు పట్టణం - ఆకట్టుకున్న విశేష పూజలు ఎమ్మిగనూరు: హర హర మహాదేవ..అంటూ భక్తుల జయధ్వానాలు..వేదపండితుల మంత్రోచ్చారణలు.. మంగళవాయిద్యాల సుస్వరాల సమ్మేళనం మధ్య.. శనవారం శ్రీ నీలకంఠేశ్వరస్వామి మహారథోత్సవం ఎమ్మిగనూరు పట్టణంలో అత్యంత వైభవంగా సాగింది. నీలకంఠేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం సాయంత్రం 6గంటల నుంచి 6.27గంటల వరకు రథోత్సవాన్ని నిర్వహించారు. ఉత్సవంలో రెండు లక్షలకు వరకు భక్తజనం పాల్గొని తరించారు. ముందుగా స్వామి వారి ఆలయంలో విశేష పూజలు నిర్వహించారు. అనంతరం తేరుబజార్ వరకు ఉత్సవమూర్తిని ఊరేగింపుగా తీసుకు వచ్చారు. స్వామి వారిని పీఠంపై అధిష్టింపజేసి..హోమం జరిపారు. పూర్ణకుంభంతో నైవేద్యం సమర్పించి హోమం చుట్టూ ఉత్సవమూర్తిని ప్రదక్షిణ చేయించారు. అనంతరం మహా రథంపై అధిష్టింపజేసి.. హారతి ఇచ్చారు. ఆశీర్వచనాలు ముగియగానే..రథోత్సవాన్ని పురోహితులు ప్రారంభించారు. భక్తులు హర నామస్మరణ చేస్తుండగా.. మహారథం ముందుకు సాగింది. రథాన్ని లాగి స్వామివారి కృపను పొందాలని భక్తులు పోటీపడ్డారు. మార్కండేయస్వామి ఆలయం వరకు రథయాత్రను సాగింది. అక్కడ మార్కెండేయ స్వామికి పూజలు నిర్వహించారు. అనంతరం రథాన్ని యథాస్థానానికి లాగి ఉత్సవానికి ముగింపు పలికారు. రథోత్సవాన్ని తిలకించేందుకు జిల్లా నలుమూలల నుంచే కాకుండా..కర్ణాటక, మహారాష్ట్ర, తమిళæనాడు ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. నందికోళ్లసేవ , గొరవయ్యల నృత్యాలు, కోలాటాలు, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్యానయి. రథోత్సవాన్ని తిలకించేందుకు మూడు ఎల్ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేశారు. రథోత్సవంలో ప్రముఖులు.. రథోత్సవాన్ని కర్నూలు ఎంపీ బుట్టా రేణుక, కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి, ఎమ్మిగనూరు ఎమ్మెల్యే డాక్టర్ బీవీ.జయనాగేశ్వరరెడ్డి, మంత్రాలయం ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి, బీజేపీ నియోజకవర్గ నాయకులు కేఆర్ మురహరి రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ ఎర్రకోట జగన్మోహన్రెడ్డి తిలకించారు. వైఎస్ఆర్సీపీ నాయకులు వై.రుద్రగౌడ్, మాచాని రఘునాథ్, మంత్రాలయం మాజీ ఎంపీపీ సీతారామిరెడ్డి, టీడీపీ జిల్లా నాయకులు బీటీ నాయుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ యువజన నాయకులు వై.ధరణీధర్ రెడ్డి, పురుషోత్తంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. భారీ బందోబస్తు రథోత్సవంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆదోని డీఎస్పీ కొల్లి శ్రీనివాసరావు, ఎమ్మిగనూరు సీఐ శ్రీనివాసులు మూర్తి, పట్టణ ఎస్ఐ హరిప్రసాద్ నేతృత్వంలో దాదాపు 600మంది పోలీసులు బందోబస్తు నిర్వహించారు. -
ఎమ్మిగనూరు యార్డులోనే పత్తి కొనుగోలు
–వచ్చే వారం నుంచి సీసీఎస్ ద్వారా ప్రారంభం –మార్కెటింగ్‌శాఖ కమిషనర్ మల్లికార్జున రావు ఎమ్మిగనూరు: ఎమ్మిగనూరు మార్కెట్ యార్డులో వెంటనే పత్తికొనుగోళ్లను ప్రారంభించాలని రాష్ట్ర మార్కెటింగ్‌శాఖ కమిషనర్ మల్లికార్జునరావు ఆదేశించారు. ఆదివారం ఎమ్మిగనూరు వ్యవసాయ మార్కెట్‌ను ఆయన పరిశీలించారు. పత్తి రైతులకోసం ఏర్పాటు చేసిన టీఎంసీ యార్డు, యార్డు క్యాంటీన్లను ఆయన పరిశీలించారు. మార్కెట్ యార్డులో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై యార్డు కార్యదర్శి జయలక్ష్మితో చర్చించారు. రైతుల కోసం క్యాంటీన్లో ఫాస్టుఫుడ్ తరహాలో సేవలు, ఆర్ఓ ప్లాంట్ ఏర్పాటు, మార్కెట్ ప్రహరీ గోడ నిర్మాణం ,యార్డులో బ్యాంక్ సేవలు అందించాలని చెప్పారు. జీరో వ్యాపారాలపై నిఘా పెంచాలని అధికారులను ఆదేశించారు. రైతు బజారు ఏర్పాటుకు స్థల పరిశీలన చేపట్టాలని సూచించారు.అనంతరం విలేకరులతో మాట్లాడుతూ వచ్చే వారం నుంచి రాష్ట్రంలోని 43మార్కెట్లలో సీసీఐ ద్వారా పత్తి కొనుగోళ్లను చేపట్టాలని సూచించామన్నారు.బయట వ్యారులు రేట్లను తగ్గించినప్పుడు ప్రత్యామ్నాయంగా సీసీఐ ఉంటుందన్నారు. క్వింటాల్‌కు రూ.4,160 ప్రకారం ధర ఉంటుందన్నారు. గతంలో సీసీఐ కొనుగోళ్ల పేరుతో భారీ అక్రమాలు జరిగిన విషయం వాస్తవమేనని, దీనిపై ,ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. రాయలసీమ జిల్లాలో ఉల్లిపంటను అధికంగా సాగుచేశారని, కిలో రూ.6కు తగ్గకుండా కొనుగోలు చేసేలా చర్యలు చేపట్టామన్నారు. అనంతరం కమిషన్ మర్చంట్స్ ఉరుకుందయ్యశెట్టి, యూటి శంకర్,ప్రతాప్ కిట్టు, శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ మార్కెట్లో టెండర్‌ఫారాలు సరిగ్గా లేవని, బ్యాంక్ సౌకర్యాలు కల్పించాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఏడీఎం సత్యనారాయణ చౌదరీ,సెక్రటరీ జయలక్ష్మి, డీఈఈ సుబ్బారెడ్డి, మార్కెట్ వైస్ చైర్మన్ సుందరం, తదితరులు పాల్గొన్నారు. చైర్మెన్‌డుమ్మా: మార్కెట్ కమిషనర్ మల్లికార్జునరావు ఎమ్మిగనూరు మార్కెట్ పరిశీలనకు వస్తున్నట్లు సమాచారం రావటంతో చైర్మెన్ సంజన్న ముఖం చాటేశారు. కాంట్రాక్టు ఉద్యోగుల తొలగింపు,మార్కెట్‌యార్డు సిబ్బందిని వేధించటం, ప్రతి పనిలో కమీషన్ల కోసం ఇబ్బంది పెట్టడం తదితర వాటిపై కమిషనర్‌కు ఫిర్యాదు చేస్తారనే నెపంతో సంజన్న ముఖం చాటేసినట్లు కమీషన్ ఏజెంట్లు చర్చించుకోవటం గమనార్హం. -
నేత... మేత
అధికార పార్టీ ఎమ్మెల్యేకు అవినీతి మరక! రూ.5 లక్షలు తీసుకున్నా ఉద్యోగం తిరిగి ఇప్పించలేదని ఆరోపణ అధికార పార్టీ వర్గపోరులో తొలగింపు ఫిర్యాదు చేసేందుకు పార్టీ కార్యాలయం వద్దకు వెళితే అడ్డుకున్న నేతలు అనంతరం డిప్యూటీ సీఎంను కలిసి ఎమ్మిగనూరు ఎమ్మెల్యేపై ఫిర్యాదు ఆరా తీసిన అధిష్టానం? కర్నూలు: అధికార పార్టీకి చెందిన ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డికి అవినీతి మరక అంటుకుంది. ఉద్యోగం తిరిగి ఇప్పిస్తానంటూ తన నుంచి రూ.5 లక్షలు వసూలు చేసి.. ఇప్పటి వరకు న్యాయం చేయలేదని గతంలో ఏపీఓగా పనిచేసిన సీతమ్మ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తిని కలిసి ఫిర్యాదు చేశారు. అధికార పార్టీ నేతల వర్గపోరులో తనను ఉద్యోగం నుంచి ఎమ్మెల్యే తీసేయించారని.. తిరిగి ఉద్యోగంలోకి తీసుకోవాలంటే రూ.5 లక్షలు అడిగారన్నారు. అయితే, తీరా రూ.5లక్షలు ఇచ్చినప్పటికీ ఉద్యోగం మాత్రం తిరిగి ఇప్పించలేదని వాపోయారు. తనకు న్యాయం జరిగేలా చూడాలని ఆయనను వేడుకుంది. మరోవైపు అంతకుముందు ఈ విషయంలో హైడ్రామా నడిచింది. టీడీపీ కార్యాలయం వద్ద ఎమ్మెల్యేతో పాటు డిప్యూటీ సీఎంను కలిసి విన్నవించేందుకు ఆమె ప్రయత్నించగా అక్కడి నుంచి ఆమెను అధికార పార్టీ నేతలు నెట్టేశారు. అనంతరం గెస్ట్‌హౌస్ వద్ద డిప్యూటీ సీఎంను కలిసి ఆమె తన గోడు వినిపించింది. మొత్తంగా ఎమ్మెల్యేపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఈ విషయాన్ని ఆ పార్టీ అధిష్టానం కూడా ఆరా తీసినట్టు సమాచారం. వివరాల్లోకి వెళితే.... నందవరం మండలంలో ఉపాధి హామీ పథకం ఏపీఓగా సీతమ్మ పని చేస్తోంది. అయితే, అధికార పార్టీకే చెందిన జెడ్పీ వైస్-చైర్పర్సన్ పుష్పావతమ్మకు అనుకూలంగా పనిచేస్తున్నారనే భావనతో అవినీతి ఆరోపణలు సాకుగా చూపి తనను ఎమ్మెల్యే డిసెంబర్ 31, 2014న సస్పెండ్ చేశారని బాధితురాలు చెబుతోంది. అనంతరం ఆగస్టు 18, 2015లో ఏకంగా తనను ఉద్యోగం నుంచి టెర్మినేట్ చేశారని వాపోయింది. అయితే, తిరిగి ఉద్యోగంలోకి తీసుకోవాలంటే ఎమ్మెల్యేకు రూ.5 లక్షలు ఇవ్వాలంటూ ఎమ్మెల్యే పీఏ సురేష్‌తో పాటు ఎంపీపీ నరసింహారెడ్డి తనను అడిగారని ఆమె ‘సాక్షి’కి వివరించింది. మొదట ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో రూ. 2 లక్షలు ఇచ్చానని.. మిగిలిన రూ. 3లక్షలు ఎమ్మిగనూరులో ఇచ్చానని తెలిపారు. అయితే, డబ్బులు తీసుకున్నప్పటికీ ఉద్యోగం తిరిగి ఇప్పించలేదని.. ఇదే విషయాన్ని డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకెళ్లానన్నారు. ఎమ్మెల్యేనే ఉద్యోగం నుంచి తొలగించారు నందవరంలో గతంలో ఏపీఓగా పనిచేస్తున్న సీతమ్మను ఉద్యోగం నుంచి ఎమ్మెల్యేనే సస్పెండ్ చేయించిన మాట వాస్తవం. కేవలం నాతో అనుకూలంగా ఉన్నారన్న ఆరోపణలతోనే ఉద్యోగం నుంచి తొలగించారు. అయితే, ఉపాధి పనులు రైతులందరికీ జరిగాయి. ఇదే విషయాన్ని రైతులు కూడా చెప్పారు. అయితే ఆడిట్ వాళ్లపై కూడా ఎమ్మెల్యే ఒత్తిడి తెచ్చి.. అవినీతి జరిగిందని రాయించారు. ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి ఇప్పించకపోవడం దారుణం. - పుష్పావతమ్మ, నందవరం జెడ్పీటీసీ సభ్యురాలు వర్గ పోరుతో ఉద్యోగం ఊడింది వాస్తవానికి అధికార పార్టీ నేతల మధ్య నెలకొన్న వర్గపోరుతోనే ఈ మొత్తం వ్యవహారంలో సదరు ఉద్యోగి ఉద్యోగం ఊడిందని తెలుస్తోంది. ఇదే విషయాన్ని అటు బాధితురాలితో పాటు ఇటు అధికార పార్టీ నేత జెడ్పీ వైస్-చైర్పర్సన్ పుష్పావతమ్మ కూడా చెబుతుండటం గమనార్హం. నందవరం జెడ్పీటీసీ సభ్యురాలు పుష్పావతమ్మకు, ఎమ్మెల్యేకు మధ్య ఉన్న వర్గపోరులో ఏపీఓ బలిపశువు అయినట్లు తెలుస్తోంది. కేవలం తన పనులు మాత్రమే చేస్తున్నారనే ఆరోపణలతో ఆమెను ఉద్యోగం నుంచి తొలగించారని పుష్పావతమ్మ కూడా చెబుతున్నారు. మొత్తంగా అధికార పార్టీలోని వర్గపోరులో కొద్దిరోజుల క్రితం ఏకంగా నంద్యాలలో మునిసిపల్ ఉద్యోగిపై దాడి జరగగా... తాజాగా ఉద్యోగం ఊడిన వ్యవహారం బయటపడటం చర్చనీయాంశమవుతోంది. -
ఈతకు వెళ్లి బాలుడు మృత్యువాత
ఎమ్మిగనూరు రూరల్ (కర్నూలు) : తోటి వారితో కాల్వలో ఈతకు వెళ్లిన ఓ బాలుడిని మృత్యువు మింగేసింది. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో గురువారం ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానిక వెంకటాపురం కాలనీకి చెందిన బొజ్జప్ప,గుంటమ్మ దంపతులకు ఇద్దరు కుమారులున్నారు. పెద్ద కుమారుడు శివ(8) ఐదో తరగతి చదువుతున్నాడు. అయితే దసరా సెలవులు కావటంతో గురువారం మధ్యాహ్నం స్నేహితులతో కలసి సమీపంలోని తుంగభద్ర ఎల్లెల్సీ కాలువ వద్దకు ఈత కొట్టేందుకు వెళ్లాడు. సరిగా ఈత రాని శివ నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాడు. కొద్దిసేపటి తర్వాత శివ కనిపించకపోవటంతో తోటి పిల్లలు శివ తల్లిదండ్రులకు తెలిపారు. స్థానికుల సాయంతో మృతదేహాన్ని వెలికితీశారు. -
బెదిరించాడు... బెయిల్ రద్దయింది
కర్నూలు : లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఓ విద్యుత్ అధికారి బెయిలును...ఫిర్యాదుదారుడిని బెదిరిస్తున్నందుకు న్యాయస్థానం రద్దు చేసింది. వివరాల్లోకి వెళ్తే... గత మార్చిలో ఓ కాంట్రాక్టర్ నుంచి రూ.లక్ష లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన కర్నూలు జిల్లా ఎమ్మిగనూర్ ట్రాన్స్‌కో అసిస్టెంట్ డివిజన్ ఇంజినీర్ చంద్రశేఖర్‌కు అదే నెల చివరిలో బెయిల్ మంజూరైంది. అయితే ఆయన ఫిర్యాదుదారు వెంకటేశప్పను బెదిరింపులకు గురి చేస్తుండటంతో బాధితుడు ఏసీబీ కోర్టు పీపీ వెంకటేశ్ దృష్టికి తీసుకువచ్చారు. దీంతో ఆయన బెయిల్ రద్దు చేయాలని విన్నవించటంతో అందుకు కోర్టు శనివారం సమ్మతించింది. -
’వర్షపు నీటిని సంరక్షించుకోవాలి’
-
అరుదైన ఘనత
హీరో నందమూరి బాలకృష్ణ నటించగా గత ఏడాది విడుదలైన సూపర్‌హిట్ చిత్రం ‘లెజెండ్’ ఇప్పుడు మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంటోంది. తెలుగు చిత్రసీమలో విడుదలైన హాలు మారకుండా, నేరుగా 400 రోజులు (కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులోని ‘మినీ శివ’ థియేటర్లో రోజూ నాలుగు ఆటలతో మే 1వ తేదీకి) జరుపుకొంటున్న తొలి చిత్రమనే ఖ్యాతిని సంపాదిస్తోంది. అలాగే పొద్దుటూరు ‘అర్చన’ థియేటర్లో సింగిల్ షిఫ్ట్‌తో 400 రోజులు పూర్తి చేసుకుంటోంది. అభిమానుల అండదండలతోనే సాధ్యమైన ఈ ఘనతకు గుర్తుగా వారి సమక్షంలోనే, రానున్న మే 2వ తేదీ సాయంత్రం ఎమ్మిగనూరులోని జూనియర్ కాలేజ్ గ్రౌండ్లో చిత్ర యూనిట్ సభ్యులు బహిరంగ సభలో పాల్గొని, భారీ వేడుక చేసుకోనున్నారు బాలయ్య. తెలుగు చిత్ర పరిశ్రమలో డెరైక్ట్ తొలి వంద రోజుల చిత్రం (జెమినీ ‘బాలనాగమ్మ’ (1942) - మద్రాసులోని వెల్లింగ్టన్ థియేటర్), తొలి 200 రోజుల చిత్రం (‘పాతాళభైరవి’ (1951) - విజయవాడలోని దుర్గాకళామందిరం), తొలి 300 రోజుల చిత్రం (‘అడవి రాముడు’ (1977)- విశాఖపట్నంలోని అలంకార్) తర్వాత ఇన్నేళ్ళకు మరో రికార్డు రన్ సినిమా వచ్చిందంటూ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జరుగుతున్న విజయోత్సవానికి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా, హీరో బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను, చిత్ర నిర్మా తలతో సహా ‘లెజెండ్’ చిత్ర యూనిట్ మొత్తం హాజరవుతున్నట్లు సినీ వర్గాలు తెలిపాయి. -
అన్నీ విశేషాలే!
ఒక సినిమా వెంటనే మరో సినిమాతో, పవర్ఫుల్ పాత్ర పోషణతో జోరు మీదున్న హీరో బాలకృష్ణ. ఆయన మునుపటి చిత్రం ‘లెజండ్’ ఇవాళ్టితో 350 రోజులు పూర్తిచేసుకొని, పొద్దుటూరు, ఎమ్మిగనూరు కేంద్రాల్లో రోజూ 4 ఆటలతో స్వర్ణోత్సవం జరుపుకొంటోంది. ‘ప్రదర్శనరంగంలో డిజిటల్ విధానం వచ్చాక ఇన్ని రోజులు ఒక చిత్రం ప్రదర్శితమవడం దేశంలో ఇదే తొలిసారి’ అని అభిమానులు ఉత్సాహంగా చెబుతున్నారు. అభిమానుల ఉత్సాహాన్ని పెంచుతూ బాలకృష్ణ తదుపరి చిత్రం ‘లయన్’ ఇప్పుడు సిద్ధమవుతోంది. శక్తిమంతమైన సి.బి.ఐ అధికారిగా ఆయన ఈ తాజా చిత్రంలో నటిస్తున్నారు. జవ్వాజి రామాంజనేయులు సమర్పణలో సత్యదేవా దర్శకత్వంలో రుద్రపాటి రమణారావు నిర్మిస్తున్న ఈ చిత్రం ప్యాచ్‌వర్క్ మినహా ప్రధాన షూటింగ్ మొత్తం మంగళవారంతో పూర్తయిపోయింది. ‘‘హీరో బాలకృష్ణ సరసన కథానాయికలు త్రిష, రాధికా ఆప్టే, బృందం నర్తించగా, ప్రేమ్క్ష్రిత్ నృత్య సారథ్యంలో హైదరాబాద్‌లోని అన్నపూర్ణా స్టూడియోలో వేసిన సెట్స్‌లో అయిదురోజుల పాటు పాట తీశాం. ‘లయన్’ అంటూ వచ్చే ఈ టైటిల్ సాంగ్‌ను రామజోగయ్యశాస్త్రి రాశారు. ఈ పాటతో సినిమా ప్రధాన చిత్రీకరణ మొత్తం పూర్తయిపోయింది. మిగిలిన కొద్దిపాటి ప్యాచ్‌వర్క్‌ను రెండు, మూడు రోజుల్లో పూర్తి చేయనున్నాం’’ అని నిర్మాత ‘సాక్షి’కి వివరించారు. విశేషం ఏమిటంటే, ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లండగా, మరో కథానాయిక అర్చన ఒక ప్రత్యేక గీతంలో కనువిందు చేయనుండడం. ‘‘సందర్భోచితంగా వచ్చే ప్రత్యేక నృత్య గీతం అది’’ అని అర్చన చెప్పారు. ఆ ప్రత్యేక గీతంలో మరో యువ హీరో శివబాలాజీ సైతం నర్తిస్తుండడం విశేషం. ‘‘ఇలా అనేక విశేషాలున్న సినిమా ‘లయన్’. ఇది బాలకృష్ణకు బాగా నచ్చిన కథ. ఉత్కంఠగా సాగే కథ, రెండు భిన్నమైన కోణాలుండే కథానాయకపాత్ర - మాస్‌నూ, క్లాస్‌నూ ఆకట్టుకొంటాయి. కథానాయిక త్రిష కూడా మునుపటి పాత్రలకు భిన్నంగా అల్లరిగా ఉండే అందమైన పాత్రను ధరిస్తోంది’’ అని దర్శకుడు సత్యదేవా తెలిపారు. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలోని పాటలను ఏప్రిల్ ప్రథమార్ధంలో విడుదల చేస్తున్నట్లు కార్యనిర్వాహక నిర్మాత కొమ్మినేని వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. -
'లక్ష' తీసుకుంటూ దొరికిపోయాడు..
కర్నూలు : కర్నూలు జిల్లాలో ఏసీబీ వలలో మరో అవినీతి చేప చిక్కింది. లక్ష రూపాయిల లంచం తీసుకుంటూ ట్రాన్స్‌కో ఏఈ బుధవారం ఉదయం రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. వివరాల్లోకి వెళితే ఎమ్మిగనూరు ట్రాన్స్‌కోలో ఏఈగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న చంద్రశేఖర్...ఓ కాంట్రాక్టర్ నుంచి లక్ష రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు. గత కొన్నిరోజులుగా తన పని త్వరగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్ వెంకటస్వామి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా.. పెడచెవిన పెట్టిన ఏఈ లక్ష రూపాయలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీంతో కాంట్రాక్టర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. పక్కా ప్రణాళిక ప్రకారం ఈ రోజు ఉదయం ఏడీ లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు అతడిని పట్టుకున్నారు. ఏసీబీ అధికారులు ఏఈని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. -
అభిమాని కుటుంబానికి రూ. 2 లక్షలు
హైదరాబాద్: తన సినిమా చూసేందుకు వచ్చి మృత్యువాత పడిన అభిమానిని ఆదుకునేందుకు హీరో రామ్‌చరణ్ ముందుకు వచ్చారు. 'గోవిందుడు అందరివాడేలే' సినిమా చూడానికి వెళ్లి కర్నూలు జిల్లాలోని ఎమ్మిగనూరులో కన్నయ్య అనే అభిమాని మృతి చెందాడు. స్థానిక శివ థియేటర్ లో టికెట్ల కోసం జరిగిన తొక్కిసలాటలో అతడు ప్రాణాలు కోల్పోయాడు. కన్నయ్య మృతి పట్ల రామ్‌చరణ్ సంతాపం ప్రకటించారు. అతడి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు. అతడి కుటుంబానికి రూ.2 లక్షలు ఎక్స్‌గ్రేషియా అందిస్తామని తెలిపారు. ఈమేరకు రామ్‌చరణ్ ఒక ప్రకటన విడుదల చేశారు. అయితే ధియేటర్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే కన్నయ్య చనిపోయాడని అభిమానులు విమర్శించారు. -
రూ.కోట్లు మింగిన నాగ‘మణి’
ఎమ్మిగనూరులో ఘరానా మోసం తేలు కుట్టిన దొంగల్లా బాధితులు ఎమ్మిగనూరు: నాగుపాములు, నాగమణుల సబ్జెక్టుతో తెరకెక్కిన సినిమాలన్నీ విజ యాలు సాధించినవే. అదే సూత్రంతో ఓ ఇద్దరు ఎమ్మిగనూరులో పలు వ్యాపారులకు వెర్రెక్కించారు. నాగమణి ఆశ చూపి రూ.కోట్లు వసూలు చేశారు. అసలు ఉందో లేదో తెలియని మణి కోసం ఇళ్లు, వాకిలి తాకట్టు పెట్టిన వారు ఇప్పుడు లబోదిబోమంటున్నారు. ఎమ్మిగనూరు సమీపంలోని అగ్రహారం గ్రామానికి చెందిన రియల్ ఎస్టేట్ ఏజెంట్, మరో స్వీటు వ్యాపారి కలసి నాగ‘మణి’ పేరిట జనాలను బుట్టలో వేశారు. రూ.కోట్లు విలువ చేసే మణి కర్ణాటకలోని ఓ బ్యాంకు లాకర్లో ఉందని, మలేషియాకు చెందిన ఓ వ్యక్తి మాత్రమే లాకర్‌ను తెరువగలడని జోరుగా ప్రచారం చేశారు. మణితో తమ దశ తిరుగుతుందన్న అత్యాశతో కొందరు రూ.రెండు కోట్ల నుంచి లక్షల్లో వారికి ముట్టజెప్పారు. మొత్తం రూ.8 కోట్లు వసూలు చేశారు. ఆ మొత్తాన్ని మలేసియాకు చెందిన వ్యక్తికి అప్పగించామని, తొందర్లోనే మణి వస్తుందని ఆరునెలలుగా నమ్మబలుకుతున్నారు. వీరికి డబ్బులిచ్చి మోసపోయిన వ్యక్తి సోదరులు పోలీసు శాఖలో పని చేస్తున్నారు. తమ అన్నకు జరిగిన మోసాన్ని తెలుసుకుని అగ్రహారం ఏజెంట్‌ను ప్రశ్నించగా., జూలై 15 లోగా రూ.50 లక్షలు తిరిగిచ్చేస్తామని, ఈ వ్యవహారం బయటకు పొక్కనివ్వొద్దంటూ వేడుకున్నట్టు తెలిసింది. కాగా, ఈ ఏడాది మార్చిలో రెండు సార్లు మలేిసియా వెళ్లి వచ్చినట్టు సమాచారం. మణి పేరిట వసూలు చేసిన మొత్తం ఏం చేశారో.? డబ్బు తిరిగి ఎలా చెల్లిస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. మరోవైపు మణి మాయలో వీరికి డబ్బులు సమర్పించిన బాధితులు.., బయటకు చెప్పుకోలేక తేలు కుట్టిన దొంగల్లా వ్యవహరిస్తున్నారు. -
రెవెన్యూ ఉద్యోగుల్లో గుబుల్
ఎమ్మిగనూరు టౌన్: ఆస్తి పన్నుల అక్రమాలపై మున్సిపల్ పరిపాలన విభాగం డెరైక్టర్(డీఎంఏ) స్సెషల్ ఆడిట్‌కు ఆదేశించడంతో రెవెన్యూ ఉద్యోగుల గుండెల్లో గుబుల్ ప ట్టుకుంది. ఇటీవల నంద్యాల మున్సిపాలిటీలో ఆస్తి పన్ను విధింపులో చోటు చే సుకున్న అక్రమాలు బయటపడటంతో పాటు 11మంది రెవెన్యూ ఉద్యోగులపై వేటు పడిన విషయం విధితమే. దీంతో రాష్ర్టంలోని అన్ని మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో ఆస్తిపన్ను విధింపుపై ఆన్లైన్, మాన్యువల్ రికార్డులను ర్యాండమ్ పద్ధతిలో అసిస్మెంట్లను పరిశీలించేందుకు స్పెషల్ ఆడిట్ నిర్వహించాలని డీఎంఏ నిర్ణయించారు. ఈ మేరకు రికార్టులను సిద్ధంగా ఉంచుకొని స్పెషల్ ఆడిట్ బృందానికి సహకరించాలని డీఎంఏ శనివారం రాత్రి మున్సిపల్ కమిషనర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఎమ్మిగనూరు మునిపాలిటీలో ఐదేళ్లుగా భవనాలు, దుకాణాలు, అపార్ట్మెంట్ల నిర్మాణం జోరందుకుంది. 2011లో నిర్వహించిన గృహాల గణన రికార్డుల మేరకు పట్టణంలో వివిధ భవనాలు 19,168 ఉన్నాయి. గణన తరువాత మూడేళ్లలో మరిన్ని భవనాలు వెలిశాయి. ప్రస్తుతం ఈ అసిస్మెంట్ల(భవనాలు) ద్వారా ఏడాదికి రూ.1.46కోట్ల ఆదాయం మున్సిపాలిటీకి సమకూరుతోంది. 2001నుంచి 2010వ సంవత్సరం వరకు ఎమ్మిగనూరు మున్సిపాలిటీలో పాలన గాడి తప్పడంతో రూ.7.30కోట్ల అవినీతి చోటు చేసుకుంది. ఈ కుంభకోణంపై సీబీసీఐడీ అధికారులు రెండేళ్లుగా విచారణను చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో గతంలో ఆస్తిపన్ను విధింపులోనూ అక్రమాలు చోటు చేసుకున్నాయన్న ఆరోపణలున్నాయి. కొన్ని అసిస్మెంట్లకు ఇప్పటికీ పన్ను విధించలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనికితోడు గతంలో పనిచేసిన బిల్కలెక్టర్లు డబ్బుకు కక్కుర్తిపడి ఆస్తిపన్నును తగ్గించి మున్సిపాలిటీ ఆదాయానికి గండి కొట్టారన్న విమర్శలున్నాయి. ఈ సారి ఆడిట్ అధికారులు నిజాలు ఎంతవరకు నిగ్గుతేలుస్తారో వేసిచూడాలి. -
అడుగడుగునా. రాజ ముద్రలే!
‘‘రాయలకాలంలో రత్నాలు రాశులుపోసి అమ్మిన నేల కరువు రక్కసి ఎడారిగా మారుస్తుంటే ఆ గుండె తల్లడిల్లింది.. హలం పట్టి పొలాలు దున్నిన హలధారి అప్పుల బాధతో హాలాహలం తాగి తనువు చాలిస్తుంటే ఆ హృదయం ఘోషించింది.. పుట్లకొలది ధాన్యం పండించే పుడమి పుత్రుడు పుట్టెడు దుఖఃలో శోకిస్తుంటే రైతు కష్టాలు తెలిసిన ఆ రైతుబిడ్డ మనసు చిన్నబోయింది.. మట్టిని నమ్మి మట్టిలో పెరిగే ఆ మట్టిమనుషులను ఆదుకోవాలనీ ఆ తల వేయి తలలై ఆలోచించింది.. సేద్యంలో స్వేదం చిందించే రైతుమోమున దరహాసం చూడాలని..కరువునేల సస్యశ్యామలమై సిరులు పండాలంటే సాగునీరే శరణ్యమని గుర్తించి గురుతరబాధ్యతగా ప్రాజెక్టులకు ప్రాణం పోసిన ఆ అపర భగీరథుడే దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి. రైతుకు పంటే ఆధారమనీ .. ఆ పంటకు నీరే ప్రాణమనీ..ఆ నీటికోసమే ప్రాజెక్టుల నిర్మాణానికి జలయజ్ఞమే చేపట్టారు వైఎస్సార్. జలరాశులను ప్రోదిచేసి జలాశయాలను కట్టించేందుకు ప్రతినబూనారు. చంద్రబాబు చీకటిపాలనలో పునాదిరాళ్లతో వెక్కిరిస్తున్న పథకాలకు నిధులను రాశులుగా బోశారు. కొత్త ప్రాజెక్టులకెన్నో రూపకల్పనజేసి రైతు పక్షపాతిగాముద్ర వేసుకొన్నారు. భావి తరాల భవిష్యత్తు దృష్ట్యా ఆయన చేపట్టిన జలాశయాల్లో నీటి బొట్టు బొట్టునా ఆయన పేరు శాశ్వతమయింది. సీమ ముఖద్వారమైన కర్నూలు జిల్లా సాగునీటి ప్రాజెక్టులకు పురిటిగడ్డ. రాయలసీమ జిల్లాల్లో లక్షల ఎకరాలకు సాగునీరందించటంతోపాటు..వేనవేల గొంతుకలదాహార్తిని తీర్చాలని వైఎస్ రూపకల్పనజేసిన ఎన్నో ప్రాజెక్టులు కార్యరూపం దాల్చి రైతన్నకు ఆసరాగా నిలిచాయి. ఆయనలా ఆలోచించేవారులేక మరికొన్ని మధ్యలో నిలిచిపోయాయి. మహానేత ఇప్పటివరకూ బతికుంటే ప్రాజెక్టులన్నీ పూర్తయ్యేడివని..కరువునేల పచ్చని పైర్లతో సస్యశ్యామలంగా మారేదనీ అందరినోటా వినిపించే మాట. ఆ జలయజ్ఞం ఖ్యాతిని ఆ మహానేతకు అంకితం చేయాలంటే రాజన్న రాజ్యం మళ్లీ రావాలంటూ గొంతు గొంతూ గుండెలోతుల్లోంచి ఘోషిస్తోంది. వేయి కళ్లతో మరో జననేత కోసం ఎదురుచూస్తోంది..! - న్యూస్‌లైన్, ఎమ్మిగనూరు -
టిడిపి అభ్యర్థిపై చీటింగ్ కేసు నమోదు
కర్నూలు: ఎమ్మిగనూరు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి జయనాగేశ్వర రెడ్డిపై పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. జయనాగేశ్వర రెడ్డి ఒకరి వద్ద రెండు కోట్ల 50 లక్షల రూపాయలు అప్పుతీసుకుని చెల్లించలేదు. అంతే కాకుండా చెల్లని చెక్కులు ఇచ్చారు. అప్పు ఇచ్చిన శ్రీరామ్ అనే వ్యక్తి చెల్లని చెక్ ఇచ్చారని జయనాగేశ్వర్ రెడ్డిపై గత జనవరిలో ఫిర్యాదు చేశారు. నాంపల్లి కోర్టులో పిటిషన్ వేశారు. కోర్టు ఆదేశాల మేరకు హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో చీటింగ్ కేసు నమోదు చేశారు. జయనాగేశ్వర రెడ్డి ఎన్నికల అఫిడవిట్లో ఈ కేసును ప్రస్తావించలేదు. -
విజయవంతం వైఎస్ విజయమ్మ పర్యటన సక్సెస్
సాక్షి ప్రతినిధి, కర్నూలు: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ప్రచారం పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నింపింది. జిల్లాలో నాలుగు రోజుల పాటు సాగిన పర్యటన విజయవంతమైంది. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈనెల 20న అనంతపురం జిల్లా నుంచి నేరుగా బనగానపల్లెకు చేరుకున్న విజయమ్మ ఆళ్లగడ్డ, నంద్యాల, ఆత్మకూరు, నందికొట్కూరు, డోన్, గూడూరు, ఎమ్మిగనూరు, ఆదోని మున్సిపాలిటీల్లో పర్యటించారు. మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సతీమణి వస్తున్నారని తెలుసుకున్న ఆయా గ్రామాల ప్రజలు ప్రధాన రహదారుల వెంట బారులు తీరారు. అడుగడుగున పూల వర్షం కురిపించి అభిమానం చాటుకున్నారు. బహిరంగ సభలకు జనం పోటెత్తారు. మున్సిపల్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. సార్వత్రిక ఎన్నికల్లో ఎంపీ, ఎమ్మెల్యేలను గెలుపొందించడం ద్వారా వైఎస్ జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకోగలిగితే వైఎస్ సువర్ణయుగం మళ్లీ చూడగలమన్నారు. అదేవిధంగా వైఎస్ఆర్ సంక్షేమ పాలనను.. చంద్రబాబు, కిరణ్‌ల ప్రజా వ్యతిరేక పాలనను కళ్లకు కట్టినట్లు వివరించడం ప్రజలను ఆలోచింపజేసింది. రాష్ట్రాన్ని ముక్కలు చేయడంలో కాంగ్రెస్, టీడీపీ, బీజేపీలు తీసుకున్న నిర్ణయంపై విరుచుకుపడ్డారు. రానున్న ఎన్నికల్లో ఈ మూడు పార్టీలకు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. మొత్తంగా విజయమ్మ పర్యటన ప్రత్యర్థి పార్టీల నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెట్టించింది. ఆమె ప్రసంగాలు తాజా మాజీ ఎమ్మెల్యేలకు ముచ్చెమటలు పట్టించగా.. ఆయా ప్రాంతాల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థుల గెలుపు నల్లేరు మీద నడకేననే అభిప్రాయం వ్యక్తమైంది. ప్రచారం చేపట్టిన పలు మున్సిపాలిటీల్లో ప్రధానమైన నాయకులు పార్టీలో చేరడం శ్రేణులకు మరింత బలాన్నిస్తోంది. చివరి రోజు నాలుగు మున్సిపాలిటీల్లో ప్రచారం వైఎస్ విజయమ్మ చివరి రోజు ఆదివారం డోన్, గూడూరు, ఎమ్మిగనూరు, ఆదోని మున్సిపాలిటీల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆమె ప్రచారానికి ప్రజలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. రోడ్‌షోలకు విశేష స్పందన లభించింది. డోన్ పట్టణంలో బహిరంగ సభకు ఇసుకేస్తే రాలనంత జనం పాల్గొన్నారు. గూడూరులో పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త మణిగాంధీ, ఎదురూరు విష్ణువర్ధన్‌రెడ్డి ఆధ్వర్యంలో సభకు పల్లెల నుంచి ప్రజలు పోటెత్తారు. ఎమ్మిగనూరు, ఆదోనిలోనూ రోడ్‌షోలు, బహిరంగ సభల్లో విజయమ్మ ప్రసంగం ఆకట్టుకుంది. కార్యక్రమంలో పార్టీ కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త బుట్టా రేణుక, జిల్లా కన్వీనర్ గౌరు వెంకటరెడ్డి, ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు సాయిప్రసాద్‌రెడ్డి, బాలనాగిరెడ్డి, కొత్తకోట ప్రకాష్‌రెడ్డి.. డోన్, కోడుమూరు, పత్తికొండ నియోజకవర్గాల సమన్వయకర్తలు బుగ్గన రాజేంధ్రనాథ్‌రెడ్డి, మణిగాంధీ, కోట్ల హరిచక్రపాణిరెడ్డి, మంత్రాలయం నాయకుడు వై.ప్రదీప్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల ప్రచారం ముగించుకున్న విజయమ్మ హైదరాబాద్‌కు బయలుదేరారు -
అత్యంత వెనుకబడిన ప్రాంతాలకు అభివృద్ధి ఫలాలు
-
దేశం.. నిస్తేజం
అసెంబ్లీ అభ్యర్థుల విషయంలో కొరవడిన స్పష్టతఎమ్మిగనూరు, మంత్రాలయంలో గందరగోళం మున్సిపల్, ప్రాదేశిక ఎన్నికల్లో నాయకత్వలోపం అభ్యర్థుల ఎంపికలో ‘టీజీ’ నిర్ణయానికి ప్రాధాన్యం తేలని మాజీ మంత్రి బీవీ తనయుడి భవితవ్యం ‘మంత్రాలయం’ కోసం మండల నాయకుల పోటీ ఎమ్మిగనూరు, న్యూస్‌లైన్: ఎన్నికల వేళ తెలుగుదేశం పార్టీలో నిస్తేజం నెలకొంది. ముందుగానే అభ్యర్థులను ప్రకటిస్తామని ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ప్రకటించినా.. ఎమ్మిగనూరు, మంత్రాలయం నియోజకవర్గాల విషయంలో స్పష్టత కరువైంది. ఈ రెండు నియోజకవర్గాల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలతో పాటు ఎమ్మిగనూరులో మున్సిపల్ ఎన్నికల నగారా మోగింది. ఈ నేపథ్యంలో నడిపించే నాయకుడు ఎవరో తెలియక శ్రేణుల్లో గందరగోళం నెలకొంది. ఎమ్మిగనూరు అసెంబ్లీ అభ్యర్థిగా మాజీ మంత్రి బి.వి.మోహన్‌రెడ్డి కుమారుడు జయనాగేశ్వరరెడ్డిని ప్రకటిస్తారని అందరూ భావించినా.. మారుతున్న పరిణామాలతో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వారం రోజులుగా ఆయన హైదరాబాద్‌లో తిష్ట వేసినా పార్టీ అధినేత స్పందించకపోవడం ఇందుకు బలం చేకూరుస్తోంది. ఆ తర్వాత కలిసినా.. మొదట మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థులను గెలిపించుకుంటే ఆ తర్వాత చూద్దామనే అధినేత మాటలను బీవీ వర్గీయులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇదే సమయంలో బాబు ఆదేశాలతో ఇటీవల ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్న టీజీ వెంకటేష్ ఎమ్మిగనూరు రాజకీయాల్లోనూ చక్రం తిప్పుతున్నారు. ఈయన చిన్ననాటి మిత్రుడు, రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగి శివశంకర్ సతీమణిని చైర్పర్సన్ అభ్యర్థిగా ప్రకటించారు. పార్టీ తరఫున పోటీ చేసేందుకు ముందుకొచ్చే అభ్యర్థులకు కూడా టీజీయే ఆర్థిక వనరులను సమకూరుస్తున్నట్లు చర్చ జరుగుతోంది. చేసేది లేక బీవీ అభ్యర్థులచే నామినేషన్లు వేయించడం, వారి తరఫున ప్రచారం చేయడంతో సరిపెట్టుకోవాల్సి వస్తోంది. ఎమ్మిగనూరు నుంచి పోటీకి పత్తికొండ ఎమ్మెల్యే కేఈ ప్రభాకర్, కాంగ్రెస్ నాయకులు ప్యాలకుర్తి తిక్కారెడ్డి, వై.రుద్రగౌడ్లతో పాటు నంద్యాల డివిజన్‌కు చెందిన ఇరువురు కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యేలు పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. మంత్రాలయంలో అనిశ్చితి నియోజకవర్గ అభ్యర్థిగా ఇప్పటి వరకు ఎవరినీ ప్రకటించకపోవడం ప్రాదేశిక ఎన్నికలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇక్కడి నుంచి మండల స్థాయి నాయకులు అసెంబ్లీ టిక్కెట్ కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. మంత్రాలయం మండలం నుంచి మాధవరం రామిరెడ్డి, కోసిగి మండలం నుంచి బి.టి.నాయుడు, కౌతాళం మండలం నుంచి ఉలిగయ్య, చందాఖాన్, పెద్దకడబూరు మండలం నుంచి గుడిసె కృష్ణమ్మ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరిలో ఎవరి పట్లా అధినేత ఆసక్తి చూపడం లేదనే చర్చ జరుగుతోంది. కర్నూలు లోక్‌సభ అభ్యర్థిగా బీసీ వర్గీయులకు అవకాశం కల్పిస్తే.. మంత్రాలయం రెడ్డి సామాజిక వర్గానికి కేటాయించాలని బాబు భావిస్తున్నట్లు సమాచారం. ఇటు మున్సిపల్ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ మొదలవడం.. పంచాయతీ నామినేషన్ల ప్రక్రియ మరో వారం రోజుల్లో ప్రారంభం కానున్న తరుణంలోనూ అసెంబ్లీ అభ్యర్థుల విషయంలో టీడీపీ వేచి చూసే ధోరణి శ్రేణులను కలవరపరుస్తోంది. -
హీరో రామ్ చరణ్‌పై కేసు నమోదు
-
హీరో రామ్ చరణ్‌పై కేసు నమోదు
కర్నూలు : ప్రముఖ యువ హీరో రామ్ చరణ్‌పై కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయ్యింది. రామ్ చరణ్ హీరోగా ఇటీవలి విడుదలైన 'ఎవడు' చిత్రంలో అశ్లీలత ఉందంటూ మాజీ కౌన్సిలర్ కోనేరు నాగేందర్ ప్రసాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు ఐపీఎస్ సెక్షన్ 292 కింద కేసు నమోదు చేశారు. రామ్ చరణ్‌తో పాటు మరో ఆరుగురిపైనా పోలీసులు కేసు నమోదు చేశారు. -
వివాహిత అనుమానాస్పద మృతి
ఎమ్మిగనూరు రూరల్, న్యూస్‌లైన్: అత్తింటి వేధింపులు ఓ మహిళ ప్రాణం తీశాయి. భర్త చిత్రహింసలు, అత్త, ఆడ పడుచుల సూటిపోటి మాటలు తాళలేక ఆమె చావే శరణ్యమనుకుంది. ప్రతీ రోజు బిడ్డను నిద్ర పుచ్చే ఊయలను ఉరి తాడుగా మార్చుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాద సంఘటన ఎమ్మిగనూరు పట్టణంలో ఆదివారం చోటు చేసుకుంది. పట్టణంలోని ఎన్టీఆర్ కాలనీ బోర్డు సమీపంలో నివాసముంటున్న మోహరూన్ బేగం(20) ఉరి వేసుకుని మృతి చెందింది. నాగలదిన్నె గ్రామానికి చెందిన మోహరూన్బేగంకు ఎమ్మిగనూరుకు మోఫీస్తో రెండు సంవత్సరాల కిత్రం వివాహమైంది. కట్నం కింద తల్లిదండ్రులు రూ. 1.10 లక్షల నగదు, 10 తులాల బంగారు ఇచ్చారు. అయితే పెళ్లైన నెల రోజులు మాత్రమే సంసారం సజావుగా సాగింది. రెండో నెల నుంచే అదనపు కట్నం కోసం భర్తతో పాటు అత్త, ఆడపడుచులు వేధించారు. వారి వేధింపులు తాళలేక ఆమె పుట్టింటికి వెళ్లింది. అనంతరం పెద్దలు భార్యాభర్తలకు నచ్చజెప్పి తిరిగి పంపించారు. కాన్పునకు పుట్టింటికి వచ్చిన ఆమె ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. నెలలు గడుస్తున్నా భర్త ఇంటి నుంచి ఎవరు చూడటానికి వెళ్లలేదు. రెండు నెలల కిత్రం భర్త మోఫీస్ తన భార్యను పంపాలని పెద్ద మనుషులను వెంటబెట్టుకొని నాగలదిన్నెకు వెళ్లాడు. తమ కుమార్తెతో వేరే కాపురం పెడితేనే పంపుతామని త ల్లిదండ్రులు చెప్పటంతో సరేనని వెంట తీసుకెళ్లాడు. కొత్త ఇంట్లో కాపురం పెట్టినా నిత్యం భార్యను హింసించడం మానలేదు. భర్త వేధింపులు తాళలేక తనను తీసుకెళ్లాలని ఆమె శనివారం రాత్రి తండ్రి హుసేన్దేశాయ్కి ఫోన్ చేసి చెప్పింది. ఆయన వచ్చే లోపే ఆదివారం సాయంత్రం ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. తల్లి చనిపోయిన విషయం తెలియని చిన్నారిని చూసి బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. మృతురాలి బంధువులు ఆగ్రహంతో భర్త, అత్తపై దాడి చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని భర్త, అత్త షమీమ్‌ను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ కృష్ణారెడ్డి విలేకరులకు తెలిపారు. మృతిపై అనుమానాలు: మోహరూన్ బేగం మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సాయంత్రం 4.30 గంటల సమయంలో ఇంట్లో నుంచి ఆమె భర్త మోఫీన్ బయటకు వెళ్లాడు. కొద్ది సేపటి తర్వాత ఇంట్లో నుంచి చిన్నారి ఏకధాటిగా ఏడుస్తుండటంతో పక్కింట్లోని ఓ మహిళ వెళ్లి చూసింది. మోహరూన్ బేగం చీరకు వేళాడుతూ కనిపించడంతో చుట్టూ పక్కల వారికి విషయం చెప్పింది. 15 నిమిషాల తర్వాత తల్లి, కుటుంబీకులతో అక్కడికి చేరుకున్న భర్త ఇంట్లోకి వెళ్లి వేళాడుతున్న భార్య మృతదేహాన్ని కిందకు దించాడు. అయితే ఆమె ఉరి వేసుకున్న ప్రాంతంలో మంచం ఉందని, ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేసినా వీలు కాదని, చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అదనపు కట్నం కోసమే బిడ్డ ప్రాణాలు తీశారని బోరున విలపిస్తున్నారు. -
మట్టి పోసి.. నిధులు నొక్కేసి!
ఎమ్మిగనూరు, న్యూస్‌లైన్: వర్షాధారమే అయినప్పటికీ నాలుగు దశాబ్దాలుగా గాజులదిన్నె ప్రాజెక్టు కోడుమూరు, గోనెగండ్ల, వెల్దుర్తి, డోన్, క్రిష్ణగిరి మండలాల్లోని పంట పొలాలను తడుపుతూ.. ప్రజల దాహార్తి తీరుస్తోంది. 5.25 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో 32,500 ఎకరాలకు రబీలో సాగునీరు ఇవ్వాలన్నది ప్రాజెక్టు లక్ష్యం. నాలుగేళ్ల క్రితం వరకు కుడి కాలువ కింద 21వేలు, ఎడమ కాలువ కింద 5వేల ఎకరాల ఆయకట్టు సాగయ్యేది. అయితే ప్రాజెక్టు నుండి బండగట్టు ర క్షిత మంచినీటి పథకం పేరుతో పత్తికొండ నియోజకవర్గంలోని 21 గ్రామాలకు తాగునీటిని అందిస్తున్నారు. అదేవిధంగా డోన్ నియోజకవర్గంలోని మున్సిపాలిటీ ప్రజలతో పాటు 40 గ్రామాలకు తాగునీటిని అందించేందుకు క్రిష్ణగిరి వద్ద మంచినీటి పథకాన్ని నిర్మిస్తున్నారు. ఫలితంగా ఏటా ఆయకట్టు విస్తీర్ణం తగ్గుతోంది. ఇదే సమయంలో ప్రాజెక్టు పటిష్టతకు చర్యలు చేపట్టకపోతే మనుగడ కష్టమంటూ 1996లో సెంట్రల్ డిజైనింగ్ ఆర్గనైజేషన్(సీడీఓ), ఇరిగేషన్ ఈఎన్సీ బృందం ఓ నివేదిక రూపొందించింది. ఈ నేపథ్యంలో ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి, కోడుమూరు దివంగత ఎమ్మెల్యే శిఖామణి 2008లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు 2009లో ఆయన పరిపాలనా అనుమతులివ్వగా.. 2011లో ఆధునికీకరణకు టెండర్లను ఆహ్వానించారు. హైదరాబాద్‌కు చెందిన హార్విన్ కన్స్ట్రక్షన్ గ్రూపు ఒక శాతం తక్కువతో టెండర్‌ను రూ.43.9 కోట్లకు దక్కించుకుంది. 2011 ఆగస్టు నుంచి 2013 సెప్టెంబర్ 30వ తేదీ లోపు పనులను పూర్తి చేసేలా అగ్రిమెంట్ ఖరారైంది. జపాన్ ఇంటర్నేషనల్ కమర్షియల్ ఏజెన్సీ(జేఐసీఏ) నిధులతో చేపట్టే ఈపనుల పర్యవేక్షణ నీటిపారుదల ఇంజనీర్లుతోపాటు జపాన్ ప్రతినిధుల అజమాయిషీ ఉంది. మంజూరైన నిధులతో ఆనకట్ట(బండ్)పటిష్టత, డ్యామేజైన 6 స్లూయిస్ గేట్ల మరమ్మతు, వరద ఉద్ధృతిని నుంచి ప్రాజెక్టు పరిరక్షణకు రెండు అదనపు స్లూయిస్ గేట్ల నిర్మాణం చేపట్టాల్సి ఉంది. అదేవిధంగా ఎడమ కాలువకు 25 కిలోమీటర్లు, కుడి కాలువకు 36 కిలోమీటర్ల వరకు లైనింగ్, కాలువ గట్ల పటిష్టత పర్చాల్సి ఉంది. మట్టి పనులకే ప్రాధాన్యం: అధికార పార్టీ ప్రధాన ప్రజాప్రతినిధులకు భారీగా గుడ్‌విల్ ఇచ్చుకోవాల్సి రావడం.. అధికారుల పర్సెంటేజీల నేపథ్యంలో కాంట్రాక్టర్ ప్రధానమైన ప్రాజెక్టు గేట్లు, బండ్ పటిష్టతను పక్కనపెట్టి మట్టి పనులకే ప్రాధాన్యమిచ్చాడు. ఎడమ కాలువకు 17.3 కిలోమీటర్లు, కుడి కాలువకు 26.35 కిలోమీటర్ల మేర లైనింగ్ చేశారు. కాలువ గట్ల పటిష్టతకు గ్రావెల్ ప్రెస్సింగ్ పనులు చేయాల్సిన చోట రైతుల పొలం గట్టున ఉన్న మట్టిపోసి మెరుగులుదిద్దారు. బండ్ డ్యామేజీ ఉన్న చోట రివిట్మెంట్, రెండు కెనాల్ రెగ్యులేటర్ల నిర్మాణం చేపట్టి పని పూర్తయిందనిపించారు. ఈ పనులకు ఇప్పటికే రూ.38కోట్ల బిల్లు కూడా తీసేసుకున్నాడు. మరో రెండు కోట్ల రూపాయలకు బిల్లులు సిద్ధమయ్యాయి. మిగిలిన ప్రధానమైన పనులు చేపట్టేందుకు కాంట్రాక్టర్ కుంటి సాకులు చెబుతూ చేతులెత్తేశాడు. చేయాల్సిన పనులకు సరిపడా నిధులు లేవని.. అగ్రిమెంట్ గడువు కూడా ముగిసిందంటూ కాంట్రాక్టర్ తప్పుకోవడం గమనార్హం. అధికారులు సైతం ముందుగా ప్రాజెక్టు పటిష్టత పనులు చేయించకపోవడం అనుమానాలకు తావిస్తోంది. డిస్ట్రిబ్యూటరీ కాలువలకు లైనింగ్ చేస్తే తప్ప పంట పొలాలకు నీరందదని రైతులు వాపోతున్నారు. ఆధునికీకరణ పనుల్లో పలు అక్రమాలు చోటు చేసుకున్నాయని.. ఉన్నతాధికారులచే విచారణ చేపట్టాలని గతంలో ప్రాజెక్టు కమిటీ చైర్మన్ ప్రకాష్‌రెడ్డి ఇరిగేషన్ ప్రధాన అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది. -
ఎమ్మిగనూరులో బాల్య వివాహం
ఎమ్మిగనూరురూరల్, న్యూస్‌లైన్: పట్టణంలోని శ్రీ గుంటిరంగస్వామి ఆలయంలో శుక్రవారం ఉదయం 9 గంటలకు బంధువులు బాలికకు వివాహం చేశారు. పెళ్లికుమారుడికి భార్య, ముగ్గురు పిల్లలున్నారు. ఆలస్యంగా విషయం తెలుసుకున్న ఐసీడీఎస్ అధికారులు పోలీసుల సహకారంతో వారికి కౌన్సెలింగ్ ఇప్పించి ఎవరి ఇళ్లకు వారిని పంపించివేశారు. సీడీపీఓ భవాని, ఎస్ఐ చంద్రబాబునాయుడు తెలిపిన వివరాలు.. మండల పరిధిలోని సోగనూరుకు చెందిన దాసరి మాదన్న(33)కు అదే గ్రామానికి చెందిన మేనత్త కుమార్తె దాసరి తిమ్మక్కతో 11 ఏళ్ల క్రితం వివాహమైంది. వారికి ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. ఈ నేపథ్యంలో వారి బంధువైన నందవరం మండలం హలహర్వికి చెందిన దాసరి పాండురంగడు కుమార్తె మీనాక్షి(14)ని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. అందుకు తన భార్య ఆరోగ్యం బాగా లేదని సాకు చూపించాడు. అమాయకురాలైన మొదటి భార్యపై ఒత్తిడి తెచ్చి తన రెండో పెళ్లికి ఒప్పించాడు. శుక్రవారం వెంకటాపురంలో గుంటిరంగస్వామి ఆలయంలో మీనాక్షిని వివాహం చేసుకున్నాడు. ఆలస్యంగా విషయం తెలుసుకున్న ఐసీడీఎస్ అధికారులు పట్టణ ఎస్ఐ చంద్రబాబునాయుడు సహయంతో పెళ్లి మండ పానికి చేరుకున్నారు. ఇరు కుటుంబాల వారినీ పోలీస్ స్టేషన్‌కు తీసుకుని వెళ్లారు. భార్య ఉండ గా వివాహం చేసుకోవటం చట్టరీత్యా నేరమని సూచించారు. మైనర్‌ను చేసుకోవడం మరీ పెద్ద నేరమన్నారు. భార్య ఇష్టపూర్వకంగా పెళ్లి చేసుకున్నా వధువుకు 18 ఏళ్లు నిండి ఉండాలని, లేని పక్షంలో కేసు నమోదు చేస్తామని సీఐ శ్రీనివాసరావు హెచ్చరించారు. వధూవరులతోపాటు కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్ ఇచ్చి ఎవరి ఇళ్లకు వారిని పంపించారు. వారితో పాటు ఐసీడీఎస్ సూపర్వైజర్ పుష్పవతి, బాలల సమగ్ర సంరక్షణ పథకం జిల్లా కోఆర్డినేటర్ రాజు, ఎంవీఎఫ్ మండల కోఆర్డినేటర్ రామకృష్ణ తదితరులు ఉన్నారు. -
‘సహకారం’ కరువైంది!
ఎమ్మిగనూరు, న్యూస్‌లైన్ : ఎమ్మిగనూరు సహకార బ్యాంక్ అధికారులు, సిబ్బంది మామూళ్ల మత్తులో తూగుతుండడం.. వారికి, ఫీల్డ్‌స్టాఫ్‌కు మధ్య కోల్డ్‌వార్ నడస్తుండడంతో రైతులకు చేయూత కరువవుతోంది. వ్యవసాయరంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అన్నదాతను అన్ని విధాలా ప్రోత్సహించేందుకు వివిధ రంగాలు ముందుకు వస్తున్నాయి. కానీ రైతుల సామూహిక పెట్టుబడులు, టర్నోవర్‌తో ఏర్పాటైన సహకారబ్యాంక్ మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది. కర్షకులను పక్కన బెట్టి కమర్షియల్‌గా ఆలోచిస్తూ స్వాహా పర్వానికి తెరలేపుతోంది. ఎమ్మిగనూరు సహకార బ్యాంక్‌లో పంట రుణాలు పొందేందుకు రైతులు కూడా మామూళ్లు ఇచ్చుకోవాల్సిన దుస్థితి నెలకొంది. కేడీసీసీ బ్యాంక్‌కు, గ్రామీణ సింగిల్‌విండో సొసైటీలకు అనుసంధానంగా పని చేస్తున్న ఎమ్మిగనూరు సహకార బ్యాంక్ రైతులకు అన్ని విధాలా చేయూతనివ్వాల్సి ఉంది. బ్యాంకు పరిధిలో కడిమెట్ల, ఎమ్మిగనూరు, నందవరం, మంత్రాలయం, కలుదేవకుంట సింగిల్‌విండో సంఘాలు ఉన్నాయి. 39,553 మంది రైతులు సహకార సంఘాల సభ్యులుగా ఉన్నారు. వారిలో 6,889 మంది రైతులకు మాత్రమే పంటరుణాలు అందుతున్నాయి. మిగిలిన వారి గురించి అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. బ్యాంకు అధికారులు మాత్రం మొత్తం రూ.12 కోట్ల రుణాలను రైతుల మధ్య టర్నోవర్‌గా చూపుతున్నారు. ఈ యేడాది వ్యక్తిగత రుణాల కింద రూ.96 లక్షలను ఉద్యోగులు, వ్యాపారులకు అందజేశారు. రూ.65 లక్షలు గోల్డ్‌లోన్‌ను రుణాలుగా మార్చారు. కానీ ఈ ఖరీఫ్ సీజన్లో రైతులకు ఇవ్వాల్సిన ఎస్టీ లోన్లను ఇప్పటి వరకు పంపిణీ చేయకపోవడం వివాదాస్పదమవుతోంది. బ్యాంక్‌సిబ్బంది, ఫీల్డ్ స్టాఫ్ మధ్య ఏర్పడ్డ వివాదం, మామూళ్ల పంపిణీలో తేడాలే ఇందుకు కారణమని తెలుస్తోంది. పైసలిస్తేనే పంటరుణాలు ఎమ్మిగనూరు సహకార బ్యాంక్ స్థాయిని పెంచి కార్పొరేట్ బ్యాంకులకు దీటుగా సేవలు అందించాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. దాన్ని ఆసరాగా చేసుకుని స్థానిక అధికారులు, సిబ్బంది స్వాహాలపర్వానికి తెరలేపారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఎమ్మిగనూరు సింగిల్‌విండో సొసైటీలో పనిచేస్తున్న ముగ్గురు సిబ్బంది బినామీల పేరుతో ఏకంగా రూ.9 లక్షలను స్వాహాచేశారు. విషయం వెలుగులోకి వచ్చి ఆరు నెలలైనా జిల్లా సహకార బ్యాంక్ అధికారులు విచారణ పేరుతో కాలయాపన చేస్తున్నారు. ఫలితంగా విచారణ పూర్తయి, ఆడిట్ జరిగే వరకూ ఆ సొసైటీ పరిధిలోనే రైతులకు పంటరుణాలు అందటం కష్టమే. బ్యాంక్ కార్యాలయంలో కొంతమంది చేతివాటం బ్యాంక్ ప్రతిష్టను మరింత భ్రస్టుపట్టించింది. వ్యక్తిగత లోన్లకుగాను లక్ష రూపాయలకు రూ.3 వేలు చొప్పున ముడుపులు వసూలు చేస్తున్నారనే విమర్శలున్నాయి. రైతులకిచ్చే దీర్ఘకాలిక రుణాలకు కూడా స్థాయిని బట్టి పర్సెంటేజీలు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మామూళ్లు ఇవ్వలేదనే ఉద్దేశంతోనే ఈ ఖరీఫ్‌లో రైతులకు పంపిణీ చేయాల్సిన రూ.60 లక్షలను ఇవ్వకుండా కేంద్రబ్యాంక్కు రిటర్న్ చేసినట్లు సమాచారం. జిల్లా ఉన్నతాధికారులు స్పందించి ఎమ్మిగనూరు బ్రాంచ్‌లో జరుగుతున్న వ్యవహారాలపై విచారణ చేపట్టాలని రైతులు, రైతుసంఘాల ప్రతినిధులు కోరుతున్నారు. -
సీసీఐ కేంద్రం ఏర్పాటుకు కృషి
ఎమ్మిగనూరు టౌన్, న్యూస్‌లైన్ : ఎమ్మిగనూరు కాటన్ మార్కెట్లో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) కేంద్రం ఏర్పాటుకు కృషి చేస్తామని మార్కెటింగ్ శాఖ రీజినల్ జాయింట్ డెరైక్టర్(జేడీ) రామాంజనేయులు తెలిపారు. గురువారం స్థానిక మార్కెట్ యార్డ్‌లో ఆయన రికార్డులను పరిశీలించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఎమ్మిగనూరులో పత్తి కొనుగోలుకు బయ్యర్స్ ముందుకు రాకపోవడంతో రూ.2కోట్లతో కాటన్ మార్కెట్‌ను నిర్మించామని, అయితే కొనుగోళ్లను ప్రారంభించలేకపోతున్నామన్నారు. గత ఏడాదే సీసీఐ ద్వారా పత్తిని కొనుగోలు చేయించాలని చూసినా తగ్గిన పత్తి ధర ప్రభావం వల్ల వారు ఆసక్తి చూపలేకపోయారన్నారు. ఈ సారి ఏలాగైనా సీసీఐ కేంద్రాన్ని ఏర్పాటు చేయించి కొనుగోళ్లకు స్వీకారం చుడుతామన్నారు. ఇక్కడ పత్తి కొనుగోలు ప్రారంభమైతే ఆదోని మార్కెట్ యార్డ్‌పై ఒత్తిడి తగ్గ్గుతుందన్నారు. హమాలీల సమస్యపై చర్చించిన ఆర్జేడీ : స్థానిక మార్కెట్ యార్డ్ హమాలీల సమస్య పరిష్కారం కోసం జేడీ రామాంజనేయులు కమీషన్ ఏజెంట్లు, బయ్యర్స్‌తో చర్చించారు. లెసైన్సులు రెన్యువల్ చేయడంతోపాటు కమిషన్ ఏజెంట్లు, బయ్యర్స్ సూచించిన వారికి కొత్త లెసైన్సులు ఇచ్చేందుకు తమకు ఏలాంటి అభ్యంతరం లేదన్నారు. రెన్యువల్, కొత్త లెసైన్సుల మంజూరుపై హమాలీలు, రాజకీయ నాయకులతో చర్చించి ఓ నిర్ణయం తీసుకుంటామని చెప్పడంతో బయ్యర్స్ అంగీకరించారు. జేడీని కలిసిన వారిలో మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ మహ్మద్ఉసేని, కమిషన్ ఏజెంట్లు ప్రతాప్ ఉరుకుందయ్యశెట్టి, జగన్నాథ్‌రెడ్డి, కాకర్ల నాగరాజు, బందెనవాజ్, గోపాల్‌రెడ్డి, కందనాతి శ్రీనివాస్‌రెడ్డి, బయ్యర్స్ నటరాజ్, మహాబలేశ్వర తదితరులు పాల్గొన్నారు.