తోటి వారితో కాల్వలో ఈతకు వెళ్లిన ఓ బాలుడిని మృత్యువు మింగేసింది. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో గురువారం ఈ ఘటన చోటుచేసుకుంది.
ఎమ్మిగనూరు రూరల్ (కర్నూలు) : తోటి వారితో కాల్వలో ఈతకు వెళ్లిన ఓ బాలుడిని మృత్యువు మింగేసింది. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో గురువారం ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానిక వెంకటాపురం కాలనీకి చెందిన బొజ్జప్ప,గుంటమ్మ దంపతులకు ఇద్దరు కుమారులున్నారు. పెద్ద కుమారుడు శివ(8) ఐదో తరగతి చదువుతున్నాడు.
అయితే దసరా సెలవులు కావటంతో గురువారం మధ్యాహ్నం స్నేహితులతో కలసి సమీపంలోని తుంగభద్ర ఎల్లెల్సీ కాలువ వద్దకు ఈత కొట్టేందుకు వెళ్లాడు. సరిగా ఈత రాని శివ నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాడు. కొద్దిసేపటి తర్వాత శివ కనిపించకపోవటంతో తోటి పిల్లలు శివ తల్లిదండ్రులకు తెలిపారు. స్థానికుల సాయంతో మృతదేహాన్ని వెలికితీశారు.