canal
-
రక్తపుటేరు
అర్జెంటీనాలో ఓ కాలువ ఏకంగా ఎరుపు రంగులోకి మారింది. రాజధాని బ్యూనస్ ఎయిర్ష్ సమీపంలో ఉన్న అవెల్లెనెడా మున్సిపాలిటీలోని సరండ్ కాల్వ ఒక్కసారిగా రంగు మారడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అసలేం జరిగిందంటే అర్జెంటీనా, ఉరుగ్వే మధ్య రియో డి లా ప్లాటాలోకి ప్రవహించే జలమార్గంలో స్థానిక తోలు, వస్త్ర పరిశ్రమలు విపరీతంగా రంగులు, రసాయన వ్యర్థాలను వదులుతున్నాయి. దాంతో కాల్వ ఎప్పుడూ పసుపు రంగులో కనిపిస్తూ యాసిడ్ వాసనలు వస్తుంటుంది. అలాంటిది గురువారం అవెల్లెనెడా వాసులు నిద్రలేచే సరికి అది ఉన్నట్టుండి రక్త వర్ణంలోకి మారి భయంకరంగా కనిపించడమే గాక తీవ్ర దుర్గంధం వెదజల్లింది. ఆ విపరీతమైన దుర్వాసనకే ఉలిక్కిపడి లేచామని చాలామంది వాపోయారు. కాలుష్యంపై ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా ఎవరూ పట్టించుకోవడం లేదని వారంటున్నారు. అర్జెంటీనా పర్యావరణ శాఖ దీనిపై స్పందించింది. రంగు మార్పుకు కారణాలను గుర్తించడానికి కాల్వ నుంచి నీటి నమూనాలను సేకరించింది. సమీప ఫ్యాక్టరీ నుంచి రంగు లీకవడం వల్లే కాల్వ నీళ్లు ఎర్నగా మారాయని అధికారులు చెబుతున్నారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఘోర బస్సు ప్రమాదం.. 8 మంది మృతి
పంజాబ్: బఠిండాలో ఘోర ప్రమాదం జరిగింది. వంతెనను రెయిలింగ్‌ను ఢీకొట్టిన బస్సు.. కాల్వలో పడింది. ఈ ఘటనలో 8 మంది మృతిచెందగా, మరో 18 మంది గాయపడ్డారు. జీవన్ సింగ్ వాలా గ్రామ సమీపంలో ఈ ఘటన జరిగింది. ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మరణించగా, ముగ్గురు తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ మరణించారు.క్షతగాత్రులు షహీద్ భాయ్ మణి సింగ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 50 మంది ప్రయాణికులతో ప్రయాణిస్తున్న బస్సు సర్దుల్‌గఢ్ నుండి బఠాండాకు వెళ్తుండగా జీవన్ సింగ్ వాలా దగ్గర కాలువలో పడడంతో ఈ ప్రమాదం జరిగింది. ఎన్డీఆర్ఎఫ్, పోలీసులు, స్థానికుల సహకారంతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.2 people have died, while many others have been injured after a bus carrying nearly 50 passengers fell into a drain in Punjab's Bathinda. Rescue operations are underway.#Punjab #Bathinda pic.twitter.com/MwwfJlbhrd— Vani Mehrotra (@vani_mehrotra) December 27, 2024 -
ట్రంప్‌కు పనామా అధ్యక్షుడి కౌంటర్
పనామాసిటీ:త్వరలో రెండోసారి అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్న డొనాల్డ్ ట్రంప్(Donald Trump) పనామా కాలువ(Panama Canal)ను కొనేస్తానంటూ ఇటీవల చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. ఈ వ్యాఖ్యలపై పనామా అధ్యక్షుడు జోస్ రౌల్ ములినో తాజాగా స్పందించారు. అసలు ఈ అంశంపై ట్రంప్‌తో చర్చించాల్సిన అవసరమే లేదన్నారు.ఈమేరకు ములినో మీడియాతో మాట్లాడారు. కాలువ పనామేనియన్లకు చెందిందన్నారు. కెనాల్‌పై ఎవరితోనూ ఎలాంటి చర్చలు జరపాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు. అమెరికా(America) వాణిజ్య నౌకల నుంచి పనామా దేశం భారీగా ఫీజులు వసూలుచేస్తోందనే ట్రంప్ ఆరోపణలను ములినో ఖండించారు.అదేవిధంగా పనామా కెనాల్లో చైనా జోక్యం లేదన్నారు.కెనాల్ రుసుములు పబ్లిక్ అండ్ ఓపెన్ ప్రాసెస్ కింద అధ్యక్షుడు లేదా అడ్మినిస్ట్రేటర్ పాదర్శకంగా నిర్ణయిస్తారన్నారు.కాగా, ట్రంప్ ఇటీవల ఓ ర్యాలీలో మాట్లాడుతూ..అట్లాంటిక్, పసఫిక్ సముద్రాలను కలిపే పనామా కాలువను స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించారు.అమెరికాకు చెందిన వాణిజ్య,నావికాదళ నౌకల నుంచి పనామా దేశం భారీగా ఫీజులు వసూలు చేస్తోందని,వీటిని తగ్గించాలని ట్రంప్ డిమాండ్ చేశారు. లేకపోతే ఆ కాలువను తిరిగి అప్పగించాలన్నారు. దీంతో పాటు డెన్మార్క్ అధీనంలోని గ్రీన్‌లాండ్‌ను కొనుగోలు చేస్తామని ట్రంప్ అన్నారు. -
సరదా డీఎన్ఏ పరీక్ష... మర్డర్ మిస్టరీని ఛేదించింది!
అది 1997. అమెరికాలో మిషిగన్ రాష్ట్రంలో మాకినాక్ కౌంటీ. ఓ డ్రైనేజ్ కాలువలో నవజాత శిశువు మృతదేహం దొరికింది. పోలీసులు ఎంత విచారించినా ఆ చిన్నారిని ఎవరు పొట్టన పెట్టుకున్నారో కనిపెట్టలేకపోయారు. తనకు ‘బేబీ గార్నెట్’గా నామకరణం చేసి స్థానిక శ్మశానవాటికలో ఖననం చేశారు. ఫోరెన్సిక్ సైన్స్ పుణ్యమా అని ఏకంగా పాతికేళ్ల తర్వాత ఆ మిస్టరీ వీడింది. ఓ యువతి సరదాగా చేసుకున్న డీఎన్ఏ టెస్ట్ ఈ కేసులో ఆమె అమ్మమ్మను జైలుపాలు చేసింది. క్రిస్మస్ సందర్భంగా డీఎన్ఏ కిట్లు కానుకగా ఇవ్వడం అమెరికాలో ఆనవాయితీ. అలా మిషిగాన్‌లోని న్యూబెర్రీలో పూల దుకాణంలో పనిచేసే జెన్నా గెర్వాటోవ్స్కీకి డీఎన్ఏ కిట్ అందింది. ఆమె సరదాకు టెస్ట్ చేసుకుని అక్కడితో మరిచిపోయింది. అయితే, ‘బేబీ గార్నెట్’ కేసు గురించి విన్నారా?’ అంటూ 2022లో పోలీసుల నుంచి ఆమెకు కాల్ వచ్చింది. అవునని చెప్పింది జెన్నా. తన డీఎన్ఏ బేబీ గార్నెట్ డీఎన్ఏతో సరిపోయిందని వారు చెప్పడంతో ఆశ్చర్యపోయింది. 1997లో చనిపోయిన శిశువుకు, తనకు సంబంధమేమిటో అర్థం కాలేదు. ఇంటికి వెళ్లాక తల్లి కారాకు చెబితే స్పామ్ కాల్ అయి ఉంటుందని కొట్టిపారేసింది. కానీ వారం తరువాత షాప్‌లో ఉండగా అర్జెంటుగా ఇంటికి రమ్మంటూ తల్లి ఫోన్ చేసింది. వెళ్లి చూస్తే ఇంట్లో పోలీసులున్నారు. బేబీ గార్నెట్ తనకు పిన్ని అవుతుందని వారు చెప్పడంతో జెన్నా ఆశ్చర్యపోయింది. పోలీసులు తల్లితో మాట్లాడి ఆమెనూ డీఎన్ఏనూ పరీక్షలకు ఒప్పించారు. కారాకు బేబీ గార్నెట్ స్వయానా సోదరి అని తేలింది. కారాను లోతుగా ప్రశ్నించగా తన తర్వాత తల్లి నాన్సీకి ఓ పాప పుట్టిందని, ఊపిరాడక మరణించిందని చెప్పింది. కానీ ఆ పాపను పుట్టగానే సంచిలో పెట్టి పడేశారన్నది పోలీసుల వాదన. నాన్సీపై నవజాత శిశువు హత్యాభియోగం మోపారు. రుజువైతే ఆమెకు జీవిత ఖైదు పడవచ్చు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
కాల్వలోకి దూసుకెళ్లిన కారు.. ఇద్దరు మృతి
సాక్షి, కృష్ణా జిల్లా: పామర్రు మండలం కొండాయపాలెం వద్ద కారు కాల్వలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. గుడివాడ నుంచి పామర్రు వైపు వెళ్తున్న కారు.. కొండాయపాలెం వద్దకు రాగానే అదుపుతప్పి కాల్వలోకి దూసుకుపోయింది.కాల్వలో నీరు ఎక్కువగా ఉండటంతో కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులు ఊపిరాడక మృతి చెందారు. సమాచారం అందుకున్న పామర్రు పోలీసులు ఘటనా ప్రాంతానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. స్థానికుల సాయంతో కారును బయటకు తీశారు. మృతదేహాలను గుడివాడ ఆసుపత్రి తరలించారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.ఇదీ చదవండి: ఎంతకు తెగించింది..! భర్త రూ.8 కోట్లు ఇవ్వలేదని, ప్రియుడితో కలిసి -
పిల్లలను తోసి కాలువలోకి దూకిన తల్లి
పటమట(విజయవాడతూర్పు): ఓ తల్లి తన ఇద్దరు కుమార్తెలను కాలువలోకి నెట్టి, తానూ దూకి ఆత్మహత్యకు యత్నంచింది. ఈ ఘటనలో ఓ చిన్నారి మృతదేహం లభించగా.. తల్లి, మరో కుమార్తె ఆచూకీ లభించలేదు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని స్క్రూబ్రిడ్జి వద్ద ఆదివారం ఈ ఘటన జరిగింది. భార్యాభర్తల మధ్య మనస్పర్థలే దీనికి కారణమని తెలిసింది. పోలీసుల కథనం మేరకు వివరాలు.. గుంటూరు శారద కాలనీకి చెందిన తిరుపతిరావు రోజువారీ పనులకు వెళ్తుంటాడు. అతనికి సుధారాణి(25)తో ఐదేళ్ల కిందట వివాహమైంది. వారికి జాస్వీ (16 నెలలు), బ్లెస్సీ(4 నెలలు) సంతానం.శనివారం గుంటూరులో భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. విజయవాడ కృష్ణలంకలోని కళానగర్‌లో నివసించే తిరుపతిరావు బావ కోటేశ్వరరావు ఇంటికి భార్యాభర్తలు వచ్చారు. మధ్యాహ్నం సమయంలో ఫోను వచి్చందని తిరుపతిరావు బయటకు వెళ్లాడు. ఆ వెంటనే సుధారాణి తన ఇద్దరు పిల్లలను తీసుకుని ఇంటి నుంచి బయటకు వచ్చి స్క్రూబ్రిడ్జికి చేరుకుని ఇద్దరు పిల్లలను బందరు కాలువలో పడేసి ఆమె కూడా దూకింది.స్థానికులు దీనిని గమనించి వారిని కాపాడే ప్రయత్నం చేయగా బ్లెస్సీ మృతదేహం దొరికింది. విషయం తెలుసుకున్న పటమట సీఐ పవన్‌కిషోర్ ఎన్డీఆర్ఎఫ్ సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. కాలువలో నీటి ప్రవాహం ఉధృతంగా ఉండటంతో జాస్వీ, సుధారాణిల ఆచూకీ లభించలేదు. పోలీసులు తిరుపతిరావును అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. -
వరద కాలువలోనూ ‘విద్యుదుత్పత్తి’ చేయాలి
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: శ్రీరాంసాగర్ ప్రాజెక్టు మిగులు జలాలను సది్వనియోగం చేసుకునే లక్ష్యంతో వరద కాలువ నిర్మాణం చేపట్టారు. ఈ కాలువ ద్వారా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని మిడ్‌మానేరుకు నీటిని తరలిస్తారు. వరద కాలువ సామర్థ్యం 22 వేల క్యూసెక్కులు. 2010 నుంచి దీని ద్వారా మిడ్‌మానేరుకు నీటిని వదులుతున్నారు. గతంలో ఒక సీజన్లో అత్యధికంగా 56 వేల క్యూసెక్కుల నీటిని సైతం వదిలారు. ఈ కాలువ వద్ద పంప్‌హౌస్ నిర్మాణం చేస్తే 90 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసేందుకు అవకాశముంటుందని పలువురు పేర్కొంటున్నారు. ప్రస్తుతం శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నుంచి కాకతీయ కాలువ ద్వారా విడుదల చేస్తున్న నీటి ఆధారంగా 4 టర్బైన్లతో విద్యుదుత్పత్తి కేంద్రం నిర్మించారు. ఈ కాకతీయ కాలువ సామర్థ్యం 9 వేల క్యూసెక్కులు. ఒక్కో టర్బైన్ నుంచి 2,200 క్యూసెక్కుల నీటి ద్వారా 9 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. 4 టర్బైన్ల ద్వారా 8,800 క్యూసెక్కుల నీటితో 36 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. అయితే 22 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేసే వరద కాలువ నుంచి సైతం విద్యుదుత్పత్తి చేసే విషయాన్ని ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలని డిమాండ్లు వస్తున్నాయి. 13 ఏళ్లుగా వరద కాలువ ద్వారా ప్రతి సంవత్సరం నీటిని విడుదల చేస్తున్నారు. గతంలో గరిష్టంగా వరద కాలువ ద్వారా ఒక సీజన్లో 56 టీఎంసీల నీటిని విడుదల చేసిన సందర్భంగా కూడా ఉంది.ఈ లెక్కన చూస్తే ప్రస్తుతం కాకతీయ కాలువ ద్వారా చేస్తున్న విద్యుదుత్పత్తికి మూడు రెట్లు ఉత్పత్తి చేయవచ్చని తెలుస్తోంది. కాకతీయ కాలువ టర్బైన్లతో పోలిస్తే వరద కాలువకు ఇలాంటి 10 టర్బైన్లు నిర్మించే అవకాశాలున్నాయి. శ్రీరాంసాగర్ జలాశయంలో పూడిక పేరుకుపోతుండడంతో నీటినిల్వ సామర్థ్యం తగ్గుతూ వస్తోంది. దీంతో గత పదేళ్లుగా 42 వరద గేట్లును ఎత్తి గోదావరిలోకి నీటిని వదులుతున్నారు. మరోవైపు వరద కాలువ ద్వారా కూడా నీటిని మిడ్‌మానేరుకు విడుదల చేస్తున్నారు. ఎగువ మహారాష్ట్ర నుంచి ప్రతిఏటా భారీగా వరద నీరు వస్తోంది. భవిష్యత్‌లోనూ ఇదే పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలో వరదకాలువ వద్ద పంప్‌హౌస్ విద్యుదుత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేసుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. మరోవైపు ఎస్సారెస్పీ పునరుజ్జీవన పథకం ద్వారా కాళేశ్వరం నుంచి రివర్స్ పంపింగ్‌తో వరద కాలువ ద్వారా నీటిని శ్రీరాంసాగర్ జలాశయంలోకి తరలించారు. కాగా 1,091 అడుగుల పూర్తి నీటిమట్టం ఉన్న ఎస్సారెస్పీకి 1,075 అడుగుల మేర నీటిమట్టం చేరగానే వరద కాలువ ద్వారా నీటి విడుదల చేస్తున్నారు. -
ఎంత ఘోరం.. కొడుకుని కాలువలో పడేసిన తల్లి.. మొసళ్లు కొరకడంతో
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో అమానుష ఘటన వెలుగుచూసింది. భార్యభర్తల గొడవ ఆరేళ్ల బాలుడి ప్రాణాలు తీసింది. దంపతుల మధ్య వివాదం కారణంగా ఆరేళ్ల మూగవాడైన కొడుకును కాలువలో పడేయడంతో అందులోని మొసళ్లు బాలుడిని కొరికి చంపేశాయి.. వివరాలు.. ఉత్తర కన్నడ జిల్లా, దండెలి తాలూకాలో నివసించే సావిత్రి అనే 33 ఏళ్ల మహిళ సావిత్రికి, భర్త రవికుమార్, కుమారులు వినోద్(6), రెండేళ్ల బాలుడు ఉన్నారు. సావిత్రి ఇంట్లో పనులు చేస్తూ జీవిస్తుండగా రవి తాపీ మేస్త్రీగా పనిచేస్తున్నాడు.కాగా పెద్ద కొడుక్కి చెవులు వినబడకపోవడం, మాటలు రాకపోవడంతో అతడి విషయంలో గత కొంతకాలంగా దంపతుల మధ్య తరుచూ గొడవలు జరిగేవి. గత శనివారం వీరిద్దరి మధ్య మళ్లీ గొడవ జరిగింది. దీంతో ఆవేశంతో సావిత్రి తన కొడుకుని ఉత్తర కన్నడ జిల్లాలోని ఓ కాలువలో పడేసింది. అయితే ఆ కాలువలో మూసళ్లు ఉండటంతో బాలుడిని దారుణంగా కొరికి చంపేశాయి.దీన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందిచారు. అదే రోజు రాత్రి కాలువలో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా.. మరుసటి రోజు ఉదయం బాలుడి మృతదేహం లభ్యమైంది. మృతదేహం అంతా కొరికిన గుర్తులు ఉండగా, బాలుడి కుడి చేయి కూడా కనిపించలేదు. దీంతో చిన్నారిని మొసళ్లు కొరికి చంపేసి ఉంటాయని పోలీసులు నిర్ధారించారు. తల్లిదండ్రులు రవి, సావిత్రి ఇద్దరిని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు.అయితే తన కొడుక్కి చావుకు భర్తే బాధ్యుడని సావిత్రి పేర్కొంది. మూగ కుమారుడిని ఎందుకు కన్నావ్ అంటూ రవి తనతో పదే పదే గొడవపడేవాడని సావిత్రి తెలిపింది. తినడం తప్ప ఏం చేతగాని కొడుకును కాల్వలో పడేసి చంపేస్తానని బెదిరించేవాడని చెప్పింది. ‘నా భర్త అలా మాట్లాడుతుంటే, కొడుకు మాత్రం ఎంత టార్చర్ భరించగలడు. నా బాధను ఎవరితో చెప్పుకోగలను’ అని పేర్కొంది. చివరికి ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు వారిపై హత్యకేసు నమోదు చేశారు. -
నిజాంసాగర్ కెనాల్ కు గండి
-
నిజాంసాగర్ కెనాల్‌కు గండి.. ఇళ్లలోకి నీరు
నిజామాబాద్ జిల్లా: ఆర్మూర్‌లో నిజాంసాగర్ కెనాల్‌కు గండి పడింది. ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని జర్నలిస్ట్ కాలనీకి ఆనుకొని ఉన్న నిజాంసాగర్ కెనాల్ కట్టకు ఓ చోట గండి పడింది. దీంతో కాలనీలోని ఇండ్లలోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. సొమవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకోవడంతో గ్రామస్తులు ప్రాణభయంతో పరుగులు తీశారు. ఇండ్లు పూర్తిగా వరద నీటితో మునిగిపోవటంతో..చాలా మంది నిరాశ్రయులయ్యారు. ఇరిగేషన్ కెనాల్ అధికారుల నిర్లక్ష్యమే కారణంగానే ఈ ఘటన జరిగింది అంటూ స్థానికుల ఆరోపణ చేస్తున్నారు. త్వరగా సహాయక చర్యలు మొదలు పెట్టాలని కాలనీవాసుల డిమాండ్ చేస్తున్నారు. -
హోలీ వేళ.. నాలుగు కుటుంబాల్లో విషాదం!
హోలీ పండుగవేళ.. కుమురంభీం ఆసిఫా బాద్ జిల్లాలోని వార్దా తీరం కన్నీటి మయమైంది. ఆర్తనాదాలతో మారుమోగింది. అప్పటి వరకు ఉత్సాహంగా రంగుల పండుగ జరుపుకుని స్నానం కోసం వెళ్లిన నలుగురు స్నేహితులను నది పొట్టన బెట్టుకుంది. ఈత రాకపోవడంతో గల్లంతై తిరిగిరాని లోకాలకు చేరుకున్న ఆ మిత్రుల చివరి వేడుక విషాదాంతంగా మారింది. నాలుగు కుటుంబాలకు తీరని దుఃఖాన్ని మిగి ల్చింది. విగత జీవులుగా మిగిలిన బిడ్డలను పట్టుకొని గుండెలవిసేలా ఆ తల్లులు రోదించిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది. ఉత్సాహంగా హోలీ చేసుకుని.. కౌటాల మండలం కేంద్రంలోని నదిమాబాద్‌కు చెందిన పనస కమలాకర్(22), ఆలం సాయి(22), ఉప్పుల సంతోష్(25), ఎల్ములె ప్రవీణ్(23), మేడి నవీన్, పసుల సంతోష్ చిన్ననాటి నుంచి ప్రాణ స్నేహితులు. కలిసి చదువుకోకున్నా ఒకే కాలనీలో ఉండడంతో వీరి మధ్య స్నేహం పెరిగింది. సోమవారం హోలీ పండుగ కలిసే జరుపుకున్నారు. మధ్యాహ్న వరకు రంగులు చల్లుకుని ఎంజాయ్ చేశారు. సెల్ఫీలు దిగారు. తర్వాత మద్యం కొనుగోలు చేసి స్నానాలు చేసేందుకు తాటిపల్లి గ్రామ సమీపంలోని వార్దా నది వద్దకు వెళ్లారు. మద్యం తాగి స్నానానికి దిగి.. ఆరుగురూ స్నానం చేస్తూ ఉల్లాసంగా గడిపారు. తర్వాత ఒడ్డునే కూర్చుని అందరూ వెంటతెచ్చుకున్న మద్యం సేవించారు. అనంతరం నవీన్ అక్కడి నుంచి కౌటాలకు తిరిగి వెళ్లాడు. పసుల సంతోష్‌కు ఫోన్ రావడంతో మాట్లాడుతూ ఒడ్డునే ఉండి పోయాడు. కమలాకర్, ఉప్పుల సంతోష్, ప్రవీణ్, సాయి మాత్రం మరోసారి స్నానం చేసేందుకు నదిలో దిగారు. మద్యం మత్తు, ఈత రాకపోవడం, లోతు అంచనా వేయకపోవడంతో నలుగు రూ గల్లంతయ్యారు. గమనించిన సంతోష్ సమీ పంలో ఉన్నవారి వద్దకు వెళ్లి సాయం చేయాలని కోరాడు. స్థానికులు నదిలో గాలించగా ఆచూకీ లభించలేదు. పోలీసులకు సమాచారం అందించడంతో కౌటాల సీఐ సాదిక్‌పాషా, సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకున్నాడు. గజ ఈతగాళ్లను రప్పించి సుమారు నాలుగు గంటలపాటు గాలించారు. అనంతరం నలుగురి మృతదేహాలను బయటకు తీశారు. ప్రమాదానికి కారణాలివే.. నదిలో స్నానానికి వెళ్లి నలుగురు మృత్యువాత పడడానికి ప్రధాన కారణం ఈత రాకపోవడం. నదిలో లోతు అంచనా వేయకుండా స్నానానికి వెళ్లడం, మద్యం తాగి ఉండడం అని పోలీసులు తెలిపారు. ఘటన జరిగిన ప్రాంతంలో నది ప్రవాహం వంపు తిరిగి ఉంది. నదిలో స్నానానికి వెళ్లిన ప్రదేశంలో తీరం నుంచి ఇసుక ఉండగా.. నడుచుకుంటూ వెళ్లిన వారు ఒక్కసారిగా లోతుకు పడిపోయి ఉంటారని స్థానికులు తెలిపారు. మద్యం తాగి ఉండటం, నీటి మట్టం కారణంగా బయట రాలేకపోయారని పోలీసులు పేర్కొన్నారు. యువకులు దిగే చోట లోతు ఎక్కువగా ఉందని స్థానిక రైతులు చెప్పినా లెక్క చేయకపోవడంతో అంతా విగతజీవులుగా మారాల్సి వచ్చింది. ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ, డీఎస్పీ తాటిపల్లి వద్ద ఘటనా స్థలాన్ని ఎస్పీ సురేశ్‌కుమార్, డీఎస్పీ కరుణాకర్ పరిశీలించారు. మృతదేహాలను పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. ఘటనా స్థలంలో ప్రత్యక్ష సాక్షిగా ఉన్న మరో యువకుడు పసుల సంతోష్‌తో మాట్లాడారు. సీఐ సాదిక్ పాషాతో మాట్లాడిన ఎస్పీ మృతదేహాలకు త్వరగా పోస్ట్‌మార్టం ముగించి కుటుంబీకులకు అప్పగించాలని ఆదేశించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. యువకులు నలుగురు మద్యం తాగి నీటిలోకి దిగడంతో ఈత రాక మృతి చెందారని ప్రాథమికంగా గుర్తించినట్లు తెలిపారు. మిన్నంటిన రోదనలు.. యువకులు నీటిలో గల్లంతయిన విషయం తెలుసుకున్న వారి కుటుంబసభ్యులు, బంధువులు, మిత్రులు, ప్రజలు భారీగా నది వద్దకు చేరుకున్నారు. మృతదేహాలను వెలుపలికి తీయగానే మృతుల కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. ‘హోలీ ఆడి ఇంటికి వచ్చి బోర్ వేసుకుని స్నానం చేయమన్నా కదా కొడుకా.. ఇక్కడికి ఎందుకు వచ్చినవ్ కొడుకా..’ అంటూ కమలాకర్ తల్లి నది వద్ద కొడుకు మృతదేహాన్ని పట్టుకుని రోదించిన తీరు కదిలించింది. మృతుల వివరాలు.. ఆలం శంకర్–దేవమ్మ దంపతులకు ముగ్గురు సంతానం కాగా, సాయి పెద్ద కుమారుడు. ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్నూర్‌లో డిగ్రీ చదువుకుంటున్నాడు. ఉప్పుల గురుపాదం–శంకరమ్మ దంపతుల చిన్న కుమారుడు ఉప్పుల సంతోష్. తండ్రి గతంలో చనిపోవడంతో ఇంటర్ పూర్తి చేసిన సంతోష్ రైస్‌మిల్లులో పని చేస్తూ కుటుంబానికి ఆసరాగా ఉంటున్నాడు. పనస వసంత్ – లక్ష్మి దంపతులకు ఇద్దరు కుమారులు. పేద కుటుంబం కావడంతో పెద్ద కుమారుడు కమలాకర్ డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబానికి అండగా ఉంటున్నాడు. వాసుదేవ్ – సునీత దంపతుల ఒక్కగానొక్క కుమారుడు ఎల్ములే ప్రవీణ్. వీరిది రైతు కు టుంబం. ప్రవీణ్ వ్యవసాయంలో తండ్రికి తోడుగా ఉంటున్నాడు. మూడేళ్ల క్రితం వివా హం కాగా, భార్య వకుళ, ఏడాది వయసున్న కుమారుడు వేదాంశ్ ఉన్నాడు. కొడుకు మృతితో భార్య, తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఇదిలా ఉండగా ఆరు నెలల క్రితం ప్రవీణ్ మేనమామ చౌదరి మారుతి కూడా సిర్పూర్(టి) మండలం టోంకిని వద్ద వార్దా నదిలోనే గల్లంతై మృతి చెందాడు. ఇవి చదవండి: వివాహితను ట్రాప్ చేసిన ఏఎస్సై రామయ్య.. -
యూపీలో కాలువలో పడిన కారు.. ముగ్గురు మృతి.. మరో ముగ్గురు గల్లంతు!
యూపీలోని బులంద్‌షహర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పెళ్లి బృందంతో తిరిగి వస్తున్న కారు వర్షం కారణంగా కాలువలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, ఇద్దరు గాయపడినట్లు సమాచారం. అలాగే ముగ్గురి ఆచూకీ ఇంకా తెలియడంలేదు. వీరిని గాలించేందుకు రెస్క్యూ టీమ్‌లు రంగంలోకి దిగాయి. ప్రమాదం జరిగిన సమయంలో కారులో ఎనిమంది మంది ప్రయాణిస్తున్నారు. ఆదివారం అర్థరాత్రి దాటాక జహంగీరాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కప్నా కాలువలో కారు పడిపోయింది. ప్రమాదానికి సంబంధించిన సమాచారం అందిన వెంటనే డీఎం, ఎస్ఎస్పీ, ఇతర పోలీసు అధికారులు కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అధికారులను అప్రమత్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున పరిహారం అందించనున్నట్లు సీఎం ప్రకటించారు. -
పనామా కాలువను ఓడలు ఎలా దాటుతాయంటే? చూస్తేనే అర్థమవుతుంది
మానవ నిర్మితమైన 'పనామా కాలువ' (Panama Canal) పసిఫిక్ మహాసముద్రాన్ని, అట్లాంటిక్ మహాసముద్రాన్ని కలుపుతోంది. ఈ కాలువ ఉత్తర, దక్షిణ అమెరికాలు విడదీస్తుంది. ఈ కాలువ నిర్మాణం పూర్తయిన తరువాత ప్రయాణించే దూరం ఏకంగా 9500 కిమీ తగ్గిపోయింది. సాధారణంగా సముద్రం మీద వెళ్లినట్లు ఈ కాలువలో షిప్పులు ప్రయాణించడం సాధ్యం కాదు, ఎందుకంటే ఇక్కడ భూభాగం ఎగుడు దిగుడుగా ఉండటం వల్ల ఇది అసాధ్యం. దీనిని దృష్టిలో ఉంచుకుని లాకింగ్ సిస్టం అనే పద్దతి ద్వారా షిప్పులను జాగ్రత్తగా ఒకవైపు నుంచి మరో వైపుకు పంపడం చూడవచ్చు. పనామా కాలువలో షిప్పులు ఎలా ముందుకు వెళతాయి అనేదానికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఇందులో ఒక స్టేట్ నుంచి మరో స్టేజికి వెళ్లాలంటే లాకింగ్ పద్దతిని అనుసరించి వెళ్లాల్సి ఉంటుంది. అంటే నీటిని ఓకే సమతుల్య స్థానానికి తీసుకు వచ్చిన తరువాత ఇవి ముందుకు కదులుతాయి. ఇలా లాకింగ్ పద్దతిని అనుసరించి అట్లాంటిక్ సముద్రం నుంచి పసిఫిక్ సముద్రంలోకి షిప్పులు కదులుతాయి. How ships cross the Panama Canal.. ❤️pic.twitter.com/G5GeuBxK92 — #NaMo Again 🚩 (@BhaktSanatani_) February 29, 2024 -
పనామా కెనాల్లో ఎలా ఉంటుందంటే.?
-
ఔననదు.. కాదనదు!
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు నావిగేషన్ కెనాల్‌ను జాతీయ జలమార్గం క్లాస్–3 ప్రమాణాల మేరకు నిర్మించాలని సూచించిన ఇన్‌ల్యాండ్ వాటర్‌వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఐడబ్ల్యూఏఐ).. ఆ పనులకయ్యే నిధులపై మాత్రం స్పందించడం లేదు. ఇప్పటికే పోలవరం స్పిల్ వే, ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌లను పూర్తి చేసి.. వరద ప్రవాహాన్ని స్పిల్ వే మీదుగా మళ్లించిన రాష్ట్ర ప్రభుత్వం ఈసీఆర్ఎఫ్ డ్యామ్‌పై దృష్టి పెట్టింది. జలాశయం పూర్తయితే నావిగేషన్ కెనాల్, టన్నెల్ నిర్మాణం చేపట్టడం అతి పెద్ద సవాల్‌గా మారుతుంది. ఇదే అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం అనేకసార్లు కేంద్ర నౌకాయాన శాఖ, ఐడబ్ల్యూఏఐ దృష్టికి తీసుకెళ్లింది. అయినా ఆ రెండు సంస్థలు మాత్రం నిధుల మంజూరుపై స్పష్టత ఇవ్వట్లేదు. 90 శాతం పనులు పూర్తి.. వాస్తవానికి పోలవరం ప్రాజెక్టుకు అవసరమైన అనుమతులను 2004–05లోనే కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) ఆమోదించిన డిజైన్ మేరకు ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రభుత్వం చేపట్టింది. ఇందులో పోలవరం ప్రాజెక్టు ద్వారా గోదావరిపై ఎగువకు, దిగువకు నౌకయానానికి వీలుగా 36.6 మీటర్ల వెడల్పు.. 9.6 మీటర్ల పూర్తి ప్రవాహ లోతు(ఎఫ్ఎస్డీ)తో 1.423 కి.మీ.ల పొడవుతో అప్రోచ్ ఛానల్.. దానికి కొనసాగింపుగా 40 మీటర్ల వెడల్పు, 10 మీటర్ల ఎత్తు గేటుతో మూడు నావిగేషన్ లాక్‌లు, 12 మీటర్ల వెడల్పు, 3.81 మీటర్ల ఎఫ్‌ఎస్‌డీతో 3.84 కి.మీ.ల పొడవున నావిగేషన్ కెనాల్.. 12 మీటర్ల వెడల్పు, 3.66 మీటర్ల ఎఫ్ఎస్డీ, 2.34 మీటర్ల నిలువుతో 890 మీటర్ల పొడవున నావిగేషన్ టన్నెల్ పనులను చేపట్టింది. ఇందులో 2014 నాటికే నావిగేషన్ లాక్‌ల పనులను దాదాపుగా పూర్తిచేసింది. నావిగేషన్ టన్నెల్ పనులు 90 శాతం పూర్తయ్యాయి. అలాగే.. 2013–14 ధరల ప్రకారం సీడబ్ల్యూసీ టీఏసీ ఆమోదించిన వ్యయం మేరకు నావిగేషన్ కెనాల్ పనుల అంచనా వ్యయం రూ.261.62 కోట్లు. ఇందులో రూ.137.93 కోట్ల విలువైన పనులను రాష్ట్ర ప్రభుత్వం పూర్తిచేసింది. జాతీయ జల మార్గంలో స్థానం.. ధవళేశ్వరం–భద్రచాలం స్ట్రెచ్(అఖండ గోదావరి)ను జాతీయ జలమార్గం–4లో అంతర్భాగంగా 2016లో ఐడబ్ల్యూఏఐ ప్రకటించింది. ఈ జలమార్గాన్ని క్లాస్–3 ప్రమాణాలతో చేపట్టాలని నిర్ణయించింది. క్లాస్–3 ప్రమాణాలతో పోలవరం నావిగేషన్ కెనాల్‌ను నిర్మించాలంటే.. 1.423 కి.మీ.ల పొడవున అప్రోచ్ ఛానల్‌ను 40 మీటర్ల వెడల్పు, 2.20 ఎఫ్‌ఎస్‌డీతోనూ.. దానికి కొనసాగింపుగా 70 మీటర్ల వెడల్పు, 15 మీటర్ల ఎత్తు గేటుతో 3 నావిగేషన్ లాక్‌లు, 40 మీటర్ల వెడల్పు, 2.20 మీటర్ల ఎఫ్‌ఎస్‌డీతో 3.84 కి.మీ.ల పొడవున నావిగేషన్ కెనాల్.. 20 మీటర్ల వెడల్పు, 2.20 మీటర్ల ఎఫ్ఎస్డీ, 7 మీటర్ల నిలువుతో 890 మీటర్ల పొడవున నావిగేషన్ టన్నెల్ పనులను చేపట్టాలి. ఈ పనులకు రూ.876.38 కోట్ల వ్యయమవుతుంది. ఉలుకూపలుకు లేని ఐడబ్ల్యూఏఐ.. నిధులిస్తే పనులు చేపడతామని ఐడబ్ల్యూఏఐకి అనేకసార్లు రాష్ట్ర జలవనరుల శాఖాధికారులు ప్రతిపాదించారు. ఈ వ్యయాన్ని ఐడబ్ల్యూఏఐ భరించాలని సీడబ్ల్యూసీ, కేంద్ర జల్ శక్తి శాఖలు కూడా స్పష్టం చేశాయి. ఐడబ్ల్యూఏఐ, పోలవరం ప్రాజెక్టు అథారిటీ, కేంద్ర నౌకాయాన శాఖ, సీడబ్ల్యూసీ, రాష్ట్ర జలవనరుల శాఖ ఉన్నతాధికారులతో కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి సమావేశాలు నిర్వహించి.. నిధులు మంజూరు చేయాలని ఐడబ్ల్యూఏఐకి తేల్చిచెప్పారు. అయినా కూడా ప్రతి సమావేశంలోనూ జాతీయ ప్రమాణాల మేరకు పోలవరం నావిగేషన్ కెనాల్ పనులు చేయాలని ఐడబ్ల్యూఏఐ ఉన్నతాధికారులు నిర్దేశిస్తారేగానీ.. నిధులిచ్చే అంశాన్ని మాత్రం ఎటూ తేల్చడం లేదు. -
దారుణం: డెడ్‌బాడీని కాలువలో పడేసిన పోలీసులు
పాట్నా: బిహార్‌లోని ముజఫర్‌పూర్‌లో దారుణం వెలుగులోకి వచ్చింది. పోలీసులే అమానవీయ ఘటనకు పాల్పడ్డారు. ఓ బాధితుని మృతదేహాన్ని కాలువలో పడేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా.. ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. దీంతో ఆ మృతదేహాన్ని మళ్లీ వెలికితీసి మార్చురీకి తరలించారు. పోలీసు కానిస్టేబుళ్లు ఓ బాధిత మృతదేహాన్ని కాలువలో పడేస్తుండగా.. ఓ బాటసారి వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాడు. దీంతో విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసు ఉన్నతాధికారులు ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుని దర్యాప్తు చేయించారు. అయితే.. ఓ ప్రమాదంలో చిధ్రమైన మృతదేహాన్ని ఇలా కాలువలో పడేసినట్లు తెలిపారు. ఆ బాధిత మృతదేహం ఎవరిదో కూడా గుర్తించినట్లు స్పష్టం చేశారు. పోలీసు కానిస్టేబుళ్లు చేసిన ఘటన అమానవీయమని పేర్కొన్న జిల్లా ఎస్పీ రాకేశ్ కుమార్.. నిందితులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇప్పటికే ఆ కానిస్టేబుళ్లను ఉద్యోగాల నుంచి సస్పెండ్ చేసినట్లు తెలిపారు. ఆ చిధ్రమైన మృతదేహాన్ని పోస్టుమార్టానికి పంపినట్లు వెల్లడించారు. ఇదీ చదవండి: యువకుడి బ్యాంక్ ఖాతాలో 753 కోట్లు -
కాల్వలో పడిన ట్రాక్టర్.. 9 మంది మృతి
లక్నో: ట్రాక్టర్ ట్రాలీ కాల్వలోకి దూసుకెళ్లిన ఘటనలో నలుగురు చిన్నారులు సహా మొత్తం తొమ్మిది మంది మృతి చెందారు. ఉత్తరప్రదేశ్‌లోని షహరాన్‌పూర్ జిల్లాలో ఈ విషాదం చోటుచేసుకుంది. తాజ్‌పురా ప్రాంతానికి చెందిన సుమారు 50 మంది బుధవారం సాయంత్రం రన్‌దౌల్ గ్రామంలో జరిగే మతపరమైన కార్యక్రమానికి ట్రాక్టర్లో బయలుదేరారు. రెధిబోడ్కి గ్రామ సమీపంలోని కాల్వలో ప్రమాదవశాత్తు ట్రాక్టర్ ట్రాలీ పడిపోయింది. బుధవారం నాలుగు, గురువారం అయిదు మృతదేహాలను కాల్వ నుంచి బయటకు తీశారు. మృతుల్లో 5–12 ఏళ్ల మధ్య వయస్సున్న నలుగురు చిన్నారులు న్నారు. గాలింపు చర్యలు కొనసాగుతు న్నాయని అధికారులు చెప్పారు. -
వెళ్లి పోయావా మిత్రమా!
కోనసీమ: ఊహకు ఊపిరిలా.. ఆశకు శ్వాసలా.. మది నిండా మధుర జ్ఞాపకాలతో సందడి చేశారు. నీకు నేనున్నానంటూ భరోసా ఇచ్చుకున్నారు.. స్నేహితుల దినోత్సవం వేళ దోస్తులంతా కలసి చేసిన సందడి కొద్ది క్షణాల్లోనే ఆవిరి అయ్యింది. తమ స్నేహితుడు కళ్ల ముందే కాలువలో గల్లంతైన ఘటన చూసిన సహచరులు నిర్ఘాంతపోయారు. ఈ ఘటన ఎస్.యానం కట్టు కాలువ వద్ద జరిగింది. స్నేహితులు, కుటుంబీకులు, పోలీసుల కథనం ప్రకారం.. ఆదివారం స్నేహితుల దినోత్సవాన్ని పురస్కరించుకుని అమలాపురం రూరల్ మండలం వన్నెచింతలపూడిలో కొత్త కాలనీకి చెందిన చిత్రి ముఖేష్ కుమార్ (19) తన పదకొండు మంది మిత్రులతో కలసి ఎస్.యానం బీచ్‌కు వెళ్లాడు. అక్కడ ఆట పాటలతో సముద్ర స్నానాలు చేసి సాయంత్రం వరకూ సరదాగా గడిపారు. తిరిగి ఇంటికి పయనమయ్యారు. ఇంటికి వెళుతూ ఒంటిపై ఉన్న ఇసుకను తొలగించుకునేందుకు బీచ్‌ను ఆనుకుని ఉన్న కట్టు కాలువలో స్నానాలకు దిగారు. సముద్ర పోటు సమయం కావడంతో కాలువలో నీరు ఎక్కువగా ఉంది. దీంతో ముఖేష్ కుమార్ నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాడు. తోటి స్నేహితులు చూస్తుండగానే అతను నీటి ప్రవాహంలో గల్లంతయ్యాడు. స్నేహితులు చేతనైన సాయం చేద్దామనుకున్నా ఎటువంటి ప్రయోజనం లేకపోయింది. స్నేహితుల దినోత్సవం రోజునే తమ మిత్రుడు ఇలా కొట్టుకుపోతుంటే తట్టుకోలేక హాహాకారాలు చేశారు. ఈ సంఘటనను తెలుసుకున్న ఎస్సై జి.వెంకటేశ్వరరావు, పోలీసులు, గ్రామస్తులు, బంధువులు గాలింపు చర్యలు చేపట్టారు. అయినా ముఖే‹Ùకుమార్ ఆచూకీ లభ్యం కాలేదు. ఆదివారం రాత్రి వరకూ గాలింపు కొనసాగింది. ముఖేష్ కుమార్ సోదరుడు తరుణ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్సై వెంకటేశ్వరరావు వివరించారు. -
ఘోర ప్రమాదం.. కాల్వలోకి దూసుకెళ్లిన కారు.. ముగ్గురి మృతి
సాక్షి, తూర్పుగోదావరి: తూర్పుగోదావరి జిల్లా విషాదం చోటుచేసుకుంది. కోరుకొండ మండలం బూరుగుపూడి గేటు వద్ద బ్రిడ్జిపై నుంచి ఓ కారు కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మరణించారు. ఏపీ 39 హెచ్ఆర్0907 నెంబర్ గల బలేనో కారు ఏజెన్సీ మారేడుమిల్లి నుంచి ఏలూరు వెళ్తుండగా ఈ ఘటన ఆదివారం తెల్లవారు జామున జరిగింది. వివరాలు.. జిల్లాకు చెందిన 10 మంది స్నేహితులు రెండు కార్లలో అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి సమీపంలోని గుడిసె పర్యాటక ప్రాంతానికి వెళ్లారు. రుగు ప్రయాణంలో అర్ధరాత్రి దాటిన తర్వాత కోరుకొండ మండలం బూరుగుపూడి వద్ద ఓ కారు నేరుగా కాల్వలోకి దూసుకెళ్లింది. స్థానికంగా ఉండే పాత, కొత్త వంతెనల మధ్యలోని కాల్వలో పడింది. ప్రమాద సమయంలో కారులో ఆరుగురు ప్రయాణికులు ఉన్నారు. ముగ్గురు మృతిచెందారు. మృతులను ఉదయ్ కిరణ్, హర్ష వర్ధన్, హేమంత్గా గుర్తించారు. గాయపడిన మిగతా ముగ్గురిని రాజమంత్రి ప్రభుత్వం ఆసుపత్రికి తరలించారు. మరణించిన ముగ్గురు యువకులు ఏలూరు సమీపంలోని రామచంద్ర ఇంజినీరింగ్ కాలేజీలో బీ టెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నట్లు సమాచారం. -
ఆవనిగడ్డ కరకట్ట కేసు.. ఆ అర్ధరాత్రి ఏం జరిగింది?
సాక్షి, కృష్ణా: చోడవరం వద్ద కరకట్ట కాలువలోకి కారు దూసుకెళ్లిన ఘటనలో.. గాజుల రత్నభాస్కర్ (47) మృతదేహంగా దొరికిన సంగతి విదితమే. అయితే ఈ కేసు పెద్ద మిస్టరీగా మారడంతో.. చేధించే పనిలో పోలీసులు తలమునకలయ్యారు. ముదినేపల్లికి కారులో వెళ్లాల్సిన భాస్కర్ చోడవరం వైపు వెళ్లడం.. చివరకు శవమై కనిపించడం, పైగా వెంట తీసుకెళ్లిన డబ్బులూ కనిపించకుండా పోవడంతో.. కుటుంబ సభ్యులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అవనిగడ్డ ప్రమాదం కేసు పోలీసులకు పెద్ద సవాల్‌గా మారింది. కెనాల్లో కారు దూసుకెళ్లిన 36 గంటల తర్వాత(మంగళవారం ఉదయం).. తోట్లవల్లూరు మండలం కళ్లంవారిపాలెం వద్ద నగ్నంగా రత్నభాస్కర్ మృతదేహం తేలింది. మృతుడి కుటుంబ సభ్యులు అవనిగడ్డ నుంచి వచ్చి మృతదేహాన్ని చూసి రత్నభాస్కర్‌దేనని గుర్తించారు. ఒంటిపై గాయాలు - ఎలాంటి క్లూ లేకపోవడంతో ఏం జరిగిందన్నది నిర్ధారించుకోలేకపోయారు పోలీసులు.. మూడు బృందాలుగా ఏర్పడి కేసు దర్యాప్తు చేపట్టారు. అర్థరాత్రి ఏం జరిగింది.. రత్నభాస్కర్ ఇంటి నుంచి బయల్దేరిన రోజు అర్ధరాత్రి ఏం జరిగిందనేదే మిస్టరీగా మారింది. ఇంటి నుంచి ఆయన రూ.4 లక్షలతో బయల్దేరినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. దీంతో.. ఆర్థిక లావాదేవీలు, శత్రువులున్నారా? లేదంటే దొంగల పనా? అనే కోణంలో పోలీసుల దర్యాప్తు చేపట్టారు. అలాగే.. రత్నభాస్కర్ కారు జర్నీ ఆధారంగా సీసీఫుటేజ్ సేకరిస్తున్నారు. ఈ క్రమంలో రెండు చోట్ల ఒంటరిగానే వెళ్తున్నట్లు కనిపించినట్లు తెలుస్తోంది. పోస్టుమార్టం కీలకం.. రత్నభాస్కర్ మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఉయ్యూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతదేహం దొరికినా కేసులో మిస్టరీ మాత్రం వీడలేదు. ఈ కేసులో పోస్టుమార్టం కీలకంగా మారనుంది. నివేదిక వస్తేనే.. ఏం జరిగిందనేదానిపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. జరిగింది ఇదే.. ముదినేపల్లికి చెందిన ఐస్ ఫ్యాక్టరీ యజమాని గాజుల రత్నభాస్కర్ ఆదివారం మచిలీపట్నంలో నిర్వహించిన టీడీపీ సమావేశానికి వెళ్లాడు. అక్కడి నుంచి ముదినేపల్లి ఐస్ ఫ్యాక్టరీ వద్దకు వెళ్లాల్సి ఉంది. అయితే ఆయన సోమవారం వేకువజామున చోడవరం వద్ద తాను ప్రయాణిస్తున్న కారుతో సహా కేఈబీ కెనాల్లోకి దూసుకువెళ్లాడు. మచిలీపట్నంలో ఉన్న రత్నభాస్కర్ ముదినేపల్లికి వెళ్లకుండా చోడవరం వచ్చి శవమై తేలడంతో కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేశారు. కారు కాలువలోకి దూసుకెళ్లడంతో ప్రాణాలతో బయటపడాలని కారులోనే దుస్తులు విప్పి కాలువలోకి రత్నప్రసాద్ దిగి మృతి చెందాడా అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కారులో ఉన్న దుస్తులు, సెల్‌ఫోన్ పోలీసులు ఇప్పటికే స్వాధీనం చేసుకున్నారు. కేసును అన్ని కోణాల నుంచి విచారణ చేస్తామని డీఎస్పీ జయసూర్య తెలిపారు. -
వీడియో: వెనిస్ మిస్టరీ.. రాత్రికి రాత్రే రంగు మారిపోయింది!
-
Venice: రాత్రికి రాత్రే రంగు మారింది!
వైరల్ న్యూస్: ఇటలీ నీటి నగరం వెనిస్లో ఆసక్తికర ఘటన ఒకటి జరిగింది. తేట నీరుతో టూరిస్టులను ఆకట్టుకునే అక్కడి గ్రాండ్ కెనాల్ నీటి రంగు.. రాత్రికి రాత్రే మొత్తం ఆకుపచ్చగా మారింది. ఆదివారం ఉదయం కాలువ రంగు మారిపోవడంతో అక్కడి ప్రజలంతా ఆశ్చర్యానికి గురయ్యారు. వెనెటో రీజియన్ రాజధాని వెనిస్లో Grand Canal నీరు అసాధారణ రీతిలో ఆకుపచ్చ రంగులోకి మారిపోయింది. తెల్లవారు జామున రియాల్టో బ్రిడ్జి వద్ద తొలుత అది గమనించిన కొందరు స్థానికులు విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో.. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టాలని పోలీసులకు వెనెటో రీజియన్ ప్రెసిడెంట్ లూకా జాయియా ఆదేశించారు. మరోవైపు సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి. ఇక నీరు రంగు మారిన పరిణామం రకరకాల ఊహాగానాలు తెర మీదకు వచ్చాయి. ఇది ఆల్గే(నాచు) వల్ల సంతరించుకుంది కాదని పరిశోధకులు ప్రకటించారు. దీంతో.. బహుశా ఎవరైనా నిరసకారులు లేదంటే ఆకతాయిలు ఈ పని చేసి ఉంటారని భావిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీ ద్వారా వాళ్లను కనిపెట్టే పనిలో పోలీసులు ఉన్నారు. The water in the Grand Canal in Venice has turned bright green. Has grown significantly. pic.twitter.com/N7js56Vmiy — Animal World (@dragon_of_time_) May 28, 2023 ఇదిలా ఉంటే.. వెనిస్ గ్రాండ్ కెనాల్ ఇలా రంగు మారడం ఇదే తొలిసారి కాదు. గతంలో.. 1968లో అర్జెంటీనా ఆర్టిస్ట్ నికోలస్ గార్సియా ఉద్దేశపూర్వకంగానే గ్రాండ్ కెనాల్లో ఫ్లూరెసెయిన్ అనే డైని కలిపారు. ఆ టైంలో వెనిస్ ఇంటర్నేషనల్ థియేటర్ ఫెస్టివల్ జరగాల్సి ఉండగా.. పర్యావరణ సమస్యలను ప్రపంచం దృష్టికి తీసుకెళ్లే ఉద్దేశంతో ఆ టైంలో ఆయన ఆ పని చేశారు. -
సంతానం కోసం పూజలు.. భర్తతో బైక్‌పై శివయ్య ఆలయానికి వెళ్తుండగా..
మంచిర్యాల: అదుపుతప్పిన బైక్ ప్రమాదవశాత్తు కుమురంభీం ప్రాజెక్టు ప్రధాన ఎడమ కాలువలో దూసుకెళ్లిన ఘటనలో భార్య మృతిచెందగా, భర్త ప్రాణాలతో బయటపడ్డాడు. మండలంలోని ఇందాని(మోకాసిగూడ) సమీపంలో ఈ ఘటన సోమవారం చోటు చేసుకుంది. ఎస్సై డి.సాగర్ కథనం ప్రకారం.. మండలంలోని లెండిగూడ గ్రామానికి చెందిన వడై ఇంద్రాజీ–సాక్రుబాయి(28) దంపతులు గత 9 ఏళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. మూడేళ్ల క్రితం బాబు పుట్టిన వెంటనే చనిపోయాడు. అప్పటి నుంచి మళ్లీ సంతానం కలగకపోవడంతో పిల్లల కోసం గత మూడు నెలల నుంచి బెండార శివారులో గల శంకరుని ఆలయంలో ప్రతీ శని, సోమవారాలు పూజలు నిర్వహించేవారు. ఎప్పటిలాగే సోమవారం ఉదయం 5.30 గంటలకు ఇంద్రాజీ, సాక్రుబాయి దంపతులు బెండార శంకరుని గుడికి వెళ్లేందుకు బైక్‌పై బయల్దేరారు. కుమురంభీం ప్రాజెక్టు ఎడమ ప్రధాన కాలువ మీదుగా ఉన్న బీటీ గుండా వెళ్తుండగా మోకాసిగూడ–సరాండి గ్రామాల మధ్యలో ఉన్న మూలమలుపు వద్ద బైక్ అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లింది. బైక్‌తోపాటు ఇద్దరు నీటిలో మునిగారు. ఇంద్రాజీకి ఈత రావడంతో వెంటనే తేరుకుని భార్యను ఒడ్డుకు తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేశాడు. కాలువకు సిమెంటు లైనింగ్ ఉండటంతో నీళ్లలో నుంచి బయటికి రాలేకపోయాడు. కొంత సమయానికి అటుగా వెళ్తున్న ఓ వ్యక్తి సహాయంతో భార్యను బయటికి తీసుకొచ్చాడు. కానీ అప్పటికే సాక్రుబాయి మృతి చెందింది. కాలువలో నీళ్లతో పాటు నాచు, పూడిక అధికంగా ఉండటంతో బాధితులు బయటపడటంలో ఆలస్యమై ఉంటుందని అక్కడున్న వారు అభిప్రాయాలు వ్యక్తం చేశారు. నీటిలో మునిగిన బైక్‌ను పోలీసులు స్థానికుల సహాయంతో బయటికి తీశారు. మృతురాలి తండ్రి ఆదె మోతీరాం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
కాలుష్య కాసారంతో నిండిపోతున్న కృష్ణ కెనాల్ కాలువ...
-
నెల్లూరు: హారిక మిస్సింగ్ కేసు విషాదాంతం
సాక్షి, నెల్లూరు: గుర్రాలమడుగు సంఘం చిన్నారి మిస్సింగ్ కేసు విషాదాంతంగా ముగిసింది. నాలుగు రోజుల కిందట ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారి ప్లేస్‌లో ఓ బొమ్మ ఉంచి.. పాపను ఎత్తుకెళ్లిన ఉదంతం స్థానికంగా సంచలనం సృష్టించింది. అయితే.. చిన్నారి హారిక ఆచూకీ కోసం చేపట్టిన గాలింపులో చివరికి ఆమె మృతదేహం లభ్యం అయ్యింది. సర్వేపల్లి కాలువలో చిన్నారి హారిక మృత దేహం లభ్యం అయ్యింది. పక్కా సమాచారం అందుకున్న పోలీసులు.. మంగళవారం అర్థరాత్రి దాటాక గజ ఈతగాళ్ల సాయంతో మృతదేహాన్ని వెలికి తీయించారు. దీంతో.. ఆ తల్లిదండ్రులు గుండెలు పగిలేలా రోదిస్తున్నారు. మరోవైపు ఈ మిస్సింగ్ కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. ఆమె మరణంపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇది కచ్చితంగా రక్త సంబంధీకుల పనే అయ్యి ఉంటుంది భావిస్తున్నారు. కుటుంబ సభ్యుల విచారణలో అందిన సమాచారం మేరకే కాలువలో గాలింపు చేపట్టినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు మీడియా సమావేశం నిర్వహించి.. పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. గుర్రాలమడుగు సంఘానికి చెందిన అనూష, రావూరుకు చెందిన మణికంఠకు నాలుగేళ్ల కిందట వివాహం అయ్యింది. వీళ్లకు ఇద్దరు కూతుళ్లు. మణికంఠ హోటల్ నడుపుతుండగా. అనూష భర్తకు దూరంగా ఉంటూ ఎంసీఏ చదువుతూ గుర్రాల మడుగు సంఘంలోనే ఉంటోంది. భర్త మణికంఠ అప్పుడప్పుడూ వచ్చి భార్యాపిల్లలను చూసి పోతుంటాడు. ఈ క్రమంలో.. ఆదివారం తన తల్లి బయటకు వెళ్లడంతో.. దగ్గర్లో ఉన్న తన పిన్ని ఇంటికి పిల్లలతో వెళ్లింది అనూష. అర్ధరాత్రి కరెంట్ పోవడంతో డోర్లు తీసి పడుకుందామె. ఉదయం లేచి చూసేసరికి.. ఊయలలో ఏడాదిన్నర వయసున్న హారికకు బదులు.. బొమ్మ ఉంది. దీంతో ఆందోళనకు గురై భర్తకు సమాచారం అందించగా.. అంతా కలిసి చుట్టుపక్కల గాలించారు. ఆపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కుటుంబ కలహాల నేపథ్యంలోనే చిన్నారిని బలి తీసుకుని ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. -
అతివేగంతో అదుపుతప్పి కెనాల్లో పడిన కారు
గజ్వేల్: వేములవాడ రాజన్న దర్శనానికి వెళ్లి వస్తుండగా మార్గమధ్యలో సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్ మండలం ముని గడపలో చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురిని బలితీసుకుంది. అతివేగం వల్ల కారు అదుపుతప్పి కల్వర్టును ఢీకొని రోడ్డు పక్కనే ఉన్న కొండ పోచమ్మసాగర్ డిస్ట్రిబ్యూటరీ కెనాల్లో పడిపోవడంతో ఈ దుర్ఘటన జరిగింది. ఘటనా స్థలంలోనే ఐదుగురు మృతి చెందగా.. గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరొకరు కన్ను మూశారు. ప్రత్యక్ష సాక్షులు, పోలీసుల కథనం ప్రకారం.. యాదాద్రి– భువనగిరి జిల్లా బీబీనగర్ మండల కేంద్రానికి చెందిన బొల్లు సమ్మయ్య(38).. భార్య స్రవంతి(36), కూతురు భవ్య(13), కుమారుడు కార్తీక్ అలియాస్ లోకేశ్ (11)లతో పాటు అదే జిల్లా బొమ్మల రామారం మండలం మల్యాల గ్రామానికి చెందిన మామ బిట్టు వెంకటేష్ (58), అత్త రాజమణి(56)లను తీసుకొని ఆల్టో కారులో తనే డ్రైవింగ్ చేస్తూ సోమవారం మధ్యాహ్నం వేములవాడ రాజన్న ఆల యానికి వెళ్లాడు. సమ్మయ్య ఏటా ఆలయానికి ఆనవాయి తీగా వెళ్తుంటాడు. మొక్కుతీర్చుకొని వీరంతా మంగళవారం తిరుగు ప్రయాణమయ్యారు. తక్కువ దూరం ఉంటుందని భావించి రాజీవ్ రహదారిపై ఉన్న గజ్వేల్ మండలం కొడకండ్ల నుంచి జగదేవ్‌పూర్, భువనగిరి వైపు వచ్చారు. కల్వర్టును ఢీకొట్టిన తర్వాత.. మార్గమధ్యలో మధ్యాహ్నం 3.30గంటల సమయంలో మునిగడప గ్రామ స్టేజీ సమీపంలో ఎల్లమ్మ ఆలయం వద్ద మలుపు దాటిన తర్వాత కొండపోచమ్మసాగర్ డిస్ట్రిబ్యూటరీ కెనాల్ కోసం నిర్మించిన కల్వర్టును వేగంగా ఢీకొట్టాడు. దాంతో ఒక్కసారిగా కారు అదుపుతప్పింది. ఇదే క్రమంలో స్టీరింగ్ తిప్పి ఎక్సలేటర్ మరింత పెంచడంతో కారు వేగంగా ఎడమ నుంచి కుడివైపు దూసుకువెళ్లి మట్టిగడ్డను తాకింది. దాని పైనుంచి కాల్వలో మిషన్ భగీరథ పైప్‌లైన్‌ను తాకి అందులో పడిపోయింది. అప్పటికే కాల్వలో నీరు ఉండడం వల్ల కారు తలకిందులైంది. దీంతో కారులో ప్రయాణిస్తున్న వారందరూ తీవ్రంగా గాయపడడంతో పాటు కారులోకి నీరుచేరడంతో నీటమునిగి ఊపిరాడనిస్థితిలో కొట్టుమిట్టా డారు. ఈ ఘటనను చూసిన గ్రామస్తులు హుటాహుటిన పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకోవడం, ఇదే సమయంలో ఎస్ఐ కృష్ణమూర్తి, గజ్వేల్‌రూరల్ సీఐ రాజశేఖరరెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని నీటమునిగిన వారిని బయటకు తీశారు. అప్పటికే సమ్మయ్య, స్రవంతి, భవ్య, కార్తీక్‌లతో పాటు రాజమణిలు మృతి చెందినట్లు గుర్తించారు. వెంకటేష్ మాత్రం విషమస్థితిలో ఉన్నట్టు గమనించి ఆయన్ను చికిత్స నిమిత్తం గజ్వేల్‌లోని ప్రభుత్వాస్పత్రికి ఆ తర్వాత సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించగా... చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతదేహాలను అక్క డి నుంచి పోస్టుమార్టం నిమిత్తం గజ్వేల్ ఆస్ప త్రికి తరలించారు. ఆర్ధికంగా ఇంకా కుదురు కోని సమ్మయ్య కుటుంబ పోషణ నిమిత్తం స్టీల్ సామాన్ల వ్యాపారం నిర్వహిస్తున్నాడు. మరో మృతుడు సమ్మయ్య మామ వెంకటేష్‌ది రెక్కాడితేగాని డొక్క నిండని కుటుంబం. కారు కండీషన్లో లేకపోవడం... మృతులు ప్రయాణించిన కారు కండీషన్ సక్రమంగా లేకపోవడం, అందులో ఆరుగురు ఇరుకుగా కూర్చోవడం కూడా ప్రమాదానికి ఓ కారణంగా భావిస్తున్నారు. కాగా ప్రమాదంలో మృతి చెందిన వెంకటే– రాజమణి దంపతులు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన నిరుపేద కూలీలు. రాజమణి గంపలో గాజులు, స్టీల్, ప్లాస్టిక్ సామాన్లు పెట్టుకుని ఇంటింటికి అమ్ముతూ ఉండగా, వెంకటేష్ గ్రామంలో ఎక్కడైనా దినసరి కూలీ లభిస్తే వెళ్లేవాడు. లేని పక్షంలో పూరీ్వకుల నుంచి ఆచారంగా వచి్చన వృత్తిలో భాగంగా భాగవతం పాటలు పాడుతూ భిక్షాటన చేసేవాడు. మంత్రి హరీశ్‌రావు దిగ్భ్రాంతి మునిగడపలో చోటు చేసుకున్న ప్రమాదంలో ఆరుగురు మృతి చెందిన ఘటనపై రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖామంత్రి హరీశ్‌రావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతదేహాల పోస్టుమార్టంతో పాటు ఇతర సహాయక చర్యలను వెనువెంటనే జరిపించేందుకు దగ్గరుండి పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్‌పాటిల్, సీపీ శ్వేతలను ఆదేశించారు. మంత్రి ఆదేశాల నేపథ్యంలో కలెక్టర్, సీపీలు గజ్వేల్ ప్రభుత్వాస్పత్రికి చేరుకొని పోస్టుమార్టం త్వరగా జరిపించి మృతదేహాలను స్వస్థలాలకు తరలించే ఏర్పాట్లు చేయాలని వైద్యాధికారులతో పాటు పోలీసులకు సూచించారు. -
Viral Video: డ్రైవింగ్ చేస్తూ ఉన్నపళంగా డ్రైనేజీ కాలువలోకి పడిపోయింది
-
కాలువలోకి దూసుకెళ్లిన మినీబస్సు.. 22 మంది దుర్మరణం
కైరో: ఈజిప్టు ఉత్తర డకాలియా ప్రావిన్స్ అగ పట్ణణంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైవేపై ప్రయాణిస్తున్న ఓ మినీబస్సు అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లింది. శనివారం జరిగిన ఈ దుర్ఘటనలో 22 మంది దుర్మరణం చెందారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఆరుగురు మహిళలు, ముగ్గురు చిన్నారులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మొత్తం 18 అంబులెన్సులను పంపి బాధితులను రెండు ఆస్పత్రులకు తరలించినట్లు చెప్పారు. ప్రమాద సమయంలో బస్సులో 46 మంది ప్రయాణికులున్నారు. వీరిలో విద్యార్థులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. మృతుల కుటుంబాలకు లక్ష ఈజిప్ట్ పౌండ్లను పరిహారంగా ప్రకటించింది ప్రభుత్వం. ఈజిప్ట్‌లో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. రహదారులు సరిగ్గా లేకపోవడం, ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడంతో ఏటా వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. 2021లోనే 7,000 మందికిపైగా వివిధ ప్రమాదాల్లో చనిపోయారు. గత నెలలో కూడా మినీబస్సు, లారీ ఢీకొన్న ఘటనలో 10 మంది దుర్మరణం చెందారు. -
తుంగా కాలువలో చంద్రశేఖర్ మృతదేహం.. రోదించిన ఎమ్మెల్యే
సాక్షి, బెంగళూరు(బనశంకరి): దావణగెరె జిల్లా హొన్నాళి నియోజకవర్గ ఎమ్మెల్యే రేణుకాచార్య సోదరుడి కుమారుడు చంద్రశేఖర్ (24) అదృశ్యమైన ఘటన గురువారం విషాదాంతమైంది. చంద్రశేఖర్ కారు తుంగా ప్రధాన కాలువలో లభ్యమైంది. అందులో చంద్రశేఖర్ మృతదేహం బయటకు తీశారు. ఐదురోజులు క్రితం అదృశ్యమైన అతని కోసం పోలీసులు విస్తృతంగా గాలించారు. కడదగట్టి గ్రామం వద్ద కారు ఆనవాళ్లు దావణగెరె జిల్లా హొన్నాళి తాలూకా కడదగట్టి గ్రామం తుంగా కాలువ వద్ద చంద్రశేఖర్ కారు సంచరించినట్లు పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలో కాలువ వద్దకు చేరుకున్న పోలీసులు కారుతో పాటు అందులో ఉన్న చంద్రశేఖర్ మృతదేహాన్ని బయటకు తీశారు. అక్కడే ఘటనస్థలంలో ఉన్న ఎమ్మెల్యే రేణుకాచార్య తీవ్రంగా రోదించారు. సోదరుడి కుమారుడు అదృశ్యమై ఐదు రోజులు గడిచినప్పటికి ఎలాంటి ఆచూకీ లభించలేదు. చంద్రశేఖర్ కుటుంబసభ్యులు కంగారుపడ్డారు. చంద్రశేఖర్ మొబైల్ స్విచ్చాఫ్ వచ్చింది. చంద్రశేఖర్ మృతి కేసులో ట్విస్ట్.. కారులో ఉన్న ఆ ఇద్దరు ఎవరూ ? ఈ సంఘటనపై తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కారులో ఇద్దరు ఉన్నట్లు సీసీ కెమెరాలో రికార్డయింది. న్యామతి వద్ద చంద్రశేఖర్ కారులో ఇద్దరు వ్యక్తులు ఉన్న దృశ్యాలు రికార్డు అయింది. చంద్రశేఖర్ పక్కన మరొకరు ప్రయాణిస్తున్నట్లు తెలిసింది. అదే కారులో చంద్రశేఖర్ మృతదేహం లభ్యమైంది. దీంతో అనేక అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. హొన్నాళి నుంచి ఐదు కిలోమీటర్లు దూరంలో ఉన్న తుంగా కాలువలో చంద్రశేఖర్ మృతదేహం లభించింది. ఇది హత్య, ఆత్మహత్య అనే కోణాల్లో పోలీసులు విచారణ చేస్తున్నారు. -
అమ్మ కావాలి.. కన్నీరు పెట్టించిన విషాద ఘటన..
ముప్పాళ్ల(పల్నాడు జిల్లా): క్షణికావేశం రెండు నిండు ప్రాణాలను బలి తీసుకుంది. ఆలనా పాలనా చూడాల్సిన తల్లి క్షణికావేశంతో ఆత్మహత్యకు ప్రయత్నించి కన్నబిడ్డకు అమ్మప్రేమను దూరం చేయగా, తన తోబుట్టువులా భావించే మనిషి కళ్ల ముందే ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నిస్తే ఆమెను కాపాడే ప్రయత్నంలో మరో వ్యక్తి మృతి చెందిన విషాదకర సంఘటన పల్నాడు జిల్లాలో సోమవారం జరిగింది. రెండు కుటుంబాల్లోనూ తీవ్ర విషాదాన్ని నింపింది. చదవండి: బీచ్‌లో రిప్ కరెంట్.. వేరీ డేంజర్.. గజ ఈతగాళ్లు కూడా తప్పించుకోలేరు.. కాలువలో దూకిన చెల్లి, ఆమెను కాపాడేందుకు ప్రయత్నించిన సోదరుడు ఇద్దరూ మృతి చెందిన విషాదకర సంఘటన మండలంలోని నార్నెపాడు సమీపంలో సోమవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సత్తెనపల్లి మండలం పాకాలపాడు గ్రామానికి చెందిన శానంపూడి హరినాథ్‌రెడ్డికి నాలుగేళ్ల కిందట ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం ఏల్చూరు గ్రామానికి చెందిన కృష్ణవేణి(22)తో వివాహం జరిగింది. వారికి రెండున్నరేళ్ల బాబు ఉన్నాడు. ఏడాది కిందట ప్రమాదం జరిగి హరినాథ్‌రెడ్డికి కాలు విరిగింది. ఈ క్రమంలో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉండేవి. 15 రోజుల కిందట భర్తతో గొడవ పడి ఆమె పుట్టింటికి వెళ్లింది. హరినాథ్‌రెడ్డి వరుసకు బావ అయిన మోదుగుల వెంకటరమణారెడ్డి(47)ని తన భార్య, కుమారుడిని తీసుకురావాలని కోరారు. ఆ నేపథ్యంలో వెంకటరమణారెడ్డి ఏల్చూరు వెళ్లి ఆమె తల్లిదండ్రులు, బంధువులతో మాట్లాడాడు. కృష్ణవేణి, ఆమె కుమారుడు మహీందర్‌రెడ్డిని తీసుకుని తన ద్విచక్రవాహనంపై పాకాలపాడు బయలుదేరాడు. మండల పరిధిలోని నార్నెపాడు రోడ్డు వద్ద గల గుంటూరు బ్రాంచి కాలువ వద్దకు రాగానే ఆమె బైకు ఆపమని కోరింది. బైకు ఆపగా వెళ్లి కాలువలో దూకింది. ఈ హఠాత్తు పరిణామంతో ఖంగుతిన్న వెంకటరమణారెడ్డి బండిపై బాలుడిని కూర్చోబెట్టి ఆమెను కాపాడేందుకు కాలువలో దూకాడు. అప్పటికే నీటి ప్రవాహంలో ఆమె మునిగి పోయింది. అక్కడే ఉన్న స్థానికులు వెంకటరమణారెడ్డిని కాపాడేందుకు ప్రయత్నించారు. నీటి ప్రవాహం ఉధృతంగా ఉండడంతో అతను మునిగిపోయాడు. అతని మృతదేహాన్ని బయటకు తీయగా, ఆమె మృతదేహం కనిపించలేదు. నీటి ఉధృతిని మరో కాలువకు మళ్లించి గాలింపు చేపట్టారు. కాసేపటికి మృతదేహం లభ్యమైంది. ఇరువురి మృతదేహాలను శవపంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం సత్తెనపల్లి ఏరియా వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ఎం.పట్టాభిరామయ్య తెలిపారు. అమ్మ కావాలి... అమ్మ కావాలి అంటూ బాలుడు ఏడుస్తున్న తీరు చూపరులను కన్నీరు పెట్టించింది. అప్పటి వరకు తనతోపాటు వచ్చిన అమ్మ, మామయ్యలు కనిపించకపోవటంతో పాటు, జనాలు పెద్దఎత్తున గుమికూడి ఉండటంతో ఏమి జరిగిందో తెలియక బాలుడు విలపించసాగాడు. కొద్దిసేపటికి మృతుల బంధువులు అక్కడికి చేరుకుని బాలుడిని ఓదార్చారు. వెంకటరమణారెడ్డికి భార్య ఇద్దరు ఆడపిల్లలున్నారు. ఈ సంఘటనతో రెండు కుటుంబాల్లోను విషాదఛాయలు అలముకున్నాయి. -
కాలువలతో చెరువుల అనుసంధానం
సాక్షి, అమరావతి: రాయలసీమ, ప్రకాశం, ఉత్తరాంధ్ర తదితర కరువు ప్రాంతాల్లో కాల్వల ద్వారా చెరువులను అనుసంధానం చేయాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. నియోజకవర్గాన్ని ఒక యూనిట్‌గా తీసుకుని ఉండాల్సిన చోట చెరువులు ఉన్నాయా? లేవా? ఉన్న చెరువుల పరిస్థితి ఏంటి? వాటికి నీరు చేరడంలో ఉన్న ఇబ్బందులు, తదితర అంశాలపై సమగ్రంగా అధ్యయనం చేయాలని చెప్పారు. ఆ తర్వాత ప్రపంచ బ్యాంకు లాంటి ఆర్థిక సంస్థల సహాయంతో ఈ ప్రాజెక్టు కింద పనులను పరుగులు పెట్టించాలని సూచించారు. విదేశీ ఆర్థిక సంస్థల సాయంతో (ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్) రాష్ట్రంలో చేపట్టిన వివిధ ప్రాజెక్టుల పనుల పురోగతిపై శుక్రవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కరువు ప్రాంతాల్లో చెరువులపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని చెప్పారు. అవసరమైన చోట చెరువులు లేకపోతే.. అక్కడ కొత్తగా చెరువులు నిర్మించాలని ఆదేశించారు. ఈ చెరువులన్నింటికీ గ్రావిటీ ద్వారా నీరు ప్రవహించేలా కాల్వలతో అనుసంధానం చేయాలని స్పష్టం చేశారు. దీనివల్ల భూగర్భ జలాలు గణనీయంగా పెరుగుతాయని, పర్యావరణ సమతుల్యత కూడా ఉంటుందన్నారు. చెరువు కింద చక్కగా భూముల సాగు జరుగుతుందని, వ్యవసాయం బాగుండడంతో ఉపాధి, ఆదాయాలు కూడా స్థిరంగా ఉంటాయని తెలిపారు. ఆ ప్రాజెక్టుల పనుల్లో వేగం పెరగాలి విదేశీ ఆర్థిక సంస్థల సాయంతో వివిధ రంగాలలో చేపట్టిన ప్రాజెక్టుల పనుల్లో ఎలాంటి అలసత్వం లేకుండా చూడాలని సీఎం అధికారులను ఆదేశించారు. నిర్ధేశిత సమయంలోగా ఆయా ప్రాజెక్టుల పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. న్యూ డెవలప్మెంట్ (ఎన్డీబీ)బ్యాంకు, ఏసియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ (ఏఐఐబీ), జపాన్ ఇంటర్నేషనల్ కో ఆపరేషన్ ఏజెన్సీ (జైకా), ప్రపంచ బ్యాంకు, కేఎఫ్‌బీ.. తదితర బ్యాంకుల రుణ సహాయంతో మొత్తం 10 ప్రాజెక్టుల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.25,497.28 కోట్లు ఖర్చు చేస్తోందన్నారు. ఇందులో భాగంగా గత చంద్రబాబు ప్రభుత్వంలో అసంపూర్తిగా మిగిలిపోయిన వంతెనల పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. బ్రిడ్జిలు, ఆర్వోబీలు, ఫ్లై ఓవర్లును వెంటనే పూర్తి చేయడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పారు. పోర్టుల పరిధిలో సత్వర అభివృద్ధి రామాయపట్నం, మచిలీపట్నం, భావనపాడుల్లో మూడు పోర్టులు కడుతున్నామని, వీటి చుట్టుపక్కల అభివృద్ధి జరిగే అవకాశాలు బాగా ఉంటాయని చెప్పారు. ఈ నేపథ్యంలో వాటి పరిధిలో ల్యాండ్ బ్యాంక్‌ను ఏర్పాటు చేయడం అన్నది చాలా అవసరం అని స్పష్టం చేశారు. దీనివల్ల పోర్టు ఆధారితంగా పెద్ద ఎత్తున అభివృద్ధి జరుగుతుందని తెలిపారు. ఈ సమీక్షా సమావేశంలో సీఎస్ సమీర్ శర్మ, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ స్పెషల్ సీఎస్ వై శ్రీలక్ష్మి, ఆర్థిక శాఖ స్పెషల్ సీఎస్ ఎస్ ఎస్ రావత్, జల వనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్, రహదారులు, భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి ఎం టీ కృష్ణబాబు, పరిశ్రమల శాఖ డైరెక్టర్ జి సృజన, ఏపీయూఎఫ్ఐడీసీ ఎండీ పి రాజాబాబు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఇదీ చదవండి: చంద్రబాబు ఎయిర్పోర్ట్ నిర్మించడమేంటి.. వినేవాడుంటే బాబు ఏదైనా చెప్తారు: కొడాలి నాని ఫైర్ -
కుక్కను తప్పించబోయి కాల్వలోపడ్డ కారు
వాజేడు: కుక్కను తప్పించబోయి కారు కాల్వలో పడటంతో ఐదుగురు పర్యాటకులకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ సంఘటన ములుగు జిల్లా వాజేడు మండలంలో ఆదివారం చోటుచేసుకుంది. బొగత జలపాతం చూడటానికి హైదరాబాద్ నుంచి కారులో పర్యాటకులు వచ్చారు. బొగత జలపాతాన్ని చూసి తిరిగి వెళ్తుండగా మండల పరిధిలోని దూలాపురం గ్రామం వద్ద వారి కారుకు కుక్క ఎదురొచ్చింది. దీంతో దాన్ని తప్పించడానికి కారును పక్కకు తిప్పడంతో అదుపుతప్పి సమీపంలోని కాల్వలో బోల్తాపడింది. స్థానికులు గమనించి బోల్తాపడిన కారులో ఉన్నవారిని బయటకు తీశారు. -
ఇద్దరి ప్రాణాలు నిలబెట్టారు..
ఈపూరు(పల్నాడు జిల్లా): మండలంలోని నెమలిపురికి చెందిన సాంబశివరావు, కోటేశ్వరరావులు బంధువులు. బొమ్మరాజుపల్లికి చెందిన వీరి బంధువు శేషారావు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఆయన మృతదేహాన్ని చూసేందుకు వీరిద్దరు ద్విచక్ర వాహనంపై బయలుదేరారు. భద్రుపాలెం గ్రామసమీపంలోకి వచ్చేసరికి ద్విచక్రవాహనం అదుపు తప్పి నాగార్జున సాగర్ మెయిన్‌కెనాల్‌లో పడింది. స్పందించిన గ్రామస్తులు రక్షించారు. తాళ్ల సహాయంతో ఇద్దరిని పైకి లాగి వారిని ప్రాణాపాయం నుంచి కాపాడారు. అనంతరం ద్విచక్ర వాహనాన్ని కూడా తాళ్ల సాయంతో పైకి తీశారు. ఇద్దరి ప్రాణాలను కాపాడిన గ్రామస్తులను అధికారులు అభినందించారు. -
సాగర్ కాలువలో కారును పడేసిన వారిని గుర్తించిన పోలీసులు
-
అయ్యో కొడుకా.. ఎంత పనాయే..!
సాక్షి, పెద్దపల్లి(మంథని): ‘అయ్యో కొడుకా.. ఎంత పనాయే.. మీ నాన్న ఆరోగ్యం సహకరించకపోయినా కూలీనాలీ చేసుకుంట మిమ్మల్ని చదివిస్తున్న. రెక్కలు ముక్కలు చేసుకుని ముగ్గురిని సాదుకుంటున్న. మీరే సర్వస్వం అనుకుని మిమ్మల్ని చూసుకునే బతుకుతున్న. ఎంత కష్టమైనా భరించుకుంటున్న. ఇప్పుడు పుట్టెడు శోకంలో ముంచితివి కదా బిడ్డా..’ అంటూ ఆ తల్లి గుండలవిసేలా రోదించింది. రామగిరి మండలం రత్నాపూర్ పంచాయతీ పరిధి బేగంపేట క్రాస్ రోడ్డుకు చెందిన పదో తరగతి విద్యార్థి తంగళ్లపల్లి విష్ణువర్ధన్ సోమవారం ఈతకు వెళ్లి మృత్యువాతపడగా.. గ్రామస్తులు, కుటుంబసభ్యులు విషాదంలో మునిగిపోయారు. తంగళ్లపల్లి రామచంద్రం, రాజ్యలక్ష్మి దంపతులది స్వగ్రామం లద్నాపూర్ కాగా.. ఆ గ్రామాన్ని సింగరేణి సంస్థ స్వాధీనం చేసుకోవడంతో దాదాపు 20ఏళ్ల క్రితమే జీవనోపాధి నిమిత్తం ఇక్కడకు వచ్చి స్థిరపడ్డారు. వీరికి ఇద్దరు కుమారులు. రామచంద్రం మానసికస్థితి సరిగా లేకపోవడంతోపాటు పక్షవాతం బారిన పడ్డాడు. దీంతో రాజ్యలక్ష్మి వ్యవసాయ కూలీగా పనిచేస్తూ ఇద్దరు పిల్లలతోపాటు భర్తను కాపాడుకుంటోంది. మొదటి కుమారుడు కేశవర్ధన్ ఐటీఐ చేస్తున్నాడు. విష్ణువర్ధన్ ఓ ప్రైవేటు పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. చదవండి: హైకోర్టు ఉత్తర్వు కాపీలతో అసెంబ్లీకి బీజేపీ ఎమ్మెల్యేలు.. స్పీకర్ ఏమన్నారంటే.. పాఠశాల ఆవరణంలోకి చేరిన ఎస్సారెస్పీ నీళ్లు ఎస్సారెస్పీ కాలువ నీరు పాఠశాల ఆవరణలోకి చేరడంతో యాజమాన్యం సెలవు ప్రకటించింది. దీంతో తోటి మిత్రులు ఫిరోజ్, శ్రీతరుణ్తో కలిసి ఈతకు వెళ్లాడు. ముగ్గురు కాలువలోకి దిగారు. అయితే విష్ణువర్ధన్ నీటిలో అడుగుభాగంలో ఉన్న పూడికలో దిగబడి మునిగిపోయాడు. పాఠశాల యథావిధిగా నిర్వహించి ఉంటే విష్ణువర్ధన్ ఈతకు వెళ్లేవాడే కాదని, సెలవు ఇవ్వడంతోనే సరదా కోసం ఈతకెళ్లి తిరిగి రాని లోకాలు చేరాడని స్థానికులు కంటతడి పెట్టారు. కాంట్రాక్టర్‌పై ఫిర్యాదు సింగరేణి సంస్థ ఓసీపీ–2 ఓబీ యార్డును ఆనుకుని కాలువ పనులు నిర్వహిస్తున్న ఎన్టీపీసీకి చెందిన కాంట్రాక్టర్ పని స్థలంలో ఎలాంటి రక్షణ చర్యలూ తీసుకోకపోవడంతోనే తన కొడుకు చనిపోయాడని రాజ్యలక్ష్మి పోలీసులకు ఫిర్యాదుచేసింది. ఈ మేరకు కాంట్రాక్టర్‌పై కేసు నమోదు చేశామని ఎస్సై కటికె రవిప్రసాద్ తెలిపారు. -
కింద నది.. పైన కాలువ
సాక్షి, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లాలో సాత్నాల నదిపై నుంచి కాలువ ప్రవహించేందుకు వీలుగా కొత్త పద్ధతిలో వంతెన నిర్మిస్తున్నారు. సాగునీటిని నదికి అవతలివైపు తరలించేందుకు ఆర్సీసీ షెల్ఫ్‌తో పిల్లర్లపై కాలువను కడుతున్నారు. ఈ మధ్యే నిర్మాణం పూర్తవడంతో అధికారులు, ఇంజనీర్లు కలిసి కాలువ లోపల పరిశీలించారు. వాహనంలో తీసుకొచ్చి.. ఒక్కొక్కటిగా బిగించి.. ఆదిలాబాద్ జిల్లాలో చనాఖా–కొరాటా బ్యారేజీ కింద లోయర్ పెన్‌గంగ ప్రాజెక్టు మెయిన్ కెనాల్‌ను 42 కిలోమీటర్ల పరిధిలో రూ.207.32 కోట్లతో నిర్మిస్తున్నారు. ఇందులో భాగంగా జైనథ్, బేల మండలాలకు కాలువ నీటిని మళ్లించే మధ్యలో సాత్నాల నది ఉంది. దీంతో నదిపై 1.675 కిలోమీటర్ల మేర పిల్లర్లు నిర్మించి కాలువ కడుతున్నారు. సిమెంట్ కాంక్రీట్‌తో చేసిన షెల్ఫ్‌లను (ఒక్కొక్కటి 250 టన్నుల బరువు ఉంటుంది) ఓ వాహనంలో తీసుకొచ్చి ఒక్కొక్కటిగా బిగిస్తున్నారు. పిల్లర్ల ఎత్తు 35 మీటర్ల నుంచి 40 మీటర్ల వరకు ఉంటుంది. కాలువ ద్వారా రెండు మండలాల్లోని 37 వేల ఎకరాలకు సాగునీరు అందించనున్నారు. కాలువ లోపల నడిచి.. ఎలాగుందో చూసి.. 68 పిల్లర్లపై 67 షెల్ఫ్‌లను బిగించేందుకు చేపట్టిన పనులు తుది దశకు వచ్చాయి. 24.4 మీటర్ల పొడవు, 5.2 మీటర్ల వెడల్పు, 3.2 మీటర్ల ఎత్తుతో నిర్మితమైన ఈ షెల్ఫ్‌ల ద్వారా 420 క్యూసెక్కుల సాగునీటిని తరలించవచ్చని అధికారులు చెబుతున్నారు. పనులు తుది దశకు చేరుకోవడంతో జల వనరుల శాఖాధికారులు, కాంట్రాక్టర్లు కలిసి ఈ వయాడక్ట్ మార్గంలో పయనించి పరిశీలించారు. -
విషాదం: తన ఇద్దరి బిడ్డలను బైకుపై తీసుకువచ్చి.. పానీపూరి తినిపించి..
బల్లికురవ(ప్రకాశం జిల్లా): శివరాత్రి సందర్భంగా కోటప్పకొండ తిరునాళ్లకని చెప్పి వెళ్లిన ఓ తండ్రి తన ఇద్దరు బిడ్డలతో సాగర్ కాలువలో దూకి ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన బల్లికురవ మండలం గుంటుపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. తండ్రి మృతదేహం లభించగా, అతని వెంట వెళ్లిన చిన్నారుల కోసం గాలిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు బల్లికురవ మండలంలోని గుంటుపల్లి గ్రామానికి చెందిన గుర్రం చిరంజీవి (36)కి 11 ఏళ్ల క్రితం మార్టూరు మండలం వలపర్ల గ్రామానికి చెందిన కల్యాణితో వివాహమైంది. వీరికి కుమారుడు శాయి చైతన్య కృష్ణ (10), శాయి సౌమ్య (8) ఉన్నారు. గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో చైతన్య కృష్ణ నాల్గవ తరగతి, సౌమ్య 3వ తరగతి చదువుతున్నారు. మంగళవారం మహా శివరాత్రి సందర్భంగా పానీపూరి కావాలని పిల్లలు తండ్రి చిరంజీవిని కోరారు. చదవండి: అనూస్ పేరుతో బ్యూటీ పార్లర్.. స్థానికులతో పరిచయం పెంచుకుని.. చివరికి బల్లికురవ తీసుకెళ్లి పానీపూరి తినిపించి అక్కడ నుంచి కోటప్పకొండ తిరునాళ్లకు తీసుకెళ్తానని భార్యకు చెప్పాడు. బైకుపై తీసుకువచ్చి పానీపూరి తినిపించి అక్కడ నుంచి అద్దంకి బయలుదేరాడు. దారిలో సాగర్ అద్దంకి బ్రాంచ్ కాలువ వల్లాపల్లి లాకుల వద్ద బైకును నిలిపాడు. చిరంజీవి ఇద్దరు బిడ్డలతో సాగర్ కాలువలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బుధవారం ఉదయానికి తిరునాళ్లకని వెళ్లిన భర్త, పిల్లలు తిరిగి రాకపోవడంతో కోటప్పకొండలోని బంధువుల ఇళ్ల వద్ద కల్యాణి విచారించింది. ఆచూకీ లభించలేదు. సాగర్ కాలువ వల్లాపల్లి లాకుల వద్ద చిరంజీవి బైకు, చెప్పులు, కుమారుడు చైతన్య కృష్ణ చెప్పులు ఉన్నాయన్న సమాచారం అందడంతో బల్లికురవ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎస్సై వి.వేమన మిస్సింగ్ కేసు నమోదుతో దర్యాప్తు చేపట్టారు. గజ ఈతగాళ్లతో సాగర్ కాలువలో గాలింపు చేపట్టారు. బొల్లాపల్లి లాకుల వద్ద చిరంజీవి మృతదేహాన్ని గుర్తించారు. పోస్టుమార్టం నిమిత్తం మార్టూరు సీహెచ్‌సీకి తరలించారు. చిన్నారుల కోసం గజ ఈతగాళ్లు గాలిస్తున్నారు. చిరంజీవికి రూ.20 లక్షలకుపైగా అప్పులు ఉన్నట్లు సమాచారం. ఈ విషయమై అతను మదనపడుతుండేవాడని గ్రామస్తులు తెలిపారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. -
ఏపీ పోలీసు సమయస్ఫూర్తి.. కెనాల్లో కొట్టుకుపోతున్న నలుగురిని..
సాక్షి, గుంటురు: ఏపీ పోలీసు అధికారి సమయస్ఫూర్తితో వ్యవహరించి నలుగురు వ్యక్తుల ప్రాణాలను కాపాడారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో మరోసారి వైరల్‌గా మారింది. ఈ అరుదైన సంఘటన గుంటూరులో చోటు చేసుకుంది. కాగా, అడిగొప్పలా గ్రామపరిధిలో నాగార్జున సాగార్ కెనాల్ ఉంది. కెనాల్‌ను చూడటానికి నలుగురు వ్యక్తులు ఈనెల (నవంబరు28) వెళ్లారు. ఆతర్వాత ప్రమాదవశాత్తు వారంతా.. కెనాల్లో పడిపోయారు. ఈక్రమంలో.. కొంతదూరం నీటి ప్రవాహంలో కొట్టుకుపోయారు. అయితే, బాధితులు సహాయం కోసం గట్టిగా అరవడాన్ని ఒడ్డున ఉన్న ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి విన్నాడు. అతను స్థానిక దుర్గి పోలీసుస్టేషన్లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. ప్రవీణ్‌కుమార్ వెంటనే స్పందించి.. అక్కడి వారి సహయంతో బట్టలను ఒక తాడులాగా చేశాడు. ఆతర్వాత.. నీటి ప్రవాహంలో కొట్టుకుపోతున్న వారివైపు విసిరాడు. వారు.. ఆ తాడును పట్టుకుని ఒడ్డుకు చేరుకుని వారి ప్రాణాలకు కాపాడుకున్నారు. ఈ వీడియో వైరల్ కావడంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. కానిస్టేబుల్ ప్రవీణ్‌కుమార్ చూపిన సమయస్ఫూర్తిని అక్కడివారు అభినందించారు. ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ కూడా కానిస్టేబుల్‌ను ప్రత్యేకంగా అభినందించారు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు.. ‘హ్యట్సాఫ్ సర్..’, ‘మీ సమయస్ఫూర్తికి సెల్యూట్..’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. -
కృష్ణా జిల్లాలో విషాదం.. నలుగురు చిన్నారులు మృతి
సాక్షి, కృష్ణా జిల్లా: కైకలూరు మండలం వరాహపట్నంలో విషాదం చోటు చేసుకుంది. ఆడుకుంటూ వెళ్లి, నలుగురు చిన్నారులు కాల్వలో పడి మృతి చెందారు. మృతులను కావ్యశ్రీ(10), నిఖిత(10), నవ్యశ్రీ(11), వీరాంజనేయులు(6)గా గుర్తించారు. బాలికలు, బాలుడు మృతదేహాలు లభ్యమయ్యాయి. చిన్నారుల తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. -
NGT: తాగునీటి కోసమే రిజర్వాయర్లు
సాక్షి, న్యూఢిల్లీ: తాగునీటిని అందించడానికే పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల నిర్మాణాన్ని చేపట్టామని తెలంగాణ స్పష్టం చేసింది. ఈ మేరకు బుధవారం జాతీయ హరిత ట్రిబ్యునల్(ఎన్జీటీ) చెన్నై ధర్మాసనం ముందు వాదనలు వినిపించింది. అయితే, కేంద్రం వైఖరి చెప్పకుండా ఆదేశాలు ఇవ్వొద్దని ఏపీ అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ విజ్ఞప్తి చేశారు. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతలకు పర్యావరణ అనుమతులు లేవంటూ ఏపీ రైతుల డి.చంద్రమౌళీశ్వరరెడ్డి తదితరులు దాఖలు చేసిన పిటిషన్‌ను బుధవారం జస్టిస్ రామకృష్ణన్, విషయ నిపుణుడు సత్యగోపాల్‌లతో కూడిన ధర్మాసనం విచారించింది. ఎన్జీటీలో పిటిషన్ దాఖలుకు 6 నెలల కాలపరిమితి ఉంటుందని, ఆ సమయం మించి దాఖలైన పిటిషన్లను విచారించరాదని తెలంగాణ అదనపు అడ్వొకేట్ జనరల్ రాంచందర్‌రావు పేర్కొన్నారు. సుప్రీంకోర్టులోనూ ఈ అంశంలో పిటిషనర్లకు అనుకూలంగా తీర్పు రాలేదన్న విషయం తెలిసీ ఎన్జీటీని ఆశ్రయించారన్నారు. 2015లో ఇచ్చిన జీవో ప్రకారం.. తాగునీటి కోసమే ప్రాజెక్టు చేపట్టామని తెలిపారు. పర్యావరణ అనమతులు వచ్చే వరకూ సాగునీటి ప్రాజెక్టు పనులు చేపట్టబోమని రాంచందర్‌రావు వెల్లడించారు. తాగునీటి కోసమే అయితే అంత సామర్థ్యమున్న రిజర్వాయర్లు ఎందుకు కడుతున్నారు.. సాగునీటి కోసం కూడా ప్రాజెక్టు వినియోగించాలన్న ఉద్దేశంతోనే చేపడుతున్నట్లుంది కదా.. అని ధర్మాసనం ప్రశ్నించింది. కృష్ణాలో నిరంతరం నీరు ఉండదని, వర్షాలు తక్కువ పడినా, వరదలు లేకున్నా నాలుగేళ్లపాటు నిర్విరామంగా తాగునీరు అందించాలన్న లక్ష్యంతో తెలంగాణ సర్కార్ ఈ ప్రాజెక్టులో భాగంగా రిజర్వాయర్లు కడుతోంందని రాంచందర్‌రావు చెప్పారు. ప్రాజెక్టు సమీప 13 మండలాలు ఫోర్లైడ్ బాధిత గ్రామాలని, భూగర్భజలాలు వినియోగం వల్ల ఇబ్బందులు వస్తున్న నేపథ్యంలో భారీ రిజర్వాయర్లు కట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఈ విచారణ ప్రాథమిక దశలోనే ఉందని తుది విచారణలో తప్పకుండా తమ వైఖరి వెల్లడిస్తామని కేంద్రం తరఫు న్యాయవాది ధర్మాసనానికి తెలిపారు. తదుపరి వాదనలు గురువారం (నేడు) వింటామన్న ధర్మాసనం విచారణ వాయిదా వేసింది. చదవండి: టీఆర్ఎస్ జెండాను ఎత్తుకెళ్లిన దుండగులు -
West Godavari: కాల్వలోకి దూసుకెళ్లిన కారు.. ఇద్దరు మృతి
పశ్చిమ గోదావరి: పశ్చిమ గోదావరి జిల్లాలో మంగళవారం విషాదం చోటు చేసుకుంది. నిడమర్రు మండలం మందలపర్రులో వద్ద రోడ్డుప్రమాదం జరిగింది. కారు అదుపుతప్పి రోడ్డుపక్కనే ఉన్న కాల్వలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. మృతిచెందిన వారిని సుమంత్(35), శరత్(28)లుగా పోలీసులు గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. చదవండి: చెన్నైలో గ్యాంగ్.. ఢిల్లీకి హెరాయిన్ -
సాగర్‌లో దూకి కుటుంబం ఆత్మహత్య
సాక్షి, నల్లగొండ: సాగర్‌లో దూకి ఓ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. మృతులు రామయ్య, నాగమణి, కుమారుడు సాత్విక్‌గా గుర్తించారు. చింతలపాలెం వద్ద కృష్ణానదిలో సాత్విక్ మృతదేహం లభ్యం కాగా దంపతులు రామయ్య, నాగమణి మృతదేహాల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. -
లక్ష అప్పు: చంపి, ముక్కలు చేసి కాలువలో విసిరేసిన జంట
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలో మరో దారుణం వెలుగు చూసింది. తీసుకున్న అప్పు చెల్లించమన్నందుకు ఒక వృద్ధురాలిని నిర్దాక్షిణ్యంగా హత్య చేశారు ఒక జంట. కేవలం లక్ష రూపాయల కోసం 75 ఏళ్ల మహిళను హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని ముక్కలుగా చేసి స్థానిక కాలువలో విసిరి పారేశారు. తమ అఘాయిత్యం ఎవరికి తెలియదులే అనుకున్నారు. చివరికి పోలీసుల విచారణలో నేరాన్ని అంగీకరించి, కటాకటాల వెనక్కి వెళ్లకి తప్పలేదు. సీనియర్ పోలీసు అధికారి సంతోష్ మీనా అందించిన సమాచారం ప్రకారం అనిల్ ఆర్య, అతని భార్య తన్నూ ఆర్య ఢిల్లీలోని నజాఫ్‌నగర్ ప్రాంతంలో నివసిస్తున్నారు. ఈవెంట్ మేనేజ్మెంట్ అధికారిగా పనిచేస్తున్న అనిల్, మృతురాలి వద్ద లక్ష రూపాయలు అప్పుగా తీసుకున్నాడు. అవసరాల నిమిత్తం తీసుకున్న సొమ్మును చెల్లించమంటే మాత్రం నిర్లక్క్ష్యంగా వ్యవహరించేవారు. అయితే తన అప్పు తీర్చాల్సిందిగా పదే పదే నిలదీసేది. అది జీర్ణించుకోలేని అనిల్ దంపతులు ఆమెను ఎలాగైనా మట్టు బెట్టాలని ప్లాన్ వేశారు. ఈ క్రమంలో మరోసారి డబ్బులకోసం ఒత్తిడి చేయడంతో ఆమెపై దాడి చేసి వాటర్ పైప్‌తో గొంతుకు ఉరిబిగించి హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని మూడు ముక్కలుగా చేసిన స్థానిక కాలువలో పడేశారు. నిందితుల సమాచారం మేరకు మృతదేహ భాగాలను కాలువ నుంచి వెలికి తీశారు పోలీసులు. కేసు నమోదు చేసి అనిల్ దంపతులను అరెస్ట్ చేశారు. మృతురాలిని కవితా గ్రోవర్‌గా గుర్తించారు. కవిత కుమారుడు, స్థానిక రియల్టీ వ్యాపారి మనీష్ గ్రోవర్ ఫిర్యాదు మేరకు విచారణ పట్టిన పోలీసులు కేసును ఛేదించారు. -
వరుడి కోసం.. రాత్రికి రాత్రి వంతెన నిర్మించి అవాక్కయ్యేలా చేశారు
Bamboo bridge For Groom: ఇటీవల ఉత్తరాన జరిగే వివాహాలు చర్చనీయాంశమవడమే గాక సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న విషయం తెలిసిందే. గతంలో ఓ వరుడు అత్తగారి ఇంటి నుంచి వధువును తన భుజాలపై ఎత్తుకుని వాగు దాటించగా, మరో ఘటనలో వధువును ఆమె కుటుంబ సభ్యులు పడవలో అత్తారింటికి సాగనంపారు. తాజాగా అలాంటి ఘటనే బీహార్‌లో వెలుగుచూసింది. అరారియాలో ఫుల్సర గ్రామంలోని అమ్మాయికి ఇటీవలే పెళ్లి నిశ్చయమైంది. దీంతో ఆ యువతి పెళ్లికి ముందు రోజు గ్రామంలోని కాలువపై వంతెన నిర్మాంచారు అది కూడా రాత్రికి రాత్రే. అసలు వివాహానికి వంతెనకు లింకేంటి అనుకుంటున్నారా? పుల్సర గ్రామానికి రహదారి సౌకర్యం లేకపోవడంతో, గ్రామస్తులు కాలువ గుండా ప్రయాణించే వారు. వివాహాది శుభకార్యాలకు విషయానికొస్తే ఎన్నో వ్యయ ప్రయాసలతో జరిగేవి. కొందరు గ్రామస్తులు తమ కుమార్తెలను ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లి వివాహం జరిపించేవారు. అటువంటి పరిస్థితుల్లో తాజాగా గ్రామానికి చెందిన బతేష్ తన కుమార్తె రాఖీ కుమారి వివాహం కారణంగా ఆ ఇబ్బందులు తీరింది. అమ్మాయి తరపు వాళ్లు పెళ్లి తేది వరకు అన్ని సన్నాహాలు పూర్తి చేశారు. కాని ఇక్కడ ప్రధాన సమస్యగా .. వరుడిని అతడి బంధుమిత్రులను ఎటువంటి ఇబ్బందులు లేకుండా తమ గ్రామానికి తీసుకురావడం. దీంతో వారు ఈ సమస్యకు పరిష్కారం కోసం చర్చించారు. చివరికి వెదురు వంతెన నిర్మించాలని తీర్మానించుకున్నారు. ఇంకేముంది టైం తక్కువ ఉండడంతో అనుకున్నదే తడవుగా రాత్రికి రాత్రే నిర్మాణం మొదలుపెట్టి పూర్తి కూడా చేశారు. వంతెన బలంగా లేనప్పటికీ, ఊరేగింపుగా వరుడిని తీసుకొచ్చేందుకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూశారు. దీంతో పెళ్లి కొడుకుని బైక్ మీద ఎక్కించుకుని వంతెనను దాటించి ఇంటికి తీసుకువచ్చారు. వరుడితో పాటు, అతడి బంధుమిత్రులు కూడా వెదురు వంతెన సాయంతో కాలువ దాటి గ్రామానికి చేరుకుని వివాహానికి హాజరయ్యారు. ప్రస్తుతం ఈ పెళ్లి , వరుడి కోసం వంతెన నిర్మించడం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారి హల్ చల్ చేస్తోంది. -
కె ఎల్ ఐ ప్రధాన కాలువలో చేపల మృత్యువాత
-
మేమేం పాపం చేశాం.. మాకెందుకీ కడుపుకోత
నల్గొండ: ‘అయ్యో దేవుడా మేమేం పాపం చేశాం.. మాకెందుకీ కడుపుకోత.. మా బిడ్డలతో పాటే మమ్మల్నీ తీసుకుపో’ అంటూ ఆ తల్లిదండ్రులు రోదించిన తీరు అందరినీ కలచివేసింది. ఏఎమ్మార్పీ కాల్వలో గల్లంతైన మరో బాలుడు నందు కూడా మృతిచెందాడు. అతడి మృతదేహం సోమవారం పానగల్– కట్టంగూర్ రోడ్డు సమీపంలో కాల్వలో లభ్యమైంది. జిల్లా కేంద్రంలోని సుందరయ్య కాలనీకి చెందిన గార్లపాటి రాంబాబు, మమతల పెద్ద కుమారుడు చందు(10), చిన్న కుమారుడు నందు(6) ఇంటి సమీపంలోని మెయిన్ కెనాల్లో ఆదివారం ఈతకు వెళ్లి గల్లంతయ్యారు. చందు మృతదేహం అదే రోజు లభించగా నందు ఆచూకీ కోసం కాల్వలో నీటి ప్రవాహం తగ్గించి గాలించారు. పానగల్ సమీపంలోని చెట్లపొదల్లో నందు మృతదేహాన్ని గుర్తించి వెలికితీశారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తలరించినట్లు ఎస్సై రాజశేఖర్‌రెడ్డి తెలిపారు. ఇద్దరు కుమారులు ఒకేసారి మృతి చెందడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. చిన్నారుల మృతిలో ఏమైనా కుట్ర కోణం ఉందా..? ప్రమాదవశాత్తు మరణించారా..? అని పోలీసులు ఆరా తీస్తున్నారు. మృతుల తండ్రి రాంబాబు ఫిర్యా దు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. ( చదవండి: ఓటు వేశాక అనుకోని ప్రమాదం: ఇద్దరు ఉద్యోగులు మృతి ) -
అర్ధరాత్రి విషాదం: పగబట్టిన పొగమంచు..
ఆత్రేయపురం: అర్ధరాత్రి పొగమంచు.. మార్గంలో హెచ్చరిక బోర్డులు లేకపోవడమే లొల్ల లాకుల సమీపాన జరిగిన కారు ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు. ఆత్రేయపురం మండలం లొల్ల లాకుల వద్ద.. బొబ్బర్లంక – రావులపాలెం రోడ్డుపై ముక్తేశ్వరం ప్రధాన కాలువలోకి కారు దూసుకు పోయిన సంఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఇద్దరు సురక్షితంగా బయటపడ్డారు. ఇదే మండలం తాడిపూడికి చెందిన ఇందుకూరి సత్యనారాయణరాజు (43) పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని ఒక ప్రైవేట్ కళాశాలలో పని చేస్తున్నారు. మిత్రులతో అక్కడే ఉంటున్నారు. మహా శివరాత్రి సందర్భంగా స్నేహితులతో కలిసి గురువారం కారులో స్వగ్రామం వచ్చారు. వసంతవాడలో పార్వతీ పరమేశ్వరస్వామిని దర్శించుకున్నారు. వీరందరూ రాత్రి తిరిగి భీమవరం బయలుదేరారు. కారును చింతలపాటి శ్రీనివాసరాజు (46) నడుపుతున్నారు. ఆయన పక్కన ముందు సీటులో ఇందుకూరి సత్యనారాయణరాజు కూర్చున్నారు. వెనుక సీటులో ముదునూరి గణపతిరాజు, గొట్టుముక్కల బాపిరాజు చెరోపక్కన కూర్చోగా, వారి మధ్యలో ముదిండి సురేష్‌వర్మ కూర్చున్నారు. ఊరు దాటగానే పొగమంచు ఎక్కువగా ఉంది. దీంతో మార్గం కనిపించలేదు. అర్ధరాత్రి సమయానికి లొల్ల లాకుల వద్దకు చేరేసరికి కారు అదుపు తప్పి ముక్తేశ్వరం ప్రధాన కాలువలోకి దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో ఇందుకూరి సత్యనారాయణరాజు, చింతలపాటి శ్రీనివాసరాజు (46), ముదిండి సురే‹Ùవర్మ (38) మరణించారు. కారు వెనుక సీటులో కూర్చున్న ముదునూరి గణపతిరాజు, గొట్టుముక్కల బాపిరాజులు ప్రమాదాన్ని గమనించి డోర్లు తెరచుకుని చెరోపక్కకు దూకేసి, సురక్షితంగా బయట పడ్డారు. మృతదేహాలను స్థానికుల సహాయంతో బయటకు తీసినట్లు ఎస్సై నరేష్ తెలిపారు. ఇదీ మృతుల నేపథ్యం ♦ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన చింతలపాటి శ్రీనివాసరాజుది పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం సమీపంలోని కేశవరం. ఆయన రొయ్యల వ్యాపారం చేసేవారు. ఆయనకు భార్య శిరీష, కుమారుడు అవినాష్‌వర్మ ఉన్నారు. వర్మ ఆస్ట్రేలియాలో చదువుతున్నాడు. ♦మరో మృతుడు ముదిండి సురేష్వర్మది పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం సమీపంలోని ఈడూరు. ఆయన లారీ ట్రాన్స్‌పోర్టు వ్యాపారం చేసేవారు. ఆయనకు భార్య ప్రమీల, కుమార్తె వర్షిత ఉన్నారు. కుమార్తె భీమవరంలో ఇంటర్ చదువుతోంది. ♦మరో మృతుడు ఆత్రేయపురం మండలం తాడిపూడికి చెందిన ఇందుకూరి సత్యనారాయణరాజుకు భార్య మాధవి, ఏకైక కుమారుడు అఖిల్‌వర్మ ఉన్నారు. వర్మ ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. హెచ్చరిక బోర్డులేవీ! బొబ్బర్లంక–రావులపాలెం ఆర్అండ్బీ రోడ్డుపై లొల్ల లాకుల వద్ద మలుపు అత్యంత ప్రమాదకరంగా ఉంది. ఇక్కడ తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. అర్ధరాత్రి వాహన చోదకులు ఈ మలుపును గుర్తించలేకపోతున్నారు. ఫలితంగా కాలువలోకి దూసుకుపోతున్నారు. కాలువలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉంటే కొట్టుకుపోతున్నారు. ఇటీవల ఏడెనిమిది సంఘటనలు జరిగాయి. ఇక్కడ హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేస్తామని ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారే కానీ పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. ఫలితంగా కొత్తవారు ఈ మార్గంలో ప్రయాణిస్తే కాలువలోకి దూసుకుపోయి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. రూ.59 కోట్లతో ప్రతిపాదనలు శిథిలావస్థకు చేరిన లొల్ల లాకుల మరమ్మతులకు రూ.59 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి తెలిపారు. రెండు రోజుల క్రితమే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి ఈ సమస్య తీసుకువెళ్లామన్నారు. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో కొంత అభివృద్ధి జరిగిందన్నారు. ఈ నెలాఖరున క్రాప్ హాలిడే ప్రకటించగానే ఇక్కడ వంతెన నిర్మాణం, ఇతర పనులు చేపడతామన్నారు. గడ్డర్లు ఊడిపోయే స్థితిలో ఉన్నాయన్నారు. కారు ప్రమాదంపై ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గ్రిల్ ఊడిపోవడం వల్లే కారు కాలువలోకి దూసుకుపోయిందని అభిప్రాయపడ్డారు. మృతదేహాలకు నివాళులర్పించారు. ఆయన వెంట వైఎస్సార్ సీపీ మండల కనీ్వనర్ కనుమూరి శ్రీనివాసరాజు, మాజీ ఏఎంసీ చైర్మన్ ముదునూరి రామరాజు, మాజీ ఎంపీపీ పీఎస్ రాజు, వాడపల్లి ఆలయ కమిటీ సభ్యులు పెన్మెత్స సురేష్‌రాజు తదితరులు ఉన్నారు. చదవండి: తల్లీబిడ్డ మృతి కేసు.. విస్తుపోయే నిజాలు వైఎస్సార్సీపీ శ్రేణులపై టీడీపీ, జనసేన వర్గీయుల దాడి -
కట్టుకున్నోడే పుస్తేలు తెంపేశాడు!
కోరుట్ల: తాళి కట్టిన భర్త పుస్తెల తాడు లాక్కెళ్లడంతో మనస్తాపానికి గురై ఓ వివాహిత ఆత్మహత్యకు యత్నించి కెనాల్ వద్ద కళ్లు తిరిగిపడిపోయిన ఘటన మహిళా దినోత్సవం రోజు కోరుట్ల మండలం ఎఖీన్‌పూర్ వద్ద చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. కథలాపూర్ మండలం గంభీర్‌పూర్‌కు చెందిన ఎన్నమనేని హర్షిత అలియాస్ నాగరాణి(25)కి ఆరు నెలల క్రితం కొడిమ్యాల మండలం కోనాపూర్‌కు చెందిన ఎన్గందుల రాజేందర్(41)తో వివాహమైంది. రాజేందర్‌కు రెండో వివాహం కాగా కొన్ని రోజులుగా ఇద్దరి మధ్య సఖ్యత కొరవడింది. ప్రతీరోజు రాజేందర్ తాగి వచ్చి హర్షితను కొట్టడం, తిట్టడం చేసేవాడు. దీంతో విసిగిపోయిన హర్షిత కొన్ని రోజుల క్రితం గంభీర్‌పూర్‌కు వచ్చింది. శనివారం రాత్రి గంభీర్‌పూర్‌కు వచ్చిన రాజేందర్ మళ్లీ హర్షితతో గొడవపడి ఆదివారం ఉదయం పుస్తెలతాడు లాక్కెళ్లాడు. దీంతో మనస్తాపానికి గురైన హర్షిత గంభీర్పూర్ నుంచి కోరుట్ల మండలం ఎఖీన్‌పూర్ ఎస్సారెస్పీ కెనాల్ వద్దకు వెళ్లింది. అక్కడ నీటి ప్రవాహాన్ని చూసి కళ్లు తిరిగిపడిపోయింది. చుట్టుపక్కల రైతులు ఆమెను గమనించి వివరాలు తెలుసుకుని వెంటనే బంధువులకు సమాచారమిచ్చారు. కోరుట్లలో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో పనిచేసే హర్షిత పెద్దమ్మ కారంగుల శ్యామల కెనాల్ వద్దకు వచ్చి ఆమెను ప్రభుత్వాసుపత్రికి తరలించింది. హర్షిత ఆరోగ్యం మెరుగ్గానే ఉంది. తనకు న్యాయం చేయాలని హర్షిత కోరుతోంది. -
గల్లంతైన ఆరుగురి మృతదేహాలు లభ్యం
సాక్షి, ఏలూరు : పశ్చిమ గోదావరి జిల్లాలో విషాదం నెలకొంది. వసంతవాడ వాగులొ ఈతకు వెళ్లిన ఆరుగురు గల్లంతు అయ్యారు. గల్లంతు అయిన ఆరుగురి మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతులు భూదేవి పేటకు చెందినవారుగా గుర్తించారు. ఈతకు వెళ్లి ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మృతుల వివరాలు 1) గంగాధర వెంకట్రావు,16 సంవత్సరాలు 2) శ్రీరాముల శివాజీ,16 సంవత్సరాలు 3) గొట్టుపర్తి మనోజ్,16 సంవత్సరాలు 4) కర్నటి రంజిత్, 15 సంవత్సరాలు 5) కెల్లాసాయి,16 సంవత్సరాలు 6) కూనవరపు రాధాకృష్ణ,15 సంవత్సరాలు -
వారి నిర్లక్ష్యం.. చిన్నారులకు మరణ శాసనం
కేజీఎఫ్(కర్ణాటక): అధికారుల నిర్లక్ష్యం చిన్నారులకు మరణశాసనమైంది. ముగ్గురు తల్లులకు కడుపుకోత మిగిల్చింది. రైల్వే అండర్‌పాస్‌లో నిలిచిన నీటిని తరలించేందుకు అధికారులు తవ్వించిన కాలువలోకి దిగిన చిన్నారులు పైకి రాలేక మృత్యువాత పడ్డారు. ఈ విషాద ఘటన బంగారుపేటలో శనివారం చోటు చేసుకుంది. మృతులను కుంబారహళి్లకి చెందిన సయ్యద్ అమీర్ కుమారుడు సాధిక్ (12), సలీం కుమార్తె మెహిక్ (8), నవీద్ కుమారుడు ఫయాజ్(7)గా గుర్తించారు. శుక్రవారం బంగారుపేట పట్టణంలో భారీ వర్షం కురిసింది. దీంతో పట్టణంలో అశాస్త్రీయంగా నిర్మించిన రైల్వే అండర్ పాస్ పొంగి పొర్లింది. వాహనరాకపోకలు స్తంభించడంతో రైల్వే అధికారులు జేసీబీ సహాయంతో సమాంతరంగా కాలువ తవ్వించి నీటిని మళ్లించారు. శనివారం మధ్యాహ్నం అటుగా వచ్చిన ముగ్గురు చిన్నారులు సరదాగా కాలువలోకి దిగారు. నీరు లోతుగా ఉండడంటంతో పైకి వచ్చేందుకు యత్నించగా జారి మళ్లీ నీటిలోకి పడిపోయి ప్రాణాలు కోల్పోయారు. పట్టణ పోలీసులు వచ్చి మృతదేహాలను వెలికి తీశారు. ప్రాణానికి ప్రాణమైన తమ పిల్లలు ఇక లేరని తెలుసుకున్న తల్లిదండ్రులు ఘటనా స్థలానికి వచ్చి మృతదేహాలపై రోదించారు. చిన్నారుల మృతదేహాలకు పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. కాగా అండర్‌పాస్ అశాస్త్రీయంగా నిర్మించిన అండర్‌పాస్ వల్ల ఘోరాలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు దుమ్మెత్తి పోశారు. మృతుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం అందించాలని రైతు సంఘం డిమాండ్ చేసింది. -
సామాన్యుడి 30 ఏళ్ల కృషి..
పాట్నా: బిహార్‌కు చెందిన దశరథ్ మాంఝీ అనే వ్యక్తి కొండచర్యలు విరిగిపడి తన భార్య మరణించడంతో ఒక్కడే ఒక కొండను తొలచి గ్రామానికి రహదారి నిర్మించిన విషయం తెలిసిందే. 22 ఏళ్లు కష్టపడి ఒక్కడే ఈ పనిని చేయడంతో ఈ విషయం అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ తరువాత మాంఝీ కథతో సినిమా కూడా తెరకెక్కింది. సరిగ్గా ఇప్పుడు అలాంటి భగీరధ ప్రయత్నంతో బిహార్‌కు చెందిన మరో వ్యక్తి అందరి చూపును తనవైపు తిప్పుకున్నాడు. ఆయన పేరు లంగీ భుయాన్. బిహార్‌లోని గయ ప్రాంతంలోని కోటీలావ గ్రామానికి చెందిన వ్యక్తి. వర్షాకాలంలో ఆ ఊరి సమీపంలో ఉన్న కొండలపై కురిసిన వాన నీరు వృథాగా పోవడం గమనించిన లంగీ భుయాన్‌కు ఒక ఆలోచన వచ్చింది. వర్షం నీరు వ్యర్థంగా పోకుండా కాలువ తవ్వాలనే ఆలోచన తట్టింది. అనుకున్నదే తడవుగా ఒక కాలువ తవ్వి కొండ దగ్గర నుంచి దానికి మార్గం వేయాలనుకున్నాడు. 30 ఏళ్ల క్రితం కొండ కింద నుంచి కాలువ తవ్వడం మొదలుపెట్టి ఇన్నాళ్లకు పూర్తి చేశాడు. 3 కిలోమీటర్ల పొడవున కాలువ తవ్వి తన ఊరికి అందించాడు. దీంతో అక్కడ ఉన్న పంట పొలాలన్నింటికీ ఆ నీరే ఆధారమవుతోంది. ఇన్నేళ్ల లంగీభుయాన్ ప్రయత్నం సఫలం కావడంతో గ్రామస్తులందరు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీని గురించి భుయాన్ మాట్లాడుతూ, ఎంతోమంది ఉపాధి కోసం పట్టణాలకు వెళుతున్నారు. నేను మాత్రం గ్రామాన్ని నమ్ముకుని జీవిస్తున్నాను. ఈ 30 ఏళ్లలో కాలువ తవ్వుతుంటే నాకు సాయం చేసినవాళ్లే లేకుండా పోయారు. పశువులను మేత కోసం రోజు కొండ ప్రాంతానికి తోలుకొని వెళ్లేవాడిని, ఆ సమయంలో కాలువ తవ్వే పనులను చేసేవాడిని ’ అని తెలిపారు. లంగీభుయాన్ కాలువ తవ్వడంతో స్థానిక నేతలు, గ్రామ ప్రజలు ఆయనను ఘనంగా సత్కరించారు. చదవండి: రాజకీయ దిగ్గజాన్ని కోల్పోయాం : మోదీ -
కాలువలో 8 కిలోమీటర్లు కొట్టుకుపోయి..
కలువాయి (నెల్లూరు జిల్లా): తెలుగుగంగ కాలువలో 8 కి.మీ కొట్టుకుపోయిన బాలిక ప్రాణాలతో బయటపడింది. ఈ ఘటన శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కలువాయి సమీపంలో గురువారం జరిగింది. కలువాయి గిరిజన కాలనీలో తన అవ్వతాతలతో కలిసి ఉంటున్న కంభంపాటి మౌనిక (9) గురువారం కాలనీకి సమీపంలోని తెలుగుగంగ కాలువ వద్దకు తన సోదరితో వెళ్లింది. అక్కడ ఆడుకుంటూ ఉండగా కాలువలో జారి పడింది. కాలువకు 11 వేల క్యూసెక్కులు నీటిని వదలడంతో నీటి ఉధృతికి కొట్టుకుపోసాగింది. ఆమె సోదరి ఇంటికి వెళ్లి జరిగిన విషయాన్ని చెప్పింది. కుటుంబీకులు వచ్చి గాలించినా మౌనిక ఆచూకీ లభించలేదు. (చదవండి: అరచేతిలో పోలీస్ స్టేషన్!) సమాచారం అందుకున్న కలువాయి ఎస్ఐ ఎం.ఆంజనేయులు తన సిబ్బందితో కలిసి కాలువ వెంబడి గాలించారు. బాలిక 8 కిలోమీటర్లు కొట్టుకుపోయి బాలాజీరావుపేట గ్రామ సమీపంలో కాలువపై వెళ్తున్న కత్తి కృష్ణయ్య అనే వ్యక్తిని చూసి కాపాడాలని కేకలు వేసింది. కృష్ణయ్య గ్రామస్తులకు, పోలీసులకు సమాచారమిచ్చాడు. పోలీసులు అక్కడికి చేరుకునే సరికి గ్రామస్తులు తాళ్లు తీసుకుని వచ్చారు. కొండపోగు ప్రసాద్, మరికొందరు యువకులు, పోలీసులు తాళ్లువేసి మౌనికను లాగి ఒడ్డుకు చేర్చారు. (చదవండి: నటి శ్రావణి ఆత్మహత్య కేసు: గంటకో మలుపు) -
గుంటూరు: కాలువలో పడిన కారు
-
గర్భిణి ప్రసవవేదన
పెద్దేముల్: వాగు ఉధృతికి రాకపోకలు నిలిచిపోయాయి. ఓ నిండుచూలాలిని కటుంబీకులు అతికష్టం మీద అసంపూర్తి బ్రిడ్జిని దాటించి ఆస్పత్రికి తరలించారు. అప్పటికే పరిస్థితి విషమించడంతో శిశువు మృతిచెందాడు. ఈ ఘటన మండల పరిధిలో మంగళవారం జరిగింది. వివరాలు.. కోట్‌పల్లి మండలం మారేపల్లి తండాకు చెందిన రుక్మిణిబాయి నిండు గర్భిణి. మంగళవారం ఉదయం పురిటి నొప్పులు రావడంతో కుటుంబీకులు 108 సమాచారం అందించారు. వాహనంలో తాండూరుకు బయలుదేరారు. మార్గంమధ్యలో గాజీపూర్ వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. అక్కడున్న అసంపూర్తి బ్రిడ్జి పైనుంచి వాహనాలు రాకపోకలు సాగించడం లేదు. దీంతో గర్భిణి కుటుంబీకులు అతికష్టం మీద బ్రిడ్జి పైనుంచి దాటించారు. అవతలి వైపు నుంచి ఆటోలో తాండూరులోని జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యులు రుక్మిణిబాయికి ప్రసవం చేశారు. సకాలంలో గర్భిణిని తీసుకురాకపోవడంతో పరిస్థితి విషమించి శిశువు మృతిచెందింది. అసంపూర్తి బ్రిడ్జితోనే శిశువు మృతిచెందినట్లు కుటుంబీకులు కన్నీటిపర్యంతమయ్యారు. -
కరోనా భయంతో ఊరెళితే..
తిరుపతిలో ఉంటే కరోనా సోకుతుందని కుమారుడిని తీసుకుని పుంగనూరులోనిపుట్టింటికి వచ్చిన ఓ తల్లి కళ్ల ఎదుటే కుమారుడు నీటిలో మునిగిపోయి ప్రాణాలు కోల్పోయాడు. స్నేహితుడితో ఈత కొట్టేందుకు వచ్చిన మరో బాలుడు నీటిమునిగి మృత్యువాత పడిన విషాదకర సంఘటన సోమవారం జరిగింది. వివరాలు.. చిత్తూరు ,పుంగనూరు: తిరుపతికి చెందిన పెయింటర్ శ్రీనివాసులు, రాజేశ్వరి దంపతుల కుమారుడు రాఖేష్ నాయక్ (13), ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. తిరుపతిలో కరోనా కేసులు పెరుగుతుండంతో రాజేశ్వరి కుమారుడితో కలసి పుట్టినిల్లు పట్రపల్లెతాండాకు వెళ్లింది. అదే గ్రామానికి చెందిన శ్రీరాములు నాయక్ కుమారుడు లక్ష్మీతేజ (9) నాలుగవ తరగతి చదువుతున్నాడు. సోమవారం బంధువులు రూప, రత్నమ్మలతో కలసి రాజేశ్వరి గ్రామ సమీపంలోని చిట్టెంవారిపల్లె క్వారీ గుంతల్లో దుస్తులు ఉతికేందుకు వెళ్లారు. ఈ సమయంలో లక్ష్మీతేజ, రాఖేష్‌నాయక్, లోకేష్, భవదీప్, హేమసాయి ఐదుగురు కలసి సమీపంలోని ఉపాధికుంటలో ఈత కొట్టేందుకు వెళ్లారు. నీటిలో మునిగిపోతూ కేకలు వేయడంతో రాజేశ్వరి, రూప, రత్నమ్మ పిల్లలను కాపాడేందుకు వెళ్లారు. రూప నీటిలోకి దూకి లోకేష్ (10), భవదీప్(11), హేమసాయి (9)లను కాపాడింది. రాఖేష్, లక్ష్మీతేజలను కాపాడే ప్రయత్నంలో రూప కూడ నీటిలో మునిగిపోతుండగా అక్కడే పశువులు మేపుతున్న హరీష్ అనే యువకుడు ఆమెను కాపాడాడు. అప్పటికే నీట మునిగిన రాఖేష్, లక్ష్మీతేజలు మృత్యువాత పడ్డారు. ఈ సంఘటనతో పట్రపల్లెతాండలో విషాదచాయలు అలుముకున్నాయి. ఇద్దరు చిన్నారులు మృతితో వారి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అయ్యారు. ఎస్ఐ ఉమా మహేశ్వరరావు కేసు నమోదు చేసి, మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు. -
తెగించి ప్రాణాలు కాపాడారు
కర్ణాటక,రాయచూరు రూరల్: ఓ మహిళ అదుపు తప్పి వాగులో పడి కొట్టుకుపోతుండగా కొందరు యువకులు ధైర్యసాహసాలు ప్రదర్శించి నీటిలోకి దూకి ఆమెను కాపాడారు. వివరాలు.. మూడు రోజలుగా కురుస్తున్న భారీ వర్షాలతో యాదగిరి జిల్లా శహపుర తాలూకా పగలాపుర వద్ద కోయిలూరు వాగి పొంగి ప్రవహిస్తోంది. ఆశనాలకు చెందిన మహిళ, మరికొంతమంది కూలీలు శనివారం ఉదయం ఆటోలో పగలూరులోని పొలానికి వెళ్లారు. సాయంత్రం తిరిగి ఆటోలో వస్తుండగా కోయిలూరు వాగులో నీటి ఉధృతిని చూసి డ్రైవర్ ఆటోను నిలిపివేశాడు. దీంతో కూలీలు ఒకరి చేతులు మరొకరు పట్టుకొని వాగు దాటుతుండగా నాగమ్మ(29)అనే మహిళ అదుపు తప్పి నీటిలో పడి కొట్టుకుపోయింది. దీంతో మిగతా వారు గట్టిగా కేకలు వేయడంతో అక్కడే ఉన్న యువకులు వాగులోకి దూకారు. మెడలోతు వరకు నీరు ఉధృతంగా ప్రవహిస్తున్నా లెక్క చేయకుండా ఈదుకుంటూ వెళ్లి నాగమ్మను రక్షించారు. -
వన భోజనాల్లో విషాదం
డిచ్పల్లి: డిచ్పల్లి మండలం సుద్దులం గ్రామంలో శుక్రవారం పలు కుటుంబాలు ఉత్సాహంగా వన భోజనాలకు వెళ్లాయి. వనభోజనాలకు వెళ్లినవారు గ్రామ శివారులోని రామడుగు ప్రాజెక్టు్ట వద్ద ఆనందంగా గడిపారు. ఇంతలోనే అనుకోని విషాదం నెలకొంది. భోజనాల అనంతరం పక్కనే ఉన్న రామడుగు ప్రాజెక్టు ఎడమ కాలువ నీటిలో సరదాగా ఈత కొడదామని వెళ్లిన ఐదుగురు స్నేహితుల్లో ఒకరు నీట మునిగి మృతి చెందారు. డిచ్పల్లి తహసీల్దార్ వేణుగోపాల్, ఎస్సై సురేశ్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. సుద్దులం గ్రామానికి చెందిన పలు కుటుంబాల వారు వన భోజనాలకు పక్కనే గల రామడుగు ప్రాజెక్టు వద్దకు తరలివెళ్లారు. భోజనాల అనంతరం గ్రామానికి చెందిన కల్లెడ నిఖిలేందర్‌రెడ్డి(21) మరో నలుగురు స్నేహితులతో కలిసి ఈత కొడదామని ప్రాజెక్టు కాలువ నీటిలోకి దిగాడు. కొద్ది సేపటికే నీళ్లలో మునిగి పోయాడు. ఆందోళనకు గురైన మిగిలిన యువకులు ఈ విషయాన్ని వారి గ్రామస్తులకు, కుటుంబ సభ్యులకు తెలిపారు. గ్రామస్తులు పెద్ద సంఖ్యలో ప్రాజెక్టు వద్దకు చేరుకుని నీటిలో గాలించగా మృతదేహం లభించలేదు. సమాచారం అందుకున్న తహసీల్దార్ వేణుగోపాల్, ఎస్సై సురేశ్‌కుమార్ ప్రాజెక్టు వద్దకు చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. రామడుగు గ్రామానికి చెందిన గజఈతగాడు రమేశ్ అతని బృందం సభ్యులను పిలిపించారు. రమేశ్ బృందం కాలువ నీటిలో సుమారు రెండు గంటల పాటు గాలించి మృతదేహాన్ని వెలికి తీశారు. పోలీసులు పంచనామా నిర్వహించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కల్లెడ ప్రభాకర్‌రెడ్డి, విజయ దంపతులకు నిఖిలేందర్‌రెడ్డితో పాటు కూతురు ఉన్నారు. నిఖిలేందర్‌రెడ్డి ప్రస్తుతం సీఏ చదువుతున్నాడు. కరోనా నేపథ్యంలో ఇంటి వద్దనే ఉంటున్నాడు. ఒక్కగానొక్క కొడుకు చనిపోవడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. -
కాలువలోకి దూసుకెళ్లిన కారు
హిరమండలం: పాతహిరమండలం సమీపంలోని వంశధార కుడి ప్రధాన కాలువలోకి మంగళవారం తెల్లవారుజామున ఓ కారు దూసుకెళ్లింది. కారులో ఉన్న వ్యక్తులు అప్రమత్తమై అద్దాలు పగులగొట్టి బయటకు రావడంతో పెద్ద ప్రమాదం తప్పింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పాలకొండకు చెందిన సత్యనారాయణ, కారు డ్రైవరు మురళీకృష్ణలు కంచిలిలో పని ముగించుకొని సోమవారం అర్ధరాత్రి తిరుగు ప్రయాణమయ్యారు. వీరు పాతపట్నం, హి రమండలం మీదుగా పాలకొండ చేరుకోవాలని నిర్ణయించుకున్నారు. హిరమండలం వచ్చేసరికి ఉదయం నాలుగు గంటలైంది. పాత హిరమండలం దాటాక వంశధార కుడి ప్రధా న కాలువ సమీపంలోకి వచ్చేసరికి డ్రైవర్ నిద్రమత్తులో ఉండి కారును అదుపు చేయలేకపోవడంతో అమాంతం కాలువలో పడిపోయింది. అప్పటికే కాలువలో పది అడుగుల మేర నీటి ప్రవాహం ఉంది. అయితే అద్దాలను పగులగొట్టి సత్యనారాయణ, మురళీకృష్ణ ఎలాగోలా బయట పడ్డారు. స్థానికులు కూడా వీరిని గుర్తించి సాయం చేశారు. పోలీసులకు సమాచారం అందించడంతో ఎస్ఐ గోవిందరావు ఆధ్వర్యంలో సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. బాధితుల నుంచి వివరాలు సేకరించారు. క్రేన్ సాయంతో కారును బయటకు తీశారు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ దారిలో హెచ్చరిక బోర్డులు ఏర్పా టు చేయలేదని, కొద్ది రోజుల కిందట కూడా ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. అధికారులు స్పందించి సూచిక బోర్డులు ఏర్పాటుచేయాలని ప్రజలు కోరుతున్నారు. -
‘కొండపోచమ్మ’ కాల్వకు భారీ గండి
సాక్షి సిద్దిపేట/గజ్వేల్: కొండపోచమ్మ సాగర్ కాల్వల నిర్మాణంలో డొల్లతనం మరోసారి బయటపడింది. ఇటీవల గజ్వేల్ మండలం కొడకండ్ల హెడ్ రెగ్యులేటరీ వద్ద, మర్కుక్ పంప్‌హౌస్ వద్ద సిమెంట్ లైనింగ్ దెబ్బతినడం, కొండపాక మండలం ఎర్రవల్లి వద్ద కాల్వలు దెబ్బతిన్న ఘటనలు మరువకముందే తాజాగా మంగళవారం మర్కుక్ మండలం శివారు వెంకటాపూర్‌లో కాల్వకు భారీ గండి పడింది. దీంతో నీళ్లన్నీ పంట పొలాలు, ఇళ్లలోకి చేరాయి. ఈ హఠాత్పరిణామం వల్ల గ్రామస్తులు ప్రాణభయంతో పరుగులు తీశారు. అలాగే.. 30 ఎకరాలకుపైగా పంట నష్టం వాటిల్లింది. వానాకాలం సమీపించే వరకు కాల్వల ద్వారా నీరు వదలాలనే ఉద్దేశంతో వేగంగా పనులు చేయడం.. పనుల్లో నాణ్యత లోపించడం.. సిమెంట్ లైనింగ్ సక్రమంగా చేయకపోవడం.. కాల్వల కోసం పోసిన కట్టలను గట్టిపడే వరకు తొక్కించకపోవడం, సరిగా చదును చేయకపోవడంతో కాల్వల నిర్మాణాల్లో నాణ్యత లోపించింది. దీంతో ఇప్పటివరకు మొత్తం మూడు చోట్ల గండ్లు పడ్డాయి. కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ నుంచి జగదేవ్‌పూర్ కాల్వకు రిజర్వాయర్ నుంచి 3.5 కిలోమీటర్ల కాల్వ మేడ్చల్ జిల్లా తుర్కపల్లి వద్ద కలుస్తుంది. ఇక్కడ జగదేవ్‌పూర్, తుర్కపల్లి కాల్వలు పాయలుగా విడిపోతాయి. జగదేవ్‌పూర్ కాల్వ శివారు వెంకటాపూర్ నుంచి తీగుల్ వైపు వెళ్తుంది. ఈ కాల్వలను జూన్ 24న ప్రారంభించిన సంగతి తెలిసిందే. మంగళవారం ఉదయం 6.30 గంటలకు శివారు వెంకటాపూర్ వద్ద మొల్లోనికుంట సమీపంలోని కాల్వ ప్రదేశంలో భారీ గండి పడింది. దీంతో కాల్వ కింది భాగంలో ఉన్న కల్వర్టు ద్వారా మొల్లోని కుంటలోకి భారీ ప్రవాహం, మరో ప్రవాహం గ్రామంలోకి వెళ్లింది. దీని వల్ల 30 ఎకరాల్లో మిర్చి, టమాట, పత్తి, మొక్కజొన్న పంటలు నీట మునిగాయి. దీంతో రైతులు లబోదిబోమంటున్నారు. మరోవైపు గ్రామంలోని పలువురి ఇళ్లలోకి నీరు చేరింది. టీవీలు, వంట సామగ్రి, బియ్యం, బట్టలు, ఇతర విలువైన వస్తువులు తడిసిపోయాయి. పలు ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఏం జరుగుతుందో తెలియని గందరగోళ పరిస్థితి నెలకొన్నది. సమాచారం అందుకున్న నీటిపారుదల శాఖ ఈఎన్సీ హరేరామ్, ఎస్ఈ వేణు, ఈఈ బద్రినారాయణ ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. మరోవైపు నీటిపారుదల శాఖ అధికారులు ముందుగా కాల్వ ప్రవాహాన్ని ఆపడానికి రిజర్వాయర్ వద్ద గేట్లను మూసేశారు. దీంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. ప్రవాహం పెరగడం వల్లే గండి 295 క్యూసెక్కుల సామర్థ్యం కలిగిన జగదేవ్‌పూర్ కాలువలో ప్రవాహం పెరగడం వల్లే భారీ గండి ఏర్పడినట్లు అధికారులు గుర్తించారు. కాల్వ నుంచి నీటిని చెరువుల్లోకి పంపడం ఇటీవల మొదలైంది. కొత్త కావడం వల్ల నిజానికి ఈ కాలువలో 195 క్యూసెక్కులకు మించి ప్రవాహం ఉండకూడదని చెబుతున్నారు. కానీ సోమవారం రాత్రి నుంచి ఎక్కువ సామర్థ్యంలో నీటిని వదిలారని తెలిసింది. దీని వల్ల గండ్లు ఏర్పడి మొల్లోని కుంటలోకి కొంత, గ్రామంలోకి మరో 30 క్యూసెక్కులకు పైగా నీటి ప్రవాహం వచ్చినట్లు చెబుతున్నారు. రాత్రి పూట గనుక ఈ గండ్లు పడి ఉంటే నిద్రావస్థలో ఉన్న జనంపైకి నీరు వేగంగా వచ్చి.. ప్రాణ నష్టం సంభవించేదని పలువురు అభిప్రాయపడ్డారు. కాగా, నీటిపారుదల శాఖ ఈఎన్సీ దగ్గరుండి జేసీబీ, ఇతర యంత్రాలతో గండ్లను పూడ్చి వేయించారు. ప్రాజెక్టుల నిర్మాణంలో ఇలాంటివి సహజం: నీటిపారుదల శాఖ ఈఎన్సీ హరేరామ్ ప్రాజెక్టుల నిర్మాణం, కాల్వల ద్వారా చెరువుల్లోకి నీళ్లు పంపే సందర్భాల్లో గండ్లు పడటం సహజంగా జరుగుతుంటాయని, దీనిని నాణ్యత లోపం, ఇంజనీర్ల వైఫల్యం అని నిరు త్సాహపర్చవద్దని నీటిపారుదల శాఖ ఈఎన్సీ హరేరామ్ అన్నారు. మంగళవారం సాయంత్రం కొండపోచమ్మ సాగర్ జగదేవ్‌పూర్ కాల్వ గండి పడిన శివారు వెంకటాపూర్ వద్ద విలేకరులతో మాట్లాడారు. మేడిగడ్డలో 88 మీటర్ల ఎత్తు నుంచి 10 పంప్‌హౌస్‌లను దాటుకుంటూ కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ వరకు 618 మీటర్ల ఎత్తుకు విజయవంతంగా గోదావరి జలాలను తీసుకురాగలిగామని పేర్కొన్నారు. ఈ మహత్తర ప్రాజెక్టుల నిర్మాణంలో ఇంజనీర్లు రాత్రిపగలు అలుపెరగకుండా శ్రమించారని గుర్తు చేశారు. కొత్త ప్రాజెక్టులను ప్రారంభోత్సవం చేసే సందర్భంలో, కాల్వల ద్వారా చెరువులకు నీళ్లను పంపే సందర్భంలో సహజంగా ఇలాంటి చిన్నచిన్న లోపాలు బయటపడుతాయని పేర్కొన్నారు. తాము ప్రస్తుతం జగదేవ్‌పూర్ కాల్వలో నీటి ప్రవాహం ఏవిధంగా ఉందనే అంశంపైనే ట్రయల్ రన్ నిర్వహిస్తున్నామని తెలిపారు. శివారు వెంకటాపూర్ వద్ద కాలువ పక్కన మట్టి వర్షానికి లూజుగా మారి సిమెంట్ లైనింగ్ దెబ్బతినడం చోటుచేసుకుందన్నారు. దీని వల్లే గండి ఏర్పడిందని చెప్పారు. పక్కనే బైపాస్ రోడ్డు ఉండటం వల్ల కొంత ఇబ్బంది ఏర్పడిందని అభిప్రాయపడ్డారు. ఈనెల 11న అర్ధరాత్రి ఎర్రవల్లి, కొడకండ్ల వద్ద కాలువలు దెబ్బతినడంలోనూ చిన్న లోపాలు బయటపడ్డాయని చెప్పారు. ఆ రోజు 220 మిల్లీమీటర్ల వర్షం కురవడం వల్ల నీటి ప్రవాహం పెరిగి అలా జరిగిందని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. కొండపోచమ్మ సాగర్ కాల్వల ద్వారా నీటిని పంపే సమయంలో తాము పది, పన్నెండు చోట్ల చిన్నచిన్న సమస్యలు వస్తాయని ముందే ఊహించామని, కానీ ఒకటి, రెండు చిన్న సమస్యలతోనే బయట పడగలిగామని స్పష్టం చేశారు. దీన్ని పెద్దదిగా చూపి ప్రజలను భయాందోళనలకు గురిచేయవద్దని కోరారు. -
స్నానానికి వెళ్లి శవమై తేలాడు!
నిజామాబాద్, డిచ్పల్లి: విందుకు వెళ్లిన మిత్రులు సరదాగా స్నానం చేసేందుకు వెళ్లగా, ఓ యువకుడు ప్రమాదవశాత్తు మృతి చెందాడు. డిచ్పల్లి తహసీల్దార్ వేణుగోపాల్, ఎస్సై సురేశ్‌కుమార్ మంగళవారం తెలిపిన వివరాల ప్రకారం.. మోపాల్ మండలం బోర్గం (పీ) గ్రామానికి చెందిన గౌర వుల రమేశ్ (24), తన స్నేహితుడు శ్రీనాథ్‌తో కలిసి సోమవారం ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. ఇద్దరు కలిసి బైక్‌పై డిచ్పల్లి మండలం యానంపల్లి శివారులో గల రామడుగు ప్రాజెక్టు ఎడమ కాలువ వద్దకు చేరుకుని సాయంత్రం వరకూ విందు చేసుకున్నారు. అనంతరం కాలువలో స్నానం చేయడానికి దిగిన రమేశ్ నీటిలో మునిగి చనిపోయాడు. రాత్రి పది దాటినా రమేశ్ ఇంటికి రాక పోవడంతో ఆయన భార్య సంధ్య కంగారు పడింది. అతడి ఫోన్ చేయగా స్నేహితుడు శ్రీనాథ్ ఫోన్ లిఫ్ట్ చేశాడు. రమేశ్ గురించి అడుగగా సరైన సమాధానం చెప్పకుండానే పెట్టేశాడు. అయితే, మరో స్నేహితుడు మంగళవారం ఉదయం సంధ్యకు ఫోన్ చేసి, రమేశ్ కాలువలో స్నానం చేస్తుండగా నీటిలో మునిగి చనిపోయినట్లు తెలిపాడు. వెంటనే మృతుని కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారమిచ్చి, ఘటనా స్థలానికి చేరుకున్నారు. విషయం తెలుసుకున్న కలెక్టర్ నారాయణరెడ్డి ఆదేశాల మేరకు తహసీల్దార్ వేణుగో పాల్ సైతం కాలువ వద్దకు చేరుకున్నారు. కాలువ లోతుగా ఉండటంతో ఎస్సై సురేశ్‌కుమార్ జాలర్లను రంగంలోకి దించారు. చేపల వల సహాయంతో సుమారు 3 గంటల పాటు గాలించి చివరకు మృతదేహాన్ని బయటకు తీశారు. మృతదేహాన్ని జిల్లా ఆస్పత్రికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేశారు. -
శుభ ముహూర్తానికి అడ్డువచ్చిన ‘కరోనా’
ఈ వేసవి ముగిసేలోపు గోదావరి జలాల గలగల సవ్వడి జిల్లాలో వినిపించనుంది. సిద్దిపేటను సస్యశ్యామలం చేసేందుకు ప్రభుత్వం నడుం బిగించింది. ఇందులో భాగంగానే కాళేశ్వరం ద్వారా గోదావరి జలాలను సిద్దిపేటకు వచ్చే ఏర్పాటు చేసింది. ప్రస్తుతం గోదావరి జలాలు జిల్లా సరిహద్దుకు చేరాయి. ఇక రంగనాయకసాగర్, అక్కడి నుంచి మల్లన్న సాగర్, ఆ తర్వాత కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్లు, అక్కడి నుంచి జిల్లాలోని చెరువుల్లోకి గోదావరి జలాలు పరుగులు పెట్టే గడియ రానే వచ్చింది. కరోనా ప్రభావంతో కాస్త ఆలస్యమైనా మిషన్ కాకతీయ ద్వారా అందంగా ముస్తాబైన చెరువుల్లో తర్వరలో జలకల సంతరించుకోనుంది. సాక్షి, సిద్దిపేట :జిల్లా అంతా మెట్ట ప్రాంతం. సముద్ర మట్టానికి 600 మీటర్ల ఎత్తులో ఉంది. ఇంత ఎత్తులో ఉన్న సిద్దిపేట జిల్లాకు గోదావరి జలాలు ఎత్తిపోసే పని దాదాపుగా పూర్తి కావచ్చింది. కాళేశ్వరం నుండి దశలవారిగా మిడ్‌మానేరుకు చేరాయి. అక్కడి నుండి సిద్దిపేట జిల్లా సరిహద్దులో ఉన్న అనంతగిరి సాగర్ రిజర్వాయర్‌కు పంపింగ్ చేశారు. మొత్తం 3.5టీఎంసీల నీటి సామర్థ్యం ఉన్న ఈ రిజర్వాయర్ నింపేందుకు నాలుగు పంపులు పూర్తి స్థాయిలో పనిచేస్తున్నారు. కొత్తగా నిర్మించిన రిజర్వాయర్ కావునా కొద్దికొద్దిగా పంపులు వదులుతూ.. నీటిని నింపుతున్నారు. దీంతో ఇప్పటికి 0.8 టీఎంసీ నీళ్లు చేరాయి. దీంతో అనంతగిరి సాగర్ నుండి రంగనాయకసాగర్‌కు పంపింగ్ చేసే ప్రదేశం వద్దకు గోదారమ్మ వచ్చి ఆగింది.. శుభ ముహూర్తానికి అడ్డువచ్చిన కరోనా జిల్లా సరిహద్దులో ఉన్న అనంతగిరి సాగర్ వరకు వచ్చిన గోదావరి జలాలు జిల్లాకు ఎత్తిపోసేందుకు సర్వం సిద్దమైంది. అయితే కరోనా మహర్మారితో నీళ్లపండుగ ఆగిపోయింది. 3 టీఎంసీల సామర్థ్యంతో 1.10లక్షల ఆయకట్టుకు సాగునీరు అందించేలా రంగనాయకసాగర్, 15టీఎంసీల సామర్థ్యంలో 2.85లక్షల ఎకరాలకు సాగునీరు అందించేలా కొండపొచమ్మ సాగర్, అదేవిధంగా 50టీఎంసీల సామర్థ్యంలో 1.25లక్షల ఎకరాలకు నీరు అందించే మల్లన్న సాగర్ ప్రాజెక్టులు నిర్మించారు. అయితే ఇందులో మల్లన్న సాగర్ మినహా మిగిలిన మూడు రిజర్వాయర్లకు సంబంధించిన భూసేకరణ ప్రక్రియ పూర్తి అయ్యింది. అనంతగిరి వరకు నీళ్లు వచ్చాయి. ఈ నీటిని ముందుగా రంగనాయకసాగర్‌కు పంప్ చేస్తారు. అక్కడి నుండి టన్నెల్, గ్రావిటీ కెనాల్ ద్వారా మల్లన్నసాగర్ రిజర్వాయర్ వద్దకు నీటికి తీసుకెళ్తారు. అయితే మల్లన్న సాగర్ రిజర్వాయర్ నిర్మాణం పూర్తి కాకపోయినా.. తుక్కాపూర్ వరకు వచ్చిన నీటిని 18 కిలో మీటర్ల పొడవునా కాలువ తవ్వి కొండపొచమ్మ సాగర్ కాల్వకు అనుసంధానం చేశారు... ఇలా మల్లన్న సాగర్ రిజర్వాయర్ నిర్మాణంతో పనిలేకుండా గోదావరి జలాలు కిందికి తరలించేందుకు సర్వం సిద్ధం చేసినట్లు అధికారులు చెబుతున్నారు. కరోనా ప్రభావంతో ఆలస్యం సిద్దిపేట జిల్లా సరిహద్దు అనంతగిరి రిజర్వాయర్ వరకు గోదావరి జలాలు వచ్చాయి.. అక్కడి నుండి రంగనాయకసాగర్‌లోకి పంపింగ్ చేసేందుకు సర్వం సిద్దం చేశాం. మంచి ముహూర్తం పెట్టుకొని, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఆహ్వానించుకొని పండుగ వాతావరణం మధ్య గోదారమ్మకు స్వాగతం పలుకుదాం అనుకున్నాం.. ఇంతలోనే కరోనా వైరస్ వచ్చి అంతా తారుమారు చేసింది. ఏది ఏమైనా.. ఈ వేసవిలో జిల్లాలోని చెరువులను గోదావరి జలాలతో నింపాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు.. వారి ఆదేశాల మేరకు వేసవిలో చెరువులు నింపేందుకు సర్వం సిద్ధం చేస్తున్నాం. – హరీశ్‌రావు, ఆర్థికశాఖ మంత్రి ఆ గడియ కోసమేఎదురు చూపు.. కరువు ప్రాంతం సిద్దిపేటను కోనసీమను తలపించేలా చేయాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనకు ప్రతీరూపమే కాళేశ్వరం ప్రాజెక్టు. రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు పట్టువదలకుండా రిజర్వాయర్ల నిర్మాణం పూర్తి చేశారు. గోదావరి జలాలు జిల్లాలో పారే గడియ కోసమే జిల్లా ప్రజలు వేయికళ్లతో వెదురు చూస్తున్నారు..– రాధాకృష్ణ శర్మ,టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి -
కారులో మూడు మృతదేహాలు..
సాక్షి, కరీంనగర్: అలగునూర్ సమీపంలో కాకతీయ కెనాల్లోకి కారు దూసుకుపోయి ముగ్గురు మృతి చెందిన సంఘటనపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రమాదవశాత్తూ కారు కెనాల్లోకి దూసుకువెళ్లిందా? లేక వారు ఆత్మహత్యకు పాల్పడ్డారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. కాగా పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి సోదరి రాధ, ఆమె భర్త సత్యనారాయణ రెడ్డి, కుమార్తె వినయశ్రీ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. వీరు ప్రయాణిస్తున్న కారు కాకతీయ కెనాల్లో బయటపడింది. ఆదివారం రోజున మానేరు కాలువలో ప్రమాదవ శాత్తు పడిన ఒక మోటార్ బైక్ ను వెలికితీయడానికి కాలువలో నీటిని నిలిపివేశారు. నీరు ఖాళీ కావడంతో అందులో కారు బయటపడింది. దాన్ని పోలీసులు తరిచి చూస్తే అందులో కుళ్లిన శవాలు బయటపడ్డాయి. లభించిన ఆధారాల మేరకు పెద్దపల్లి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సోదరి కుటుంబం అని తేలింది. (చదవండి : పెద్దపల్లి ఎమ్మెల్యే సోదరి అనుమానాస్పద మృతి!) గత నెల 27న సాయంత్రం మూడు గంటల నుంచి సత్యనారాయణ రెడ్డి ఫోన్ స్విచ్చాఫ్‌లో ఉంది. ఆ సమయంలోనే కారు కెనాల్లో పడితే రాజీవ్ రహదారిపై వెళ్లేవారు చూసేందుకు అవకాశం ఉండేది. అయితే ఈ ప్రమాదం సాయంత్రం వరకూ జరిగి ఉండకపోవచ్చని పోలీసులు భావిస్తున్నారు. కాగా సత్యానారాయణ రెడ్డి ...భార్య, కుమార్తెకు తెలియకుండా ముందుగా పథకం ప్రకారమే రాత్రి సమయంలో వేగంగా కారును కెనాల్లోకి దూసుకువెళ్లేలా చేశారా అనే కోణంలోనూ పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ సంఘటనపై ట్రైనీ ఐపీఎస్ నితిక పంత్ విచారణ చేపట్టారు. సంఘటనా స్థలంలోనే మూడు మృతదేహాలకు పోస్ట్‌మార్టం నిర్వహించారు. సత్యనారాయణరెడ్డి జనవరి 27న భార్య, కుమార్తెతో కలిసి ఇంటి నుంచి కారులో బయల్దేరారు. వీరంతా పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డికి దగ్గర బంధువులు. మృతురాలు రాధ ఎమ్మెల్యేకు సోదరి అవుతుంది. సత్యనారాయణ రెడ్డికి కరీంనగర్లో ఫర్టిలైజర్ షాపు ఉండగా, రాధిక స్కూల్ టీచర్. మూడేళ్ల క్రితం వీరి కుమారుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. కొడుకును కోల్పోయినప్పటి నుంచి దంపతులు మానసికంగా కృంగిపోయారు. వైద్యం కోసం తరచూ హైదరాబాద్‌కి వెళ్లేవారని బంధువులు తెలిపారు. ఇంటి నుంచి వెళ్లిన వీరి ఆచూకీ తెలియకపోవడంతో బంధువులు వారి ఆచూకీ కోసం ప్రయత్నించారు. చివరకు బ్యాంక్ కాలనీలోని వారి ఇంటి తాళాలు పగులగొట్టి చూసినా ఎలాంటి ఆధారాలు లభించలేదు. ఒకవేళ విదేశాలకు వెళ్లి ఉంటారని భావించి విమానాశ్రయంలో ఆరా తీసినా ఫలితం లేకపోయింది. అయితే పోలీసులకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేయకపోవడంతో మిస్సింగ్ కేసు నమోదు కాలేదు. -
పెద్దపల్లి ఎమ్మెల్యే సోదరి అనుమానాస్పద మృతి
-
భర్త, కుమార్తెతో సహా ఎమ్మెల్యే సోదరి మృతి
సాక్షి, కరీంనగర్ : పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. మనోహర్ రెడ్డి సోదరి రాధ కుటుంబ సభ్యులు అలగనూరు వద్ద మానేరు కాలువలో శవాలుగా తేలారు. భర్త సత్యనారాయణ రెడ్డి, కుమార్తె సహస్రతో సహా ఎమ్మెల్యే సోదరి రాధ మృతి చెందారు. దాదాపు 20 రోజుల నుంచి ఆ కుటుంబం గురించి ఎలాంటి సమాచారం లేదు. ఆదివారం రోజున మానేరు కాలువలో ప్రమాదవ శాత్తు పడిన ఒక మోటార్ బైక్ ను వెలికితీయడానికి కాలువలో నీటిని నిలిపివేశారు. నీరు ఖాళీ కావడంతో అందులో కారు బయటపడింది. దాన్ని పోలీసులు తరిచి చూస్తే అందులో కుళ్లిన శవాలు బయటపడ్డాయి. లభించిన ఆధారాల మేరకు పెద్దపల్లి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సోదరి కుటుంబం అని తేలింది. దాదాపు 20 రోజులుగా ఆ కుటుంబానికి సంబంధించిన సమాచారం లేదు. (దూసుకొచ్చిన మృత్యువు) బైకు కోసం నీటిని ఖాళీ చేయగా అందులో ప్రమాదానికి గురైన కారు కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కారు నుంచి మూడు శవాలను బయటకు తీశారు. అవి పూర్తిగా కుళ్లిపోయిన దశలో ఉన్నాయి. కారు నంబర్ ఆధారంగా పెద్దపల్లికి చెందిన రాధగా గుర్తించారు. ఆమె స్థానిక ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సోదరి. జనవరి 27 నుంచి ఆమెకు సంబంధించిన ఎలాంటి సమాచారం లేదని ఎమ్మెల్యే చెబుతున్నారు. ఇన్ని రోజులు గడుస్తున్నా ఆ కుటుంబానికి సంబంధించిన ఎలాంటి ఫిర్యాదు నమోదు కాకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ప్రస్తుతం ఘటనా స్థలానికి ఎమ్మెల్యే మనోహార్ రెడ్డి, కలెక్టర్ శశాంక్, సీపీ కమల్‌హాసన్‌రెడ్డి చేరుకున్నారు, ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు.. తమ కుటుంబానికి సోదరి మరణం తీరని లోటు అని ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. తమ కుటుంబంలో ఎలాంటి గొడవలు లేవని, సోదరి కుటుంబం తరచుగా విహార యాత్రలకు వెళ్తూ ఉంటారని, తాజాగా కూడా అలాగే భావించామని పేర్కొన్నారు. గత 20 రోజులుగా వారితో సంబంధాలు లేవని అందుకే తమకెలాంటి అనుమానం రాలేదని తెలిపారు. సీపీ కమలాహాసన్ రెడ్డి మాట్లాడుతూ, ఈ ఘటనపై ఎలాంటి వివరాలు అందలేదని,పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని తెలిపారు. మిస్సింగ్ కేసు నమోదైందో తెలియాల్సి ఉందన్నారు. పూర్తి విచారణ తరువాత వివరాలు వెల్లడిస్తామన్నారు. -
ఇద్దరిని మింగిన చెరువు
నాన్నా నేను ఈత నేర్చుకుంటా.. అంటూ ఆ బాలుడు చెరువు ఒడ్డు నుంచి నీళ్లలోకి దిగాడు. అంతేఒక్కసారిగా మునిగిపోతూ.. నాన్న.. నాన్న అని కేకలు వేశాడు. కుమారుడిని కాపాడేందుకు తండ్రి కూడా చెరువులో దిగాడు. భయంతో తండ్రీకొడులకు ఒకరినొకరు గట్టిగా పట్టుకున్నారు. ఇద్దరూ మునిగిపోయారు. ఇటీవల ‘మిషన్ కాకతీయ’ పనులతో ఏర్పడిన పెద్ద పెద్ద గోతులు ఆ తండ్రీకొడుకుల ప్రాణాలు తీశాయి. సాక్షి, కారేపల్లి: కొడుకు చెరువులో మునిగిపోతుండగా కాపాడబోయి తండ్రి కూడా నీటిలో మునిగి ఇద్దరూ మృత్యువాత పడ్డ సంఘటన కారేపల్లి మండలం గుంపెళ్లగూడెం గ్రామంలో శని వా రం మధ్యాహ్నం చోటుచేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. మండల పరిధిలోని గుంపెళ్లగూడెం గ్రామానికి చెందిన పిప్పళ్ల సత్యనారాయణ (45), పిప్పళ్ల సులోచ న దంపతులకు కుమారుడు పిప్పళ్ల భరత్ (14), కుమార్తె శైలజ ఉన్నారు. భరత్ సమీప గ్రామం పేరుపల్లి హైసూ్కల్లో 9వ తరగతి చదువుతున్నాడు. శైలజ మణుగూరులోని ఓ హాస్టల్లో ఉంటూ 10వ తరగతి చదువుతోంది. సత్యనారాయణ దంపతులు గ్రామంలో ఇస్త్రీ షాపు నడుపుకుంటూ, రజక వృత్తి నిర్వహించుకుంటూ, కూలి పనులకు వెళ్తూ జీవనం సాగిస్తున్నారు. ఇద్దరు పిల్లలను పోషించుకుంటున్నారు. ఈ నెల 14వ తేదీన వారి ఎదురింట్లో వివాహ వేడుక జరిగింది. ఇంటిల్లిపాది వివాహవేడుకల్లో పాల్గొన్నా రు. శనివారం సత్యనారా యణ దంపతులు పెళ్లి ఇంటి బట్టలు ఉతికేందుకు సమీపంలోని మాధారం చెరువు అలుగు వద్దకు వెళ్లారు. స్వల్ప అనారోగ్యంతో పాఠశాలకు వెళ్లకుండా ఇంటివద్ద ఉన్న భరత్ కూడా వారితోపాటు వెళ్లాడు. పనిలో అమ్మానాన్నలకు సాయం చేశా డు. బట్టలు ఉతకటం పూర్తయ్యాక ఈత నేర్చుకుంటానంటూ చెరువు ఒడ్డు నుంచి నీటిలోకి దిగాడు. ఇటీవల మిషన్ కాకతీయ పథకంలో చేపట్టిన పనులతో చెరువు అలుగు వద్ద పెద్ద పెద్ద గొయ్యిలు ఏర్పడ్డాయి. దీంతో బాలు డు ప్రమాదవశాత్తు జారి నీటిలో మునిగి పోతూ.. ‘నాన్న నాన్న’అని కేకలు వేశాడు. అక్కడే ఉన్న తండ్రి.. కొడుకును కాపాడేందుకు చెరువులో దిగాడు. భయంతో ఒకరునొకరు గట్టిగా పట్టుకోవడం, తండ్రికి ఈతవచ్చినా.. ఈతకొట్టే వీలుకాక పోవటంతో..ఇద్దరూ నీటిలో మునిగి పోయారు. దీంతో తల్లి ఓ కొడుకో..! ఓ దేవుడో..!! అంటూ కేకలు వేసింది. కేకలు విన్న గ్రామ యువకులు పరుగు పరుగున వచ్చి చెరువులోకి దిగారు. అర్ధగంటపాటు గాలింపు చేపట్టారు. చెరువు అడుగుకు చేరిన తండ్రీ కొడుకులను ఒడ్డుకు చేర్చారు. అప్పటికే ఇద్ద రూ మృతి చెందారు. కళ్ల ముందే భర్త, కుమారుడు విగత జీవులుగా మారడంతో సులోచన కన్నీరుమున్నీరుగా విలపించింది. కొడుకు మృతదేహం పై పడి ‘ఒక్కసారి లే కొడకా..! ఓ దేవుడా నా కొడుకుకు ఊపిరి ఊదు దేవుడా..!! అంటూ రోదిస్తున్న తీరు గ్రామస్తులను కంటతడి పెట్టించింది. ఘటన స్థలాన్ని సింగరేణి సీఐ బి శ్రీనివాసులు, ఎస్ఐ పొదిల వెంకన్న, ఆర్ఐ సక్రు, వీఆర్వో నాగలక్ష్మి సందర్శించారు. పంచనామా నిర్వహించారు. పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాలను ఇల్లెందు ప్రభుత్వాస్పత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. ఒకే ఇంట్లో ఇద్దరి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. -
ఆడుకోవడానికి వెళ్లి మృత్యు ఒడిలోకి..
సాక్షి, చెన్నారావుపేట: చిన్నారులతో ఆడుకుంటూ ప్రమాదవశాత్తు ఎస్సారెస్పీ డీబీఎం–40 కాల్వలో పడి బాలుడు మృతి చెందిన ఘటన వరంగల్ రూరల్ జిల్లా చెన్నారావుపేట మండలంలోని కాల్నాయక్తండాలో ఆదివారం చోటు చేసుకున్నది. ఇదే గ్రామానికి చెందిన గుగులోతుఈరు–భద్రమ్మ దంపతుల కుమారుడు గుగులోతు సాత్విక్(6) మండల కేంద్రంలోని ఓ ప్రయివేట్ పాఠశాలలో నర్సరీ చదువుతున్నాడు. ఆదివారం సెలవు కావడంతో తల్లిదండ్రులు వ్యవసాయ పనులకు వెళ్లారు. దీంతో పిల్లలు ఇంటి వద్దనే ఉన్నారు. కాల్నాయక్తండా మీదుగా ఎస్సారెస్పీ డీబీఎం–40 కాల్వలో ఆటలు ఆడుకుంటూ ప్రమాదశాత్తు అందులో పడి అక్కడికక్కడే మృతి చెందాడు. తండావాసులు గమనించి సాత్విక్ మృతదేహాన్ని బయటికి తీశారు. కుమారుడి మృతితో తల్లి దండ్రులు రోదిస్తున్న తీరు పలువురిని కంటతడి పెట్టించింది. సర్పంచ్ బాదావత్ రజిత, వీరన్న నాయక్‌లు నివాళులు అర్పించి కటుంబసభ్యులను పరామర్శించి ఓదార్చారు. -
ప్రాణం తీసిన కొండ కాలువ
తూర్పుగోదావరి, మారేడుమిల్లి: ప్రకృతి ఒడిలో సేద తీరుదామని విహార యాత్రకు వచ్చిన ఓ కుటుంబంలో పెను విషాదం మిగిలింది. సరదాగా కొండ కాలువలో స్నానాకి దిగి ఓ యువకుడు ఊబిలో కూరుకుపోయి మృత్యవాత పడ్డాడు. రాజమహేంద్రవరం నుంచి 14 మందితో కూడిన కుటుంబ సభ్యులు శనివారం మారేడుమిల్లి విహార యాత్రకు వచ్చారు. అక్కడ నుంచి ప్రసిద్ధ పర్యా టక ప్రదేశమైన గుడిసె గ్రామానికి రెండు వాహనాల్లో తరలి వెళ్లారు. శనివా రం రాత్రి అక్కడ బస చేసి, ఆదివారం తిరిగి మారేడుమిల్లి వస్తుండగా మార్గ మధ్యంలోని ఆకుమామిడి కోట సమీపంలో సంగువ కొండ కాలువలో స్నానానికి దిగారు. స్నానాలు చేస్తుండగా వారిలో సూరపురెడ్డి నిఖిల్æగోపి (23) కాలులోని ఊబిలో కూరుకుపోయాడు. మిగిలిన వారు అతడిని ఊబిలోంచి బయటకు తీసి, మారేడుమిల్లి పీహెచ్‌సీకి తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే అతడు మృతి చెందినట్టు ధ్రువీకరించారు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహన్ని పోస్టుమార్డం నిమిత్తం రంపచోడవరం ఏరి యా ఆస్పత్రికి తరలించారు. అప్పటి వరకూ తమ కళ్ల ముందు ఆనందంగా కేరింతలు కొట్టిన కుమారుడు మృతి చెందటంతో తల్లిదండ్రులు, బంధువు లు కన్నీరుమున్నీరయ్యారు. వారిని ఓదార్చడం ఎవరి వల్ల కాలేదు. మృతుడు నిఖిల్గోపి బీటెక్ పూర్తి చేసి ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నాడు. రాజహేంద్రవరం ఏవీ అప్పారావు రోడ్డు ప్రాంతానికి చెందిన సూరపురెడ్డి నాగేశ్వరరావుకు ఇద్దరు కుమారు కాగా, మృతుడు నిఖిల్ పెద్ద కుమారుడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై రామకృష్ణ తెలిపారు. -
తల్లిని కాపాడబోయి తనయుడు మృతి
కరీంనగర్, హుజూరాబాద్‌రూరల్: తల్లిని కాపాడబోయి తనయుడు మృతిచెందిన విషాద సంఘటన ధర్మరాజుపల్లిలో చోటుచేసుకుంంది. తలకొరివి పెడతాడని అనుకున్న కుమారుడు తనకళ్ల ముందే కానరాని లోకాలకు వెళ్లడంతో కన్నీరుమున్నీరుగా విలపించిన తల్లిని చూసి పలువురు కంటతడిపెట్టుకున్నారు. గ్రామస్తులు, పోలీసులు, కుటుంబసభ్యులు వివరాల ప్రకారం..గ్రామానికి చెందిన సారయ్య–సారమ్మలకు నలుగురు సంతానం. ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తె ఉన్నారు. వీరి చిన్న కొడుకు జక్కు రవి(26)ని కూలీనాలీ చేస్తూ డిగ్రీ వరకు చదివించారు. ఉద్యోగాన్వేషణ చేస్తూనే తల్లిదండ్రులు చేసే చిరు వ్యాపారానికి చేదోడువాదోడుగా ఉంటున్నాడు. గోదావరిఖనికి చెందిన మెరుగు వెంకటేశం–పార్వతీల పెద్ద కూతురు అనూష(లావణ్య)ను నాలుగేళ్లక్రితం రవికి ఇచ్చి వివాహం చేశారు. వీరికి రెండేళ్ల కూతురు సాన్విక ఉంది. భార్య అనూష పండుగకు పుట్టింటికి వెళ్లింది. గ్రామ శివారులోని డీబీఎం–18బీ ఎస్సారెస్పీ కాలువలో నీళ్లు వస్తుండడంతో బట్టలు ఉతికేందుకు తల్లి సారమ్మను తీసుకొని రవి బైక్‌పై కాలువ గట్టు వద్దకు వెళ్లాడు. కాలువలోకి దిగి బట్టలు ఉతికేందుకు తల్లికి సహకారం అందిస్తున్న సమయంలో ఓ చీరె నీటి ప్రవాహానికి కొట్టుకుపోవడాన్ని గమనించిన తల్లి దాన్ని పట్టుకునేందుకు ప్రయత్నించింది. దీంతో నీటిలో పడిపోతుండగా రవి కాపాడబోయాడు. ఈ క్రమంలో రవి కాలువలోపడిపోయాడు. ఈతరాకపోవడంతో నీటి ప్రవాహానికి కొట్టుకుపోయాడు. ఈ సమయంలో తల్లి సారమ్మ కేకలువేయగా సమీప పొలాల్లో పని చేస్తున్న రైతులు, కూలీలు గమనించి రవిని రక్షించే ప్రయత్నం చేయగా అప్పటికే మృతిచెందాడు. మృతదేహాన్ని చూసిన కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. రవి మృతితో భార్య అనూష, కూతురు సాన్విక ఒంటరయ్యారు. మృతుడి సోదరుడు భిక్షపతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు టౌన్ సీఐ మాధవి తెలిపారు. -
ప్రాణం తీసిన ఫిట్స్!
కశింకోట (అనకాపల్లి): ఫిట్స్ వ్యాధి విద్యార్థి ప్రాణం తీసింది. కన్నవారికి గర్భశోకాన్ని మిగిల్చింది. ఈ విషాద సంఘటన గొబ్బూరు గ్రామంలో చోటుచేసుకుంది. పోలవరం కాలువలో మునిగి చందక దేవికుమార్(14) చనిపోయాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గొబ్బూరు గ్రామానికి చెందిన చందక రాము, పద్మ దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కొడుకు దేవికుమార్ నరసింగబిల్లి ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. ఆదివారం గ్రామ సమీపంలోని పోలవరం కాలువ ప్రాంతానికి బహిర్భూమికి వెళ్లాడు. అనంతరం కాలువలో దిగిన సమయంలో ఫిట్స్ వ్యాధి రావడంతో నీటిలో పడిపోయి మునిగి అక్కడికక్కడే మృతి చెందాడు. అటుగా వెళ్తున్నవారు చూసి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. కుమారుడు మృతితో కన్నవారు కన్నీరుమున్నీరుగా రోదించిన తీరు స్థానికులను కలచి వేసింది. ఈ ఘటనపై అందిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు.. దేవికుమార్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్టు ఎస్సై రాజు తెలిపారు. -
వాగు మధ్యలో చిక్కుకొన్న దంపతులు
రాజవొమ్మంగి (రంపచోడవరం): రోజూ మాదిరిగానే పొలం నుంచి వాగు దాటి ఇంటికి వస్తున్న రాజవొమ్మంగి మండలం నెల్లిమెట్ల గ్రామానికి చెందిన ముర్రం రాజబాబు, దేవమ్మలు అనుకోని రీతిలో వాగు మధ్యలో చిక్కుకొన్నారు. వారు ఇరువురు వాగు మధ్యలో గల ఓ చెట్టు ఆసరా చేసుకొని వాగు ఉధృతి తగ్గే వరకు దాదాపు రెండు గంటల పాటు ఆ చెట్టుపైనే వేచి ఉండి చివరికి గ్రామానికి చెందిన యువకుల సహాయంతో క్షేమంగా ఇంటికి చేరారు. ఆదివారం రాత్రి జరిగిన ఈ సంఘటనపై ప్రత్యక్షసాక్షుల కథనమిది.. రాజబాబు, దేవమ్మలు పొలం పనులు ముగించుకొని తిరిగి ఇంటికి వస్తు రోజు మాదిరిగానే తమ గ్రామానికి సమీపాన గల మడేరు వాగు దాటసాగారు. అప్పటికే అదే గ్రామానికి చెందిన కొంత మంది వాగుదాటి అవలివైపు చేరుకోగా రాజబాబు, దేవమ్మలు కూడా వాగు దిగారు. అయితే వారు వాగు మధ్యలోకి వచ్చేసరికి ఉన్నట్టుండి ఉప్పొంగడం గమనించిన దేవమ్మ వాగుమధ్యలో గల చెట్టు పట్టుకొని వాగు ఉధృతి తగ్గే వరకు ఆగుదామని భర్తను కోరింది. దీంతో ఆ చెట్టుపైనే వారిద్దరూ కాసేపు వుండిపోయారు. ఇది తెలుసుకొన్న స్థానిక యువకులు ఈకా నాగరాజు, నయిన రమేష్, పూసం పండుదొర, ముర్రం మల్లుదొరలు హుటాహుటిన వాగు వద్దకు వెళ్లి రాజుబాబు, దేవమ్మలకు తాళ్లు అందజేశారు. వారిని సురక్షితంగా వాగు దాటించడంతో అందరూ ఊపిరి పీల్చుకొన్నారు. సంఘటన స్థలానికి స్థానిక సీఐ నాగదుర్గారావు, ఎస్సై వినోద్ వచ్చి ఆరా తీసి ఎవరికి ప్రమాదం జరగలేదని నిర్ధారించుకొని వెనుదిరిగారు. స్థానికంగా వర్షాలు కురవకపోయినా ఎగువన కురిసే వానలకు ఈ వాగు ఉన్నట్టుండి పొంగుతోంని, ఇది తమకు అలవాటైపోయిందని స్థానికులు అంటున్నారు. గ్రామసమీపాన గల ఈ వాగుపై తాళ్ల వంతెన నిర్మించి తమ ఇబ్బందులు తొలగించాలని వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఇదిలా ఉండగా వాగు మధ్యలో చిక్కుకొన్న ముర్రం రాజుబాబు లాగరాయి పీహెచ్సీలో ఎంపీహెచ్‌ఏగా పనిచేస్తున్నాడు. -
కింద పెద్దవాగు.. పైన కాకతీయ కాలువ..
మోర్తాడ్(బాల్కొండ): ప్రకృతి అందించిన పెద్దవాగు ప్రవాహానికి బ్రేక్ పడకుండా కాకతీయ కాలువ ద్వారా నీటి తరలింపునకు ఆటంకం లేకుండా అక్విడెక్ట్ నిర్మాణాన్ని పూర్తి చేసిన ఇంజినీర్ల శ్రమ ఎంతో గొప్పది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి కాకతీయ కాలువ ద్వారా విడుదల చేసే నీటి తరలింపు కోసం తొర్తి, వెంచిర్యాల్ మధ్యలో ఉన్న పెద్దవాగుపై అక్విడెక్ట్‌ను నిర్మించారు. కింద పెద్దవాగు, పైన కాకతీయ కాలువ చూడడానికి ఇదో అద్భుతంగా ఉంటుంది. ఇంజినీర్ల ప్రతిభకు అద్దంపట్టే అక్విడెక్ట్‌ను శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నిర్మాణ సమయంలోనే పూర్తిచేశారు. వర్షాకాలంలో పెద్దవాగు, కాకతీయ కాల్వలు రెండు ప్రవహించే సమయంలో పర్యాటకులను ఈ అక్విడెక్ట్ ఎంతో ఆకర్షిస్తుంది. డంగు సున్నం, కంకర, ఇనుము తది తర సామగ్రిని వినియోగించి అక్విడెక్ట్‌ను పూర్తి చేశారు. కాకతీయ కాలువ ద్వారా విడుదల చేసే నీటి ప్రవాహానికి అక్విడెక్ట్ తట్టుకుని ఉండే విధంగా లీకేజీలను ఏర్పాటు చేశారు. లీకేజీల వల్ల పెద్దవాగులో జలకళ సంతరించుకుని సా గునీటి సమస్యను కొంత మేర తీరుస్తుంది. నీటి తరలింపునకే కాకుండా రవాణాకు ఉపయోగపడే విధంగా అక్విడెక్ట్‌ను నిర్మించారు. అక్విడెక్ట్ కు రెండువైపులా వాహనాలు వెళ్లే విధంగా మా ర్గం ఉంది. దీంతో ఈ మార్గంలో ప్రయాణించేవారికి అక్విడెక్ట్‌ను దాటడం సులభంగానే ఉంది. అక్విడెక్ట్‌కు చిన్న చిన్న మరమ్మతులు అవసరం ఉన్నాయి. అయితే అక్విడెక్ట్ నిర్మించి ఐదు దశాబ్దాలు దాటినా ఈ నిర్మాణం చెక్కు చెదరకుండా ఉండడంతో అప్పటి ఇంజినీర్ల ప్రతిభకు తార్కాణంగా నిలుస్తుందని చెప్పవచ్చు. టెక్నాలజీ తోడవడంతో అద్భుత ఆవిష్కరణలు దేశ ప్రగతిలో ఇంజినీర్ల పాత్ర చాలాకీలకం. శాస్త్ర, సాంకేతిక రంగంలో వచ్చిన విప్లవాత్మక మార్పులు, ఇంజినీరింగ్ రంగానికి తోడు కావడంతో సాగునీటి ప్రాజెక్టుల ఆవిష్కరణలో ఆద్భుత ఫలితాలు సాధించుకుంటున్నాం. గోదావరి నదిపై చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టును మూడేళ్లలో పూర్తి చేయడంలోనే తెలంగాణ ఇంజినీర్ల ప్రతిభ ప్రపంచానికి తెలిసింది. ఇంజినీరింగ్ రంగంలో అద్భుత ఆవిష్కరణలు చోటు చేసుకుంటున్నాయి. – మధుకర్ రెడ్డి, ఈఈ నీటిపారుల శాఖ ప్రాజెక్టు డివిజన్, బోధన్ -
అయ్యో..పాపం పసికందు..!
సాక్షి, గజపతినగరం రూరల్: ఏ తల్లి కన్నదో ఆ బిడ్డను. నవమాసాలు మోసి... ప్రసవవేదన అనుభవించి... చివరకు జన్మనిచ్చింది. కానీ ఆ బిడ్డ వారికి బరువైందో... మృతశిశువును కన్నదో... పుట్టిన బిడ్డ ఊపిరాగిందో... లేక ఏ ప్రబుద్ధుడి మోసానికి బలై అన్యాయంగా తల్లిగా మారిందో... కానీ ఓ మగబిడ్డను నిర్దాక్షిణ్యంగా రోడ్డు పక్కన కాలువలో పడేశారు. నీటిలో తేలియాడితూ పసికందు మృతదేహం మంగళవారం ఉదయం వెలుగు చూసింది. గజపతినగరం రైల్వేస్టేషన్ సమీపంలో జాతీయ రహదారి వద్ద చిన్న పాటిగా ఉన్న లోతట్టు ప్రాంతంలోని నీటిలో తేలియాడుతున్న ఆ పసికందు మృతదేహాన్ని స్థానికులు గుర్తించి మధుపాడ వీఆర్ఓ దాసరి అప్పలరాజుకు సమాచారం అందించారు. ఆయన గజపతినగరం పోలీస్ స్టేషన్‌కు తెలియజేయడంతో సీఐ విద్యాసాగర్, ఎస్ఐ సన్యాసినాయుడు అక్కడకు చేరుకొని మృతశిశువును పరిశీలించారు. అనంతరం ఆ మృతశిశువును శవపంచనామాకోసం తరలించారు. అయితే ఆ బిడ్డ మృతి చెంది మూడు లేదా నాలుగు రోజులు అయి ఉండవచ్చని ప్రాథమికంగా ఆస్పత్రిలో పరిశీలించిన గజపతినగరం సూపరింటెండెంట్ డాక్టర్ అరుణా దేవి తెలిపారు. కేసును నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ఎ.సన్యాసినాయుడు తెలిపారు. -
కాటేసిన కాలువ
ఇద్దరు చిన్నారులూ ఐదోతరగతి చదువుతున్నారు. మంచి స్నేహితులు. ఉదయం పాఠశాలకు వెళ్లి మధ్యాహ్నం సెలవుపెట్టారు. సరదాగా ఆటల్లో నిమగ్నమయ్యారు. సైకిల్‌పై గ్రామానికి కిలోమీటరు దూరంలో ఉన్న తోటపల్లి కుడి ప్రధాన కాలువ వద్దకు చేరుకున్నారు. దుస్తులు ఒడ్డున పెట్టి స్నానం కోసం దిగబోయారు. అంతే.. కాలువ రూపంలో మృత్యువు కాటేసింది. ఇద్దరినీ అందని లోకాలకు తీసుకుపోయింది. పిల్లలే సర్వస్వంగా బతుకుతున్న కుటుంబాలను విషాదంలోకి నెట్టేసింది. సాక్షి, చీపురుపల్లి రూరల్: చీపురుపల్లి పట్టణంలోని జి.అగ్రహారం గ్రామానికి చెందిన ఇజ్జరోతు సతీష్(9) ఖరీదు గౌరీ శంకర్(9) సోమవారం సాయంత్రం గ్రామ సమీపంలో ఉన్న తోటపల్లి కాలువలో పడి మృతిచెందారు. స్థానిక పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం... ఇద్దరు చిన్నారులు స్థానికంగా ఉన్న వేర్వేరు ప్రైవేటు పాఠశాలల్లో ఐదోతరగతి చదువుతున్నారు. ఉదయం పాఠశాలకు వెళ్లారు. మధ్యాహ్న భోజనానికి ఇంటికి వచ్చిన వీరు పాఠశాలకు సెలవుపెట్టారు. ఆటల్లో నిమగ్నమయ్యారు. సాయంత్రం 3 గంటల సమయంలో సైకిల్‌పై తోటపల్లి కాలువ వైపు వెళ్లారు. ఇద్దరూ దుస్తులు తీసి ఒడ్డున పెట్టారు. స్నానానికి దిగబోయి కాలువలో పడిపోయారు. ఈత రాకపోవడంతో మునిగిపోయారు. ఇద్దరు చిన్నారుల్లో ఒకరి మృతదేహం కాలువలోని నీటిలో తేలి ఉండడాన్ని అటువైపుగా వస్తున్న రైతులు గమనించారు. గ్రామస్తులకు సమాచారం అందించారు. దీంతో స్థానికులు దిగి విద్యార్థి మృతదేహాన్ని బయటకు తీశారు. ఒడున రెండు జతల దుస్తులు కనిపించడంతో మరో విద్యార్థి ఉండొచ్చని భావించి కాలువలో దిగి వెతికారు. కాలువలోని బురదలో కూరుకుపోయిన మరో చిన్నారి మృతదేహం కనిపించడంతో గగ్గోలు పెడుతూ బయటకు తీశారు. ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం చీపురుపల్లి ప్రభుత్వాస్పత్రికి పోలీసులు తరలించారు. కేసు నమోదుచేసి దర్యాప్తుచేస్తున్నారు. మరణంలోనూ వీడని స్నేహం.. వారిద్దరు చిన్నారులు మంచి స్నేహితులు. ఒకటే వయస్సు. మృత్యువులోనూ స్నేహం వీడలేదు. మృతుల్లో సతీష్ తల్లిదండ్రులు శంకరరావు డ్రైవర్ కాగా తల్లి అరుణ ఉపాధి హామీ పథకంలో విధులు నిర్వహిస్తోంది. వీరికి సతీష్ ఒక్కడే కుమారుడు. ఒక్కగానొక బిడ్డను మృత్యువు కాటేయడంతో కన్నీరుమున్నీరవుతున్నారు. కుమారుడి మృతదేహాన్ని పట్టుకుని వారు విలపిస్తున్న తీరు అక్కడివారిని కంటతడి పెట్టించింది. మరో విద్యార్థి గౌరీ శంకర్ తల్లిదండ్రులు సత్యనారాయణ, కనకరత్నంలు అగ్రహారం గ్రామం రోడ్డు సమీపంలో చిన్నపాటి టిఫిన్ దుకాణం నడుపుకుంటూ కాలం గడుపుతున్నారు. వీరికి ఇద్దరు అమ్మాయిలు, ఒక కుమారుడు. అల్లారుముద్దుగా సాకుతున్న కుమారుడిని మృత్యువు కబళించడంతో భోరున విలపిస్తున్నారు. దేవుగా ఎందుకిలా చేశావు.. నీకు మేము ఏం అన్యాయం చేశావు... మా పిల్లలను తీసుకుపోయావంటూ ఏడ్చిన తీరు అక్కడివారిని కలచివేసింది. చిన్నారుల మృతితో గ్రామంలో విషాద చాయలు అలముకున్నాయి. -
నదిలో పడిన పెళ్లి వ్యాన్ : 7గురు చిన్నారులు గల్లంతు
సాక్షి, లక్నో: ఉత్తర్ ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. పెళ్లికి వెళ్లి తిరిగి వస్తోన్న ఎస్యూవీ ఒకటి అదుపు తప్పి కాలువలోకి పడిపోయింది. ఈ ప్రమాదంలో కొంతమందిని రక్షించగా, మరికొంతమంది చిన్నారులు గల్లంతయ్యారు. దీంతో వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనలో పడిపోయారు. లక్నోలో గురువారం ఉదయం ఘటన చోటు చేసుకుంది. పోలీసులు అందించిన సమాచారం ప్రకారం 29 మంది వేళ్లి వేడుకు హాజరైన తిరిగి వస్తుండగా వీరు ప్రయాణిస్తోన్న వాహనం నగ్రం పోలీస్ స్టేషన్ పరిధిలోని పట్వా ఖేరా వద్ద ఇందిర కాలువలో పడిపోయింది. గజ ఈతగాళ్లు 22 మందిని రక్షించగా మిగిలిన ఏడుగురు చిన్నారులు కనిపించకుండా పోయారు. ఎన్డీఆర్ఆఫ్ దళాలు వారి కోసం తీవ్రంగా గాలిస్తున్నాయని సీనియర్ పోలీసు అధికారి ఎస్కే భగత్ తెలిపారు. కాలువలో వలలను ఏర్పాటు చేయాల్సిందిగా ఆదేశించామన్నారు. వీరితోపాటు లక్నో నగరపాలక సంస్థ అధికారులు, పోలీసులు ఘటనాస్థలం వద్దే వుండి సహాయ చర్యలను పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు ఈ ఘటనపై ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులకు అన్ని రకాల సాయం అందించాల్సిందిగా అధికారులను ఆదేశించారు. SK Bhagat, IG Range Lucknow: A vehicle carrying around 29 people fell into the canal, around 22 people have been rescued so far, 7 children are still missing. Rescue operations by NDRF and local divers underway. pic.twitter.com/6apRZC4e4M — ANI UP (@ANINewsUP) June 20, 2019 -
గ్రావిటీ కాల్వ రెడీ!
కాళేశ్వరం: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులోని నీటిని తరలించే అతి ముఖ్యమైన గ్రావిటీ కాల్వ నిర్మాణం పూర్తయింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కన్నెపల్లి పంపుహౌస్ నుంచి అడవి మార్గంలో 13.341 కిలోమీటర్ల దూరం రూ.800 కోట్ల వ్యయంతో నిర్మించిన గ్రావిటీ కాల్వ ద్వారా ఈ ఖరీఫ్ నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని తరలించనున్నారు. ఈ గ్రావిటీ కాల్వ నిర్మాణాన్ని 30 స్ట్రక్చర్లతో అత్యాధునిక టెక్నాలజీని వినియోగించి అతి తక్కువ సమయంలో పూర్తి చేశారు. వచ్చే నెల నుంచి రాష్ట్రంలోని 37లక్షల ఎకరాలకు ఈ కాల్వ ద్వారా సాగునీరు సరఫరా కానుంది. భవిష్యత్‌లో 3 టీఎంసీల సాగునీరు తరలించేలా కాల్వ నిర్మాణం చేపట్టారు. ప్రస్తుతం కన్నెపల్లి పంపుహౌస్‌లో 7 మోటార్ల బిగింపు పూర్తి కాగా మరో 2 నిర్మాణ దశలో, మరో రెండు పురోగతిలో ఉన్నాయి. అనతి కాలంలోనే పనులు పూర్తి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి 2016, మే 2న ముఖ్యమంత్రి కేసీఆర్ భూమి పూజ చేయగా.. అనతి కాలంలోనే పనులన్నీ పూర్తి చేసి నీటిని తరలించడానికి సిద్ధం చేశారు. కాళేశ్వరం వద్ద గోదావరి, ప్రాణహిత జలాలను వినియోగించి రాష్ట్రంలోని 37 లక్షల ఎకరాలకు సాగు నీరందించడానికి ఈ ప్రాజెక్టును రూపకల్పన చేయగా అటవీ, పర్యావరణ శాఖ అనుమతులకు సంబంధించి అడ్డంకులు త్వరగా తొలగిపోవడంతో గ్రావిటీ కెనాల్ (కాల్వ) పనులు పూర్తయ్యాయి. మేడిగడ్డ బ్యారేజీ వద్ద గోదావరికి అడ్డుకట్ట వేసి నిలిపిన నీటిని అప్రోచ్ కెనాల్ ద్వారా కన్నెపల్లి పంప్‌హౌస్‌లో అమర్చిన 11 మోటార్ల సాయంతో రివర్స్ పంపింగ్ ద్వారా తరలించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. పంప్‌హౌస్ నుంచి 1.5 కిలోమీటర్ల దూరం పైపులైన్ పూర్తయింది. ఈనెల 4న సీఎం కేసీఆర్ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన సందర్భంగా జూలై నుంచి నీటిని తరలించడానికి సమన్వయంతో పనిచేయాలని కాంట్రాక్టర్లు, ఇంజనీర్లకు మార్గనిర్దేశం చేశారు. దీంతో పనుల్లో వేగం మరింత పెరిగింది. పర్యాటక అభివృద్ధికి అడుగులు ఈ గ్రావిటీ కాల్వ పొడవునా అందమైన రిసార్ట్సు, గెస్ట్‌హౌస్‌ల నిర్మాణానికి పర్యాటక శాఖ అడుగులు వేస్తుంది. ఇప్పటికే ఓ ప్రత్యేక బృందం హైదరాబాద్ నుంచి వచ్చి పరిశీలించి ప్రణాళికలు తయారు చేసింది. త్వరలో బోటింగ్ పాయింట్స్ కూడా పెట్టనున్న ట్లు తెలిసింది. దీనికి అనుగుణంగా పర్యాటకులకు ఆ హ్లాదాన్ని అందించడానికి ప్రభుత్వం ఆలోచిస్తుంది. కాల్వ నిర్మాణం ఇలా.. కన్నెపల్లి పంప్‌హౌస్ నుంచి అన్నారం వరకు 13.341 కిలోమీటర్ల వరకు అడవిలో కాల్వ 150–250 మీటర్ల వెడల్పు.. అడుగు భాగంలో 76 మీటర్లతో నిర్మాణం చేపట్టారు. రోజుకు 2 టీఎంసీల నీటిని తరలిస్తే కాల్వలో 5.5 మీటర్ల నీరు ప్రవహిస్తుంది. అదే 3 టీఎంసీలు తరలిస్తే 7.5 మీటర్ల నీరు వెళ్లేలా కాల్వ లైనింగ్ పూర్తి చేశారు. అధునాతన పద్ధతులతో 30 స్ట్రక్చర్లు గ్రావిటీ కాల్వలో 30 స్ట్రక్చర్లు నిర్మాణం చేపట్టారు. ప్రత్యేకమైన ఏడు పద్ధతులతో దీనిని నిర్మించారు. ఇందులో డీఎల్ఆర్ వంతెనలు 4, అండర్ టన్నెల్ వంతెనలు 8, ఎకో వంతెనలు 5, సూపర్స్పాసేజ్ వంతెనలు 5, ఇన్లెట్ వంతెనలు 6, పైపులైన్ వంతెన 1, డ్రాప్స్ వంతెన ఒకటి నిర్మించారు. సూపర్ స్పాసేజ్ వంతెనల ద్వారా అడవుల నుంచి, వాగుల ద్వారా పారే కాల్వ ల నీటిని ఇతర చెరువులకు తరలిస్తారు. అండర్ టన్నెల్ వంతెనల ద్వారా కాల్వ కింద ఉన్న బెడ్ నుంచి నీటిని తరలిస్తారు. ఇన్లెట్ వంతెనల ద్వారా చిన్న వర్షాలకు వచ్చే నీటిని యథావిధిగా కాల్వ గుండా తరలిస్తారు. ఎకో వంతెనలు అడవుల్లోని వన్యప్రాణులు ఇటు నుంచి అటు తిరగడానికి వీలుగా నిర్మించారు. వాటికి అనుగుణంగా అక్కడక్కడా చెట్ల పెంపకం చేపట్టనున్నారు. కాల్వను పరిశీలించడానికి ఇరువైపుల రోడ్డు నిర్మాణం జరుగుతోంది. ఎడమ వైపు 5.5, కుడి వైపు 1.8 కిలోమీటర్లు పూర్తయింది. -
పశ్చిమ డెల్టా ప్రధాన కాలువకు గోదావరి నీరు విడుదల
-
సాగునీటికి గండి
పశ్చిమగోదావరి , చింతలపూడి : ఆంధ్రా కాలువకు మరమ్మతులు చేపట్టకపోవడంతో ఈ ఏడాది సాగునీటి కష్టాలు తప్పవని రైతులు ఆందోళన చెందుతున్నారు. 2012లో నీలం తుపానుకు పడిన గండిని సంబంధిత అధికారులు ఇంత వరకూ పూడ్చలేదు. దీంతో ఇప్పటికే మెరక తేలి పూడిక, ముళ్ల పొదలతో పూడుకుపోయిన ఆంధ్రా కాలువ కొంతకాలానికి కనుమరుగు అవుతుందేమోనని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 11 వేల ఎకరాలకు సాగునీరు చింతలపూడి మండలంలోని 21 చెరువులకు సాగు నీరు అందించడానికి ఖమ్మం జిల్లా తుమ్మూరు వద్ద ఆనకట్ట నిర్మించారు. అక్కడి నుంచి వరద నీటిని సాగునీటి చెరువులకు మళ్లిస్తారు. 1967లో 18 కిలోమీటర్ల పొడవున కాలువను నిర్మించారు. ఈ కాలువల ద్వారా మండలంలో దాదాపు 11 వేల ఎకరాలకు ఏటా సాగునీరు అందుతోంది. అయితే అధికారులు, ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం కారణంగా ఆంధ్రా కాలువ పూడుకుపోయి సాగు నీటి సరఫరాకు అంతరాయంగా మారింది. దీంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాలువకు గండ్లు దీనికి తోడు మైనర్ ఇరిగేషన్ పరిధిలోని ఈ కాలువకు వర్షాకాలం సమయంలో అనేకసార్లు గండ్లు పడటం, మరమ్మతులు చేయడం ఆనవాయితీగా వస్తోంది. గతంలో నీలం తుపానుకు మండలంలోని గణిజర్ల గ్రామం వద్ద ఆంధ్రాకాలువకు పెద్ద గండి పడింది. ఆంధ్రా కాలువకు పడిన గండిని తక్షణం పూడ్చాలని రైతులు, ప్రజలు ఎప్పటికప్పుడు విజ్ఞప్తి చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. గతంలో కూడా సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు గండి పూడ్చివేతలో లక్షలాది రూపాలయలు దండుకుంటున్నారే తప్ప పూర్తిస్థాయిలో శాశ్వత చర్యలు చేపట్టలేదని పలువురు ఆరోపిస్తున్నారు. ఏటా ఇదే ప్రాంతంలో గండి పడుతుండటంతో అధికారులకు, కాంట్రాక్టర్లకు కాసుల పంట కురుస్తుందని విమర్శలు వస్తున్నాయి. ఈ వేసవిలో నిధులు మంజూరు చేసి మరమ్మతులు చేపట్టకపోతే ఆంధ్రా కాలువ నుంచి వచ్చే వరదనీరు వృథాగా పోయే ప్రమాదం ఉందని ఈ ప్రాంత రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు శాశ్వత ప్రాతిపదికన పటిష్టంగా మరమ్మతులు చేపట్టాలని, ఆంధ్రకాలువ పూడికతీత పనులను చేపట్టాలని రైతులు, ప్రజలు కోరుతున్నారు. -
క్షణక్షణం.. భయం భయం
శ్రీకాకుళం , రేగిడి: మండల పరిధిలోని కందిశ వద్ద ఉన్న మడ్డువలస ప్రధాన కుడికాలువపై నిర్మించిన బ్రిడ్జి శిథిలావస్థకు చేరుకుంది. దీంతో క్షణక్షణం భయం భయంగా మారింది. ప్రాజెక్టు కుడికాలువ నిర్మాణ సమయంలో పదిహేనేళ్ల క్రితం బ్రిడ్జిని నిర్మించారు. నిత్యం కాలువ ద్వారా నీరు ప్రవహించినప్పటికీ బ్రిడ్జికి ఏ రకమైన ఇబ్బంది ఏర్పడలేదు. గ్రామ సమీపంలో ఉన్న నాగావళిలో ఇసుక ర్యాంపును ఏర్పాటుచేసి రాత్రుళ్లు అక్రమంగా ట్రాక్టర్లు, లారీలతో ఈ బ్రిడ్జిపై నుంచే వాహనాలు వెళ్తుండేవి. దీంతో బ్రిడ్జి నిర్మాణం పటుత్వం పూర్తిగా కోల్పోయింది. బ్రిడ్జికి వేసిన శ్లాబ్ పూర్తిగా పెచ్చులు రాలిపోతుంది. బ్రిడ్జికి వేసిన పిల్లర్లకు కూడా పగుళ్లు ఏర్పడడంతో ఏ క్షణమైన కూలిపోయే ప్రమాదం లేకపోలేదని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. పైనుంచి బ్రిడ్జిని చూస్తే మేడిపండు చందంగా ఉంది. అధికారుల పర్యవేక్షణ కొరవడడంతో దీని పరిస్థితి ఇలా తయారైంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి తక్షణమే ఇసుక ట్రాక్టర్లను బ్రిడ్జిపై నుంచి వెళ్లనివ్వకుండా నిలుపుదల చేయడంతోపాటు తక్షణమే బ్రిడ్జికి అవసరమైన మరమ్మతులను చేపట్టాలని రైతులు, గ్రామస్తులు కోరుతున్నారు. -
పంట కాలువలోకి దూసుకుపోయిన కారు
-
భూ వివాదం నిండు ప్రాణం బలి
సాక్షి, జగ్గంపేట: భూ వివాదం నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. భార్య తరఫు భూమికి సంబంధించి గోనేడ గ్రామానికి చెందిన వారితో నెలకొన్న వివాదం హత్యకు దారితీసినట్టు తెలిసింది. పోలీసుల కథనం ప్రకారం.. జగ్గంపేట మండలం రామవరం శివారులో పిఠాపురం మండలం మంగుతుర్తికి చెందిన పేకేటి పేర్రాజు అనే రాజా (56) మృతదేహాన్ని పంట కాల్వలో పోలీసులు బుధవారం గుర్తించారు. పెద్దాపురం డీఎస్పీ రామారావు, సీఐ రాంబాబు, ఎస్సై రామకృష్ణ, సిబ్బంది మృతదేహాన్ని బయటకు వెలికి తీయించడంతో ఒంటి నిండా తీవ్ర గాయాలు గుర్తించారు. హత్య చేసి కాల్వలో పడేసి ఉంటారని ప్రాథమికం అంచనాకు వచ్చారు. పేర్రాజుకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. కాకినాడలో మకాం ఉంటున్నారు. గతంలో ఎన్‌ఎఫ్‌సీఎల్‌లో పనిచేసి ఉద్యోగం మానేశాడు. మాజీ ఎంపీ దివంగత తోట సుబ్బారావుకు వరసకు మేనల్లుడయ్యే పేర్రాజుకు భార్య తరఫున భూమి జగ్గంపేట మండలం రామవరంలో ఉంది. ఈ భూమిపై కిర్లంపూడి మండలం గోనేడకు చెందిన వారితో వివాదం నెలకొంది. బుధవారం ఉదయం కాకినాడ నుంచి తన కారులో రామవరం పొలం వద్దకు వచ్చారు. కారు రోడ్డు పక్కన పెట్టి పొలం వద్ద లోపలకు వెళ్లగా అక్కడ చోటు చేసుకున్న వివాదంలో పేర్రాజుపై దాడి చేసి తీవ్రంగా గాయపరచి పంట కాల్వలో విడిచిపెట్టి వెళ్లిపోయి ఉంటారని భావిస్తున్నారు. సంఘటన గురించి తెలుసుకున్న పోలీసులకు పొలం సమీపంలో ఉదయం పూట ఉన్న వారిని విచారిస్తున్నారు. దివంగత మాజీ ఎంపీ తోట సుబ్బారావు కుమారుడు సర్వారాయుడు సంఘటన స్థలం వద్దకు చేరుకుని భూ వివాదం గురించి పోలీసులకు వివరించారు. ఫిర్యాదు మేరకు హత్య కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, హంతకులు పరారీలో ఉన్నట్టు సీఐ రాంబాబు తెలిపారు. మృతదేహాన్ని పెద్దాపురం ప్రభుత్వాస్పత్రికి పోస్టుమార్టం కోసం తరలించామన్నారు.