కెనాల్‌లో గుర్తు తెలియని మృతదేహం | Unidentified body found in canal | Sakshi
Sakshi News home page

కెనాల్‌లో గుర్తు తెలియని మృతదేహం

Published Wed, Mar 29 2017 9:52 PM | Last Updated on Wed, Apr 3 2019 5:32 PM

Unidentified body found in canal

పెద్దవడుగూరు: మండలంలోని లక్ష్ముంపల్లి సమీపంలో గల కెనాల్‌ లో ఓ గుర్తు తెలియని వ్యక్తి(50) మృతదేహాన్ని బుధవారం కనుగొన్నట్లు ఎస్‌ఐ రమణారెడ్డి తెలిపారు. పది రోజుల సదరు వ్యక్తి కెనాల్‌లో పడి మరణించి ఉండొచ్చని భావిస్తున్నారు. మృతదేహాన్ని కుక్కలు పీక్కుతిన్నాయి. ఘటనా స్థలంలో ఎయిడ్స్‌కు సంబంధించిన మాత్రల డబ్బా లభించడంతో మృతుడు ఎయిడ్స్‌ వ్యాధితో బాధపడుతూ తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్మకు పాల్పడి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. లేదా వడదెబ్బ తగిలి స్పృహ కోల్పోయి మృతి చెంది ఉండొచ్చని కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మృతదేహం కుళ్లిపోవడంతో పామిడి పీహెచ్‌సీ డాక్టర్‌ లింగేశ్వర్‌ను అక్కడికే పిలిపించి పోస్టుమార్టం చేయించారు. మృతుడు బూడిద కలర్‌ నిక్కర్, నలుపు, తెలుపు పట్టీల లుంగీ, మెంతు రంగు కలర్‌ చారలు గల చొక్కా ధరించినట్లు ఎస్‌ఐ తెలిపారు. కేసు దర్యాప్తులో ఉంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement