available
-
కిలో ఉల్లి రూ. 35.. ఎక్కడంటే?
న్యూఢిల్లీ: దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఉల్లి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. పండుగల సీజన్లో ఉల్లికి మరింత డిమాండ్ ఉంటుంది. దీనిని గుర్తించిన ప్రభుత్వం ఉల్లి ధరలను నియంత్రించేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది.ఢిల్లీలో ఉల్లి ధరలు మండుతున్న నేపధ్యంలో ప్రభుత్వం మహారాష్ట్ర నుంచి ఉల్లిని భారీగా దిగుమతి చేసుకుంది. మహారాష్ట్ర నుంచి ఉల్లిపాయల లోడుతో బయలు దేరిన కందా ఎక్స్‌ప్రెస్ రైలు ఢిల్లీకి చేరుకుంది. ఈ ఉల్లిని ఢిల్లీలోని ఎన్సీసీఎఫ్, ఎన్‌ఏఎఫ్‌ఈడీలతో పాటు వ్యాన్ల ద్వారా ప్రభుత్వం కేజీ రూ. 35కు విక్రయిస్తోంది. ఢిల్లీ రిటైల్ మార్కెట్లో ఉల్లి ధర కిలో 75 రూపాయలకు చేరుకుంది. దీంతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.దీపావళికి ముందుగానే ఉల్లి ధరలను నియంత్రించేందుకు భారతీయ రైల్వే సహాయంతో ఢిల్లీలోని హోల్‌సేల్ మార్కెట్లకు 1,600 టన్నుల ఉల్లిపాయలను సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సెప్టెంబరు నెల నుండి ఉల్లిపాయలు, టమోటాలు, కూరగాయల ధరలు పెరిగాయి. దీంతో సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు.ఇది కూడా చదవండి: భారతీయులకు ఏ సీజన్ అంటే ఇష్టం? -
డెంగ్యూకు టీకా.. బీహార్‌లో తుది ట్రయల్స్
పాట్నా: డెంగ్యూ వ్యాధి నుంచి ప్రజలకు త్వరలో విముక్తి లభించనుంది. బీహార్‌లోని పట్నాలో డెంగ్యూ వ్యాక్సిన్ మూడో దశ క్లినికల్ ట్రయల్ ప్రారంభమైంది. ఇప్పటి వరకు ఆరుగురికి డెంగ్యూ వ్యాక్సిన్ వేశారు. త్వరలో 500 మందికి ఈ వ్యాక్సిన్‌ను ఇవ్వనున్నారు. ఈ వ్యాక్సిన్ తీసుకున్న వారిని రెండేళ్లపాటు శాస్త్రవేత్తల బృందం పరిశీలించనుంది.ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్‌కు చెందిన పాట్నాలోని రాజేంద్ర మెమోరియల్ మెడికల్ సైన్సెస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ క్లినికల్ ట్రయల్ నిర్వహిస్తోంది. దేశంలోనే పూర్తిగా తయారవుతున్న ఈ వ్యాక్సిన్ మూడో దశ ట్రయల్ సెప్టెంబర్ 26న ప్రారంభమైందని ఆర్‌ఎంఆర్‌ఐఎంఎస్ అధికారి ఒకరు తెలిపారు. ఐసీఎంఆర్, పనాసియా బయోటెక్ లిమిటెడ్ సంయుక్తంగా ఈ వ్యాక్సిన్‌ను తయారు చేసేందుకు కృషి చేస్తున్నాయి.వ్యాక్సిన్ పరీక్షల కోసం 10 వేల మందికి ముందుగా వ్యాక్సిన్ వేసి, వారి ఆరోగ్యాన్ని పర్యవేక్షించనున్నారు. డెంగ్యూ వ్యాక్సిన్‌ను పరీక్షించేందుకు దేశవ్యాప్తంగా 19 కేంద్రాలను ఎంపిక చేశారు. వాటిలో ఆర్‌ఎంఆర్‌ఐఎంఎస్ ఒకటి. ఒక్కో కేంద్రంలో సుమారు 500 మందికి ట్రయల్ వ్యాక్సిన్ వేయనున్నారు. కాగా బీహార్‌లో డెంగ్యూ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఈ ఏడాది 4,416 కేసులు నమోదయ్యాయి. 12 మంది డెంగ్యూ బాధితులు మృతిచెందారు. ఒక్క పట్నాలోనే 2,184 కేసులు నమోదయ్యాయి. ఇది కూడా చదవండి: బ్రెజిల్లో తుపాను బీభత్సం.. ఏడుగురు మృతి -
తగ్గనున్న ప్లాట్ఫారం టిక్కెట్ ధర
భారతీయ రైల్వేలు ప్రతిరోజూ లక్షలాది మంది ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేరవేస్తుంటాయి. త్వరలో రైల్వేశాఖ ప్రయాణికులకు శుభవార్త చెప్పనుంది. ఇది ప్రయాణికులకు ఉపశమనం కలిగించనుంది.ప్లాట్ఫారం టిక్కెట్ ధరను తగ్గించాలని రైల్వేశాఖ నిర్ణయించింది. ఇప్పటి వరకు ప్లాట్ఫారం టిక్కెట్ ధర రూ. 10గా ఉంది. దీని ధర రూపాయి తగ్గి రూ. 9 కానుంది. ఇది ప్రయాణికులకు ఊరట కలిగించనుంది. రైల్వే స్టేషన్ లోనికి వెళ్లాలంటే ఎవరైనా సరే ప్లాట్ ఫారం టిక్కెట్ తీసుకోవాల్సి ఉంటుంది. రైలు ప్రయాణానికి వెళ్లేవారు టిక్కెట్ తీసుకుంటారు కాబట్టి వారు ప్రత్యేకంగా ప్లాట్ఫారం టిక్కెట్ తీసుకోనవసరం లేదు. అయితే ఎవరినైనా రైలు నుంచి రిసీవ్ చేసుకునేందుకు రైల్వే స్టేషన్ లోనికి వెళ్లేవారు తప్పనిసరిగా ప్లాట్ఫారం టిక్కెట్ తీసుకోవాల్సి ఉంటుంది.ప్లాట్ఫారం టిక్కెట్ లేకుండా ఎవరైనా స్టేషన్‌లోనికి ప్రవేశిస్తే వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటారు. ఎందుకంటే ప్లాట్ఫారం టిక్కెట్ కూడా రైల్వేకు ఆదాయాన్ని సమకూర్చే మార్గాలలో ఒకటి. ప్రస్తుతం ప్లాట్ఫారం టికెట్ ధర రూ.10. అయితే జూన్ 22న జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ప్లాట్ఫారం టిక్కెట్లపై జీఎస్టీని తొలగిస్తున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు.ప్లాట్ఫారం టికెట్‌తో పాటు రిటైరింగ్ రూమ్, బ్యాటరీతో నడిచే కారు తదితర సేవల రుసుము నుంచి కూడా జీఎస్టీని తొలగించారు. దీంతో ఇప్పటి వరకూ ఉన్న 5శాతం ఉన్న జీఎస్టీ భారం ప్రయాణికులకు తగ్గనుంది. ఫలితంగా ప్లాట్ఫారం టిక్కెట్ ధర రూ. 10 నుంచి రూ. 9కి చేరనుంది. -
మంగళూరులో దాహం.. దాహం!
కర్నాటకలోని మంగళూరు ప్రజలు తాగునీటి ఎద్దడితో విలవిలలాడిపోతున్నారు. ఈ ప్రాంతానికి ప్రధాన నీటి వనరు అయిన నేత్రావతి నదిలో ఎక్కువ భాగం ఎండిపోవడంతోనే ఈ పరిస్థితి ఎదురయ్యింది. దీంతో మంగళూరు మునిసిపల్ కార్పొరేషన్ సిటీలో రోజు విడిచి రోజు వారీగా నీటిని సరఫరా చేయాలని నిర్ణయించింది.దక్షిణ కన్నడ జిల్లా డిప్యూటీ కమిషనర్ ముల్లై ముహిలన్ అధ్యక్షతన జరిగిన మంగళూరు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, ఇతర అనుబంధ శాఖల అధికారుల సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. దీనికి తోడు పట్టణ ప్రజలు నీటిని దుర్వినియోగం చేయకూడదని, గృహ అవసరాల కోసం కాకుండా ఇతర ప్రయోజనాల కోసం నీటిని వృథా చేయవద్దని అధికారులు కోరారు.గత ఐదేళ్లలో తొలిసారిగా మంగళూరు నగరం ఇటువంటి పరిస్థితిని ఎదుర్కొంటోంది. నైరుతి రుతుపవనాలు సకాలంలో వస్తే నీటి ఎద్దడి సమస్య తీరుతుందని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు. కర్నాటకలోని బెంగళూరు నగరం కూడా నీటి సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఈ నేపధ్యంలో బెంగళూరు వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు ఇటీవలే నగరంలోని స్విమ్మింగ్ పూల్స్‌లో తాగునీటి వినియోగాన్ని నిషేధించింది. దీనిని ఉల్లంఘిస్తే రూ. ఐదువేలు జరిమానా విధిస్తామని బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది. -
పిల్లలతో రైలు ప్రయాణం మరింత భారం!
వేసవి సెలవుల్లో పిల్లలతో రైలు ప్రయాణం చేయాలనుకుంటున్నారా? అయితే మీపై మరింత భారం పడనుంది. భారతీయ రైల్వే ప్రయాణ టిక్కెట్లపై ఐచ్ఛిక బీమా నిబంధనలలో పలు మార్పులు చేసింది. ఇకపై రైలు ప్రయాణంలో పిల్లలకు హాఫ్ టికెట్ తీసుకుంటే వారికి ఐచ్ఛిక బీమా ప్రయోజనం లభ్యకాదు.ఐఆర్సీటీసీ తెలిపిన వివరాల ప్రకారం ఇకపై పిల్లలకు పూర్తి టిక్కెట్ తీసుకుంటేనే బీమా సౌకర్యంలోని ప్రయోజనాన్ని పొందగలుగుతారు. మరోవైపు ఐఆర్సీటీసీ ప్రత్యామ్నాయ బీమా ప్రీమియంను కూడా పెంచింది. ఏప్రిల్ ఒకటి నుంచి ఒక్కో ప్రయాణికుడి ప్రీమియం 45 పైసలకు పెంచింది. గతంలో ఇది 35 పైసలు ఉండేది.ఐచ్ఛిక బీమా పథకం అందించే ప్రయోజనం ఈ-టికెట్లను బుక్ చేసుకునే ప్రయాణీకులకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. రైల్వే టికెట్ కౌంటర్ నుండి కొనుగోలు చేసే టిక్కెట్లపై ఈ బీమా పథకం వర్తించదు. ఆన్లైన్ లేదా ఈ-టికెట్‌ను కొనుగోలు చేసిన వారికే ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుంది. ఆన్లైన్లో టిక్కెట్లను బుక్ చేసేటప్పుడు వారు బీమా సౌకర్యాన్ని పొందాలనుకుంటున్నారా లేదా అనేది ఎంచుకోవాలి. ప్రయాణీకుడు బీమా సౌకర్యాన్ని పొందాలనుకుంటే, అతను ఆ ఎంపికపై క్లిక్ చేయాలి. అప్పుడు రైల్వే ప్రయాణీకుడి మొబైల్, ఈ-మెయిల్‌కు బీమా కంపెనీ నుండి సందేశం వస్తుంది.ఈ బీమా పథకం కింద రైల్వే ప్రయాణీకులు మరణిస్తే రూ.10 లక్షలు, పాక్షిక అంగవైకల్యం ఏర్పడితే రూ.7.5 లక్షలు, గాయాలపాలైతే చికిత్స కోసం కుటుంబానికి రూ.2 లక్షలు అందజేస్తారు. రైల్వే ప్యాసింజర్ ఐచ్ఛిక బీమా పథకాన్ని భారతీయ రైల్వే సెప్టెంబర్ 2016లో ప్రారంభించింది. -
జీడిపప్పుకు సవాల్ విసిరిన వెల్లుల్లి!
వెల్లుల్లి ధరలు విపరీతంగా పెరుగుతూ, జీడిపప్పుకు సవాల్ విసురుతున్నాయి. ఛత్తీస్‌గఢ్‌లోని వైకుంఠ్‌పూర్, మనేంద్రగఢ్, చిర్మిరి, ఖడ్గవాన్‌తో సహా పరిసర ప్రాంతాల్లో కిలో వెల్లుల్లిని రూ.400 నుండి రూ.600కు విక్రయిస్తున్నారు. నెల రోజుల క్రితం కిలో వెల్లుల్లి రూ.200కు విక్రయించగా, తరువాత అంతకంతకూ పెరుగుతూవస్తోంది. స్థానిక కూరగాయల వ్యాపారి రాజ్ కుష్వాహ తెలిపిన వివరాల ప్రకారం జనవరిలో కిలో వెల్లుల్లి ధర రూ.200 ఉండగా, ప్రస్తుతం రూ.600 దాటింది. కూరల రుచిని పెంచే వెల్లుల్లి ఇప్పుడు సామాన్యులకు అందుబాటులో లేకుండా పోయింది. ప్రస్తుతం జీడిపప్పు ధరలతో వెల్లుల్లి ధర పోటీ పడుతోందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. మార్కెట్లో కిలో జీడి పప్పు ధర రూ. 800 నుంచి 1000 మధ్య ఉంటోంది. ప్రభుత్వం వెల్లుల్లి ధరలను నియంత్రించే ప్రయత్నం చేయడంలేదని పలువురు విమర్శిస్తున్నారు. ఈసారి హోల్‌సేల్‌లో కూడా వెల్లుల్లి కిలో రూ.421 చొప్పున విక్రయిస్తున్నారు. దీంతో రిటైల్ మార్కెట్లో వెల్లుల్లి ధర రూ.600 దాటింది. గత శనివారం నుంచి కొత్త వెల్లుల్లి మార్కెట్లోకి రావడంతోనే వీటి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. వెల్లుల్లి ధర ఒక్కసారిగా పెరగడంపై ఈ ప్రాంత రైతు అమిత్ కుమార్ గుప్తా మాట్లాడుతూ.. గత ఏడాది అధికశాతం రైతులు వెల్లుల్లి సాగు చేశారన్నారు. దీంతో మార్కెట్లో వెల్లుల్లి ధర బాగా తగ్గిందన్నారు. దీంతో ఈ ఏడాది రైతులు వెల్లుల్లి సాగును తగ్గించారు. దీంతో మార్కెట్లో వెల్లుల్లి కొరత ఏర్పడింది. ఫలితంగా వెల్లుల్లి ధరలు విపరీతంగా పెరిగాయన్నారు. గత ఏడాది స్థానికంగా వెల్లుల్లి ఎక్కువగా పండడంతో గిట్టుబాటు ధర లభించక రైతులు తమ పంటలను నదులు, కాలువల్లో పడేశారు. గత సంవత్సరం, వెల్లుల్లి హోల్‌సేల్ ధర కిలో రూ. 40. మార్కెట్ ధర దీని కంటే తక్కువగా ఉంది. దీంతో రైతులు భారీగా నష్టపోయారు. ఫలితంగా రైతులు ఈసారి వెల్లుల్లి సాగును తగ్గించారు. -
విశాఖ జిల్లా వాసులకు శుభవార్త : పెరిగిన భూగర్భ జలాలు
సాక్షి, విశాఖపట్నం: ఎండలు మండుతున్న వేళ విశాఖ జిల్లాలోని భూగర్భ జలాలు ఊరటనిస్తున్నాయి. ఇవి అందుబాటులో ఉంటూ జనానికి ఉపశమనం కలిగిస్తున్నాయి. సాధారణంగా వేసవిలో భూగర్భ జలాలు అడుగంటుతుంటాయి. తాగునీటికి ఇబ్బందులు ఎదురవుతాయి. కానీ ప్రస్తుతం ఈ ఏడాది సమ్మర్లో ఆ పరిస్థితి లేదు. నీటి మట్టాలు ఆశాజనకంగానే ఉంటున్నాయి. భూగర్భ జల వనరులు, జలగణన శాఖ తరచూ నీటి మట్టాలను పరిశీలిస్తుంది. వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన పీజోమీటర్ల ద్వారా వాటి స్థాయిలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటుంది. భూగర్భ శాఖ జిల్లాలో నమోదు చేసిన వివరాల ప్రకారం మార్చి ఆఖరి వరకు భీమిలి మండలం చుక్కవానిపాలెంలో భూగర్భ జలాలు అత్యంత పైన అంటే మూడు మీటర్లకంటే తక్కువ లోతులోనే లభ్యమవుతున్నాయి. ఎండాడ ప్రాంతంలో అత్యంత దిగువన అంటే 19.35 మీటర్ల లోతు వరకు లభ్యం కావడం లేదు. 0–3 మీటర్ల మధ్య చుక్కవానిపాలెంతో పాటు చిప్పాడ, పాలవలస, నరవ ప్రాంతాల్లో భూగర్భ జలాలు అందుబాటులో ఉన్నాయి. అలాగే 3–10 మీటర్ల మధ్య నీటి లభ్యత పందలపాక, శొంఠ్యాం, వెల్లంకి, భీమిలి, నగరంపాలెం, అగనంపూడి, బీహెచ్‌పీవీ, గొల్లలపాలెం, గోపాలపట్నం, అనంతవరం, ఐనాడ, పాండ్రంగి, టి.దేవాడ, స్టీల్‌ప్లాంట్, అప్పుఘర్, విశాలాక్షినగర్, పాండురంగాపురం, మధురవాడ, మారికవలస, తాటిచెట్లపాలెం ప్రాంతాలున్నాయి. కణితి కాలనీ, పెందుర్తి, ఆరిలోవ, పెద్ద రుషికొండ, శివాజీపాలెం, వైఎస్సార్ పార్కు ప్రాంతాలు 10–20 మీటర్ల లోతులో నీటిమట్టాలున్నాయి. హెచ్చుతగ్గులు ఇలా.. మార్చి నెలలో విశాఖ జిల్లాలో సగటు నీటిమట్టం 7.48 మీటర్లుగా ఉంది. గత ఏడాది మార్చిలో 6.82 మీటర్లలో ఉండేది. గత మార్చితో పోల్చుకుంటే స్వల్పంగా 0.66 మీటర్ల దిగువకు వెళ్లినట్టయింది. గత సంవత్సరం మార్చితో భూగర్భ జలాల పరిస్థితిని పరిశీలిస్తే మొత్తం 31 పీజోమీటర్లకు గాను 14 చోట్ల పెరగ్గా, 17 చోట్ల దిగువకు వెళ్లాయి. వీటిలో శొంఠ్యాం, వెల్లంకి, భీమిలి, చుక్కవానిపాలెం, నగరంపాలెం, గొల్లలపాలెం, కణితి కాలనీ, పాండ్రంగి, పాలవలస, టి.దేవాడ, నరవ, పెందుర్తి, స్టీల్‌ప్లాంట్, మారికవలస ప్రాంతాల్లో నీటిమట్టాల స్థాయి పెరుగుదల కనిపించింది. అలాగే పందలపాక, చిప్పాడ, అగనంపూడి, బీహెచ్‌పీవీ, గోపాలపట్నం, అనంతవరం, ఐనాడ, ఏపీటీడీసీ, ఆరిలోవ, బీవీకే కాలేజీ, యోగా విలేజీ, పెద్ద రుషికొండ, ఎండాడ, మధురవాడ, ఏపీఎస్ఐడీసీ, శివాజీపాలెం, వైఎస్సార్ పార్క్ ప్రాంతాల్లో భూగర్భ జలాలు దిగువకు వెళ్లాయి. జిల్లా మొత్తమ్మీద 20 మీటర్లకంటే దిగువన నీటిమట్టాలున్న ప్రాంతాలు ఒక్కటీ లేకపోవడం విశేషం! భూగర్భ జలాల సంరక్షణ అవసరం భూగర్భ జలాలనూ అందరూ బాధ్యతగా సంరక్షించుకోవాలి. వర్షం నీరు వృథాగా పోకుండా ఇళ్ల వద్ద ఇంకుడు గుంతలు వంటి వాటిని ఏర్పాటు చేసుకోవాలి. దీనివల్ల వేసవిలో భూగర్భ జలాలు అందుబాటులో ఉంటూ నీటి ఎద్దడికి ఆస్కారం ఉండదు. ప్రస్తుతం జిల్లాలో భూగర్భ జలాల పరిస్థితి ఆశాజనకంగా ఉంది. – లక్ష్మణరావు, జిల్లా భూగర్భ జల శాఖాధికారి సగటు భూగర్భ జలాల లభ్యత మండలాల వివరాలు ఇలా.. 3 నుంచి 8 మీటర్ల లోపలే ఆనందపురం, భీమిలి, గాజువాక, ములగాడ, పద్మనాభం, పెందుర్తి, గోపాలపట్నం, పెదగంట్యాడ 8 నుంచి 20 మీటర్ల లోపు మహారాణిపేట, సీతమ్మధార విశాఖపట్నం రూరల్ -
హైదరాబాద్ లో జియో 5G ఫ్రీ ..!
-
అయ్యప్ప భక్తులకు తపాల శాఖ తీపికబురు
సాక్షి, వరంగల్: ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో శబరిమలై దేవస్థానం వెళ్లలేని భక్తులకు తపాలా శాఖ(పోస్టాఫీస్) ద్వారా అయ్యప్ప స్వామి ప్రసాదం రూ.450లకు అందించనున్నట్లు వరంగల్ డివిజన్ పోస్టల్ సూపరింటెండెంట్ ఉమామహేశ్వర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. స్వామివారి ప్రసాదం కావాలనుకునే భక్తులు సమీప పోస్టాఫీసుల్లో రూ.450 చెల్లించి అరవాన్న ప్రసాదం, పసుపు, కుంకుమ, నెయ్యి, అష్టోత్తర అర్చన ప్రసాదాలు జనవరి 16 వరకు అందుబాటులో ఉంచుతామని పేర్కొన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. చదవండి: ‘జైలోను పట్టుకుని వెనక్కు లాగిన పులి’.. ఆనంద్ మహీంద్ర ట్వీట్.. -
మూడు నెలల్లో అందరికీ వ్యాక్సిన్ : ఢిల్లీ సీఎం
సాక్షి,న్యూఢిల్లీ: ఒక వైపు కరోనా వైరస్ అంతానికి వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంటే, మరోవైపు ఢిల్లీ, మహారాష్ట్ర, కర్నాటక లాంటి రాష్ట్రాల్లో మహమ్మారి మళ్లీ పంజా విసురుతోంది. ఈనేపథ్యంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కేంద్రానికి కీలక విజ్ఞప్తి చేశారు. అందరికీ టీకాలు వేయడానికి కేంద్రం అనుమతించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఇందుకు సంబంధించిన టీకాల సరఫరా తమకు లభిస్తే తమ ప్రభుత్వం మూడు నెలల్లోనే ఢిల్లీలో టీకాల కార్యక్రమం మొత్తాన్ని పూర్తి చేస్తామన్నారు. కోవిడ్ -19 టీకాల వేగాన్ని పెంచాలని ఢిల్లీ సర్కార్ పెంచాలని యోచిస్తోంది. రోజుకు 30-40వేల వ్యాక్సిన్లు ఇస్తున్నామనీ, దీన్ని త్వరలో 1.25 లక్షల మందికి పెంచుతామని కేజ్రీవాల్ తెలిపారు..అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ టీకాలు వేయించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. పెరుగుతున్న కేసులను దృష్టిలో ఉంచుకుని అర్హతగల లబ్ధిదారులందరికీ టీకా డ్రైవ్‌ను విస్తరించాలని అరవింద్ కేజ్రీవాల్ గురువారం కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. వ్యాక్సిన్ ఉత్పత్తి పెరిగింది, కాబట్టి టీకాలు అందించే కార్యక్రమాన్ని కూడా మరింతగా విస్తరించాలన్నారు. అంతేకాదు టీకా తీసుకునేందుకు అర్హుల జాబితా తయారుచేసే బదులు అందరికీ అవకాశం కల్పించాలన్నారు. అలాగే టీకా ధరలు, వ్యాక్సినేషన్ ప్రక్రియను వికేంద్రీకరించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. తద్వారా రాష్ట్రాలు తమదైన రీతిలో యుద్ధ ప్రాతిపదికన టీకాలు వేయడానికి అనుమతించాలని ఢిల్లీ సీఎం కోరారు. టీకా కేంద్రాలకు సంబంధించిన కేంద్రం అమలు చేస్తున్న ప్రస్తుత మార్గదర్శకాలు చాలా కఠినంగా ఉన్నాయని అభి ప్రాయపడిన ఆయన దీ న్ని సరళీకరించి మరిన్ని కేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు. టీకా విషయంలో 2 నెలల అనుభవం నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకుని, సాధ్యమైనన్ని ఎక్కువ కేంద్రాల్లో టీకాలు వేస్తామని ఆయన హామీ ఇచ్చారు. కాగా భారతదేశంలో మళ్లీ కోవిడ్-19 విజృంభిస్తోంది. గత 24 గంటల్లో 35,871 తాజా కేసులు నమోదయ్యాయి. ఇది 3 నెలల్లో అత్యధికమని అధికార గణాంకాలు చెబుతున్నాయి. బుధవారం ఢిల్లీలో 500కి పైగా కేసులు కొత్తగా నమోదుతో మొత్తం సంఖ్య 644,489 కు చేరుకుంది. గత 24 గంటల్లో ఒక మరణంతో మరణించిన వారి సంఖ్య 10,945 గా ఉంది. -
కరోనా కట్టడికి ప్రత్యేక యాప్
సాక్షి, హైదరాబాద్: కరోనా ప్రభావాన్ని కట్టడి చేసేందుకు వివిధ ప్రభుత్వ శాఖల భాగస్వామ్యంతో రాష్ట్ర ప్రభుత్వం బహుముఖ వ్యూహాన్ని అమలు చేస్తోంది. విదేశాల నుంచి వచ్చిన వారిని గుర్తించి క్వారంటైన్‌కు తరలించడం, బాధితులకు వైద్య సేవలు, లాక్డౌన్ నేపథ్యంలో తలెత్తుతున్న ఇబ్బందుల పరిష్కారంలో ప్రభుత్వం తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ శాఖల నడుమ మెరుగైన సమన్వయం సాధించడంతోపాటు బాధితుల గుర్తింపు, చికిత్స, కరోనాపై అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం ఐటీ సాంకేతికతతో డ్పాటు తీసుకోవాలని నిర్ణయిం చింది. పలు ఫీచర్లతో కూడిన ప్రత్యేక యాప్‌ను రూపొం దించడంపై ఐటీ విభాగం ఇప్పటికే కొంత పురోగతి సాధించింది. పది రోజుల్లో అందుబాటులోకి రానున్న ఈ యాప్ ద్వారా కరోనా బాధితుల గుర్తింపు, నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన వంటి అనేక చర్యలు సులభతరం కానున్నాయి. లొకేషన్ డేటా ఆధారంగా ఇప్పటివరకు ప్రభావితమైన వారు, వ్యాధి విస్తరణకు అవకాశం ఉన్న ప్రాంతాలు తదితర అంశాలను కూడా ఈ యాప్ ద్వారా తెలుసుకొనే వీలుంటుంది. స్వీయ గృహ నిర్బంధంపై నిఘా... ఐటీశాఖ రూపొందిస్తున్న కొత్త యాప్ ద్వారా విదేశాల నుంచి వచ్చిన వారు స్వీయ గృహనిర్బంధం ఎంత మేరకు పాటిస్తున్నారనే విషయం తెలుసుకొనే అవకాశం ఉంటుంది. వారి వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలగకుండా ఎప్పటికప్పుడు యాప్ ద్వారా వారి కదలికలు తెలుసుకొనేలా వీలుంటుందని ఐటీశాఖ వర్గాలు చెబుతున్నాయి. యాప్‌లోని ఈ–ఫ్రాప్ అనే హైపర్లింక్ ద్వారా విదేశాల నుంచి వచ్చిన వారు, వారిలో కరోనా లక్షణాలతోపాటు వారి సాధారణ ఆరోగ్య స్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకొనే వీలుంటుంది. ఇప్పటికే సామాజిక పించన్ల పంపిణీలో ఉపయోగిస్తున్న ఐటీ సాంకేతికత ‘రియల్ టైమ్ డిజిటల్ అథెంటికేషన్ ఆఫ్ ఐడెంటిటీ’ని ఈ యాప్‌లో వినియోగిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ యాప్‌ను ప్రయోగాత్మకంగా పరిశీలించామని, మరో 10 రోజుల్లో పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెస్తామని ఐటీశాఖ వర్గాలు వెల్లడించాయి. స్టార్టప్‌ల ద్వారా వెంటిలేటర్ల తయారీ... రాబోయే రోజుల్లో కరోనా మహమ్మారి విజృంభించినా అందుకు తగ్గట్లుగా వైద్య సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. చికిత్సలో కీలకపాత్ర పోషించే వెంటిలేటర్ల తయారీతోపాటు కరోనా పరీక్ష కిట్ల తయారీపై దృష్టి సారించింది. వెంటిలేటర్లు, కిట్ల తయారీ బాధ్యతను రెండు స్టార్టప్ కంపెనీలకు అప్పగించినట్లు తెలిసింది. తక్కువ ఖర్చుతో తయారయ్యే వెంటిలేటర్లను ఇప్పటికే కాన్పూర్ ఐఐటీ రూపొందించి నమూనాను కూడా తయారు చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా తక్కువ ఖర్చుతో వెంటిలేటర్లు, పరీక్ష కిట్లను తయారు చేసే స్టార్టప్‌లను గుర్తించినట్లు సమాచారం. -
ఎక్కడి రైళ్లు, బస్సులు అక్కడే
సాక్షి, హైదరాబాద్: జనతా కర్ఫ్యూ నేపథ్యంలో ఎక్కడి రైళ్లు అక్కడే నిలిచిపోనున్నాయి. ప్రధాన మంత్రి మోదీ పిలుపు నేపథ్యంలో రైల్వే శాఖ ఇప్పటికే ఆదివారం ఉదయం ఏడు నుంచి రాత్రి తొమ్మిది మధ్య బయలుదేరాల్సిన రైళ్లను రద్దు చేసింది. జనతా కర్ఫ్యూ మొదలయ్యే ముందు బయలుదేరిన రైళ్లు మాత్రం యథావిధిగా నడుస్తాయి. ఇక నగర పరిధిలో మా త్రం ప్రజల అత్యవసర ప్రయాణాల దృ ష్ట్యా 12 ఎంఎంటీఎస్ రైళ్లను మాత్రం నడుపుతోంది. ఉదయం ఆరు గంటలకు సికింద్రాబాద్ –ఫలక్‌నుమా రైలు, ఉ.6.50, 9.55, 1.00, 5.10Sకు ఫలక్ను మా–లింగంపల్లి మధ్య, 8.23, 11.30, 3.30, రాత్రి 8.45లకు లింగంపల్లి–ఫలక్‌నుమా, సాయంత్రం 6.50కి లింగంపల్లి–హైదరాబాద్, 7.35కి హైదరాబాద్–లింగంపల్లి, రాత్రి 10.30కి ఫలక్‌నుమా–సి కింద్రాబాద్ సర్వీసులు బయల్దేరతాయి. ఆదివారం ఉదయం 6 నుంచి సోమవా రం ఉదయం 6 వరకు అన్ని బస్సులు ని లిచిపోనున్నాయి. అత్యవసరాలకు కొన్ని బస్సులు మాత్రం సిద్ధంగా ఉంటాయి. -
ఎక్కడచూసినా అవే బారులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రం లో 24 గంటల జనతా కర్ఫ్యూ నేపథ్యంలో నిత్యావసరాల కొనుగోళ్లకు ప్రజలు శనివారం మార్కెట్లకు పోటెత్తారు. రైతు బజార్లు, స్థానిక మార్కెట్లతోపాటు సూపర్ మార్కెట్లు, మాల్స్‌కు పరుగులు తీశారు. కోవిడ్–19 వ్యాప్తి దృష్ట్యా వివిధ రాష్ట్రా ల సరిహద్దులు మూసేస్తుండటం, ఈ ప్రభా వం సరుకు రవాణాపై పడే అవకాశం ఉండటంతో నిత్యావసరాల ధరలు పెరుగుతాయన్న ఆందోళనతో కూరగాయలతోపాటు నెలకు సరిపడా బియ్యం, పప్పులు, నూనెలు, ఇతర వస్తువులను కొనుగోలు చేశారు. తెరిచే ఉండనున్న పెట్రోల్ బంకులు ప్రభుత్వం అత్యవసర సేవలను దృష్టిలో పెట్టు కొని పెట్రోల్‌బంక్‌లకు మినహాయింపు ఇచ్చింది. అంబులెన్స్‌లు, పోలీసు, రెవెన్యూ వాహ నాలతో క్వారంటైన్ సేవలను దృష్టిలో పెట్టుకొ ని పెట్రోల్ బంకులను తెరిచే ఉంచనున్నట్లు పౌర సరఫరాల శాఖ కమిషన ర్ సత్యనారాయణరెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. బంకులో పెట్రోల్ లేదా డీజిల్ పోసే యూనిట్లు 3–4 ఉంటే సిబ్బంది సంఖ్యను తగ్గించి ఒక్కో యూనిట్ మాత్రమే అందుబాటులో ఉం టుందని, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 3 వేల పెట్రోల్ బంకుల్లో ఇదే విధానం ఉంటుందని పెట్రోల్ బంకు డీలర్ల సంఘం నేత దినేశ్‌రెడ్డి తెలిపారు. అయితే పెట్రోల్ ట్యాంకర్లు మా త్రం ఆదివారం ఎక్కడివక్కడే నిలిచిపోనున్నాయి. రాష్ట్రంలో రోజూ 10 లక్షల లీటర్ల మేర పెట్రోల్, డీజిల్ అవసరాలు ఉంటాయని, ఇందుకోసం రాష్ట్రానికి సంబంధించిన 3 వేల ట్యాంకర్లు, 12 వేల ఇతర రాష్ట్రాల ట్యాంకర్లు సరఫరా చేస్తుంటాయని, ఆదివారం వాటిని ఎక్కడికక్కడే నిలిపివేస్తామని ట్యాంకర్స్ అసోసియేషన్ ప్రతినిధి రాజశేఖర్ వెల్లడించారు. ఇతరత్రా ఇబ్బందు లెదురైనా.. రాష్ట్రంలో వారానికి సరిపడా నిల్వలున్నాయని తెలిపారు. -
టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో గ్రూప్–2 అభ్యర్థుల మార్కుల వివరాలు
సాక్షి, హైదరాబాద్: టీఎస్పీఎస్సీ గ్రూప్–2 ఉద్యోగాలకు ఇటీవల నిర్వహించిన ఇంట ర్వ్యూలకు హాజరైన అభ్యర్థుల మార్కుల వివరాలను తమ అధికారిక వెబ్సైట్లో ఉంచినట్లు వెల్లడించింది. మొత్తం 1,032 ఉద్యోగ ఖాళీలకు 2,064 మందిని ఇంటర్వ్యూలకు ఆహ్వానించగా, 2,028 మంది హాజరయ్యారని, ఇంటర్వ్యూకు హాజరైన వారందరి మార్కుల వివ రాలను వెబ్సైట్లో అందుబాటులో ఉంచామని టీఎస్పీఎస్సీ కార్యదర్శి ఎ.వాణీప్రసాద్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. గ్రూప్–2 ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థులకు ఈ ఏడాది జూలై 1 నుంచి ఆగస్టు 27 వరకు ఇంటర్వ్యూలు నిర్వహించిన విషయం తెలిసిందే. టీఆర్టీ ఎస్జీటీ ఫలితాలు వెల్లడి 909 ఖాళీలకు 843 మంది ఎంపిక సాక్షి, హైదరాబాద్: టీచర్స్ రిక్రూట్మెంట్ టెస్ట్ (టీఆర్టీ) ద్వారా సెకండరీ గ్రేడ్ టీచర్స్ (ఇంగ్లిషుమీడియం) ఉద్యోగాలకు నిర్వహించిన పరీక్ష ఫలితాలు వెల్లడయ్యాయి. మొత్తం 909 ఖాళీలకు నిర్వహించిన ఈ పరీక్ష ద్వారా ఉత్తీర్ణులైన వారి వివరాలను కోర్టు ఆదేశాలకనుగుణంగా వెల్లడించినట్లు టీఎస్పీఎస్సీ కార్యదర్శి ఎ.వాణీప్రసాద్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో 909 ఖాళీలకు 843 మంది ఎంపికైన అభ్యర్థుల జాబితాను టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు ఆమె వెల్లడించారు. 5 ఖాళీలకు సంబంధించిన ఫలితాలు కోర్టులో కేసు ఉన్నందున వెల్లడించలేదని, 39 వికలాంగ ఖాళీల ఫలితాలను విద్యాశాఖ నుంచి అందే తదుపరి సమాచారం ఆధారంగా ప్రకటిస్తామని, మరో 21 ఖాళీలను కూడా కోర్టుల్లో కేసులు, ఏజెన్సీ క్లెయిమింగ్ నిర్ధారణ కారణంగా ప్రకటించలేదని, మరో ఖాళీకి అర్హులైన అభ్యర్థి దొరకనందున 843 మంది జాబితాను ప్రకటించినట్లు ఆమె ఆ ప్రకటనలో పేర్కొన్నారు. -
రోహిత్ ఫిట్: బీసీసీఐ
న్యూఢిల్లీ: టీమిండియా తాత్కాలిక కెప్టెన్ రోహిత్ శర్మ ఫిట్‌గానే ఉన్నాడని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తెలిపింది. శుక్రవారం ప్రాక్టీస్ చేస్తుండగా అతని ఉదర భాగంలో బంతి బలంగా తాకింది. దీంతో కాసేపు విలవిలలాడిన రోహిత్ ప్రాక్టీస్ ఆపేసి అక్కడినుంచి నిష్క్రమించాడు. జట్టు ఫిజియో, వైద్యులు అతనికి చికిత్స అందజేశారు. అనంతరం వైద్యులు అతనికి అయిన గాయం సాధారణమైందేనని తేల్చారు. దీంతో తొలి టి20 మ్యాచ్‌లో అతను బరిలోకి దిగుతాడని బీసీసీఐ వెల్లడించింది. ప్రాక్టీస్ సెషన్లో సంజూ సామ్సన్ పాల్గొనలేదు. రిషభ్ పంత్ చాలాసేపు చెమటోడ్చాడు. దీంతో తుదిజట్టులో పంత్‌కే అవకాశం దక్కనుంది. ముంబై ఆల్‌రౌండర్ శివమ్ దూబేకు ప్రాక్టీస్ సందర్భంగా హెడ్ కోచ్ రవిశాస్త్రి సలహాలిచ్చారు. -
మీ ముందుకే ‘ఆధార్’ సేవలు
సాక్షి, హైదరాబాద్: పోస్టల్ శాఖ సరికొత్త సేవలతో ముందుకు వస్తోంది. ఉత్తరాలు, పోస్టుకార్డులు చేరవేస్తూ ప్రజలకు సేవలందిస్తున్న తపాలా శాఖ ఆధార్ సేవలూ అందిస్తోంది. ఇప్పటికే హైదరాబాద్‌లోని జనరల్, హెడ్, సబ్ పోస్టాఫీసుల్లో ఆధార్ కేంద్రాలు ఏర్పాటు చేసిన తపాలా శాఖ తాజాగా ప్రజల ఇంటి వద్దకే వెళ్లి ఆధార్ సేవలు అందించాలని నిర్ణయించింది. ఆధార్ నమోదు, చేర్పులు, మార్పుల సేవలు అవసరమున్నట్లు సమాచారం అందిస్తే చాలు.. డోర్ వద్దకు వచ్చి సేవలందించనుంది. గత రెండున్నరేళ్ల క్రితమే జాతీయ స్థాయిలో భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) తో ఒప్పందం కుదుర్చుకున్న పోస్టల్ శాఖ ఆధార్ అధీకృత కేంద్రాలను ఏర్పాటు చేసి సేవలు అందిస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో సహా ప్రైవేటు సంస్థలూ తమ సేవలను ఆధార్‌తో అనుసంధానం చేయడంతో ప్రతి ఒక్కరికి ఆధార్ తప్పనిసరిగా మారింది. ఇప్పటికే కొత్తగా పుట్టిన శిశువులు, చిన్నారులు మినహా దాదాపు ప్రతి ఒక్కరూ ఆధార్ నమోదు చేసుకున్నప్పటికీ పేరు, ఇంటి పేర్లలో అక్షర దోషాలు, సవరణలు, చిరునామాలు, మొబైల్ నెంబర్ల లింకేజీ, మార్పు కోసం ఆధార్ కేంద్రాలకు పరుగులు తీయక తప్పడం లేదు. దీంతో ఆధార్ కేంద్రాలకు డిమాండ్ పెరిగింది. 122 పోస్టాఫీసుల్లో ఆధార్ కేంద్రాలు హైదరాబాద్‌లో జనరల్ పోస్టాఫీసు, హెడ్, సబ్ పోస్టాఫీసుల్లో ఆధార్ కేంద్రాలు ఏర్పాటు చేసి సేవలందిస్తున్నారు. గత రెండేళ్ల క్రితం కేవలం ఆధార్ కార్డుల అప్డేషన్కు పరిమితమైన పోస్టల్ శాఖ గతేడాది నుంచి ఎన్రోల్మెంట్ ప్రక్రియకు కూడా శ్రీకారం చుట్టింది. ప్రతిరోజు 20 నుంచి 30 టోకెన్లకు తగ్గకుండా పంపిణీ చేసి వినియోగదారులకు సమయం కేటాయిస్తున్నారు. రోజూ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు సేవలందిస్తున్నారు. టోకెన్ జారీ చేసే సమయంలోనే అవసరమైన పత్రాలను పరిశీలించి కేటాయించిన సమయంలో ప్రక్రియను పూర్తి చేస్తున్నారు. పోస్టాఫీసుల్లో కొత్త ఆధార్ నమోదుతోపాటు కార్డుల్లో చేర్పులు, మార్పులకు సంబంధించిన పలు సేవలు అందిస్తారు. కొత్తగా ఆధార్ నమోదుకు ఉచితంగా.. అప్డేషన్కు రూ.50లు వసూలు చేస్తున్నారు. అప్డేషన్కు బయోమెట్రిక్ తప్పనిసరి ఆధార్ అప్డేషన్ కోసం బయోమెట్రిక్ తప్పనిసరి. ఆధార్ వివరాలు నమోదు అనంతరం ఆథరైజ్ సిబ్బంది, కార్డుదారుడి బయోమెట్రిక్ ఆమోదం అనంతరమే యూఐడీఏఐ ప్రధాన సర్వర్ అప్డేషన్కు అనుమతిస్తుంది. మొబైల్ నెంబర్‌కు వచ్చే వన్‌టైమ్ పాస్వర్డ్ (ఓటీపీ) ఆధారంగా చేర్పులు, మార్పులు పూర్తిచేస్తారు. అనంతరం అప్డేషన్ ప్రక్రియ పూర్తయినట్లు మొబైల్‌కు సంక్షిప్త సమాచారం వస్తుంది. ఈ తతంగం 15 నిమిషాల్లో పూర్తవుతుంది. అనంతరం యూఐడీఏఐ వెబ్సైట్ నుంచి ఈ–ఆధార్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. రెండున్నరేళ్లుగా.. హైదరాబాద్‌లో పోస్టల్ శాఖ ఆధార్ కేంద్రాల ద్వారా రెండున్నరేళ్లుగా పెద్ద ఎత్తున సేవలందిస్తోంది. పోస్టల్ ఆధార్ కేంద్రాల ద్వారా సుమారు 16,271 మంది కొత్తగా ఆధార్ నమోదు చేసుకోగా 1,30,996 మంది తమ ఆధార్ కార్డుల్లో మార్పులు, చేర్పులు చేసుకున్నారు. కేవలం హైదరాబాద్ జనరల్ పోస్టాఫీసు (జీపీవో)లో మాత్రం 1,759 మంది కొత్తగా ఆధార్ నమోదు చేసుకోగా, సుమారు 17,522 మంది తమ ఆధార్‌లో మార్పులు, చేర్పులు చేసుకున్నట్లు అధికారిక గణాంకాల ద్వారా తెలుస్తోంది. ఇళ్ల వద్దకే ‘ఆధార్’ సేవలు.. పోస్టాఫీసుల్లో ఏర్పాటు చేసిన ఆధార్ కేంద్రాలకు మంచి స్పందన వస్తోంది. ఇక ప్రజలకు ఇళ్ల వద్దనే ఆధార్ సేవలు అందించాలని నిర్ణయించాం. ఆధార్ సేవలు అవసరము న్న వారు కనీసం 30 మంది ఉంటే చాలు వారి ఇళ్ల వద్దకే వెళ్లి ఆధార్ సేవలందిస్తాం. కేవలం విద్యుత్ సౌకర్యం ఏర్పాటు చేస్తే చాలు. అపార్ట్మెంట్, వీధి, కాలనీ కమిటీ లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. నేరు గా సెల్ నెంబర్ 9440644035ను సంప్రదించవచ్చు. – జయరాజ్, చీఫ్ పోస్ట్‌మాస్టర్, జనరల్ పోస్టాఫీసు, అబిడ్స్, హైదరాబాద్ -
సెలెక్షన్స్‌కు అందుబాటులో ఉన్నా: మిథాలీ
న్యూఢిల్లీ: దక్షిణాఫ్రికా జట్టుతో స్వదేశంలో వచ్చే నెలలో జరిగే మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌కు తాను అందుబాటులో ఉంటానని భారత సీనియర్ క్రికెటర్ మిథాలీ రాజ్ స్పష్టం చేసింది. అయితే వచ్చే ఏడాది ఆరంభంలో జరిగే టి20 వరల్డ్ కప్‌ను దృష్టిలో పెట్టుకొని సెలెక్టర్లు యువ క్రీడాకారిణులకు అవకాశం ఇవ్వాలనే ఆలోచనతో ఉన్నారు. ఈ నేపథ్యంలో మిథాలీ రాజ్‌ను టి20 జట్టులోకి ఎంపిక చేస్తారో లేదో అనుమానంగా ఉంది. జట్టును ఎంపిక చేసేందుకు సెప్టెంబర్ 5న సెలెక్టర్లు సమావేశం కానున్నారు. 36 ఏళ్ల మిథాలీ 2021 వన్డే వరల్డ్ కప్‌లో ఆడతానని చెప్పినా... టి20 ఫార్మాట్లో మాత్రం ఆమెను జట్టులో కొనసాగించే అవకాశాలు తక్కువగానే ఉన్నాయి. ‘దక్షిణాఫ్రికాతో టి20 సిరీస్‌కు నేను అందుబాటులో ఉన్నాను. అయితే వచ్చే ఏడాది జరిగే టి20 వరల్డ్ కప్ గురించి ఇంకా ఆలోచించలేదు. ప్రస్తుతమైతే ఒక్కో సిరీస్‌పైనే దృష్టి పెట్టాను’ అని మిథాలీ తెలిపింది. ‘మిథాలీ గొప్ప క్రికెటర్. కానీ టి20 కెరీర్‌పై ఆమె తొందరగానే ఓ నిర్ణయం తీసుకోవాలి. టి20 వరల్డ్ కప్ మరో ఆరు నెలల్లోనే ఉంది. ఈలోపు కొంతమంది యువ క్రీడాకారిణులకు అవకాశం ఇవ్వాలి. మిథాలీ ఆలోచనలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలి’ అని బీసీసీఐ అధికారొకరు తెలిపారు. -
వాట్సాప్ యూజర్లకు గుడ్‌న్యూస్
సోషల్ మీడియా దిగ్గజం వాట్సాప్ తన యూజర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. ఇటీవల లాంచ్ చేసిన వాట్సాప్ బిజినెస్ యాప్‌ను ఇకపై ఇండియాలో అద్భుతమైన ఆఫర్లతో అందుబాటులోకి తీసుకొచ్చింది. గూగుల్ ప్లే స్టోర్‌నుంచి దీన్ని ఉచితంగా డోన్లోడ్ చేసుకోవచ్చు. ముఖ్యంగా ఆండ్రాయిడ్ యూజర్లకు దీన్ని అందుబాటులోకి వచ్చింది. స్వంతంగా వ్యాపారాలు కలిగిన ఎవరైనా దీన్ని ఉచితంగా డౌన్లోడ్ చేసుకుని తమ ఖాతాదారులకి నేరుగా టచ్‌లో ఉండొచ్చు. తద్వారా సులభంగా వ్యాపార కార్యలాపాలను నిర్వహించుకోవచ్చు. చిన్న వ్యాపారస్తులు తమ కస్టమర్లతో టచ్‌లో ఉండేలా వాట్సాప్ బిజినెస్ యాప్ పనిచేయనుంది. ఈ యాప్ ద్వారా షాప్, బిజినెస్, చిరునమా, వెబ్సూఐట్ తదితర వివరాలను అందుబాటులో ఉంటాయి. ముఖ్యంగా వినియోగదారులకందించే సేవలతోపాటు వారి అడిగే సందేహాలకు తక్షణమే స్పదించవచ్చు. వాయిస్ , వీడియో కాల్స్ చేయడానికి కూడా అనుమతిస్తుంది. అలాగే మీ కస్టమర్లకి గ్రీటింగ్స్ తెలిపే అవకాశం కూడా. అంతేకాదు మెసేజ్‌లను ఎంతమంది చదివారు అన్నది గణాంకాలు తెలుసుకోవచ్చు. వాట్సాప్ లాగానే ఈ బిజినెస్ యాప్ కూడా కాల్స్, మెసేజ్‌లను థర్డ్‌పార్టీకి చేరకుండా ఎండ్ టూ ఎండ్ ఎన్క్రిప్షన్ను ఆఫర్ చేస్తోంది. ప్రొఫైల్ ఫోటో సెక్యూరిటీతోపాటు లైవ్ లొకేషన్ షేరింగ్‌ను కూడా అనుమతిస్తుంది. కాగా ఇటీవల ఇండోనేషియా, ఇటలీ, మెక్సికో, యుకె, యుఎస్ సహా కొన్ని మార్కెట్లలో వాట్సాప్ బిజినెస్ యాప్ మొదట లాంచ్ చేసింది. అధికారిక లాంచింగ్ముందే ఇండియా, బ్రెజిల్లో టెస్టింగ్ నిర్వహించింది. గత సంవత్సరం ఫిబ్రవరిలో అందించిన అధికారిక డేటా ప్రకారం, వాట్సాప్‌కు భారతదేశంలో 200 మిలియన్ల మందికి పైగా క్రియాశీల వినియోగదారులను కలిగి ఉంది. -
ఐఫోన్ 7పై డిస్కౌంట్ ఎంతో తెలుసా?
న్యూఢిల్లీ: ఇ-కామర్స్ సంస్థలు కస్టమర్లను ఆకర్షించే క్రమంలో భారీ ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ముఖంగా ఆపిల్ ఐ ఫోన్లపై ఆన్లైన్ రీటైలర్స్ ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ ఇండియా మధ్య ఆఫర్ల యుద్ధ నడుస్తోంది. తాజాగా ఐఫోన్ 7పై అమెజాన్ ఇండియా రూ. 17 వేలదాకా భారీ డిస్కౌంట్ ను ప్రకటించింది. ఇప్పటికే ఫ్లిప్‌కార్ట్ ఐఫోన్ 6 పై రూ.14వల డిస్కౌంట్ ప్రకటించగా ఇదే బాటలో అమెజాన్ నడుస్తోంది. అమెజాన్ ఇండియా ఇప్పటికే ఐప్యాడ్ ధర రూ. 14వేల డిస్కౌంట్ అందిస్తోంది. దీనికి తోడు తాజాగా ఆపిల్ ఐఫోన్ 7పై ఈ భారీ తగ్గింపును ఆఫర్ చేస్తోంది. అన్ని స్టోరేజ్ వేరియంట్లు డిస్కౌంట్ ధరల్లో అందుబాటులో ఉన్నాయి. ఐ ఫోన్ 7 32 జీబీ వేరియంట్ రూ.14 వేల డి స్కౌంట్ తరువాత ప్రస్తుతం రూ. 45,999కే లభించనుంది. ఐ ఫోన్ 7 256 జీబీ వేరియంట్ రూ.16 వేల డిస్కౌంట్. ప్రస్తుతం రూ. 65,999లు. ఐ ఫోన్7 128 జీబీ వేరియంట్ రూ.17 వేల డిస్కౌంట్ అందిస్తోంది. దీంతో ప్రస్తుతం ఈ డివైస్ రూ.52,972 కే లభించనుంది. అంతేకాదు కలర్ ఆధారంగా ఈ తగ్గింపు వర్తించనుంది. మరిన్ని వివరాలకు అమెజాన్ అధికారిక వెబ్‌సైట్‌ను గమనించగలరు. ఐఫోన్ 7 ఫీచర్ల విషయానికి వస్తే 4.7 అంగుళాల డిస్ ప్, లే న్యూ క్వాడ్-కోర్ ఆపిల్ ఎ 10 ఫ్యూజన్ ప్రాసెసర్ f / 1.8 ఎపర్చరు, 6 ఎలిమెంట్ లెన్స్, 4 ఎల్ఈడీ ఫ్లాష్, ఫ్లికర్ సెన్సర్, 12ఎంపీ వెనుక కెమెరా తదితరాలు ఉన్నాయి. -
కెనాల్లో గుర్తు తెలియని మృతదేహం
పెద్దవడుగూరు: మండలంలోని లక్ష్ముంపల్లి సమీపంలో గల కెనాల్ లో ఓ గుర్తు తెలియని వ్యక్తి(50) మృతదేహాన్ని బుధవారం కనుగొన్నట్లు ఎస్ఐ రమణారెడ్డి తెలిపారు. పది రోజుల సదరు వ్యక్తి కెనాల్లో పడి మరణించి ఉండొచ్చని భావిస్తున్నారు. మృతదేహాన్ని కుక్కలు పీక్కుతిన్నాయి. ఘటనా స్థలంలో ఎయిడ్స్‌కు సంబంధించిన మాత్రల డబ్బా లభించడంతో మృతుడు ఎయిడ్స్ వ్యాధితో బాధపడుతూ తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్మకు పాల్పడి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. లేదా వడదెబ్బ తగిలి స్పృహ కోల్పోయి మృతి చెంది ఉండొచ్చని కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మృతదేహం కుళ్లిపోవడంతో పామిడి పీహెచ్సీ డాక్టర్ లింగేశ్వర్‌ను అక్కడికే పిలిపించి పోస్టుమార్టం చేయించారు. మృతుడు బూడిద కలర్ నిక్కర్, నలుపు, తెలుపు పట్టీల లుంగీ, మెంతు రంగు కలర్ చారలు గల చొక్కా ధరించినట్లు ఎస్ఐ తెలిపారు. కేసు దర్యాప్తులో ఉంది. -
ఆడ శిశువు మృతదేహం లభ్యం
కణేకల్లు: కణేకల్లు–ఎర్రగుంట మార్గమధ్యంలోని కల్వర్టు వద్ద ఆదివారం ఓ ఆడశిశువు మృతదేహం లభ్యమైంది. అటువైపు బైక్‌పై వెళ్తున్న కొందరికి కల్వర్టు వద్ద కుక్కలుండటం గమనించారు. దగ్గరకెళ్లి కుక్కలను తరిమేయగా వారికి మృతశిశువు కనిపించింది. వెంటనే పైన పేర్కొన్న గ్రామాల వారికి విషయం తెలిపారు. వారొచ్చి మృత శిశువును చూసి కంటతడి పెట్టారు. బతికుండగా పడేసి వెళ్లారో, లేక చనిపోయాక ఖననం చేయకుండా వదిలేసి వెళ్లారో అంతుబట్టడం లేదు. పసికందును అలా పడేయటానికి వారికి మనసెలా వచ్చిందోనంటూ శాపనార్థాలు పెట్టారు. -
చెరువులో గల్లంతైన విద్యార్థి మృతదేహం లభ్యం
మామునూరు : చెరువులో ఈత కొట్టేం దుకు వెళ్లి గల్లంతైన విద్యార్థి మృతదేహం శుక్రవారం లభ్యమైంది. నీటిలో కొట్టుకుపోయిన తమ కుమారుడు తిరి గి వస్తాడునుకుని కోటి ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రులకు కన్నీరే మిగిలింది. వివరాల్లోకి వెళితే.. హన్మకొండ మండలం తిమ్మాపురం పరిధిలోని బెస్తం చెరువులో గురువారం మధ్యాహ్నం ఈత కొట్టేందుకు వెళ్లిన నలుగురు విద్యార్థుల్లో లెనిన్‌నగర్‌కు చెందిన ఇమ్మడి మొగిలి, అరుణ దంపతుల కుమారుడు ఇమ్మడి భవన్ (17) చెరువులో మునిగి గల్లంతైన విషయం తెలి సిందే. అయితే పోలీసులు, గజ ఈతగాళ్లు గాలింపు చర్యలు చేపట్టినా మృతదేహం లభ్యం కాలేదు. ఈ క్రమంలో మామునూరు ఏసీపీ మహేందర్ ఆదేశాల మేరకు శుక్రవారం సీఐ పి.శ్రీని వాస్ పర్యవేక్షణలో ఎస్సైలు రాంప్రసాద్, యుగేంధర్ నేతృత్వంలో ధర్మసాగర్ రిజర్వాయర్‌కు చెందిన గజ ఈ తగాళ్లు, జాలర్లు మర పడవల సాయం తో బెస్తం చెరువులో గాలింపులు చేపట్టగా సాయంత్రం 4 గంటల సమయంలో ఇమ్మడి భవన్ మృతదేహం లభించింది. ఈ సందర్భంగా వారు మృతదేహాన్ని ఒడ్డుకు చేర్చారు. కాగా, కుమారుడి మృతదేహాన్ని చూసిన తల్లిదండ్రులు, బంధువులు రోదించిన తీరు స్థానికులను కలిచివేసింది. ఇప్పుడే వస్తానని స్నేహితులతో కలిసి వెళ్లిన కొడుకు శవమై వచ్చాడని వారు బోరు న విలపించారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎంజీఎంకు తరలించారు. మృతుడి తండ్రి ఇమ్మ డి మొగిలి ఫిర్యాదు మేరకు కేసు న మోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పి.శ్రీనివాస్ తెలిపారు. -
ప్రజలకు అందుబాటులో ఉండాలి
స్థానికంగానే సమస్యలు పరిష్కరించుకోవాలి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు 'గండుగులపల్లి(దమ్మపేట): స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు ప్రజలకు అందుబాటులో ఉండాలని, స్థానిక సమస్యలను అక్కడే పరిష్కరించుకోవాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు.మంగళవారం మండల పరిధిలోని గండుగులపల్లిలోని తన నివాసంలో ఉన్న తుమ్మలను జిల్లాలోని పలు ప్రాంతాలకు చెందిన ప్రజాప్రతినిధులు, అధికారులు కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమపై నమ్మకంతో ప్రజా ప్రతినిధులుగా ఎన్నుకున్న ప్రజల కష్ట సుఖాల్లో పాలు పంచుకోవాలన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి అభివృద్ధిని వేగవంతం చేయాలన్నారు. అధికారులు ధైర్యం చేసి పనులు చేస్తే ఆ కీర్తి వారికే దక్కుతుందని, గతంలో ఇక్కడ పనిచేసిన అధికారులు ప్రస్తుతం మంచి స్థానాల్లో ఉన్నారంటే దానికి వారు చేసిన పనివిధానమే కారణమన్నారు. పట్టుదలతో పనిచేస్తే ఏదైనా సాధించవచ్చునని, ఆ విధంగా అధికారులు పనులు చేయాలన్నారు. అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల అమలు విషయంలో పైరవీలకు ప్రాధాన్యతనిస్తే సహించేది లేదన్నారు. జిల్లా వ్యాప్తంగా చేపట్టిన రోడ్ల విస్తరణ పనులను వేగవంతం చేయాలన్నారు. మంత్రిని కలిసిన వారిలో మాజీ సొసైటీ అధ్యక్షుడు పైడి వెంకటేశ్వరరావు, దొడ్డాకుల రాజేశ్వరరావు, చల్లగుళ్ల నరసింహారావు, సత్తుపల్లి ఆత్మ కమిటీ చైర్మన్ కట్టా అజయ్‌కుమార్, వేంసూరు సొసైటీ అధ్యక్షుడు వెల్ది జగన్మోహనరావు, నాయకులు దుగ్గిదేవర వెంకట్‌లాల్, కురిశెట్టి సత్తిబాబు, కాసాని నాగప్రసాద్ తదితరులున్నారు. -
వ్యవసాయ బావిలో బాలుడి శవం లభ్యం
ఈనెల 13 నుంచి కనిపించని బాలుడు మృతదేహంపై గాయాలున్నట్లు అనుమానం ఖమ్మం రూరల్ : ఓ బాలుడి మృతదేహం ఖమ్మం రూరల్ మండలం గుర్రాలపాడు శివారు కోదాడ–ఖమ్మం ప్రధాన రహదారి పక్కన వ్యవసాయ బావిలో మంగâýæవారం లభ్యమైంది. పోలీసుల కథనం ప్రకారం.. నల్లగొండ జిల్లా కోదాడ మండలం మొగలాయికోటకు చెందిన లింగా గోవిందరెడ్డి, రమాదేవిలకు ఇద్దరు కొడుకులు. సృజ¯ŒSరెడ్డి, పూరీజగన్నాథరెడ్డి(10). ఆర్మీలో ఉద్యోగం చేసిన గోవిందరెడ్డి ఉద్యోగ విరమణ పొందిన తర్వాత కోదాడలోని యాక్సిస్ బ్యాంక్‌లో గార్డుగా పని చేస్తున్నాడు. ఇదిలా ఉండగా.. స్థానిక ప్రైవేటు పాఠశాలలో 2వ తరగతి చదువుతున్న పూరీజగన్నాథరెడ్డి ఈనెల 13న గ్రామంలోని వినాయకుని వద్ద కాసేపు గడిపి.. తిరిగి ఇంటికి వెళ్తుండగా.. ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ద్విచక్ర వాహనంపై వచ్చి ‘కోదాడకు వెళ్తున్నాం.. నిన్ను బండిమీద తీసుకెళతాం’ అంటూ పూరీజగన్నాథరెడ్డిని అడిగారు. ‘నా దగ్గర సైకిల్ ఉంది.. ఇప్పుడెలా రానని బాలుడు అనగా.. ఇంటి వద్ద సైకిల్ పెట్టిరా..’ అనడంతో సైకిల్ ఇంటి దగ్గర పెట్టి వచ్చి గుర్తు తెలియని వ్యక్తులతో ద్విచక్ర వాహనంపై వెళ్లాడని మొగలాయికోటకు చెందిన స్థానికులు తెలిపారని బంధువులు చెప్పారు. అనంతరం జగన్నాథరెడ్డి కనిపించడం లేదని తండ్రి లింగారెడ్డి కోదాడ పోలీస్‌స్టేçÙ¯ŒSలో ఫిర్యాదు చేశాడు. మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తర్వాత పదేâýæ్ల బాలుడు కనిపించడం లేదని.. ఆచూకీ తెలిపిన వారికి రూ.లక్ష బహుమానం ఇస్తామని తండ్రి పోస్టర్లు ముద్రించి.. కోదాడ, ఖమ్మం వచ్చే ప్రధాన రహదారి వెంబడి అంటించారు. ఒక పక్క కోదాడ పోలీసులు, మరో పక్క బాలుని బంధువులు జగన్నాథరెడ్డి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. ఈ క్రమంలో మంగâýæవారం గుర్రాలపాడు వద్ద బావిలో బాలుడి శవం కనిపించడంతో గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు సంఘటనా స్థలానికి చేరుకుని కన్నీరు మున్నీరుగా విలపించారు. ఇదిలా ఉండగా.. బావిలో ఉన్న మృతదేహం బాగా కుళ్లిపోవడంతో పోలీసులు అతి కష్టంమీద బయటకు తీయించారు. కోదాడ సీఐ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కాగా.. బాలుడి మృతదేహంపై గాయాలున్నట్లు పోలీసులు తెలిపారు. ఈనెల 13న లేదా మరుసటి రోజు గుర్తు తెలియని వ్యక్తులు బాలుడిని కొట్టి.. హత్య చేసి ఉంటార ని భావిస్తున్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. -
అందుబాటులో గడ్డి విత్తనాలు
అనంతపురం: జిల్లా వ్యాప్తంగా అన్ని పశువైద్యకేంద్రాల్లో రాయితీ గడ్డి విత్తనాలు అందుబాటులో పెట్టామని పశుసంవర్ధక శాఖ జేడీ డాక్టర్ కె.జయకుమార్, పశుగ్రాసం విభాగం ఏడీ డాక్టర్ సుబ్రమణ్యం తెలిపారు. కిలో మొక్కజొన్న విత్తనాలు పూర్తి విలువ రూ.49 కాగా అందులో రైతు వాటా రూ.12.25గా చెల్లించాలన్నారు. అలాగే సీఎస్హెచ్ ఎంఎఫ్–24 రకం జొన్న విత్తనాలు కిలో పూర్తి విలువ రూ.56 కాగా అందులో రైతు రూ.14.10 ప్రకారం చెల్లించాలని తెలిపారు. ఇక సుగర్గ్రేజ్ జొన్న విత్తనాలు కిలో రూ.337 కాగా అందులో రైతు వాటాగా రూ.84.25 చెల్లించాలని సూచించారు.