
సాక్షి, వరంగల్: ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో శబరిమలై దేవస్థానం వెళ్లలేని భక్తులకు తపాలా శాఖ(పోస్టాఫీస్) ద్వారా అయ్యప్ప స్వామి ప్రసాదం రూ.450లకు అందించనున్నట్లు వరంగల్ డివిజన్ పోస్టల్ సూపరింటెండెంట్ ఉమామహేశ్వర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
స్వామివారి ప్రసాదం కావాలనుకునే భక్తులు సమీప పోస్టాఫీసుల్లో రూ.450 చెల్లించి అరవాన్న ప్రసాదం, పసుపు, కుంకుమ, నెయ్యి, అష్టోత్తర అర్చన ప్రసాదాలు జనవరి 16 వరకు అందుబాటులో ఉంచుతామని పేర్కొన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
చదవండి: ‘జైలోను పట్టుకుని వెనక్కు లాగిన పులి’.. ఆనంద్ మహీంద్ర ట్వీట్..