
శబరిమల అనగానే గుర్తొచ్చేది ముందుగా అయ్యప్ప ఆలయం, ఆ తర్వాత స్వామి ప్రసాదం. ఏటా శబరిమల అయ్యప్పస్వామిని భారీ సంఖ్యలో భక్తులు దర్శించుకున్న అనంతరం బంధువులు, కుటుంబ సభ్యులకు కోసం తప్పకుండా ప్రసాదం తీసుకెళ్తుంటారు. తిరుపతి లడ్డూ తర్వాత ఆ స్థాయిలో శబరిమలలో దొరికే అరవణి ప్రసాదానికి కూడా అంత పేరుంది.
ఈ ప్రసాదాన్ని అరవణ ప్రసాదం అంటారు. బియ్యం, నెయ్యి, బెల్లాన్ని ఉపయోగించి చేసే ఈ ప్రసాదం తినడానికి రుచిగా ఉండటంతో పాటు చలికాలంలో తింటే ఆరోగ్యానికి మరీ మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఈ ప్రసాదానికి వాడే బియ్యం మావెలిక్కరలోని ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు పరిధిలోని చెట్టికులంగర దేవి ఆలయం నుంచి వస్తాయి. కేరళలో కొన్ని ప్రత్యేక వేడుకల్లో అరవణ పాయసాన్ని తయారు చేసుకుంటారు. మరి దీని తయారీ విధానం చూసేద్దాం.
కావల్సిన పదార్థాలు
ఎర్రబియ్యం: ఒక కప్పు
నల్ల బెల్లం: రెండు కప్పులు
శొంటిపొడి: 1 టీస్పూన్
పచ్చి కొబ్బరి: ఒక కప్పు
నెయ్యి: తగినంత
జీడికప్పులు: పావు కప్పు
నీళ్లు: ఆరు కప్పులు
అరవణ ప్రసాదం తయారీ
ముందుగా పాన్ మీద నల్ల బెల్లం వేసి కరిగించాలి. మరో పాన్‌లో ముందుగా పచ్చికొబ్బరి, జీడిపప్పులు వేయించి పక్కనపెట్టుకోవాలి. ఆ తర్వాత ఎర్రబియ్యం బాగా శుభ్రంగా కడిగి అన్నంలా వండుకోవాలి. ఉడికించే సమయంలోనే కాస్త నెయ్యి వేసుకోని కాస్త మెత్తగా వండుకోవాలి.
అనంతరం ఈ మిశ్రమాన్ని బెల్లం పాకంలో వేసి ఉడికించుకోవాలి. తర్వాత శొంటి పొడి, నెయ్యి వేస్తూ దగ్గరకు పడుతున్నంత సేపు ఉడికించుకోవాలి. చివరగా కొబ్బరి ముక్కలు, జీడిపప్పు వేసుకోవాలి. అంతే ఎంతో టేస్టేగీ ఉండే అవరణ పాయసం రెడీ.
Comments
Please login to add a commentAdd a comment