prasadam
-
తిరుమల లడ్డూ వ్యవహారం నుంచి బయటపడటానికి బాబు యత్నిస్తున్నారు
-
పిఠాపురం పాదగయ క్షేత్రంలో అపచారం
సాక్షి, కాకినాడ జిల్లా: పిఠాపురం పాదగయ క్షేత్రంలో అపచారం జరిగింది. కుక్కుటేశ్వర స్వామి ప్రసాదంలో పురుగులు దర్శనమిచ్చాయి. పులిహోరాలో పురుగులు దర్శనమివ్వడంతో భక్తుడు షాక్ అయ్యారు. ప్రసాదంలో కనిపించిన పురుగులపై దేవస్ధానం అధికారులను భక్తులు నిలదీశారు. అధికారుల పర్యవేక్షణ కొరవడడంతో పాదగయాలో నాసిరకం వస్తువులతో ప్రసాదం తయారీ అవుతోంది.కాగా.. గత నెలలో హోమగుండంలో స్వామివారు, అమ్మవార్ల ఫోటోలతో ముద్రించిన రసీదు పుస్తకాలు, విలువైన పత్రాలను సిబ్బంది దహనం చేసిన సంగతి తెలిసిందే. తైల ద్రవ్యాలు వేయాల్సిన హోమ గుండంలో రసీదు పుస్తకాలు వేయడంపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.కార్తీక పూజలు సందర్భంగా హోమ గుండాల్లో ప్రత్యేక హోమాలు నిర్వహిస్తున్నారు. అయితే.. ఈ ఘటనపై శాఖపరమైన విచారణకు ఆలయ ఈవో చర్యలు తీసుకున్నారు. సనాతన ధర్మం కోసం మాట్లాడుతున్న డీప్యూటీ పవన్ కల్యాణ్ నియోజకవర్గంలోని ఆలయంలో ఇలాంటి అపచారాలు జరగడంపై భక్తుల విస్మయం వ్యక్తం చేస్తున్నారు. -
గురునానక్ జయంతి: ప్రత్యేక ప్రార్థనలు, ప్రసాదం రెసిపీ షేర్ చేసిన బాలీవుడ్ నటి
కార్తీక పౌర్ణమి గురునానక్ జయంతి పర్వదినాన్ని బాలీవుడ్ నటి నిమ్రత్ కౌర్ జరుపుకుంది. ఈ శుభ సందర్భంగా స్వయంగా ఇంట్లోనే కడ ప్రసాదం(హల్వా) తయారు చేసి గురుద్వారాలో ప్రార్థనలు, నివేదన అనంతరం పంచిపెట్టింది. కుటుంబంలో తరతరాలుగా కడ ప్రసాదం తయారు చేస్తున్న వైనాన్ని వివరించి, ఈ రెసిపీ వీడియోను ఇన్‌స్టాలో షేర్ చేసింది. గురుద్వారాలో పూజల తరువాత మీడియాకు ప్రసాదాన్ని పంచిపెట్టడం విశేషం. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.గురునానక్ జయంతి సందర్భంగా ప్రసాదం హల్వాను ఎలా తయారు చేయాలో దశలవారీగా నిమ్రత్ కౌర్ వెల్లడించింది. ఈ ప్రసాదం తయారు చేయడం తన తల్లి దగ్గరనుంచి నేర్చుకున్నట్టు తెలిపింది. అలాగే తన తాతగారు చాలా ఏళ్లు గురుద్వారాలో హల్వా తయారు చేసేవారనీ, ఆయన్నుంచి అమ్మ , అమ్మనుంచి తాను నేర్చుకున్నానని చెప్పింది.కాగా బాలీవుడ్ నటి నిమ్రత్ కౌర్ అభిషేక్ బచ్చన్‌తో ఎఫైర్ ఉందనే పుకార్ల మధ్య గత కొన్ని వారాలుగా వార్తల్లో నిలుస్తోంది. ఐశ్వర్య రాయ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్ మధ్య సమస్యలకు నిమ్రత్ కౌర్‌తో ఎఫైర్ ఒక కారణమని ఊహాగానాలు జోరుగు నడుస్తున్న సంగతి తెలిసిందే. ఊహిస్తున్నాయి. ఈ వివాదాలను, ఆరోపణల ప్రభావం తనమీద ఏమాత్రం పడకుండా నిమ్రత్ కౌర్ తన పని తాను చేసుకుపోతోంది. View this post on Instagram A post shared by BollywoodShaadis.com (@bollywoodshaadis); View this post on Instagram A post shared by Nimrat Kaur (@nimratofficial) -
నవరాత్రి ప్రసాదాలు: పచ్చికొబ్బరితో లడ్డు
దసరా నవరాత్రులు మొదలయ్యాయి. అమ్మవారికి ప్రసాదాలు చేయాలి. ఆ ప్రసాదాలను పిల్లలు ఇష్టంగా తినాలి. పొంగలి... పులిహోరకు తోడు ఇంకేం చేద్దాం. పచ్చికొబ్బరితో లడ్డు... మూంగ్‌దాల్ కోకోనట్ ఖీర్ ట్రై చేద్దాం. మూంగ్‌దాల్ కోకోనట్ ఖీర్ కావలసినవి: పెసరపప్పు – అరకప్పు; నీరు – ఒకటిన్నర కప్పు; కొబ్బరిపాలు – ముప్పావు కప్పు (కొబ్బరి పాలు వీలుకాక΄ోతే గేదెపాలు లేదా ఆవుపాలు); బెల్లం పొడి– ముప్పావు కప్పు; యాలకుల పొడి – అర టీ స్పూన్; జీడిపప్పు – పది; కిస్మిస్ – పది ; ఎండుకొబ్బరి పలుకులు – 2 టేబుల్ స్పూన్లు; నెయ్యి – 2 టేబుల్ స్పూన్లు; వెన్న తీయనిపాలు – అరలీటరు (పావు వంతుకు ఇంకే వరకు మరిగించాలి).తయారీ: ∙మందపాటి పెనం వేడి చేసి అందులో పెసరపప్పు వేసి మంట తగ్గించి పచ్చివాసనపోయి మంచి వాసన వచ్చే వరకు వేయించాలి. వేడి తగ్గిన తరవాత పప్పును కడిగి నీటిని ΄ోసి ప్రెషర్ కుకర్‌లో రెండు – మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి ∙ఈ లోపు బెల్లం పొడిని ఒక పాత్రలో వేసి నాలుగు టేబుల్ స్పూన్ల నీటిని పోసి మరిగించాలి. చిక్కబడేటప్పుడు దించి పక్కన పెట్టాలి ∙ఒక పెనంలో నెయ్యి వేడి చేసి జీడిపప్పు, కిస్మిన్, ఎండుకొబ్బరి పలుకులను వేయించి పక్కన పెట్టాలి ∙ప్రెషర్ కుకర్ వేడి తగ్గిన తర్వాత మూత తీసి పెసరపప్పును మెదపాలి. అందులో కొబ్బరిపాలు కలిపి స్టవ్ మీద పెట్టి ఒక చిన్న మంట మీద ఐదు నిమిషాల సేపు ఉడికించాలి. ఆ తర్వాత బెల్లం పాకం, యాలకుల పొడి కలిపి ఉడికించాలి. ఇప్పుడు చిక్కటి పాలను కూడా పోసి కలిపితే పెసరపప్పు పాయసం రెడీ. చివరగా నేతిలో వేయించిన జీడిపప్పు, కిస్మిస్, ఎండుకొబ్బరి పలుకులను నేతితో సహా వేసి కలపాలి. గమనిక: నీటి కొలత ప్రెషర్ కుకర్‌లో ఉడికించడానికి మాత్రమే. పాత్రను నేరుగా స్టవ్ మీద పెట్టి ఉడికిస్తే కనీసం మూడు కప్పుల నీరు అవసరమవుతుంది. కావలసినవి: పచ్చి కొబ్బరి తురుము – 2 కప్పులు; యాలకుల పొడి– పావు టీ స్పూన్ ; జీడిపప్పు – 10; నెయ్యి– టీ స్పూన్; చక్కెర – ముప్పావు కప్పు (రుచిని బట్టి మోతాదు మార్చుకోవాలి); పాలు – కప్పు. పచ్చికొబ్బరితో లడ్డు..తయారీ: ∙ఒక పెనంలో నెయ్యి వేడి చేసి జీడిపప్పులు వేయించి పక్కన పెట్టాలి ∙అదే పెనంలో కొబ్బరి తురుము,పాలు, చక్కెర, యాలకుల పొడి వేసి మరిగించాలి ∙మిశ్రమం అడుగుకు అంటుకోకుండా కలుపుతూ ఉండాలి. మిశ్రమం దగ్గరయ్యేటప్పుడు తరచుగా కలుపుతూ ఉండాలి పాలు, చక్కెరలను కొబ్బరి తురుము పూర్తిగా పీల్చుకుని తేమ ఇంకిన తర్వాత స్టవ్ ఆపేయాలి ∙మిశ్రమం వేడి తగ్గి గోరు వెచ్చగా ఉన్నప్పుడు అందులో జీడిపప్పు వేసి కలిపి మిశ్రమాన్ని పెద్ద నిమ్మకాయంత సైజులో చేతుల్లోకి తీసుకుని లడ్డూలు చేయాలి. గమనిక : చక్కెర బదులు బెల్లంతో కూడా చేసుకోవచ్చు. చక్కెరతో చేస్తే చూడడానికి తెల్లగా ఆకర్షణీయంగా ఉంటాయి. పిల్లలకు చక్కెర తింటే జలుబు చేసేటట్లయితే బెల్లంతో చేసుకోవచ్చు. -
ఈ పాపం చంద్రబాబుకు మాత్రమే పరిమితం అవ్వాలి
-
దేవునితో బాబు ఆటలాడుతున్నాడు ఇది కేవలం రాజకీయ దురుద్దేశం మాత్రమే!
-
తిరుపతిలో గొప్ప వ్యవస్థ ఉంది.. మళ్ళీ గుర్తుచేస్తున్న ఇది టీటీడీ ప్రొసీజర్
-
లడ్డూ వివాదంపై సంచలన ట్వీట్..
-
చంద్రబాబును ఉతికారేసిన సుప్రీంకోర్టు
-
చంద్రబాబుకు చురకలు పెట్టిన జాతీయ నేతలు .. ప్రముఖులు
-
ట్విట్టర్లో ప్రకాష్ రాజ్ మరో చురక..
-
బాబు, పవన్ రాజీనామా చేయాలి మాజీ IAS డిమాండ్..
-
సుప్రీంకోర్టు సీరియస్.. రాజీనామా చేసి ఎన్నికలకు సిద్దమేనా..?
-
రాజీనామా..!? వాళ్ల గోతిలో వాళ్లే పడ్డారు
-
NDDB రిపోర్ట్ప అనుమానాలు.. సుప్రీంకోర్టు ప్రశ్నలకు సైలెంట్..?
-
చంద్రబాబు పాపం బయటకు రావాలి: వైఎస్ జగన్ (ఫొటోలు)
-
ఎందుకింత అయోమయం పవన్..
-
సిట్‌తో వాస్తవాలు బయటకు రావు.. VHP లీడర్ ఫైర్
-
తిరుపతికి లడ్డూ ఎలా వచ్చింది?
తిరుపతి లడ్డూపై వివాదం నెలకొన్న ప్రస్తుత తరుణంలో అసలు లడ్డూ ఎలా ఆవిర్భవించిందో తెలుసుకోవాలన్న ఆసక్తి చాలా మందిలో కలుగుతోంది. అసలు తిరుమల శ్రీ వేంకటేశుని ప్రసాదంగా లడ్డూ ఎప్పటి నుంచి ఉంది..అసలు లడ్డూయే ప్రసాదంగా ఎందుకు ఉంది అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ ప్రశ్నలకు అనిరుధ్ కనిశెట్టి అనే చరిత్రకారుడు ‘ది ప్రింట్’లో రాసిన సమగ్ర కథనంలో ఆసక్తికర విషయాలు వెల్లడించారు. తొమ్మిదో శతాబ్దం నుంచి ఇప్పటివరకు తిరుపతి చరిత్రను వివరిస్తూ కాలగమనంతో పాటు శ్రీ వేంకటేశుని ప్రసాదం ఎలా మారుతూ వచ్చిందన్నది అనిరుధ్ తన కథనంలో రాసుకొచ్చారు.వేల ఏళ్ల క్రితం తిరుపతి ప్రసాదం ఏంటి..?నిజానికి తిరుమల-తిరుపతి అనగానే లడ్డూ టక్కున గుర్తొచ్చేస్తుంది. ఎందుకంటే తిరుపతి వెళ్లినపుడు ఏడుకొండలవాడిని దర్శించుకోవడం ఎంత ముఖ్యమైన ఘట్టమో లడ్డూ ప్రసాదం తినడమూ భక్తులకు అంతే ముఖ్యం. ఏడుకొండలకు వెళ్లి లడ్డూ ప్రసాదం ఆరగించడమే కాదు..క్యూలో నిల్చొని కష్టపడి తీసుకున్న లడ్డూను ఇతరులకు పంచి పెట్టడం కూడా భక్తిలో భాగమైపోయాయి. ఇంతటి ప్రాముఖ్యం కలిగిన లడ్డూ నిజానికి తొలి ఉంచి ఏడు కొండలవాడి ప్రసాదం కాదని అనిరుధ్ చెబుతున్నారు. తొమ్మిదో శతాబ్దం నుంచి 1900 సంవత్సరం వరకు శ్రీవారి ప్రసాదం అన్నం,నెయ్యితో తయారు చేసిన పొంగల్ అని తెలిపారు. లడ్డూ ప్రసాదంగా ఎలా మారింది..?తొమ్మిదో శతాబ్దంలో తిరుపతి పుణ్యక్షేత్రం బ్రాహ్మణుల ఆధీనంలో చిన్న పల్లెటూరుగా ఉండేది.ఆ తర్వాతి కాలంలో చోళులు, విజయనగర రాజులు, బహమనీ సుల్తానులు, బ్రిటీషర్ల పాలనలో తిరుపతి క్షేత్రంలో చాలా మార్పులు జరిగాయి. శ్రీ వేంకటేశుడి మహిమతో తిరుపతి ప్రభ రోజురోజు పెరుగుతూ వచ్చింది.తొలుత అక్కడ పొంగల్‌గా ఉన్న ప్రసాదం ఉత్తర భారతీయుల కారణంగా లడ్డూగా మారిందని అనిరుధ్ తన కథనంలో రాశారు. ‘బాలాజీ’ అనే పిలుపు కూడా వారిదే..బ్రిటీషర్ల పాలనలో ఉత్తర భారతీయులు ఎక్కువగా తిరుపతి సందర్శనకు వచ్చేవారని, వీరు వెంకటేశుడిని బాలాజీగా పిలుచుకునే వారని తెలిపారు. వీరే పొంగల్‌గా ఉన్న తిరుపతి ప్రసాదాన్ని తీయనైన లడ్డూగా మార్చారని అనిరుథ్ రాసుకొచ్చారు.తొలుత బ్రాహ్మణుల ఆధీనంలో తిరుపతి ఉన్నపుడు వెంకటేశునికి స్వచ్చమైన మంచి నీటితో అభిషేకాలు అక్కడ నెయ్యితో వెలిగించిన దీపాలు తప్ప ఎలాంటి నైవేద్యాలు ఉండేవి కాదని కథనంలో అనిరుధ్ పేర్కొనడం విశేషం. ఇదీచదవండి: లడ్డూ వెనుక ‘బాబు’ మతలబు ఇదేనా.. -
మేము తప్పుచేసాం అని నిరూపించు నేను నీ బూట్లు తుడుస్తా...!
-
ఈ ప్రశ్నలకు జవాబు ఉందా బాబు?
-
చంద్రబాబు అబద్ధాల కోరు .. ఆయన చరిత్ర నాకు తెలుసు ..
-
బాబు కొంపముంచిన లోకేష్
-
వాలంటీర్ల ధర్నా.. చంద్రబాబుకు డిమాండ్
-
ప్రసాదం వివాదంపై మరో బిగ్ ట్విస్ట్ .. సుప్రీం కోర్టుకు సుబ్రమణ్య స్వామి
-
తిరుమల లడ్డుపై భక్తుల షాకింగ్ రియాక్షన్
-
రిపోర్ట్' వచ్చి రెండు నెలలైతే ఎందుకు బయటపెట్టలేదు? బాబు రియాక్షన్..
-
Ys Jagan: చంద్రబాబు టీటీడీని బజారుకు ఈడ్చాడు...
-
చంద్రబాబు వ్యాఖ్యలు నేను నమ్మడం లేదు.. బహిరంగంగా క్షమాపణలు చెప్పాలి
-
తిరుమల ప్రసాదంపై టీటీడీ ఈవో కీలక ప్రకటన
-
తిరుమల ప్రసాదంపై చంద్రబాబు వ్యాఖ్యలు దుర్మార్గం: వైవీ సుబ్బారెడ్డి
సాక్షి, గుంటూరు: సీఎం చంద్రబాబు వ్యాఖ్యలపై టీటీడీ మాజీ ఛైర్మన్, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మండిపడ్డారు. దివ్య క్షేత్రం తిరుమల పవిత్రతను, వందల కోట్లమంది హిందువుల విశ్వాసాలను చంద్రబాబు దారుణంగా దెబ్బతీసి పెద్ద పాపమే చేశాడంటూ ఆయన ట్వీట్ చేశారు.‘‘తిరుమల ప్రసాదంపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు అత్యంత దుర్మార్గం. మనిషి పుట్టుక పుట్టిన వారెవ్వరూ కూడా ఇలాంటి మాటలు మాట్లాడరు. ఇలాంటి ఆరోపణలు చేయరు. రాజకీయం లబ్ధికోసం ఎంతటి నీచానికైనా చంద్రబాబు వెనుకాడడని మరోమారు నిరూపితం అయ్యింది. భక్తుల విశ్వాసాన్ని బలపరిచేందుకు తిరుమల ప్రసాదం విషయంలో నేను, నా కుటుంబం ఆ దేవ దేవుని సాక్షిగా ప్రమాణానికి సిద్ధంగా ఉన్నాం. చంద్రబాబు కూడా తన కుటుంబంతో ప్రమాణానికి సిద్ధమా?’’ అంటూ ఎక్స్ వేదికగా వైవీ సుబ్బారెడ్డి సవాల్ విసిరారు.ఇదీ చదవండి: పవన్.. గొంతు ఎందుకు పెగలడం లేదు?దివ్య క్షేత్రం తిరుమల పవిత్రతను, వందలకోట్లమంది హిందువుల విశ్వాసాలను చంద్రబాబునాయుడు దారుణంగా దెబ్బతీసి పెద్ద పాపమే చేశాడు. తిరుమల ప్రసాదంపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు అత్యంత దుర్మార్గం. మనిషి పుట్టుక పుట్టినవారెవ్వరూ కూడా ఇలాంటి మాటలు మాట్లాడరు, ఇలాంటి ఆరోపణలు చేయరు.1/2— Y V Subba Reddy (@yvsubbareddymp) September 18, 2024 -
భక్తులకు ఎఫ్ఎస్ఎస్ఏఐ ప్రసాదం మాత్రమే : కర్ణాటక నిర్ణయంపై వివాదం
కర్ణాటక ప్రభుత్వం భక్తులకు నాణ్యమైన 'ప్రసాదం' అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు కనిపిస్తోంది. గణేష్ మండపాల వద్ద 'ఎఫ్ఎస్ఎస్ఏఐ-ధృవీకరించిన ప్రసాదాలను మాత్రమే పంపిణీ చేయాలని ఆదేశించింది. ఈ మేరకు ఆగస్టు 31న ఆదేశాలు జారీ చేసింది. దీంతో సరికొత్త దుమారం రేగింది. కర్నాటక ప్రభుత్వ నిర్ణయం హిందూ వ్యతిరేక నిర్ణయమని బీజేపీ అభివర్ణించింది. అయితే, గణేష్ చతుర్థి పండుగ సీజన్లో ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు కర్ణాటక ప్రభుత్వం తెలిపింది. గణేష ఉత్సవ నిర్వాహకులకు జారీ చేసిన సర్క్యులర్ ప్రకారం ఎఫ్ఎస్ఎస్ఏఐ సర్టిఫికేట్ పొందిన వారిని మాత్రమే గణేష్ పందిళ్లలో ప్రసాదం తయారు చేయడానికి అనుమతిస్తారు. పందిళ్లలోఅందించే ప్రసాదానికి ఎఫ్ఎస్ఎస్ఏఐ ధృవీకరణ తప్పనిసరి అని బృహత్ బెంగళూరు మహానగర పాలికే (BBMP)కి రాసిన లేఖలో ఎఫ్ఎస్ఎస్ఏఐ పేర్కొంది. అంతేకాదు అనుమతి లేకుండా ప్రసాదం పంపిణీ చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎఫ్ఎస్ఎస్ఏఐ హెచ్చరించింది. అనుమతులు తప్పనిసరిబెంగళూరులోని గణేశ మంటప నిర్వాహకులు ఎఫ్ఎస్ఎస్ఏఐ ధృవీకరణతో పాటు, బహిరంగ ప్రదేశాల్లో విగ్రహాలను ఏర్పాటు చేసేందుకు పోలీసు, నగర పాలక సంస్థ, విద్యుత్ లాంటి స్థానిక అధికారుల అనుమతులను పొందాలి. నిర్వాహకులు పాండల్స్ కోసం కర్ణాటక రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి నిర్దేశించిన నిర్దిష్ట పర్యావరణ నిబంధనలను కూడా పాటించాలి. తప్పనిసరిగా సీసీటీవీ కెమెరాలు, అగ్నిమాపక యంత్రాలు, అత్యవసర భద్రతా చర్యల్లో భాగంగా వేదిక వద్ద అత్యవసర సంప్రదింపు నంబర్లను ప్రదర్శించాలి.మరోవైపుగణేష్ చతుర్థి ఉత్సవాలకు అనుమతిస్తూ కర్నాటక హైకోర్టు, అధికారుల నిర్ణయాన్ని సమర్థించడంతో బుధవారం హుబ్బళ్లి-ధార్వాడ్‌లోని ఈద్గా మైదాన్‌లో గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. -
గరుడ ప్రసాదం.. పోటెత్తిన జనం.. ట్రాఫిక్ నరకం (ఫొటోలు)
-
అజ్మీర్ దర్గాలో ప్రసాదం రెడీ
-
Tirumala: సర్వదర్శనానికి 18 గంటల సమయం
తిరుపతి, సాక్షి: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఉచిత సర్వదర్శనానికి 16 కంపార్ట్మెంట్లలో వేచివున్న భక్తులు. దర్శనానికి 18 గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పేర్కొంది. రూ.300 ప్రత్యేక దర్శనానికి 3 గంటల సమయం పడుతోందని వెల్లడించింది. మరోవైపు.. టైమ్ స్లాట్ ఎస్ఎస్డి దర్శనం కోసం 8 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉండగా.. 5 గంటల సమయం పడుతోంది. ఇక.. నిన్న(శుక్రవారం) స్వామివారిని 69,874 భక్తులు దర్శించుకున్నారు. అందులో 26,034 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారి హుండీ ఆదాయం 3.39 కోట్లుగా లెక్క తేలింది. వచ్చే 22న అయోధ్య రామా మందిరం ప్రారంభం.. నేడు ప్రత్యేక ప్లైట్‌లో అయోధ్య చేరనున్న టీటీడీ శ్రీవారి లడ్డులు. దేశీయ ఆవునెయ్యిని వినియోగించి లక్ష లడ్డూలు తయారి. నిన్న రాత్రి తిరుమల నుండి బయలుదేరిన లడ్డులు. -
రాములోరికి 44 క్వింటాళ్ల లడ్డూల భోగం!
2019 నవంబర్‌లో సుప్రీం కోర్టు ఇచ్చిన ‘రామ జన్మభూమి’ తీర్పు రామభక్తులకు ఎనలేని సంతోషాన్నిచ్చింది. 2020 ఆగస్ట్ 5న ప్రధాని నరేంద్ర మోదీ నూతన రామాలయ భూమి పూజను నిర్వహించడంతో రామ భక్తులు సంబరాలు చేసుకున్నారు. ఇక ఇప్పుడు రాబోయే 22న నూతన రామాలయం ప్రారంభం కానుండటంతో రామభక్తులు పెద్దఎత్తున పండుగ చేసుకోబోతున్నారు. 2024, జనవరి 22.. ఈ తేదీ చరిత్ర పుటల్లో నమోదుకానుంది. శ్రీ రాముడు ఆ రోజున దివ్యమైన రామాలయంలో కొలువుదీరనున్నాడు. ఈ నేపధ్యంలో పలువురు భక్తులు రాములోరికి విలువైన కానుకలు సమర్పిస్తున్నారు. అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా ఇక్కడికి తరలివచ్చే భక్తులకు ‘దేవ్రహా బాబా’ లడ్డూ ప్రసాదాన్ని పంపిణీ చేయనున్నారు. ఈ ప్రసాదాన్ని స్వచ్ఛమైన దేశీ నెయ్యితో తయారు చేస్తున్నారు. ‘దేవ్రహా బాబా’ రామ మందిర నిర్మాణాన్ని ముందే ఊహించిన సాధువు. శ్రీరాముడు జన్మించిన ప్రదేశం ఇదేనని ఆయనే తెలియజేశారు. శ్రీరామునికి భోగంగా సమర్పించేందుకు 44 క్వింటాళ్ల లడ్డూలను దేశీ నెయ్యితో తయారు చేస్తున్నామని, ఒక్క చుక్క నీరు కూడా వాడలేదని దేవ్రహ బాబా శిష్యులు తెలిపారు. ఈ లడ్డూలు ఆరు నెలల వరకూ చెడిపోవని పేర్కొన్నారు. ఈ లడ్డూలను వెండి పళ్లెంలో రామ్‌లల్లాకు నైవేద్యంగా సమర్పిస్తామన్నారు. అనంతరం వీటిని భక్తులకు ప్రసాదంలా పంపిణీ చేయనున్నామన్నారు. 44 క్వింటాళ్ల బరువు కలిగిన ఒక వేయి 111 లడ్డూలను తయారు చేస్తున్నామన్నారు. శ్రీరామునికి ఈ విధమైన సేవ చేయడం తమకు ఎంతో ఆనందదాయకంగా ఉందని దేవ్రహ బాబా శిష్యులు పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: అయోధ్యలో హోటల్ గది అద్దెలు ఆకాశానికి! -
తిరుమల నుంచి అయోధ్యకు లక్ష లడ్డూలు
-
గుడిలో తీర్థం, ప్రసాదాలు ఎందుకు ఇస్తారో తెలుసా? కారణమిదే!
ధనుర్మాసంలో చేసే పూజలకు తగ్గట్టుగానే తులసీతీర్థం, చక్కెర పొంగళి, కట్టె పొంగలి, దద్దోజనం, పులిహోర తదితర పోషక విలువలుండే ప్రసాదాలను ఆరగిస్తారు. అలంకార ప్రియుడైన శ్రీమహావిష్ణువును ఆరాధించడంలో స్వామివారికి ఇష్టమైన ప్రసాదాలను అర్పించడం ఎంతటి పుణ్యఫలమో, అంతటి ఆరోగ్యబలం కూడా. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని నిర్దేశించి ఈ ధనుర్మాసంలో అందిస్తున్న ప్రసాదాలు ఎన్నెన్నో పోషక విలువలతో ముడిపడి ఉండటం విశేషం. తీర్థం.. ప్రసాదంగా మనం స్వామివారికి సమర్పించి స్వీకరించే వీటిలో ప్రతి పదార్థానికి చక్కటి ఔషధగుణాలున్నాయి. తులసి తీర్థంతో మానసిక బలం ఆలయాల్లో దేవుడ్ని దర్శించుకున్న తర్వాత అర్చకుడు ఇచ్చే తీర్థమే తులసీతీర్థం. దీనినే భక్తులు తొలి ప్రసాదంగా భావిస్తారు. తులసి పత్రాలు, కర్పూరం.. యాలిక బీజాలను కలిపి తీర్థంగా ఇస్తుంటారు. ఇది మానసిక ఉద్వేగాలను అదుపులో ఉంచుతుంది. దగ్గు, ఆస్థమా, చర్మవ్యాధులు తీర్థ సేవనంతో నయమవుతాయయి. కడుపులో క్రిముల నివారణవుతాయి. కడుపు ఉబ్బరం తగ్గుతుంది. ముక్కు దిబ్బడ నుంచి ఉపశమనం కలుగుతుంది. మానసిక వేదన నుంచి ఉపశమనం లభిస్తుంది. పరమాన్నం.. పరమ ఔషధం.. పాలు, బియ్యంలో బెల్లం లేదా పంచదార వేసి చేసేదే పరమాన్నం. ఇందులో బాదంపప్పు, యాలకులు, పచ్చికొబ్బరి వేస్తారు. దేహానికి బలం, చక్కని కాంతిని ఇస్తుంది. ఆలోచన శక్తిని పెంచుతుంది. వాత, పైత్యాలను తగ్గిస్తుంది. ప్రతి 100 గ్రాముల బియ్యంలో 78 గ్రాముల కార్బోహైడ్రేట్లు, 8.5 గ్రాముల ప్రోటీన్లు ఉంటాయి. 100 గ్రాముల బెల్లంలో 11.4 మిల్లీ గ్రాముల కేలరీలు, ఇనుము ఉన్నాయి దీనికి పుష్టిని ఇచ్చే గుణం ఉంది. వాత రోగాలు నివారణవుతాయి. బాదంలో బలాన్ని చేకూర్చే గుణం ఉంది. ఉత్సాహం పెరగడంతో పాటు నరాల బలహీనత, రక్తపోటును తగ్గుతుంది. జ్వరాలు రాకుండా దద్దోజనం తాళింపు పెట్టిన పెరుగన్నమే దద్దోజనం, ఆవు పాలను మరగకాచి చల్లార్చి తోడుపెట్టిన పెరుగులో మిరియాలు, ఇంగువ, శొంఠి మొదలైన వాటిని అన్నంలో కలుపుతారు. దానిని ఆవునెయ్యితో పోపుపెడతారు. ధనుర్మాసంలోని రెండోపక్షంలో దీనిని ప్రసాదంగా నివేదిస్తారు మంచు, చలి ఎక్కువగా ఉండే ఈ సమయంలో దద్దోజనం తీసుకోవటం వల్ల జలుబు, విష జ్వరాలు, శీతల జ్వరం రాకుండా నిరోధిస్తుంది. అరుగుదలకు పులిహోర.. బియ్యంతో అన్నం వండిన తర్వాత దానికి పసుపు, నూనె, ఆవాలు, ఉప్పు, కరివేపాకు, శెనగపప్పు తదితరాలని కలిపి చేస్తారు. దీనివల్ల ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. ఆకలి పెరుగుతుంది. కాలేయానికి మంచిది. జలుబు, తుమ్ములు, ఉబ్బసం, దగ్గు నుంచి ఉపశమనం కలుగుతుంది. కట్టె పొంగలితో కీళ్లజబ్బులు నయం ధనుర్మాసంలో చలి, మంచు ఎక్కువగా ఉంటాయి. కట్టె పొంగలిని తినడం వల్ల జీర్ణశక్తి మెరుగ్గా ఉంటుంది. కీళ్ల జబ్బులు తగ్గుతాయి. దగ్గు, జలుబు రాకుండా చేస్తుంది. చక్కటి ఔషధం చక్కెర పొంగలి బియ్యం, పెసరపప్పు సమానంగా పోసి ఆవునేతితో ఉడికించి అందులో పంచదార, ద్రాక్ష, పచ్చకర్పూరం, కుంకుమపువ్వు, యాలకులు వంటి సుగంధ ద్రవ్యాలు వేసి చేసే చక్కెర పొంగలిని సేవించడం వల్ల దేహపుష్టి కలుగుతుంది. ఇది జ్ఞాపకశక్తిని పెంచుతుంది. శూల (నొప్పి)ని, జ్వరాన్ని హరిస్తుంది. పచ్చకర్పూరం వల్ల ఆహారం తేలిగ్గా జీర్ణమవుతుంది. కఫాన్ని, శరీరంలోని మంటల్ని నిరోధిస్తుంది. -
Karnataka Temple: ఆలయంలో విషాహారం
బెంగళూరు: బెంగళూరు శివారులోని హోస్కోటే ప్రాంతంలో ఒక ఆలయంలో ప్రసాదం తిని ఒక మహిళ ప్రాణాలు కోల్పోయింది. 70 మంది ఆస్పత్రి పాలయ్యారు. ఆలయంలో విషాహారం ఘటనను సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వం వెంటనే దర్యాప్తునకు ఆదేశించింది. ఆదివారం ఒక ఆలయంలో అక్కడి భక్తులు ప్రసాదం తిన్నాక వాంతులు, విరేచనాలతో ఇబ్బందులు పడుతూ వేర్వేరు ఆస్పత్రుల్లో చేరారు. ఆరోగ్యం పూర్తిగా విషమించి ఒక మహిళ సోమవారం ఆస్పత్రిలో కన్నుమూసింది. ఫుడ్ పాయిజన్‌కు కారణాలు ఇంకా తెలియరాలేదని పోలీసులు తెలిపారు. ఒక ఆస్పత్రిలో ఒక ఫ్లోర్ మొత్తం ఐసీయూ పేషెంట్ల కోసం కేటాయించి చికిత్స చేస్తోంది. ప్రసాదం తినడం వల్లే తమ ఆరోగ్యం చెడిపోయిందని కొందరు చెప్పగా, ప్రసాదం తినకపోయినా ఆరోగ్య సమస్యలు తలెత్తాయని ఇంకొందరు చెప్పారు! దీనిపై నుంచి నివేదిక రావాల్సి ఉందని పోలీసులన్నారు. -
శబరిమల అయ్యప్పస్వామి ప్రసాదం మీకు ఇష్టమా? ఇలా చేసుకోవచ్చు
శబరిమల అనగానే గుర్తొచ్చేది ముందుగా అయ్యప్ప ఆలయం, ఆ తర్వాత స్వామి ప్రసాదం. ఏటా శబరిమల అయ్యప్పస్వామిని భారీ సంఖ్యలో భక్తులు దర్శించుకున్న అనంతరం బంధువులు, కుటుంబ సభ్యులకు కోసం తప్పకుండా ప్రసాదం తీసుకెళ్తుంటారు. తిరుపతి లడ్డూ తర్వాత ఆ స్థాయిలో శబరిమలలో దొరికే అరవణి ప్రసాదానికి కూడా అంత పేరుంది. ఈ ప్రసాదాన్ని అరవణ ప్రసాదం అంటారు. బియ్యం, నెయ్యి, బెల్లాన్ని ఉపయోగించి చేసే ఈ ప్రసాదం తినడానికి రుచిగా ఉండటంతో పాటు చలికాలంలో తింటే ఆరోగ్యానికి మరీ మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఈ ప్రసాదానికి వాడే బియ్యం మావెలిక్కరలోని ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు పరిధిలోని చెట్టికులంగర దేవి ఆలయం నుంచి వస్తాయి. కేరళలో కొన్ని ప్రత్యేక వేడుకల్లో అరవణ పాయసాన్ని తయారు చేసుకుంటారు. మరి దీని తయారీ విధానం చూసేద్దాం. కావల్సిన పదార్థాలు ఎర్రబియ్యం: ఒక కప్పు నల్ల బెల్లం: రెండు కప్పులు శొంటిపొడి: 1 టీస్పూన్ పచ్చి కొబ్బరి: ఒక కప్పు నెయ్యి: తగినంత జీడికప్పులు: పావు కప్పు నీళ్లు: ఆరు కప్పులు అరవణ ప్రసాదం తయారీ ముందుగా పాన్ మీద నల్ల బెల్లం వేసి కరిగించాలి. మరో పాన్‌లో ముందుగా పచ్చికొబ్బరి, జీడిపప్పులు వేయించి పక్కనపెట్టుకోవాలి. ఆ తర్వాత ఎర్రబియ్యం బాగా శుభ్రంగా కడిగి అన్నంలా వండుకోవాలి. ఉడికించే సమయంలోనే కాస్త నెయ్యి వేసుకోని కాస్త మెత్తగా వండుకోవాలి. అనంతరం ఈ మిశ్రమాన్ని బెల్లం పాకంలో వేసి ఉడికించుకోవాలి. తర్వాత శొంటి పొడి, నెయ్యి వేస్తూ దగ్గరకు పడుతున్నంత సేపు ఉడికించుకోవాలి. చివరగా కొబ్బరి ముక్కలు, జీడిపప్పు వేసుకోవాలి. అంతే ఎంతో టేస్టేగీ ఉండే అవరణ పాయసం రెడీ. -
మధురాతి మధురం..
అన్నవరం: అమృతానికి సరిసాటి అన్నవరం శ్రీ వీర వేంకట సత్యనారాయణస్వామి వారి ప్రసాదమే అంటే అతిశయోక్తి కానే కాదు. స్వామివారి గోధుమ నూక ప్రసాదం పేరు వింటే చాలు.. నోట్లో నీరూరక మానదు. ప్రసాదంతో పాటు అది కట్టిన ఆకు కూడా నాకేయాలనిపించేంత రుచిగా ఉంటుంది. అయితే, ఇటీవల సత్యదేవుని ప్రసాదం నాణ్యతపై తరచుగా విమర్శలు వస్తున్నాయి. ప్రసాదం అంత రుచిగా ఉండటం లేదని, ఒక్క రోజు కూడా నిల్వ ఉండటం లేదని పలువురు భక్తులు విమర్శిస్తున్నారు. దీనిపై గతంలో డయల్ యువర్ ఈఓ కార్యక్రమంలో కూడా ఫిర్యాదులు వచ్చాయి. దీనికి తోడు వీఐపీల కోసం ఎక్కువ సేపు ఉడికించి తయారు చేసే స్పెషల్ ప్రసాదాన్నే సాధారణ భక్తులకు కూడా ఇవ్వాలనే డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలో మరింత రుచిగా, నిల్వ ఉండేలా గోధుమ నూక ప్రసాదం తయారు చేసేందుకు దేవస్థానం అధికారులు చర్యలు చేపట్టారు. దేవస్థానం ఈఓ చంద్రశేఖర్ అజాద్ రెండు రోజుల పాటు ప్రసాద తయారీ విభాగంలో ఒక కళాయిలో భక్తులకు విక్రయించే ప్రసాదం, ఇంకో కళాయిలో వీఐపీ ప్రసాదం వండించి రెండింటి మధ్య తేడాను గమనించారు. నీరంతా ఆవిరయ్యే వరకూ బాగా ఉడికించడం వలన స్పెషల్ ప్రసాదం రంగు, రుచి బాగుంటున్నాయని నిర్ధారణకు వచ్చారు. ఈ నేపథ్యంలో సాధారణ భక్తులకు విక్రయించే ప్రసాదం కూడా అదే విధంగా తయారు చేయాలని నిర్ణయించారు. మరింతగా యాలకుల పొడి ప్రసాదం తయారీకి ఒక్కో కళాయిలో వంద డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద మరిగించిన 40 లీటర్ల నీరు, 15 కేజీల గోధుమ నూక, రెండు విడతలుగా 30 కిలోల పంచదార వేస్తారు. గోధుమ నూక ఉడికాక ఆరు కేజీల నెయ్యి, 150 గ్రాముల యాలకుల పొడి కలుపుతారు. ప్రసాదం తయారయ్యాక దానిని తొట్టెలో వేసి, దానిపై కూడా యాలకుల పొడి చల్లి, కాస్త చల్లారాక ప్యాకెట్లు కడతారు. ప్యాకింగ్ చేసేటప్పుడు మరో రెండు కిలోల నెయ్యి కలుపుతారు. గంటన్నర వ్యవధిలో ఒక్కో కళాయికి 80 కేజీల ప్రసాదం తయారవుతుంది. కళాయి ప్రసాదం తయారీకి సుమారు 4.730 కిలోల గ్యాస్ వినియోగమవుతోంది. ఒక్కో కళాయి ప్రసాదం తయారీకి వినియోగిస్తున్న యాలకుల పొడిని ఇకపై 200 గ్రాములకు పెంచాలని, ప్రసాదాన్ని గంటన్నరకు బదులు రెండు గంటల పాటు ఉడికిస్తే రుచి పెరుగుతుందని ధర్మకర్తల మండలి సమావేశంలో ఈఓ అజాద్ ప్రతిపాదించారు. మరో అరగంట ఎక్కువగా ప్రసాదాన్ని ఉడికించడం వలన కళాయి ప్రసాదం తయారీకి 6 కిలోల (అదనంగా 1.270 కిలోలు) వరకూ గ్యాన్ వినియోగమవుతుంది. ఈ ప్రతిపాదనలకు ధర్మకర్తల మండలి ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. కళాయి ప్రసాదానికి 150 గ్రాముల ప్రసాదం ప్యాకెట్లు 533 వస్తాయి. తాజా మార్పుల వలన ఒక్కో కళాయి ప్రసాదం తయారీకి సుమారు రూ.180 అదనంగా ఖర్చవుతుందని అంచనా వేశారు. అంటే ప్రతి ప్యాకెట్‌కు అదనంగా 35 పైసలు ఖర్చు కానుంది. దేవస్థానంలో ఏటా 1.80 కోట్ల ప్రసాదం ప్యాకెట్లు తయారవుతాయి. కొత్తగా చేపట్టే మార్పుల వలన ఏటా అదనంగా సుమారు రూ.60 లక్షలు ఖర్చయ్యే అవకాశం ఉందని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఆ మేరకు దేవదాయ శాఖ కమిషనర్ అనుమతి తీసుకోవాలని నిర్ణయించారు. ఏటా రూ.40 కోట్ల ఆదాయం సత్యదేవుని ప్రసాదం విక్రయాల ద్వారా అన్నవరం దేవస్థానానికి ఏటా రూ.40 కోట్ల ఆదాయం వస్తోంది. రత్నగిరిపై 2 కౌంటర్లలో ఉదయం నుంచి రాత్రి వరకు, కొండ దిగువన తొలి పావంచా, నమూనా ఆలయం వద్ద 24 గంటలూ స్వామివారి ప్రసాదాలు విక్రయిస్తున్నారు. ఈ కౌంటర్ల ద్వారా 150 గ్రాముల బరువైన ప్రసాదం ప్యాకెట్లను ఏటా దాదాపు 1.80 కోట్లు విక్రయిస్తున్నారు. విశాఖపట్నం నుంచి రాజమహేంద్రవరం వైపు ఉన్న జాతీయ రహదారి పక్కన కూడా మరో ప్రసాదం కౌంటర్, నమూనా ఆలయం నిర్మాణానికి ఏర్పాట్లు చేస్తున్నారు. దీని ద్వారా కూడా ప్రసాదం విక్రయాలు మరింత పెరిగే అవకాశం ఉంది. భక్తుల కోసమే.. సత్యదేవుని ప్రసాదం మరింత రుచిగా తయారు చేసి భక్తులకు అందించాలనేదే మా ప్రయత్నం. ఇందులో భాగంగా ప్రయోగాత్మకంగా యాలకుల పొడి పరిమాణం పెంచి, ఎక్కువసేపు పొయ్యి మీద ఉడికిస్తే బాగా రుచిగా తయారైంది. అదేవిధంగా ప్రసాదం తయారు చేసి భక్తులకు అందించాలని నిర్ణయించాం. దీనికి కమిషనర్ అనుమతి తీసుకోవాల్సి ఉంది. – చంద్రశేఖర్ అజాద్, కార్యనిర్వహణాధికారి, అన్నవరం దేవస్థానం -
Bathukamma: పండుగ వేళ తొమ్మిది రకాల నైవేద్యాలు.. ఆరోగ్య ప్రయోజనాలెన్నో!
పూలనే దేవతారూపంగా కొలిచే అపురూపమైన పండుగ బతుకమ్మ. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు అద్దం పట్టే ఈ పూల పండుగ అంటే కేవలం ఆటపాటలే కాదు.. ఘుమఘుమలాడే పిండి వంటలు కూడా గుర్తుకువస్తాయి. బతుకమ్మ ఆటా.. పాటా మానసికోల్లాసాన్ని ఇస్తే.. ఇంటి తిరిగి వెళ్లే వేళ ఇచ్చిపుచ్చుకునే వాయినాలు.. ఆరోగ్యానికి మేలు చేస్తాయి. తొమ్మిది రోజులు చేసే తొమ్మిది రకాల ప్రసాదాలు పోషక విలువలు కలిగి ఉంటాయి. ఐరన్ పుష్కలం సాధారణంగా మహిళలు, పిల్లల్లో ఐరన్ లోపం ఎక్కువగా కనిపిస్తుంది. బతుకమ్మ సమయంలో తయారు చేసే సద్దిలో ఐరన్ శాతం ఎక్కువ. నువ్వులు, పల్లీలు, కొబ్బరి పొడి, సత్తుపిండి, పెసర ముద్దలు... ఇలా చిరుధానాల్యతో కూడిన వంటకాలు తింటే ఆరోగ్యకరమని పెద్దల మాట. నువ్వుల ముద్దలు నువ్వుల వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. బతుకమ్మ పండుగ వేళ వీటితో పొడి చేస్తారు. శరీరానికి ముఖ్యమైన అమైనోయాసిడ్స్ నువ్వుల్లో పుష్కలం. ఇక వీటిలో జింక్, కాల్షియం, పొటాషియం కూడా ఎక్కువే. మొదడును చురుకుగా ఉంచడంలో జింక్ కీలక పాత్ర పోషిస్తే.. కాల్షియం ఎమకల ధృడత్వాన్ని దోహదం చేస్తుంది. సత్తు పిండి బతుకమ్మ వేడుకల్లో మొదటి రోజు సాధారణంగా ఆకువక్కలు, తులసీదళాలు, దానిమ్మగింజలు, శనగపప్పు, పెసరపప్పు, నువ్వులు, మొక్కజొన్న గింజల సత్తు పిండిని తయారు చేసుకుంటారు. దీనిలో పీచు ఎక్కువగా ఉంటుంది. కార్బొహైడ్రేట్స్ తక్కువగా ఉంటాయి. కాగా పీచు పదార్థాల వల్ల మలబద్దకం దూరమవుతుంది. ఇక రెండోరోజు పప్పు బెల్లం, రేగు పండ్లు, మూడో రోజు పూర్ణాలు, నాల్గోరోజు బెల్లం బియ్యం, ఐదో రోజు అట్లు, ఎనిమిదో రోజు నువ్వులు, బెల్లం కలిపిన వెన్న ముద్దలు, తొ మ్మిదోరోజు బియ్యం పిండి, గోధుమపిండి, బెల్లంతో మలీద ముద్దలు చేసుకుంటారు. వీటిలోనూ ఆరోగ్యానికి దోహదం చేసే కారకాలు ఎక్కువే. పెసర ముద్దలు పెసర్లను ఉడకబెట్టి అందులో బెల్లం కలిపి ముద్దలుగా చేస్తారు. ఇది జీర్ణశక్తిని పెంచడంతోపాటు జీర్ణ సంబంధిత వ్యాధులనూ తగ్గిస్తుంది. కొబ్బరి పొడి కొబ్బరిలో ప్రొటీన్లు అధికం. మహిళల ఆరోగ్యానికి కొబ్బరి పొడి చాలా ఉపయోగపడుతుంది. పెరుగన్నం, పులిహోర... పెరుగన్నంలో పల్లీలు, వివిధ రకాల ధాన్యాలను కలుపుతారు. చింతపండు లేదా నిమ్మరసంతో చేసిన పులిహోర ప్రసాదం తయారు చేసుకుంటారు. చిన్న గాయాల నుంచి క్యాన్సర్ వరకు పసుపు విరుగుడుగా పని చేస్తుంది. చింతపండు గుజ్జులో విటమిన్ ‘సి’ అత్యధిక. పంచామృతాల్లో పెరుగు ఒకటి. ఇందులో పోషక విలువలు మెండు. దీంతో అన్నం కలిపి నైవేద్యం చేస్తారు. దీనిలో ప్రొటీన్, కాల్షియం, విటమిన్ బీ6, బీ12 వంటివి ఎక్కువగా ఉంటాయి. కొవ్వు తక్కువగా ఉండే పెరుగులో లాక్‌లో బాసిల్లై అధికంగా ఉంటుంది. పల్లి పిండి పల్లి పిండి శరీర ఎదుగుదలకు దోహదం చేస్తుంది. ప్రోటీన్లు ఎక్కువ. అంతేకాదు నోటికి రుచికరంగా ఉండడంతో చాలా మంది దీనిని ఇష్టపడతారు. ఇక పల్లి పొడికి బెల్లం కలిపి తింటే మరిన్ని ఎక్కువ ప్రయోజనాలు కలుగుతాయి. -
Bathukamma: బతుకమ్మ.. తొమ్మిది రోజులు.. తొమ్మిది నైవేద్యాలు ఇవే!
Bathukamma 2022- 9 Days- 9 Food Varieties: బతుకమ్మ పండుగ అంటేనే సంతోషాలు.. సంబరాలు.. పూలను ఆరాధించే ఈ అపురూప పండుగ సందర్భంగా రకరకాల ప్రసాదాలు, పిండి వంటకాలు, రుచికరమైన చిరుతిండ్లు తయారు చేస్తారు. తెలంగాణ వ్యాప్తంగా ఏ ఇంట్లో చూసినా ఘుమగఘుమలు గుబాళిస్తాయి. ముఖ్యంగా పల్లెల్లో అయితే పోటా పోటీగా భిన్న రుచులను తయారు చేసి మరీ వడ్డిస్తారు. ఇంట్లో చేసుకున్న ఏ వంటకమయినా.. మరో నలుగురికి పంచి వారితో తినిపించడం బతుకమ్మ పండుగలో కనిపించే సంతోషకరమైన సన్నివేశం. తొమ్మిది రోజుల బతుకమ్మ సంబరంలో కనిపించే ముఖ్యమైన ప్రసాదాలు ఇవి. ఎంగిలిపూల బతుకమ్మ.. బతుకమ్మ మొదటి రోజు పెతర అమావాస్య నాడు జరుపుకొంటారు. ఆరోజు నువ్వులు, బియ్యం పిండి, నూకలు కలిపి నైవేద్యం తయారు చేస్తారు. పండుగకు ముందు ఆయా పుష్పాలన్నీ వివిధ కీటకాల పరాగ సంపర్కం కారణంగా ఎంగిలి పడ్డాయని తలచి మొదటి రోజు బతుకమ్మను ఎంగిలిపూల బతుకమ్మగా వ్యవహరిస్తారు. ఆరోజు నువ్వుల సద్దిని అందరితో పంచుకుంటారు. అటుకుల బతుకమ్మ.. రెండో రోజు అటుకుల ప్రసాదం చేస్తారు. సప్పిడి పప్పు, బెల్లం, అటుకులు కలిపి అమ్మవారికి ఇష్టంగా వడ్డించే నైవేద్యం ఇది. ముద్దపప్పు బతుకమ్మ.. మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మ. ముద్ద పప్పు, పాలు, బెల్లంతో వేడివేడిగా నైవేద్యం తయారు చేసి అమ్మవారికి సమర్పిస్తారు. నానబియ్యం బతుకమ్మ.. నాలుగో రోజు నాన బియ్యం బతుకమ్మ. నాన బెట్టిన బియ్యంను పాలు, బెల్లంతో కలిపి ఉడికింది ప్రసాదంగా తయారు చేస్తారు. అట్ల బతుకమ్మ.. ఐదోరోజు అట్ల బతుకమ్మ. అట్లు లేదా దోశలను అమ్మవారికి నైవేద్యంగా వడ్డిస్తారు. అలిగిన బతుకమ్మ ఆరో రోజు అలిగిన బతుకమ్మగా జరుపుకొంటారు. ఆరోజు అమ్మవారికి అలకగా చెప్పుకుంటారు. ఉపవాసం పాటిస్తారు వేపకాయల బతుకమ్మ.. ఏడోరోజు వేపకాయల బతుకమ్మ. బియ్యంపిండిని బాగా వేయించి వేపపండ్లుగా తయారుచేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. వెన్నెముద్దల బతుకమ్మ.. ఎనిమిదో రోజు వెన్నెముద్దల బతుకమ్మ. నువ్వులు, వెన్న లేదా నెయ్యి బెల్లం కలిపి వెన్నముద్దల నైవేద్యంగా వడ్డిస్తారు. సద్దుల బతుకమ్మ.. బతుకమ్మ నవరాత్రి ఉత్సవాల్లో చివరి రోజును సద్దుల బతుకమ్మగా జరుపుకొంటారు. తొమ్మిదోరోజు పెరుగన్నం, చింతపండు పులిహోర, కొబ్బరన్నం, నువ్వులన్నం అనే ఐదురకాల నైవేద్యాలు తయారు చేసి అమ్మవారికి నివేదిస్తారు. మలీద ముద్దలు ఇవి కాక.. రొట్టె, బెల్లం లేదా చక్కెర కలిపి మలీద ముద్దలను తయారు చేసి అందరికీ పంచుతారు. దీనిని గోధుమ పిండి, డ్రై ఫ్రూట్స్, బెల్లం, పాలు, నెయ్యితో కలిపి తయారు చేస్తారు. దీంతో పాటు రకరకాల పొడులు పెసరపొట్టు, బియ్యం పిండి, కంది పిండికి కావాల్సినంత బెల్లం, చక్కర కలిపి నెయ్యితో పొడులు తయారు చేస్తారు. చదవండి: Bathukamma 2022: బతుకమ్మ పండుగ.. నేపథ్యం గురించి తెలుసా? Bathukamma: పండగ వెనుక ఎన్ని కథలున్నా.. బతుకమ్మ ప్రత్యేకత ఇదే -
అయ్యప్ప భక్తులకు తపాల శాఖ తీపికబురు
సాక్షి, వరంగల్: ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో శబరిమలై దేవస్థానం వెళ్లలేని భక్తులకు తపాలా శాఖ(పోస్టాఫీస్) ద్వారా అయ్యప్ప స్వామి ప్రసాదం రూ.450లకు అందించనున్నట్లు వరంగల్ డివిజన్ పోస్టల్ సూపరింటెండెంట్ ఉమామహేశ్వర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. స్వామివారి ప్రసాదం కావాలనుకునే భక్తులు సమీప పోస్టాఫీసుల్లో రూ.450 చెల్లించి అరవాన్న ప్రసాదం, పసుపు, కుంకుమ, నెయ్యి, అష్టోత్తర అర్చన ప్రసాదాలు జనవరి 16 వరకు అందుబాటులో ఉంచుతామని పేర్కొన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. చదవండి: ‘జైలోను పట్టుకుని వెనక్కు లాగిన పులి’.. ఆనంద్ మహీంద్ర ట్వీట్.. -
యాదాద్రి ప్రసాదంలో ప్లాస్టిక్ కవర్
యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి వడ ప్రసాదంలో ఓ భక్తుడికి ప్లాస్టిక్ కవర్ ప్రత్యక్షమైంది. భక్తుడు దీనికి సంబంధించిన వీడియో తీసి పోస్టు చేయడంతో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సికింద్రాబాద్‌లోని బేగంపేట్‌కు చెందిన సందీప్ అనే భక్తుడు కుటుంబ సభ్యులతో కలిసి ఈ నెల 11న యాదాద్రీశుడి దర్శనానికి వచ్చారు. స్వామి వారి నిత్య కల్యాణ వేడుకలో పాల్గొన్న వీరికి వడ ప్రసాదం అందజేశారు. ఇంటికెళ్లిన తర్వాత సోమవారం రాత్రి వడ ప్రసాదం తింటున్న సమయంలో అందులో ప్లాస్టిక్ కవర్ తగిలింది. దీంతో సందీప్ ‘‘ఎవరైనా చూసుకోకుండా తింటే ప్రాబ్లెమ్ అవుతుంది..దేవస్థానం వారు మరోసారి ఇటువంటివి జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని మనవి చేస్తున్నాను’’అంటూ వీడియో తీసి వాట్సాప్ గ్రూపులో పోస్టు చేశారు. ఈ విషయమై దేవస్థానం సూపరింటెండెంట్ అశోక్‌ను సాక్షి వివరణ కోరగా..ప్రసాదం తయారీ గోదాంలో బియ్యం బ్యాగులు ఉంటాయని వాటిపై ఉన్న కవర్ చిన్నది పడినట్లుందని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
సద్దుల బతుకమ్మ: నువ్వుల ముద్దలు, సత్తుపిండి, కొబ్బరి పొడి, పల్లి పిండి..
సాక్షి, పెద్దపల్లి: బతుకమ్మ మానవ సంబంధాలకే పరిమితం కాకుండా అతివలకు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. ఆడపడుచుల్లో ఆరోగ్యకాంతులను వెలిగిస్తుంది. ఆటపాటలతో మానసికోల్లాసమే కాదు, బతుకమ్మ ఆడిన తర్వాత సద్ది పేరుతో ఇచ్చిన్నమ్మ వాయినం.. పుచ్చుకుంటినమ్మ వాయినం.. అంటూ మహిళలు ఫలహారాలు ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకుంటారు. తొమ్మిది రోజులు తొమ్మిది రకాల ఫలాహారాలు చేస్తారు. వీటిల్లో అనేక పోషక విలువలున్నాయి... శరీరానికి కావాల్సిన అనేక పోషకాలను ఫలహారాల రూపంలో బతుకమ్మ అందిస్తోంది. బతుకమ్మ సద్దిలో ‘ఐరన్’ స్త్రీలు, పిల్లల్లో ఐరన్ లోపం కనిపిస్తుంది. బతుకమ్మ వేడుకల్లో తయారు చేసుకునే సద్దిలో ఐరన్ శాతం అధికంగా ఉంటుంది. సత్తుపిండి, పెసర ముద్దలు, నువ్వులు, కొబ్బరి, పల్లిపొడి లేదా ముద్దలు ఉంటాయి. ఇవన్నీ పండుగ సమయానికి చేతికి వచ్చే చిరుధాన్యాలు కాబట్టి వీటిని తింటే ఆరోగ్యకరమని పెద్దలు చెబుతున్నారు. ఒక్కోరోజు ఒక్కో తరహా పిండి వంటలను తయారు చేస్తుంటారు. చదవండి: నేడు, రేపు సద్దుల బతుకమ్మ వేడుకలు నువ్వుల ముద్దలు నువ్వులు ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. వీటితో పొడి చేస్తారు. నువ్వుల్లో అమైనోయాసిడ్స్ అధికంగా ఉంటాయి. ఇవి శరీరానికి చాలా ముఖ్యమైనవి. జింక్, కాల్షియం, పొటాషియం ఎక్కువగా ఉంటాయి. జింక్ మొదడును చురుకుగా ఉండేలా చేస్తుంది. కాల్షియం ఎమకల ధృడత్వాన్ని పెంచుతుంది. సత్తు పిండి బతుకమ్మ వేడుకల్లో తొలిరోజు ఆకువక్కలు, తులసీదళాలు, దానిమ్మగింజలు, శనగపప్పు, పెసరపప్పు, నువ్వులు, మొక్కజొన్న గింజల సత్తు పిండిని తీసుకెళ్తారు. సత్తుపిండిలో పీచు అధికంగా, కార్బొహైడ్రేట్స్ తక్కువగా ఉంటాయి. పీచు పదార్థాల వల్ల మలబద్దకం రాదు. రెండోరోజు పప్పు బెల్లం, రేగు పండ్లు, మూడో రోజు పూర్ణాలు, నాల్గోరోజు బెల్లం బియ్యం, ఐదో రోజు అట్లు, ఎనిమిదో రోజు నువ్వులు, బెల్లం కలిపిన వెన్న ముద్దలు, తొ మ్మిదోరోజు బియ్యం పిండి, గోధుమపిండి, బె ల్లంతో మలీద ముద్దలు తయారు చేస్తారు. íఇవి బతుకమ్మకు పెట్టే ప్రత్యేక నైవేద్యాలు పెసర ముద్దలు పెసర్లను ఉడకబెట్టి అందులో బెల్లం కలిపి ముద్దలుగా తయారు చేస్తారు. ఇది జీర్ణశక్తిని పెంచడంతోపాటు జీర్ణ సంబంధిత వ్యాధులనూ తగ్గిస్తుంది. కొబ్బరి పొడి కొబ్బరిలో ప్రొటీన్లు అధికంగా ఉంటాయి. మహిళల ఆరోగ్యానికి పొడి చాలా ఉపయోగపడుతుంది. పెరుగన్నం, పులిహోర... పెరుగన్నంలో పల్లీలు, వివిధ రకాల ధాన్యాలను కలుపుతారు. చింతపండు లేదా నిమ్మరసంతో చేసిన పులిహోర ప్రసాదంగా వాడుతున్నారు. చిన్న గాయాల నుంచి క్యాన్సర్ వరకు పసుపు విరుగుడుగా పని చేస్తుంది. చింతపండు గుజ్జులో విటమిన్ ‘సి’ అత్యధికంగా ఉంటుంది. పంచామృతాల్లో పెరుగు ఒకటి దీనిలో పోషక విలువలు మెండు. దీంతో అన్నం కలిపి కమ్మనైన నైవేద్యాన్ని సమరి్పస్తారు. ఇందులో ప్రొటీన్, కాల్షియం, రిబోప్లా విటమిన్, విటమిన్ బీ6, బీ12, వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. కొవ్వు తక్కువగా ఉండే పెరుగులో లాక్‌లో బాసిల్లై అధికంగా ఉంటుంది. పల్లి పిండి పల్లి పిండి శరీర ఎదుగుదలకు అత్యంత ప్రాధానమైంది. అధిక ప్రోటీన్లతోపాటు రుచికరంగా ఉండడంతో చాలా మంది ఇష్టంగా తింటారు. దీనికి బెల్లం జోడించడంతో కావల్సిన పోషకాలు లభిస్తాయి. వీటిని ముద్దలుగా సైతం చేస్తారు. రోగనిరోధక శక్తి పెరుగుతుంది సత్తుపిండితో రోగనిరోధక శక్తిని పెరుగుతుంది. రుచిగా ఉండే సత్తుపిండి పిల్లలకు, మహిళలకు చాలా ప్రొటీన్స్‌ను అందిస్తాయి. ఐరన్, కాల్షియంతో కండరాల పటిష్టత, ఎముకల గట్టితనం, పిల్లల్లో ఎదుగుదల వంటి అనేక రకాల ఉపయోగాలున్నాయి. షాపుల్లోని స్వీట్స్ తినడంకంటే, సాంప్రదాయ పిండివంటలను ప్రతీ ఒక్కరూ తినడం బెటర్. బతుకమ్మ ఆరోగ్యాన్ని పెంచే ప్రత్యేకమైన పండుగ. – రాజశేఖర్‌రెడ్డి, జనరల్ ఫిజీషియన్, గోదావరిఖని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి -
తిరుమల: భక్తులకు శ్రీవారి ధన ప్రసాదం
తిరుమల: భక్తులు శ్రీవారికి సమర్పిస్తోన్న చిల్లర నాణేలను తిరిగి భక్తులకే ధన ప్రసాదంగా అందించే వినూత్న ప్రయోగాన్ని టీటీడీ చేపట్టింది. ప్రస్తుతం కరెంట్ బుకింగ్‌లో రూ.500 గదులు పొందే భక్తులు కాషన్ డిపాజిట్‌గా రూ.500 అదనంగా చెల్లిస్తున్నారు. గదులు ఖాళీ చేసి వెళ్లేటప్పుడు భక్తులకు ఆ మొత్తాన్ని టీటీడీ తిరిగి చెల్లిస్తుంది. ఈ కాషన్ డిపాజిట్‌ను ధన ప్రసాదం రూపంలో చెల్లించే విధానాన్ని బుధవారం నుంచి టీటీడీ చేపట్టింది. ధన ప్రసాదంలో పసుపు, కుంకుమతోపాటు నాణేల ప్యాకెట్‌ను భక్తులకు అందజేస్తోంది. భక్తులు చిల్లర నాణేలను తీసుకునేందుకు ఆసక్తి చూపకపోతే నోట్ల రూపంలో కాషన్ డిపాజిట్‌ను తిరిగి ఇస్తోంది. ప్రస్తుతం రూ.2.5 కోట్ల మేరకు నాణేలు టీటీడీ వద్ద పేరుకుపోయాయి. వాటిని ధన ప్రసాదం రూపేణా భక్తులకు టీటీడీ అందిస్తోంది. ఆ ఆరోపణలన్నీ అవాస్తవం : టీటీడీ హిందూ ధర్మ పరిరక్షణే లక్ష్యంగా టీటీడీ నిర్ణయాలు తీసుకుంటుందని టీటీడీ పీఆర్వో బుధవారం తెలిపారు. ఇటీవల కొన్ని పత్రికలు, సామాజిక మాధ్యమాల్లో పనిగట్టుకుని టీటీడీపై దుష్ప్రచారం చేస్తున్నారని, అదంతా అవాస్తవమని పేర్కొన్నారు. తిరుమల అన్నమయ్య భవన్ హోటల్‌ను, బెంగళూరులోని ఒక సంస్థకు కేటాయించడానికి టీటీడీ అధికారులు చర్యలు చేపట్టినట్లు నిరాధారమైన చౌకబారు ఆరోపణలు చేశారని చెప్పారు. అన్నమయ్య భవన్ హోటల్‌తో పాటు తిరుమలలోని అన్ని హోటళ్ల నుంచి బకాయిలను రాబట్టడానికి టీటీడీ చర్యలు చేపట్టిందని చెప్పారు. అసత్య వార్తలు ప్రచురించే వారిపై టీటీడీ చట్టపరమైన చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. ఇవీ చదవండి: Andhra Pradesh: సిరి ధాన్యాలపై గురి మహానేత వైఎస్సార్: నిలువెత్తు సంక్షేమ రూపం -
ఆన్లైన్ పూజలు.. ఇంటికే ప్రసాదం
సాక్షి, హైదరాబాద్: వినాయక నవరాత్రులను పురస్కరించుకుని దేవాదాయ, తపాలాశాఖలు సంయుక్తంగా ఆన్లైన్ సేవలు, స్పీడ్‌పోస్టు ద్వారా ఇంటికే ప్రసాద పంపిణీకి శ్రీకారం చుడుతున్నాయి. ప్రయోగాత్మకంగా మొదట సికింద్రాబాద్ గణేశ్ టెంపుల్‌తో దీన్ని ప్రారంభిస్తున్నారు. కోవిడ్ ఆందోళన నేపథ్యంలో కొందరు భక్తులు దేవాలయాలకు వెళ్లేందుకు భయపడుతున్నారు. కానీ, ఏటా వినాయక ఉత్సవాల వేళ ఆలయంలో పూజలు చేయించుకునే సంప్రదాయాన్ని ఆచరించలేకపోతు న్నామన్న భావన వారిలో ఉంది. ఇలాంటి వారి కోసం ఈ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. తపాలాశాఖ ఈ–షాప్ వెబ్సైట్ ద్వారా పేర్లు నమోదు చేసుకుంటే నవరాత్రి ప్రత్యేక పూజాదికాలను నిర్ధారిత రోజుల్లో వారి పేరుతో నిర్వహి స్తారు. కుంకుమ, అక్షింతలు, పొడి ప్రసాదాలను స్పీడ్ పోస్టు ద్వారా భక్తుల ఇళ్లకు పంపుతారు. సెప్టెంబరు 12న లక్ష భిల్వార్చన (రుసుము రూ.320), 14న సత్య గణపతి వ్రతాలు (రూ.620), 17న సిద్ధిబుద్ధి సమేత గణపతి కళ్యాణం (620), 10 నుంచి 19 వరకు సహస్ర మోదక గణపతి హోమాలు (620), 10 నుంచి 20 వరకు సర్పదోష నివారణ అభిషేకాలు (రూ.400) ఉంటాయని, ఆయా సేవలకు కనీసం రెండు రోజుల ముందు పేర్లు నమోదు చేసుకోవాలని అధికారులు వెల్లడించారు. -
సత్యదేవుడి ప్రసాదం ముప్పావుగంటలో సిద్ధం
అన్నవరం: సత్యదేవుని గోధుమ నూక ప్రసాదాన్ని యంత్రాల ద్వారా తయారు చేయడానికి మంగళవారం శ్రీకారం చుట్టారు. ఈ ప్రక్రియ కొత్త భవనంలో మొదలైంది. తొలి కళాయిలో 80 కిలోల ప్రసాదం తయారైంది. స్వామికి నివేదన సమర్పించాక ప్యాకింగ్ సిబ్బంది 150 గ్రాముల చొప్పున విస్తర్లలో ప్యాక్ చేసి, విక్రయ కౌంటర్లకు పంపించారు. మంగళవారం భక్తుల సంఖ్య తక్కువగా ఉంటుందని, 98 కళాయిల్లో 7,930 కిలోల ప్రసాదం తయారు చేశామని అధికారులు తెలిపారు. ప్రసాదం తయారీ ఇలా.. తొలుత వంద డిగ్రీల సెల్సియస్ వేడినీరు 40 లీటర్లు గొట్టం ద్వారా కళాయిలో పడింది. అందులో 35 కిలోల గోధుమ నూక మరో గొట్టం ద్వారా, ఇంకో గొట్టం ద్వారా రెండు విడతలుగా 30 కిలోల పంచదార పడ్డాయి. ప్రసాదం ఉడికిన తర్వాత ఆరు కిలోల నెయ్యి, 150 గ్రాముల యాలకుల పొడిని సిబ్బంది కలిపారు. కళాయికి ఇరువైపులా ఉన్న చక్రాలను ముందుకు వంచడం ద్వారా ప్రసాదం మరో తొట్టెలో పడింది. ప్యాకింగ్ సమయంలో మరికొంత నెయ్యి కలుపుతామని సిబ్బంది తెలిపారు. ఈ తయారీ ప్రక్రియ 45 నిమిషాల్లో ముగియడం ఆశ్చర్యం కలిగించింది. భవన దాత మట్టే సత్యప్రసాద్ చొరవ తీసుకుని యంత్రాల పనితీరు పర్యవేక్షణకు నలుగురు టెక్నీషియన్లను పంపించారు. దేవస్థానం పీఆర్ఓ కె.కొండలరావు, ఈఈ వి.రామకృష్ణ, ఆలయ ఏఈఓ డీవీఎస్ కృష్ణారావు తదితరులు ప్రసాద తయారీని పరిశీలించారు. యంత్రాలకు సమీపాన ప్యాకింగ్ చేస్తుండడంతో కొంచెం వేడి వస్తోందని సిబ్బంది తెలిపారు. కుకింగ్, ప్యాకింగ్‌ల మధ్యన అడ్డంగా అద్దాలు అమర్చి, అదనంగా ఫ్యాన్లు బిగించేలా చూస్తామని భవన దాత సత్యప్రసాద్ వారికి హామీ ఇచ్చారు. ఆలయ సూపరింటెండెంట్ బలువు సత్యశ్రీనివాస్, ప్రసాదం సూపరింటెండెంట్ భాస్కర్, సీనియర్ అసిస్టెంట్ బండారు వేంకట రమణ తదితరులు ప్రసాదం తయారీ ఏర్పాట్లను పర్యవేక్షించారు. తయారీ సులభం ప్రసాదం తయారీ సులభంగా ఉంది. నలుగురు రెగ్యులర్, నలుగురు ఔట్సోర్సింగ్ సిబ్బంది తయారు చేస్తున్నారు. ఏకకాలంలో 20 కళాయిల ద్వారా కూడా ప్రసాదం తయారు చేయవచ్చు. - పీఎస్‌ఎస్‌వీ ప్రసాదరావు, ప్రసాదం హెడ్ కుక్ ప్యాకింగ్ వేగం ప్రసాదం ప్యాకింగ్ కూడా వేగంగా జరుగుతోంది. తయారీకి, ప్యాకింగ్ చేసే ప్రదేశం దగ్గరగా ఉండడంతో కొంత వేడి వస్తోంది. దీంతో ఇబ్బంది పడాల్సి వస్తోంది. వేడి రాకుండా ఏర్పాట్లు చేయాలి. - వీవీఎస్ కుమార్, సీనియర్ ప్యాకర్ -
రాజన్న, నర్సన్న ప్రసాదాలు పొందడం ఇక సులువే!
సాక్షి, హైదరాబాద్/వేములవాడ: రాష్ట్రంలోని పది ప్రధాన దేవాలయాల ప్రసాదాలను నేరుగా ఇళ్లకే పంపే ప్రత్యేక సేవను దేవాదాయ శాఖ ప్రారంభించింది. ఇందుకు శనివారం తపాలా శాఖతో ఒప్పందం కుదుర్చుకుంది. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి, భద్రాచలం సీతారామచంద్రస్వామి, వేములవాడ రాజరాజేశ్వరస్వామి, బాసర శ్రీ జ్ఞాన సరస్వతి, కొండగట్టు ఆంజనేయ స్వామి, కొమురవెల్లి మల్లికార్జున స్వామి, సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళీ, సికింద్రాబాద్ గణేశ్, బల్కంపేట ఎల్లమ్మ–పోచమ్మ, కర్మన్‌ఘాట్ ఆంజనేయస్వామి దేవాలయాల్లో ప్రస్తుతం ఈ సేవలు ప్రారంభించారు. భక్తులు ఈ దేవాలయాల ప్రసాదాలు కావాలని స్థానిక తపాలా కార్యాలయానికి వెళ్లి వివరాలు నమోదు చేసుకుంటే రెండు మూడు రోజుల్లో ఆయా ఆలయాల నుంచి ప్రసాదం వారి ఇంటికి తపాలా ద్వారా చేరుతుంది. అయితే, ఆయా దేవాలయాలకు ప్రత్యేక ప్రసాదాలుంటాయి. పులిహోర, దధ్యోదనం, లడ్డూ, రవ్వకేసరి లాంటివి. కానీ, ఇవి రెండుమూడు రోజుల పాటు నిల్వ ఉండే అవకాశం ఉండదు. దీనికోసం తపాలా ద్వారా డ్రైఫ్రూట్స్, రవ్వ పొడి ప్రసాదాలను మాత్రమే పంపనున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న 1.60 లక్షల తపాలా కార్యాలయాలలో ఈ సేవలు అందుబాటులో ఉండనున్నాయి. ఇప్పటికే ఆన్లైన్ ద్వారా ఆయా దేవాలయాల ఆర్జిత సేవలు నిర్వహించుకునే అవకాశాన్ని దేవాదాయ శాఖ గతంలోనే ప్రారంభించింది. వేర్వేరు ప్రాంతాల్లో ఉంటూ నేరుగా తమ పేరుతో జరిగే పూజల్లో పాల్గొనే అవకాశం లేని వారు ఆన్లైన్లో గోత్రనామాలు, పూజ జరగాల్సిన తేదీని బుక్ చేసుకుంటే ఆ రోజు వారి పేరిట పూజలు నిర్వహిస్తున్నారు. ఇందు కోసం ఐటీ శాఖ రూపొందించిన టీ యాప్ ఫోలి యో ద్వారా 22 దేవాలయాల్లో ఈ సేవలు పొందే వీలుంది. తాజాగా పూజలతోపాటు ప్రసాదాలు కూడా పొందే వీలును తపాలాశాఖతో కలిసి ఏర్పా టు చేసింది. శనివారం అరణ్య భవన్‌లోని కార్యాలయంలో దేవాదాయ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి సమక్షంలో జరిగిన ఈ ఒప్పందంలో దేవాదాయశాఖ కమిషనర్ అనిల్‌కుమార్, తపాలాశాఖ తెలంగాణ సర్కిల్ చీఫ్ పోస్ట్‌మాస్టర్ జనరల్ ఎస్.రాజేంద్రకుమార్, దేవాదాయ శాఖ అదనపు కమిషనర్ కృష్ణవేణి, హైదరాబాద్ రీజియన్ పోస్ట్‌మాస్టర్ జనరల్ పీవీఎస్‌రెడ్డి, హైదరాబాద్ పోస్ట్ మాస్టర్ జనరల్ సాగర్ హనుమాన్ సింగ్, డైరెక్టర్ ఆఫ్ పోస్టల్ సర్వీసెస్ ఎస్వీ రావు తదితరులు పాల్గొన్నారు. -
స్పీడ్‌పోస్ట్‌లో శబరిమల ప్రసాదం
తిరువనంతపురం: ఈ సీజన్లో మాత్రమే దొరికే శబరిమల అరవణ పాయసం భక్తులకు ఎంతో ప్రీతిదాయకం. కోవిడ్ మహమ్మారి వ్యాప్తితో ఎక్కువ మంది భక్తులు దర్శించుకోవడానికి అనుమతి ఇవ్వకపోవడంతో శబరిమల సందర్శించే వారి సంఖ్య లక్షల నుంచి వందలకు పడిపోయింది. దీంతో దేశవ్యాప్తంగా ఉన్న శబరిమల భక్తులకు స్వామి ప్రసాదం ఇంటి వద్దకే అందజేయాలని పోస్టల్ శాఖ నిర్ణయించింది. ఆ వెంటనే శబరిమల ప్రసాదాన్ని భక్తులకు డెలివరీ చేసేందుకు కేరళకు చెందిన పోస్టల్ సర్కిల్ ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డుతో ఒప్పందం కుదుర్చుకుంది. ప్రసాదం పంపిణీ కోసం సమగ్ర బుకింగ్, డెలివరీ ప్యాకేజీని అభివృద్ధి చేసినట్లు మంగళవారం అధికారికంగా పత్రికా ప్రకటన చేసింది. చదవండి: (మంచు కొండల్లో పెరిగిన పొలిటికల్ హీట్..) ప్రసాదం కిట్ ధర రూ.450 గా ప్రకటించింది. ఇందులో అరవణ పాయసం, విభూతి, కుంకుమ, పసుపు, నెయ్యి, అష్టోత్తర అర్చన ప్రసాదం ఉంటాయని తెలిపారు. ఒక వ్యక్తి ఒకేసారి 10 వరకు ప్రసాదం కిట్స్‌ని ఆర్డర్ చేయవచ్చని, అంతకన్నా ఎక్కువ కావాలంటే మరో రిసిప్ట్ పైన బుక్ చేయాలని పేర్కొన్నారు. స్పీడ్ పోస్ట్‌లో ప్రసాదం బుక్ అయిన వెంటనే, స్పీడ్ పోస్ట్ నంబర్ ఎస్ఎంఎస్ ద్వారా భక్తుడికి వస్తుంది. ఆ నంబర్‌తో ఇండియా పోస్టల్ వెబ్సైట్లో లాగిన్ అయ్యి ప్రసాదం ఎక్కడ ఉందో తెలుసుకోవచ్చని వివరించారు. ఈ సేవను నవంబర్ 16 నుంచి ప్రారంభించామని, ప్రజల నుంచి అద్భుతమైన స్పందన వచ్చిందని తెలిపారు. ఇప్పటికే దేశమంతటా 9,000 ఆర్డర్లు బుక్ చేయబడ్డాయని, ఈ సంఖ్య రోజురోజుకూ గణనీయంగా పెరుగుతుందన్నారు. కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో ఏడు నెలలుగా మూసివేసిన ఆలయాన్ని కొన్ని నిబంధనలతో అక్టోబర్ 16 నుంచి తెరిచారు. నవంబర్ 16 నుంచి అయ్యప్ప మాల వేసుకునే వారిని అనుమతించారు. అయితే రోజు వారీగా పరిమిత సంఖ్యలో అనుమతించడం, కఠినమైన ఆంక్షలు నేపథ్యంలో శబరిమలను సందర్శించే వారి సంఖ్య బాగా తగ్గిందని పేర్కొన్నారు. -
దళిత కుటుంబానికి భూమిపూజ తొలి ప్రసాదం
అయోధ్య: అయోధ్యలో రామ మందిర భూమి పూజకు సంబంధించిన ప్రసాదాన్ని తొలిగా ఒక దళిత కుటుంబం అందుకుంది. లడ్డూలు, రామచరిత మానస్ పుస్తకం, తులసిమాల ఉన్న ప్రసాదాన్ని యూపీ సీఎం ఆదేశాల మేరకు అయోధ్యలోని మేస్త్రీ వృత్తిలో ఉన్న మహావీర్ కుటుంబానికి అధికారులు పంపించారు. మహావీర్ అయోధ్యలోని సుతాటి ప్రాంతంలో కుటుంబంతో కలిసి నివసిస్తున్నారు. 2019 ఎన్నికల సందర్భంగా మహావీర్ ఇంట్లో ఆదిత్యనాథ్ భోజనం చేశారు. ‘అలి– బజరంగ బలి’ వ్యాఖ్యల కారణంగా అంతకుముందే సీఎం యోగిని మూడు రోజుల పాటు ఎన్నికల ప్రచారంలో పాల్గొనకూడదని ఎన్నికల సంఘం నిషేధం విధించింది. ‘నన్ను గుర్తుంచుకుని ప్రసాదం పంపినందుకు ఆయనకు కృతజ్ఞతలు’ అని మహావీర్ పేర్కొన్నారు. -
ఆ గుడిలో చికెన్, మటన్ బిర్యానీలే ప్రసాదాలు
భారతదేశం ఆలయాల నిలయం. ఇక్కడ ఒక్కొక్క దేవాలయానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. ముఖ్యంగా తమిళనాడులో ఉన్నన్ని దేవాలయాలు మరెక్కడా ఉండవు. అయితే.. ఆ రాష్ట్రంలోని మధురై ప్రాంతంలో ఉన్న మునియాండి స్వామి ఆలయానికి మరెక్కడా లేనంత విశిష్టత ఉంది. లడ్డూ, పులిహోరా, దద్దోజనం, వడ, చక్కెర పొంగలి, చివరకు బిస్మిల్లా బాత్ కూడా ఆలయాల్లో ప్రసాదంగా అందిస్తుండటం మనం చూశాం. కానీ ఏకంగా మాంసాహారాన్ని ఆలయాల్లో ప్రసాదంగా అందిస్తారా.? అంటే ఇలాంటి కొన్ని వింతలు కూడా ఉంటాయన్నది సత్యం. కానీ.. మునియాండి స్వామి ఆలయంలో చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీలే ప్రసాదాలు. గత ఎనిమిదిన్నర దశాబ్దాలుగా ఇక్కడ ఇదే ఆనవాయితీ. ప్రతి సంవత్సరం ఇక్కడ జనవరి 24 నుంచి రెండు రోజుల పాటు ఉత్సవాలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా వేలాది మంది భక్తులు మునియాండి ఆలయానికి వస్తారు. వారి కోసం 1000 కిలోల బియ్యం, 250 మేకపోతులు, 300 కోళ్లతో రుచికరమైన బిర్యానీలు వండుతారు. ఉత్సవాలు జరిగినన్ని రోజులు ఇదే ప్రసాదంగా అందిస్తారు. అంతేకాదు, ఆ బిర్యానీ ప్రసాదాన్ని పార్శిల్ కట్టించుకుని ఇంటికి తీసుకెళ్లే సదుపాయం కూడా ఉండటం గమనార్హం. Tamil Nadu: Biryani is served as 'prasad' at Muniyandi Swami temple in Vadakkampatti, Madurai. A devotee says,'I come here every yr,we're celebrating this festival for last 84 yrs.Around 1000 kg rice,250 goats&300 chickens are used to make biryani, we use public donations for it' pic.twitter.com/6ZYEIlKZkt — ANI (@ANI) January 26, 2019 -
‘పళని’ పంచామృతానికి జీఐ గుర్తింపు
సాక్షి, చెన్నై: తమిళనాడులో ప్రసిద్ధి చెందిన పళని పంచామృతానికి జీఐ గుర్తింపు లభించింది. ఈ విషయాన్ని జియోగ్రాఫిక్ ఇండెక్షన్ డిప్యూటీ రిజిస్ట్రార్ చిన్న రాజ్ చెప్పారు. దిండుగల్ జిల్లా పళనిలో దండాయుధపాణి స్వామిగా వెలసిన సుబ్రహ్మణ్యస్వామి ఆలయం ఉంది. పళని అంటే పంచామృతం. సహజ సిద్ధంగా ఐదు రకాల వస్తువులతో ఈ ప్రసాదం తయారు చేస్తారు. అరటి, బెల్లం, ఆవు నెయ్యి, స్వచ్ఛమైన తేనె, కర్జూరం వంటి వాటితో సిద్ధం చేస్తున్న ఈ పంచామృతం కొనుగోలుకు భక్తులు బారులు తీరుతుంటారు. దీని విక్రయాలు, అన్ని రకాల హక్కులు పళని ఆలయ పాలక మండలికే అప్పగించారు. ఈ నేపథ్యంలో ప్రసిద్ధి చెందిన ఈ పంచామృతానికి జీఐ గుర్తింపు కల్పించేందుకు తగ్గ చర్యలు చేపట్టి, సెంటర్ ఫుడ్ టెక్నాలజీ పరిశోధన కేంద్రంలో అన్ని రకాల పరిశోధనలు చేశారు. ప్రక్రియలన్నీ ముగియడంతో పళని పంచామృతానికి జీఐ గుర్తింపు కల్పిస్తూ బుధవారం సంబంధిత వర్గాలు ప్రకటించాయి. -
విదేశాలకూ దైవ ప్రసాదం
సాక్షి, హైదరాబాద్ : అమెరికాలో ఉంటున్న నాగేందర్ ఇలవేల్పు యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామి. ఏటా తన పుట్టిన రోజున స్వామిని అర్చించి తీర్థ ప్రసాదాలు తీసుకోవాలనేది ఆయన కోరిక. కానీ వివిధ కారణాల వల్ల ఆయనకు యాదాద్రి వచ్చి దైవ దర్శనం చేసుకునేందుకు కుదరట్లేదు. దీంతో పుట్టిన రోజున ఏదో వెలితి ఆయనను వెంటాడుతోంది. ఇలాంటి ఎందరో ప్రవాస తెలుగువారు వేదన పడుతున్నారు. ఇకపై భక్తుల చింత తీరనుంది. కొద్దిరోజుల్లోనే వారి ఇలవేల్పు దేవాలయం నుంచి ఆయా దేశాల్లోని భక్తు ల చెంతకు స్వామివారి ప్రసాదం, అక్షింతలు, పసుపు–కుంకుమ చేరనున్నాయి. ప్రత్యేక సందర్భాల్లో వారు కోరిన రోజున ఆలయంలో వారి పేరుతో పూ జాదికాలు నిర్వహించి ప్రసాదాన్ని వారికి పంపుతా రు. దేవాదాయశాఖ తాజాగా తీసుకున్న ఈ నిర్ణయం వచ్చే నెల నుంచి అందుబాటులోకి రాబోతోంది. యాదగిరిగుట్టతో మొదలు.... విదేశాల్లోని భక్తులకు మానసిక సంతోషాన్ని కలిగించేలా వారి ఇష్టదైవం కొలువైన కోవెల నుంచి ప్రసాదం ఎందుకు వారికి చేరకూడదన్న ఉద్దేశంతో దేవాదాయశాఖ కమిషనర్ అనిల్ కుమార్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డితో చర్చించి దీనికి అనుమతి తీసుకున్న ఆయన... విదేశాలకు స్వామి ప్రసాదం చేరవేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాల్సిందిగా ఐటీ శాఖను కోరారు. దీనికి సంబంధించిన అనుమతులు తీసుకోవడం నుంచి విధివిధానాలను ఖరారు చేయడం వరకు ఆ శాఖ ఏర్పాట్లు చేస్తోంది. వచ్చే నెల నుంచి ప్రారంభించే ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా తొలుత యాదగిరి లక్ష్మీనర్సింహస్వామి దేవాలయంతో మొదలుపెట్టాలని నిర్ణయించారు. వీలైతే భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయం నుంచి కూడా ఈ సేవ మొదలుపెట్టాలనుకుంటున్నారు. ఇటీవలే బెల్లం ప్రసాదాల వితరణ ప్రారంభించి భక్తుల అభిమానాన్ని చూరగొన్న దేవాదాయశాఖ అదే ఉత్సాహంతో దేవాలయాల్లో నిర్వహించే ఆర్జిత సేవలు, గదుల కేటాయింపు తదితరాల బుకింగ్‌ను ఆన్లైన్ చేసింది. ఇప్పుడు విదేశీ భక్తులకు ప్రసాదం అందజేసే కార్యక్రమాన్ని మొదలుపెడుతున్నారు. మరిన్ని దేవాలయాల్లో ఆన్లైన్ సేవలు.... దేవాలయానికి వెళ్లేలోపే ఆర్జిత సేవలు, గదులను బుక్ చేసుకునేందుకు వీలుగా ఆన్లైన్ సేవలకు ఇటీవలే దేవాదాయశాఖ శ్రీకారం చుట్టింది. హైదరాబాద్‌లో యాదాద్రి భవనాన్ని ప్రారంభించిన సందర్భంగా ఆన్లైన్ సేవలను మొదలుపెట్టింది. తొలుత యాదగిరిగుట్ట, భద్రాచలం, వేములవాడ, బాసర, సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి దేవాలయం, బల్కంపేట ఎల్లమ్మ దేవాలయం, కర్మన్‌ఘాట్ ఆంజనేయస్వామి దేవాలయంలో ఈ సేవలను మొదలుపెట్టారు. జూలై 6వ తేదీ నుంచి వరంగల్‌లోని భద్రకాళి దేవాలయం, ధర్మపురి, కొండగ ట్టు, కొమురవెల్లి, జూబ్లీహిల్స్ పెద్దమ్మ దేవాలయం, సికింద్రాబాద్ గణపతి దేవాలయాల్లో ప్రారంభించనున్నారు. ఆ తర్వాత దశలవారీగా మిగతా ప్ర ధాన ఆలయాల్లో మొదలుపెడతారు. విరాళాలను కూడా ఆన్లైన్ ద్వారా చెల్లించే అవకాశం కల్పించారు. నిల్వ ఎలా? రాష్ట్రంలోని చాలా దేవాలయాల్లో పులిహోర, లడ్డూ ప్రధాన ప్రసాదంగా ఉంది. పులిహోరను ఒక రోజుకు మించి నిల్వ చేసే అవకాశం లేనందున దాన్ని విదేశాలకు పంపరు. ఇక లడ్డూ కూడా రెండు మూడు రోజులే నిల్వ ఉంటుంది. దాన్ని గాలి చొరబడని ప్యాకింగ్‌లో ఉంచితే ఒక రోజుకు మించి నిల్వ ఉండదు. లడ్డూ నిల్వ ఉండాలంటే తిరుమల ప్రసాదం తరహాలో తేమ లేకుండా ఉండాలి. దీంతో ఈ విషయంలో తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ప్రస్తుతానికి ప్రసాదంగా స్వామి పసుపు–కుంకుమ, అక్షింతలు, ఇతర పూజా వస్తువులను పంపాలని నిర్ణయించారు. తేమ లేని లడ్డూ తయారీ, రవ్వతో చేసే పొడి ప్రసాదం తదితరాల విషయంలో తుది నిర్ణయం తీసుకొని దాన్ని అందించనున్నారు. -
జూన్ నుంచి ‘షుగర్ ఫ్రీ’ ప్రసాదం!
సాక్షి, హైదరాబాద్: లడ్డూ, చక్కెర పొంగలి, రవ్వ కేసరి... గుడిలో దేవునికి నైవేద్యంగా సమర్పించాక అందించే ఇలాంటి ప్రసాదాలను భక్తులు ఎంతో ఇష్టంగా ఆరగిస్తారు. తీపి పదార్థాలకు దూరంగా ఉండాల్సిన మధుమేహ రోగులైతే తమ ‘కట్టుబాటు’ను పక్కనపెట్టి మరీ వాటిని లాగించేస్తారు. అయితే ఇప్పుడు మధుమేహం ఉన్న వారూ నిరభ్యంతరంగా ఈ ప్రసాదం స్వీకరించొచ్చు! దీనికి దేవాదాయశాఖ అభయం ఇస్తోంది. ఎందుకంటే రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాలన్నింటిలో ఇక నుంచి ఎంచక్కా బెల్లం ప్రసాదాలు అందుబాటులోకి వస్తున్నాయి. గుడి అనగానే ఠక్కున కనిపించేది లడ్డూ ప్రసాదం. ఇప్పుడు ఆ లడ్డూ కూడా బెల్లంతో సిద్ధమవుతోంది. ఒక్క లడ్డూ మాత్రమే కాదు చక్కెర పొంగళి స్థానంలో బెల్లం పొంగలి, రవ్వ కేసరి లాంటివి కూడా అందుబాటులోకి రానున్నాయి. ఇటీవల దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శి, ఇన్చార్జి కమిషనర్ అనిల్ కుమార్ ఈ ఆలోచనకు శ్రీకారం చుట్టారు. ఆయన ప్రతిపాదనకు దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అంగీకరించడంతో ప్రయోగాత్మకంగా ఇటీవలే కొన్ని దేవాలయాల్లో బెల్లం ప్రసాదాలు ప్రారంభించారు. భక్తుల నుంచి సానుకూల స్పందన వస్తుండటంతో దాన్ని విస్తరించాలని తాజాగా నిర్ణయించారు. జూన్ ఒకటి నుంచి వీలైనన్ని ప్రధాన దేవాలయాల్లో బెల్లం ప్రసాదాలను ప్రారంభించనున్నారు. వెరసి ఇప్పుడు దేవుడికి ‘షుగర్ ఫ్రీ’నైవేద్యాలు సిద్ధమన్నమాట. దేవుడికి ప్రీతి... భక్తులకు ‘ముక్తి’.. స్వామి కైంకర్యాల్లో ప్రసాద నివేదన కీలకం. మంత్రోచ్ఛరణల్లోనూ దాని ప్రస్తావన ఉంటుంది. గుడ నైవేద్యం సమర్పయామి అంటూ నివేదిస్తుంటారు. స్వామి సేవకు పేదరికం అడ్డుకాదని చెబుతూ పత్రం పుష్పం ఫలం తోయం ప్రస్తావన తెస్తారు. అదే కోవలో నైవేద్యానికి కూడా బెల్లం ముక్క చాలు అంటూంటారు. నిజానికి స్వామి–అమ్మవార్లు బెల్లం అంటే మక్కువ చూపుతారని చెప్పడం ద్వారా దేవుడు పేదల దరిలో ఉంటాడన్న నమ్మకాన్ని కలిగిస్తారు. పూర్వకాలంలో బెల్లం ప్రసాదాల వితరణ విస్తారంగా ఉన్నా రానురానూ చక్కెర ప్రాధాన్యం పెరిగింది. అన్ని ప్రసాదాలూ చక్కెరతో నిండిపోయాయి. ఇంతకాలం తర్వాత మళ్లీ దేవుళ్లు, భక్తులను బెల్లం పలకరిస్తోంది. చక్కెర వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరగడం, బెల్లంలో పోషక విలువలు ఎక్కువగా ఉండటం, ముఖ్యంగా మహిళలకు ఎంతో అవసరమైన ఇనుము అందులో ఎక్కువగా ఉండటం, పూర్వకాలంలో ప్రసాదంలో బెల్లానికి విశేష ప్రాధాన్యం ఉండటం... ఇలా అన్ని అంశాలు కలగలిపి బెల్లం ప్రసాదాలు చేయించాలని దేవాదాయశాఖ కమిషనర్ నిర్ణయించారు. ప్రభుత్వం నుంచి అనుమతి పొంది ఆయన అధికారులకు ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. అయితే భక్తులు బెల్లం ప్రసాదాలను స్వాగతిస్తారో లేదో చూద్దామని వారం క్రితం ప్రయోగాత్మకంగా కొన్ని దేవాలయాల్లో ప్రారంభించారు. భద్రాచలం, వేములవాడ, బాసర, యాదగిరిగుట్టతోపాటు సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళీ ఆలయం, కర్మన్‌ఘాట్ ఆంజనేయస్వామి గుడిలో ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. యాదగిరిగుట్టలో చక్కెర లడ్డూలతోపాటు బెల్లం లడ్డూలు ప్రారంభించారు. ప్రస్తుతం నిత్యం దాదాపు వెయ్యి బెల్లం లడ్డూలు విక్రయిస్తున్నారు. బాసరలో కూడా అంతేమొత్తం అమ్ముతుండగా భద్రాచలంలో సాధారణ రోజుల్లో 1,500, శని, ఆదివారాల్లో 5 వేల వరకు అమ్ముతున్నారు. ఇక్కడ ఇంతకాలం అందుబాటులో ఉన్న చక్కెర పొంగళిని పూర్తిగా ఆపేసి బెల్లం పొంగళి అమ్ముతున్నారు. దీంతోపాటు రవ్వ కేసరిని కూడా బెల్లంతో చేసి అందుబాటులో ఉంచుతున్నారు. ఇక వేములవాడలో గుడాన్న పొంగళి పేరుతో బెల్లం ప్రసాదాన్ని విక్రయిస్తున్నారు. 200 గ్రాముల బరువు తూగే పొట్లాలను కాజు, కిస్మిస్, నెయ్యి రంగరించి రుచికరంగా సిద్ధం చేస్తుండటంతో భక్తజనం సంబరంగా స్వీకరిస్తున్నారు. చక్కెర ప్రసాదం ధరలకే వీటినీ అందుబాటులో ఉంచుతున్నారు. భవిష్యత్తులో తయారీ పెంచుతాం... చక్కెరతో పోలిస్తే బెల్లం ప్రసాదం రుచిలో కొంత తేడా ఉన్నా దేవుడికి ఇష్టమైందని, ఆరోగ్యానికి మేలు చేసేదన్న ఉద్దేశంతో భక్తజనం సానుకూలంగా స్పందిస్తుండటంపట్ల అధికారులు సంబరపడుతున్నారు. ‘వేములవాడలో పొంగళికి ఎంతో ప్రాధాన్యముంది. భక్తులు ఇష్టంగా, భక్తితో దీన్ని తీసుకుంటారు. ఇప్పుడు గుడాన్న పొంగళిగా బెల్లం ప్రసాదాన్ని అందుబాటులో ఉంచడంపట్ల వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో బెల్లం ప్రసాదాల తయారీని పెంచుతాం’అని వేములవాడ కార్యనిర్వహణాధికారి రాజేశ్వర్ పేర్కొన్నారు. -
ప్రసాదం.. కలుషితం
చామరాజనగరలో మారెమ్మ ఆలయంలో విషం కలిపిన ప్రసాదం ఆరగించి సుమారు 20 మంది మరణించడం, చింతామణిలో అలాంటి ప్రసాదమే ఆరగించి ఇద్దరు చనిపోయిన దుర్ఘటనలు మరువక ముందే ఆలయంలో మరో కలుషిత ప్రసాద సంఘటన చర్చనీయాంశమైంది. తుమకూరు జిల్లా శిర తాలూకాలోని ఓ ఆంజనేయ ఆలయంలో అన్న–సాంబారు, పాయసం తిన్నవారిలో 60 మందికి పైగా ఆస్పత్రి పాలయ్యారు. తుమకూరు: దేవాలయంలో ప్రసాదం తిని సుమారు 60 మంది ప్రజలు అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ సంఘటన తుమకూరు జిల్లాలోని శిరా తాలుకాలో ఉన్న చిన్నప్పనజళ్ళి గ్రామంలో జరిగింది. శనివారం గ్రామంలో ఉన్న ఆంజనేయ స్వామి ఆలయంలో హరసేవ పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తుల కోసం ప్రసాదంగా అన్నం– సాంబారు, పాయసం, స్వీట్లు, కారాబూందీని పంపిణీ చేశారు. పెద్దసంఖ్యలో భక్తులు దేవాలయంలో ఆరగించి వెళ్లారు. ఇక ఆదివారంఉదయం నుంచి ఇబ్బంది మొదలైంది. ప్రసాదం తిన్నవారిలో చాలామందికి వాంతులు, విరేచనాలు అయ్యాయి. గ్రామంలో వందమందికిపైగా ప్రసాదం తినగా, వారిలో సుమారు 60 మందికిపైగా అస్వస్థతకు గురి కావడంతో చికిత్స కోసం శిరా, కళ్ళంబెళ్ళ ప్రాథమిక ఆస్పత్రులకు తరలించి చికిత్స చేయిస్తున్నారు. వాంతులు, విరేచనాలతో పాటు తలనొప్పి, జ్వరం కూడా రావడంతో బాధితులు భయాందోళలకు గురవుతున్నారు. నమూనాల సేకరణ ఆరోగ్య కార్యకర్తలు పరీక్షల కోసం వంటల నమూనాలను సేకరించారు. బాధితుల్లో 10 మందికి పైన చిన్నారులున్నారు. ఎలాంటి ప్రాణాప్రాయం జరగలేదని, అందరికీ చికిత్స అందిçస్తున్నామని వైద్యులు తెలిపారు. పాత్రల్ని సరిగా శుభ్రం చేయకపోవడమో, కలుషిత నీటిని వాడడమో ఘటనకు కారణమై ఉంటుందని భావిస్తున్నారు. ఉదయం నుంచే మొదలైంది ఈ విషయంపైన చిన్నప్పనహళ్ళి గ్రామానికి చెందిన సరోజమ్మ మాట్లాడుతూ రాత్రి అందరూ ప్రసాదం తిన్నామని, ఆదివారం ఉదయం వరకు బాగానే ఉంది, ఆ తరువాతే చాలామంది వాంతులు, విరేచాలు అయ్యాని తెలిపారు. వెంటనే ఆరోగ్య కేంద్రానికి వెళ్లామని చెప్పారు. నేను నా భర్త, కుమారుడు ప్రసాదం తిన్నాం, నాకు నా కొడుక్కి ఏమీ కాలేదు, తుమకూరుకు పనిమీద వెళ్ళిన తన భర్తకు వాంతులు అయినట్లు పోన్ చేశాడని తెలిపారు. -
ప్రియుని భార్యను చంపడానికి కేసరిబాత్‌లో సైనేడ్..
చింతామణి: చిక్కబళ్లాపురం జిల్లా చింతామణిలో విషం కలిపిన ప్రసాదం తిని ఇద్దరు మరణించడం, మరో 8మంది తీవ్ర అస్వస్థత పాలైన ఘటనలో మిస్టరీ వీడిపోయింది. అక్రమ సంబంధమే ఇంత పని చేయించిందని తేలింది. తమ ఆనందానికి ప్రియుని భార్య గౌరి, ఆమె తల్లి అడ్డుగా ఉందని వారిని మట్టుబెట్టడానికి ప్రియుడు లోకేష్ (30)తో కలిసి నిందితురాలు లక్ష్మీ (48) ఈ ఘాతుకానికి పాల్పడిందని పోలీసులు ప్రకటించారు. స్వర్ణకారులు బంగారంపనిలో ఉపయోగించే సైనేడ్ విషాన్ని ప్రసాదంలో కలిపినట్లు తెలిపారు. మంగళవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో రాష్ట్ర ఐజీపీ దయానంద, ఎస్పీ కార్తీక్‌రెడ్డితో కలిసి కేసు వివరాలను వెల్లడించారు. ప్రధాన నిందితురాలు లక్ష్మీ, ఆమెకు సహకరించిన ఇద్దరు మహిళలను అరెస్టు చేసినట్లు వారు తెలిపారు. వివరాలు.. గత శుక్రవారం రాత్రి చింతామణి పట్టణంలో ఒక ఆలయం వద్ద ఇద్దరు మహిళలు పంచిన ప్రసాదం తిని కవిత (29), సరస్వతమ్మ (55) అనే ఇద్దరు మహిళలు మరణించారు. ఇది సంచలనం కలిగించింది. ఎస్పీ కార్తీక్‌రెడ్డి కేసు దర్యాప్తును సీరియస్‌గా తీసుకున్నారు. కేసు విచారణలో భాగంగా పలువురు అనుమానితులను పట్టుకుని విచారించగా లక్ష్మీ పాత్ర బయటపడింది. అడ్డు తొలగించుకోవాలని ఆలయం వద్ద ఎదురెదురు ఇళ్లలో ఉండే మహిళ లక్ష్మీతో యువకుడులోకేష్ అనైతిక సంబంధం ఉంది. రెండేళ్ల కిందట లోకేష్‌కు శిడ్లఘట్టకు చెందిన గౌరి అనే యువతితో పెళ్లయింది. లోకేష్ బండారం భార్యకు తెలిసిపోవడంతో లక్ష్మీతో గొడవలు పడింది. పోలీసు స్టేషన్‌కు వెళ్లి పంచాయతీ జరిగాయి. నాలుగు నెలల కిందట లోకేష్ ఇంటి నుండి ఎక్కడికో వెళ్లిపోయాడు. గౌరి పోలీసుస్టేషన్ మిస్సింగ్ కేసు పెట్టింది. కానీ అజ్ఞాతం నుంచి లక్ష్మీ– లోకేష్ మధ్య సంబంధాలు కొనసాగాయి. గౌరిని చంపాలని పథకం పన్ని రెండుసార్లు ప్రయత్నించి విఫలయినట్టు లక్ష్మీ అంగీరించింది. ఈసారి పకడ్బందీగా గత శుక్రవారం పకడ్బందీగా అమలు చేశారు. లక్ష్మీ తన ఇంట్లో కేసరిబాత్‌ను తయారు చేసింది. ప్రసాదాన్ని రెండు భాగాలు చేసి ఇంటి పనిమనిషి అమరావతి, ఆలయం ముందర పూలు అమ్ముతున్న పార్వతీలను పిలిచి ప్రసాదాన్ని పంచాలని సూచించింది. అందులో సైనైడ్ కలిపి ఉన్న విషయం వారికి తెలియకపోవడంతో సరేనని అంగీకరించారు. ప్లాస్టిక్ కప్పులో పెట్టినది గౌరి, వారి తల్లి సరస్వతి గుడినుంచి రాగానే ఇవ్వాలని సూచింది. వారు సరిగ్గా గౌరి, తల్లి సరస్వతికి ఇచ్చి తినమని చెప్పారు. ఇంటికి వెళ్లాక సరస్వతి ఇంటిపక్కలవారికి పంచింది.తాను కొంత తిని, కూతురికి ఇవ్వగా ఆమె తినలేదు. కొంతసేపటికే ప్రసాదం తిన్న 10 మంది తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. కవిత అనే మహిళ చనిపోగా, ఆమె భర్త రాజు, చిన్నారులు జాహ్నవి, చరణి , ఇతరులు నారాయణప్ప, వెంకటరమణ, సుధా, శశిదర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సరస్వతి చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది. ఈ కేసులో మరొక నిందితుడు లోకేష్ కోసం గాలిస్తున్నామని ఐజీపీ చెప్పారు. దర్యాప్తు బృందానికి 50వేలు బహుమానాన్ని ప్రకటించారు. -
డబ్బులు కట్టి.. మృతదేహాల్ని తీసుకోండి
కర్ణాటక, కోలారు: చింతామణిలోని ప్రసిద్ద గంగమ్మ దేవాలయంలో ప్రసాదం సేవించి అస్వస్థులై నగరంలోని ఆర్ఎల్ జాలప్ప ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిలో సరస్వతమ్మ (56) అనే మహిళ శనివారం అర్థరాత్రి సమయంలో చికిత్స ఫలించక మరణించింది. ఈ ఘటనలో మరణించిన ఇద్దరు మృతదేహాల పోస్టుమార్టం అనంతరం బిల్లులు చెల్లించి మృతదేహాలను తీసుకోవాలని ఆస్పత్రి వర్గాలు తెలియజేయడంతో సంబంధీకులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. తాము చాలా పేదలమని డబ్బులు చెల్లించే స్థితిలో లేమని మొర పెట్టుకున్నారు. అస్వస్థులకు ఇక్కడే చికిత్స చేయడం వల్ల బిల్లులు చెల్లించాలని పట్టుపట్టారు. దీంతో వారు చింతామణి ఎమ్మెల్యే డిప్యూటీ స్పీకర్ దృష్టికి తీసుకు వచ్చారు. డిప్యూటీ స్పీకర్ కృష్ణారెడ్డి వెంటనే కోలారు డిహెచ్ఓకు ఫోన్ చేసి పేదల వద్దనుంచి డబ్బులు అడగడం సమంజసంగా లేదని డబ్బులు చెల్లించాల్సి వస్తే ప్రభుత్వం నుంచి డబ్బులు అందేలా చూస్తామని తెలపడంతో డిహెచ్ఓ డాక్టర్ విజయకుమార్ వెంటనే ఆస్పత్రికి వెళ్లి ఆస్పత్రి సూపరింటెండ్ డాక్టర్ లక్ష్మయ్యతో చర్చించారు. ప్రభుత్వం నుంచి బిల్లులు మంజూరు అయ్యేలా చూస్తామని హామీ ఇవ్వడంతో శవాలను సంబంధీకులకు అందించారు. ప్రభుత్వ అంబులెన్స్‌లో ఊరికి తరలించారు. ఆరోగ్య శాఖ డైరెక్టర్, కలెక్టర్ పరిశీలన ఆస్పత్రిలో అస్వస్థులై చికిత్స పొందుతున్న వారిని ఆరోగ్య శాఖ డైరెక్టర్ డాక్టర్ ప్రభాకర్, కలెక్టర్ జె మంజునాథ్‌లు వెళ్లి పరిశీలన జరిపారు. చికిత్స ఏ విధంగా జరుగుతుందో అని అడిగి తెలుసుకున్నారు. చికిత్స పొందుతున్న వారిలో 5 మంది ఆరోగ్యంగా ఉన్నారని ఒకరికి మూత్రపిండాలకు ఇన్ఫెక్షన్ సోకిందని డాక్టర్లు తెలిపారు. చింతామణి ఘటనపై సీఎం ఆరా సాక్షి, బెంగళూరు: చింతామణి గంగమ్మ దేవస్థానంలో ప్రసాదం సేవించి ఇద్దరు మరణించిన ఘటన పై సీఎం కుమారస్వామి ఆరా తీశారు. చిక్కబళ్లాపుర జిల్లా కలెక్టర్ అనిరుధ్ శ్రవణ్ నుంచి వివరాలు సేకరించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారికి తగిన చికిత్స సహకారం అందించాలని సూచించారు. -
మహిళ ప్రాణాలు తీసిన ప్రసాదం
బెంగళూరు: ఆలయం వద్ద పంచుతున్న ప్రసాదం తిన్న భక్తులు కడుపునొప్పి, వాంతులు, విరేచనాల పాలై ఓ మహిళ మరణించగా, 9 మంది అస్వస్థకు గురయ్యారు. వీరిలో ఇద్దరు చిన్నారులతో కలిపి నలుగురు పరిస్థితి విషమంగా ఉంది. ఈ సంఘటన చిక్కబళ్లాపుర జిల్లా చింతామణి పట్టణంలో శుక్రవారం అర్ధరాత్రి దాటిన సమయంలో జరిగింది. మరణించిన మహిళను కవిత (28)గా పోలీసులు గుర్తించారు. గుడి ట్రస్టీతో పాటు ఇద్దరు మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వివరాలు.. పట్టణంలోని 20 వార్డు శ్రీరామనగర ప్రాంతానికి చెందిన నారాయణమ్మ, ఇంటి పక్కన వున్న బంధువు రాజుతో నరసింహపేటలో వెలసిన గంగాభవాని ఆలయానికి వెళ్లారు. శుక్రవారం రాత్రి 8 గంటలకు దర్శించుకొన్నారు. ఆలయం బయట ఇద్దరు మహిళలు బకెట్లలో కేసరిబాత్‌ను పెట్టుకుని ప్రసాదమని పంచుతున్నారు. నారాయణమ్మ, రాజు ఆ ప్రసాదాన్ని ఇంటికి తీసుకొని వచ్చారు. వారు తినడంత పాటు పొరుగింటి కవిత కుటుంబానికీ ఇచ్చారు. తిన్న కొంతసేపటికే అందరికీ కడుపునొప్పి, వాంతులు రావడంతో తక్షణమే చింతామణి ప్రభుత్వ అస్పత్రికి సాగించారు. కవిత, రాజు, గంగాధర, రాధ, సుధ, చిన్నారులు జాహ్నవి, శరణి తీవ్ర అస్వస్థతగా వుండంతో డాక్టర్లు కోలారు ఆస్పత్రికి పంపించారు. కోలారు జాలప్ప అస్పత్రిలో డాక్టర్లు పరీక్షించగా కవిత అప్పటికే మరణించింది. రాజు, రాధ, జాహ్నవి, శరణి పరిస్థితి విషమంగా వుండంతో ఐసీయూలో వుంచారు. చింతామణిలోని ప్రైవేటు ఆస్పత్రిలో నారాయణమ్మ, వెంకట రమణ చికిత్స పొందుతున్నారు. ప్రసాదం కలుషితమైందా, లేక కావాలనే విషం కలిపారా? అనేది సస్పెన్స్‌గా ఉంది. -
పగతోనే ప్రసాదంలోకి గుట్టుగా మోనోక్రోటోఫాస్..
ఈ నెల 14వ తేదీ చామరాజనగర జిల్లా సుళ్వాడిలో చిక్క మారమ్మ ఆలయం గోపురం శంకుస్థాపన కార్యక్రమంలో విష ప్రసాద మారణహోమం ఎవరి పనో పోలీసులు తేల్చేశారు. ఆలయ ట్రస్టు అధ్యక్షుడు ఇమ్మడి మహదేవస్వామి అలియాస్ రేవణ్ణ సూత్రధారిగా, అతని మేనకోడలు అంబిక, ఆమె భర్త, ఆలయ మేనేజర్ మాదేశ్, అర్చకుడు దొడ్డయ్య కలిసి భక్తుల ప్రాణాలు తీశారని గుర్తించారు. ఐదురోజుల ముమ్మర దర్యాప్తులతో వీరి బండారం బయటపడి కటకటాలు లెక్కిస్తున్నారు. కర్ణాటక, మైసూరు: సుళ్వాడి గ్రామంలోని మారమ్మ దేవాలయంలో విషపూరిత ప్రసాదం తిని 15 మంది మృత్యువాత పడిన దుర్ఘటనకు కారణమెవరైందీ బుధవారం వెలుగు చూసింది. చామరాజనగరలో సౌత్‌జోన్ ఐజీ శరత్చంద్ర ఈ కేసు దర్యాప్తును మీడియా సమావేశంలో వివరించారు. ఆధిపత్య వివాదం మనసులో ఉంచుకుని మారమ్మ ఆలయ ట్రస్ట్ అధ్యక్షుడు ఇమ్మడి మహదేవస్వామి తన మనుషులతో కలసి ప్రసాదంలో మోనోక్రోటోఫాస్ అనే పురుగులమందు కలిపి ఈ ఘోరానికి పాల్పడినట్లు ఐజీ పేర్కొన్నారు. వివరాలు.. ఈ ట్రస్టులో చిన్నప్పి అనే వ్యక్తి సభ్యునిగా కొనసాగుతున్నారు. ట్రస్ట్ ఆదాయ, నిర్వహణ తదితర అన్ని బాధ్యతలను చిన్నప్పి నిర్వర్తిస్తుండడంతోఅతని ఆధిపత్యం పెరుగుతూ వస్తోంది. ట్రస్ట్ సభ్యులు, సిబ్బంది కూడా చిన్నప్పికే ఎక్కువ విలువ ఇస్తుండడంతో అసూయ పెంచుకున్న అధ్యక్షుడు ఇమ్మడి మహదేవస్వామికి అతనితో విభేదాలు మొదలయ్యాయి. గోపురం వేడుక వేదికగా కొద్దిరోజుల క్రితం మారమ్మ ఆలయానికి రూ.1.50 కోట్లతో కొత్త గోపురాన్ని నిర్మించాలని మహదేవస్వామి నిర్ణయించగా దీన్ని వ్యతిరేకించిన చిన్నప్పి... రూ.80 లక్షల నిధులతో చిన్నగోపురం నిర్మిస్తే సరిపోతుదంటూ ప్రతిపాదించారు. దీనిపై ఇరువురి మధ్య వాగ్వాదం, వైషమ్యాలు తారాస్థాయికి చేరుకున్నాయి. చిన్నప్పి ఇదేనెల 14వ తేదీన సాలూరు మఠాధిపతి గురుస్వామిని ముఖ్య అతిథిగా ఆహ్వానించి దేవాలయం గోపుర నిర్మాణానికి పూజలు పూజా కార్యక్రమాలు జరిపాడు. మహదేవస్వామి ఇది జీర్ణించుకోలేక చిన్నప్పితో పాటు అతనికి మద్దతుగా నిలిచిన ఇతర సభ్యులు, సిబ్బందిపై పగ తీర్చుకోవాలనుకున్నాడు. అందులో భాగంగా తన అక్క కుమార్తె అంబికా, ఆమె భర్త, దేవాలయ మేనేజర్ మాదేశ్, అర్చకుడు దొడ్డయ్యతో కలసి ప్రసాదంలో విషం కలపడానికి నిర్ణయించుకున్నాడు. వీరికి డబ్బు,పదవులు ప్రలోభపెట్టాడు. అంబిక మొదట తన దూరపు బంధువైన వ్యవసాయశాఖ అధికారిని సంప్రదించి క్రిమిసంహార మందులు తెప్పించుకుంది. గోపుర నిర్మాణ పనుల పూజా కార్యక్రమాల రోజు వాటిని భర్త మాదేశ్‌కు అప్పగించింది. వాటిని వంటగదిలో తీసుకెళ్లిన మాదేశ్ అక్కడ వేచిఉన్న అర్చకుడు దొడ్డయ్య చేతికి అందించాడు. వంటగదిలో పని చేస్తున్న కార్మికులను బయటకు పంపించాడు. తరువాత ప్రసాదంలో కలిపి వచ్చేశాడు. కొద్దిసేపటి తరువాత ప్రసాదం నుంచి దుర్వాసన వస్తుండడంతో కార్మికులు అనుమానం వ్యక్తం చేయగా మసాలా ఎక్కువయి ఉంటుందంటూ కప్పిపుచ్చారు. ఇదే అనుమానం భక్తులు కూడా వ్యక్తం చేయగా ప్రసాదంలో పచ్చ కర్పూరం ఎక్కువగా వేసామంటూ తెలపడంతో ఇది నమ్మిన భక్తులు ప్రసాదాన్ని తిన్నారు. ప్రసాదం తిన్న కొద్ది సేపటికే వందమందికి పైగా వాంతులు చేసుకుంటూ అస్వస్థతకు గురయ్యారు. హైడ్రామా నడుమ దొడ్డయ్య అరెస్ట్ ఘటన జరిగిన కొద్ది సేపటికి అర్చకుడు అంబులెన్స్‌లో కేఆర్ ఆసుపత్రిలో చేరాడు.తాను కూడా ప్రసాదం తిన్నానని వాంతులు అవుతున్నాయంటూ వైద్యులను నమ్మించి ఆసుపత్రిలో చేరాడు.అయితే దొడ్డయ్యను క్షుణ్ణంగా పరిశీలించిన వైద్యులు దొడ్డయ్య శరీరంలో ఎటువంటి విషం ఆధారాలు గుర్తించకపోవడంతో అనుమానం వ్యక్తం చేసిన వైద్యులు పోలీసులకు విషయాన్ని తెలియజేసారు.దీంతో సోమవారం దొడ్డయ్యను అదుపులోకి తీసుకున్న పోలీసులు తమదైన శైలిలో విచారణ చేయగా అసలు విషయం బహిర్గతం చేశాడు. అంబికపై పోలీసుల దృష్టి ఘటనపై కేసు నమోదు చేసుకున్న కొళ్లేగాల పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. అంబికపై కాల్లిస్ట్తో పాటు అంబిక ప్రతీ కదలికపై నిఘా ఉంచారు. అంబిక కొద్ది రోజుల క్రితం తన దూరపు బంధువైన వ్యవసాయశాఖ అధికారితో మాట్లాడినట్లు గుర్తించారు. ఇది జరిగిన కొద్ది రోజులకే సదరు వ్యవసాయశాఖ అధికారిఅంబిక ఇంటికి వచ్చినట్లు గుర్తించారు. ఇద్దరి మధ్య ఫోన్ సంభాషణలు నడిచినట్లు గుర్తించి వ్యవసాయ శాఖ అధికారిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. విచారణలో అంబిక మోనోక్రోటోఫాస్ క్రిమిసంహారక మందులు అడిగినట్లు వెల్లడించడంతో అంబికను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. మారమ్మ ట్రస్ట్ అధ్యక్షుడు మహదేవస్వామి సూచన మేరకు తన భర్త మాదేశ్,అర్చకుడు దొడ్డయ్యతో కలసి ప్రసాదంలో విషం కలిపినట్లు అంబిక అంగీకరించింది. సాలూరు గురుస్వామినీ చంపాలని కుట్ర సాలూరు మఠాధిపతి గురుస్వామితో కూడా మహదేవస్వామికి విభేదాలున్నాయి. గోపుర శంకుస్థాపన రోజు ప్రసాదం తిని చిన్నప్పి, గురుస్వామి కూడా మరణిస్తే సాలూరు మఠం కూడా హస్తగతమవుతుందని కుట్రపన్నాడు. గురుస్వామికి ప్రసాదం దుర్వాసన రావడంతో తినకుండానే వెళ్లిపోయారు. చిన్నప్పి కూడా తినలేదు. ఘటన జరిగిన మరుసటి రోజే చిన్నప్పిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. అతని పాత్ర లేదని తెలిసి వదిలేశారు. -
ప్రసాదంలో విషం.. 12 మంది మృతి
సాక్షి బెంగళూరు: కర్ణాటకలో ఘోరం చోటుచేసుకుంది. దేవాలయంలో పంపిణీ చేసిన ప్రసాదం తిని ఇద్దరు చిన్నారులతో సహా 12 మంది మృత్యువాత పడ్డారు. మరో 80 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. వీరిలో 10 మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. చామరాజనగర్ జిల్లా హనూరు తాలూకా సుళివాడి గ్రామంలో శుక్రవారం ఈ దారుణం జరిగింది. గ్రామంలోని మారెమ్మ దేవాలయ గోపుర నిర్మాణానికి గురువారం శంఖుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చుట్టుపక్కల నుంచి వందలాది మంది భక్తులు తరలివచ్చారు. పూజాది కార్యక్రమాలు ముగిసిన అనంతరం ప్రసాదం కోసం సిద్ధం చేసిన రైస్‌బాత్‌తో అన్నదానం నిర్వహించారు. ఆ రైస్‌బాత్ తిన్న కొద్దిసేపటికి చాలామంది భక్తులు వాంతులు చేసుకుని స్పృహ తప్పారు. ఆస్పత్రిలో చేర్పించగా 12 మంది చికిత్సపొందుతూ చనిపోయారు. దేవుడి ప్రసాదం విషమయం కావడానికి దేవాలయ పాలక మండలిలో ఉన్న రెండు వర్గాల మధ్య విబేధాలే కారణమని తెలుస్తోంది. కార్యక్రమానికి ఆటంకం కలిగించాలనే ఉద్దేశంతో ఒక వర్గం వారు ప్రసాదంలో కిరోసిన్‌తో పాటు క్రిమిసంహారక మందులు కలిపినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికీ సీఎం రూ. 5 లక్షల పరిహారం ప్రకటించారు. -
కొంపముంచిన టమాటా రైస్
సాక్షి, బెంగళూరు: గుడిలో పంచిపెట్టిన ప్రసాదం భక్తుల పాలిట యమపాశమైంది. కర్నాటక, చామరాజ్ నగర్ జిల్లాలోని సులివాడి గ్రామంలో శుక్రవారం ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా మారమ్మ దేవాలయం శంకుస్థాపన సందర్బంగా భక్తులకు పంపణీ చేసిన ప్రసాదం విషపూరితం కావడంతో దాన్ని స్వీకరించిన పదకొండు మంది భక్తులు మృత్యువాత పడ్డారు. దాదాపు 72మందికి పైగా తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. వీరిలో 12 మంది ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. ఈ ఘటనపై జిల్లా ఆరోగ్య అధికారి ప్రసాద్ అందించిన సమాచారం ప్రకారం ప్రసాదం తిన్నవెంటనే భక్తులు వాంతులు, తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడ్డారు. వెంటనే స్పందించిన స్థానిక అధికారులు, పోలీసులు బాధితులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. ప్రసాదంలో విషం కలిసి వుంటుందనే అనుమానాలను ఆరోగ్య అధికారి వ్యక్తం చేశారు. ఘటనాస్థలంలో సేకరించిన ప్రసాదం శాంపిళ్లను పరీక్షల నిమిత్తం పంపించినట్టు తెలిపారు. అలాగే ప్రసాదంలో కిరోసిన్ కలిసిన వాసన వచ్చినట్టుగా బాధితులు చెప్పారన్నారు. చనిపోయినవారిలో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నట్టు చెప్పారు. తమకు పంచిపెట్టిన టమాటో రైస్ వాసన వచ్చిందని, అయితే క్యూలో ముందున్న వాళ్లు ప్రసాదం తిన్న వెంటనే వాంతులు చేసుకున్నారని, దీంతో కొంతమంది తినకుండా పారేయడంతో క్షేమంగా బయటపడ్డారని భక్తుడు మురుగప్ప తెలిపారు. అటు ప్రసాదంలో విషం కలిపారన్న ఆరోపణలపై పోలీసులు ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. మరోవైపు ఈ ఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి తీవ్ర దిగ్ర్భాంతిని వ్యక్తం చేశారు. చనిపోయినవారికి 5లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. అలాగే తక్షణమే సంబంధిత చర్యలు చేపట్టాల్సిందిగా అధికారులను ఆదేశించారు. -
దేవీ అలంకారాలు
ఆశ్వయుజ శుద్ధ అష్టమి, బుధవారం, 17–10–2018 సర్వస్వరూపే సర్వేశే సర్వశక్తి సమన్వితే భయేభ్యస్త్రాహి నో దేవి దుర్గే దేవీ నమోస్తుతే ‘‘ శరన్నవరాత్రి మహోత్సవాలలో కనకదుర్గమ్మవారు దుర్గాదేవిగా భక్తులకు తన దివ్యదర్శనాన్ని ప్రసాదిస్తుంది. లోక కంటకుడైన దుర్గమాసురుడిని సంహరించి దుర్గాదేవిగా ఇంద్రకీలాద్రిపై స్వయంగా ఆవిర్భవించింది ఆ తల్లి. రాక్షసుడిని సంహరించి దుర్గతులను పోగొట్టి దుర్గగా వెలుగొందినది అష్టమి తిథి నాడే. శరన్నవరాత్రులలో దుర్గాదేవిని అర్చించటం వలన దుర్గతులను తొలగి సద్గతులు ప్రాప్తిస్తాయని పెద్దలు చెబుతారు. ‘దుర్గే దుర్గతి నాశని’ అనే మంత్రం సకల జనులకూ శుభాలను కలుగచేస్తుంది. దుర్గతులను నశింపచేసి సద్గతులను ప్రసాదించి, ఆయురారోగ్యాలను ప్రసాదించే దివ్యరూపిణి దుర్గమ్మవారు. ఈ అమ్మవారి దర్శనం సకల శ్రేయోదాయకం. -
అమ్మ అనుగ్రహ ప్రసాదం
ఇంద్ర కీలాద్రిపై కొలువు తీరిన కనకదుర్గమ్మవారిని భక్తులు దర్శించుకుని పరవశం చెందుతారు. దర్శనానంతరం అమ్మవారి భక్తులు అమ్మవారి ప్రసాదాలను కొనుగోలు చేస్తారు. అమ్మవారికి జరిగే నిత్యపూజలు, ఆర్జిత సేవలలో పాల్గొనే ఉభయదాతలకు దేవస్థానం పులిహోర, లడ్డూ ప్రసాదాలను అందచేస్తుంది. అమ్మవారి ప్రసాదాలుగా లడ్డు, శ్రీచక్ర లడ్డు, పులిహోరలతో పాటు చక్కెరపొంగలిని సైతం దేవస్థానం విక్రయిస్తుంది. మహామండపం గ్రౌండ్ ఫ్లోర్‌లోని ఆరు కౌంటర్ల ద్వారా ఈ ప్రసాదాలను విక్రయిస్తారు. కొండపై నటరాజ స్వామి వారి గుడి, ఓం మలుపు దగ్గర కూడా ప్రసాదాలను విక్రయిస్తారు. దసరా, భవానీ దీక్షల సమయంలో కొండ దిగువన కనకదుర్గనగర్‌లో 13 కౌంటర్ల ద్వారా అమ్మవారి ప్రసాద విక్రయాలు జరుగుతాయి. బస్ స్టాండ్‌లోనూ ప్రత్యేక కౌంటర్‌ను ఏర్పాటు చేశారు. అమ్మవారి ప్రసాదాలను తయారు చేసేందుకు ప్రత్యేకంగా పోటును నిర్వహిస్తారు. లడ్డూ ప్రసాదం తయారీకి శిక్షకులైన వంట వారితో పాటు లడ్డూను చుట్టేందుకు మహిళలు పనిచేస్తారు. పులిహోర, చక్కెరపొంగలి తయారుచేసేందుకు సిబ్బందిని దేవస్థానం నియమిస్తుంది. ఉచితంగా అప్పాల ప్రసాదం... ఈ దసరా ఉత్సవాల నుంచి అమ్మవారిని దర్శించుకునే ప్రతి భక్తుడికి అప్పం ప్రసాదంగా అందచేస్తున్నారు. ఇందుకుగాను అప్పాలు తయారు చేసేందుకు ప్రత్యేకంగా వంటశాలను కొండపై సిద్ధం చేశారు. దసరా ఉత్సవాలలో సుమారు 15 లక్షల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకునే అవకాశం ఉందని ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు. రైల్వే స్టేషన్లో ప్రత్యేక కౌంటర్.. ఇతర రాష్ట్రాలలోని అమ్మవారి భక్తులకు ప్రసాదాలు అందాలనే భావనతో దుర్గ గుడి అధికారులు రైల్వే స్టేషన్ తూర్పు కౌంటర్ దగ్గర ప్రత్యేక ప్రసాదం కౌంటర్‌ను నడుపుతోంది. ఇక్కడ పులిహోర, లడ్డూ ప్రసాదాలు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అందుబాటులో ఉంటాయి. విజయవాడ మీదుగా ప్రయాణించే సుదూర ప్రాంతాలకు చెందిన భక్తులు ఈ కౌంటర్లలో ప్రసాదాలను కొనుగోలు చేసి, బంధువులకు, మిత్రులకు అందచేస్తారు. అమ్మవారిని దర్శించుకోలేకపోయినా, ప్రసాదాలను స్వీకరించే భాగ్యమైనా దక్కిందని భక్తులు తృప్తిచెందుతారు. త్వరలో బస్టాండ్‌లో సైతం అమ్మవారి ప్రసాదాలు భక్తులకు అందుబాటులోకి రానున్నాయి. దివ్య దర్శనం భక్తులకు చిన్న లడ్డు... రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి అమ్మవారి దర్శనానికి విచ్చేసే దివ్య దర్శనం భక్తులకు దేవస్థానం ప్రత్యేకంగా ప్రసాదాలను అందచేస్తుంది. అమ్మవారి దర్శనానంతరం వేద పండితుల ఆశీర్వచనం అందచేసి, దేవస్థానం తరపున రవిక, అమ్మవారి కుంకుమ ప్రసాదంతో పాటు చిన్న సైజు లడ్డూను అందచేస్తారు. అనంతరం అన్న ప్రసాదాన్ని సైతం అందిస్తారు. అమ్మవారి ప్రసాదాలు – ధరలు పులిహోర – రూ. 5లు లడ్డూ – రూ. 15లు శ్రీచక్ర లడ్డూ – రూ. 100 చక్కెర పొంగలి – రూ. 20 – ఉప్పులూరి శ్యామ్‌ప్రకాశ్, సాక్షి, విజయవాడ -
మహా ప్రసాదం..!
పశ్చిమగోదావరి, ద్వారకాతిరుమల: చిన తిరుపతి పేరు చెప్పగానే టక్కున గుర్తుకొచ్చేది శ్రీవారి లడ్డూ ప్రసాదం. ఇది ఒకప్పటి మాట. ఇప్పుడు ఐదు రకాల పంచామృత ప్రసాదాలు గుర్తుకొస్తున్నాయి. లడ్డూ, పులిహోర, శర్కర పొంగలి ప్రసాదాలకు ఇటీవల తోడైన మహాప్రసాదం(పెద్ద లడ్డూ), వడ ప్రసాదాలు భక్తులకు మరింత ప్రీతికరంగా మారాయి. ఇక అన్నప్రసాదం విషయానికొస్తే.. తిరుమల తిరుపతి తరువాత అంతటిరుచికరమైన అన్నప్రసాదం ఇక్కడ మాత్రమే లభిస్తోంది. నిత్యం వేలాది మంది భక్తులు ఈ ప్రసాదాలను స్వీకరిస్తున్నారు. రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాల్లో ఒకటిగా విరాజిల్లుతోన్న ద్వారకా తిరుమల క్షేత్రాన్ని నిత్యం వేలాది మంది భక్తులు సందర్శిస్తున్నారు. ఒక్క శనివారం నాడే దాదాపు 25 నుంచి 30 వేల మంది భక్తులు స్వామివారిని దర్శిస్తున్నారు. శ్రీవారి దర్శనం పూర్తవగానే భక్తులకు గుర్తుకొచ్చేది స్వామివారి ప్రసాదం. ఇక్కడ షడ్రుచులతో ఐదు రకాల ప్రసాదాలు భక్తులకు లభిస్తున్నాయి. ప్రసాదాలు తయారు చేసే అంబరు ఖానాలో నిత్యం సిబ్బంది ఈ ఐదు రకాల ప్రసాదాల తయారీలో నిమగ్నమవుతున్నారు. ఇక తయారైన ప్రసాదాలను ప్యాక్ చేసేందుకు కొం దరు భక్తులు తమ సేవలను అందిస్తున్నారు. ప్రసాద విక్రయాలు అదుర్స్ అన్ని ప్రసాదాల్లో కంటే.. వడ ప్రసాద విక్రయాలు రోజురోజుకు ఊపందుకుంటున్నాయి. లడ్డూ తరువాత ఎక్కువగా భక్తులు మక్కువ చూపుతోంది ఈ వడ ప్రసాదం మీదే. అలాగే పెద్ద లడ్డూ విక్రయాలు కూడా అధికంగా జరుగుతున్నాయి. గతేడాది ఏప్రిల్ నుంచి ఈ నెల 20 వరకు సాధారణ లడ్డూ ప్రసాదాలు 30,22,261, పులిహోర 12,78,415, శర్కర పొంగలి 6,67,129 ప్యాకెట్లను విక్రయించారు. అలాగే మహా ప్రసాదం(పెద్ద లడ్డూ) విక్రయాలను ఈ ఏడాది ఆగస్టు 1న ప్రారంభించగా, ఇప్పటి వరకు 6,050 లడ్డూలను విక్రయించారు. అదేవిధంగా ఈ ఏడాది ఆగస్టు 17న ప్రారంభమైన వడ ప్రసాదాలు ఇప్పటి వరకు 24,240 అమ్ముడయ్యాయి. రెండు పూటలా అన్న ప్రసాదం శ్రీవారి భక్తులకు ఇప్పుడు రెండు పూటలా మహా అన్నప్రసాదం అందుతోంది. రాత్రి వేళ క్షేత్రానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం రెండు పూటల అన్నప్రసాద వితరణ పథకాన్ని దేవస్థానం నూతనంగా ప్రారంభించింది. స్వామి సన్నిధిలో నిర్వహిస్తున్న అన్న ప్రసాద వితరణ, భక్తుల నుంచి విరివిగా వస్తోన్న విరాళాలతో మరింత అభివృద్ధి చెందుతోంది. సామాన్య భక్తులే కాదు.. వీఐపీలు కూడా ఇక్కడకొచ్చి స్వామివారి అన్నామృతాన్ని స్వీకరిస్తున్నారు. రాత్రి వేళ భక్తులకు కదంబం, పెరుగన్నం, చెట్నీని ప్రసాదంగా అందిస్తున్నారు. రెండు పూటలా అన్నప్రసాద వితరణ పథకం తిరుమల తిరుపతి తరువాత, ఏ దైవ సన్నిధిలోను లేని విధంగా ఒక్క చిన వెంకన్న సన్నిధిలోనే నిత్య సాధ్యమైంది. -
ఏటీఎమ్‌లో వినాయకుని ప్రసాదం
-
ఏటీఎమ్ వినాయకుడు; ఎనీ టైమ్ మోదక్
పుణె: గణపతి నవరాత్రుల సందర్భంగా తాము ప్రతిష్టించే వినాయక విగ్రహాలు అందరి దృష్టిని ఆకర్షించాలని భక్తులు కోరుకుంటారు. అయితే మహారాష్ట్ర, పూణెలోని శంకర్‌నగర్‌కు చెందిన గణేష్ భక్తులు మాత్రం విగ్రహా ఏర్పాటులో సాంకేతికతను వినియోగించారు. నూతనంగా ఆలోచించిన వారు.. ఏటీఎమ్(ఎనీ టైమ్ మోదక్) వినాయకున్ని ఏర్పాటు చేశారు. మోదక్ అంటే వినాయకునికి ఇష్టమైన ప్రసాదం. ఏటీఎమ్ స్క్రీన్ మీద వినాయకని చిత్రాన్ని ఉంచారు. ప్రత్యేకంగా రూపొందించిన కార్డు ద్వారా ఈ ఏటీఎమ్ సేవలను పొందవచ్చు. మాములు ఏటీఎమ్‌లలో డబ్బులు వచ్చినట్టే ఇక్కడ వినాయకుని ప్రసాదం లభిస్తుంది. భక్తులు కార్డు వినియోగించినప్పుడు ఏటీఎమ్‌లో నుంచి ప్రసాదం వస్తుంది. ఈ ఏటీఎమ్‌పై నంబర్లకు బదులు ప్రత్యేకమైన బటన్లు ఉంటాయి. వాటిపై క్షమాపణ, శాంతి, భక్తి, జ్ఞానం, అభిమానం.. అని రాసి ఉంది. ప్రస్తుతం ఈ ఏటీఎమ్ వినాయకునికి సంబంధించిన విశేషాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. -
వినాయక విహారం
వినాయకుడు చవితి పండగ నాడు భూలోకానికి విహారానికి వస్తే?తన జనని పార్వతీదేవికి ఇక్కడి వింతలు విడ్డూరాలు చూపిస్తే..నారదుడు ఆ ట్రిప్‌కు లైవ్ రిపోర్టింగ్ అందిస్తే.. చదివిన వారికి పుణ్యమూ, ఫలమూ దక్కినట్టే కదా! శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజమ్ ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజాననమహర్నిశమ్ అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే‘‘ కృష్ణద్వీపంలో నివసించే వేదవ్యాసుడికి మదిలో ఒక కథ మెదిలింది. ఆ కథను అక్షరీకరించాలనుకున్నాడు. తాను నిరాఘాటంగా చెబుతుంటే, ఆపకుండా రాయగలిగే వ్రాయసగాని కోసం వెదికాడు వ్యాసుడు.అప్పుడాయన మదిలో వినాయకుడు మెదిలాడు. ఈ సత్కార్యం విఘ్ననాయకుడైన వినాయకుని పవిత్ర హస్తాల మీదుగా సాగితే బాగుంటుంది అనుకున్నాడు. అనుకున్నదే తడవుగా, వినాయకుడి దగ్గరకు స్వయంగా వెళ్లి, ‘నాయనా! నేను మహాభారత రచన చేద్దామనుకుంటున్నాను. నాకు వ్రాయసకాడు కావాలి. నేను వేగంగా చెబుతుంటే, అంతే వేగంగా రచన చేయాలి. ఇలా రాయాలంటే తప్పనిసరిగా వ్రాయసకాడు కూడా జ్ఞాని అయి ఉండాలి. అందుకు నువ్వే తగినవాడివని భావించాను. మన భారత రచన ఎప్పుడు ప్రారంభిద్దాం గణేశా’ అని ఆప్యాయంగా పలకరించాడు వ్యాసభగవానుడు. అందుకు ఆ గజాననుడు వినమ్రంగా శిరసువంచి, ‘మహర్షీ! మీ అంతటివారు నన్ను ఎంచుకున్నందుకు సదా ధన్యుడిని. మీరు ఎప్పుడు సుముహూర్తం నిర్ణయిస్తే అప్పుడే ప్రారంభిద్దాం’ అన్నాడు ఉమాపుత్రుడు.‘మంచిపనికి ముహూర్తం అక్కర్లేదు నాయనా! తక్షణమే ప్రారంభిద్దాం ఈ శుభకార్యాన్ని’ అన్నాడు బాదరాయణుడు. లంబోదరుడు పాదప్రక్షాళనం చేసుకుని, తాళపత్రాలు, ఘంటం చేతబట్టి, మనస్సులో ఆదిదంపతులను స్మరించి, మనస్సును భ్రూమధ్యంలో లగ్నం చేసి, రచనకు సన్నద్ధుడయ్యాడు. వ్యాసుడి నోటి నుంచి శ్లోకాలు నిశిత శరాలుగా వెలువడుతున్నాయి, వినాయకుడి ఘంటం కూడా అంతే వేగంగా పరుగులు తీస్తోంది, భారత రచన సాగింది. రచన పూర్తయ్యేవరకు వినాయకుడు కదలలేదు, మెదలలేదు, పెదవి కదపలేదు. శ్రీమన్మహాభారతం నిర్విఘ్నంగా పద్దెనిమిది పర్వాలు లక్ష శ్లోకాలు పూర్తయ్యాయి. వ్యాసుడికి నమస్కరించి, ఆయన దగ్గర సెలవు పుచ్చుకుని కైలాసంలో ఉండే తన తల్లిదండ్రులను దర్శించుకున్నాడు. క్షేమసమాచారాలు కనుక్కున్నారు పార్వతీపరమేశ్వరులు. వ్యాసభగవానుడి అద్భుత సృష్టికి తమ కుమారుడు ఘంటం పట్టినందుకు ఆనందపారవశ్యం చెందారు వారు. భూమి మీద భారతం ఉన్నంతకాలం వినాయకుడి పేరు కూడా నిలబడిపోతుందని ఆనందించారు ఆది దంపతులు. ‘‘అమ్మా! ఇంతకాలం వ్యాసభగవానుడి దగ్గర ఉండి, జ్ఞానసముపార్జన చేశాను. ఎంతో అందమైన భారతాన్ని ఆయనకు లేఖకుడిగా ఉన్న కారణంగా అందరికంటె ముందుగా తెలుసుకోగలిగాను. ఇంతటి మహేతిహాసాన్ని మరెవ్వరూ కొన్ని యుగాలు గడిచినా రచించలేరమ్మా! ఇంతకాలం మీకు దూరంగా ఉన్నందుకు నేను ఎన్నడూ చింతించలేదమ్మా. నా రచనా ప్రావీణ్యాన్ని చూసి మీరు కూడా సంబరపడే ఉంటారు. ఇప్పుడు నా మనసుకి కొంచెం విశ్రాంతి కావాలనిపిస్తోంది. కొంతసేపు భూలోకంలో సంచరించాలని ఉంది. నా పుట్టినరోజు వేడుకలను భూలోక వాసులు ఎంతో సంబరంగా జరుపుకుంటారు కదా. ‡ నీ అనుమతితో భూలోకంలో సంచరించాలనుకుంటున్నానమ్మా’ అన్నాడు గణనాయకుడు. అందుకు పార్వతి, ‘నాయనా! నాకు నీ వెంట రావాలని ఉంది. నిన్ను ఒక్కో సంవత్సరం ఒక్కో కొత్త అవతారంలో భూలోకవాసులు చూసుకుంటున్నారు కదా. ఎక్కడెక్కడ ఎవరెవరు నిన్ను ఎలా పూజిస్తున్నారో కనులారా చూసి ఆనందించాలని ఉంది’ అంది పార్వతి. ‘నా మూషికం మీద ఈ యావత్ప్రపంచం నీకు చూపిస్తానమ్మా. ముందుగా నన్ను ఆశీర్వదించు’ అని తల్లి దగ్గర దీవెనలు అందుకుని, ఆమెను తన వాహనం మీద కూర్చుండబెట్టుకుని బయలుదేరాడు వినాయకుడు. వినాయకుడు భూలోక సంచారానికి బయలుదేరుతున్నాడన్న వార్త తెలిసిన త్రిలోక సంచారి నారదుడు, ఈ సమాచారాన్ని తానే ముందుగా అందరికీ అందించాలని, వినాయకుడి కంటె ముందుగానే తన సామాగ్రితో బయలుదేరాడు. వినాయకుడి వెంట తల్లి కూడా ఉండటం చూసి, వెంటనే ‘తాజా వార్త’ అంటూ ప్రచారం చేసేసి, మళ్లీ వారి వెంట బయలుదేరాడు నారదుడు మరింత సమాచార సేకరణ కోసం.‘నాయనా! నిన్ను రకరకాల వేషాలతో విగ్రహాలుగా తయారు చేస్తుంటారు కదా! నీకు కోపం రాదా’ అని ప్రశ్నించింది పార్వతి. వినాయకుడు చిరునవ్వులు చిందిస్తూ, ‘అమ్మా! నాకు ఏది కావాలన్నా నిన్నే అడుగుతాను, అలాగే నువ్వు నీకు కావలసిన విధంగా నన్ను అలంకరించుకుంటావు. అవునా. ఎందుకంటే నాకు నీ దగ్గర చనువు, నీకు నా మీద వాత్సల్యం ఉన్నాయి కాబట్టి. ముందుగా నీవు నీ ఒంటి నలుగు పిండితో నన్ను రూపొందించావు. అందుకే అందరూ నన్ను మట్టితో రూపొందించాలి. అయితే, కొందరు బంగారంతోనూ నన్ను తయారుచేస్తారు. నన్ను వారి ఇంటి బిడ్డగా చూసుకుంటారు. సాధారణంగా మనకు చనువైన వారి దగ్గరే మనకు కావలసినవి అడుగుతాం, చిలిపిచేష్టలు ప్రదర్శిస్తుంటాం. భూలోక వాసులకు నేనంటే ఎంతో ప్రేమ, ఎంతో చనువు ఉంది కాబట్టే నన్ను వారి ఇంటి మనిషిగా భావించి, వారికి నచ్చిన రూపంలో నన్ను అలంకరిస్తుంటారు. అంతేనా! కుంచె పట్టిన ప్రతి చిత్రకారుడు ఈ మాసమంతా నా మీద వ్యంగ్య చిత్రాలు వేస్తూనే ఉంటాడు, హాస్యకథలు రాసేవారు నన్ను ఆధారంగా చేసుకుని హాస్యకథలు రాస్తూనే ఉంటారు’ అన్నాడు వినాయకుడు. ‘‘నాయనా! నీ మాటలు బాగానే ఉన్నాయి. నిన్ను కొందరు నులక మంచం మీద విశ్రాంతి తీసుకుంటున్న వినాయకుడిగా చూపుతారు, కొందరేమో స్కూటర్ వినాయకుడిగా కొలుస్తారు, మరికొందరు నీకు నల్ల కళ్లజోడు పెడతారు. సంగీతాభిలాష ఉన్న కొందరు, నవవినాయకులుగా తొమ్మిది రకాల వాద్యపరికరాలతో నిన్ను సంగీత వినాయకుడిగా చూపుతున్నారు. కొందరు నిన్ను ఓంకార స్వరూపంగా తలుస్తున్నారు, కొందరు నువ్వు క్రికెట్ ఆడుతుంటే చూసి మోజుపడుతున్నారు, నిన్ను వెంకటేశ్వరునిగా మరికొందరు చిత్రీకరిస్తుంటారు. కొందరు నట వినాయకుడిగా చిత్రీకరించారు’ అని ఒక్కొక్క రూపాన్ని పార్వతీదేవి ఏకరువు పెడుతుంటే, మధ్యలోనే వినాయకుడు అడ్డుతగిలి, ‘అంతేనా అమ్మా! కొందరు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ, నాకు పెళ్లి కూడా చేసేశారు, నాలో ఉన్న సిద్ధి, బుద్ధి అనే లక్షణాలను నా భార్యలుగా చేశారు. ఎవరు ఏం చేసినా, వారంతా నా మీద ప్రేమతో చేసినట్లే భావన చేశాను’ అంటుండగా మధ్యలో నారదుడు ప్రవేశించి, ‘అయ్యా! వినాయకా! మీరు చూసినవాటి కంటె నేను మరిన్ని రూపాలు చూశాను. మిమ్మల్ని హనుమ రూపంలో చూడాలనే కుతూహలంతో కొందరు మీ చేతితో గద ఉంచారు. మరికొందరు సర్ప వినాయకుడిని చేశారు, కొందరైతో మీతో కోలాటం ఆడించారు. ఆకులను మీ రూపంగా మలిచారు. మరికొందరు ముచ్చటగా మీ ఒడిలో శ్రీకృష్ణుడిని కూర్చోపెట్టారు. మరో అడుగు ముందుకు వేసి లక్ష్మీదేవిగా కూడా మిమ్మల్ని రూపొందించుకున్నారు’ అంటూ రకరకాల రూపాలను వివరించాడు నారదుడు.నారదుడి మాటలకు ముసిముసిగా తొండం వెనుక నుంచి నవ్వుతూ, ‘త్రిలోక సంచారీ! నాకు నచ్చేది ఒకటేనయ్యా! నా పుట్టినరోజు పేరుతో ఎంతో మంది తమలోని సృజనను వెలికి తీస్తున్నారు. దేవతలలో ఎవ్వరికీ దక్కని ఈ ఘనత నాకు మాత్రమే దక్కింది. నా భక్తులు నన్ను వారి ఇంటి కుమారుడిగా భావించి, వారికి కావలసిన విధంగా నన్ను అలంకరించారు. మంచి తివాసీ మీద పడుకోబెడతారు, పిల్లలు తినే మిఠాయిలతో నన్ను తయారు చేస్తారు, రకరకాల పూసలతో రూపొందిస్తారు. విలాసంగా కూర్చున్నట్లుగా కొందరు నన్ను చెక్కుతారు. ఎవరు ఎలా అలంకరించినా, ఎవరు ఏ రూపంలో నన్ను ఆరాధించినా నాకు అందరి మీద ఒకే ప్రేమ ఉంటుంది’ అని పలికాడు గణనాథుడు. ఇంతలోనే నారదుడు మళ్లీ, ‘‘వినాయకా! ఇవన్నీ సామాన్యుల ఆలోచనలైతే, ఋషులు సైతం నిన్ను విడిచిపెట్టలేదు నాయనా! నిన్ను పదహారు మంది గణపతులుగా పేర్కొన్నారు. నిరుక్త్త గణపతి నుంచి మళ్లీ నిరుక్త గణపతిగా అమావాస్య నుంచి పౌర్ణమి దాకా అర్చిస్తున్నారు. ఎంతటి ఘనత గణనాథా నీది. నాది ఒక్కటే చిన్న విన్నపం గణనాథా! నీ పేరు చెప్పుకుని పర్యావరణాన్ని పాడు చేస్తున్నారు అని కొందరు నిందిస్తున్నారు. ఈ నీలాపనిందలు పడకుండా, నీ భక్తులందరికీ నిన్ను మీ అమ్మ రూపొందించినట్టుగా మట్టితోనే తయారుచేయమని ఆశీర్వదించు’ అంటూ నారదుడు సాష్టాంగపడ్డాడు. వినాయకుడు అందుకు తాను ఏమీ చేయలేనంటూ, జగజ్జనని అయిన తన తల్లితో... నాది ఒక్కటే కోరిక అమ్మా.. నా పేరున జరుగుతున్న ఈ తొమ్మిది రోజుల పండగ సందర్భంగా ప్రతి పందిరిలోను, భక్తిపాటలను మాత్రమే వేయాలని కోరుకుంటున్నాను. మనం తల్లి దగ్గర ఒకలా, తండ్రి దగ్గర ఒకలా, పిల్లల దగ్గర ఒకలా మాట్లాడతాం. అలాగే దేవుడి పందిళ్లలో కొన్ని పాటలు వేయకుండా ఉంటే మనకు మంచిది అనిపించింది. నా పేరున అసభ్యపు పాటలు వింటున్నారని నలుగురూ నా భక్తుల గురించి అనుకోవడం నాకు బాధగా ఉందమ్మా. అందరూ నా పుట్టినరోజును సంబరంగా, సంతోషంగా, ఆనందంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ నా ఆశీస్సులు అందజేస్తున్నాను’’ అంటూ ముగించాడు విఘ్నేశ్వరుడు. ప్రసాదం... అమ్మా! నువ్వు ఎప్పుడూ నా ప్రసాదం గురించి, ‘రుచిపచిలేని ప్రసాదం’ అని బాధపడుతుంటావు. శివాలయంలో అంటే నా తండ్రి నివసించే ఆలయంలో కేవలం తీర్థం మాత్రమే ప్రసాదంగా ఇస్తారు కదా! నా తండ్రి జన్మదినం నాడు భక్తులంతా ఉపవాసం కూడా ఉంటారు. నా తండ్రి సామాన్య జీవితం గడప డానికే ఇష్టపడతాడు. నేను కూడా అంతేనమ్మా. అందుకే నాకు పెట్టే నైవేద్యం అందరికీ అరగడానికి అనువుగా, అందరికీ అందుబాటు లో ఉండే విధంగా నిర్ణయించిన మహాను భావుడు ఎవరో కాని, ఆయనకు శతకోటి వందనాలమ్మా. భక్తితో చేసే నా పూజకు అసలు ఖర్చే ఉండదమ్మా. పిల్లలంతా తోటల లోకి వెళ్లి, రకరకాల ఆకులు కోసుకు వస్తే చాలు. ఏవీ దొరక్కపోతే, నాలుగు గడ్డి పరకలు తెచ్చినా చాలు సంతోషిస్తాను. నా తయారీ కూడా అలాగే సులువుగా ఉండాలి. బంకమట్టితో నన్ను తయారు చేస్తే చాలు. సామాన్యుడి దగ్గర నుంచి సంపన్నుల దాకా అందరికీ అందుబాటు లో ఉండే పూజ కదమ్మా నాది. నా మీద ప్రేమతో ముత్తుస్వామి దీక్షితార్ ‘వాతాపి గణపతిం భజే’, ‘మహాగణపతిం మనసాస్మరామి’ అంటూ... రచించిన కీర్తనలను నేటి తరం కూడా పాడు కోవాలనే ధ్యేయంతో కొందరు వీటికి ఆధునిక పోకడలను సైతం సంత రించారు. – డా. వైజయంతి పురాణపండ -
పాములంటే భయమా? అయితే ఇది చూడాల్సిందే..!
-
శబరిమల ప్రసాదానికి కొత్త రూపు
సాక్షి, తిరువనంతపురం : అయ్యప్పస్వామి ఆలయం శబరిమల ప్రసాదంలో భక్తులకు ఇచ్చే అప్పం, అరవణలో మార్పు చేర్పులు చేపట్టనున్నారు. తిరుపతి వెంకన్న, పళనిలోని మురగ ఆలయ ప్రసాదాలైన లడ్డు, పంచామృతాల తయారీలో సూచనలు చేస్తున్న సెంట్రల్ ఫుడ్ టెక్నలాజికల్ రీసెర్చి ఇనిస్టిట్యూట్ (సీఎఫ్టీఆర్ఐ) శబరిమల ఆలయ ప్రసాదానికీ మెరుగులుదిద్దనుంది. ప్రసాదంగా అందించే అప్పం, అరవణలకు కొత్త రుచి, నాణ్యతలను మేళవించేందుకు ఆలయ యాజమాన్యం ట్రావన్‌కోర్ దేవస్థానం బోర్డు (టీడీబీ) సీఎఫ్‌టీఆర్‌ఐతో ఒప్పందం చేసుకుంది. శబరిమల ఆలయానికి ఏటా నవంబర్ నుంచి జనవరి సీజన్లో దేశ విదేశాల నుంచి లక్షలాది భక్తులు తరలివస్తారు. మే 15న నెలవారీ పూజ కోసం ఆలయాన్ని తెరుస్తామని..ఆ మరుసటి రోజే ప్రసాదంలో మార్పు చేర్పుల కోసం సీఎఫ్‌టీఆర్‌ఐతో ఆలయ బోర్డు ఎంఓయూ చేసుకుంటుందని టీడీబీ అధ్యక్షుడు ఏ పద్మకుమార్ తెలిపారు. ప్రసాదం తయారీలో నిమగ్నమయ్యే ఆలయ సిబ్బందికి సీఎఫ్ఐఆర్ఐ బృందం శిక్షణ ఇస్తుందని చెప్పారు. అన్నీ సజావుగా సాగితే తదుపరి సీజన్ నుంచే భక్తులకు అప్పం, అరవణ ప్రసాదాలు సరికొత్త రుచులతో అందుబాటులో ఉంటాయని తెలిపారు. కాగా ప్రసాదాల ధరలను పెంచే ప్రతిపాదన లేదని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటివరకూ శబరిమల అప్పం గట్టిగా ఉంటోందని, దాన్ని కొంచెం మెత్తగా, తీయగా రూపొందిస్తామని, ఇక అరవణ గట్టిదనాన్ని తగ్గిస్తామని, ఇందులో ఉపయోగించే బెల్లం పరిమాణం కూడా 30-40 శాతం తగ్గుతుందని చెప్పారు. సీఎఫ్టీఆర్ఐ నిపుణుల పర్యవేక్షణలో ప్రసాదాల తయారీ ఏర్పాట్లు, ప్యాకింగ్ పద్ధతుల్లో మార్పుచేర్పులు చోటుచేసుకుంటాయన్నారు. -
ప్రసాదం తిని ఇద్దరు మహిళల మృతి
కోయంబత్తూరు : ప్రసాదం తిని అస్వస్థతకు గురైన ఇద్దరు మహిళలు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. తమిళనాడులోని మెట్టుపాలాయంలోని సెల్వముత్తు మరియమ్మమ్ ఆలయంలో ప్రసాదం తిని సుమారు 30మంది అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన బుధవారం చోటుచేసుకుంది. ఆలయంలో ప్రసాదం స్వీకరించిన 30 మంది భక్తులకు వాంతులు, విరేచనాలు కావడంతో వారిని మెట్టుపాలాయం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఫుడ్ పాయిజన్‌గా నిర్ధారించిన వైద్యులు చికిత్స చేపట్టారు. వీరిలో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ లోకనాయకి, సావిత్రి గురువారం ఉదయం మృతి చెందారు. మిగతా 28మందికి డాక్టర్లు వైద్యం అందిస్తున్నారు. ఆలయంలో తయారుచేసే ప్రసాదానికి పాడైపోయిన నెయ్యి, నూనె వాడటమే ఫుడ్ పాయిజన్ కావడానికి కారణంగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
శ్రీరామ నవమి ప్రసాదం... స్వీకరిద్దాం రారండి!
శ్రీరామ నవమి నాడు పానకం ప్రసాదంగా స్వీకరించడం మన సంప్రదాయం. కేవలం ఒక ప్రసాదంగా మాత్రమే కాదు... అందులోనూ ఎన్నో పోషకాలూ, ఆరోగ్య ప్రయోజనాలూ ఉన్నాయి. బెల్లం ♦ జీర్ణ ప్రక్రియను వేగవంతం చేయడంతో పాటు ఆహారం బాగా జీర్ణమయ్యేలా తోడ్పడుతుంది బెల్లం. జీర్ణ వ్యవస్థ మీద, పేగుల మీద భారాన్ని తొలగిస్తుంది ♦ బెల్లం శ్వాసకోశ వ్యవస్థనూ, జీర్ణ వ్యవస్థను శుభ్రం చేస్తుంది ♦ బెల్లంలో పీచు ఎక్కువ. అందుకే ఇది మలబద్దకాన్ని నివారిస్తుంది. అంతేకాదు... ఈ పీచుపదార్థాలే బెల్లాన్ని మంచి క్లెన్సర్‌గా పనిచేసేలా చేస్తాయని ప్రతీతి. క్లెన్సర్‌గా ఇది కాలేయాన్ని సైతం శుభ్రపరుస్తుంది ♦ బెల్లంలో ఖనిజాలు, లవణాలు చాలా ఎక్కువ. మరీ ముఖ్యంగా ఐరన్ ఎక్కువ ♦ బెల్లంతో చేసిన పదార్థాలు తినడం వల్ల అవి ఒంట్లోని ఫ్రీరాడికల్స్‌ను హరిస్తాయి. ఫలితంగా రోగనిరోధక శక్తి పెరుగుతుంది ♦ కీళ్ల నొప్పులు ఉన్నవారి బాధలకు బెల్లం కాస్త ఉపశమనం కలిగిస్తుంది. మిరియాల్లో... ♦ మిరియాలలోని పైపరిన్ అనే పోషకం మెదడులోని కణాలను ఉత్తేజపరుస్తుంది. అందువల్ల మెదడు చురుగ్గా ఉండటంతో పాటు మతిమరుపు, అలై్జమర్స్ లాంటి అనేక సమస్యలు నివారితమౌతాయి ♦ మన శరీరంలోని ఫ్రీరాడికల్స్‌ను మిరియాలు సమర్థంగా అరికట్టి ఎన్నో రకాల క్యాన్సర్ల నివారణకు సమర్థంగా తోడ్పడతాయి, మలబద్దకాన్ని, డయేరియాను సైతం నివారిస్తాయి ∙జలుబు, దగ్గులకు తొలి చిట్కా మిరియాలే ∙ఛాతీ పట్టేసినట్లు ఉన్నా, ఊపిరితిత్తుల్లో శ్వాస తీసుకోవడం కష్టమైనా మిరియాలు ఆ సమస్యను తక్షణం ఉపశమింపజేస్తాయి. సైనసైటిస్ సమస్యకు మిరియాలు మంచి ఉపశమనం. యాలకులు... శ్రీరామ నవమి వేసవిలో వచ్చే పండుగ. ఈకాలంలో ఎన్ని నీళ్లు తాగినా దాహం తీరని గుణాన్ని నివారించడానికి తోడ్పడేవి యాలకులు. శ్రీరామ నవమి పానకానికి మంచి రుచి, సువాసనను ఇస్తాయవి. వాటితోనూ కలిగే ఆరోగ్య ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు. ఈ సుగంధద్రవ్యం వల్ల కలిగే ప్రయోజనాలలో కొన్ని... ♦ ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్ క్యాన్సర్లతోపాటు గుండెజబ్బులనూ నివారిస్తాయి ♦ దేహంలో ఎక్కడ ఇన్ఫెక్షన్ లేదా ఇన్ఫ్లమేషన్ ఉన్నా యాలకులు నివారిస్తాయి ♦ యాలకుల్లో మూడ్‌ను బాగుండేలా చేసే లక్షణంతో పాటు డిప్రెషన్‌ను దూరం చేసే గుణం ఉంది ♦ నోటి పరిశుభ్రతనూ, ఆరోగ్యాన్ని (ఓరల్ హైజీన్)ను కాపాడతాయి. ఇక నవమి ప్రసాదంలోని వడపప్పులో... పెసర్లలో ఆరోగ్యానికి మేలు చేసే గుణాలివి... ♦ పెసర్లలో పీచు పాళ్లు ఎక్కువ. అందుకే జీర్ణవ్యవస్థ ఆరోగ్యానికి ఇవి ఎంతగానో మేలుచేస్తాయి. మలబద్దకాన్ని నివారించి, జీర్ణశక్తిని మెరుగుపరుస్తాయి ♦ ఒంట్లోని కొవ్వులు, కొలెస్ట్రాల్‌ను నియంత్రణలో ఉంచుతాయి ♦ పొటాషియమ్ పాళ్లు ఎక్కువ. అందుకే హైబీపీని తగ్గించేందుకు ఇవి బాగా ఉపయోగపడతాయి ♦ పెసర్లలో ఐరన్ పుష్కలం. రక్తహీనతను తగ్గించడానికి అవి తోడ్పడతాయి. కొబ్బరిలో... వడపప్పులో చిన్నచిన్న కొబ్బరి ముక్కలు, కొబ్బరి కోరు వేస్తారు. దీనివల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల్లో కొన్ని... ♦ కొబ్బరిలో 61 శాతం డయటరీ ఫైబర్ ఉంటుంది. కాబట్టి అది ఒంట్లోకి విడుదల అయ్యే చక్కెరను చాలా నెమ్మదిగా అయ్యేలా చూస్తుంది ♦ కొబ్బరిలోని సైటోకైనిన్స్, కైనెటిన్, ట్రాన్స్ జీటిన్ అనే అంశాలు వయసును తగ్గిస్తాయి. కొబ్బరి తినేవారు దీర్ఘకాలం యౌవనంతో ఉంటారు ♦ కొబ్బరిలో వ్యాధి నిరోధక శక్తిని పెంచే పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. అందుకే కొబ్బరి తినేవారిలో వైరల్, ఫంగల్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లను తట్టుకునే శక్తి బాగా పెరుగుతుంది. అంతేకాదు... ఆహారంలో కొబ్బరిని ఎక్కువగా వాడేవారికి గొంతు ఇన్ఫెక్షన్లు, బ్రాంకైటిస్, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లు ఒక పట్టాన రావు కొబ్బరిలో కొవ్వుల పాళ్లు ఎక్కువ అన్న సంగతి తెలిసిందే. కొబ్బరి తిన్నప్పుడు ఆ కొవ్వుల కారణంగా ఆకలి అంతగా అనిపించదు. అందుకే కొబ్బరి తినేవారిలో ఆకలి కాస్త తగ్గడం వల్ల తినే కోరిక కూడా తగ్గుతుంది. అందుకే బరువు తగ్గాలనుకునే వారు ఆరోగ్యవంతమైన బరువు తగ్గే సాధనంగా కొబ్బరిని ఎంచుకొని, దాని వాడకం పెంచుకోవడం మంచిదనేది ఒబేసిటీని తగ్గించే నిపుణులు చెబుతున్న మాట. మన సంప్రదాయంలో స్వాభావికంగానే ఆరోగ్యాన్ని కాపాడే మంచి లక్షణాలు ఉన్నాయి. శ్రీరామనవమి నాటి వడపప్పులో, పానకంలో కూడా. అందుకే నవమి నాటి ప్రసాదాలను స్వీకరిస్తే... దైవకృపకు కృప... ఆరోగ్యానికి ఆరోగ్యం. -
అన్యమతస్తులకు ప్రసాదం తయారీ కాంట్రాక్ట్?
సింహాచలం(పెందుర్తి): వరాహ లక్ష్మీనృసింహస్వామి దేవస్థానంలో ప్రసాదాల కాంట్రాక్ట్‌ను అన్యమతస్తుడికి ఇచ్చారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దేవా దాయశాఖ నిబంధనలను ఉల్లంఘించి అన్యమతస్తుడికి కాంట్రాక్ట్ ఇచ్చి హిందువుల మనోభావాలు దెబ్బతీశారన్న నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. వివరాల్లోకి వెళ్తే... సింహాచలం దేవస్థానంలో స్వామి ప్రసాదంగా లడ్డు, పులిహోర విక్రయాలు జరుపుతార న్న సంగతి తెలిసిందే. వీటిని భక్తులు మహా ప్రసాదంగా స్వీకరిస్తారు. ఏటా దేవస్థానం ఈప్రొక్యూర్‌మెంట్, సీక్రెట్ టెండర్ ద్వారా ప్రసాదాల కాంట్రాక్ట్‌ను ఇస్తుంటుంది. వీటిల్లో తక్కువ కోడ్ చేసిన కాంట్రాక్టర్‌కు ప్రసాదాల కాంట్రాక్ట్ ఇస్తుంది. సదరు కాంట్రాక్టర్ పులిహోర ప్యాకింగ్, శ్రీ వైష్ణవస్వాములతో లడ్డూను తయారుచేయించడం, సిబ్బంది చేత లడ్డూలను చుట్టించడం చేయాలి. దేవాదాయశాఖ రూల్ ప్రకారం టెండర్లు వేసి, వాటిని దక్కించుకునే వారంతా హిందువులే అయి ఉండాలి. ఇప్పటివరకు అలాగే కొనసాగుతోంది. ఈ ఏడాది జనవరి నుంచి ప్రారంభమైన కొత్త కాంట్రాక్ట్‌కు సంబంధించి దేవస్థానం టెండర్లు పిలిచింది. అందులో ఈప్రొక్యూర్‌మెంట్ ద్వారా తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి చెందిన రాజ్ సెక్యూరిటీ సర్వీసెస్ తక్కువ కోడ్ చేసి టెండరు కైవసం చేసుకుంది. సంబంధిత సెక్యూరిటీ సర్వీసెస్ మేనేజింగ్ పార్టనర్ టెండరు దాఖలు చేశారు. టెండరు తక్కువ ధరకు కోడ్ చేయడంతో అతనికి కాంట్రాక్ట్‌ని దేవస్థానం అధికారికంగా అందజేసింది. ఫిబ్రవరి నుంచి ఇందుకు సంబంధించిన పనులు చేస్తున్నాడు. అయితే సదరు కాంట్రాక్టర్ అన్యమతస్తుడని, ప్రసాదాల కాంట్రాక్ట్‌ను అతడికి ఎలా అప్పగిస్తారన్న ఆరోపణలు రెండు రోజుల నుంచి చోటుచేసుకున్నాయి. విచారణ చేయిస్తాం దేవాదాయశాఖ రూల్స్ ప్రకారం ప్రసాదాల టెండ రు దాఖలు చేసేవాళ్లు, తీసుకునేవారు హిందువు అయి ఉండాలి. టెండరు రూల్స్ ప్రకారం కాంట్రాక్టు పొందిన వ్యక్తి తాను హిందువునని డిక్లరేషన్‌లో పేర్కొన్నాడు. దేవాదాయశాఖ పరిధిలోని ఆలయాల్లో ఇలాటి విధులు నిర్వర్తించడానికి అవసరమైన సిబ్బందిని కొన్నేళ్ల నుంచి అందిస్తున్నట్టు డిక్లరేషన్‌లో తెలిపారు. దేవాదాయశాఖ నిబంధనలకు కట్టుబడి పూర్తిగా హిందూ ధర్మాన్ని పాటిస్తున్నానని, అన్యమతానికి చెందినవాడిని కాదని తెలిపారు. అయినా అతను హిందువో కాదో విచారణ జరిపిస్తాం. అతను అన్యమతస్తుడైతే కాంట్రాక్ట్ రద్దు చేసి క్రిమినల్ చర్యలు తీసుకుంటాం. – కె.రామచంద్రమోహన్, ఈవో సింహాచలం దేవస్థానం -
తిరుమల బూందీపోటులో అగ్నిప్రమాదం
-
తిరుమల బూందీపోటులో అగ్నిప్రమాదం
సాక్షి, తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయం వెలుపల బూందీ పోటులో శనివారం అగ్నిప్రమాదం జరిగింది. బూందీ తయారీకి వాడే బాండిళ్లు (పెనం) అతివేడి కారణంగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన పోటు సిబ్బంది డ్రై కెమికల్ పౌడర్‌తో మంటలు ఆర్పి వేశారు. గ్యాస్ సరఫరా నిలిపివేశారు. పోటు సిబ్బంది క్షేమంగా బయటపడ్డారు. డిప్యూటీ ఈవో కోదండ రామారావు, పోటు పేష్కార్ అశోక్ ఘటనా స్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మూడు బాండిళ్లు కాలినట్టు గుర్తించి వాటిని తొలగించారు. గంట వ్యవధిలోనే తిరిగి బూందీ తయారీ ప్రారంభించారు. బూందీ పోటులో ఎటువంటి అగ్నిప్రమాదం జరగలేదని, బాండిల్‌కు అంటుకుని ఉన్న నెయ్యి వ్యర్థాలు మాత్రమే కాలాయని కోదండ రామారావు తెలిపారు. ఘటనలో ఆస్తి నష్టం జరగలేదన్నారు. -
తిరుమలలో అగ్నిప్రమాదం
-
మహాప్రసాదం
సత్తెన్న ప్రసాదానికి పెరిగిన డిమాండ్ ‘లోవ ’ భక్తుల కొనుగోళ్లు తొలిపాంచా, నమూనా ఆలయం కౌంటర్లలో 65 వేల ప్రసాదం ప్యాకెట్ల విక్రయం రూ.9.75 లక్షల ఆదాయం అన్నవరం: ఆషా«ఢమాసం.. ఆదివారం.. తుని రూరలె మండలంలోని లోవ తలుపులమ్మతల్లి దర్శనానికి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. వారి తిరుగుప్రయాణంలో భారీ ఎత్తున సత్యదేవుని ప్రసాదాలు కొనుగోలు చేశారు. కొండదిగువన తొలిపాంచా వద్ద, బైపాస్ రోడ్డులోని సత్యదేవుని నమూనా ఆలయం వద్ద గల ప్రసాదం విక్రయస్టాల్స్ వద్ద ఆదివారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకూ భక్తుల రద్దీ కొనసాగింది. రాత్రి ఏడు గంటల సమయానికి సుమారు 65 వేల ప్రసాదం ప్యాకెట్లు (125 గ్రాములు రూ.15) విక్రయించగా రూ.9.75 లక్షల ఆదాయం సమకూరింది. ఏటా ఆషాఢమాసంలో వచ్చే ఆదివారాలలో భారీ సంఖ్యలో లోవ తలుపులమ్మ తల్లి దేవస్థానానికి వెళ్లే భక్తులు తిరుగు ప్రయాణంలో సత్యదేవుని ప్రసాదం కొనుగోలు చేయడం ఆనవాయితీగా వస్తోంది. దాన్ని దృష్టిలో ఉంచుకొనే అన్నవరం దేవస్థానం విస్తృతంగా ఏర్పాట్లు చేసింది. కొండదిగువన తొలిపాంచా వద్ద, బైపాస్ రోడ్డులోని నమూనా ఆలయం వద్ద గల ప్రసాదం స్టాల్స్ వద్ద అదనపు కౌంటర్లను ఏర్పాటు చేసింది. సుమారు 70 వేల ప్రసాదం ప్యాకెట్లను సిద్ధం చేసింది. మధ్యాహ్నం నుంచి రాత్రి ఏడుగంటల వరకూ సుమారు 65 వేల ప్యాకెట్లను విక్రయించినట్టు అధికారులు తెలిపారు. మిగిలిన ఐదువేల ప్రసాదం ప్యాకెట్లు కూడా రాత్రి విక్రయించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. దేవస్థానం ఇన్‌ఛార్జి ఈఓ ఈరంకి వేంకట జగన్నాథరావు ఈ ప్రసాదం స్టాల్స్‌ను సందర్శించి అక్కడ సిబ్బందికి తగు సూచనలు ఇచ్చారు. ఏఈఓ సాయిబాబా, ఆలయ సూపరిండెంట్ బలువు సత్యశ్రీనివాస్, ఇనస్పెక్టర్ పోల్నాటి లక్ష్మీనారాయణ తదితరులు స్టాల్స్ వద్ద విక్రయాలు పర్యవేక్షించారు. -
దేవుడికి సమర్పించినదే... నైవేద్యం
ఆత్మీయం పండగరోజుల్లోనో, పూజలు చేసేటప్పుడో దేవుడికి నైవేద్యం పెట్టడం అలవాటు. నైవేద్యం పెట్టేటప్పుడు ఏ మంత్రాలు చదవాలో, ఏం చేయాలో తెలియకపోయినా... ఒక ఆకులో లేదా పళ్లెంలో వండిన పదార్థాలన్నింటినీ ఉంచి, దేవుడికి చూపించిన తర్వాతే భోజనం చేస్తారు. నైవేద్యం ఎందుకంటారు? మనం ఆహారం తినేటప్పుడు ‘ఇది నేను సంపాదించినది లేదా మా నాన్న సంపాదించినది లేదా నా భర్త సంపాదించినది’ అనే భావం తొంగి చూస్తుంటుంది. అదే ఆహారాన్ని భగవంతునికి సమర్పించడం వల్ల అహంకారం స్థానంలో వినమ్రత కలుగుతుంది. అన్నం పరబ్రహ్మ స్వరూపం అని తెలుస్తుంది. ‘నేను ఈ రోజున అన్నం తింటున్నానంటే, అది నీ కృప వల్లే తప్ప నా గొప్పతనం కాదు’ అనే సమర్పణ భావన, కృతజ్ఞతాభావం ఉంటాయి. భగవంతునికి సమర్పించిన దానిని వృథా చేయరాదన్న ఆలోచన కలుగుతుంది. మనం పుస్తకంలో లేదా పేపర్లో అక్షరాలు చదువుతాం... ఆ అక్షరాలు అక్షరాలుగా పేపర్లో లేదా పుస్తకంలో ఉంటాయి కానీ, అవి జ్ఞానంగా, జ్ఞాపకంగా మారి మన మెదడులో ప్రవేశిస్తాయి... అదేవిధంగా దేవుడు మనం పెట్టిన నైవేద్యాన్ని సూక్ష్మస్థితితో స్వీకరిస్తాడు... కానీ పదార్థాలు పదార్థాలుగా అలాగే ఉండిపోతాయన్నమాట. దానినే మనం పవిత్రమైన ప్రసాదంగా స్వీకరిస్తాం. -
శ్రీరాముడికి సంప్రదాయ ప్రసాదాలు కనుమరుగు
-
‘ఘీ’చులాట
నెయ్యి సరఫరా చేయలేమని చేతులెత్తేసిన ఏపీ డెయిరీ కిలో రూ.400 చొప్పున ‘సంగం’ నుంచి కొనుగోలుకు నిర్ణయం అన్నవరం : కార్తీక మాసంలో వచ్చే భక్తుల కోసం విస్తృత ఏర్పాట్లు చేస్తున్న అన్నవరం దేవస్థానం అధికారులకు షాక్ తగిలింది. స్వామివారి ప్రసాదం తయారీలో ఉపయోగించే నెయ్యి(ఘీ)ని సరఫరా చేస్తున్న ఏపీ డెయిరీ అధికారులు ఇకపై నెయ్యి సరఫరా చేయలేమని లేఖ పంపించారు. ప్రతి నెలా సుమారు 12 టన్నుల నెయ్యి ప్రసాదం విభాగంలో వాడుతుండగా కార్తీకమాసంలో ఏకంగా 20 టన్నులకు పైగా నెయ్యి అవసరం. ఇంత పెద్ద మొత్తంలో నెయ్యిని ఎక్కడ కొనుగోలు చేయాలోనని అధికారులు డైలమాలో పడ్డారు. దానికితోడు శుక్రవారం తయారు చేసే ప్రసాదానికి అవసరమయ్యే 400 కేజీల నెయ్యి కూడా దేవస్థానంలో లేని పరిస్థితి. దీంతో అధికారులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. గతంలో రెండు నెలలపాటు నెయ్యి సరఫరా చేసిన సంగం డెయిరీ మళ్లీ నెయ్యి సరఫరా చేయాలని కోరగా సంబంధిత యాజమాన్యం ఆమోదం తెలపడంతో ఊపిరి పీల్చుకున్నారు. అంతే కాదు గురువారం ఒక్కో టిన్ను 15 కేజీల బరువు కలిగిన 350 టిన్నులు నెయ్యిని పంపించడంతో శుక్రవారం ప్రసాదం తయారీకి ఇబ్బంది లేకుండా పోయింది. అయితే రేటు మాత్రం కేజీ నెయ్యికి రూ.26 అదనంగా చెల్లించాల్సి ఉంది. ఆ మేరకు దేవస్థానంపై భారం పడనుంది. దేవస్థానానికి అదనపు భారం: ప్రస్తుతం కేజీ నెయ్యి రూ.374కి కొనుగోలు చేస్తుండగా సంగం డెయిరీ నెయ్యి కేజీ రూ.400. దీంతో కేజీకి రూ.26 అదనపు భారం పడనుంది. నెలకు సుమారు 20 టన్నుల నెయ్యి కొనుగోలు చేస్తారనుకుంటే రూ.5.20లక్షలు అదనపు భారం పడనుంది. అయితే బహిరంగ మార్కెటలో ఇతర మిల్క్ సొసైటీల నెయ్యి రేటు కిలో రూ.420 నుంచి రూ.440 వరకూ ఉందని అధికారులు తెలిపారు. దీంతో పోలిస్తే ఇది తక్కువేనని వివరించారు. ఏపీ డెయిరీ సరఫరా చేయనందునే.. ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ డెయిరీ నుంచే ఇప్పటి వరకూ నెయ్యి కొనుగోలు చేశాం. వారు హఠాత్తుగా సరఫరా చేయలేమని చెప్పడంతో సంగం డెయిరీ నుంచి నెయ్యి కొనుగోలు చేయడానికి నిర్ణయించాం సంగం డెయిరీ విజయవాడ, ద్వారకా తిరుమల దేవస్థానాలకు కేజీ నెయ్యి రూ.400కి సరఫరా చేస్తోందని, అదే రేటు చెల్లించాలని వారు కోరగా అంగీకరించాం – ఈఓ నాగేశ్వరరావు -
ఇకపై వధూవరులకు దుర్గమ్మ ఆశీస్సులు
విజయవాడ (ఇంద్రకీలాద్రి) : శ్రీదుర్గామల్లేశ్వరస్వామి దర్శనానికి వచ్చే నూతన వధూవరులకు దుర్గమ్మ దర్శనంతో పాటు వేదపండితుల ఆశీర్వచనం, ప్రసాదాలు అందజేసే కార్యక్రమానికి దుర్గగుడి అధికారులు శ్రీకారం చుట్టారు. దేవాదాయ శాఖ ఆదేశాల మేరకు గురువారం నుంచి ఆలయ అధికారులు ఈ విధానాన్ని ప్రారంభించారు. గురువారం ఈ భాగ్యాన్ని పొందిన వధూవరులు ఎంతో ఆనందించారు. దుర్గమ్మ స్వయంగా తమను ఆశీర్వదించిందని సంతోషం వ్యక్తం చేశారు. -
శ్రీవారి ప్రసాదాల తయారీ కేంద్రంలో అగ్నిప్రమాదం
తిరుమల: శ్రీవెంకటేశ్వర స్వామివారి ప్రసాదాలు తయారు చేసే ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తేవడానికి ప్రయత్నిస్తున్నారు. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో.. సిబ్బంది భయాందోళనలకు గురయ్యారు. మితిమీరిన వేడి వలన వ్యర్థాలు అంటుకోవడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. -
రైల్వేస్టేషన్లో దుర్గమ్మ ప్రసాదం రెడీ
విజయవాడ (రైల్వేస్టేçÙన్) : దుర్గగుడి అధికారులు రైల్వేస్టేçÙన్లో ఏర్పాటు చేసిన కౌంటర్లో ప్రసాదాలను బుధవారం నుంచి విక్రయిస్తున్నారు. ఈ కౌంటర్లో ఆదివారం నుంచి ప్రసాదం అందుబాటులో లేదు. ఈ విషయాన్ని బుధవారం ‘సాక్షి’ వెలుగులోకి తీసుకొచ్చింది. దీనిపై దుర్గగుడి అధికారులు స్పందించారు. రైల్వేస్టేçÙన్లోని కౌంటర్‌కు ప్రసాదాలను పంపారు. ఈ మేరకు మధ్యాహ్నం నుంచి భక్తులకు ప్రసాదం విక్రయిస్తున్నారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ముగిసే వరకు 24 గంటలు ప్రసాదం విక్రయిస్తామని సిబ్బంది తెలిపారు. -
సత్యదేవుని ప్రసాదం నాణ్యతపై విమర్శల వెల్లువ
కారణాలపై అధికారులతో సమీక్ష నిర్వహించిన ఈఓ ఇద్దరు సిబ్బంది సస్పెన్షన్, ముగ్గురికి ఛార్జి మెమోలు అన్నవరం: సత్యదేవుని ప్రసాదం నాణ్యతపై విమర్శలు వచ్చిన నేప«ధ్యంలో ఆ విభాగంలో పనిచేసే పలువురి సిబ్బందిపై ఈఓ కె.నాగేశ్వరరావు గురువారం క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. సత్యదేవుని ప్రసాదం నిల్వ ఉండడం లేదని సామర్లకోటకు చెందిన ప్రయివేట్ స్కూల్ ఉపాధ్యాయుడు వాపోయిన విషయం మంగళవారం ‘సాక్షి’ దినపత్రికలో వచ్చిన విషయం విదితమే. బుధవారం కూడా కొంతమంది భక్తులు ఇదే విధమైన ఫిర్యాదులు చేశారు. దాంతో ఆయన గురువారం సంబంధిత విభాగం అధికారులతో సమావేశం నిర్వహించి ప్రసాదం నాణ్యతగా ఉండక పోవడానికి కారణాలపై ^è ర్చించారు. అనంతరం ప్రసాదం కుక్ పీఎస్‌ఎస్‌వి ప్రసాదరావు, గోధుమ నూక మర ఆడే ప్యాకర్ ఎన్. లక్ష్మణరావును సస్పెండ్ చేశారు. సంబంధిత విభాగ సూపరెంటెండెంట్ పీవీఎస్ భాస్కర్, గుమస్తాలు వరహాలరావు, లక్ష్మీనారాయణలకు ఛార్జి మెమోలు జారీ చేశారు. -
లక్షా పదివేల ప్రసాదం ప్యాకెట్లు విక్రయం
రూ.11 లక్షల ఆదాయం అన్నవరం : తుని మండలం లోవకొత్తూరులో గల తలుపులమ్మ తల్లి దేవస్థానానికి ఆదివారం తరలివెళ్లిన భక్తులు తిరుగు ప్రయాణంలో అన్నవరంలో ఆగి సత్యదేవుని ప్రసాదాల కొనుగోలు చేశారు. లోవభక్తుల రద్దీతో స్వామివారి ప్రసాదాల విక్రయ కేంద్రాల వద్ద ఆదివారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకూ తీవ్ర రద్దీ ఏర్పడింది. బైపాస్‌రోడ్‌లోని నమూనా ఆలయం వద్ద ప్రసాదాల కోసం భక్తులు అర గంట క్యూలో వేచియుండాల్సి వచ్చింది. సత్యదేవుని తొలిపాంచా వద్ద, బైపాస్‌రోడ్‌లోని నమూనా ఆలయం వద్ద, రత్నగిరిపై రోశయ్య మండపంలో గల ప్రసాద విక్రయ కేంద్రాల వద్ద సుమారు లక్షా పదివేల ప్రసాదం ప్యాకెట్లు విక్రయించినట్లు అధికారులు తెలిపారు. ఒక్కో ప్యాకెట్ రూ. పది విలువ గల ఈ ప్యాకెట్ల విక్రయం ద్వారా దేవస్థానానికి రూ.11 లక్షలు ఆదాయం సమకూరిందని అధికారులు తెలిపారు. -
అన్నవరం దేవాలయ వంటశాలలో ప్రమాదం
-
అన్నవరం దేవాలయ వంటశాలలో ప్రమాదం
అన్నవరం: తూర్పుగోదావరి జిల్లా అన్నవరంలోని సత్యనారాయణ స్వామి దేవాలయ వంటశాలలో ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం సంభవించింది. శనివారం ఉదయం వంటలు చేస్తుండగా గ్యాస్ సిలిండర్ పేలుడు సంభవించినల్టు సమాచారం. ఈ ప్రమాదంలో ముగ్గురు కూలీలు గాయపడ్డారు. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. విషయం తెలిసిన అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపుచేశారు. -
అన్నవరం ప్రసాదం.. ఇక వంద గ్రాములే!!
రేటు పెంచకుండా పరిమాణంపై వేటు పాలకవర్గ సమావేశంలో నిర్ణయం తయారీ వ్యయం పెరుగుదలే కారణమంటున్న అధికారులు సత్యదేవుని ప్రసాదం తయారీ ఖర్చులు పెరిగిన నేపథ్యంలో రేటు యథాతథంగా ఉంచి ప్రసాదం పరిమాణాన్ని తగ్గించాలని పాలకవర్గ సమావేశంలో నిర్ణయించారు. సత్యదేవునికి 2013- 14 ఆర్థిక సంవత్సరంలో రూ. 60 కోట్ల మేర ఆదాయం లభించింది. దేవస్థానం పాలక మండలి సమావేశం వివరాలను ఈఓ వేంకటేశ్వర్లు ‘న్యూస్‌లైన్’కు తెలిపారు. దేవస్థానంలో వాడే వివిధ దినుసుల ధరలు పెరగడంతో ఏడాదికి రూ. 25 లక్షల మేరకు ఖర్చు పెరిగినట్టు ఆయన వెల్లడించారు. ప్రసాదం తయారీ వ్యయం పెరగడం వల్ల సత్యదేవుని ప్రసాదం ప్యాకెట్ బరువు తగ్గిస్తున్నట్టు ఈఓ తెలిపారు. ప్రస్తుతం 150 గ్రాముల ప్రసాదం ప్యాకెట్ రూ.పది కాగా అదే రేటుకు 100 గ్రాముల ప్రసాదం అందజేయాలని తీర్మానించారన్నారు. అదే విధంగా ప్రస్తుతం 150 గ్రాముల బంగీ ప్రసాదం ప్యాకెట్ ధర రూ. 15 అని, ఇకపై 100 గ్రాముల బంగీ ప్రసాదం రూ.15కు అందజేయాలని పాలకవర్గం తీర్మానించారన్నారు. ఈ తీర్మానాలను దేవాదాయ శాఖ కమిషనర్‌కు పంపుతున్నామని, అక్కడ ఆమోదం పొందాక ఈ మార్పు అమలులోకి వస్తుందన్నారు. ప్రసాదం తయారీలో వినియోగించే నెయ్యి ధర ఆరు నెలల క్రితం కిలో రూ.292 ఉండగా ప్రస్తుతం రూ.377 అయ్యిందన్నారు. గ్యాస్ బండ ప్రస్తుతం రూ.1,250 నుంచి రూ.1,325 మధ్యలో కొనుగోలు చేస్తున్నారు. ఆరు నెలల క్రితంతో పోల్చిచూస్తే దీని ధర కూడా రూ. రెండు వందల వరకూ పెరిగినట్టు ఆయన తెలిపారు. గోధుమ ధర కిలో రూ. 24, చక్కెర కిలో రూ.29కి కొనుగోలు చేస్తున్నామన్నారు. ఈ ధరలు కూడా భవిష్యత్తు లో పెరిగే అవకాశం ఉందన్నారు. ప్రసాదం ప్యాకర్లకు గతంలో ఒక ప్యాకెట్‌కు 35 పైసలు ఇచ్చేవారమని, ప్రస్తుతం అది 50 పైసలకు పెంచుతూ దేవాదాయశాఖ కమిషనర్‌కు ప్రతిపాదన పంపామన్నారు.