లక్షా పదివేల ప్రసాదం ప్యాకెట్లు విక్రయం
Published Sun, Jul 24 2016 8:44 PM | Last Updated on Mon, Sep 4 2017 6:04 AM
రూ.11 లక్షల ఆదాయం
అన్నవరం : తుని మండలం లోవకొత్తూరులో గల తలుపులమ్మ తల్లి దేవస్థానానికి ఆదివారం తరలివెళ్లిన భక్తులు తిరుగు ప్రయాణంలో అన్నవరంలో ఆగి సత్యదేవుని ప్రసాదాల కొనుగోలు చేశారు. లోవభక్తుల రద్దీతో స్వామివారి ప్రసాదాల విక్రయ కేంద్రాల వద్ద ఆదివారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకూ తీవ్ర రద్దీ ఏర్పడింది. బైపాస్‌రోడ్‌లోని నమూనా ఆలయం వద్ద ప్రసాదాల కోసం భక్తులు అర గంట క్యూలో వేచియుండాల్సి వచ్చింది. సత్యదేవుని తొలిపాంచా వద్ద, బైపాస్‌రోడ్‌లోని నమూనా ఆలయం వద్ద, రత్నగిరిపై రోశయ్య మండపంలో గల ప్రసాద విక్రయ కేంద్రాల వద్ద సుమారు లక్షా పదివేల ప్రసాదం ప్యాకెట్లు విక్రయించినట్లు అధికారులు తెలిపారు. ఒక్కో ప్యాకెట్ రూ. పది విలువ గల ఈ ప్యాకెట్ల విక్రయం ద్వారా దేవస్థానానికి రూ.11 లక్షలు ఆదాయం సమకూరిందని అధికారులు తెలిపారు.
Advertisement