annavaram
-
సత్యదేవుని దేవేరికి నేడు వజ్ర కిరీట సమర్పణ
అన్నవరం: కాకినాడ జిల్లా అన్నవరం శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామివారి 134వ ఆవిర్భావ దినోత్సవాలు (జయంత్యుత్సవాలు) సోమవారం ఘనంగా ప్రారంభం కానున్నాయి. దీన్ని పురస్కరించుకుని సత్యదేవుని దేవేరి అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారికి పెద్దాపురానికి చెందిన శ్రీ లలితా రైస్ ఇండస్ట్రీ అధినేతల్లో ఒకరైన మట్టే సత్యప్రసాద్ దంపతులు వజ్ర కిరీటం సమర్పించనున్నారు. సోమవారం మ«ధ్యాహ్నం స్వామివారి ప్రధాన ఆలయంలో రూ.1.50 కోట్ల విలువైన ఈ వజ్రకిరీటాన్ని అందజేయనున్నట్లు సత్యప్రసాద్ తెలిపారు. ఈ కిరీటంతో పాటు స్వామి, అమ్మవార్లకు రూ.50 లక్షలతో చేయించిన వజ్ర కర్ణాభరణాలు కూడా అందజేయనున్నట్లు చెప్పారు. కాగా, ఇకపై ప్రతి రోజూ స్వామి, అమ్మవార్లు ఈ వజ్రకిరీటాలు, వజ్ర కర్ణాభరణాలు ధరించి భక్తులకు దర్శనమివ్వనున్నారు. -
హోం మంత్రి అనుచరుల అరాచకం
సాక్షి ప్రతినిధి, కాకినాడ: కోల్‌కతా–చెన్నై జాతీయ రహదారిని ఆనుకుని కాకినాడ జిల్లా అన్నవరం సమీపంలోని ఓ రెస్టారెంట్లో తెలుగు తమ్ముళ్లు విధ్వంసానికి పాల్పడ్డ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచి్చంది. బాధితుల కథనం మేరకు.. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట ప్రాంతంలో తెలుగుదేశం పార్టీకి చెందిన ఒక రియల్టర్, ఇద్దరు హేచరీల నిర్వాహకులు కలిసి పొరుగున అన్నవరంలో జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న ఒక రెస్టారెంట్‌కు ఇటీవల వచ్చారు. రెస్టారెంట్లో ఎటువంటి ఆర్డర్ ఇవ్వకుండా గంటల తరబడి కూర్చోవడంపై రెస్టారెంట్ నిర్వాహకులు ప్రశి్నంచారు.కస్టమర్లు వస్తున్నారు, వ్యాపారం దెబ్బతింటున్నదని టేబుల్ ఖాళీ చేయాలని రెస్టారెంట్ సిబ్బంది వారికి సూచించడంతో ఒక్కసారిగా వారు రెచి్చపోయారు. హోంమంత్రి తాలూకా తమనే రెస్టారెంట్ నుంచి వెళ్లిపోమంటావా, ఖాళీ చేయిస్తావా అంటూ రెస్టారెంట్లో నానా రాద్ధాంతం సృష్టించారు. నిర్వాహకులు సర్దిచెబుతున్నా లెక్క చేయకుండా రెస్టారెంట్ ఎలా నిర్వహిస్తావో చూస్తామంటూ బెదిరించి కురీ్చలు తన్నేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. వారు అదే రోజు సాయంత్రం సుమారు 20 మంది అనుచరులతో గుంపుగా మరోసారి వచ్చి రెస్టారెంట్లో ఫుడ్ ఆర్డర్ ఇచ్చి నిర్వాహకులతో గొడవకు దిగారు.మంత్రి తాలూకా అంటూ బిల్లు ఇచ్చేది లేదని మీకు దిక్కున్న చోట చెప్పుకోమంటూ కురీ్చలు తన్నేసి నానా గొడవ సృష్టించి సిబ్బందిని బయటకు తీసుకొచ్చి చితకబాదారు. రెస్టారెంట్ నిర్వాహకులు కూడా తెలుగుదేశంపార్టీ సానుభూతిపరులే కావడంతో.. విషయాన్ని సిబ్బంది విదేశాల్లో ఉన్న హోటల్ నిర్వాహకునికి తెలియజేశారు. దీంతో ఆయన తన ఆతీ్మయుడైన సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణకు ఫోన్‌చేసి మంత్రి పేరు చెప్పి గలాటా సృష్టిస్తున్నారని వారిని కట్టడి చేసి కేసు నమోదు చేయాలని విజ్ఞప్తి చేశారని తెలిసింది. రెస్టారెంట్లో కురీ్చలు గిరాటేసి దాడులకు పాల్పడ్డ గలాటా తాలూకా వీడియోలు విశాఖ, అనకాపల్లి జిల్లాల్లోని సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి.మంత్రి పేరు చెప్పి నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారని బాలకృష్ణ దృష్టికి తీసుకువెళ్లడంతో ఆయన సీరియస్‌గా తీసుకుని బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సీఎంవో ద్వారా పోలీసు ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. ఇంతలో గలాటా సృష్టించిన తెలుగు తమ్ముళ్లు అక్కడి నుంచి జారుకున్నారు. ఈ వివాదంపై రెస్టారెంట్ నిర్వాహకులు అన్నవరం పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారని తెలిసింది.విషయం తెలుసుకున్న తెలుగు తమ్ముళ్లు మంత్రి ద్వారా రాజీ కోసం ప్రయతి్నస్తూ కేసు లేకుండా పోలీసులపై ఒత్తిడి తెస్తున్నారని సమాచారం. దీంతో పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. ఇదే విషయమై అన్నవరం సబ్ ఇనస్పెక్టర్ కిశోర్‌బాబును సంప్రదించగా రెస్టారెంట్లో స్వల్ప వివాదం జరిగినట్టు స్థానికుల ద్వారా తెలిసిందన్నారు. అయితే గొడవ విషయంపై తమకు నిర్వాహకుల నుంచి ఎటువంటి ఫిర్యాదు అందలేదన్నారు. -
శ్రీ సత్యనారాయణ స్వామి కల్యాణోత్సవం ప్రారంభం
-
సత్యదేవునికి కేంద్ర ప్రసాద్‌ం లేనట్టేనా?
అన్నవరం: అంతన్నాడు.. ఇంతన్నాడు గంగరాజు...అనే సినిమా పాటలా తయారైంది అన్నవరం దేవస్థానానికి ‘ప్రసాద్ ’ స్కీం నిధులు ఇవ్వడంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి. పదేళ్లుగా దేవస్థానం అధికారులను ఊరిస్తూ రూ.96 కోట్లు ఇస్తామని చివరకు రూ. పది కోట్లు ఇస్తాం అనే పరిస్థితికి తీసుకువచ్చారు. త్వరలో లోక్‌సభ ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చే పరిస్థితుల్లో ఆ నిధులు కూడా ఇచ్చే పరిస్థితి లేదని సమాచారం. నిధులిస్తే ఈ పాటికే విడుదల చేసేవారని రాష్ట్ర టూరిజం శాఖ అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఎనిమిదేళ్ల క్రితమే అన్నవరం దేవస్థానం ఎంపిక కేంద్ర ప్రభుత్వం దేశంలో ప్రముఖ పుణ్యక్షేత్రాల్ని అభివృద్ధి చేయడానికి ఉద్దేశించిన పిలిగ్రిమేజ్ రీజువినేషన్ అండ్ స్ప్రిట్యువల్ అగ్మంటేషన్ డ్రైవ్ (ప్రసాద్) స్కీం కింద దాదాపు ఎనిమిదేళ్ల క్రితమే ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరంలోని శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానాన్ని ఎంపిక చేసింది. కొండమీద, కొండదిగువన భక్తులకు సౌకర్యాలు కల్పించేందుకు వివిధ నిర్మాణాల ప్రతిపాదనలు పంపమని కోరింది. దేవస్థానం అధికారులు రూ.96 కోట్లకు ప్రతిపాదనలు పంపించారు. 2020లో ప్రతిపాదనలను రూ.54 కోట్లకు కుదించి మళ్లీ ప్రతిపాదనలు పంపించాలని ఆదేశించగా దేవస్థానం అధికారులు ఆ విధంగా పంపించారు. రెండు నెలల క్రితం రూ.పది కోట్లు మాత్రమే ఇస్తాం...దానికి తగ్గట్టుగా ప్రతిపాదనలు పంపించమన్నారు. నిరాశకు లోనైన దేవస్థానం రూ.పది కోట్లతో అన్నదాన భవనం నిర్మాణానికి ప్రతిపాదనలు పంపించింది. అలా పంపించిన ప్రతిపాదనలపై ఇంతవరకు ఎటువంటి సమాచారం అటు రాష్ట టూరిజం శాఖ అధికారులకు కాని, అన్నవరం దేవస్థానానికి కాని రాలేదు. ఎదురు తెన్నులు డీపీఆర్ ప్రకారం వెంటనే నిధులివ్వాలని 2021 లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని కాకినాడ ఎంపీ వంగా గీత, ఎంఎల్ఎ పర్వత శ్రీపూర్ణచంద్రప్రసాద్, అన్నవరం దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ తదితరులు కలిసి విజ్ఞప్తి చేశారు. అయినా ఫలితం లేదు. కేంద్రం నుంచి ప్రసాద్ స్కీం నిధులు అన్నవరం దేవస్థానానికి విడుదల అయ్యే అవకాశం దాదాపుగా లేదనే చెప్పాలని రాష్ట్ర టూరిజం శాఖ ఉన్నతాధికారులు అభిప్రాయపడుతున్నారు. ఈ నెలలోనే జీఓ విడుదల అవ్వాలి. నిధులు విడుదల అవ్వాలి. టెండర్లు పిలవాలి, టెండర్లు ఖరారు కావాలి. ఇదంతా ఈ నెల రోజుల్లో జరగడం సాధ్యం కాదని వారు అభిప్రాయపడుతున్నారు. -
వస్తున్నాయ్.. సత్యదేవుని కొత్త రథాలు
అన్నవరం: రత్నగిరి వాసుడైన సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతిదేవి కోసం కొత్త రథాలు సిద్ధమవుతున్నాయి. రూ.1.42 కోట్ల వ్యయంతో నాణ్యమైన బస్తరు టేకుతో ఈ రెండు రథాలను అన్నవరం దేవస్థానం తయారు చేయిస్తోంది. వీటిలో రూ.34 లక్షలతో నిర్మించిన చిన్నరథం స్వామి, అమ్మవార్ల ఊరేగింపునకు సిద్ధమైంది. దీనికి వెండి రేకు తాపడం చేసేందుకు దాతల కోసం దేవస్థానం అన్వేషిస్తోంది. మరోవైపు రూ.1.08 కోట్లతో నిర్మిస్తున్న పెద్ద రథం పనులు చురుగ్గా జరుగుతున్నాయి. మరో మూడు నెలల్లో ఈ రథం కూడా సిద్ధమవుతుందని చెబుతున్నారు. చురుగ్గా పెద్ద రథం పనులు ♦ రూ.1.08 కోట్లతో పెద్ద రథం నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. ♦ దీని ఎత్తు 33.9 అడుగులు, వెడల్పు 14 అడుగులు, పొడవు 23.5 అడుగులు. ♦ ఈ రథంపై వివిధ లతలు, దేవతామూర్తుల చిత్రాలు, వివిధ డిజైన్లు చెక్కుతున్నారు. ♦ పెద్ద రథం పీఠం నిర్మాణ పనుల్లో శిల్పులు నిమగ్నమయ్యారు. పెద్ద రథానికి సంబంధించి స్తంభాలు సైతం చెక్కుతున్నారు. ♦ సత్యదేవునికి ఇప్పటికే రెండు రథాలున్నాయి. వీటిలో ఒకటి వెండి రథం కాగా.. మరొకటి వైశాఖ మాసంలో జరిగే వార్షిక కల్యాణ మహోత్సవాల్లో మూడో రోజు స్వామి, అమ్మవార్లను ఊరేగించే రావణ బ్రహ్మ వాహనం. వెండి రథం శిథిలావస్థకు చేరింది. ♦ కొత్త రథం తయారు చేయించాలన్న ప్రతిపాదన పదేళ్లుగా ఉన్నా వివిధ కారణాలతో అధికారులు సాహసించలేదు. ♦ వెండి, బంగారం పనులు చేయించేటప్పుడు పలు సమస్యలు ఉత్పన్నమవుతాయని వెనుకంజ వేశారు.అయితే.. గత ఈవో చంద్రశేఖర్ ఆజాద్ నూతన రథం తయారీకి ఉపక్రమించారు. ♦ వెండి రథంతోపాటు స్వామి, అమ్మవార్లను కొండ దిగువన ఊరేగించేందుకు పెద్ద రథం కూడా తయారు చేయాలని నిర్ణయించారు. ♦ పాలకవర్గం ఆమోదంతో వీటి తయారీకు గత ఈవో ఎస్ఎస్ చంద్రశేఖర్ ఆజాద్ ఆగస్ట్ నెలలో టెండర్లు పిలిచారు. ♦ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మురమళ్లకు చెందిన శ్రీమాణిక్యాంబ శిల్పకళ వుడ్ వర్క్స్ అధినేతలు కొల్లాటి కామేశ్వరరావు, కొల్లాటి శ్రీనివాస్ ఈ పనులను దక్కించుకున్నారు. సిద్ధమైన చిన్న రథం ♦ చిన్న రథం నిర్మాణం ఇప్పటికే పూర్తయింది. ఈ రథం ఎత్తు 14 అడుగులు, వెడల్పు 6.3 అడుగులు, పొడవు 7.5 అడుగులు ఉంది. నాలుగు స్తంభాలపై శిఖరం వస్తుంది. నాలుగు చక్రాల మీద అందమైన లతలు చెక్కారు. ♦ రథం మీద దేవతామూర్తుల చిత్రాలతో పాటు పలు ఆకర్షణీయమైన డిజైన్లు చిత్రీకరించనున్నారు. ముందు భాగంలో రెండు గుర్రాలను అమర్చారు. ♦ దీనిని టేకుతో తయారు చేయడానికి రూ.34 లక్షలు అవుతుండగా.. వెండి రేకు తాపడానికి సుమారు 300 కిలోల వెండి అవసరం కానుంది. దాతల సహకారంతో వెండి తాపడం చేయాలని అధికారులు ప్రయత్నిస్తున్నారు. చిన్న రథం నిర్మాణం బాగుంది చిన్న రథం నిర్మాణం పూర్తయింది. చాలా బాగుంది. ఈవో కె.రామచంద్ర మోహన్ దీనిని పరిశీలించిన అనంతరం ట్రయల్ రన్ వేస్తాం. అనంతరం దీనిని స్వామివారి సేవలో ఎప్పుడు ఉపయోగించాలో ఈవో పండితులు, నిర్ణయిస్తారు. – ఉదయ్ కుమార్, డీఈ, అన్నవరం దేవస్థానం -
కన్నుల పండువగా సత్యదేవుని తెప్పోత్సవం
అన్నవరం/అరసవల్లి: కాకినాడ జిల్లా అన్నవరంలోని రత్నగిరిపై వెలసిన శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామివారి తెప్పోత్సవం క్షీరాబ్ది ద్వాదశి పర్వదినం సందర్భంగా శుక్రవారం రాత్రి పంపా నదిలో కన్నుల పండువగా జరిగింది. సర్వాంగ సుందరంగా ముస్తాబు చేసిన హంసవాహనంపై సత్యదేవుడు, అమ్మవార్లు నదిలో విహరించారు. ఈ తెప్సోత్సవానికి భక్తులు వేల సంఖ్యలో హాజరయ్యారు. సాయంత్రం 5–30 గంటలకు సత్యదేవుడు, అమ్మవార్లను, క్షేత్రపాలకులు సీతారాములను రత్నగిరి నుంచి ఊరేగింపుగా పంపా తీరాన గత పూజా మండపం వద్దకు తీసుకొచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం 6–30 గంటలకు స్వామి అమ్మవార్లను హంస వాహనంపై కూర్చోబెట్టి తెప్పోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ కే రామచంద్ర మోహన్, ఏసీ రమే‹Ùబాబు పాల్గొన్నారు. సుమారు 150మంది పోలీసులు బందోబస్తు నిర్వహించారు. వైభవంగా ఆదిత్యుని తెప్పోత్సవం ప్రఖ్యాత అరసవల్లి ఆదిత్య క్షేత్రంలో క్షీరాబ్ధి ద్వాదశి సందర్భంగా శుక్రవారం తెప్పోత్సవం వైభవంగా నిర్వహించారు. ఉషాపద్మినిఛాయా దేవేరులతో స్వామి వారు హంస వాహనంపై పవిత్ర ఇంద్రపుష్కరిణిలో 12 సార్లు జలవిహారం చేశారు. అలాగే రోజంతా ఆదిత్యుడు పూర్తి స్వర్ణాలంకరణలో దర్శనమిచ్చారు. ఈ అద్భుత దృశ్యాలను తిలకించేందుకు సుదూర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఆలయ ఈవో వి.హరిసూర్యప్రకాష్ ఆధ్వర్యంలో ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకరశర్మ సమక్షంలో హంస నావలో శ్రీచక్రార్చన పూజలు నిర్వహించారు. -
రత్నగిరీశునికి ముత్యాల వస్త్రం
అన్నవరం: దేవతామూర్తులకు బంగారు, వజ్ర, వైఢూర్యాలతో ఆభరణాలు తయారుచేసి భక్తితో అలంకరించి తరిస్తుంటాం. అలాగే మంచి ముత్యాలతో నఖశిఖ పర్యంతం ఉండే ఒక ముత్యాల వస్త్రం (ముత్తంగి) అలంకరించడం కూడా పలు దేవాలయాల్లో ఆనవాయితీగా వస్తోంది. శ్రీరంగంలో శ్రీరంగనాథుడు, తిరుమల బ్రహ్మోత్సవాల్లో మలయప్పస్వామి, భద్రాద్రిలో సీతారాములు ముత్తంగి అలంకరణలో దర్శనమిస్తూ ఉంటారు. అన్నవరం పుణ్యక్షేత్రంలో శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామి వారు, దేవేరి అనంతలక్ష్మీ సత్యవతీదేవి, ఈశ్వరుడు కార్తీకమాసం నుంచి ముత్తంగి అలంకరణలో దర్శనమివ్వనున్నారు. దీని తయారీకి అయ్యే ఖర్చు రూ.8 లక్షలు సమకూర్చేందుకు దేవస్థానం వ్రత పురోహిత సంఘం ముందుకు వచ్చింది. ప్రాచీన కళను కాపాడుతూ.. ముత్తంగి తయారీ ప్రాచీనమైన కళ. దీన్ని హైదరాబాద్‌కు చెందిన సుధీర్ చరణ్ కుటుంబం వంశపారంపర్యంగా కాపాడుతూ వస్తోంది. తమిళనాడులోని శ్రీరంగంలో సుమారు 12 అడుగుల పొడవున పవళించి ఉండే శ్రీరంగనాథునికి 17వ శతాబ్దంలో నాయకర్ రాజులు ముత్తంగి తయారు చేయించి అలంకరించారు. వందేళ్ల తరువాత వన్నె తగ్గడంతో దాన్ని తీసి భద్రపరిచారని సుదీర్ చరణ్ ‘సాక్షి’కి చెప్పారు. తరువాత 1932లో చెన్నైకి చెందిన ఆయన ముత్తాత కృష్ణాజీని శ్రీరంగం దేవస్థానం ప్రతినిధులు సంప్రదించి, భద్రపరిచిన ముత్తంగిని మళ్లీ ముత్యాలు, వజ్రాలు, కెంపులతో తయారు చేయించి శ్రీరంగనాథునికి అలంకరించారు. ఎలా తయారు చేస్తారంటే.. ముత్తంగి తయారీ చాలా శ్రమ, నైపుణ్యం, ఏకాగ్రతతో కూడిన కళ. ఇందుకు అవసరమయ్యే ముత్యాల వ్యయం తక్కువే అయినప్పటికీ వాటిని వస్త్రంగా తయారు చేయడానికి నెలల తరబడి కష్టపడాల్సి ఉంటుంది. శిరస్సు దగ్గర నుంచి పాదాల వేళ్ల వరకూ దేవతామూర్తుల కొలతలు తీసుకుని, ముందుగా వెండి లేదా రాగి రేకుతో వస్త్రంలా తయారు చేసి, దానికి వివిధ సైజుల్లో ముత్యాలు అతికిస్తారు. వీటి మధ్యలో ఎటువంటి ఖాళీ ఉండదు. కేవలం స్వామి, అమ్మవార్ల ముఖాలు మాత్రమే కనిపిస్తాయి. మిగిలిన భాగమంతా మంచిముత్యాలే కనిపిస్తాయి. సత్యదేవునికీ ముత్తంగి సేవ సత్యదేవుడు, అమ్మవారు, శంకరులకు ప్రతి సోమవారం ముత్తంగి అలంకరించి, ప్రత్యేక పూజలు చేయించాలని నిర్ణయించాం. దీనికి దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్ కూడా అంగీకరించారు. దాతల ద్వారా ముత్తంగి చేయించాలనుకున్నాం. అదే సమయంలో వ్రతపురోహిత సంఘం ముందుకు వచ్చింది. – ఎస్ఎస్ చంద్రశేఖర్ ఆజాద్, ఈవో, అన్నవరం దేవస్థానం -
భక్త మహాశయులకు...
అన్నవరం: ఆధ్యాత్మిక చింతనతో.. మది నిండా భక్తిభావంతో.. ఆ స్వామివారిని స్మరిస్తూ రత్నగిరికి కాలినడక వచ్చే భక్త మహాశయులకు సౌకర్యాలు ఒనగూరుతున్నాయి.. మెట్ల మార్గం నుంచి అలసి సొలసి వచ్చేవారి కోసం విశ్రాంతి భవనం (డార్మెట్రీ) సకల హంగులతో రూపుదిద్దుకుంటోంది.. రత్నగిరిపై వనదుర్గ ఆలయం ఎదురుగా రూ.రెండు కోట్లతో దాత పెన్నాడ వెంకట రాజామణి సారథ్యంలో భక్తుల విశ్రాంతి భవన నిర్మాణం జరుగుతోంది. ఇది ఆగస్టు నెలాఖరు నాటికి పూర్తి కానుంది. గత ఏడాది ఆగస్టులో పనులు ప్రారంభం కాగా, ఇప్పటికే 90 శాతం పూర్తయ్యాయి. వచ్చే ఆగస్టు నెలాఖరుకు మిగిలిన పనులు పూర్తి చేసి డార్మెట్రీని దేవస్థానానికి అప్పగించాలని దాత నిర్ణయించారు. డార్మెట్రీని దేవస్థానానికి అప్పగించిన వెంటనే ప్రారంభించేందుకు తగిన చర్యలు తీసుకుంటామని ఈఓ చంద్రశేఖర్ అజాద్ వివరించారు. అలా పునాది పడి.. రత్నగిరి సత్యదేవుని దర్శనానికి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు తరలి వస్తుంటారు. ఇందులో చాలామంది మెట్ల దారి నుంచి వచ్చి మొక్కులు తీర్చుకుంటుంటారు. అలాంటి వారికోసం డార్మెట్రీ నిర్మించాలని దేవస్థానం అధికారులు నిర్ణయించారు. బాత్రూమ్లలో స్నానం చేసి, తమ వస్తువులను అక్కడే లాకర్లలో భద్రపర్చుకునేందుకు శ్రీవనదుర్గ అమ్మవారి ఆలయం వద్ద ఈ భవనం చేపట్టాలని భావించారు. ఈ సమయంలోనే రాజమహేంద్రవరానికి చెందిన దాత పెన్నాడ వెంకట రాజామణి డార్మెట్రీ నిర్మించడానికి ముందుకు వచ్చారు. అప్పటి ఈఓ వి.త్రినాథరావు శ్రీవనదుర్గ ఆలయం వద్ద ఉన్న పాత భవనాన్ని కూల్చి వేసి ఆ స్ధలాన్ని దాతకు అప్పగించారు. ఈ నిర్మాణానికి గత ఏడాది ఆగస్టు 13న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, దేవదాయ ధర్మదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, ఎంపీ వంగా గీత, ఎమ్మెల్యే పర్వత శ్రీపూర్ణచంద్రప్రసాద్ భూమిపూజ చేశారు. వెయ్యి మంది సేదతీరేలా.. మొత్తం 3,900 చదరపు అడుగుల విస్తీర్ణంలో మూడంతస్తులలో ఈ భవనం నిర్మిస్తున్నారు. ఏకకాలంలో సుమారు వెయ్యి మంది సేదతీరే విధంగా సౌకర్యాలు కల్పిస్తున్నారు. మూడు అంతస్తులలోనూ టాయిలెట్లు, స్నానపు గదులు ఏర్పాటు చేస్తున్నారు. దీనివల్ల భక్తులు కొండపై వసతి గదుల కోసం ప్రయత్నించకుండా ఇక్కడే స్నానం చేసి స్వామివారిని దర్శనానికి రావొచ్చని అధికారులు తెలిపారు. ఈ పనులు ప్రారంభించిన మూడు నెలలకే పునాదుల దశ పూర్తి చేయగా, ఏప్రిల్ నెలలోనే మూడు శ్లాబ్‌ల నిర్మాణం పూర్తి చేశారు. ప్రస్తుతం నిర్మాణం పూర్తయి వెలుపల ప్లాస్టింగ్, టైల్స్ అతికించడం పనులు చేస్తున్నారు. టాయిలెట్ల నిర్మాణం, విద్యుత్తు సరఫరా పనులు కూడా దాదాపుగా పూర్తయ్యాయని నిర్మాణ కాంట్రాక్టర్ అబ్బులు తెలిపారు. -
అన్నవరం: కన్నుల పండువగా సత్యదేవుని కల్యాణం (ఫొటోలు)
-
అన్నవరం: కన్నుల పండువగా సత్యదేవుని కల్యాణం (ఫొటోలు)
అన్నవరం: కన్నుల పండువగా సత్యదేవుని కల్యాణం (ఫొటోలు) -
మధురాతి మధురం..
అన్నవరం: అమృతానికి సరిసాటి అన్నవరం శ్రీ వీర వేంకట సత్యనారాయణస్వామి వారి ప్రసాదమే అంటే అతిశయోక్తి కానే కాదు. స్వామివారి గోధుమ నూక ప్రసాదం పేరు వింటే చాలు.. నోట్లో నీరూరక మానదు. ప్రసాదంతో పాటు అది కట్టిన ఆకు కూడా నాకేయాలనిపించేంత రుచిగా ఉంటుంది. అయితే, ఇటీవల సత్యదేవుని ప్రసాదం నాణ్యతపై తరచుగా విమర్శలు వస్తున్నాయి. ప్రసాదం అంత రుచిగా ఉండటం లేదని, ఒక్క రోజు కూడా నిల్వ ఉండటం లేదని పలువురు భక్తులు విమర్శిస్తున్నారు. దీనిపై గతంలో డయల్ యువర్ ఈఓ కార్యక్రమంలో కూడా ఫిర్యాదులు వచ్చాయి. దీనికి తోడు వీఐపీల కోసం ఎక్కువ సేపు ఉడికించి తయారు చేసే స్పెషల్ ప్రసాదాన్నే సాధారణ భక్తులకు కూడా ఇవ్వాలనే డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలో మరింత రుచిగా, నిల్వ ఉండేలా గోధుమ నూక ప్రసాదం తయారు చేసేందుకు దేవస్థానం అధికారులు చర్యలు చేపట్టారు. దేవస్థానం ఈఓ చంద్రశేఖర్ అజాద్ రెండు రోజుల పాటు ప్రసాద తయారీ విభాగంలో ఒక కళాయిలో భక్తులకు విక్రయించే ప్రసాదం, ఇంకో కళాయిలో వీఐపీ ప్రసాదం వండించి రెండింటి మధ్య తేడాను గమనించారు. నీరంతా ఆవిరయ్యే వరకూ బాగా ఉడికించడం వలన స్పెషల్ ప్రసాదం రంగు, రుచి బాగుంటున్నాయని నిర్ధారణకు వచ్చారు. ఈ నేపథ్యంలో సాధారణ భక్తులకు విక్రయించే ప్రసాదం కూడా అదే విధంగా తయారు చేయాలని నిర్ణయించారు. మరింతగా యాలకుల పొడి ప్రసాదం తయారీకి ఒక్కో కళాయిలో వంద డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద మరిగించిన 40 లీటర్ల నీరు, 15 కేజీల గోధుమ నూక, రెండు విడతలుగా 30 కిలోల పంచదార వేస్తారు. గోధుమ నూక ఉడికాక ఆరు కేజీల నెయ్యి, 150 గ్రాముల యాలకుల పొడి కలుపుతారు. ప్రసాదం తయారయ్యాక దానిని తొట్టెలో వేసి, దానిపై కూడా యాలకుల పొడి చల్లి, కాస్త చల్లారాక ప్యాకెట్లు కడతారు. ప్యాకింగ్ చేసేటప్పుడు మరో రెండు కిలోల నెయ్యి కలుపుతారు. గంటన్నర వ్యవధిలో ఒక్కో కళాయికి 80 కేజీల ప్రసాదం తయారవుతుంది. కళాయి ప్రసాదం తయారీకి సుమారు 4.730 కిలోల గ్యాస్ వినియోగమవుతోంది. ఒక్కో కళాయి ప్రసాదం తయారీకి వినియోగిస్తున్న యాలకుల పొడిని ఇకపై 200 గ్రాములకు పెంచాలని, ప్రసాదాన్ని గంటన్నరకు బదులు రెండు గంటల పాటు ఉడికిస్తే రుచి పెరుగుతుందని ధర్మకర్తల మండలి సమావేశంలో ఈఓ అజాద్ ప్రతిపాదించారు. మరో అరగంట ఎక్కువగా ప్రసాదాన్ని ఉడికించడం వలన కళాయి ప్రసాదం తయారీకి 6 కిలోల (అదనంగా 1.270 కిలోలు) వరకూ గ్యాన్ వినియోగమవుతుంది. ఈ ప్రతిపాదనలకు ధర్మకర్తల మండలి ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. కళాయి ప్రసాదానికి 150 గ్రాముల ప్రసాదం ప్యాకెట్లు 533 వస్తాయి. తాజా మార్పుల వలన ఒక్కో కళాయి ప్రసాదం తయారీకి సుమారు రూ.180 అదనంగా ఖర్చవుతుందని అంచనా వేశారు. అంటే ప్రతి ప్యాకెట్‌కు అదనంగా 35 పైసలు ఖర్చు కానుంది. దేవస్థానంలో ఏటా 1.80 కోట్ల ప్రసాదం ప్యాకెట్లు తయారవుతాయి. కొత్తగా చేపట్టే మార్పుల వలన ఏటా అదనంగా సుమారు రూ.60 లక్షలు ఖర్చయ్యే అవకాశం ఉందని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఆ మేరకు దేవదాయ శాఖ కమిషనర్ అనుమతి తీసుకోవాలని నిర్ణయించారు. ఏటా రూ.40 కోట్ల ఆదాయం సత్యదేవుని ప్రసాదం విక్రయాల ద్వారా అన్నవరం దేవస్థానానికి ఏటా రూ.40 కోట్ల ఆదాయం వస్తోంది. రత్నగిరిపై 2 కౌంటర్లలో ఉదయం నుంచి రాత్రి వరకు, కొండ దిగువన తొలి పావంచా, నమూనా ఆలయం వద్ద 24 గంటలూ స్వామివారి ప్రసాదాలు విక్రయిస్తున్నారు. ఈ కౌంటర్ల ద్వారా 150 గ్రాముల బరువైన ప్రసాదం ప్యాకెట్లను ఏటా దాదాపు 1.80 కోట్లు విక్రయిస్తున్నారు. విశాఖపట్నం నుంచి రాజమహేంద్రవరం వైపు ఉన్న జాతీయ రహదారి పక్కన కూడా మరో ప్రసాదం కౌంటర్, నమూనా ఆలయం నిర్మాణానికి ఏర్పాట్లు చేస్తున్నారు. దీని ద్వారా కూడా ప్రసాదం విక్రయాలు మరింత పెరిగే అవకాశం ఉంది. భక్తుల కోసమే.. సత్యదేవుని ప్రసాదం మరింత రుచిగా తయారు చేసి భక్తులకు అందించాలనేదే మా ప్రయత్నం. ఇందులో భాగంగా ప్రయోగాత్మకంగా యాలకుల పొడి పరిమాణం పెంచి, ఎక్కువసేపు పొయ్యి మీద ఉడికిస్తే బాగా రుచిగా తయారైంది. అదేవిధంగా ప్రసాదం తయారు చేసి భక్తులకు అందించాలని నిర్ణయించాం. దీనికి కమిషనర్ అనుమతి తీసుకోవాల్సి ఉంది. – చంద్రశేఖర్ అజాద్, కార్యనిర్వహణాధికారి, అన్నవరం దేవస్థానం -
3 ప్రముఖ ఆలయాలకు ట్రస్టు బోర్డుల నియామకం
సాక్షి, అమరావతి/ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ): రాష్ట్రంలో దేవదాయ శాఖ పరిధిలోని మూడు ప్రముఖ ఆలయాలకు ప్రభుత్వం మంగళవారం ట్రస్టు బోర్డులను నియమించింది. కాకినాడ జిల్లా అన్నవరం శ్రీవీరవెంకటసత్యనారాయణ స్వామి వారి దేవస్థానానికి ఆ ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త ఐ.వి.రోహిత్‌ను ట్రస్టు బోర్డు చైర్మన్‌గా, మరో 13 మంది ట్రస్టు బోర్డు సభ్యులుగా నియమిస్తూ దేవదాయశాఖ ముఖ్య కార్యదర్శి హరిజవహర్‌లాల్ ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామి దేవస్థానానికి ఆ ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త ఎస్వీ సుధాకరరావును ట్రస్టు బోర్డు చైర్మన్‌గా, మరో 14 మంది ట్రస్టు బోర్డు సభ్యులుగా నియమించారు. అదే విధంగా విజయవాడ శ్రీదుర్గమల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానానికి 15 మంది ట్రస్టు బోర్డు సభ్యులను నియమించారు. ఈ మూడింటికి వేర్వేరుగా ఉత్తర్వులు జారీ చేశారు. విజయవాడ దుర్గగుడి ట్రస్టు బోర్డు చైర్మన్‌ను సభ్యులు ప్రమాణ స్వీకారం అనంతరం సమావేశమై ఎన్నుకుంటారు. అదనంగా ఆయా ఆలయాలలో ప్రధాన అర్చకులుగా పనిచేస్తున్న వారు ఆయా ట్రస్టు బోర్డులో ఎక్స్ అఫిషియో సభ్యులుగా కొనసాగుతారని ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. ఆయా ఆలయాల ట్రస్టు బోర్డులలోని సభ్యులు పదవీ బాధ్యతలు చేపట్టిన రోజు నుంచి రెండేళ్ల పాటు ఆ పదవుల్లో కొనసాగుతారని తెలిపింది. దుర్గమ్మ ఆలయ చైర్మన్‌గా కర్నాటి రాంబాబు ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని శ్రీదుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థాన నూతన పాలక మండలి సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం మంగళవారం జరిగింది. చైర్మన్‌గా కర్నాటి రాంబాబు, సభ్యులుగా కేసరి నాగమణి, కట్టా సత్తెయ్య, బుద్దా రాంబాబు, దేవిశెట్టి బాలకృష్ణ, చింతా సింహాచలం, బచ్చు మాధవీకృష్ణ, అనుమోలు ఉదయలక్ష్మి, నిడమనూరి కళ్యాణి, నంబూరి రవి, చింకా శ్రీనివాసరావు, మారం వెంకటేశ్వరరావు, అల్లూరి కృష్ణవేణి, తొత్తడి వేదకుమారి చేత ఈవో భ్రమరాంబ ప్రమాణ స్వీకారం చేయించారు. కొలుకులూరి రామసీత ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంది. -
అన్నవరానికి ఆధ్యాత్మిక శోభ ...
-
కన్నులపండుగగా అన్నవరం సత్యదేవుని కళ్యాణం
-
అధ్యాపకుడి అరుదైన చదివింపు
అన్నవరం: చదువుల్లో రాణించాలని, లక్ష్యాలు సాధించాలని విద్యార్థులకు బోధించే అధ్యాపకులు చాలా కళాశాలల్లో కనిపిస్తారు. కాని కళాశాలల్లో పేద విద్యార్థులకు మధ్యాహ్న భోజన సదుపాయం కూడా కల్పిస్తే వారు మరింత బాగా కష్టపడి చదివి ఉన్నత స్థానాలకు చేరుకుంటారని భావించి అందుకోసం సొంత సొమ్మును ఖర్చు చేసే అధ్యాపకులు చాలా అరుదు. అటువంటి కోవలోకే వస్తారు సత్యదేవ డిగ్రీ కళాశాల విశ్రాంత ప్రిన్సిపాల్ భీమలింగం సూర్యనారాయణమూర్తి. ఆయన తన భార్య పద్మావతితో కలిసి సోమవారం శ్రీ సత్యదేవ నిత్యాన్నదాన పథకానికి సత్యదేవ డిగ్రీ కళాశాల విద్యార్థుల పేరుతో రూ.ఐదు లక్షలు విరాళాన్ని దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ వి.త్రినాథరావుకు అందజేసిన విషయం తెలిసిందే. మధ్యాహ్న భోజనం పునరుద్ధరించాలనే లక్ష్యంతో... విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పునరుద్ధరించాలనే లక్ష్యంతో తన వంతు సాయంగా ఈ విరాళాన్ని అందచేసినట్టు ఆయన ‘సాక్షి’కి తెలిపారు. స్థానిక సత్యదేవ డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపాల్‌గా 2015–17 మధ్య సేవలందించిన సూర్యనారాయణమూర్తి ప్రస్తుతం తమ స్వగ్రామమైన పెద్దాపురం మండలంలోని సిరివాడలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆయన ప్రిన్సిపాల్‌గా వ్యవహరించిన సమయంలో దూరప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులు మధ్యాహ్న భోజనం లేక ఇబ్బంది పడుతున్న విషయాన్ని అప్పటి దేవస్థానం చైర్మన్ రాజా ఐవీ రామ్‌కుమార్, ఈఓ కాకర్ల నాగేశ్వరరావు దృష్టికి తీసుకువెళ్లారు. ఫలితంగా 2016లో అక్టోబర్ నుంచి 2017 ఏప్రిల్ వరకు డిగ్రీ కళాశాల విద్యార్థులకు అన్నదానం పథకం నుంచి మధ్యాహ్న భోజనం పంపించారు. అన్నదానం పథకానికి దాతలు ఇచ్చిన విరాళాలు భక్తులకు భోజనానికి ఉపయోగించాలి తప్ప విద్యార్థుల భోజనానికి కాదని ఆడిట్ అధికారులు అభ్యంతరం చెప్పడంతో దేవస్థానం ఆ భోజనాన్ని పంపించడం నిలిపివేసింది. 2018లో సూర్యనారాయణమూర్తి పదవీ విరమణ చేశారు. అయితే విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పునరుద్ధరించేందుకు ఆయన చాలా ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. దీంతో తన వంతు విరాళంగా ఆయన రూ.ఐదు లక్షలు అందజేశారు. మధ్యాహ్న భోజన సౌకర్యం పునరుద్ధరించాలని కోరాను కళాశాలలో చదివే విద్యార్థులు 600 మందిలో 400 మంది పేద, మధ్యతరగతి వారు. వీరికి భోజన సౌకర్యం పునరుద్ధరించాలని ఆలయ పెద్దలను కోరాను. నేను ఇచ్చిన విరాళంపై వడ్డీతో రోజుకు కనీసం పది మంది విద్యార్థులకు అన్నదాన పథకంలో (కళాశాల పనిదినాలు 180 రోజుల్లో) భోజనం పెట్టమని కోరాను. – సూర్యనారాయణమూర్తి, విశ్రాంత ప్రిన్సిపాల్ కమిషనర్‌తో చర్చిస్తాం డిగ్రీ కళాశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ఏర్పాటుపై గతంలో ఆడిట్ అభ్యంతరాలు రావడంతో నిలిపివేయాల్సి వచ్చింది. మళ్లీ భోజనం పెట్టాలంటే దేవదాయశాఖ కమిషనర్ ఆదేశాలివ్వాలి. ఆ దిశగా ప్రయత్నం చేస్తాం. – చైర్మన్ రోహిత్, ఈఓ త్రినాథరావు -
రూ.1.50 కోట్లతో సత్యదేవునికి వజ్రకిరీటం
అన్నవరం(తూర్పుగోదావరి): అన్నవరంలోని శ్రీ సత్యదేవుడు త్వరలో వజ్రకిరీటంతో భక్తులకు దర్శనమివ్వనున్నాడు. పెద్దాపురంలోని శ్రీలలితా రైస్ ఇండస్ట్రీ డైరెక్టర్లలో ఒకరైన మట్టే సత్యప్రసాద్ రూ.1.5 కోట్లతో వజ్రకిరీటం చేయించి అందజేసేందుకు ముందుకువచ్చారు. దేవస్థానం చైర్మన్ రోహిత్, ఈవో త్రినాథరావు శనివారం ఈ విషయాన్ని తెలిపారు. చదవండి: పథకమా.. పన్నాగమా.. అచ్చెన్నాయుడు మాస్టర్ ప్లాన్? సత్యప్రసాద్ దంపతులు ఇప్పటికే రూ.5.5 కోట్లతో స్వామివారి ప్రసాద భవనాన్ని, రూ.35 లక్షలతో సహస్రదీపాలంకార సేవకు మండపాన్ని నిర్మించారు. స్వామివారి పంచహారతుల సేవకు వెండి దీపాలను అందజేశారు. స్వామివారి నిత్య కల్యాణమండపాన్ని ఏసీ చేయించడంతో బాటు స్వామివారికి నిత్యం నివేదనకు బియ్యాన్ని అందజేస్తున్నారని ఈవో తెలిపారు. వజ్రకిరీటం చేయించే అవకాశం కలగడం తమకు దక్కిన అదృష్టంగా భావిస్తున్నామని సత్యప్రసాద్ తెలిపారు. -
అన్నవరం: ఇక పేదలకు కల్యాణ వైభోగమే..
సాక్షి, అన్నవరం: సత్యదేవుని సన్నిధిన పేదలు ఉచితంగా పెళ్లి చేసుకునేందుకు ‘శ్రీ సత్య శ్రీనివాస ఉచిత కల్యాణ మండపం’ వేదిక కానుంది. దేవస్థానం అధికారులు ఇందుకు అనుమతిచ్చారు. ఆధునిక వసతులతో ఒకేసారి 12 వివాహాలకు వీలుగా ఇక్కడ వేదికలు నిర్మించిన సంగతి తెలిసిందే. శ్రావణ మాసంలో జరిగే పెళ్లిళ్లకు అప్పుడే రిజర్వేషన్లు మొదలయ్యాయి. అన్నవరంలో పెళ్లి అదో ‘వరం’ రత్నగిరిపై పెళ్లి చేసుకున్న వారి బతుకులు బాగుంటాయన్నది భక్తుల విశ్వాసం. ఈ కారణంతోనే ఉభయ గోదావరి జిల్లాల వారే కాదు ఇతర ప్రాంతాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడ వివాహాలకు ఆసక్తి చూపిస్తుంటారు. ఆర్థిక స్తోమతను బట్టి ఇక్కడ కల్యాణ మండపాలను అద్దెకు తీసుకుంటారు. ఏటా ఐదు వేలు పైగా పెళ్లిళ్లు జరుగుతాయి. తక్కువ ఖర్చుతో వివాహం చేసుకోవాలనుకునేవారు ఇప్పటి వరకూ ఆరుబయట చేసుకునేవారు. వర్షం వస్తే వీరు చాలా ఇబ్బంది పడేవారు. పెళ్లి మధ్యలో వర్షం వస్తే షెల్టర్ కిందకు పరుగులు పెట్టిన సందర్భాలెన్నో. శ్రీసత్య శ్రీనివాస ఉచిత కల్యాణ మంటపం 3.5 కోట్లతో కల్యాణ మండపం కొండపై పెళ్లిళ్లకు పేదలు పడుతున్న ఇబ్బందులకు స్పందించి శ్రీ లలితా రైస్ ఇండస్ట్రీస్ అధినేతల్లో ఒకరైన మట్టే శ్రీనివాస్, విద్యుల్లత దంపతులు పెద్ద మనసు చాటుకున్నారు. రూ.3.5 కోట్లతో శ్రీసత్య శ్రీనివాస ఉచిత కల్యాణ మంటపం (ఏసీ) నిర్మించారు. ఈ నెల 16న టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి దంపతులు దీనిని ప్రారంభించారు. మంటపం కేటాయింపులో పేదలకే అగ్రాసనమని ఆలయ ఈఓ త్రినాథరావు తెలిపారు. కల్యాణ మంటపంలో వివాహ వేదికలు సదుపాయాలివీ.. ► వివాహానికి 50 కుర్చీలు, జంబుఖానా, పెళ్లిపీటలు, కాడి, ఇతర వివాహ సామగ్రి. వధూవరులకు రెండు గదులు, బాత్రూం సౌకర్యం. ► వివాహ వేదికలు కావాలంటే వధూవరుల ఆధార్ కార్డులు, శుభలేఖ లేదా పురోహితుని లగ్నపత్రిక, అవసరం. ► నెల రోజులు ముందుగా రిజర్వ్ చేసుకోవాలి. ఆగస్టులో పెళ్లికి బుక్ చేసుకున్నాం ఉచిత కల్యాణ మంటపం చాలా బాగుంది. వేదికలు ఇంకా బాగున్నాయి. ఆగస్టు 25న రాత్రి 2.37 గంటలకు జరిగే పెళ్లికి కల్యాణ వేదికను బుక్ చేసుకున్నాం. దాతకు, దేవస్థానం అధికారులకు కృతజ్ఞతలు. – ఎన్.శ్రీనివాస్, అరసవిల్లి, శ్రీకాకుళం జిల్లా -
పాలుపోస్తే.. ఓటర్లు పదవి ఇచ్చారు
అన్నవరం: ఉపసర్పంచ్ వెంకన్నగారు.. పాలు పలుచగా ఉన్నాయండీ.. అని ప్రజలు అడుగుతుంటే.. ఉపసర్పంచ్‌కి పాలకి సంబంధం ఏంటని కొత్త వారు ఆశ్చర్యపోతుంటారు. పాల వ్యాపారం చేసే వెంకన్న ఉపసర్పంచ్‌గా ఎన్నికైనా యథావిధిగా సైకిల్ మీద ఖాతాదారులకు పాలు విక్రయిస్తున్నారు. ఇది తూర్పుగోదావరి జిల్లా అన్నవరం పంచాయతీ ఉప సర్పంచ్ సంగతి. స్థానిక వెలంపేటలో ఉండే బొబ్బిలి వెంకన్నబాబు 35 సంవత్సరాలుగా పాల వ్యాపారం చేస్తున్నారు. పాల వెంకన్నగా పేరు పొందారు. మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి, ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అంటే ఎంతో అభిమానం. 2013లో తొమ్మిదో వార్డు పదవికి పోటీచేసి రెండు ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఈనెల తొమ్మిదో తేదీన జరిగిన పంచాయతీ ఎన్నికల్లో అదే తొమ్మిదో వార్డు నుంచి వైఎస్సార్సీపీ అభిమానిగా పోటీచేసి 182 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. పంచాయతీ వార్డు సభ్యుల్లో ఇదే అత్యధిక మెజార్టీ. అన్నవరం పంచాయతీ సర్పంచ్ పదవితోపాటు 16 వార్డులకుగాను 15 వార్డుల్లో వైఎస్సార్సీపీ అభిమానులే విజయం సాధించారు. దీంతో ఉపసర్పంచ్ పదవికి తీవ్రపోటీ ఏర్పడింది. దీర్ఘకాలంగా పార్టీ విధేయుడిగా ఉండడం, బీసీ వర్గానికి చెంది అత్యధిక మెజార్టీతో విజయం సాధించడం, అన్నింటికి మించి వివాద రహితుడనే పేరుండడంతో బొబ్బిలి వెంకన్నబాబును ఉపసర్పంచ్ పదవికి ప్రత్తిపాడు శాసనసభ్యుడు పర్వత పూర్ణచంద్రప్రసాద్ ప్రతిపాదించారు. సర్పంచ్ శెట్టిబత్తుల కుమార్‌రాజా దీన్ని బలపర్చగా సభ్యులు ఏకగ్రీవంగా మద్దతు తెలిపారు. దీంతో వెంకన్న ఉపసర్పంచ్ అయ్యారు. ఆ మరుసటి రోజు నుంచే ఆయన తన మోటారు సైకిల్ మీద ఖాతాదారులకు పాలు విక్రయిస్తున్నారు. ఉదయం ఆరుగంటల నుంచి పదిగంటల వరకు, సాయంత్రం ఆరుగంటల నుంచి రాత్రి పదిగంటల వరకు పాల వ్యాపారం చేస్తానని, ఉదయం పదిగంటల నుంచి సాయంత్రం ఆరుగంటల వరకు ఉపసర్పంచ్‌గా గ్రామానికి సేవచేస్తానని వెంకన్నబాబు తెలిపారు. -
ఒంటరైన మూడేళ్ల చిన్నారి
భార్య, భర్త, మూడేళ్ల బాబు.. అందమైన కుటుంబం.. జీవితం ఎంతో సరదాగా సాగిపోతోంది. భర్త ఓ కంపెనీలో అసిస్టెంట్ ఎలక్ట్రికల్ ఇంజినీర్, భార్య గృహిణి. మూడు రోజుల క్రితం కుటుంబం అందరూ కలసి నూతన సంవత్సరం వేడుకల కోసం తుని నుంచి రాజమహేంద్రవరం వెళ్లారు. అక్కడ కుటుంబ సభ్యులతో సరదాగా గడిపారు. ఆదివారం మధ్యాహ్నం డ్యూటీ ఉండడంతో తిరిగి తుని బయల్దేరి వస్తుండగా.. విధి ఆ కుటుంబంపై పగబట్టింది. రోడ్డు ప్రమాద రూపంలో వారి జీవితాలను చిదిమేసింది. భార్యభర్తలను మృత్యు ఒడికి చేర్చి.. ఆ మూడేళ్ల చిన్నారిని తల్లి, తండ్రి లేని ఒంటరిని చేసింది. తీవ్రగాయాలతో ఆసుపత్రిలో చేరిన ఆ బాలుడికి ఏం జరిగిందో, అమ్మా, నాన్న ఏమయ్యారో తెలియక బిత్తరచూపులు చూస్తున్నాడు. సాక్షి, అన్నవరం: జాతీయ రహదారిపై ఆదివారం అన్నవరం వద్ద మధ్యాహ్నం డివైడర్‌ను బైక్ ఢీ కొట్టిన ప్రమాదంలో దానిపై ప్రయాణిస్తున్న భర్త మహ్మద్ కరీం(32) అక్కడికక్కడే మృతి చెందగా, భార్య మహ్మద్ అరీష్ కోమల్(26) తుని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందింది. బండి మీద వారిద్దరి మధ్య కూర్చున్న మూడేళ్ల బాలుడు కరీముల్లా ఖాదరీఫ్ తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసుల కథనం ప్రకారం.. రాజమహేంద్రవరానికి చెందిన మహ్మద్ కరీం పదేళ్లుగా విశాఖ జిల్లా రాజవరంలోని డక్కన్ కెమికల్స్‌లో అసిస్టెంట్ ఎలక్ట్రికల్ ఇంజినీర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఆయనకు 2014లో కాకినాడకు చెందిన మహ్మద్ అరిష్ కోమల్‌తో వివాహమైంది. వీరు ఆరేళ్లుగా తునిలో నివాసం ఉంటున్నారు. మూడు రోజుల క్రితం నూతన సంవత్సర వేడుకల కోసం రాజమహేంద్రవరం వెళ్లిన వీరు ఆదివారం హీరోహోండా గ్లామర్ బైక్(ఏపీ05, డీబీ 6213)పై తిరిగి తుని బయల్దేరారు. వారి కుమారుడు ఖాదరీఫ్‌ను మధ్యలో కూర్చోబెట్టుకున్నారు. అన్నవరం జాతీయ రహదారిపై ప్రయాణిస్తుండగా.. స్నేహ రెసిడెన్సీ సమీపంలో డివైడర్‌ను వీరి బైక్ ఢీకొని ఒక్కసారిగా కింద పడిపోయారు. మహ్మద్ కరీం, భార్య అరిష్ కోమల్ రోడ్డు పక్కనే పడిపోగా, కుమారుడు ఖాదరీఫ్ పక్కనే ఉన్న తుప్పల్లో పడ్డాడు. స్థానికులు వీరిని గమనించి వెంటనే 108 అంబులెన్స్‌కు ఫోన్ చేయగా.. 108 సిబ్బంది అక్కడికి చేరుకుని వారిని పరీక్షించగా మహ్మద్ కరీం అప్పటికే చనిపోయాడు. భార్య, తీవ్ర గాయాలతో తుప్పల్లో పడి ఉన్న కుమారుడు ఖాదరీఫ్‌ను గమనించి వెంటనే తుని ఆసుపత్రికి తరలిస్తుండగా భార్య అరిష్ కోమల్ మార్గం మధ్యలో చనిపోయినట్టు పోలీసులు తెలిపారు. బాలుడు ఖాదరీఫ్‌కు తీవ్ర గాయాలవ్వడంతో అతడిని తుని ప్రభుత్వాసుపత్రి వైద్యుల సిఫారసుతో కాకినాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అన్నవరం ఎస్సై అజయ్ బాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: అడ్వాన్స్ ఇవ్వలేదని ప్రయాణికురాలి పీక కోశాడు..) -
మందుగుండు సామాగ్రి తయారీలో అపశ్రుతి
సాక్షి, విశాఖ : దీపావళి పండుగ సందర్భంగా మందుగుండు సామాగ్రి తయారీలో అపశ్రుతి చోటుచేసుకుంది. మందుగుండు తయారు చేస్తూ నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. చోడవరం పట్టణం అన్నవరం కాలనీలోని అంబేద్కర్ వీధికి చెందిన మహేష్(20) నిఖిల్(13) జ్యోసిత(13) దివ్య శనివారం బాణసంచా సామాగ్రి తయారు చేస్తుండగా ప్రమాదం జరిగింది. ముగ్గురికి కాళ్లు, చేతులు కాలడంతో చోడవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు జ్యోసిత తీవ్రంగా గాయపడటంతో ఆమెను అనకాపల్లిలోని ఎన్టీఆర్ ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
అన్నవరంలో దర్శనాలు నిలిపివేత
అన్నవరం: తూర్పుగోదావరి జిల్లా అన్నవరంలోని శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో దర్శనాలను ఆగస్టు 23 వరకు నిలిపివేస్తున్నట్లు దేవస్థానం ఈవో త్రినాథరావు తెలిపారు. ఇటీవల దేవస్థానం సిబ్బందిలో 650 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 50 మందికి పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. దీంతో ఈ నెల 9 నుంచి 14 వరకు ఆలయంలో దర్శనాలను నిలిపివేశారు. ఈ నెల 11న మరో 250 మంది సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. ఆ ఫలితాలు రావాల్సి ఉంది. రెండ్రోజుల్లో మరో 200 మందికి పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా ఈ నెల 23 వరకు దర్శనాలు నిలిపివేస్తున్నట్లు దేవస్థానం ప్రకటించింది. వ్రతాలు, కల్యాణం, చండీ, ఆయుష్య హోమాలు, త్రికాల పూజలన్నీ ఏకాంతంగా నిర్వహించనున్నట్లు ఈ వో తెలిపారు. చదవండి: ఆన్లైన్లో శ్రీవారి కల్యాణోత్సవ సేవ -
బండరాయిని ఢీకొన్న కారు
అన్నవరం: తూర్పుగోదావరి జిల్లా అన్నవరం వద్ద 16వ నంబర్ జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారు జామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. వేగంగా వెళ్తున్న కారు అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న పెద్ద బండరాయిని ఢీకొని పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో కారు నడుపుతున్న కట్టా శ్రీనివాసులు (30), ముందు సీట్లో కూర్చున్న దొమ్మేటి పవన్‌కుమార్ (33) అక్కడికక్కడే మృతి చెందారు. వెనుక సీట్లో కూర్చున్న గుత్తుల బాలు, దొమ్మేటి వెంకటేష్ గాయపడ్డారు. మృతులు శ్రీనివాసులుది జిల్లాలోని అమలాపురం మండలం గున్నేపల్లి అగ్రహారం. పవన్‌కుమార్‌ది అంబాజీపేట. గాయపడిన ఇద్దరిలో దొమ్మేటి వెంకటేష్‌ది అంబాజీపేట కాగా, గుత్తుల బాలుది విశాఖ జిల్లా గాజువాక. శనివారం రాత్రి కాకినాడలో జరిగిన స్నేహితుడి వివాహానికి హాజరైన ఈ నలుగురూ కారులో విశాఖపట్నం బయలుదేరారు. తెల్లవారుజామున 4.30 గంటలకు అన్నవరంలోని మండపం జంక్షన్ ముందున్న వై జంక్షన్ వద్ద కారు అదుపు తప్పి రోడ్డు పక్కన ఖాళీస్థలంలో ఉన్న పెద్ద బండరాయిని బలంగా ఢీకొంది. అనంతరం రెండు పల్టీలు కొట్టి, పది మీటర్ల అవతల రోడ్డు మీద బోల్తా పడింది. మృతి చెందిన, గాయపడిన నలుగురూ 30–35 మధ్య వయసు వారే. కోనసీమలో పుట్టిన వీరు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లి, వివిధ వృత్తుల్లో స్థిరపడ్డారు. అన్నవరం ఎస్సై మురళీమోహన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అప్పుడు దోపీడి చేసి ఇప్పుడు నీతులు..
సాక్షి, తూర్పుగోదావరి: అమరావతిలో భూముల రేట్లు పడిపోతాయని యనమల రామకృష్ణుడు రకరకాల ప్రేలాపణలు చేస్తున్నారని ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా మండిపడ్డారు. ఆయన గురువారం జిల్లాలోని అన్నవరంలో మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని అన్ని విధాలుగా దోపీడి చేసి ఇప్పుడు యనమల రామకృష్ణుడు నీతులు చెబుతున్నారని దుయ్యబట్టారు. అమరావతిలో యనమలతో పాటుగా ఆయన సోదరుడు, అల్లుడు భూములు కొన్నారని దాటిశెట్టి రాజా విమర్శించారు. ప్రజాధనాన్నీ.. యనమల, చంద్రబాబు కలిసి ఏలా దోచుకున్నారో త్వరలోనే బయట పెడతామన్నారు. పరిశ్రమల పెట్టుబడుల కోసం వైజాగ్‌లో నిర్వహించిన కార్యక్రమాలకు టీడీపీ వేల కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిందని ఆయన ధ్వజమెత్తారు. చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన పారిశ్రామికవేత్తలు బస చేసిన ఒక్కో హోటల్‌కు రూ. 250 నుంచి రూ.300 కోట్లు చెల్లించారని దాడిశెట్టిరాజా మండిపడ్డారు. టీడీపీ పాలనలో రాష్ట్రం అధోగతి పాలైందని ఆయన తీవ్రంగా విమర్శించారు. టీడీపీ హయాంలో డబుల్ డిజిట్ గ్రోత్ ఎక్కడ వచ్చిందో యనమల చెప్పాలని రాజా డిమాండ్ చేశారు. కేవలం ఫిషింగ్ సెక్టార్లో డబుల్ డిజిట్ గ్రోత్ వచ్చిందని.. ఆ సెక్టార్లో వచ్చిన గ్రోత్‌ను పట్టుకుని అన్ని సెక్టార్లలో వచ్చినట్లు మీడియాతో ప్రచారం చేయించుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లూలూ గ్రూప్ అనేది ఓ షాపింగ్ మాల్ లాంటిదని దాటిశెట్టిరాజా అన్నారు. గట్టిగా ఐదువందల మందికి కూడా ఈ కంపెనీలో ఉద్యోగాలు రావని ఆయన రాజా విమర్శించారు. అటువంటి షాపింగ్ మాల్‌కు రూ.10వేల కోట్ల పెట్టుబడులు ఎలా పెడతారని ప్రశ్నించారు. లూలూ గ్రూప్ ప్రపంచంలో పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ అని.. యనమలతో పాటు చంద్రబాబు, లోకేష్ బిల్డప్ ఇస్తున్నారని దాడిశెట్టి రాజా ఎద్దేవా చేశారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వైజాగ్‌లో పర్యటిస్తే వేలాది మంది వచ్చారని ఆయన తెలిపారు. చంద్రబాబులా తాము పేయిడ్ ఆర్టిస్టులను తెచ్చుకోమని రాజా అన్నారు. -
బాలికపై లైంగిక దాడి కేసులో నిందితుడి పట్టివేత
అన్నవరం (ప్రత్తిపాడు): వైఎస్సార్ జిల్లా సుండుపల్లె పోలీస్ స్టేషన్ పరిధి రెడ్డివారిపల్లెకు చెందిన గిరిజన బాలికపై గత నెల 27న లైంగిక దాడికి పాల్పడి పరారీలో ఉన్న అర్చకుడు రవి అలియాస్ సత్యనారాయణను తూర్పు గోదావరి జిల్లా అన్నవరం పోలీసులు పట్టుకున్నారు. పరారీలో ఉన్న నిందితుడు ఓ కాల్ చేసుకోవాలంటూ పలువురి ఫోన్లు తీసుకుని, తన సన్నిహితుడికి ఫోన్ చేసేవాడు. అతడి ఫోన్‌ను ట్రాప్ చేసిన పోలీసులు చివరి కాల్ అన్నవరం రైల్వే స్టేషన్ నుంచి వచ్చిందని గుర్తించి నిందితుడి వివరాలు అన్నవరం పోలీసులకు పంపించారు. స్పందించిన అన్నవరం పోలీసులు రైల్వే స్టేషన్‌కు చేరుకుని శనివారం రాత్రి 7.30కు విజయవాడ వైపు వెళ్లే గోదావరి ఎక్స్‌ప్రెస్ ఎక్కేందుకు ప్రయత్నిస్తుండగా రవిని అదుపులోకి తీసుకున్నారు. ఆదివారం సుండుపల్లె పోలీసులకు అప్పగించారు. -
ఇంగ్లీష్ విద్య కూడా అవసరం: స్వరూపానందేంద్ర స్వామీజీ
-
ఇంగ్లీష్ విద్యపై స్పందించిన స్వరూపానందేంద్ర
సాక్షి, తూర్పుగోదావరి: ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెడుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై విశాఖ శ్రీ శారద పీఠం పీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ హర్షం వ్యక్తం చేశారు. శనివారం అన్నవరంలో స్వామీజీ మాట్లాడుతూ.. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకున్న ఈ నిర్ణయానికి తన ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉంటుందని అన్నారు. భావితరాలు ముందుకు ఎదగడానికి ఇంగ్లీష్ ఎంతో అవసరమని.. దీంతో సామాన్య, పేద ప్రజల పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో చదివి ఉన్నత స్థాయిలో రాణిస్తారని అభిలాషించారు. నేడు బతకడానికి, బతుకుదెరువుకు ఇంగ్లీష్ అవసరం ఉందని.. లేదంటే దేశ, విదేశాల్లో ఉన్న మన తెలుగు బిడ్డలు రాణించడం కష్టమవుతుందని.. ఎలా బతుకుతారనే సందేహం వెలిబుచ్చారు. ఇంగ్లీష్ కారణంగానే ఏపీ, తెలంగాణకు చెందిన వారు ఎందరో దేశ, విదేశాల్లో ఉన్నత స్థాయిలో ఉన్నారని అన్నారు. అయితే అమ్మా అని పిలవడానికి తెలుగు కావాలని, తెలుగు మన కన్నతల్లి వంటిదని అభిప్రాయపడ్డారు. అటువంటి మన తెలుగు భాషను పరిరక్షించుకోవాలని కాంక్షించారు. -
అప్పుల బాధతో దంపతుల ఆత్మహత్య
అన్నవరం (ప్రత్తిపాడు): అప్పుల బాధ తట్టుకోలేక దంపతులు ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన తూర్పుగోదావరి జిల్లా అన్నవరంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌కు చెందిన భార్యాభర్తలు దుడ్డు ఎస్వీఆర్ పవన్ (50), దివ్యలక్ష్మి (45) ఆదివారం అన్నవరం వచ్చి ఓ హోటల్లో దిగారు. మంగళవారం ఉదయం ఎంతసేపటికీ వారు గది నుంచి బయటకు రాకపోవడంతో హోటల్ నిర్వాహకులు కిటికీ తీసి చూడగా దంపతులిద్దరూ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని విగతజీవులై కనిపించారు. దీంతో హోటల్ నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దంపతులు బస చేసిన గదిలో సూసైడ్ నోట్ లభ్యమైంది. అందులో అప్పుల బాధ తాళలేక, అవి తీరే దారి లేక ఆత్మహత్య చేసుకుంటున్నట్టు పేర్కొన్నారు. -
వరాల మాట సరే.. చోరీల సంగతేంటి స్వామీ
తూర్పుగోదావరి ,అన్నవరం (ప్రత్తిపాడు): ఏ దిక్కు లేనివాళ్లకు దేవుడే దిక్కంటారు. మరి ఆ దేవుడు సన్నిధిలోనే దొంగతనాలు జోరుగా జరుగుతుంటే ఏం చేయాలి? ఎవరితో చెప్పుకోవాలి? ప్రస్తుతం అన్నవరం సత్యదేవుని సన్నిధిలో భక్తులు అదే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. తమ కోర్కెలు స్వామికి చెప్పుకుందామని వస్తున్న వారు.. మా కార్ల అద్దాలు ఎవరూ పగులకొట్టకుండా.. మా పర్సులు, ఆభరణాలు ఎవరూ అపహరించకుండా చూడు స్వామీ అని వేడుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఆదివారం రత్నగిరిపై కారు అద్దాలు పగలగొట్టి రూ.20 వేల నగదు, మూడు సెల్ఫోన్లు పట్టుకుపోయిన విషయం తెలిసిందే.దీంతో సోమవారం దేవస్థానానికి వచ్చిన భక్తులు తమ కార్లకు తామే కాపలా కాసుకోవల్సిన పరిస్థితి ఏర్పడింది. కాగా ఆ కారు నిలిపి ఉంచిన ప్రదేశంలో సీసీ కెమెరా లేకపోవడంతో దొంగ ఆచూకీ దొరకలేదని పోలీసులు తెలిపారు. కీలక ప్రదేశాల్లో సీసీ కెమెరాలు పెట్టాలని ఈఓ ఆదేశించినా.. దేవస్థానంలో తరచూ చోరీలు జరుగుతున్న విషయాన్ని, కీలక ప్రదేశాల్లో సీసీ కెమెరాలు లేకపోవడాన్ని వివరిస్తూ ఈ నెల ఐదో తేదీన ‘సత్తెన్న.. భద్రతేదీ’ శీర్షికన ‘సాక్షి’లో కథనం ప్రచురితమైన విషయం విదితమే. దీనిపై స్పందించిన దేవస్థానం ఈఓ త్రినాథరావు భద్రత విషయంలో నిర్లక్ష్యంగా ఉండవద్దని దేవస్థానం సిబ్బందిని ఆదేశించి అన్ని కీలక ప్రాంతాల్లో సీసీ కెమెరాలు అమర్చాలని ఆదేశించారు. అయితే ఈఓ ముందు తల ఊపిన సంబంధిత సెక్షన్ అధికారులు కొన్ని చోట్ల మాత్రమే సీసీ కెమెరాలు అమర్చి చేతులు దులుపుకొన్నారు. వీఐపీలు బస చేసే వినాయక అతిథిగృహం వద్ద, ఆ పరిసరాల్లో భక్తులు తమ కార్లు నిలిపి ఉంచే పార్కింగ్ స్థలంలో కాని సీసీ కెమెరాలు అమర్చలేదు. ఇదే అదనుగా భావించిన దొంగ ఆదివారం తణుకుకు చెందిన కె.శ్రీనివాస్ కారు అద్దాలు పగలగొట్టి రూ.20 వేల నగదు, మూడు సెల్ఫోన్లు అపహరించారు. అంతే కాదు సీసీ కెమెరాలు లేని మార్గాల్లో అక్కడి నుంచి పరారయ్యాడు. ఆ దొంగ దేవస్థానంలోని అన్ని ప్రాంతాలు తెలిసిన వాడడం వల్లే అలా పరారవ్వగలిగాడనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. చోరీ జరిగినందుకు కొంత, కారు అద్దాలు పగలుకొట్టినందున కొత్త అద్దం వేయడానికి మరో రూ.40 వేల వరకు ఖర్చవుతుందని బాధితుడు శ్రీనివాస్ వాపోయారు. చోరీలు అరికట్టాలంటే.. ♦ రత్నగిరిపై చోరీలకు అడ్డుకట్ట వేయాలంటే.. దేవస్థానంలో పలు నిర్ణయాలను అమలు చేయాల్సి ఉంది. ♦ కొండ దిగువ నుంచి కొండ మీద వరకు ప్రతి పాయింట్ సీసీ కెమెరాలో కవర్ అయ్యేలా చర్యలు తీసుకోవాలి. ♦ దేవస్థానంలో భక్తుల కార్లు నిలిపేచోట సెక్యూరిటీ సిబ్బంది ని ఎక్కువగా నియమించాలి. ఆ ప్రాంతాలలో సీసీ కెమెరాలు తప్పక ఏర్పాటు చేయాలి. వీఐపీ కాటేజీల్లో కూడా వీటిని ఏర్పాటు చేయాలి. పోలీస్ అవుట్‌పోస్టు ఏర్పాటు చేయాలి. ఒక కానిస్టేబుల్ ప్రతి రెండు గంటలకు దేవస్థానంలో అన్ని పాయింట్లు చెక్ చేసి అక్కడ ఉన్న సెక్యూరిటీ సిబ్బందిని అలర్ట్ చేయాలి. ♦ దొంగతనం చేస్తూ పట్టుబడిన వారి ఫొటోలను దేవస్థానంలోని కీలక ప్రదేశాల్లో ప్రదర్శించి భక్తులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలి. ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి పదిగంటల వరకు సీసీ టీవీ లను పరిశీలించేందుకు సిబ్బందిని నియమించాలి. ♦ ప్రధానంగా చోరీ సంఘటనలు జరిగినపుడు అక్కడ సిబ్బందిపై చర్యలు ఉండాలి. దేవస్థానంలో భద్రతను కట్టుదిట్టం చేస్తాం: ఈఓ త్రినాథరావు ఆదివారం జరిగిన చోరీ సంఘటన దురదృష్టకరం. దేవస్థానంలో చాలా చోట్ల సీసీ కెమెరాలు లేవని ‘సాక్షి’లో వార్త వచ్చినపుడు అన్ని ప్రదేశాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సిబ్బందిని ఆదేశించా. కానీ ఆ కారు నిలిపినచోట సీసీ కెమెరాలు లేవని తెలిసింది. సోమవారం ఉదయం ఆ ప్రాంతానికి వెళ్లి చూడగా ఎక్కడా సీసీ కెమెరా కనిపించలేదు. అంత కీలకమైన చోట ఎందుకు సీసీ కెమెరా పెట్టలేదో వివరణ ఇవ్వాలని సిబ్బందిని ఆదేశించాను. నాలుగు రోజుల్లో అన్ని చోట్ల కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించాను. పోలీసులు గస్తీ తిరిగేలా చర్యలు తీసుకుంటాం. ఈ మేరకు ఉన్నతాధికారులతో మాట్లాడతాను. -
బ్యాంకులో బంగారం విడిపిస్తానని ఫైనాన్సియర్‌ను నమ్మించి..
సాక్షి, తూర్పుగోదావరి(అన్నవరం) : బ్యాంకులో కుదువ పెట్టిన రూ.ఏడు లక్షల విలువైన బంగారాన్ని విడిపించుకోవడానికి రూ.2.20 లక్షలు సహాయం చేస్తే ఆ బంగారాన్ని తక్కువ ధరకు మీకే విక్రయిస్తానని ఫైనాన్సియర్‌ను నమ్మించి ఆ సొమ్ము తీసుకుని పరారైన ఘరానా మోసగాడి ఉదంతమిది. తొండంగి ఎస్సై గోపాలకృష్ణ కథనం ప్రకారం.. మండలంలోని గోపాలపట్నంలోని ఎస్బీఐ బ్రాంచ్ ఇటీవల బ్యాంకులో ఖాతాదారులు విడిపించుకోని బంగారాన్ని వేలం వేస్తున్నట్టు పత్రికలో ప్రకటన ఇచ్చింది. అది చూసిన పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన కుమార్ అనే వ్యక్తి విజయవాడలోని ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీకి ఫోన్ చేశాడు. ఆ కంపెనీ బ్యాంకు వేలం వేసే బంగారాన్ని పాడుకుని తిరిగి లాభాలకు విక్రయిస్తుంది. ఈ కంపెనీకి ఈనెల ఆరో తేదీన కుమార్ ఫోన్ చేసి గోపాలపట్నంలో గల స్టేట్‌బ్యాంక్ శాఖలో రూ.ఏడు లక్షల విలువ చేసే తన బంగారం సోమవారం వేలం వేస్తున్నారని, తన వద్ద రూ.ఐదు లక్షలు మాత్రమే ఉన్నాయని, మిగిలిన డబ్బు మీరు సర్దితే ఆ బంగారాన్ని విడిపించి వెంటనే మీకు అమ్ముతానని తెలిపాడు. అది నిజమని నమ్మిన ఆ ఫైనాన్స్ కంపెనీ యజమాని రూ.2.20 లక్షలు తమ వద్ద పనిచేసే టి.సురేష్ అనే వ్యక్తికి ఇచ్చి సోమవారం ఉదయం ఆ బ్యాంక్‌కు పంపించారు. మరోవైపు కుమార్ సోమవారం ఉదయం అన్నవరం ఆర్టీసీ కాంప్లెక్స్‌లో బస్ దిగి, తాను ఆర్టీసీలో డీఎంనని అక్కడ క్యాంటీన్ నిర్వహిస్తున్న కర్రి లోవదొరను పరిచయం చేసుకున్నాడు. అర్జెంట్ గా స్టేట్‌బ్యాంక్‌కు వెళ్లాలని కారు కావాలని అడిగాడు. దీంతో లోవదొర తన కారు ఇచ్చి తన బంధువుతో అతడిని బ్యాంకుకు పంపించాడు. ఆ బ్యాంకు వద్ద వేచి ఉన్న ఫైనాన్స్ కంపెనీ ఉద్యోగి సురేష్ వద్దకు వెళ్లి ఈ కారు తనదేనని చెప్పి బీఎం వద్దకు వెళ్లి మాట్లాడివస్తానని వెళ్లాడు. తరువాత కొంతసేపటికి వెనక్కి వచ్చి డబ్బు ఇవ్వండి బ్యాంకు మేనేజర్‌కు కట్టేస్తాను అని రూ.2.20 లక్షలు తీసుకుని మరలా బ్యాంక్ మేనేజర్ రూమ్‌లోకి వెళ్లి ఆయనతో మాట్లాడి వెనక్కి వచ్చాడు. అర్జంటుగా బయటకు వెళ్లి ఒక సంతకం పెట్టాలి ఇప్పుడే వస్తాను అని చెప్పి వెళుతుండగా ఆ ఫైనాన్స్ ఉద్యోగి అతడిని నిలదీశాడు. ‘‘మా కారు ఇక్కడే ఉంది. నేను ఇప్పుడే వచ్చేస్తా’’ అని చెప్పి రోడ్డు మీదకు వెళ్లాడు. ఎంతసేపటికి అతడు రాకపోవడంతో ఆఫైనాన్స్ ఉద్యోగి బ్రాంచ్ మేనేజర్ వద్దకు వెళ్లి గోల్డ్‌లోన్ వేలం గురించి, తన వద్ద డబ్బు చెల్లించాలని తీసుకున్న విషయం చెప్పాడు. అయితే తనను ఆ విషయాలు అతడు అడగలేదని, పర్సనల్ లోన్ కావాలని మాత్రమే అడిగాడని బీఎం చెప్పారు. దీంతో ఆ ఫైనాన్స్ కంపెనీ ఉద్యోగి సురేష్ మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు బ్యాంకుకు వచ్చి సీసీటీవీ పుటేజీ పరిశీలించి ఆ మోసగాడి ఫొటో డౌన్లోడ్ చేశారు. ఈ మోసగాడిపై ఇప్పటికే ఉభయ గోదావరి, కృష్ణాజిల్లాల్లో పదికి పైగా కేసులు పెండింగ్ లో ఉన్నాయని పరిశీలనలో తేలిందని ఎస్సై తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. -
సత్యదేవుని ఆవిర్భావ వేడుకలకు అంకురార్పణ
సాక్షి, అన్నవరం (తూర్పుగోదావరి) : రత్నగిరివాసుడు శ్రీ సత్యదేవుని 129వ ఆవిర్భావ దినోత్సవాన్ని గురువారం వైభవంగా ప్రారంభించారు. ఉదయం 9.15 గంటలకు గణపతి పూజ, పుణ్యాహవచనం, పారాయణ తదితర కార్యక్రమాలను వైభవంగా నిర్వహించారు. 125 మంది రుత్విక్కులు, ఆలయ వైదిక సిబ్బందికి దీక్షావస్త్రాలను దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ ఎం.సురేష్ బాబు, ఏసీ డీఎల్వీ రమేష్‌బాబు అందజేశారు. సాయంత్రం దర్భారు మంటపంలో కలశ స్థాపన, మంటపారాధన చేశారు. అనంతరం స్వామి, అమ్మవార్లకు నీరాజన మంత్ర పుష్పాలతో సేవ చేశారు. దేవస్థానం వేద పండితులు కపిలవాయి రామశాస్త్రి, ముష్టి కామశాస్త్రి, గొల్లపల్లి ఘనపాఠీ, ప్రధానార్చకుడు కొండవీటి సత్యనారాయణ, స్పెషల్ గ్రేడ్ వ్రత పురోహితులు నాగాభట్ల కామేశ్వర శర్మ, ముత్య సత్యనారాయణ, ఛామర్తి కన్నబాబు, రవిశర్మ, అంగర సతీష్, పాలంకి పట్టాభి తదితరులు పూజాదికాలు నిర్వహించారు. దేవస్థానం ఏసీ రమేష్‌బాబు, ఏఈఓ ఎంకేటీఎన్వీ ప్రసాద్ ఏర్పాట్లను పర్యవేక్షించారు, నేడు ఆవిర్భావ వేడుక సత్యదేవుని ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా శుక్రవారం తెల్లవారుజామున నాలుగు గంటలకు స్వామి, అమ్మవార్ల మూలవిరాట్లకు మహాన్యాసపూర్వక అభిషేకం, పట్టువస్తాలు, స్వర్ణాభరణాలతో అలంకరించి ప్రత్యేక పూజలు చేస్తారు. ఎనిమిది గంటల నుంచి భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. అనంతరం స్వామివారి విశేష పూజలు, హోమం నిర్వహిస్తారు. ఫల పుష్పసేవకు ఏర్పాట్లు రాత్రి 7.30 గంటలకు శ్రీ స్వామివారి నిత్యకల్యాణ మంటపంలో సత్యదేవుడు, అమ్మవార్లకు ఫల పుష్పసేవకు ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు. 20 రకాల ఫలాలు, 30 రకాల పుష్పాలతో మంటపాన్ని ముస్తాబు చేస్తున్నారు. తాపేశ్వరంలోని సురుచి ఫుడ్స్ అధినేత పోలిశెట్టి మల్లిబాబు అందజేసే మహాలడ్డూను స్వామివారికి నివేదన చేస్తారు. తాపేశ్వరం లడ్డూ నేడు అన్నవరం తరలింపు తాపేశ్వరం (మండపేట): అన్నవరం సత్యదేవుని జన్మ దినోత్సవాల సందర్భంగా స్వామివారికి తాపేశ్వరంలోని మడత కాజా మాతృ సంస్థ సురుచి ఫుడ్స్ 500 కిలోల లడ్డూ తయారీ ప్రారంభమైంది. ప్రత్యేక పూజలు అనంతరం గురువారం సంస్థ అధినేత పోలిశెట్టి మల్లిబాబు లడ్డూ తయారీని ప్రారంభించారు. అర టన్ను బరువుతో ఈ లడ్డూ తయారీకి 220 కిలోల పంచదార, 130 కేజీల శనగపిండి, 110 కేజీల ఆవు నెయ్యి, 23 కేజీల జీడిపప్పు, ఆరు కేజీల బాదం పప్పు, రెండు కేజీల యాలికలు, అర కేజీ పచ్చకర్పూరం వినియోగి స్తున్నట్టు ఆయన తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నం ప్రత్యేక వాహనంలో ఈ లడ్డూను అన్నవరం సత్యదేవుని సన్నిధికి తరలిస్తామని తెలిపారు. -
నేడు ఆలయాల మూసివేత
తిరుమల/అన్నవరం(ప్రత్తిపాడు)/ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ): ఈనెల 17వ తేదీన చంద్రగ్రహణం కారణంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రముఖ ఆలయాలు మూసివేయనున్నారు. మంగళవారం రాత్రి 7 గంటల నుంచి మరుసటిరోజు తెల్లవారుజామున 5 వరకు తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయం తలుపులు మూసివేస్తారు. 17న బుధవారం ఉదయాత్పూర్వం 1.31 నుంచి 4.29 గంటల వరకు చంద్రగ్రహణం ఉంటుంది. గ్రహణ సమయానికి 6 గంటల ముందుగా ఆలయం తలుపులు మూసివేయడం ఆనవాయితీ. 17న ఉదయం 5 గంటలకు సుప్రభాతంతో ఆలయ తలుపులు తెరిచి శుద్ధి పుణ్యాహవచనం నిర్వహిస్తారు. అనంతరం తోమాలసేవ, కొలువు, పంచాంగ శ్రవణం, అర్చన సేవలను ఏకాంతంగా నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు సర్వదర్శనం ప్రారంభమవుతుంది. 16న దివ్యదర్శనం, సర్వదర్శనం టోకెన్లను రద్దు చేశారు. సత్యదేవుని ఆలయం.. చంద్రగ్రహణం కారణంగా అన్నవరంలోని సత్యదేవుని ఆలయాన్ని సాయంత్రం నాలుగు గంటలకు మూసివేయనున్నట్లు ఆలయాన్ని శుద్ధి చేసిన అనంతరం బుధవారం ఉదయం తొమ్మిది గంటల నుంచి భక్తులకు స్వామివారి దర్శనాలతోపాటు వ్రతాలు, ఇతర పూజా కార్యక్రమాలు యథావిధిగా జరుగుతాయని తెలిపారు. విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై శాకంబరి ఉత్సవాలు జరుగుతున్నాయి. మంగళవారంతో శాకంబరిదేవి ఉత్సవాలు ముగియనున్నాయి. చంద్రగ్రహణం కారణంగా మంగళవారం సాయంత్రం 6 గంటల వరకే భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. మల్లేశ్వర స్వామి వారి ఆలయం, ఇతర ఉప ఆలయాలు మూసివేస్తారు. -
అన్నవరంలో అమానుషం
అన్నవరం (ప్రత్తిపాడు): సత్యదేవుడు కొలువైన తూర్పుగోదావరి జిల్లా అన్నవరంలో సోమవారం విషాదం చోటుచేసుకుంది. దేవస్థానం మొదటి ఘాట్‌రోడ్ దిగువన ఓ ఇంట్లో నివాసం ఉంటున్న ఓ వివాహిత, ఆమె ఇద్దరు చిన్నారులు సోమవారం అనుమానాస్పదస్థితిలో మృతి చెందారు. వివరాలు ఇలా ఉన్నాయి... అన్నవరంలోని జూనియర్ కళాశాల వెనుకనున్న ఇంట్లో నివాసం ఉంటున్న తాళ్లపురెడ్డి సుష్మ రాజ్యలక్ష్మి (26), ఆమె కుమారులు సాత్విక్ (ఐదు), రెండో కుమారుడు యువన్ (7 నెలలు) సోమవారం ఉదయం విగతజీవులుగా కనిపించారు. తాము ఇంట్లో లేని సమయంలో తమ కోడలు పిల్లలను చంపి, ఉరి వేసుకుని చనిపోయిందని మృతురాలి మామ చంద్రరావు అన్నవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే తమ కుమార్తెను భర్త, అత్త, మామలు తరుచూ వేధించేవారని, వారే పిల్లలను, తమ కుమార్తెను హత్య చేయడమో, లేక ఆత్మహత్య చేసుకునే విధంగా ప్రేరేపించడమో చేశారని రాజ్యలక్ష్మి తల్లిదండ్రులు, బంధువులు ఆరోపిస్తున్నారు. పండుగకు వెళ్లి వచ్చి... సుష్మ రాజ్యలక్ష్మిది విశాఖపట్నం జిల్లా నాతవరం మండలం కిత్తనాయుడుపాలెం గ్రామం. 2013 సంవత్సరంలో అన్నవరానికి చెందిన తాళ్లపురెడ్డి లోవ వెంకట రమేష్‌తో వివాహమైంది. వివాహ సమయంలో కట్న, కానుకలు కింద రూ.రెండు లక్షలు ఇచ్చినట్లు మృతురాలి తండ్రి కొరుప్రోలు పెదరాజబాబు తెలిపారు. అయితే వివాహమైనప్పటి నుంచి తన భర్త, అత్త మామలు, ఆడపడుచులు తరుచూ తనను సూటిపోటి మాటలతో వేధిస్తున్నారంటూ తన కుమార్తె తరచూ చెప్పేదని తెలిపారు. గత నెలలో స్వగ్రామంలో జరిగిన పండుగకు తమ కుమార్తె పిల్లలతో పాటు వచ్చిందని, ఈ నెల ఆరో తేదీన తిరిగి అన్నవరం పంపించామని, ఇంతలోనే ఈ ఘోరం జరిగిపోయిందని రోధించారు. కాగా మృతురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు వరకట్న చావు, హత్య కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అన్నవరం ఎస్ఐ మురళీమోహన్ తెలిపారు. అత్త, మామ, భర్తలను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు తెలిపారు. పోస్టుమార్టానికి తరలించకుండా అడ్డుకున్న బంధువులు సుష్మరాజ్యలక్ష్మి, ఆమె పిల్లల చావుకు కారణమైన వారిని కఠినంగా శిక్షించే వరకూ మృతదేహాలను పోస్టుమార్టానికి కదలనిచ్చేది లేదని మృతురాలు ఇంటివద్ద ఆమె బంధువులు బైఠాయించారు. మృత దేహాలను తరలించేందుకు వచ్చిన అంబులెన్స్‌ను కూడా అడ్డుకున్నారు. -
శ్రీసత్య నారాయణుడి కల్యాణం చూతము రారండీ...
సాక్షాత్తూ శ్రీమన్నారాయణుడే లక్ష్మీ సమేతుడై వెలసిన ప్రముఖ పుణ్యక్షేత్రం తూర్పుగోదావరి జిల్లాలోని అన్నవరం, ఇక్కడ రత్నగిరి పై పంపానదీ తీరాన 128 సంవత్సరాల క్రితం వెలసిన భక్తవరదుడు శ్రీ వీర వేంకటసత్యనారాయణ స్వామి. లక్ష్మీదేవి అంశ అయిన శ్రీ అనంతలక్ష్మీ సత్యవతీదేవి, శంకరుడు ఒకే పానపట్టంపై దర్శనమిచ్చి భక్తుల కోరిన కోర్కెలు తీర్చే స్వామిగా సత్యదేవుని ఖ్యాతి జగద్విదితం. శివ కేశవులకు భేదం లేదని తెలిపే విధంగా విష్ణుమూర్తి శివుడు, శక్తి స్వరూపం అనంతలక్ష్మీ అమ్మవారు పక్కపక్కనే దర్శనమివ్వడం ఇక్కడ విశేషం. 14 నుంచి స్వామివారి దివ్యకల్యాణమహోత్సవాలు శ్రీ సత్యదేవుని దివ్యకల్యాణమహోత్సవాలు వైశాఖ శుద్ధ దశమి అనగా మే14 వ తేదీ నుంచి వైశాఖ బహుళ పాడ్యమి 19వ తేదీ వరకూ అంగరంగ వైభవంగా నిర్వహించడానికి దేవస్థానం ఏర్పాట్లు చేసింది. వైశాఖ శుద్ధ ఏకాదశి, మే 15 రాత్రి తొమ్మిది గంటల నుంచి 11–30 గంటల వరకూ స్వామివారి దివ్య కల్యాణమహోత్సవం ఘనంగా జరుగనుంది. స్వామివారి కల్యాణమహోత్సవం అనంతరం భక్తులకు స్వామివారి తలంబ్రాలు, ప్రసాదాలను కూడా పంపిణీ చే యనున్నారు.ఈసారి స్వామి కల్యాణమహోత్సవాలు ఏడు రోజులకు బదులు ఆరు రోజులు మాత్రమే జరుగుతాయని అధికారులు తెలిపారు. వైశాఖ శుద్ధద్వాదశి, త్రయోదశి రెండు తిథులు ఒకే రోజు వచ్చినందున ఆ రెండు రోజుల కార్యక్రమాలు ద్వాదశినే నిర్వహిస్తున్నారు.భద్రాద్రి రాముని కల్యాణం తరువాత తెలుగు రాష్ట్రాలలో అంత ప్రాముఖ్యత కలిగిన వేడుక రత్నగిరి శ్రీసత్యదేవుని దివ్యకల్యాణం. ఈ వేడుకకి పెళ్లి పెద్దలుగా శ్రీసీతారాములే వ్యవహరిస్తారు. అన్నవరం క్షేత్రానికి క్షేత్రపాలకునిగా శ్రీరాముడు పూజలందుకుంటున్న విషయం తెలిసిందే. ఆ హోదాలో ఆ వేడుకలకు పెళ్లి పెద్దలుగా వ్యవహరిస్తారు. 15 నుంచి ‘పంచహారతుల సేవ’ ఈ కల్యాణమహోత్సవాల వేడుకల్లో భాగంగా శ్రీసత్యదేవుడు, అమ్మవారికి నూతనంగా ‘పంచ హారతుల సేవ’ను ఈ నెల 15వ తేదీ నుంచి ప్రారంభిస్తున్నట్లు దేవస్థానం ఈఓ ఎంవీ సురేష్ బాబు తెలిపారు. ఈ సేవకు పెద్దాపురానికి లలితాబ్రాండ్ రైస్ కంపెనీ అధినేతలు మట్టే సత్యప్రసాద్, శ్రీనివాస్ సోదరులు సుమారు 12కిలోల వెండితో చేయించిన ఎనిమిది రకాల ఆకృతులతో వెండిహారతి సామాగ్రి విరాళంగా అందచేస్తున్నారని తెలిపారు. రోజూ రాత్రి ఏడు గంటల నుంచి అర్ధగంట సేపు ఈ సేవ స్వామివారి ప్రధానాలయంలో నిర్వహిస్తారు. రూ.500 టికెట్‌తో రోజూ 20 దంపతులను మాత్రమే ఈ కార్యక్రమానికి అనుమతిస్తారు. మే 14, వైశాఖ శుద్ధ దశమి మంగళవారం సాయంత్రం నాలుగు గంటలకు స్వామివారి దేవాలయ ప్రాంగణంలోని అనివేటి మండపంలో శ్రీసత్యదేవుడు, అమ్మవారిని వధూవరులను చేస్తారు. అనంతరం రామారాయ కళావేదిక మీద స్వామి, అమ్మవార్లకు ఎదుర్కోలు ఉత్సవం నిర్వహిస్తారు. 15, వైశాఖ శుద్ధ ఏకాదశి, బుధవారం రాత్రి తొమ్మిది నుంచి 11–30 గంటల వరకూ కల్యాణవేదిక మీద స్వామి, అమ్మవార్లకు దివ్యకల్యాణమహోత్సవం నిర్వహిస్తారు. 16, వైశాఖ శుద్ధ ద్వాదశి, త్రయోదశి, గురువారం ప్రధాన స్థాలీపాక హోమాలు, రాత్రి ఏడు గంటలకు అరుంధతి దర్శనం, అనంతరం స్వామి అమ్మవార్లను రాత్రి తొమ్మిది గంటల నుంచి రావణవాహనం మీద, పొన్నవాహనం మీద స్వామి, అమ్మవార్లను ఊరేగిస్తారు. 17, వైశాఖశుద్ధ చతుర్దశి, శుక్రవారం మధ్యాహ్నం 2–30కు అనివేటి మండపంలో పండిత సదస్యం, సాయంత్రం ఐదు గంటలకు కొండదిగువన దేవస్థానం గార్డెన్స్‌లో శ్రీవారి వనవిహారం. 18, వైశాఖ శుద్ధ్ద పౌర్ణమి, శనివారం ఉదయం 8–30 గంటలకు పంపానదిలో నిర్మించిన పుష్కరిణిలో స్వామివారి ‘శ్రీచక్రస్నానం’. సాయంత్రం 4 గంటలకు రత్నగిరిపై అనివేటి మండపంలో నీలలోహిత గౌరీపూజ, నాకబలి, దండియాడింపు, ధ్వజావరోహణం, కంకణ విమోచన. 19, వైశాఖ బహుళ పాడ్యమి, ఆదివారం రాత్రి ఏడు గంటలకు స్వామివారి నిత్య కల్యాణమండపంలో శ్రీస్వామి, అమ్మవార్లకు శ్రీపుష్పయోగం కార్యక్రమంతో ఉత్సవాలు ముగుస్తాయి. నాగఫణిశర్మ అష్టావధానం ఈసారి శ్రీసత్యదేవుని దివ్యకల్యాణమహోత్సవాలలో ద్విసహస్రావధాని మాడుగుల నాగఫణిశర్మ అష్టావధాన కార్యక్రమం 16వ తేదీ సాయంత్రం ఏర్పాటు చేశారు. నాగఫణిశర్మ 14న ఎదుర్కోలు ఉత్సవంలో, 15న స్వామివారి కల్యాణమహోత్సవాలలో వ్యాఖ్యాతగా వ్యవహరిస్తారు.కాగా పంపలో నీరు లేకపోవడంతో తాత్కాలిక పుష్కరిణి నిర్మించారు. ఆ పుష్కరిణికి ఏలేరు జలాలు తరలించడంతో పుష్కరిణి కళకళ లాడుతోంది. ఈ పుష్కరిణి లోనే 18న సత్యదేవుని చక్రస్నాన కార్యక్రమం నిర్వహించనున్నారు. అనిశెట్టి వేంకట రామకృష్ణ సాక్షి, అన్నవరం, -
అప్పుడే పెళ్లి చేసుకున్న ప్రేమ జంటపై ..
సాక్షి, కృష్ణా : అప్పుడే పెళ్లి చేసుకొని ఇంటికి తిరిగి ఇంటికి వస్తున్న ప్రేమ జంటపై యువతి బంధువుల దాడి చేసి నవవధువును లాక్కెళ్లిన ఘటన కృష్ణా జిల్లా అవనిగడ్డలో చోటు చేసుకుంది. గుంటూరు జిల్లా రేపల్లె మండలం అరవపల్లికి చెందిన వేపూరి గోపి(23), అదే గ్రామానికి చెందిన భూపతి పూజిత(20) గత కొద్ది రోజులుగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లికి పెద్దలు అంగీకరించకపోవడంతో అన్నవరం గుడిలో వివాహం చేసుకున్నారు. వివాహనంతరం తిరిగి సొంత గ్రామానికి వస్తుండగా పులిగడ్డ టోల్గేట్ వద్ద నవ దంపతులపై యువతి బంధువలు దాడి చేశారు. గోపిని తీవ్రంగా గాయపరచి పూజితను కిడ్నాప్ చేశారు. ఈ దాడిపై నవవరుడు గోపి అవనిగడ్డ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. -
మోగనున్న పెళ్లిబాజా
శుభకార్యాలు నిర్వహించుకోవడం కోసం చాలామంది ఎదురు చూసే మాఘమాసం రానే వచ్చింది. మంగళవారం నుంచి మార్చి ఆరో తేదీ వరకూ మాఘమాసం కొనసాగనుంది. ఈ పవిత్ర మాసంలో మంచి ముహూర్తాలు ఉండడంతో వివాహాలు, గృహప్రవేశాలు, శంకుస్థాపనలు తదితర శుభకార్యాలు జోరుగా జరగనున్నాయి. ప్రతి గ్రామంలోనూ పెళ్లిబాజాలు మోగనున్నాయి. ముఖ్యంగా ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం శ్రీ వీర వేంకట సత్యనారాయణస్వామి వారి దేవస్థానంలో పెళ్లిళ్లు జోరుగా జరగనున్నాయి. దీంతోపాటు పలు పర్వదినాలు కూడా ఉన్న నేపథ్యంలో దేవస్థానం అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. తూర్పుగోదావరి, అన్నవరం (ప్రత్తిపాడు): జిల్లాలో వివాహాది శుభకార్యాలు చివరిగా మార్గశిర బహుళ నవమి అంటే డిసెంబర్ 30న జరిగాయి. తిరిగి 35 రోజుల విరామం అనంతరం బుధవారం నుంచి ఈ నెల 28వ తేదీ వరకూ వివాహాలు జరగనున్నాయి. వీటిలో ఈ నెల 8, 9, 10, 11 తేదీల్లో ఉన్న ముహూర్తాల్లో పెద్ద సంఖ్యలో వివాహాలు చేసేందుకు చాలామంది ఏర్పాట్లు చేసుకున్నారు. అలాగే మార్చి ఏడో తేదీ నుంచి మొదలయ్యే ఫాల్గుణ మాసంలో కూడా మార్చి 30వ తేదీ వరకూ వివాహాలు జరుగుతాయని పండితులు తెలిపారు. సుముహూర్తాల నేపథ్యంలో రత్నగిరిపై సందడి మొదలైంది. వివాహాలు చేసుకునే పెళ్లిబృందాలు ఇప్పటికే సత్రాల్లో గదులు, వివాహ మండపాలను రిజర్వ్ చేసుకున్నాయి. ఆ రోజుల్లో ఇతర భక్తులకు వసతి గదులు తక్కువగా మాత్రమే లభ్యమయ్యే పరిస్థితి ఏర్పడింది. వివాహముహూర్తాల నేపథ్యంలో రత్నగిరిపై పురోహితులు, క్యాటరింగ్, బజంత్రీలకు డిమాండ్ పెరిగింది. పర్వదినాలకు ఏర్పాట్లు ఇదిలా ఉండగా మాఘమాసంలో వచ్చే పర్వదినాలైన రథసప్తమి, భీష్మ ఏకాదశిని దృష్టిలో ఉంచుకొని దేవస్థానంలో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. రథసప్తమి నాడు సూర్యభగవానుడికి ప్రత్యేక పూజలు, సూర్యనమస్కారాలు తదితర కార్యక్రమాలు నిర్వహిస్తారు. అలాగే 16వ తేదీన భీష్మ ఏకాదశి సందర్భంగా తెల్లవారుజాము నుంచి రత్నగిరిపై వ్రతాలు ప్రారంభించడంతోపాటు సత్యదేవుని దర్శనానికి భక్తులను అనుమతిస్తారు. మార్చి నాలుగో తేదీన మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా రాత్రి 12 గంటలకు సత్యదేవుని మూలవిరాట్ పక్కనే ఉన్న శివలింగానికి ప్రత్యేక అభిషేకం చేయనున్నారు. లక్షమంది భక్తులు వస్తారనే అంచనాతో.. భీష్మ ఏకాదశి పర్వదినం నాడు సుమారు లక్ష మంది భక్తులు స్వామివారి దర్శనానికి వస్తారనే అంచనాతో ఏర్పాట్లు చేస్తున్నాం. ప్రత్యేక క్యూ లైన్లు, వ్రతాల కోసం అదనపు మండపాలు అందుబాటులోకి తెస్తాం. భక్తుల కోసం ప్రత్యేక ప్రసాదం కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నాం. ఉదయం నుంచీ భక్తులకు పులిహోర, దద్ధోజనం పంపిణీ చేస్తాం.– వి.త్రినాథరావు, ఇన్చార్జి ఈఓ, అన్నవరం దేవస్థానం -
అన్నవరంలో ప్రేమజంట ఆత్మహత్యాయత్నం
-
నేడు అన్నవరం సత్యదేవుని కల్యాణోత్సవం
-
నడిరోడ్డుపై ప్రసవం
అన్నవరం (ప్రత్తిపాడు): సోమవారం ఉదయం పది గంటలు. 35 డిగ్రీలకు మించిన ఎండ. ఆ సమయంలో అన్నవరం పాతబస్టాండ్‌లో ఒక ఆటో ఆగింది. దానిలో నుంచి నిండుగర్భిణి, ఆమె తల్లి కిందకు దిగారు. అప్పటికే ఆ మహిళ తీవ్రంగా నొప్పులు పడుతోంది. కిందకు దిగిన మరుక్షణం ఆమె కిందకు వాలిపోయింది. ఆ వెంటనే పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. అసలేం జరిగిందో తెలుసుకునేలోపే ప్రసవం జరిగిపోయింది. ఆ మహిళ వెంట వచ్చిన ఆమె తల్లి ఆ శిశువును తన పొత్తిళ్లలోకి తీసుకోగా ఆ మహిళ కొంతసేపు అలానే నేలమీద కూర్చుండి పోయింది. అక్కడ ఉన్న వారు కొంతమంది 108కు ఫోన్ చేయగా వెంటనే సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. ఆమె చెప్పిన వివరాల మేరకు ప్రాథమిక చికిత్స చేసి తొండంగి పీహెచ్సీ కి తరలించారు. వివరాలివీ.. 108 సిబ్బంది కథనం ప్రకారం.. తొండంగి మండలం సీతారాం పురం గ్రామానికి చెందిన మహిళపేరు మారుకొండ పెద్దాపురం అని తెలిపారు. తొండంగి వైద్యాధికారి డాక్టర్ నాగభూషణం ఆమె గర్భం దాల్చినప్పటి నుంచి రెగ్యులర్‌గా చెకప్ చేస్తున్నారని తెలిపారు. ఆమె కు ఈ నెల 29న డెలివరీ అయ్యే అవకాశం ఉందని అంచనా వేశారు. అయితే కాకినాడలో కూడా పరీక్షలు చేయించుకోవాలని చెప్పడంతో కాకినాడ ఆసుపత్రికి వెళ్లేందుకు తొండంగి నుంచి అన్నవరం రాగా, అక్కడే డెలివరీ అయినట్టు తెలిపారు. తల్లి పిల్లలను తొండంగి ఆసుపత్రిలో చూపించిననంతరం వైద్యాధికారి సూచనల మేరకు కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించినట్టు తెలిపారు. తల్లీపిల్ల క్షేమంగా ఉన్నట్టు తెలిపారు. -
కిడ్నాప్ కలకలం
అన్నవరం(ప్రత్తిపాడు): అన్నవరంలో ఓ వివాహితను కిడ్నాప్ చేసేందుకు ఓ అగంతకుడు ప్రయత్నించగా ఆమె చాకచక్యంగా కారులో నుంచి దూకి తప్పించుకుంది. ఆ ఘటన వివరాలను గురువారం రాత్రి అన్నవరం పోలీస్‌స్టేషన్‌లో ప్రత్తిపాడు సీఐ అద్దంకి శ్రీనివాసరావు ఇలా వెల్లడించారు. సామర్లకోట మండలం హుస్సేన్‌పురంలో ఉంటున్న ఏనుగుల శిరీషకు విశాఖ జిల్లా చింతపల్లికి చెందిన మహేష్‌తో ఏడాది క్రితం వివాహమైంది. శిరీష కాకినాడ ఆదిత్య డిగ్రీ కళాశాలలో చదువుతూ తన స్వగ్రామం హుస్సేన్పురంలోనే ఉంటూ రోజూ కాకినాడ కళాశాలకు వెళ్లి వస్తోంది. బుధవారం సాయంత్రం మహేష్ అన్నవరానికి చెందిన తన బంధువులకు చెందిన నీలి రంగు రెనాల్ట్ పల్స్ కారు(ఏపీ 5 బీడీ 1567)లో హుస్సేన్ పురం వెళ్లాడు. అక్కడి నుంచి భార్యాభర్తలు ఇరువురు గురువారం ఉదయం అన్నవరంలోని శ్రీసత్యదేవుని ఆలయానికి వచ్చి స్వామివారి వ్రతమాచరించి దర్శనం చేసుకున్నారు. అనంతరం కొండ దిగువకు వచ్చి ఎస్బీఐ ఏటీఎం వద్ద కారు ఆపి తన బంధువులకు ఫోన్ చేసి కారు తీసుకెళ్లిపోమని చెప్పాడు. తరువాత ఆ కారు ఇంజిన్ ఆపకుండా మహేష్ అందులో నుంచి దిగి వాటర్ బాటిల్ కొనుక్కోవడానికి వెళ్లాడు. ఈ లోపు ఓ అగంతకుడు ఆ కారు డ్రైవర్ సీటులోకి ఎక్కి అతి వేగంగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్లిపోతుండడంతో మహేష్‌తో పాటు అతడి బంధువులు ఆ కారును ఆపేందుకు ప్రయత్నించారు. ఫలితం లేక మోటార్ సైకిల్‌పై వెంబడించారు. కారులో ఉన్న శిరీష కూడా గట్టిగా కేకలు వేస్తుండడంతో బెండపూడి వద్ద అగంతకుడు కారు ఆపాడు. ఆమె కారు డోర్ తీసుకుని కిందకు దూకేసింది. ఈ లోపు మహేష్, అతడి బంధువులు అక్కడికి చేరుకోవడంతో ఆ అగంతకుడు కారు వేగంగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్లిపోయాడు. కారును ధర్మవరం వరకు వెంబడించిన మహేష్ బంధువులు ఆ తరువాత కారు ఆచూకీ తెలియక వెనుదిరిగారు. అప్రమత్తమైన పోలీసులు కిడ్నాప్ విషయం తెలుసుకున్న పోలీసులు అప్రమత్తమయ్యారు. కృష్ణవరం టోల్గేట్ సిబ్బందికి ఫోన్ చేసి కారును ఆపాలని సూచించారు. హైవే మీద అన్ని పోలీస్స్టేషన్లను అలర్ట్ చేశారు. గురువారం రాత్రి మహేష్, శిరీష, వారి బంధువుల నుంచి సీఈ శ్రీనివాసరావు పూర్తి వివరాలు సేకరించారు. త్వరలోనే ఆ నిందితుడిని పటుకుంటామని తెలిపారు. అగంతకుడు ముఖానికి గుడ్డ కట్టుకున్నాడని, కారులో తన ఫోన్, బ్యాగ్ ,పర్స్ ఉన్నాయని శిరీష తెలిపింది. -
కార్తిక మాసోత్సవాలకు రత్నగిరి సన్నద్ధం
అన్నవరం (ప్రత్తిపాడు): ఈ నెల 20వ తేదీ నుంచి నవంబర్ 18 వరకూ కొనసాగనున్న కార్తి్తకమాసంలో సత్యదేవుని ఆలయానికి వచ్చే భక్తులకు అన్ని ప్రభుత్వ శాఖల సహకారంతో ఎటువంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని దేవస్థానం, ప్రభుత్వశాఖల సమన్వయకమిటీ సమావేశంలో తీర్మానించారు. శుక్రవారం దేవస్థానంలోని ఈఓ చాంబర్లో జరిగిన ఈ సమావేశానికి పెద్దాపురం ఆర్డీఓ విశ్వేశ్వరరావు అ«ధ్యక్షత వహించారు. దేవస్థానం ఇన్చార్జి ఈఓ ఈరంకి జగన్నాథరావు మాట్లాడుతూ దేవస్థానంలో చేస్తున్న ఏర్పాట్లను వివరించారు. సమావేశంలో శంఖవరం ఎంపీడీఓ శ్రీను, పంపా రిజర్వాయర్ ఏఈ వీరబాబు, తుని ఫైర్ సర్వీస్ అధికారి కేవీ రమణ, దేవస్థానం వైద్యాదికారి డాక్టర్ పాండురంగారావు, గ్రామపంచాయతీ కార్యదర్శి రామశ్రీనివాసరావు, ఆర్టీసీ, వైద్య ఆరోగ్యశాఖ, రెవిన్యూ, పోలీస్, తదితర విభాగాల అధికారులు సమావేశంలో పాల్గొన్నారు. సమన్వయకమిటీ సమావేశం నిర్ణయాలు ముఖ్యమైన పర్వదినాలు: ఈ నెల 23, 30, నవంబర్ ఆరోతేదీ, నవంబర్ 13వ తేదీ కార్తి్తకమాస సోమవారాలు. 21, 28 నవంభర్ నాలుగో తేదీ 11, 18 తేదీలు శనివారాలు, 22,29, నవంభర్ 5, 12 వ తేదీలు ఆదివారాలు. 31 వ తేదీ, నవంబర్ 14 వ తేదీ కార్తిక శుద్ధ, బహుళ ఏకాదశి పర్వదినాలు వచ్చినందున ఆ రోజుల్లో భక్తుల రద్దీ అధికంగా ఉండే అవకాశం ఉంది. ఆ రోజుల్లో తెల్లవారుజామున రెండు గంటలకే ఆలయం తెరిచి భక్తులకు సర్వదర్శనాలు కల్పిస్తారు. ఆ రోజుల్లో పోలీసులు అదనపు బందోబస్తు ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. భక్తులకు ఉదయం ఏడు గంటల నుంచి పులిహోర పంపిణీ చేయాలని నిర్ణయించారు. నవంబర్ 1న తెప్పోత్సవం: క్షీరాబ్ది ద్వాదశి పర్వదినం సందర్బంగా నవంబర్ ఒకటో తేదీ సాయంత్రం 6–30 గంటల నుంచి 8–30 గంటల వరకూ సత్యదేవుని తెప్పోత్సవానికి పంపా నదిలో తగినంత నీటిమట్టం ఉండేలా చర్యలు తీసుకోవాలి. బాణసంచా కాల్చేటపుడు ఎటువంటి ప్రమాదాలు జరుగకుండా తుని ఫైర్ సిబ్బంది చర్యలు తీసుకోవాలి. పోలీసు బందోబస్తు నిర్వహించాలి. నాలుగో తేదీన గిరిప్రదక్షిణ : నవంబర్ నాలుగో తేదీన కార్తీకపౌర్ణమి సందర్భంగా స్వామివారి గిరిప్రదక్షిణ ఉదయం ఎనిమిది గంటల నుంచి నిర్వహించాలని నిర్ణయించారు. మూడో తేదీ మధ్యాహ్నం నుంచి వచ్చినందున ఆరోజు రాత్రి జ్వాలాతోరణం, పంపా నదీ హారతులు నిర్వహిస్తారు. సహస్ర దీపాలంకరణ సేవ ప్రారంభం: దేవస్థానంలో సహస్రదీపాలంకార సేవను కార్తీకమాసంలోనే ప్రారంభించాలని నిర్ణయించారు. ఈ మేరకు అవసరమైన షెడ్డు నిర్మాణం, ఇతర వస్తుసామగ్రిని కార్తీక పౌర్ణమి నాటికి సమకూర్చుకోవాలని నిర్ణయించినట్లు ఇన్చార్జి ఈఓ జగన్నాథరావు సాక్షి కి తెలిపారు. కార్తీకమాసంలోని పర్వదినాల్లో తెల్లవారుజాము నుంచి వ్రతాలు ప్రారంభిస్తారు. భక్తుల రద్దీ ఎక్కువ ఉన్నపుడు అంతరాలయ దర్శనం రద్దు చేసి ప్రత్యేక దర్శనం టిక్కెట్ భక్తులకు ప్రత్యేక క్యూ లైన్ అమలు చేస్తారు. కార్తీకమాసం నెల రోజులు రత్నగిరికి ఆర్టీసీ ప్రత్యేక బస్‌లు నడపాలని, వైద్య నిర్వహించాలని నిర్ణయించారు. -
రత్నగిరికి పోటెత్తిన భక్తులు
ఘాట్ రోడ్లో ట్రాఫిక్ జామ్ అన్నవరం(ప్రత్తిపాడు) : రత్నగిరిపై కొలువైన శ్రీసత్యదేవుని ఆలయానికి ఆదివారం భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. స్వామివారి ఆలయంతో పాటు, ప్రాంగణం భక్తులతో నిండిపోయింది. తెల్లవారుజామున ఐదు గంటల నుంచి సాయంత్రం వరకూ భక్తులు తండోప తండాలుగా వస్తూనే ఉన్నారు. శనివారం రాత్రి, ఆదివారం ఉదయం రత్నగిరిపై వివాహాలు జరిగాయి. దానికి తోడు వరుస సెలవులు కావడం కూడా భక్తులు పోటెత్తడానికి కారణమైంది. వ్రతాల కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు.. సత్యదేవుని వ్రతాలాచరించేందుకు భక్తులు గంటల తరబడి వేచి ఉండాల్సి వచ్చింది. ప్రధానంగా రూ.200, రూ.400 వ్రతాలాచరించే భక్తులైతే భారీ క్యూలో వేచి ఉన్నారు. ధ్వజస్తంభం వద్ద వ్రతాలాచరించేందుకు రూ.1500 టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు కూడా ఇబ్బందులు తప్పలేదు. స్వామి దర్శనానికి మూడు గంటలు సత్యదేవుని దర్శనానికి మూడు గంటలు సమయం పట్టింది. స్వామివారి అంతరాలయం దర్శనం కోసం రూ.వంద టిక్కెట్ తీసుకున్న భక్తులు కూడా రెండు గంటలు వేచియుండాల్సి వచ్చింది. వృద్ధులు, చిన్న పిల్లలు ఇబ్బంది పడ్డారు. ఆలయానికి సుమారు ఎనిమిది వేల వాహనాలలో భక్తులు తరలివచ్చారు. పలుమార్లు ఘాట్రోడ్లో వాహనాలు నిలిచిపోయాయి. గతంలో భక్తుల రద్దీ ఉన్న సమయంలో చిన్న కార్లు, ఇతర వాహనాలను ప్రకాష్‌సదన్ వెనుక గల మైదానంలో నిలిపివేసేవారు. ఈ సారి వాహనాలను యథేచ్ఛగా వదిలేయడంతో కార్లను పశ్చిమ రాజగోపురం ముందు నిలిపివేశారు. అదే విధంగా ఆటోలను కూడా నిలిపివేయడంతో భక్తులకు ఇక్కట్లు తప్పలేదు. పాలకమండలి సమావేశంలో అధికారులు సత్యదేవుని దర్శనానికి భారీగా భక్తులు వస్తారని తెలిసి కూడా అదే రోజు పాలక మండలి సమావేశం నిర్వహించడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. పాలకమండలి సమావేశంలో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకూ దేవస్థానం చైర్మన్, సభ్యులు, ఇన్చార్జి ఈఓ, వివిద విభాగాల ఏఈఓలు, సూపరింటెండెంట్లు, ప్రధానార్చకుడు, అందరూ పాల్గొన్నారు. ఓ వైపు వేలాది మంది భక్తులు ఆలయప్రాంగణంలో ఇబ్బంది పడుతుంటే గుమస్తాలు, నాలుగో తరగతి ఉద్యోగులు మాత్రమే వారికి సేవలందించాల్సిన పరిస్థితి నెలకొంది. గతంలో ఇటువంటి రద్దీ రోజుల్లో మిగిలిన విభాగాల సిబ్బందికి కూడా ఆలయం వద్ద, వ్రత మండపాల వద్ద ప్రత్యేక డ్యూటీలు వేసేవారు. చైర్మన్, ఇన్చార్జి ఈఓ ఆలయ ప్రాంగణం అంతా తిరిగి సిబ్బందికి సూచనలిచ్చేవారు. ఈ సారి అందుకు విరుద్ధంగా అక్కడ విధుల్లో ఉండాల్సిన అధికారులు కూడా భక్తులను గాలికి వదిలేసి పాలక మండలి సేవలో తరించడం విశేషం స్వామిని దర్శించిన 45 వేల మంది భక్తులు సత్యదేవుని ఆలయానికి సుమారు 45 వేల మంది భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. వ్రతాలు 4,185 జరగగా రూ.40 లక్షల ఆదాయం సమకూరిందని అధికారులు తెలిపారు. -
రత్నగిరిపై బయో గ్యాస్‌ప్లాంట్
35.49 లక్షలతో ఏర్పాటుకు చర్యలు కొండదిగువన గోశాలలో రెండు షెడ్ల నిర్మాణం దేవస్థానం కళాశాల మైదానంలో వాకింగ్ ట్రాక్ పాలకమండలి సమావేశంలో తీర్మానాలు అన్నవరం (ప్రత్తిపాడు) : అన్నవరం దేవస్థానంలోని నిత్యాన్న దాన పథకంలోని ఆహార వ్యర్థాలు, వ్రతాల విభాగంలో వచ్చే వ్యర్థాలను వినియోగిస్తూ రత్నగిరి కొండమీద బయోగ్యాస్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని దేవస్థానం పాలకమండలి నిర్ణయించింది. పాలక మండలి సమావేశం ఆదివారం దేవస్థానంలోని ప్రకాష్‌సదన్‌లో గల సమావేశ మందిరంలో చైర్మన్ ఐవీ రోహిత్ అధ్యక్షతన జరిగింది. సమావేశపు అజెండాలో పొందుపరచిన 41 అంశాలపై సభ్యులు చర్చించి తీర్మానాలు చేశారు. సమావేశంలో సభ్యులు చిర్ల శేషుకుమారి, కొత్త వేంకటేశ్వరరావు, సత్తి వీరదానరెడ్డి, రొబ్బి విజయశేఖర్, మారెడ్డి శింగారెడ్డి, రావిపాటి సత్యనారాయణ, యనమల రాజేశ్వరరావు, యడ్ల భేతాళుడు, అవసరాల వీర్రాజు, కందుల విశ్వేశ్వరరావు, నున్న రామచంద్రరావు, మట్టే సత్యప్రసాద్, సింగిలిదేవి సత్తిరాజు, పర్వత రాజబాబు, ఎక్స్ అఫీషియో సభ్యుడు ప్రధానార్చకుడు కొండవీటి సత్యనారాయణ, ఇన్చార్జి ఈఓ ఈరంకి జగన్నాధరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు. సమావేశం అనంతరం వివరాలను అధికారులు తెలియజేశారు. ముఖ్యమైన తీర్మానాలు దేవస్థానంలోని శ్రీవనదుర్గ, శ్రీకనకదుర్గ ఆలయాలు, తొలిపాంచా, ప్రసాదం కౌంటర్ కు రంగులు వేయడానికి తీర్మానించారు. దేవస్థానంలో గత నెలలో ఈ–ప్రోక్యూర్మెంట్ కం బహిరంగవేలం ద్వారా 14 టీ, కాఫీ మిషన్ల నిర్వహణకు గాను హెచ్చు పాటను ఖరారు చేశారు. కొండదిగువన గోశాలలో రూ.19.95 లక్షలతో ఏసీ షీటుతో రెండు షెడ్లు నిర్మించేందుకు తీర్మానించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు చెందుర్తిలో నిర్మించిన గోశాలలో గోవుల పరరక్షణ, మేత, దాణా సరఫరా అన్నవరంలోని గోశాల ద్వారా చేసేందుకు పాలకమండలి తీర్మానించింది. రూ.30 లక్షలతో దేవస్థానంలోని ప్రకాష్ సదన్ సత్రం వెనుక గల పవర్ హౌస్‌లో, కొండదిగువన గల పంపా తీరంలో గల పవర్‌హౌస్‌లో అధునాతన పేనల్ బోర్డులు ఏర్పాటు చేయడానికి తీర్మానించారు. విశాఖ జిల్లాలోని నర్సీపట్నం శివారు బలిఘట్టంలో గల శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి దేవాలయాన్ని దత్తత తీసుకోవడానికి కమిషనర్ అనుమతి కోసం రాయాలని తీర్మానించారు. సత్యదేవుని ఆలయం వద్ద గల శయన మందిరం వద్ద రూ.2.75 లక్షలతో వ్యయంతో జియో షీట్‌తో షెడ్డు నిర్మాణం ప్రతిపాదనకు అంగీకరిస్తూ తీర్మానించారు. ప్రకాష్‌సదన్ వద్ద రూ.7.75 లక్షలతో టాయ్‌లెట్స్ మరమ్మతులకు తీర్మానించారు. శ్రీసత్యదేవ జూనియర్ కళాశాల మైదానంలో ఉపాధి హామీ నిధులతో వాకింగ్ ట్రాక్ నిర్మాణానికి అనుమతి మంజూరు చేస్తూ తీర్మానించారు. -
తొలగిన'తల’భారం
అన్నవరం దేవస్థానంలో నిల్వ ఉన్న 700 కిలోల తలనీలాలు వేలంపాట దారునికి అప్పగించేందుకు కమిషనర్ అనుమతి రూ.20 లక్షలు ఆదాయం వచ్చే అవకాశం అన్నవరం(ప్రత్తిపాడు) : దేవాదాయశాఖ కమిషనర్ జారీ చేసిన ఓ ఆదేశం అన్నవరం దేవస్థానం అధికారుల తల బరువు దించినట్టయింది. దేవస్థానంలోని కేశఖండన శాలలో గత తొమ్మిది నెలలుగా నిల్వ ఉన్న సుమారు 700 కేజీల తలనీలాలను పాటదారునికి అప్పగించేందుకు దేవాదాయశాఖ కమిషనర్ వైవీ అనూరాధ అనుమతి మంజూరు చేస్తూ ఇచ్చిన ఆదేశాలు జారీ చేశారు. దేవస్థానంలో భక్తులు సమర్పించిన తలనీలాలను తీసుకునేందుకు ఏటా వేలం పాట నిర్వహిస్తారు. గతేడాది కూడా ఇదే విధంగా వేలంపాట నిర్వహించగా రూ.1.28 కోట్లకు పాట వెళ్లింది. అయితే పాటదారుడు రూ.పది లక్షలు మాత్రమే చెల్లించడంతో ఆ విలువ మేరకు తల నీలాలను అప్పగించారు. నవంబర్ 17 నుంచి వచ్చిన తల నీలాలను కేశఖండనశాలలోని గదిలో దేవస్థానం అధికారులు భద్రపరుస్తున్నారు. అయితే తల నీలాలు మూడు నెలలు వరకూ మాత్రమే భద్రపర్చడానికి వీలు ఉంటుంది. అంతకన్నా ఎక్కువ రోజులు భద్రపర్చాలంటే కెమికల్స్‌తో ప్రాసెస్ చేయాలి. అలాంటి ఏర్పాటు దేవస్థానంలో లేదు. ఈ నేపథ్యంలో గత నెలలో వేలం నిర్వహించారు. తల పొడవును బట్టి గ్రేడ్ల వారీగా విభజించి పాట నిర్వహించారు. ఇందులో అత్యధికంగా రూ.20 లక్షల వరకూ పాట వెళ్లింది. ఈ వేలం పాట ను పాలకమండలి కూడా ఖరారు చేయడంతో కమిషనర్ అనుమతికి పంపించారు. తలనీలాలను పాట దారునికి అందచేయడానికి కమిషనర్ మంగళవారం సాయంత్రం ఆదేశాలు జారీ చేశారు. దీంతో తలనీలాలను పాటదారునికి అప్పగిస్తామని ఇన్చార్జి ఈఓ జగన్నాథరావు తెలిపారు. -
సరస్వతీనమస్తుభ్యం..
శ్రీసరస్వతీ అమ్మవారిగా పూజలందుకున్న శ్రీవనదుర్గ మూడో రోజు ఘనంగా శ్రావణమాస జాతర మహోత్సవాలు అన్నవరం : రత్నగిరిపై జరుగుతున్న శ్రీవనదుర్గ అమ్మవారి శ్రావణమాస జాతర మహోత్సవాల మూడో రోజు శ్రావణశుద్ధ ద్వాదశి శుక్రవారం శ్రీవనదుర్గ అమ్మవారు శ్రీసరస్వతీ దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చి పూజలందుకున్నారు. ఉదయం 9.30 గంటలకు శ్రీవనదుర్గ అమ్మవారి ఆలయంలో రుత్వీకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. నవగ్రహ జపాలు, లింగార్చన, శ్రీచక్రార్చన, శ్రీ పురుష సూక్త పారాయణలు, మూలమంత్ర జపాలు, సూర్యనమస్కారాలు, సప్తశతీ పారాయణలు, మూలమంత్ర జపాలు తదితర కార్యక్రమాలను నిర్వహించారు. సాయంత్రం అమ్మవారికి కుంకుమ పూజలు నిర్వహించారు. మూడోరోజు కూడా రుత్వీకులు చండీహోమం కొనసాగించారు. అనంతరం అమ్మవారికి నీరాజన మంత్రపుష్పాలు సమర్పించారు. ప్రసాదాల నివేదన చేసి భక్తులకు పంపిణీ చేశారు. వేదపండితులు, ప్రధానార్చకులు గాడేపల్లి వేంకట్రావు, స్పెషల్‌గ్రేడ్ వ్రతపురోహితులు నాగాభట్ల కామేశ్వరశర్మ, ముత్య సత్యనారాయణ, కల్యాణబ్రహ్మ ఛామర్తి కన్నబాబు, పురోహితులు పాలంకి పట్టాభి, ప్రసాద్, మూర్తి, శ్రీవనదుర్గ అర్చకులు గాడేపల్లి సత్యనారాయణ తదితరులు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కిటకిటలాడిన దుర్గాలయాలు శ్రావణ శుక్రవారం, వరలక్ష్మీ పూజ పర్వదినం సందర్భంగా రత్నగిరి దుర్గామాతలు శ్రీవనదుర్గ, శ్రీకనకదుర్గ అమ్మవారి ఆలయాలను పెద్దసంఖ్యలో భక్తులు దర్శించి పూజలు చేశారు. దుర్గాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. -
పట్టు తప్పుతున్న పాలన
రెగ్యులర్ ఈఓ లేక అనిశ్చితి చైర్మన్ రోహిత్ అనుభవరాహిత్యం ఇన్చార్జి ఈఓ మెతకతనం సత్యదేవుని ఆలయంలో రాజ్యమేలుతున్న వివాదాలు అన్నవరం (ప్రత్తిపాడు) : సత్యదేవుని ఆలయంలో పరిపాలన అధికారుల పట్టు జారుతోంది. ఈఓ కె.నాగేశ్వరరావును బదిలీ చేసి దాదాపు 40 రోజులైనా రెగ్యులర్ ఈఓను నియమించలేదు. ఇన్చార్జి ఈఓ ఈరంకి వేంకట జగన్నాథరావు మెతక వైఖరి, ఆయన హోదా తాత్కాలికమే కావడంతో సిబ్బంది ఆయనను ఖాతరు చేయడం లేదు. దీంతో ఆలయ పాలనలో అనిశ్చితి నెలకొంది. దేవస్థానంలో సుమారు 30 ఏళ్ల పైబడి ఉద్యోగం చేస్తున్న జగన్నాథరావు ఈఓలు మారినప్పుడు, కొత్త ఈఓ రావడానికి మధ్య కాలంలో ఇన్చార్జి ఈఓగా సుమారు ఏడు పర్యాయాలు చేశారు. ఆ సమయంలో అప్పటి చైర్మన్ ఐవీ రామ్‌కుమార్ అండదండలు ఉండడంతో పాలన సజావుగా సాగించేవారు. అనుభవ రాహిత్యంలో చైర్మన్ రోహిత్ : రామ్‌కుమార్ ఆకస్మికమృతితో చైర్మన్‌గా వచ్చిన ఆయన కుమారుడు ఐవీ రోహిత్ అనుభవ రాహిత్యం వల్ల దేవస్థానంలోని వ్యవహరాలు పూర్తిగా అర్ధం కావడం లేదు. ఎప్పుడు, ఎక్కడ, ఎలా వ్యవహరించాలో తెలియక చిక్కులు ఎదుర్కొంటున్నారు. దీనిని అలుసుగా తీసుకుని కొంతమంది ఉద్యోగులు చిన్న వివాదాన్ని కూడా పెద్దదిగా చిత్రీకరించి ఆయనను దెబ్బ తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. దీనికి తోడు ఐవీ రామ్‌కుమార్‌కు రాజకీయ నాయకులతో కొంత పరిచయం ఉండేది. రోహిత్‌కు అటువంటి పరిచయాలేవీ లేకపోవడం కూడా ఆయనకు ప్రతిబంధకంగా మారింది. వీటికితోడు పాత ఈఓ నాగేశ్వరరావు అనుసరించిన విధానాలే కరెక్ట్ అనే అభిప్రాయంతో ఉండడం కూడా సిబ్బందికి ఆయనకు మధ్య దూరం పెంచుతోంది. సిబ్బందిలో లోపించిన క్రమశిక్షణ: పాత ఈఓ నాగేశ్వరరావు అనుసరించిన విధానాలపై పలు విమర్శలున్నా సిబ్బందిలో భయముండేది. ఆ భయం వల్ల క్రమశిక్షణతో ఉండేవారు. కాని ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. సిబ్బందిలో కొంతమంది మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వెడితే బయోమెట్రిక్ అటెండెన్స్ సమయానికే మళ్లీ కొండమీదకు వస్తున్నారన్న విమర్శ వినిపిస్తోంది. ఫేస్బుక్, వాట్సాప్ రాజకీయం: భక్తులకు, సిబ్బందికి ఇబ్బందులు ఎదురైతే ఫొటోలు తీసి తనకు వాట్సఫ్లో పెట్టాలని పాత ఈఓ కే నాగేశ్వరరావు చెప్పేవారు. అయితే భక్తులు అలా వాట్సప్‌లో పెట్టినది తక్కువ. అయితే ప్రస్తుతం సిబ్బంది మాత్రం సీసీటీవీ పూటేజ్‌లను తిలకిస్తూ తమకు గిట్టని వారి గురించి ఆ సీసీటీవీ పూటేజ్‌లతో ఛైర్మన్, ఈఓ లకు వాట్సప్ ద్వారా ఫిర్యాదు చేస్తున్నారు. కొంతమంది ఫేస్బుక్లో కూడా పెడుతున్నారు. ఈ దృశ్యాల ఆధారంగా చర్యలు తీసుకోవడం కూడా వివాదాస్పదమవుతోంది. దీంతో సిబ్బంది వర్గాలుగా చీలిపోతున్నారు. ఇదే అదనుగా కొంతమంది తమ పబ్బం గడుపుకునేందుకు సిబ్బందిని రెచ్చగొడుతున్నారన్న విమర్శలు కూడా ఉన్నాయి. దీనికితోడు అంతర్గత బదిలీలు కూడా ఏకపక్షంగా జరుగుతున్నాయన్న అభిప్రాయం కలుగుతోంది. రెగ్యులర్ ఈఓ లేకపోతే మరంత ఇబ్బంది: రూ.వంద కోట్లు పైబడిన ఆదాయం కలిగిన అన్నవరం దేవస్థానానికి రెగ్యులర్ ఈఓను నియమించకుండా నెలల తరబడి కాలయాపన చేయడం కూడా సరి కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈఓగా సీనియర్ ఆర్జేసీ, గతంలో ఇక్కడ పనిచేసిన ఎం.రఘునా«ద్ నియామకం ఖరారైందన్న వార్త నెల రోజులుగా చక్కర్లు కొడుతున్నా ఆదేశాలు మాత్రం వెలువడలేదు. ఆయనను ఈఓగా నియమించవద్దని దేవస్థానం ఉద్యోగుల సంఘం పేరుతో ప్రభుత్వానికి ఫిర్యాదు చేయడం ఇక్కడ నెలకొన్న పరిస్థితికి తార్కాణం. అయితే ఆ ఫిర్యాదుతో తమకు సంబంధం లేదని ఆ నేతలు చెప్పడం గమనార్హం. దేవస్థానంలో నెలకొన్న పరిస్థితి ఇంకా ముదరకుండానే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. రఘునా«థ్ కాకపోతే మరో సమర్థుడైన అధికారిని ఈఓగా ఇక్కడ నియమించాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
ముగిసిన సత్యదేవుని జయంత్యుత్సవాలు
-పంచామృతాభిషేకం, ఆయుష్యహోమం -భక్తులకు పవిత్రాల పంపిణీ అన్నవరం (ప్రత్తిపాడు): రత్నగిరిపై గత మూడు రోజులుగా వైభవంగా జరుగుతున్న సత్యదేవుని 127వ ఆవిర్భావదినోత్సవాలు (జయంత్యుత్సవాలు) బుధవారం ముగిశాయి. స్వామివారి జన్మనక్షత్రం మఖ సందర్భంగా తెల్లవారుజామున 2 నుంచి 5 గంటల వరకూ స్వామి, అమ్మవార్ల మూలవిరాట్లకు పంచామృతాభిషేకం నిర్వహించారు. ఉదయం 9 నుంచి 11 గంటల వరకూ దర్బారు మండపంలో ఆయుష్యహోమం నిర్వహించారు. హోమం పూర్ణాహుతి కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, పాలకమండలి సభ్యుడు అవసరాల వీర్రాజు, ఇన్చార్జి ఈఓ జగన్నాథరావు పాల్గొన్నారు. కాగా సత్యదేవుని సన్నిధిలో భక్తులు, అర్చక, పురోహిత, సిబ్బంది వలన తెలిసీ తెలియక జరిగే అపచారాల నివృత్తికి గత మూడు రోజులుగా నిర్వహిస్తున్న పవిత్రోత్సవాలు కూడా బుధవారంతో ముగిశాయి. ఈ సందర్బంగా పవిత్రాలను (చేతులకు కట్టుకునే కంకణాల వంటివి) స్వామి సన్నిధిలో ఉంచి పూజలు చేసి, అనంతరం భక్తులకు పంపిణీ చేశారు. వేదపండితులు కపిలవాయి రామశాస్రి, ముష్టి కామశాస్త్రి, గొల్లపల్లి ఘనాపాఠి, యనమండ్ర శర్మ అవధాని, ప్రధానార్చకులు గాడేపల్లి వేంకట్రావు, కొండవీటి సత్యనారాయణ, స్పెషల్ గ్రేడ్ వ్రతపురోహితులు నాగాభట్ల కామేశ్వరశర్మ, ముత్య సత్యనారాయణ, కల్యాణబ్రహ్మ చామర్తి కన్నబాబు, తదితరులు కార్యక్రమాలను నిర్వహించారు. -
ఘనంగా సత్యదేవుని 127వ జయంత్యుత్సవం
స్వామివారి మూలవిరాట్‌కు పంచామృత అభిషేకం శాస్త్రోక్తంగా ఆయుష్యహోమం పూర్ణాహుతి ఆరుగురు వేదపండితులకు ఘన సత్కారం వైభవంగా స్వామివారి వెండి రథోత్సవం అన్నవరం(ప్రత్తిపాడు) : సత్యదేవుని 127వ ఆవిర్భావ దినోత్సవాన్ని (జయంత్యుత్సవాన్ని) శ్రావణశుద్ధ విదియ మంగళవారం రత్నగిరిపై ఘనంగా నిర్వహించారు. సత్యదేవుడు, అమ్మవార్ల మూలవిరాట్లకు పంచామృతాభిషేకం, ఆయుష్యహోమం పూర్ణాహుతి, పండితులకు ఘన సత్కారం, రథోత్సవం తదితర కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. పంచామృతాలతో స్వామికి అభిషేకం స్వామివారి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంగళవారం తెల్లవారుజామున రెండు గంటల నుంచి ఉదయం ఐదు గంటల వరకు సత్యదేవుడు, అమ్మవారు, ఈశ్వరుల మూలవరులకు పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఇన్చార్జి ఈఓ ఈరంకి వేంకట జగన్నాథరావు పాల్గొన్నారు. శాస్త్రోక్తంగా ఆయుష్యహోమం పూర్ణాహుతి దర్బారు మండపంలో నిర్వహిస్తున్న ఆయుష్యహోమం పూర్ణాహుతి కార్యక్రమం ఘనంగా జరిగింది. ఉదయం 11 గంటలకు పండితులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించగా ఇన్చార్జి ఈఓ జగన్నాథరావు, ఆలయ ఏఈఓ ఎంకేటీఎన్వీ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు శ్రీసూక్త, పురుషసూక్త జపాలు, నవావరణార్చన, సువాసినీ పూజలు, లింగాష్టకం తదితర కార్యక్రమాలు నిర్వహించారు. ఆరుగురు పండితులకు సత్కారం సత్యదేవుని ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వేదాలలో నిష్ణాతులైన ఆరుగురు పండితులను దేవస్థానం ఇన్చార్జి ఈఓ ఈరంకి జగన్నాథరావు సత్కరించారు. రాజమండ్రికి చెందిన మహామహోపాధ్యాయ విశ్వనాథ గోపాలకృష్ణశాస్త్రి, వేదపండితులు చిర్రావూరి శ్రీరామశర్మ, ఉప్పులూరి సత్యనారాయణ అవధాని, సింహాచలం దేవస్థానం వేదపండితులు కపిలవాయి వేంకటేశ్వర అవధాని, వడ్లమాని వేంకటేశ్వర అవధాని, పశ్చిమగోదావరి జిల్లా బోడపాడుకు చెందిన సత్యనారాయణ అవధాని లకు రూ.2500 చొప్పున పారితోషికం, పంచె కండువా, స్వామివారి ప్రసాదాలను బహూకరించి సత్కరించారు. వెండి రథంపై స్వామివారి ఊరేగింపు స్వామివారి ఆలయప్రాకారంలోని మాడావీధుల్లో స్వామి, అమ్మవార్ల ఊరేగింపు కార్యక్రమం మంగళవారం ఘనంగా జరిగింది. ఇన్చార్జి ఈఓ జగన్నాథరావు ఈ ఊరేగింపు ప్రారంభించారు. వేదపండితులు, అర్చకస్వాములు, పెద్దసంఖ్యలో విచ్చేసిన భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భక్తులు స్వామివారి రథాన్ని లాగేందకు పోటీపడ్డారు. నేడు స్వామివారి మూలవిరాట్‌కు పంచామృతాభిషేకం మఖ నక్షత్రం సందర్భంగా బుధవారం తెల్లవారుజామున స్వామి, అమ్మవార్లకు పంచామృతాభిషేకం నిర్వహిస్తారని పండితులు తెలిపారు. అదే విధంగా ఉదయం తొమ్మిది గంటలకు ఆయుష్యహోమం ప్రారంభించి 11 గంటలకు పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహిస్తారు. -
సత్యదేవుని జయంత్యుత్సవం ప్రారంభం
-ఆయుష్య హోమానికి శ్రీకారం -నేడు, రేపు మూలవిరాట్‌కు అభిషేకాలు అన్నవరం (ప్రత్తిపాడు): శ్రీసత్యదేవుని 127వ ఆవిర్భావ దినోత్సవాలు( జయంత్యోత్సవాలు) శ్రావణ శుద్ధ పాడ్యమి సోమవారం రత్నగిరిపై ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 9 గంటలకు ఆలయంలో అర్చకస్వాములు ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి ఆవిర్భావ దినోత్సవ పూజలను నిర్వహించే పండితులు, అర్చకస్వాములు, వంద మంది రుత్విక్కులకు దేవస్థానం ఛైర్మన్ ఐవీ రోహిత్, ఇన్‌ఛార్జి ఈఓ ఈరంకి వేంకట జగన్నాథరావు వరుణలు, దీక్షావస్త్రాలను బహూకరించారు. మధ్యాహ్నం మండపారాధన, కలశస్థాపన, శ్రీసూక్త, పురుషసూక్త జపాలు, నవావరణ అర్చన, సువాసినీ పూజలు, లింగాష్టకం తదితర కార్యక్రమాలు నిర్వహించారు. దేవస్థానం వేదపండితులు కపిలవాయి రామశాస్త్రి, ముష్టి కామశాస్త్రి, గొల్లపల్లి ఘనాపాఠీ, గొర్తి సుబ్రహ్మణ్య ఘనాపాఠీ, ప్రధానార్చకులు గాడేపల్లి వేంకట్రావు, కొండవీటి సత్యనారాయణ, స్పెషల్‌గ్రేడ్ వ్రతపురోహితులు నాగాభట్ల కామేశ్వరశర్మ, ముత్య సత్యనారాయణ, కల్యాణబ్రహ్మ ఛామర్తి కన్నబాబు, తదితరులు పాల్గొన్నారు. ఆవిర్భావ దిన వేడుకల్లో భాగంగా సత్యదేవుని ఆయుష్యహోమానికి పండితులు సోమవారం సాయంత్రం అంకురార్పణ చేశారు. మంత్రోచ్చరణల మధ్య కొయ్యల రాపిడితో హోమాగ్నిని వెలిగించి గుండంలో వేసి హోమాన్ని ప్రారంభించారు. హోమం పూర్ణాహుతి కార్యక్రమం బుధవారం జరుగుతుంది. మంగళవారం తెల్లవారుజామున రెండు గంటలకు స్వామి, అమ్మవారు, శంకరుల మూలవిరాట్ లకు పంచామృతాభిషేకం నిర్వహిస్తారు. అనంతరం స్వామి, అమ్మవార్లను స్వర్ణాభరణాలు, పట్టువస్త్రాలతో సర్వాంగసుందరంగా అలంకరించి పూజలు చేశాక దర్శనానికి భక్తులను అనుమతిస్తారు. మఖ న క్షత్రం సందర్భంగా బుధవారం తెల్లవారుజామున కూడా స్వామి, అమ్మవార్లకు పంచామృతాభిషేకం నిర్వహిస్తారు. -
నేటి నుంచి సత్యదేవుని ఆవిర్భావ వేడుకలు
అన్నవరం (ప్రత్తిపాడు) : సత్యదేవుని 127వ ఆవిర్భావ దినోత్సవాలకు రత్నగిరి ముస్తాబైంది. సోమవారం నుంచి బుధవారం వరకూ మూడు రోజుల పాటు ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని దేవస్థానం నిర్ణయించింది. ఉత్సవాలకు సోమవారం అంకురార్పణ చేస్తారు. ఈ సందర్భంగా రుత్విక్కులకు దీక్షావస్త్రాలు బహూకరిస్తారు. స్వామివారి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంగళవారం తెల్లవారుజామున రెండు గంటలకు స్వామి, అమ్మవారు, శంకరుల మూలవిరాట్లకు పంచామృతాభిషేకం నిర్వహిస్తారు. అదే రోజు ఉదయం తొమ్మిది గంటలకు స్వామివారి ఆయుష్య హోమానికి అంకురార్పణ చేస్తారు. ఈ ఏడాది కొత్తగా పవిత్రోత్సవాలను కూడా ప్రారంభించనున్నారు. స్వామివారికి వివిధ కూరగాయలు, సుగంధద్రవ్యాలతో వండిన పిండివంట ‘కాయం’ నివేదిస్తారు. స్వామివారి జన్మనక్షత్రం మఖ సందర్భంగా బుధవారం తెల్లవారుజామున కూడా స్వామి, అమ్మవార్లకు పంచామృతాభిషేకం నిర్వహిస్తారు. రెండో రోజు కూడా పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. అనంతరం చేతికి కట్టుకునే కంకణాలను భక్తులకు బహూకరిస్తారు. ఉత్సవాల సందర్భంగా దేవస్థానంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. శ్రీరామునికి ఘనంగా జన్మనక్షత్ర పూజలు రత్నగిరి క్షేత్రపాలకుడు శ్రీరామచంద్రమూర్తి జన్మనక్షత్రం పునర్వసు సందర్భంగా రామాలయంలో ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. రామచంద్రమూర్తి పట్టాభిషేక మహోత్సవం కూడా ఘనంగా నిర్వహించారు. కల్యాణ వేదికపై సూర్యనమస్కారాలు ప్రతి ఆదివారం రత్నగిరిపై సత్యదేవుని కల్యాణ వేదిక మీద నిర్వహిస్తున్న సూర్య నమస్కారాలు ఈ వారం కూడా కొనసాగాయి. ఆకొండి కృష్ణ, రేపాక రామదాసు, తదితరులు ఈ కార్యక్రమం నిర్వహించారు. -
అన్నారం టు అమెరికా
లక్ష డాలర్ల వార్షిక వేతనంతో కొలువుదీరిన తెలుగు యువకుడు సృజన్ రెడ్డి సక్సెస్ అబ్రాడ్ అమెరికాలో ఉన్నత విద్య అవకాశం లభించడం ఎంతో కష్టం. సుదీర్ఘ నిరీక్షణ.. అనేక నిబంధనలు.. టెస్టుల్లో స్కోర్స్. ఆ యువకుడు వాటన్నింటినీ అధిగమించాడు. అమెరికా యూనివర్సిటీలో స్కాలర్‌షిప్‌తో అడ్మిషన్ సొంతం చేసుకున్నాడు. ఎంఎస్ పూర్తి చేశాక అక్కడే ప్రముఖ రిటైల్ సంస్థ ‘టార్గెట్’లో లక్ష డాలర్ల వార్షిక వేతనంతో ఉద్యోగం సంపాదించుకున్నాడు. సాధారణ వ్యవసాయ కుటుంబం నుంచి యూఎస్‌లో ఉన్నత విద్య కోసం అడుగుపెట్టి.. అక్కడే సొంతగా ఉద్యోగాన్వేషణ సాగించి.. విజయం సాధించిన తెలుగు యువకుడు సృజన్ రెడ్డి సక్సెస్ స్టోరీ. మా స్వస్థలం కామారెడ్డి జిల్లాలోని అన్నారం. మాకున్న కొద్దిపాటి భూమిలో నాన్న దేవేందర్‌రెడ్డి వ్యవసాయం చేస్తుంటారు. అమ్మ జ్యోత్స్న గృహిణి. పదో తరగతి వరకు సిద్దిపేటలోనే చదువుకున్నా. తర్వాత హైదరాబాద్‌కు వచ్చి ఇంటర్మీడియెట్ పూర్తయ్యాక ఎంసెట్ ర్యాంకుతో హైదరాబాద్‌లోనే ఓ సాధారణ ఇంజనీరింగ్ కాలేజ్‌లో బీటెక్ పూర్తి చేశా. నా చదువు పరంగా అమ్మానాన్న ఎంతో సహకరించారు. బీటెక్ నుంచే యూఎస్ కల బీటెక్‌లో చేరినప్పటి నుంచే ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లాలని కలలు కన్నా. బాగా చదువుకొని అక్కడే స్థిరపడాలని లక్ష్యంగా పెట్టుకున్నా. ఆ దిశగా ముందస్తుగానే జీఆర్ఈకి ప్రిపరేషన్ ప్రారంభించా. దాంతో మంచి స్కోర్ లభించింది. అమెరికాలోని యూనివర్సిటీలకు ఎంఎస్ కంప్యూటర్ సైన్స్ కోర్సుకు దరఖాస్తు చేశా. యూనివర్సిటీ ఆఫ్ హోస్టన్, నార్త్‌వెస్ట్ మిస్సోరి స్టేట్ యూనివర్సిటీ, క్లీవ్‌ల్యాండ్ స్టేట్ యూనివర్సిటీల్లో ప్రవేశం ఖరారైంది. స్కాలర్‌షిప్‌తో అడుగు యూనివర్సిటీ ఆఫ్ హోస్టన్ 60 శాతం స్కాలర్‌షిప్‌తో ఆఫర్ ఇవ్వడంతో అందులో చేరాను. ఈ విశ్వవిద్యాలయం అకడమిక్ ట్రాక్ రికార్డ్ బాగున్న విద్యార్థులకు స్కాలర్షిప్ను మంజూరు చేస్తుంది. నా స్కోర్స్‌ను పరిగణనలోకి తీసుకొని ఫీజులో 60 శాతం స్కాలర్షిప్ అందించింది. 2013 ఫాల్ సెషన్లో ఎంఎస్–కంప్యూటర్ సైన్స్‌లో చేరాను. ఇబ్బందులు సహజం అమెరికాలోని ఏ యూనివర్సిటీ క్యాంపస్‌ను చూసినా.. ప్రపంచంలోని భిన్న దేశాలకు, విభిన్న సంస్కృతులకు చెందిన విద్యార్థులు కనిపిస్తారు. కాబట్టి ప్రారంభంలో ఎవరికైనా అక్కడి పరిస్థితుల్లో ఇమిడిపోయే విషయంలో కొంత ఇబ్బంది ఎదురవడం సహజమే. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే.. కొత్త ప్రదేశం.. మనవాళ్లతో కలిసి ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఇండియన్ స్టూడెంట్స్‌తోనే ఇంటరాక్షన్‌కు ఎక్కువ మంది ప్రయత్నిస్తారు. ఇది సరికాదు. ఇతర దేశాలకు చెందిన వారితోనూ మాట్లాడాలి. అలాగే క్యాంపస్‌కే పరిమితం కాకుండా వీలైన సమయంలో బాహ్య ప్రపంచంలో అడుగుపెట్టి స్థానిక సంస్కృతి, జీవనశైలిని అవగాహన చేసుకునే ప్రయత్నం చేయాలి. తద్వారా భవిష్యత్‌లోæజాబ్ మార్కెట్ కోణంలో వాస్తవంగా పరిస్థితులపై అవగాహన వస్తుంది. ఉద్యోగాన్వేషణ.. స్వయంగానే ఎంఎస్ పూర్తవుతూనే ఉద్యోగాన్వేషణలో పడ్డాను. వాస్తవానికి క్యాంపస్ రిక్రూట్మెంట్ డ్రైవ్స్ జరుగుతాయి. కానీ అక్కడికి వచ్చే కంపెనీలు స్థానికుల (అమెరికన్ల)కే ప్రాధాన్యమిస్తాయి. ఇతర దేశాల విద్యార్థులకు క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో జాబ్ లభించడం చాలా అరుదు. దీంతో నేను కోర్సు చివరి సెమిస్టర్ నుంచే ఉద్యోగం కోసం స్వీయ అన్వేషణ సాగించాను. ఇందుకోసం ప్రొఫెషనల్ నెట్వర్కింగ్ సైట్ లింక్డిన్, స్థానిక కన్సల్టెన్సీల ద్వారా ఉద్యోగ ప్రయత్నం చేశాను. ‘టార్గెట్’లో కొలువు.. లక్ష డాలర్ల వేతనం కన్సల్టింగ్ సంస్థల ద్వారా అమెరికాలోని ప్రముఖ కామర్స్ అండ్ రిటైల్ సంస్థ టార్గెట్ కార్పొరేషన్లో సీనియర్ డేటా ఇంజనీర్‌గా 2016 జనవరిలో ఉద్యోగం లభించింది. ప్రస్తుతం లక్ష డాలర్ల వార్షిక వేతనంతోపాటు పెయిడ్ లీవ్స్, హెల్త్ ఇన్సూరెన్స్ వంటి అదనపు భత్యాలు అందుతున్నాయి.. హడూప్, డేటాసైన్స్, క్లౌడ్ కంప్యూటింగ్, ఆటోమేషన్‌కు సంబంధించిన విధులు నిర్వహిస్తున్నాను. తెలంగాణలోని ఓ చిన్న గ్రామం నుంచి అమెరికాలో అడుగుపెట్టడం.. అంతేకాకుండా ఫార్చూన్–500 జాబితాలోని కంపెనీలో కొలువు సొంతం చేసుకోవడం ఎంతో సంతోషాన్ని కలిగించిన సంఘటనలు. డేటాసైన్స్‌లో ఎంబీఏ ప్రస్తుతం సీనియర్ డేటా ఇంజనీర్‌గా ఉద్యోగం చేస్తున్నప్పటికీ.. ఈ విభాగంలోనే ఉన్నత హోదాలు అందుకునేందుకు మార్గం కల్పించే డేటా సైన్స్‌లో ఎంబీఏ చదవాలనేది నా తదుపరి లక్ష్యం. ఇప్పుడు కంపెనీ లన్నీ డేటా అనలిటిక్స్ ఆధారంగానే కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. ఉద్యోగులకు కూడా ఆ నైపుణ్యాలు ఉండాలని కోరుకుంటున్నాయి. ముందస్తు ప్రణాళికతో ఉన్నత విద్య పరంగా అమెరికాను లక్ష్యంగా చేసుకున్న విద్యార్థులు.. ముందస్తు ప్రణాళికతో జాగ్రత్తగా వ్యవహరించాలి. యూనివర్సిటీల అన్వేషణ పరంగా కేవలం కన్సల్టెన్సీలపైనే ఆధారపడకుండా.. స్వయంగా తాము లక్ష్యంగా నిర్దేశించుకున్న కోర్సు, యూనివర్సిటీల గురించి అన్వేషణ సాగించాలి. వాటి అర్హత ప్రమాణాలను తెలుసుకుని వాటిని అందుకునేలా బీటెక్ నుంచే కృషి చేయాలి. అప్డేట్ అయితేనే అమెరికాలో విద్యా విధానం బాగుంటుందని, కరిక్యులం పరంగా ఎప్పటికప్పుడు మార్పులు జరుగుతాయని చాలామంది విద్యార్థులు భావిస్తారు. అయితే అమెరికాలోనూ కెరీర్ పరంగా రాణించేందుకు సెల్ఫ్ అప్డేట్ ఎంతో అవసరం. అంతేకాకుండా ప్రొఫెసర్లు, సీనియర్లతో నిరంతరం సంప్రదిస్తుండాలి. ఫలితంగా స్థానికంగా ఉన్న ఉద్యోగావకాశాల గురించి, వాటిని అందుకోవడానికి గల మార్గాల గురించి తెలుస్తుంది. అడుగుపెట్టినప్పటి నుంచి వ్యక్తిగతంగా, అకడమిక్‌గా, సామాజికంగా వినూత్న దృక్పథంతో వ్యవహరిస్తే కోర్సు పూర్తయ్యాక ఇక్కడే కొలువుదీరే అవకాశాలు ఎన్నో!! -
ప్చ్.. కరుణ చూపలేదు!
- రూ.200 వ్రతాల భక్తులను కరుణించని పాలక మండలి - క్యూ లైన్‌పై షెల్టర్ నిర్ణయం వాయిదా అన్నవరం (ప్రత్తిపాడు) : సత్యదేవుని సన్నిధిలో రూ.200 వ్రతాల భక్తులపై అన్నవరం దేవస్థానం పాలక మండలి కరుణ చూపలేదు. క్యూలో నిలబడే ఈ వ్రతాల భక్తులకు నీడ కల్పించేందుకుగాను షెల్టర్ నిర్మించేందుకు ఇంజినీరింగ్ అధికారులు చేసిన ప్రతిపాదనలను మరో నెల వాయిదా వేసింది. ప్రకాష్ సదన్ సత్రంలోని సమావేశ మందిరంలో చైర్మన్ ఐవీ రోహిత్ అధ్యక్షతన సోమవారం మధ్యాహ్నం పాలక మండలి సమావేశం జరిగింది. సభ్యులతోపాటు ప్రధానార్చకుడు కొండవీటి సత్యనారాయణ, ఇన్చార్జి ఈఓ ఈరంకి జగన్నాథరావు తదితరులు పాల్గొన్నారు. సమావేశానికి ముందు సత్యగిరిపై సభ్యులు మొక్కలు నాటారు. సమావేశంలో పలు తీర్మానాలను ఆమోదించారు. ముఖ్య తీర్మానాలివీ.. - దేవస్థానంలో నామినేషన్ పద్ధతిపై నామమాత్రపు అద్దెకు ప్రైవేటు వ్యక్తులు నిర్వహిస్తున్న 14 కాఫీ, టీ విక్రయ పాయింట్లను ఇకపై టెండర్ కం బహిరంగ వేలం ద్వారా లీజుకు ఇవ్వాలి. - సత్యదేవుని ప్రసాదం తయారీకి రూ.49 లక్షలతో కొత్త ఇత్తడి కళాయిలు కొనుగోలు చేయాలి. - యంత్రాలయంలో యంత్రం వద్ద శాస్త్ర విరుద్ధంగా పాత ఈఓ కె.నాగేశ్వరరావు ఏర్పాటు చేసిన విద్యుద్దీపాన్ని తొలగించి, దానిస్థానంలో నూనె దీపాలు ఏర్పాటు చేయాలి. - దేవస్థానం స్టాఫ్ క్వార్టర్లకు పెయింటింగ్, పశ్చిమ రాజగోపురం వద్ద ఫ్లోరింగ్ పనులు చేయాలి. - స్వామివారి నిత్యకల్యాణం మండపానికి రూ.5 లక్షలతో రంగులు వేయాలి. - రెండు టన్నుల వ్యర్థాలతో బయోగ్యాస్ తయారీకి ప్రతిపాదనలు రూపొందించాలి. - రూ.1,500, రూ.2 వేల వ్రత మండపాల్లో రూ.4.15 లక్షలతో అగ్నిమాపక యంత్రాలు ఏర్పాటు చేయాలి. - హరిహరసదన్ సత్రం ముందు వివాహాలు చేసుకునేందుకు ఉపయోగిస్తున్న ఖాళీ స్థలాన్ని ఇకపై అద్దెకు ఇవ్వకూడదు. షెల్టర్ నిర్మించేదెప్పుడో! దేవస్థానంలో జరిగే వ్రతాల్లో సగానికి పైగా రూ.200 వ్రతాలే ఉంటాయి. వీటిని ఆచరించేవారిలో ఎక్కువమంది పేద, మధ్యతరగతివారే. గత ఏడాది రూ.200 వ్రతాలే మూడు లక్షలు జరిగాయి. ఇన్ని వ్రతాలు జరుగుతున్నా వీటి నిర్వహణకు మూడు మండపాలే ఉన్నాయి. బ్యాచ్‌కు 200 మంది మాత్రమే ఈ మండపాల్లో వ్రతాలాచరించే వీలుంటుంది. ఇందుకోసం భక్తులు గంటల తరబడి క్యూలో నిలబడాల్సి ఉంటోంది. ఎండొచ్చినా, వానొచ్చినా క్యూలో తడవాల్సిందే. వారి కష్టాలపై ‘వ్రతాలు రూ.200.. ఇబ్బందులు వేయింతలు’ శీర్షికన గత నెల 27వ తేదీన సాక్షి దినపత్రికలో వార్త ప్రచురితమైన విషయం విదితమే. దీనిపై స్పందించిన అధికారులు.. రూ.200 వ్రతాలాచరించే భక్తులకు ఎండ, వాన నుంచి రక్షణ కల్పించేలా షెల్టర్ నిర్మించేందుకు సోమవారం జరిగిన పాలక మండలి సమావేశంలో రూ.10 లక్షలతో ప్రతిపాదనలు సమర్పించారు. అయితే దీనిని పాలక మండలి వచ్చే సమావేశానికి వాయిదా వేసింది. ఈ షెల్టర్ నిర్మాణానికి వెంటనే టెండర్ పిలిచినా పనులు ప్రారంభించడానికి కనీసం నెల పడుతుంది. పని పూర్తి కావడానికి మరో నెల పడుతుందని అధికారులు చెబుతున్నారు. ఈ అంశాన్ని పాలక మండలి మరో నెల వాయిదా వేయడంతో ఇప్పట్లో ఈ పనులు జరిగే అవకాశాలు లేవు. ఫలితంగా రూ.200 వ్రతాల భక్తుల ఇబ్బందులు కూడా ఇప్పుడప్పుడే తొలగే పరిస్థితి కానరావడంలేదు. పాలక మండలి సభ్యులు ఈ వ్రత మండపాలను ఈ నెల 25న పరిశీలించి షెల్టర్ అవసరమా, కాదా అనే దానిపై ఒక నిర్ధారణకు వస్తామన్నారని, అందువల్లనే ఈ అంశాన్ని వాయిదా వేశామని ఈఓ జగన్నాథరావు ‘సాక్షి’కి తెలిపారు. -
మహాప్రసాదం
సత్తెన్న ప్రసాదానికి పెరిగిన డిమాండ్ ‘లోవ ’ భక్తుల కొనుగోళ్లు తొలిపాంచా, నమూనా ఆలయం కౌంటర్లలో 65 వేల ప్రసాదం ప్యాకెట్ల విక్రయం రూ.9.75 లక్షల ఆదాయం అన్నవరం: ఆషా«ఢమాసం.. ఆదివారం.. తుని రూరలె మండలంలోని లోవ తలుపులమ్మతల్లి దర్శనానికి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. వారి తిరుగుప్రయాణంలో భారీ ఎత్తున సత్యదేవుని ప్రసాదాలు కొనుగోలు చేశారు. కొండదిగువన తొలిపాంచా వద్ద, బైపాస్ రోడ్డులోని సత్యదేవుని నమూనా ఆలయం వద్ద గల ప్రసాదం విక్రయస్టాల్స్ వద్ద ఆదివారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకూ భక్తుల రద్దీ కొనసాగింది. రాత్రి ఏడు గంటల సమయానికి సుమారు 65 వేల ప్రసాదం ప్యాకెట్లు (125 గ్రాములు రూ.15) విక్రయించగా రూ.9.75 లక్షల ఆదాయం సమకూరింది. ఏటా ఆషాఢమాసంలో వచ్చే ఆదివారాలలో భారీ సంఖ్యలో లోవ తలుపులమ్మ తల్లి దేవస్థానానికి వెళ్లే భక్తులు తిరుగు ప్రయాణంలో సత్యదేవుని ప్రసాదం కొనుగోలు చేయడం ఆనవాయితీగా వస్తోంది. దాన్ని దృష్టిలో ఉంచుకొనే అన్నవరం దేవస్థానం విస్తృతంగా ఏర్పాట్లు చేసింది. కొండదిగువన తొలిపాంచా వద్ద, బైపాస్ రోడ్డులోని నమూనా ఆలయం వద్ద గల ప్రసాదం స్టాల్స్ వద్ద అదనపు కౌంటర్లను ఏర్పాటు చేసింది. సుమారు 70 వేల ప్రసాదం ప్యాకెట్లను సిద్ధం చేసింది. మధ్యాహ్నం నుంచి రాత్రి ఏడుగంటల వరకూ సుమారు 65 వేల ప్యాకెట్లను విక్రయించినట్టు అధికారులు తెలిపారు. మిగిలిన ఐదువేల ప్రసాదం ప్యాకెట్లు కూడా రాత్రి విక్రయించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. దేవస్థానం ఇన్‌ఛార్జి ఈఓ ఈరంకి వేంకట జగన్నాథరావు ఈ ప్రసాదం స్టాల్స్‌ను సందర్శించి అక్కడ సిబ్బందికి తగు సూచనలు ఇచ్చారు. ఏఈఓ సాయిబాబా, ఆలయ సూపరిండెంట్ బలువు సత్యశ్రీనివాస్, ఇనస్పెక్టర్ పోల్నాటి లక్ష్మీనారాయణ తదితరులు స్టాల్స్ వద్ద విక్రయాలు పర్యవేక్షించారు. -
సత్యదేవునికి పన్ను పోటు!
- అన్నవరం దేవస్థానంపై రూ.5 కోట్ల వరకూ జీఎస్టీ? - రత్నగిరీశుని వార్షికాదాయం రూ.125 కోట్లు - రూ.20 లక్షలు దాటితే తప్పని పన్నుభారం - ఇంకా అందని ఆదేశాలు అన్నవరం (ప్రత్తిపాడు) : ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరంలోని శ్రీ వీర వేంకట సత్యనారాయణస్వామివారి దేవస్థానానికి వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) పోటు తగలనుంది. నూతన పన్ను విధానం వలన దేవస్థానంపై రూ.5 కోట్ల వరకూ భారం పడే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఆదాయ పరంగా రాష్ట్రంలో తిరుమల - తిరుపతి దేవస్థానం, శ్రీశైలం, విజయవాడ కనకదుర్గమ్మ దేవస్థానాల తరువాతి స్థానంలో అన్నవరం ఉంది. గడచిన ఆర్థిక సంవత్సరంలో సత్యదేవుని వార్షికాదాయం రూ.125 కోట్లు దాటింది. ఈ నేపథ్యంలో నూతన పన్ను విధాన ప్రభావం అన్నవరం దేవస్థానంపై అధికంగానే ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. పూర్తిస్థాయిలో ఇంకా నిర్ధారణ జరగకపోయినా దేవస్థానంలో వివిధ సేవల టిక్కెట్ల విక్రయాలు, ప్రసాదం తయారీకి ముడిసరుకుల కొనుగోళ్లు, అన్నదానం పథకంలో ఆహార పదార్థాల తయారీకి కొనుగోలు చేసే ముడి సరుకులవంటి వాటిపై జీఎస్టీ పడే అవకాశం ఉంది. ఇది ఎంతమేరకు అనేదానిపై ఇంకా స్పష్టత రానందున ఇప్పుడే దీనిపై ఏమీ చెప్పలేమని దేవస్థానం అధికారులు అంటున్నారు. రూ.20 లక్షల వార్షికాదాయం మించితే.. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం రూ.20 లక్షల వార్షికాదాయం దాటిన దేవస్థానాలన్నీ జీఎస్టీ పరిధిలోకి వస్తాయి. దాని ప్రకారం జిల్లాలోని తలుపులమ్మ లోవ దేవస్థానం సహా సుమారు 50 దేవస్థానాలు జీఎస్టీ పరిధిలోకి వస్తున్నాయి. వీటన్నింటికంటే అన్నవరం దేవస్థానం వార్షికాదాయం అధికం. కాబట్టి ఈ దేవస్థానమే ఎక్కువ జీఎస్టీ చెల్లించాల్సిన పరిస్థితి ఉందని భావిస్తున్నారు. ఏటా రూ.26 కోట్లతో ముడిసరుకుల కొనుగోళ్లు అన్నవరం దేవస్థానంలో ఏటా రూ.26 కోట్లతో వివిధ ముడిసరుకులు కొనుగోలు చేస్తున్నారు. వీటిలో రూ.23 కోట్లను ప్రసాదం తయారీలో వాడే గోధుమలు, పంచదార, నెయ్యి, యాలకులు, గ్యాస్, వ్రతాల్లో వాడే నూనె, ఇతర పూజాసామగ్రి, వివిధ సత్రాల్లో వాడే వస్తువుల కొనుగోళ్లకు వెచ్చిస్తున్నారు. అన్నదానం పథకంలో ప్రత్యేకంగా రూ.3 కోట్లతో బియ్యం, పప్పులు, కూరగాయలు, నూనె తదితర వస్తువులు కొనుగోలు చేస్తున్నారు. వీటిలో కొన్నింటిపై ప్రస్తుతం వ్యాట్, కొన్నింటిపై సెంట్రల్ ఎక్సైజ్ ట్యాక్స్ విధిస్తున్నారు. నూతన విధానం ప్రకారం ఒకే పన్ను కావడంతో ఇకనుంచి జీఎస్టీ విధించనున్నారు. తలనీలాల విక్రయంపై కూడా.. దేవస్థానంలో భక్తులు సమర్పించిన తలనీలాల విక్రయం మీద కూడా జీఎస్టీ విధించే అవకాశం ఉంది. ఏటా ఇక్కడి తలనీలాలను బహిరంగ వేలం ద్వారా దేవస్థానం విక్రయిస్తుంది. తద్వారా రూ.కోటి నుంచి రూ.2 కోట్ల వరకూ ఆదాయం వస్తోంది. జీఎస్టీపై ఎటువంటి ఆదేశాలూ రాలేదు దేవస్థానంలో కొనుగోళ్లు, అమ్మకాలపై జీఎస్టీ విధింపు అంశానికి సంబంధించి ఉన్నతాధికారుల నుంచి ఇంతవరకూ ఎటువంటి ఆదేశాలూ రాలేదు. జీఎస్టీ ఎంతమేరకు ఉంటుంది? దేనిపై ఉంటుందనే దానిపై క్లారిటీ ఇవ్వాలని ఆడిటర్లను అడిగాం. ప్రస్తుతానికి దేవస్థానంలో యథాతథ స్థితి కొనసాగుతోంది. జీఎస్టీ అమలుపై ఉన్నతాధికారులు సర్క్యులర్ పంపిస్తే దాని ప్రకారం వ్యవహరిస్తాం. - ఈరంకి వేంకట జగన్నాథరావు, ఇన్చార్జి ఈఓ, అన్నవరం దేవస్థానం -
కోటీశ్వరుడు ... సత్య గిరీశుడు
- హుండీలు తెరిస్తే చాలు...‘రూ కోటి ’ ఆదాయం వచ్చినట్టే ! - వరుసగా మూడు నెలలు రూ.కోటి దాటిన సత్యదేవుని హుండీ ఆదాయం - జూన్ నెల హుండీ ఆదాయం రూ.1,23,71,212 అన్నవరం: (ప్రత్తిపాడు): రత్నగిరివాసుడు శ్రీ సత్యదేవుని ఆలయానికి ఆదాయం గణనీయంగా వస్తోంది. అందులో హుండీల ద్వారా వచ్చే ఆదాయమే ప్రతి నెలా రూ.కోటికి పైగా ఉంటోంది. సంవత్సరంలో ఒకటి, రెండు నెలలు మినహా ప్రతి నెలా హుండీ ఆదాయం రూ.కోటి దాటుతోంది. జూన్ నెలకుగాను శుక్రవారం సత్యదేవుని హుండీలను తెరిచి లెక్కించగా రూ.1,23,71,212 ఆదాయం సమకూరింది. ఏప్రిల్ నెలకు సంబంధించి హుండీలను మే రెండో తేదీన (32 రోజులకు) తెరిచి లెక్కించగా రూ.1.08 కోట్లు ఆదాయం వచ్చింది. మే నెలకు సంబంధించి అదే నెల 29న లెక్కించగా రూ.1.25 కోట్లు ఆదాయం వచ్చింది. వేసవి సెలవులు...వివాహాల సీజన్‌తో... ఏప్రిల్, మే, జూన్ నెలల్లో స్వామి సన్నిధిన వివాహాలు అధికంగా జరగడం, వేసవి సెలవులు, సత్యదేవుని దివ్యకల్యాణ మహోత్సవాలు తదితర కారణాలతో స్వామివారి ఆలయానికి భారీగా భక్తులు తరలి వచ్చారు. దీంతో స్వామివారికి ఆదాయం భారీగా వచ్చింది. దాంతోపాటే హుండీల్లో కూడా భక్తులు దండిగా కానుకలు సమర్పించడంతో ఆదాయం రూ.కోటి దాటిందని అధికారులు విశ్లేషిస్తున్నారు. హుండీ ఆదాయంలో నగదు 1.15 కోట్లు, చిల్లర రూ.8.15 లక్షలు... శుక్రవారం స్వామివారి హుండీలను తెరిచి లెక్కించగా రూ.1,23,71,212 ఆదాయం వచ్చిందని ఇన్‌ఛార్జి ఈఓ ఈరంకి జగన్నాధరావు తెలిపారు. ఇందులో రూ.1,15,55,412 నగదు కాగా, రూ.8,15,800 చిల్లర నాణేలు. వీటితోపాటు బంగారం 65 గ్రాములు, వెండి 870 గ్రాములు లభించాయని తెలిపారు. అమెరికా డాలర్లు 719, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దీరామ్స్ 205 , సింగపూర్ డాలర్లు రెండు, మలేషియా రిమ్స్ మూడు. మరో నాలుగు దేశాల కరెన్సీలు లభించాయని తెలిపారు. ఇంకా హుండీలలో రద్దయిన నోట్లు... కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన రూ.500, రూ.1000 నోట్లను భక్తులు ఇంకా హుండీల్లో వేస్తూనే ఉన్నారు. శుక్రవారం స్వామివారి హుండీలను తెరవగా రూ.1,04,000 విలువైన పాత నోట్లు లభించాయి. హుండీలో రూ.500 నకిలీ నోటు... అప్పుడే కొత్త రూ.500 నకిలీ నోట్లు తయారయ్యాయి. ఇందుకు సాక్ష్యమే ఇది. ఈ నకిలీ నోటు ఒకటి శుక్రవారం దేవస్థానం హుండీలలో రాగా లెక్కింపులో సిబ్బంది గుర్తించి చించేశారు. శుక్రవారం జరిగిన హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని పాలకమండలి సభ్యులు పర్వత రాజబాబు, యడ్ల భేతాళుడు, కొత్త వేంకటేశ్వరరావు (కొండబాబు), రొబ్బి విజయశేఖర్, శింగిలిదేవి సత్తిరాజు, యనమల రాజేశ్వరరావు పర్యవేక్షించారు. దేవస్థానం సిబ్బంది, వ్రతపురోహితులు, నాయీ బ్రాహ్మణులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
ఇన్చార్జి ఈఓగా జగన్నాథరావు
- నేడు అన్నవరం దేవస్థానం బాధ్యతలు చేపట్టనున్న ఏసీ - ప్రిన్సిపల్ సెక్రటరీ విదేశీ పర్యటనతో రెగ్యులర్ ఈఓ నియామకంలో జాప్యం అన్నవరం (ప్రత్తిపాడు) : ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వేంకట సత్యనారాయణస్వామి దేవస్థానం ఇన్చార్జి కార్యనిర్వహణాధికారి(ఫుల్ అడిషనల్ చార్జి)గా అసిస్టెంట్ కమిషనర్ ఈరంకి వేంకట జగన్నాథరావు నియమితులయ్యారు. ఈమేరకు దేవాదాయ శాఖ కమిషనర్ కార్యాలయం శుక్రవారం సాయంత్రం ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుత ఈఓ, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ కె.నాగేశ్వరరావును విజయనగరం జిల్లా జాయింట్ కలెక్టర్-2గా ఈ నెల 8న ప్రభుత్వం బదిలీ చేసిన విషయం తెలిసిందే. ఆయన స్థానంలో వచ్చేందుకు పలువురు ప్రయత్నాలు చేశారు. అవి ఇంతవరకూ ఒక కొలిక్కి రాలేదు. దీనికితోడు దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జేఎస్వీ ప్రసాద్ రెండు వారాల పాటు సెలవు పెట్టి శుక్రవారం విదేశాలకు వెళ్లారు. ఆయన ఈ నెల 30న తిరిగి వస్తారు. ఆ తరువాతే ఈఓ నియామకంపై ఒక నిర్ణయం తీసుకుంటారని విశ్వసనీయవర్గాల సమాచారం. ఈలోగా దేవస్థానంలో పాలన వ్యవహారాలు చూసేందుకు, బదిలీ అయిన ఈఓ నాగేశ్వరరావును రిలీవ్ చేసేందుకు ఇన్చార్జిగా ఈరంకిని నియమించారు. ఆయనను ఆ ఇన్చార్జి ఈఓగా నియమించే అవకాశం ఉందని ‘సాక్షి’ ముందే చెప్పింది. బదిలీ అయిన ఈఓ నాగేశ్వరరావు నుంచి జగన్నాథరావు శనివారం ఉదయం బాధ్యతలు స్వీకరించనున్నారు. విజయనగరం జేసీ-2గా సోమ లేదా మంగళవారాల్లో తాను బాధ్యతలు స్వీకరిస్తానని నాగేశ్వరరావు శుక్రవారం సాయంత్రం ‘సాక్షి’కి తెలిపారు. ఈరంకికి ఈ బాధ్యతలు ఏడోసారి.. గత ఆరేళ్లుగా ఏసీ జగన్నాథరావు ఆరుసార్లు అన్నవరం దేవస్థానం ఇన్చార్జి ఈఓగా పని చేశారు. ఈసారి కూడా కలుపుకుంటే అది ఏడోసారి అవుతుంది. 2010లో అప్పటి ఈఓ కె.రామచంద్రమోహన్ అమెరికాలో సత్యదేవుని వ్రతాల నిర్వహణకు వెళ్లినపుడు ఈరంకి పది రోజులు ఇన్చార్జి ఈఓగా పని చేశారు. రామచంద్రమోహన్ తరువాత 2012లో స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ ప్రసాదం వేంకటేశ్వర్లు ఈఓగా నియమితులయ్యారు. ఆయన బాధ్యతలు తీసుకోవడానికి 15 రోజులు పట్టడంతో అప్పుడు కూడా జగన్నాథరావే ఇన్చార్జి ఈఓగా పని చేశారు. వేంకటేశ్వర్లు 2013లో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లినపుడు 12 రోజులు ఇన్చార్జి ఈఓగా పని చేశారు. వేంకటేశ్వర్లు 2013 మే నెలలో 15 రోజులు సెలవు పెట్టినపుడు కూడా ఇన్చార్జి ఈఓగా పని చేశారు. 2014 ఆగస్టులో వేంకటేశ్వర్లు వ్యవసాయ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పీఏగా బదిలీ కాగా, ఆయన స్థానంలో 2015 జూలై రెండో తేదీన కె.నాగేశ్వరరావు ఈఓగా వచ్చే వరకూ ఈరంకి ఇన్చార్జి ఈఓగా పని చేశారు. ఇప్పుడు తిరిగి ఇన్చార్జి ఈఓగా శనివారం బాధ్యతలు స్వీకరించనున్నారు. -
‘స్వామి సొమ్ముతో షో’ వద్దు
- పునఃపరిశీలించాలి - అన్నవరం దేవస్థానం నూతన పాలక మండలి తీర్మానం - రూ.55 లక్షలతో స్వామివారికి కొత్త రథం తయారీకి పచ్చజెండా - సబ్ క్యాంటీన్ వద్ద భక్తులకు ఉచితంగా పులిహోర, దద్ధోజనం పంపిణీ - గోల్డ్‌బాండ్ స్కీమ్‌లో 2.860 కిలోల బంగారం డిపాజిట్ అన్నవరం (ప్రత్తిపాడు) : సత్యదేవుని సొమ్ము రూ.2.96 కోట్లతో సౌండ్ అండ్ లైట్ షో ఏర్పాటు చేయాలని తీసుకున్న నిర్ణయాన్ని దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు పునఃపరిశీలించాలని కోరుతూ అన్నవరం దేవస్థానం పాలక మండలి తీర్మానించింది. దేవస్థానం నూతన పాలక మండలి తొలి సమావేశం చైర్మన్ ఐవీ రోహిత్ అధ్యక్షతన ప్రకాష్ సదన్ సత్రంలోని పాలక మండలి సమావేశ మందిరంలో శుక్రవారం జరిగింది. ఉదయం 11 నుంచి సాయంత్రం వరకూ జరిగిన ఈ సమావేశంలో తొమ్మిది అంశాలపై చర్చించారు. పాలక మండలి సభ్యులు రావిపాటి సత్యనారాయణ, యనమల రాజేశ్వరరావు, యడ్ల భేతాళుడు, అవసరాల వీర్రాజు, కందుల విశ్వేశ్వరరావు, నున్న రామచంద్రరావు, చెల్లి శేషుకుమారి, కొత్త వేంకటేశ్వరరావు (కొండబాబు), సత్తి దేవదానరెడ్డి, రొబ్బి విజయశేఖర్, మారెడ్డి సింగారెడ్డి, మట్టే సత్యప్రసాద్, సింగిలిదేవి సత్తిరాజు, ప్రధానార్చకుడు కొండవీటి సత్యనారాయణ, ఈఓ కె.నాగేశ్వరరావు, ఏసీ జగన్నాథరావు, ఇతర అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ముఖ్య తీర్మానాలివీ.. - రూ.2.96 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేయనున్న సౌండ్ అండ్ లైట్ షో దేవస్థానానికి అంత లాభదాయకం కాదు. అలాగని టెంపుల్ టూరిజం అభివృద్ధికి కూడా అంతగా ఉపయోగపడేది కాదు. పైగా ఇది దేవస్థానానికి ఆర్ధికంగా భారం. ఉన్నతాధికారులు పునఃపరిశీలన జరిపి దీనిని ఉపసంహరించాలి. - గత నవంబర్ నుంచి మూసివేసిన సబ్ క్యాంటీన్ వద్ద భక్తులకు ఉదయం ఉచితంగా పులిహోర, దద్ధోజనం పంపిణీ చేయాలి. రద్దీ రోజుల్లో 2 వేల మందికి, ఇతర రోజుల్లో వెయ్యి మందికి సరిపోయేలా పంపిణీ చేయాలి. సోమవారం నుంచి దీనిని ప్రారంభించాలి. - స్వామి, అమ్మవార్లను ఉత్సవాల్లో ఊరేగించేందుకు రూ.55 లక్షలతో నూతన రథం తయారు చేయించాలి. - దేవస్థానంలో ఉన్న 2.860 కేజీల బంగారాన్ని గోల్డ్ బాండ్ స్కీమ్‌లో డిపాజిట్ చేయాలి. - గురువారం జరిగిన షాపుల వేలంలో గత ఏడాదికన్నా అత్యధికంగా పాడుకున్నవారికి షాపులను ఇవ్వాలి. -
ఎవరికో అన్న‘వరం’
సత్తెన్న సన్నిధిలో రాజకీయం - ఖాళీ అయిన ఈవో పోస్టుపై రత్నగిరిపై తమ్ముళ్ల పోరు సాక్షి ప్రతినిధి, కాకినాడ : అన్నవరం సత్యదేవుని కొండపై రాజకీయ పాచికలు అడుకుంటున్నారు. ఖాళీ అయిన ఈఓ పోస్టు కోసం అధికార పార్టీలో రెండు గ్రూపులు సిగపట్లు పడుతుండటంతో రత్నగిరిపై రాజకీయం రాజుకుంది. రాష్ట్రంలోనే పేరెన్నికగన్న అన్నవరం సత్యదేవుని వార్షిక ఆదాయం రూ.120 కోట్లు. ఏటా 80 లక్షల మంది భక్తులు రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా దేశ, విదేశాల నుంచి కూడా వస్తుంటారు. స్వామి సన్నిధిలో జరిగే వ్రతాలు ఖండాంతర ఖ్యాతిని ఆర్జించాయి. అటువంటి సత్యదేవుని కొండపై పట్టు కోసం నేతలు హోరాహోరీగా తలపడుతూ రాజకీయం చేస్తున్నారు. సత్యదేవుని ఆలయ కార్యనిర్వాహణాధికారి కాకర్ల నాగేశ్వరరావు విజయనగరం జిల్లా జేసీ–2గా గురువారం బదిలీ కావడంతో పోరు తీవ్రమైంది. నాగేశ్వరర రావు స్థానంలో కొత్త ఈవో కోసం రెండు గ్రూపులు రెండు పేర్లను తెరమీదకు తేవడంతో కొండపై రాజకీయం రసకందాయంగా మారింది. అర్హతలేకున్నా అందలాలెక్కించడం, ఏళ్ల తరబడి ఒకే చోట తిష్టవేయడం, లక్షల రూపాయలు చేతులు మారితేనే కానీ పోస్టింగుల రాని పరిస్థితులు దేవాదాయశాఖలో ఇటీవల శృతిమించి పోయిన వ్యవహారాలపై ‘సాక్షి’ పలు కథనాలను ప్రచురించిన సంగతి పాఠకులకు విదితమే. గ్రేడ్–1, గ్రేడ్–2 ఈఓ పోస్టింగులకే రూ.20 నుంచి రూ.30 లక్షలు ముట్టజెప్పితే ఇక అన్నవరం సత్యదేవుని ఈఓ పోస్టింగ్ అంటే మాటలా అంటున్నారు. ఆ పోస్టింగ్‌కు ఎంత పలుకుతుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమే లేదు. ప్రయత్నాల్లో ముగ్గురు... అన్నవరం ఈఓ పోస్టింగ్ కోసం ముగ్గురు పేర్లు ప్రచారంలో ఉన్నాయి. కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు ఈవో మంచెనపల్లి రఘునా«థ్, ద్వారకా తిరుమల ఈవో వేండ్ర త్రినా«ధరావు, రాజమహేంద్రవరం ఆర్జేసీ చంద్రశేఖర్ అజాద్ పేర్లు వినిపిస్తున్నాయి. ఇందులో ఒకరు మినహా ఇద్దరు రాజకీయ పలుకుబడిని ఉపయోగించి తమ ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు. రెండేళ్ల క్రితం నాగేశ్వరరావు అన్నవరం ఈవోగా వచ్చే సమయంలో రఘునా«థ్ కూడా ఇక్కడకు రావడానికి గట్టి ప్రయత్నాలే చేశారు. అప్పట్లో జిల్లాకు చెందిన ఓ మంత్రి సోదరుడు ఈయన్ని తీసుకువచ్చేందుకు అన్ని ప్రయత్నాలు చేసినా చివరకు దేవాదాయశాఖకు సంబధంలేని రెవెన్యూ శాఖ నుంచి స్పెషల్ డిప్యుటీ కలెక్టర్ స్థాయి అధికారి అయిన నాగేశ్వరరావుకు పోస్టింగ్ దక్కింది. ఈ పోస్టింగ్ కోసం అప్పట్లో మంత్రి వర్గీయులు ఒక ఈవో నుంచి తీసుకున్న రూ.20 లక్షలు సంబంధిత వ్యక్తికి ఇప్పటి వరకూ తిరిగి ఇవ్వకపోవడంతో వివాదంగా మారింది. ఆ సొమ్ములు ఎలానూ ఇవ్వలేదు కనీసం ఇప్పుడైనా ఆ పోస్టింగ్ అవకాశం దక్కేలా చూడాలని సంబంధిత వ్యక్తి ఒత్తిడి తెస్తున్నారని సమాచారం. ఏసీబికి చిక్కడంతో... ఇక్కడకు వస్తారని ప్రచారం జరుగుతున్న రఘునా«థ్ 2006 నుంచి 2008 వరకు అన్నవరం ఈవోగా పని చేశారు. ఆ సమయంలోనే ఆదాయానికి మించిన ఆస్తులున్నాయంటూ అవినీతి నిరోధకశాఖ కేసు నమోదు చేయడంతో సస్పెండయ్యారు. ఆ కారణంగానే రెండేళ్ల కిందట తిరిగి అన్నవరం ఈవోగా రావాలనే ప్రయత్నాలకు బ్రేక్ పడింది. ఆ ఏసీబీ కేసులో క్లీన్చిట్ రావడంతో ఇప్పుడు ఇక్కడకు రావడానికి ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారని ఆలయ వర్గాలు చెబుతున్నాయి. ఈసారి ఎట్టిపరిస్థితుల్లోను రఘునా«థ్‌ను తీసుకువచ్చి తీరతామని మంత్రి అనుచరులు చాలా నమ్మకంగా చెబుతున్నారని ఆలయ వర్గాలు పేర్కొంటున్నాయి. రఘునా«థ్ వస్తే కొండపై తమకు ఇబ్బందులు తప్పవని ఆయనకు వ్యతిరేకంగా ఉన్న ఓ ఇంజినీరింగ్ అధికారి, మరో ఏసీ ఇక్కడి పోస్టింగ్ కోసం ఆసక్తి కనబరుస్తున్న ద్వారకా తిరుమల ఈవో వేండ్ర త్రినాథరావు లైన్లో పెడుతున్నారు. త్రినా«థరావు జిల్లాలో డిప్యుటీ కమిషనర్‌గా పనిచేసినప్పుడు కొండపై అన్నీ తామే అన్నట్టు చక్రం తిప్పిన ఆ ఇద్దరు రాజకీయంగా పావులు కదుపుతున్నారు. ఆయన ఈవోగా రావడం ఖాయమని ఇప్పటికే విస్తృత ప్రచారాన్ని కూడా చేస్తున్నారు. ఇందుకు మంత్రి వర్గీయులతో పొసగని మెట్ట ప్రాంతానికి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేల సిఫార్సులతో ఉన్నత స్థాయిలో తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని నమ్మకమైన వర్గాల ద్వారా తెలిసింది. ఈవో నాగేశ్వరరావు ముక్కుసూటిగా పోయే విధానంనచ్చని వారు ఇప్పుడు కొండపై తమ మాట వినే వారిని తెచ్చుకునే పనిలో ఉన్నారు. ఇలా రెండు గ్రూపులు చెరొకరి కోసం పోటాపోటీగా ప్రయత్నాలు చేస్తుండగా రాజకీయ సిఫార్సులతో సంబంధం లేకుండా రాజమహేంద్రవరం ఆర్జేసీ చంద్రశేఖర్ ఆజాద్ వైపు దేవాదాయశాఖ కమిషనరేట్ వర్గాలు మొగ్గు చూపుతున్నాయని సమాచారం. ఈ పరిస్థితుల్లో కొండపై మంత్రి, ఎమ్మెల్యేలలో ఎవరి మాట చెల్లుబాటవుతుందో ఎవరు పట్టు సాధిస్తారోననే ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. -
అన్నవరం దేవస్థానం ఈఓ నాగేశ్వరరావు బదిలీ
- విజయనగరం జేసీ–2గా బదిలీ చేసిన ప్రభుత్వం - కొత్త ఈఓ వచ్చేవరకూ ఇన్‌ఛార్జి ఈఓగా ఏసీ జగన్నాధరావు? అన్నవరం: అన్నవరం దేవస్థానం ఈఓ కె.నాగేశ్వరరావును విజయనగరం జాయింట్ కలెక్టర్–2గా బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో ఎవరినీ నియమించ లేదు. రెవెన్యూ విభాగానికి చెందిన పలువురు స్పెషల్ గ్రేడ్ డిఫ్యూటీ కలెక్టర్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం గురువారం రాత్రి జీఓ ఆర్ఎస్ నెంబర్.1267 విడుదల చేసింది. అందులో రెండో పేరుగా ఈయనది ఉంది. ఇన్‌ఛార్జి ఈఓగా ఏసీ జగన్నాధరావు? ఇన్‌ఛార్జి ఈఓగా దేవస్థానం ఏసీ జగన్నాథ రావును నియమించే అవకాశాలున్నాయి. గతంలో పనిచేసిన ఈఓలు కె. రామచంద్రమోహన్, ప్రసాదం వేంకటేశ్వర్లు బదిలీ అయినపుడు వెంటనే రెగ్యులర్ ఈఓలను నియమించకుండా దేవస్థానం ఏసీ జగన్నాధరావునే ఇన్‌ఛార్జి ఈఓగా నియమించారు. అదే ఆనవాయితీని ఇప్పుడు కూడా పాటిస్తారనే అభిప్రాయం వినిపిస్తోంది. ఈ విషయం ముందే చెప్పిన ‘సాక్షి’ ... దేవస్థానం ఈఓ బదిలీ అవుతున్న విషయాన్నిఈ నెల ఐదో తేదీన ‘అన్నవరం దేవస్థానానికి కొత్త ఈఓ’ శీర్షికన ‘సాక్షి’లో ప్రచురితమైంది. ఈఓ పనితీరుతో అసంతృప్తిగా ఉన్న జిల్లాకు చెందిన కొంతమంది రాజకీయ ప్రముఖులు సీఎం వద్దకు వెళ్లి ఈఓను బదిలీ చేసి దేవాదాయశాఖకు చెందిన మరో అధికారిని ఇక్కడ నియమించాలని కోరగా అందుకు సీఎం అంగీకరించినట్టు, దీనిపై రెండు మూడు రోజుల్లో నిర్ణయం వెలువడుతుందని ఆ వార్తలో ప్రస్తావించాం. అన్నట్టుగానే గురువారం రాత్రి ఈఓ బదిలీకి సంబంధించి జీఓ విడుదలైంది. -
‘‘దేవస్థానానికి అప్రతిష్ట తీసుకురాకండి’’
ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రసాద్ ఆగ్రహం వేద పాఠశాల నిర్మాణ పనుల జాప్యంపై అసంతృప్తి సహజ ఆసుపత్రి నిర్వహణపైనా అదే రీతిలో స్పందన పారిశుద్ధ్యం బాగోలేదని కాంట్రాక్టర్‌కు రూ.పదివేలు జరిమానా యాగశాల నిర్మాణానికి గ్రీన్‌సిగ్నల్ అన్నదానం భవనం నిర్మాణస్థలం మార్పుపై పరిశీలన అన్నవరం(ప్రత్తిపాడు) : అన్నవరం దేవస్థానంలో అధికారుల పనితీరుపై దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జేఎస్వీ ప్రసాద్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. నిర్మాణాలు నత్తనడకన సాగడం, సహజ ఆసుపత్రి పరిసరాల్లో అపరిశుభ్రత తాండవించడంపై ‘ఇది దేవస్థానానికి అప్రతిష్ట’ అని వ్యాఖ్యానించారు. గురువారం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి మూడు గంటల వరకు ఆయన అన్నవరం దేవస్థానంలో పర్యటించారు. వివిధ నిర్మాణపథకాల పనితీరును పరిశీలించారు. సత్యగిరిపై రూ.2.82 కోట్ల వ్యయంతో చేపట్టిన స్మార్త, ఆగమ, వేదపాఠశాల పనులు నత్తనడకన సాగుతుండడంపై జేఎస్వీ సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవస్థానంలో పారిశుద్ధ్యం నిర్వహణ, సహజ ఆసుపత్రి పనితీరుపైనా తీవ్ర అసంతృపి వ్యక్తం చేశారు. ఇంత నిర్లక్ష్యంగా ఎందుకు వ్యవహరిస్తున్నారని అధికారులను నిలదీశారు. డిసెంబర్ నాటికి పూర్తి కావాలి.. సత్యగిరిపై నిర్మిస్తున్న స్మార్త, ఆగమ, వేదపాఠశాల పనులను ఆయన పరిశీలించారు. పనుల జాప్యంపై ఆరాతీశారు. ఈ నిర్మాణాలు చేసే నిపుణులైన పనివారి కొరత ఉండడంతో ఆలస్యమవుతోందని కాంట్రాక్టర్ నాయుడు తెలిపారు. అవసరమైనంత మందిని తీసుకువచ్చి ఈ డిసెంబర్ నెలాఖరుకల్లా పనులు పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. ఈ పనులు పూర్తయ్యేలోపు వేదపాఠశాల ప్రాంగణంలో మొక్కలు నాటాలని, స్థలం చుట్టూ పాతపద్ధతిలో మెస్తో ప్రహరీ నిర్మించాలని ఆదేశించారు. సహజ ఆసుపత్రి పనితీరుపై అసంతృప్తి.. దేవస్థానం నిర్వహిస్తున్న సహజ ప్రకృతి ఆసుపత్రి పనితీరుపై ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రసాద్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో పది మంది సిబ్బంది, నలుగురు పేషెంట్లు ఉండడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రి చుట్టూ అపరిశుభ్ర వాతావరణం ఉండడాన్ని చూసి మండిపడ్డారు. ఇది ఆలయానికి అప్రతిష్ట అని ఈఓను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. దేవస్థానంలో పారిశుద్ధ్య పనులు చూస్తున్న పద్మావతి సంస్థ అన్నవరం మేనేజర్ కుళాయప్పకు రూ.పదివేలు జురిమానా విధించారు. ఆర్జేసీ అజాద్‌కు ‘సహజ’ బాధ్యతలు.. సహజ ఆసుపత్రిని కేంద్ర ప్రభుత్వ ఆయుష్ సంస్థకు అనుసంధానం చేసి అభివృద్ధి చేస్తామని ప్రిన్సిపల్ సెక్రటరీ జేఎస్వీ ప్రసాద్ అన్నారు. ఇందుకుగాను 20 పాయింట్లు రూపొందించామన్నారు. ఆసుపత్రి ముందు ఔషద మొక్కలను పెంచుతామన్నారు. ఆ పనులను దేవాదాయశాఖ కాకినాడ ఆర్జేసీ చంద్రశేఖర్ అజాద్‌కు అప్పగిస్తున్నట్టు తెలిపారు. పనులు పూర్తయ్యాక దీనిపై ఒక బ్రోచర్ ముద్రించి ప్రచారం చేస్తామన్నారు. చెందుర్తిలో సోలార్ పవర్‌ప్రాజెక్ట్ చెందుర్తిలో ఉన్న 135 ఎకరాల దేవస్థానం స్థలంలో 1.5 మెగావాట్ సోలార్ పవర్ ప్రాజెక్ట్‌ను రూ.4.5 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేయాలని ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రసాద్ సూచించారు. ఈ ప్రాజెక్ట్ ను సత్యగిరిపై ఏర్పాటు చేయాలని గతంలోనే దేవస్థానం చైర్మన్, ఈఓ లతో కూడిన పాలకమండలి తీర్మానించింది. అయితే సత్యగిరిపై కాకుండా చెందుర్తి భూమిలో ఏర్పాటు చేయాలని ఆయన ఆదేశించారు. ఎట్టకేలకు యాగశాల నిర్మాణానికి మోక్షం: దేవస్థానంలో యాగశాల ఏర్పాటు పనులు 18 నెలలుగా నిలిచిపోయిన విషయం విదితమే. అయితే గురువారం ప్రిన్సిపల్ సెక్రటరీ జేఎస్వీ ప్రసాద్ ఈ నిర్మాణానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. తన ఆదేశాలను దేవాదాయశాఖ కమిషనర్‌కు తెలియజేసి వెంటనే పనులు ప్రారంభించాలని ఆయన ఈఓను ఆదేశించారు. అన్నదానం భవన నిర్మాణస్థలం మార్పుపైనా సానుకూలత.. అన్నదాన భవన నిర్మాణాన్ని పాత టీటీడీ సత్రం భవనస్థలంలో నిర్మించే విషయమై పరిశీలనకు ఆయన సంసిద్ధత వ్యక్తం చేశారు. అనంతరం చైర్మన్, ఈఓలతో కలసి ఆయన టీటీడీ సత్రం స్థలాన్ని పరిశీలించారు. సత్యగిరిపై నిర్మాణాలను అంగీకరించే ప్రసక్తి లేదు సత్యగిరిపై 138 గదుల సత్రంతో సహ ఈ విధమైన నిర్మాణాలను అంగీకరించే ప్రసక్తి లేదని మరోసారి ఆయన స్పష్టం చేశారు. అయితే సౌండ్ అంట్ లైట్ షో, అర్బన్ గ్రీనరీ పనులు కొనసాగుతాయని వివరించారు. ప్రిన్సిపల్ సెక్రటరీ జేఎస్వీ ప్రసాద్ వెంట దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ కే నాగేశ్వరరావు, దేవాదాయశాఖ ఆర్జేసీ చంద్రశేఖర్ అజాద్, దేవస్థానం ఈఈ శ్రీనివాసరాజు, డీఈలు రామకృష్ణ, రాజు, ఏఈలు రాంబాబు, తదితరులు పాల్గొన్నారు. -
తెలంగాణ అన్నవరం
గూడెం గుట్ట పుణ్య తీర్థం ప్రకృతి ఒడిలో.. దేవుని గుడిలో భక్తులను పులకరింపజేస్తుంది గూడెం గుట్ట.. ఎత్తయిన కొండలు... గోదావరి నీటి గలగల సవ్వడులు అలరిస్తున్నాయి. కొండపై వెలసిన శ్రీ రమాసహిత సత్యనారాయణస్వామి భక్తుల పాలిట కొంగు బంగారంగా విరాజిల్లుతున్నాడు. ఈ ప్రదేశాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రెండో అన్నవరంగా పిలిచేవారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ‘తెలంగాణ అన్నవరం’గా పిలుచుకుంటున్నారు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం గూడెం గ్రామ శివారులో ఎత్తయిన కొండపై వెలసిన శ్రీ సత్యనారాయణ స్వామి దేవాలయం ఎంతో ప్రసిద్ధి చెందింది. ఈ క్షేత్రం మంచిర్యాలకు 30 కిలోమీటర్లు, కరీంనగర్‌కు 70 కిలోమీటర్ల దూరంలో 63 వ జాతీయ రహదారికి పక్కనే ఉంది. ఆలయ సమీపాన పవిత్ర గోదావరి నది ప్రవహిస్తుంది. దీంతో భక్తులు గోదావరినదిలో పుణ్యస్నానాలు ఆచరించి గుట్టపైన గల శ్రీరమాసహిత సత్యనారాయణ స్వామిని దర్శించుకుంటారు. ఇక్కడ నిత్యపూజలతో పాటు, సత్యనారాయణ వ్రతాలు, పెళ్లిళ్లసీజన్లో పెళ్ళిళ్లు కూడా జరుగుతుంటాయి. ఆలయ ప్రాశస్త్యం సుమారుగా 53 సంవత్సరాల క్రితం గూడెం గ్రామానికి చెందిన గోవర్దన పెరుమాండ్లు అనే చాత్తాద వైష్ణవుడికి సత్యదేవుడు కలలో కనిపించాడు. మీ గ్రామ శివారులో గల రాట్నపు చెవుల కొండపై ఉన్నానని చెప్పాడు. ఆ వైష్ణవుడు కొండపై వెదకగా చిన్న విగ్రహం దర్శనమిచ్చింది. ఆయన సంతోషంతో సమీపాన గల గోదావరి నదికి వెళ్లి స్నానం ఆచరించి వచ్చాడు. గోదావరి జలంతో అభిషేకం నిర్వహించి సుగంధ ద్రవ్యాలతో పూజలు నిర్వహించాడు. విషయం తెలుసుకున్న గ్రామస్థులు కూడా స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు. కొద్దిరోజుల తర్వాత చాత్తాద వైష్ణవుడు భక్తుల సహకారంతో గుట్టపైనే ఆలయం నిర్మించాడు. క్రోధి నామ సంవత్సర మాఘశుద్ధ దశమి రోజున (1964 లో) విగ్ర ప్రతిష్ట చేశారు. అప్పటినుంచి ఇప్పటి వరకు ఆలయం దినదినాభివృద్ధి చెందుతూ ప్రసిద్ధికెక్కింది. ఇక్కడ ప్రతి పౌర్ణమికి జాతర, కార్తీక పౌర్ణమికి భారీఎత్తున జాతర నిర్వహిస్తూ, ప్రతి ఏటా స్వామివారి కళ్యాణ బ్రహ్మోత్సవాలు కూడా ఘనంగా నిర్వహిస్తుంటారు. అయ్యప్ప, ఆంజనేయ స్వామి, సాయిబాబా సత్యనారాయణ స్వామి ఆలయం సమీపాన గల మరో ఎత్తయిన కొండపై శ్రీ అయ్యప్పస్వామి, పంచముఖ ఆంజనేయస్వామి ఆలయాలు ఉన్నాయి. శబరిమలైలో ఉండే విధంగా అయ్యప్ప దేవాలయాన్ని నిర్మించడంతో భక్తులు గూడెం అయ్యప్ప ఆలయాన్ని తెలుగువాళ్ల శబరిమలగా పిలుచుకుంటారు. ప్రతి ఏటా అనేకమంది అయ్యప్ప, ఆంజనేయ స్వామి భక్తులు మాలధారణ చేసుకుంటారు. దీక్ష విరమణ కూడా చేస్తారు. వీటితోపాటు గుట్ట కింద శ్రీషిర్డిసాయిబాబా ఆలయం కూడా ఉంది. ఒకేచోట నాలుగు దేవాలయాలు ఉండటంతో ప్రతి నిత్యం ఇక్కడ భక్తుల రద్దీ ఉంటుంది. దీంతో గూడెం గ్రామం పుణ్య క్షేత్రాలకు నిలయంగా ప్రసిద్ధి గాంచింది. ఇలా వెళ్లచ్చు.. గూడెం సత్యనారాయణస్వామి ఆలయానికి కరీంనగర్ నుంచి బస్సులు లేదా ప్రైవేటు వాహనాల్లో రావచ్చు. బస్సుల్లో వచ్చే వారు. లక్సెట్టిపేట మీదుగా ఆదిలాబాద్, మంచిర్యాల వెళ్లే బస్సులు ఆలయం ముందునుంచే వెళతాయి. నిజామాబాద్, జగిత్యాల వైపు నుంచి వచ్చే వాళ్లు లక్సెట్టిపేట, మంచిర్యాల వెళ్లేబస్సుల్లో రావచ్చు. ఈ బస్సులు కూడా ఆలయం ముందునుంచే వెళతాయి. ఆదిలాబాద్ నుంచి వచ్చే వాళ్లు మంచిర్యాల, లేదా వయా లక్సెట్టిపేట మీదుగా కరీంనగర్, హైదరాబాద్, వరంగల్, గుంటూరు, ఖమ్మం వెళ్ళే బస్సుల్లో రావచ్చు. మంచిర్యాల బస్సుల్లో వచ్చేవారు కరీంనగర్ టర్నింగ్ చౌరస్తా లో దిగితే అక్కడనుంచి బస్సుల్లో లేదా ప్రెవేటు వాహనాల్లో వెళ్లచ్చు. మంచిర్యాల వైపు నుంచి వచ్చే వారు లక్సెట్టిపేట మీదుగా కరీంనగర్, జగిత్యాల, నిజామాబాద్, హైదరాబాద్ వెళ్ళే బస్సుల్లో రావచ్చు. రైలు మార్గం ద్వారా.. గూడెం సత్యనారాయణ స్వామి ఆలయానికి రైలు మార్గం ద్వారా వచ్చేవారు మంచిర్యాల రైల్వేస్టేషన్లో దిగాలి. అక్కడనుంచి ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు వాహనాలు వెళతాయి. మంచిర్యాల నుంచి లక్సెట్టిపేట మీదుగా కరీంనగర్, హైదరాబాద్, జగిత్యాల, నిజామాబాద్ వెళ్లే బస్సుల్లో వస్తే ఆలయం ముందే దిగచ్చు. – మొదంపురం వెంకటేష్, దండేపల్లి, మంచిర్యాల -
రత్నగిరిపై ‘ఏకాదశి’ రద్దీ
స్వామిని దర్శించిన 40 వేలమంది భక్తులు ఎండ వేడి తట్టుకోలేక భక్తుల ఇబ్బందులు అన్నవరం(ప్రత్తిపాడు) : ఏకాదశి పర్వదినం సందర్భంగా సోమవారం రత్నగిరి శ్రీసత్యదేవుని ఆలయానికి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. స్వామివారిని దర్శించుకున్నారు. తెల్లవారుజామున ఐదు గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకూ భక్తుల రద్దీ కొనసాగింది. సోమవారం 40 డిగ్రీల పైబడి ఎండ కాయడంతో భక్తులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. ఉదయం పది గంటల నుంచి నేల వేడెక్కి కాళ్లు కాలిపోవడంతో తీవ్ర అవస్థలు పడ్డారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకున్న తెల్లవారుజామున ఐదు గంటల నుంచి స్వామివారి ఆలయాన్ని తెరిచి భక్తులకు దర్శనాన్ని ఏర్పాటు చేశారు. నాలుగు గంటల నుంచి వ్రతాల నిర్వహణ ప్రారంభించారు. స్వామివారి దర్శనానికి గంట ప్రత్యేక దర్శనానికి అరగంట సమయం పట్టింది. సత్యదేవుని వ్రతమాచరించిన చిన రాజప్ప, రెడ్డి సుభ్రహ్మణ్యం: డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప, శానసమండలి డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం సత్యదేవుని వ్రతమాచరించి స్వామివారిని దర్శించుకున్నారు. స్వామి దర్శనం అనంతరం వేదపండితులు వేదాశీస్సులు, అధికారులు స్వామివారి ప్రసాదాలను అందజేశారు. ఏసీ మండపంలో వ్రతాలకు డిమాండ్: ఎండ తీవ్రత అధికంగా ఉండడంతో వ్రతాలాచరించే భక్తులు రూ.2,000 టికెట్‌తో ఏసీ వ్రతమండపంలో వ్రతాలాచరించేందుకు మొగ్గు చూపారు. సాధారణంగా ప్రతి రోజూ వంద వ్రతాల వరకూ మాత్రమే ఇక్కడ జరుగుతాయి. అటువంటిది సోమవారం రెండు వందలకు పైగా ఈ వ్రతాలు జరిగాయి. స్వామివారిని దర్శించిన 40 వేల మంది భక్తులు: సుమారు 40 వేలమంది భక్తులు సోమవారం సత్యదేవుని దర్శించారని అధికారులు అంచనా వేస్తున్నారు. స్వామివారి వ్రతాలు 3,611 జరిగాయి. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.30 లక్షలు ఆదాయం సమకూరిందని అధికారులు తెలిపారు. -
అన్నవరానికి త్వరలో కొత్త ఈఓ!
రెవెన్యూశాఖకు ప్రస్తుత ఈఓ నాగేశ్వరరావు సరెండర్? ప్రచారంలోకి త్రినాథరావు, రఘునాథ్ పేర్లు అధికారపార్టీ నేతల ముమ్మర ప్రయత్నాలు అన్నవరం : అన్నవరం దేవస్థానం ఈఓ కె.నాగేశ్వరరావును ఆయన మాతృ విభాగం రెవెన్యూ శాఖకు సరెండర్ చేయాలా లేక మరో ఆరు నెలలు ప్రస్తుత పదవిలోనే కొనసాగించాలా అనే దానిపై రెండు మూడు రోజుల్లో ప్రభుత్వం నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. అధికారపార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలు ఆయనను పంపించి, దేవాదాయశాఖకు చెందిన అధికారిని ఈఓ గా నియమించాలని సీఎంను కోరగా, ఆయన అందుకు అంగీకరించినట్టు ప్రచారం జరుగుతోంది. రెవెన్యూ శాఖలో స్పెషల్‌గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్‌గా పనిచేస్తున్న ఆయనను 2015 జూలై రెండో తేదీన దేవస్థానం ఈఓగా ప్రభుత్వం నియమించింది. 2016 జూలై రెండో తేదీకి ఏడాది కాలపరిమితి పూర్తవడంతో మరో ఏడాది డెప్యుటేషన్ పొడిగించింది. దీంతో వచ్చే జూలై రెండో తేదీతో ఆయన కాలపరిమితి ముగియనుంది. తన డెప్యుటేషన్ పూర్తవుతున్నందున తనను రెవెన్యూ విభాగానికి సరెండర్ చేయాలని ఆయన దేవాదాయశాఖ ప్రిన్స్‌పల్ సెక్రటరీ, కమిషనర్ ను గతంలో కోరారు. అయితే 2018 మే నెలాఖరున పదవీ విరమణ చేయనున్న ఆయన మరో ఆరు నెలలు ఇక్కడే కొనసాగాలని భావిస్తున్నట్టు ప్రచారం జరగుతోంది. పంపించేయాలని నేతల ప్రయత్నాలు: అయితే ఇటీవల కాలంలో ఈఓ పనితీరుపై విమర్శలు వెల్లువెత్తడం, అధికారపార్టీకి చెందిన మెజార్టీ నేతలు కూడా తమకు సరైన గౌరవ మర్యాదలు జరగడం లేదని అసంతృప్తి వ్యక్తం చేస్తుండడంతో ఆయనను కొనసాగించే విషయమై అనుమానం వ్యక్తమవుతోంది. దీనికి తోడు రెవెన్యూ విభాగానికి చెందిన అధికారి ఈఓగా వస్తే దేవస్థానంలో ఎటువంటి అభివృద్ది జరగడం లేదని, ఏడేళ్లుగా ఇదే పరిస్థితి అని కొంతమంది అధికారపార్టీ నాయకులు సీఎంకు వివరించినట్లు సమాచారం. ఈఓగా త్రినాదరావు లేదా రఘునాద్..? ద్వారకా తిరుమల దేవస్థానం ఈఓగా పనిచేస్తున్న వి.త్రినాథరావు లేదా పెనుగంచిప్రోలు దేవస్థానం ఈఓగా పనిచేస్తున్న ఎం.రఘునాథ్ ఇద్దరిలో ఒకరిని అన్నవరం దేవస్థానం ఈఓగా నియమిస్తారనే ప్రచారం సాగుతోంది. త్రినాథరావు గతంలో జిల్లాలో డీసీ పనిచేయగా, రఘునా«థ్ గతంలో అన్నవరం దేవస్థానం ఈఓ గా పనిచేశారు. ఆయన ఆదాయానికి మించి ఆస్తులు కలిగిఉన్నారన్న ఆరోపణలపై అవినీతి నిరోధకశాఖ గతంలో దాడులు చేసింది. ఆ కేసులో ఆయనకు క్లీన్చిట్ లభించిందని చెబుతున్నారు. -
వీడని వివాదాల చెర
అన్నవరం పాలక మండలి ప్రమాణ స్వీకారం తనకు తెలియకుండా ముహూర్తం నిర్ణయించడంపై ఎమ్మెల్యే ఆగ్రహం జూన్ నాలుగుకు మారిన ముహూర్తం అన్నవరం (ప్రత్తిపాడు): అన్నవరం దేవస్థానం పాలకమండలి నియామక జీఓ ఏ ముహూర్తాన విడుదలైందో కానీ ఏదో ఒక వివాదం వెంటాడుతోంది. ఇప్పటివరకూ పాలకమండలి ప్రమాణస్వీకార వేదిక విషయంలో వివాదం ఏర్పడగా, ఇప్పుడు తేదీ విషయంలో మరో వివాదం తలెత్తింది. దీంతో జూన్ నాలుగో తేదీకి ప్రమాణస్వీకారం వాయిదా పడింది. పాలకమండలి ప్రమాణ స్వీకారానికి జూన్ ఒకటో తేదీని ముహూర్తంగా నిర్ణయించి ఆతర్వాత తనను దేవస్థానం అధికారులు ఆహ్వానించడంపై ప్రత్తిపాడు శాసనసభ్యుడు వరుపుల సుబ్బారావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జూన్ ఒకటో తేదీన రాష్ట్ర క్యాబినెట్ సమావేశం ఉందని, అందువల్ల జిల్లా మంత్రులు కానీ, తాను కానీ హాజరయ్యే పరిస్థితి లేదని ఆయన అధికారులకు తెలిపినట్టు సమాచారం. ఇప్పటికే జూన్ ఒకటో తేదీన ప్రమాణస్వీకారం జరుగుతుందని పాలకమండలిలో సభ్యులుగా నియమితులైన 16 మందికీ దేవస్థానం అధికారులు సమాచారం పంపించారు. ఆ సభ్యులు భారీ ఊరేగింపుతో అన్నవరం వచ్చేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రమాణస్వీకార తేదీ మార్పుపై అధికారులు తర్జనభర్జనలు పడ్డారు. చివరకు జూన్ నాలుగో తేదీ సాయంత్రం నాలుగు గంటలు కొత్త ముహూర్తంగా నిర్ణయించారు. ఆ సమయంలో కళావేదిక మీద ఈ కార్యక్రమం జరుగుతుంది. మంత్రులు, ఎమ్మెల్యే హాజరయ్యేందుకు వీలుగా తేదీ మార్పు దేవస్థానం పాలకమండలి సభ్యుల ప్రమాణస్వీకార కార్యక్రమానికి జిల్లాకు చెందిన మంత్రులు, స్థానిక శాసనసభ్యుడు హాజరయ్యేందుకు వీలుగా జూన్ నాలుగో తేదీకి మార్పు చేసినట్టు ఈఓ కె. నాగేశ్వరరావు సోమవారం సాయంత్రం ‘సాక్షి’ కి తెలిపారు. ముందుగా నిర్ణయించిన ఒకటో తేదీన రాష్ట్ర క్యాబినెట్ మీటింగ్ ఉన్నందున ఆ తేదీని మార్చామన్నారు. ఉదయం 9.30 గంటలకు బదులు సాయంత్రం నాలుగు గంటలకు ఆ కార్యక్రమం జరుగుతుందని ఆయన అన్నారు. -
సత్తెన్న ‘ హుండీ ’ సిరి రూ.1.25 కోట్లు
అన్నవరం: శ్రీ సత్యదేవునికి మే నెలలో 27 రోజులకు హుండీల ద్వారా రూ.1,25,18,846 ఆదాయం సమకూరింది. అన్నవరం దేవస్థానంలోని హుండీలను సోమవారం తెరిచి లెక్కించారు. రూ.1,16,37,156 నగదు, రూ.8,81,690 చిల్లర నాణాలు వచ్చినట్టు హుండీ లెక్కింపు పర్యవేక్షించిన దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ కె. నాగేశ్వరరావు తెలిపారు. హుండీల్లో 200 గ్రాముల బంగారం, 145 గ్రాముల వెండి భక్తులు సమర్పించారన్నారు. వీటితో బాటు అమెరికా డాలర్లు 144, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దీనార్లు పది, ఖతార్ సెంట్రల్ బ్యాంక్ దీర్హామ్ ఒకటి, సింగపూర్ డాలర్లు 12, మలేషియా డాలర్లు తొమ్మిది, కెనడా డాలర్లు 20, మరో ఐదు దేశాలకు చెందిన కరెన్సీ లభ్యమయ్యాయని తెలిపారు. వేసవి సెలవుల కారణంగా నెల్లాళ్లుగా సత్యదేవుని ఆలయానికి భక్తులు భారీగా తరలివస్తున్నారని ఈఓ నాగేశ్వరరావు తెలిపారు. దీనికి తోడు పెద్దసంఖ్యలో వివాహాలు జరగడం, స్వామివారి దివ్యకల్యాణమహోత్సవాలు తదితర కార్యక్రమాలను తిలకించడానికి వచ్చిన భక్తులు హుండీలో దండిగా కానుకలు సమర్పించడంతో ఈ ఆదాయం లభించిందన్నారు. ఆదాయంలో రూ.వంద, రూ.పదులదే అగ్రస్థానం: సత్యదేవుని హుండీ ఆదాయంలో సగానికన్నా ఎక్కువగా రూ.వంద, రూ.పది నోట్లే ఉన్నాయి. రూ. 2 వేల నోట్లు 556, రూ. 500 నోట్లు 3,646, రూ. 100 నోట్లు 46,700, రూ. 50 నోట్లు 22,772, రూ. 20 నోట్లు 40,867, రూ. పది నోట్లు 2,06,431, రూ. 5 నోట్లు 2,343, రూ. 2 నోట్లు 15, రూ. 1 నోట్లు 161 ఉన్నాయి. చిల్లర రూ. 8,81,690 సమకూరింది. -
సత్యగిరిపై సత్రానికి మూడో ‘సారీ’
సత్రం నిర్మాణానికి మూడో సారి తీర్మానం తిరస్కరించిన ఉన్నతాధికారులు కొండ దిగువున సత్రం నిర్మాణానికి అంగీకారం అన్నవరం (ప్రత్తిపాడు): ప్రతి చిన్న విషయానికి పొదుపు, విరాళాలు అంటూ కాలయాపన చేసే దేవస్థానం అధికారులు ఒకవైపు... అవసరమని తెలిసి కూడా సత్రాల నిర్మాణానికి అనుమతి ఇవ్వని దేవాదాయశాఖ ఉన్నతాధికారులు మరోవైపు... దీంతో అంగుళం ముందుకు కదలని దేవస్థానం నిర్మాణాలు... వసతి గదులు దొరక్క భక్తుల ఇబ్బందులు...ఇదీ ప్రస్తుతం అన్నవరం దేవస్థానం పరిస్థితి. అన్నవరం సత్యగిరిపై 1.5 ఎకరాల స్థలంలో రూ.16 కోట్లతో ఐదంతస్తుల్లో 138 గదులతో తలపెట్టిన సత్రం నిర్మాణానికి ముచ్చటగా మూడో సారీ దేవాదాయశాఖ ఉన్నతాధికారుల నుంచి చుక్కెదురైంది. ఈ నిర్మాణం ఇప్పుడే వద్దని, ముందు కొండదిగువున ఈరంకి వారి సత్రంలో వంద గదులు నిర్మించుకోవాలని దేవాదాయశాఖ కమిషనర్ వై.వి.అనూరాధ దేవస్థానం అధికారులకు సూచించారు. దీంతో ఈ సత్రం నిర్మాణానికి ఏడేళ్లలో మూడో సారి అధికారులు చేసిన ప్రయత్నం వృ«థా అయింది. దేవస్థానం మాస్టర్‌ప్లాన్ ఇంకా సిద్ధం కాకపోవడాన్ని సాకుగా చూపి అనుమతి ఇవ్వలేదని అధికారులు తెలిపారు. ప్రిన్సిపల్ సెక్రటరీ జె.ఎస్.వి.ప్రసాద్ దేవస్థానానికి వచ్చి ఈ సత్రం నిర్మాణం అవసరం ఉందో లేదో పరిశీలించిన తరువాత అనుమతి ఇచ్చే విషయం పరిశీలిస్తామని చెప్పినట్టు సమాచారం. దీంతో ఈ సత్రం అనుమతి కోసం విజయవాడ వెళ్లిన ఇంజినీరింగ్ శాఖ అధికారులు డీలా పడ్డారు. 2011లోనే పాలక మండలి తీర్మానం భక్తుల వసతి కోసం సత్యగిరిపై 138 గదులతో సత్రం నిర్మించాలని 2011లో చైర్మన్ ఐ.వి.రామ్‌కుమార్ అధ్యక్షతన గల పాలకమండలి తీర్మానించింది. ఈ సత్రం నిర్మాణానికి రూ.11 కోట్లు వ్యయమవుతుందని ఇంజినీరింగ్ అధికారులు అంచనా వేశారు. దీన్ని 2012లో అప్పటి కమిషనర్ ఆమోదించగా, అప్పటి ఈఓ, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ ప్రసాదం వేంకటేశ్వర్లు సత్రం నిర్మాణానికి టెండర్లు పిలవకుండా తాత్సారం చేయడంతో నిర్మాణం జరగలేదు. ఆయన బదిలీ అనంతరం మరలా 138 గదుల సత్రం నిర్మాణానికి 2014లో పాలకమండలి రెండో సారి తీర్మానం చేసింది. అప్పుడు దీని అంచనా వ్యయం రూ.11 కోట్ల నుంచి రూ.14.5 కోట్లకు పెరిగింది. 2014లో దేవస్థానానికి వచ్చిన శృంగేరీ పీఠాధిపతి జగద్గురు శ్రీభారతీ తీర్థస్వామి ఈ సత్రం నిర్మాణానికి లాంఛనంగా కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు. గత నెలలో మళ్లీ తీర్మానం భక్తుల వసతికి ఇబ్బందిగా ఉన్నందున 138 గదుల సత్రం నిర్మాణం అవసరమని భావించి మరలా గత నెలలో పాలక మండలిలో తీర్మానించారు. దీని నిర్మాణానికి ప్రస్తుత ధరల ప్రకారం రూ.16 కోట్లు వ్యయమవుతుందని అంచనా వేశారు. వాస్తవంగా చూస్తే 2011లోనే దీని నిర్మాణం ప్రారంభిస్తే అప్పటి అంచనా వ్యయం ప్రకారం రూ.11 కోట్లకే పూర్తయి ఉండేది. మూడేళ్ల క్రితమే భక్తులకు అందుబాటులోకి వచ్చేది. దేవస్థానం అధికారుల అశ్రద్ధ, ఉన్నతాధికారుల అభ్యంతరాల కారణంగా దీని నిర్మాణ వ్యయం రూ.ఐదు కోట్లు పెరిగింది. అయినప్పటికీ ఉన్నతాధికారులు అనుమతించకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. కొండ దిగువున సత్రం నిర్మాణానికి అనుమతి కొండ దిగువున జూనియర్ కళాశాల వెనుక గల 2.34 ఎకరాల ఈరంకి వారి స్థలంలో 110 గదులతో సత్రం నిర్మాణానికి కొన్ని మార్పులతో కమిషనర్ అనుమతి ఇచ్చారు. దీని నిర్మాణానికి రూ.13.25 కోట్లు వ్యయమవుతుందని అంచనా. ఈ స్థలంలో ప్రస్తుతం నర్సరీ గార్డెన్ నిర్వహిస్తున్నారు. ఈ గార్డెన్‌ను తయారు చేయడానికి సుమారు రూ.20 లక్షలు ఖర్చుపెట్టి పంపా నుంచి మట్టి తెచ్చి ఎత్తు చేశారు. కొండ కింద సత్రాలకు భక్తుల ఆధరణ ఉండటం లేదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. కొండమీద బస చేయాలనుకునే భక్తులే ఎక్కువ. ఇప్పటికే కొండ దిగువున బస చేసేవారు లేక పంపా సత్రాన్ని ప్రైవేట్ వ్యక్తుల నిర్వహణకు ఇచ్చేశారు. సత్యగిరి సత్రంలో గదులు రద్దీ సమయంలో తప్ప పూర్తిగా నిండే పరిస్థితి లేదు. దీంతో కొండ దిగువున సత్రం కట్టడం పెద్దగా లాభదాయకం కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పరిశీలించాకా అనుమతి ఇస్తామన్నారు సత్యగిరిపై నిర్మించే సత్రానికి కమిషనర్ ఇంకా అనుమతి ఇవ్వలేదు. పూర్తి స్థాయిలో పరిశీలించిన తరువాత అనుమతి ఇస్తామన్నారు. ముందు కొండ దిగువున ఈరంకి వారి స్థలంలో సత్రం కట్టేందుకు అనుమతి ఇచ్చారు. అది కూడా పాత ప్లాన్ మార్చమని చెప్పారు. ఆ ప్లాన్ మార్చేందుకు దేవస్థానం ఈఈని విజయవాడలోని దేవాదాయశాఖ కమిషనర్ కార్యాలయానికి పంపాం. - కె.నాగేశ్వరరావు, ఈఓ, అన్నవరం దేవస్థానం -
అన్నవరం దేవస్థానం పాలకమండలి ఏర్పాటు
- ఛైర్మన్‌గా వ్యవస్థాపక ధర్మకర్త రోహిత్ - ఎక్స్ అఫీషియో సభ్యునిగా ప్రధానార్చకుడు - బీజేపీ నుంచి ఒక్కరికి అవకాశం - జీఓ విడుదల చేసిన ప్రభుత్వం అన్నవరం: ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానానికి రెండేళ్ల కాలపరిమితితో పాలక మండలిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం రాత్రి జీఓ విడుదల చేసింది. గతంలో ఆలయ వ్యవస్థాపక కుటుంబ సభ్యుడు ( వంశపారంపర్య ధర్మకర్త)తో కలిపి తొమ్మిది మంది సభ్యులు ఉండేవారు.ఈ సంఖ్యను తెలుగుదేశం ప్రభుత్వం 16కు పెంచింది. ఇందులో ఆలయ వ్యవస్థాపక కుటుంబ సభ్యుడు, ఆలయ ప్రధానార్చకుడితోపాటు 13 మంది టీడీపీకి చెందినవారున్నారు. ఒకరు బీజేపీ, మరొకరు ఆలయానికి విరాళాలిచ్చిన దాత ఉన్నారు. పాలక మండలి సభ్యులు వీరే... వ్యవస్థాపక ధర్మకర్తగా రాజా ఇనుగంటి వేంకట రోహిత్, పాలక మండలి సభ్యులుగా రావిపాటి సత్యనారాయణ, పర్వత గుర్రాజు(రాజబాబు) యనమల రాజేశ్వరరావు, యడ్ల బేతాళుడు, అవసరాల వీర్రాజు, కందుల విశ్వేశ్వరరావు, నున్న రామచంద్రరావు, చెల్లి శేషుకుమారి , కొత్త విశ్వేశ్వరరావు, సత్తి దేవదానరెడ్డి, రొబ్బి విజయశేఖర్, సింగిలిదేవి సత్తిరాజు, మారెడ్డి సింగారెడ్డి, మట్టే సత్యప్రసాద్, కొండవీటి సత్యనారాయణలు నియమితులయ్యారు. ఈ పాలకమండలికి ఛైర్మన్‌గా ఐవీ రోహిత్ వ్యవహరిస్తారని, కొండవీటి సత్యనారాయణ ఎక్స్అఫీషియో సభ్యునిగా, మిగిలిన వారంతా సభ్యులుగా వ్యవహరిస్తారని ఆ జీఓలో పేర్కొన్నారు. -
ఘనంగా సత్యదేవుని పుష్పయాగం
-స్వామి, అమ్మవార్లకు 9 పిండివంటల నివేదన -విష్ణుమూర్తి, లక్ష్మీ అవతారాల్లో ఊయలసేవ -ముగిసిన దివ్యకల్యాణ మహోత్సవాలు అన్నవరం (ప్రత్తిపాడు) : సత్యదేవుని దివ్యకల్యాణ మహోత్సవాల చివరి రోజు వైశాఖ బహుళ పాడ్యమి గురువారం రాత్రి సత్యదేవుని శ్రీపుష్పయాగ మహోత్సవం కన్నుల పండువగా జరిగింది. సర్వాంగ సుందరంగా ముస్తాబు చేసిన అనివేటి మండపానికి సత్యదేవుడు, అమ్మవార్లను, పెళ్లిపెద్దలు సీతారాములను ఊరేగింపుగా రాత్రి 7.30 గంటలకు తీసుకువచ్చారు. అక్కడ గల వెండి సింహాసనం మీద స్వామి అమ్మవార్లను, ఆ సింహాసనం పక్కనే గల మరో ఆసనం మీద పెళ్లిపెద్దలు సీతారాములను ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పుష్పయాగం కార్యక్రమాన్ని ప్రారంభించారు. తొలుత విఘ్నేశ్వరపూజ చేశారు. అనంతరం పుణ్యాహవచనం మంత్రాలను పఠించారు. తరువాత పండితులు గర్భాదానం కార్యక్రమానికి సంబంధించిన పూజలు నిర్వíßహించారు. సత్యదేవుడు, అమ్మవార్లకు దేవస్థానం చైర్మన్, ఈఓ నూతన వస్త్రాలను సమర్పించారు. తరువాత సర్వాంగసుందరంగా అలంకరించిన ఊయల మీద పవళించిన విష్ణుమూర్తి, లక్ష్మీదేవి అవతారంలో సత్యదేవుడు, అమ్మవార్లను అలంకరించి పూజలు చేశారు. మొత్తం పది రకాల పుష్పాలతో స్వామి, అమ్మవార్లను సేవించారు. తొమ్మిది రకాల పిండివంటలను నివేదించి పండితుల మంత్రోఛ్చాటన మధ్య స్వామి, అమ్మవార్లు ఉన్న ఊయలను మూడు పర్యాయాలు ఊపారు. భక్తులు ఊయలకు ఎదురుగా ఉంచిన అద్దంలో స్వామి, అమ్మవార్ల ప్రతిబింబాలను తిలకించి పులకించారు. తరువాత ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు దంపతులకు, వేదపండితుల దంపతులకు, ఈఓ దంపతులకు దంపత తాంబూలాలను బహూకరించారు. ఈ కార్యక్రమానికి వచ్చిన మహిళలందరికీ రవికెలగుడ్డలను, భక్తులకు ప్రసాదాలను పంపిణీ చేశారు. దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, వేదపండితులు కపిలవాయి రామశాస్త్రి, ముష్టి కామశాస్త్రి, ప్రధానార్చకులు కొండవీటి సత్యనారాయణ, గాడేపల్లి వేంకట్రావు, స్పెషల్‌గ్రేడ్ వ్రతపురోహితులు నాగాభట్ల కామేశ్వరశర్మ, ముత్య సత్యనారాయణ, ఇతర అర్చకస్వాములు, పురోహితులు పాల్గొన్నారు. -
శాస్త్రోక్తంగా సత్యదేవుని శ్రీచక్రస్నానం
- పంపా నదిలో నీరు లేక ఇబ్బంది - బిందెతో నీరు తీసి కార్యక్రమం పూర్తిచేసిన పండితులు అన్నవరం (ప్రత్తిపాడు) : శ్రీసత్యదేవుని దివ్యకల్యాణ మహోత్సవాల్లో భాగంగా ఆరో రోజు వైశాఖ బహుళ పాడ్యమి, బుధవారం ఉదయం సత్యదేవునికి పంపా నదిలో శ్రీ చక్ర స్నానం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఉదయం 8.30 గంటలకు స్వామి, అమ్మవార్లను, పెళ్లి పెద్దలు సీతారాములు ఊరేగింపుగా పంపా నదీ తీరంలో పవర్ హౌస్ వద్ద ఉన్న వేదిక వద్దకు తీసుకువచ్చి సింహాసనం మీద స్వామి అమ్మవార్లను ప్రతిష్టించారు. ఆ పక్కనే ఉన్న ఆసనంపై సీతా రాములను ప్రతిష్టించి ప్రత్యేక అభిషేకాలను నిర్వహించారు. తరువాత ఊరేగింపుగా పంపా నది లోనికి తీసుకువెళ్లి నదీ జలాలతో పండితుల మంత్రోచ్చరణ మధ్య స్వామి వారికి, శ్రీ చక్రానికి స్నానం నిర్వహించారు. కార్యక్రమానికి దేవస్థానం ఛైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ కె. నాగేశ్వరరావు, ఏసీ జగన్నా«ధరావు హాజరయ్యారు. వేదపండితులు కపిలవాయి రామశాస్త్రి, గొల్లపల్లి ఘనాపాఠి, శివ ఘనాపాఠి, ప్రధానార్చకులు కొండవీటి సత్యనారాయణ, స్పెషల్ గ్రేడ్ వ్రత పురోహతులు నాగాబట్ల కామేశ్వరశర్మ, ముత్య సత్యనారాయణ, అర్చక స్వాములు కోట శ్రీను, పురోహితులు పాలంకి పట్టాభి తదితరులు పాల్గొన్నారు. అడుగులోతు నీటిలోనే శ్రీచక్ర స్నానం... నదిలో నీరు అడుగు లోతు మాత్రమే ఉండడంతో బిందెలతో నీరు తోడి పోశారు. భక్తులు కూడా అరకొరగా నీళ్లు మీద పోసుకుని స్నానం అయిందనిపించారు. పంపా నదిలో చాలా రోజుల క్రితమే నీరు అడుగంటింది. రెండ్రోజుల కిందటే రెండు అడుగులు నీరు ఉండేలా ఇంజినీరింగ్ సిబ్బంది గొయ్యి తవ్వగా నీరు చేరినా విరగకాసిన ఎండలకు ఆ నీరు కాస్తా ఆవిరై పోయింది. చిన్న పుష్కరణి వంటిది ఏర్పాటు చేసుకోవడమే ఉత్తమం... ఎప్పుడూ నడి వేసవిలోనే సత్యదేవుని కల్యాణ మహోత్సవాలు జరుగుతాయి. భవిష్యత్‌లో కూడా ఇటువంటి నీటి సమస్య పునరావృతమయ్యే అవకాశాలున్నందున దేవస్థానం కనీసం మూడు సెంట్ల స్థలంలో ‘గ్రౌండ్ లెవల్ రిజర్వాయర్’ (జీఎల్ఆర్)లాంటి ‘చిన్న పుష్కరణి ’ నిర్మించుకుని మోటార్లతో అందులో నీటిని నింపి శ్రీ చక్ర స్నానం నిర్వహించాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వనదుర్గ అమ్మవారికి ప్రత్యంగిర హోమం - రత్నగిరిపై భక్తుల రద్దీ...గత మూడు రోజుల్లో 60 వేల మంది రాక అన్నవరం: వైశాఖ పౌర్ణమి సందర్భంగా బుధవారం రత్నగిరి వనదేవత శ్రీ వనదుర్గ అమ్మవారికి ఘనంగా ప్రత్యంగిర హోమం నిర్వహించారు. ఉదయం ఎనిమిది గంటలకు పండితులు అమ్మవారికి ఘనంగా పూజలు చేశారు. అనంతరం తొమ్మిది గంటలకు ప్రత్యంగిర హోమం ప్రారంభించారు. 11 గంటలకు హోమం పూర్ణాహుతి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్ బలువు సత్యశ్రీనివాస్ పాల్గొన్నారు. పండితులు ఛామర్తి కన్నబాబు, అంగరసతీష్, సీహెచ్ ప్రసాద్, అర్చకస్వాములు చిట్టెం శ్రీహరగోపాల్, గంగాధరబట్ల శ్రీనివాస్ హోమం, తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పెద్దసంఖ్యలో భక్తులు ఈ హోమంలో పాల్గొన్నారు. రత్నగిరిపై భక్తుల రద్దీ... రత్నగిరిపై భక్తుల రద్దీ పెరిగింది. వరుస సెలవులు, వివాహాల సీజన్ కావడంతో భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. దీంతో ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడుతోంది. సత్యదేవుని దర్శనానికి రెండు గంటలు, ప్రత్యేక దర్శనానికి గంట పడుతోంది. సోమ, మంగళ. బుధ వారాలు మూడు రోజుల్లో సుమారు 60 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించినట్లు అధికారులు తెలిపారు. స్వామివారి వ్రతాలు ఆరువేలు జరిగాయి. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి సుమారు రూ.50 లక్షలు ఆదాయం సమకూరింది. -
స్వామి, అమ్మవార్లకు అరుంధతీ నక్షత్ర దర్శనం
అన్నవరం: సత్యదేవుని దివ్యకల్యాణ మహోత్సవాలలో భాగంగా ఆదివారం సాయంత్రం నవదంపతులు శ్రీసత్యదేవుడు, అనంతలక్ష్మీ అమ్మవార్లకు స్థాలీపాక హోమాలు ఘనంగా నిర్వహించారు. రాత్రి ఏడు గంటలకు స్వామి, అమ్మవార్లను ఆలయం వెలుపలకు తీసుకువచ్చి అరుంధతి నక్షత్రం చూపించి పూజలు చేశారు. వేదపండితులు కపిలవాయి రామశాస్త్రి, ముష్టి కామశాస్త్రి, వ్రతపురోహిత ప్రముఖులు నాగాభట్ల కామేశ్వరశర్మ, ముత్య సత్యనారాయణ, పురోహితులు పాలంకి పట్టాభి, అంగర సతీష్, అర్చకస్వామి కోట శ్రీను తదితరులు పాల్గొన్నారు. -
సత్యదేవుని కల్యాణ ఏర్పాట్లపై అసంతృప్తి
చైర్మన్, ఈవోలపై ఎంపీ తోట ఆగ్రహం పోలీసుల బంధువులతో నిండిపోయిన వీఐపీ, వీవీఐపీ గ్యాలరీలు అన్నవరం : శ్రీసత్యదేవుని దివ్యకల్యాణ మహోత్సవాలను దేవస్థానం అధికారులు నిర్వహిస్తున్న తీరుపై అటు వీఐపీలలో, ఇటు సామాన్య భక్తుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ప్రధానంగా శనివారం రాత్రి నిర్వహించిన సత్యదేవుని దివ్యకల్యాణ మహోత్సవంలో దేవస్థానం అధికారులు, పోలీసులు వ్యవహరించిన తీరు వివాదాస్పదమైంది. వీవీఐపీ గ్యాలరీ, వీఐపీ గ్యాలరీ అంటూ వివాహ వేదిక ముందు సగం స్థలాన్ని తమ అదుపులో పెట్టుకుని సామాన్య భక్తులెవరినీ దరిదాపులకు రాకుండా చేశారు. కల్యాణం ప్రారంభమయ్యాక పోలీసులు వారి బంధువులతో ఆ గ్యాలరీలు నింపేశారు. అధికారులపై ఎంపీ ఆగ్రహం గతేడాది స్వామివారి కల్యాణవేదికకు ముందు కాకినాడ ఎంపీ తోటనరసింహానికి సీటు కేటాయించిన అధికారులు ఈసారి వేదికకు దూరంగా కుడివైపున సీటు కేటాయించారు. దీంతో అక్కడ నుంచి చూస్తే సత్యదేవుని కల్యాణ దృశ్యాలు కనిపించకపోవడంతో ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆదివారం ఆయన దేవస్థానం చైర్మన్, ఈఓ ఇద్దరినీ కాకినాడ పిలిపించి ఈ విషయమై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. దీనికి తోడు ప్రొటోకాల్ లేని వారితో కూడా పట్టువస్త్రాలు, తలంబ్రాల పళ్లాలు నెత్తిన పెట్టడం, వారికి అధిక ప్రాధాన్యం ఇవ్వడం కూడా విమర్శలకు తావిచ్చింది. భక్తుల రాకుండా అడ్డుకున్న దేవస్థానం సత్యదేవుని కల్యాణానికి తరలి రావాలని ఫ్లెక్సీలు, బ్యానర్లు, ప్రకటనల ద్వారా ఊదరకొట్టిన దేవస్థానం అధికారులు కల్యాణ సమయానికి మాత్రం భక్తులను కొండమీదకు వచ్చే వీలు లేకుండా చేశారు. రాత్రి తొమ్మిది గంటలు దాటితే ఆటోలు రత్నగిరికి నడవకుండా అధికారులు నిషేధం విధించిన విషయం తెలిసిందే. కల్యాణం రోజున కూడా ఆటోలను వదల్లేదు. ఎక్కువగా దేవస్థానం బస్‌లను కూడా నడపలేదు. చాలా మంది రాత్రి పది గంటల వరకూ టోల్గేట్ వద్ద ఎదురు చూసి ఇంటికి పోయి టీవీలలో కల్యాణం తిలకించారు. భక్తులను దేవస్థానానికి తరలించాల్సిన ట్రాన్స్‌పోర్టు ఇన్చార్జి రాజు, ఇతర సిబ్బంది చైర్మన్, ఈఓల సేవలలో తరించారు. జేబు దొంగల చేతివాటం కల్యాణ వేదిక వద్ద సుమారు వంద మందికి పైగా పోలీసులు బంబోబస్తు, వీరికి తోడు దేవస్థానం సెక్యూరిటీ సిబ్బంది ఉన్నప్పటికీ జేబుదొంగలను మాత్రం నిరోధించలేక పోయారు. కాకినాడకు చెందని తుమ్మలపల్లి శివప్రసాద్ జేబులో ఉన్న రూ.లక్షను దొంగలు అపహరించారు. ఆదివారం తెల్లవారుజామున పాయకరావుపేటలో జరిగే గృహ ప్రవేశానికి హాజరవడానికి భార్యతో కలిసి వెడుతూ ఆయన సత్యదేవుని కల్యాణం తిలకించేందుకు రత్నగిరి చేరుకున్నట్టు తెలిపారు. అప్పటి వరకూ భక్తుల గ్యాలరీలో ఉన్న తాను తలంబ్రాలల కోసం వీఐపీ గ్యాలరీ లోకి రాగానే జేబులో ఉన్న 2,000 నోట్ల కట్ట (రూ.లక్ష)ను అపహరించారని తెలిపారు. దీనిపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశానన్నారు. -
సత్యదేవుని ఆదాయానికి ‘క్షవరం’
- అన్నవరం దేవస్థానంలో రూ.7 లక్షల విలువైన తలనీలాలు మాయం - రూ.1.28 కోట్లకు వేలం పాడిన టీడీపీ నేత - షరతుల ప్రకారం సగం సొమ్ము చెల్లించకుండానే మూడు నెలల తలనీలాల తరలింపు - కుమ్మక్కైన సిబ్బంది - ఆలస్యంగా గుర్తించిన అధికారులు - గుమస్తా సస్పెన్షన్.. ఇద్దరికి ఛార్జ్ మెమోలు అన్నవరం : బీహార్‌లో పశువుల దాణాను మేసేసిన ప్రబుద్ధుల గురించి విన్నాం. రాష్ట్రంలో ఇసుక బుక్కేస్తున్న బకాసురుల బాగోతాలను రోజూ చూస్తూనే ఉన్నాం. తాజాగా అన్నవరం దేవస్థానంలో సత్యదేవుని ఆదాయానికి కొంతమంది సిబ్బంది క్షవరం చేసేశారు. 18 రోజుల కాలానికి భక్తులు సమర్పించిన రూ.7 లక్షల విలువైన తలనీలాలు మాయమయ్యాయి. దాదాపు ఆరు నెలల కిందట జరిగిన ఈ వ్యవహారం బయటకు వెల్లడి కాకుండా కొందరు అధికారులు గోప్యత పాటించారు. ఎట్టకేలకు ఆ బాగోతం బయట పడడంతో కేశఖండన శాల గుమస్తాను సస్పెండ్ చేసి, సంబంధిత సూపరింటెండెంట్, ఏఈఓలకు మెమోలు జారీ చేసినట్లు ఈఓ కె.నాగేశ్వరరావు ఆదివారం విలేకర్లకు తెలిపారు. అసలేం జరిగిందంటే.. పలువురు భక్తులు సత్యదేవునికి తలనీలాలు సమర్పిస్తూంటారు. అలా వచ్చిన తలనీలాలను దేవస్థానం ఏడాది ముందే టెండర్ కం వేలంపాట ద్వారా విక్రయిస్తుంది. పాటదారు ఆ ఏడాదంతా ఆ తలనీలాలను సేకరించుకోవాలి. గత ఏడాది ఆగస్ట్ ఒకటో తేదీ నుంచి ఈ ఏడాది జూలై 31 వరకూ తలనీలాలు పోగు చేసుకుని, తీసుకునే హక్కును తుని మునిసిపాలిటీలో కీలక పదవిలో ఉన్న ఓ టీడీపీ నాయకుడు రూ.1.28 కోట్లకు దక్కించుకున్నారు. టెండర్ షరతుల ప్రకారం సగం మొత్తం అంటే రూ.64 లక్షలు చెల్లించాలి. అనంతరం తలనీలాలు తీసుకోవాలి. దీని ప్రకారం ఆ పాటదారు డిపాజిట్ రూపంలో రూ.10 లక్షలు చెల్లించాడు. మిగిలిన మొత్తంలో రూ.18 లక్షలు నగదు, మిగిలిన మొత్తానికి చెక్కులు ఇచ్చాడు. అయితే ఆ చెక్కులు మారలేదు. దీంతో టెండర్ నిబంధనల ప్రకారం సగం సొమ్ము చెల్లించనందున, భక్తులు సమర్పించిన తలనీలాలను ఒక గదిలో దాచి ఉంచారు. దీనికి అటు దేవస్థానం అధికారులు, ఇటు పాటదారుని వద్ద పని చేసేవారు రెండు తాళాలు వేసి జాయింట్ కస్టడీలో ఉంచుకున్నారు. అయితే పాట పాడిన వ్యక్తి అధికార టీడీపీ నాయకుడు కావడంతో ఏ ఒత్తిళ్లు వచ్చాయో ఏమో కానీ నిబంధనలకు విరుద్ధంగా తలనీలాలు తీసుకువెళ్లడానికి సంబంధిత అధికారులు అనుమతించారు. దీంతో గదిలో భద్రపరచిన మూడు నెలల తలనీలాలను అక్టోబర్ 29న పాటదారుకు అప్పగించారు. ఆ మర్నాటి నుంచి భక్తులు సమర్పించిన తలనీలాలను పాటదారుకు ఇవ్వకుండా ప్రతి రోజూ కేశఖండన శాల సిబ్బంది గ్రేడింగ్ చేసి భద్రపర్చాలి. అయితే అధికారుల నుంచి తమకు అటువంటి ఆదేశాలు లేనందున తలనీలాలు ఉన్న గదికి తాళం వేయలేదని సంబంధిత సిబ్బంది చెబుతున్నారు. మొత్తానికి ఏం జరిగిందో కానీ అక్టోబర్ 30 నుంచి నవంబర్ 16 వరకూ వచ్చిన తలనీలాలు మాయమయ్యాయి. ఏ రోజు ఎంత మొత్తంలో తలనీలాలు వచ్చాయన్న ఆధారాలు కూడా లేవు. దీంతో పాటదారు తరఫు మనుషులతో సిబ్బంది కుమ్మక్కై తలనీలాలను తరలించేసి, సొమ్ము చేసుకున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విచారణకు ఆదేశించాం తలనీలాలు మాయమైన వ్యవహారంలో కేశఖండన శాల గుమస్తా ఎం.రామకృష్ణను సస్పెండ్ చేశాం. ఈ వ్యవహారంపై సంజాయిషీ ఇవ్వాల్సిందిగా సూపరింటెండెంట్ జి.సత్యనారాయణ, ఏఈఓ సాయిబాబాలకు ఛార్జి మెమోలు జారీ చేశాం. పెద్ద పెద్ద స్కామ్‌లు కూడా చాలా కాలం తరువాతే వెలుగు చూస్తాయి. ఇదీ అంతే. ఆరు నెలల క్రితం జరిగినా అందుకే మా దృష్టికి రాలేదు. పాటదారు చెల్లించిన సొమ్ము మేరకే తలనీలాలు తీసుకువెళ్లేందుకు అనుమతించాం. ఈ వ్యవహారంపై విచారణకు ఆదేశించాం. నవంబర్ 17 నుంచి తలనీలాలను భద్రపరుస్తున్నాం. పూర్తి సొమ్ము కట్టని పాటదారుపై కేసు వేశాం. పాత వేలం రద్దు చేసి కొత్తగా వేలం నిర్వహిస్తాం. - కె.నాగేశ్వరరావు, కార్యనిర్వహణాధికారి, అన్నవరం దేవస్థానం -
సత్తెన్న పెళ్లికొడుకాయెనే...
∙సత్యదేవుని దివ్య కల్యాణానికి సర్వం సిద్ధం ∙రత్నగిరిపై మొదలైన పెళ్లి సందడి ∙నేటి రాత్రి 9.30 నుంచి కల్యాణోత్సవం అన్నవరం : భక్తవరదుడు సత్యదేవుడు వరుడై... సిరులొసగే దేవేరి అనంతలక్ష్మీ అమ్మవారు వధువైన శుభవేళ రత్నగిరి పులకించింది. కల్యాణ కారకులైన స్వామి, అమ్మవార్లే పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తెలుగా దర్శనమిచ్చిన తరుణంలో భక్తకోటి తరించింది. రత్నగిరి వాసుడు సత్యదేవుడు, అనంతలక్ష్మీ అమ్మవారి దివ్యకల్యాణోత్సవాలు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. పండితుల వేద మంత్రోచ్ఛారణల నడుమ అనివేటి మండపంలో స్వామి, అమ్మవార్లను వధూవరులను చేసి కల్యాణ వేడుకలకు శ్రీకారం చుట్టారు. సత్యదేవుడు, అమ్మవార్లు, పెళ్లి పెద్దలు సీతారాములను సాయంత్రం 4 గంటలకు ఊరేగింపుగా అనివేటి మండపం వద్దకు తీసుకువచ్చారు. సర్వాంగ సుందరంగా ముస్తాబు చేసిన ప్రత్యేక ఆసనంపై స్వామి, అమ్మవార్లను, పక్కనే మరో ఆసనంపై సీతారాములను ప్రతిష్ఠించారు. పండితులు ప్రత్యేక పూజలు చేశారు. స్వామి, అమ్మవార్లకు దేవస్థానం చైర్మ¯ŒS ఐ.వి.రోహిత్, ఈఓ కె.నాగేశ్వరరావు నూతన పట్టు వస్త్రాలను సమర్పించారు. సంప్రదాయ ప్రకారం ముత్తయిదువలు పసుపు దంచారు. ఘనంగా ఎదుర్కోలు ఉత్సవం రాత్రి ఏడు గంటలకు రత్నగిరి కళావేదిక మీద శ్రీసత్యదేవుడు, అమ్మవార్ల ఎదుర్కోలు ఉత్సవం కనులపండువగా జరిగింది. స్వామి వారి తరఫున కొంతమంది పండితులు అమ్మవార్ల తరఫున మరికొంత మంది పండితులు మేము గొప్పంటే... మేము గొప్పని వాదించుకున్నారు. ఈ కార్యక్రమం అనంతరం స్వామి, అమ్మవార్లకు పండితులు నీరాజనమంత్రపుష్పాలు సమర్పించారు. స్వామివారికి పట్టువస్త్రాలు శ్రీసత్యదేవుని కల్యాణానికి టీటీడీ పట్టువస్త్రాలు సమర్పించింది. టీటీడీ డిప్యూటీ ఈఓ బాలాజీ పట్టు వస్త్రాలను దేవస్థానం పండితులకు అందజేశారు. నేడు సత్యదేవుని దివ్యకల్యాణం సత్యదేవుడు, అమ్మవార్ల దివ్యకల్యాణోత్సవం రత్నగిరి వార్షిక కల్యాణ వేదికపై శనివారం రాత్రి 9.30 గంటల నుంచి వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. వీవీఐపీలు, వీఐపీలు, సాధారణ భక్తులు, మహిళలకు వేర్వేరు ఎ¯ŒSక్లోజర్లు ఏర్పాటు చేశారు. దూరంగా ఉండే భక్తులకు కల్యాణం స్పష్టంగా కనిపించేందుకు టీవీ, స్క్రీ¯ŒSల ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. కల్యాణ వేదికను, ఏర్పాట్లను దేవస్థానం చైర్మన్, ఈఓ శుక్రవారం రాత్రి పరిశీలించారు. కల్యాణానికి మంత్రులు, కమిషనర్? సత్యదేవుని దివ్యకల్యాణానికి రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి పి.మాణిక్యాలరావు, మంత్రి సుజయ కృష్ణ రంగారావు, దేవాదాయశాఖ కమిషనర్ వైవీ అనూరాధ, జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు, కలెక్టర్ తదితరులు హాజరయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అన్నవరంలో నేడు వైదిక కార్యక్రమాలు తెల్లవారు జాము 3 గంటలకు సుప్రభాతసేవ ఉదయం 8 గంటలకు చతుర్వేదపారాయణ 9 గంటలకు అంకురార్పణ, «ధ్వజారోహణ, కంకణధారణ, దీక్షావస్త్రధారణ రాత్రి 7 గంటలకు కొండ దిగువన స్వామి వారికి వెండి గరుడ వాహనంపై, అమ్మవారికి గజ వాహనంపై, సీతారాములకు వెండి పల్లకీపై ఊరేగింపు రాత్రి 9.30 నుంచి కొండ మీద వార్షిక కల్యాణ వేదికపై సత్యదేవుని దివ్యకల్యాణం సాంస్కృతిక కార్యక్రమాలు ఉదయం 6 నుంచి 9 గంటల వరకూ భజనలు 8 సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకూ భక్తిరంజని, 6 నుంచి 7 గంటల వరకూ గాత్ర కచేరీ -
రత్నగిరిపై కల్యాణ కాంతులు
- నేటి నుంచే సత్యదేవుని దివ్యకల్యాణ మహోత్సవాలు - సాయంత్రం 4 గంటలకు వధూవరులు కానున్న అమ్మవారు, స్వామి - రేపు రాత్రి 9.30 గంటల నుంచి కల్యాణ మహోత్సవం అన్నవరం : మంచి వ్యక్తితో తన జీవితం ముడిపడాలని.. మంచి చదువు, ఉద్యోగం దొరకాలని పార్థించే యువతీయువకులు.. తమ కాపురం నిండు నూరేళ్లూ అష్టైశ్వర్యాలతో పచ్చగా సాగాలని వేడుకొనే నవదంపతులు.. తమ పిల్లల భవిష్యత్తు చక్కగా సాగాలని కోరుకొనే లక్షలాది మంది భక్తులు.. ఇలా భక్తులు కోరిన కోర్కెలు తీర్చే భక్తవరదుడైన సత్యదేవుడు, దేవేరి అనంతలక్ష్మీ సత్యవతీదేవితో కలిసి.. లోకకల్యాణార్థం కల్యాణ తిలకం దిద్దుకుంటున్నవేళ.. పావన దివ్యక్షేత్రం రత్నగిరి సానువులు పులకరిస్తున్నాయి. వరాలిచ్చే సత్యదేవుడే వరుడవుతున్న వేళ.. సిరులిచ్చే శ్రీమహాలక్ష్మే వధువవుతున్న శుభవేళ.. రత్నగిరి కల్యాణశోభతో తుళ్లిపడుతోంది. ఈ కమనీయ ఘట్టానికి దేవస్థానంలో విస్తృత ఏర్పాట్లు చేశారు. ఆలయాన్ని విద్యుద్దీపాలతో సుందరంగా అలంకరించారు. అనివేటి మండపంలో అంగరంగ వైభవంగా.. సత్యదేవుని ప్రధానాలయం దిగువన అనివేటి మండపంలో అమ్మవారిని, సత్యదేవుడిని వధూవరులను చేసే కార్యక్రమం అంగరంగ వైభవంగా జరగనుంది. వైశాఖ శుద్ధ దశమి శుక్రవారం సాయంత్రం 4 గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమం గంటన్నరపాటు జరుగుతుందని పండితులు తెలిపారు. అనంతరం రాత్రి 7 గంటలకు రత్నగిరి కళావేదిక మీద ఎదుర్కోలు ఉత్సవం జరుగుతుంది. పండితులు రెండు పక్షాలుగా ఏర్పడి.. స్వామి, అమ్మవార్ల ఘనకీర్తిని, వంశచరితను వివరించడమే ఈ కార్యక్రమం ప్రత్యేకత. సీతారాములే పెళ్లిపెద్దలుగా.. సత్యదేవుని కల్యాణానికి రత్నగిరి క్షేత్రపాలకుడైన శ్రీరామచంద్రుడు, సీతమ్మతల్లి పెళ్లి పెద్దలుగా వ్యవహరించనున్నారు. అమ్మవారిని, సత్యదేవుడిని వధూవరులను చేసే కార్యక్రమం నుంచే వారి పెద్దరికం మొదలవుతుంది. వైశాఖ శుద్ధ ఏకాదశి, శనివారం రాత్రి 9.30 గంటల నుంచి జరిగే కల్యాణం, ఆపై ఐదు రోజులపాటు వరుసగా జరిగే వైదిక కార్యక్రమాలు.. పండిత సత్కారం, వనవిహారం, చక్రస్నానం, శ్రీపుష్పయాగం తదితర కార్యక్రమాలకు సీతారాములే పెళ్లి పెద్దలుగా వ్యవహరించనున్నారు. వారం రోజులపాటు నిత్యకల్యాణాల నిలుపుదల ప్రతి నిత్యం స్వామి, అమ్మవార్లకు కల్యాణ మండపంలో నిత్య కల్యాణం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే స్వామివారి దివ్యకల్యాణ మహోత్సవాల్లో భాగంగా శుక్రవారం నుంచి ఏడు రోజులపాటు వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఏడు రోజులూ స్వామివారి నిత్యకల్యాణాలు జరగవు. తిరిగి 12వ తేదీ నుంచి నిత్య కల్యాణాలు ప్రారంభమవుతాయి. -
అన్నవరంలో భక్తుల అష్టకష్టాలు
-
కొండకు కల్యాణశోభ
-సత్యదేవుని పెండ్లివేడుకకు ముస్తాబైన రత్నగిరి -శనివారం రాత్రి 9.30 గంటల నుంచి పరిణయోత్సవం అన్నవరం : సత్యదేవుని కల్యాణ వేడుకలకు రత్నగిరి ముస్తాబయింది. శుక్రవారం నుంచి ఈనెల 11 వరకూ జరగనున్న వేడుకలకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ప్ర«ధానాలయం, ఉపాలయాలు, కల్యాణ వేదిక, ఇతర కట్టడాలను, కొండ దిగువన వివిధ సత్రాలనూ రంగు రంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు. భక్తులకు ఎండ తగలకుండా ప్రధానాలయం చుట్టూ షామియానాలు వేయించారు. అన్నవరంలో పలు చోట్ల పెద్ద పెద్ద బ్యానర్లు, ఫెక్ల్సీలు ఏర్పాటు చేశారు. ఇప్పటికే అన్నవరం, చుట్టుపక్కల గ్రామాలలో సత్యదేవుని ప్రచారరథం ద్వారా కల్యాణ మహోత్సవాల గురించి ప్రచారం చేస్తున్నారు. శుక్రవారం సాయంత్రం నాలుగు గంటలకు సత్యదేవుడు, అమ్మవార్లను వధూవరులను చేయడంతో కల్యాణ వేడుకలు ప్రారంభమవుతాయి. శనివారం రాత్రి 9.30 గంటల నుంచి జరిగే సత్యదేవుడు, అమ్మవారి దివ్యకల్యాణ మహోత్సవాన్ని దూరదర్శన్, టీటీడీ చానల్లు ప్రత్యక్ష ప్రసారం చేయనున్నాయి. ఊరేగింపునకు వాహనాలు సిద్ధం శుక్రవారం నుంచి మంగళవారం వరకూ కొండ దిగువన పెళ్లిపెద్దలు శ్రీసీతారాములతో పాటు సత్యదేవుడు, అమ్మవార్లను వివిధవాహనాలలో ఊరేగించనున్నారు. ఆ వాహనాలకు మరమ్మతులు చేసి సిద్ధ చేశారు. రావణబ్రహ్మ, పొన్నచెట్టు వాహనాలకు రంగులు వేసి ఊరేగింపునకు సిద్దం చేశారు. ఊరేగింపు జరిగే ఐదు రోజులు అన్నవరం మెయిన్ రోడ్ మీద ట్రాఫిక్‌ను నియంత్రించనున్నారు. కల్యాణోత్సవాల సందర్భంగా ప్రత్తిపాడు సీఐ ఆధ్వర్యంలో సుమారు 50 మంది పోలీసులు బందోబస్తు ఏర్పాట్లలో పాల్గొననున్నారు. కల్యాణం రోజున నలుగురు ఎస్ఐలు, వందమంది పోలీసులు బందోబస్తులో పాల్గొంటారు. స్థానిక కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాలు కల్యాణోత్సవాల ఏడు రోజులు స్థానిక కళాకారులతో భక్తిరంజని, హరికథ, బుర్రకథ, కూచిపూడి, భరతనాట్యం వంటి సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. పౌరాణిక నాటకాలను ఈ ఏడాది కూడా రద్దు చేశారు. -
శ్రీకారం చుట్టుకుంది.. పెళ్లి ఉత్సవం..
ఐదు నుంచి 11వ తేదీ వరకూ సత్తెన్న కల్యాణ మహోత్సవాలు వైశాఖ ఏకాదశి, ఆరో తేదీ రాత్రి 9:30కి దివ్య కల్యాణం అన్నవరం : సత్యదేవుని వార్షిక కల్యాణ వేడుకలకు పెళ్లిపుస్తకం(శుభలేఖ) శ్రీకారం చుట్టింది. ప్రతీసారి వీఐపీలకు, ఇతర ముఖ్యులకు పంపిణీ చేసే శుభలేఖ రంగుల పుస్తకంలా ఉండేది. అయితే ఈసారి ఆ పుస్తకానికి బదులు డిజిటల్ ప్రింటింగ్‌లో ఆకర్షణీయంగా శుభలేఖ ముద్రించారు. వైశాఖ శుద్ధ దశమి ఈనెల ఐదో తేదీ నుంచి 11వ తేదీ వరకూ స్వామివారి దివ్యకల్యాణ మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించేందుకు దేవస్థానంలో ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. వైశాఖ శుద్ధ ఏకాదశి ఆరో తేదీ రాత్రి 9:30 గంటల నుంచి సత్యదేవుడు, అనంతలక్ష్మీ అమ్మవార్లకు రత్నగిరి కల్యాణ వేదికపై దివ్యకల్యాణమహోత్సవం కన్నుల పండువగా జరగనుంది.ఇప్పటికే ఈ శుభలేఖలను ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులకు దేవస్థానం చైర్మ¯ŒS ఐవీ రోహిత్, ఈఓ కే నాగేశ్వరరావు స్వయంగా అందజేశారు. ఊరూవాడా పోస్టర్లు, కరపత్రాలతో ప్రచారం చేస్తున్నారు. ఏడు రోజుల వేడుక... సత్యదేవుని దివ్యకల్యాణమహోత్సవాలను ఏడు రోజుల పాటు నిర్వహించనున్నారు. ఈ వేడుకల కోసం బడ్జెట్లో రూ.40 లక్షలు కేటాయించారు. విద్యుత్ దీపాలంకరణ, ఇతర పనులకు అదనంగా మరో రూ.పది లక్షల వరకూ ఖర్చు చేసే వీలుంది. కల్యాణమహోత్సవాలు షెడ్యూల్ l మే 5, వైశాఖ శుద్ధ దశమి : స్వామి, అమ్మవార్లను వధూవరులు చేసే కార్యక్రమం l మే 6, వైశాఖ శుద్ధ ఏకాదశి : శ్రీసత్యదేవుని దివ్య కల్యాణమహోత్సవం. రాత్రి 9 : 30 గంటల నుంచి రత్నగిరిపై వార్షిక కల్యాణవేదిక మీద సత్యదేవుడు, అమ్మవార్లకు దివ్యకల్యాణ మహోత్సవం. l మే 7, వైశాఖ శుద్ధ ద్వాదశి : నవదంపతులకు అరుంధతీ నక్షత్ర దర్శనం, రావణబ్రహ్మ వాహనంమీద స్వామివారి ఊరేగింపు l మే 8, వైశాఖ శుద్ధ త్రయోదశి: వేదపండిత సదస్యం l మే 9, వైశాఖ శుద్ధ చతుర్దశి: వనవిహారోత్సవం, వెండి రథోత్సవం l మే 10, వైశాఖ పౌర్ణిమ: ఉదయం, శ్రీచక్రస్నానం, మధ్యాహ్నం గౌరీపూజ, నాకబలి, దండియాడింపు. l మే11, వైశాఖ బహళ పాడ్యమి. శ్రీపుష్పయాగ మహోత్సవం -
వైశాఖం.. వైభోగం..
సత్యదేవుని సన్నిధిలో జోరుగా కల్యాణాలు గత రెండ్రోజుల్లో 200 వివాహాలు శనివారం పగలు కూడా ఒక్కటైన జంటలు మే నెలంతా, జూ¯ŒS 18 వరకూ పెళ్లిళ్లే పెళ్లిళ్లు అన్నవరం : రత్నగిరి సత్యదేవుని సన్నిధి పెళ్లి బాజాల మోతతో మార్మోగుతోంది. ఏడాదిలో అత్యధికంగా వివాహాలు జరిగే వైశాఖ మాసం గురువారం నుంచి ప్రారంభమైన విషయం విదితమే. దివ్యమైన వివాహ ముహూర్తాలుండడంతో రత్నగిరిపై రెండురోజులుగా పెళ్లిళ్లు జోరుగా జరుగుతున్నాయి. వైశాఖ శుద్ద తదియ, శుక్రవారం రోహిణి నక్షత్రం శుభముహూర్తంలో రాత్రి 12: 40, శనివారం తెల్లవారుజామున 3 : 40 గంటల ముహూర్తంలో పెద్దసంఖ్యలో వివాహాలు జరిగాయి. వివాహాలకు విచ్చేసిన పెళ్లిబృందాల వాహనాలతో శుక్రవారం రాత్రి దేవస్థానం కళాశాల మైదానం నిండిపోయింది. శనివారం పగలు కూడా జోరుగా పెళ్లిళ్లు రోహిణీ న„ýక్షత్రం ఉండడంతో శనివారం ఉదయం 11–19 గంటల ముహూర్తంలోనూ దేవస్థానంలో వివాహాలు జరిగాయి. రోశయ్య మండపం, సర్క్యులర్ మండపం ఈ వివాహాలకు విచ్చేసిన బంధుమిత్రులతో నిండిపోయింది. గత రెండు రోజుల్లో సుమారు 200కి పైగా వివాహాలు జరిగినట్టు అధికారులు తెలిపారు. మే, జూ¯ŒS నెలల్లో జోరుగా వివాహ ముహూర్తాలు వైశాఖ మాసంలో ఈనెల 30, మే నెలలో 4, 6, 7, 8, 11, 12, 13, 14, 17, 18, 19, 20, 21 తేదీల్లో వివాహ ముహూర్తాలు ఉండడంతో ఆయా రోజుల్లో వివాహాలు జరుగునున్నాయి. అదే విదంగా జ్యేష్ట మాసంలో మే 27, 28, 29, 31 తేదీల్లో, జూ¯ŒS నెలలో ఒకటో తేదీ నుంచి 18వ తేదీ వరకూ వివాహ ముహూర్తాలు ఉన్నాయి. వీటి తరువాత ఆషాఢమాసం, ఇతర కారణాల వల్ల సుమారు 40 రోజుల పాటు వివాహాలకు విరామం. తిరిగి జూలై 27వ తేదీ నుంచి వివాహాలు జరుగనున్నాయని పండితులు తెలిపారు. నవ దంపతులతో ఆలయప్రాంగణం కిటకిట భారీగా విచ్చేసిన నవదంపతులు, వారి బంధుమిత్రులతో శనివారం సత్యదేవుని సన్నిధి నిండిపోయింది. శుక్రవారం రాత్రి, శనివారం తెల్లవారుజామున, ఉదయం రత్నగిరిపై పెద్దసంఖ్యలో వివాహాలు జరిగాయి. వీరంతా సత్యదేవుని వ్రతాలాచరించి, స్వామివారిని దర్శించి పూజలు చేశారు. దీంతో రత్నగిరిపై ఎక్కడ చూసినా నవదంపతులు కనువిందు చేశారు. -
సత్యదేవుని దర్శించిన రాష్ట్ర పీఏసీ చైర్మన్‘బుగ్గన’
తుని ఎమ్మెల్యే రాజా, పర్వత ప్రసాద్‌లతో కలిసి స్వామివారికి పూజలు అన్నవరం : రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్, కర్నూల్ జిల్లా డో¯ŒS శాసన సభ్యుడు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గురువారం ఉదయం రత్నగిరిపై సత్యదేవుని దర్శించి పూజలు చేశారు. తుని శాసనసభ్యుడు దాడిశెట్టి రాజా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రత్తిపాడు నియోజకవర్గ సమన్వయకర్త పర్వత పూర్ణచంద్రప్రసాద్‌తో కలిసి ఆయన స్వామివారి ఆలయానికి విచ్చేశారు. వారికి పండితులు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. స్వామివారి దర్శనం అనంతరం వేదపండితులు ఆశీస్సులందజేశారు. ఆలయ ఏసీ ఈరంకి జగన్నాథరావు స్వామివారి ప్రసాదాలను ఆయనకు అందించారు. బుగ్గన మాట్లాడుతూ తమ కుటుంబ ఇష్ట దైవం సత్యదేవుడని, ప్రతి నెలా తమ ఇంట్లో సత్యదేవుని వ్రతమాచరిస్తామని తెలిపారు. అధికారంలోకి రావడం ఖాయం.. అన్నవరం వచ్చిన బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డిని స్థానిక వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు కలిశారు. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై ఆయన స్పందిస్తున్న తీరును ప్రశంసించారు. ఈ సందర్భంగా బుగ్గన మాట్లాడుతూ మరో 18 నెలలు ఓపిక పడితే మన ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని కార్యకర్తలకు తెలిపారు. ఒకవేళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అదృష్టం బాగుంటే వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం రావడం మరో నాలుగు నెలలు ఆలస్యమవుతుందే తప్ప అధికారంలోకి రావడం ఖాయం అని తెలిపారు. సత్యదేవుని చిత్రపటాన్ని బహూకరించిన కార్యకర్తలు సత్యదేవుని చిత్రపటాన్ని స్థానిక వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నాయకులు ఆయనకు బహూకరించారు. తుని మండల పార్టీ కన్వీనర్ పోతల రమణ, ఆరుమిల్లి ఏసుబాబు, నాగం గంగబాబు స్థానిక పార్టీ నాయకులు సరమర్ల మధుబాబు, ఎస్ కుమార్ రాజా, రాయి శ్రీనివాస్, ధారా వెంకటరమణ, తాడి సత్యనారాయణ, బొబ్బిలి వెంకన్న, బీఎస్వీ ప్రసాద్, ఆశిన శ్రీనివాస్, కొల్లు చిన్నా, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
సత్యదేవుని దర్శనానికి పోటెత్తిన భక్తులు
అన్నవరం : రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ జయంతి, సెలవు దినం కావడంతో రత్నగిరి సత్యదేవుని ఆలయానికి శుక్రవారం పెద్ద సంఖ్యలో భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. మొత్తం 12 వేలమంది భక్తులు దర్శించుకోగా 1,233 వ్రతాలు జరిగాయి. సుమారు రూ.12 లక్షల ఆదాయం సమకూరింది. భక్తులతోపాటు ప్రభుత్వ ఉన్నతాధికారులు కూడా స్వామివారిని దర్శించుకున్నారు. దక్షిణ మధ్య రైల్వే చీఫ్ మెడికల్ ఆఫీసర్ కేహెచ్‌కే దొర, నేవీ డైరెక్టర్ థాకరేలు స్వామివారిని దర్శించినవారిలో ఉన్నారు. వారికి ఆలయం వద్ద ఏసీ జగన్నాథరావు ఘనంగా స్వాగతం పలికారు. దర్శనానంతరం స్వామివారి ప్రసాదాలను బహూకరించారు. -
సత్యదేవుడిని దర్శించిన ఆర్టీఐ కమిషనర్
అన్నవరం : సమాచారహక్కు చట్టం(ఆర్టీఐ) కమిషనర్ వేంకటేశ్వర్లు దంపతులు గురువారం రత్నగిరిపై సత్యదేవుని వ్రతమాచరించి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం వేదపండితులు వేదాశీస్సులందించగా దేవస్థానం ఏసీ ఈరంకి జగన్నాథరావు వారికి స్వామివారి ప్రసాదాలను అందజేశారు.