ఆదాయంపై పెద్దదెబ్బ.. | annavaram temple income | Sakshi
Sakshi News home page

ఆదాయంపై పెద్దదెబ్బ..

Published Tue, Apr 4 2017 11:33 PM | Last Updated on Tue, Sep 5 2017 7:56 AM

annavaram temple income

  • నోట్ల రద్దు ప్రభావంతో స్వల్పంగానే పెరిగినసత్తెన్న ఆదాయం 
  • 2016–17లో సత్యదేవుని ఆదాయం రూ.122.59 కోట్లు
  • 2015–16లో 118.95 కోట్లు పెరిగిన ఆదాయం కేవలం రూ.3.60 కోట్లు మాత్రమే
  • 2016–17 లో దేవస్థానంలో ఖర్చు రూ.117.64 కోట్లు 
  • రూ.34 కోట్లకు చేరిన అన్నదానం విరాళాలు
  •  
    గడచిన ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2016–17లో సత్యదేవుని ఆదాయం కేవలం రూ.3.60 కోట్లు మాత్రమే పెరిగింది 
    అవును మీరు చదివింది నిజమే.. మూడేళ్లుగా ఆదాయంలో దూకుడు ప్రదర్శిస్తున్న సత్తెన్నపై ఈ ఏడాది పెద్దనోట్ల రద్దు ప్రభావం పడిందో! ఏమో! కానీ ఈ సారి ఆదాయం తగ్గింది. ఈ విషయాన్ని ఆలయ చైర్మ¯ŒS, అధికారులు చెబుతున్నారు. 
    – అన్నవరం (ప్రత్తిపాడు)
     
    2016–17లో స్వామివారికి రూ.122,59,79,867 ఆదాయం సమకూరినట్టు దేవస్థానం చైర్మ¯ŒS రాజా ఐవీ రోహిత్, ఈఓ కే నాగేశ్వరరావు మంగళవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో తెలిపారు. 
    ∙2013–14లో స్వామివారి ఆదాయం రూ.72,05 కోట్లు, 2014–15లో 92.92 కోట్లుకాగా పెరుగుదల  రూ.21 కోట్లు.  
    ∙2015–16లో ఆదాయం రూ.118.95 కోట్లు కాగా, పెరుగుదల రూ.26 కోట్లు.  వీటితో పోలిస్తే గడచిన ఏడాదిలో పెరిగిన రూ.3.60 కోట్లు చాలా స్వల్పమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
    త్వరలోనే దేవస్థానం ఆదాయం రూ.150 కోట్లకు చేరవవుతుందని భావించిన అధికారులకు గత ఏడాది ఆదాయం బాగా తగ్గిపోవడం ఆందోళన కలిగిస్తోంది.  ఆదాయం తగ్గుదలపై విభాగాల వారీగా సమీక్ష నిర్వహించి ఆదాయం పెరిగేలా చర్యలు తీసుకోకపోతే భవిష్యత్‌లో ఇబ్బంది తప్పదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
    2016–17లో వ్యయం రూ.117.64 కోట్లు
    2016–17 ఆర్థిక సంవత్సరంలో  మొత్తం రూ.117.64 కోట్లు వ్యయమైనట్టు చైర్మ¯ŒS రోహిత్, ఈఓ నాగేశ్వరరావు తెలిపారు. వీటిలో ప్రధానంగా వ్రతాల నిర్వహణ, పురోహితుల పారితోషికానికి రూ.14.25 కోట్లు, ప్రసాదం తయారీ, ప్యాకర్ల పారితోషికం కలిపి రూ.14 కోట్లు, శానిటేష¯ŒSకు రూ.3.40 కోట్లు, సిబ్బంది జీతభత్యాలు, పెన్షన్లు, కాంట్రాక్ట్‌ సిబ్బంది వేతనాలు రూ.24 కోట్లు, సీజీఎఫ్, ఇతర చెల్లింపులు రూ.11 కోట్లు, వివిధ నిర్మాణాలు, విద్యుత్‌ పరికరాల కొనుగోళ్లకు రూ.మూడు కోట్లు, విద్యుత్‌ చార్జీల కింద రూ. 1.50 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు.
    బ్యాంకుల్లో డిపాజిట్లు రూ.42.04 కోట్లు..
    వివిధ వాణిజ్య బ్యాంకుల్లో దేవస్థానానికి (అన్నదానం డిపాజిట్లు కాకుండా) రూ.42.04 కోట్లు డిపాజిట్లు ఉన్నాయని తెలిపారు. ఈ డిపాజిట్లలో రూ.17 కోట్లు గత రెండేళ్లలో కొత్తగా వేశామని వివరించారు. మిగిలిన డిపాజిట్లు రెన్యువల్‌ చేసినవన్నారు.
    ఈ ఏడాది అభివృద్ధి ప్రణాళిక
    2017–18లో దేవస్థానంలో అనేక అభివృద్ధి చర్యలు చేపట్టనున్నట్టు చైర్మన్, ఈఓ తెలిపారు. దేవస్థానంలో సత్యగిరి, రత్నగిరి సత్రాలలో బస చేసే భక్తుల కోసం ఒక బస్‌ను ఉచితంగా నడపనున్నామని, ఈ బస్‌ ఒకట్రెండు రోజుల్లో విజయనగరం నుంచి వస్తుందని తెలిపారు. మరో కొత్త బస్‌ కొండదిగువ నుంచి రత్నగిరికి టికెట్‌ పద్ధతిన నడపనున్నామన్నారు. యాగశాల నిర్మాణం ప్రారంభిస్తామని, సత్యగిరిపై ఆగమ పాఠశాల పనులు వేగవంతం చేస్తామన్నారు. రూ.2.95 కోట్ల వ్యయంతో దేవస్థానం లైట్‌ అండ్‌ సౌండ్‌ సిస్టమ్‌ ఏర్పాటు చేస్తామన్నారు. అన్నదానం భవన నిర్మాణం చేపట్టనున్నట్టు తెలిపారు. కేంద్రప్రభుత్వ ఆయుష్‌ విభాగం వారితో సహజ ఆసుపత్రి లో ప్రత్యేక విభాగం ఏర్పాటు చేస్తామని తెలిపారు.
     
    అన్నదాన పథకంలో 10.83 లక్షల మందికి భోజనం
    2016–17లో సత్యదేవుని నిత్యాన్నపథకంలో 10,83,067 మంది భక్తులకు భోజనం పెట్టామని తెలిపారు. 2014–15లో 10.96 లక్షల మందికి, 2015–16లో 11.64 లక్షల మందికి భోజనం పెట్టినట్టు తెలిపారు. గడచిన ఆర్థిక సంవత్సరంలో భక్తుల రాక తగ్గినందున ఆ మేరకు భోజనాలు తగ్గాయని వివరించారు. అన్నదానపథకానికి గత 30 ఏళ్లుగా భక్తులు సమర్పించిన విరాళాలు రూ.33,98,71,086  బ్యాంకులో డిపాజిట్లుగా  జమ చేశామన్నారు. కాగా గడచిన సంవత్సరంలో వచ్చిన విరాళాలు రూ.2.98 కోట్లు. 
    అన్నదాన పథకంలో భోజనం తయారీ ఖర్చు 
    2014–15లో రూ.29.88, 2015–16లో రూ.27.09, 2016–17లో రూ.26.95. ప్రస్తుతం అన్నదానపథకంలో రూ.లక్ష అంతకంటే ఎక్కువ విరాళాలిచి్చన దాతలు 639, రూ.50వేలు పైబడి 454, రూ.పది వేలు అంతకన్నా ఎక్కువగా ఇచ్చినవారు 4,294, రూ.వేయి కన్నా ఎక్కువ మొత్తం విరాళం ఇచ్చిన దాతలు 1,08,441 మంది ఉన్నారు.
     
     
    నాలుగేళ్లుగా వచ్చిన ఆదాయం (రూ.కోట్లలో)
    విభాగం...             2013–14     2014–15    2015–16    2016–17
    వ్రతాలు.... 13.84 19.19 21.76 23.33
    ప్రసాదం 15.73 17.57 19.46 20.49
    హుండీలు 09.62 11.04 12.59 12.42 
    సత్రాలు 05.11 05.65 05.90 06.87
    స్పెషల్‌ దర్శనం 03.12 03.53 05.72 05.00
    షాపుల లీజులు 08.57 10.37 11.65 14.42
    డిపాజిట్‌లపై వడ్డీ 02.05 02.65 02.58 04.18
    ట్రా¯Œ్సపోర్టు 00.84 00.86 01.03 01.07
    ఇతర విభాగాలు 13.17 22.07 38.26 34.82
    మొత్తం 72.05 92.93 118.95 122.60
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement