temple income
-
టీటీడీ ఆదాయం అదుర్స్
-
షిర్డీ ఆలయానికి భారీగా ఆదాయం.. మూడు రోజుల్లోనే రూ. 5 కోట్లు
షిర్డీ: ప్రముఖ పుణ్యక్షేత్రం షిర్డీలో ఇటీవల మూడు రోజులపాటు జరిగిన గురుపౌర్ణమి ఉత్సవాల్లో భక్తులు భారీగా విరాళాలు సమర్పించుకున్నారు. ఈ సందర్భంగా భక్తులు హుండీలో నగదు, బంగారు, వెండి వస్తువులు, కౌంటర్లవద్ద చెక్కులు, వివిధ రకాల చెల్లింపుల ద్వారా బాబా ఆలయ సంస్ధాన్‌కు ఏకంగా రూ.5.57 కోట్లు విరాళాలు వచ్చాయి. ఏటా షిర్డీ పుణ్యక్షేత్రంలో గురుపౌర్ణమి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. కరోనా కారణంగా గత రెండేళ్లుగా ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌వల్ల ఆలయం మూసి ఉంచడంతో వివిధ పండుగలకు, ఉత్సవాలకు భక్తులు రాలేకపోయారు. ఈ ఏడాది కరోనా వైరస్ నియంత్రణలోకి రావడంతో ప్రభుత్వం లాక్డౌన్ అంక్షలన్నీ ఎత్తివేసింది. ఆ తరువాత గురుపౌర్ణమి ఉత్సవాలు జరగడంతో భక్తులు పోటీపడుతూ షిర్డీకి చేరుకున్నారు. మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌సహా దేశంలోని వివిధ ప్రాంతాలు, నలుమూలల నుంచి సుమారు మూడు లక్షలకుపైగా భక్తులు వచ్చి బాబా సమాధిని దర్శించుకున్నారు. మూడు రోజులపాటు షిర్డీ పుణ్యక్షేత్రం భక్తులతో పులకించిపోయింది. ఈ సందర్భంగా బాబా సమాధి ఆలయంలో, పరిసరాల్లో ఏర్పాటు చేసిన హుండీలలో భక్తులు భారీగా విరాళాలు సమర్పించుకున్నా రు. గురుపౌర్ణమి ఉత్సవాలు ముగిసిన తరువాత హుండీలలో సమర్పించిన నగదు, బంగారు, వెండి వస్తువుల రూపంలో సమర్పించిన కానుకలు, విరాళాలు సేకరించే కౌంటర్లవద్ద భక్తులు చెల్లింపులను లెక్కించారు. అందులో సుమారు రూ.5.57 కోట్లు విరాళాలు వచ్చినట్లు బాబా సంస్ధాన్ తెలిపింది. ఇందులో హుండీలలో రూ.2,16,84,939 నగదు, విరాళాలు సేకరించే కౌంటర్లవద్ద రూ.1,59, 18,974 నగదు, అదేవిధంగా చెక్, డీ.డీ., మనీ అర్డర్, డెబిట్, క్రెడిట్ కార్డు, ఆన్లైన్ చెల్లింపుల ద్వారా రూ.1,36,38,000 మేర వచ్చాయి. విదేశీ కరెన్సీ రూపంలో రూ.19,80,094 వచ్చాయి. అలాగే రూ.22.14 లక్షల విలువచేసే 479.500 గ్రాముల బంగారం, రూ.3.22 లక్షలు విలువ చేసే 8,067.800 గ్రాముల వెండి వస్తువులున్నాయి. 1.35 లక్షల హెక్టార్లలో పంటనష్టం: ఫడ్నవీస్ నాగ్‌పూర్/చంద్రాపూర్: వరదల కారణంగా నాగ్‌పూర్ డివిజన్లో దాదాపు 1,35,000 హె క్టార్లలో పంటలు దెబ్బతిన్నాయని మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మంగళవారం తెలిపారు. హింగ్‌ఘాట్, చంద్రాపూర్ జిల్లాల్లో మంగళవారం వర్ష ప్రభావిత గ్రామాలను సందర్శించిన అనంతరం ఫడ్నవీస్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నాగ్‌పూర్ డివిజన్లో ముఖ్యంగా చంద్రాపూర్, గడ్చిరోలి జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయని చెప్పారు. ప్రాథమిక పరిశీలన ప్రకారం నాగ్‌పూర్ డివిజన్లో వరదలతో 1,35,000 హెక్టార్ల భూమిలో పంటలు దెబ్బతిన్నాయని, పంట నష్టాలపై సర్వే జరుగుతోందని, వీలైనంత త్వరగా నష్టపరిహారం అందించేందుకు యంత్రాంగం కృషి చేస్తున్నదన్నారు. అలాగే జిల్లాలోని చిమూర్ తహసీల్‌లోని నవేగావ్ (పేథ్)లో పంట నష్టాన్ని కూడా ఫడ్నవీస్ పరిశీలించారు. -
ఆదాయం లేని ఆలయాలకు ఊరట
సాక్షి, అమరావతి: ఆదాయం తక్కువ ఉండే ఆలయాలపై అదనపు భారాలు పడకుండా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రూ.ఐదులక్షల లోపు ఆదాయం ఉండే గుళ్లు, ఇతర హిందూ ధార్మికసంస్థలు చట్టబద్ధంగా దేవదాయ శాఖకు చెల్లించాల్సిన వివిధ రకాల ఫీజుల నుంచి మినహాయింపునిచ్చింది. ఇందుకు సంబంధించి దేవదాయ శాఖ కమిషనర్ హరిజవహర్‌లాల్ సోమవారం జిల్లాల దేవదాయ శాఖ అధికారులకు, డిప్యూటీ కమిషనర్లు, రీజనల్ జాయింట్ కమిషనర్లకు సూచనలు జారీచేశారు. అధికారిక ఉత్తర్వులు వెలువడాల్సి ఉన్నప్పటికీ.. కమిషనర్ ముందుగానే ఆయా ఆలయాల నుంచి ఆ తరహా ఫీజులను వసూలు చేయవద్దని సూచిస్తూ మెసేజ్ ఆదేశాలు జారీచేశారు. దేవదాయ శాఖ చట్టం ప్రకారం.. ఎన్నో ఏళ్ల నుంచి రాష్ట్రంలో రూ.రెండులక్షలకు పైగా ఆదాయం ఉన్న ఆలయాలు ఏటా కొంత మొత్తం దేవదాయ శాఖకు చెల్లించాలి. ఆదాయం తక్కువ ఉండే పురాతన ఆలయాల పునర్నిర్మాణంతో పాటు హిందూ ధార్మిక కార్యక్రమాలకు ఉద్దేశించిన కామన్ గుడ్ ఫండ్ (సీజీఎఫ్)కు ప్రతి ఆలయం తమ నికర ఆదాయంలో తొమ్మిది శాతం చొప్పున చెల్లించాలి. దేవదాయ శాఖ నిర్వహణ నిధికి మరో ఎనిమిది శాతం, ఆడిట్ ఫీజుగా 1.5 శాతం చొప్పున చెల్లించాలి. ఇటీవల రూ.ఐదులక్షల లోపు ఆదాయం ఉండే ఆలయాలను ఈ తరహా ఫీజులు వసూలు నుంచి మినహాయించే విషయం పరిశీలించాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. హైకోర్టు సూచనపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ఫీజు మినహాయింపునకు ఆదాయ పరిమితిని ఏటా రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు పెంచింది. 95 శాతం ఆలయాల ఆదాయం రూ.ఐదులక్షల లోపే.. రాష్ట్రంలో దేవదాయ శాఖ పరిధిలో మొత్తం 24,699 గుళ్లు, ఇతర హిందూ ధార్మికసంస్థలు ఉన్నాయి. వీటిలో ఏటా రూ.ఐదులక్షల లోపు ఆదాయం ఉండే ఆలయాలు 23,465 ఉన్నాయి. అంటే దేవదాయ శాఖ పరిధిలోని మొత్తం గుళ్లలో ఏటా రూ.ఐదులక్షల లోపు నికర ఆదాయం ఉండే ఆలయాలే 95 శాతం. రూ.ఐదులక్షల లోపు ఆదాయం ఉన్న వాటిలో 4,131 ఆలయాలు మాత్రమే దేవదాయ శాఖ కార్యనిర్వహణాధికారుల (ఈవోల) పర్యవేక్షణలో ఉన్నాయి. ఫీజు మినహాయింపునకు ఆదాయ పరిమితి పెంపుతో కొత్తగా 1,254 ఆలయాలకు లబ్ధికలుగుతుందని అధికారులు తెలిపారు. ఈ ఆలయాలు ఏటా రూ.7.31 కోట్ల వరకు ప్రయోజనం పొందే అవకాశం ఉందని వెల్లడించారు. అర్చకుల జీతభత్యాలకు వెసులుబాటు.. రూ.ఐదులక్షల లోపు ఆదాయం ఉండే ఆలయాలను దేవదాయ శాఖ చట్టబద్ధంగా చెల్లించాల్సిన ఫీజుల నుంచి మినహాయింపు ఇస్తూ తీసుకున్న నిర్ణయం వల్ల ఆయా ఆలయాల్లో పనిచేసే అర్చకుల జీతాలకు ఆర్థిక వెసులుబాటు కలుగుతుందని ఆంధ్రప్రదేశ్ అర్చక సమాఖ్య ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ నిర్ణయం అమలుకు కృషిచేస్తున్న అందరికీ సమాఖ్య ప్రధాన కార్యదర్శి అగ్నిహోత్రం ఆత్రేయబాబు కృతజ్ఞతలు తెలిపారు. -
ఆదాయంపై పెద్దదెబ్బ..
నోట్ల రద్దు ప్రభావంతో స్వల్పంగానే పెరిగినసత్తెన్న ఆదాయం 2016–17లో సత్యదేవుని ఆదాయం రూ.122.59 కోట్లు 2015–16లో 118.95 కోట్లు పెరిగిన ఆదాయం కేవలం రూ.3.60 కోట్లు మాత్రమే 2016–17 లో దేవస్థానంలో ఖర్చు రూ.117.64 కోట్లు రూ.34 కోట్లకు చేరిన అన్నదానం విరాళాలు గడచిన ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2016–17లో సత్యదేవుని ఆదాయం కేవలం రూ.3.60 కోట్లు మాత్రమే పెరిగింది అవును మీరు చదివింది నిజమే.. మూడేళ్లుగా ఆదాయంలో దూకుడు ప్రదర్శిస్తున్న సత్తెన్నపై ఈ ఏడాది పెద్దనోట్ల రద్దు ప్రభావం పడిందో! ఏమో! కానీ ఈ సారి ఆదాయం తగ్గింది. ఈ విషయాన్ని ఆలయ చైర్మ¯ŒS, అధికారులు చెబుతున్నారు. – అన్నవరం (ప్రత్తిపాడు) 2016–17లో స్వామివారికి రూ.122,59,79,867 ఆదాయం సమకూరినట్టు దేవస్థానం చైర్మ¯ŒS రాజా ఐవీ రోహిత్, ఈఓ కే నాగేశ్వరరావు మంగళవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో తెలిపారు. ∙2013–14లో స్వామివారి ఆదాయం రూ.72,05 కోట్లు, 2014–15లో 92.92 కోట్లుకాగా పెరుగుదల రూ.21 కోట్లు. ∙2015–16లో ఆదాయం రూ.118.95 కోట్లు కాగా, పెరుగుదల రూ.26 కోట్లు. వీటితో పోలిస్తే గడచిన ఏడాదిలో పెరిగిన రూ.3.60 కోట్లు చాలా స్వల్పమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. త్వరలోనే దేవస్థానం ఆదాయం రూ.150 కోట్లకు చేరవవుతుందని భావించిన అధికారులకు గత ఏడాది ఆదాయం బాగా తగ్గిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఆదాయం తగ్గుదలపై విభాగాల వారీగా సమీక్ష నిర్వహించి ఆదాయం పెరిగేలా చర్యలు తీసుకోకపోతే భవిష్యత్‌లో ఇబ్బంది తప్పదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 2016–17లో వ్యయం రూ.117.64 కోట్లు 2016–17 ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ.117.64 కోట్లు వ్యయమైనట్టు చైర్మ¯ŒS రోహిత్, ఈఓ నాగేశ్వరరావు తెలిపారు. వీటిలో ప్రధానంగా వ్రతాల నిర్వహణ, పురోహితుల పారితోషికానికి రూ.14.25 కోట్లు, ప్రసాదం తయారీ, ప్యాకర్ల పారితోషికం కలిపి రూ.14 కోట్లు, శానిటేష¯ŒSకు రూ.3.40 కోట్లు, సిబ్బంది జీతభత్యాలు, పెన్షన్లు, కాంట్రాక్ట్ సిబ్బంది వేతనాలు రూ.24 కోట్లు, సీజీఎఫ్, ఇతర చెల్లింపులు రూ.11 కోట్లు, వివిధ నిర్మాణాలు, విద్యుత్ పరికరాల కొనుగోళ్లకు రూ.మూడు కోట్లు, విద్యుత్ చార్జీల కింద రూ. 1.50 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. బ్యాంకుల్లో డిపాజిట్లు రూ.42.04 కోట్లు.. వివిధ వాణిజ్య బ్యాంకుల్లో దేవస్థానానికి (అన్నదానం డిపాజిట్లు కాకుండా) రూ.42.04 కోట్లు డిపాజిట్లు ఉన్నాయని తెలిపారు. ఈ డిపాజిట్లలో రూ.17 కోట్లు గత రెండేళ్లలో కొత్తగా వేశామని వివరించారు. మిగిలిన డిపాజిట్లు రెన్యువల్ చేసినవన్నారు. ఈ ఏడాది అభివృద్ధి ప్రణాళిక 2017–18లో దేవస్థానంలో అనేక అభివృద్ధి చర్యలు చేపట్టనున్నట్టు చైర్మన్, ఈఓ తెలిపారు. దేవస్థానంలో సత్యగిరి, రత్నగిరి సత్రాలలో బస చేసే భక్తుల కోసం ఒక బస్‌ను ఉచితంగా నడపనున్నామని, ఈ బస్ ఒకట్రెండు రోజుల్లో విజయనగరం నుంచి వస్తుందని తెలిపారు. మరో కొత్త బస్ కొండదిగువ నుంచి రత్నగిరికి టికెట్ పద్ధతిన నడపనున్నామన్నారు. యాగశాల నిర్మాణం ప్రారంభిస్తామని, సత్యగిరిపై ఆగమ పాఠశాల పనులు వేగవంతం చేస్తామన్నారు. రూ.2.95 కోట్ల వ్యయంతో దేవస్థానం లైట్ అండ్ సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేస్తామన్నారు. అన్నదానం భవన నిర్మాణం చేపట్టనున్నట్టు తెలిపారు. కేంద్రప్రభుత్వ ఆయుష్ విభాగం వారితో సహజ ఆసుపత్రి లో ప్రత్యేక విభాగం ఏర్పాటు చేస్తామని తెలిపారు. అన్నదాన పథకంలో 10.83 లక్షల మందికి భోజనం 2016–17లో సత్యదేవుని నిత్యాన్నపథకంలో 10,83,067 మంది భక్తులకు భోజనం పెట్టామని తెలిపారు. 2014–15లో 10.96 లక్షల మందికి, 2015–16లో 11.64 లక్షల మందికి భోజనం పెట్టినట్టు తెలిపారు. గడచిన ఆర్థిక సంవత్సరంలో భక్తుల రాక తగ్గినందున ఆ మేరకు భోజనాలు తగ్గాయని వివరించారు. అన్నదానపథకానికి గత 30 ఏళ్లుగా భక్తులు సమర్పించిన విరాళాలు రూ.33,98,71,086 బ్యాంకులో డిపాజిట్లుగా జమ చేశామన్నారు. కాగా గడచిన సంవత్సరంలో వచ్చిన విరాళాలు రూ.2.98 కోట్లు. అన్నదాన పథకంలో భోజనం తయారీ ఖర్చు 2014–15లో రూ.29.88, 2015–16లో రూ.27.09, 2016–17లో రూ.26.95. ప్రస్తుతం అన్నదానపథకంలో రూ.లక్ష అంతకంటే ఎక్కువ విరాళాలిచి్చన దాతలు 639, రూ.50వేలు పైబడి 454, రూ.పది వేలు అంతకన్నా ఎక్కువగా ఇచ్చినవారు 4,294, రూ.వేయి కన్నా ఎక్కువ మొత్తం విరాళం ఇచ్చిన దాతలు 1,08,441 మంది ఉన్నారు. నాలుగేళ్లుగా వచ్చిన ఆదాయం (రూ.కోట్లలో) విభాగం... 2013–14 2014–15 2015–16 2016–17 వ్రతాలు.... 13.84 19.19 21.76 23.33 ప్రసాదం 15.73 17.57 19.46 20.49 హుండీలు 09.62 11.04 12.59 12.42 సత్రాలు 05.11 05.65 05.90 06.87 స్పెషల్ దర్శనం 03.12 03.53 05.72 05.00 షాపుల లీజులు 08.57 10.37 11.65 14.42 డిపాజిట్లపై వడ్డీ 02.05 02.65 02.58 04.18 ట్రా¯Œ్సపోర్టు 00.84 00.86 01.03 01.07 ఇతర విభాగాలు 13.17 22.07 38.26 34.82 మొత్తం 72.05 92.93 118.95 122.60 -
బాసర అమ్మవారి ఆదాయం రూ. 49 లక్షలు
బాసర(నిర్మల్): బాసరలో కొలువు దీరిన శ్రీజ్ఞానసరస్వతి అమ్మవారి హుండీ లెక్కింపు కార్యక్రమం పూర్తైంది. గత 50 రోజుల్లో అమ్మవారి హుండీకి రూ. 49,79,327 నగదుతో పాటు 120 గ్రాముల బంగారం, రెండున్నర కిలోల వెండి ఆభరణాలు కానుకలుగా వచ్చాయి. వీటితో పాటు 13 విదేశీ కరెన్సీ నాణాలు కూడా ఉన్నాయి. -
నరసన్న సొమ్ము లెక్కలు చెప్పకుంటే ఉద్యమం
రూ.57 లక్షల ఖర్చుకు వివరాలు చెప్పని అన్నవరం అధికారులు వైఎస్సార్ సీపీ సీజీసీ సభ్యురాలు విజయలక్ష్మి కోరుకొండ : రాష్ట్రంలోనే ప్రసిద్ధిగాంచిన కోరుకొండ శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి పేరున బ్యాంక్ ఖాతాలో ఉన్న నగదు డ్రా చేసిన అన్నవరం దేవస్థానం అధికారులు ఖర్చుల లెక్కలు రెండు వారాల్లో స్వామి సన్నిధిలో భక్తుల సమక్షంలో తెలియజేయాలని వైఎస్సార్ సీపీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి డిమాండ్ చేశారు. లేనిపక్షంలో తమ పార్టీ ఆందోళన చేపడుతుందని హెచ్చరించారు. శనివారం ఆమె ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ ఆనువంశిక ధర్మకర్త ఎస్పీ రంగరాజ్భట్టార్స్వామితో మాట్లాడుతూ స్వామి పేరున బ్యాంక్‌లో ఉన్న సొమ్ములో డ్రా చేసిన సుమారు రూ.57 లక్షలకు ఖర్చుల వివరాలు తెలపాలని అడిగారు. ఆ లెక్కలు తనకు తెలియవని, అన్నవరం దేవస్థానం వారికే తెలుసని భట్టార్ చెప్పారు. అనంతరం విజయలక్ష్మి మాట్లాడుతూ అన్నవరం దేవస్థానం లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని దత్తత తీసుకున్నప్పుడు వచ్చిన సొమ్ము స్వామి పేరున బ్యాంక్‌లో జమ చేస్తామన్నారని చెప్పారు. అప్పటి ఈఓ అలాగే సొమ్ము జమ చేశారన్నారు. ప్రస్తుతం స్వామి సొమ్ము డ్రా చేసి ఖర్చుల వివరాలు చెప్పడం లేదన్నారు. దీనిపై స్థానిక ఎమ్మెల్యే ప్రత్యేకదృష్టి పెట్టాలని కోరారు. ఇప్పటికైనా అన్నవరం దేవస్థానం ఈఓ స్పందించక పోతే ఉద్యమం చేపడతామన్నారు. ఆమె వెంట పార్టీ మండల కన్వీనర్ వుల్లి బుజ్జిబాబు, జిల్లా కార్యదర్శులు చింతపల్లి చంద్రం, అయిల శ్రీను, యువజన నాయకులు బొరుసు బద్రి, తాడి హరిశ్చంద ప్రసాద్‌రెడ్డి, మండల అధికార ప్రతిని««దlులు గరగ మధు, వాకా నరసింహారావు, మండల రైతు కన్వీనర్ తోరాటి శ్రీను, బీసీ కన్వీనర్ సూరిశెట్టి భద్రం, యూత్ కన్వీనర్ అడపా శ్రీను తదితరులున్నారు. -
గణనీయంగా పెరిగిన యాదగిరిగుట్ట ఆదాయం
నల్లగొండ: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహ స్వామి ఆలయం ఆదాయం ఈ ఏడాది గణనీయంగా పెరిగింది. గత ఏడాదితో పోలిస్తే రూ.11 కోట్ల మేర అధికంగా లభించిందని ఆలయ ఈవో గీతారెడ్డి తెలిపారు. గత ఏడాది 66,58, 47, 445 రూపాయలు రాగా, ఈసారి 73,03, 15, 953 రూపాయల మేర సమకూరిందన్నారు. భక్తులకు సౌకర్యాల మెరుగుదలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు ఆమె వివరించారు. అలాగే, రక్షణ చర్యలను కూడా చేపట్టినట్లు పేర్కొన్నారు.