నరసన్న సొమ్ము లెక్కలు చెప్పకుంటే ఉద్యమం | korukonda temple income plz telme | Sakshi
Sakshi News home page

నరసన్న సొమ్ము లెక్కలు చెప్పకుంటే ఉద్యమం

Published Sat, Dec 10 2016 11:51 PM | Last Updated on Mon, Sep 4 2017 10:23 PM

korukonda temple income plz telme

  • రూ.57 లక్షల ఖర్చుకు వివరాలు చెప్పని అన్నవరం అధికారులు
  • వైఎస్సార్‌ సీపీ సీజీసీ సభ్యురాలు విజయలక్ష్మి
  • కోరుకొండ : 
    రాష్ట్రంలోనే ప్రసిద్ధిగాంచిన కోరుకొండ శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి పేరున బ్యాంక్‌ ఖాతాలో ఉన్న నగదు డ్రా చేసిన అన్నవరం దేవస్థానం అధికారులు ఖర్చుల లెక్కలు రెండు వారాల్లో స్వామి సన్నిధిలో భక్తుల సమక్షంలో తెలియజేయాలని   వైఎస్సార్‌ సీపీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో తమ పార్టీ ఆందోళన చేపడుతుందని హెచ్చరించారు. శనివారం ఆమె ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ ఆనువంశిక ధర్మకర్త  ఎస్పీ రంగరాజ్‌భట్టార్‌స్వామితో మాట్లాడుతూ స్వామి పేరున బ్యాంక్‌లో ఉన్న సొమ్ములో డ్రా చేసిన సుమారు రూ.57 లక్షలకు ఖర్చుల వివరాలు తెలపాలని అడిగారు. ఆ లెక్కలు తనకు తెలియవని, అన్నవరం దేవస్థానం వారికే తెలుసని భట్టార్‌ చెప్పారు. అనంతరం విజయలక్ష్మి మాట్లాడుతూ అన్నవరం దేవస్థానం లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని దత్తత తీసుకున్నప్పుడు వచ్చిన సొమ్ము స్వామి పేరున బ్యాంక్‌లో జమ చేస్తామన్నారని చెప్పారు. అప్పటి ఈఓ అలాగే సొమ్ము జమ చేశారన్నారు. ప్రస్తుతం స్వామి సొమ్ము డ్రా చేసి ఖర్చుల వివరాలు చెప్పడం లేదన్నారు. దీనిపై స్థానిక ఎమ్మెల్యే ప్రత్యేకదృష్టి పెట్టాలని కోరారు.  ఇప్పటికైనా అన్నవరం దేవస్థానం ఈఓ స్పందించక పోతే ఉద్యమం చేపడతామన్నారు. ఆమె వెంట పార్టీ మండల కన్వీనర్‌  వుల్లి బుజ్జిబాబు, జిల్లా కార్యదర్శులు చింతపల్లి చంద్రం, అయిల శ్రీను, యువజన నాయకులు బొరుసు బద్రి, తాడి హరిశ్చంద ప్రసాద్‌రెడ్డి, మండల అధికార ప్రతిని««దlులు గరగ మధు, వాకా నరసింహారావు, మండల రైతు కన్వీనర్‌ తోరాటి శ్రీను, బీసీ కన్వీనర్‌ సూరిశెట్టి భద్రం, యూత్‌ కన్వీనర్‌ అడపా శ్రీను తదితరులున్నారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement