korukonda
-
తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ శ్రీలక్ష్మినరసింహస్వామి ఆలయంలో అపచారం
-
Watch Live: కోరుకొండలో సీఎం జగన్ ప్రచార సభ
-
ఘోర ప్రమాదం.. కాల్వలోకి దూసుకెళ్లిన కారు.. ముగ్గురి మృతి
సాక్షి, తూర్పుగోదావరి: తూర్పుగోదావరి జిల్లా విషాదం చోటుచేసుకుంది. కోరుకొండ మండలం బూరుగుపూడి గేటు వద్ద బ్రిడ్జిపై నుంచి ఓ కారు కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మరణించారు. ఏపీ 39 హెచ్ఆర్0907 నెంబర్ గల బలేనో కారు ఏజెన్సీ మారేడుమిల్లి నుంచి ఏలూరు వెళ్తుండగా ఈ ఘటన ఆదివారం తెల్లవారు జామున జరిగింది. వివరాలు.. జిల్లాకు చెందిన 10 మంది స్నేహితులు రెండు కార్లలో అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి సమీపంలోని గుడిసె పర్యాటక ప్రాంతానికి వెళ్లారు. రుగు ప్రయాణంలో అర్ధరాత్రి దాటిన తర్వాత కోరుకొండ మండలం బూరుగుపూడి వద్ద ఓ కారు నేరుగా కాల్వలోకి దూసుకెళ్లింది. స్థానికంగా ఉండే పాత, కొత్త వంతెనల మధ్యలోని కాల్వలో పడింది. ప్రమాద సమయంలో కారులో ఆరుగురు ప్రయాణికులు ఉన్నారు. ముగ్గురు మృతిచెందారు. మృతులను ఉదయ్ కిరణ్, హర్ష వర్ధన్, హేమంత్గా గుర్తించారు. గాయపడిన మిగతా ముగ్గురిని రాజమంత్రి ప్రభుత్వం ఆసుపత్రికి తరలించారు. మరణించిన ముగ్గురు యువకులు ఏలూరు సమీపంలోని రామచంద్ర ఇంజినీరింగ్ కాలేజీలో బీ టెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నట్లు సమాచారం. -
ఊరంతా కళాకారులే.. పౌరాణిక పాత్రలకు కేరాఫ్ శ్రీరంగపట్నం
సాక్షి, రాజమహేంద్రవరం/మధురపూడి: రామాంజనేయ యుద్ధం, కురుక్షేత్రం, బాలనాగమ్మ, చింతామణి.. నాటకం ఏదైనా వారి నటనాచాతుర్యం ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. కాళికా మాత, దుర్గమ్మ, శ్రీరాముడు, కృష్ణుడు, శివుడు, ఆంజనేయుడు, వెంకన్నబాబు, రాక్షసుడు, అఘోరాలు.. ఇలా వేషమేదైనా పరకాయ ప్రవేశం చేయడమే వారి ప్రత్యేకత. తాతల కాలం నుంచి సంప్రదాయాన్ని పుణికి పుచ్చుకుని మరీ వారు రంగస్థలంపై, జాతర్లలో సత్తా చాటుతున్నారు. నటనపై మక్కువతోనే జీవనం సాగిస్తున్నారు. కుటుంబ పోషణకు వ్యవసాయం చేసినా ప్రదర్శనలను మాత్రం విస్మరించరు. కోరుకొండ మండలం శ్రీరంగపట్నం గ్రామం పౌరాణిక నాటకాలకు కేరాఫ్ అడ్రస్‌గా విరాజిల్లుతోంది. ఊరంతా కళాకారులే తూర్పు గోదావరి జిల్లా కళాకారులకు పెట్టింది పేరు. తెలుగువారి సాంస్కృతిక రాజధానిగా రాజమహేంద్రవరం ఖ్యాతి గడించింది. కేవలం నగరం ఒక్కటే కాకుండా జిల్లా వ్యాప్తంగా కళాకారులు వేల సంఖ్యలో ఉన్నారు. శ్రీరంగపట్నంలో అయితే ఊరంతా కళాకారులే దర్శనమిస్తారు. మేజర్ పంచాయతీ అయిన ఈ గ్రామ జనాభా 12,500. కుటుంబాలు 3,165 ఉన్నాయి. వీరిలో 400 మంది పౌరాణిక నాటకాలు వేసే కళాకారుల కుటుంబాలకు చెందిన వారే ఉన్నారంటే నాటకాలపై వారికున్న మక్కువ ఏమిటో అర్థమవుతోంది. వ్యవసాయ పనులతో జీవనం సాగించే కళామతల్లి ముద్దుబిడ్డలు వివిధ పండగలు, జాతర సమయాల్లో కళాకారులుగా రూపుదాలుస్తారు. ప్రజలను అలరించే ప్రదర్శనలు ఇస్తారు. వీరి నట విశ్వరూపానికి దేశవ్యాప్తంగా అత్యంత ఆదరణ ఉంది. శ్రీరంగపట్నం కళాకారులంటే ఆంధ్ర, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, కర్ణాటక తదితర రాష్ట్రాల ప్రజలు అమితంగా ఇష్టపడుతూంటారు. రాష్ట్రవ్యాప్తంగా బెంగళూరు, చిత్తూరు, విజయవాడ తదితర ప్రాంతాలతో పాటు దేశవ్యాప్తంగా నాటి నుంచి నేటి వరకూ వేలాది ప్రదర్శనలు వారి సొంతం. ఫలితంగా ఎన్నో అవార్డులు, ప్రశంసా పత్రాలు సొంతం చేసుకున్నారు. దసరా, దీపావళి, సంక్రాంతి, గ్రామ దేవతల జాతరల సమయంలో కళా ప్రదర్శనలతో సందడి వాతావరణం తీసుకువస్తారు. వివిధ వేషధారణలతో అలరిస్తారు. రూ.500తో మొదలై.. 1988లో ఒక్కో బృందంలో సభ్యుడికి కళాప్రదర్శనకు రూ.500 అందేది. ఇవి ఖర్చులకు కూడా సరిపోకపోయినా కళామతల్లినే నమ్ముకుని జీవనం సాగిస్తున్నారు. ప్రస్తుతం 20 మంది ఉన్న బృందంలో ఒక్కో కళా ప్రదర్శనకు రూ.45 వేల నుంచి రూ.50 వేల వరకూ అందుతోంది. ఏ పాత్ర కావాలన్నా.. గ్రామంలో 20 నాటక బృందాలున్నాయి. ఒక్కో బృందంలో 20 మంది చొప్పున 400 మంది కళాకారులున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వందల సంఖ్యలో పౌరాణిక కళాబృందాలున్నా.. పాత్రకు అనువైన కళాశారులు దొరకడం కష్టం. కానీ శ్రీరంగపట్నం మాత్రం అందుకు భిన్నం. ఏ పాత్రయినా.. ఏ నాటకమైనా అందుకు తగిన కళాకారులను సమకూర్చడం ఈ ఊరి ప్రత్యేకత. పౌరాణిక పాత్రల్లో అత్యంత ప్రాధాన్యమైన అన్నమయ్య, రాముడు, లక్ష్మణుడు వంటి విభిన్న పాత్రల్లో నటించే వారు కేవలం ఇక్కడే ఉండటం విశేషం. వీటితో పాటు కాళికాదేవి, నెమలి కోబ్రా డ్యాన్స్, నక్షత్రకుడు, హరిశ్చంద్రుడు, బిల్వమంగళుడు, భవానీ శంకరుడు, తాండ్ర పాపారాయుడు వంటి వేషధారణలకు కేరాఫ్‌గా ఈ గ్రామం ప్రఖ్యాతి చెందింది. ఇక్కడ లేని కళాకారులు లేరంటే అతిశయోక్తి కాదు. నాటక ఘట్టం సందర్భంగా వీరు వేసే పాత్రలు, నృత్య ప్రదర్శనలు వీక్షకులను కట్టి పడేస్తుంటాయి. తమ తాతలను, తండ్రులను స్ఫూర్తిగా తీసుకుని ప్రస్తుతం వారి సంతానం నాటక రంగంలోకి ప్రవేశిస్తున్నారు. ప్రదర్శనలపై ఉన్న మక్కువతో ఈ రంగంలోనే స్థిరపడిపోతూ కళకు జీవం పోస్తున్నారు. 34 ఏళ్లుగా.. 1988 నుంచి ప్రదర్శనలు ఇస్తున్నా. నాటక రంగంపై ఉన్న ప్రేమతో నేటికీ కళామతల్లి బిడ్డగా కొనసాగుతున్నా. రామాంజనేయ యుద్ధంలో నా నటనకు ప్రశంసా పత్రాలు, అవార్డులు దక్కాయి. నాడు ఒక్కో ప్రదర్శనకు రూ.500 గౌరవ వేతనం ఇచ్చేవారు. ప్రస్తుతం రూ.2 వేలు పైగా అందుతోంది. డ బ్బులు ఎంత వచ్చాయన్నది కాకుండా.. కళను బతికించాలన్న తాపత్రయంతోనే కొనసాగుతున్నాం. – బాసెట్టి జగ్గారావు, కళాకారుడు రాక్షసుడే వచ్చినట్టు.. బాలగౌరి కళాకారుల సంఘ సభ్యుడైన తనకాల నాని మిమిక్రీ ఆర్టిస్ట్. నాటక రంగంలోనూ సత్తా చాటుతున్నాడు. నల్లకాళికాదేవి, వేపాలమ్మ పాత్రలకు జీవం పోస్తున్నాడు. తన నటనకు గుర్తింపుగా ఇటీవల పుష్ప–2 సినిమాలో అవకాశం దక్కింది. ఆవేశం.. ఈ వేషం.. నాన్న కీబోర్డ్ ప్లేయర్. బాబాయ్ సింగర్. వారిని స్ఫూర్తిగా తీసుకున్న కళాకారులు సతీష్ లేడీ ఓరియంటెడ్ గెటప్‌లో అలాగే ఒదిగిపోతాడు. బుల్లితెరపై స్టాండప్ కామెడీ రోల్ చేస్తున్నా.. నాటక ప్రదర్శన ఉందంటే చాలు వాలిపోతాడు. వేషమేదైనా.. కళాత్మకమే.. అఘోరా నృత్యం చేయడం అంత సులభం కాదు. కానీ ఆ పాత్రకు జీవం పోస్తాడు ఎం.సంపత్. అతను నాట్యం చేస్తూంటే అఘోరాలే ఔరా! అంటూ ఆశ్చర్య పోవాల్సిందే. పార్వతీ దేవి పాత్రకు సైతం న్యాయం చేస్తాడు. అబ్బాయే.. అమ్మాయిలా.. మరో కళాకారుడు రాంబాబు అమ్మవారు, లేడీ గెటప్, రుక్మిణీదేవి వేషధారణల్లో అలరిస్తుంటారు. ఇలా ఈ గ్రామంలోని ప్రతి ఒక్కరూ ఒక్కో పాత్రకు న్యాయం చేయడంతో కీలక భూమిక పోషిస్తారు. (క్లిక్ చేయండి: ఒకప్పుడు తిరుగులేని ఆదరణ.. ఇప్పుడు కనుమరుగు) -
బుల్లి భగవద్గీత.. చదరపు సెంటీమీటరు పుస్తకంలో..!
మధురపూడి: కేవలం ఒక చదరపు సెంటీమీటరు పరిమాణంలో ఉన్న పుస్తకంలో భగవద్గీతను లిఖించి ఆశ్చర్యపరిచాడు తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం దోసకాయలపల్లికి చెందిన విద్యార్థి బాలశివతేజ. రాజమహేంద్రవరంలో ఇంటర్మీడియెట్ చదువుతున్న శివతేజ కొన్నాళ్లుగా స్మాలెస్ట్ హ్యాండ్ రైటింగ్‌లో సాధన చేస్తున్నాడు. ఇందులో భాగంగా భగవద్గీతలోని 240 శ్లోకాలను, 50 చిత్రాలను కేవలం ఒక చదరపు సెంటీమీటరు పరిమాణంలో ఉన్న 240 పేజీల పుస్తకంలో లిఖించాడు. దీనిని అతడు కేవలం 2 గంటల 50 నిమిషాల 23 సెకండ్లలో పూర్తి చేయడం అబ్బురపరుస్తోంది. దీనికి స్థానిక పంచాయతీ కార్యదర్శి జగ్జీవన్‌రావు, హైస్కూల్ ఉపాధ్యాయుడు సాంబశివరావు పరిశీలకులుగా వ్యవహరించారు. అరుదైన ప్రతిభను కనబరచిన శివతేజను పలువురు ప్రముఖులు, ఉపాధ్యాయులు అభినందించారు. ఈ అంశానికి సంబంధించిన వీడియోలు, ఫొటోలను మిరాకిల్ వరల్డ్ రికార్డు సాధన కోసం ఒంగోలు పంపారు. -
ఎల్లో మీడియాతో రోజుకో పుకారు పుట్టిస్తున్నారు
-
అదే జరిగితే టీడీపీకి డిపాజిట్లు గల్లంతే: వైఎస్ జగన్
సాక్షి, పశ్చిమ గోదావరి: గత ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా.. మోసపూరితమైన మ్యానిఫెస్టో పేరుతో మరోసారి మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. గత ఎన్నికల సమయంలో 54 పేజీలతో కూడా ఎన్నికల ప్రణాళికను చంద్రబాబు నాయుడు విడుదల చేశారని.. కానీ అధికారంలోకి వచ్చాక అవేవీ కూడా అమలు చేయలేదని మండిపడ్డారు. ప్రజలకిచ్చిన వాగ్ధానాలను నెరవేర్చకుండా ఈసారి అబద్ధాలతో కూడిన 34 పేజీల మ్యానిఫెస్టో రూపొందించారని ఆయన అన్నారు. గత ఎన్నికల సమయంలో చంద్రబాబు చెప్పినట్లు రైతుల రుణమాఫీ, డ్వాక్రా రుణాల రద్దు, మద్యపాన నిషేదం, పంటలకు గిట్టుబాటు ధర వంటి అనేక హామీలను విస్మరించారని గుర్తుచేశారు. చంద్రబాబు నాయుడి ఐదేళ్ల పాలనపై చర్చ జరగకుండా రోజుకో అంశాన్ని తెరపైకి తీసుకువచ్చి కుట్ర చేస్తున్నారని, ఆయన పాలనపై చర్చ జరిగితే టీడీపీకి కనీసం డిపాజిట్లు కూడా రావని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం ఏర్పడిన తరువాత పేదలకు ఏవిధంగా మేలు జరుగుతుందో.. తమ పార్టీ మ్యానిఫెస్టోలో వివరించామని వైఎస్ జగన్ తెలిపారు. టీడీపీలా తమది పేజీలకొద్ది అబద్ధాల పుస్తకం కాదని..కేవలం రెండే పేజీల రూపంలో ప్రజలకు అర్థమైయ్యే విధంగా వైఎస్సార్సీపీ ఎన్నికల ప్రణాళికను రూపొందించినట్లు వెల్లడించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తూర్పు గోదావరి జిల్లా కోరుకొండలో ఆదివారం జరిగిన బహిరంగ సభలో వైఎస్ జగన్ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజానగరం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి జక్కంపూడి రాజా, రాజమండ్రి లోక్‌సభ అభ్యర్థి మార్గని భరత్‌ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. గోదావరి నది పక్కనే ఉన్నా ఈ ప్రాంత ప్రజలకు తాగు, సాగు నీరు దొరకడం లేదని వైఎస్ జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘పాదయాత్రలో ఈ జిల్లాలోని ప్రజలు పడుతున్న కష్టాలన్నీ నేను దగ్గర నుంచి చూశాను. ప్రభుత్వ సహాయం అందక, సంక్షేమ పథకాలు అమలుకాక ఎంతో మంది పేదలు కష్టాలు పడుతున్నారు. వారందరికీ నేను ఉన్నానని హామీ ఇస్తున్నాను. రైతులకు గిట్టుబాటు ధర ఉండదు. రుణమాఫీ కూడా కాలేదు. దీంతో రైతుల ఆత్మహత్యలు ఎక్కువగా ఉన్నాయి. 2017 నాటికే పోలవరం పూర్తి చేస్తామన్నారు. కానీ ఇప్పటికీ పునాదులు దాటలేదు. ప్రాజెక్టుల పేరుతో దోచుకోవాలనే ఆరాటంతో అంచనాల వ్యయ్యాన్ని ఇష్టం వచ్చినట్టు పెంచారు. ఇదే జిల్లాకు చెందిన మంత్రి యనమల రామకృష్ణుడి వియ్యంకుడు సబ్ కాంట్రక్టర్‌గా దోచుకుంటున్నారు. పురుషోత్తంపట్నం కూడా ఇదే పరిస్థితి ఉంది. గతంలో కడియం స్కీం ద్వారా దివంగత వైఎస్సార్ 48 గ్రామాలకు నీరు అందించారు. చంద్రబాబుకు అది కూడా చేతకావడంలేదు. అనేక ప్రాంతాల్లో ఇసుక ర్యాంపులను ఏర్పాటు చేసి ఇసుకను అక్రమంగా దోచుకుంటున్నారు. అధికార పార్టీకి చెందిన నేతలు వంద కోట్లకు పైగా దొచుకున్నారు. గత ఎన్నికల సమయంలో ఇచ్చిన 650 వాగ్ధానాలను అమలు చేయకుండా మోసం చేసిన వ్యక్తి మరోసారి సీఎంగా మనకు అవసరమా?. ఎన్నికల సమీపిస్తున్న వేళ డబ్బుల మూటలు పంచుకుని గ్రామాల్లోకి వస్తున్నారు. చంద్రబాబు ఇచ్చే మూడువేలు తీసుకుని మోసపోవద్దు. వచ్చేది మన ప్రభుత్వమే. అందరినీ ఆదుకుంటాం. డ్వాక్రా రుణాల పూర్తిగా మాఫీచేసి.. సున్నా వడ్డీకే రుణాలు అందిస్తాం. రైతుల పెట్టుబడికి మేలో రూ.1250 ఇస్తాం. ఆర్థికంగా వెనుకబడిన ప్రతి పేదవాడిని ఉచితంగా చదవిస్తాం. నవరత్నాలు ద్వారా ప్రతి పేదవాడి బతుకులు మారతాయి. మళ్లీ రాజన్న రాజ్యం వస్తుంది’’ అని అన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
జనసంద్రమైన కోరుకొండ
-
పెంపుడు కూతిరిపై తండ్రి కత్తితో దాడి
-
కూతురిపై అనుమానం, కత్తితో దాడి
సాక్షి, తూర్పుగోదావరి : కోరుకొండ మండలం కొత్తజంబు పట్నంలో శుక్రవారం దారుణం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పడాల కొండా రెడ్డి అనే వ్యక్తి వరసకు కూతురైన బాలికపై కత్తితో దాడి చేయడంతో తీవ్రంగా గాయపడింది. వివరాలు..గ్రామానికి చెందిన పడాల కొండారెడ్డికి కొన్నేళ్ల క్రితమే వివాహం జరిగినా మనస్పర్థలతో భార్యను వదిలేశాడు. అదే గ్రామానికి చెందిన లోవమ్మ కూడా 17 ఏళ్ల క్రితం మరో వ్యక్తితో వివాహం జరిగింది. మనస్పర్థలతో మొదటి భర్తతో విడిగా ఉంటోంది. లోవమ్మకు వీర వెంకట లక్ష్మి(15) అనే కూతురు ఉంది. కొన్నేళ్ల నుంచి కొండారెడ్డి, లోవమ్మలు పెద్దలు, బంధువుల అంగీకారంతో సహజీవనం సాగిస్తున్నారు. అయితే వీరి మధ్య మూడు నెలల నుంచి గొడవలు జరుగుతున్నాయి. అయితే వరసకు కూతురైన లక్ష్మి ఎవరినో ప్రేమిస్తుందని అనుమానం పెంచుకున్నకొండారెడ్డి లక్ష్మితో గొడవపడ్డాడు. కోపంతో తన దగ్గరున్న బ్లేడుతో మెడ కోశాడు. ఛాతీ, చేతిలపై కూడా ఆమెకు గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన స్థానికులు అడ్డుకోవడంతో ప్రమాదం తప్పింది. మెడపై మాత్రం తీవ్రగాయం కావడంతో హుటాహుటిన రాజమండ్రి ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రాణాపాయం తప్పిందని వైద్యులు తెలిపారు. కొండారెడ్డిని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించినట్లు రాజమండ్రి డీఎస్పీ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. -
తూ.గో.జిల్లాలో ఘరానా మోసం
-
భక్తులకు కోటితలంబ్రాల పంపిణీ
కోరుకొండ : భద్రాచలం, ఒంటిమెట్ట సీతారాముల వారి కల్యాణంలో ఉపయోగించిన కోటితలంబ్రాలకు శుక్రవారం శ్రీరంగపట్నం ఆంజనేయ స్వామి వారి దేవాలయంలో పూజలు నిర్వహించి శ్రీ కృష్ణ చైతన్య సంఘం అధ్యక్షులు కల్యాణం అప్పారావు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ధాన్యపు గింజలను గోటితో ఒలిచి కోటితలంబ్రాలను సిద్ధం చేసే కార్యక్రమంలో సుమారు 200 మంది భక్తులు పాల్గొన్నారన్నారు. వారితో పాటు అందరికీ తలంబ్రాలను అందిస్తున్నామని తెలిపారు. -
భూముల రిజిస్ట్రేషన్లపై నిషేధం తొలగించండి
వైఎస్సార్సీపీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి రాజమహేంద్రవరం కల్చరల్ : కోరుకొండ గ్రామంలో రైతుల భూములకు సంబంధించి రిజిస్ట్రేషన్లపై నిషేధం తొలగించాలని వైఎస్సార్సీపీ కేంద్రపాలక మండలి సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి కోరారు. ఆమె సోమవారం కోరుకొండ గ్రామానికి చెందిన 30 మంది రైతులతో దేవాదాయశాఖ ప్రాంతీయ సహ కమిషనర్ చంద్రశేఖర్ ఆజాద్‌ను ఆయన కార్యాలయంలో ప్రాంతీయ కలసి రిజిస్ట్రేషన్లు ఆపివేయడం వల్ల రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. అన్నవరం దేవస్థానం నుంచి ఈ భూములు దేవస్థానానికి చెందినవని తమకు లేఖ రావడం వల్ల రిజిస్ట్రేషన్లు నిలిపి వేశామని, ఈ భూములు దేవస్థానానికి చెందినవని సంబంధిత తహసీల్దార్ ధ్రువీకరణ పత్రాన్ని కూడా ఇచ్చారని అధికారులు చెబుతున్నారన్నారు. సమాచారహక్కు చట్టం కింద ఈ విషయంలో రైతులు తహసీల్దార్ నుంచి వివరాలు అడిగినప్పుడు తాము ఎలాంటి ధ్రువీకరణ పత్రాలను ఇవ్వలేదని సమాధానం వచ్చిందని ఆమె ప్రాంతీయ సహ కమిషనర్‌కు తెలిపారు. సహేతుక కారణం లేకుండా భూముల రిజిస్ట్రేషన్లు నిలిపివేసి, ఈ ఏడాది జనవరిలో ఈ భూములను నిషిద్ధ భూములుగా ప్రభుత్వం ప్రకటించడం చట్టవిరుద్ధమని ఆమె తెలిపారు. రైతుల జీవితాలతో ప్రభుత్వాలు ఆడుకుంటున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. -
రిజిస్ట్రేషన్లు చేయకపోతే ఆందోళన ఉధృతం
వైఎస్సార్ సీపీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి కోరుకొండ (రాజానగరం) : భూములకు రిజిస్ట్రేషన్లు చేయాలని పార్టీలకు అతీతంగా కోరుకొండలో రైతులు, ప్రజలు ఐదు రోజులుగా చేస్తున్న ఆందోళనపై ప్రభుత్వం స్పందించడం లేదని వైఎస్సార్ సీపీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి ధ్వజమెత్తారు. గ్రామంలో ఆదివారం దీక్షాధారులకు డ్రింక్ ఇచ్చి ఆమె దీక్షలను విరమింపజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అన్నవరం దేవస్థానం ఈఓ వైఖరి వల్ల రెండున్నర ఏళ్లుగా పొలాలు, ఇళ్లు, ఇళ్ల స్థలాలకు క్రయ విక్రయాలు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఈ సమస్యపై దేవాదాయ శాఖ కమిషనర్‌కు రైతులతో కలిసి వినతిపత్రం ఇస్తామన్నారు. అప్పటికీ స్పందించకపోతే ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ వివిధ విభాగాల నాయకులు బొరుసు బద్రి, వుల్లి ఘణనాథ్, కాలచర్ల శివాజీ, సలాది వెంకటేశ్వరరావు, అయిల శ్రీను, వాకా నరసింహరావు, గట్టి ప్రసాద్, తోరాటి సత్య ప్రసాద్, ముద్దాల అను, వుల్లి శేషగిరి, అయిల రామకృష్ణ, గుగ్గిలం బాను తదితరులు పాల్గొన్నారు. -
కోరుకొండ స్వామి ఆదాయం రూ.15.27లక్షలు
భక్తి శ్రద్ధలతో శ్రీ పుష్పయాగం కోరుకొండ : లక్ష్మీనరసింహ స్వామి వారి దివ్య కల్యాణం పురస్కరించుకుని వివిధ రూపాల్లో భక్తులు ఇచ్చిన విరాళాలు, హుండీల సొమ్ము ద్వారా స్వామికి రూ.15 లక్షల 27 వేల 206 ఆదాయం వచ్చింది. సోమవారం ఆలయ ప్రాంగణంలో అన్నవరం దేవస్థానం అధికారులు జగన్నాథం, తులారాం, ఎంకేటీఎన్వీ ప్రసాద్, టీవీ రమణ, టీఎన్ రాంజీ, కోరుకొండ లక్ష్మీనరసింహ ఆలయ ధర్మకర్త ఎస్పీ రంగరాజభట్టర్, భక్తుల సమక్షంలో హుండీల లెక్కింపు నిర్వహించారు. కల్యాణం టికెట్ల ద్వారా రూ.76,500, దర్శనం టికెట్ల ద్వారా రూ.1,28,637, లడ్డూ ప్రసాదం ద్వారా రూ.1,37,760, కల్యాణం ద్వారా రూ.8,761, భక్తుల ప్రత్యేక విరాళాలు రూ.15,650, కొబ్బరి చెక్కల పాటలు రూ.50,500, తలనీలాల ద్వారా రూ.నాలుగు వేలు, చెప్పుల పాటల ద్వారా రూ.19,400, హుండీల ద్వారా రూ.7,67,567, ఉత్సవాలకు ముందు డిబ్బీల లెక్కింపు ద్వారా వచ్చిన ఆదాయం రూ. 3,18,930 ఆదాయం స్వామి వారికి వచ్చిందన్నారు. ఈ మొత్తం రూ.15,27,206 నగదును శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి బ్యాంకు ఖాతాలలో జమ చేస్తామని అన్నవరం దేవస్థానం అధికారులు తెలిపారు. శ్రీ పుష్పయాగం లక్ష్మీనరసింహ స్వామి వారి కల్యాణ మహోత్సవాలు పురస్కరించుకుని సోమవారం ఉదయం స్వామికి ప్రత్యేక పూజలు జరిగాయి. సాయంత్రం వివిధ రకాల ప్రసాదాలు, పండ్లు, విశేష పుష్పఅలంకరణతో స్వామి వారికి విశేష సేవా కాలం (శ్రీ పుష్పయాగం) నిర్వహించారు. తదుపరి పవళింపు సేవలో స్వామి వారిని చూసి భక్తులు సేవించుకున్నారు. -
భక్తిప్రపత్తులతో చక్రతీర్థం
కోరుకొండ : కోరుకొండ దేవుని కోనేరులో శ్రీ లక్ష్మీనరసింహ స్వామి, శ్రీ చక్రపెరుమాళ్ళ స్వామిల చక్రతీర్థం వందలాది మంది భక్తుల సమక్షంలో ఆదివారం వైభవంగా జరిగింది. ఉదయం ఆలయంలో స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించాక రెండు పల్లకీలలో శ్రీ లక్ష్మీనరసింహ స్వామి, శ్రీ పద్మనాభ స్వామి వార్లను, శ్రీ చక్రపెరుమాళ్ళు స్వామిని మంగళవాయిద్యాలతో వేలాది మంది భక్తులు అనుసరించగా గిరి ప్రదక్షణ చేస్తూ కోనేరు వద్దకు తీసుకెళ్ళారు. విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం జరిపి చక్రతీర్థం నిర్వహించారు. ఆలయ అనువంశిక ధర్మకర్త ఎస్పీ రంగరాజభట్టర్, ఎస్పీ శ్రీ వాత్సవభట్టర్ స్వామి, అర్చకులు పెద్దింటి రంగాప్రసాద్, వాడపల్లి కిరణ్‌చక్రవర్తి, పాణింగిపల్లి సత్యపవన్‌ఆచార్య, డీఎస్పీ ఏవీఎల్ ప్రసన్నకుమార్, ఎస్ఐ ఆర్.మురళీమోహన్, సర్పంచ్ కటకం అన్నపూర్ణచలం, అన్నవరం దేవస్థానం అధికారులు జగన్నాథరాజు, ప్రసాద్, తులారాం, టీఎన్ రాంజీ, ఎన్వీ రమణ తదితరులు పాల్గొన్నారు. చక్రతీర్థంలో ఉపయోగించిన నీటిలో వేలాది మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. అనంతరం స్వామి వార్లను ఆలయానికి పల్లకీలలో తీసుకువస్తుండగా గ్రామస్తులు రోడ్డును పసుపునీళ్ళతో కడిగి, ముగ్గులు వేసి స్వామిని దర్శించుకున్నారు. ఆదివారం సెలవుదినం కావడంతో పెద్దసంఖ్యలో భక్తులు తరలివచ్చారు. -
నరసన్న రథోత్సవం
శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి రథోత్సవం వేలాది మంది భక్తుల సమక్షంలో బుధవారం కన్నులపండువలా జరిగింది. కల్యాణ మహోత్సవాలను పురస్కరించుకుని స్వామి వారిని పెండ్లికుమారుడిగా, అమ్మవారిని పెండ్లికుమార్తెగా అలంకరించి రథంపై ఆసీనులను చేశారు.ఆలయ ఆనువంశిక ధర్మకర్త ఎస్పీ రంగరాజభట్టర్, అన్నవరం దేవస్థానం అధికారులు జగన్నాథం, టి.తులారామ్, ఎంకేటీఎ¯ŒSవీ ప్రసాద్, పీవీ రమణ, టీఎ¯ŒS రాంజీ, శ్రీ నృసింహభట్టర్ స్వామి, ఆలయ వంశపారంపర్య అర్చకులు, డీఎస్పీ ఏవీఎల్ ప్రసన్నకుమార్ ముందు రథానికి ప్రత్యేక పూజలు చేశారు. రథాన్ని లాగడానికి భక్తులు పోటీ పడ్డారు. సుందరంగా తీర్చిదిది్దన రథంపై వేంచేసిన స్వామి వారిపై అరటిపండ్లు విసిరి భక్తిని చాటుకున్నారు. రథం ముందు వివిధ దేవతావేషధారణలు, కోలాటాలు, ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు సాగాయి. జై లక్ష్మీనరసింహ స్వామి, జై గోవిందా గోవిందా అన్న భక్తుల నినాదాలతో కోరుకొండ వీధులు మార్మోగాయి. – కోరుకొండ (రాజానగరం) -
నేటి నుంచి నరసింహుని కల్యాణోత్సవాలు
కోరుకొండ (రాజానగరం) : రాష్ట్రంలో చారిత్రక ప్రసిద్ధి గాంచిన కోరుకొండ శ్రీలక్ష్మీనరసింహ స్వామివారి కల్యాణ మహోత్సవాలు బుధవారం నుంచి ఐదు రోజుల పాటు వైభవంగా జరగనున్నాయి. ఈ వేడుకలు అన్నవరం సత్యదేవుని దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. బుధవారం ఉదయాన్నే భక్తులు దేవుని కోనేరులో పుణ్యస్నానాలు ఆచరించి స్వామి వారిని దర్శించుకుంటారు. మధ్యాహ్నం 12 గంటలకు స్వామివారిని పెండ్లికుమారుడిగా, అమ్మవారిని పెండ్లికుమార్తెగా అలంకరించి రథంపై ఆసీనులు చేసి, 2 గంటలకు రథోత్సవం జరుగుతుంది. రాత్రి 9 గంటలకు ఆలయంలో పండితుల, అర్చకుల ఆధ్వర్యంలో స్వామివారి కల్యాణం నిర్వహిస్తారు. అన్నవరం ఈఓ కాకర్ల నాగేశ్వరరావు, కోరుకొండ ఆలయ అనువంశిక ధర్మకర్త ఎస్పీ, రంగరాజ భట్టార్ ఆధ్వర్యంలో మహోత్సవాలు జరుగుతున్నాయి. కోరుకొండ తీర్థానికి రాష్ట్రంలో పలు ప్రాంతాల నుంచే భక్తులు తరలివస్తారు. ముస్తాబైన రథం... స్వామివారి రథాన్ని ముస్తాబు చేశారు. రథోత్సవంలో వివిధ ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు, దేవతామూర్తుల వేషధారణలు నిర్వహిస్తున్నారు. కోరుకొండ ఉత్తర మండల డీఎస్పీ ఏవీఎల్ ప్రసన్నకుమార్ ఆధ్వర్యంలో సీఐలు, ఎస్సైలు సుమారు 80 మందితో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. గోకవరం, రాజమహేంద్రవరం డిపో నుంచి కోరుకొండ తీర్థానికి వచ్చే భక్తుల కోసం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. దేవుని కోనేరు వద్ద స్నానాలు ఆచరించిన తరువాత వస్త్రాలు మార్చుకొనేందుకు తాత్కాలిక గదులు ఏర్పాటు చేశారు. కోరుకొండ తీర్థం ఘనంగా జరిపేందుకు ప్రతిఒక్కరూ సహకరించాలని అన్నవరం దేవస్థానం ఈఓ నాగేశ్వరరావు, ఆలయ అనువంశిక ధర్మకర్త ఎస్పీ రంగరాజ భట్టార్ కోరారు. -
లక్ష్మీనరసింహ స్వామి కల్యాణ మహోత్సవ ఆహ్వాన పత్రిక విడుదల
కోరుకొండ : అన్నవరం వీరవెంకట సత్యనారాయణస్వామి దేవస్థానం – దత్తత దేవాలయమైన లక్ష్మీనరసింహ స్వామి వారి దివ్యకల్యాణ మహోత్సవాలను విజయవంతం చేయాలని అన్నవరం దేవస్థానం పీఆర్ఓ తులారాము, ఏఈఓ ఎంకేటీఎన్వీ ప్రసాద్, సూపరింటెండెంట్ పీవీ రమణ, ఇన్చార్జ్ టీఎన్ రామ్‌జీ అన్నారు. ఆదివారం కోరుకొండ శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ సన్నిధిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ఈ నెల 8 నుంచి 12 వరకు స్వామి వారి కల్యాణ మహోత్సవాలు అన్నవరం దేవస్థానం ఈఓ కాకర్ల నాగేశ్వరరావు, అన్నవరం దేవస్థానం వ్యవస్థాపక ధర్మకర్త వీవీ రోహిత్, లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం అనువంశిక ధర్మకర్త ఎస్పీ. రంగరాజభట్టార్ సారధ్యంలో జరుగుతుందన్నారు. అన్నవరం దేవస్థానం నిధులతో స్వామి వారి కల్యాణం ఘనంగా జరుపుతామన్నారు. సుమారు రూ.14 లక్షలతో తీర్థం ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. లక్ష్మీనరసింహ స్వామి వారి మెట్ల సమీపంలో అన్నవరం దేవస్థానం రూ.30 లక్షల నిధులతో భక్తులకు విశ్రాంతి గదులను నిర్మిస్తామన్నారు. స్వామి వారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా అన్నవరం దేవస్థానం అన్ని ఏర్పాట్లు చేస్తుందన్నారు. రాజమహేంద్రవరం అర్జన్ జిల్లా ఎస్పీ రాజకుమారి సారధ్యంలో డీఎస్పీ ఏవీఎల్. ప్రసన్నకుమార్, సీఐలు, ఎస్సైలు బంధోబస్తు నిర్వహిస్తారన్నారు. కొండ దిగువున, కొండ పైన మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేసామన్నారు. కోరుకొండ లక్ష్మీనరసింహ స్వామి వారి ఆలయాన్ని అన్నవరం దేవస్థానం 2010లో దత్తత తీసుకుందని, అప్పుడు రూ.మూడు లక్షల ఎఫ్డీఆర్తో దేవస్థానాన్ని దత్తత తీసుకున్నామని, ప్రస్తుతం రూ. 31 లక్షలు స్వామి వారి పేరున ఎఫ్డీఆర్ వేశామన్నారు. -
8న కోరుకొండ నరసన్న కల్యాణం
అదే రోజు మధ్యాహ్నం రథోత్సవం 12 వ తేదీ వరకూ ఉత్సవాలు అన్నవరం దేవస్థానంలో వాల్‌పోస్టర్ ఆవిష్కరణ అన్నవరం : అన్నవరం దేవస్థానం దత్తత ఆలయమైన కోరుకొండలోని శ్రీలక్ష్మీ నరసింహస్వామివారి దివ్యకల్యాణ మహోత్సవాలు మార్చి ఎనిమిది నుంచి 12వ తేదీ వరకూ నిర్వహించనున్నట్లు దేవస్థానం చైర్మన్ రాజా ఐవీ రోహిత్, ఈఓ కె.నాగేశ్వరరావు తెలిపారు. దేవస్థానం ట్రస్ట్ బోర్డు హాలులో మంగళవారం స్వామివారి కల్యాణానికి సంబంధించిన వాల్‌పోస్టర్‌ను వారు ఆవిష్కరించారు. ఫాల్గుణ శుద్ద ఏకాదశి, మార్చి ఎనిమిదో తేదీ మధ్యాహ్నం రెండు గంటలకు స్వామివారి రథోత్సవం, అదే రోజు రాత్రి తొమ్మిది గంటలకు స్వామివారి దివ్యకల్యాణ మహోత్సవం నిర్వహిస్తారని వారు చెప్పారు. మిగిలిన నాలుగు రోజులు రోజుకొక వైదిక కార్యక్రమం నిర్వహిస్తారన్నారు. దేవస్థానం పీఆర్ఓ తులా రాము, వ్రతపురోహిత సంఘం అధ్యక్ష, కార్యదర్శులు ఛామర్తి వెంకటరెడ్డి పంతులు (కన్నబాబు), కార్యదర్శి బండి నర్శింహమూర్తి, వ్రతపురోహితులు ఆకొండి వ్యాస్, కర్రి వైకుంఠం తదితరులు పాల్గొన్నారు. -
సత్తెన్న సొమ్ముపై రాజకీయ పెత్తనం!
-ఇప్పటికే వృథాగా కిర్లంపూడి, శంఖవరం కల్యాణ మంటపాలు - తాజాగా కోరుకొండలో డార్మెట్రీహాలు నిర్మాణానికి పాలకవర్గం తీర్మానం అన్నవరం : సత్యదేవుడు కొలువైన అన్నవరంలో దేవస్థానం కల్యాణ మంటపం ఒక్కటీ లేదు. కానీ రాజకీయ ఒత్తిళ్లతో ఇతర ప్రాంతాల్లో దేవస్థానం కల్యాణ మంటపాలు, డార్మెట్రీ హాళ్ల నిర్మాణాలు చేపడుతున్నారు. వివరాలిలాఉన్నాయి... అన్నవరంలో దేవస్థానం కల్యాణ మంటపాలు లేకపోవడంతో ప్రైవేట్ లాడ్జిలకు చెందిన కల్యాణ మంటపాలలోనే సామాన్యులు వివాహాలు చేసుకుంటున్నారు. రాజకీయ వత్తిడుల కారణంగా 1999–2001 సంవత్సరాల మధ్య జిల్లాలోని కిర్లంపూడి, శంఖవరాలలో రెండు కల్యాణ మంటపాలు అధికారులు నిర్మించారు. ఒక్కొక్క దానికి రూ.కోటికి పైగా వ్యయమైంది. వాటిలో పెద్దగా వివాహాలు జరగక, నిర్వహణకు సరిపడా ఆదాయం కూడా రాక లీజు కిచ్చేందుకు దేవస్థానం టెండర్లు కూడా పిలిచింది. ఈసారి కోరుకొండలో.. ఈ చేదు అనుభవం ఉన్నప్పటికీ...తాజాగా కోరుకొండలో దేవస్థానం స్థలంలో రూ.35 లక్షల వ్యయంతో డార్మెట్రీ నిర్మాణానికి పాలకవర్గం తీర్మానించింది. కోరుకొండ ప్రాంత ప్రజాప్రతినిధి ఇటీవల అన్నవరం వచ్చి ఈఓ కే నాగేశ్వరరావుతో ఈ నిర్మాణ విషయమై సుదీర్ఘంగా చర్చించి ఒప్పించినట్టు సమాచారం. వాస్తవానికి కల్యాణ మంటపం నిర్మించడానికే ప్రతిపాదనలు పెట్టారు. అయితే కల్యాణ మంటపం నిర్మాణం అంటే వివాదమవుతుందని భావించి ఈ రకంగా మార్పు చేశారు. 84 అడుగుల పొడవు 33 అడుగుల వెడల్పుతో ఈ నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. పొడవుగా రెండు హాల్స్ కలిపి ఒక భవనంగా నిర్మించి ఒక దాంట్లో కిచెన్, డైనింగ్‌హాల్, మరో దాంట్లో వివాహాలు చేసుకునేందుకు గాను ప్లాన్ సిద్ధం చేశారు. కమిషనర్ అనుమతికి పంపించే ఏర్పాట్లు జరుగుతున్నాయి. మొదట్లో అంతే! గతంలో కిర్లంపూడి, శంఖవరంలో కల్యాణ మంటపాలు నిర్మించేటపుడు కూడా మొదట తక్కువ మొత్తంతోనే ప్లాన్ సిద్ధం చేసి అనుమతులు పొంది, ఆ తరువాత రూ.కోటి వరకూ ఖర్చు చేశారు. ఇప్పుడు కూడా ఈ డార్మెట్రీ హాలు నిర్మాణం పూర్తయ్యేటప్పటికీ సుమారు రూ.60 లక్షల వరకూ ఖర్చవుతుందని సమాచారం. ఈవో నో కామెంట్ అన్నవరంలో కాకుండా ఎక్కడెక్కడో రూ.లక్షలు ఖర్చు పెట్టి నిర్మిస్తుండడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై ఈఓ కే నాగేశ్వరరావును సంప్రదించగా మాట్లాడేందుకు నిరాకరించారు. -
పౌష్టికాహారమా! విషమా?
గర్భిణులు, బాలింతలకు నాణ్యతలేని ఆహారమా? ఐసీడీఎస్ పీఓపై వైఎస్సార్సీపీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి ఆగ్రహం కోరుకొండ (రాజానగరం) : అన్నా అమృత హస్తం పేరుతో అంగ¯ŒSవాడీ సెంటర్లకు వచ్చే గర్భిణులు, బాలింతలకు ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహారం నాణ్యతలేమితో విషపూరితమైన ఆహారంగా మారే ప్రమాదం ఉందని వైఎస్సార్సీపీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి ఆందోళన వ్యక్తం చేశారు. అనారోగ్యకరమైన ఆహారాన్ని అందజేస్తున్న కోరుకొండ ఐసీడీఎస్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం కోరుకొండ తహసీల్దార్ కార్యాలయానికి వచ్చిన ఆమెను కొంతమంది గర్భిణులు, బాలింతలు కలుసుకుని అంగ¯ŒSవాడీ కేంద్రాల ద్వారా తమకు నాసిరం సరుకులు సరఫరా చేస్తున్నారంటూ పాడైన పాల ప్యాకెట్లు, చిన్నసైజు కోడిగుడ్లు, పుచ్చుపట్టిన కందిపప్పు, పురుగు పట్టిన బియ్యాన్ని చూపించారు. దీంతో ఆగ్రహించిన జక్కంపూడి తహసీల్దార్ కార్యాలయం వద్ద ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని కోరుకొండ, సీతానగరం, గోకవరం మండలాల అంగ¯ŒSవాడీ కార్యకర్తలతో జరుగుతున్న సదస్సుకు వెళ్లి పీఓ సీతారామలక్షి్మని నిలదీశారు. అ«ధికార పార్టీ మెప్పు కోసం పనిచేస్తున్నారా? ప్రజల కోసం విధులు నిర్వర్తిస్తున్నారా? అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గర్భిణులకు, బాలింతలకు పౌష్టికాహారం పేరుతో ద్రోహం చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. నాలుగు నెలలుగా జీతాలు లేవు అంగ¯ŒSవాడీ కేంద్రాలను బలోపేతం చేసే కార్యకర్తలు ఆకలి బాధలతో అలమటిస్తూ చురుగ్గా ఏ విధంగా విధులు నిర్వర్తించగలరని విజయలక్ష్మి ప్రశ్శించారు. అంగ¯ŒSవాడీ సిబ్బందికి నాలుగు నెలలుగా జీతాలు రాని విషయాన్ని ప్రస్తావిస్తూ ఈ విధంగా అన్నారు. అన్న అమృతహస్తం పథకం ద్వారా నాసిరకం సరుకులను అందిస్తూ అధికార పార్టీకి చెందిన పెద్దలే నిధులు మింగేస్తుంటే మీరేం చేస్తున్నారని ప్రశ్నించారు. ఒక అధికారిగా బాధ్యతను విస్మరించి విధులు నిర్వర్తిస్తే ఫలితం ప్రజలపై పడుతుందనే విషయాన్ని గ్రహించాలన్నారు. పీఓ వేధింపుల నుంచి రక్షణ కల్పించండి పీఓ వేధింపులను భరించలేకపోతున్నామని, ఆమె బారి నుంచి రక్షించాలని పలువురు అంగ¯ŒSవాడీలు విజయలక్షి్మని కోరారు. ఇకపై నాణ్యత ఉన్న సరుకులనే అందజేసేలా ఉన్నతాధికారులతో మాట్లాడి చర్యలు తీసుకుంటామని ఐసీడీఎస్ ïపీఓ సీతారామలక్ష్మి అందరూ సమక్షంలో హామీ ఇవ్వడంతో సమస్య సద్దుమణిగింది. విజయలక్ష్మి వెంట వైఎస్సార్ సీపీ రైతు కన్వీనర్ తోరాటి శ్రీను, మండల అధికార ప్రతినిధులు గరగ మధు, వాకా నరసింహరావు, తాడి హరిశ్చంద్రప్రసాద్‌రెడ్డి, యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి బొరుసు బద్రి, మండల యూత్ అధ్యక్షులు అడపా శ్రీనివాస్, పార్టీ జిల్లా కార్యదర్శి ఐల శ్రీను, మైనార్టీ సెల్ నాయకులు షేక్ జిలానీ, మండల పార్టీ నాయకులు పాలం నాగవిష్ణు, సూరిశెట్టి అప్పలస్వామి, ముద్దా అణు, గుగ్గిలం భాను తదితరులు ఉన్నారు. -
జనం పాట్లు పట్టని ప్రభుత్వం
వైఎస్సార్ సీపీ సీజీసీ సభ్యురాలు విజయలక్ష్మి బ్యాంక్ అధికారుల దృష్టికి పింఛన్‌దారుల పాట్లు కోరుకొండ : పెద్దనోట్ల రద్దుతో అన్ని వర్గాల ప్రజలతో పాటు పింఛన్‌దారులైన దివ్యాంగులు, వితంతువులు, వయోవృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు బ్యాంకుల వద్ద నిత్యం నరకయాతన పడుతున్నారని వైఎస్సార్ సీపీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి అన్నారు. ప్రభుత్వం ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. పింఛన్‌దారులు పడుతున్న సమస్యలను సోమవారం ఆమె తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ స్టేట్ బ్యాంకు మేనేజరు ద్వారంపూడి వెంకటకృష్ణారెడ్డి, పశ్చిమ గానుగూడెం ఆంధ్రా బ్యాంకు మేనేజరు పీఎస్ రాజాలకు వివరించారు. నడవలేని స్థితిలో ఉన్న కోటికేశవరానికి చెందిన గుడేలి కాంతమ్మ (బధిర వృద్ధురాలు), బొల్లెద్దుపాలెంకు చెందిన వికలాంగురాలు గోలి గన్నెమ్మలను వారి వద్దకు తీసుకెళ్లి వారి వెతలను వినిపించారు. పింఛన్‌దారులతో పాటు రైతులు, చిరు వ్యాపారులు, విద్యార్థులు నగదు కోసం చాలా అవస్థలు పడుతున్నారన్నారు. ఏటీఎంలలో కూడ నగదు ఉండడం లేదని ఆరోపించారు. పింఛన్దారులలో కొందరు ఏటీఎం కార్డులు, బ్యాంకు అకౌంట్ల కోసం నానా అవస్థలు పడుతున్నారని ఆరోపించారు. పింఛన్‌దారులందరికీ నేరుగా పంచాయతీల ద్వారా నగదు బట్వాడా చేయాలని డిమాండ్ చేశారు. పోస్టాఫీసులలో చాలా రోజులుగా నగదు ఇవ్వడం లేదని ఆరోపించారు. పింఛన్‌దారులు, బ్యాంకు వినియోగదారులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్ వుల్లి బుజ్జిబాబు, జిల్లా కార్యదర్శులు చింతపల్లి చంద్రం, అయిల శ్రీను, మండల బీసీ సెల్ కన్వీనర్ సూరిశెట్టి భద్రం, రాష్ట్ర యూత్ కార్యదర్శి బొరుసు బద్రి, మండల యూత్ అధ్యక్షుడు అడపా శ్రీను, మండల అధికార ప్రతినిధులు గరగ మధు, తాడి హరిశ్చంద్రప్రసాద్‌రెడ్డి, కోరుకొండ యూత్ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు కోడూరి సత్తిరెడ్డి, పసుపులేటి బుల్లియ్యనాయుడు, విద్యార్థి విభాగం నాయకుడు వుల్లి గణనాథ్, ఎంపీటీసీ వుల్లి చెల్లారావు, రైతు నాయకులు గింజాల వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. కరెన్సీ కష్టాలు తీర్చాలి. కరెన్సీ కష్టాలను తక్షణం తీర్చాలని, బ్యాంకులు, ఏటీఎంల వద్ద తగినంత నగదు అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ సీపీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి ఆధ్వర్యంలో సోమవారం కోరుకొండలో ప్రదర్శన నిర్వహించారు. పింఛనుదార్లకు ఆయా పంచాయతీ కార్యదర్శుల ద్వారా పింఛన్లు అందించాలని; రైతులు, వివిధ వర్గాల ప్రజలకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం నగదు ఇవ్వాలని; వృద్ధులు, వికలాంగులకు బ్యాంకుల వద్ద ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. -
నరసన్న సొమ్ము లెక్కలు చెప్పకుంటే ఉద్యమం
రూ.57 లక్షల ఖర్చుకు వివరాలు చెప్పని అన్నవరం అధికారులు వైఎస్సార్ సీపీ సీజీసీ సభ్యురాలు విజయలక్ష్మి కోరుకొండ : రాష్ట్రంలోనే ప్రసిద్ధిగాంచిన కోరుకొండ శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి పేరున బ్యాంక్ ఖాతాలో ఉన్న నగదు డ్రా చేసిన అన్నవరం దేవస్థానం అధికారులు ఖర్చుల లెక్కలు రెండు వారాల్లో స్వామి సన్నిధిలో భక్తుల సమక్షంలో తెలియజేయాలని వైఎస్సార్ సీపీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి డిమాండ్ చేశారు. లేనిపక్షంలో తమ పార్టీ ఆందోళన చేపడుతుందని హెచ్చరించారు. శనివారం ఆమె ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ ఆనువంశిక ధర్మకర్త ఎస్పీ రంగరాజ్భట్టార్స్వామితో మాట్లాడుతూ స్వామి పేరున బ్యాంక్‌లో ఉన్న సొమ్ములో డ్రా చేసిన సుమారు రూ.57 లక్షలకు ఖర్చుల వివరాలు తెలపాలని అడిగారు. ఆ లెక్కలు తనకు తెలియవని, అన్నవరం దేవస్థానం వారికే తెలుసని భట్టార్ చెప్పారు. అనంతరం విజయలక్ష్మి మాట్లాడుతూ అన్నవరం దేవస్థానం లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని దత్తత తీసుకున్నప్పుడు వచ్చిన సొమ్ము స్వామి పేరున బ్యాంక్‌లో జమ చేస్తామన్నారని చెప్పారు. అప్పటి ఈఓ అలాగే సొమ్ము జమ చేశారన్నారు. ప్రస్తుతం స్వామి సొమ్ము డ్రా చేసి ఖర్చుల వివరాలు చెప్పడం లేదన్నారు. దీనిపై స్థానిక ఎమ్మెల్యే ప్రత్యేకదృష్టి పెట్టాలని కోరారు. ఇప్పటికైనా అన్నవరం దేవస్థానం ఈఓ స్పందించక పోతే ఉద్యమం చేపడతామన్నారు. ఆమె వెంట పార్టీ మండల కన్వీనర్ వుల్లి బుజ్జిబాబు, జిల్లా కార్యదర్శులు చింతపల్లి చంద్రం, అయిల శ్రీను, యువజన నాయకులు బొరుసు బద్రి, తాడి హరిశ్చంద ప్రసాద్‌రెడ్డి, మండల అధికార ప్రతిని««దlులు గరగ మధు, వాకా నరసింహారావు, మండల రైతు కన్వీనర్ తోరాటి శ్రీను, బీసీ కన్వీనర్ సూరిశెట్టి భద్రం, యూత్ కన్వీనర్ అడపా శ్రీను తదితరులున్నారు. -
నరసన్న నిధులకు రెక్కలు
బ్యాంకు అకౌంట్ నుంచి రూ.59 లక్షలు విత్‌డ్రా మళ్లీ జమచేయాలని కోరుతున్న భక్తులు రాజానగరం / కోరుకొండ : కోరుకొండ లక్ష్మీనరసింహస్వామి సొమ్ములకే భద్రత కరువైంది. బ్యాంకులో వేసిన సొమ్ములకు రెక్కలు వచ్చాయి. రూ. 76.37 లక్షలు ఉండవలసిన నిల్వలు రూ. 17 లక్షలకు తరిగిపోయాయి. దేవుడి మాన్యం ఉన్నా కాలక్రమంలో తరిగిపోవడంతో ఆదాయం కూడా తగ్గిపోయింది. దీంతో 2010లో అన్నవరం దేవస్థానం నరసన్న ఆలయాన్ని దత్తత తీసుకుంది. కళ్యాణాలు ఇతర ఉత్సవాల నిర్వహణకు తమ నిధులు వెచ్చించేలా అన్నవరం ఆలయ అధికారులు నిర్ణయించారు. అలాగే రాష్ట్రంలో ఆదాయం తక్కువగా ఉన్న ప్రసిద్ధి చెందిన 25 ఆలయాలను ప్రభుత్వం దత్తత తీసుకుంది. అనంతరం ఈ ఆలయం ద్వారా వచ్చే ఆదాయాన్ని స్వామి పేరున కోరుకొండ ఆంధ్రాబ్యాంకులో డిపాజిట్ చేసేలా అప్పటి అన్నవరం ఈఓ కె.రామచంద్రమోహన్, బోర్డు సభ్యులు నిర్ణయించారు. దీంతో రూ.9 లక్షల నిల్వతో అకౌంట్ ప్రారంభించి ఆలయాన్ని అప్పగించారు. గడిచిన నాలుగేళ్లలో నిధులు రూ.76.37 లక్షలకు చేరినట్టు గత మార్చి నెలలో జరిగిన సమావేశంలో అధికారులు తెలిపారు. కాగా వివిధ ఖర్చుల నిమిత్తం రూ.59 లక్షలను విత్‌డ్రా చేసినట్టు పలువురు భక్తులు పేర్కొన్నారు. కోరుకొండ ఖర్చులన్నీ తామే భరిస్తామన్న తరువాత నిధులు ఎందుకు విత్‌డ్రా చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని వారు ప్రశ్నిస్తున్నారు. కోరుకొండ ఆలయానికి పాలకమండలి లేకపోవడమూ ఇందుకు కారణమని వారు ఆరోపిస్తున్నారు. సొమ్ము విత్‌డ్రాలో ఈఓకూ భాగం ఉందని వారు ఆరోపిస్తున్నారు. ఈఓ నిర్లక్ష్యంగా సమాధానమిస్తున్నారు ఈ విషయమై ఈఓను వివరణ కోరగా నేను ఎవరికీ చెప్పనక్కరలేదు, ఎమ్మెల్యేకి కానీ, కమిషనర్‌కు గానీ వివరిస్తానని నిర్లక్ష్యంగా సమాధానమి స్తున్నారు. మీకు కూడా కావాలంటే అన్నవరం రావాలంటున్నారు. ఆలయ దత్తత సమయంలో ఇచ్చిన మాట ప్రకారం ఖర్చులు అన్నవరం దేవస్థానమే భరించాలి. – నీరుకొండ యుధిష్టర నాగేశ్వరావు, భక్తుడు, కోరుకొండ.