కోరుకొండ: తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం నర్సాపురం వద్ద మంగళవారం మధ్యాహ్నం ఓ డీజిల్ ట్యాంకర్ బోల్తా కొట్టింది. ఈ ఘటనలో డ్రైవర్‌కు గాయాలు అయ్యాయి. అతడిని స్థానికులు 108 వాహనంలో కోరుకొండ ఆస్పత్రికి తరలించారు. గోకవరం మండలం గుమ్మళ్లదొడ్డిలోని హెచ్‌పీసీఎల్ కేంద్రం నుంచి డీజిల్‌తో ట్యాంకర్ వెళుతుండగా... నర్సాపరం వద్దకు వచ్చేసరికి ఎదురుగా వచ్చిన గేదెను తప్పించే ప్రయత్నంలో లారీ బోల్తాకొట్టింది. కాగా, రోడ్డు పక్కన ప్రవాహం కట్టిన డీజిల్‌ను పట్టుకునేందుకు స్థానికులు పరుగులు తీయగా... పోలీసులు రంగప్రవేశం చేసి వారిని చెల్లాచెదురు చేశారు.