
ఎన్నికల హామీలను విస్మరించిన చంద్రబాబు
కోరుకొండ : రుణమాఫీ విషయంలో సీఎం చంద్రబాబు మాట తప్పి రైతులు, డ్వాక్రా సభ్యులను మోసం చేశారని వైఎస్సార్‌సీపీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి ధ్వజమెత్తారు. మంగళవారం కోరుకొండలో వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సభకు విచ్చేసిన ఆమె విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు ఎన్నికల ముందు ఒకమాట ఇప్పుడు మరోమాట మాట్లాడుతున్నారని ఆరోపించారు. వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వై.ఎస్. జగన్‌మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు ప్రజా పక్షాన్న నిలబడి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్నారు. పార్టీ మండల కన్వీనర్ చింతపల్లి చంద్రం, యూత్ కన్వీనర్ వైఎల్‌ఎన్ స్వామి, రైతు కన్వీనర్ తోరాటి శ్రీను, బీసీ సెల్ కన్వీనర్ సూరిశెట్టి భద్రం పాల్గొన్నారు.