Vijayalakshmi
-
నేటితో GHMC పాలకమండలి ఏర్పడి నాలుగేళ్లు పూర్తి
-
గుర్రం విజయలక్ష్మి అరెస్ట్..
దుండిగల్: నిబంధనలకు విరుద్ధంగా అక్రమ నిర్మాణాలు చేపట్టడమేగాక, వినియోగదారులను మోసం చేసి రూ.కోట్లు సంపాదించింది. పోలీసు కేసులు నమోదు కావడంతో దేశం విడిచి పారిపోయేందుకు యత్నించిన ఓ నిర్మాణ సంస్థ యజమానురాలిని దుండిగల్ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మేడ్చల్ జిల్లా దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలో మల్లంపేటలోని సర్వే నెంబర్ 170/3, 170/4, 170/5లోని 15 ఎకరాల భూమిని పాతికేళ్ల క్రితం ముగ్గురు స్వాతంత్ర సమరయోధులకు అప్పటి ప్రభుత్వం కేటాయించింది. ఆ తర్వాత సదరు భూమి పలువురి చేతులు మారి చివరికి కొన్నేళ్ల క్రితం శ్రీ లక్ష్మీ శ్రీనివాస కన్స్ట్రక్షన్ సంస్థకు చేరింది. సంస్థ నిర్వాహకురాలు గుర్రం విజయలక్ష్మి ఐదేళ్ల క్రితం 3.20 ఎకరాల్లో 65 విల్లాల నిర్మాణం కోసం హెచ్ఎండీఏకు దరఖాస్తు చేసుకుంది. ఆ తర్వాత సదరు సంస్థ ఎలాంటి అనుమతులు లేకుండానే పక్కనే ఉన్న కత్వ చెరువుకు సంబంధించిన 16 గుంటల ఎఫ్టీఎల్, మూడు ఎకరాల బఫర్ జోన్‌ను ఆక్రమించి ఏకంగా 300కు పైగా విల్లాలను నిరి్మంచింది. దీనిపై స్థానికులు పలుమార్లు మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. బఫర్ జోన్, ఎఫ్టీఎల్ పరిధిలోని 11 అక్రమ విల్లాలను గత సెప్టెంబరులో అధికారులు కూల్చివేశారు. అంతేగాక ఇరిగేషన్ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా అక్రమ నిర్మాణాలు చేపట్టారని దుండిగల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనికి తోడు తమకు అన్ని సదుపాయాలు కల్పిస్తామని చెప్పి మోసం చేశారని, రిజి్రస్టేషన్లు సైతం చేసుకుని బ్యాంకుల్లో రుణాల్లో తీసుకుని రూ. లక్షలు వెచ్చించి ప్లాట్లను కొనుగోలు చేశామని, చివరికి తమ విల్లాలను కూల్చివేశారని, సంస్థ నిర్వాహకురాలు గుర్రం విజయలక్ష్మిపై చర్యలు తీసుకోవాలని బాధితులు దుండిగల్ పోలీసులను ఆశ్రయించారు. విజయలక్ష్మిపై ఇప్పటి వరకు ఏడు కేసులు నమోదు చేసిన పోలీసులు లుక్ఔట్ నోటీసులు జారీ చేశారు. కాగా గురువారం తెల్లవారుజామున దేశం విడిచి పారిపోయేందుకు ప్రయతి్నంచిన ఆమెను శంషాబాద్ ఎయిర్పోర్ట్ పోలీసులు అదుపులోకి తీసుకుని దుండిగల్ పోలీసులకు అప్పగించారు. వారు ఆమెను న్యాయమూర్తి ఎదుట హాజరు పరచడంతో 14 రోజుల రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఆమెను చంచల్‌గూడ జైలుకు తరలించారు. -
GHMC: అవగాహన లేకుండా ‘అవిశ్వాసం’
సాక్షి, హైదరాబాద్: బల్దియా పాలకమండలి ఏర్పాటై వచ్చే నెల 10వ తేదీకి నాలుగేళ్లు పూర్తి కానుండటం.. ఆ తర్వాత మేయర్‌పై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు అవకాశం ఉన్న నేపథ్యంలో గురువారం జరగనున్న జీహెచ్ఎంసీ ప్రత్యేక బడ్జెట్, సాధారణ సర్వసభ్య సమావేశాలపై రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కౌన్సిల్ ఈ సమావేశాల సందర్భంగా ఏం జరుగుతుందోనని ఆసక్తికరంగా మారింది. ఒకవేళ మేయర్‌పై అవిశ్వాస తీర్మానం పెట్టాలనుకున్నా అందుకు పాలకమండలి సమావేశం వేదిక కాకపోయినప్పటికీ, పొలిటికల్ హీట్ మాత్రం పెరిగింది. ఈ నేపథ్యంలో కౌన్సిల్ సమావేశాల సందర్భంగా అనుసరించాల్సిన వ్యూహంపై మంగళవారం బీజేపీ కార్పొరేటర్లతో ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జాతీయ నాయకుడు, ఎంపీ కె.లక్ష్మణ్ నేతృత్వంలో సమావేశం నిర్వహించారు. పలువురు పార్టీ అగ్రనేతలు కూడా హాజరైన ఈ సమావేశంలో ప్రజా సమస్యలపై నిలదీయాలని ఉద్భోదించారు. కేంద్రం నిధులివ్వడం లేదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పదే పదే అంటున్నందున జీహెచ్ఎంసీలో ప్రజలు వేల కోట్ల పన్నులు కడుతున్నా మీరెందుకు వారికి పనులు చేయడం లేదని ప్రశ్నించాలనే నిర్ణయానికి వచ్చారు. ఈ నిధులు ఎక్కడికి మళ్లిస్తున్నారో అడగాలని, ఆ నిధులన్నీ ఏం చేస్తున్నారో నిలదీయాలని సూచించారు. ముఖ్యంగా.. జీహెచ్ఎంసీ బడ్జెట్‌పైనా, ప్రజా సమస్యలపైనా గళమెత్తాలని ఆదేశించారు. సమస్యలపై ప్రశ్నించేందుకు బీజేపీ సభ్యులకు అవకాశమివ్వకపోవడం తగదన్నారు. ప్రశ్నల ద్వారా సమాధానాలు రాబట్టాలన్నారు. మేయర్‌పై అవిశ్వాసానికి సంబంధించి ఎలాంటి చర్చ జరగలేదని తెలిసింది. హాజరైన కార్పొరేటర్లు ముగ్గురే.. మేయర్ గద్వాల్ విజయలక్ష్మి జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో తమ పార్టీ కార్పొరేటర్లతో సమావేశమయ్యారు. ఆమె బీఆర్ఎస్ నుంచి కార్పొరేటర్‌గా గెలిచి మేయర్ కావడం తెలిసిందే. పాలకమండలి తొలి ఎన్నికల్లో కాంగ్రెస్‌కు వచి్చంది కేవలం రెండు కార్పొరేటర్ స్థానాలే అయినప్పటికీ, ఏడాది క్రితం రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక జీహెచ్ఎంసీలోనూ కాంగ్రెస్ బలం పెరిగింది. ప్రస్తుతం ఆ పారీ్టలో 24 మంది కార్పొరేటర్లు ఉన్నప్పటికీ, కౌన్సిల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు మేయర్ ఆహ్వానానికి కేవలం ముగ్గురు మాత్రమే హాజరు కావడం బల్దియాలో చర్చనీయాంశంగా మారింది. అనుసరించాల్సిన వ్యూహం కోసం పిలిస్తే కనీస సంఖ్యలో కూడా సభ్యులు రాలేదు. అవగాహన లేకుండా ‘అవిశ్వాసం’ తనపై ఏ పార్టీవారు అవిశ్వాస తీర్మానం పెట్టుకున్నా తనకు అభ్యంతరం లేదని మేయర్ విజయలక్ష్మి ఉప్పల్‌లో జరిగిన ఓ కార్యక్రమం సందర్భంగా మీడియా ఎదుట వ్యాఖ్యానించారు. చట్టం, నిబంధనల మేరకు వారికా అవకాశం ఉందంటూ ఫిబ్రవరి 11 తర్వాత మాత్రమే అది సాధ్యమన్నారు. ఆలోగా ఏయే పార్టీలు కలిసి అవిశ్వాసం పెడతాయో చూద్దామన్నారు. అసలు అవిశ్వాసం పెట్టాలంటే ఎంత బలం ఉండాలో వారికి తగిన అవగాహన లేదన్నారు. తనపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ చేసిన అవినీతి వ్యాఖ్యలపై స్పందిస్తూ, పదేళ్లుగా తాను, దాదాపు యాభయ్యేళ్లుగా తనతండ్రి కేశవరావు రాజకీయాల్లో ఉన్నా.. మా లైఫ్‌స్టైల్ ఏంటో, కొత్తగా ఎమ్మెల్యేలైన బీఆర్ఎస్ వారి లైఫ్ స్టైల్ ఏంటో ప్రజలు చూస్తూనే ఉన్నారన్నారు. ఎవరు అవినీతికి పాల్పడుతున్నారో దాన్ని బట్టే అర్థం చేసుకోవచ్చునన్నారు. బీజేపీ చీఫ్ పదవిపై కాంగ్రెస్ ఫ్లోర్‌లీడర్ వ్యాఖ్య జీహెచ్ఎంసీలో కాంగ్రెస్ పక్ష నాయకుడు దర్పల్లి రాజశేఖర్‌రెడ్డి జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో కలిసిన విలేకరులతో మాట్లాడుతూ.. బీజేపీ రాష్ట్ర పగ్గాలు ఈటల రాజేందర్‌కు దక్కకుండా ఉండేందుకు కేంద్రమంత్రి బండి సంజయ్ తెలివిగా ప్లాన్ చేశారని ఆరోపించారు. గద్దర్‌కు అవార్డు ఇవ్వకపోవడం గురించి చేసిన వ్యాఖ్య ద్వారా బీజేపీ అధ్యక్ష పదవికి ఈటల అర్హుడు కాదనే సంకేతాలిచ్చారన్నారు. -
మేయర్‌పై అవిశ్వాసం
సాక్షి, సిటీబ్యూరో: నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మిపై అవిశ్వాస తీర్మాన అంశం మంగళవారం నగరంలో హాట్ టాపిక్‌గా మారింది. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ జూబ్లీహిల్స్ నివాసంలో జరిగిన విందుకు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, గ్రేటర్ పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన సంభాషణల్లో మేయర్‌పై అవిశ్వాసం అంశం కూడా ప్రస్తావనకొచ్చింది. మేయర్ పదవీ బాధ్యతలు స్వీకరించి వచ్చే నెల ఫిబ్రవరి 10వ తేదీకి నాలుగేళ్లు పూర్తి కానుండటం, ఆ తర్వాత అవిశ్వాస తీర్మానానికి అవకాశం ఉన్న నేపథ్యంలో మిగ తా అంశాలతో పాటు దీనిపై కూడా కొద్దిసేపు మా ట్లాడినట్లు తెలిసింది. విందుకు పలువురు నేతలు హాజరు కావడం.. మేయర్‌పై అవిశ్వాసానికి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలకు కూడా అవకాశం ఉండటంతో ఇదే అంశంపై చర్చ జరిగిందనే ప్రచారం వైరల్‌గా మారింది. ముఖ్యంగా రాజకీయ వర్గాల్లో, జీహెచ్ఎంసీ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. పార్టీ మారినందునే.. జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా మేయర్ పదవి కోసం ఎంతోమంది పోటీ పడినా.. గద్వాల్ విజయలక్ష్మికే బీఆర్ఎస్ అవకాశం కల్పించింది. కాగా.. ఆమె కనీస కృతజ్ఞత లేకుండా గులాబీ పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరారనే అభిప్రాయం ఆ పార్టీ నేతల్లో ఉంది. దీంతో అవిశ్వాసం అంశం కూడా చర్చకు వచ్చినట్లు తెలిసింది. కేవలం కుటుంబ కార్యక్రమంగా జరిగిన ఈ సమావేశంలో, తాము రాజకీయాల్లో ఉన్నందున రాజకీయ అంశాలు కూడా పిచ్చాపాటీగా చర్చకు వచ్చాయని పార్టీ నాయకుడొకరు తెలిపారు. వివిధ అంశాలతో పాటు మేయర్‌పై అవిశ్వాసం కూడా ప్రస్తావనకు వచ్చిందిని, అంతకు మించి ఎక్కువ చర్చ జరగలేదని చెప్పారు. బహుశా వచ్చే శనివారం.. లేదంటే ఆదివారం నగరానికి చెందిన ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు తదితరులతో కేటీఆర్ సమావేశం నిర్వహించనున్నారని సమాచారం. ఆ రోజు రాజకీయ అంశాలతో పాటు రేషన్‌కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, నగర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు తదితరాలపై ఎజెండాకు అనునుగుణంగా సమావేశం జరగనున్న ట్లు తెలిసింది. అదే సమావేశంలో మేయర్‌పై అవిశ్వాసానికి సంబంధించి కూడా విస్తృతంగా చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటారని సమాచారం. ఇంతకీ ఏం జరగనుంది? మేయర్‌పై అవిశ్వాసం పెడితే ఏం జరగనుంది? గద్వాల్ విజయలక్ష్మి మేయర్ పదవిని కోల్పోక తప్పదా? అనే ప్రశ్నలు ప్రస్తుతం ఆసక్తికరంగా మారాయి. జీహెచ్ఎంసీ చట్టం, నిబంధనలు, ప్రస్తుతం జీహెచ్ఎంసీలో ఆయా పార్టీల బలాలు తదితరాలను పరిగణనలోకి తీసుకుంటే పదవి పోయేంత ప్రమాదమేమీ లేదని మున్సిపల్ వ్యవహారాల నిపుణులు చెబుతున్నారు. నిబంధనల మేరకు కార్పొరేటర్లు, ఎక్స్ అఫీషియో సభ్యుల్లో (స్థానిక ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు) 50 శాతం మంది అవిశ్వాస తీర్మానాన్ని కోరుతూ.. నిరీ్ణత ప్రొఫార్మా ద్వారా సంతకాలు చేసి హైదరాబాద్ జిల్లా కలెక్టర్‌కు అందజేయాలి. ప్రస్తుతం జీహెచ్ఎంసీలో కార్పొరేటర్లు, ఎక్స్ అఫీషియో సభ్యులు మొత్తం 196 మంది ఉండగా, అందులో 98 మంది సంతకాలు చేస్తేనే అది సాధ్యం, బీఆర్ఎస్కు కార్పొరేటర్లు, ఎక్స్‌అఫీషియోలు కలిసి 71 మంది సభ్యుల బలం ఉంది. ఆ పార్టీలు కలిసి వచ్చేనా? అవిశ్వాసం పెట్టాలంటే మరోపార్టీ కలిసి రావాలి. ఎంఐఎం ప్రస్తుతం కాంగ్రెస్‌తో సఖ్యతగా ఉండటం తెలిసిందే. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా బీఆర్ఎస్తో కలిసి నడుస్తుందని చెప్పలేం. ఇక మిగిలింది బీజేపీ. అది సైతం బీఆర్ఎస్తో కలిసే పరిస్థితి లేదు. ఒకవేళ అవిశ్వాసం కోసమే రెండింటిలో ఏదో ఒక పార్టీ సభ్యులు లోపాయికారీగా సంతకాలు చేసి.. అవిశ్వాసం కోసం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసినా అవిశ్వాసం నెగ్గే పరిస్థితి లేదు. జీహెచ్ఎంసీలోని సంబంధిత సెక్షన్ 91–ఎ మేరకు మొత్తం ఓటు హక్కున్న సభ్యుల్లో మూడొంతుల మెజారిటీ ఉంటేనే అవిశ్వాసానికి కోరం ఉన్నట్లు లెక్క. ఆ లెక్కన ప్రస్తుతమున్న కార్పొరేటర్లు, ఎక్స్ అఫీషియోలను పరిగణనలోకి తీసుకుంటే 131 మంది సభ్యుల బలం ఉండాలి. బీఆర్ఎస్తో బీజేపీ కలిసినా, లేక ఎంఐఎం కలిసినా అది సాధ్యం కాదు. బీఆర్ఎస్, బీజేపీ కలిస్తే మొత్తం బలం 116 అవుతుంది. బీఆర్ఎస్, ఎంఐఎం కలిసినా 122 అవుతుంది. కోరమే ఉండనప్పుడు అవిశ్వాసం ముందుకు వెళ్లే పరిస్థితే ఉండదని జీహెచ్ఎంసీ చట్టం, నిబంధనల గురించి తెలిసిన నిపుణులు చెబుతున్నారు. -
గుర్తుండిపోయే పాత్రలు చేయాలన్నదే నా లక్ష్యం
విజయలక్ష్మీ ఫిరోజ్.. తమిళ సినీ అభిమానులకు బాగా తెలిసిన నటి. ఇప్పుడు వెబ్ తెరకూ పరిచయమై తన టాలెంట్‌తో వీక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంటోంది.దర్శకుడి కూతురిని కాబట్టే నాకు అవకాశాలు వస్తున్నాయనుకుంటున్నవాళ్లున్నారు ఇప్పటికీ! కానీ అది నిజం కాదు. దర్శకుడి కూతురు అనే ట్యాగ్.. ఇండస్ట్రీ ఎంట్రీని ఈజీ చేస్తుందేమో కానీ.. నిలబెట్టేది మాత్రం టాలెంటే! అలా నా ప్రతిభతో ఎప్పటికీ గుర్తుండిపోయే పాత్రలు చేయాలన్నదే నా లక్ష్యం. అందుకెంత ఆలస్యమైనా పరవాలేదు.– విజయలక్ష్మీ ఫిరోజ్.⇒ 2007లో ‘చెన్నై 600028’ మూవీతో సినీ ఇండస్ట్రీ దృష్టిలో పడింది. వరుస అవకాశాలను అందుకోవడం మొదలుపెట్టింది. ఆ క్రమంలోనే ‘అంజాదే’లో నటించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. వెండితెర, బుల్లితెర అనే తేడా చూపకుండా టీవీ సీరియల్స్‌లో వచ్చిన చాన్సెస్నూ సద్వినియోగం చేసుకుంది. తమిళ ‘బిగ్ బాస్ 2’, ‘సర్వైవర్ తమిళ్’ వంటి రియాలిటీ షోలలోనూ పాల్గొంది.⇒ విజయలక్ష్మీ ఫిరోజ్ది సినిమా కుటుంబం అని చెప్పొచ్చు. తండ్రి అగత్తియన్ దర్శకుడు. సోదరీమణులు నిరంజనీ అగత్తియన్.. నటి, కాస్ట్యూమ్ డిజైనర్. కార్తీకా అగత్తియన్ నటి.⇒ ఫిరోజ్ మహ్మద్‌ని పెళ్లి చేసుకుని, నటన నుంచి సినిమా నిర్మాణం వైపు మళ్లింది. ఫిరోజ్ దర్శకత్వం వహించిన ‘పండిగై’ తో నిర్మాతగా మారింది.⇒ దాదాపు పదేళ్ల తర్వాత మళ్లీ స్క్రీన్‌పై కనిపించింది. ‘హై ప్రీస్టెస్’ సిరీస్‌తో వెబ్ దునియాలోకి అడుగుపెట్టింది. ఇది జీ5లో స్ట్రీమ్ అవుతోంది. -
పిచ్చుకలకు కుచ్చులు
గతం ఎక్కడికో పోదు. వర్తమానమై పలకరిస్తుంది. భవిష్యత్ ఆశాకిరణమై మెరుస్తుంది. ఘనంగా చెప్పుకోవడానికి గతంలో ఎన్నో ఉన్నాయి. ‘ఇది మా ఇల్లు మాత్రమే కాదు... పక్షులది కూడా’ అనుకోవడం అందులో ఒకటి. పిచ్చుకలకు ఇంట్లో చోటివ్వడంతోపాటు వాటి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసేవారు. ఇప్పుడు అంత సీన్ ఉందా?పక్షుల ప్రపంచం, మన ప్రపంచం వేరైపోయాయి. ఇప్పుడు పక్షుల నుంచి చుట్టపు చూపు పలకరింపు కూడా లేదు. ఎప్పుడో ఒకసారి పిట్ట కనిపించినా వాటిని పలకరించే ఓపిక మనకు లేదు. ఇలాంటి నేపథ్యంలో విజయలక్ష్మిలాంటి పక్షిప్రేమికులు ఆశాదీపాలను వెలిగిస్తున్నారు. ఆ వెలుగును చూడగలిగితే మరెన్నో దీపాలు వరుస కడతాయి. పక్షులతో చెలిమి చేయడానికి స్వాగత తోరణాలు అవుతాయి.తమ ఇంటి పిట్టగోడపై వాలిన ఆ పిట్టను చూడగానే నిర్మల్‌కు చెందిన విజయలక్ష్మికి తన చిన్ననాటి జ్ఞాపకాలు ఒక్కసారిగా గుర్తుకు వచ్చాయి. ‘‘మా ఊళ్లో.. మా ఇంట్లో.. మా నాన్నగారు ఇలాంటి పిచ్చుకల కోసం ఏదో చేసేవారే..! దానికోసం గూడు కట్టడంతో పాటు తినడానికి ఏదో పెట్టేవారే..!’ అని గుర్తుతెచ్చుకునే ప్రయత్నం చేసింది. బంధువులకు ఫోన్లు కలిపింది. నానమ్మ తరపువాళ్లు ‘దాన్ని వరికుచ్చు అంటారే..’ అని చెప్పడంతోనే ‘హమ్మయ్యా.. తెలిసింది..’ అని అనుకుని ఊరుకోలేదు.‘ఇక ఇప్పుడు కుచ్చులు కట్టడమెలా..!?’ అంటూ ఆలోచనల్లో పడింది. యూట్యూబ్‌లో ‘వరికుచ్చుల తయారీ’ గురించి సెర్చ్ చేసింది. ఆ వీడియోలను చూస్తూ ప్రాక్టీస్ చేసి నేర్చేసుకుంది. నిర్మల్ జిల్లాలో డీఆర్డీవో (జిల్లా గ్రామీణాభివృద్ధిశాఖాధికారి)గా పనిచేస్తున్న విజయలక్ష్మి తన సిబ్బందికి కూడా వరి కుచ్చులు తయారు చేయడం ఎలాగో నేర్పించింది. వీరు చేసిన వరికుచ్చులు ఇప్పుడు ప్రతి ప్రభుత్వ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. సామాన్యుల నుంచి మంత్రుల వరకు ఈ వరికుచ్చులపై ఆసక్తి చూపుతున్నారు. తమ ఇళ్లల్లో వేలాడదీస్తున్నారు. ఇప్పుడు ఆ ఇళ్లలో మనుషులు మాత్రమే కాదు... అందమైన పిచ్చుకలు కూడా కనిపిస్తున్నాయి.ఎన్నో ఎన్నెన్నో!పచ్చదనమన్నా, పల్లెవాసులతో కలిసిపోవడమన్నా ఇష్టపడే విజయలక్ష్మి డీఆర్డీవోగా నిర్మల్ జిల్లాలో ఎన్నో వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది...→ గ్రామీణ, ఆదివాసీ మహిళలు రుతుక్రమ సమయంలో ఇంటికి దూరంగా ఉండటాన్ని చూసి చలించిన విజయలక్ష్మి వారికి అవగాహన కలిగించేందుకు షార్ట్ఫిలిమ్ తీసింది. తక్కువ ధరలోనే శానిటరీ ప్యాడ్స్ ఇవ్వడానికి కుంటాల మండల మహిళ సమాఖ్య ద్వారా రేలా (రూరల్ వుమెన్ ఎంపవర్మెంట్ అండ్ లైవ్లీహుడ్ ఆక్టివేషన్) పేరిట శానిటరీ ప్యాడ్స్ తయారీ కేంద్రాన్నిప్రారంభించారు → నిర్మల్ కొయ్యబొమ్మల కోసం మూడుచోట్ల పొనికిచెట్లను పెంచుతున్నారు → మండల మహిళల ద్వారా సమీకృత సాగుప్రారంభించి అందులో వరితో పాటు కూరగాయలు, బీట్రూట్, క్యారట్, వట్టివేరు, కర్రపెండలం పండిస్తున్నారు. చేపలు, నాటుకోళ్లు పెంచుతున్నారు. క్యాన్సర్ పేషెంట్లకు ఉపయోగపడే ‘ప్యాషన్’ఫ్రూట్నూ ఇక్కడ పండిస్తున్నారు→ ఉపాధిహామీ పథకంలో కూలీలు, పనుల సంఖ్యను పెంచి తెలంగాణ రాష్ట్రంలోనే నిర్మల్‌ను మూడేళ్లుగా ప్రథమ స్థానంలో నిలిపారు. స్త్రీనిధి, బ్యాంక్ లింకేజీ రుణాలు ఇవ్వడంలో, వసూలు చేయడంలోనూ నిర్మల్‌ను అగ్రస్థానంలో నిలిపారు. జిల్లా సంక్షేమాధికారి ఇన్చార్జి బాధ్యతల్లో ఉన్నప్పుడు అంగన్వాడీ కేంద్రాల్లో ఆకుకూరల సాగు చేపట్టారు. ‘మన వంట–అంగన్వాడీ ఇంట’ ‘న్యూట్రిబౌల్’లాంటి కార్యక్రమాలతో ప్రశంసలు అందుకున్నారు.వరికుచ్చుల సరిగమలుపాతకాలపు లోగిళ్లు మనుషులకే కాదు పశుపక్ష్యాదులకూ చోటిచ్చేవి. చిలుకచెక్కతో ఉండే ఇళ్ల స్లాబుల్లోనే పిచ్చుకల కోసమూ గూళ్లను కట్టించేవారు. వాటిలో కాపురం పెట్టే జంటల కోసం తమ పంటల్లో నుంచి భాగాన్ని పంచేవారు. ధాన్యం ఇంటికొచ్చే వేళ పిచ్చుకల కోసం ప్రత్యేకంగా వరికుచ్చులను తయారు చేసిపెట్టేవారు. అలా చేసిన కుచ్చులను పిచ్చుకల గూళ్లకు దగ్గరగా వేలాడదీసేవారు. పొద్దుపొద్దున్నే వాటిపై వాలే పిచ్చుకలు ఒక్కో వడ్లగింజను నోటితో ఒలుస్తూ ఆరగిస్తూ, కిచకిచమంటూ ఇంటిల్లిపాదిని మేలుకొల్పేవి.ఆ మంత్రదండం మన దగ్గరే ఉంది!భవిష్యత్ గురించి మాత్రమే మనం ఎక్కువగా ఆలోచిస్తుంటాం. గతంలోకి కూడా తొంగిచూస్తే... విలువైన జ్ఞాపకాలే కాదు విలువైన సంప్రదాయాలు కనిపిస్తాయి. వాటికి మళ్లీ ఊపిరి పోస్తే విలువైన గతాన్ని వర్తమానంలోకి ఆవిష్కరించినట్లే. ప్రతిప్రాంతానికి తనదైన విలువైన గతం ఉంటుంది. విలువైన సంప్రదాయాలు, కళలకు ఊపిరిపోస్తే ‘ఇప్పుడా రోజులెక్కడివి!’ అని నిట్టూర్చే పరిస్థితి రాదు. గతాన్ని వర్తమానంలోకి తీసుకువచ్చే మంత్రదండం మన దగ్గరే ఉంది.– విజయలక్ష్మి – రాసం శ్రీధర్, సాక్షి, నిర్మల్ -
ఆఫీస్ ఎన్ని గంటలకు?..మీరు వస్తున్నది ఎన్నింటికి?
సాక్షి,సిటీబ్యూరో: అయినా తీరు మారలేదు. ఎంతకూ రీతి మారలేదు. ఇష్టం వచి్చనప్పుడు రావడం.. ఓపిక ఉన్నప్పుడు ఫైళ్లు కదపడం.. ఏళ్లుగా ఇదే తంతు. తనిఖీలు చేసి హెచ్చరించినా వారికి లెక్కలేదు. మేయర్ సీరియస్ అయినా పట్టించుకోరు. ఇదీ జీహెచ్ఎంసీ సిబ్బంది, అధికారుల పనితీరు. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మికి మరోసారి కోపమొచ్చింది. గతంలో రెండు పర్యాయాలు కార్యాలయాల్లో తనిఖీలు చేసినప్పుడు సిబ్బంది ఎవరూ తమ సీట్లలో కనిపించకపోవడంపై మేయర్ ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. తాజాగా బుధవారం ఆయా విభాగాల్లో ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. కొన్ని విభాగాల్లో మధ్యాహ్నం 12 గంటలవుతున్నా అధికారులు తమ తమ స్థానాల్లో లేకపోవడంపై మేయర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకపై సహించేది లేదని, సమయపాలన పాటించనివారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆలస్యంగా వచ్చేవారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో తనకు నివేదిక పంపాల్సిందిగా అన్ని విభాగాలకు సర్క్యులర్లు పంపినా, ఎందుకు పంపలేదంటూ టౌన్‌ప్లానింగ్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. టౌన్ ప్లానింగ్‌పైనే ఎక్కువ ఫిర్యాదులు ప్రజావాణిలో ఎక్కువ ఫిర్యాదులు టౌన్ ప్లానింగ్‌వే ఉంటున్నాయని, పరిష్కారం కాక ప్రజలు జీహెచ్ఎంసీ చుట్టూ తిరుగుతున్నారని మేయర్ అన్నారు. హెల్త్ సెక్షన్లో కొందరు పని మాని సెల్‌ఫోన్ వీక్షణంలో నిమగ్నం కావడాన్ని గుర్తించి సీరియస్ అయ్యారు. ఇన్చార్జి సీఎంఓహెచ్ సీట్లో లేకపోవడంపై మండిపడ్డారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎక్కడ తనిఖీలు చేస్తున్నారో తెలుసుకోవాలని అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ ముత్యం రాజును ఆదేశించగా, ఆయన శేరిలింగంపల్లి ఫుడ్ఇన్స్పెక్టర్కు ఫోన్ చేశారు. ఫుడ్ ఇన్స్పెక్టర్ సక్రమంగా సమాధానం ఇవ్వకపోవడంతో మేయర్ మండిపడ్డారు. వెటర్నరీ విభాగంలోనూ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ ఇంతకు ముందు కూడా రెండుసార్లు అన్ని విభాగాల్లో ఆకస్మిక తనిఖీలు చేశానని, అయినా వారి తీరు మారలేదన్నారు. ఆయా విభాగాల సిబ్బంది ఉదయం 10:30 గంటల వరకు ఆఫీసులకు రావాలని, 10:40 నిమిషాల వరకు కూడా రాకపోతే ఆలస్యంగా నమోదు చేస్తామని, ఇలా మూడు పర్యాయాల ఆలస్యానికి క్యాజువల్ లీవ్ కట్ చేస్తామని, అవి లేనివారికి ఈఎల్ కట్‌చేస్తామని హెచ్చరించారు. తనిఖీల సందర్భంగా మేయర్ వెంట అడిషనల్ కమిషనర్ నళినీపద్మావతి ఉన్నారు. అనంతరం మేయర్ మీడియాతో మాట్లాడుతూ ఆలస్యంగా వచ్చేవారి గురించి తనకు ప్రతినెలా నివేదిక అందజేయాలని అన్ని విభాగాలకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. జీహెచ్ఎంసీలోని ప్రతి ఉద్యోగి ఫేషియల్ రికగి్నషన్ హాజరులో పేర్లు నమోదు చేయించుకోవాలని సూచించారు. -
Hyderabad: మేయర్ విజయలక్ష్మిపై కేసు నమోదు
బంజారాహిల్స్: బంజారాహిల్స్ రోడ్డునంబర్–12లోని ఎన్బీటీనగర్ ప్రభుత్వ పాఠశాల ఎదురుగా ఉన్న మైదానంలో ఏర్పాటు చేసిన బతుకమ్మ వేడుకల్లో నిబంధనలకు విరుద్ధంగా డీజే ఏర్పాటు చేయడంతో పాటు గడువు ముగిసిన తర్వాత కూడా సౌండ్ పొల్యుషన్‌కు పాల్పడిన ఘటనలో నగర మేయర్‌తో పాటు మరో ఇద్దరిపై బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. ఈ నెల 10వ తేదీ రాత్రి 10 గంటల çసమయంలో బంజారాహిల్స్ రోడ్డునంబర్–12లోని ఎన్బీటీనగర్లో అమ్మవారి విగ్రహాల నిమజ్జన ఊరేగింపుతో పాటు మండపాలను కానిస్టేబుళ్లు ఎస్కే నజీర్ అహ్మద్, హోంగార్డు సాయి ప్రసాద్‌లు పర్యవేక్షిస్తున్నారు. రాత్రి 11.40 గంటల ప్రాంతంలో ప్రభుత్వ పాఠశాల ముందు జరుగుతున్న బతుకమ్మ వేడుకల్లో భారీ సౌండ్‌తో డీజే ఏర్పాటు చేశారని, శబ్ద కాలుష్యంతో తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయని పోలీసులకు సమాచారం అందింది. దీంతో నజీర్ అహ్మద్, సాయిప్రసాద్‌లు అక్కడికి చేరుకుని డీజేను ఆపాల్సిందిగా నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు. అదే సమయంలో గ్రేటర్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మీ అక్కడికి చేరుకుని పోలీసులు ఇందులో జోక్యం చేసుకోవద్దని, మ్యూజిక్‌ను కొనసాగించాలని వారికి సూచించారు. భారీ శబ్ద కాలుష్యంతో ఈవెంట్‌ను అలాగే కొనసాగించారని, వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా కానిస్టేబుల్ నజీర్ అహ్మద్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో బతుకమ్మ వేడుకల నిర్వాహకులు కందాడి విజయ్‌కుమార్, మ్యూజిక్ ప్లే చేస్తున్న మహ్మద్ గౌస్, జోక్యం చేసుకోవద్దంటూ చెప్పిన మేయర్ గద్వాల్ విజయలక్ష్మిపై బంజారాహిల్స్ పోలీసులు బీఎన్ఎస్ సెక్షన్ 223, 280, 292, 49 రెడ్‌విత్ 3 (5), సెక్షన్ 21/76 సీపీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
గణనాథుల వద్ద అన్నప్రసాద వితరణ
గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా బంజారాహిల్స్ రోడ్ నెం. 13 విఘ్నేశ్వర యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ప్రారంభించగా, ప్రతాప్‌నగర్‌లో సాయినాథ్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని టీపీసీసీ కార్యదర్శి పి.విజయారెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమాల్లో నిర్వాహకులు సతీష్, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. -
బల్దియాలో అంతే!.. మధ్యాహ్నం 12 గంటలైనా విధులకు రాని సిబ్బంది
సాక్షి,హైదరాబాద్: జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం... బుధవారం ఉదయం 10.35 గంటలు⇒ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఒకటో అంతస్తులోని ఒక కార్యాలయంలోకి వెళ్లారు. ఎంతమంది సిబ్బంది ఉన్నారో చూశారు. అవాక్కయ్యారు. 20 మందికి పైగా ఉండాల్సిన సెక్షన్లో ఐదుగురే ఉన్నారు. మిగతా వారేరీ? అంటే..ఇంకా రాలేదు అనే సమాధానం వచి్చంది.⇒ అలాగే ఒక్కో కార్యాలయం చూసుకుంటూ ఒక అంతస్తు తర్వాత మరో అంతస్తుకు జీహెచ్ఎంసీలో వివిధ విభాగాలున్న ఆరంతస్తుల వరకు వెళ్లారు. అన్ని చోట్లా దాదాపుగా అవే సీన్లు. ఉద్యోగులు 10.30 గంటలకే కార్యాలయాల్లో ఉండాల్సి ఉండగా, 11 గంటలు దాటినా లేరు. 11.30 గంటలవుతున్నా పూర్తిస్థాయిలో లేరు. ⇒ అప్పుడే వస్తున్నవారిని చూసి ఆఫీస్ టైమెప్పుడు? ఎప్పుడు వస్తున్నారంటే ఆలస్యమైందంటూ తడబడుతూ సమాధానమిచ్చారు. మ. 12 గంటలైనా ఇంకా వస్తున్న వారున్నా రు. ఆ తర్వాత వచి్చన వారు సైతం ఉన్నారు. మేయర్ ఆకస్మిక విషయం ఒక్కసారిగా గుప్పుమనడంతో చాలామంది హడావుడిగా వచ్చారు. అన్ని విభాగాల్లో దాదాపుగా ఇవే పరిస్థితులుండటంతో మేయర్ మండిపడ్డారు. ⇒ ప్రజాప్రభుత్వంలో ఇలా ఉంటే నడవదని, ‘ఉండాలనుకుంటే ఉండొచ్చు..లేకుంటే వెళ్లిపోవచ్చు’ అని సీరియస్ అయ్యారు. రేపట్నుంచి 10.35 గంటల వరకు మాత్రం హాజరు రిజిస్టర్లు కార్యాలయాల్లో ఉంచి, 10.40 గంటలకు తన కార్యాలయానికి పంపించాల్సిందిగా అధికారులకు సూచించారు. రాని వారికి మెమోలు జారీ చేయాల్సిందిగా అడిషనల్ కమిషనర్ (పరిపాలన) నళిని పద్మావతికి సూచించారు.‘ఫేస్ రికగ్నిషన్’ అమలు చేస్తాం.. తనిఖీల అనంతరం మేయర్ విజయలక్ష్మి మాట్లాడుతూ, క్రమశిక్షణ, సమయపాలన పాటించని వారిని ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. సమయానికి రానివారిపై చర్యలు తీసుకుంటామన్నారు. ఉద్యోగులపై హెచ్ఓడీల పర్యవేక్షణ ఉండాలన్నారు. పలు విభాగాల్లో ఉద్యోగులు ఆలస్యంగా వస్తూ, సాయంత్రం 4 గంటలకే వెళ్తున్నట్లు తన దృష్టికి రావడంతోపాటు పలు ఫిర్యాదులందడంతో ఈ తనిఖీ నిర్వహించినట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో ఫేస్ రికగి్నషన్ అటెండెన్స్‌ను కూడా అమల్లోకి తెచ్చే ఆలోచన ఉందన్నారు. ఇది ఇక్కడ మామూలే.. మేయర్ తనకీ విషయం ఇప్పుడే తెలిసినట్లు చెప్పినప్పటికీ, బల్దియాలో అది సాధారణ తంతు. అందుకే ఒకసారి బల్దియాలో చేరిన వారు బదిలీలైనా పోకపోవడానికున్న కారణాల్లో ఇదీ ఒకటి. బల్దియా వ్యవహారాల గురించి బాగా తెలిసిన వారి సమాచారం మేరకు, మధ్యాహ్నం 12 గంటలైనా చాలామంది విధులకు రారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి ‘లంచ్ టైమ్’ మొదలవుతుంది. బల్దియాలో సాధారణ లంచ్‌బ్రేక్ అంటూ లేదు. ఎవరిష్టం వారిది. మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకూ అది నడుస్తుంటుంది. 4 గంటలు దాటాక ఇళ్లకు తిరుగుముఖం ప్రారంభమవుతుంది. పై ఆదాయం వచ్చే వారు మాత్రం సీట్లలో సాయంత్రం 5.30 గంటలు దాటినా ఉంటారు. ఇక, కార్యాలయాల్లో ఉండేవారిలో సైతం అందరూ పనులు చేస్తున్నారని చెప్పలేం. కొందరు కంప్యూటర్లలో గేమ్స్ ఆడుతుంటారు. కొందరు ఎక్కువ సమయంలో ఫోన్లలో యూట్యూబ్ చిత్రాలు చూస్తుంటారు. బల్దియాలోని వైఫై సదుపాయంతో నిరి్వరామంగా ఫోన్లు, కంప్యూటర్లతో కాలం గడుపుతారు. అలాగని అంకితభావంతో పనిచేస్తున్నవారు లేరని చెప్పలేం. కాకపోతే వారి సంఖ్య స్వల్పం. ఉదయం సమయానికే వచ్చి పొద్దుపోయేంత వరకు తలమునకలుగా పనులు చేసే వారూ ఉన్నారు. అలాంటి వారివల్లే బల్దియా బతుకుతోంది. నిజంగా చర్యలుంటాయా ? మేయర్ హెచ్చరికల్ని ఎవరైనా ఖాతరు చేస్తారా అన్నది అనుమానమే. గతంలో ఆహార కల్తీ తనిఖీలకు సంబంధించి ఏ రోజు ఎన్ని తనిఖీలు జరిపారో, ఏం చర్యలు తీసుకున్నారో ఏ రోజుకారోజు సాయంత్రం తనకు నివేదికలు పంపాలని ఆదేశించారు. అది ఏమాత్రం అమలవుతుందో సంబంధిత విభాగానికి, మేయర్ కార్యాలయానికే తెలియాలి. బయోమెట్రిక్ ఉత్తుత్తిదేనా ? కారి్మకులతోపాటు కమిషనర్ దాకా బయోమెట్రిక్ హాజరు వేయాలని గతంలో చెప్పారు. ఒకరిద్దరు కమిషనర్లు సైతం దాన్ని పాటించారు. కనీసం ఉద్యోగులైనా బయోమెట్రిక్ హాజరును వినియోగిస్తున్నారో, లేదో తెలియని పరిస్థితి మేయర్ తనిఖీతో వెల్లడైంది. నిజంగా వినియోగిస్తే అంత ఆలస్యంగా ఎందుకు వస్తారు? ఒకవేళ ఆలస్యంగా వచ్చినా వారికి పూర్తి జీతాలెందుకు చెల్లిస్తున్నారు? అన్నవాటికి సంబంధిత అధికారులే సమాధానం చెప్పాలి. కొన్ని సీట్లు ఖాళీగా ఉండటం తనిఖీలో గుర్తించిన మేయర్..ఆ సీట్లు ఎవరివి అంటే వారి పేర్లు కూడా సహచరులు చెప్పలేకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. కొన్ని సెక్షన్లలో నాలుగైదు రోజులకోమారు వచ్చి ఒకేసారి అన్ని రోజులకూ సంతకాలు పెట్టుకుంటారనే గుసగుసలు సైతం వినిపిస్తున్నాయి. అలాంటప్పుడు ఇక బయోమెట్రిక్ ఎందుకు..దాని నిర్వహణకు లక్షలాది రూపాయల వ్యయమెందుకు? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. జోన్లు..సర్కిళ్లలో.. ప్రధాన కార్యాలయంలో పరిస్థితి ఇలా ఉంటే జోన్లు, సర్కిళ్లలోనూ ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. అక్కడ ఇంకో సదుపాయం కూడా ఉంది. లేని వారి గురించి సంబంధిత సెక్షన్లలో అడిగితే ప్రధాన కార్యాలయానికి పనిమీద వెళ్లారని టక్కున సమాధానం చెబుతారు. సర్క్యులర్ జారీ మేయర్ ఆదేశాల నేపథ్యంలో చర్యలకు సిద్ధమైన సంబంధిత అడిషనల్ కమిషనర్ (పరిపాలన) నళిని పద్మావతి ఆ మేరకు సర్క్యులర్ జారీ చేశారు. ఉద్యోగులంతా కార్యాలయ వేళల మేరకు ఉదయం 10.30 గంటలకల్లా హాజరు కావాలి. పది నిమిషాల గ్రేస్ సమయం మాత్రం ఉంటుంది. అంటే 10.40 గంటల వరకు మినహాయింపు ఇస్తారు. జిల్లా ఆఫీస్ మాన్యువల్ మేరకు మూడు పర్యాయాలు అంతకంటే ఆలస్యంగా వస్తే ఒక సీఎల్‌గా పరిగణిస్తారు. తరచూ ఆలస్యంగా హాజరయ్యే వారిపై తగిన క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారు. -
దర్శన్‌పై ద్వేషం లేదు.. రేణుకాస్వామి తండ్రి
దొడ్డబళ్లాపురం: నటుడు దర్శన్ తన ఇంటికి వస్తే భోజనం పెడతానని చెప్పి రేణుకాస్వామి తండ్రి పెద్ద మనసు చాటుకున్నారు. రేణుకాస్వామిని హత్య చేశారని హీరో దర్శన్, నటి పవిత్రగౌడ, అనుచరులను పోలీసులు అరెస్టు చేయడం తెలిసిందే. తండ్రి కాశీనాథయ్య మాట్లాడుతూ దర్శన్ విడుదల అయ్యాక తన ఇంటికి వస్తే భోజనం పెడతానని, తాము జంగమ సామాజికవర్గం వారమని, ద్వేషం, అసూయ వంటివి ఉండవన్నారు. చట్ట ప్రకారం తమకు న్యాయం కావాలన్నారు. దర్శన్ భార్య విజయలక్ష్మి డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ను కలిసి ఏం మాట్లాడారు అనే సంగతి తమకు అనవసరమని అన్నారు.కొల్లూరులో దర్శన్ భార్య పూజలుజైలులో ఉన్న దర్శన్ ఆరోగ్యం బాగుండాలని, త్వరగా విడుదల కావాలని కోరుతూ భార్య విజయలక్ష్మి ఇప్పుడు ఆలయాలకు వెళ్తున్నారు. కుందాపుర సమీపంలోని కొల్లూరు మూకాంబిక దేవాలయంలో ఆమె ప్రత్యేక పూజలు చేయించారు. నవ చండికా హోమం జరిపించారు. తండ్రికి వినోద్‌రాజ్ పరామర్శరేణుకాస్వామి కుటుంబానికి వచ్చిన కష్టం చూసి ఎంతో ఆవేదన కలుగుతోందని నటుడు వినోద్‌రాజ్ అన్నారు. రేణుకాస్వామి తండ్రి, ఆయన కుటుంబాన్ని వినోద్‌రాజ్ చిత్రదుర్గకు వెళ్లి కలిశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన ఇంటికి ఆధారంగా ఉన్న వ్యక్తిని కోల్పోతే ఆ కుటుంబం వీధినపడుతుందని, ఆ లోటును భగవంతుడు కూడా తీర్చలేడన్నారు. కుటుంబానికి ఆయన రూ. లక్ష సాయం అందించారు. గత వారం వినోద్‌రాజ్ పరప్పన జైలులో ఉన్న దర్శన్‌ను కలిశారు. -
ప్రైవేటు బస్సు బోల్తా.. ఇద్దరు మృతి
మార్కాపురం: రహదారిపై గేదెలు అడ్డురావడంతో ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తాపడి ఇద్దరు ప్రయాణికులు మృతిచెందారు. మరో ఎనిమిది మంది గాయపడ్డారు. ఈ ప్రమాదం ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం చింతగుంట్ల, తిప్పాయపాలెం గ్రామాల మధ్య అమరావతి–అనంతపురం హైవేపై శనివారం అర్ధరాత్రి రెండు గంటల సమయంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... విజయవాడ నుంచి అనంతపురం వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో 30మంది ప్రయాణికులు ఉన్నారు. బస్సు చింతగుంట్ల–తిప్పాయపాలెం గ్రామాల మధ్యకు రాగానే ఆకస్మికంగా గేదెలు అడ్డువచ్చాయి. వాటిని తప్పించేందుకు డ్రైవర్ ప్రయత్నించే క్రమంలో బస్సు బోల్తా పడింది. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న అనంతపురం జిల్లా ధర్మవరానికి చెందిన గజ్జల శివయ్య(45)కు తీవ్ర గాయాలుకావడంతో ఘటనాస్థలంలోనే మృతిచెందారు. విజయవాడ నుంచి అనంతపురం వెళుతున్న పెద్దారవీడు మండలం కలనూతల గ్రామానికి చెందిన కె.విజయలక్ష్మీబాయి(40)కి తీవ్రగాయాలయ్యాయి. ఆమెకు మార్కాపురం జీజీహెచ్‌లో ప్రథమ చికిత్స అందించిన అనంతరం మెరుగైన వైద్యం కోసం గుంటూరుకు తరలిస్తుండగా, మార్గమధ్యంలో నరసరావుపేట వద్ద మృతిచెందారు. అదేవిధంగా ఈ ప్రమాదంలో హరినాథ్, రాజీబీ, నాగమయ్య నాయక్, ఢమరుకానందరెడ్డి, మునీందర్‌రెడ్డి, అప్సన్, మోహిత్, దస్తగిరి అనే ప్రయాణికులకు గాయాలయ్యాయి. వీరికి మార్కాపురం జీజీహెచ్‌లో చికిత్స అందించారు. గజ్జల శివయ్యకు భార్య సువర్ణ, ఒక కుమారుడు, కుమార్తె, విజయలక్ష్మీబాయికి భర్త కాశీనాయక్, కుమారుడు, కుమార్తె ఉన్నారు. -
ఆమెను నా భర్త పెళ్లి చేసుకోలేదు.. పోలీసులకు హీరో భార్య లేఖ!
రేణుకాస్వామి హత్య కేసులో కన్నడ హీరో దర్శన్‌తో పాటు నటి పవిత్రా గౌడను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వీరిద్దరు పోలీసు కస్టడీలో ఉన్నారు. అయితే ఈ కేసు విచారణలో వీరిద్దరిని దంపతులుగా పేర్కొనడంపై దర్శన్ భార్య విజయలక్ష్మి అభ్యంతరం తెలిపింది. పవిత్రాగౌడ, దర్శన్ భార్య కాదంటూ బెంగళూరు పోలీస్ కమిషనర్‌కు లేఖ రాసింది. ‘ఇటీవల మీరు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పవిత్రను దర్శన్ భార్య అని తప్పడు ప్రకటన చేశారు. ఆ తర్వాత హోంమంత్రి కూడా అలానే పేర్కొన్నారు. ఆమెను నా భర్త పెళ్లి చేసుకోలేదు. దర్శన్‌కు పవిత్ర కేవలం స్నేహితురాలు మాత్రమే. దర్శన్‌కు చట్టపరమైన జీవిత భాగస్వామిని నేనే. మా పెళ్లి 2003లో జరిగింది. దయచేసి పోలీసు రికార్డుల్లో పవిత్రాగౌడను దర్శన్ భార్య అని పేర్కొనకండి. ఇది భవిష్యత్తులో నాకు, నా కుమారుడికి సమస్యలు తెచ్చిపెడుతుంది. పవిత్రకు సంజయ్‌సింగ్ అనే వ్యక్తితో వివాహమైంది. వారికి ఓ కుమార్తె కూడా ఉంది. దయచేసి ఈ వాస్తవాలను రికార్డుల్లో స్పష్టంగా రాయండి’ అని విజయలక్ష్మి విజ్ఞప్తి చేసింది.కాగా, దర్శన్‌కి విజయలక్ష్మితో వివాహమైనప్పటికీ.. కొంతకాలంగా దూరంగా ఉంటున్నాడు. కన్నడ నటి పవిత్రాగౌడతో సహజీవనం చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ విషయం దర్శన్ అభిమాని రేణుకాస్వామికి తెలియడంతో.. విజయలక్ష్మికి అన్యాయం జరుగుతుందని భావించి.. పవిత్రకు అశ్లీల సందేశాలు పంపించి హెచ్చరించాడు. అదే అతని హత్యకు దారి తీసిందని పోలీసుల ప్రాధమిక విచారణలో తేలింది. -
డిప్రెషన్లో దర్శన్ భార్య.. ఎప్పుడూ భర్త కోసమే తపించేది!
అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో అరెస్టయిన కన్నడ హీరో దర్శన్ ప్రస్తుతం పరప్పన అగ్రహార జైల్లో ఉన్నాడు. ప్రియురాలు, నటి పవిత్ర గౌడ కోసం తన గ్యాంగ్‌తో కలిసి రేణుకాస్వామిని చంపేశాడన్న ఆరోపణలతో అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయంలో అందరూ దర్శన్‌ను తప్పుపడుతుండగా ఆయన అభిమానులు మాత్రం హీరోను వెనకేసుకొస్తున్నారు.డిప్రెషన్దర్శన్ చేసిన తప్పు వల్ల ఏ పాపం ఎరుగని అతడి సతీమణి విజయలక్ష్మి ఇబ్బందులు పడుతోందంటోంది సింగర్ షమిత మల్నాడ్. ఆమె మాట్లాడుతూ... జరిగిన సంఘటన వల్ల విజయలక్ష్మి డిప్రెషన్‌కు లోనవుతోంది. బయటకు మాత్రం ధైర్యంగా ఉంటోంది. ఏం మాట్లాడాలో అర్థం కాని అయోమయ స్థితిలో ఉన్న మమ్మల్ని సముదాయిస్తోంది. ఏం జరగదు.. కంగారు పడకూడదని అటు మాకు, ఇటు అభిమానులకు ధైర్యం చెప్తోంది. అయినా తను ఈ ఒత్తిడి నుంచి త్వరగానే బయటపడుతుంది. తను చాలా స్ట్రాంగ్ మహిళ.. ఈ పరిస్థితిలో తన కుమారుడిని ఎలా చూసుకోవాలి? అటు దర్శన్‌కు ఎలా ధైర్యం చెప్పాలో ఆమెకు బాగా తెలుసు. ఆమెలా ధైర్యంగా నిలబడేవాళ్లు చాలా అరుదుగా ఉంటారు. మాది 20 ఏళ్ల స్నేహం. ఇన్నేళ్లలో తను ఎప్పుడూ కుమారుడికి, భర్తకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేది. తన కుటుంబాన్ని ఎన్నటికీ విచ్ఛిన్నం కానివ్వదు అని షమిత చెప్పుకొచ్చింది. View this post on Instagram A post shared by Vijayalakshmi darshan (@viji.darshan)చదవండి: మామూలు ఖైదీగానే దర్శన్ -
రిమాండ్ మహిళా ఖైదీ.. హైడ్రామా!
ఆదిలాబాద్: సుపారి ఇచ్చి ప్రభుత్వ ఉపాధ్యాయుడైన తన భర్త జాదవ్ గజానంద్‌ను భార్యనే హత్య చేయించిన సంఘటన ఇటీవల జిల్లాలో సంచలనం సృష్టించింది. ఈ కేసులో ప్ర ధాన నిందితురాలి గా ఉన్న మృతుని భార్య విజయలక్ష్మిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించిన విష యం తెలిసిందే.ఆది లాబాద్ పట్టణంలోని జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న విజయలక్ష్మి బ్లేడ్ ముక్కలు మింగినట్లుగా జైలు ఽఅధికారులతో ఆదివారం సాయంత్రం తెలిపింది. తీవ్ర కడుపునొప్పితో బాధపడుతున్నట్లుగా పేర్కొనడంతో జైలు అధికారులు రిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు 24గంటల పాటు పర్యవేక్షణలో ఉంచారు.అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించి ఎలాంటి బ్లేడు ముక్కలు లేవని నిర్దారించారు. దీంతో జైలు సిబ్బంది ఆమెను తిరిగి జైలుకు తరలించారు. ఈ విషయమై జిల్లా జైలు సూపరింటెండెంట్ అశోక్‌ను సంప్రదించగా ఆమె పూర్తి ఆరోగ్యంగా ఉండడంతో తిరిగి జిల్లా జైలుకు తరలించినట్లు తెలిపారు. -
ప్రియుడి మోజులో భర్తను చంపించింది
నార్నూర్: ప్రియుడిపై మోజులో ఓ మహిళ భర్తను కిరాతకంగా హత్య చేయించింది. పథకం ప్రకారం ఆమె తన ప్రియుడు, మరో ఇద్దరితో కలిసి భర్తను దారుణంగా కొట్టి చంపించింది. తర్వాత తనకేమీ తెలియనట్టు భర్తను ఎవరో చంపారని నమ్మించే ప్రయత్నం చేసింది. పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి ఆదిలాబాద్ జిల్లా గాదిగూడ మండలం అర్జునికొలాంగూడ గ్రామ శివారులో జరిగిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు గజేందర్ (40) హత్య కేసు మిస్టరీని 24 గంటల్లో ఛేదించారు. మృతుని భార్య విజయలక్ష్మి, ఆమె ప్రియుడు రాథోడ్ మహేశ్, మరో ఇద్దరు నిందితులను పోలీసులు శనివారం రిమాండ్‌కు తరలించారు. ఉట్నూర్ డీఎస్పీ నాగేందర్, నార్నూర్ సీఐ రహీంపాషా శనివారం డీఎస్పీ కార్యాలయంలో నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టి వివరాలు వెల్లడించారు. నార్నూర్ మండలం నాగల్కొండ గ్రామానికి చెందిన గజేందర్ జైనథ్ మండలం మేడిగూడ కే జెడ్పీ ఉన్నత పాఠశాలల్లో తెలుగు పండిత్‌గా పని చేస్తున్నాడు. ఈయనకు గాదిగూడ మండలం ఖాండోరాంపూర్ గ్రామానికి చెందిన విజయలక్ష్మితో 2017లో వివాహమైంది. వీరికి ఓ కుమారుడు (7) ఉన్నాడు.విజయలక్ష్మి నిజామాబాద్‌లో డిగ్రీ చదువుతున్న రోజుల్లో నార్నూర్ మండలం తాడిహత్నూర్ గ్రామానికి చెందిన రాథోడ్ మహేశ్‌తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. గజేందర్ స్వల్పంగా దివ్యాంగుడు కావడంతో ఇష్టపడని ఆమె.. మహేశ్‌తో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ఈ విషయం తెలియడంతో పెద్దల సమక్షంలో పంచాయితీ నిర్వహించి ఆమెకు నచ్చజెప్పారు. క్షమాపణ చెప్పి ఇక నుంచి ప్రియుడికి దూరంగా ఉంటానని నమ్మించింది. కానీ ఆమె మారకుండా ప్రియుడితో వివాహేతర సంబంధం కొనసాగిస్తూ వచ్చింది. ఆదిలాబాద్‌లో ఉంటూ విధులకు వెళుతున్న గజేందర్ సొంత మండలానికి బదిలీ చేయించుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నా డు. వేసవి సెలవులు కావడంతో భార్య, కుమారుడితో స్వగ్రామం నాగల్‌కొండలోనే ఉంటున్నారు. ఈ క్రమంలో ఇక్కడే ఉంటే సంబంధం కొనసాగించడం కష్టమని భావించి మహేశ్‌తో కలిసి గజేందర్‌ను చంపాలని విజయలక్ష్మి పథకం పన్నింది. సుపారీ ఇస్తామని.. బేల గ్రామానికి చెందిన బండే సుశీల్, ఉర్వేత కృష్ణలతో కలిసి చెరో రూ.3 లక్షలు సుపారీ ఇస్తామని గజేందర్ హత్యకు విజయలక్ష్మి, మహేశ్ ఒప్పందం చేసుకున్నారు. ఈ నెల 11న విజయలక్ష్మి మ హేశ్‌కు ఫోన్ చేసి భర్త హత్యకు ప్రణాళిక రచించింది. 12న పాఠశాలలు పునఃప్రారంభం కావడంతో స్వగ్రామం నుంచి గజేందర్ ఉదయం 7.30 గంటలకు స్కూల్‌కు బయల్దేరాడు. ఈ విషయాన్ని విజయలక్ష్మి మహేశ్‌కు ఫోన్ చేసి చెప్పింది. పథకం ప్రకారం అర్జునికొలాంగూడ గ్రామ శివారు వద్ద ముగ్గురూ కాపు కాశారు. గజేందర్‌ను మొదట వె నుక నుంచి బైక్‌తో ఢీకొట్టడంతో అతను కింద పడి పోయాడు. అతడిని కొద్ది దూరం లాక్కెళ్లి బండల తో తల, ఇతర శరీర భాగాలపై కొట్టి హత్య చేశా రు. ఈ విషయం ప్రియుడి ద్వారా తెలుసుకున్న విజయలక్ష్మి ఉదయం గజేందర్ బీపీ మందులు వేసుకోలేదని, ఫోన్ చేస్తే స్విచ్ఛాఫ్ వస్తుందని ఇంట్లో చెప్పి తన బావ కొడుకు అంకిత్‌ను వెంటబెట్టు కుని హుటాహుటిన ద్విచక్ర వాహనంపై హత్య జరిగిన స్థలానికి వెళ్లింది. మహేశ్, మిగతా ఇద్దరు నిందితులు అక్కడే ఉండడం చూసి వెళ్లిపోవాలని సైగ చేయడంతో వారు అక్కడి నుంచి వెళ్లిపోయారు. అనంతరం తన మామకు ఫోన్ చేసి భర్తను ఎవరో చంపేశారని సమాచారం ఇచ్చింది. మృతుడి తండ్రి జాదవ్ భిక్కు ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేసిన పోలీసులు హత్య కేసును 24 గంటల్లో ఛేదించారు. విజయలక్ష్మి, మహేశ్, సుశీల్, కృష్ణలను అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు. -
ప్రధానిపై పాటకు ఆటోగ్రాఫ్..
సాక్షి, హైదరాబాద్: హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ మనవరాలు జశోధర (6) తనపై ప్రత్యేకంగా పాడిన పాటను గుర్తుచేసుకుని ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ నగరంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బండారు దత్తాత్రేయ కుమార్తె విజయలక్ష్మీతో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె తన కూతురు పాడిన పాటను మోదీ రీట్వీట్ చేసిన విషయాన్ని ప్రస్తావించగా..మోదీ స్పందించి త్వరలో జశోధరను కలుస్తానని తెలిపారు. అంతేకాకుండా మోదీ రీట్వీట్ చేసిన స్క్రీన్‌షాట్ ఫొటోగ్రాఫ్ పైన ఆటోగ్రాఫ్ ఇచ్చి ఆమెను అభినందించారు. తన ఇద్దరు కూతుర్లు జశోధర, వేదాన్షీ మోదీ పైన ప్రత్యేకంగా పాటలు పాడారని విజయలక్ష్మి ప్రధానికి తెలిపారు. My grand daughter Jashodhara reciting a poem in praise of Hon'ble Prime Minister Shri @narendramodi ji. pic.twitter.com/PXQL3KiBmE— Bandaru Dattatreya (@Dattatreya) December 9, 2023 -
చేనేతలకు వరం జగనన్న: జింకా విజయలక్ష్మి
-
ప్రేమతోనే కాంగ్రెస్‌లో చేరుతున్నా..
బంజారాహిల్స్ (హైదరాబాద్): అవకాశవాద రాజకీయాల కోసం తాను బీఆర్ ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరుతున్నట్టు వస్తున్న విమర్శలు సరికావని ఎంపీ కె.కేశవరావు పేర్కొన్నారు. తన వయసు 85 ఏళ్లు అని.. 55 ఏళ్లు కాంగ్రెస్‌లో కొన సాగానని, 13 ఏళ్లు బీఆర్ఎస్లో ఉన్నానని చెప్పారు. తనకు రాజకీయ జీవితం ఇచ్చిన కాంగ్రెస్‌పై ప్రేమతోనే మళ్లీ చేరుతున్నానన్నారు. ఇది తనకు తీర్థయాత్ర తర్వాత సొంతింటికి వస్తున్నట్టుగా ఉందన్నారు. శుక్రవారం ఆయన హైదరాబాద్‌లోని తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్లో మొదటిసారి రాజ్యసభ సభ్యుడిగా కాంగ్రెస్ ఓటు వేయడం వల్లే గెలిచానని, తర్వాత కేసీఆర్ తనకు మరో చాన్స్ ఇచ్చారని కేకే చెప్పారు. తన మాటకు చాలా విలువ ఇచ్చారని పేర్కొన్నారు. కేసీఆర్ తెలంగాణను దేశంలో నంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దారని.. రాష్ట్ర సాధనలో, పునర్నిర్మాణంలో ఆయన పాత్ర ఎంతో ఉందని వ్యాఖ్యానించారు. అయితే బీఆర్ఎస్ను కుటుంబ పాలన నడిపిస్తోందని ప్రజలు అనుకుంటూ ఉండేవారని.. ఆ సమయంలో బాల్క సుమన్, తలసాని శ్రీనివాస్ యాదవ్ వంటి నేతలు పార్టీని నడిపిస్తే బాగుండేదని తాను అనుకున్నానని చెప్పారు. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీయేనని, కాంగ్రెస్‌లో టీఆర్ఎస్ (బీఆర్ఎస్)ను విలీనం చేస్తానని సోనియాగాంధీకి కేసీఆర్ హామీ ఇచ్చి మాట తప్పారని పేర్కొ న్నారు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ కష్టకాలంలో ఉందని, అందుకే తాను ఆ పార్టీలో చేరుతున్నానని చెప్పారు. బీజేపీని ఎదుర్కోవాలంటే ఇలాంటి నిర్ణయం తప్పదన్నారు. తాను గురువారం కేసీఆర్‌ను కలిశాననని, తాను పార్టీని వీడుతుండటం పట్ల ఆయన బాధపడ్డారని కేకే చెప్పారు. బీజేపీ ఎంపీ బండి సంజయ్ తనను తిట్టారని కొందరు తన దృష్టికి తీసుకువచ్చా రని.. దీనిని ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానని వ్యాఖ్యానించారు. అభివృద్ధి కొనసాగించడానికే అధికార పార్టీలోకి..: విజయలక్ష్మి గ్రేటర్ హైదరాబాద్‌లో జరుగుతున్న అభివృద్ధిని ఇలాగే కొనసాగించడా నికి తాను అధికార కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నా నని హైదరాబాద్ మేయ ర్ గద్వాల విజయలక్ష్మి పేర్కొన్నారు. గ్రేటర్ హైదరాబాద్‌లో ఏమేం అభివృద్ధి పనులు కావా లో త్వరలోనే సీఎంతో మాట్లాడి చెబుతాన న్నారు. తనతో పాటు 150 మంది కార్పొరేటర్ల సమన్వయంతో అభివృద్ధి చేయాలన్నదే లక్ష్య మని చెప్పారు. కొందరు బీఆర్ఎస్ నేతలు తన సోదరుడు, బీఆర్ఎస్ నేత విప్లవ్కుమార్ను తెరపైకి తీసుకొచ్చి తమ కుటుంబంలో కలహా లు రేపుతున్నారని ఆరోపించారు. కాగా.. సీఎం రేవంత్‌రెడ్డి శనివారం విజయలక్ష్మి నివాసానికి రానున్నట్టు తెలిసింది. సీఎం ఆమెకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించనున్నట్టు సమాచారం. -
జీహెచ్ఎంసీ మేయర్‌కు కాంగ్రెస్ ఆహ్వానం
బంజారాహిల్స్ (హైదరాబాద్): ‘రెండుసార్లు కార్పొరేటర్‌గా బంజారాహిల్స్ డివిజన్ ప్రజలు గెలిపించారు. దీపాదాస్ మున్షీ మా ఇంటికి వచ్చి కాంగ్రెస్ పార్టీలోకి రావాల్సిందిగా ఆహ్వానించారు. మా డివిజన్ ప్రజలు, కార్యకర్తలు, కార్పొరేటర్లతో చర్చించిన తర్వాతనే నా నిర్ణయం ప్రకటిస్తాను’ అని జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి అన్నారు. శుక్రవారం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహా రాల ఇన్చార్జ్ దీపాదాస్ మున్షీ, డీసీసీ అధ్యక్షుడు రోహిణ్రెడ్డిలు బంజారాహిల్స్‌లోని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర సెక్రటరీ జనరల్ కేశవరావు ఇంటికి వెళ్లారు. అక్కడే జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, కేశవరావులతో గంటపాటు చర్చించారు. కాంగ్రెస్‌లోకి రావాల్సిందిగా, పార్టీని బలోపేతం చేయా ల్సిందిగా దీపాదాస్ వారిని ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీలో విజయలక్ష్మి రాజకీయ భవిష్యత్‌పై భరోసా ఇచ్చినట్టు సమాచారం. -
కాంగ్రెస్ లో చేరనున్న మేయర్ విజయలక్ష్మి
-
చేనేతలకు గుర్తింపు జగనన్న చలవే
పద్మశాలీయులకు జగనన్న ప్రభుత్వంలోనే ప్రత్యేక గుర్తింపు వచ్చిందని ఆంధ్రప్రదేశ్ పద్మశాలి వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్పర్సన్ జింకా విజయలక్ష్మి అభిప్రాయపడ్డారు. గతంలో శాలీలుగా పిలిపించుకున్న తాము కార్పొరేషన్ ఏర్పాటుతో ఆ పిలుపునుంచి ఉపశమనం లభించిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 30 నుంచి 40 లక్షల వరకు ఉన్న తమ సామాజిక వర్గాలకు వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో జరిగిన మేలు, అందిస్తున్న ప్రోత్సాహంపై ఆమె సాక్షితో మాట్లాడారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే... కార్పొరేషన్‌తో అభివృద్ధికి అవకాశం చేనేత వృత్తిలో ఉన్న పద్మశాలీయుల అభివృద్ధికి గత ప్రభుత్వం ప్రత్యేకంగా చేసిందేమి లేదు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక 2020 అక్టోబర్ 18న కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. తనతోపాటు రాష్ట్రంలోని 12 జిల్లాలకు చెందిన 12 మందిని డైరెక్టర్లుగా నియమించారు. రాష్ట్రంలోని ప్రొద్దుటూరు, మంగళగిరి, విశాఖపట్నం, చీరాల, వెంకటగిరి, ధర్మవరం, తణుకు, రాజమండ్రి, పెడన, ఉప్పాడ, పొందూరు, అరకు, పాడేరు, లంబసింగి, ఎమ్మిగనూరు, ఆదోని, పత్తికొండ, నగరి, పుత్తూరు, మదనపల్లి, శ్రీకాళహస్తి ప్రాంతాల్లో ఎక్కువగా మా సామాజికవర్గానికి చెందినవారున్నారు. పద్మశాలీయుల్లో సేనాపతులు, కైకాల, కర్ణభక్తులు, స్వకులశాలి, పట్టుశాలి వంటి ఉప కులాలున్నాయి. కార్పొరేషన్ ఏర్పాటు ద్వారానే గుర్తింపు వచ్చింది. చట్టసభల్లోనూ అవకాశం 2014 టీడీపీ ప్రభుత్వంలో పద్మశాలీయులు చట్టసభలో లేరు. 2019 వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో కర్నూలు ఎంపీగా డాక్టర్ సంజీవకుమార్, ఎమ్మెల్సీగా మురుగుడ హనుమంతరావు ఉన్నారు. ఆప్కో చైర్మన్లుగా చల్లపల్లి మోహన్‌రావు, ప్రస్తుతం గంజి చిరంజీవి ఉన్నారు. రాష్ట్రంలోని ప్రొద్దుటూరు, రాయదుర్గం, వెంకటగిరి, చీరాల మున్సిపల్ చైర్పర్సన్లుగా పద్మశాలీయులే ఉన్నారు. 2024 ఎన్నికలకు సంబంధించి ఎమ్మిగనూరు నియోజకవర్గానికి బుట్టా రేణుక, మంగళగిరికి మురుగుడు లావణ్యను ఎంపిక చేశారు. విదేశీ విద్యకు ప్రోత్సాహం నేను చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యాక అనేక మందిని విదేశీ విద్య పథకంపై అవగాహన కల్పించి పంపించా. హ్యాండ్లూం టె క్స్‌టైల్స్ కార్పొరేషన్ ద్వారా జాకార్డ్, లిఫ్టింగ్ మెషీన్‌తోపాటు మగ్గం పరికరాలను సబ్సిడీపై చా లా మందికి అందించా. – ప్రొద్దుటూరు సైకత మగువ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం తీరప్రాంతంలో సైకత శిల్పి మంచాల సనత్‌కుమార్ సిలికా దిబ్బలవద్ద సైకత శిల్పాన్ని రూపొందించారు. గ్రామానికి చెందిన యువతులతో కలిపి ఈ శిల్పాన్ని ప్రదర్శించారు. – చిల్లకూరు తిరుచానూరు అమ్మవారికి మా ఇంటి చీర సారె.. ఏటా తిరుచానూరులో జరిగే కార్తీక బ్రహ్మోత్సవాల్లో సింహవాహన సేవ రోజున పద్మశాలీయుల ఇంటి నుంచి చీర, సారె సమర్పించేలా ప్రభుత్వం జీఓ జారీ చేసింది. అమ్మవారికి కుట్టు బార్డర్‌తో కలిగిన 9 ఇంచుల కంచిపట్టు చీరను సమర్పిస్తున్నాం. రాష్ట్రంలోని తమ సామాజికవర్గంవారందరికీ తిరుచానూరు నుంచి ఈ కార్యక్రమానికి ఆహ్వానం అందుతోంది. ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాల్లో గరుడ సేవ రోజున స్వామివారికి చీర, సారె ఇస్తున్నాం. చేనేతల కష్టాలను గుర్తించిన ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి వైఎస్సార్ నేతన్న నేస్తం పథకాన్ని అమలు చేశారు. ఈ పథకం ద్వారా మగ్గం నేసే ప్రతి కార్మికుడి కుటుంబానికి ఏటా రూ.24వేలు చెల్లిస్తున్నారు. ఈ పథకం వచ్చాక చాలా మంది తిరిగి వృత్తిలోకి వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నారు. పల్లెలుప్రగతిపట్టాలెక్కిపరుగులు పెడుతున్నాయి. గ్రామ సీమల స్వరూపం మారుతోంది. బాపూజీ కన్న గ్రామ స్వరాజ్యం సీఎం జగన్మోహన్రెడ్డి ఐదేళ్ల పాలనలో సుసాధ్యమైంది. పాలకొల్లు మండలంలోని వెలివెల గ్రామంలో రూ.8.60 కోట్లతో పలు అభివృద్ధి పనులు ప్రత్యక్ష సాక్ష్యాలుగా నిలిచాయి. ఈ గ్రామంలో 817 కుటుంబాల దరికి సంక్షేమ పథకాలు చేరాయి. వివిధ ప్రభుత్వ కార్యాలయాలన్నీ మీ పల్లెకు తీసుకురావడం సీఎం జగన్ సర్కారుకే చెల్లిందని గ్రామస్తులు చెబుతున్నారు. గతంలో చిన్నచిన్న పనులకు కూడా కిలోమీటర్ల దూరం వెళ్లాల్సివచ్చిందని, ఇప్పుడు పదడుగులు దూరంలోనే సమకూర్చడంతో సమయం కలిసివస్తోందని ఆ గ్రామ పెద్దలు అంటున్నారు. – పాలకొల్లు -
ఆత్మహత్య చేసుకోబోతున్నా.. నా చావుకు కారణం అతనే, నటి వీడియో వైరల్
ఆత్మహత్య చేసుకోబోతున్నానంటూ ఓ నటి విడుదల చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తనకు జరిగిన అన్యాయంపై ఎవరూ స్పందించడం లేదని.. అందుకే చనిపోవాలని డిసైడ్ అయ్యానంటూ సదరు నటి ఆ వీడియోలో పేర్కొంది. ఆ నటి ఎవరు? ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలనుకుంటుంది? సౌత్ ఇండస్ట్రీలో నటిగా మంచి గుర్తింపు తమిళ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు నటి విజయలక్ష్మీ. 1997లో 'నాగమండలం' చిత్రంతో సినీ కెరీర్ ప్రారంభించి.. జోడిహక్కి, భూమితై చొచ్చల మగా, అరుణోదయ, స్వస్తిక్, హబ్బా, సూర్యవంశం లాంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తమిళ్లో వరుసగా సినిమాలు చేస్తూ.. అప్పట్లో బిజియెస్ట్గా నటిగా మారింది. తెలుగులో హనుమాన్ జంక్షన్ సినిమాలో జగపతిబాబు, అర్జున్ చెల్లెలిగా నటించి ఆకట్టుకుంది. మోహన్‌లాల్‌తో కలిసి మలయాళ చిత్రం దేవదూతన్‌లో కూడా నటించింది. ఇలా తెలుగు, తమిళ, మలయాళంలో మొత్తం 40 సినిమాలకు పైగా నటించి ఆకట్టుకుంది. సీమాన్‌పై తీవ్ర ఆరోపణలు ఆ మధ్య తమిళనాడుకు చెందిన నామ్ తమిళర్ కట్చి పార్టీ అధినేత నటుడు, దర్శకుడు సీమాన్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు విజయ లక్ష్మీ. సీమాన్ తనను పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని... ప్రేమిస్తున్నట్లు నటించి 7 సార్లు బలవంతంగా అబార్షన్ చేయించాడంటూ సంచనల వ్యాఖ్యలు చేసింది. ఆ తర్వాత ఫిబ్రవరి 29న ఓ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ సీమాన్ తనతో మాట్లాడాలని కోరింది. అయితే ఆ వీడియో పట్ల సీమాన్ స్పందించలేదు. దీంతో తాజాగా మరో వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేశారు విజయలక్ష్మీ. ఇదే నా చివరి వీడియో ఆ వీడియోలో విజయలక్ష్మీ మాట్లాడుతూ.. ‘మీడియా మిత్రులకు నమస్కారం. ఫిబ్రవరి 29న నేను ఒక వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేశాను. ఆ వీడియోలో నామ్ తమిళర్ కట్చి పార్టీ అధినేత నటుడు సీమాన్ నాతో మాట్లాడాలని, ఆయనతో కలిసి జీవించాలని కోరారు. కానీ ఎలాంటి స్పందన రాలేదు. చాలా బాధపడ్డాను. ఏడుస్తూ ఓ వీడియోని అతనికి పంపాను. ‘నువ్వు కావాలి..నువ్వు లేకుంటే చనిపోతాను’అని చెప్పినా పట్టించుకోలేదు. నన్ను సీక్రెట్‌గా పెళ్లి చేసుకొని.. జీవితాన్ని నాశనం చేశాడు. ఇప్పుడు అక్కర్లేదంటూ రోడ్డున పడేశాడు. ఇప్పుడు నాకు ఎవరూ సాయం చేయడం లేదు. నన్ను పట్టించుకోవడం లేదు. కర్ణాటకలో బ్రతుకలేకపోతున్నాను. ఆత్మహత్య చేసుకోవాలని డిసైడ్ అయ్యాను. ఇదే నా చివరి వీడియో.. నా చావుపై సీమాన్ వివరణ ఇవ్వాలి’అని ఆమె డిమాండ్ చేసింది. మంగళవారం పోస్ట్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. View this post on Instagram A post shared by The Whistle (@thewhistletv) -
పట్టణ మహిళలకు సుస్థిర జీవనోపాధి
సాక్షి, అమరావతి: పట్టణాల్లోని స్వయం సహాయక సంఘాల(ఎస్‌హెచ్‌జీ) సభ్యులు అందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చూడడంతోపాటు సుస్థిర జీవనోపాధిపై ఉన్నతాధికారులు దృష్టి సారించారు. ఈ మేరకు పట్టణ పేదరిక నిర్మూనా సంస్థ (మెప్మా) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వివిధ శిక్షణలు ఇచ్చేందుకు కసరత్తు చేస్తున్నారు. ఎస్‌హెచ్‌జీ సభ్యులందరికీ సుస్థిర జీవనోపాధి కల్పించాలనే లక్ష్యంతో ఇప్పటికే 11 మునిసిపాలిటీల్లో జగనన్న మహిళా మార్టులు, జగనన్న ఈ–మార్ట్, ఆహా క్యాంటీన్లు, అర్బన్ మార్కెట్లు, చేయూత జీవనోపాధి యూనిట్లు వంటివి ఏర్పాటు చేశారు. వీటికి అదనంగా పట్టణ ప్రగతి యూనిట్లను కూడా ఈ నెలలోనే ఏర్పాటు చేయనున్నారు. మెప్మా పరిధిలో 123 పట్టణ స్థానిక సంస్థల(యూఎల్బీ)లో 25 లక్షల మంది ఎస్‌హెచ్‌జీ సభ్యులు ఉండగా, ఇప్పటిదాకా 13.50 లక్షల మంది ప్రత్యక్షంగా స్వయం ఉపాధి పొందుతున్నారు. మిగిలిన వారిలో అత్యధిక మందితో పట్టణ ప్రగతి యూనిట్లు, ఆహా క్యాంటీన్లు, మెప్మా అర్బన్ మార్కెట్లు, చేయూత, జీవనోపాధి యూనిట్లు ఏర్పాటుచేసి స్వయం ఉపాధి వైపు ప్రోత్సహించేందుకు సభ్యుల అభిప్రాయాలు తెలుసుకోవాలని మెప్మా మిషన్ డైరెక్టర్ విజయలక్ష్మి ఇటీవల జిల్లాల మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్లు, సిబ్బందిని ఆదేశించారు. ఇందుకోసం ప్రాంతాల వారీగా సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే విశాఖపట్నం, గుంటూరు జిల్లాల పరిధిలో సమావేశాలు ముగిశాయి. రాయలసీమ జిల్లాల పథక సంచాలకులు, సిబ్బందికి నెల్లూరులో బుధవారం సమావేశం నిర్వహించనున్నారు. ఎస్‌హెచ్‌జీలు బలోపేతం: మెప్మా ఎండీ రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకు లింకేజీ ద్వారా వివిధ సంక్షేమ పథకాలు ఎంత మందికి అందాయి.. ఇంకా పొందాల్సిన వారు ఎవరైనా ఉన్నారా.. అనేదానిపై సమగ్రంగా పరిశీలిస్తున్నట్లు మెప్మా మిషన్ డైరెక్టర్ వి.విజయలక్ష్మి ‘సాక్షి’కి తెలిపారు. అర్బన్ స్వయం సహాయక సంఘాలు బలోపేతం కావాలని, ప్రతి సభ్యురాలిని స్వయం ఉపాధి వైపు మెప్మా ప్రోత్సహిస్తుందని చెప్పారు. వారికి అందుతున్న చేయూత, ఆసరా, సున్నా వడ్డీ, జగనన్న తోడు... వంటి పథకాలతో ప్రభుత్వం సహకారం అందిస్తోందన్నారు. ఆ నగదుతో వారికి ఆసక్తి ఉన్న రంగాల్లో శిక్షణ ఇచ్చి నైపుణ్యాలను మెరుగుపరుస్తున్నట్లు వివరించారు. ఇప్పటికే పలు దఫాలుగా మహిళలకు శిక్షణనిచ్చి, వారితో పలు వ్యాపార సంస్థలను ఏర్పాటుచేసి విజయవంతంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. మిగిలిన సభ్యులకు అవసరమైన సహకారం అందించేందుకు స్వయంగా సభ్యులతో మాట్లాడాలని తమ సిబ్బందిని ఆదేశించినట్లు చెప్పారు. ఇంటిని చక్కదిద్దుకునే మహిళలు వ్యాపారాన్ని విజయవంతంగా చేయగలరని తమ జగనన్న మహిళా మార్టులు, అర్బన్ మార్టులు, ఆహా క్యాంటీన్లు నిరూపించాయన్నారు. ఆయా యూనిట్ల బలోపేతం కోసం నిరంతరం శిక్షణ, పర్యవేక్షణ అందించాలని సిబ్బందిని ఆదేశించినట్లు తెలిపారు. ఏపీ టిడ్కో గృహాల లబ్ధిదారులకు యూఎల్బీల పరిధిలో 100శాతం బ్యాంకు రుణాలు అందించే ఏర్పాట్లు చేశామని ఆమె వివరించారు. -
అక్కా..మీ ఓటు మాకే
ముషీరాబాద్: హర్యానా రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ కుమార్తె, ముషీరాబాద్ నియోజకవర్గం నుంచి బీజేపీ టికెట్ ఆశించిన బండారు విజయలక్ష్మికి బీఆర్ఎస్ నాయకులు తమ పార్టీ కరపత్రాన్ని అందించి మద్దతు ఇవ్వాలని కోరారు. సోమవారం అడిక్‌మెట్ డివిజన్లో ప్రచార కార్యక్రమంలో భాగంగా దత్తాత్రేయ నివాసం ఉండే గల్లీలో బీఆర్ఎస్ మాజీ కార్పొరేటర్ వి.శ్రీనివాస్‌రెడ్డి, డివిజన్ అధ్యక్షులు బల్లా శ్రీనివాస్‌రెడ్డి, శ్యామ్‌సుందర్, సయ్యద్ అస్లాం ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. అదే వరుసలో ఉన్న దత్తాత్రేయ నివాసానికి వెళ్లగా విజయలక్ష్మికి కరపత్రాన్ని అందించి ముఠా గోపాల్‌కు మద్దతు ఇవ్వాలని కోరారు. ఆమె చిరునవ్వుతో కరపత్రాన్ని స్వీకరించి వారితో ఫొటో దిగారు. కార్యక్రమంలో నాయకులు కొండపల్లి సాయిప్రసన్న, ఇంద్రసేనారెడ్డి, మహ్మద్ ఖదీర్, నేత శ్రీనివాస్, చంద్రశేఖర్, మహ్మద్ జహంగీర్, రోషం బాలు తదితరులున్నారు. దత్తన్న కుమార్తె విజయలక్ష్మికి బీఆర్ఎస్ కరపత్రం -
మహిళా మార్ట్.. లాభాల్లో బెస్ట్
సాక్షి, అమరావతి : పట్టణాల్లోని పేద, మధ్య తరగతి మహిళలు సంఘటితమై విజయం సాధించారు. పట్టణ ప్రాంత పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) అందించిన సాయంతో జగనన్న మహిళా మార్ట్లను నెలకొల్పి లాభాల బాటలో నడిపిస్తున్నారు. రాష్ట్రంలో 10 పట్టణాల్లో ఏర్పాటు చేసిన మార్ట్లు నెలకు సగటున రూ.79.40 లక్షల వ్యాపారం చేస్తూ ముందుకు సాగుతున్నాయి. పొదుపు సంఘాల్లోని మహిళలు కేవలం రూ.150 చొప్పున పెట్టుబడి పెట్టి.. తమ ఇంటికి అవసరమైన సరుకులను డిస్కౌంట్ ధరకు పొందుతూనే రోజువారీ అమ్మకాల ద్వారా ఏడాదికి రూ.19 లక్షల నికర లాభాలను ఆర్జిస్తున్నారు. తిరుపతి పట్టణానికి చెందిన స్వయం సహాయక సంఘాల్లోని 37,308 మంది మహిళలు మెప్మా ఎండీ విజయలక్ష్మి ప్రోత్సాహంతో మార్ట్ ఏర్పాటుకు ముందుకు వచ్చారు. ఒక్కో సభ్యురాలు కేవలం రూ.150 చొప్పున రూ.55,96,200 పెట్టుబడిగా పెట్టి గత ఏడాది మే నెలలో జగనన్న మహిళా మార్ట్‌ను ఏర్పాటు చేశారు. ఈ మార్ట్ ఏడాదిన్నరలో రూ.4.89 కోట్ల అమ్మకాలు చేసి, రూ.30 లక్షల లాభాన్ని ఆర్జించింది. ఈ సందర్భంగా శుక్రవారం ప్రత్యేక వేడుకలు నిర్వహిస్తున్నారు. వాటాదారులకు రూ.20 లక్షల మొత్తాన్ని డివిడెంట్‌గా పంచి.. మిగిలిన రూ.10 లక్షలను సభ్యుల అంగీకారంతో మరో వ్యాపారంలో పెట్టుబడి పెట్టేందుకు నిర్ణయించారు. ఆర్థిక స్వావలంబన దిశగా.. రాష్ట్రంలో ఎన్నో ఏళ్లుగా మహిళా సమాఖ్యలు ఉన్నా వీరు ప్రభుత్వం ఇచ్చే సాయాన్ని ఇన్నేళ్లు ఇంటి అవసరాలకే వినియోగించుకునేవారు. వారికి మెరుగైన ఆర్థిక స్వావలంబన ఉండాలని, సుస్థిర జీవనోపాధికి మార్గం చూపాలన్న లక్ష్యంతో ‘మెప్మా’ ఎండీ విజయలక్ష్మి సమాఖ్య సభ్యులను సూపర్ మార్కెట్ల ఏర్పాటు దిశగా ప్రోత్సహించారు. ఆసక్తి గల సభ్యులతో రూ.150 చొప్పున పెట్టుబడి పెట్టించి ‘జగనన్న మహిళా మార్ట్’లను ఏర్పాటు చేశారు. 2021 జనవరిలో పులివెందులలో తొలి మార్ట్‌ను ఏర్పాటు చేశారు. గత ఏడాది ఈ స్టోర్ రూ.2.50 కోట్ల వ్యాపారం చేయడంతో పాటు సుమారు రూ.18 లక్షల లాభాన్ని ఆర్జించింది. దాంతో వాటాదారులకు డివిడెండ్ చెల్లించారు. ఇప్పుడు తిరుపతి పట్టణంలోని మహిళా మార్ట్ వాటాదారులు డివిడెంట్ అందుకోనున్నారు. కాగా.. ఈ రెండేళ్ల కాలంలో పులివెందుల, రాయచోటి, అద్దంకి, పుంగనూరు, తిరుపతి, చిత్తూరు, శ్రీకాకుళం, కర్నూలు, మారా>్కపురం, ఒంగోలు పట్టణాల్లో 10 జగనన్న మహిళా మార్ట్లను అందుబాటులోకి తెచ్చారు. ఇది సమైక్య విజయం పెట్టుబడిదారులు, అమ్మకందారులు, కొనుగోలుదారులు మహిళలే. మార్ట్ల నిర్వహణ కోసం మెప్మా ఆధ్వర్యంలోశిక్షణ ఇచ్చాం. మార్ట్ ఏర్పాటు, నిర్వహణ ప్రతి దశను ఎస్‌హెచ్‌జీ సభ్యులే స్వయంగా చూసుకుంటున్నారు. తిరుపతిలో జగనన్న మహిళా మార్ట్ ఏడాదిన్నలో రూ.30 లక్షల లాభాన్ని ఆర్జించింది. ఇందులోని సభ్యులకు రూ.20 లక్షల డివిడెండ్ చెల్లించి.. మిగతా మొత్తంతో సభ్యుల అంగీకారంతో కొత్త వ్యాపారంలో ప్రారంభిస్తాం. ఇందులోనూ మహిళలే సభ్యులుగా ఉండి వచ్చిన లాభాలను పంచుకుంటారు. మహిళా స్వయం సహాయక సంఘాల్లోని ప్రతి మహిళ ఆర్థికంగా ఎదిగేలా చేయడమే మెప్మా లక్ష్యం. – వి.విజయలక్ష్మి, మెప్మా మిషన్ డైరెక్టర్ -
29న నటి విజయలక్ష్మి కోర్టులో హాజరుకావాల్సిందే
ఇటీవల శాండల్‌వుడ్ విజయలక్ష్మి నామ్ తమిళర్ కట్చి నేత సీమాన్‌పై లైంగిక వేధింపుల కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. అతని వల్ల ఏడుసార్లు అబార్షన్ అయిందంటూ ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు సైతం దర్యాప్తు వేగవంతం చేశారు. అయితే ఈ కేసు ఊహించని విధంగా మలుపులు తిరిగింది. సీమాన్‌పై తాను పెట్టిన కేసును ఉపసంహరించుకున్నట్లు వెల్లడించింది. దీంతో మద్రాస్ హైకోర్టు నటి విజయలక్ష్మిని ఈ నెల 29న హాజరుకావాలని ఆదేశించింది. తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని నటి విజయలక్ష్మి 2011లో నామ్ తమిళర్ పార్టీ కోఆర్డినేటర్ సీమాన్న్పై వలసరవాక్కం పోలీసులకు ఫిర్యాదు చేసింది. (ఇదీ చదవండి: వరస మార్చిన రైతుబిడ్డ.. రతికని అక్క అనేశాడు!) సీమాన్, తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 2011లో దాఖలు చేసిన ఫిర్యాదును 2012లో ఉపసంహరించుకోవాలని నటి విజయలక్ష్మి ఇచ్చిన లేఖ ఆధారంగా పోలీసులు కేసును క్లోజ్ చేశారు. అయితే ఇప్పుడు మళ్లీ కేసు విచారణ చేపట్టి సమన్లు జారీ చేశారు. 12 ఏళ్ల నాటి కేసులో ఫిర్యాదుదారుల తర్వాత రాజకీయ ఉద్దేశంతో కేసును మళ్లీ తెరుస్తున్నందున కేసు దర్యాప్తుపై నిషేధం విధించాలని కోరారు. ఈ కేసు చివరిసారి విచారణకు వచ్చినప్పుడు 2011లో నటి ఇచ్చిన ఫిర్యాదును ఉపసంహరించుకున్నప్పుడు కేసు ఎందుకు పెండింగ్‌లో ఉంచారో కూడా సమాధానం చెప్పాలని పోలీసులు ఆదేశించారు. ఈ వ్యాజ్యం మంగళవారం జస్టిస్ ఆనంద్ వెంకటేష్ ఎదుట మరోసారి విచారణకు వచ్చింది. పోలీసు రిపోర్టు దాఖలైంది. అనంతరం సీమాన్ కేసు రద్దుకు సంబంధించి వివరణ ఇచ్చేందుకు నటి విజయలక్ష్మిని 29న కోర్టుకు హాజరుకావాలని న్యాయమూర్తి ఆదేశించారు. కేసు విచారణను వాయిదా వేశారు. సీమాన్ సూపర్.. ఆయన్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు ఓ సంస్థకు చెందిన వీరలక్ష్మి పర్యవేక్షణలో తాను గృహ నిర్భంధంలో ఉన్నట్టుగా గత కొద్ది రోజులుగా పరిణామాలు చోటు చేసుకున్నాయని విజయలక్ష్మి అన్నారు. ఇవి తనను ఎంతగానో బాధించాయని పేర్కొన్నారు. సీమాన్ సూపర్ అని.. ఆయన పవర్ ఫుల్ అని కామెంట్స్ చేశారు. ఆయన్ని ఇక్కడ ఎవ్వరూ ఏమీ చేయలేరని.. తాను మళ్లీ ఇక్కడికి రాబోనని, బెంగళూరు వెళ్లి పోతున్నట్లు విజయలక్ష్మి పేర్కొన్నారు. సీమాన్ పవర్ ముందు తాను ఓటమిని అంగీకరించి వెళ్తున్నానని అన్నారు. అతను బాగుండాలని.. రాజకీయంగా మరిన్నీ విజయాలు సాధించాలని కోరుకున్నారు. తాను సీమాన్ వద్ద ఎలాంటి నగదు, మరే ఇతర తాయిలాలు తీసుకోలేదని మరోసారి ఆమె స్పష్టం చేశారు. -
విశ్వనగరమే ధ్యేయంగా ముందుకు..
మాదాపూర్: కొండాపూర్ డివిజన్ పరిధిలోని దుర్గం చెరువు వద్ద 7.0 ఎంఎల్డీ సామర్థ్యంతో రూ.15 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన మురుగునీటి శుద్దికేంద్రం(ఎస్టీపీ)ను సోమవారం మేయర్ విజయలక్ష్మి, ఎమ్మెల్సీ సురభి వాణీదేవిలు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్టీపీతో దుర్గంచెరువు ప్రాంత ప్రజలకు ఎంతో ఊరట లభిస్తుందన్నారు. అలాగే మురుగు నీటి నుంచి చెరువులకు విముక్తి లభిస్తుందన్నారు. హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని చెప్పారు. మురుగునీటి శుద్ధిలో హైదరాబాద్ నగరం దేశంలోనే ప్రత్యేకంగా నిలుస్తుందన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న 772 ఎల్ఎండీ సీవరేజ్ ప్లాంట్ల ఏర్పాటుకు కేబినెట్ అనుమతి ఇచ్చిందన్నారు. దీనికోసం రూ. 3866.21 కోట్లు ప్రభుత్వం కేటాయించిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్, హెచ్ఎండీఏ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అర్వింద్ కుమార్, జలమండలి ఎండీ దానకిషోర్, జోనల్ కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ, కార్పొరేటర్లు హమీద్ పటేల్, నార్నే శ్రీనివాసరావు, ఉప్పలపాటి శ్రీకాంత్, సింధు ఆదర్శ్‌రెడ్డి, మంజుల రఘునాథ్‌రెడ్డి, మాజీ కార్పొరేటర్లు సాయిబాబా, మాధవరం రంగారావు పాల్గొన్నారు. దుర్గం చెరువులో వాటర్ ఫౌంటెన్లు ప్రారంభం సందర్శకులను ఆకట్టుకునేందుకు దుర్గం చెరువులో ఏర్పాటు చేసిన మ్యూజికల్ వాటర్ ఫౌంటెన్లను స్థానిక ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ ప్రారంభించారు. దాదాపు 60 మీటర్లు పొడవులో..మ్యూజిక్‌కి అనుగుణంగా రంగులు వెదజల్లుతున్న ఫౌంటెన్లు సందర్శకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ప్రతి రోజు సాయంత్రం 7 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఈ మ్యూజికల్ వాటర్ ఫౌంటెన్ పనిచేస్తుందని అధికారులు తెలిపారు. -
ఏడుసార్లు అబార్షన్ అంటూ నటి ఫిర్యాదు.. అంతలోనే బిగ్ ట్విస్ట్!
ఇటీవల శాండల్‌వుడ్ విజయలక్ష్మి నామ్ తమిళర్ కట్చి నేత సీమాన్‌పై లైంగిక వేధింపుల కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. అతని వల్ల ఏడుసార్లు అబార్షన్ అయిందంటూ ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు సైతం దర్యాప్తు వేగవంతం చేశారు. అయితే ఈ కేసు ఊహించని విధంగా మలుపులు తిరిగింది. సీమాన్‌పై తాను పెట్టిన కేసును ఉపసంహరించుకున్నట్లు వెల్లడించింది. (ఇది చదవండి: మహేశ్ బాబు నుంచి మరో మల్టీఫ్లెక్స్ థియేటర్ రెడీ.. ఎక్కడో తెలుసా?) అయితే ఈ కేసులో ఇప్పటికే ఆమెకు వైద్య పరీక్షలు కూడా నిర్వహించారు. సీమాన్ పలుమార్లు అబార్షన్లు చేయించారని ఆరోపిస్తూ ఆమె ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు దర్యాప్తు నిర్వహించారు. సీమాన్ తనను వాడుకుని మోసం చేసినట్టుగా దశాబ్దం కాలంగా విజయలక్ష్మి పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో సీమాన్ పోలీసుల ఎదుట హాజరు కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో విజయలక్ష్మి యూటర్న్ తీసుకుంది. వలసర వాక్కం పోలీసు స్టేషన్లో కేసును వెనక్కి తీసుకుంటున్నట్లు లిఖిత పూర్వకంగా వినతిపత్రం సమర్పించారామె. దీంతో పోలీసులు సీమాన్ సూపర్.. ఓ సంస్థకు చెందిన వీరలక్ష్మి పర్యవేక్షణలో తాను గృహ నిర్భంధంలో ఉన్నట్టుగా గత కొద్ది రోజులుగా పరిణామాలు చోటు చేసుకున్నాయని విజయలక్ష్మి అన్నారు. ఇవి తనను ఎంతగానో బాధించాయని పేర్కొన్నారు. సీమాన్ సూపర్ అని.. ఆయన పవర్ ఫుల్ అని కామెంట్స్ చేశారు. ఆయన్ని ఇక్కడ ఎవ్వరూ ఏమీ చేయలేరని.. తాను మళ్లీ ఇక్కడికి రాబోనని, బెంగళూరు వెళ్లి పోతున్నట్లు విజయలక్ష్మి పేర్కొన్నారు. సీమాన్ పవర్ ముందు తాను ఓటమిని అంగీకరించి వెళ్తున్నానని అన్నారు. అతను బాగుండాలని.. రాజకీయంగా మరిన్నీ విజయాలు సాధించాలని కోరుకున్నారు. తాను సీమాన్ వద్ద ఎలాంటి నగదు, మరే ఇతర తాయిలాలు తీసుకోలేదని మరోసారి ఆమె స్పష్టం చేశారు. (ఇది చదవండి: హర్ఘసాయి హీరోగా మెగా సినిమా.. టీజర్ వచ్చేసింది) -
పెళ్లి పేరుతో శారీరకంగా!.. డైరెక్టర్‌పై స్టార్ హీరోయిన్ ఫిర్యాదు!
1997లో 'నాగమండలం' చిత్రంతో సినీ కెరీర్ ప్రారంభించిన నటి విజయలక్ష్మి. ఈ చిత్రంలో ప్రకాశ్ రాజ్‌కు జోడీగా నటించింది. మొదటి సినిమాతోనే ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ నటి అవార్డును గెలుచుకుంది. ఆ తర్వాత జోడిహక్కి, భూమితై చొచ్చల మగా, అరుణోదయ, స్వస్తిక్, హబ్బా, సూర్యవంశం లాంటి కన్నడ సినిమాల్లో నటించారు. తెలుగులోనూ హనుమాన్ జంక్షన్, పృథ్వి నారాయణ చిత్రాల్లో కనిపించారు. ఆమె తమిళ చిత్ర పరిశ్రమలో చాలా చిత్రాలు చేశారు. మద్రాసులో జన్మించిన విజయలక్ష్మి కర్ణాటకలోని బెంగుళూరులో చదువుకుంది. తన కెరీర్లో దాదాపు 40 సినిమాల్లో నటించింది. తెలుగులోనూ హనుమాన్ జంక్షన్ సినిమాతో గుర్తింపు తెచ్చుకుంది. అంతే కాకుండా మోహన్‌లాల్‌తో కలిసి ఒక మలయాళ చిత్రం దేవదూతన్‌లో కూడా నటించింది. ఆత్మాహత్యాయత్నం 2006లో తండ్రి మరణంతో విజయలక్ష్మి నిద్రమాత్రలు వేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు అప్పట్లో వార్తలొచ్చాయి. అయితే మూడు సంవత్సరాల డేటింగ్ తర్వాత.. మార్చి 2007లో నటుడు సృజన్ లోకేష్‌తో ఎంగేజ్మెంట్ చేసుకుంది. అయితే ఊహించని సంఘటనలతో అతనితో నిశ్చితార్థం బ్రేకప్ అయింది. ఆ తర్వాత సినిమాలకే పరిమితమైన విజయలక్ష్మి గత కొన్నేళ్లుగా మళ్లీ వార్తల్లో నిలుస్తున్నారు. పెళ్లి పేరుతో మోసం తమిళనాడుకు చెందిన నామ్ తమిళర్ కట్చి పార్టీ అధినేత నటుడు, దర్శకుడు సీమాన్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. సీమాన్ తనను పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని ఆరోపిస్తూ ఫిబ్రవరి 2020లో పోలీసులకు ఫిర్యాదు చేసింది. అప్పట్లో అతని వేధింపులు తట్టుకోలేక 2020 జూలైలో మాత్రలు మింగిఆత్మహత్యకు ప్రయత్నించింది. అయితే ఇటీవలే ఆమె మరోసారి సీమాన్‌పై సంచలన ఆరోపణలు చేశారు. పెళ్లి పేరుతో నమ్మించి తనను శారీరకంగా వాడుకున్నారని విజయలక్ష్మి ఆరోపించింది. ప్రేమిస్తున్నట్లు నటించి 7 సార్లు బలవంతంగా అబార్షన్ చేయించాడని తెలిపింది. అంతే కాకుండా నా బంగారు నగలు తీసుకుని సీమాన్ మోసం చేశాడని వాపోయింది. తనకు న్యాయం చేయాలని కోరితే చంపేస్తానని బెదిరిస్తున్నారని ఇటీవల మరోసారి చెన్నై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీమాన్‌ను విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. అయితే ఆయన విచారణకు హాజరుకాలేదు. మంగళవారం తప్పకుండా విచారణకు హాజరు కావాలని పోలీసులు మరోసారి హెచ్చరించారు. విజయలక్ష్మికి గైనకాలజిస్ట్ పరీక్ష విజయలక్ష్మి ఫిర్యాదుతో చెన్నై పోలీసులు పూర్తిస్థాయిలో దర్యాప్తు ప్రారంభించారు. సీమాన్‌ను విచారణకు ఆదేశించడమే కాకుండా.. విజయలక్ష్మికి వైద్య పరీక్షలు కూడా నిర్వహించారు. ఆమెకు 7 సార్లు గర్భస్రావం జరిగిందని ఆరోపణల నేపథ్యంలో గైనకాలజిస్టులతో వైద్య పరీక్షలు చేశారు. -
సీమాన్ అరెస్టుకు విజయలక్ష్మి డిమాండ్
సాక్షి, చైన్నె : నటి విజయలక్ష్మీ మళ్లీ తెర మీదకు వచ్చా రు. నామ్ తమిళర్ కట్చి కన్వీనర్ సీమాన్‌ను అరెస్టు చేయాలని కోరుతూ తాజాగా ఆమె చైన్నె పోలీసు కమిషనర్ సందీప్ రాయ్ రాథోర్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. సినీ నటుడు, దర్శకుడు, నామ్ తమిళర్ కట్చి నేత సీమాన్ తనను మోసం చేసినట్టుగా 2011 నుంచి నటి విజయలక్ష్మి పోరాటం చేస్తూ వస్తున్నారు. న్యాయం కోసం ఆమె కొన్ని సార్లు ఆత్మహత్యా ప్రయత్నాలు కూడా చేశారు. అలాగే తరచూ సీమాన్‌కు వ్యతిరేకంగా ఆమె తీవ్రంగా విరుచుకు పడుతూ వస్తున్నా రు. అయితే ఇప్పటి వరకు సీమాన్‌పై అనేక ఫిర్యాదు లు వచ్చినా ఫలితం మాత్రం శూన్యం. దీంతో మళ్లీ తెర మీదకు వచ్చిన విజయలక్ష్మి చైన్నె పోలీసు కమిషనర్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. సీమాన్ తనను మోసం చేశాడని, ఆయన్ని అరెస్టు చేయాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం మీడియా ముందుకు వచ్చిన విజయలక్ష్మి కన్నీటి పర్యంతమయ్యారు. 2011 నుంచి తాను పోలీసులకు ఫిర్యాదు చేస్తూనే వచ్చానని, అన్నాడీఎంకే హ యాంలో సీమాన్‌కు అనుకూలంగా పోలీసులు వ్యవహరించారని ఆరోపించారు. ప్రస్తుతం మహిళా సంక్షేమం కోసం శ్రమిస్తున్న ప్రభుత్వం రాష్ట్రంలో అధికా రంలో ఉందని, అందుకే తనకు న్యాయం దొరుకుతుందన్న ఆశతో మళ్లీ ఫిర్యాదుచేశానన్నారు. గతంలో తాను ఫిర్యాదు చేస్తే, సీమాన్‌ను విచారించ లేదని, అయితే తననే విచారించారని, బెదిరించారని ఆరోపించారు. తన వద్ద ఉన్న అన్ని ఆధారాలను కమిషనర్‌కు సమర్పించానని, సీమాన్‌ను అరెస్టు చేసి తనకు న్యా యం చేయాలని విన్నవించుకున్నట్లు పేర్కొన్నారు. ఇప్పుడు జరగబోయే విచారణ తన జీవితానికి చావో రేవో లాంటిదని, తనకు న్యాయం దొరుకుతుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు సంధించిన ప్రశ్నలకు ఆమె ఆగ్రహానికి గురై అక్కడి నుంచి వెళ్లిపోయారు. -
ప్రేమ పేరుతో మోసం.. ఏళ్లు గడుస్తున్నా న్యాయం జరగట్లే: నటి ఆవేదన
తమిళ నటి, తెలుగులో 'హనుమాన్ జంక్షన్' సినిమాలో నటించిన విజయలక్ష్మి మరోసారి పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది. నామ్ తమిళర్ కట్చి నేత, నటుడు, దర్శకుడు సీమన్ తనను ప్రేమ పేరుతో మోసం చేశాడని, అతడిపై చర్యలు తీసుకోవాలంటూ చెన్నై పోలీసులకు ఫిర్యాదు చేసింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా వాడుకున్నాడని వాపోయింది. మోసం చేయడమే కాకుండా తనను బెదిరింపులకు గురి చేస్తున్న అతడిని అరెస్ట్ చేయాలని పోలీసులను వేడుకుంది. అనంతరం మీడియా ముందుకు వచ్చి ఆమె మాట్లాడుతూ.. 'నేను సీమన్పై గతంలోనూ ఫిర్యాదు చేశాను. ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఈసారి నేను పోలీసులు, ప్రభుత్వంపై నమ్మకం పెట్టుకున్నాను. అంతకుముందున్న ప్రభుత్వం కనీస విచారణ కూడా చేపట్టలేదు' అని పేర్కొంది. సహజీవనం.. ముఖం చాటేసిన సీమన్ కాగా విజయలక్ష్మి.. సీమన్పై గతంలోనూ ఈ ఆరోపణలు చేసింది. 2007-2009 వరకు సీమన్, తాను సహజీవనం చేశామని, ఇద్దరి మధ్య విబేధాలు రావడంతో పెళ్లికి విముఖత వ్యక్తం చేశాడంది. పైగా తనపై బెదిరింపులకు పాల్పడుతుండటంతో చెన్నై కమిషనర్ దగ్గరకు వెళ్లి ఫిర్యాదు చేసింది. కానీ సీమన్ సెటిల్మెంట్కు రావడంతో కేసు విత్‌డ్రా చేసుకున్నట్లు తెలిపింది. ఆ తర్వాత మాత్రం మీడియా ముందు తన పరువుకు భంగం కలిగించేలా మాట్లాడాడంటూ మరోసారి అతడిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆత్మహత్యాయత్నం అయితే విజయలక్ష్మిపై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ జరగడంతో 2020లో విజయలక్ష్మి ఆత్మహత్యకు పాల్పడింది. సోషల్ మీడియాలో సీమన్, ‘పనన్‌కట్టు పడై’కి చెందిన హరి నాడార్ మద్దతుదారుల వేధింపులు ఎక్కువయ్యాయని, తన చావుకు కారణమైనవాళ్లను వదిలిపెట్టొద్దంటూ ఓ వీడియో పోస్ట్ చేసి మరీ సూసైడ్‌కు యత్నించింది. అయితే సకాలంలో ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లడంతో పెద్ద గండం నుంచి బయటపడింది. చదవండి: ఆమె మోజులో హీరో.. అతడినే గుడ్డిగా ప్రేమించిన హీరోయిన్.. అప్పుడు డిప్రెషన్లో.. ఇప్పుడు నడవలేని స్థితిలో.. వడివేలు ఇంట తీవ్ర విషాదం.. తల్లి చనిపోయిన బాధ నుంచి ఇంకా తేరుకోకముందే.. -
66 ఏళ్ల వయసులో భార్య చనిపోయిన వ్యక్తిని పెళ్లాడిన నటి.. నెల రోజులకే..
ఇష్టానికి వయసుతో పనేంటి? నటన మీద ఆమెకున్న మక్కువ 71 ఏళ్ల వయసులో తనను ఇండస్ట్రీ వైపు అడుగులు వేయించేలా చేసింది. డాక్టర్, రచయిత్రి, కవయిత్రి, క్లాసికల్ డ్యాన్సర్, లాయర్.. ఇలా భిన్న రంగాల్లో ఆరితేరిన ఆమె రిటైర్మెంట్ తీసుకునే సమయంలో నటనా రంగంలో ఎంట్రీ ఇచ్చింది. షార్ట్ ఫిలింస్‌తో గుర్తింపు తెచ్చుకున్న బామ్మ తర్వాత ఏకంగా పెద్ద హీరోలతో నటించే అవకాశాన్ని కొట్టేసింది. ఈ బామ్మ పేరు విజయలక్ష్మి. కానీ తన జీవిత ప్రయాణాన్ని చూస్తే ఆమెను ధైర్యలక్ష్మి అని మెచ్చుకుని తీరాల్సిందే! సలార్, పుష్ప 2లో బామ్మ తాజాగా ఈ నటి ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు వెల్లడించింది. నటి విజయలక్ష్మి మాట్లాడుతూ.. 'నేను మొదట షార్ట్ ఫిలింలో నటించాను. అది బాగా క్లిక్ అయింది. అలా మరికొన్ని షార్ట్ ఫిలింస్ చేశాను. వెండితెరపై తొలిసారిగా రాజరాజ చోళ చిత్రం చేశాను. విరూపాక్ష, ఆచార్య, పొన్నియన్ సెల్వన్ 2.. ఇలా చాలా సినిమాలు చేశాను. సలార్, పుష్ప 2 కూడా చేస్తున్నాను. ఈ ఏడాది 12 సీరియల్స్ చేశాను. ఇంకా చాలా అవకాశాలు వస్తున్నాయి. సంతోషంగా ఉంది. 11 ఏళ్లకే తండ్రి కన్నుమూత నా కుటుంబ విషయానికి వస్తే.. నాకు ఇద్దరు తమ్ముళ్లు, ఒక చెల్లెలు. అందులో ఒకరైన నా మిలటరీ తమ్ముడు(60) ఈ మధ్యే చనిపోయాడు. తనంటే నాకెంతో ఇష్టం. తను చనిపోవడంతో డిప్రెషన్లోకి వెళ్లిపోయాను. నా తోబుట్టువలను చిన్నప్పటి నుంచి నేనే పెంచి పెద్దవాళ్లను చేశాను. నా 11 ఏళ్ల వయసులో నాన్న చనిపోయారు. మేనమామలు అప్పుడే నాకు పెళ్లి చేస్తా అంటే ఒప్పుకోలేదు. ముందు నా తమ్ముళ్లను బాగా చదివించి గొప్ప స్థానానికి తీసుకెళ్లాలనుకుంటున్నానని చెప్పాను. వారిని మంచి స్థానంలో చూడాలనుకున్నాను. అలా నా పెద్ద తమ్ముడు మిలటరీకి వెళ్లాడు. రెండో తమ్ముడు బ్యాంక్ మేనేజర్‌గా పని చేస్తున్నాడు. చెల్లె గృహిణిగా ఉంది. భార్య చనిపోయిన వ్యక్తితో పెళ్లి బాధ్యతలు అన్నీ తీరిపోయాక 32 ఏళ్ల వయసులో నా కోరిక తీర్చుకుందామని ఆంధ్ర నాట్యం నేర్చుకున్నాను. తర్వాత ఓ ప్రోగ్రామ్‌లో కింద పడటంతో కాలుకు దెబ్బ తగిలి డ్యాన్స్‌కు దూరమయ్యాను. 66 ఏళ్ల వయసులో నాకంటూ ఓ తోడుండాలని మామయ్య నాతో పెళ్లివైపు అడుగులు వేయించారు. భార్య చనిపోయిన ఓ రైల్వే ఉద్యోగిని నాకిచ్చి పెళ్లి చేశారు. అప్పటికే ఆయనకు ఇద్దరు పిల్లలు, కోట్ల ఆస్తి ఉంది. ఆస్తి కోసం అతడిని పెళ్లి చేసుకున్నానన్న బద్నాం నాకు వద్దని అతడి ఆస్తినంతా తన కుమారుల పేరిట రాసిచ్చాకే వివాహానికి ఒప్పుకుంటానన్నాను. ఆస్తిని రాసిచ్చేశానని ఆయన అబద్ధం చెప్పాడు. అది అబద్ధమని తర్వాత తెలిసింది. మాపెళ్లి జరిగాక అసలు కష్టాలు మొదలయ్యాయి. నా భర్త బతికున్నాడో లేదో కూడా తెలియదు నన్ను ఇంట్లోవాళ్లే బెదిరించారు, రాచిరంపాన పెట్టారు. ఆయన మనవళ్లు నన్ను ఇంట్లో నుంచి వెళ్లిపోతావా? లేదా? తనతో ఎలాగైనా ఆస్తి రాయించమని కొడుతుంటే కూడా నా భర్త మౌనంగా ఉండేవాడు. ఆయన ఆస్తి రాయడు, వీళ్లు హింసలు పెట్టడం మానరు. పెళ్లయ్యాక నెల రోజులు మాత్రమే అక్కడున్నాను. వాళ్ల చిత్రహింసలు తట్టుకోలేక ఇంటి నుంచి బయటకు వచ్చేశాను. 2016 నుంచి ఇప్పటివరకు ఆయన ఎలా ఉన్నాడో కూడా తెలియదు. అసలు బతికున్నాడో లేదో కూడా తెలియదు. నా శవాన్ని అక్కడివ్వండి నేను ఎవరికీ భారం కాను. కాళ్లూచేతులు బాగున్నన్నాళ్లు పని చేస్తాను. తర్వాత అనాధాశ్రమానికి వెళ్లిపోతాను. నేను చనిపోయాక నా శవాన్ని కర్నూలులోని జనరల్ ఆస్పత్రిలో అప్పగించమని కోరుతున్నాను. ఎందుకంటే ఈమేరకు నేను నా శరీరాన్ని మెడికల్ స్టూడెంట్స్‌కు దానం చేసేందుకు ఒప్పుకున్నాను. వీలైతే నా జీవిత కథను పది అధ్యాయాలుగా పుస్తకంగా తేవాలన్నదే నా ఆశయం' అంటూ తన కన్నీటి కష్టాలను చెప్పుకొచ్చింది విజయలక్ష్మి. చదవండి: పెళ్లై 8 ఏళ్లయినా పిల్లలు లేకపోవడంతో ఐవీఎఫ్.. నాలుగోసారికి సక్సెస్.. కానీ రౌడీ హీరో షర్ట్ వేసుకున్న రష్మిక మందన్నా, మళ్లీ దొరికిపోయిందిగా -
ఇంట్లోనే ఉండండి.. అత్యవసరమైతేనే బయటకు రండి
హిమాయత్‌నగర్: నగర ప్రజల ప్రాణాలను రక్షించడమే తమకు అత్యంత ప్రధానమని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు. సెలవులు ఉన్నాయి కదా అని ఎవరూ బయటకు రావొద్దంటూ ఆమె విజ్ఞప్తి చేశారు. ప్రజల అవసరాల కోసం, ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు నగర వ్యాప్తంగా జీహెచ్ఎంసీలోని అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది కలిసికట్టుగా పని చేస్తున్నారన్నారు. ఎవరికి ఏ సమస్య వచ్చినా గ్రీవెన్స్, ట్విట్టర్, టోల్‌ఫ్రీ నంబర్లకు ఫోన్ చేయాలని సూచించారు. గ్రీవెన్స్‌కు వచ్చిన ప్రతి సమస్యను పరిష్కరిస్తూ ప్రజలకు భరోసా కల్పిస్తున్నామన్నారు. ఇందుకోసం నగర వ్యాప్తంగా 429 రెస్క్యూ టీంలు పని చేస్తున్నాయన్నారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్‌ను మేయర్ శనివారం సందర్శించారు. కంట్రోల్ రూమ్‌కు వస్తున్న ఫోన్ కాల్స్, ఇతర ఫిర్యాదుల పట్ల సిబ్బంది పనితీరు ఎలా ఉందనే విషయాల్ని ఆమె దాదాపు గంట సేపు సమీక్షించారు. రూ.780 కోట్లతో 30 ప్రాంతాల్లో పనులు విస్తారమైన వర్షాల కారణంగా జీహెచ్ఎంసీ గ్రీవెన్స్ సెల్‌కు ఇప్పటి వరకు వచ్చిన ఫిర్యాదుల సంఖ్య 946. వీటిలో శిథిలావస్థ భవనాలు, చెట్లు విరిగి పడిపోవడం, రోడ్లపై నీరు నిలిచిపోవడం, మ్యాన్‌హోల్స్ నుంచి నీరు పొంగడం తదితర సమస్యలు ఉన్నాయన్నారు. వీటిని తమ సిబ్బంది పరిష్కరిస్తూ వస్తున్నారన్నారు. నాలా పరీవాహక ప్రాంతాల వద్ద ఎస్ఎన్డీపీ కింద రూ.780 కోట్లతో 30 ప్రాంతాల్లో పనులు జరిగాయన్నారు. ఇంకా ఆరు చోట్ల మాత్రమే పనులు పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు. 429 రెస్క్యూ టీంలు వర్షాల కారణంగా ప్రజల అవసరాలు తీర్చేందుకు, ప్రజలను సురక్షితమైన ప్రాంతాలకు చేర్చేందుకు 429 రెస్క్యూ టీమ్‌లు అందుబాటులో ఉన్నాయన్నారు. ధ్వంసమైన రోడ్లను బాగు చేసేందుకు సీఆర్ఎంపీకి చెందిన 29 టీంలు పని చేస్తున్నాయని మేయర్ తెలిపారు. లోతట్టు ప్రాంతమైన గాజులరామారాం వద్ద నిలిచిపోయిన నీరును తొలగించేందుకు తమ సిబ్బంది పని చేస్తున్నట్లు పేర్కొన్నారు. ► విద్యాసంస్థలకు, ప్రైవేటు సెక్టార్లకు, ఇతరత్రా కార్యాలయాలకు ప్రభుత్వం సెలవులు ఇచ్చిన నేపథ్యంలో.. కొందరు బయటకు వచ్చేందుకు ఇష్టపడతారని.. అత్యవసరమైతేనే తప్ప బయటకు రావద్దని.. ఇళ్లల్లోనే సేఫ్‌గా ఉండాలని రిక్వెస్ట్ చేస్తున్నట్లు మేయర్ విజయలక్ష్మి సూచించారు. వారం తర్వాత వారిపై సీరియస్ యాక్షన్ నగరంలో ఇప్పటి వరకు 483 శిథిలావస్థ భవనాలను గుర్తించామన్నారు. కూల్చేందుకు వెళ్లిన క్రమంలో మరమ్మతులు చేసుకుంటామని వాటి యజమానులు కోరడంతో కొంత గడువు ఇచ్చినట్లు చెప్పారు. వీరందరికీ నోటీసులు ఇచ్చామని, ఇప్పటికే 87 భవనాలను కూల్చివేశామని మేయర్ తెలిపారు. 92మంది రిపేర్ చేసుకోగా, 135 మంది ఖాళీ చేశారని, 19 భవనాలను సీజ్ చేశామని, 150 ప్రాసెస్‌లో ఉన్నాయన్నారు. వీటికి సంబంధించిన యజమానులు వారంలో రిపేర్ చేసుకోకపోతే సీరియస్ యాక్షన్ ఉంటుందన్నారు. -
నిందితుడు ‘నితిన్‌సాయి’ మేనేజరే
అనంతపురం: విజిలెన్స్ శాఖ ఏడీ ల్యాప్‌టాప్ చోరీ కేసులో మిస్టరీని పోలీసులు ఛేదించారు. రోడ్డు పనుల నాణ్యతలో డొల్లతనం బట్టబయలవుతుందనే భయంతో నితిన్‌సాయి కన్స్ట్రక్షన్స్ యాజమాన్యమే ఇందుకు ప్రోత్సహించిందని, ల్యాప్‌టాప్‌ను చోరీ చేసింది ఆ కంపెనీ మేనేజర్ శంకర్‌రెడ్డేనని నిగ్గు తేల్చారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న శంకరరెడ్డిని బుధవారం ముదిగుబ్బ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను ముదిగుబ్బ సీఐ కంబగిరి రాముడు వెల్లడించారు. అక్రమాలన్నీ ల్యాప్‌టాప్‌లోనే. ముదిగుబ్బ నుంచి మలకవేముల క్రాస్ వరకూ రహదారి పనులను నితిన్‌సాయి కన్స్ట్రక్షన్స్ కంపెనీ చేపట్టింది. అయితే ఈ పనుల్లో నాణ్యతా ప్రమాణాలకు తిలోదకాలివ్వడమే కాక, నిబంధనలకు విరుద్దంగా మొబైల్ క్రషర్లను వినియోగిస్తున్నట్లుగా మైనింగ్ అండ్ విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదులు అందాయి. దీంతో మైనింగ్ అండ్ విజిలెన్స్ ఏడీ విజయలక్ష్మి ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో భాగంగా నితిన్‌సాయి కనస్ట్రక్షన్ కంపెనీ అక్రమాలు బట్టబయలయ్యాయి. ఈ వివరాలన్నీ నివేదిక రూపంలో అధికారులు ల్యాప్‌టాప్‌లో నిక్షిప్తం చేశారు. వాహనంలో నుంచి ల్యాప్‌టాప్ అపహరణ ఈ నెల 6న తనిఖీలు పూర్తి చేసి, ల్యాప్‌టాప్‌లో వివరాలన్నీ నమోదు చేసిన విజిలెన్స్ ఏడీ విజయలక్ష్మి.. అదే రోజు మధ్యాహ్నం ముదిగుబ్బలోని ఓ హోటల్లో భోజనానికి వెళ్లారు. ఆ సమయంలో ల్యాప్‌టాప్‌ను తమ బొలెరో వాహనంలోనే వారు ఉంచారు. అప్పటి వరకూ అధికారులను అనుసరిస్తూ వచ్చిన నితిన్ సాయి కన్స్ట్రక్షన్స్ మేనేజర్ శంకరరెడ్డి.. అధికారుల బొలెరో వాహనం వద్ద ఎవరూ లేని సమయంలో ల్యాప్‌టాప్‌ను అపహరించుకెళ్లాడు. ఈ దృశ్యాలన్నీ సీసీ కెమెరా ఫుటేజీల్లో నిక్షిప్తమయ్యాయి. ఘటనపై అప్పట్లో అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన ముదిగుబ్బ పోలీసులు ల్యాప్‌టాప్ చోరీ జరిగిన ప్రదేశంలోని సీసీ కెమెరాల ఫుటేజీలను సేకరించి, పరిశీలించారు. అందులో శంకరరెడ్డి కదలికలు స్పష్టంగా ఉండడంతో అతనే దొంగగా నిర్ధారించుకుని మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. విచారణ అనంతరం నిందితుడు నేరాన్ని అంగీకరించాడు. దీంతో శంకర్‌రెడ్డితో పాటు నితిన్ సాయి కన్స్ట్రక్షన్స్ యాజమాన్యంపై కూడా కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
కార్పొరేటర్లు కాదు.. అధికారులే వాకౌట్
హైదరాబాద్: కార్పొరేటర్లకు బదులుగా అధికారులు సమావేశాన్ని బహిష్కరించి వాకౌట్ చేసిన ఘటన బుధవారం జరిగిన జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశంలో చోటుచేసుకుంది. వాటర్‌బోర్డు అధికారులను తీవ్రంగా అవమానించారంటూ వాటర్‌బోర్డు అధికారులు సమావేశం నుంచి వాకౌట్ చేయగా, వారికి మద్దతుగా జీహెచ్ఎంసీ అధికారులు సైతం తాము కూడా బాయ్‌కాట్ చేస్తున్నామంటూ ప్రకటించి బయటకు వెళ్లిపోయారు. దీంతో మేయర్ సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. సమావేశం నిర్వహించాలని బీజేపీ సభ్యులు పట్టుబట్టినా మేయర్ వినిపించుకోలేదు. మంగళవారం డ్రైనేజీ సిల్ట్‌ను తీసుకువెళ్లి బీజేపీ కార్పొరేటర్లు వాటర్‌బోర్డు ఎండి కార్యాలయంలో పూలకుండీల్లో వేయడం తెలిసిందే. దీనికి నిరసనగా వాటర్‌బోర్డు అధికారులు వాకౌట్ చేశారు. సమావేశం మొదలైన దాదాపు 20 నిమిషాలకే బీజేపీ సభ్యుల ఆందోళనల మధ్య వాయిదా వేస్తున్నట్లు మేయర్ ప్రకటించడంతో సమావేశం ఎలాంటి చర్చ, ప్రశ్నోత్తరాలు లేకుండానే వాయిదా పడింది. వాయిదా పడ్డాక సైతం కార్పొరేటర్లు, అధికారులు ఎవరికి వారుగా ఎదుటివారి తీరును విమర్శిస్తూ వాదనలు వినిపించారు. ఇంత చేస్తున్నా అవమానిస్తారా? మధ్యాహ్నం 12.30 గంటలకు సమావేశం ప్రారంభమైంది. ఇటీవల మరణించిన ఎమ్మెల్యే సాయన్న, బీజేపీ కార్పొరేటర్ దేవర కరుణాకర్, నాలాలో మరణించిన బాలిక మౌనిక, ఉగ్రవాదుల దాడిలో మరణించిన సైనికులకు సంతాపం తెలుపుతూ సభ్యులు మౌనం పాటించారు. సభాధ్యక్షత వహించిన మేయర్ విజయలక్ష్మి ప్రారంభోపన్యాసం ముగియగానే లంచ్ బ్రేక్ ప్రకటన చేయగా బీజేపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చే శారు. అంతలోనే వాటర్ బోర్డు ఈడీ సత్యనారాయణ తనకు మాట్లాడే అవకాశశమివ్వాలంటూ మాట్లాడారు. తాగునీరు, మురుగు నీరు నిర్వహణ పనులు చేస్తున్న తాము 186 కి.మీ నుంచి గోదావరి, 110 కి.మీ నుంచి కృష్ణాలతో పాటు సింగూరు, మంజీరాల నుంచి నీటిని ఇంటింటికీ అందిస్తున్నామని, 200 ఎయిర్‌టెక్ మెషీన్లతో మురుగునీటి సమస్యలు తీరుస్తున్నామని, అయినా తమను అవమానించినందుకు నిరసనగా సభ నుంచి వాకౌట్ చేస్తున్నామంటూ వెళ్లిపోయారు. వెంటనే జీహెచ్ఎంసీ కూకట్పల్లి జోనల్ కమిషనర్ మమత లేచి వారికి మద్దతుగా జీహెచ్ఎంసీ అధికారులందరం బాయ్‌కాట్ చేస్తున్నామంటూ ప్రకటించడంతో అందరూ వెళ్లిపోయారు. బీజేపీ సభ్యులు పోడియం వైపు దూసుకెళ్లి సభ జరగాలని పట్టుబట్టినా మేయర్ వాయిదా వేస్తున్నట్లు ప్రకటించడంతో అందరూ బయటకు వెళ్లిపోయారు. అధికారులిలా ప్రవర్తిస్తారా?: బీజేపీ, కాంగ్రెస్ కార్పొరేటర్లు ప్రజల కోసం పని చేస్తున్న తాము వారి సమస్యలను ప్రస్తావిస్తే పట్టించుకోని అధికారులు సభను బహిష్కరించడం దారుణమని బీజేపీ, కాంగ్రెస్ సభ్యులు విమర్శించారు. ఎక్కడైనా రాజకీయ నేతలు వాకౌట్ చేస్తారు కానీ.. ప్రజల సమస్యలు పరిష్కరించకుండా ప్రశ్నిస్తే వాకౌట్ చేస్తారా? అంటూ అధికారుల తీరును తప్పుబట్టారు. ఓవైపు నాలాల్లో , అగ్ని ప్రమాదాల్లో, కుక్కకాట్లు, దోమలతో ప్రజలు చస్తున్నా అధికారులకు చీమ కుట్టినట్లయినా లేదని, ప్రజల ఈ సమస్యలు చర్చించాల్సిన సమావేశం జరగకుండా చేశారని పేర్కొన్నారు. కాంగ్రెస్ సభ్యులు నాలాల్లో పసిప్రాణాల మరణాలు, కుక్కకాట్ల చావులపై ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన వ్యక్తం చేశారు. నల్లదుస్తులతో సభకు.. ప్రజల ప్రాణాలు పోతున్నా పట్టించుకోని జీహెచ్ఎంసీ తీరుకు నిరసనగా బీజేపీ కార్పొరేటర్లు నల్లదుస్తులతో సభకు హాజరయ్యారు. సభ వాయిదా పడ్డాక సైతం కౌన్సిల్ హాల్లోనే ఉన్న బీజేపీ కార్పొరేటర్లు మేయర్ రావాలంటూ డిమాండ్ చేశారు. కరెంట్ తీసేసినా వారు కదలకపోవడంతో, సాయంత్రం ఆరుగంటల ప్రాంతంలో పోలీసులు వారిని అక్కడినుంచి తరలించారు. నిరసన కార్యక్రమం కేటీఆర్‌కు ముందే తెలుసా? అధికారులు నిరసన వ్యక్తం చేయనున్న విషయాన్ని సభకు ముందస్తుగానే వాటర్‌బోర్డు అధికారులు మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలుస్తోంది. వాటర్‌బోర్డులో జరిగిన ఘటనను ఎండీ దానకిశోర్ మంత్రికి వివరించగా, ఏ పార్టీ వారైనా కార్పొరేటర్లు అలా వ్యవహరించడం తగదని మంత్రి సమాధానమిచ్చినట్లు విశ్వసనీయంగా తెలిసింది. అందువల్లే వాటర్‌బోర్డుకు మద్దతుగా జీహెచ్ఎంసీ అధికారులు బాయ్‌కాట్ చేశారంటున్నారు. గతంలో అధికారుల వాకౌట్లు గతంలో మాజిద్ హుస్సేన్ మేయర్‌గా ఉన్నప్పుడు కమిషనర్‌గా ఉన్న సోమేశ్‌కుమార్ సమావేశం నుంచి వాకౌట్ చేసినప్పటికీ, కొద్దిసేపు విరామం తర్వాత పలువురు నచ్చచెప్పడంతో తిరిగి సమావేశాన్ని నిర్వహించారు. సమీర్‌శర్మ కమిషనర్‌గా, బండ కార్తీకరెడ్డి మేయర్‌గా ఉన్నప్పుడు సైతం కమిషనర్ సమావేశం నుంచి వెళ్లిపోయిన ఘటనను కొందరు గుర్తు చేస్తున్నారు. కానీ అధికారులంతా మూకుమ్మడిగా వాకౌట్ చేయడం ఇదే ప్రథమం. మేయర్ వచ్చాకే అధికారులు సభలోకి ప్రవేశించడం ఈ సందర్భంగా గమనార్హం. ప్రజాధనం దుబారా.. ప్రతి సమావేశంలోనూ గందరగోళం సృష్టిస్తూ వాయిదా వేస్తున్నారని, ప్రజల సమస్యలు పట్టించుకోవడం లేదని, సమావేశాల సందర్భంగా భోజనాలు, ఇతరత్రా ఖర్చుల పేరిట జీహెచ్ఎంసీ ఖజానాకు రూ.లక్షల ఖర్చు తప్ప ప్రజల సమస్యలు పట్టించుకోవడం లేదని ప్రజలు వాపోతున్నారు. బ్లాక్‌డే: మేయర్ సభ వాయిదా పడ్డాక బీఆర్ఎస్ కార్పొరేటర్లతో కలిసి మేయర్ మీడియాతో మాట్లాడుతూ.. సీటులోకి రాకముందే తనను మహిళ అని కూడా చూడకుండా దూషించారని, అధికారులను సిగ్గుందా? అనడం సమంజసమా అని ప్రశ్నించారు. గతంలో ఎప్పుడూ అప్రజాస్వామిక భాష వాడలేదన్నారు. కార్పొరేటర్లు అధికారులను అవమానించడంతో వారి ఆత్మగౌరవం దెబ్బతిన్నదన్నారు. ఇదొక బ్లాక్‌డే అని వ్యాఖ్యానించారు. మర్యాద ఇవ్వకపోతే పనులు చేయం: మమత కార్పొరేటర్లు అధికారులతో మర్యాదగా ప్రవర్తించకపోతే సహకరించబోమని కూకట్పల్లి జోనల్ కమిషనర్, తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షురాలు మమత తెలిపారు. సభ వాయిదా అనంతరం జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి విలేకరులతో మాట్లాడుతూ.. కార్పొరేటర్ల అనుచిత ధోరణికి నిరసనగా సమావేశాన్ని బాయ్‌కాట్ చేశామన్నారు. జీహెచ్ఎంసీ, వాటర్‌బోర్డు అధికారులు కష్టపడి పనిచేస్తున్నా, అందరి ముందూ ఇష్టం వచ్చినట్లు తిడుతూ అధికారులకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదన్నారు. ► గ్రేటర్ నగరంలో ప్రజల ప్రాణాలకు రక్షణలేకుండా పోయిందంటూ బీజేపీ సభ్యులు వ్యంగ్యంగా ప్రదర్శనలు నిర్వహించారు. నన్ను చంపమని కోరేందుకు దోమ వేషంలో వచ్చానంటూ ఒకరు.. మేం కౌన్సిల్ హాల్లోకి వెళ్లాక ఏ అగ్ని ప్రమాదం జరుగుతుందోనని కుటుంబ సభ్యులు ఈ అగ్నిమాపక పరికరాలు ఇచ్చి పంపారని, కార్లలోనూ వీటిని ఉంచారని ఒకరు.. హఠాత్తుగా వానొస్తే చెరువులయ్యే రోడ్లతో కారు కొట్టుకుపోతే మాకు ఈత రానందున రక్షణగా టైర్లు, రక్షణ జాకెట్లు ఇచ్చారని కొందరు వివిధ పరికరాలతో, వేషధారణలతో వచ్చి సమావేశానికి ముందు వ్యంగ్యంగా నిరసనలు వ్యక్తం చేశారు. ► ఈ రకంగానైనా అధికారులకు సిగ్గు వస్తుందేమోననే తలంపుతోనే ఈ ప్రదర్శనలకు దిగామన్నారు. అధికారులు బాయ్‌కాట్ చేయడం సిగ్గుచేటని, మేయర్ కౌన్సిల్‌ను అదుపు చేయలేకపోయారని సభ వాయిదాపడ్డాక కొప్పుల నరసింహారెడ్డి, ఆకుల శ్రీవాణి తదితర కార్పొరేటర్లు మీడియాతో మాట్లాడుతూ పేర్కొన్నారు. మేయర్ అనుమతి లేకుండానే, మేయర్ కుర్చీకి గౌరవమివ్వకుండా అధికారులు ఇష్టానుసారం వాకౌట్ చేయడం తగదని, వారిపై తగిన చర్యలు తీసుకోవాలని, సభను అదుపు చేయలేని మేయర్ దిగిపోవాలని కొందరు డిమాండ్ చేశారు. అధికారులు ఎక్కడా ప్రజల సమస్యలు పట్టించుకోవడం లేరని, జోన్లలోనూ అవే పరిస్థితులని, ప్రజలకు తాము సమాధానాలు చెప్పలేకపోతున్నామని పేర్కొన్నారు. నగరాన్ని డల్లాస్ చేస్తామని చెప్పినా, నాలాల్లో ప్రాణాలు పోతుండటం వాస్తవం కాదా.. అని ప్రశ్నించారు. వాటర్‌బోర్డు వైఫల్యాలు తెలుపుతూ పూల మొక్కలిచ్చేందుకు వెళ్లిన తమను గూండాల్లా భావించి పోలీస్స్టేషన్లకు తరలిస్తారా అని ప్రశ్నించారు. మంత్రి కేటీఆర్, మేయర్ విజయలక్ష్మి మొద్దునిద్ర వీడాలన్నారు. కొసమెరుపు.. వాటర్‌బోర్డు సమస్యను జీహెచ్ఎంసీ సమావేశంలో లేవనెత్తి సభను రద్దు చేయడమేంటో అంతుచిక్కడంలేదంటూ నగరవాసులు ఆశ్చర్యపోతున్నారు. సాధారణంగా జీహెచ్ఎంసీ సమావేశాలకు వాటర్‌బోర్డు అధికారులు హాజరు కారు. ఏమైనా అత్యవసర సందర్భాల్లోనే సంబంధిత అధికారి మాత్రమే హాజరవుతారు. -
బీజేపీ కార్పొరేటర్ల తీరుపై అధికారుల నిరసన
-
సికింద్రాబాద్ కళాసిగూడలో విషాదంపై మేయర్ విజయలక్ష్మి రియాక్షన్
-
యాభై ఏళ్లలో చేయనోళ్లు.. ఇప్పుడు అభివృద్ధి చేస్తారట!
సాక్షి, మేడ్చల్ జిల్లా: యాభై ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధి చేయనివాళ్లు.. ఇప్పుడు అవకాశమిస్తే ఎలా చేస్తారని ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కె.తారకరామారావు ప్రతిపక్షాలను సూటిగా ప్రశ్నించారు. జవహర్‌నగర్ డంపింగ్ యార్డులో రూ.251 కోట్లతో 2000 కేఎల్డీ సామర్థ్యం కలిగిన లీచెట్ ప్లాంట్‌ను కార్మిక మంత్రి మల్లారెడ్డి, హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి , రాంకీ సంస్థ ప్రతినిధులతో కలసి కేటీఆర్ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో 3,619 మంది స్థానిక లబ్ధిదారులకు పట్టాలు అందజేశారు. అనంతరం మాట్లాడుతూ జవహర్‌నగర్ డంప్ యార్డ్ నుంచి ఉత్పత్తి అయ్యే లీచెట్ కారణంగా కలుషితమవుతున్న మల్కారం చెరువుతో పాటు యార్డు చుట్టుపక్కల చెరువుల్లో ఉన్న లీచెట్ శుద్దీకరణ ప్రక్రియను వచ్చే ఏడాది ఏప్రిల్ లోపు పూర్తి చేస్తామని ప్లాంట్ నిర్వాహకులు హామీ ఇచ్చారని తెలిపారు. దేశానికే హైదరాబాద్ ఆదర్శ నగరం కాబోతోంది.. హైదరాబాద్ మహానగరంలో రోజుకు దాదాపు 2వేల ఎంఎల్టీ ( 2వేల మిలియన్ లీటర్ల) మురికినీరు ఉత్పత్తి అవుతోందని, 100 శాతం ఎస్టీపీలతో జూలై కల్లా దేశంలోనే మొట్టమొదటి నగరం కాబోతుందని కేటీఆర్ తెలిపారు. ఇందుకోసం రూ.4 వేల కోట్లు ఖర్చుపెడుతున్నట్లు వెల్లడించారు. జపాన్‌లో వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ చూశానని అక్కడ పైన పార్కు, కింద ప్లాంట్ ఉందని, ఏ మాత్రం వాసన లేదని వివరించారు. జవహర్ నగర్, నాగారం, దమ్మాయిగూడలను ఆ విధంగా అభివృద్ధి చేస్తామని మంత్రి కేటీఆర్ హామీనిచ్చారు. 3 వేల మెట్రిక్ టన్నుల యార్డ్... 8 వేల మెట్రిక్ టన్నులైంది జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్ మొదలుపెట్టినప్పుడు హైద రాబాద్ నుంచి 3వేల మెట్రిక్ టన్నుల చెత్త వస్తుందని డిజైన్ చేశారని, కానీ ఇప్పుడు 8 వేల మెట్రిక్ టన్నుల చెత్త వస్తోందన్నారు. ప్రస్తుతం జవహర్ నగర్‌కు వచ్చే చెత్తలో తడి చెత్త నుంచి ఎరువు ఉత్పత్తి చేసి, రైతులకు అమ్ముతున్నామని కేటీఆర్ తెలిపారు. రూ.550 కోట్లతో దక్షిణ భారతదేశంలోనే పెద్దదైన ఈ చెత్త నుంచి కరెంట్ ఉత్పత్తి చేసే యూనిట్‌ను ప్రారంభించి 20 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి చేస్తున్నామన్నారు. రెండోదశలో మరొక రూ.550 కోట్లతో 28వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని త్వరలో స్థాపించనున్నట్టు కేటీఆర్ తెలిపారు. దీంతో ఒక్క జవహర్‌నగర్ నుంచే 48 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తవుతుందన్నారు. హైదరాబాద్ నుంచి వచ్చే మొత్తం చెత్తతో 100 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామన్నారు. మూడో రకం చెత్తతో సిమెంట్, బ్రిక్స్ తయారీ తడి,పొడి చెత్త కాకుండా, ఇళ్లు కట్టినప్పుడు, కూలగొట్టినప్పుడు వచ్చే కంకర రాళ్లు, మట్టితో మూడో రకం చెత్త వస్తోందని కేటీఆర్ తెలిపారు. నిర్మాణం, శిథిలాల నుంచి వచ్చే ఈ వ్యర్థాలను పునరుత్పత్తి చేసి.. పునర్వినియోగం చేసి.. వాటి నుంచి సిమెంట్, బ్రిక్స్, ఫుట్‌పాత్‌ల మీద వేసే టైల్స్ తయా రు చేస్తున్నామన్నారు. ఈ రకమైన ప్లాంట్లను ఒకటి ఫతూల్గూడలో, రెండోది జీడిమెట్లలో పెట్టినట్లు వివరించారు. ఈ రెండూ కూడా ఒక్కోటి 500మెట్రిక్ టన్నుల కెపాసిటీతో నడుస్తున్నాయని, మరో రెండు కూడా త్వరలో పెట్టబోతున్న ట్లు మంత్రి కేటీఆర్ ప్రకటించారు. కార్యక్రమంలో ఎంపీ అయోధ్య రామిరెడ్డి, ఎమ్మెల్సీ శంభీపూర్‌రాజు, జెడ్పీ చైర్మన్ శరత్ చంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఎం.సుదీర్‌రెడ్డి, కలెక్టర్ అమయ్‌కుమార్, మేయర్లు మేకల కావ్య, జక్కా వెంకట్‌రెడ్డి, జిల్లా గ్రంధాలయం చైర్మన్ దయాకర్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ భాస్కర్ యాదవ్, అడిషనల్ కలెక్టర్ నర్సింహారెడ్డి, ఆర్డీఓ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. -
Artist Vijaya Lakshmi: సంకల్పానికి చిత్రరూపం
ఆమె చిత్రలేఖనంలో మనకు కనిపించేది ఒక రూపం కాదు... అనేకం. బుద్ధుడి బొమ్మలో కేవలం బుద్ధుడు మాత్రమే కాదు... బ్రష్ పట్టుకుని... తదేక దీక్షతో బుద్ధుడి బొమ్మ వేస్తున్న ఓ టీనేజ్ అమ్మాయి కూడా ఉంటుంది. రవివర్మ కుంచెకు అందిన అందం... విజయలక్ష్మి చిత్రాల్లో ద్యోతకమవుతుంది. తెలంగాణ రాష్ట్రం, మేడ్చల్– మల్కాజ్గిరి జిల్లా, శామిర్ పేట మండలంలో ఉంది తుర్కపల్లి. ఆ ఊరిలో అత్యంత సాధారణ కుటుంబంలో పుట్టిన అమ్మాయి చిత్రలేఖనంతో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డు అందుకుంది. కళారత్న, అబ్దుల్ కలామ్ అవార్డులతోపాటు లెక్కలేనన్ని పురస్కారాలు, ప్రశంసలు ఆమె సొంతమయ్యాయి. తన రంగుల ప్రస్థానాన్ని, ఒక చిత్రంలో లెక్కకు మించిన వివరాలను పొందుపరచడంలో తన అభిరుచిని, బొమ్మల పట్ల తన ఇష్టాన్ని సాక్షితో పంచుకున్నారు విజయలక్ష్మి. అసాధారణమైన ప్రతిభ ‘‘నా జీవితంలో బొమ్మలు ఎప్పుడు ప్రవేశించాయో స్పష్టంగా చెప్పలేను. ఎందుకంటే నా దృష్టిని ఆకర్షించిన దృశ్యాలకు చిత్రరూపం ఇవ్వడం నా బాల్యంలోనే మొదలైంది. నన్ను స్కూల్‌కి మా అన్న తీసుకు వెళ్లి, తీసుకువచ్చేవాడు. నాకు చదువంటే చాలా ఇష్టం. ఇంటికి వచ్చిన తర్వాత కూడా పుస్తకాలే నా లోకం. అందులోని బొమ్మలే నా స్నేహితులు. అందరి పిల్లల్లా ఆడుకోవడం నాకు కుదరదు కదా. అందుకే చదువుకుంటూ, బొమ్మలేసుకుంటూ పెరిగాను. టెన్త్‌క్లాస్ తర్వాత కాలేజ్కెళ్లడం కష్టమైంది. కొన్నేళ్ల విరామంలో సైకాలజీ, ప్రముఖుల బయోగ్రఫీలు, భగవద్గీత... అదీ ఇదీ అనే తేడా లేకుండా నాకు దొరికిన ప్రతి పుస్తకాన్నీ చదివాను. ఆ తర్వాత డిస్టెన్స్ ఎడ్యుకేషన్‌లో డిగ్రీ చేశాను. చదివేకొద్దీ నా ఆలోచన పరిధి విస్తృతం కాసాగింది. నా గురించి నేను ఆలోచించడమూ ఎక్కువైంది. ఒక వ్యక్తి అసాధారణమైన నైపుణ్యాలను సాధించినప్పుడు ఆ వ్యక్తిని ఆ ప్రత్యేకతలతోనే గుర్తిస్తారు. ఇతర లోపాలున్నా సరే అవి తొలుత గుర్తుకురావు. నాకు ఎడమ చెయ్యి మాత్రమే మామూలుగా పని చేస్తుంది. రెండు కాళ్లు, కుడి చెయ్యి చిన్నప్పుడే పోలియో భూతం బారిన పడ్డాయి. నా పేరు విన్న వెంటనే కాన్వాస్ మీద అద్భుతాలు సృష్టించగలిగిన ఒక చిత్రకారిణి గుర్తుకురావాలి. సమాజం ఒక సాధారణ వ్యక్తిని సాధారణంగానే గుర్తిస్తుంది. ఒక నైపుణ్యమో, వైకల్యమో ఉన్నప్పుడు వ్యక్తిగా గుర్తించడానికంటే ముందు నైపుణ్యం, వైకల్యాలతోనే పరిగణనలోకి తీసుకుంటుంది. పోలియో బాధితురాలిగా ఐడెంటిఫై కావడం కంటే విజయలక్ష్మి అంటే చిత్రలేఖనం గుర్తుకు వచ్చేటంతగా రాణించాలనుకున్నాను. అందుకోసమే అహర్నిశలూ శ్రమించాను. నేను చూసిన దృశ్యాల నుంచి నా బొమ్మల పరిధిని విస్తరించాను. నేను చదివిన పుస్తకాల నుంచి ఇతివృత్తాలను రూపుదిద్దుకున్నాను. అన్నింటికీ మించి రాజా రవివర్మ నుంచి స్ఫూర్తి పొందాను. రవీంద్రభారతిలో పురస్కారాలు చిత్రకారిణిగా గుర్తింపు రావడమే కాదు, పురస్కారాలను రవీంద్రభారతిలో అందుకోగలిగాను. రవీంద్రభారతిలో అందుకోవడం కూడా ఒక పురస్కారంగానే భావిస్తాను. 2019లో నా చిత్రాలను తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ప్రదర్శించే అవకాశం వచ్చింది. అలాగే హైదరాబాద్‌లోని స్టేట్ ఆర్ట్ గ్యాలరీ, సాలార్జంగ్ మ్యూజియంతోపాటు ఢిల్లీలోనూ ప్రదర్శితమయ్యాయి. మనలో ఆత్మవిశ్వాసం, అకుంఠిత దీక్ష, సంకల్పబలం ఉంటే భగవంతుడు అవకాశం ఇచ్చి తీరుతాడని నమ్ముతాను. ఓ సంస్థ నా అవసరాన్ని గుర్తించి డెబ్బై వేల విలువ చేసే ఎలక్ట్రానిక్ వీల్‌చైర్ విరాళంగా ఇచ్చింది. అది కూడా భగవంతుడు పంపినట్లే. స్ఫూర్తిప్రదాతగా... నేను రాజా రవివర్మ నుంచి స్ఫూర్తి పొందితే, నన్ను స్ఫూర్తిగా తీసుకుంటున్న కొత్తతరం ఉండడం నాకు సంతోషంగా ఉంది. నేను చదువుకున్న స్కూల్లో నా బొమ్మలను ప్రదర్శించినప్పుడు నాకా సంగతి తెలిసింది. జీవితాన్ని నిస్సారంగా గడిపేయకూడదు, స్ఫూర్తిమంతంగా ఉండాలని కోరుకుంటాను. సోషల్ మీడియాను నూటికి నూరుశాతం వినియోగించుకున్నాననే చెప్పాలి. సోషల్ మీడియా వేదికగానే ఇన్‌ఫ్లూయెన్సర్‌ని కాగలిగాను. తలసేమియా వ్యాధిగ్రస్థులకు రక్తం కోసం ఏడాదికి మూడుసార్లు బ్లడ్ డొనేషన్ క్యాంపులు నిర్వహిస్తున్నాను. మా ఊరి కుర్రాళ్లు ‘ఏం చేయాలో చెప్పక్కా, మేము చేసి పెడతాం’ అని ఉత్సాహంగా సహాయం చేస్తున్నారు. ‘వీల్‌చైర్ నుంచి నేను ఇన్ని చేస్తుంటే హాయిగా నడవగలిగిన వాళ్లు ఎందుకు చేయలేరు. స్థిరచిత్తం ఉంటే ఏదైనా సాధ్యమే’నని వీడియోల్లో చెబుతుంటాను’’ అని సంతోషంగా తన బొమ్మలలోకాన్ని వివరించింది విజయలక్ష్మి. బుద్ధుడి వెనుక యువతి విజయలక్ష్మి చిత్రలేఖనంలో ఉన్న అమ్మాయి అచ్చమైన తెలుగుదనంతో ఒత్తైన జడ వేసుకుని ఉంటుంది. ఆ జడను అలంకరించి పూలు కూడా అచ్చం పూలను పోలినట్లే తెల్లటి పువ్వులో పసుపువర్ణంలో పువ్వు మధ్యభాగం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఆ అమ్మాయి చెవి జుంకీలకున్న నగిషీలు కూడా. అలాగే మరో చిత్రలేఖనం ఇంకా అద్భుతం... మన దృష్టి అభయ ముద్రలో ఉన్న బుద్ధుడి మీద కేంద్రీకృతమవుతుంది. బుద్ధుని పాదాల వద్దనున్న కమలం మీద, బుద్ధుడి శిఖ, శిఖ వెనుకనున్న కాంతివలయాన్ని కూడా చూస్తాం. ఆ తర్వాత మన దృష్టికి వస్తుందో అద్భుతం. ఆ బుద్ధుడి బొమ్మ ఉన్నది కేవలం కాన్వాస్ మీద కాదు. ఒక యువతి వీపు మీద. అటువైపు తిరిగి కూర్చుని ఉన్న యువతిని చిత్రీకరించిన తర్వాత ఆమె వీపు మీద చూపరులకు అభిముఖంగా ఉన్న బుద్ధుడిని చిత్రించింది విజయలక్ష్మి. – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
' 'బలగం' తొలి సినిమానే.. కానీ ఆమె జీవితమే ఓ కన్నీటి కథ'
తెలంగాణ పల్లె వాతావరణాన్ని కళ్లకు కట్టినట్లు తెరకెక్కించిన చిత్రం 'బలగం'. మానవ సంబంధాలను, ముఖ్యంగా రక్తబంధాన్ని హృదయాలను హత్తుకునేలా చూపించారు. ఈ సినిమా కన్నీళ్లు పెట్టనివారు లేదంటే ఏ రేంజ్లో హిట్ అయిందో అర్థమవుతోంది. అయితే ఈ సినిమాలో నటించిన వారిలో ప్రతి ఒక్కరీ జీవితంలో ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొన్నవారే. అలాంటివారిలో కీలక పాత్రధారిగా బలగం సినిమాలో మెప్పించిన కొమరయ్య చెల్లెలు పోచవ్వ. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తన జీవితంపై ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఆమె అసలు పేరు విజయలక్ష్మి. బలగం చిత్రంలో పోచవ్వ పాత్రతో అందరినీ ఆకట్టుకుంది. ఆమె సురభి కళాకారిణి కాగా.. ఈ సినిమాలో పోచవ్వ నటనకు ఎవరైనా మెచ్చుకోకుండా ఉండలేరు. కొమరయ్యకు చెల్లెలుగా.. ఆ కుటుంబానికి మేనత్తగా మెప్పించింది. విజయలక్ష్మి మాట్లాడుతూ.. ' తాను సురభి కళాకారిణిని. 35 ఏళ్ల పాటు నాటకాలు వేశా, హరికథలు చెప్పా. నంది అవార్డు వచ్చింది. నేను చేసిన తొలి చిత్రం బలగం. నాకు ఇంత మంచి పేరు రావడానికి కారణం దర్శకుడు వేణునే. ఆర్థికంగా చాలా కష్టాలు పడ్డా. నా భర్త చనిపోయాక పిల్లలకు పెళ్లిళ్లు చేశా. ఇద్దరు కుమారులు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. నా చిన్న కుమారుడు రోడ్డు ప్రమాదంలో మరణించాడు. ఆ సమయంలో నా కోడలు గర్భవతి. నా జీవితంలో అంతుచిక్కని విషాదం. భర్త చనిపోవడం, నాలుగేళ్లకే కుమారుడిని పోగొట్టుకుని తీవ్ర విషాదంలో మునిగిపోయా. ఆ సంఘటన నుంచి ఇప్పటికీ బయట పడలేకపోతున్నా.' అంటూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఆమె నటించిన తొలి సినిమా అయినా తనదైన నటనతో ఆకట్టుకున్నారు. -
మహిళోదయం
శ్రీకాకుళానికి చెందిన సుగుణరెడ్డి, రత్నకుమారి, రమాదేవి, నాగలక్ష్మి, విజయ ఇంటిని చక్కదిద్దుకునే దిగువ మధ్యతరగతి గృహిణులు. 18,364 మంది మహిళా సమాఖ్య సభ్యులతో కలసి పట్టణంలో ఫిబ్రవరిలో జగనన్న మహిళా మార్టు ఏర్పాటు చేశారు. ఒక్కొక్కరి నుంచి రూ.150 చొప్పున మొత్తం రూ.27,54,600 స్త్రీనిధిగా సేకరించారు. మొదటి నెలలో రూ.10,75,013 మేర వ్యాపారం చేయడంతోపాటు రూ.లక్ష లాభం కూడా ఆర్జించారు. కస్తూరి, ప్రీతి, ఇందిర, ప్రియ, హిమబిందు చిత్తూరుకు చెందిన మహిళా సమాఖ్య సభ్యులు. పట్టణంలో 26,850 మంది సభ్యులతో కలసి జగనన్న మహిళా మార్ట్ నెలకొల్పారు. రూ.40,27,500 స్త్రీనిధిని సేకరించి నెలకు రూ.32,56,152 మేర వ్యాపారం చేస్తున్నారు. ఏ బిజినెస్ స్కూల్లో పట్టాలు పొందలేదు.. ఆ మాటకొస్తే పెద్దగా చదువుకోలేదు.. గతంలో వ్యాపార అనుభవం కూడా లేదు. సంఘటితంగా మారి ‘పొదుపు’ బాట పట్టారు. సామాన్య మహిళలైన వీరంతా జగనన్న మహిళా మార్టుల ద్వారా వ్యాపారాల్లో ఎంతో బాగా రాణిస్తున్నారు. పులివెందుల, అద్దంకి, రాయచోటి, తిరుపతి, పుంగనూరు సహా మొత్తం ఏడు చోట్ల జగనన్న మహిళా మార్ట్లను సమాఖ్య సభ్యులే నెలకొల్పి విజయవంతంగా నడిపిస్తున్నారు. పట్టణ ప్రాంత పేదరిక నిర్మూలనా సంస్థ (మెప్మా) అందించిన శిక్షణతో ఇంత పెద్ద విజయాన్ని సాధించారు. ఏడు మార్టుల్లో 1.19 లక్షల మందికి పైగా స్వయం సహాయక సంఘాల సభ్యులు వాటాదార్లుగా రూ.1.79 కోట్లు పెట్టుబడిగా పెట్టారు. ప్రతి నెలా రూ.1.35 కోట్ల టర్నోవర్ చేస్తున్నారు. సభ్యులే కమిటీలుగా ఏర్పడి సరుకు కొనుగోలు, నాణ్యత, నిర్వహణ బాధ్యతలను చూసుకుంటున్నారు. ఇంటి సరుకుల కోసం చేసే ఖర్చును తగ్గించుకునేందుకు చేపట్టిన ఈ ప్రాజెక్టు పట్టణ ప్రాంత మహిళల్లో కొత్త శక్తిని నింపుతోంది. – సాక్షి, అమరావతి రెండేళ్ల క్రితం పులివెందులలో ‘మెప్మా’ అందించిన సాయంతో ప్రారంభమైన ‘జగనన్న మహిళా మార్ట్’ ప్రస్థానం ఏడు పట్టణాలకు విస్తరించింది. మహిళా సమాఖ్యలోని సభ్యులంతా దిగువ మధ్య తరగతి, నిరుపేద కుటుంబాలకు చెందినవారే. ఇంటి అవసరాల సరుకులు కొనేందుకు ప్రతి నెలా కనీసం రూ.5 వేల నుంచి రూ.7 వేల వరకు ఖర్చు చేస్తుంటారు. మహిళా మార్టుల్లో వాటాదార్లకు మేలు జరిగేలా చర్యలు తీసుకున్నారు. షాపులో సాధారణంగా ఇచ్చే డిస్కౌంట్ల కంటే సభ్యులకు 0.50% అదనంగా డిస్కౌంట్ ఇస్తున్నారు. దీంతో ఇప్పుడు ఒక్కో కుటుంబం నెలకు కనీసం రూ.700 నుంచి రూ.1,000 వరకు ఆదా చేయగలుగుతోంది. పేదలకు అది పెద్ద మొత్తమే. రూ.150 వాటాకు జీవితకాల సభ్యత్వంతోపాటు లాభాల్లో ఏటా 33 శాతం డివిడెండ్ రూపంలో చెల్లిస్తున్నారు. మూడేళ్లలో పెట్టిన పెట్టుబడి వెనక్కి రావడంతో పాటు కొనుగోళ్లలో అదనపు డిస్కౌంట్ దక్కుతోంది. 6 వేల నుంచి 37 వేల మంది సభ్యులు పట్టణ ప్రాంతాల్లోని మహిళా సమాఖ్యల సభ్యులతో మెప్మా స్టోర్లను ఏర్పాటు చేస్తోంది. స్థానికంగా ఉన్న సభ్యులతో సమావేశాలు నిర్వహించి వ్యాపారంపై పూర్తి అవగాహన కల్పించాక వాటాదార్లుగా చేర్చుకుంటున్నారు. పట్టణాన్ని బట్టి ఒక్కో మార్టులో 6 వేల మంది నుంచి గరిష్టంగా 37 వేల మంది వరకు వాటాదార్లుగా ఉన్నారు. పులివెందుల స్టోర్‌లో 8 వేల మంది రూ.12 లక్షలు పెట్టుబడిగా పెట్టి ప్రతి నెలా రూ.20 లక్షలకు పైగా వ్యాపారం చేస్తున్నారు. తిరుపతిలో 37,309 మంది సభ్యులు కలిసి రూ.56 లక్షలు వాటాగా పెట్టి ప్రతి నెలా రూ.29.88 లక్షల మేర వ్యాపారం చేస్తున్నారు. ‘స్వయం’కృషితో ఎదిగిన స్త్రీ శక్తి మహిళా సమాఖ్యలు ప్రభుత్వం అందించే సాయాన్ని ఇన్నేళ్లు ఇంటి అవసరాలకే వినియోగించుకుంటుండగా వారికి ఆర్థిక స్వావలంబన ద్వారా సుస్థిర జీవనోపాధికి మార్గం చూపాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయించారు. అందుకు అనుగుణంగా ‘మెప్మా’ ఎండీ విజయలక్ష్మి వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టారు. ప్రభుత్వం అందించే ఆర్థిక సాయాన్ని సద్వినియోగం చేసుకుంటూ సభ్యులంతా కలిసి సూపర్ మార్కెట్లు నెలకొల్పవచ్చని మహిళలకు వివరించారు. వారితో పలు దఫాలు సమావేశాలు నిర్వహించి ఎలా ముందుకెళ్లాలో మార్గనిర్దేశం చేశారు. సమాఖ్య సభ్యులపై భారం లేకుండా ఒక్కొక్కరి పెట్టుబడి కేవలం రూ.150గా నిర్ణయించారు. ‘జగనన్న మహిళా మార్ట్’ పేరుతో 2021 జనవరి 3న తొలి మార్ట్‌ను పులివెందులలో ఏర్పాటు చేశారు. ఏడాది కాలంలోనే ఈ స్టోర్ రూ.2.50 కోట్ల మేర వ్యాపారం చేయడంతో పాటు వాటాదార్లకు లాభాల్లో 33 శాతం డివిడెంట్‌గా చెల్లించింది. గతేడాది జనవరిలో రాయచోటిలో నెలకొల్పిన జగనన్న మహిళా మార్ట్ మొదటి నెలలోనే రూ.14 లక్షల మేర వ్యాపారం చేసింది. ఫిబ్రవరిలో ప్రకాశం జిల్లా అద్దంకిలో ప్రారంభమైన స్టోర్ సైతం రూ.10.72 లక్షల వ్యాపారం నిర్వహించింది. ఈ మూడు స్టోర్లు విజయవంతం కావడంతో తిరుపతి, పుంగనూరు, చిత్తూరులోనూ జగనన్న మహిళా మార్ట్లను మెప్మా ఎండీ అందుబాటులోకి తెచ్చారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో శ్రీకాకుళంలోనూ మార్ట్‌ను ప్రారంభించారు. ఏడుచోట్ల నెలకు రూ.1.35 కోట్ల మేర వ్యాపారం చేస్తున్నారు. నాణ్యతే ప్రమాణంగా వ్యాపార శిక్షణ వ్యాపారం ఏదైనా సరే నాణ్యతే పెట్టుబడిగా ఉంటే మంచి సరుకులు ఎక్కడున్నా కొనుగోలుదారులు వస్తుంటారు. ఈ సూత్రంతోనే స్టోర్ల భాగస్వాములైన మహిళా సమాఖ్య సభ్యులకు మెప్మా శిక్షణ ఇచ్చింది. స్టోర్ నిర్వహణ, సరుకుల కొనుగోలు, నాణ్యత పరిశీలనకు, ఖాతాల నిర్వహణకు వాటాదార్లుగా ఉన్న మహిళలతోనే కమిటీలు ఏర్పాటయ్యాయి. దీంతో వ్యాపార నిర్వహణ తేలికైంది. ఎక్కడ నాణ్యమైన సరుకులు దొరుకుతాయో అక్కడి నుంచే నేరుగా కొనుగోలు చేసి అమ్మకానికి ఉంచుతున్నారు. మహిళా సమాఖ్య సభ్యులు సొంతంగా తయారు చేసిన వస్తువులను సైతం ఇక్కడ విక్రయించే ఏర్పాట్లు చేశారు. మార్ట్‌ల్లో గృహ అవసరాలకు వినియోగించే అన్ని వస్తువులను అమ్ముతున్నారు. పెద్దగా లాభాలు ఆశించకుండా నాణ్యమైన సరుకులను అందిస్తుండటంతో ప్రజలకు వీటిపై నమ్మకం పెరిగింది. ప్రతి మార్ట్‌లోనూ ఒకే ధర ఉంటుంది. అన్నింటికీ ఒకే సాఫ్ట్వేర్ వినియోగిస్తుండడంతో నిర్వహణ తేలికైంది. జగనన్న మహిళా మార్టులు కార్పొరేట్ సూపర్ మార్కెట్లను తలదన్నేలా ఉండడమే కాకుండా లాభాల బాటలో నడుస్తున్నాయి. ఆర్థిక స్వావలంబనే లక్ష్యంగా... ముఖ్యమంత్రి జగన్ ఆలోచనల మేరకు పట్టణ పేద మహిళల ఆర్థిక స్వావలంబనే లక్ష్యంగా జగనన్న మహిళా మార్ట్లను ఏర్పాటు చేస్తున్నాం. ఏడు స్టోర్లు విజయవంతంగా నడుస్తున్నాయి. స్వయం సహాయక గ్రూప్ మహిళలకు వీటి ఏర్పాటుపై అవగాహన కల్పిస్తున్నాం. స్వచ్ఛందంగా రూ.150 పెట్టుబడిగా పెడుతున్నారు. పులివెందుల స్టోర్ వాటాదారులు డివిడెంట్ కూడా తీసుకున్నారు. అన్ని స్టోర్లలోనూ ఒకే విధంగా మార్కెట్ కంటే తక్కువ ధరలుంటాయి. అన్ని స్టోర్లను అనుసంధానిస్తూ ఏకీకృత సాఫ్ట్వేర్ రూపొందించాం. స్థానిక మున్సిపాలిటీకి చెందిన వ్యాపార సముదాయల్లో షాపులను నెలకొల్పడం ద్వారా అద్దె భారం తగ్గుతోంది. సరుకులు కొనుగోళ్లను మార్ట్ కమిటీ సభ్యులే స్వయంగా చూసుకుంటున్నారు. మార్ట్లు అనుకున్న దానికంటే ఎక్కువ విజయవంతం కావడం ఆనందంగా ఉంది. ప్రతి మునిసిపాలిటీలో ఒక స్టోర్ ఏర్పాటు దిశగా కృషి చేస్తున్నాం. – విజయలక్ష్మి, మెప్మా ఎండీ -
మేయర్ ఇంట్లో 5000 వీధి కుక్కల్ని వదలాలి: RGV
-
బాలుడి ప్రాణానికి బాధ్యులు ఎవరు..?
-
కిషన్ రెడ్డి కేంద్ర నిధులు తేలేకపోయారు: మేయర్ విజయలక్ష్మి
-
మేయర్ ను అడ్డుకున్న పార్టీ కార్యకర్తలు
-
పుష్ప మూవీ చూశా, ఆ హీరో ఎవరో తెలియదు: నటి
పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా.. ఫైర్, తగ్గేదేలే అంటూ చిత్తూరు మేనరిజమ్ డైలాగ్స్‌తో సినీలవర్స్‌ను ఎంటర్టైన్ చేశాడు అల్లు అర్జున్. ఈ మూవీతో బాక్సాఫీస్‌ను గడగడలాడించిన బన్నీ ఇప్పుడు పుష్ప సీక్వెల్‌తో బిజీగా ఉన్నాడు. ఇదిలా ఉంటే అల్లు అర్జున్ ఎవరో తనకు తెలియదంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది అలనాటి నటి, నర్తకి ఎల్ విజయలక్ష్మి. తెలుగు, తమిళం, మలయాళ, హిందీ భాషల్లో నటించిన ఆమె పెళ్లి తర్వాత అమెరికా వెళ్లిపోయి అక్కడే సెటిలైంది. తాజాగా ఇండియాకు వచ్చిన ఆమె ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది. ఐదేళ్ల వయసులోనే డ్యాన్స్ షో చూసి యథాతథంగా అలాగే స్టెప్పులేసేదాన్ని అని చెప్పుకొచ్చింది. నందమూరి తారకరామారావుగారు తనను కోడలా.. కోడలా.. అని పిలిచేవారంటూ మురిసిపోయింది. ఈ మధ్య ఏదైనా సినిమా చూశారా? అన్న ప్రశ్నకు పుష్ప సినిమా చూశానంది. అందులో నటించిన హీరో ఎవరో తెలుసుగా అనేలోపే తనకు తెలియదని చెప్పింది. అతడు అల్లు రామలింగయ్యగారి మనవడు అని చెప్పడంతో ఆశ్చర్యపోయిన నటి.. ఈ మధ్యకాలంలో హీరోల గురించి అడుగుతుంటే రామానాయుడు మనవడు, నాగేశ్వరరావు మనవడు అని ఇలాగే చెప్తున్నారని పేర్కొంది. కాగా ఇటీవల విజయలక్ష్మి ఎన్టీఆర్ పురస్కారాన్ని అందుకుంది. ఈ అవార్డు స్వీకరించేందుకు దాదాపు యాభై ఏళ్ల తర్వాత ఆమె అమెరికా నుంచి తెనాలి రావడం కొసమెరుపు. చదవండి: బిగ్‌బాస్: టికెట్ టు ఫినాలే బరిలో నిలబడ్డ లేడీ కంటెస్టెంట్ అర్ధరాత్రి ప్రభాస్ చేసిన పనికి సూర్య షాక్ -
ఎన్టీఆర్‌తో నటించేటప్పుడు విలువలు నేర్చుకున్నా
‘‘నేను చిన్నతనం నుంచి ఎన్టీఆర్‌గారిని ఆదర్శంగా తీసుకునేదాన్ని. ఆయనతో నటించేటప్పుడు క్రమశిక్షణ, సిన్సియారిటీ, అంకితభావం, నిబద్ధత, మాటతీరు.. వంటి విలువలు నేర్చుకున్నాను’’ అని సీనియర్ నటి ఎల్.విజయలక్ష్మి అన్నారు. దివంగత నటుడు ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో భాగంగా తెనాలిలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో ఎన్టీఆర్ అవార్డు అందుకున్నారు ఎల్.విజయలక్ష్మి. ఈ సందర్భంగా సోమవారం హైదరాబాద్‌లో సినీ ప్రముఖుల సమక్షంలో ఆమెకు హీరో బాలకృష్ణ గౌరవ సత్కారం చేశారు. అనంతరం ఎల్.విజయలక్ష్మి మాట్లాడుతూ– ‘‘ఎంతో అభిమానంతో అమెరికా నుంచి నన్ను పిలిపించి గౌరవించడం చూస్తుంటే కళ్లు చెమర్చుతున్నాయి. ఇందుకు బాలకృష్ణ, ఆలపాటి రాజా, బుర్రా సాయిమాధవ్‌లకు థ్యాంక్స్. వివాహం అయ్యాక సినిమాలు మానేసి అమెరికా వెళ్లాను. అక్కడ సీఏ చదివానంటే ఎన్టీఆర్‌గారి స్ఫూర్తి వల్లే. రామానాయుడు, ఎన్టీఆర్‌గార్ల తరం చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉంది. మళ్లీ ఇలాంటి వేడుకలకు రావాలనుంది’’ అన్నారు. బాలకృష్ణ మాట్లాడుతూ– ‘‘విజయలక్ష్మిగారు వందకుపైగా సినిమాల్లో నటిస్తే అందులో 60కి పైగా నాన్నగారితో నటించారు. ఆమె మహిళా సాధికారతకు ప్రతీక. ఆమె ఎక్కిన మెట్లను భావితరాలు ఆదర్శంగా తీసుకోవాలి’’ అన్నారు. ‘‘1964లో మా బేనర్లో(సురేశ్ ప్రొడక్షన్స్) నిర్మించిన ‘రాముడు భీముడు’ సినిమాలో విజయలక్ష్మిగారు నటించారు. అందులో ‘‘దేశమ్ము మారిందే..’ అనే సాంగ్ కోసం ఆమె ఎంత కష్టపడ్డారో నాన్నగారు (రామానాయుడు) చెబుతుండేవారు’’ అన్నారు నిర్మాత డి.సురేశ్ బాబు. ఈ వేడుకలో రచయిత పరుచూరి గోపాలకృష్ణ, దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, డైరెక్టర్ వైవీఎస్ చౌదరి, నిర్మాతలు సి.కల్యాణ్, ప్రసన్న కుమార్, బసిరెడ్డి, రామసత్యనారాయణ, జూబ్లీహిల్స్ మాజీ కార్పొరేటర్ ఖాజా సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
విజయలక్ష్మికి తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఘనంగా సత్కారం ( ఫొటోలు)
-
ఎల్. విజయలక్ష్మికి ఎన్టీఆర్ అవార్డు
అలనాటి అందాల తార, ప్రముఖ నర్తకి ఎల్. విజయలక్ష్మిని ఎన్టీఆర్ అవార్డు వరించింది. తెనాలిలో జరుగుతున్న ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో భాగంగా ఎన్టీఆర్ నటించిన అన్ని సినిమాలు ఏడాది పాటు పెమ్మసాని (రామకృష్ణ) థియేటర్లో ప్రదర్శితమవుతున్నాయి. ఇక్కడ జరిగే కార్యక్రమంలో ప్రతి నెలా ఎన్టీఆర్ కుటుంబం నుండి ఒకరు పాల్గొంటారు. ఎన్టీఆర్‌తో పనిచేసిన ఒక లెజెండరీ పర్సన్‌కు ప్రతి నెలా అవార్డు, గోల్డ్ మెడల్ ప్రదానం చేస్తారు. అక్టోబర్ నెలకిగాను ఎన్టీఆర్ పురస్కారానికి ఎల్. విజయలక్ష్మి ఎంపికయ్యారు. బాలనటిగా ‘సిపాయి కూతురు’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన ఆమె ‘జగదేకవీరుని కథ, ఆరాధన, గుండమ్మ కథ, నర్తనశాల, పూజా ఫలం, బొబ్బిలి యుద్ధం, రాముడు–భీముడు, భక్త ప్రహ్లాద’ వంటి ఎన్నో సినిమాల్లో నటించారు. ముఖ్యంగా ఎన్టీఆర్‌తో సుమారు 15 సినిమాలకు పైగా నటించారు విజయలక్ష్మి. 50 ఏళ్ల క్రితం పెళ్లి చేసుకొని ఇండస్ట్రీకి దూరంగా అమెరికాలో స్థిరపడ్డారామె. ఈ నెల 30న తెనాలిలో జరిగే కార్యక్రమంలో అవార్డు అందుకోవడానికి ఆమె ఇక్కడికి రానున్నారు. కాగా ‘ఎన్టీఆర్ శతజయంతి’ కార్యక్రమానికి గౌరవ అధ్యక్షుడిగా నందమూరి బాలకృష్ణ, అధ్యక్షుడిగా ఆలపాటి రాజేంద్రప్రసాద్, కార్యనిర్వాహక అధ్యక్షుడిగా బుర్రా సాయిమాధవ్ వ్యవహరిస్తున్నారు. -
Rain Alert: భాగ్యనగరంలో భారీ వర్షాలు
సాక్షి, హైదరాబాద్: భాగ్యనగరంలో ఈ రోజు రాత్రి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ క్రమంలో నగర్ మేయర్ గద్వాల విజయలక్ష్మి మాన్సూన్ యాక్షన్ టీమ్‌లను అప్రమత్తం చేశారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సహాయక చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇదిలా ఉంటే ఇప్పటికే నగరంలో అనేక ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. ఉప్పల్, ఎల్బీ నగర్, వనస్థలిపురం, హయత్‌నగర్, కూకట్పల్లి, పంజాగుట్ట, సికింద్రాబాద్, మెహదీపట్నం, బంజారాహిల్స్, అబ్దుల్లాపూర్‌మెట్, సరూర్ నగర్, కర్మన్ ఘాట్, మీర్పెట్, లాల్ ధర్వాజా, చాంద్రాయణగుట్ట, ఉప్పుగూడా, గౌలిపురా, అలియబాద్, ఛత్రినాక ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ సూచించింది. చదవండి: (కాంగ్రెస్‌లోకి చేరికల తుపాన్ రాబోతోంది: రేవంత్‌రెడ్డి) -
విజయ కీర్తి
విజయసోపానాలు అధిరోహించడానికి ఏం చేయాలా?! అని సుదీర్ఘ ఆలోచనలు చేయనక్కర్లేదు అనిపిస్తుంది కీర్తి ప్రియను కలిశాక. తెలంగాణలోని సూర్యాపేట వాసి అయిన కీర్తిప్రియ కోల్‌కతాలోని ఐఐఎమ్ నుంచి ఎంబీయే పూర్తి చేసింది. తల్లి తన కోసం పంపే ఎండు కూరగాయల ముక్కలు రోజువారి వంటను ఎంత సులువు చేస్తాయో చూసింది. తన కళ్లముందు వ్యవసాయ పంట వృథా అవడం చూసి తట్టుకోలేకపోయింది. ఫలితంగా తల్లి తన కోసం చేసిన పని నుంచి తీసుకున్న ఆలోచనతో ఓ ఆహార పరిశ్రమనే నెలకొల్పింది. స్థానిక మహిళలకు ఉపాధి అవకాశాలనూ కల్పిస్తోంది. తన వ్యాపారంలో తల్లి విజయలక్ష్మిని కూడా భాగస్వామిని చేసిన కీర్తి విజయం గురించి ఆమె మాటల్లోనే.. ‘‘ఈ రెడీ టు ఈట్, రెడీ టు కుక్ కాన్సెప్ట్‌కు ముందు చదువు, ఉద్యోగరీత్యా బెంగళూరులో ఉన్నప్పుడు మా అమ్మ నాకు వంట ఈజీగా అవడం కోసం ఎండబెట్టిన కూరగాయల ముక్కలను ప్యాక్ చేసి, నాకు పంపేది. వాటిలో టొమాటోలు, బెండ, క్యాబేజీ, గోంగూర, బచ్చలికూర, మామిడికాయ... ఇలా రకరకాల ఎండు కూరగాయల ముక్కలు ఉండేవి. వీటితో వంట చేసుకోవడం నాకు చాలా ఈజీ అయ్యేది. ఈ సాధారణ ఆలోచన నాకు తెలియకుండానే నా మనసులో అలాగే ఉండిపోయింది. వృథాను అరికట్టవచ్చు సూర్యాపేటలోని తొండా గ్రామం మాది. ఒకసారి రైతు పండించిన పంటకు సరైన గిట్టుబాటు ధర రాక, ఆ పంటను పొలంలోనే వదిలేశారు. ఇది చూసి చాలా బాధేసింది. చదువు తర్వాత సొంతంగా వ్యాపారం మొదలుపెట్టాలన్న ఆలోచనకు నా బాధ నుంచే ఓ పరిష్కారం కనుక్కోవచ్చు అనిపించింది. అమ్మ తయారు చేసే ఎండు కూరగాయల కాన్సెప్ట్నే నా బిజినెస్‌కు సరైన ఆలోచన అనుకున్నాను. ఆ విధంగా వ్యవసాయదారుల పంట వృథా కాకుండా కాపాడవచ్చు అనిపించింది. ఈ ఆలోచనను ఇంట్లోవాళ్లతో పంచుకున్నాను. అంతే, రెడీ టు ఈట్, రెడీ టు కుక్ కాన్సెప్ట్ సిద్ధమైపోయింది. కుటుంబ మద్దతు మా నాన్న పోలీస్ విభాగంలో వర్క్ చేస్తారు. అమ్మ గృహిణి. ముగ్గురు అమ్మాయిల్లో నేను రెండవదాన్ని. నా ఆలోచనకు ఇంట్లో అందరూ పూర్తి మద్దతు ఇచ్చారు. దీనికి ముందు చేసిన స్టార్టప్స్, టీమ్ వర్క్ .. గురించి అమ్మానాన్నలకు తెలుసు కాబట్టి ప్రోత్సహిస్తూనే ఉంటారు. కాకపోతే అమ్మాయిని కాబట్టి ఊళ్లో కొంచెం వింతగా చూస్తుంటారు. వృద్ధిలోకి తీసుకు వస్తూ.. సాధారణంగా తెలంగాణలో ఎక్కువగా పత్తి పంట వేస్తుంటారు. మా చుట్టుపక్కల రైతులతో మాట్లాడి, క్రాప్ పంటలపై దృష్టి పెట్టేలా చేశాను. రసాయనాలు వాడకుండా కూరగాయల సాగు గురించి చర్చించాను. అలా సేకరించిన కూరగాయలను మెషిన్స్ ద్వారా శుభ్రం చేసి, డీ హైడ్రేట్ చేస్తాం. వీటిలో ఆకుకూరలు, కాకర, బెండ, క్యాబేజీ.. వంటివి ఉన్నాయి. వీటితోపాటు పండ్లను కూడా ఎండబెడతాం. రకరకాల పొడులు తయారు చేస్తాం. మూడేళ్ల క్రితం ఈ తరహా బిజినెస్ ప్లానింగ్ మొదలైంది. మొదట్లో నాలుగు లక్షల ప్రారంభ పెట్టుబడితో ప్రారంభించిన ఈ పరిశ్రమ ఇప్పుడు రెండున్నర కోట్లకు చేరింది. వ్యాపారానికి అనువుగా మెల్లమెల్లగా మెషినరీని పెంచుకుంటూ, వెళుతున్నాం. మార్కెట్‌ను బట్టి యూనిట్ విస్తరణ కూడా ఉంటోంది. రెడీ టు ఈట్, రెడీ టు కుక్ కాన్సెప్ట్‌తో ఈ ఐడియాను అభివృద్ధి చేస్తున్నాం. వీటితో పాటు సూప్ మిక్స్‌లు, జ్యూస్ మిక్స్‌లు, కూరల్లో వేసే పొడులు మా తయారీలో ఉన్నాయి. ఏ పని చేయాలన్నా ముందు దాని మీద పూర్తి అవగాహన ఉండాలి. దీంతోపాటు తమ మీద తమకు కాన్ఫిడెన్స్ ఉండాలి. మనకు ఓ ఆలోచన వచ్చినప్పుడు, దానిని అమలులో పెట్టేటప్పుడు చాలామంది కిందకు లాగాలని చూస్తుంటారు. కానీ, మనకు దూరదృష్టి ఉండి, క్లారిటీగా పనులు చేసుకుంటూ వెళితే తిరుగుండదు. మన ఆలోచనని అమలులో పెట్టేటప్పుడు కూడా మార్కెట్‌కు తగినట్టు మనల్ని మనం మార్చుకుంటూ ఉండాలి’’ అని వివరిస్తుంది కీర్తిప్రియ. – నిర్మలారెడ్డి -
5, 6, 7 తేదీల్లో ఏఐటీయూసీ జాతీయ జనరల్ కౌన్సిల్ సమావేశాలు
హిమాయత్‌నగర్: ఏఐటీయూసీ జాతీయ జనరల్ కౌన్సిల్ సమావేశా లను ఈనెల 5, 6, 7 తేదీల్లో నగరంలో నిర్వహించనున్నట్లు ఏఐటీయూసీ జాతీయ కార్యదర్శి డాక్టర్ బి.వి.విజయ లక్ష్మి, రాష్ట్ర అధ్యక్షుడు ఎస్.బాలరాజ్, వర్కింగ్ ప్రెసిడెంట్. ఎం.డి.యూసుఫ్ వెల్లడించారు. గురువారం ఏఐటీయూసీ భవన్లో వారు మాట్లాడుతూ.. 3 రోజుల పాటు జాతీయ జనరల్ కౌన్సిల్ సమావేశాలు కాచిగూడలోని మహారాజ క్లాసిక్ ఇన్ (ఓయో) హోటల్లో జరగనున్నట్టు వారు పేర్కొన్నారు. 5వ తేదీన ఉదయం 10 గంటలకు ఏఐటీయూసీ జాతీయ జనరల్ కౌన్సిల్ సమావేశాలు ప్రారంభ మవుతాయని, 6వ తేదీన ఉదయం 11 గంటలకు ఆన్లైన్ బహిరంగసభ జరుగుతుందన్నారు. సమావేశాలలో ఏఐటీయూసీ జాతీయ అధ్యక్షుడు రామేంద్రకుమార్, ప్రధాన కార్యదర్శి అమర్ జీత్ కౌర్, వర్కింగ్ ప్రెసిడెంట్ హెచ్.మహదేవన్ తదితరులు పాల్గొంటారని తెలిపారు. -
ఏపీ హస్తకళ అభివృద్ధి సంస్థ చైర్మన్‌గా బి.విజయలక్ష్మి ప్రమాణస్వీకారం
అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ హస్తకళ అభివృద్ధి సంస్థ చైర్మన్‌గా బి.విజయలక్ష్మి బుధవారం ప్రమాణస్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సీఎం జగన్ రాష్ట్రంలో మహిళలకు పెద్దపీట వేశారని కొనియాడారు. రాష్ట్రంలో హస్తకళల అభివృద్ధికి తన వంతు కృషిచేస్తానని హామీ ఇచ్చారు. హస్తకళలు భారత దేశానికి వెన్నెముక లాంటిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు సుధీర్‌రెడ్డి, రవీంద్రనాథ్, వ్యవసాయశాఖ సలహాదారుడు అంబటి కృష్ణారెడ్డి పాల్గొన్నారు. -
కొడుక్కి ముద్దిచ్చిన నటి, ఇదేం బాగోలేదంటున్న నెటిజన్లు
Actress Vijayalakshmi: తమిళ దర్శకుడు అగత్యన్ రెండో కుమార్తె, నటి విజయలక్ష్మి తాజాగా సోషల్ మీడియాలో తన కొడుకుతో కలిసి దిగిన ఫొటోను షేర్ చేసింది. దీనికి "మమ్మీ... ఐ లవ్ యూ.. అతి పెద్ద గ్రహమైన బృహస్పతి కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నా.." అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఇందులో ఆమె తన కొడుక్కి ప్రేమగా ముద్దు పెట్టింది. అయితే ఆమె తన కొడుకు పెదాల మీద ముద్దివ్వడం నెటిజన్లకు పెద్దగా నచ్చినట్లు లేదు. దీంతో కొందరు ఆమెకు వ్యక్తిగతంగా మెసేజ్‌లు పెడుతున్నారట. నీ పద్ధతేమీ బాగోలేదని విమర్శిస్తూ, చీదరించుకుంటూ చీవాట్లు పెడుతున్నారట. దీంతో ఆమె ఈ ట్రోలింగ్‌కు ఘాటుగా బదులిచ్చింది. 'దీని వెనకాల కూడా ఏమైనా సిద్ధాంతాలుంటాయా? ఈ ఫొటో చూడగానే చెడిపోతారా? ఆపండెహె' అంటూ ట్వీట్ చేసింది. ఆమె అభిమానులు మాత్రం తల్లీకొడుకుల ఫొటో భలే ముద్దొస్తుంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా విజయలక్ష్మి 'చెన్నై 600028' సినిమాతో పాటు దీనికి సీక్వెల్‌గా వచ్చిన 'అంజాతే'లోనూ సహజ నటనతో మెప్పించింది. తను ఎంతగానో ప్రేమిస్తున్న ఫిల్మ్ మేకర్ ఫిరోజ్‌ను పెళ్లాడిన విజయలక్ష్మి వైవాహిక జీవితాన్ని ఆనందంగా కొనసాగిస్తోంది. ఈ దంపతులకు నాలుగేళ్ల కొడుకున్నాడు. Mummay… I love you .. bigger than Jupiter!! pic.twitter.com/KoB74QB5Mn — Vijayalakshmi A (@vgyalakshmi) July 7, 2021 -
వీరప్పన్ కూతురు కథానాయికగా తెరంగేట్రం
చెన్నై: గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తమిళనాడు, కర్ణాటక ప్రభుత్వాలను గడగడలాడించిన వీరప్పన్‌ను ఎట్టకేలకు 2004లో తమిళనాడు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ అధికారులు కాల్చి చంపిన విషయం తెలిసిందే. గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ గురించి ఇప్పటికే పలు భాషల్లో చిత్రాలు రూపొందాయి. కాగా వీరప్పన్‌కు ఇద్దరు కూతుర్లు ఉన్నారు. వారిలో పెద్ద కూతురు విద్యారాణి ఇటీవలే బీజేపీ పార్టీలో చేరారు. ఇక రెండవ కూతురు విజయలక్ష్మి తమిళ్వురిమై పార్టీలో చేరారు. ఇప్పుడు ఆమె సినీ రంగ ప్రవేశం చేసి కథానాయికగా అవతారమెత్తారు. విజయలక్ష్మి కథానాయికగా నటిస్తున్న చిత్రానికి మావీరన్ పిళ్లై అనే టైటిల్‌ని నిర్ణయించారు. కేఎన్ఆర్ మూవీస్ పతాకంపై కేఎన్ఆర్. రాజ్శ్రీ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దీనికి రవివర్మ సంగీతాన్ని, మంజునాథ్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. ఈ చిత్ర ఫస్ట్‌లుక్ శుక్రవారం విడుదల చేశారు. విశేషమేమిటంటే మావీరన్ పిళ్లై చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్లో విజయలక్ష్మి తండ్రి వీరప్పన్ గెటప్‌లో భుజాన తుపాకీ పట్టుకొని నిలబడ్డారు. దీంతో ఈ చిత్రం కూడా గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే కథ అని తెలుస్తోంది. ఈ చిత్రంతో వీరప్పన్ వారసురాలు సినీరంగంలో ఎలాంటి పేరును సంపాదించుకుంటారో చూడాలంటే మరి కొద్ది రోజులు ఆగాల్సిందే. చదవండి: మలైకాకు కోవిడ్ వ్యాక్సిన్ -
నటి ఆత్మహత్యాయత్నం: ఇది డ్రామా కాదు
-
నేను నిజంగానే చావాలనుకున్నాను
సోషల్ మీడియాలో తనపై ట్రోలింగ్ జరుగుతుండటంతో మనస్తాపం చెందిన తమిళ నటి విజయలక్ష్మి ఆదివారం ఆత్మహత్యాయత్నం చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమె చెన్నైలోని ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. అయితే తను చావును కోరుకోడానికి కారణం నామ్ తమిళర్ కచ్చి పార్టీ నాయకుడు సీమన్, పనంకట్టు పాడై పార్టీకి చెంది హరి నాదర్ అని అంతకు ముందు వీడియోలో పేర్కొన్నారు. అయితే ఆమె బలవన్మరణానికి పాల్పడటం కూడా డ్రామానే అంటూ కొందరు కించపరిచేలా మాట్లాడుతున్నారు. వీటికి సమాధానంగా ఆమె ఆస్పత్రి నుంచే ఓ వీడియోను పోస్టు చేశారు. (బీపీ మాత్రలు మింగిన నటి, పరిస్థితి విషమం!) "ప్రస్తుతం నేను బాగానే ఉన్నాను. మీ ప్రేమాభిమానాల వల్ల క్షేమంగా ఉన్నాను. కానీ నేను చనిపోతుంటే కూడా రాజకీయం చేస్తున్నారు. సీమాన్ లాంటివాళ్లు ఇలాంటి పనులు ఎలా చేస్తారో నాకర్థం కావడం లేదు. కానీ నేను నిజంగానే చావాలనుకున్నాను. ఇందులో డ్రామా ఏం లేదు. నా బీపీ, హృదయ స్పందన రేటు కూడా ఇంకా సాధారణ స్థితికి రాలేదు. ఇంకా నేను పోరాడుతూనే ఉన్నాను. నేనెవరి కోసమో ఆత్మహత్యాయత్నం అంటూ డ్రామా చేయలేదు. కేవలం సీమాన్ వల్లే ఆస్పత్రిపాలయ్యాను. అతను మనిషా లేక జంతువా నాకైతే అర్థం కావట్లేదు. దయచేసి నేను ఫలానా పార్టీ బంటును అని వాగడం మానేయండి. దీన్ని రాజకీయం చేయకండి, నేనేం అంతలా దిగజారిపోలేదు. ఇప్పటికే ఎంతో భరించాను. దయచేసి ఇంకా చెడుగా మాట్లాడుతూ వేధించకండి" అని కోరారు. కాగా విజయలక్ష్మి తెలుగులో "హనుమాన్ జంక్షన్" సినిమాలో నటించారు. పలు తమిళ, కన్నడ సినిమాల్లోనూ హీరోయిన్గా కనిపించారు. (చావు నుంచి కాపాడినందుకు థ్యాంక్స్) -
ఇంటర్ చదవడం ఇష్టం లేక..
కర్నూలు,మద్దికెర : ఇంటర్ చదవడం ఇష్టం లేక ఓ బాలిక బలవన్మరణానికి పాల్పడింది. మండల పరిధిలోని ఎం.అగ్రహారం గ్రామంలో శుక్రవారం ఈ సంఘటన జరిగింది. మృతురాలు విజయలక్ష్మి (16) ఎం. అగ్రహారం గ్రామంలోని అవ్వాతాతల వద్ద ఉండి చదువుకుంటుంది. తల్లిదండ్రులు నాగవేణి, శంకర్ హైదరాబాద్‌లో ఉంటారు. ఈ ఏడాది పదవతరగతి పూర్తికావడంతో ఇంటర్‌కు దరఖాస్తు చేసుకోవాలని కుమార్తెకు చెప్పారు. ఉన్నత విద్య అభ్యసించడం ఇష్టం లేని ఆ బాలిక శుక్రవారం ఇంట్లో ఉరి వేసుకుంది. గమనించిన కుటుంబసభ్యులు వైద్య చికిత్స కోసం ఆసుపత్రికి తరలించేలోపు మృతిచెందింది. ఈమేరకు తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తుచేస్తున్నట్లు మద్దికెర పోలీసులు తెలిపారు. -
టిక్‌టాక్‌లో చూసి శివకుమార్ ఫిదా.. కానీ,
బెంగళూరు : టిక్‌టాక్ ద్వారా పరిచయమైన యువతికి ఓ యువకుడు రూ. లక్షలు ఇచ్చి మోసపోయిన ఘటన బెంగళూరులో జరిగింది. నగరానికి చెందిన శివకుమార్‌కు టిక్‌టాక్ ద్వారా విజయలక్ష్మీ అనే మహిళ పరిచయం అయింది. దీంతో శివకుమార్ ఫిదా అయ్యారు. ఆమె మొబైల్ నంబర్ తీసుకుని ఫేస్బుక్ ఖాతా ద్వారా చాటింగ్ చేయడం మొదలుపెట్టాడు. వీరి స్నేహం ప్రేమగా మారింది. కొద్ది రోజుల పాటు ఇద్దరు ఒకే ఇంటిలో సహ జీవనం కూడా మొదలుపెట్టారు. పెళ్లి చేసుకుంటానంటూ నమ్మించి శివకుమార్ దగ్గర రూ. లక్షలు డబ్బులను తీసుకుని విజయలక్ష్మీ పరారైంది. తీసుకున్న డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేయడంతో హత్య చేస్తానంటూ బెదిరించినట్లు శివకుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. డీజీహళ్లి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. పట్టుబడ్డ బిల్డప్ బాబాయ్! ఐఏఎస్ అధికారి అని చెప్పుకుంటూ తిరుగుతున్న వ్యక్తిని తహసీల్దార్ సమయస్పూర్తితో పట్టించిన సంఘటన చెన్నపట్టణలో చోటుచేసుకుంది. మహమ్మద్ సల్మాన్ (37) అరెస్టయిన నకిలీ ఐఏఎస్ అధికారి. నిందితుడు ఇన్నోవా కారుపై కర్ణాటక సర్కార అని రాసుకుని ఇద్దరు గన్మ్యాన్లను వెంటబెట్టుకుని తిరుగుతూ తాలూకాలకు వెళ్లి ప్రభుత్వ అధికారుల చేత పనులు చేయించుకోవడంతోపాటు రాజభోగాలు అనుభవించేవాడు. శుక్రవారం సాయంత్రం మహ్మద్ సల్మాన్ చెన్నపట్టణ ప్రభుత్వ అతిథిగృహంలో ఐఏఎస్ అధికారి హోదాలో దిగాడు. ఈ విషయం కాస్త తహసీల్దార్ సుదర్శన్ చెవిన పడింది. దీంతో హుటాహుటిన ఒక బొకే తీసుకుని స్వాగతిద్దామని బయలుదేరి వెళ్లారు. ఈ క్రమంలో తహసీల్దార్ సుదర్శన్ రెవెన్యూశాఖకు సంబంధించి మాట్లాడుతూ కొన్ని ప్రశ్నలు వేయగా మహ్మద్ సల్మాన్ తడబడ్డాడు. దొరికిపోతాననే భయంతో గన్మ్యాన్లతో కలిసి పరారవుతుండగా వారిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. సల్మాన్ రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ఇదేవిధంగా ఐఏఎస్ అధికారినని చెప్పుకుని తిరుగుతూ ప్రభుత్వ అధికారులతో పనులు చేయించుకునేవాడని పోలీసుల విచారణలో తేలింది. సల్మాన్‌తోపాటు ఇద్దరు గన్మ్యాన్లను అరెస్టు చేసిన పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. -
కోర్టులో లొంగిపోయిన కోడెల కుమార్తె
సాక్షి, గుంటూరు : ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కుమార్తె విజయలక్ష్మి గురువారం కోర్టులో లొంగిపోయారు. ఉద్యోగాల పేరుతో రూ. లక్షలు దండుకుని అమాయకపు ప్రజలను మోసం చేసిన కేసుకు సంబంధించి ఆమె కోర్టు ముందు హాజరయ్యారు. అయితే ప్రస్తుతానికి ఆమెకు రెండు కేసుల్లో బెయిల్ మంజూరు అయింది. ప్రతి ఆదివారం వన్‌టౌన్, టూటౌన్ స్టేషన్లలో సంతకం చేయాలని.. 1వ అదనపు జిల్లా మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టు విజయలక్ష్మికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. కాగా, తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని విజయలక్ష్మి పలు అక్రమాలకు పాల్పడ్డారని ఆమెపై ఆరోపణలు ఉన్నాయి. ఇందుకు సంబంధించి ఆమెపై పదుల సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. -
కోడెల తనయుడి షోరూంలో అసెంబ్లీ ఫర్నిచర్
సాక్షి, గుంటూరు: మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు స్వాధీనంలో ఉన్న అసెంబ్లీ ఫర్నిచర్‌ను అతని తనయుడికి చెందిన షోరూమ్‌లో గుర్తించారు. అసెంబ్లీ అసిస్టెంట్ సెక్రటరీ కె.రాజ్‌కుమార్, తహసీల్దార్ తాతా మోహన్‌రావు తదితరులు శుక్రవారం గుంటూరులోని గౌతమ్ హీరో షోరూమ్‌లో తనిఖీలు నిర్వహించారు. మొదటి అంతస్తులో 10 బర్మా టేకు కుర్చీలను, రెండు, మూడో అంతస్తుల్లో యూరప్ నుంచి దిగుమతి చేసుకున్న 22 కుర్చీలు, నాలుగు సోఫాలు, డైనింగ్ టేబుల్, టీపాయ్, దర్బార్ కుర్చీ, కంప్యూటర్లు, ఏసీలు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను గుర్తించారు. 22 యూరప్ కుర్చీలు, డైనింగ్ టేబుల్ విలువ రూ.65 లక్షలు పైమాటేనని తెలుస్తోంది. అసెంబ్లీ అధికారుల బృందం వస్తున్నట్టు తెలియడంతో కోడెల తనయుడు శివరామ్ రవాణా శాఖ అధికారుల అధీనంలో ఉన్న తన షోరూమ్ తాళాలను తీసుకోలేదు. షోరూమ్ తాళాలను అప్పగించేందుకు డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఉదయం నుంచీ ఫోన్ చేస్తున్నా మేనేజర్ అందుబాటులోకి రాలేదు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో మేనేజర్ తాళాలు తీసుకుని షోరూమ్ తెరిచారు. పైఅంతస్తుల్లోకి అధికారులు తనిఖీకి వెళ్లే సమయంలో కోడెల తన లాయర్‌ను పంపి అడ్డుకున్నారు. సెర్చ్ వారెంట్ లేకుండా తనిఖీ చేయడానికి వచ్చారంటూ సుమారు గంటపాటు కోడెల తరఫు న్యాయవాది టి.చిరంజీవి అధికారుల్ని అడ్డుకుని వాదనకు దిగారు. ఎట్టకేలకు పైఅంతస్తుల్లో తనిఖీ చేసిన అధికారులు పాత అసెంబ్లీ ఫర్నిచర్ మొత్తం అక్కడ ఉందని చెప్పారు. ఇదిలావుంటే.. సత్తెనపల్లిలోని కోడెల కార్యాలయంలో రెండు కంప్యూటర్లను దొంగలు ఎత్తుకెళ్లారని పుకారు పుట్టించారు. నిన్న మొన్నటి వరకు కోడెల కార్యాలయంలో పనిచేసిన మున్సిపల్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగి ఆకురాతి మల్లికార్జునరావు (అర్జునుడు) వాటిని దొంగిలించాడని కట్టుకథ అల్లారు. చోరీ జరిగినట్లు సత్తెనపల్లి పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. శుక్రవారం ఉదయం కోడెల కార్యాలయం వెనుక ఎవరో ఓ కంప్యూటర్ పడేశారని అదే వ్యక్తి పట్టుకొచ్చాడు. చోరీకి గురైనట్టు చెబుతున్న కంప్యూటర్ల లో కోడెల కే–ట్యాక్స్ వ్యవహారాలు, ఇతర బాగోతాలకు సంబంధించిన డేటా ఉందనే ప్రచారం సాగుతోంది. 30 ల్యాప్‌టాప్‌లు పట్టుకెళ్లారు! ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు తనయుడు కోడెల శివరామ్ ఆదేశాల మేరకు కొందరు వ్యక్తులు 30 ల్యాప్‌టాప్‌లు, ప్రింటర్ తీసుకెళ్లారని నైపుణ్యాభివృద్ధి సంస్థ జిల్లా అధికారి షేక్ బాజీబాబు సత్తెనపల్లి పట్టణ పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం ఫిర్యాదుచేశారు. గ్రామీణ ప్రాంత యువతలో నైపుణ్యాలు అభివృద్ధి చేసేందుకు జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో 2017లో సత్తెనపల్లిలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్‌ను ప్రారంభించాలని నిర్ణయించారు. ఈ మేరకు అప్పటి నైపుణ్యాభివృద్ధి సంస్థ జిల్లా అధికారి అజేష్‌చౌదరి ఆదేశాల మేరకు 30 ల్యాప్‌టాప్‌లు, ఒక ప్రింటర్(ఇన్ఫ్రాస్ట్రక్చర్)ను సత్తెనపల్లి తీసుకొచ్చి ఎన్ఎస్పీ బంగ్లాలో భద్రపరిచారు. పర్యవేక్షణ బాధ్యతలను ఎన్ఎస్పీ ఏఈగా ఉన్న ఏసమ్మకు అప్పగించారు. 2018లో కోడెల శివరామ్.. ల్యాప్‌టాప్‌లను, ప్రింటర్‌ను తమ వారికి అందించాలని అజేష్‌చౌదరికి సూచించగా, ఆయన ఆదేశాలతో శివరామ్ అనుచరులకు ఏసమ్మ అప్పగించినట్టు బాజీబాబు చెప్పారు. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను కోడెల కుమారుడు శివరామ్ అధికార బలంతో కాజేశారనే ఆరోపణలపై స్థానిక ఎమ్మెల్యే అంబటి రాంబాబు నైపుణ్యాభివృద్ధి సంస్థ ఉన్నతాధికారులకు ఇటీవల ఫిర్యాదు చేశారు. సంస్థ ఎండీ ఐఆర్టీఎస్ అధికారి ఆర్జా శ్రీకాంత్ ఆదేశాల మేరకు బాజీబాబు 16న సత్తెనపల్లి వచ్చి విచారణ చేసి నివేదికను ఉన్నతాధికారులకు అందించారు. వారి ఆదేశాల మేరకు బాజీబాబు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కోడెలకు అస్వస్థత టీడీపీ సీనియర్ నేత, మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు శుక్రవారం రాత్రి అస్వస్థతకు గురయ్యారు. ఆయనను గుంటూరు నగరం మూడు వంతెనల రోడ్డులోని శనక్కాయల ఫ్యాక్టరీ పక్కన ఉన్న కోడెల కుమార్తె విజయలక్ష్మీకి చెందిన శ్రీలక్ష్మీ మల్టీస్పెషాలిటీ ఆస్పత్రిలో చేర్పించారు. వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు. -
అయోమయ స్థితిలో కోడెల కుటుంబం
సాక్షి, గుంటూరు: నాడు కప్పం కట్టాల్సిందే అని గద్దించిన నోర్లు నేడు మూగబోయాయి.. ఓ వైపు అంతటా చుక్కెదురు.. మరోవైపు సొంతపార్టీలో, ఉన్న ఊర్లో అంతటా విముఖత.. వెరసి శాసన సభ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కుటుంబం పరిస్థితి అయోమయంగా మారింది. ఐదేళ్లలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్‌రావు కుమారుడు శివరామ్, కుమార్తె పూనాటి విజయలక్ష్మి సత్తెనపల్లి, నరసరావుపేట నియోజకవర్గాల్లో కే–ట్యాక్స్ పేరుతో తోపుడు బండిపై వ్యాపారం చేసుకునే వ్యక్తి నుంచి బడా కాంట్రాక్టర్ వరకూ ప్రతి ఒక్కరి నుంచి పన్నులు వసూలు చేశారనే ఆరోపణలున్నాయి. వారి వసూళ్ల గురించి నరసరావుపేట, సత్తెనపల్లి నియోజకవర్గాల్లో వరుసగా కేసులు నమోదవుతున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకూ కోడెల శివప్రసాద్‌రావుపై రెండు, శివరామ్‌పై 9, విజయలక్ష్మిపై 7 కేసులు నమోదయ్యాయి. తనపై నమోదైన కేసుల్లో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని విజయలక్ష్మి హైకోర్టును ఆశ్రయించగా చుక్కెదురైంది. కోడెల శివరామ్ బెయిల్ పిటిషన్ హైకోర్టు ముందు ఉంది. తమ నుంచి ఇబ్బందులు ఎదుర్కొన్న వారందరూ వరుసగా పోలీస్‌లను ఆశ్రయిస్తుండటం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, చీటింగ్ కేసులు నమోదవుతుండటంతో కోడెల కుటుంబానికి అరెస్ట్‌ల భయం పట్టుకుంది. కోర్టులు సైతం ముందస్తు బెయిల్ మంజూరుకు నిరాకరిస్తుండటంతో వారు రాజీకి సిద్ధమవుతున్నారు. తీసుకున్న డబ్బు తిరిగి ఇస్తాం రాజీకి రావాలంటూ రాయబారాలు పంపుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే సత్తెనపల్లి నియోజకవర్గంలో నమోదైన ఓ కేసులో బాధితునికి రూ.35లక్షల మేర డబ్బు వెనక్కు ఇచ్చి రాజీ ప్రయత్నాలు చేశారు. అయితే ఆ ప్రయత్నాలు ఫలించలేదని సమాచారం. ఇదే తరహాలో తక్కిన బాధితుల వద్దకు రాయబారులను పంపి రాజీకి రావాలని, కావాలంటే నష్టపోయిన దానికి రెట్టింపు మొత్తాన్ని చెల్లిస్తామని కూడా బతిమాలుతున్నారని తెలుస్తోంది. కాగా ఇప్పటి వరకూ కోడెల కుటుంబంపై ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ, చీటింగ్ సహా 18 కేసులు నమోదయ్యాయి. ఆయా కేసుల్లో నిందితులుగా ఉన్న కోడెల, ఆయన కుమారుడు, కుమార్తె, అనుచరులను అరెస్ట్ చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. -
హైకోర్టులో కోడెల కుమార్తెకు చుక్కెదురు
సాక్షి, అమరావతి: టీడీపీ సీనియర్ నేత, ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కుమార్తెకు హైకోర్టులో చుక్కెదురు అయింది. ముందస్తు బెయిల్ కోసం కోడెల కుమార్తె విజయలక్ష్మి దాఖలు చేసిన నాలుగు పిటిషన్లను న్యాయస్థానం తిరస్కరించింది. గుంటూరు జిల్లా నరసరావుపేట టౌన్, రూరల్ పోలీస్ స్టేషన్లలో నమోదైన నాలుగు కేసులు అక్రమమంటూ, వాటిని కొట్టేయాలంటూ ఆమె న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన న్యాయమూర్తి డీవీవీ సోమయాజులు ముందస్తు బెయిల్ అభ్యర్థనను తోసిపుచ్చారు. కాగా కే ట్యాక్స్ పేరుతో కోడెల కుమారుడు, కుమార్తె భూ దందాలు, సెటిల్మెంట్లు, బెదిరింపులు, కే ట్యాక్స్ వసూలు వంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. -
టీడీపీ నేతలు ‘గడ్డి’ని కూడా వదల్లేదు..
సాక్షి, అమరావతి: పశువుల మందుల సరఫరాలో అక్రమాలపై పశు సంవర్థకశాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ విచారణకు ఆదేశించారు. ఈ సందర్భంగా మంత్రి మోపిదేవి మాట్లాడుతూ... ’టీడీపీ నేతలు దేనిని వదలకుండా అవినీతికి పాల్పడ్డారు. పశువులకు సరఫరా చేసే గడ్డిని కూడా వదలకుండా దోచుకున్నారు. టీడీపీ నేతలు, ఎమ్మెల్యేలు పశువుల మందులు, గడ్డిలోనూ అవినీతికి పాల్పడటం సిగ్గుచేటు మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ కుమార్తె విజయలక్ష్మి, కుమారుడు శివరామ్ కంపెనీల పేరుతో అవినీతికి పాల్పడ్డారు. అయిదు కంపెనీల కోసం అక్రమంగా టెండర్ల నిబంధనలు మార్చేసి అవినీతికి పాల్పడ్డారు. రూ.4.5కోట్ల వరకూ వాళ్లకి చెల్లించాల్సిన బిల్లులను నిలిపివేయాలని ఆదేశించాను. అయిదేళ్లలో జరిగిన అవినీతిని వెలికి తీస్తాం. ఇప్పుడు పూర్తి పారదర్శకంగా టెండర్లు పిలుస్తాం.’ అని తెలిపారు. -
కోడెల కుమార్తెపై ఉన్న కేసుల వివరాలివ్వండి
సాక్షి, అమరావతి: భూ దందాలు, సెటిల్మెంట్లు, బెదిరింపులు, కే ట్యాక్స్ వసూలు వంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కుమార్తె విజయలక్ష్మిపై నమోదైన 15 కేసుల వివరాలను లిఖితపూర్వకంగా తమ ముందుంచాలని పోలీసులను ఏపీ హైకోర్టు ఆదేశించింది. విజయలక్ష్మి అరెస్టుపై సోమవారం తగిన నిర్ణయం వెలువరిస్తామని న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు శుక్రవారం పేర్కొన్నారు. ఓ భూమి కొనుగోలు వివాదంలో గుంటూరు పోలీసులు తనపై నమోదు చేసిన ఎస్సీ, ఎస్టీ కేసును కొట్టేయడంతో పాటు తనను అరెస్ట్ చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలంటూ విజయలక్ష్మి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై శుక్రవారం జస్టిస్ సోమయాజులు విచారణ జరిపారు. పిటిషనర్ తరఫు న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపిస్తూ..ఎప్పుడో 2014లో ఘటన జరిగిందంటూ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఇప్పుడు కేసు నమోదు చేశారని తెలిపారు. ఎవరి వద్ద నుంచో ఆస్తి కొనుగోలు చేస్తే, ఆ ఆస్తికి ఫిర్యాదుకూ సంబంధం లేకపోయినా పిటిషనర్‌పై ఫిర్యాదు చేశారని కోర్టుకు తెలిపారు. ఈ కేసులో పిటిషనర్‌ను అరెస్ట్ చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. -
భాస్కరభట్లకు మాతృవియోగం
రాజమహేంద్రవరం : ప్రముఖ సినీ గేయ రచయిత భాస్కరభట్ల రవికుమార్ తల్లి విజయలక్ష్మి (67) తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం రాత్రి కన్ను మూశారు. ఆమెకు ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. భాస్కరభట్ల పెద్ద కుమారుడు. విజయలక్ష్మి అంత్యక్రియలు స్థానిక ఇన్నీసుపేట కైలాసభూమిలో మంగళవారం జరిగాయి. ఆమె చితికి భాస్కరభట్ల నిప్పంటించారు. పలువురు సినీ ప్రముఖులు, సాహితీకారులు భాస్కరభట్లకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు. -
రూ.కోట్లు మింగిన కోడెల కుటుంబం
సాక్షి, అమరావతి: ఏదైనా ఒక వస్తువును ఉత్పత్తి చేయాలంటే దానికి తగిన యంత్రాలు అవసరమని ఏ చిన్నపిల్లాడిని అడిగినా చెబుతాడు. కానీ, ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కుమార్తె విజయలక్ష్మి, కుమారుడు శివరాం యంత్రాలే లేకుండా కంపెనీని సృష్టించారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రూ.కోట్ల విలువైన ఆర్డర్లు పొందారు. ఈ అవినీతి బాగోతం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఆసుపత్రుల్లో చికిత్సలకు ఉపయోగించే కాటన్, బ్యాండేజీలను తయారు చేసే కంపెనీ స్థాపించామంటూ నకిలీ డాక్యుమెంట్లతో లైసెన్సులు పొందారు. ఇందుకు అధికార బలాన్ని వాడుకున్నారు. తమిళనాడు నుంచి తీసుకొచ్చిన నాసిరకం కాటన్, బ్యాండేజీని ప్రభుత్వానికి సరఫరా చేసి, ఖజానా నుంచి భారీగా నిధులు మింగేశారు. స్మాల్ స్కేల్ యూనిట్ల(ఎస్ఎస్ఐ) పేరుతో రాష్ట్ర మౌలిక వైద్య సదుపాయాల సంస్థకు (ఏపీఎంఎస్ఐడీసీ) దరఖాస్తు చేసి, అధికార బలంతో ఆర్డర్లు తెచ్చుకున్నారు. రాష్ట్రంలో చిన్న పరిశ్రమలు నడుపుకుంటూ నాణ్యమైన కాటన్, బ్యాండేజీలు తయారు చేసే వారి నోట్లో మట్టి కొట్టారు. ‘సేఫ్’ యాజమాన్యానికి నోటీసులు ఔషధ నియంత్రణ అధికారులు రెండు రోజుల క్రితం కోడెల శివప్రసాదరావు కుటుంబానికి చెందిన ‘సేఫ్’ కంపెనీలో తనిఖీలు నిర్వహించారు. అక్కడ ఒక భవనం ఉంది గానీ అందులో ఎలాంటి యంత్రాలు లేవని నిర్ధారించారు. ఇదే అంశంపై ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. కోడెల కంపెనీ ఏం చేసిందంటే.. తమిళనాడులోని చెన్నై, కోయంబత్తూరు నుంచి నాసిరకం కాటన్, బ్యాండేజీలను తీసుకొచ్చింది. వాటిని తామే తయారు చేశామంటూ ‘సేఫ్’ కంపెనీ పేరిట లేబుళ్లు వేసి, ప్రభుత్వానికి అంటగట్టింది. తమకు కంపెనీ ఉన్నట్లు కోడెల కుటుంబం డ్రగ్ లైసెన్స్ కూడా తీసుకుంది. లేని కంపెనీకి లైసెన్సు ఎలా ఇచ్చారో అప్పటి అధికారులే చెప్పాలి. ఔషధ నియంత్రణ అధికారులు ఇచ్చిన నివేదికతో ‘సేఫ్’ కంపెనీని స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ జాబితా నుంచి తొలగించినట్టు ఏపీఎంఎస్ఐడీసీ అధికారులు తెలిపారు. ఆ కంపెనీకి ఇకపై ఆర్డర్లు ఇవ్వబోమని తేల్చిచెప్పారు. ‘సేఫ్’ యాజమాన్యానికి ఇప్పటికే ఔషధ నియంత్రణ శాఖ నోటీసులు జారీ చేసినట్టు తెలిసింది. గడ్డిలోనూ దిగమింగారు ఆరోగ్య శాఖలోనే కాదు పశు సంవర్థక శాఖలోనూ కోడెల తన కంపెనీ పేరుతో భారీగా దాణా కుంభకోణానికి పాల్పడ్డారు. ఎండు గడ్డి సరఫరా చేస్తామంటూ పశు సంవర్ధక శాఖ నుంచి ఆర్డర్ దక్కించుకున్నారు. కానీ, సరఫరా చేయకుండానే రూ.కోట్లు కొల్లగొట్టారు. డైరెక్టర్ స్థాయి అధికారులతో కుమ్మక్కై, పశువుల దాణా తినేశారు. గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలో ఓ లారీ గడ్డి సరఫరా చేశామంటూ లారీ నెంబరు ఇచ్చారు. విచిత్రం ఏమిటంటే ఆ లారీకి తగిలించిన నెంబరు ఓ ద్విచక్ర వాహనానిదిగా ఆర్టీఏ అధికారులు గుర్తించారు. అంతేకాదు ఫలానా రైతులకు గడ్డి సరఫరా చేశామంటూ వారి ఆధార్ నెంబర్లను కోడెల కంపెనీ సమర్పించింది. వాస్తవానికి వారెవరూ గడ్డిని తీసుకోలేదు. ఆధార్ డేటా నుంచి కొన్ని నెంబర్లు సేకరించి, ప్రభుత్వానికి సమర్పించినట్లు సమాచారం. పశువులకు కోడెల కంపెనీ సరఫరా చేసిన మందులు కూడా నాసిరకమైనవే. ఆ మందుల నాణ్యతను నిర్ధారించకుండా ఔషధ నియంత్రణ అధికారులను బెదిరించారు. పశు సంవర్థక శాఖలో కొందరు అధికారులు కోడెలకు సహకరించి, రూ.కోట్లు వెనకేసుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కోడెల, అతని కుమారుడిపై టీడీపీ నేత కేసు నరసరావుపేట : మాజీ స్పీకర్ కోడెల, అతని కుమారుడు శివరామ్‌పై మరో కేసు నమోదైంది. తనను అపహరించటంతో పాటు బెదిరించి కాంట్రాక్ట్‌లో పర్సంటేజ్, అక్రమ వసూళ్లకు వీరిద్దరూ పాల్పడ్డారని టీడీపీ నాయకుడు, కాంట్రాక్టర్ వడ్లమూడి శివరామయ్య శనివారం గుంటూరు జిల్లా నరసరావుపేట స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రొంపిచర్ల మండలం వడ్లమూడివారిపాలెం గ్రామానికి చెందిన వడ్లమూడి శివరామయ్య కాంట్రాక్ట్ పనులు చేస్తుంటాడు. ఆర్డబ్ల్యూఎస్ చెరువు మరమ్మతులకు సంబంధించి 2016లో రూ.30 లక్షల కాంట్రాక్ట్ పనిని దక్కించుకున్నాడు. విషయం తెలుసుకున్న కోడెల శివరామ్ పిలిచి బెదిరించటంతో చేయాల్సిన పనిలో పది శాతం రూ.3 లక్షలు పర్సంటేజ్ (కే ట్యాక్స్) చెల్లించాడు. ఇది సరిపోలేదంటూ ఇంకా చెల్లించాలని కోడెల శివరామ్ నుంచి పిలుపు వచ్చింది. శివరామయ్య వెళ్లకపోవటంతో శివరామ్ అనుచరులు గుత్తా నాగప్రసాద్, బద్దుల రాములు బలవంతంగా కారులో గుంటూరు హీరో షోరూమ్‌కు తీసుకెళ్లారు. అక్కడ బెదిరించి తాను అనారోగ్యంతో కాంట్రాక్ట్ పనులు చేయట్లేదంటూ సంతకాలు పెట్టించారని బాధితుడు తెలిపాడు. కాంట్రాక్ట్‌ను 6 నెలలపాటు బ్లాక్‌లిస్టులో చేర్చి కాంట్రాక్ట్‌ను బద్దుల రాములు దక్కించుకున్నాడని, దీంతో రూ.3 లక్షల నష్టం జరిగిందని శివరామయ్య ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీంతో పాటు మంచినీటి సరఫరా కాంట్రాక్ట్‌కు సంబంధించి మరో రూ.2 లక్షలు కోడెల శివరామ్ బెదిరించి తీసుకున్నాడని తెలిపారు. ఈ వ్యవహారంపై మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావును కలిసి చెప్పగా, నేనే అలా చేయమన్నానని కుమారుడికి వత్తాసు పలికాడన్నారు. తనకు న్యాయం చేయాలని పోలీసులను కోరారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ బిలాలుద్దీన్ తెలిపారు. -
కోడెల కుమార్తెపై మరో కేసు నమోదు
-
కోడెల కుమార్తె విజయలక్ష్మీపై మరో కేసు నమోదు
-
డాక్టర్‌ను మోసం చేసిన కోడెల కుమార్తె
సాక్షి, గుంటూరు : టీడీపీ సీనియర్ నేత, మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కుటుంబంపై ఫిర్యాదుల పరంపర కొనసాగుతోంది. ఇప్పటికే ఆయన కుమారుడు, కుమార్తెపై పలు కేసులు నమోదు అయిన విషయం తెలిసిందే. తాజాగా కోడెల కుమార్తె విజయలక్ష్మిపై చీటింగ్ కేసు నమోదు చేశారు పోలీసులు. ఆరోగ్యశ్రీ పర్మిషన్ పేరుతో తనను మోసం చేశారంటూ డాక్టర్ చక్రవర్తి బుధవారం సత్తెనపల్లి పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేశారు. డాక్టర్ చక్రవర్తికి చెందిన మేఘనా ఆస్పత్రికి ఆరోగ్యశ్రీ పథకాన్ని వర్తింప చేస్తామంటూ విజయలక్ష్మి నాలుగు లక్షలు వసూలు చేశారు. అయితే ఆరోగ్యశ్రీ వర్తింపచేయలేదు. తిరిగి డబ్బులు ఇవ్వాలని అడిగినా బెదిరింపులకు దిగారు. దీంతో విజయలక్ష్మితో పాటు బొమ్మిశెట్టి శ్రీను, పోట్ల ప్రసాదుపై పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. కాగా కోడెల శివప్రసాదరావు కుటుంబం అధికారం అండతో ఇన్నాళ్లూ సాగించిన దౌర్జన్యాలు, అరాచకాలు, అక్రమ వసూళ్లు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. తన కుటుంబంపై కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే తప్పుడు ఫిర్యాదులు చేస్తున్నారని, ఆధారాలు ఉంటే చూపించాలంటూ కోడెల సవాలు విసిరి రెండు రోజులు గడవకముందే రంజీ క్రికెట్ క్రీడాకారుడిపై దాడికి పాల్పడిన ఘటన చోటు చేసుకుంది. గుంటూరు రూరల్ ఎస్పీ జయలక్ష్మిని ఆదేశాలతో కోడెల శివప్రసాదరావుతోపాటు ఆయన కుమారుడు శివరాంపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. సత్తెనపల్లి, నరసరావుపేట నియోజకవర్గాల్లో తన కుమారుడు శివరాం, కుమార్తె విజయలక్ష్మి సాగించిన అరాచకాలు, అక్రమ వసూళ్లకు కోడెల శివప్రసాదరావు అండగా నిలిచినట్లు మరోమారు తేటతెల్లమైంది. కోడెల కుమారుడు, కుమార్తెపై గతంలో నమోదైన కేసుల్లో శివప్రసాదరావును సైతం నిందితుడిగానే చేర్చాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది. -
‘కోడెల ట్యాక్స్ పుట్ట బద్దలవుతోంది’
సాక్షి, అమరావతి : ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ‘కే ట్యాక్స్’ పుట్ట బద్దలవుతోందని వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయి రెడ్డి తెలిపారు. తండ్రి పదవిని అడ్డం పెట్టుకుని కొడుకు కోడెల శివరాం, కుమార్తె పూనాటి విజయలక్ష్మి చేసిన అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయన్నారు. శుక్రవారం ట్విటర్ వేదికగా కోడెల కుటుంబ అక్రమాలపై విజయసాయి రెడ్డి ధ్వజమెత్తారు. కొడెల కొడుకు, కూతురు చిన్నచిన్న వ్యాపారాలు చేసుకుని బతికే వారిని దోచుకోవడంపై పూర్తి దర్యాప్తు జరుగుతుందన్నారు. కుటుంబ సభ్యుల దోపిడీని ప్రోత్సహించిన మాజీ స్పీకర్‌పై ఎబెట్మెంట్ సెక్షన్ కింద కేసు నమోదు చేయాలన్నారు. కేట్యాక్స్ బాధితులు నిర్భయంగా ఫిర్యాదు చేయాలని గతంలో పిలుపునిచ్చిన విజయసాయిరెడ్డి.. కోడెల కుటుంబం వందల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. మరో ట్వీట్లో.. ‘ఆర్టీసిని ప్రభుత్వంలో విలీనం చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడంపై దేశ వ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతోంది. 56 వేల మంది ఉద్యోగులు ఇక నిశ్చింతగా ఉండగలుగుతారు. గతంలో రైల్వేలను విలీనం చేయడం కంటే ఇది సాహసోపేత నిర్ణయమని ఆర్థిక నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.’ విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. ‘కే’ట్యాక్స్ బాధితుల ఫిర్యాదుల మేరకు కోడెల శివప్రసాదరావు కుమారుడు కోడెల శివరాం, కుమార్తె పూనాటి విజయలక్ష్మిలపై ఇప్పటికే పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. ఉద్యోగాలు ఇప్పిస్తామని డబ్బూలు వసూలు చేయడం, బెదిరింపులకు పాల్పడ్డారని ఈ ఇద్దరిపై ఆరోపణలు వచ్చాయి. ఇక ఈ నేరారోపణలు ఎదుర్కొంటున్న కోడెల శివరాం, విజయలక్ష్మి ప్రస్తుతం అజ్ఞాతంలోకి జారుకున్నారు. బాధితుల తాకిడితో వారిద్దరూ ఊరు విడిచి వెళ్లినట్లు టీడీపీ శ్రేణులు చెబుతున్నాయి. మరోవైపు ఓ బాధితుడికి డబ్బులు వెనక్కి ఇచ్చినట్లు తెలియడంతో మరికొందరు బాధితులు కోడెల నివాసం, కార్యాలయం వద్ద పడిగాపులు కాస్తున్నారు. చదవండి: ‘కే ట్యాక్స్’పై ఐదు కేసులు కోడెల కుమార్తెపై కేసు కోడెల తనయుడు శివరామ్‌పై కేసు నమోదు -
అజ్ఞాతంలో కోడెల కుమారుడు, కుమార్తె
సాక్షి, గుంటూరు : భూకబ్జా, నకిలీ పత్రాల తయారీ, బెదిరింపులు, కులదూషణల ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ మాజీ ఎమ్మెల్యే కోడెల శివప్రసాదరావు కుటుంబం అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. కోడెల ఆయన కుమారుడు కోడెల శివరామ్, విజయలక్ష్మి ప్రస్తుతం ఎవరికీ అందుబాటులో లేనట్లు తెలుస్తోంది. వారిని విచారించేందుకు పోలీసులు ఫోన్లు చేసినా స్పందన లేనట్లు సమాచారం. బాధితుల తాకిడితో వారిద్దరూ ఊరు విడిచి వెళ్లినట్లు టీడీపీ శ్రేణులు చెబుతున్నాయి. ముందస్తు బెయిల్ కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఓ బాధితుడికి డబ్బులు వెనక్కి ఇచ్చినట్లు తెలియడంతో మరికొందరు బాధితులు కోడెల నివాసం, కార్యాలయం వద్ద పడిగాపులు కాస్తున్నారు. ప్రస్తుతం పరారీలో ఉన్న వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. కాగా తన కుటుంబంపై కావాలనే ఆరోపణలు చేస్తున్నారని కోడెల శివప్రసాదరావు నిన్న ఆరోపించారు. తన కుటుంబ సభ్యులపై అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారని, కేసులకు ఆధారాలు చూపించి రుజువు చేయాలని డిమాండ్ చేశారు. చదవండి: ‘కే ట్యాక్స్’పై ఐదు కేసులు కోడెల కుమార్తెపై కేసు కోడెల తనయుడు శివరామ్‌పై కేసు నమోదు -
‘గండ్ర’ నన్ను మోసం చేశాడు!
భూపాలపల్లి: గండ్ర వెంకటరమణారెడ్డి తనను శారీరకంగా లోబరచుకుని మోసం చేశాడని, అతడిని కాంగ్రెస్ నుంచి సస్పెం డ్ చేయాలని మదర్ స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వాహకురాలు కె.విజయలక్ష్మి డిమాండ్ చేశారు. ఉదయం భూపాలపల్లి జయశంకర్ చౌరస్తా వద్ద బైఠాయించి ఆమె నిరసన చేపట్టింది. ఇది తెలుసుకున్న కాంగ్రెస్ మహిళా నేతలు అక్కడికి చేరుకుని.. ఆమెను రోడ్డుపై ఈడ్చుకెళ్లి ఆటోలో కూర్చోబెట్టి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. సాయంత్రం పోలీస్‌స్టేషన్ నుంచి బయటకు వచ్చిన విజయలక్ష్మి తనతో గండ్ర మాట్లాడిన ఫోన్‌కాల్స్ రికార్డింగ్స్‌ను విలేకరులకు వినిపించింది. తనతో ఏ సంబం ధం లేకుంటే ఫోన్లో గండ్ర అలా ఎందుకు మాట్లాడుతాడని ప్రశ్నించింది. విజయలక్ష్మితో వచ్చిన మహిళలు తర్వాత ఇందిరాభవన్‌లో మాట్లాడుతూ.. విజయలక్ష్మి తన భర్త ఐదేళ్లుగా కాపురానికి తీసుకెళ్లడం లేదు.. మాట్లాడేందుకు రమ్మంటే వచ్చా మని తెలిపారు. గండ్ర గురించి అంటే తాము వచ్చే వారమే కాదని చెప్పారు. -
పరువు తీసిందని పొట్టన పెట్టుకున్నాడు
పెద్దఅంబర్‌పేట (ఇబ్రహీంపట్నం): ‘పరువు’కు మరో ఆడ కూతురు బలయ్యింది. తనను ఎదిరించి ప్రేమ పెళ్లి చేసుకుందని, తమ పరువు తీసిందని నిండు గర్భిణి అని కూడా చూడకుండా కూతురును కిరాతకంగా హత్య చేశాడో తండ్రి. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలంలోని అబ్దుల్లాపూర్ గ్రామంలో గురువారం చోటుచేసుకుందీ ఘటన. తల్లి చనిపోయిందని రావడంతో.. అబ్దుల్లాపూర్ గ్రామం ఎస్సీ కాలనీకి చెందిన ఎల్లంకి కిష్టయ్య కుమారుడు ఎల్లంకి సురేశ్, పక్కింట్లో ఉండే మంగలిపల్లి నర్సింహ కూతురు విజయలక్ష్మి (27) ప్రేమించుకున్నారు. తమ ప్రేమకు కుటుంబ సభ్యులు అభ్యంతరం చెప్పడంతో ఇంట్లో వారిని ఎదిరించిన విజయలక్ష్మి 2014లో సురేశ్‌ను వివాహం చేసుకుంది. భద్రాచలంలో కాపురం పెట్టింది. సురేశ్ తాపీ పని చేస్తూ విజయలక్ష్మిని పోషించుకుంటున్నాడు. వీరికి నాలుగేళ్ల కుమారుడు ఉన్నాడు. విజయలక్ష్మి ప్రస్తుతం ఏడు మాసాల గర్భిణి. ఈ నేపథ్యంలో ఈ నెల 19న సురేశ్ తల్లి సుక్కమ్మ రోడ్డు ప్రమాదంలో మృతిచెందగా.. అంత్యక్రియల కోసం సురేశ్ దంపతులు గ్రామానికి వచ్చారు. ఎప్పటి నుంచో విజయలక్ష్మి మీద పగ పెంచుకున్న కుటుంబ సభ్యులు ఆమెను హత్యచేసేందుకు పన్నాగం పన్నారు. విషయం తెలుసుకున్న స్థానికులు గ్రామపెద్దల దృష్టికి తీసుకురాగా ఇరు కుటుంబాలతో మాట్లాడారు. విజయలక్ష్మి ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని ఆమె కుటుంబ సభ్యులు ఒత్తిడి తీసుకురాగా గురువారం ఊరి నుంచి పంపిస్తామని గ్రామపెద్దలు చెప్పా రు. దీంతో అందరూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. కొట్టుకుంటూ తీసుకెళ్లి.. మెడ కోసి.. గురువారం ఉదయం తల్లి నర్సమ్మ, చిన్నమ్మలు వనమ్మ, లావణ్య, మంగమ్మ, యాదమ్మ, రాములమ్మ.. విజయలక్ష్మిని తమ వెంట తీసుకువెళ్లేందుకు వచ్చారు. వారిని చూసిన విజయలక్ష్మి ఇంట్లోకి వెళ్లగా ఆమెను బలవంతంగా సమీపంలో ఉన్న ఎస్సీ కమ్యూనిటీ హాల్లోకి లాక్కెళ్లారు. సురేశ్ కుటుంబసభ్యులు అడ్డుకుని బతిమిలాడినా పట్టించుకోకుం డా విజయలక్ష్మీని కొడుతూ తీసుకెళ్లారు. కమ్యూనిటీ హాల్లో కత్తితో సిద్ధంగా ఉన్న నర్సింహ ఆమె మెడను కోశాడు. చీరతో విజయలక్ష్మి గొంతును గట్టిగా చుట్టి కుటుంబ సభ్యుల సహాయంతో హత్య చేశాడు. అనంతరం పోలీసులకు లొంగిపోయాడు. నర్సింహాతోపాటు అతని కుటుంబ సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వనస్థలిపురం ఏసీపీ గాంధీనారాయణ అబ్దుల్లాపూర్‌మెట్ సీఐ మునితో కలసి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. తన భార్యను హత్యచేసిన నర్సింహతోపాటు అతనికి సహకరించిన కుటుంబసభ్యులపై పోలీసులకు సురేశ్ ఫిర్యాదు చేశాడు. -
అదొక ఉన్మాదపు సేన. అతనో తిక్క సేనాని!.. వైరల్
సాక్షి, హైదరాబాద్ : సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పార్టీ అధికారిక సమావేశాలకు వెళ్లిన తాను ప్రాణాలతో బయటపడటాన్ని అదృష్టంగా భావిస్తున్నానని ఓ మహిళా కార్యకర్త తన ఆవేదనను వ్యక్తం చేసిన వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. దీనిపై సినీ విమర్శకుడు, నటుడు మహేశ్ కత్తి తీవ్ర స్థాయిలో స్పందిస్తూ తన ఫేస్బుక్ ఖాతాలో ఆ వీడియోను పోస్ట్ చేశారు. దశాబ్దం పాటు కలిసి బ్రతికిన రేణు దేశాయ్ కి ఫ్యాన్స్ నుంచీ బెదిరింపులు వస్తే, ఒక్క మాట కూడా మాట్లాడని పవన్ కల్యాణ్.. మీలాంటి సామాన్య మహిళలకు రక్షణ కల్పిస్తారని ఎలా అనుకున్నారంటూ జనసేన అధిసేన అధినేత తీరును మరోసారి తప్పుపట్టారు. 'ఇద్దరు పిల్లల తల్లి. ఒక దశాబ్దం పాటు కలిసి బ్రతికిన రేణు దేశాయ్ కి ఫ్యాన్స్ నుంచీ బెదిరింపులు వస్తే, ఒక్క మాట కూడా మాట్లాడని పవన్ కళ్యాణ్. జనసేన పార్టీ లోకి వచ్చే మహిళలకు రక్షణ ఇస్తాడని ఎలా అనుకున్నారు తల్లీ మీరు? పవన్ కళ్యాణ్ పిచ్చి సేనకు దక్కిన తిక్క సేనాని. అక్కడ ఫ్యాన్స్ అనే భక్తుల మాటలే చెల్లుతాయి. మీకు దక్కేవి అవమానాలు, ప్రాణ భయాలే. మహిళల్లారా... తల్లులారా జనసేనకు దూరంగా ఉండండి. అదొక ఉన్మాదపు సేన. అతనో తిక్క సేనాని. మీ జాగ్రత్తలో మీరు ఉండండి' అంటూ మహేశ్ కత్తి పిలుపునిచ్చారు. జనసేనలో మహిళలకు రక్షణ లేదు! ఆ వీడియోలో ఏముందంటే.. నాపేరు విజయలక్ష్మి. పవన్ కల్యాణ్ ఒంగోలు సభకు వెళ్లాను. అక్కడ పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. అక్కడి నుంచి ప్రాణాలతో బయటపడటంతో ఊపిరి పీల్చుకున్నాను. సమస్యను జనసేన అధికార ప్రతినిధులకు చెబితే.. నిన్ను ఇక్కడికి ఎవరు రమ్మన్నారంటూ మహిళను ప్రశ్నించడం బాధాకరం. మహిళల ప్రాణాలకు పవన్ సభలో రక్షణ లేదు. మేం ప్రాణాలు కోల్పోతే పవన్‌కు ఏ నష్టం లేదు. నష్టపోయేది మా కుటుంబాలే. మహిళలకు జనసేన పార్టీ నేతలే విలువివ్వకపోవడం దురదృష్టకరం. పవన్ కల్యాణ్ ఎక్కడో ఏసీ కార్లలో తిరుగుతారు. మాలాంటి మహిళా కార్యకర్తల బాధలు పవన్ కల్యాణ్‌కు ఏం తెలుస్తాయంటూ' భయానక పరిస్థితిని జనసేన మహిళా కార్యకర్త వీడియో ద్వారా వెల్లడించగా.. ఆ వీడియోను మహేశ్ కత్తి తన ఫేస్బుక్లో పోస్ట్ చేయగా వైరల్ అయింది. మహిళా కార్యకర్తల బాధలు పవన్ కల్యాణ్‌కు ఏం తెలుస్తాయి -
నరసరావుపేటలో దారుణం
సాక్షి, నరసరావుపేట : ఇద్దరు పిల్లలతో కలసి తల్లి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న దారుణ సంఘటన సోమవారం సాయంత్రం నరసరావుపేట పట్టణంలో చోటు చేసుకుంది. గుంటూరు జిల్లా నాదెండ్ల మండలం అప్పాపురం గ్రామానికి చెందిన విజయలక్ష్మీకి ఇద్దరు సంతానం. కూతురు దిగ్విజయ, తనయుడు గణేష్ సాయిలు మార్టూరులో విద్యను అభ్యసిస్తున్నారు. దిగ్విజయ పుట్టిన రోజు కావడంతో సోమవారం పిల్లలను కలిసేందుకు విజయలక్ష్మీ మార్టూరుకు వెళ్లారు. పిల్లల్ని తీసుకుని సోమవారం మధ్యాహ్నానికి నరసరావుపేట చేరుకున్నారు. మార్కెట్ దగ్గర గల మూడో గేట్ వద్ద గూడ్స్ రైలు వస్తుందనగా పిల్లల్ని రైలు కింద తోసేశారు. అనంతరం తాను రైలు కింద పడ్డారు. ఈ ఘటనలో విజయలక్ష్మీ, ఇద్దరు పిల్లలు దుర్మరణం పాలయ్యారు. చూస్తుండగానే తల్లి, పిల్లలు రైలు కింద పడటంతో గేటు వద్ద ఆ సమయంలో ఉన్న వారు షాక్‌కు గురయ్యారు. సంఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. కుటుంబ కలహాల కారణంగానే విజయలక్ష్మీ పిల్లలతో కలసి ఆత్మహత్యకు పాల్పడిందని భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
జక్కంపూడి విజయలక్ష్మిని అడ్డుకున్న పోలీసులు
నిర్వాసితులకు పునరావాసం ఏదీ...? - వైఎస్సార్ సీపీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి సీతానగరం (రాజానగరం): పురుషోత్తపట్న ఎత్తిపోతల పథకం పనుల పరిశీలినకు సీఎం వస్తున్నారని ఖాళీ చేయించిన నిర్వాసితులకు ఇళ్ల స్థలాలు ఎక్కడని వైఎస్సార్ సీపీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి ప్రశ్నించారు. మంగళవారం పురుషోత్తపట్నంకు వెళ్లడానికి వచ్చిన జక్కంపూడి విజయలక్ష్మిని రఘుదేవపురం రవీంద్ర కాలనీ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. స్థానిక ఎస్సై ఎ. వెంకటేశ్వరావు జక్కంపూడిని అడ్డుకుని, సీఎం కార్యక్రమం ఉన్నందున వెళ్లరాదని అవరోధం సృష్టించినా ‘ససేమిరా’ అనండంతో కోరుకొండ సీఐ మధుసూదనరావుతోపాటుగా సుమారు 150 మంది పోలీస్ సిబ్బంది తరలివచ్చి విజయలక్ష్మితో చర్చించారు. ఏటిగట్టుపై ఉంటున్న వారికి ఖాళీ చేయించారని, వారు గత ఏభై ఏళ్లుగా ఉంటున్నారని, తొలగించి వారికి స్థలాలు కేటాయింస్తామని తహసీల్దార్ తెలిపారని, వారికి తక్షణమే కేటాయించాలని డిమాండ్ చేశారు. దీంతో సీఐ స్పందించి స్థలాల విషయం తాను తెలుసుకుంటానని, సీఎం కార్యక్రమం ఉన్నందున అటువైపు వెళ్లరాదని నచ్చజెప్పారు. దీంతో జక్కంపూడిì విజయలక్ష్మి వెనుతిరిగారు. జక్కంపూడి విజయలక్ష్మి విలేకరులతో మాట్లాడుతూ పుష్కర పథకం ప్రారంభోత్సవానికి యూపీఏ చైర్పర్సన్ సోనియా వచ్చినా ఎవరినీ నిర్వాసితులుగా చేయలేదన్నారు. ప్రజలను మోసం చేయడానికే... పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం ప్రారంభోత్సవంతో ప్రజలను మోసం చేస్తున్నారని విజయలక్ష్మి ఆరోపించారు. పనులు కాకుండానే పథకం ప్రారంభోత్సవాలేమిటని ప్రశ్నించారు. రైతులకు ఇళ్ల నుంచి కదలకుండా పోలీసులను ఏర్పాటు చేస్తున్నారని, రైతుల గొంతును నొక్కిపట్టి పథకాలను ప్రారంభోత్సవాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్ పెదపాటి డాక్టర్‌బాబు, రాష్ట్ర రైతు విభాగం కార్యదర్శి వలవల రాజా, జిల్లా కమిటీ కార్యదర్శి వలవల వెంకట్రావు, మద్దాల అను తదితరులు పాల్గొన్నారు. -
టీవీ మెకానిక్ కుమార్తె జూనియర్ సివిల్ జడ్జి
తొలి ప్రయత్నంలోనే హరిప్రియ ఎంపిక మరో జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికైన విజయలక్ష్మి విజయనగరం లీగల్/మున్సిపాలిటీ: తల్లిదండ్రులు తన కోసం పడ్డ కష్టాలను కనులారా చూసింది. తనతో పాటు తన అక్కను కని పెంచి ఉన్నత చదవులు చదివించేందుకు వారు పడ్డ కష్టాన్ని చెరిపేసి , వారు కన్న కలలను సాకారం చేయాలని నిర్ణయించుకుంది. అందుకోసం పట్టుదలతో న్యాయవాది వృత్తిని ఎంచుకుంది. తను ఎంచుకున్న రంగంలోనే రాణిస్తూనే తొలి ప్రయత్నంలోనే ఉన్నత శిఖరాన్ని అధిరోహించటం ద్వారా తల్లిదండ్రుల స్వప్నాన్ని నిజం చేసింది. ఆమె పట్టణ శివారులోని గాజులరేగలో నివసిస్తున్న చందక భాను, మంగ దంపతుల ద్వితీయ కుమార్తె హరిప్రియ. గాజులరేగ గ్రామంలో టీవీ మెకానిక్ వృత్తి చూసుకుంటూ పెద్ద కుమార్తెను సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా చదివించిన భాను ఈ దశలో పస్తులున్న సందర్భాలు ఆ జీవితంలో లేకపోలేదు. ద్వితీయ కుమార్తె హరిప్రియ తన చిన్నాన్న చిన్నప్రభాకర్ స్ఫూర్తితో ఎంచుకున్న న్యాయవాద వృత్తిలో రాణించేందుకు తమ వంతుగా ప్రోత్సాహాన్ని అందించారు. తల్లిదండ్రుల ప్రోద్బలంతో హరిప్రియ జూనియర్ సివిల్‌జడ్జిగా ఎంపికైంది. 2015 సంవత్సరంలో విజయనగరం ఎంఆర్‌వీఆర్ లా కళాశాలలో న్యాయ విద్యను పూర్తి చేశారు. 2016 సంవత్సరంలో హైకోర్టు జూనియర్ సివిల్ జడ్జి పోస్టుల నియామకాలపై నోటిఫికేషన్ జారీ చేయగా..పట్టుదలతో, అమ్మనాన్నల ప్రోత్సాహంతో మొదటి ప్రయత్నంలో తన లక్ష్యాన్ని చేరుకుంది. హైకోర్టు విడుదల చేసిన ఫలితాల్లో జూనియర్ సివిల్ జడ్జిగా నియామకాన్ని సాధిస్తూ విద్యలకు నగరమైన విజయనగరం జిల్లా ఖ్యాతిని చాటి చెప్పింది. విజయలక్ష్మి ఎంపిక కృషి ఉంటే సాధించ లేనిదంటూ ఏమిలేదన్న విషయాన్ని మరో మారు రుజువు చేశారు విజయనగరం ఫ్యామిలీ కోర్టులో జూనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న గరుడపల్లి విజయలక్ష్మి. తల్లిదండ్రులు గురడపల్లి ధర్మానంద్, సింహాచలం స్వస్థలం బాడంగి మండలం కామన్నవలస. వీరి ముగ్గురు కుమార్తెల్లో మొదటి సంతానమైన విజయలక్ష్మి 2007 జుడిషీయల్ డిపార్ట్మెంట్లో చేరగా... రెండవ కుమార్తె› నాగమణి విశాఖ ఉమెన్ పోలీస్‌స్టేషన్ ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నారు. మూడవ కుమార్తె అరుణకుమారి డిగ్రీ విద్యనభ్యసిస్తున్నారు. విజయలక్ష్మి భర్త సునీల్‌కుమార్ రైల్వే శాఖలో విధులు నిర్వహిస్తుండగా...ఆయనతో పాలు తల్లిదండ్రులు ఇచ్చిన ప్రోత్సాహంతో 2016లో పరీక్షల్లో జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికైంది. ఇదిలా ఉండగా జిల్లా న్యాయ వ్యవస్థ చరిత్రలో కోర్టు సిబ్బంది స్థాయి నుంచి జూనియర్ సివిల్ జడ్జిగా ఎదిగిన తొలి మహిళగా గుర్తింపు పొందారు. -
అధికారుల తీరుపై జక్కంపూడి ధ్వజం
ఆలయ భూముల రికార్డులు తీసుకెళ్లడంపై ఆగ్రహం కోరుకొండ : శ్రీలక్ష్మీనరసింహ స్వామి వారి ఆలయానికి చెందిన వివిధ రకాల రికార్డులను అన్నవరం దేవస్థానం అధికారులు తీసుకెళ్లడంపై రైతులు, ప్రజల్లో పలు అనుమానాలు రేకెత్తిస్తున్నాయని వైఎస్సార్సీపీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి అన్నారు. సోమవారం కోరుకొండలోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో విలేకర్ల సమావేశంలో జక్కంపూడి విజయలక్ష్మి మాట్లాడారు. అన్నవరం దేవస్థానం ఈఓ, స్థానిక ప్రజాప్రతినిధి తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గత కొన్నేళ్లుగా కోరుకొండ దేవస్థానంలో ఉన్న రైతులు, ప్రజలకు సంబంధించిన భూముల రికార్డులు, స్వామి వారి ఆస్తుల రికార్డులను ఎవరికీ సమాచారం ఇవ్వకుండా తీసుకెళ్లడంపై మండిపడ్డారు. చివరకు శ్రీలక్ష్మీనరసింహ స్వామి వారి ఆలయ అనువంశిక ధర్మకర్త ఎస్పీ. రంగరాజభట్టార్ స్వామికి కూడా సమాచారం తెలియకపోవడంపై పలు అనుమానాలకు దారి తీస్తున్నాయన్నారు. గోకవరం మండలం భూపతిపాలెంలో గల స్వామివారికి చెందిన 1180 ఎకరాల భూమి వివరాల పట్టాలన్నీ తీసుకెళ్లడం చూస్తుంటే దీని వెనుక ఏదో దాగి ఉందని విజయలక్ష్మి అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కోరుకొండ, శ్రీరంగపట్నం, కాపవరం, జంబూపట్నం గ్రామాలకు చెందిన పలువురు రైతుల భూములు రిజిస్ట్రేషన్ కాకుండా అన్నవరం దేవస్థానం వారు నిలుపుదల చేయడంపై గతంలో ఆందోళన చేయడం, అన్నవరం ఈఓకు వినతిపత్రం అందించామన్నారు. రెండున్నరేళ్లుగా రైతులు, ప్రజలకు చెందిన భూములను రిజిస్ట్రేషన్లు నిలిపివేయడానికి ఎలాంటి ఆధారం ఉందో తమకు వివరించాలని డిమాండ్ చేశారు. రిజిస్ట్రేషన్లు నిలిపివేసిన భూములు లక్ష్మీనరసింహ స్వామి దేవాలయానికి చెందినవా, రైతులవా అని తెలియకుండా అన్నవరం దేవస్థానం అధికారులు ఏ హక్కుతో రిజిస్ట్రేషన్లు నిలిపివేశారని ఆరోపించారు. వెంటనే అన్నవరం అధికారులు రికార్డులను కోరుకొండకు తీసుకు రాకపోతే ఆందోళన చేపడతామని హెచ్చరించారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర, జిల్లా నాయకులు నక్కా రాంబాబు, గరగ మధు, తాడి హరిశ్చంద్ర ప్రసాద్‌రెడ్డి, వాకా నరసింహారావు, నీరుకొండ యుదిష్టర నాగేశ్వరరావు, అయిల శ్రీను, తిక్కిరెడ్డి హరిబాబు, దాసరి యేసు, గుగ్గిలం భాను తదితరులు ఉన్నారు.